చీరపై నేరం ఆనవాళ్లు?
చార్జిషీటులో పేర్కొన్న సిట్
బనశంకరి: మహిళలపై అత్యాచారం కేసులో అరెస్టైన జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బాధితురాలి చీర పెద్ద సమస్య తీసుకువచ్చే అవకాశం ఉంది. ఆ మహిళ చీరను ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలకు పంపారు. బాధితురాలి నుంచి నాలుగు చీరలను స్వాదీనం చేసుకున్న సిట్ అధికారులు వాటిని ల్యాబ్‌కు పంపించారు.
చీరల్లో వీర్యం, వెంట్రుకలు లభించినట్లు తేలింది. దీంతో ఇవి ఎవరివో తెలుసుకోవడానికి ప్రజ్వల్ రేవణ్ణకు డీఎన్‌ఏ పరీక్షలు చేపట్టారు. అవి ప్రజ్వల్‌వే అని నిర్ధారణ అయితే కేసు మరింత బిగుసుకునే అవకాశం ఉంది. ఇంటి పనిమనిషిపై అత్యాచారం కేసులో ప్రజ్వల్‌పై కోర్టులో సిట్ చార్జిషీట్ దాఖలు చేయగా, అందులో ఈ డీఎన్‌ఏ పరీక్షల తతంగాన్ని పేర్కొన్నారు. అంతేగాక వైద్య పరీక్షల నివేదిక పెండింగ్‌లో ఉంది. ల్యాబ్ నుంచి నివేదిక అందిన వెంటనే అదనపు చార్జిషిట్ వేస్తామని కోర్టుకు సిట్ తెలిపింది.
గదిలోకి పిలిచి అఘాయిత్యం
హొళెనరసిపురలో బన్నికోడ ఫాంహౌస్‌లో ప్రజ్వల్ మంచి నీరు తేవాలని మహిళకు సూచించాడు. చెంబులో నీరు తీసుకుని రూమ్‌లోకి వెళ్లగానే ప్రజ్వల్ తలుపులు లాక్‌చేసి నా దుస్తులు తొలగించి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆపై వీడియో తీశాడు. బెంగళూరు బసవనగుడి ఇంట్లో పనిచేయడానికివెళ్లినప్పుడు కూడా ప్రజ్వల్ ఇదేవిధంగా ప్రవర్తించాడు. ఇళ్లు తుడవడానికి గదిలోకి పిలిచాడు, నేను వెళ్లకపోవడంతో గదమాయించాడు. గదిలోకి వెళ్లగానే తలుపు గడియ పెట్టి అత్యాచారం చేశాడు. ఎక్కడైనా నోరువిప్పితే వీడియో నీ కుమారునికి చూపిస్తానని బెదిరించారు. ఎంపీ అనే భయంతో మౌనంగా ఉండిపోయాను అని బాధిత మహిళ వాంగ్మూలం ఇచ్చినట్లు చార్జిషిట్‌లో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment