missing case
-
దృశ్యం సినిమాను తలపించిన స్వాతి కేసు
భద్రాద్రి కొత్తగూడెం, సాక్షి: జిల్లాలో ఓ మహిళ మిస్సింగ్ కేసు కాస్త విషాదాంతం అయ్యింది. కనిపించకుండా పోయిన స్వాతి అనే మహిళ.. ముక్కలై గోనె సంచిలో తేలింది. దృశ్యం సినిమాను తలపించిన ఈ కేసులో ప్రియుడే ఆమెను దారుణంగా హతమార్చగా.. డబ్బే అందుకు ప్రధానకారణమని తేలింది.జూలూరుపాడు మండలం మాచినేనిపేటకు చెందిన వీరభద్రం.. స్వాతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో వీరభద్రం భార్యతో స్వాతికి గొడవ జరిగింది. ఇందుకు సంబంధించి చుంచుపల్లి పీఎస్‌లో స్వాతిపై కేసు నమోదైంది. అయితే ఈ విచారణలో భాగంగా స్వాతి కోసం పోలీసులు ఆరా తీయగా.. ఆమె కనిపించడం లేదనే విషయం వెలుగు చూసింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలో వీరభద్రంను విచారించిన జూలూరుపాడు పోలీసులు.. అతని నుంచి పొంతన లేని సమాధానాలు రావడంతో అనుమానం వ్యక్తం చేశారు. తమదైన శైలిలో విచారించగా.. స్వాతిని హతమార్చినట్లు వీరభద్రం నేరం ఒప్పుకున్నాడు. ఈపై ఆమెను చంపి పాతిపెట్టిన గోనె సంచిని తవ్వి తీసి పోలీసులకు అప్పగించాడు. మొత్తం డబ్బు తనకే ఉండాలని.. గతంలో జూలూరుపాడు మండలానికి చెందిన ఓ జంటకు.. సింగరేణిలో ఉద్యోగాలిప్పిస్తామని స్వాతి నమ్మబలికింది. వాళ్ల దగ్గరి నుంచి రూ.16 లక్షల దాకా వసూలు చేసి వీరభద్రం చేతికి అప్పగించింది. అయితే ఎంతకీ వాళ్ల నుంచి బదులు లేకపోవడంతో ఆ జంట పోలీసులను ఆశ్రయించారు ఆ భార్యభర్తలు. అయినా ప్రయోజనం లేకపోవడంతో చివరకు ఆత్మహత్య చేసుకుంది. దీంతో.. ఆ డబ్బు మొత్తం తానే అనుభవించాలనే ఉద్దేశంతో స్వాతిని హతమార్చినట్లు వీరభద్రం పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. -
అసలు.. ఆ ప్యామిలీకి ఏమైంది? ఎక్కడికి వెళ్లినట్లు?
అదంతా పెద్దపెద్ద కొండలుండే ప్రాంతం. అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న ప్రదేశం. ఒకవైపు అడవి, మరోవైపు రహదారి. సుమారు వారం రోజులుగా ఎడతెరిపిలేని వర్షంతో విసిగిపోయిన ఓ గిరిజన బృందం ఆ రోజు వర్షం ఆగడంతో వేటకు బయలుదేరింది. వారంతా నడిచి వెళ్తూ ఉండగా ఓ చిన్న కుక్కపిల్ల మూలుగులు వారి చెవిన పడ్డాయి. ‘ఎక్కడ? ఎటువైపు?’ అన్నట్లు చెవులు రిక్కిస్తూ అటుగా నడిచారు.వారు అడవిలోంచి రోడ్డు మీదకు వెళ్లేసరికి, రోడ్డు పక్కన ఓ ట్రక్ కార్ ఆగి ఉంది. అందులోంచే కుక్కపిల్ల మూలుగుతోంది. దగ్గరకు వెళ్లి, కారు అద్దంలోంచి చూస్తే, అది బక్కచిక్కిపోయి, నీరసంగా ఆయాసపడుతోంది. ఆ కారులో హ్యాండ్ బ్యాగ్, పర్స్, సెల్ ఫోన్స్ కూడా కనిపించాయి. చుట్టుపక్కల ఎవరూలేరు. పైగా డోర్స్ని లాక్ చేయలేదు. కుక్కపిల్ల పరిస్థితి చూస్తే, తిండి లేక చాలా రోజులైనట్లుంది. మరి కారు ఓనర్ ఎక్కడ? విలువైన వాటిని వదిలిపెట్టి లాక్ చేయకుండా, ఇలాంటి ప్రాంతంలో ఎక్కడికి వెళ్లినట్లు? ఇవే ప్రశ్నలు వారిని కుదురుగా ఉండనివ్వలేదు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు.ఆ కారు నంబరు చూడగానే పోలీసులకు ‘జామిసన్ ఫ్యామిలీ మిస్సింగ్ కేసు’ గుర్తొచ్చింది. బాబీ జామిసన్, షెరిలిన్ అనే దంపతులు తమ ఆరేళ్ల కూతురు మాడిసన్ తో కలసి సరిగ్గా అప్పటికి ఎనిమిది రోజుల క్రితం అదే కారులో ఇంటి నుంచి బయలుదేరారు. వారి ఇంటి ముందున్న సీసీ కెమెరాలో అది రికార్డ్ అయ్యింది. అయితే వారు తమ ప్రయాణం గురించి సొంతవారికి కూడా చెప్పలేదు. రెండు మూడు రోజులుగా ఫోన్ ్సకి స్పందించడంలేదంటూ షెరిలిన్ తల్లి కోకోటన్ అప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏ క్లూ లేక ఆగిన ఆ కేసుకు ఈ కారే కీలకంగా మారింది. కారు దొరికిన పరిసరాల్లో తప్పిపోయిన ఆ ముగ్గురి కోసం వెతకడం ప్రారంభించారు. అప్పుడే ఆ కారు సీట్ కింద 32 వేల డాలర్లతో ఓ బ్యాగ్ దొరికింది. ‘అంత డబ్బు వారికి ఎక్కడిది?’ అనే ప్రశ్నకు కోకోటన్ కూడా సమాధానం ఇవ్వలేకపోయింది.మొదటి సంతానం కొడుకుతో కలసి దిగిన ఫొటోషెరిలిన్ ఫోన్ లోని చివరి ఫొటో విచారణ సమయంలో పలు అనుమానాలకు దారితీసింది. మాడిసన్ భయపడుతూ, ఏడుపు తన్నుకొస్తున్నట్లుగా చేతులు కట్టుకుని నిలబడిన ఫొటో అది. అసలు ఆ ఫొటోలో మాడిసన్ ఎందుకు అలా ఉంది? ఆ ఫొటో ఎవరు తీశారు? అప్పటికే జామిసన్ దంపతులకు ఏదైనా జరిగిందా? వేరే ఎవరైనా ఆ ఫొటో తీసుంటారా? అనే ప్రశ్నలు ఉత్కంఠను రేపాయి.కారులో దొరికిన మరో ఫోన్ లో జీపీఎస్ లొకేషన్ ఇంకా ఆన్ లోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కారు ఆగిన చోటుకు దగ్గర్లో ఓ కొండపైకి వారు చేరుకోవాల్సిన లొకేషన్ ని చూపిస్తోంది. మరి కారు ఎందుకు అక్కడ ఆగింది? వాళ్లెందుకు అక్కడ దిగారు? అనుకుంటూ అధికారులు కారు దొరికిన పరిసరాల్లో మొత్తం వెతికించారు. అయితే అప్పటికే పడిన వర్షాల కారణంగా సాక్ష్యాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి.సరిగ్గా మూడేళ్ల తర్వాత జామిసన్ కారు దొరికిన ప్రదేశానికి రెండు మైళ్ల దూరంలో అడవి వైపు అసలు దారే లేని చోట కొందరు పర్వతారోహకులకు వారి ముగ్గురి అస్థిపంజరాలు కనిపించాయి. అయితే అప్పటికే కోకోటన్ .. బాబీ ఉపయోగించే పర్సనల్ గన్ తో పాటు ఒక సూట్‌కేస్ కనిపించడం లేదని, అది వారి ఇంట్లోనూ, కారులోనూ దొరకలేదంటే...æ ఆరోజు అడవిలో ఎవరైనా దొంగలు దాడి చేసి తీసుకెళ్లారేమోనని పోలీసులతో చర్చించింది. జామిసన్ దంపతులకు మాడిసన్ కంటే ముందు ఒక కొడుకు కూడా ఉన్నాడు. తన కోకోటన్ దగ్గర పెరిగేవాడు.మరోవైపు అదే కారులో దొరికిన ఒక డైరీలో షెరిలిన్ – బాబీ ప్రవర్తన గురించి రాసుకుంది. బాబీ ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తున్నాడని, అప్పుడే ప్రేమ, అప్పుడే ద్వేషంతో విచిత్రంగా ప్రవర్తిస్తాడని స్వయంగా షెరిలిన్ రాయడంతో బాబీనే అడవిలోకి తీసుకెళ్లి భార్య, కూతుర్ని చంపేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడేమోనన్న కథనాలు మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఇక వైద్యపరీక్షల్లోనూ అది హత్యా లేక ఆత్మహత్యా అనేది తేలలేదు.కారులో అంత డబ్బు దొరికిందంటే, ఆ దంపతులు డ్రగ్స్ మాఫియాతో మారకద్రవ్యాల డీల్స్ చేసేవారేమో అనే అనుమానాలు మొదలయ్యాయి. అంటే మాఫియానే తమ డీల్‌లో తేడా రావడంతో వారిని కడతేర్చిందా అనే ప్రశ్న పురుడుపోసుకుంది. మరోవైపు జామిసన్ దంపతులు ఆ కొండ ప్రాంతాల్లో 40 ఎకరాల స్థలం కొనడానికి అడ్వాన్స్ ఇచ్చారని, త్వరలోనే అక్కడికి షిప్ట్ అవ్వాలనేది వారి కోరికని, ఆ లొకేషన్ కోసమే ఆ రోజు వాళ్లు అక్కడికి వెళ్లారని కొందరు సన్నిహితులు చెప్పారు. అదలా ఉండగా వారు మిస్ అవ్వడానికి కొన్ని నెలల ముందు బాబీ తమ పొరుగువారితో ‘మా ఇంట్లో చాలా దయ్యాలున్నాయి. అవి మమ్మల్ని బాగా ఇబ్బందిపెడుతున్నాయి.. మా ప్రాణాలకే ప్రమాదంలా ఉంది’ అని చెప్పాడట. ఇదే విషయం కోకోటన్ ని అడిగితే, ‘గతంలో ఒకసారి వారి ఇంటికి వెళ్లినప్పుడు నేను కూడా ఆ దయ్యాల ఉనికి గుర్తించాను, చాలా భయపడ్డాను’ అని గుర్తు చేసుకుంది. దాంతో ఈ క్రైమ్ స్టోరీ ఉన్నపళంగా హారర్ రంగు పులుముకుంది. ఏది ఏమైనా, ఆ ముగ్గురూ ఎలా చనిపోయారు? చివరి ఫొటోలో పాప ఎందుకలా ఉంది? అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు దొరకలేదు.2009 అక్టోబర్ 8న అమెరికా, ఓక్లహోమాలోని యుఫాలాలో నివసించే జామిసన్ కుటుంబం కైమిచ్ పర్వతాల వైపు వెళ్లారు. మూడేళ్ల తర్వాత ఆ సమీపంలోనే అస్థిపంజరాలై దొరకడంతో ఈ ఉదంతం స్థానికంగా సంచలనం రేపింది. నేటికీ మిస్టరీగానే మిగిలింది. – సంహిత నిమ్మనఇవి చదవండి: Armand Duplantis: ఎవరికీ అందనంత ఎత్తుకు.. -
ఎక్కడున్నారో.. ఏమయ్యారో?
కరీంనగర్ క్రైం: కరీంనగర్ కమిషనరేట్ పరిఽధిలో మిస్సింగ్ కేసులు పెరుగుతున్నాయి. కనిపించకుండా పోతున్నవారిలో ఎక్కువ శాతం మహిళలే ఉంటుండటం ఆందోళన కలిగిస్తోంది. దాంపత్య జీవితంలో గొడవలతో కొందరు ఇంటికి దూరమవుతుండగా.. మరికొందరు ప్రేమ పేరిట మోసపోతూ ఇళ్ల నుంచి వెళ్లి తిరిగి రావడం లేదు. మతిస్థిమితం లేనివారు, వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారిదీ ఇదే దారి. ఈ ఏడాది ఇప్పటివరకు జిల్లాల్లోని పోలీస్స్టేషన్లలో 297 మిస్సింగ్ కేసులు నమోదవగా 257 కేసులను పోలీసులు ఛేదించారు.180 మంది మహిళలు..ప్రేమ పేరిట మోసపోతున్న యువతులు, బాలికల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. బాధిత కుటుంబసభ్యులు వారి బంధువులు, స్నేహితులు, తెలిసినవారి ఇళ్లలో వెతుకుతూ చివరకు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పోలీసుల విచారణలో ప్రేమ వ్యవహారమే కారణమని తేలిన సందర్భాలు అనేకం ఉంటున్నాయి. కరీంనగర్ కమిషనరేట్‌లో ఇప్పటివరకు 180 మంది మహిళలు, 12 మంది బాలికలు అదృశ్యమవగా పోలీసులు 165 మహిళలు, 11 మంది బాలికలను గుర్తించి, వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. కుటుంబ కలహాలతో ఇంటి నుంచి వెళ్లినవారు, మతిస్థిమితం లేకుండా వెళ్లిపోయినవారు కొందరిని సీసీ కెమెరాల సహాయంతో పట్టుకున్నారు.వ్యాపారాల్లో నష్టాలతో పలువురు..పలువురు వ్యాపారులు కరీంనగర్‌ను వదిలి వెళ్లిపోతున్నారు. వ్యాపారాల్లో పెద్ద మొత్తంలో నష్టాలు వచ్చి, ఇక్కడ ఉండలేక ఇతర పట్టణాలకు రాత్రికిరాత్రే జంప్ అవుతున్నారు. చిట్టీలు నడిపించి నష్టపోయిన కొందరు, వడ్డీ వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకొని, తిరిగి చెల్లించలేనివారు మరికొందరు ముఖం చాటేస్తూ దూర ప్రాంతాలకు వెళ్తుండటంతో ఇక్కడ మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. పోలీసులు వాటిని ఛేదించడానికి టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. -
ధవళేశ్వరం బాలికల మిస్సింగ్ కేసులో కొత్త ట్విస్ట్...
-
ప్రవీణ్ రెడ్డి, పోలీసుల చొరవతో తల్లి ఒడికి బాలుడు
సాక్షి, హైదరాబాద్: సాక్షి టీవీ అవుట్ పుట్ ఎడిటర్ దంపతులు, పోలీసుల చొరవతో ఏడాది వయస్సున్న బాలుడు తల్లి ఒడికి చేరాడు. గంట వ్యవధిలోనే సదరు బాలుడు తమ వద్దకు చేరడంతో పేరెంట్స్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రవీణ్ రెడ్డి దంపతులకు, పోలీసులకు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఇక, ఈ ఘటన రామంతపూర్‌లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. నగరంలోని చాంద్రాయణగుట్టకు చెందిన మర్యం బేగం, మజీద్ దంపతులు. వీరికి ఐదుగురు సంతానం. ఏడాది వయస్సున్న బాలుడు, ఆరు నెలల పాప, భర్త, తమ్ముడితో కలిసి మర్యం రామంతాపూర్‌లోని కేసీఆర్ నగర్‌కు ఆటోలో వచ్చింది. కేసీఆర్ నగర్ సమీపంలో టీ కోసమని ఆటోను ఆపి.. భర్త, తమ్ముడు వెళ్లాడు. చంటిపాపకు పాలుపట్టిస్తూ ఉండగా.. ఏడాది వయస్సున్న బాలుడు ఆటో దిగి ఎటో వెళ్లిపోయాడు. టీ తాగి ఆటో దగ్గరకు వచ్చిన మర్యం పిల్లవాడి గురించి ఆరా తీయగా.. ఆటో దిగి ఉంటాడని చెప్పింది. చుట్టుపక్కల వెతకడంతో బాలుడి ఆచూకీ లభించలేదు.దీంతో.. మర్యం ఆమె బంధువులు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బాలుడిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? అన్న కోణంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే.. రెండు బృందాలను ఏర్పాటు చేసిన ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి దర్యాప్తు చేపట్టారు. సరిగ్గా.. ఇదే టైంలో.. విధులు ముగించుకుని.. తమ కూతురిని ఇంటికి తీసుకెళ్లటానికి స్కూల్ దగ్గరకు వెళ్లిన సాక్షి టీవీ అవుట్ పుట్ ఎడిటర్ ప్రవీణ్ రెడ్డి దంపతులకు స్కూల్ దగ్గర ఏడాది వయస్సున్న బాలుడు కన్పించాడు. దీంతో, బాలుడి వివరాలు గురించి వాకబ్ చేస్తే ఎలాంటి సమాచారం రాలేదు.ఈ క్రమంలో ప్రవీణ్‌రెడ్డి.. బాలుడి ఫోటోను తీసి ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డికి వాట్సాప్ చేశారు. బాలుడి బంధువులు ఎవరైనా వస్తారని.. తనకు తెలిసిన వారి ఇంటి దగ్గర ఉంచారు. అప్పటికే మర్యం కుటుంబ సభ్యులు బాలుడు కన్పించటం లేదని ఫిర్యాదు చేయటంతో వాళ్లకు ప్రవీణ్ రెడ్డి పంపిన ఫోటోను చూపించారు. వెంటనే ఆ బాలుడు తమ కుమారుడని గుర్తుపట్టారు. వెంటనే సీఐ.. మర్యం కుటుంబ సభ్యులను బాలుడు ఉన్న చోటుకు తీసుకువచ్చారు. ప్రవీణ్ రెడ్డి దంపతులు, స్థానికుల సమక్షంలో బాలుడిని మర్యం కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. బాలుడు తప్పిపోయిన గంట వ్యవధిలోనే తల్లిదండ్రుల చెంతకు చేర్చటంలో సాయం చేసిన ప్రవీణ్ రెడ్డి దంపతులకు పోలీసులు, మర్యం కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఏపీలో కొససాగుతున్న విధ్వంస పాలన
-
కోటాలో విద్యార్థి అదృశ్యం కలకలం.. వారంలో రెండో ఘటన
జేఈఈ (JEE) విద్యార్థి రచిత్ అదృశ్యం మరవక ముందే రాజస్థాన్‌లోని కోటాలో 18 ఏళ్ల నీట్(NEET) కోచింగ్ విద్యార్థి అదృశ్యం కలకలం రేపతోంది. రెండు రోజుల క్రితం సికార్ జిల్లాకు చెందిన యవరాజ్ అనే విద్యార్థి అదృశ్యం అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను నీట్ మెడికల్ ప్రవేక్ష పరీక్ష కోసం కోటాలో కోచింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. యువరాజు కోటాలోని ట్రాన్స్‌పోర్టు నగరలోని హాస్టల్లో ఉంటున్నాడు. శనివారం ఉదయం 7 గంటలకు క్లాస్‌కు హాజరయ్యేందుకు బయటకు వెళ్లి యూవరాజ్ అదృశ్యం అయ్యాడు. అతను తన మొబైల్ ఫోన్‌ను హాస్టల్లోనే వదిలి వెళ్లాడు. వారం రోజుల క్రితమే రచిత్ సోంధ్య అనే విద్యార్థి అదృశ్యం అయిన విషయం తెలిసిందే. 16 ఏళ్ల జేఈఈ(JEE) విద్యార్థి రచిత్.. హాస్టల్ నుంచి క్లాస్‌కు బయలుదేరి అదృశ్యం అయ్యారు. సీసీటీవీ ఫుటేజుల వివరాల ప్రకారంలో కోటాలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన రచిత్ .. హాస్టల్ నుంచి బయటకు వచ్చి.. ఒక క్యాబ్‌లో అటవీ ప్రాంతానికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. గత సోమవారం రచిత్ బ్యాగ్, మొబైల్ ఫోన్, హాస్టల్ రూం తాళం చెవిని అటవీ ప్రాంతానికి సమీపంలోని గరడియా మహాదేవ్ ఆలయం వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఇద్దరు విద్యార్థుల అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని.. వెతుకుతున్నారు. వారికోసం పోలీసులు ప్రత్యేకంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. -
నా కొడుకు దొరికాడు..తల్లి కృతజ్ఞతలు..
-
భారతీయ విద్యార్థి నాలుగేళ్లుగా మిస్సింగ్.. ఆచూకీ చెబితే 8 లక్షల రివార్డ్
న్యూయార్క్: అమెరికాలోని న్యూజెర్సీలో భారతీయ విద్యార్థి నాలుగేళ్ల క్రితం అదృశ్యమైంది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియరాలేదు. అయితే ఆ యువతి జాడ తెలిపిన వారికి 10 వేల డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం సుమారు 8.32 లక్షలు) ఇవ్వనున్నట్లు యూఎస్ దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) ప్రకటించింది. వివరాలు.. 29 ఏళ్ల మయూషీ భగత్.. 2019, ఏప్రిల్ 29వ తేదీన జెర్సీ సిటీలోని తన అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్లి కనిపించకుండాపోయింది. తల్లిదండ్రులు ఫోన్ చేస్తేమో స్విచ్చాఫ్ వచ్చింది. ఆమె స్నేహితుల్ని సంప్రదించినా ఎలాంటి సమాచారం లభించలేదు.దీంతో కూతురు అదృశ్యంపై ఆమె కుటుంబ సభ్యులు మే 1వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘మయూషీ ఇంటి నుంచి వెళ్లిన సమయంలో కలర్ పైజామా, బ్లాక్ టీ షర్ట్ ధరించింది’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. యువతి మిస్సింగ్‌పై న్యూజెర్సీలోని ఎఫ్‌బీఐ నెవార్క్ ఫీల్డ్ ఆఫీస్, జెర్సీ సిటీ పోలీసు శాఖ ఆమె కోసం గత నాలుగేళ్లుగా కోసం వెతుకుతూనే ఉంది. పలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినా.. ఎలాంటి ఫలితం దక్కలేదు. అయితే మయూషీ ఆచూకీ ఇంకా తెలియరాకపోవడంతో తాజాగా ఎఫ్‌బీఐ ఓ ప్రకటన చేసింది. యువతి సమాచారం ఇచ్చిన వారికి పదివేల డాలర్ల రివార్డు ఇవ్వనున్నట్లు ఎఫ్‌బీఐ తెలిపింది. చదవండి: జన్మనిచ్చిన తల్లికై తపిస్తున్న ఓ కూతురి గాథ వింటే..కన్నీళ్లు ఆగవు..! ఎవరీ మయూషీ భగత్ మయూషీ భగత్.. భారతీయ విద్యార్థి. 1994లో వడోదరాలో జన్మించింది. 2016లో ఎఫ్ 1 స్టూడెంట్ వీసాపై అమెరికా వెళ్లిన ఆమె అక్కడ న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్ చేస్తోంది. మయూషి భగత్ ఎత్తు 5 అడుగుల 10 అంగుళాలు ఉంటుందని. గోధుమ రంగు కళ్ళు, నల్లటి జుట్టు కలిగి ఉంటుందని అధికారులు వివరాలు వెల్లడించారు. ఆమె 2016లో ఎఫ్1 స్టూడెంట్ వీసాపై అమెరికాకు వచ్చింది. FBI గత ఏడాది జూలైలో తన వెబ్‌సైట్‌లోని ‘మోస్ట్ వాంటెడ్’ పేజీలో మయూషీ ‘తప్పిపోయిన వ్యక్తుల’ పోస్టర్‌ను ప్రదర్శించింది. -
Alex Baty: బ్రిటన్‌లో పాపం పసివాడు!
అనగనగా అలెక్స్ బాటీ. ఓ 11 ఏళ్ల పాల బుగ్గల పసివాడు. సొంతూరు బ్రిటన్‌లోని గ్రేటర్ మాంచెస్టర్. తల్లి, తాతయ్య విదేశీ యాత్రకు వెళ్దామంటే సంబరంగా వాళ్లతో కలిసి స్పెయిన్ బయల్దేరాడు. ఆ యాత్ర ఏకంగా ఆరేళ్లకు పైగా సాగుతుందని అప్పుడతనికి తెలియదు పాపం! ఎందుకంటే అప్పట్నుంచీ అతను బ్రిటన్ తిరిగి రానే లేదు. సరికదా, ఆచూకీ కూడా తెలియకుండా పోయాడు! అతనే కాదు, నాటినుంచీ అతని తల్లి, తాతయ్య కూడా నేటికీ పత్తా లేరు!! ఈ ఉదంతం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బ్రిటన్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కూడా చేశారు. అలెక్స్ కోసం యూరప్ అంతటా వెదికీ వెదికీ అలసిపోయారు. ఇక తమవల్ల కాదంటూ చేతులెత్తేశారు. అదుగో, అలాంటి స్థితిలో మూడు రోజుల క్రితం అనుకోకుండా ఫ్రాన్స్‌లో దొరికాడు అలెక్స్. ఈ లాస్ట్ అండ్ ఫౌండ్ స్టోరీ ఇప్పుడు బ్రిటన్ అంతటా టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది! ఇలా దొరికాడు... వాయవ్య ఫ్రాన్స్‌లోని టౌలోస్ అనే కొండ ప్రాంతంలో గత బుధవారం అర్ధరాత్రి దాటాక ఓ 17 ఏళ్ల కుర్రాడు హోరు వానలో తడుస్తూ, హైవే పక్కగా పేవ్‌మెంట్‌పై ఒంటరిగా నడుస్తూ పోతున్నాడు. అటుగా వెళ్తున్న ఫాబియన్ అసిడినీ అనే ఓ ట్రక్ డ్రైవర్ కంటపడ్డాడు. అది మారుమూల ప్రాంతం, పైగా ఎవరూ బయట తిరగని వేళ కావడంతో అనుమానం వచి్చన ఆ డ్రైవర్ మనవాణ్ని దగ్గరికి తీశాడు. తొలుత బెదురు చూపులతో మారుపేరు చెప్పినా, అనునయించి అడిగేసరికి అసలు పేరు, తాను తప్పిపోయిన వృత్తాంతంమొత్తం చెప్పుకొచ్చాడు. ‘కొన్నేళ్ల కింద మా అమ్మే నన్ను కిడ్నాప్ చేసింది’ అంటూ ముక్తాయించాడు. దాంతో బిత్తరపోయిన అసిడినీ వెంటనే అతన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పజెప్పాడు. వాళ్లు బ్రిటన్‌కు సమాచారమివ్వడం, ఫొటో చూసిన నానమ్మ అలెక్స్‌ను గుర్తు పట్టడం, ఇద్దరూ వీడియో కాల్లో మాట్లాడుకుని ఆనందబాష్పాలు రాల్చడం చకచకా జరిగిపోయాయి. ఏం జరిగిందంటే... అలెక్స్ అమ్మానాన్నలు చాన్నాళ్ల క్రితమే విడిపోయారు. అలెక్స్ కోరిక మేరకు కోర్టు అతన్ని నానమ్మ సంరక్షణలో ఉంచింది. ఆమె అనుమతి లేకుండానే 11 ఏళ్ల అలెక్స్‌ను తల్లి, తాతయ్య కలిసి విహారయాత్ర పేరిట 2017లో స్పెయిన్ తీసుకెళ్లారు. అప్పటినుంచీ ముగ్గురూ అయిపు లేకుండా పోయారు. పెద్దవాళ్లిద్దరూ అప్పటికి కొంతకాలంగా ఆధ్యాతి్మక బాట పట్టినట్టు దర్యాప్తులో తేలింది. తమతో పాటు అలెక్స్ కూడా ఆ ప్రత్యామ్నాయ జీవనం గడపాలనే ఉద్దేశంతో అతన్ని తీసుకుని స్పెయిన్‌లో ఓ ఆరామం వంటి ప్రదేశానికి వెళ్లినట్టు పోలీసులు ముక్తాయించారు. తాము తొలుత ఓ విలాసవంతమైన ఇంట్లో ఒక రకమైన ఆధ్యాతి్మక సమూహంతో కలిసి కొన్నేళ్ల పాటు గడిపామన్న అలెక్స్ తాజా వాంగ్మూలం కూడా దీన్ని ధ్రువీకరించింది. తర్వాత అమ్మ, తాతయ్య ఇద్దరూ అలెక్స్‌ను తీసుకుని 2021లో ఫ్రాన్స్‌లో ప్రత్యామ్నాయ జీవన శైలికి పేరున్న పైరెనీస్ ప్రాంతానికి మారినట్టు భావిస్తున్నారు. అలెక్స్ దొరికిన చోటు కూడా అక్కడికి కొద్ది దూరంలోనే ఉంది. ఆ జీవన విధానం తనకు నచ్చక నానమ్మ చెంతకు చేరేందుకు తప్పించుకుని వచ్చేశానని అలెక్స్ చెప్పుకొచ్చాడు. అతన్ని ఒకట్రెండు రోజుల్లో నానమ్మ దగ్గరికి చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అతని అమ్మ, తాతయ్యలపై కిడ్నాపింగ్ కేసు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉండటం విశేషం! తాజా వివరాల ఆధారంగా వారిని తెరపైకి తీసుకొచ్చే పనిలో పడ్డారు బ్రిటన్ పోలీసులు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కడపలో తల్లీతనయుల అదృశ్యం!
కడప అర్బన్ : కడప నగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లీ, ఇద్దరు కుమారులు అదృశ్యమయ్యారు. వివరాలు ఇలా.. సాధుచెంగన్న వీధికి చెందిన షేక్ ఫర్హత్ అంజుమ్‌కు(35), బెల్లంమండివీధిలో నివాసం ఉంటున్న షేక్ అల్తాఫ్తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు షేక్ అబ్దుల్లా(13), షేక్ ఇబ్రహీం(11)లు ఉన్నారు. ఆ తర్వాత భార్యాభర్తలు మనస్పర్థలతో విడిపోయారు. ఈ క్రమంలో ఆమె తన ఇద్దరు కుమారులతో కలిసి తల్లి షేక్ ముంతాజ్ బేగం వద్ద ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈనెల 8వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మాసాపేటలోని ఓ స్కూల్లో చదువుతున్న తన ఇద్దరు కుమారులను తీసుకుని వస్తానని తల్లికి చెప్పి ఫర్హత్ వెళ్లింది. తరువాత తన కుమార్తె, ఇద్దరు మనుమల ఆచూకీ తెలియరాలేదని ముంతాజ్ బేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి ఆచూకీ తెలిసిన వారు 9121100513, 9121100517, 9121100518 ఫోన్ నంబర్లలో లేదా పోలీస్ స్టేషన్‌లోగానీ, డయల్ 100కు గానీ సమాచారం ఇవ్వాలని కడప టు టౌన్ పోలీసు స్టేషన్ ఎస్ఐ సంజీవరాయుడు కోరారు. ఇవి చదవండి: అనుమానాస్పద స్థితిలో భార్య మృతి! భర్తే ఇలా చేశాడని.. -
కూతురు జాడ కోసం తుది శ్వాస వరకు ఆరాటపడ్డ ఓ తల్లి వ్యథ!
కాలం ఎప్పుడూ.. బంధాల కోసం పాకులాడే అనురాగాలతో పాటు, ఆ బలహీనతలతో ఆటలాడుకునే నైజాన్ని సరితూకమేస్తుంది. జరిగినదాంట్లో పాపపుణ్యాలను పక్కనపెడితే చివరికి మిగిలిన వ్యథే.. ఎన్నో హెచ్చరికలను జారీ చేస్తుంది. సుమారు యాభై ఏళ్ల క్రితం అదృశ్యమైన ‘అమీ బిల్లిగ్’ అనే అమ్మాయి ఉదంతం అలాంటిదే. అమెరికా, ఫ్లోరిడాలోని మయామిలో ‘కోకోనట్ గ్రోవ్’ సమీపంలో నివసించే నెడ్ బిల్లిగ్, సుసాన్ బిల్లిగ్ దంపతులు.. కూతురు అమీ, కొడుకు జోస్‌తో కలసి సంతోషంగా జీవించేవారు. తండ్రి నెడ్ ఆర్ట్ గ్యాలరీ నడుపుకుంటుంటే.. తల్లి సుసాన్ ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తూ .. వచ్చినదానితోనే పిల్లల్ని ప్రాణంగా చూసుకునేవారు. జోస్ కంటే అమీ సుమారు పదేళ్లు పెద్దది. అమ్మాయికి యుక్త వయసు వచ్చేనాటికి.. ఆ కుటుంబాన్ని ఊహించని ఉపద్రవం ముంచెత్తింది. అది 1974 మార్చి 5, మధ్యాహ్నం 12 దాటింది. పదిహేడేళ్ల అమీ.. స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది. రాగానే ఆర్ట్ గ్యాలరీకి కాల్ చేసి.. తండ్రితో మాట్లాడింది. ‘డాడ్.. నేను మా స్నేహితులతో కలసి హోటల్లో లంచ్‌కి వెళ్తున్నా.. నాకు 2 డాలర్లు కావాలి’ అని కోరింది. ‘సరే.. గ్యాలరీకి వచ్చి తీసుకెళ్లమ్మా’ అన్నాడు నెడ్. వెంటనే రెడీ అయ్యి.. కెమెరా పట్టుకుని.. ‘అటు నుంచి అటే వెళ్తా మమ్మీ’ అని తల్లికి చెప్పి.. తండ్రి దగ్గరకు బయలుదేరింది అమీ. ఇంటి నుంచి గ్యాలరీకి పావుగంట పడుతుంది. దాంతో కాసేపట్లో కూతురు వస్తుందని నెడ్ ఎదురు చూడసాగాడు. గంటదాటినా రాలేదు. ‘ఒకవేళ డబ్బులు వద్దనుకుని వెళ్లిపోయిందేమో’ అని సరిపెట్టుకున్నాడు నెడ్. సాయంత్రం ఇంటికెళ్లి చూస్తే.. కూతురు ఇంకా ఇల్లు చేరలేదు. మధ్యాహ్నం వెళ్లిన అమ్మాయి.. రాత్రి కావస్తున్నా రాకపోయేసరికి భయమేసింది. పైగా అమీ డబ్బులు తీసుకోవడానికి తన దగ్గరకు కూడా రాలేదనే భర్త మాటలు విని.. సుసాన్‌కి గుండె ఆగినంత పనైంది. వెంటనే ఆమె స్నేహితుల్ని ఆరా తీస్తే.. తెలియదనే సమాధానమే వినిపించింది. పోలీసుల్ని ఆశ్రయిస్తే.. ‘ఈ రోజుకి చూడండి.. రేపటికీ రాకపోతే కేసు నమోదు చేసుకుందాం’ అనే బదులొచ్చింది. మరునాడు కూడా అమీ అడ్రస్ లేకపోయేసరికి.. అన్నమాట ప్రకారం పోలీసులు రంగంలోకి దిగారు. ఆ వెతుకులాటలోనే వైల్డ్‌వుడ్ ఎగ్జిట్ అనే హైవే రోడ్లో అమీ తీసుకెళ్లిన కెమెరా దొరికింది. దానిలోని ఏ ఫొటో.. తదుపరి విచారణకు సహకరించలేదు. కొన్ని రోజులకు.. నెడ్ దంపతులకు ఓ నంబర్ నుంచి బెదిరింపు కాల్స్ రావడం మొదలయ్యాయి. ఆ కాల్స్‌లో ప్రతిసారి.. ‘మమ్మీ, డాడీ కాపాడండి’ అంటూ ఏడ్చే అస్పష్టమైన అమ్మాయి స్వరం వారిని వణికించింది. ‘పోలీసులకు చెప్పకుండా 30 వేల డాలర్లు ఇస్తే.. మీ అమ్మాయిని వదిలిపెడతాం.. లేదంటే చంపేస్తాం’ అనే హెచ్చరిక.. వారి కన్నపేగును మెలిపెట్టింది. దాంతో వారు చెప్పిన సమయానికి.. అడిగినంత డబ్బు పంపించేశారు. అయితే రోజులు గడిచినా అమీ తిరిగి రాలేదు. కనీసం ఆ నంబర్ నుంచి ఫోన్ కాల్స్ కూడా లేవు. తిరిగి కాల్ చేస్తే కలవలేదు. దాంతో నెడ్ దంపతులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కూపీ లాగిన పోలీసులు.. ఆ బెదిరింపు కాల్స్ చేసింది చార్ల్స్, లారే గ్లాసర్ అనే కవలలని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. చివరికి వాళ్లు కేవలం డబ్బు కోసం మాత్రమే అలా చేశారని.. అమీ మిస్సింగ్‌కి వాళ్లకి ఏ సంబంధం లేదని తేలింది. అమీ తల్లిదండ్రుల ఎమోషన్స్‌తో ఆడుకున్నందుకు కోర్టు వారికి జైలు శిక్ష విధించింది. మరికొన్ని రోజులకు.. ‘ది అవుట్లాస్’ అనే మోటర్‌సైకిల్ గ్యాంగ్.. అమీని కిడ్నాప్ చేసుండొచ్చు అనే కొందరు స్థానికుల అనుమానం.. నెడ్ దంపతుల్ని బెదరగొట్టింది. దాంతో నెడ్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు.. పోలీసులతో సంబంధం లేకుండా.. ఓ అనుమానిత బైక్ ముఠా సభ్యులతో నెడ్ కుటుంబానికి రహస్య సమావేశం ఏర్పాటు చేశాడు. అమీ ఫొటోలు చూసిన ఆ ముఠా సభ్యుల్లో కొందరు.. ‘మేము అమీనైతే చూడలేదు. కానీ, గతంలో కొందరు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి అమ్ముకున్న మాట వాస్తవమే’ అని ఒప్పుకున్నారు. అందులో కొందరు కేవలం క్రెడిట్ కార్డ్స్ కోసం, బైక్స్ కోసమే అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి, విక్రయించినట్టు చెప్పారు. అమీ వివరాలు ఇతర బైకర్స్ నుంచి సంపాదిస్తామని నెడ్ ఫ్యామిలీకి మాటిచ్చారు. కానీ వాళ్ల నుంచి ఆ తర్వాత ఎలాంటి సహాయమూ అందలేదు, సమాచారమూ రాలేదు. అయితే అంతకు ఐదేళ్ల క్రితం బైకర్ ముఠాకు చిక్కిన ‘గినా ఆండ్రూ’ అనే అమ్మాయి తప్పించుకుని క్షేమంగా తిరిగి రావడంతో.. అమీ కూడా అలాగే తిరిగి వస్తుందని ఆశపడింది నెడ్ కుటుంబం. కానీ అలా జరగలేదు. అమీ తల్లి సుసాన్.. కూతురి ఫొటోలు పట్టుకుని పిచ్చిదానిలా చాలా చోట్ల వెతికింది. ఆ క్రమంలోనే తమ ఇంటికి 160 మైళ్ల దూరంలో ఉన్న ఒక కన్వీనియెన్స్ స్టోర్ మేనేజర్ని కలిసింది. అమీ ఫొటో చూసి గుర్తుపట్టిన ఆ మేనేజర్.. ‘అమీ ఇద్దరు బైకర్స్‌తో కలసి చాలాసార్లు మా స్టోర్‌కి వచ్చింది. ఆమె వెజిటేరియన్ కావడంతో తను నాకు బాగా గుర్తుంది’ అని చెప్పాడు. అతని మాట విన్న కొన్ని పత్రికలు.. అమీ తన ఇష్టప్రకారమే కుటుంబానికి దూరంగా పారిపోయిందనే కథనాలను అల్లాయి. ఆ ఊహాగానాల్లో ఏడాది గడిచిపోయింది. సుసాన్ మాత్రం తన ప్రయత్నాలు ఆపలేదు. ఎవరి మాటలూ నమ్మలేదు. ఒకరోజు ఓ కొత్త నంబర్ నుంచి నెడ్ కుటుంబానికి కాల్ వచ్చింది. ‘నా పేరు జాన్సన్.. అమీ గురించి మరచిపొండి, తనని వెతకొద్దు.. నేనో సెక్స్ రాకెట్ సభ్యుడ్ని. తనని బంధించింది నేనే’ అని బెదిరించాడు అవతలి వ్యక్తి. కాసేపటికే ఫోన్ కట్ అయ్యింది. అతడి నుంచి వరసగా కాల్స్ వస్తూనే ఉన్నాయి. కానీ అతడు పబ్లిక్ బూత్ నుంచి కాల్స్ చేస్తుండడంతో పోలీసులు పట్టుకోలేకపోయారు. ఆ బెదిరింపు కాల్స్ నెడ్ కుటుంబాన్ని మరింత కుంగదీశాయి. ‘అమీ మాట వినలేదని నాలుక కత్తిరించాం. మీరు ఇలానే అమీ కోసం వెతుకుతూ ఉంటే ఆమెను చంపేస్తాం. అమీని కిడ్నాప్ చేసినట్లే.. నిన్ను కూడా కిడ్నాప్ చేస్తాం’ అని సుసాన్‌ని వీలు చిక్కినప్పుడల్లా హడలెత్తించాడు జాన్సన్. అసభ్యకరమైన పదజాలంతో హింసించేవాడు. వేధింపులు ఎక్కువైనా.. ఏదో ఒకరోజు జాన్సన్.. అమీ గురించి నిజం చెబుతాడేమోనన్న ఆశతో ఫోన్ నంబర్ మార్చలేదు నెడ్ కుటుంబం. ఇక 1975 చివరిలో డేవిడ్ అనే ఒక ముఠా సభ్యుడు సుసాన్‌ని వ్యక్తిగతంగా కలిశాడు. ‘ఒక వార్తాపత్రికలో అమీ ఫొటో చూసి, గుర్తుపట్టి వచ్చాను. ఆమె నాకు బాగా తెలుసు’ అని చెప్పాడు. ‘ఎలా తెలుసు?’ అని అడిగితే.. ‘చట్టవిరుద్ధంగా ఒక ముఠాకి కొంత డబ్బు ఇచ్చి.. కొన్ని నెలలకుగాను అమీని నేను కొన్నాను. ఆమె నా దగ్గరున్నంత కాలం దిగులుగానే ఉంది. మూగది కావడంతో తన బాధ నాకు అర్థం కాలేదు’ అని చెప్పాడు. ఆ అమ్మాయి మూగది అనడంతో.. జాన్సన్ మాటలు గుర్తొచ్చాయి సుసాన్‌కి. అమీ ఒంటిమీదుండే రహస్య పుట్టుమచ్చల వివరాలు డేవిడ్ నోట వినడంతో.. తన నమ్మకం బలపడింది. అయితే సుసాన్ ఆవేదన చూడలేకపోయిన డేవిడ్.. అమీని వెతకడంలో సాయం చేస్తానని మాటిచ్చాడు. ఆ మాట ప్రకారమే డేవిడ్.. ఒకరోజు సుసాన్‌ని అసాంఘిక ప్రదేశానికి తీసుకెళ్లి.. అక్కడున్న ఓ ముఠా దగ్గర అమీ గురించి ఆరా తీశాడు. తీరా వారికి డేవిడ్ మీద అనుమానం వచ్చి దాడికి దిగారు. అదృష్టవశాత్తూ సుసాన్ తప్పించుకోగలిగింది. సరిగ్గా ఐదువారాలకు కాళ్లు, చేతులకు కట్లతో డేవిడ్.. సుసాన్ దగ్గరకు వచ్చాడు. ఓక్లహామా, తుల్సాలోని ఒక బార్లో అమీ పనిచేస్తున్నట్లు తెలిసిందని సమాచారమిచ్చి వెళ్లిపోయాడు. తిరిగి ఎప్పుడూ సుసాన్‌ని అతడు కలుసుకోలేదు. కూతురు మీద బెంగతో సుసాన్‌కి గుండెపోటు వచ్చింది. అయినా సరే.. కూతురి కోసం తుల్సా వెళ్లి.. అక్కడే కొన్ని నెలల పాటు ఉండి.. సమీపంలోని బార్లు, టాటూ సెంటర్స్ అన్నీ వెతికింది. అయితే అమీ ఫొటో చూసిన కొందరు.. డేవిడ్ చెప్పినట్లే ఆమె మూగ అమ్మాయిగా గుర్తు చేసుకున్నారు. ఏళ్లు గడిచాయి. జాన్సన్ వేధింపులూ ఆగలేదు. సుసాన్‌కి మరో రెండుసార్లూ గుండెపోటు వచ్చింది. అమీ మిస్ అయిన నాటికి బాలుడిగా ఉన్న జోస్ పెద్దవాడయ్యాడు. తల్లితో పాటు తన అక్క కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఇక తండ్రి నెడ్ 1993లో ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడ్డాడు. చనిపోయే ముందు చివరిసారిగా అమీని చూడాలని ఆరాటపడ్డాడు. జాన్సన్ కాల్ కోసం ఎదురు చూసిన సుసాన్.. నెడ్ పరిస్థితి వివరించి.. తన కూతుర్ని చూపించమని వేడుకుంది. అయినా జాన్సన్ నుంచి సమాధానం రాలేదు. చివరికి నెడ్ తన కోరిక తీరకుండానే మరణించాడు. హెన్రీ(ఎడమవైపు), అమీ(కుడివైపు) సుమారు 20 ఏళ్లకి.. పోలీసులు జాన్సన్‌ని అదుపులోకి తీసుకోగలిగారు. అయితే అతడి పూర్తిపేరు హెన్రీ జాన్సన్ బ్లెయిర్ అని.. కస్టమ్స్ డిపార్ట్మెంట్ మాజీ ఉద్యోగి అని గుర్తించారు. తీరా అధికారులు తమదైన శైలిలో విచారిస్తే.. ‘అమీ నాకు తెలియదు. కేవలం సెక్సువల్ ప్లెజర్ కోసమే నెడ్ కుటుంబానికి అలా బూటకపు కాల్స్ చేసేవాడ్ని’ అని చెప్పాడు. అతడో ‘మానసిక రోగి, మద్యానికి బానిస’ అని అతడి సన్నిహితులు తెలిపారు. అతడు మరికొందరికి చేసిన ఇలాంటి బూటకపు కాల్స్ అధికారికంగా నిరూపితమయ్యాయి. దాంతో నెడ్ కుటుంబానికి హెన్రీ జాన్సన్ కలిగించిన మనోవ్యథకు జైలు శిక్ష పడింది. అయితే హెన్రీ జాన్సన్.. అమీకి సుపరిచితుడేనని తేల్చాయి కొన్ని ఆనవాళ్లు. అమీ ఫొటోస్‌లో ఉన్న ఒక తెల్ల కారు.. హెన్రీ జాన్సన్ దగ్గరుంది. అలాగే అమీ తన డైరీలో ఒక చోట ‘హంక్ అనే స్నేహితుడు నన్ను దక్షిణ అమెరికా తీసుకెళ్తా అన్నాడు’ అని రాసుకుంది. ఆశ్చర్యకరంగా కస్టమ్స్ ఏంజెంట్‌గా హెన్రీ జాన్సన్ మారుపేరు హంక్. అయితే స్పష్టమైన మరే ఇతర సాక్ష్యాలు లేకపోవడంతో హెన్రీ ఈ కేసు నుంచి బయట పడ్డాడు. ఇక 1997లో ఒక మహిళ.. పోలీస్ స్టేషన్‌కి వచ్చి ‘పాల్ బ్రాండ్’ అనే వ్యక్తి నా భర్త, మోటర్‌సైకిల్ ముఠా మాజీ సభ్యుడు, అతడు చనిపోతూ అమీ వివరాలు చెప్పాడు’ అని షాకిచ్చింది. ఆమె మాటలకు అమెరికా మొత్తం ఉలిక్కిపడింది. పాల్ ఆమెతో చెప్పిన మాటల సారాంశం ఇలా ఉంది. ‘ఒకసారి అమీ.. మోటర్‌సైకిల్ ముఠా సభ్యులను అవమానించిందనే కక్షతో ఆమెను కిడ్నాప్ చేసి, ఫ్లోరిడా ఎవర్గ్లేడ్స్ పార్టీకి తీసుకెళ్లాం. ఆమెపై పలుమార్లు లైంగికదాడి చేశాం. ఆమెను లొంగదీసుకోవడానికి చాలాసార్లు డ్రగ్స్ ఇంజెక్ట్ చేయడంతో ఆమె చనిపోయింది. దాంతో ఆ రాత్రికే ఓ చిత్తడి నేలలో ఆమెను పూడ్చిపెట్టాం’ అని చనిపోయే ముందు భార్యతో చెప్పాడట పాల్. దీన్ని నమ్మేందుకు ఒక ఆధారం ఉంది. అమీ మిస్ అయిన కోకోనట్ గ్రోవ్కి.. పాల్ చెప్పిన క్రైమ్ జరిగిన ఎవర్గ్లేడ్స్కి మార్గం మధ్యలోనే అమీ తీసుకెళ్లిన కెమెరా దొరికింది. మొదట పాల్ మాటల్ని నమ్మిన సుసాన్ కుటుంబం.. అమీకి స్మారక చిహ్నం కూడా కట్టించింది. కానీ పాల్ పబ్లిసిటీ కోసం ఈ కథను సృష్టించి ఉంటాడేమో అనే ఆలోచన రావడంతో మళ్లీ అమీ కోసం వెతకడం మొదలుపెట్టింది ఆ కుటుంబం. దురదృష్టవశాత్తు సుసాన్ .. 2005, జూన్ 7న ఎనభై ఏళ్ల వయసులో మరణించింది. ఇప్పుడు అమీని వెతికే బాధ్యతను.. జోస్ అందుకున్నాడు. అసలు.. అమీ ఎవరినైనా గుడ్డిగా నమ్మి మోసపోయిందా? లేక బలవంతంగా అపహరణకు గురైందా? హెన్రీ జాన్సన్ మాటల్లో వాస్తవమెంత? పాల్ తన భార్యకు చెప్పింది నిజమేనా? డేవిడ్ ఏమయ్యాడు? ఇలా ఎన్నో ప్రశ్నలు నేటికీ మిస్టరీనే. ∙సంహిత నిమ్మన (చదవండి: -
భర్తతో గొడవ పడి.. ఆపై భార్య..
సంగారెడ్డి: కుటుంబ సమస్యలతో గొడవపడిన భార్య కనిపించకుండా పోయిన ఘటన సోమవారం నర్సాపూర్ మండలం గంగారాం తండాలో చోటు చేసుకుంది. కనిపించకుండా పోయిన గృహిణి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన జర్పుల బుజ్జి కుమార్తె శివానిని సలాబత్ తండాకు చెందిన చంద్రకాంత్‌కు ఇచ్చి నాలుగేళ్ల క్రితం పెళ్లి చేశారు. భర్తతో కుటుంబ సమస్యలపై గొడవ పడిన శివాని తల్లి గారింటి వద్దనే ఉంటుంది. ఈ క్రమంలో ఆదివారం ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయిందని శివాని తల్లి బుజ్జి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మిస్సింగ్ కాదు మోసం.. ఆదినారాయణ అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, కోడూరు(అవనిగడ్డ): కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ నోట్ ద్వారా నమ్మించే ప్రయత్నం చేసిన ఆదినారాయణ మిస్సింగ్ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. పెడన మండలంలోని కాకర్లపూడి శివారు ముత్రాస్పాలెం గ్రామానికి చెందిన యరగాని ఆదినారాయణ ఈ నెల 25వ తేదీన ఇంటి వద్ద నుంచి తన ద్విచక్రవాహనంపై ఉల్లిపాలెం–భవానీపురం వారధి వద్దకు చేరాడు. రాత్రి 7గంటల సమయంలో ఆదినారాయణ తన బైక్‌ను వారధిపై ఉంచి, అందులో తాను చనిపోతున్నట్లుగా సూసైడ్ నోట్ రాసి బైక్ ట్యాంక్ కవర్లో పెట్టాడు. ఇదే సూసైడ్ నోట్‌ను తన భార్య నవ్యశ్రీ ఫోన్‌కు కూడా పంపాడు. అప్పుల బాధలు ఎక్కువ కావడంతోనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని, తన కోసం ఎవరూ గాలించవద్దని, గాలించినా కూడా తన మృతదేహం దొరకదంటూ ఆదినారాయణ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. కోడూరు వంతెన సెంటర్లో నడుచుకుంటూ వెళ్తున్న ఆదినారాయణ రెండు రోజుల పాటు ముమ్మర గాలింపు.. ఆదినారాయణ బైక్‌తో పాటు సూసైడ్ నోట్ కూడా వారధిపై ఉండడంతో పోలీసులు ఆదినారాయణ వారధిపై నుంచి కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావించారు. ఇందులో భాగంగా రెండు రోజుల పాటు కోడూరు, పెడన పోలీసులు, ఎన్ఢీఆర్ఎప్ బృందాలు, స్థానిక మత్స్యకారుల సహాయంతో కృష్ణానదిని జల్లెడ పట్టారు. బందరు, కోడూరు మండలాల్లో ప్రవహించే నది ప్రాంతమంతా వెతికినా కూడా ఆదినారాయణ ఆచూకీ లభించలేదు. సహజంగా ఓ వ్యక్తి నదిలో దూకితే 36గంటల లోపు నీటిలో పైకి తేలతాడని, అయితే ఆదినారాయణ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు మరో కోణంలో తమ దర్యాప్తును ప్రారంభించారు. సీసీ టీవీ ఫుటేజీల్లో ఆచూకీ.. ఆదినారాయణ నదిలో దూకలేదని పోలీసులకు అనుమానం రావడంతో పెడన దగ్గర నుంచి కోడూరు వరకు ఉన్న అన్ని సీసీ టీవీ ఫుటేజీలను పోలీసులు నిశితంగా పరిశీలించారు. ఇంటి వద్ద నుంచి బయలుదేరినప్పుడు ఆదినారాయణ వద్ద బ్యాగ్ లేదని, బందరులోని ఓ దుకాణంలో బ్యాగ్‌ను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అక్కడ నుంచి బైక్‌పై చిన్నాపురం మీదగా ఉల్లిపాలెం వస్తున్నట్లు సీసీ టీవీల్లో రికార్డు అయింది. ఉల్లిపాలెం వారధి వద్ద ఆదినారాయణ తాను ఇంటి వద్ద వేసుకున్న దుస్తులను మార్చుకొని, ముఖానికి మాస్క్ ధరించి ఆటోలో కోడూరు వెళ్లడాన్ని గుర్తించారు. కోడూరు వంతెన సెంటర్లోని గంగాభవానీ అమ్మవారి దేవాలయం వద్ద ఆదినారాయణ ఆటో దిగడంతో పాటు చేతిలో బ్యాగు పట్టుకొని, మరో బ్యాగు తగిలించుకొని నవ్వుతూ సెల్‌ఫోన్‌ల్లో మాట్లాడుకుంటూ అక్కడ తిరగడం సీసీ టీవీల్లో రికార్డు అయ్యింది. కోడూరు నుంచి అవనిగడ్డకు బైక్‌ను లిఫ్ట్ అడిగి వెళ్లడాన్ని పోలీసులు గుర్తించారు. తప్పుదోవ పట్టించేందుకు.. విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు వారధి వద్ద బైక్, సూసైడ్ నోట్ పెట్టి ఆదినారాయణ బయట ప్రాంతాలకు పరారయ్యాడని పోలీసులు చెప్పారు. చేసిన అప్పులు కట్టకుండా తప్పించుకొనేందుకు ఈ తరహాలో మోసానికి పాల్పడినట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఆదినారాయణ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు కొనసాగుతుందని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ కూడా కొనసాగుతుందని ఎస్ఐ రాజేంద్రప్రసాద్ తెలిపారు. పెడన పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారని ఎస్ఐ చెప్పారు. -
నిలోఫర్ ఆస్పత్రిలో మిస్సైన బాలుడి ఆచూకీ లభ్యం
-
బాలిక మృతి కేసులో వీడని మిస్టరీ..?
బిట్రగుంట: బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ సమీపంలో గత నెల 30న అనుమానాస్పద స్థితిలో లభ్యమైన పదేళ్ల బాలిక మృతి కేసు మిస్టరీగా మారింది. పది రోజులు గడిచినా కేసు దర్యాప్తులో పురోగతి కనిపించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత నెల 30న వేకువన ఫిషింగ్ హార్బర్ సమీపంలో సముద్రంలో బాలిక మృతదేహాన్ని స్థానిక మత్స్యకారులు గుర్తించిన విషయం తెలిసిందే. బాలిక పెదవులు, మొహం నీలిరంగులో మారి ఉండడం, ముక్కు నుంచి నురగ వచ్చి ఉండడం మినహా ఎటువంటి దెబ్బలు, చేపలు కొరికిన గాయాలు లేకపోవడంతో ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే మృతదేహం వెలుగుచూసినట్లుగా భావించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించి చేతులు దులుపుకొన్నారు. బాలిక ఎవరనేది తెలిస్తే మృతికి గల కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నా ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. జిల్లాతో పాటు సమీప జిల్లాల్లో నమోదైన మిస్సింగ్ కేసులు, వలస కార్మికుల వివరాలను కూడా పూర్తిస్థాయిలో పరిశీలించలేదనే విమర్శలు ఉన్నాయి. ఫిషింగ్ హార్బర్‌తో పాటు రామాయపట్నం పోర్టు నిర్మాణానికి ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కూలీలు వచ్చి ఉన్నారు. వీరికి సంబంధించి కూడా ఎవరైనా కనిపించకుండా పోయారా అనే కోణంలో కూడా దర్యాప్తు ముందుకు సాగలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలిక ప్రమాదవశాత్తు సముద్రంలో పడి చనిపోతే తప్పనిసరిగా తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు నమోదు చేసి ఉండేవారు. ఎక్కడా మిస్సింగ్ కేసు నమోదవకపోవడం, బాలిక తల్లిదండ్రుల జాడా లేకపోవడంతో అంతా మిస్టరీగా మారింది. పోలీసులు ప్రాథమిక వివరాల పరిశీలనలో విఫలం కావడంతో పాటు సాంకేతిక ఆధారాల సేకరణకు ఎటువంటి ప్రయత్నాలు చేసినట్లుగా కనిపించడం లేదు. ఎక్కడో చనిపోతే ఇక్కడికి కొట్టుకొచ్చిందంటూ కేసును పక్కన పెట్టేసినట్లుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై బిట్రగుంట ఎస్సై శేఖర్‌బాబును సంప్రదించగా మృతి చెందిన బాలికకు సంబంధించి ఇంకా ఎటువంటి వివరాలు లభ్యం కాలేదని తెలిపారు. రాష్ట్రంలో మిస్సింగ్ కేసులకు సంబంధించిన వివరాలు అన్నీ పరిశీలించినా ఎటువంటి సమాచారం సరిపోలేదన్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తరువాత మృతికి కారణాలు తెలిసే అవకాశం ఉందని తెలిపారు. -
ఓ అమాయకురాలి విషాద గాథ! చంపింది స్నేహితుడా?.. ప్రేమికుడా?..
నిజాలను అబద్ధాలుగా.. అబద్ధాలను నిజాలుగా మార్చేయడం నేరగాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటివాళ్ల గారడీలో చిక్కిన అమాయకుల కథ ప్రపంచానికి తెలియకుండానే ముగిసిపోతుంది. చరిత్రలో మిస్టరీగా మిగిలిపోతుంది. కాథీ ఫోర్డ్ వ్యథ అలాంటిదే. వెస్ట్ వర్జీనియాలోని గోర్మానియా, మేరీల్యాండ్ సమీపంలో ఉన్న ఓల్డ్మిల్ రెస్టారెంట్ అది. 1988 ఫిబ్రవరి 17 మధ్యాహ్నం ఒంటిగంటకు ఓ ఫోన్ మోగింది. అందులో వెయిట్రెస్‌గా పని చేస్తున్న కాథీ ఫోర్డ్ అనే 19 ఏళ్ల అమ్మాయి ఆ ఫోన్ లిఫ్ట్ చేసింది. ఆ రెస్టారెంట్ ఆమె తల్లిదండ్రులదే. అందులో తను పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ ఉండేది. ఫోన్ పెట్టెయ్యగానే ఆమె చాలా కంగారుగా, అందులో పనిచేసే మరో ఉద్యోగినితో ‘కాల్ చేసింది ఓ మేజిస్ట్రేట్ అట, మైనర్లకు మద్యం అమ్ముతున్న బార్లు, రెస్టారెంట్లపై పోలీస్ విభాగం కఠినంగా వ్యవహరిస్తోందని అతడు హెచ్చరించాడు’ అని ఇతర వివరాలేమీ చెప్పకుండా అక్కడి నుంచి పరుగుతీసింది. ఆమె అదే కంగారుతో ఇంటికి వెళ్లి స్నానం చేసి, డ్రెస్ మార్చుకుని.. సరిగ్గా గంటకి రెస్టారెంట్‌కి తిరిగి వచ్చింది. అంతే వేగంగా తన పర్స్ అందుకుని, తన తండ్రి కారులో బయలుదేరింది. అదే ఆమె కనిపించిన ఆఖరి దృశ్యం. సాయంత్రం దాకా ఆమె కోసం ఎదురు చూసిన తల్లిదండ్రులు.. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. మరునాడు కాథీ బాయ్‌ఫ్రెండ్ డార్విన్ పోలీసుల్ని కలసి.. గోర్మానియాకు చెందిన డిప్యూటీ షెరీఫ్ పాల్ ఫెర్రెల్పై తనకు అనుమానం ఉందని, కాథీకి అతడితో పరిచయం ఉందని చెప్పాడు. పైగా గతరాత్రి కాథీని ఫెర్రెల్ నివాస గృహానికి సమీపంలో చూశానని సాక్ష్యమిచ్చాడు. దాంతో అదేరోజు ఫెర్రెల్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. ‘కాథీ నాకు ప్రియురాలి కంటే ముందు గొప్ప స్నేహితురాలు.. గత రాత్రి ఎనిమిదిన్నర సమయంలో స్థానిక క్లబ్‌హౌస్‌కి నా కోసం కాథీ కాల్ చేసి, కలుద్దాం అంటూ ఏడ్చింది. హైస్కూల్ పార్కింగ్ స్థలంలో ఎదురుచూస్తా త్వరగా రా అన్నాను. సుమారు 20 నిమిషాలు ఎదురు చూసినా తను రాలేదు’ అంటూ ఫెర్రెల్ బదులిచ్చాడు. ఫెర్రెల్ అప్పటికే బెర్నార్డ్ అనే మహిళతో రిలేషన్లో ఉన్నాడు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 1988 జనవరిలోనే ఫెర్రెల్ వెస్ట్ వర్జీనియాలోని గ్రాంట్ కౌంటీలో డిప్యూటీ షెరీఫ్గా జాయిన్ అయ్యాడు. సరిగ్గా నెలకు కాథీ మిస్ అయ్యింది. ‘1987 నుంచే మా మధ్య పరిచయం ఉంది. మా కలయిక చాలా రహస్యంగా నడిచేది. ఇటు బెర్నార్డ్కి కానీ, అటు కాథీ బాయ్ ఫ్రెండ్‌కి కానీ తెలియకుండా జాగ్రత్తపడేవాళ్లం. జాబ్ వచ్చిన తర్వాత కాథీకి సమీపంలో బిస్మార్క్ రోడ్లో ఇల్లు అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉండేవాడ్ని. అప్పుడప్పుడు కాథీ నా దగ్గరకు వచ్చేది’ అని ఫెర్రెల్ చెప్పాడు. ఆధారాలు లేక అతడ్ని వదిలిపెట్టేశారు. సరిగ్గా వారానికి ఓల్డ్మిల్ రెస్టారెంట్‌కి ఓ లేఖ వచ్చింది. అందులో ‘నేను క్షేమంగానే ఉన్నాను.. నా కోసం వెతకొద్దు’ అని కాథీ రాసినట్లుంది. అయినా డార్విన్.. కాథీ కోసం వెతకడం ఆపలేదు. మరో రెండు వారాలకు ఫెర్రెల్ నివాసం ఉండే ఇంటికి కిలోమీటర్‌లోపే, అడవిలో కాథీ తీసుకెళ్లిన కారు కాలి బూడిదై కనిపించింది. ఎక్కడా కాథీ ఆనవాళ్లు కానీ, మృతదేహం కానీ కనిపించలేదు. వెంటనే.. రెస్టారెంట్‌కి వచ్చిన లేఖలోని చేతిరాతపై నిఘా పెట్టారు అధికారులు. అది ఫెర్రెల్ చేతిరాతేనని తేలడంతో కేసు బిగుసుకుంది. అయితే ఫెర్రెల్ ఇంకో షాకిచ్చాడు.. ‘ఆ కారు అక్కడున్న విషయం నాకు ముందే తెలుసు. కాథీ కేసు విషయంలో నన్ను విచారించి, వదిలిపెట్టిన మరునాడే కాథీ కోసం వెతుకుతుంటే.. ఆ కారు అక్కడ కనిపించింది. కాథీ శవం కారులో ఉందేమోనన్న భయంతో ఎవరికీ చెప్పలేదు. ఎవరో నన్ను ఇరికిస్తున్నారని అర్థమై ఆ లేఖ రాసి తప్పించుకోవాలని అనుకున్నా’ అన్నాడు. మరోవైపు ఫెర్రెల్ బెడ్రూమ్లో గోడ మీద రక్తం మరకలు ఉండటంతో ఆ శాంపిల్స్ ల్యాబ్‌కి పంపించారు పోలీసులు. అది ఓ మహిళ రక్తమని తేలింది కానీ కాథీదో కాదో తేల్చలేకపోయారు. దాని గురించి ఫెర్రెల్ని అడిగితే.. ఆ మరకలు తాను అద్దెకు రాకముందు నుంచే ఆ గోడ మీద ఉన్నాయని చెప్పాడు. ఇక ఫెర్రెల్ నివాసానికి పొరుగున ఉండే కిమ్ నెల్సన్ అనే మహిళ.. ఫిబ్రవరి 17 రాత్రి తనకు సమీపంలో ఓ అమ్మాయి అరుపులు, తుపాకీ శబ్దాలు వినిపించాయని సాక్ష్యమిచ్చింది. దాంతో కాథీని చంపి మృతదేహాన్ని ఫెర్రెల్ ఎక్కడో దాచేశాడని నమ్మేవాళ్లు పెరిగిపోయారు. అలా సుమారు పదిహేనేళ్లు జైల్లోనే ఉండిపోయాడు ఫెర్రెల్. మరోవైపు అతడు.. పరిచయస్తులైన ఆడవారికి అజ్ఞాత ఫోన్ కాల్స్ చేసి.. అసభ్యకరమైన మాటలు మాట్లాడేవాడని తేలింది. తను చెప్పిన చోటుకు రావాలని బెదిరించేవాడని కొందరు మహిళలు సాక్ష్యమిచ్చారు. ఆ ఆరోపణలను ఫెర్రెల్ అంగీకరించినప్పటికీ.. ఈ ఫోన్ కాల్స్‌కి, కాథీ మిస్సింగ్‌కి సంబంధం లేదని వాదించాడు. అయితే కాథీకి ఆ రోజు కాల్ చేసింది ఫెర్రెలే అయ్యుంటాడని, ఏదో చెప్పి బెదిరించడంతోనే ఆమె వెళ్లి ఉంటుందని.. గతంలో ఇద్దరి మధ్య ఉన్న స్నేహపూర్వకమైన సంబంధాన్ని అతడు కావాలనే తప్పుగా క్రియేట్ చేసి చెబుతున్నాడని కొందరు అధికారులు భావించారు. అయితే అతడు నిర్దోషి అనేందుకు మార్టిన్ అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఓ జంటను సాక్ష్యంగా తీసుకొచ్చాడు. కాథీ కనిపించకుండా పోయిన ఏడాదికి.. టెన్నెసీ గుండా వెళుతుంటే మార్గంమధ్యలో ఓ రెస్టారెంట్లో కాథీ.. వెయిట్రెస్‌గా పనిచేయడం చూశామని ఆ జంట చెప్పుకొచ్చింది. ‘మీరు కాథీనే కదా?’ అని అడ గటానికి ప్రయత్నించినప్పుడు ఆమె కిచెన్‌లోకి పారిపోయిందని వాళ్లు చెప్పారు. మరోవైపు తనతో ఆ రోజు పోలీసులు బలవంతపు సాక్ష్యం చెప్పించారని కిమ్ వెల్లడించింది. దాంతో ఫెర్రెల్ పట్ల సానుభూతిపరులు పెరిగారు. 2002లో అతడికి పెరోల్ లభించింది. అయితే కాథీ తమని వదిలి ఉండాలనుకునే మనిషి కాదని.. తనను ఎవరో చంపేసి ఉంటారని ఆమె కుటుంబం నమ్మింది. ఈ కేసులో కాథీ స్నేహితులు కొందరు అసలు నేరస్థుడు డార్విన్ కావచ్చన్నారు. ఎందుకంటే కాథీ నిత్యం డార్విన్కే భయపడుతూ బతికేదని వాళ్లు గుర్తుచేసుకున్నారు. ఈ ఉదంతంలో కాథీ చనిపోయిందా? లేక పారిపోయిందా? డార్విన్ చంపేసి.. కేసు ఫెర్రెల్ని చుట్టుకునేలా ప్లాన్ చేశాడా? లేక ఫెర్రెలే చంపేసి.. అమాయకంగా నాటకం ఆడాడా? కాథీకి ఆ రోజు మధ్యాహ్నాం కాల్ చేసింది ఎవరు? ఇలా అన్నీ మిస్టరీగానే మిగిలాయి. --సంహిత నిమ్మన (చదవండి: కూతుర్నే పెళ్లాడిన ఓ నీచపు తండ్రి కథ..ఆఖరికి ఆమె కొడుకుని సైతం..) -
హైదరాబాద్ లో విషాదంతమైన బాలుడి మిస్సింగ్
-
మహిళల అదృశ్యంపై తప్పుడు లెక్కలు
సాక్షి, అమరావతి: మహిళల అదృశ్యంపై తెలుగుదేశం పార్టీ తప్పుడు లెక్కలతో అవాస్తవాలు ప్రచారం చేస్తోందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత ధ్వజమెత్తారు. ఆమె శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘రాష్ట్రంలో 2019–21 మధ్య 24,557 మిస్సింగ్ కేసుల్లో 23,399 మంది ఆచూకీ లభించింది. వారిని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంకా ఆచూకీ తేలాల్సింది 1,158 కేసుల్లోనే.. వాస్తవాలిలా ఉంటే.. చంద్రబాబు, లోకేశ్, పవన్ కాకి లెక్కలతో ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు దుశ్శాసన పాలనలో ఎన్నో అఘాయిత్యాలు జరిగాయి. కాల్‌మనీ సెక్స్‌రాకెట్, వనజాక్షి, రిషితేశ్వరి వంటి ఘటనల్ని మహిళలు మరువరు. మహిళలపై వేధింపుల్లో నాడు రాష్ట్రం దేశంలోనే 4వ స్థానంలో, అక్రమ రవాణాలో రెండో స్థానంలో ఉండేది. స్వార్థ రాజకీయాలకు మహిళల్ని అడ్డుపెట్టుకునే నీచుడు చంద్రబాబు. ఆనాడు లక్ష్మీపార్వతిని అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచాడు. ఇటీవల సొంత భార్యను కూడా స్వార్థ రాజకీయానికి వాడుకోవాలని చూసిన దుర్మార్గుడు. బాబు దత్తపుత్రుడైన పవన్ ఉన్మాదంతో ప్రభుత్వంపై దు్రష్పచారం చేస్తున్నాడు’ అని దుయ్యబట్టారు. సీఎం జగనన్న అంటే రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం, ధైర్యమని సునీత చెప్పారు. -
మిర్యాలగూడకు చెందిన బీటెక్ విద్యార్థి మిస్సింగ్ విషాదాంతం
-
అంతు చిక్కని మిస్టరీ..మార్లిన్ శాంటానా మూడు రోజుల పాప కథ..
కొన్నిసార్లు ఆకస్మిక ప్రమాదాల నుంచి తేరుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. జీవితమే ఒక పీడకలగా మిగిలిపోతుంది. శాంటానా కుటుంబానికి ఆనందం, విషాదం రెండూ ఒకదాని వెంట ఒకటి కవలపిల్లల్లా వచ్చాయి. కేవలం ఆనందమే మిగులుంటే ఈ రోజు ఈ కథ మిస్టరీ అయ్యేదే కాదు. అసలు మార్లీన్ శాంటానా ఎవరు? తనకేమైంది? మార్లీన్ శాంటానా కేవలం మూడు రోజుల పాప. కడుపులో ఉన్నప్పుడే తనకు మార్లీన్ అనే పేరుపెట్టాలని ఆ తల్లిదండ్రులు కలలుగన్నారు. కానీ అలా జరగలేదు. అది 1985 అక్టోబర్ 21. రాత్రి తొమ్మిది దాటింది. అమెరికా, న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లోని బ్రూక్‌డేల్ హాస్పిటల్ ముందు జనాలంతా ఒక్కొక్కరుగా పలుచబడుతున్నారు. పేషెంట్స్ రద్దీ తగ్గి.. డాక్టర్లు, నర్సులు అంతా సేదతీరుతున్నారు. అప్పుడే ఫ్రాన్సిస్కా శాంటానా అనే మూడురోజుల బాలింత డిశ్చార్జ్ అయ్యి.. తన పాపను ఎత్తుకుని ఆసుపత్రి రూమ్ నుంచి బయటికొచ్చింది. భార్యతో పాటు తన బుల్లి ప్రిన్సెస్‌ని ఇంటికి తీసుకుని వెళ్లడానికి ఫ్రాన్సిస్కా భర్త థామస్ చాలా సంబరంగా ఎదురుచూస్తున్నాడు. సాయం కోసం ఇంటి నుంచి.. ఫ్రాన్సిస్కా వాళ్ల ఇద్దరు అత్తలూ ఆసుపత్రికి వచ్చారు. నలుగురూ కలసి.. పాపను, లగేజ్‌ని తీసుకుని.. ఆసుపత్రి ప్రాంగణం నుంచి కొంచెం ముందుకు వెళ్లారు. సరిగ్గా అప్పుడే సుమారు పాతికేళ్ల అపరిచితురాలు వాళ్ల దగ్గరకు వచ్చి.. ‘ఎక్కడికి వెళ్తున్నారు’ అంటూ మాట కలిపింది. ‘ఇప్పుడే డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్తున్నాం’ అని చెప్పింది ఫ్రాన్సిస్కా. ఆమె ప్రశ్నలైతే వేస్తుంది కానీ.. చూపులు మాత్రం వాళ్లవైపు లేవు. పరిసరాలను గమనిస్తున్న కంగారు.. ఆమె కళ్లల్లో తొణికిసలాడుతోంది. స్ట్రీట్‌లైట్ వెలుగుల్లో అది స్పష్టంగా కనిపిస్తోంది. కానీ థామస్ ఫ్యామిలీ మాత్రం అదంతా పట్టించుకునే స్థితిలో లేదు. వాళ్ల హడావుడిలో వాళ్లున్నారు. అప్పుడే సడెన్‌గా ‘నేను మీ కోసం ఉదయం నుంచి ఎదురు చూస్తున్నా’ అంది ఆమె. ఆ మాటలకు ఫ్రాన్సిస్కా అర్థం కానట్లుగా ఆమెవైపు అయోమయంగా చూసింది. ఆమె భయాన్ని పసిగట్టేసిన ఆ మహిళ.. వెంటనే తుపాకీ బయటికి తీసింది. క్షణాల్లో పసిపాప తలకు గురిపెట్టి ‘అరిస్తే చంపేస్తా, నేను చెప్పిందే చెయ్యాలి’ అంది. థామస్ కుటుంబానికి గుండె ఆగినంత పనైంది. ఆమె కళ్లు పెద్దవి చేస్తూ.. గద్దిస్తూ వాళ్లను చాలా దూరం నడిపించింది. గుండె లోతుల్లోంచి దుఃఖం తన్నుకొస్తున్నా.. పాప కోసం చెప్పింది చెప్పినట్లే చేయడానికి వాళ్లు సిద్ధపడ్డారు. ఊహించని ఆ ప్రమాదానికి ఎలా స్పందించాలో, ఎలా తప్పించుకోవాలో థామస్‌కి అర్థం కాలేదు. దాదాపు రోడ్లన్నీ నిర్మానుష్యంగానే ఉన్నాయి. అరకొర అలికిడి ఉన్నా, సమీపంలో ఎవ్వరూ లేరు. కాస్త దూరంలో జంక్ యార్డ్ దగ్గర ‘ఆగండి’ అంటూ గదమాయించింది. ‘ప్లీజ్ మమ్మల్ని వదిలిపెట్టు.. మేము పాప పుట్టిన ఆనందంలో ఉన్నాం. మా దగ్గర విలువైనవి కూడా ఏం లేవు’ అంటూ ఫ్రాన్సిస్కాతో పాటు అంతా ఆ స్త్రీని వేడుకుంటూనే ఉన్నారు. కానీ ఆమె వినిపించుకోలేదు. అప్పటి దాకా ఆమె ఒక దోపిడీదారని, డబ్బు లేదా విలువైన వస్తువులు లాక్కోవడానికే దాడి చేసిందని అనుకున్నారు. కానీ వారి అంచనాలను తారుమారు చేస్తూ.. పసిపాపను తన చేతికి ఇవ్వాలని.. గన్ ట్రిగ్గర్ మీద వేలును ప్రెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు భయపెట్టింది. ‘నా బిడ్డను ఏం చేయొద్దు ప్లీజ్’ అని ఏడుస్తూ నిస్సహాయంగా పాపను ఆ స్త్రీ చేతుల్లో పెట్టింది ఫాన్సిస్కా. అలా పెట్టగానే ఒక్క ఉదుటున అందరినీ తోసిపడేసిన ఆ మహిళ.. పాపతో సహా పరుగందుకుంది. క్షణాల్లో అక్కడ దగ్గర్లో స్టార్ట్ చేసి ఉన్న కారు ఎక్కి ‘పోనీ త్వరగా’ అంది. శాంటానా ఫ్యామిలీ ఆ షాక్‌లోంచి తేరుకునే లోపే కారు వేగం అందుకుంది. ‘నా పాప.. ప్లీజ్ నా పాపను నాకు ఇచ్చేయండి, కారు ఆపండి’ అంటూ బాలింత ఫ్రాన్సిస్కా కారు వెనుకే పరుగు తీసిన దృశ్యం.. ఆ కుటుంబాన్ని ఎంతగానో కలచివేసింది. వెంటనే వారంతా పోలీస్‌స్టేషన్‌కి పరుగుతీసి, జరిగిందంతా చెప్పారు. పోలీసుల విచారణలో ఓ సీసీ ఫుటేజ్ దొరికింది. దానిలో పాపను తీసుకుని ఆమె పారిపోయే సీన్ దూరం నుంచి కనిపించింది. కానీ స్పష్టత లేదు. కాలక్రమంలో పత్రికలే పాపకు మార్లీన్ అని నామకరణం చేశాయి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. పాప కిడ్నాప్‌కి ముందు ఆ మహిళను ఫ్రాన్సిస్కా.. ఆసుపత్రిలోని పిల్లల వార్డ్‌లో కలుసుకుంది. అక్టోబర్ 19 మధ్యాహ్నసమయంలో ఆ స్త్రీ.. ఫ్రాన్సిస్కాతో మాట్లాడిందట. ‘నేను వేరే పాప కోసం వచ్చాను. కానీ మీ పాప చాలా అందంగా ఉంది. అసలు ఏడవకుండా ఎంత ముద్దుగా ఉందో.. నాకు మీ పాప బాగా నచ్చింది’ అని పొగిడిందట. ఆ రోజు ఆ పొగడ్తలకు సంతోషించిందే తప్ప అనుమానించలేదు. అదే అపరాధభావం ఫ్రాన్సిస్కాను వేధించింది. ఈ ఘటనకు ముందు న్యూయార్క్‌లోని మరో ఆసుపత్రిలో క్రిస్టోఫర్ మోర్గాన్ అనే రెండు నెలల బాబు అపహరణకు గురయ్యాడు. కొన్ని నెలల తర్వాత ఒకరి ఇంట్లో సజీవంగా దొరికాడు. వారు తాము పోగొట్టుకున్న బిడ్డ స్థానంలో క్రిస్టోఫర్ని చట్టవిరుద్ధంగా దత్తత తీసుకుని పెంచుకుంటున్నారని తేలింది. దాంతో మార్లీన్ని ఎత్తుకెళ్లిన స్త్రీ వృత్తిరీత్యా నేరస్థురాలు కాకపోవచ్చని.. బహుశా ఆమె బిడ్డను పోగొట్టుకుని, తన పాప స్థానంలో మార్లీన్ని పెంచుకుంటుంది కాబోలని చాలామంది భావించారు. అదే అనుమానంతో పోలీసులు చుట్టుపక్కల ఆసుపత్రులన్నీ జల్లెడపట్టి.. గర్భస్రావాలు లేదా ప్రసవాలు జరిగిన చాలామంది మహిళలను విచారించారు. కానీ ఏ ఆచూకీ రాబట్టలేకపోయారు. నేటికీ మార్లీన్ ఆచూకీ తేలలేదు. కేవలం రోజుల పాపే కావడం, రియల్ ఫొటో ఒక్కటి కూడా లేకపోవడంతో గత 38 ఏళ్లుగా.. మార్లీన్ ఊహాచిత్రాలు పెరిగాయి తప్ప ఫలితం లేదు. మార్లీన్ కుటుంబ సభ్యులు మాత్రం ఆమె ప్రతి పుట్టిన రోజునూ జరుపుకుంటున్నారు. ఆమె రాక కోసం ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నారు. --సంహిత (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్లబ్..ఇందులో చేరాలంటే.) -
వీరు ఎక్కడికి వెళ్లారు.. అసలేం జరిగింది?
హైదరాబాద్: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన తల్లీ కూతుళ్లు కనిపించకుండా పోయిన ఘటన శుక్రవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సందీప్‌కుమార్ వివరాల ప్రకారం మేడిపల్లి పీఅండ్‌టీ కాలనీలో నివసించే డి.వెంకటేశ్వర్లు, ఈశ్వరమ్మ(37) భార్యాభర్తలు. ఈశ్వరమ్మ గృహిణి. వీరికి పూర్వజ(19), హరిణి(18) కూతుళ్లు. ప్రస్తుతం వీరు చదువుకుంటున్నారు. ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఇంట్లో చెప్పకుండా ఈశ్వరమ్మ, ఇద్దరు కుమార్తెలు వెళ్లిపోయారు. ఎంత వెతికినా కనిపించకపోవడంతో వెంకటేశ్వర్లు మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అన్నదమ్ములను చిదిమేసిన రోడ్డు ప్రమాదం! -
పోస్టల్ ఉద్యోగుల అలసత్వమే..
సాక్షి, ఆదిలాబాద్/ఉట్నూర్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో పదో తరగతి జవాబు పత్రాల బండిల్ మిస్సింగ్ కేసులో పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే కనిపిస్తోంది. సోమవారం ప్రథమ భాష పరీక్ష తర్వాత జవాబు పత్రాలను పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు ఉట్నూర్ పోస్టాఫీసుకు అందించారు. ఇక్కడ బండిళ్లను తయారు చేసి బస్సు ద్వారా వరంగల్‌కు పంపించాలి. పోస్టాఫీస్ నుంచి ఆటోలో సిబ్బంది ఎంటీఎస్, ఈడీ ప్యాకర్ వెంటఉండి వాటిని బస్టాండ్‌కు తరలించాలి. అయితే ఈ సిబ్బంది ఎవరూ వెంట లేకుండానే ఆటోలో వేసి వారు తమ ద్విచక్ర వాహనం ద్వారా వెళ్లారు. బస్టాండ్‌కు వెళ్లిన తర్వాత 11 బండిల్స్ (కట్ట) నుంచి ఒకటి మిస్ అయ్యింది. పోస్టుమాస్టర్ ఫిర్యాదు మేరకు సోమవారం సాయంత్రం ఉట్నూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని పేపర్ బండిల్ కోసం వెతికినప్పటికీ దొరకలేదు. మంగళవారం ఉదయం కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీఈవో ప్రణీత ఉట్నూర్ చేరుకున్నారు. మొదట పోస్టాఫీసుకు వెళ్లగా సెలవు కారణంగా వారు అందుబాటులో లేరు. దీంతో వీరు స్థానిక పోలీసు స్టేషన్‌కు చేరుకొని డీఎస్పీ నాగేందర్‌ను కలిసి వివరాలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న అధికారులు పూర్తి విషయాలపై ఆరా తీశారు. కాగా, నిజామాబాద్ పోస్టల్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ ఉమామహేశ్వర్రావు ఉట్నూర్ చేరుకొని బండిల్ మిస్సింగ్ విషయంలో విచారించారు. ఇదిలా ఉంటే పోలీసులు పోస్టల్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ఆటో వెళ్లిన దారిలో రోడ్డు పక్కన ఉన్న సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. మంగళవారం సాయంత్రం వరకు పేపర్ బండిల్ దొరకలేదు. పరీక్ష రాసిన 9 మంది విద్యార్థుల జవాబు పత్రాల బండిల్ మిస్సింగ్‌తో ఆ విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇద్దరిపై వేటు టెన్త్ జవాబు పత్రాల బండిల్ మిస్సింగ్ ఘటనలో పోస్టాఫీస్ ఉద్యోగి ఎంటీఎస్ రజితపై సస్పెన్షన్ వేటుపడింది. ఈ క్రమంలోనే ఆమె అస్వస్థతకు గురికాగా ఆదిలాబాద్‌లోని రిమ్స్ కు తరలించారు. మరో ఔట్సోర్సింగ్ ఉద్యోగి నాగరాజును బాధ్యతల నుంచి తప్పించారు. -
తండ్రి మిస్సింగ్ కేసులో క్రికెటర్‌కు ఊరట
టీమిండియా క్రికెటర్ కేదార్ జాదవ్‌కు తండ్రి మిస్సింగ్ కేసులో ఊరట లభించింది. సోమవారం తన తండ్రి మహదేవ్ జాదవ్ కనిపించడం లేదంటూ పుణేలోని అలంకార్ పోలీసులను ఆశ్రయించి మిస్సింగ్ కేసు ఫైల్ చేశాడు. కాగా మంగళవారం సాయంత్రం కేదార్ జాదవ్ తండ్రి మహదేవ్ జాదవ్ ముంద్వా ఏరియాలో ఉన్నట్లు అక్కడి సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మహదేవ్ జాదవ్‌ను తమ వెంట తీసుకొచ్చి కేదార్ జాదవ్ కుటుంబసభ్యులకు అప్పగించారు. కేదార్ జాదవ్ తన తల్లిదండ్రులు మహదేవ్ జాదవ్, మందాకినిలతో కలిసి పుణేలోని కొథ్రూడ్లోని సిటీప్రైడ్ థియేటర్ సమీపంలో నివసిస్తున్నాడు. 75 సంవత్సరాల వయసు ఉన్న మహదేవ్ జాదవ్ డిమెన్షియా వ్యాధితో బాధపడుతున్నారు. ఇంట్లోని పార్క్‌లో మార్నింగ్ వాక్ చేస్తున్న మహదేవ్ ఆ తర్వాత గేట్ తీసుకొని బయటికి వెళ్లారు. కొథ్రూడ్ జంక్షన్లో ఆటో ఎక్కి వెళ్లిపోయారు. ఆ తర్వాత కనిపించకుండా పోయినట్లు పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. దీంతో అలంకార్ పోలీసులను ఆశ్రయించిన కేదార్ జాదవ్ తండ్రి మిస్సింగ్ కేసు ఫైల్ చేశాడు. ''కేదార్ జాదవ్ తండ్రి మహదేవ్ జాదవ్ కొంతకాలంగా మతిమరుపు(డిమెన్షియా) వ్యాధితో బాధపడుతున్నాడు. సోమవారం మార్నింగ్ వాక్ కోసమని బయటికి వెళ్లిన మహదేవ్ జాదవ్ ముంద్వా ఏరియాకు చేరుకున్నాడు. తాను ఎక్కడ ఉన్నానో తెలియక కాస్త అయోమయానికి గురయ్యాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మహదేవ్ కదలికలను గుర్తించాం. ప్రస్తుతం అతని మానసిక స్థితి సరిగ్గానే ఉందని.. కుటుంబసభ్యులకు అప్పగించామని'' సీనియర్ ఇన్స్పెక్టర్ అజిత్ లక్డే తెలిపారు. తన తండ్రిని క్షేమంగా అప్పగించినందుకు కేదార్ జాదవ్ అలంకార్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇక 2014లో టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన కేదార్ జాదవ్ 73 వన్డేల్లో 1389 పరుగులు, 9 టి20ల్లో 122 పరుగులు సాధించాడు. గతంలో సీఎస్కే, ఎస్ఆర్హెచ్లకు ప్రాతినిధ్యం వహించిన కేదార్ జాదవ్ 2022లో జరిగిన వేలంలో అమ్ముడిపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. చదవండి: హ్యాట్రిక్ గోల్స్‌తో రికార్డు.. సెంచరీ కొట్టిన మెస్సీ 'నెట్ బౌలర్‌గా ఆఫర్.. బోర్డు పరీక్షలను స్కిప్ చేశా' -
Hyderabad: ఇద్దరు బాలికల అదృశ్యం
సాక్షి, బంజారాహిల్స్: ఫిలింనగర్‌లోని రౌండ్ టేబుల్ ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న వి.శిరీష (12) అనే బాలిక అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. అయితే తమ కూతురిని డబ్బు కోసం కిడ్నాప్ చేశారంటూ తండ్రి వి.కృష్ణ ఆరోపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్‌లోని దుర్గా భవానీనగర్‌లో నివసించే వి.శిరీష స్థానికంగా ఏడో తరగతి చదువుతోంది. ఈ నెల 12న ఉదయం తల్లిదండ్రులు జీహెచ్ఎంసీలో పనులకు వెళ్లగా, ఇంట్లో ఉన్న సోదరి కనిపించడం లేదంటూ కొడుకు నరేష్ తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. హుటాహుటిన ఇంటికి చేరుకున్న కృష్ణ, సుజాత దంపతులు అన్ని ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకుండా పోయింది. తనకు వరుసకు మేనల్లుడు వి.మల్లేష్ (22) కూడా కనిపించడం లేదని, అతడిపైనే తమకు అనుమానం ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కృష్ణ పేర్కొన్నాడు. డబ్బుల కోసం తన కూతురిని కిడ్నాప్ చేశారని, సీసీ కెమెరా ఫుటేజీలో మల్లేష్ తల్లి సరోజమ్మ తన కూతురిని తీసుకెళ్తున్న దృశ్యం కనిపించిందన్నారు. మల్లేష్ ఇటీవల తనను రూ. 50 వేలు అడిగాడని, తాను లేవని చెప్పడంతో కక్ష పెంచుకొని తన కూతురికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశారని ఆరోపించారు. బంజారాహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు. శిరీష ఆచూకీ తెలిసిన వారు 8712660458 నంబర్లో సంప్రదించాలని పోలీసులు కోరారు. బంజారాహిల్స్‌లో 9వ తరగతి విద్యార్థిని బంజారాహిల్స్: అనుమానాస్పదస్థితిలో 9వ తరగతి విద్యార్థిని అదృశ్యమైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నం 10లోని నూర్‌నగర్‌లో నివసించే అమ్రీన్ బేగం(14) సెయింట్ నిజామియా హైస్కూల్లో చదువుతోంది. ఈ నెల 21న జహిరానగర్‌లోని షాహిన్ కన్వెన్షన్ హాల్లో పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన ఫేర్వెల్ పార్టీకి హాజరైంది. రాత్రి 11 గంటల ప్రాంతంలో సోదరుడు హనీఫ్ ఫోన్ చేయగా కార్యక్రమం ఇంకా జరుగుతున్నదని, కొద్దిసేపట్లో వస్తానని తెలిపింది. అయితే సోదరుడు కొంత సమయం తర్వాత హాల్ వద్దకు వచ్చి చూడగా కనిపించలేదు. రాత్రి ఒంటిగంట వరకు బంధుమిత్రుల ఇళ్లల్లో గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో షాహిన్ కన్వెన్షన్ హాల్ నుంచి రాత్రి 11.30 గంటల ప్రాంతంలో తన చెల్లెలు అదృశ్యమైందని పోలీసులకు హనీఫ్ ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
30 ఏళ్ల క్రితం అదృశ్యమైన మహిళ బామ్మగా ప్రత్యక్షమై..
ఒక మహిళ 30 ఏళ్ల క్రితం కనిపిచకుండా పోయింది. ఇక కనిపించదు, ఈ మిస్సిగ్ కేసు వీడదు అనుకుని కేసు క్లోజ్ చేసి మరీ.. ఆమె చనిపోయిందని ప్రకటించారు అధికారులు. ఆ తర్వాత అనుహ్యంగా ఝలక్ ఇస్తూ.. ఆ మహిళ బతికి ఉన్నానంటూ ఓ నర్సింగ్ హోంలో ప్రత్యక్షమైంది. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న పోలీసులు ఆమె గురించి పూర్తి స్థాయిలో విచారించడం ప్రారంభించారు. విచారణలో.. ప్యాటిసియా కోప్టా అనే మహిళ చివరిసారిగా 1992లో పెన్సిల్వేనియాలోని పీటర్స్‌బర్గ్‌లో కనిపిపించింది. ఆ తర్వాత నుంచి ఆమె కనిపించకుండా పోయింది. దీంతో పోలీసులు సదరు మహిళ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఐతే ఆమె 1999లో ఉత్తర ప్యూర్టోరికో వీధుల్లో తిరుగుతున్నట్లు గుర్తించారు. ఇక ఆ తర్వాత నుంచి ఆమె ఆచూకి మిస్టరీగా ఉండిపోయింది. కట్ చేస్తే ప్రస్తుతం ఆమె కరేబియన్ ద్వీపంలోని నర్సింగ్ హోంలో నివశిస్తోందని ఒక సామాజిక కార్యకర్త ద్వారా తెలుసుకుని పోలీసులు ఆశ్చర్యపోతారు. వాస్తవానికి ఆమె తన ఊరిలో వీధుల్లో పాఠాలు చెప్పే ఒక టీచర్‌గా మంచి పేరుంది. మరి ఆమె ప్యూర్టో రికోకి ఎలా వెళ్లిందో తెలియదు గానీ అక్కడ ఆమె తన గతాన్ని రహస్యంగా ఉంచింది. ఆ తర్వాత ఆమె క్రమంగా డిమోన్షియా అనే మతిస్థిమితంకి సంబంధించిన మానసిక వ్యాధి బారిన పడింది. ఐతే ఆమెకు సడెన్‌గా తన గతం గుర్తుకొచ్చి తన వివరాలను వెల్లడించడం ప్రారంభించింది. ఇంతలో ఆ సామాజికి కార్యకర్త సాయంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు నర్సింగ్హోమ్ని సంప్రదించారు. ఆమెకు డీఎన్ఏ టెస్ట్‌లు నిర్వహించి 30 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన మహిళగా నిర్థారించారు. ఐతే ఆమహిళకు ప్రసత్తు 80 ఏళ్లు. వైద్యులు ఆమె కొన్ని మానసిక రుగ్మతలతో వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఆమె ఒకనొక దశలో దేశం విడిచి పారిపోవాలనుకుందని కూడా చెప్పారు. ఐతే సదరు మహిళ తప్పిపోవడానికి ముందు ఆమెకు వివాహమైందని, ఆమె భర్త బాబ్ కోప్టా అని అధికారులు తెలిపారు. పాపాం ఆయన ఆమె కోసం ఎదురు చూస్తూ మరో పెళ్లి కూడా చేసుకోకుండా ఉండిపోయారు. ఇన్నేళ్ల తర్వాత ఆమె సజీవంగా ఉందని చెప్పడం చాలా రిలీఫ్్గా ఉందని కోప్టా చెబుతున్నారు. ఆమెకు ఇద్దరు చెల్లెళ్లు, ఒక కవల చెల్లెలు ఉన్నారు. అయితే వారంతా చనిపోగా ప్రస్తుతం ఆమెకు ఇప్పుడూ ఒక చిన్న చెల్లెలు మాత్రమే మిగిలి ఉందని చెప్పారు. సదరు మహిళ చెల్లెలు మాట్లాడుతూ.. 80 ఏళ్ల వయసులో ఆమె మా వద్దకు చేరుకోవడం చాలా షాకింగ్‌గా, ఆనందంగా ఉందని చెబుతోంది. విచిత్రమేమిటంటే పెళ్లికి ముందుగానీ, ఆతర్వాత గానీ ఎప్పుడూ కూడా ఆమె పూర్టో రికో నగరానికి వెళ్లిందే లేదు. (చదవండి: ఢిల్లీలోని ఆటో రిక్షాలో యూఎస్ సెక్రటరీ) -
ఆస్ట్రేలియా చరిత్రలో అపఖ్యాతి.. ఆ ముగ్గురు పిల్లలు ఏమయ్యారు?
కోటి కలలతో సాగే ఆ కుటుంబానికి ఊహించని పీడకల ఎదురైంది. ఉల్కిపడి తేరుకునే లోపే.. ఆ తల్లికి కడుపుకోత మిగిలింది. ఆస్ట్రేలియా చరిత్రలోనే అపఖ్యాతి మూటకట్టుకున్న కథల్లో బ్యూమాంట్ చిల్డ్రన్ మిస్సింగ్ కేసు ఒకటి. సరిగ్గా యాభై ఏడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన.. ఎందరో తల్లిదండ్రులకు గుణపాఠం. అది 1966 జనవరి 26. మధ్యాహ్నం 12 దాటింది. దక్షిణ ఆస్ట్రేలియా, అడలాయిడ్ శివారు ప్రాంతలోని 109 హార్డింగ్ స్ట్రీట్ బస్టాప్‌లో నాన్సీ అనే 39 ఏళ్ల మహిళ.. తన పిల్లల కోసం వెయిట్ చేస్తోంది. ఆరోజు ఆ దేశమంతా ఆస్ట్రేలియా డే సెలబ్రేషన్ లో ఉంటే ఆమె మాత్రం టెన్షన్లో ఉంది. ‘ఇంకా బీచ్‌లోనే ఆడుకుంటున్నారేమోలే.. తర్వాత బస్కి వస్తారు’ అనుకుంటూ 2 గంటలయ్యేదాకా ఎదురు చూసింది. ఆ బస్టాప్‌లో ఆగిన ప్రతి బస్సు ఆమెని నిరాశపరుస్తూనే ఉంది. గడిచే ప్రతి నిమిషం ఆమె గుండె వేగాన్ని పెంచుతూనే ఉంది. ‘ఒకవేళ ఆటపట్టించడానికి ఇంటికి వెళ్లాపోయారేమో?’ అదే అనుమానంతో ఇంటికి పరుగుతీసింది. తలుపు తీసి ఉండటంతో.. పట్టలేనంత ఆనందంగా లోపలికి నడిచింది. కానీ లోపల పిల్లల్లేరు. డ్యూటీ నుంచి ముందే వచ్చేసిన భర్త జిమ్ బ్యూమాంట్ ఉన్నాడు. పొంగుకొచ్చే దుఃఖం ఆపుకోలేక భర్తని హత్తుకుని.. ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది. వెంటనే బీచ్‌కి వెళ్తే.. అక్కడా పిల్లల్లేరు. జిమ్, నాన్సీలు ఆ ముందురోజే తమ ముగ్గురు పిల్లలతో కలిసి.. సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్లెనెల్గ్ బీచ్‌కి వెళ్లారు. అయితే పిల్లలకు సముద్ర తీరాల్లో ఆడుకోవాలనే ఆశ తీరలేదు. అందుకే మరునాడు (జనవరి 26) ఉదయం లేవగానే.. గ్లెనెల్గ్ బీచ్‌కి వెళ్తామని రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ కాస్తా పేచీ అయ్యింది. నిజానికి పెద్దమ్మాయి జెన్(9) తెలివితేటల మీద.. జిమ్ దంపతులకు చాలా నమ్మకం. సముద్రం లోపలికంటా వెళ్లకూడదని.. అపరిచితులతో మాట్లాడకూడదని.. ఇలా చాలా విషయాలను అర్థం చేసుకోవడంలో జెన్.. 15 ఏళ్ల అమ్మాయిలా ప్రవర్తించేది. అందుకే రెండో కూతురు అర్నా(7)ని, కొడుకు గ్రాంట్(4)ని.. జెన్ కి అప్పగించి.. బస్సు టికెట్స్‌కి కొంత డబ్బులిచ్చి.. ఉదయం పదయ్యేసరికి బీచ్‌కి వెళ్లే బస్సు ఎక్కించింది నాన్సీ. 12 అయ్యేసరికి తిరిగి వస్తామన్నారు పిల్లలు. కానీ రెండైనా రాలేదు. బీచ్లోనూ లేరు. తెలిసిన ప్రతి వీధిలోనూ వెతికారు. ఎక్కడా దొరకలేదు. దాంతో పోలీసుల్ని ఆశ్రయించారు. కిడ్నాప్ భయంతో విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్స్, అంతర్రాష్ట్ర రహదారులు ఇలా అన్నీ వెతికారు అధికారులు. సముద్రంలో కొట్టుకు పోయారేమోనన్న అనుమానంతో బీచ్ పరిసరప్రాంతాలనూ గాలించారు. 24 గంటల్లోనే దేశం మొత్తం ఈ కేసు గురించి తెలుసుకుంది. కానీ ఏ ఆధారం లభించలేదు. గ్లెనెల్గ్ బీచ్ సమీపంలోని.. సుమారు ముప్ఫై ఏళ్ల వయసున్న ఆరడుగుల సన్నటి వ్యక్తితో ఈ పిల్లల్ని చూశామని.. పిల్లలు అతడితో చాలాసేపు.. బీచ్‌లో నవ్వుతూ ఆడుకున్నారని.. కొందరు ప్రత్యక్షసాక్షులు చెప్పారు. ‘ఆ ముగ్గురు పిల్లలు డబ్బులు పోగొట్టుకున్నారు, మీలో ఎవరైనా చూశారా?’ అంటూ ఆ సన్నటి వ్యక్తి సాక్షుల్లో కొందరిని అడిగాడట. పిల్లలు సముద్రంలోకి దిగినప్పుడు ఆ వ్యక్తే కావాలని వాళ్ల డబ్బులు తీసేసి.. పిల్లల నమ్మకాన్ని సంపాదించడానికి.. సాయం చేసే వ్యక్తిలా నటించి ఉంటాడనే వాదన బలపడింది. సాక్షులు చెప్పిన పోలికలతో ఊహాచిత్రాలు కూడా గీయించి పత్రికల్లో ప్రచురించారు. పిల్లలు అదృశ్యమైన మూడు రోజుల తర్వాత ఒక మహిళ పోలీసుల్ని కలిసి.. ‘జనవరి 26 రాత్రి 7 గంటలకు పటావాలోంగా బోట్ హెవెన్ లో బ్యూమాంట్ పిల్లల్ని పోలిన ముగ్గురు పిల్లలతో నేను మాట్లాడాను’ అని చెప్పింది. దాంతో ఆ ఏరియా మొత్తం ఎమర్జెన్సీ ఆపరేషన్ నిర్వహించారు పోలీసులు. కానీ ఫలితం లేదు. ఇక బీచ్ సమీపంలోని వెంజెల్స్ బేకరీ యజమాని.. ఆరోజు జెన్ తన దగ్గరకు 1 పౌండ్ నోట్ తెచ్చిందని.. మీట్ పఫ్స్ కొని తీసుకెళ్లిందని చెప్పాడు. నాన్సీ.. నేనంత డబ్బు ఇవ్వలేదని కేవలం 6 షిల్లింగ్స్ చిల్లర మాత్రమే ఇచ్చానని చెప్పింది. దాంతో బీచ్‌లో ప్రత్యక్షసాక్షుల మాటకు బలం చేకూరింది. ఎవరో ఒక వ్యక్తి పిల్లలతో కావాలనే స్నేహం చేసుకున్నాడని.. తెలివిగా మోసం చేసి వాళ్లని తీసుకుని వెళ్లాడని నిర్ధారించుకున్నారు పోలీసులు. కొన్ని నెలల గడిచాయి. డాఫ్నే గ్రెగరీ అనే స్థానికురాలు.. పోలీసుల్ని కలిసి ఓ షాకింగ్ విషయం చెప్పింది. జనవరి 26 రాత్రి.. ఖాళీగా ఉన్న పక్కింట్లోకి ఒక వ్యక్తి ఇద్దరు ఆడపిల్లల్ని, ఒక చిన్న పిల్లాడ్ని తీసుకొచ్చాడని.. కాసేపటికి ఆ పిల్లాడు తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి పట్టుకున్నాడని.. ఆ మరునాడు ఆ ఇల్లు ఖాళీగానే కనిపించిందని చెప్పింది. ముందే ఎందుకు చెప్పలేదంటే భయపడ్డానని బదులిచ్చింది. అయితే ఆమె చెప్పినదానికి ఏ ఆధారం లేదు. రెండేళ్ల తర్వాత.. జిన్ దంపతులకు ఓ లేఖ వచ్చింది. అది స్వయంగా జెన్ రాసినట్లు ఉండటంతో వాళ్లు నివ్వెరపోయారు. ‘నన్ను(జెన్), తమ్ముడ్ని, చెల్లెల్ని దిమెన్ (కిడ్నాపర్) బాగా చూసుకుంటున్నాడు.. మేము సంతోషంగా ఉన్నాం’ అనేదే దాని సారాంశం. నెల తిరగకుండానే మరో లేఖ వచ్చింది. ఈసారి దిమెన్ స్వయంగా రాశాడు. తనని తాను పిల్లలకు గార్డియన్‌గా ప్రకటించుకున్న ఆ వ్యక్తి.. ‘మీ బాధ చూడలేక పిల్లల్ని తిరిగి ఇవ్వాలని దిమెన్ భావిస్తున్నాడు. ఫలానా చోటికి రండి.. ఎవరికీ చెప్పొద్దు’ అని రాశాడు. చెప్పినట్లే జిన్ దంపతులు.. రహస్యంగా ఓ డిటెక్టివ్‌ని నియమించుకుని.. దిమెన్ చెప్పిన చోటికి వెళ్లారు. కానీ పిల్లలు రాలేదు. కొన్ని రోజులకి మూడో లేఖ వచ్చింది. అందులో ఇలా ఉంది. ‘పిల్లల్ని తీసుకెళ్లేందుకు మీరు మాత్రమే కాకుండా.. మారువేషంలో డిటెక్టివ్‌ని తీసుకొచ్చారు. అందుకే దిమెన్ నమ్మకాన్ని కోల్పోయారు. ఇక పిల్లలు మీ దగ్గరకు రారు’ అని ఉంది. అన్ని ఉత్తరాల మీద విక్టోరియాలోని డాండెనాంగ్ పోస్టల్మార్క్ ఉంది. 1992 నాటికి లేఖలపైనున్న వేలిముద్రల సాయంతో ఫోరెన్సిక్ పరీక్షలు జరిపి.. 41 ఏళ్ల వ్యక్తిని పట్టుకున్నారు. కానీ అతడు వాటిని ఫన్ కోసం రాశానని చెప్పడంతో.. ఆధారాలు లేక, ఆ లేఖలను బూటకపు లేఖలుగా కొట్టిపారేశారు. చాలామంది అనుమానితుల్ని.. సీరియల్ కిల్లర్స్‌ని అదుపులోకి తీసుకుని విచారించారు. కొందరు మతిస్థిమితం కోల్పోయిన పాత నేరగాళ్ల మాటలు విని.. పిల్లల మృతదేహాలైనా దొరుకుతాయనే ఆలోచనతో.. అనుమానిత ప్రాంతాల్లో తవ్వకాలు కూడా జరిపారు. ఎక్కడా ఏ ఆచూకీ దొరకలేదు. నాన్సీ 2019లో తన 92 ఏళ్ల వయసులో నర్సింగ్‌హోమ్‌లో.. పిల్లల్ని తిరిగి చూడకుండానే చనిపోయింది. జిమ్ ఇంకా అడలాయిడ్‌లో జీవిస్తున్నాడు. అయితే ఈ జంట పిల్లల గురించే గొడవపడి.. విడాకులు తీసుకుంది. నాన్సీ తన చివరి జీవితంలో పిల్లల్నే కాదు భర్తని కూడా దూరం చేసుకుని బతికింది. ఏది ఏమైనా పిల్లల్ని తీసుకుని వెళ్లింది ఎవరు? అసలు పిల్లలు ఏమయ్యారు? ఆరోజు పిల్లల్ని కలిసిన వ్యక్తి ఎవరు? అనే ప్రశ్నలు నేటికీ తేలలేదు. కదిలించిన తల్లి ప్రేమ 1967లో ఆస్ట్రేలియా ‘డైలీ టెలిగ్రాఫ్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. నాన్సీ మాటలు అందరి హృదయాలను కదిలించాయి. ‘మీకు తెలుసా? నేను సాధారణంగా కలలు కనేదాన్ని కాదు. కానీ పిల్లల గురించి కలగన్నాను. వాళ్లు రాత్రి ఇంటి వెనుక తలుపు తట్టారు. వెళ్లి చూస్తే ‘హలో అమ్మా’ అన్నారు. ’మీరు ఎక్కడ ఉన్నారు?’ అని నేను అడిగాను. వెనుక లాబీస్లో నిలబడి నవ్వుతున్నారు. వాళ్లని పట్టుకుని చాలా ఏడ్చాను. ఇదే నేను కన్న మొదటికల’ అంటూ తన మదిలోని ఆవేదనను పంచుకుంది. ప్రధాన నిందితుడు హ్యారీ ఫిప్స్ 2004లో చనిపోయాడు. అతడి మరణం తర్వాత 2007లో అతడి కుమారుడు హేద్న్.. తన తండ్రిపై ఆరోపణలు చేశాడు. స్థానిక ఫ్యాక్టరీ యజమానిగా, అడలాయిడ్ సామాజిక శ్రేణిలో అప్పటి సభ్యుడిగా గౌరవమర్యాదలతో బతికిన ఫిప్స్ మంచివాడు కాదని.. 1966లో బ్యూమాంట్ పిల్లలను అతడే కిడ్నాప్ చేశాడని, అప్పటికి తన వయసు 15 ఏళ్లని, తన తండ్రి తనను కూడా లైంగికంగా వేధించాడని చెప్పాడు. పైగా ఫిప్స్‌కి 1 పౌండ్ నోట్లను పంచే అలవాటుందని చెప్పాడు. గ్లెనెల్గ్ బీచ్‌కి 300 మీటర్ల దూరంలోనే ఫిప్స్ జీవించాడు. 2013 నాటికి హేద్న్ తన నమ్మకాన్ని.. చిన్నప్పుడు తను చూసినదాన్ని కలిపి.. ‘ది శాటిన్మెన్’ అనే పుస్తకాన్ని కూడా రాశాడు. హేద్న్ చెప్పిన విషయాలన్నీ కేసుకు సరిపోలడంతో.. ఫిప్స్నే నేరగాడని చాలా మంది నమ్ముతారు. అయితే ఫిప్స్ ఇతర కుటుంబ సభ్యులు హేద్న్ వాదనని తప్పుబట్టారు. - సంహిత నిమ్మన -
ఏడు నెలల క్రితమే ప్రేమ వివాహం.. బయటకు వెళ్లి వస్తానని చెప్పి
సాక్షి, హైదరాబాద్, సంగారెడ్డి: బయటకు వెళ్లి వస్తానని చెప్పిన వ్యక్తి కనిపించకుండాపోయాడు. పటాన్చెరు మండలం అమీన్పూర్ ఎస్ఐ సోమేశ్వరి కథనం ప్రకారం.. మెదక్ జిల్లా నర్సపూర్ మండలం హమీద్‌నగర్‌కు చెందిన ప్రణయ్‌కుమార్‌రెడ్డి, సాయిలత ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏడునెలల క్రితం ఉపాధి నిమిత్తం అమీన్పూర్ మున్సిపాలిటీలోని భవానీపురం కాలనీకి వచ్చారు. ఈ నెల 22వ తేదీ రాత్రి పదిగంటలకు బయటకు వెళుతున్నానని చెప్పాడు. రాత్రయినా తిరిగి రాలేదు. భర్త కోసం భార్య సాయిలత తెలిసినవారి వద్ద, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. ఐదురోజులు దాటినా జాడ తెలియకపోవడంతో సోమవారం ఫిర్యాదు చేసింది. -
3 నెలల క్రితమే పెళ్లి.. వివాహితను బైక్‌పై తీసుకెళ్లిన యువకుడు
సాక్షి,మెదక్ : నార్సింగిలో ఇద్దరి అదృశ్యం మిస్టరీగా మారింది. మండల కేంద్రానికి చెందిన వివాహిత, మరో యువకుడు ఒకే బైక్‌పై సోమవారం రామాయంపేటలో కలిసి తిరిగినట్టు సీసీ కెమెరాలో రికార్డు అయినట్టు తెలిసింది. అయితే ఆ బైక్ , ఇద్దరి చెప్పులు మంగళవారం ఉదయం నార్సింగి చెరువు వద్ద లభ్యమయ్యాయి. కూతురు కనిపించడం లేదని ఆమె తండ్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదైంది. సదరు యువతికి మూడు నెలల క్రితం వివాహం జరిగింది. శివరాత్రి పండగ నిమిత్తం ఈనెల తొమ్మిదివ తేదీన ఆమెను అత్తగారింటినుంచి నార్సింగి తీసుకొచ్చారు. చెరువు వద్ద బైక్, చెప్పులు లభించడంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకొని ఉంటారని ముందుగా అందరూ అనుమానించారు. విషయం తెలియగానే గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో చెరువు వద్దకు చేరుకున్నారు. పోలీసులు గజ ఈతగాళ్లు, వలలతో చెరువులో గాలించినా ఇద్దరి ఆచూకీ లభించలేదు. అయితే అందరి దృష్టిని మళ్లించడానికే బైక్, చెప్పులు చెరువు వద్ద విడిచి వెళ్లినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా మిస్టరీగా మారిన ఈకేసును త్వరలోనే చేధిస్తామని నార్సింగి ఎస్ఐ నర్సింలు పేర్కొన్నారు. -
రాముతో ఐటీ ఉద్యోగిని ప్రేమ.. పెద్దలు అంగీకరించలేదని..
సాక్షి, హైదారాబాద్: విధులకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన ఓ ఐటీ ఉద్యోగిని అదృశ్యమైన ఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్సై ఎం.అంజయ్య వివరాల ప్రకారం.. ప్రైవేటు ఉద్యోగి పగడాల ఉమా శంకర్ కుటుంబ సభ్యులతో కలిసి రాంనగర్ గుండు సమీపంలో గల దుర్గా నివాస్ అపార్ట్మెంట్లోని 301 ఫ్లాట్‌లో నివాసముంటున్నారు. ఆయన ఏకైక కుమార్తె శ్రీశివనాగ హర్షిత(24) హైటెక్ సిటీలోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. గత నెల 24న ఉదయం 8 గంటల సమయంలో విధులకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లి నేటికీ తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తండ్రి ఉమా శంకర్ తమ కుమార్తె కనిపించడం లేదంటూ శనివారం సాయంత్రం నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా హర్షిత, రాము అనే యువకుడు ప్రేమించుకున్నారని, వారి ప్రేమను తాము అంగీకరించలేదని ఉమా శంకర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆరు నెలల క్రితం అదృశ్యం! చివరికి అస్థిపంజరంగా ఆచూకీ లభ్యం
సాక్షి, బనశంకరి: ఆరు నెలల క్రితం అదృశ్యమైన నేపాలీ మహిళ నిర్జీన ప్రాంతంలో అస్థిపంజరంగా కనిపించింది. హుళిమావు పోలీస్‌స్టేషన్ పరిధిలోని అక్షయనగర అపార్టుమెంట్ వెనుకభాగంలో పొదల మధ్య చెట్టుకు వేలాడుతున్న స్థితిలో ఉన్న అస్థి పంజరం నేపాలీకి చెందిన పుష్పదామి (22)గా పోలీసులు గుర్తించారు. భర్తతో గొడవ పడి... నేపాల్‌కు చెందిన పుష్పాదామి, భర్త అమర్దామి అక్షయనగరలో నివాసం ఉంటున్నారు. భర్త మద్యానికి బానిస. దీంతో అతన్ని భరించలేక నేపాల్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. గత ఏడాది జులై 8న భర్తపై కోపంతో ఇంటి నుంచి పుష్పదామి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. భార్య కనిపించకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పలు ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. ఈ ఘటనపై ఆగ్నేయ విభాగ డీసీపీ సీకే.బాబా శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ... ఉరి వేసుకున్న స్థితిలో గురువారం ఉదయం 9.30 గంటల సమయంలో హుళిమావు పరిధిలోని అపార్టుమెంట్ వెనుక భాగంలోని పొదల్లో మనిషి తలపుర్రె,అస్థి పంజరం లభ్యమైంది. అస్థిపంజరం పైన పాదరక్షలు, మెడలో ఉన్న నెక్లెస్, ఇతర వస్తువులు అక్కడ పక్కనే లభించాయి. అక్కడ ఎక్కువగా సంచారం లేకపోవడం నిర్జీన ప్రదేశం కావడంతో ఆ వస్తువులు ఎవరూ తీసుకోలేదు. ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసిందని సీకే బాబా తెలిపారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. (చదవండి: మొబైల్ చూడొద్దని మందలించారని...) -
Hyderabad: బయటకు వెళ్లొస్తానని చెప్పి.. యువకుడు అదృశ్యం
సాక్షి, లక్డీకాపూల్ : సాయంత్రం సరదాగా బయటికి వెళ్లి వస్తానని చెప్పిన ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. యువకుడి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రామంతాపూర్ ప్రాంతానికి చెందిన రోహిత్ మనోజ్ (19)(బబ్లూ) ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదు. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు అతడి కోసం గాలించినా ఆచూకీ తెలియరాలేదు. దీంతో అతడి మేనమామ బోడపాటి శ్రీనివాసరావు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించాడు. ఇంటినుంచి బయటికి వెళ్లిన సమయంలో రోహిత్ మనోజ్ నలుపు రంగు దుస్తులు ధరించి ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతని వద్ద ఫోన్ కూడా లేదని ,కేవలం స్టూడెంట్ బస్ పాస్ మాత్రమే ఉందన్నారు. అతడి ఆచూకీ తెలిస్తే 9493106929, 9912199554, 98661311010 నంబర్లకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: డెక్కన్ మాల్ కూల్చివేతకు జీహెచ్ఎంసీ గ్రీన్ సిగ్నల్) -
కన్నడ నటుడి సోదరి అదృశ్యం..
బెంగళూరు: కన్నడ నటుడు, దర్శకుడు నవీన్‌కృష్ణ సోదరి నీతా పవర్ అదృశ్యమైంది. నాలుగు రోజుల నుంచి ఆమె కనిపించకుండా పోయింది. ఈ విషయాన్ని స్వయంగా నవీన్‌కృష్ణ సోషల్ మీడియాలో పోస్టు వేశారు. సోదరి ఫోటోను, సమాచారాన్ని కూడా పంచుకున్నారు. నవీన్ కృష్ణ పోస్ట్ ప్రకారం.. సుబ్రమణ్యపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే నీతా పవార్ జనవరి 17 మధ్యాహ్నం 2:57 గంటలకు ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదు. ఈ విషయాన్ని ఇతరులకు షేర్ చేయాలని, తన సోదరి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పలు నెంబర్లు షేర్ చూస్తూ కోరారు. కాగా అదృశ్య ఘటనపై సుబ్రమణ్యపుర పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అజిత్ సరసన సాయి పల్లవి! ఎంపిక చేశారా? లేక సస్పెన్స్‌గా ఉంచారా? -
వీడని మిస్టరీ.. 50 రోజులైనా లభించని మహిళా లోకో పైలెట్ ఆచూకీ
సాక్షి, హైదరాబాద్: సనత్ నగర్లో అదృశ్యమైన లోకో పైలట్ వాసవి జాడ ఇంకా లభించలేదు. వాసవి ఆచూకీ కోసం పోలీసులు 50 రోజులుగా గాలిస్తున్నారు. ఐడీ కార్డు, మొబైల్ ఫోన్, డెబిట్ కార్డు వంటి ఇతర గాడ్జెట్ ఇంట్లో పెట్టి వెళ్లడంతో ఆమె ఆచూకీ కనుగొనడం మరింత ఆలస్యం అవుతోంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న లోకో పైలట్ అదృశ్యమైంది. లోకో పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్న వాసవి సనత్‌నగర్‌లో ఓ అద్దె గదిలో ఉంటుంది. అయితే నవంబర్ 30వ తేదీ సాయంత్రం షాపింగ్ వెళ్తున్ననని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆమె అదృశ్యమైంది. రోజు మాదిరిగానే తండ్రి భాస్కర్ రావు ఆమెకు ఫోన్ చేశాడు. ఫోన్ ఎంతసేపటికి లిఫ్ట్ చేయకపోవడంతో.. అనుమానం వచ్చి ఇంటి యజమాని సాయంతో రాత్రి 12 గంటల సమయంలో ఇల్లు తెరిచి చూడగా, ఫోన్ రూమ్‌లోనే ఉంది. కానీ ఆమె లేదు. దీంతో తండ్రి భాస్కర్ రావు తన కూతురు అదృశ్యంపై సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తప్పిపోయిన మహిళ ఎత్తు 5.5 అడుగులు ఉంటుందన్నారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడగలదు. ఆమె కనిపిస్తే సనత్‌నగర్ ఎస్‌హెచ్‌వో 9490617132, ఎస్ఐ 8919558998 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. చదవండి: జగిత్యాలలో టెన్షన్ టెన్షన్.. మాస్టర్ ప్లాన్‌ను నిరసిస్తూ అష్టదిగ్భందనం -
గుడికి వెళ్లొచ్చే సరికి కొడుకు మాయం.. అదృశ్యమైన గంటల్లోనే..
సాక్షి, హైదరాబాద్: అదృశ్యమైన బాలుడు కొన్ని గంటల్లో శవమై తేలిన ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ జగదీశ్వర్‌రావు వివరాల ప్రకారం..లాల్‌వాణినగర్‌కు చెందిన యాతం మహేష్‌యాదవ్ కుమారుడు యువన్ (9) చిన్నప్పటి నుంచి మాటలు రాదు. ఈ నెల 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తల్లితండ్రులు గుడికి వెళ్లి వచ్చేసరికి యువన్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అర్ధరాత్రి వరకు గాలించినా ఫలితం లేకపోయింది. సీసీ కెమెరాలు పరిశీలిస్తే.. ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్లు రికార్డయింది. లాల్వాణీనగర్ ప్రధాన రహదారి మరో వైపు ఉన్న సీసీ కెమరా రికార్డులు పరిశీలిస్తే యువన్ అటు వైపు వచ్చినట్లుగా కనిపించలేదు. అనుమానం వచ్చిన పోలీసులు బండచెరువులో ప్రమాదవశాత్తు పడిపోయాడా అన్న కోణంలో వెతకడం ప్రారంభించారు. గుర్రపు డెక్కతీసే యంత్రం పై నుంచి గాలిస్తుండగా చెరువు చివర కాలిన శవాన్ని గుర్తించారు. ఒంటి మీద ఉన్న బట్టలు ఆదారంగా యువన్‌దే మృతదేహంగా నిర్ధారించారు. అనుమానాలెన్నో.. బండచెరువులో చెత్త వేయకుండా కంచె ఏర్పాటు చేశారు. యువన్ మృతదేహం దొరికిన ప్రాంతంలో కంచె తొలగించి ఉంది. దీనిపై ఆరా తీయగా చెరువులో పందులు పెంచుకునే వారు వాటికి ఆహారం వేయడానికి కంచె తొలగించారని పారిశుద్ధ్య సిబ్బంది చెబుతున్నారు. ఘటనా జరిగిన స్థలానికి ప్రధాన రహదారి కొద్దిదూరంలోనే ఉంది. కాలిపోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది.గస్తీ సిబ్బంది అప్రమత్తంగా ఉండివుంటే ఈ సంఘటనను గుర్తించి ఉండేవారని స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ కొడుకు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపించారు. ఘటనా స్థలాన్ని డీసీపీ రక్షితామూర్తి, ఏసీపీ నర్సింహారెడ్డి పరిశీలించారు. జాగిలం కూడా అక్కడక్కడే తిరిగింది. -
ఈషా యోగా సెంటర్ నుంచి అదృశ్యం.. బావిలో శుభశ్రీ మృతదేహం
సాక్షి, చెన్నై : కోయంబత్తూరు ఈషాయోగా కేంద్రంలో యోగా శిక్షణకు వెళ్లి అదృశ్యమైన శుభశ్రీ మరణించింది. ఓ బావిలో ఆమె మృతదేహం ఆదివారం మధ్యాహ్నం బయట పడింది. వివరాలు.. తిరుప్పూర్‌కు చెందిన పళణి కుమార్ భార్య శుభశ్రీ గత ఏడాది డిసెంబర్లో వారం రోజుల పాటుగా ఈషాయోగా కేంద్రంలో శిక్షణ నిమిత్తం వెళ్లారు. గత నెల 18వ తేదీన ఆమె అదృశ్యమయ్యారు. ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదుతో కోయంబత్తూరు పోలీసులు తీవ్రంగా గాలించారు. సీసీ కెమెరాలలో ఆమె ఈషా యోగా కేంద్రం నుంచి బయటకు ఓ రోడ్డు మార్గంలో వెళ్తుండటం వెలుగు చూసింది. దీంతో ఆ పరిసరాలలో ఆమె కోసం గాలిస్తూవచ్చారు. ఆదివారం మధ్యాహ్నం సెమ్మేడు గాంధీ కాలనీలోని ఓ పాడు పడ్డ బావిలో మహిళ మృత దేహం బయట పడింది. పరిశీలనలో ఆ మృతదేహం శుభశ్రీగా తేలింది. శిక్షణకు వెళ్లిన శుభశ్రీ, యోగా కేంద్రం నుంచి బయటకు వచ్చేయడం, ఆ తర్వాత అదృశ్యం కావడం, ప్రస్తుతం మృతదేహంగా బావిలో తేలడం మిస్టరీగా మారింది. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోయంబత్తూరు ఆసుపత్రికి తరలించిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. -
సికింద్రాబాద్‌లో కిడ్నాపైన చిన్నారి ఆచూకీ లభ్యం
-
సికింద్రాబాద్ మహంకాళి పీఎస్ పరిధిలో పాప అదృశ్యం
-
సికింద్రాబాద్‌లో చిన్నారి అదృశ్యం.. సిద్ధిపేటలో ఆచూకీ లభ్యం
సాక్షి, సికింద్రాబాద్: హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌లో మరో చిన్నారి అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన మహంకాళి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఇంటి నుంచి బయటకు వచ్చాకే తమ ఆరేళ్ల పాప కృత్తిక అదృశ్యం అయినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ మేరకు తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా..చిన్నారి కృత్తిక ఓ వ్యక్తితో వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు ఆ దిశగా ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలించడం ప్రారంభించారు. ఎట్టకేలకు పోలీసులు చిన్నారి మిస్సింగ్ కేసును చేధించారు. ఈ మేరకు నార్త్‌జోన్ పోలీసులు సిద్ధిపేటలో చిన్నారిని గుర్తించారు. కిడ్నాప్ చేసిన పాపను సైకో రాము సిద్ధిపేటకు తీసుకెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పాపను తల్లిదండ్రులకు అప్పగించనున్నట్లు డీసీపీ తెలిపారు. (చదవండి: గోషామహల్లో కుంగిన పెద్ద నాల) -
కాలేజీకి వెళ్లి కనబడకుండా పోయిన నవ వధువు.. చివరికి!
బెంగళూరు: కాలేజీకి వెళ్లి కనబడకుండాపోయిన నవ వధువు నదిలో శవంగా లభించిన సంఘటన కలబుర్గి జిల్లా కమలాపుర తాలూకా కురికోటా గ్రామంలో చోటుచేసుకుంది. నావదగి గ్రామానికి చెందిన సృష్టి మారుతి (21) మృతి చెందిన నవ వివాహిత. డిగ్రీ 5వ సెమిస్టర్ చదువుతున్న సృష్టికి ఇటీలే వివాహం జరిగింది. ఇంట్లో ఉంటూ చదువు కొనసాగిస్తున్న సృష్టి ఈనెల 13న కాలేజీకి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. ఆ రోజంతా బంధువుల ఇళ్లు, చుట్టుపక్కల ప్రాంతాలు వెదికిన కుటుంబ సభ్యులు మరసటి రోజు మహాగాంవ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. ఇలా ఉండగా శనివారం సృష్టి మృత కురికోటా వంతెన వద్ద నదిలో లభించింది. సృష్టి ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేసారా అనే విషయం తెలియాల్సి ఉంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: చిన్నమ్మతో బుజ్జమ్మ ఢీ -
కృష్ణానదిలో గల్లంతైన విద్యార్థుల్లో ఐదుగురి మృతదేహాలు లభ్యం
-
విజయవాడ కృష్ణానదిలో గల్లంతైన ఐదుగురు విద్యార్థులు
-
‘కృష్ణా’లో గల్లంతైన ఐదుగురూ మృత్యువాత
పెనమలూరు/పటమట (విజయవాడ తూర్పు): కృష్ణానదిలో స్నానానికి వెళ్లి గల్లంతైన ఐదుగురూ మృత్యువాత పడ్డారు. నిన్న రెండు మృతదేహాలు లభించగా, ఈరోజు(శనివారం) మరో మూడు మృతదేహాలు దొరికాయి. విజయవాడ పటమట ప్రాంతంలోని దర్శిపేట అంబేడ్కర్ నగర్‌కు చెందిన షేక్ బాజీ (15), షేక్ హుస్సేన్ (15), తోట కామేష్ (15), మద్దాల బాలు (17), ఇనకొల్లు గుణశేఖర్ (14), పిన్నింటి శ్రీను, షేక్ ఖాశిం అలీ స్నేహితులు. బాజీ, కామేష్ చదువు మానేయగా, హుస్సేన్, గుణశేఖర్ తొమ్మిదో తరగతి, బాలు ఇంటర్ చదువుతున్నారు. వీరంతా ఆడుకోవటానికి వెళ్తున్నామని ఇళ్లలో చెప్పి యనమలకుదురు వద్ద కృష్ణా నది రేవు వద్దకు చేరుకున్నారు. కొద్దిసేపు అక్కడ క్రికెట్ ఆడి, యనమలకుదురు పాయ నుంచి మూడున్నర కిలోమీటర్లు నడుచుకుంటూ గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని పాతూరు ఏటిపాయ ఒడ్డుకు చేరుకున్నారు. పిన్నింటి శ్రీను తప్ప మిగిలిన ఆరుగురు నదిలో స్నానానికి దిగారు. కొద్దిసేపటికే వారంతా మునిగిపోవటం గమనించిన శ్రీను గట్టిగా అరుస్తూ స్థానికంగా ఉన్న పశువుల కాపర్లు, జాలర్లకు చెప్పటంతో వారు వెంటనే నదిలో దూకి ఖాసిం అలీను రక్షించగలిగారు. మిగిలిన ఐదుగురు చిన్నారులు నీట మునిగి గల్లంతయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న పెనమలూరు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లు, రెస్కూ సిబ్బంది సాయంతో శివలింగాల గట్టు ప్రాంతంలో గాలించారు. నిన్న రెండు మృతదేహాలు వెలికి తీయగా, ఈరోజు మిగిలిన ముగ్గురు విగత జీవులయ్యారు. దాంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. దర్శిపేటలో విషాదఛాయలు ఇనకొల్లు గుణశేఖర్, తోట కామేష్ మృతిచెందడం, షేక్ హుస్సేన్, షేక్ బాజీ, మద్దాల బాలు గల్లంతవడంతో దర్శిపేటలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇక ఇంకొల్లు గుణశేఖర్, దూదేకుల హుస్సేన్, మద్దాల బాలుకు తండ్రి లేకపోవటంతో వారి తల్లులే పండ్లు, పూలవ్యాపారం చేస్తూ తమ రెక్కల కష్టంపై పిల్లల్ని సాకుతున్నారు. మృతిచెందిన పిల్లల కుటుంబాలన్నీ నిత్యం రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలే. -
మేడ్చల్: జవహార్‌నగర్ బాలిక అదృశ్యం విషాదాంతం
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా జవహార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. దమ్మాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక గురువారం ఉదయం కనిపించకుండా పోగా.. శుక్రవారం ఉదయం చెరువులో మృతదేహం లభ్యమైంది. దీంతో చెరువు వద్దకు పెద్ద ఎత్తున స్థానికులు చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు పోలీసులు. అయితే, పాఠశాల నుంచి బాలిక చెరువు వద్దకు ఎందుకు వచ్చింది? ఎవరైనా తీసుకెళ్లారా? హత్య చేసి చెరువులో పడేశారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోస్ట్‌మార్టం నివేదిక వస్తే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరకనుంది. ఏం జరిగింది? దమ్మాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక గురువారం ఉదయం కనిపించకుండా పోయింది. గురువారం ఉదయం తండ్రితో పాటు స్కూల్‌కు వచ్చిన బాలిక తన బ్యాగును అక్కడే విడిచిపెట్టి పార్కుకు వెళ్లినట్లుగా మిగిలిన పిల్లలు చెప్పారని హెడ్మాస్టర్ తెలిపారు. బాలిక వెళ్లిపోయిన విషయాన్ని ఆమె తండ్రికి ఫోన్ చేసి చెప్పినట్లు వెల్లడించారు. ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీంతో స్కూల్ హెడ్మాస్టర్, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. డాగ్ స్వ్కాడ్స్, క్లూస్ టీంలను రంగంలోకి దింపి గాలించారు. పాఠశాల ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేవు. దమ్మాయిగూడ చౌరస్త వద్ద ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో మాత్రమే బాలిక కనిపించింది. ఆ తర్వాత ఎటు వెళ్లిందనే విషయం తెలియరాలేదు. డాగ్ స్వ్కాడ్స్ చెరువు వద్దకు వెళ్లి ఆగిపోయాయి. ఇదీ చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. భార్యకు హెచ్ఐవీ సోకే విధంగా వైద్యం -
మిస్సింగ్ కేసు కాస్త హత్య కేసుగా...ప్రియుడితో కలిసి భార్యే
సాక్షి, బెంగళూరు: కనిపించకుండా పోయిన వ్యక్తి శవంగా లభ్యం కాగా అతనిని భార్యే హత్య చేయించిన విషయం పోలీసుల తనిఖీలో వెలుగు చూసింది. అక్రమ సంబంధం నేపథ్యంలో భార్యే ప్రియుడితో కలిసి హత్య చేయించిన ఘటన తాలూకాలోని టీకల్ ఫిర్కా చంబె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆనంద్ హత్యకు గురైన వ్యక్తి. నవంబర్ 21న కనిపించకుండా పోవడంపై తాలూకాలోని మాస్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బెంగుళూరు గ్రామీణ జిల్లా హొసకోటె తాలూకా భీమకరనహళ్లి గ్రామంలోని చెరువులో ఆనంద్ శవం లభ్యమైంది. దీనిపై నందగేడి పోలీస్ స్టేషన్లో అపరిచిత శవం లభ్యం కేసు నమోదైంది. తనిఖీ సమయంలో అదృశ్యం కేసు కాస్త హత్య కేసుగా మారింది. చైత్ర, పృథ్వీరాజ్‌ల మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. తమ సరసానికి భర్త అడ్డుగా ఉన్నాడని తలంచిన చైత్ర ప్రియుడితో కలిసి మరో ఇద్దరి సహకారంతో హత్య చేసినట్లు మాస్తి పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో పోలీసులు ఆనంద్ భార్య చైత్ర, పృథ్వీరాజ్, చలపతిలను అరెస్టు చేశారు. మరో నిందితుడు నవీన్ పరారీలో ఉన్నాడు. (చదవండి: జాగ్రత్తగా నడపమన్నందుకు... కారుతో ఢీకొట్టారు) -
ఆన్లైన్లో రూ.10 లక్షలు పెట్టుబడి.. సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
సాక్షి, మెదక్: ఆన్లైన్లో పెట్టుబడి పెట్టి నష్టపోవడంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్తాపం చెంది ఓ సాఫ్ట్వేర్ అదృశ్యమైన సంఘటన అమీన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ కిష్టారెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అమీన్పూర్ పరిధి కేఎస్ఆర్ కాలనీకి చెందిన సాయిపవన్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కాగా ఇటీవల ఆన్లైన్లో రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో 14వ తేదీన ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు తెలిసిన వారిని, బంధువులను విచారించినా అతడి ఆచూకీ లభించలేదు. తమ్ముడి అదృశ్యంపై అన్న మహేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: చెత్తను శుభ్రం చేస్తుండగా కదలికలు.. తీరా చూస్తే! -
నాలుగేళ్ల క్రితం మిస్సింగ్ కేసు...నిందితుడి ఇంట అస్తిపంజరం...
నాలుగేళ్ల క్రితం మిస్సింగ్ కేసుగా నమోదైన ఒక వ్యక్తి అస్థిపంజరం నిందితుడి ఇంట బయటపడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నారా గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...అదే గ్రామానికి చెందిన మహ్మద్ హసన్ 2018లో కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు పోలీసులు. అతన్ని ఎవరైనా హత్య చేశారా అనేది తేలక అలా ఆ మిస్సింగ్ కేసు ఆధారాలు లేనిపెండింగ్ కేసుగా ఉండిపోయింది. ఐతే సదరు నిందితుడు కొద్దిరోజుల క్రితం కొంతమంది వ్యక్తుల వద్ద మహ్మద్ హసన్‌ని తానే చంపి తన ఇంట్లో పాతిపెట్టినట్లు చెప్పాడు. దీన్ని ఆయా వ్యక్తులు రికార్డు చేసి నెట్టింట పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి సదరు నిందితుడి ఇంటి వద్ద తనిఖీ చేపట్టారు. నిందితుడి ఇంట్లో జరిపిన తవ్వకాల్లో హసన్ అస్తిపంజరం బయటపడింది. ఈ మేరకు మన్సూర్పూర్ పోలీస్టేషన్ ఆఫీసర్ బిజేంద్ర సింగ్ రావత్ మాట్లాడుతూ...వీడియో నెట్టింట రికార్డు కావడంతో హసన్ కుటుంబ సభ్యులు తమకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఆ తర్వాత తాము అతని ఇంటి వద్ద తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు. ఆ ఆస్తిపంజరాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపినట్లు తెలిపారు. అతను ఆ వైరల్ వీడియోలో నేరం చేసినట్లు అంగీకరించడాని పేర్కొన్నారు. (చదవండి: కూతురిని చంపి ఆత్మహత్యగా నాటకం...పట్టించిన మొబైల్ ఫోన్) -
విశాఖ మిస్సింగ్ కేసు మిస్టరీని చేధించే పనిలో పోలీసులు
-
వివాహిత అదృశ్యం.. భర్తతో విడిపోయి..
గుంటూరు రూరల్: వివాహిత అదృశ్యంపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. స్వర్ణభారతీనగర్‌కు చెందిన జె.చిట్టెమ్మ భర్తతో విడిపోయి స్థానికంగా వలంటీరుగా పని చేసుకుంటూ విడిగా జీవిస్తోంది. ఈనెల 27వ తేదీ ఉదయం నుంచి కనిపించడం లేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: 15 మంది బాయ్‌ఫ్రెండ్స్.. భర్త హత్య కేసులో భార్య లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి.. -
Hyderabad: భర్తతో సినిమాకు వెళ్లి.. కనిపించకుండా పోయిన భార్య
సాక్షి, హైదరాబాద్: భర్తతో కలిసి సినిమాకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ సాయులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాకు చెందిన భాస్కర్ రెడ్డి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 21న సాయంత్రం భార్య శైలజతో కలిసి కొత్తగూడలోని ఏఎంబీ మాల్లో సినిమాకు వచ్చాడు. సినిమా చూస్తుండగా శైలజ వాష్‌రూమ్‌కు వెళుతున్నట్లు చెప్పి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో అతను మహిళా సిబ్బందితో వాష్ రూమ్‌లో వెతికించినా జాడ తెలియలేదు. పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. శైలజతో గత మే నెలలో భాస్కర్ రెడ్డికి వివాహం జరిగింది. తన భార్య వద్ద సెల్‌ఫోన్ కూడా లేదని, జాడ తెలియడం లేదని ఆదివారం ఆమె భర్త గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఏఎంబీ మాల్లో సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. చదవండి: రైళ్లలో ప్రీమియం తత్కాల్ దోపిడీ..రూ.450 టికెట్ రూ.1000పైనే -
ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలుడు.. గంటల వ్యవధిలోనే..
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఓ బాలుడు ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. వెంకట్‌రెడ్డి నగర్లో నివాసం ఉంటున్న సల్మా బేగం కుమారుడు మహమ్మద్ హమన్ ఈ రోజు ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న రెండు, మూడు గంటల్లోనే బాబు ఆచూకీ కనుక్కొని ఉప్పల్ పోలీసులు, పెట్రోల్ మొబైల్ ఇంచార్జ్ నర్సింగ్‌రావు.. బాలున్ని తల్లికి అప్పగించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. -
జనగామ: కిడ్నాపైన బాలుడు షబ్బీర్ హత్య.. వరసకు బావే నిందితుడు
సాక్షి, జనగామ: జనగామ జిల్లా కొడకండ్లలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడి కిడ్నాప్ కేసు విషాదాంతమైంది. కిడ్నాప్ అయిన బాలుడు షబ్బీర్(5) దారుణ హత్యకు గురయ్యాడు. కిడ్నాపర్ మహబూబ్ బాలుడిని చంపి బావిలో పడేశాడు. నిందితుడు మహబూబ్‌ను సూర్యపేట జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదు బృందాలుగా ఏర్పడిన పోలీసులు సినిఫక్కీలో వెంబడించి తిరుమలగిరి సమీపంలో మహబూబ్‌ను అరెస్ట్ చేశారు. అయితే నిందితుడు మహబూబ్.. బాలుడి తండ్రి జమాల్‌కు వరుసకు అల్లుడుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. కాగా యాదాద్రి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామానికి చెందిన మహ్మద్ జమీల్ కుటుంబం ఏడాది కాలంగా కొడకండ్లలో నివాసం ఉంటుంది. జమీల్ సమీపంలోని తిర్మలగిరి కర్రకోత మిషన్‌లో పనిచేస్తుండగా ఇతర కుటుంబీకులు అల్యూమినియం వస్తువులు తయారు చేస్తుంటారు. రోజూ మాదిరిగానే జమీల్ పనికి వెళ్లాడు. ఆ సమయంలో అతడి పెద్ద కుమారుడైన షాబీర్ గుడిసె బయట ఆడుకొంటూ కనిపించకుండా పోయాడు. దీంతో తల్లి జరీనాతోపాటు మిగతా కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇంతలోనే బాలుడు విగత జీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. చదవండి: మెడిసిన్ చదివి రెండేళ్లుగా ఇంటి వద్దే.. సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని వెళ్లి -
మెడిసిన్ చదివి రెండేళ్లుగా ఇంటి వద్దే.. సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని వెళ్లి
సాక్షి, రంగారెడ్డి: ఇంటినుంచి వెళ్లిపోయిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తల్లిదంండ్రులకు సందేశం పంపిన ఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి శ్రీరాంకాలనీకి చెందిన తాడాల శ్రీనివాస్‌రావు కుమార్తె ప్రత్యూష(24) మెడిసిన్ కోర్సు చదివి రెండేళ్లుగా ఇంటివద్దే ఉంటుంది. ఈనెల 18న ఉదయం 10గంటలకు మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్ కాలేజీలో సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని వెళ్లిన ప్రత్యూష 19వ తేదీన ఉదయం 8గంటలకు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు ఫోన్లో మెసేజి పెట్టింది. ఆందోళనకు గురైన తల్లి గంగాభవానీ పహాడీషరీఫ్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అదృశ్యమైన బాలిక సెల్లార్ గుంతలో శవమై తేలింది
గచ్చిబౌలి: అదృశ్యమైన బాలిక సెల్లార్ గుంతలో శవమై తేలిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ గోనె సురేష్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన నాణు, హీరాబాయి దంపతులు నగరానికి వలస వచ్చి గోపన్‌పల్లిలోని ఎన్టీఆర్నగర్లో ఉంటున్నారు. నాణు ఆటో డ్రైవర్‌గా, హీరాబాయి హౌస్‌మేడ్‌గా పని చేస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. చిన్న కూతురు రమావతి రాణి(17) యూసూఫ్‌గూడలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఆదివారం తల్లిదండ్రులు పనికి వెళ్లారు. ఉదయం ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లిన రాణి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఆమె కోసం గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. సోమవారం తెల్లవారు జామున ఎన్టీఆర్నగర్లోని సిరీస్ సంస్థకు సంబంధించిన సెల్లార్ గుంతలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహన్ని బయటికి తీసి స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితులను ఎమ్మెల్సీ రాములు నాయక్, స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరామర్శించారు. పరిహారం చెల్లించాలని ఆందోళన 14 ఏళ్ల క్రితం సెల్లార్ గుంతను తవ్వి వదిలేశారని, రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందారని స్థానికులు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. సాయంత్రం 5 గంటల వరకు మృతదేహంతో సెల్లార్ గుంత వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులు ఇటు బాధితులు అటు సైట్ యాజమాన్యంతో చేసిన చర్చలు ఫలించ లేదు. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సాయంత్రం 7 గంటల వరకు ఆందోళన కొనసాగించడంతో దిగివచి్చన యాజమాన్యం బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు అంగీకరించడంతో వారు ఆందోళనను విరమించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్తిత్తం ఆస్పత్రికి తరలించేందుకు అంగీకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: లిఫ్ట్ అడిగి ఇంజక్షన్ గుచ్చి) -
మిస్సింగ్ కాదు.. డబుల్ మర్డర్!
దేవరకద్ర రూరల్: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం పేరూర్లో భార్యాభర్తల మిస్సింగ్ వెనకున్న మిస్టరీని ఎనిమిదేళ్ల తర్వాత పోలీసులు ఛేదించారు. దంపతుల అదృశ్యాన్ని హత్యగా తేల్చారు. వివాహేతర సంబంధమే అందుకు కారణమని సాంకేతిక ఆధారాలతో గుర్తించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ రజితరెడ్డి, గ్రామస్తుల కథనం ప్రకారం దేవరకద్ర మండలంలోని ఇస్రంపల్లికి చెందిన బుర్రన్ పేరూర్లో తన బావమరుదులు నానేష్, మహమ్మద్ రఫీతో కలిసి బొగ్గు అమ్మేవాడు. ఈ క్రమంలో పేరూర్కే చెందిన దంపతులు బోయ శాంతమ్మ (32), బోయ ఆంజనేయులు (37)తో బుర్రన్కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో బుర్రన్ దగ్గర వారు రూ. 20వేలు అప్పుగా తీసుకున్నారు. అప్పు తీర్చాలంటూ బుర్రన్ తరచూ వారి ఇంటికి వెళ్లే క్రమంలో శాంతమ్మతో బుర్రన్ వివాహేతర సంబ«ం«ధం ఏర్పర్చుకున్నాడు. విషయం తెలుసుకున్న ఆంజనేయులు తన భార్యతో మాట్లాడితే చంపుతానని బుర్రన్ను హెచ్చరించాడు. అడ్డొస్తున్నాడని.. గొంతు నులిమి.. తన వద్ద తీసుకున్న డబ్బు ఇవ్వకపోవడంతోపాటు వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే ఉద్దేశంతో ఆంజనేయులును హతమార్చాలని బుర్రన్ నిర్ణయించుకున్నాడు. 2014 ఏప్రిల్ 19న మాట్లాడుకుందామంటూ ఆంజనేయులను పెద్దమందడి మండలంలోని పెద్దమునగల్ చేడ్ గ్రామ శివారులోని ఓ పొలం వద్దకు తీసుకెళ్లి నానేష్, రఫీతో కలసి గొంతు నులిమి చంపాడు. అనంతరం ఈ విషయాన్ని శాంతమ్మకు చెప్పాడు. ఆమె ఈ హత్యోదంతాన్ని బయటకు చెబుతాననడంతో బావమరుదుల సాయంతో ఆమెను గ్రామ శివారులోని పెద్ద చెరువు వద్దకు తీసుకెళ్లి చీర కొంగును గొంతుకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపాడు. ఈ హత్యలు బయటపడకుండా ఉండేందుకు మృతదేహాలను పూడ్చి పెట్టారు. డీఎన్ఏ పరీక్షతో కేసు ఛేదన.. 2020 ఏప్రిల్ 17న మండలంలోని పేరూర్ శివారులో శ్మశానవాటిక నిర్మాణం కోసం గుంతలు తవ్వుతుండగా ఓ చీర, ఎముకలు బయటపడ్డాయి. ఈ సమాచారం అందుకొని రంగంలోకి దిగిన పోలీసులు... గత పదేళ్లలో తప్పిపోయిన మహిళల సమాచారాన్ని సేకరించే క్రమంలో శాంతమ్మ పేరు రావడంతో మృతురాలి కుమారుడు శ్రీకాంత్‌కు డీఎన్ఏ టెస్టు చేశారు. అది ఎముకలతో సరిపోలడంతో మృతి చెందింది శాంతమ్మగా నిర్ధారించి దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నిందితులు సర్పంచ్‌ను కలిసి నిజం చెప్పారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. మరో నిందితుడు రఫీ ఏడాది క్రితం కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. -
రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై కారు నిలిపి వ్యక్తి మిస్సింగ్
-
Crime News: ఎంత పని చేశావ్ రమావతి!
భార్యభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు.. అప్పటికో, కాసేపటికో సర్దుకుపోవడం కూడా సహజమే. కానీ, ఒక్కోసారి అవి విపరీతాలకు కూడా దారి తీస్తుంటాయి. భార్యపై చెయ్యి చేసుకున్న ‘పాపాని’కి.. కలలో కూడా ఊహించని శిక్షపడింది ఆ భర్తకు. భార్యను ఎత్తుకెళ్లి.. హత్య చేసిన కేసులో ఓ భర్తకు పదేళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ కేసులో దాదాపు ఎనిమిదేళ్లపాటు పోలీసు విచారణ సాగడం గమనార్హం. ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత బెయిల్ మీద వచ్చాడు అతను. మరో నాలుగేళ్ల తర్వాత.. ఈ మధ్యే మబ్బులు వీడిపోయే వార్త ఒకటి అతని చెవిన పడింది. అతని భార్య బతికే ఉందని! ఉత్తర ప్రదేశ్ బహ్రాయిచ్ ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. అక్కడి ఏఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జాంపూర్ గ్రామానికి చెందిన కంధాయ్ అనే వ్యక్తి 2006లో అదే గ్రామానికి చెందిన రమావతి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే.. మూడేళ్ల తర్వాత అంటే 2009లో ఓరోజు హఠాత్తుగా ఆమె కనిపించకుండా పోయింది. దీంతో రమావతి కుటుంబ సభ్యులు కంధాయ్‌ను కోర్టుకు ఇడ్చారు. తమ బిడ్డను ఎత్తుకెళ్లి హత్య చేశాడని కేసు నమోదు చేయడంతో విచారణ కొనసాగింది. ఎనిమిదేళ్లు అయినా రమావతి తిరిగి రాకపోవడంతో చనిపోయి ఉంటుందని పోలీసులు నిర్ధారించుకున్నారు. అదే సమయంలో కంధాయ్‌కు వ్యతిరేకంగా ఆమె కుటుంబ సభ్యులు సాక్ష్యం చెప్పడంతో.. 2017లో స్థానిక కోర్టు అతనికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఆరు నెలల శిక్ష తర్వాత అలహాబాద్ హైకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నాడు అతను. అయితే కంధాయ్ కూడా ఊహించని ట్విస్ట్ ఒకటి బయటపడింది ఈమధ్యే. బంధువులతో పరుగున.. రమావతి, కంధాయ్ ఇరు కుటుంబాలకు దగ్గరి బంధువైన ఓ వ్యక్తి.. ఈమధ్యే రమావతి సోదరి ఇంటికి వెళ్లాడు. అక్కడ రమావతిని చూసి షాక్ తిన్నాడు అతను. వెంటనే విషయాన్ని కంధాయ్‌కు చేరవేశాడు. భార్య బతికే ఉందన్న విషయం తెలిసిన కంధాయ్.. ఆలస్యం చేయకుండా తన బంధువులతో రమావతి సోదరి ఇంటికి చేరుకున్నాడు. ఈలోపు పోలీసులకు సైతం సమాచారం ఇవ్వడంతో వాళ్లు అక్కడికి వచ్చారు. అంతా రమావతిని చూసి కంగుతిని.. అసలు విషయాన్ని ఆరా తీసేందుకు ఆమెను వన్ స్టెప్ సెంటర్(మహిళా సంక్షేమ కేంద్రం)కు తీసుకెళ్లి విచారించారు. చాయ్ విషయంలో జరిగిన గొడవతో భర్త తనపై చెయ్యి చేసుకున్నాడని, అది నచ్చకనే భర్తను జైలు పాలు చేయాలని ఇలా చేశానని అసలు విషయం చెప్పుకొచ్చిందామె. ఆమె చెప్పిన కారణం విని కంగుతిన్న భర్త, పోలీసులు, బంధువులు.. ఇన్నేళ్లపాటు ఆమె తన జాడను గోప్యంగా ఉంచడంపై ఆశ్చర్యపోతున్నారు. ఆమె అజ్ఞాతవాసం-కంధాయ్ కారాగారవాసం వెనుక రమావతి కుటుంబ ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇవాళ(సోమవారం) రమావతిని కోర్టులో హాజరుపర్చగా.. కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది కోర్టు. -
ఆర్కే బీచ్‌లో వివాహిత అదృశ్యం.. భర్త కళ్లుగప్పి ప్రియుడితో..
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ ఆర్కే బీచ్‌లో రెండు రోజుల క్రితం అదృశ్యమైన సాయి ప్రియ మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. అధికారులు, పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించిన వివాహిత అదృశ్యం వెనుక పక్కా ప్లాన్ బయటపడింది. సోమవారం ఆర్కే బీచ్‌లో కనిపించకుండా పోయిన వివాహిత సాయిప్రియ నెల్లూరులో ప్రత్యక్షమైంది. ఆమె ఆఖరి ఫోన్‌కాల్‌ను పోలీసులు కావలిలో ట్రేస్ చేశారు. ప్రియుడితో కలిసి సాయిప్రియ రైల్లో నెల్లూరు జిల్లాకు పరారైనట్లు తేలింది. సాయిప్రియ అదృశ్యమైన సమయంలో బీచ్ రోడ్లోనే ఆమె ప్రియుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే భర్తను బురిడి కొట్టించి లవర్ సాయితో పరారైనట్లు బయటపడింది. చదవండి: బీచ్‌లో గల్లంతయ్యిందా..? లేక ఇంకేమైనా జరిగిందా..? అసలేం జరిగిందంటే చిరిగిడి సాయి ప్రియ, శ్రీనివాస్ భార్యభర్తలు. కానీ సాయి ప్రియ కొంతకాలంగా రవితో ప్రేమాయణం సాగిస్తోంది. సోమవారం పెళ్లి రోజు కావడంతో భర్త శ్రీనివాస్‌తో కలిసి ఆర్కే బీచ్‌కు వెళ్లింది. శ్రీనివాస్ ఫోన్లో మెసెజ్‌లు చూస్తుండగా.. అలలు దగ్గరకు వెళ్తానని చెప్పింది. దీన్నే అవకాశంగా భావించిన సాయిప్రియ రాత్రి 7.30 గంటల సమయంలో ప్రియుడితో కలిసి బీచ్ నుంచి పారిపోయింది. భార్య కనిపించకపోవడంతో సముద్రంలో కొట్టుకుపోయి ఉంటుందని కంగారు పడిన శ్రీనివాస్ వెంటనే పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. పక్కా స్కెచ్ ప్రమాదవశాత్తు సాయిప్రియ సముద్రంలో పడిపోయి ఉంటుందని భావించిన అధికారులు.. వివాహిత ఆచూకీ కోసం సముద్రంలో రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. ముందుగా గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో నావీ సాయం కోరారు. దీంతో రెడు కోస్ట్ గార్డ్ షిప్‌లతో పాటు ఓ హెలికాప్టర్‌తో సముద్రం మొత్తం గాలించారు. అయినా జాడ దొరకలేదు. అయితే చివరకు అమ్మాయి సముద్రంలో గల్లంతు కాలేదని, ప్రియుడితో కలిసి నెల్లూరుకు చెక్కేసినట్లు తేలింది. ఎంతోమందిని టెన్షన్ పెట్టిన సాయిప్రియ మిస్సింగ్ చివరకు డ్రామాగా తేలడంతో అందరూ విస్తుపోయారు. -
పదేళ్ల అన్వేషణకు తెర
నెల్లూరు (క్రైమ్): పదేళ్ల కిందట అదృశ్యమైన ఓ మహిళ, ఆమె ఇద్దరు పిల్లల కేసును యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్‌టీయూ) పోలీసులు ఛేదించారు. వారిని తీసుకొచ్చి ఆదివారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం అల్తుర్తికి చెందిన జయంతి తన ఇద్దరు పిల్లలతో కలిసి 2012లో కనిపించకుండా పోయింది. అప్పట్లో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కోసం ఎంత గాలించినా ఎలాంటి సమాచారం లభించకపోవటంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. ఎస్పీ సీహెచ్ విజయారావు ఇటీవల ఏహెచ్‌టీయూను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఏహెచ్‌టీయూ ఎస్ఐ విజయశ్రీనివాస్ ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. తప్పిపోయిన వారికి సంబంధించి ఎలాంటి ఆధారం లేకపోవడంతో పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. సదరు మహిళపై రేషన్‌కార్డు ఉండటాన్ని గుర్తించి, దాని ఆధారంగా ఆమె గుంటూరులో ఉన్నట్లు తెలుసుకున్నారు. శనివారం రాత్రి ఎస్ఐ తన సిబ్బందితో గుంటూరుకు చేరుకుని జయంతి, ఆమె ఇద్దరు పిల్లలను తమ సంరక్షణలోకి తీసుకుని నెల్లూరుకు తీసుకువచ్చారు. ఆదివారం పొదలకూరు పోలీసుస్టేషన్లో వారిని కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించారు. -
జర్నలిస్ట్ గోపాల్ అదృశ్యం కేసులో వీడని మిస్టరీ
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: వివిధ దినపత్రికల్లో పాత్రికేయుడిగా పనిచేసిన చింతమాను గోపాలకృష్ణ (35) అదృశ్యమై ఐదేళ్లవుతున్నా నేటికీ ఆచూకీ లభ్యం కాలేదు. 2017, నవంబరు 11న గోపాలకృష్ణ కనిపించకుండా పోయాడని అతని తల్లి చింతమాను లక్ష్మమ్మ ఇటుకలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పట్లో పోలీసులు 97/2017 క్రైం నంబర్ కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ గోపాలకృష్ణ ఎక్కడున్నది గుర్తించలేకపోయారు. కుమారుడు బతికున్నాడో.. లేదో తెలియని స్థితిలో అతని తల్లి మంచం పట్టి చివరకు అనారోగ్యంతో మృతి చెందింది. చదవండి: డ్రైవర్‌తో వివాహేతర సంబంధం: ప్రియురాలి భర్తను మాట్లాడాలని పిలిచి.. అనంతరం గోపాల్ భార్య, పిల్లలు కూడా కనిపించకుండా పోయారు. గోపాల్ సోదరి తెలంగాణలో ఉన్నట్లు సమాచారం. అడిగేవారు లేకపోవడంతో గోపాల్ కేసును పోలీసులు అటకెక్కించేశారు. కాగా, గోపాలకృష్ణను హత్య చేశారన్న వదంతులూ హల్చల్ చేస్తున్నాయి. ఒక జర్నలిస్టు అదృశ్యమై ఐదేళ్లవుతున్నా పోలీసులు ఆచూకీ కనుగొనలేదంటే దర్యాప్తు ఏ స్థాయిలో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంపై ఇప్పటికైనా జర్నలిస్ట్ సంఘాలు ఉద్యమించి గోపాల్ అదృశ్యం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించాలని పలువురు కోరుతున్నారు. -
వెళ్లిపోతున్నాం..మా కోసం వెతకొద్దు!
కురబలకోట (వైఎస్సార్ జిల్లా): ‘మా కొడుకు లేని జీవితం మాకొద్దు..అప్ప..అమ్మ అనే పిలుపుకు దూరమయ్యాం..మా గురించి బాధపడకండి..మా చావుకు మేమే కారణం’ అంటూ నోట్ రాసి దంపతులు అదృశ్యమైన సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కురబలకోట మండలం వినాయక చేనేత నగర్‌లోని ఇంట్లో లెటర్ పెట్టి దంపతులు వై. కృష్ణ, రమణమ్మ బైక్‌లో ఎటో వెళ్లిపోయారు. వీరి కుమార్తె సుప్రియ తల్లి దండ్రుల అదృశ్యంపై ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దంపతుల కోసం గాలిస్తున్నారు. పీటీఎం మండలం అంగడివారిపల్లెకు చెందిన వై.కృష్ణ (50), వై.రమణమ్మ (44)కు సురేష్, సుప్రియ పిల్లలు. వీరు 24 ఏళ్లుగా మదనపల్లె వినాయక చేనేతనగర్ కాలనీలో కాపురం ఉంటున్నారు. కుమార్తె సుప్రియకు అదే కాలనీవాసితో వివాహం జరిపించారు. కృష్ణ మదనపల్లె టమాట మార్కెట్లో క్రయవిక్రయాల ద్వారా జీవనం సాగించేవాడు. వీరి కుమారుడు సురేష్ ఎంటెక్ చదివాడు. బెంగళూరులో సాప్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. అయితే ఆరు నెలల క్రితం అతడు అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి దంపతులు మనోవేదనతో గడిపేవారు. స్థానికులతో కూడా పెద్దగా మాట్లాడకుండా ముభావంగా కాలం వెళ్లదీసేవారు. ఈ నేపథ్యంలో వీరు శనివారం మధ్యాహ్నం నుంచి కన్పించకుండా పోయారు. అనుమానం వచ్చిన సుప్రియ తల్లిదండ్రులుంటున్న ఇంట్లోకి వెళ్లి చూసింది. తాము వెళ్లిపోతున్నట్లు తండ్రి, తల్లి సంతకాలతో కూడిన లెటర్ కంటపడింది. అందులో ‘కుమారుడు లేనప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాం, ఇక మేము ఎవ్వరినీ బాధపెట్టదలచుకోలేదు.. నీవు ఎప్పుడు ఏడవద్దు..మాకు ఆత్మ శాంతి ఉండదని’ రాశారు. కృష్ణ సెల్‌ఫోన్ కూడా అక్కడే కన్పించింది. అయినవారందరూ కలిసి పరిసర ప్రాంతాల్లో వెదికినా ఆచూకీ లేదు. దీంతో ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమణమ్మ తీసుకెళ్లిన సెల్ రింగ్ అవుతున్నా ఎత్తడం లేదు. కర్నాటక ప్రాంతం రాయల్పాడు ప్రాంతాన్ని లోకేషన్లో చూపుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. వీరి కోసం తీవ్రంగా గాలిస్తున్నా కన్పించకపోవంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎక్కడైనా వీరి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా ముదివేడు పోలీసులు కోరుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుకుమార్ తెలిపారు. -
పెళ్లై రెండు నెలలు.. పని నిమిత్తం భర్త, అత్తమామలు బయటకు వెళ్లడంతో..
సాక్షి, హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో ఓ గృహిణి అదృశ్యమైన ఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మల్లన్న తాండ, నల్లపోచమ్మ ఆలయం సమీపంలో నివాసముండే పోతు నితిన్, సంధ్య(28)లకు రెండు నెలల క్రితం వివాహమైంది. కాగా ఈ నెల 16న ఉదయం 9 గంటలకు నితిన్ ప్లంబింగ్ పని నిమిత్తం బయటకు వెళ్లగా, అతడి తల్లిదండ్రులు సైతం హాస్టల్లో పని చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో నితిన్ ఇంటికి రాగా భార్య సంధ్య కనిపించలేదు. ఆమె మొబైల్‌కు ప్రయత్నించగా ఇంట్లోనే వదిలిపెట్టింది. ఆందోళన చెందిన అతను చుట్టు పక్కల, బంధువుల ఇళ్లల్లో వెతకగా ఆచూకీ లభించలేదు. దీంతో శనివారం నితిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కీటికిలో నుంచి గుట్టుగా మహిళ ఫొటోలు తీసి.. -
శ్రీకాంతాచారి తండ్రి అదృశ్యం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తండ్రి కాసోజు వెంకటచారి అదృశ్యమయ్యాడు. ఈ మేరకు ఆయన భార్య శంకరమ్మ శనివారం హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాంతాచారి తల్లిదండ్రులు కొంత కాలంగా హయత్‌నగర్ డివిజన్ సూర్యానగర్‌లో నివాసముంటున్నారు. శ్రీకాంతాచారి తండ్రి వెంక టచారి ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఈ నెల 1న పనిమీద బయటికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన వెంకటచారి తిరిగి రాలేదు. 2వ తేదీన సోషల్ మీడియా ద్వారా అతను ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ వద్ద ఉన్నట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు ఆయనకు ఫోన్ చేయగా ఎత్తలేదు. వెంకటచారి ఎంతకీ తిరిగి రాపోవడంతో ఆయన కేఏ పాల్ వద్ద ఆశ్రయం పొందుతున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తూ శంకరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
3 నెలల కిత్రమే ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి.. భర్తతో గొడవపడి
సాక్షి, రంగారెడ్డి: తల్లిదండ్రులు లేనిది చూసి ఓ యువతి ఇంట్లో నుంచి పారిపోయింది. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆదిబట్ల సీఐ నరేందర్ కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం, పుల్జాల గ్రామానికి చెందిన బులిగం బాలరాజ్ కుటుంబ సభ్యులతో కలిసి అబ్దుల్లాపూర్‌మెట్ మండలం రాగన్నగూడ సమీపంలో నివాసం ఉండేవారు. బాల్‌రాజ్‌కు సాగరిక అనే కుతురు ఉంది. మూడు నెలల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి ఎడ్ల అంజి అనే యువకుడిని ప్రమ వివాహం చేసుకుంది. అప్పట్లోనూ మిస్సింగ్ కేసు నమోదైంది. అప్పటి నుంచి ఉప్పునుతల మండలం, అయ్యవారిపల్లిలో నివాసం ఉండేవారు. అంజితో సాగరిక గొడవపడి పది రోజుల క్రితం పుట్టింటికి వచ్చేసింది. ఈ నెల 5న ఇంట్లో ఎవరి లేని సమయంలో సాగరిక(19) బయటకు వెళ్లింది. ఎక్కడికి వెళ్లిందోనని కుటుంబ సభ్యులు చుట్టూ ప్రక్కల వారిని బంధువులను అడిగిన ఆచూకీ లభించలేదు. దీంతో తండ్రి బాలరాజు సోమవారం ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు విచారిస్తున్నట్లు సీఐ నరేందర్ తెలిపారు. -
వీడిన రెండేళ్ల మిస్సింగ్ కేసు మిస్టరీ
బద్వేలు అర్బన్ : రెండేళ్ల క్రితం బద్వేలు రూరల్ పోలీసుస్టేషన్లో నమోదైన ఓ మిస్సింగ్ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఇటీవల జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ జిల్లాలోని మహిళల మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో రూరల్ పోలీసులు విచారణ చేపట్టగా సంచలన నిజాలు వెలుగు చూశాయి. సదరు తప్పిపోయిన మహిళ పొలానికి వేసిన విద్యుత్ కంచె తగులుకుని మృతిచెందగా పొలం యజమానితో పాటు మరికొందరు కలిసి శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టినట్లు తేలింది. దీంతో నిందితులను అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మైదుకూరు డీఎస్పీ ఎస్.ఆర్.వంశీధర్‌గౌడ్ వివరించారు. బద్వేలు మండలం మల్లంపేట గ్రామానికి చెందిన బొల్లా రామసుబ్బమ్మ (49) అనే మహిళ తన భర్తతో ఏర్పడిన విభేదాలతో సిద్దవటం మండలం జ్యోతి సమీపంలోని గొల్లపల్లె గ్రామంలోని ఆమె సోదరుని ఇంటి వద్ద నివసిస్తుండేది. అయితే 2020వ సంవత్సరం జూలై 9వ తేదీన తమ తల్లి కనిపించడం లేదని ఆమె కుమారుడు శ్రీనివాసులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొన్ని నెలల పాటు విచారించి ఆచూకీ లభించకపోవడంతో పెండింగ్ కేసుగా ఉంచారు. ఇటీవల కాలంలో జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ జిల్లాలోని మహిళల మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి తిరిగి విచారణ చేయాలని ఆదేశించడంతో తన పర్యవేక్షణలో రూరల్ సీఐ హనుమంతనాయక్, ఎస్ఐ చంద్రశేఖర్, సబ్ డివిజన్ ఐడీపార్టీ సిబ్బందితో కలిసి విచారణ ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సిద్దవటం గొల్లపల్లె గ్రామంలోని జ్యోతిరామకృష్ణారెడ్డికి చెందిన పొలానికి అమర్చిన విద్యుత్ తీగల కంచె తగులుకుని ఓ మహిళ మృతి చెందిందని సమాచారం లభించింది. దీనిపై సదరు పొలం యజమానిని పూర్తిస్థాయిలో విచారించగా అసలు విషయం బయటపడింది. పొలంలో ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగులుకుని మహిళ మృతి చెందడంతో మరికొందరి సహాయంతో సిద్దవటం సమీపంలోని పెన్నానదిలో పూడ్చినట్లు విచారణలో తేలింది. తర్వాత పెన్నానదిలో పూడ్చిన మృతదేహాన్ని వెలికి తీసి మృతదేహానికి ఉన్న చీర, జాకెట్ ఆధారంగా మృతురాలు అప్పట్లో తప్పిపోయిన రామసుబ్బమ్మగా నిర్ధారణకు వచ్చిఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో పొలం యజమాని రామకృష్ణారెడ్డితో పాటు ఇందుకు సహకరించిన లక్షుమయ్య, వెంకటయ్య, కొండయ్య, వెంకటరమణ, వెంకటసుబ్బయ్యలను అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపరిచామని, ఈ కేసులో మరొక నిందితుడిని అరెస్టు చేయాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు. కేసును చాకచక్యంగా ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన సీఐ హనుమంతనాయక్, ఎస్ఐ చంద్రశేఖర్, ఏఎస్ఐలు రాజశేఖర్‌రెడ్డి, నరసింహారావు, ఐడీపార్టీ ఏఎస్ఐలు రాంభూపాల్‌రెడ్డి, నాగేంద్ర, కానిస్టేబుళ్లు శివ, అమరేశ్వర్‌రెడ్డి, ప్రసాద్‌లను జిల్లా ఎస్పీ, మైదుకూరు డీఎస్పీలు అభినందించారు. -
బ్యూటీపార్లర్‌కు వెళ్లడంపై భర్త అభ్యంతరం.. కొంత కాలంగా ఫోన్లోనూ..
సాక్షి, హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో తల్లితో పాటు ఆమె ఇద్దరు పిల్లలు అదృశ్యమైన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. యూసుఫ్‌గూడ సమీపంలోని బ్రహ్మశంకర్ నగర్లో నివసించే భాగ్యశ్రీ (24) నాలుగున్నరేళ్ల నందిక, రెండున్నరేళ్ల ఎస్. మల్లికార్జున్ ఈ నెల 6వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అంతకుముందు భర్త మహేశ్‌తో గొడవ పడింది. ఈ నెల 4, 5 తేదీల్లో ఆమె బ్యూటీపార్లర్‌కు వెళ్లడంపై భర్త అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా కొంత కాలంగా ఫోన్లో ఇష్టానుసారంగా, టూమచ్‌గా మాట్లాడుతున్నట్లు ఆరోపించడంతో గొడవ ఎక్కువైంది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె తన ఇద్దరు పిల్లలను తీసకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ప్రేమపేరుతో బాలికను మహారాష్ట్ర తీసుకెళ్లి.. గది అద్దెకు తీసుకుని..) -
వస్తామన్న బస్సు రానే వచ్చింది.. తండ్రిని ఆగం పట్టిచ్చిన ఆన్లైన్ గేమ్స్!
భిక్కనూరు (నిజామాబాద్): మండలంలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన వ్యాపారి భార్య, ఇద్దరు కుమారులు అదృశ్యమయ్యారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై ఆనంద్‌గౌడ్ వారి ఆచూకీని నాలుగు గంటల్లోనే కనుగొనడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఏమి జరిగిందంటే.. తిప్పాపూర్ గ్రామానికి చెందిన వ్యా పారి వీరమల్లి శ్రీనివాస్‌కు భార్య శాలిని అలియాస్ అశ్విని, ఇద్దరు కుమారులు వరుణ్, లోకేష్‌లు ఉన్నారు. శాలిని తండ్రి అనారోగ్యానికి గురికావడంతో ఆమె ఇద్దరు కుమారులను తీసుకుని ఈనెల ఒకటవ తేదీ తిప్పాపూర్ నుంచి కరీంనగర్ వెళ్లి అక్కడ తండ్రిని పరామర్శించి 3వ తేదీ కరీంనగర్లో బస్సు ఎక్కి కామారెడ్డికి మధ్యాహ్నం 3.50 గంటలకు చేరుకుంది. తన భర్త శ్రీనివాస్‌కు ఫోన్‌చేసి తిప్పాపూర్ రావడానికి రామాయంపేటలో బయలుదేరుతున్నానని భిక్కనూరు నుంచి తనను తిప్పాపూర్ తీసుకెళ్లాలని సెల్ ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో సాయంత్రం 6.30 గంటలకు ఆయన భిక్కనూరు బస్టాండ్‌కు వచ్చాడు. బస్సులో రాకపోగా ఫోన్ స్విచ్ఆఫ్ కావడంతో తీవ్ర ఆందోళన చెందారు. చదవండి👉 ఏమై పోయాడో..? స్నానానికి దిగిన యువకుడు అదృశ్యం ఆమె కుమారులు సెల్ఫోన్లో గేమ్ ఆడటంతో చార్జింగ్ అయిపోయి ఫోన్ స్విచ్ఆఫ్ ఆయ్యింది. కాగా తండ్రి మీద ఉన్న మమకారంతో ఆమె తిరిగి కరీంనగర్ వెళ్ళాలని నిర్ణయించి కుమారులతో కలిసి సిరిసిల్లి బస్సు ఎక్కారు. సిరిసిల్ల నుంచి కరీంనగర్ వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో ఆ రాత్రికి అక్కడున్న బంధువుల ఇంటికి వెళ్ళారు. అయితే ఎస్సై ఆనంద్‌గౌడ్ తీవ్రంగా కృషి చేసి ఫోన్ సిగ్నల్ ఆధారంగా సిరిసిల్లలో ఉన్నట్లు గుర్తించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే స్పందించిన ఎస్సైని పలువురు అభినందించారు. చదవండి👉🏻 వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ముగ్గురి అరెస్ట్ -
ఏమై పోయాడో..? స్నానానికి దిగిన యువకుడు అదృశ్యం
గంట్యాడ: చెరువులో స్నానానికి దిగిన ఓ యువకుడు అదృశ్యం కాగా, మరో యువకుడిని స్నేహితులు రక్షించి ఆస్పత్రిలో చేర్పించారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బుడతనాపల్లి గ్రామానికి చెందిన కొంతమంది యువకులు బుధవారం ఉదయం మంచినీటి కొనేరులో స్నానానికి దిగారు. వారిలో వారాది సురేష్ మునిగిపోతుండడంతో స్నేహితులు గమనించి రక్షించి ఒడ్డుకు చేర్చి 108 అంబులెన్సులో విజయనగరంలోని తిరుమల ఆస్పత్రికి తరలించారు. అయితే వారితో పాటు స్నానానికి దిగిన కొంచాడ రామకృష్ణ కనిపించలేదు. చెరువులో ముగినిపోయాడమోనని గ్రామస్తులు వలల సాయంతో గాలించారు. అయినప్పటికీ జాడ తెలియరాలేదు. రామకృష్ణ చెరువులో మునిగిపోయాడా? లేదా సురేష్ మునిగిపోయాడనే భయంతో పారిపోయాడా? అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందనప్పటికీ సమాచారం మేరకు విచారణ చేపట్టారు. (చదవండి: విద్యార్థిని ఆత్మహత్య...కారణం అదేనా...) -
తిరుమలలో బాలుడి అపహరణ
తిరుమల: తిరుమలలో ఓ బాలుడిని గుర్తుతెలియని మహిళ అపహరించిన ఘటన సోమవారం వెలుగుచూసింది. తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్ సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతిలోని దామినేడు, కొత్త ఇండ్లకు చెందిన చవ్వా వెంకటరమణ కుటుంసభ్యులతో శ్రీవారి దర్శనార్థం ఆదివారం తిరుమలకు చేరుకున్నారు. సాయంత్రం 5.45 గంటలకు ఆయన కుమారుడు సి.గోవర్ధన్ రాయల్ అలియాస్ చింటూ (5) అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. వెంటనే పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల నిఘా నియంత్రణ కేంద్రంలో పరిశీలించగా ఆదివారం రాత్రి 7.11 గంటల సమయంలో ఓ మహిళ బాబును తీసుకుని ఆర్టీసీ బస్సులో తిరుమల నుంచి తిరుపతికి చేరుకుంది. గుండుతో ఉన్న ఈమెతో పాటు 4 నుంచి 5 సంవత్సరాల బాబును ఎవరైనా గుర్తిస్తే తిరుమల వన్‌టౌన్ పీఎస్ సీఐ ఫోన్ నంబర్ 9440796769కు లేదా తిరుమల టూటౌన్ పీఎస్ సీఐ సెల్ నంబర్ 9440796772కు సమాచారం అందించాలని కోరారు. -
ఎల్బీనగర్లో మిస్సింగ్.. ఖమ్మం జిల్లాలో మృతదేహం లభ్యం
నాగోలు: ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 16న అదృశ్యమైన వ్యక్తి ఖమ్మం జిల్లాలోని సాగర్ ప్రధాన కాల్వలో శవమై తేలిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా, రాఘవాపురం గ్రామానికి చెందిన పదిర భాను చందర్ నగరానికి వలస వచ్చి నాగోలు సాయినగర్ గుడిసెల్లో ఉంటూ సెంట్రింగ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా టీఎస్ ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పని చేస్తున్నాడు. ఈ నెల 16న ఇంటి నుంచి బయటకు వెళ్లిన భానుచందర్ తిరిగి రాలేదు. దీంతో అతని భార్య గాలింపు చేపట్టినా ఆచూకీ తెలియరాలేదు. అదే రోజు భార్యకు ఫోన్ చేసిన భానుచందర్ యాదాద్రి జిల్లా, రాయగిరిలోని ఇంటికి వస్తున్నట్లు చెప్పి ఫోన్ పెట్టేశాడు. తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళనకు గురైన అతని భార్య కావ్య ఈ నెల 17న ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ఖమ్మం జిల్లా, రఘునాథ పాలెం మండలం, మూలగూడెం వద్ద సాగర్ ప్రధాన కాల్వలో ఈనెల 21న ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీలో భద్రపరిచారు. మృతుడి ఆనవాళ్లపై పోలీస్స్టేషన్లకు సమాచారం అందించడంతో అప్పటికే అతడికోసం వెతుకుతున్న ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, సీఐ అశోక్‌రెడ్డి, తదితరులు ఆదివారం రాత్రి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాన్ని పరిశీలించారు. మృతడి వేలికి ఉన్న ఉంగరం ఆధారంగా భానుచందర్‌గా గుర్తించారు. ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసు లు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని నాగోలు సాయినగర్‌కు తీసుకువచ్చారు. పాత కక్షలతోనే భాను చందర్ హత్య... సాయినగర్ గుడిసెల్లో ఉంటున్న భాను చందర్‌కు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తులతో విబేధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు, హయత్‌నగర్ ప్రాంతానికి చెందిన మరొకరితో కలిసి భాను చందర్‌ను పథకం ప్రకారం బయటికి తీసుకెళ్లి హత్య చేసి ఖమ్మం జిల్లా, పాలేరు సమీపంలోని సాగర్ ప్రధాన కాల్వలో పారవేయగా మృతదేహం నీటిలో మూలగూడెం వరకు కొట్టు కొచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా ఇప్పటికే దర్యాప్తు చేపట్టిన ఎల్బీనగర్ పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.. నిందితులను కఠినంగా శిక్షించాలి భానుచందర్ హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మేడి పాపయ్య, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సూర్యప్రకాష్, పలువురు నాయకులు డిమాండ్ చేశారు. బీజేపీ నాయకుల ధర్నా.. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి చింతల సురేందర్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు సాయినగర్ కాలనీలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సురేందర్ యాదవ్ అక్కడే ఉన్న ఆమ్ఆద్మీ పార్టీ నాయకురాలు ఇందిరాశోభన్ పట్ల దురుసుగా ప్రవ ర్తించాడు. దీంతో పోలీసులు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. సాయినగర్ గుడిసెల వద్ద భారీ ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఫోన్లో అతిగా మాట్లాడుతున్నావని మందలించినందుకు...
సాక్షి, బంజారాహిల్స్: నెల రోజులుగా తన భార్య ఫోన్లో విపరీతంగా మాట్లాడుతుండటాన్ని గమనించి మందలించడంతో పాటు కొట్టానని ఇందుకు అలిగి తన భార్య ఇద్దరు పిల్లలను తీసుకొని అనుమానాస్పదంగా అదృశ్యమైందంటూ బాధితుడు ఎల్లప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని తల్లీ, పిల్లల కోసం గాలింపు చేపట్టారు. వివరాలివీ... మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి గ్రామానికి చెందిన ఎరుకల ఎల్లప్ప భార్య మంగమ్మ అలియాస్ పద్మ, కూతుళ్లు సువర్ణ, స్వప్నలతో కలిసి రహ్మత్‌నగర్ వీడియో గల్లీలో అద్దెకుంటున్నారు. భార్య పద్మ యూసుఫ్‌గూడ చౌరస్తాలోని ఉడుపి హోటల్లో పని చేస్తున్నది. ఎప్పటిలాగే ఈ నెల 6న డ్యూటీకి వెళ్లింది. రాత్రి ఇంటికి వచ్చి చూడగా భార్యా, పిల్లలు కనిపించలేదు. దీంతో ఉడిపి హోటల్‌కు వెళ్లి ఆరా తీయగా పద్మ తన పిల్లలతో కలిసి మధ్యాహ్నం ఇంటికి వెళ్లిపోయినట్లు చెప్పిందని వెల్లడించారు. దీంతో స్వగ్రామంతో పాటు బంధుమిత్రుల ఇళ్లల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో తన భార్య, పిల్లలు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు ఫోన్: 62813 86209లో సంప్రదించాలని పోలీసులు కోరారు. చదవండి: పారిశుద్ధ్య కార్మికులకు కేటీఆర్ పలకరింపు -
ఆమె బతికే ఉందా.. ఇంకేదైనా జరిగిందా?
వజ్రపుకొత్తూరు(శ్రీకాకుళం జిల్లా): మండలంలోని అమలపాడుకు చెందిన వివాహిత కర్ని లక్ష్మి అదృశ్యమై నెల రోజులు దాటినా ఇంకా ఆమె ఆచూకీ లభించలేదు. వజ్రపుకొత్తూరు పోలీసులు గాలిస్తున్నా ఆమె ఎక్కడ ఉన్నారో అంతు పట్టడం లేదు. ఆమె బతికే ఉందా.. ఇంకేదైనా జరిగిందా అంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సోమవారం లక్ష్మి కుమారుడు నీలకంఠం శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యు లు తెలిపిన వివరాల మేరకు.. కర్ని లక్ష్మికి తన భర్త మాధవరావుతో ఐదేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో లక్ష్మి అమలపాడు గ్రామంలో నివాసముండగా, ఆమె భర్త మాధవరావు కొబ్బరి తోటలో ఇల్లు కట్టుకుని ఒంటరిగా ఉంటున్నారు. మార్చి 6వ తేదీ నుంచి లక్ష్మి కనిపించడం లేదు. చదవండి: ఎడబాటు భరించలేక.. బదిలీ యత్నం ఫలించక.. సూసైడ్ నోట్ రాసి.. సెల్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. కుమారుడు ఎంతగా వెతికినా తల్లి ఆచూకీ లభించలేదు. దీంతో 15 రోజుల తర్వాత అతను వజ్రపుకొత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. కాల్ డేటాను సైతం పరిశీలించి భర్త మాధవరావును కూ డా విచారించారు. ఇప్పటికి నెల దాటిపోయినా కేసు లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో లక్ష్మి కుమారుడు ఎస్పీ గ్రీవెన్స్‌సెల్‌ను ఆశ్రయించాడు. గ్రామంలో కొందరిపై అనుమానంగా ఉందని, లో తుగా విచారణ చేస్తే నిజాలు బయటకు వస్తాయని ఆయన చెబుతున్నాడు. దీనిపై వజ్రపుకొత్తూరు ఎస్ఐ కూన గోవిందరావును ‘సాక్షి’ సంప్రదించగా తమకు వచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. భర్త ను కూడా విచారించామన్నారు. కుటుంబ సభ్యులు అనుమానిస్తున్న వారిని మరోసారి విచారించి కేసును త్వరగా ఛేదిస్తామని తెలిపారు. -
రామకృష్ణ పరువు హత్య! స్పందించిన భార్య భార్గవి
సాక్షి, భువనగిరి జిల్లా: అదృశ్యమైన సస్పెండెడ్ హోంగార్డు రామకృష్ణ మృతదేహాన్ని సిద్దిపేట జిల్లా కుక్కునూర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. రామకృష్ణది పరువు హత్యగా భావిస్తున్న పోలీసులు మామ వెంకటేష్ కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. తాజాగా రామకృష్ణ భార్య భార్గవి మీడియాతో మాట్లాడుతూ.. రామకృష్ణ ఇంట్లో ఉండగా జిమ్మాపూర్ సర్పంచ్ భర్త అమృతరావు ఇంటి నుంచి తీసుకెళ్లారని తెలిపారు. ఆ తర్వాత తన భర్త తిరిగిఇంటికి రాలేదని తెలిపారు. మోత్కూర్ వైపు వెళ్లారని చెప్పారు. అమృతరావుని తన భర్త గురించి అడిగితే ఇంకా రాలేదా? అని తననే ప్రశ్నించారని తెలిపారు. భూమి చూపించాలి అని తీసుకెళ్లారని అన్నారు. లతీఫ్ అనే వ్యక్తి పలుమార్లు భూమి కొనుగోలు కోసం అంటూ తన భర్త రామకృష్ణను సంప్రదించారని పేర్కొన్నారు. లతీఫ్‌ను యాకయ్య అనే వ్యక్తి రామకృష్ణకు పరిచయం చేశారని చెప్పారు. ఒకసారి తోట కావాలి అంటూ మరోసారి రోడ్డు సైడ్ భూమి కావాలంటూ నాటకమాడారని అన్నారు. దుబాయ్ నుంచి వచ్చామని లతీఫ్ చెప్పేవారంటూ తెలిపారు. రామకృష్ణను పెళ్లి చేసుకున్న నాటి నుంచి తన పుట్టింటితో సంబంధాలు లేవని పేర్కొంది. ‘మీరు చచ్చినా మాతో సంబంధం లేదని గతంలో మా నాన్న వెంకటేష్ గొడవ పెట్టుకున్నారు’ అని భార్గవి తెలిపారు. -
అదృశ్యమైన సస్పెండెడ్ హోంగార్డ్ రామకృష్ణ మృతి.. పరువు హత్య?
సాక్షి, భువనగిరి జిల్లా: అదృశ్యమైన సస్పెండెడ్ హోంగార్డు రామకృష్ణ మృతదేహం లభ్యమైంది. సిద్దిపేట జిల్లా కుక్కునూర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రామకృష్ణ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే మృతుడిని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రామకృష్ణది పరువు హత్యగా భావిస్తున్న పోలీసులు మామ వెంకటేష్ కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. వెంకటేష్ రాజపేట మండలం కాలువపల్లిలో వీఆర్వోగా పనిచేస్తుండగా.. రామకృష్ణ హత్య కేసులో మరో హోంగార్డు యాదగిరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. వివరాల్లోకి వెళితే..యాదగిరిగుట్ట చెందిన భార్గవి వలిగొండ మండలంలోని లింగరాజుపల్లి చెందిన రామకృష్ణ 2020 ఆగస్టు 16 ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్నిరోజుల పాటు లింగరాజుపల్లి ఉన్న రామకృష్ణ దంపతులు భార్గవి ప్రెగ్నెన్సీ రావడంతో భువనగిరి పట్టణంలో నివాసం ఉంటున్నారు. ఆరు నెలల క్రితం వీరికి పాప జన్మించింది. ఇటీవల రామకృష్ణ తుర్కపల్లి గుప్తా నిధులు కేసులో సస్పెన్షన్‌కు గురయ్యాడు. అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసకుంటున్నాడు. చదవండి: హైదరాబాద్‌లో విషాదం.. భర్తతో గొడవలు.. న్యాయవాది ఆత్మహత్య ఈ నేపథ్యంలో హైదరాబాద్ చెందిన లతీఫ్ అనే వ్యక్తి భూమి చూపించడానికి ఏప్రిల్ 15న రామకృష్ణను హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. ఇంటి నుంచి వెళ్లిన రామకృష్ణ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన ఆయన భార్య భార్గవి శనివారం ఉదయం టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రామకృష్ణను ట్రాప్ చేసి హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భార్గవి కుటుంబ సభ్యులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని ఆరోపిస్తున్నారు. -
పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి కూతురుతో కలిసి
సాక్షి, పటాన్చెరు టౌన్: పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి కూతురుతో వెళ్లిన మహిళ అదృశ్యమైన సంఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సాయిలు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పటాన్చెరు పట్టణంలోని మంజీర పంప్ హౌస్‌లో చంద్రకుమార్ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 11 తేదీ ఉదయం చంద్రకుమార్ భార్య ఊర్మిళ, రెండున్నర సంవత్సరాల కూతురు జాహ్నవితో కలసి హైదరాబాద్ అఫ్జల్‌గంజ్‌లో ఉంటున్న పుట్టింటికి వెళ్తున్నామని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. అదే రోజు మధ్యాహ్నం చంద్రకుమార్ భార్యకు ఫోన్‌చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ మెస్సేజ్ రావడంతో అత్తగారింటికి ఫోన్‌చేయగా ఇంకా రాలేదని చెప్పారు. భార్య, కూతురు కోసం తెలిసిన వారిని, బంధువులను విచారించినా వారి ఆచూకీ లభించలేదు. దీంతో చంద్రకుమార్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
బంధువుల ఇంటికి వెళ్లొస్తానని చెప్పి..
సాక్షి, హైదరాబాద్: బంధువుల ఇంటికి వెళ్లొస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన తల్లీకూతుళ్లు అదృశ్యమైన ఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సురేష్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. లాలాపేటలోని గవర్న్మెంట్ స్కూల్ సమీపంలో నివాసముంటున్న సయ్యద్ అసీమ్, ఆఫ్రీన్ బేగం దంపతులు. వీరికి 8 నెలల అయాత్ అనే కూతురు సంతానం. ఈ నెల 6న మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆఫ్రీన్ బంధువుల ఇంటికి వెళ్లొస్తానని చెప్పి తన కూతురు అయాత్ను తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. రాత్రైనా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఆఫ్రీన్‌కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. బంధువులను, తెలిసిన వారిని వాకబు చేసినా ఫలితం కనిపించకపోవడంతో లాలాగూడ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. లాలాపేట: బాలుడు అదృశ్యమైన ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌కు చెందిన వరుణ్(10) ఈ నెల 5న మాణికేశ్వర్‌నగర్‌లో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి తల్లిదండ్రులతో కలిసి వచ్చాడు. తిరిగి వెళ్తామని అనుకుంటున్న సమయంలో ఈ నెల 6న మధ్యాహ్నం ఇంటి బయట ఆడుకుంటున్న వరుణ్ కనిపించకుండా పోయాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికిననా ఫలితం లేదు. దీంతో తండ్రి యశ్వంత్ ఓయూ పోలీస్‌స్టేషన్‌లో ఫిరాద్యు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
యువతి అదృశ్యం కేసు.. అనేక మలుపులు.. అసలేం జరిగిందంటే..
సాక్షి, తూర్పుగోదావరి: పిఠాపురం పట్టణంలో కలకలం రేపిన యువతి అదృశ్యం కేసును 24 గంటల్లో ఛేదించినట్టు, ఆమెను తల్లిదండ్రులకు అప్పగించినట్టు కాకినాడ డీఎస్పీ భీమారావు తెలిపారు. యువతి మానసిక స్థితి బాగోలేక విజయవాడ స్నేహితుల దగ్గరకు వెళ్లి పోగా సాంకేతిక పరిజ్ఞానంతో ఆమె ఆచూకీ తెలుసుకుని అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించామని ఆయన తెలిపారు. ఆమె ఆటో ఎక్కినట్టు తప్పుడు సమాచారం ఇచ్చిందన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన కథనాలన్నీ అభూతకల్పనలుగా ఆయన కొట్టిపారేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం సీఐ వైఆర్కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేసులో అనేక మలుపులు పరీక్షల హాల్ టిక్కెట్ తెచ్చుకోవడానికి వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన ఒక యువతి అదృశ్యమైన ఈ ఘటన జిల్లా పోలీసులకు సవాల్‌గా మారింది. ఆటో ఎక్కితే డ్రైవరు ఏడిపిస్తున్నాడు అంటూ ఆమె మెసేజ్ పంపినట్టు సోషల్ మీడియాలో వచ్చినవన్నీ అబద్దాలని (ఆ సమయంలో ఆమె కాకినాడ ఆర్టీసీ బస్టాండ్‌లో కనిపించింది) సీసీ పుటేజీల ఆధారంగా పోలీసులు నిర్ధారించారు. అసలేం జరిగిందంటే.. డిగ్రీ విద్యార్థిని అయిన ఆమె కొన్ని రోజులుగా ఇంటి వద్దే చదువుకుంటోంది. సోమవారం మధ్యాహ్నం కాకినాడలో తాను చదువుకుంటున్న కాలేజీ నుంచి హాల్ టిక్కెట్ తెచ్చుకుంటానని వెళ్లింది. పిఠాపురంలో ఉప్పాడ బస్టాండ్‌కు వెళ్లి కాకినాడ వెళ్లేందుకు ప్రైవేటు బస్ ఎక్కింది. కొంత సేపటికే సెల్ స్విచ్ ఆఫ్ అయ్యింది. తరువాత ఆమె కాకినాడ భానుగుడి సెంటర్లో బస్ దిగి, అక్కడి నుంచి ఆటోలో బస్టాండ్‌కు వెళ్లి ఉంటుందని పోలీసులు అనుకున్నారు. చదవండి: టీడీపీ: పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున బట్టబయలైన విభేదాలు కట్టు కథేనా? సోమవారం రాత్రి 10–30 గంటల సమయంలో ఒకసారి ఆమె ఫోన్ ఆన్ అయినట్టు ఒక కాల్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. మంగళవారం తెల్లవారుజామున ఆమె తన స్నేహితుల సోషల్ మీడియా గ్రూపుల నుంచి తప్పుకోవడం సెల్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. దీంతో సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు కట్టు కథగా పోలీసులు భావించారు. అసలు ఆమె అలా ఎందుకు వెళ్లింది..? ఎక్కడకు వెళ్లింది అని దర్యాప్తు చేశారు. ఆమె సెల్ నుంచి సిమ్ తీసేయడంతో పోలీసులు దర్యాప్యులో ఇబ్బంది పడ్డారు. పోలీసులు వారికి కనీస సమాచారం ఇవ్వకుండా తన స్పేహితురాలు ఆపదలో ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టడం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె ఫొటోలతో సహా పోస్టింగ్‌లు పెట్టడం నేరమంటున్నారు పోలీసులు. -
హారిక మిస్సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు
సాక్షి, కాకినాడ(తూర్పుగోదావరి): పిఠాపురంలో అదృశ్యమైన విద్యార్థిని హారిక మిస్సింగ్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఉప్పాడ సెంటర్లో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న హారిక విజివల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మూల మలుపు వద్ద బ్లూ కలర్ బస్సు ఎక్కుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. చదవండి: బాలికకు మాయమాటలు చెప్పి బైక్‌పై ఎక్కించుకుని.. అయితే హారిక అంతకు ముందు తాను ఆటోలో వస్తున్నానని.. ఆటో డ్రైవర్ ప్రవర్తన తేడాగా ఉందంటూ తన స్నేహితురాలికి వాట్సాప్‌లో మెసేజ్ పెట్టింది. ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. అదే సమయంలో కొన్ని వాట్సాప్ గ్రూప్‌ల నుంచి లెఫ్ట్ అయినట్లు పోలీసులు గుర్తించారు. హారిక కోసం ఐదు బృందాలుగా ఏర్పడి పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. అదృశ్యమైన విద్యార్థిని బీబీఏ మూడవ సంవత్సరం చదువుతోంది. హాల్ టికెట్ కోసం హారిక పిఠాపురం నుంచి కాకినాడ వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. -
డ్రెస్ కొనుక్కుంటానని చెప్పి బయటకు వెళ్లి..
సాక్షి, దుండిగల్: ఓ మహిళ కుమారుడితో సహా అదృశ్యమైన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రం సంస్తాన్‌పూర్‌కు చెందిన చంచల్ పాశ్వాన్, చాందిని దేవిలు భార్యాభర్తలు. కాగా వీరికి ముగ్గుకు సంతానం. బతుకు దెరువు కోసం వీరు నగరానికి వలస వచ్చి దుండిగల్ మున్సిపాలిటీ గండిమైసమ్మలోని 120 గజాల్లో నివాసముంటున్నారు. చంచల్ పాశ్వాన్ కూలీ పనులు చేస్తుండగా, అతడి భార్య ఇంటి వద్దనే ఉంటోంది. కాగా ఈ నెల 20న మధ్యాహ్నం 2 గంటల సమయంలో చాందినిదేవి తన చిన్నకుమారుడు యువరాజ్(3)ను వెంట బెట్టుకుని డ్రెస్ కొనుక్కుంటానని చెప్పి బయటకు వెళ్లింది. రాత్రైనా ఆమె ఇంటికి రాకపోవడంతో భర్త వారి కోసం చుట్టు పక్కల వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సోమవారం దుండిగల్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు పిల్లలతో కలిసి సికింద్రాబాద్‌లో రైలు ఎక్కింది.. చెన్నైలో దిగలేదు..
సాక్షి, సికింద్రాబాద్: నగరం నుంచి చెన్నైకి రైలు ప్రయాణం ద్వారా వెళ్లాల్సిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలు అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చెన్నైలో ఉంటున్న లలిత (23), తన కుమారులు వీరా (07), ఆశిష్ (05)తో కొద్ది రోజుల క్రితం ఒక వివాహానికి హాజరయ్యేందుకు నగరానికి వచ్చారు. తిరిగి చెన్నై వెళ్లేందుకు ఈ నెల 22న ఉప్పుగూడ నుంచి ఆటోలో లలిత తన తల్లి కమ్లి ఇద్దరు పిల్లలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. లలిత, ఆమె పిల్లలను చెన్నై ఎక్స్‌ప్రెస్ రైలు (ఎస్4–34) బోగీలో ఎక్కించిన కమ్లి సెండాఫ్ చేసి ఉప్పుగూడకు వెళ్లిపోయింది. మరుసటి రోజు చెన్నైలో దిగాల్సిన లలిత ఆమె పిల్లలు కనిపించకుండా పోయారు. లలిత ఆమె పిల్లలు అదృశ్యమయ్యారన్న సమాచారాన్ని ఆమె భర్త హరి ద్వారా తెలుపుకున్న ఆమె కుటుంబ సభ్యులు పలు చోట్ల వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్ కూడా స్వచ్చాఫ్ రావడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లలిత ఆమె పిల్లల ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. ‘గాంధీ’లో గిదేందీ!