పాప్‌ రాక్‌ ఐకాన్‌, గ్రామీ అవార్డు గ్రహితకు చేదు అనుభవం..! | Bengaluru Police Officer Pulled The Plug When Ed Sheeran Surprised | Sakshi
Sakshi News home page

పాప్‌ రాక్‌ ఐకాన్‌, గ్రామీ అవార్డు గ్రహితకు చేదు అనుభవం..!

Published Mon, Feb 10 2025 1:05 PM | Last Updated on Mon, Feb 10 2025 1:05 PM

Bengaluru Police Officer Pulled The Plug When Ed Sheeran Surprised

ఎంత పెద్ద ఫేమస్‌ సింగర్‌ అయినా ఒక్కోసారి ఊహించని చేదు అనుభవాలు ఎదురవ్వుతుంటాయి. ముందుగా ప్లాన్‌ చేసుకుని, పర్మిషన్‌ తీసుకున్నా ఒక్కోసారి అవమానపాలుకాక తప్పదనేలా ఉంటాయి పరిస్థితులు. హుందాగా, నిజాయితీగా వ్యవహరించినా..అధికార దర్పం ముందు తలవంచక తప్పదేమో ఒక్కసారి. ఇదంతా ఎందుకంటే..నాలుగుసార్లు గ్రామీ అవార్డు గెలుచుకుని, పాప్‌ ఐకాన్‌గా పేరుగాంచిన సింగర్‌కి బెంగళూరులో అనుకోని పరిణామాన్ని చవిచూశాడు. 

ఏం జరిగిందంటే.. బ్రిటిష్ గాయకుడు-గేయ రచయిత ఎడ్ షీరన్ బెంగళూరులో చర్చి స్ట్రీట్‌లోని ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్ ఎదురుగా ప్రదర్శన ఇచ్చేందుకు ప్లాన్‌ చేసుకున్నారు. ఈ ప్రదేశంలో ఒకటికి మించి రెండు పాటలతో అలరించబోతున్నా అంటూ మొదలు పెట్టారాయన. షీరన్ ముందుగా మొటి పాట అనగానే ఒక పోలీసు ఎంట్రీ ఇచ్చి ప్రదర్శనను అడ్డుకున్నారు.

ఆయన ప్రదర్శన జరగకుండా స్పీకర్లను కూడా డిస్‌కనెక్ట్‌ చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా, ఎడ్ షీరన్ మాత్రం ముందుస్తు ప్రణాళికతోనే ఈ ప్రదర్శన ప్లాన్‌ చేశామన్నారు. ఇలా రోడ్డుపై ప్రదర్శన ఇచ్చేందుకు పర్మిషన్‌ తీసుకున్నట్లు తెలిపారు. 

తామేమి అకస్మాత్తుగా అప్పటికప్పుడూ ఇలా ప్రదర్శన ప్లాన్‌ చేయలేదంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వివరణ ఇచ్చారు. కాగా, షేప్ ఆఫ్ యు, థింకింగ్ అవుట్ లౌడ్, పర్ఫెక్ట్ అండ్‌ కాజిల్ ఆన్ ది హిల్ వంటి హిట్ పాటలకు పేరుగాంచిన పాప్ రాక్‌ ఐకాన్‌ ఎడ్ షీరన్. అతని ఆల్బమ్‌లు హాటకేక్‌లా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్ది అమ్ముడైపోయాయి. ఆయన జనవరి 30 నుండి ఫిబ్రవరి 15 వరకు భారత్‌లో పర్యటించనున్నారు.

 

 

(చదవండి: దటీజ్‌ సుధీర్‌..! దూషించే పదాన్నే లగ్జరీ బ్రాండ్‌గా మార్చి..)

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement