Prajwal Revanna
-
ప్రజ్వల్ రేవణ్ణకు చుక్కెదురు
ఢిల్లీ: లైంగిక దాడుల కేసుల్లో కర్ణాటక నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు భంగపాటు ఎదురైంది. బెయిల్ విజ్ఞప్తిని సోమవారం సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఇంతకు ముందు.. కర్ణాటక హైకోర్టు కూడా ఆయన బెయిల్ అభ్యర్థనను తిరస్కరించింది. -
లైంగిక దాడి కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై మూడో ఛార్జ్‌షీట్
బెంగుళూరు: హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై నమోదైన అత్యాచారం కేసులో.. సిట్ పోలీసులు మూడవ ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. జేడీఎస్ పార్టీకి చెందిన ఓ మహిళపై తుపాకీతో బెదిరించి పలుమార్లు లైంగింకంగా వేధింపులకు పాల్పడినట్లు ఆ ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.2020 ఫిబ్రవరి నుంచి 2023 డిసెంబర్ వరకు ఓ మహిళపై ప్రజ్వల్ లైంగిక దాడి చేసినట్లు తెలిపారు. 1691 పేజీలు ఉన్న ఛార్జ్‌షీట్ లో 120 మంది సాక్ష్యుల వాంగ్మూలం కూడా ఉంది. లైంగిక చర్యకు చెందిన వీడియోలు తీసి, దాంట్లో ముఖం కనబడకుండా చేసి బెదిరింపులకు పాల్పడినట్లు సిట్ తెలిపింది. వీడియోల ఆధారంగా మళ్లీ మళ్లీ ఆ మహిళను లైంగికంగా వేధించినట్లు ఛార్జీషీట్లో పేర్కొన్నారు.కాగా తన కేసు విచారణ గోప్యంగా నిర్వహించాలని కోరుతూ ప్రజ్వల్ తన న్యాయవాదుల సహకారంతో వేసుకున్న అర్జీని జస్టిస్ ఎం.నాగప్రసన్న తోసిపుచ్చారు. బాధిత మహిళల విచారణలో గోప్యత పాటించవలసి ఉంటుందని, ప్రజ్వల్ విషయంలో విచారణ ఎలా ఉండాలో న్యాయస్థానం తీర్మానిస్తుందని ప్రకటించి.. తదుపరి విచారణను 19వ తేదీకి వాయిదా వేశారు. -
ప్రజ్వల్‌కు చీర చిక్కు
బనశంకరి: మహిళలపై అత్యాచారం కేసులో అరెస్టైన జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బాధితురాలి చీర పెద్ద సమస్య తీసుకువచ్చే అవకాశం ఉంది. ఆ మహిళ చీరను ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలకు పంపారు. బాధితురాలి నుంచి నాలుగు చీరలను స్వాదీనం చేసుకున్న సిట్ అధికారులు వాటిని ల్యాబ్‌కు పంపించారు. చీరల్లో వీర్యం, వెంట్రుకలు లభించినట్లు తేలింది. దీంతో ఇవి ఎవరివో తెలుసుకోవడానికి ప్రజ్వల్ రేవణ్ణకు డీఎన్ఏ పరీక్షలు చేపట్టారు. అవి ప్రజ్వల్వే అని నిర్ధారణ అయితే కేసు మరింత బిగుసుకునే అవకాశం ఉంది. ఇంటి పనిమనిషిపై అత్యాచారం కేసులో ప్రజ్వల్‌పై కోర్టులో సిట్ చార్జిషీట్ దాఖలు చేయగా, అందులో ఈ డీఎన్ఏ పరీక్షల తతంగాన్ని పేర్కొన్నారు. అంతేగాక వైద్య పరీక్షల నివేదిక పెండింగ్‌లో ఉంది. ల్యాబ్ నుంచి నివేదిక అందిన వెంటనే అదనపు చార్జిషిట్ వేస్తామని కోర్టుకు సిట్ తెలిపింది. గదిలోకి పిలిచి అఘాయిత్యం హొళెనరసిపురలో బన్నికోడ ఫాంహౌస్‌లో ప్రజ్వల్ మంచి నీరు తేవాలని మహిళకు సూచించాడు. చెంబులో నీరు తీసుకుని రూమ్‌లోకి వెళ్లగానే ప్రజ్వల్ తలుపులు లాక్‌చేసి నా దుస్తులు తొలగించి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆపై వీడియో తీశాడు. బెంగళూరు బసవనగుడి ఇంట్లో పనిచేయడానికివెళ్లినప్పుడు కూడా ప్రజ్వల్ ఇదేవిధంగా ప్రవర్తించాడు. ఇళ్లు తుడవడానికి గదిలోకి పిలిచాడు, నేను వెళ్లకపోవడంతో గదమాయించాడు. గదిలోకి వెళ్లగానే తలుపు గడియ పెట్టి అత్యాచారం చేశాడు. ఎక్కడైనా నోరువిప్పితే వీడియో నీ కుమారునికి చూపిస్తానని బెదిరించారు. ఎంపీ అనే భయంతో మౌనంగా ఉండిపోయాను అని బాధిత మహిళ వాంగ్మూలం ఇచ్చినట్లు చార్జిషిట్‌లో తెలిపారు. -
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై ఛార్జ్ షీట్
బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపలకు పాల్పడినట్లు జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వచ్చిన ఆరోపణలు కర్ణాటకలో సంచలనం సృష్టించాయి. ఈ కేసులో సిట్ అధికారులు శుక్రవారం ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టులో ప్రజ్వల్ రేవణ్ణ ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ప్రజ్వల్‌పై హోలెనరసిపూర పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తు అధికారి సుమారాణి 137 మంది సాక్షులను విచారించారు. ఆ వివరాలతో 2000పైగా పేజీల చార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించారు. ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు.2019 నుంచి 2022 మధ్య హోలెనరసిపురలోని తన నివాసంలో పనిచేసిన పనిమనిషిని హెచ్డీ రేవణ్ణ లైంగికంగా వేధించారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో నిందితుడు రేవణ్ణ మహిళలను లైంగికంగా వేధించారని చార్జిషీట్లో పేర్కొంది. మహిళలపై లైంగిక వేధింపుల కేసులో హెచ్డీ రేవణ్ణ ఏ1, ప్రజ్వల్ రేవణ్ణగా ఏ2గా ఉన్నారు. -
సూరజ్‌కు త్వరలో పటుత్వ పరీక్షలు
శివాజీనగర: లైంగిక దాడుల కేసులో గతంలో అన్న ప్రజ్వల్ రేవణ్ణకు పోలీసులు, వైద్యులు లైంగిక పటుత్వ పరీక్షలను నిర్వహించారు. ఇప్పుడు తమ్ముడు సూరజ్‌కు కూడా ఇవే పరీక్షలు చేయడానికి సీఐడీ ప్రత్యేక తనిఖీ బృందం సిద్దమైంది. యువకున్ని బెదిరించి అసహజ లైంగిక దాడి చేశారనే కేసులో ఈ నెల 23వ తేదీన సూరజ్‌ని హాసన్‌లో అరెస్టు చేయడం తెలిసిందే. కేసు విచారణలో భాగంగా అతి త్వరలోనే అతనికి బౌరింగ్ ఆస్పత్రిలో పురుషత్వ పరీక్షలు చేయించే అవకాశముంది. అలాగే స్వలింగ కామం సహజమైందా అనేదానికి మరికొన్ని పరీక్షలు చేయవచ్చని పోలీసులు తెలిపారు. అన్న ప్రజ్వల్‌కు జరిపిన పరీక్షల కంటే కొంతవరకు భిన్నంగా ఉంటాయని తెలిసింది. సూరజ్ ప్రస్తుతం సీఐడీ కస్టడీలో ఉన్నాడు. మూడు కేసుల్లో ప్రజ్వల్‌కు మూడుసార్లు పరీక్షలు చేశారు. ఇదేం బాగాలేదని అతడు కోర్టులో ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు సూరజ్ ఆప్తుడు శివకుమార్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతన్ని అరెస్టు చేస్తే కేసులో మరిన్ని అంశాలు బయటకు వస్తాయంటున్నారు. -
సూరజ్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు
బనశంకరి: జేడీఎస్‌కు చెందిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడి, నగ్న వీడియోల కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. తాజాగా ప్ర జ్వల్ తమ్ముడు డాక్టర్ సూరజ్ రేవణ్ణ (36)పై కూడా లైంగిక వేధింపుల కే సు నమోదైంది. ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ తనపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డారని చేతన్ కే.ఎస్. అనే జేడీఎస్ కార్యకర్త శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హాసన్ జిల్లా అరకలగూడుకు చెందిన చేతన్ వీడియోల ను కూడా విడుదల చేయడంతో కన్నడ రాజకీయాల్లో మరోసారి సంచల నం చెలరేగింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో పరిచయమైన సూరజ్ ఫాంహౌస్‌కు పిలిచి లైంగిక దాడికి యతి్నంచాడని చేతన్ ఆరోపించాడు. డబ్బులు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేతన్, అతని బంధువు డబ్బులు డిమాండ్ చేశారని, ఇవ్వకపోతే లైంగిక వేధింపుల కేసు పెడతామని బ్లాక్మెయిల్ చేశారని సూరజ్ రేవణ్ణ ముఖ్య అనుచరుడైన శివకుమార్ సైతం శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో స్నేహం చేసిన చేతన్.. సూరజ్ రేవణ్ణ బ్రిగేడ్‌కు పనిచేయడం ప్రారంభించాడని, కుటుంబ ఖర్చులకు డబ్బు ఇవ్వాలని కోరగా తాను నిరాకరించడంతో సూరజ్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు పెడతామని బెదిరింపులకు దిగారని శివకుమార్ పేర్కొన్నారు. మొదట రూ. 5 కోట్లు తర్వాత దాన్ని తగ్గించి రూ. 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని అన్నా రు. శివకుమార్ ఫిర్యాదుతో చేతన్, అతని బంధువుపై కేసు నమోదైంది. -
ఏ గదిలో ఏం జరిగింది?.. వీడియో కెమెరా ఎక్కడ
యశవంతపుర: అత్యాచారం, లైంగిక వీడియోల కేసులో అరెస్ట్‌యిన జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరులోని ఆయన ఇంటిలో సిట్ పోలీసులు పంచనామా చేశారు. బసవనగుడిలోని తండ్రి రేవణ్ణ ఇంటిలో పంచనామా చేస్తుండగా తల్లి భవాని అక్కడే ఉన్నా ప్రజ్వల్‌ను పలకరించలేదు. ప్రజ్వల్‌ను ప్రశ్నించడం ముగిసి కస్టడీకీ తరలించే ముందు బసవనగుడి నివాసంలో పంచనామాకు తీసుకెళ్లారు. కొడుకును తీసుకొచ్చారని తెలిసి తల్లి భవాని ప్రజ్వల్‌కు ముఖం చూపించకుండా అవతలకు వెళ్లిపోయి తులసి చెట్టుకు పూజలో మునిగిపోయారు. పంచనామాకు ఆటంకం కలిగించవద్దని భవానికి పోలీసులు అంతకుముందే విన్నవించారు. బాధిత మహిళ అపహరణ కేసులో భవాని కూడా నిందితురాలే. ఆమెను కూడా పోలీసులు విచారించారు. ప్రజ్వల్ తనను ఫలానా గదిలో వేధించారని బాధితురాలు చెప్పడంతో ఆ గదిలో పోలీసులు సోదాలు సాగించారు.వీడియో కెమెరా ఎక్కడఅశ్లీల వీడియోలలో ఉన్నది తాను కాదని ప్రజ్వల్ చెబుతున్నారు. అశ్లీల వీడియోలలో ఈ గది పోలికలు కనిపించలేదని సిట్ వర్గాలు తెలిపాయి. బాధిత మహిళ చూపించిన జాగా, అశ్లీల వీడియోలో ఉన్న స్థలం ఒక్కటే అయితే ప్రజ్వల్ కేసు బలపడుతుంది. మరో పక్క వీడియో తీసిన అసలైన ఫోన్/ వీడియో కెమెరా కోసం సిట్ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. తన మొబైల్ పోయిందని ఏడాది కిందటే హొళెనరసిపుర పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రజ్వల్ చెప్పారు. -
నాకేమీ తెలియదు, మొబైల్ పోయింది
బనశంకరి: అత్యాచారం, లైంగిక వీడియోల కేసులో అరెస్టైన హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను సిట్ అధికారులు బెంగళూరులో విచారణ చేపట్టారు. ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకుండా నిరాకరిస్తున్నట్లు సిట్ వర్గాలు తెలిపాయి. ఇది రాజకీయకుట్ర, అనవసరంగా తనకు ఈ కేసులో ఇరికించారు. మీ పని మీరు చేయండి, నేనేమీ చెప్పను అని మొండికేసినట్లు తెలిసింది. ప్రశ్నలను తమ న్యాయవాదిని అడగాలని చెప్పిన ప్రజ్వల్ శుక్రవారం విచారణలో ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. తన మొబైల్‌ఫోన్ ఏడాది కిందట చోరీ అయ్యిందని, మీరు అడుగుతున్న మొబైల్‌ఫోన్ తన వద్ద లేదని సిట్ అధికారులకు చెప్పారు. అశ్లీల వీడియోలలో ఉన్నది మీరే కదా అని చూపించగా, ఆ వీడియోల్లో ఉన్నది నేను కాదని, వారందరూ తనకు పరిచయం అంతే, నేను ఎవరిపై అత్యాచారానికి పాల్పడలేదని ప్రజ్వల్ చెప్పినట్లు సమాచారం. దీంతో విచారణను ఎలా సాగించాలని సిట్ అధికారులు తలపట్టుకున్నారు. నేడో రేపో ఘటనాస్థలికి శుక్రవారం రాత్రి 9 గంటల వరకు విచారించి భోజనం అందజేశారు. శనివారం కూడా విచారణ కొనసాగించారు. ఆదివారం లేదా సోమవారం హాసన్, హొళెనరసిపురలోని ఇళ్లకు ప్రజ్వల్‌ను తీసుకెళ్లి సంఘటనలు ఎలా జరిగాయో మహజరు పరిచే అవకాశముంది. ముందస్తు బెయిలు కోసం తల్లి అర్జీ ప్రజ్వల్ కేసులో ఓ బాధిత మహిళను అపహరించారనే కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన తల్లి భవానీ రేవణ్ణ శనివారం హైకోర్టును ఆశ్రయించారు. విచారణకు హాజరు కావాలని సిట్ గతంలో నోటీసులు జారీచేసినా ఆమె హాజరు కాలేదు. దీంతో పరారీలో ఉన్నారని భవానీ కోసం సిట్ గాలిస్తోంది. ముందస్తు బెయిల్‌కోసం భవానీ ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించగా అర్జీని తిరస్కరించింది. అరెస్ట్ చేస్తారనే భయంతో భవానీ హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం పిటిషన్ విచారణ కు వచ్చే అవకాశం ఉంది. బెంగళూరులో భవాని నివాసానికి ముగ్గురు మహిళా న్యాయవాదులు వెళ్లారు. వారు ఆమె తరఫున సిట్ అధికారులతో చర్చించారు. విచారణకు హాజరవుతారని, అరెస్టు కోసం ఒత్తిడి చేయరాదని సిట్‌ను కోరారు. -
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణకు ఆరు రోజుల పోలీస్ కస్టడీ
బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ సస్పెండెడ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ఆరు రోజుల పోలీస్ కస్టడీ విధించారు.. ఈ మేరకు అశ్లీల వీడియో కేసుపై ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు విచారణ అనంతరం ఆరురోజుల పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది.ఇక మైసూర్‌లోని కేఆర్ నగర్‌కు చెందిన మహిళ కిడ్నాప్ కేసులో ప్రజ్వల్ రేవణ్ణ, హెచ్డీ రేవణ్ణ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన బెయిల్‌ను వ్యతిరేకిస్తూ సిట్ కూడా హైకోర్టులో పిటిషన్ వేసింది. విచారణ పూర్తయ్యే వరకు రేవణ్ణ కస్టడీలోనే ఉండాలని, అందుకే బెయిల్‌ను రద్దు చేయాలని సిట్ హైకోర్టును కోరింది. దీనిపై విచారణను హైకోర్టు జూన్ 3కి వాయిదా వేసింది.కాగా జర్మనీ నుంచి బయల్దేరిన ప్రజ్వల్ రేవణ్ణ.. గురువారంయ అర్ధరాత్రి బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిన వెంటనే పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను భారీభద్రత మధ్య విచారణ నిమిత్తం సీఐడీ కార్యాయానికి తరలించారు. శుక్రవారం ఉదయం రేవణ్ణకు బెంగళూరులోని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రజ్వల్‌ను సిటీ సివిల్ కోర్టుకు తరలించారు. అక్కడ అతన్ని న్యాయమూర్తి ముందు హాజరుపరిచి.. ప్రజ్వలను 14 రోజులపాటు తమ కస్టడికి అప్పగించాలని సిట్ కోర్టును కోరింది.మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు అయిన ప్రజ్వల్ రేవణ్ణ 2014-19లో హాసన నుంచి జీడీఎస్ తరపున ఎంపీగా గెలుపొందారు. ఈ లోక్‌సభల్లోనూ ఎన్డీయూ కూటమి తరపున. హాసన నుంచి మళ్లీ ఎంపీగా బరిలోకి దిగారు. అయితే పలువురు మహిళలపై ఆయన లైంగిక దాడి చేసినట్లు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆయన గత ఏప్రిల్‌లో దేశం విడిచి పరారయ్యారు. ఇప్పటివరకు రేవణ్ణపై మూడు కేసులు నమోదు అయ్యాయి. ఆయన ఆచూకి కోసం బెంగళూరు పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఆయనపై నాలుగుసార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. దౌత్య పాస్‌పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. విచారణకు హాజరు కావాలని ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణ, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ బహిరంగానే కోరారు.ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసుల విచారణకు సహకరిస్తానని, మే 31న ‘సిట్’ ముందు హాజరవుతానని ఇటీవల తొలిసారి వీడియో సందేశంలో రేవణ్ణ పేర్కొన్నారు. మరోవైపు బెంగళూరు కోర్టులో రేవణ్ణకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది.