నాలుగేళ్ల క్రితం మిస్సింగ్ కేసుగా నమోదైన ఒక వ్యక్తి అస్థిపంజరం నిందితుడి ఇంట బయటపడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నారా గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...అదే గ్రామానికి చెందిన మహ్మద్ హసన్ 2018లో కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు పోలీసులు.
అతన్ని ఎవరైనా హత్య చేశారా అనేది తేలక అలా ఆ మిస్సింగ్ కేసు ఆధారాలు లేనిపెండింగ్ కేసుగా ఉండిపోయింది. ఐతే సదరు నిందితుడు కొద్దిరోజుల క్రితం కొంతమంది వ్యక్తుల వద్ద మహ్మద్ హసన్‌ని తానే చంపి తన ఇంట్లో పాతిపెట్టినట్లు చెప్పాడు. దీన్ని ఆయా వ్యక్తులు రికార్డు చేసి నెట్టింట పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.
దీంతో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి సదరు నిందితుడి ఇంటి వద్ద తనిఖీ చేపట్టారు. నిందితుడి ఇంట్లో జరిపిన తవ్వకాల్లో హసన్ అస్తిపంజరం బయటపడింది. ఈ మేరకు మన్సూర్‌పూర్ పోలీస్టేషన్ ఆఫీసర్ బిజేంద్ర సింగ్ రావత్ మాట్లాడుతూ...వీడియో నెట్టింట రికార్డు కావడంతో హసన్ కుటుంబ సభ్యులు తమకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఆ తర్వాత తాము అతని ఇంటి వద్ద తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు. ఆ ఆస్తిపంజరాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపినట్లు తెలిపారు. అతను ఆ వైరల్ వీడియోలో నేరం చేసినట్లు అంగీకరించడాని పేర్కొన్నారు.
(చదవండి: కూతురిని చంపి ఆత్మహత్యగా నాటకం...పట్టించిన మొబైల్ ఫోన్)
Comments
Please login to add a commentAdd a comment