మిస్సింగ్‌ కేసు కాస్త హత్య కేసుగా...ప్రియుడితో కలిసి భార్యే | Husband Assassinated By his Wife And Her Lover At Mysore | Sakshi
Sakshi News home page

అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు.! ప్రియుడితో కలిసి భార్యే..

Published Wed, Dec 7 2022 10:28 AM | Last Updated on Wed, Dec 7 2022 10:28 AM

Husband Assassinated By his Wife And Her Lover At Mysore - Sakshi

సాక్షి, బెంగళూరు: కనిపించకుండా పోయిన వ్యక్తి శవంగా లభ్యం కాగా అతనిని భార్యే హత్య చేయించిన విషయం పోలీసుల తనిఖీలో వెలుగు చూసింది. అక్రమ సంబంధం నేపథ్యంలో భార్యే ప్రియుడితో కలిసి హత్య చేయించిన ఘటన తాలూకాలోని టీకల్‌ ఫిర్కా చంబె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆనంద్‌ హత్యకు గురైన వ్యక్తి. నవంబర్‌ 21న కనిపించకుండా పోవడంపై తాలూకాలోని మాస్తి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

బెంగుళూరు గ్రామీణ జిల్లా హొసకోటె తాలూకా భీమకరనహళ్లి గ్రామంలోని చెరువులో ఆనంద్‌ శవం లభ్యమైంది. దీనిపై నందగేడి పోలీస్‌ స్టేషన్‌లో అపరిచిత శవం లభ్యం కేసు నమోదైంది. తనిఖీ సమయంలో అదృశ్యం కేసు కాస్త హత్య కేసుగా మారింది. చైత్ర, పృథ్వీరాజ్‌ల మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. తమ సరసానికి భర్త అడ్డుగా ఉన్నాడని తలంచిన చైత్ర ప్రియుడితో కలిసి మరో ఇద్దరి సహకారంతో హత్య చేసినట్లు మాస్తి పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో పోలీసులు ఆనంద్‌ భార్య చైత్ర, పృథ్వీరాజ్, చలపతిలను అరెస్టు చేశారు. మరో నిందితుడు నవీన్‌ పరారీలో ఉన్నాడు.    

(చదవండి: జాగ్రత్తగా నడపమన్నందుకు...  కారుతో ఢీకొట్టారు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement