
కృష్ణరాజపురం: దావణగెరె జిల్లాలోని జగళూరు తాలూకా విద్యాశాఖ బసవనగౌడ పాటిల్, అతని సోదరుడు బళ్లారి వెంకటరెడ్డిలు ఉద్యోగం ఇప్పిస్తామని రూ.1.2 కోట్లు వసూలు చేసి మోసగించారని బెంగళూరు కృష్ణరాజపురానికి చెందిన వ్యాపారి నాగేంద్రరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రామ్మూర్తినగర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వీరు పరిచయం అయ్యారని, తమకు చాలామంది ప్రభుత్వ అధికారులు తెలుసని చెప్పారన్నారు. తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కావాలని అడిగితే ఇద్దరూ కలిసి రూ.1.02 కోట్లు తీసుకున్నారని, ఇప్పటివరకు ఉద్యోగం ఇప్పించలేదని బాధితుడు తెలిపాడు.
(చదవండి: ప్రపంచ శాంతి కోసం యోగా.. మైసూర్ ప్యాలెస్‌లో ప్రధాని మోదీ యోగాసనాలు)