forensic laboratory
-
ప్రజ్వల్‌కు చీర చిక్కు
బనశంకరి: మహిళలపై అత్యాచారం కేసులో అరెస్టైన జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బాధితురాలి చీర పెద్ద సమస్య తీసుకువచ్చే అవకాశం ఉంది. ఆ మహిళ చీరను ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలకు పంపారు. బాధితురాలి నుంచి నాలుగు చీరలను స్వాదీనం చేసుకున్న సిట్ అధికారులు వాటిని ల్యాబ్‌కు పంపించారు. చీరల్లో వీర్యం, వెంట్రుకలు లభించినట్లు తేలింది. దీంతో ఇవి ఎవరివో తెలుసుకోవడానికి ప్రజ్వల్ రేవణ్ణకు డీఎన్ఏ పరీక్షలు చేపట్టారు. అవి ప్రజ్వల్వే అని నిర్ధారణ అయితే కేసు మరింత బిగుసుకునే అవకాశం ఉంది. ఇంటి పనిమనిషిపై అత్యాచారం కేసులో ప్రజ్వల్‌పై కోర్టులో సిట్ చార్జిషీట్ దాఖలు చేయగా, అందులో ఈ డీఎన్ఏ పరీక్షల తతంగాన్ని పేర్కొన్నారు. అంతేగాక వైద్య పరీక్షల నివేదిక పెండింగ్‌లో ఉంది. ల్యాబ్ నుంచి నివేదిక అందిన వెంటనే అదనపు చార్జిషిట్ వేస్తామని కోర్టుకు సిట్ తెలిపింది. గదిలోకి పిలిచి అఘాయిత్యం హొళెనరసిపురలో బన్నికోడ ఫాంహౌస్‌లో ప్రజ్వల్ మంచి నీరు తేవాలని మహిళకు సూచించాడు. చెంబులో నీరు తీసుకుని రూమ్‌లోకి వెళ్లగానే ప్రజ్వల్ తలుపులు లాక్‌చేసి నా దుస్తులు తొలగించి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆపై వీడియో తీశాడు. బెంగళూరు బసవనగుడి ఇంట్లో పనిచేయడానికివెళ్లినప్పుడు కూడా ప్రజ్వల్ ఇదేవిధంగా ప్రవర్తించాడు. ఇళ్లు తుడవడానికి గదిలోకి పిలిచాడు, నేను వెళ్లకపోవడంతో గదమాయించాడు. గదిలోకి వెళ్లగానే తలుపు గడియ పెట్టి అత్యాచారం చేశాడు. ఎక్కడైనా నోరువిప్పితే వీడియో నీ కుమారునికి చూపిస్తానని బెదిరించారు. ఎంపీ అనే భయంతో మౌనంగా ఉండిపోయాను అని బాధిత మహిళ వాంగ్మూలం ఇచ్చినట్లు చార్జిషిట్‌లో తెలిపారు. -
బెంగళూరు కేఫ్‌లో బాంబు పేలుడు
సాక్షి, బెంగళూరు: బాంబు పేలుడు ఘటనతో బెంగళూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరంలో నిత్యం రద్దీగా ఉండే వైట్‌ఫీల్డ్ పరిధిలోని బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్‌లో మధ్యాహ్నం వేళ ఈ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కేఫ్ సిబ్బందిసహా 10 మంది గాయపడ్డారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా పేలుడు సంభవించిందని తొలుత అందరూ భావించారు. 30 ఏళ్లలోపు వయసు వ్యక్తి ఒకరు ఆ కేఫ్‌లోని హ్యాండ్‌వాష్ వద్ద ఉన్న చెత్తబుట్టలో ఒక బ్యాగును పడేసి వెళ్లినట్లు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. అత్యాధునిక పేలుడు పదార్థం(ఐఈడీ) వల్లే ఈ పేలుడు సంభవించిందని బాంబు నిరీ్వర్య బలగాలు, ఫోరెన్సిక్స్ ల్యాబోరేటరీ, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బృందాలు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఆ వ్యక్తిని గుర్తించారు. టోకెన్ కౌంటర్ వద్ద రవ్వ ఇడ్లీ ఆర్డర్ చేసిన ఆ వ్యక్తి తర్వాత తినకుండా వెళ్లిపోయినట్లు సీసీటీవీలో రికార్డయింది. పోయేముందు ఒక బ్యాగును అక్కడి హ్యాండ్‌వాష్ దగ్గరి చెత్తబుట్టలో పడేసినట్లు కనిపిస్తోంది. ఒక గంట తర్వాత బాంబు పేలింది. ఐఈడీ బాంబును టైమర్ సాయంతో పేల్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలిని కర్ణాటక డీజీపీ సందర్శించారు. ‘ ఈ బాంబు పేలుడు ఘటనలో ఇప్పటికే లభించిన ఆధారాల సాయంతో దర్యాప్తు ముమ్మరం చేశాం’ అని రాష్ట్ర డీజీపీ అలోక్ మోహన్ చెప్పారు. ‘‘కేఫ్‌లో తినేందుకు అప్పుడే అక్కడికొచ్చాం. 40 మంది దాకా ఉన్నాం. ఒక్కసారిగా భారీ పేలుడు జరగడంతో ప్రాణభయంతో పరుగులు తీశాం’’ అని ప్రత్యక్ష సాక్షులు ఎడిసన్, అమృత్ చెప్పారు. ఎన్ఐఏ బృందం ఘటనాస్థలిని సందర్శించింది. పేలుడు స్థలంలో బ్యాటరీ, వైర్లను గుర్తించారు. కేవలం పది సెకండ్ల వ్యవధిలో రెండు పేలుళ్లు సంభవించాయని కెఫే ఎండీ, సహ వ్యవస్థాపకురాలు దివ్య చెప్పారు. దుండగులను వదలిపెట్టం కేఫ్‌లో పేలుడుకు ఐఈడీ బాంబే కారణమని ఆ రాష్ట్రముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ‘‘నిందితులను గుర్తించి చట్టం ముందు నిలబెడతాం. ఈ ఘటన వెనుక ఉన్నది ఎంతటి వారైనా విడిచి పెట్టేది లేదు’ అని శుక్రవారం మైసూరులో వ్యాఖ్యానించారు. ‘‘ ఘటనపై పోలీసు శాఖ దర్యాప్తు చేపట్టింది. సీసీకెమెరాల ద్వారా నిందితుల ఆచూకీ గుర్తించేందుకు చర్యలు చేపట్టాం. ఇది ఉగ్రవాదుల పనిలా లేదు. పేలుడు ఘటన వెనుక ఉన్నవారిని కఠినంగా శిక్షిస్తాం’ అని సీఎం అన్నారు. -
డెక్కన్ మాల్ ఘటన.. ఇక మిగిలింది బూడిదేనా?
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట డెక్కన్ మాల్ అగ్నిప్రమాద ఘటనలో.. గల్లంతైన ముగ్గురు వర్కర్ల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ప్రమాదం జరిగి ఇన్నిరోజులైనా కనీసం మృతదేహాల జాడ గుర్తించకపోవడం, మృతదేహాలు లభ్యమైనట్లు గందరగోళ ప్రకటనల నడుమ బాధితుల బంధువులు శోక సంద్రంలో మునిగిపోతున్నారు. మరోవైపు బిల్డింగ్ నుంచి ఇంకా పొగలు వస్తుండడంతో ఆదివారం మరోసారి ఫోమ్ జల్లుతున్నారు ఫైర్ సిబ్బంది. ఇక భవనంలో మొదటి మూడు ఫ్లోర్లలోని లోపలి భాగం స్లాబ్‌లు కుప్పకూలిపోయాయి. ఈ స్లాబ్‌ల కిందే మృతదేహాల అవశేషాలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు ఆదివారం అన్ని ఫ్లోర్లను క్షుణ్ణంగా పరిశీలించిన డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది కీలక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బూడిద ద్వారా ఆనవాలు గుర్తించేందుకు యత్నిస్తున్నారు. బిల్డింగ్ లోపల బూడిద శాంపిల్స్‌ను క్లూస్ టీం ద్వారా సేకరించారు. ఆ శాంపిల్స్‌ను అధికారులు ల్యాబ్‌కి తరలించారు. బాధితులను గుజరాత్‌కు చెందిన జునైద్, వసీం, అక్తర్‌గా గుర్తించారు. సెల్ఫోన్ల ఆధారంగా వాళ్లు ప్రమాద సమయంలో భవనంలోనే చిక్కుకుని ఉంటారని అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. ఇక మృత దేహాల ఆచూకీ లభ్యం అయిన తర్వాతే.. భవనాన్ని అత్యాధునిక పద్ధతుల్లో చుట్టుపక్కల భవనాలకు డ్యామేజ్ వాటిల్లకుండా కూల్చేసే అవకాశం ఉంది. -
తుప్పుపట్టిన కేబుళ్లు, వదులైన బోల్టులు.. మోర్బి ఘటనలో షాకింగ్ నిజాలు..!
గాంధీనగర్: 135 మంది అమాయకులు చనిపోయిన గుజరాత్ మోర్బి కేబుల్ బ్రిడ్జ్ విషాద ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదానికి కారణం బ్రిడ్జిని పునరుద్ధరించేందుకు నియమించిన కాంట్రాక్టర్లేనని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) ప్రాథమిక దార్యాప్తులో తేలింది. స్థానిక కోర్టుకు సమర్పించిన ఈ నివేదిక కీలక విషయాలను వెల్లడించింది. బ్రిడ్జిని పునరుద్ధరించిన కాంట్రాక్టర్లు కేవలం మెటల్ ఫ్లోరింగ్‌ను మాత్రమే మార్చారని నివేదిక పేర్కొంది. తుప్పుపట్టిన కేబుళ్లు, వదులుగా ఉన్న బోల్టులు, విరిగిన యాంకర్ పిన్స్ వంటి కీలక సమస్యలను పట్టించుకోలేదని తెలిపింది. కొత్తగా వేసిన మెటల్ ఫ్లోరింగ్ వల్ల వంతెన బరువు పెరిగినట్లు వెల్లడించింది. అసలు వంతెన పునరుద్ధరించేందుకు నియమించిన రెండు సంస్థలకు బ్రిడ్జిలకు మరమ్మతులు చేసే అర్హతే లేదనే షాకింగ్ విషయాన్ని నివేదిక బహిర్గతం చేసింది. నిపుణుడి సలహా తీసుకోకుండానే.. ప్రజల కోసం బ్రిడ్జిని తిరిగి ఓపెన్ చేసే ముందు సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఒరెవా గ్రూప్ ఎలాంటి నిపుణుడి సలహా తీసుకోలేదని నివేదిక స్పష్టం చేసింది. ఘటన జరిగిన అక్టోబర్ 30న ఈ సంస్థ 3,615 టికెట్లను విక్రయించిందని, బ్రిడ్జికి రెండువైపులా ఉన్న బుకింగ్ ఆఫీస్‌ల మధ్య సమన్వయం లేదని చెప్పింది. బ్రిడ్జి కూలినప్పుడు సామర్థ్యానికి మించి 250-300 మంది దానిపై ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఈ బ్రిడ్జిని రినోవేట్ చేసేందుకు గుజరాత్‌లోని ధ్రాగధ్రాకు చెందిన దేవ్ ప్రకాశ్ సోల్యుషన్ సంస్థను నియమించింది ఒరెవా సంస్థ. ఈ బ్రిడ్జ్ నిర్వహణ బాధ్యతలను ఒరెవానే చూసుకుంటోంది. మరమ్మతులు చేసినప్పుడు బ్రిడ్జి మెటల్‌ను మాత్రమే మార్చామని దేవ్ ప్రకాశ్ సొల్యూషన్స్ కోర్టులో అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 9 మందిని అరెస్టు చేశారు అధికారులు. వీరిలో ఒరెవా గ్రూప్ మేనెజర్లు దీపక్ పర్కేష్, దినేశ్ దావే సహా ఈ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులు ఉన్నారు. దేవ్ ప్రకాశ్ సొల్యూషన్ సంస్థ ఓనర్లు ప్రకాశ్ పర్మార్, దేవంగ్ పర్మార్ కూడా అరెస్టయ్యారు. వీరంతా బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పు ఇవ్వాల్సి ఉంది. చదవండి: మసాజ్ వీడియో మరువకముందే మరొకటి.. జైలులో ఆప్ మంత్రికి పసందైన విందు.. -
నాలుగేళ్ల క్రితం మిస్సింగ్ కేసు...నిందితుడి ఇంట అస్తిపంజరం...
నాలుగేళ్ల క్రితం మిస్సింగ్ కేసుగా నమోదైన ఒక వ్యక్తి అస్థిపంజరం నిందితుడి ఇంట బయటపడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నారా గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...అదే గ్రామానికి చెందిన మహ్మద్ హసన్ 2018లో కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు పోలీసులు. అతన్ని ఎవరైనా హత్య చేశారా అనేది తేలక అలా ఆ మిస్సింగ్ కేసు ఆధారాలు లేనిపెండింగ్ కేసుగా ఉండిపోయింది. ఐతే సదరు నిందితుడు కొద్దిరోజుల క్రితం కొంతమంది వ్యక్తుల వద్ద మహ్మద్ హసన్‌ని తానే చంపి తన ఇంట్లో పాతిపెట్టినట్లు చెప్పాడు. దీన్ని ఆయా వ్యక్తులు రికార్డు చేసి నెట్టింట పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి సదరు నిందితుడి ఇంటి వద్ద తనిఖీ చేపట్టారు. నిందితుడి ఇంట్లో జరిపిన తవ్వకాల్లో హసన్ అస్తిపంజరం బయటపడింది. ఈ మేరకు మన్సూర్పూర్ పోలీస్టేషన్ ఆఫీసర్ బిజేంద్ర సింగ్ రావత్ మాట్లాడుతూ...వీడియో నెట్టింట రికార్డు కావడంతో హసన్ కుటుంబ సభ్యులు తమకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఆ తర్వాత తాము అతని ఇంటి వద్ద తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు. ఆ ఆస్తిపంజరాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపినట్లు తెలిపారు. అతను ఆ వైరల్ వీడియోలో నేరం చేసినట్లు అంగీకరించడాని పేర్కొన్నారు. (చదవండి: కూతురిని చంపి ఆత్మహత్యగా నాటకం...పట్టించిన మొబైల్ ఫోన్) -
కలకలం: పోలీసు అధికారుల ఇళ్లపై డ్రోన్ కెమెరా
సాక్షి, బంజారాహిల్స్ (హైదరాబాద్): జూబ్లీహిల్స్ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో నివసించే కొందరు పోలీసు ఉన్నతాధికారుల ఇళ్లపై డ్రోన్ కెమెరా తిరుగుతుండటం కలకలం రేపింది. మూడ్రోజుల క్రితం ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, తెలంగాణ అదనపు డీజీపీ రవిగుప్తా నివాసాలపైన డ్రోన్ కెమెరా ఐదారుసార్లు తిరగడాన్ని సిబ్బంది గుర్తించారు. ఓ పోలీసు ఉన్నతాధికారి సతీమణి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు రంగంలోకి దిగి, పక్కింట్లో ఉన్న ఓ యువకుడు ఈ డ్రోన్‌ను వినియోగించినట్లు తేల్చారు. కెమెరా ఫుటేజీని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. డ్రోన్‌ను ఇళ్లపై ఎందుకు తిప్పారు? ఏయే ఫొటోలు తీశారు? అనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. -
సుశాంత్ విసెరాను సరిగా భద్రపరచలేదు
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించిన కేసులో మరో కీలక విషయం వెలుగు చూసింది. సుశాంత్ మృతదేహం నుంచి సేకరించిన కీలమైన అవయవాలు(విసెరా) సంబంధించి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఫోరెన్సిక్ బృందం పలు అనుమానాలను వ్యక్తం చేసింది. అదే విధంగా అవయవాల (విసెరా)ను సరిగా భద్రపరచలేదని తెలిపింది. ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడిసిన్, టాక్సికాలజీ విభాగానికి అందిన విసెరా చాలా తక్కువ పరిమాణంలో ఉందని, కొంత మేరకు క్షీణించిందని అధికారులు తెలిపారు. (సస్పెన్స్ థ్రిల్లర్‌కు ఏమాత్రం తీసిపోని కేసు) ఎయిమ్స్ బృందం ఆదివారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిట్)ను కలువనుంది. ఎయిమ్స్ బృందం సుశాంత్‌కి సంబంధించిన పలు నివేదికలు సిట్‌కి అందించనున్నారు. సుశాంత్ మృతికి గల కారణాన్ని నిర్ధారించడంలో కీలకమైన విసెరాను శుక్రవారం ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందం పరీక్షించింది. అయితే సుశాంత్ అవయవాల (విసెరా) క్షీణించిందని, దాని వల్ల రసాయన, టాక్సికాలజికల్ విశ్లేషణ చేయడం కష్టతరంగా మారిందని ఎయిమ్స్ అధికారులు పేర్కొన్నారు. జూన్ 14న సుశాంత్ తన ముంబై ఇంటిలో ఉరివేసుకుని చనిపోయిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సుశాంత మృతిపై పలు అనుమానాలు వ్యక్తం కావటంతో సీబీఐ విచారణ జరుపుతోంది. (కరణ్ జోహార్ డ్రగ్ పార్టీపై ఎన్సీబీ కన్ను) -
9 హత్యల కేసు: ఫోరెన్సిక్ ల్యాబ్‌కు శాంపిళ్లు
వరంగల్ అర్బన్, గీసుకొండ : గొర్రెకుంట హత్యల కేసులో 9 మంది మృత దేహాలకు ఈనెల 22న వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం సందర్భంగా మృత దేహాల నుంచి పరీక్షల కోసం గుండె, కాలేయంతో పాటు శరీరం లోపలి పలు అవయవాలు, ఊపిరితిత్తుల్లో నిల్వ ఉన్న ద్రవం, బావిలోని నీటి శాంపిళ్లు.. ’విశ్రా’ను సేకరించి తొమ్మిది బాక్సుల్లో భద్రపరిచారు. వీటిని శుక్రవారం హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు గీసుకొండ పోలీసులు తీసుకుని వెళ్లారు. నిపుణులు ల్యాబ్‌లో పరీక్షించి 15 రోజుల్లో నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఈ నివేదిక ఆధారంగా హత్యకు సంబంధించిన ఫోరెన్సిక్ ఆధారాలు నమోదు చేయనున్నారు.(హైదరాబాద్ నుంచి ‘క్లూ’స్ టీం) -
నిమ్మగడ్డ లేఖ బయటి నుంచే
రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ లేఖ వెనుక దాగి ఉన్న అనుమానాలు నిగ్గుతేలుతున్నాయి.తాజాగా ఆ లేఖ ఎస్ఈసీ కార్యాలయంలో తయారు కాలేదని ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించింది. సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ లేఖ వెనుక దాగిన లెక్కలేనన్ని అనుమానాలు ఒక్కొక్కటిగా నిగ్గుతేలుతున్నాయి. కేంద్ర హోంశాఖకు నిమ్మగడ్డ రాసినట్లుగా చెబుతున్న లేఖకు సంబంధించి సీఐడీ దర్యాప్తులో ఇప్పటికే పలు కీలక విషయాలు రాబట్టింది. తాజాగా ఆ లేఖ ఎస్ఈసీ కార్యాలయంలో తయారు కాలేదని సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించింది. ఈమేరకు ఫోరెన్సిక్ నివేదిక సీఐడీకి చేరింది. కేసు దర్యాప్తులో తాజా పరిణామాలపై సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్ మంగళవారం మాట్లాడుతూ ఏమన్నారంటే.. ► రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు నిమ్మగడ్డ లేఖ పేరుతో కుట్ర జరిగిందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దర్యాప్తు చేపట్టాం. ► ఎస్ఈసీ సహాయ కార్యదర్శి సాంబమూర్తి మాటల్లో పరస్పర విరుద్ధమైన అంశాలున్నాయి. చాలా ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పలేకపోయారు. ‘లెటర్ టు హోం సెక్రటరీ’ అనే ఫైల్‌ను ఎందుకు ధ్వంసం చేశారంటే అది రహస్యం అన్నారు. మరి అంత రహస్యం అయితే ఆ లేఖ మీడియాలో యధాతథంగా ఎలా వచ్చిందనే ప్రశ్నకు సమాధానం లేదు. వెరీ కాన్ఫిడెన్షియల్ అనుకున్నప్పుడు ఆ లేఖ తాలూకు ఫైల్ ఒక్కటే డిలీట్ చేయాలి గానీ మొత్తం ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ సిస్టమ్ ఎందుకు డిలీట్ చేశారంటే జవాబు లేదు. ► సాంబమూర్తిని విచారించి నాలుగు పరికరాలు సీజ్ చేశాం. డెల్ ల్యాప్‌టాప్, లెనోవా డెస్క్‌టాప్, స్కానర్, మోటరోలా ఫోన్‌ను విశ్లేషణ కోసం సైబర్ ఫోరెన్సిక్‌కు పంపించాం. వీటిని పరీక్షించిన సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు అసలు వాటిలో ఎస్ఈసీ లేఖ తయారు కాలేదని నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చారు. వి.విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో వ్యక్తం చేసిన అనుమానాలకు బలం చేకూర్చే విధంగా సైబర్ ఫోరెన్సిక్ నివేదిక ఉంది. ► ఫోరెన్సిక్ నివేదికను బట్టి ఎస్ఈసీలో ఆ లేఖ తయారు కాలేదని తేలింది. ఆ లేఖ ముందుగానే తయారై బయటి నుంచి వచ్చిందని నిర్ధారణ అయింది. మార్చి 18వ తేదీ పెన్‌డ్రైవ్‌లో ఆ లేఖ రమేష్‌కుమార్ వద్దకు చేరింది. వెలుగులోకి వాస్తవాలు మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ లేఖ వెనుక రాష్ట్ర ప్రభుత్వాన్ని దెబ్బతీసే కుట్ర దాగి ఉందని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కేంద్ర హోంశాఖ కార్యదర్శికి నిమ్మగడ్డ రాసిన లేఖపై తొలి నుంచి అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ లేఖ టీడీపీ కార్యాలయంలో తయారైందనే ఆరోపణలున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ సందర్భంగా రమేష్ కుమార్ చేసిన సంతకానికి, కేంద్ర హోంశాఖకు పంపిన లేఖలో ఉన్న సంతకానికి పొంతన లేదని ఫిర్యాదులో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన సీఐడీ పలు కీలక ఆధారాలు సేకరించడంతో నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘ఎన్నికల కమిషనర్’ ఆర్డినెన్స్ వ్యాజ్యాల్లో విచారణ 7కి వాయిదా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని, సర్వీసు నిబంధనలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్, తదానుగుణ జీవోలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు మంగళవారం హైకోర్టులో వాదనలను ముగించారు. ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, కొత్త ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ్ తదితరుల వాదనలు వినేందుకు విచారణను కోర్టు ఈనెల 7కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం, శుక్రవారం మధ్యాహ్నం వరకు ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, ఎన్నికల కమిషనర్ వాదనలు వింటామని, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పిటిషనర్ల తరఫు న్యాయవాదుల తిరుగు సమాధానాలు వింటామని ధర్మాసనం పేర్కొంది. -
పేద విద్యార్థులకు ఆన్లైన్ డిగ్రీ
న్యూఢిల్లీ: త్వరలో ప్రారంభించనున్న నూతన విద్యావిధానంలోని పలు అంశాలను నిర్మలా సీతారామన్ వివరించారు. ఉన్నతవిద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రుణాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. పబ్లిక్ప్రైవేటు పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో జాతీయ పోలీస్ యూనివర్సిటీ, జాతీయ ఫోరెన్సిక్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తారు. వాటిని జిల్లా మెడికల్ కాలేజీలతో అనసంధానిస్తారు. అలాగే పేదవిద్యార్థులకు ఆన్లైన్లో డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తెస్తారు, ఇండియాలో చదివేందుకు ఆసక్తి చూపే ఆసియా–ఆఫ్రికా విద్యార్థులకు ఇండ్–సాట్ పేరిట ప్రత్యేక పరీక్ష నిర్వహించి, ప్రతిభావంతులకు ఉపకార వేతనం కూడా అందించనున్నారు. ముఖ్యాంశాలు.. 1. ఉన్నత విద్య అందుబాటులో లేని బలహీన, ఆర్థికంగా వెనకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు ఆన్లైన్ డిగ్రీ కోర్సులను అందుబాటులోకి రానున్నాయి. దేశంలో టాప్ 100 విద్యాసంస్థల ద్వారా ఈ ప్రోగ్రాం అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీతారామన్ ప్రకటించారు. 2. 2020–21 బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశ పెట్టిన సందర్భంగా విద్యారంగంలో ప్రవేశపెట్టబోయే నూతన విధానాలపై ఆమె ప్రసంగిం చారు. త్వరలో నూతన విద్యా విధానం తీసుకురాబోతు న్నామని వెల్లడించారు. ఇందుకోసం రూ.99,300 కోట్లు విద్యారంగానికి నిధులు కేటాయించబోతున్నామని ఆమె పేర్కొన్నారు. 3. ప్రత్యేకంగా మరో రూ.3000 కోట్లు నైపుణ్యాభివృద్ధికి వెచ్చిస్తారు. కేంద్ర ఆరోగ్య, నైపుణ్యాభివృద్ధి మరియు ఎంట్రప్రెన్యూర్ షిప్ శాఖల సహకారంతో స్కిల్ ఇండియా మిషన్ కార్యక్రమం చేపడతారు. తద్వారా దేశవ్యాప్తంగా నైపుణ్య వాతావరణం సృష్టించి పౌరుల నైపుణ్యాలను మరింతగా మెరుగుపరుస్తారు. 4. ఉన్నత విద్యాభ్యాసానికి భారత్ కేంద్రంగా మారాలన్న తలంపుతో ‘స్టడీ ఇన్ ఇండియా’ ను రూపొందించారు. ఇందులో భాగంగా ఐఎన్డీ– ఎస్ఏటీ పరీక్షను నిర్వహిస్తారు. ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందిన ప్రతిభ గలిగిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తారు. 5. కొత్త విద్యా విధానంపై అన్ని రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఇతర భాగస్వాములతో చర్చించామని తెలిపారు. దీనిపై రెండు లక్షలకుపైగా సలహాలు, సూచనలు స్వీకరించామన్నారు. త్వరలోనే నూతన విద్యా విధానాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు. ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు, మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించే దిశగా అడుగులు వేస్తున్నట్లు వివరించారు. 6.1 విద్య అనంతరం ఉద్యోగ అవకాశాలు పెరగాలంటూ డిమాండ్లు పెరుగుతున్న దరిమిలా.. 2021 మార్చి నెలనాటికి 150 ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో అప్రెంటిష్ షిప్‌తో కూడిన డిగ్రీ, డిప్లొమా కోర్సులను కూడా ప్రవేశపెట్టబోతున్నారని ప్రకటించారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సంబంధిత స్థానిక సంస్థల్లో ఏడాదిపాటు అప్రెంటిస్‌షిప్‌కి వీలు కల్పించేందుకు ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతోందని తెలిపారు. ఆర్థికంగా వెనకబడి, బలహీన వర్గాలకు ఉన్నత విద్య అందించేందుకు డిగ్రీ స్థాయిలో పూర్తిస్థాయి ఆన్లైన్ విద్యా విధానాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు. 7. జాతీయ పోలీసు యూనివర్సిటీ, జాతీయ ఫోరెన్సిక్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయనున్నారు. పబ్లిక్ప్రైవేటు పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో చేపట్టే ఈ కార్యక్రమంలో ఈ యూనివర్శిటీలను భ™ జిల్లా మెడికల్ కాలేజీలతో అనసంధానిస్తామని, దీనివల్ల మెరుగైన వైద్యసేవలు లభిస్తాయి. -
బ్లూ ఫ్రాగ్ ఎండీ సెల్ఫోన్లు స్వాధీనం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఇసుక సరఫరాకు సంబంధించిన వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారన్న ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న విశాఖ నగరంలోని బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీ సంస్థ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. శుక్రవారం కూడా సీఐడీ అధికారులు బ్లూ ఫ్రాగ్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. సంస్థ ఎండీ ఫణికుమార్‌రాజ్ సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మొబైల్స్‌లోని ఫోన్ కాల్స్ డేటా విశ్లేషణ కోసం అమరావతిలోని సీఐడీ కార్యాలయానికి పంపారు. ఫణితో పాటు టెక్నికల్ అసిస్టెంట్ ప్రవీణ్ స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. బ్లూ ఫ్రాగ్‌లో సీజ్ చేసిన సర్వర్ల సమాచారాన్ని పూర్తిస్థాయిలో విశ్లేషించేందుకు రెండు సైబర్ క్రైం బృందాలను నియమించారు. ఏ ఐపీ అడ్రస్‌లతో బ్లూ ఫ్రాగ్ కార్యకలాపాలు నిర్వహించిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సాక్ష్యాధారాలు సేకరించాం ప్రభుత్వ వెబ్‌సైట్‌ను బ్లూ ఫ్రాగ్ బ్లాక్ చేసి ఇసుక కృత్రిమ కొరత సృష్టించిందనే ఫిర్యాదులపై విచారణ వేగవంతం చేశాం. కొన్ని ప్రాధమిక సాక్ష్యాధారాలు సేకరించాం. వాటిని సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో విశ్లేషించి నిర్ధారణ చేసుకుంటాం. రెండు మూడురోజుల్లో కేసు కొలిక్కి వచ్చే అవకాశముంది.– సునీల్‌కుమార్, సీఐడీ ఏడీజీ -
వైఎస్ జగన్ చొక్కాను ఫోరెన్సిక్‌కు అప్పగించొద్దు
అల్లిపురం(విశాఖ దక్షిణం): ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో.. కోర్టుకు సమర్పించిన రక్తపు మరకలతో ఉన్న ఆయన చొక్కాను అప్పుడే ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపవద్దని, వైఎస్సార్సీపీ అధినేత దాఖలు చేసిన రిట్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున.. అది తేలేవరకు వేచి ఉండాలని జగన్ తరఫు న్యాయవాది విశాఖ కోర్టును కోరారు. సంఘటన సమయంలో ప్రతిపక్ష నేత ధరించిన షర్టును సీల్డు కవర్లో ఈ నెల 23న ఆయన తరఫు న్యాయవాదులు 7వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో అందజేసిన విషయం తెలిసిందే. ఈ షర్టును పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపించాలని కోర్టును కోరుతూ సిట్ పోలీసులు గత సోమవారం మెమో దాఖలు చేశారు. దీనికి జగన్మోహన్రెడ్డి న్యాయవాది నీలాపు కాళీదాసురెడ్డి బుధవారం కౌంటర్ మెమో దాఖలు చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని కోర్టువారికి గుర్తుచేశారు. రిట్ పిటిషన్ ఈ నెల 27న విచారణకు రావాల్సి ఉండగా డిసెంబర్ 3వ తేదీకి వాయిదా పడిందని విన్నవించారు. హత్యాయత్నం కేంద్ర బలగాల అధీనంలో ఉన్న చోట జరిగినందున సివిల్ ఏవియేషన్ యాక్ట్ 1982కు విరుద్ధంగా స్థానిక పోలీసుల విచారణ జరిగే అవకాశముందని, అందువల్ల కేసు విచారణను కేంద్ర విచారణ సంస్థకు అప్పగించాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి ఉన్నందున.. దానిపై ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించేవరకు షర్టును రాష్ట్ర ప్రభుత్వ హయాంలో నిర్వహించే ఫోరెన్సిక్ లేబొరేటరీకి అప్పగించవద్దని, హైకోర్టు తీర్పు వెల్లడించే వరకు పెండింగ్‌లో ఉంచాలని కోరారు. ఆయన వాదనను విన్న న్యాయమూర్తి ఏపీపీకి నోటీసు ఇమ్మని కోరగా.. నోటీసు ఇచ్చారు. దీంతో డిసెంబర్ 3న ఇరు పార్టీలు వాదనలు వినిపించాలని న్యాయమూర్తి పేర్కొంటూ కేసు విచారణను వాయిదా వేశారు. -
‘తాత్కాలిక’ తప్పిదం!
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం మంగళగిరిలో హడావుడిగా తాత్కాలిక ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నిర్మాణాన్ని చేపట్టింది. దీనికోసం కోట్లాది రూపాయలు కుమ్మరిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమరావతికి ఎఫ్‌ఎస్‌ఎల్‌ను మంజూరుచేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఇక ఈ తాత్కాలిక ల్యాబ్ నిర్మాణమెందుకన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రానికి హైదరాబాద్‌లో ఉన్న ఎఫ్ఎస్ఎల్ పోలీసుల దర్యాప్తులో ఇతోధిక పాత్ర పోషించింది. అది విభజన చట్టం 10వ షెడ్యూల్లో ఉండటంతో ఇంకా పంపిణీ జరగలేదు. ప్రసుతం ఏపీలో ఐదు రీజినల్ ఎఫ్ఎస్ఎల్ సెంటర్లున్నా హైదరాబాద్‌లోని మెయిన్ ల్యాబ్‌ను కూడా అరకొరగా వినియోగించుకుంటున్నారు. రాష్ట్రంలోని విశాఖ, విజయవాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో ఉన్న రీజినల్ ఎఫ్ఎస్ఎల్ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇంకా ‘తాత్కాలికం’ ఎందుకు? కేంద్ర ప్రభుత్వం అమరావతికి కొత్తగా ఎఫ్‌ఎస్‌ఎల్‌ను కేటాయించిన నేపథ్యంలో ఇటీవల కొత్తగా చంద్రబాబు సర్కారు చేపట్టిన తాత్కాలిక ఎఫ్ఎస్ఎల్ ఎందుకు.. అనే చర్చ జరుగుతోంది. ఏపీ రాజధాని ప్రాంతంలో తాత్కాలిక ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీని మంజూరుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 13న ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకోసం తొలిదశలో రూ.27 కోట్లు కేటాయించింది. మంగళగిరిలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ సమీపంలో తాత్కాలిక ఎఫ్ఎస్ఎల్ కోసం ఐదు అంతస్తుల భవన నిర్మాణం చేపట్టారు. తొలి మూడు అంతస్తులు పోలీస్ శాఖ అవసరాలకు, పైరెండు అంతస్తులు ఎఫ్ఎస్ఎల్ కోసం కేటాయించారు. దానిలో పరికరాలు (ఎక్విప్మెంట్)కు, సైంటిఫిక్ స్టాఫ్‌కు వేతనం (కన్సాలిడేట్ పే) కోసం ఏడాదికి రూ.1.08 కోట్లు, రికరింగ్ బడ్జెట్‌గా రూ.72 లక్షలు కేటాయించడం గమనార్హం. ఈ నెల 27న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశంలో అంతర్గత భద్రత పథకానికి రూ.25 వేల కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగానే ఏపీ రాజధాని అమరావతిలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీని మంజూరుచేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మీడియాకు వెల్లడించారు. పోలీసు మౌలిక వసతుల కల్పన, శిక్షణ సంస్థలు, దర్యాప్తు సదుపాయాల నిమిత్తం కేటాయించిన రూ.100 కోట్లలోంచి అమరావతి ఎఫ్ఎస్ఎల్కు నిధులు కేటాయిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది కాలంలో దీని ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. దీని కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం వెలగపూడి సచివాలయం సమీపంలో మూడెకరాల స్థలం కేటాయించింది. కేంద్ర నిధులు మంజూరయ్యాక రాజధానిలో ఎఫ్ఎస్ఎల్ నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. అయినా మంగళగిరిలో కోట్లాది రూపాయలతో నిర్మిస్తున్న తాత్కాలిక ల్యాబ్ పనులు జరుగుతూనే ఉండటం గమనార్హం. -
శాస్త్రీయ ఆధారాలను తొక్కిపెడుతున్నదెవరు?
నందిగామ సమీపంలో జరిగిన బస్సు దుర్ఘటనలో శాస్త్రీయ ఆధారాలను తెరమరుగు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేర స్థలానికి ఫోరెన్సిక్ నిపుణులు వెళ్లకపోవడం, భౌతిక ఆధారాలకు ఎంతమాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోవడం అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. ఈ కేసులో కొన్ని లోపాలను ఫోరెన్సిక్ నిపుణులు లేవనెత్తుతున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా? ఈ విషయాన్ని ఫోరెన్సిక్ లేబొరేటరీ నిర్ధారించాల్సి ఉంటుంది. ఈ పరీక్ష చేసేది ఫోరెన్సిక్ లేబొరేటరీలోని టాక్సికాలజీ విభాగం (విష పదార్థాల నిర్థారణ). ఆసుపత్రికి వచ్చిన మృతదేహాన్ని భౌతికంగా పరిశీలించి, విస్రా (కాలేయం, కిడ్నీలు, గుండె)ను సేకరించి ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపాలి. ఈ విషయంలో ఆసుపత్రి వర్గాలు ఆలస్యం చేయడం వెనుక రహస్యం ఏమిటి? ఒకవేళ డ్రైవర్ మద్యం తాగితే మూడుగంటల వరకూ విస్రాలో ఆల్కహాల్ పదార్థాలు ఉంటాయి. దీన్ని సేకరించి లేబొరేటరీకి పంపితే ఆల్కహాల్ శాతం ఎంతో తేలిపోతుంది. ఈ ఘటనలో బస్సు గంట క్రితమే విజయవాడలో ఆగినట్టు తెలుస్తోంది. అంటే అక్కడ మద్యం తాగి ఉంటే అది ఫోరెన్సిక్ పరీక్షలో తేలిపోయేందుకు వీలుంది. విస్రాను మార్చేస్తారా? డ్రైవర్ వాస్తవ పరిస్థితిని బయటకు రానీయకుండా చేయడానికి... విస్రాను మార్చే అవకాశం ఉంది. గతంలో వర్థమాన నటి ప్రత్యూష కేసులో ఇదే జరిగినట్టు వివాదం చెలరేగింది. ఆమె అత్యాచారానికి గురైందని ఫోరెన్సిక్ వైద్యులు ముందే వెల్లడించారు. దీంతో విస్రాను మార్చివేసి, ఆమె విషం తాగినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేశారనే ఆరోపణలు వచ్చాయి. అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబు ప్రభుత్వమే. ఆయన మంత్రివర్గ సహచరుల కుమారులపైనే అప్పట్లో అనుమానాలు వచ్చాయి. దీంతో లేబొరేటరీకి పంపిన విస్రాను డీఎన్ఏ టెస్టుకు పంపాలనే డిమాండ్ తెరమీదకొచ్చినా చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ఘటనలోనూ ఇలా జరిగే వీలుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణంగానే పోస్టుమార్టం చేయడంలో వైద్యులు నిర్లక్ష్యం చేసి ఉండొచ్చనే అనుమానాలు విన్పిస్తున్నాయి. భౌతిక ఆధారాలు తీసుకున్నారా సంఘటనా స్థలం కీలకమైంది. ఇక్కడ భౌతిక ఆధారాలే కేసుకు బలం. సాధారణంగా బస్సు దుర్ఘటన సమయంలో టైర్ గుర్తులు (స్కిడ్ మార్క్స్) తీసుకోవాలి. దీనివల్ల బస్సు ఎంత వేగంతో వెళ్తుంది? ఆ బస్సు పటుత్వం (ఫిట్నెస్) ఎంత? అనే కీలకమైన అంశాలను గుర్తించవచ్చు. కానీ ఇక్కడ ఈ ఆధారాలు తీసుకున్న దాఖలాలే లేవు. ఇవన్నీ యాజమాన్యాన్ని కాపాడేందుకు పక్కా ప్రణాళికతో జరిగాయా? అనే సందేహాలకు తావిస్తున్నాయి. -
భయమొద్దు.. బ్రెడ్డే!
చూడ్డానికి భయానకంగా కనిపిస్తోంది కదూ.. మానవ శరీర భాగాలను ఖండఖండాలు చేస్తున్నట్లుగా.. భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇది బ్రెడ్ మాత్రమే. ఎంచక్కా జామ్‌తో నంజుకు తినేయొచ్చు. థాయ్‌లాండ్‌కు చెందిన కిట్టివత్ ఉనారమ్ అనే కళాకారుడి ‘ప్రతిభ’కు నిదర్శనమీ చిత్రం. పెయింటింగ్, శిల్పాలు చెక్కడం ఇలా చాలా ప్రయత్నాలు చేసిన కిట్టివత్ ఏదైనా కొత్తగా చేయాలని తలంచాడు. చివరికి తమ కుటుంబానికి చెందిన బేకరీ వ్యాపారాన్ని చేపట్టిన తర్వాత అందులో తనకు కావాల్సిన ప్రయోగాలన్నీ చేశాడు. ఇందుకోసం ఫోరెన్సిక్ లాబొరేటరీలను సందర్శించాడు. మానవ శరీర నిర్మాణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. తర్వాత వీటిని రూపొందించాడు. ఇవి చూడ్డానికి నిజమైన విలా కనిపిస్తుండటంతో ఇతడి కళకు క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో కిట్టివత్ ‘బాడీ బేకరీ’ ఓ పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. ఈ చిత్రవిచిత్రమైన బ్రెడ్‌ను తిందామని థాయ్‌లాండ్ వెళ్లేరు. ఎందుకంటే.. కిట్టివత్ వీటిని అమ్మడం లేదు. ప్రస్తుతానికివి ప్రదర్శనకు మాత్రమేనట. -
ఫోరెన్సిక్ అమ్ములపొదిలో సి-డార్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకూ ఉమ్మడిగా సేవలందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ(ఏపీఎఫ్ఎస్ఎల్) అమ్ములపొదిలోకి మరో అత్యాధునిక పరికరం వచ్చి చేరింది. వివిధ రకాలైన ఆడియోలను విశ్లేషించి, కచ్చితమైన నివేదికలివ్వడానికి ఉపకరించే సి-డార్ పరికరాన్ని ల్యాబ్ అధికారులు ఇటీవలే కొనుగోలు చేశారు. దక్షిణ భారత్‌లో మరే ఇతర రాష్ట్రాలకు చెందిన ఫోరెన్సిక్ ల్యాబ్స్‌లోనూ ఇలాంటి పరికరం అందుబాటులో లేదు. ఇటీవలికాలంలో ఆడియోతో కూడిన వాయిస్ అనాలసిస్‌తో ముడిపడిన కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. సభల్లోనూ, ఆన్లైన్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రసంగాలతోపాటు ఫోన్ల ద్వారా, నేరుగా బెదిరింపులే గాక.. కొన్ని రకాలైన భారీ కుంభకోణాల కేసుల దర్యాప్తులోనూ అనుమానిత వ్యక్తి వాయిస్ రికార్డులు, శాంపిల్స్‌ను పక్కాగా విశ్లేషించడం కీలకంగా మారింది. ఆడియో సంబంధిత కేసుల్లో ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన నివేదికే నిందితుడ్ని న్యాయస్థానంలో దోషిగా నిరూపించడానికి కీలకమైంది. ఇప్పటివరకు ఈ తరహా పరీక్షల కోసం పోలీసు విభాగంతోపాటు ఇతర ఏజెన్సీలు చండీగఢ్‌లోని ఫోరెన్సిక్ లేబొరేటరీపై ఎక్కువగా ఆధారపడేవి. ఏపీఎఫ్ఎస్ఎల్ సైతం కొన్ని కేసుల్ని పరిష్కరించినా ఆధునిక పరికరాలు అందుబాటులో ఉండేవి కాదు. ఆడియో విశ్లేషణతో ముడిపడి ఉన్న కేసులకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకున్న ఏపీఎఫ్ఎస్ఎల్ డెరైక్టర్ శారద అవధానం ఉన్నతాధికారుల అనుమతితో లండన్‌కు చెందిన ప్రముఖ కంపెనీ నుంచి సి-డార్ పరికరాన్ని కొనుగోలు చేశారు. ఓ ఆడియోను విశ్లేషించాల్సి వచ్చినప్పుడు దాంతోపాటు అది ఎవరిదిగా పోలీసులు అనుమానిస్తున్నారో వారి నమూనాలనూ ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు సేకరిస్తారు. ఈ రెంటినీ సి-డార్లో విశ్లేషించడం ద్వారా మరింత కచ్చితమైన నివేదికలిచ్చే అవకాశమేర్పడింది. ఈ పరికరాన్ని ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా వినియోగిస్తున్న ఫోరెన్సిక్ సిబ్బందికి మరింత సమర్థంగా విశ్లేషించడానికి వీలుగా తగిన మెరుగైన శిక్షణను విదేశాల్లో ఇప్పిం చేందుకు ఎఫ్ఎస్ఎల్, పోలీసు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
ఫోరెన్‘సిక్’కు చికిత్స
న్యూఢిల్లీ: నగరంలో ఒకే ఒక ఫోరెన్సిక్ ప్రయోగశాల ఉండడంతో కేసులు త్వరగా తెమలడం లేదు. పది వేలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉండిపోయాయి. అంతేకాకుండా ప్రతి నెలా 500 నమూనాలు ఈ ప్రయోగశాలకు పరీక్షలకోసం వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశరాజధానికి త్వరలో మరో మూడు ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలలతోపాటు (ఎఫ్ఎస్ఎల్) 11 మొబైల్ ఫోరెన్సిక్ లేబొరేటరీ వ్యాన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. ‘క్రైం కేసులను సత్వరమే పరిష్కరించడంలో నగర పోలీసులకు చేయూత ఇచ్చేందుకుగాను మరో మూడు ఎఫ్ఎస్ఎల్ల ఏర్పాటుకు ప్రాథమిక అంగీకారం తెలిపాం. రోహిణి ప్రాంతంలోని ఎఫ్ఎస్ఎల్పై పడుతున్న కేసుల భారాన్ని తగ్గించేందుకు ఇవి దోహదం చేస్తాయి. వీటిని జిల్లా కోర్టుల సమీపంలో ఏర్పాటు చేస్తాం. వీటి ఏర్పాటుకు అవసరమైన స్థలం కోసం ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ)ని సంప్రదించాం. ప్రతి జిల్లా కోర్టు వద్ద ఓ మొబైల్ ఎఫ్‌ఎస్‌ఎల్‌ను ఏర్పాటు చేయాలంటూ నగర పోలీసు శాఖ చేసిన ప్రతిపాదనకు గత నెలలోనే ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది’ అని తెలిపారు. హోం శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని, ఈ ప్రతిపాదనను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపించామని, ఇందుకు సానుకూల స్పందన లభిస్తుందనే విశ్వాసం తమకు ఉందని ఆయన వివరించారు. ప్రయోగాల ద్వారా సేకరించిన ఆధారాలు భద్రపరిచిననాటి నుంచి ఆరు నెలలకు మించి నిల్వ ఉండవు. ఆరు నెలల కాలం ముగియగానే కడుపులోని అవయవాలు, రక్తం, డీఎన్ఏల నమూనాలు క్షీణించిపోవడం మొదలవుతుందని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కి చెందిన పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ శాస్త్రవేత్త వెల్లడించారు. నగరంలో ఒకే ఒక ప్రయోగశాల ఉండడంతో దానిపై విపరీతమైన పనిభారం పడుతోందన్నారు. కాగా హైదరాబాద్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) స్థానిక ఎఫ్ఎస్ఎల్ పంపిన 110 నమూనాలను భద్రపరుస్తోంది. ఇక కోల్‌కతాలోని ప్రయోగశాల నుంచి 50, అహ్మదాబాద్, చండీగఢ్‌లలోని ఎఫ్ఎస్ఎల్లకు ఒక్కొక్కదానికి 25 కేసులను హైదరాబాద్‌లోని సీఎఫ్ఎస్ఎల్ కు నగర పోలీసులు పంపుతున్నారు. కాగా ఫోరెన్సిక్ నివేదిక దాఖలు జాప్యమవడానికి కారణమేమిటో తెలియజేయాలంటూ డి సెంబర్ 16వ తేదీ నాటి సామూహిక అత్యాచారం కేసు విచారణ సందర్భంగా హైకోర్టు... రాష్ర్ట ప్రభుత్వం, నగర పోలీసులతోపాటు రోహిణిలోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీని వివరణ కోరిన సంగతి విదితమే. దీంతో ఇందులో ఖాళీగా ఉన్న 30 ఉద్యోగాల నియామకానికి రోహిణిలోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ శ్రీకారం చుట్టింది.