basavanna Goud
-
ఉద్యోగం పేరుతో రూ.కోటి టోపీ
కృష్ణరాజపురం: దావణగెరె జిల్లాలోని జగళూరు తాలూకా విద్యాశాఖ బసవనగౌడ పాటిల్, అతని సోదరుడు బళ్లారి వెంకటరెడ్డిలు ఉద్యోగం ఇప్పిస్తామని రూ.1.2 కోట్లు వసూలు చేసి మోసగించారని బెంగళూరు కృష్ణరాజపురానికి చెందిన వ్యాపారి నాగేంద్రరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రామ్మూర్తినగర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వీరు పరిచయం అయ్యారని, తమకు చాలామంది ప్రభుత్వ అధికారులు తెలుసని చెప్పారన్నారు. తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కావాలని అడిగితే ఇద్దరూ కలిసి రూ.1.02 కోట్లు తీసుకున్నారని, ఇప్పటివరకు ఉద్యోగం ఇప్పించలేదని బాధితుడు తెలిపాడు. (చదవండి: ప్రపంచ శాంతి కోసం యోగా.. మైసూర్ ప్యాలెస్‌లో ప్రధాని మోదీ యోగాసనాలు) -
ముస్లింలు నా ఆఫీసుకు రావద్దు
సాక్షి, బళ్లారి: ‘బుర్కా, టోపీ ధరించిన ముస్లింలు నా ఆఫీసుకు రావద్దు. వారు నాకు ఓటు వేయాల్సిన అవసరం లేదు’ అని కేంద్ర మాజీ మంత్రి, విజయపుర బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాళ్ వ్యాఖ్యానించారు. ఈ నెల 4న విజయపురలోని సిద్దే«శ్వర కళాభవన్‌లో శివాజీ మహారాజ్ జయంత్యుత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హిందువుల సంక్షేమం కోసమే పని చేయాలని, ముస్లింలకు పనులు చేయవద్దని ఈ సందర్భంగా ఆయన నగర కార్పొరేటర్లకు సూచించారు. ముస్లింలను తన ఆఫీసులోకి రానివ్వద్దని, తన పక్కన కూర్చొనివ్వరాదని ఆఫీసు సిబ్బందికి చెప్పారు. -
భూవివాదం : గొడ్డళ్లతో దాడి
పొలం గట్టు విషయంలో తలెత్తిన వివాదంలో తీవ్ర కోపోద్రిక్తులైననిద్దరు అన్నదమ్ముళ్లు పరస్పరం గొడ్డళ్లతో దాడి చేసుకున్నారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా ఆలహరిణి మండలం విరుపాపురం గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బసవన్న గౌడ్, హర్ష గౌడ్ అన్నదమ్ములు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరికి తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తి సరిహద్దు విషయంలో గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు ఇద్దరు పరస్పరం గొడ్డళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో బసవన్న గౌడ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించ గా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.