సూరజ్‌ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు | JDS MLC Suraj Revanna quizzed on molestation abuse charge | Sakshi
Sakshi News home page

సూరజ్‌ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు

Published Sun, Jun 23 2024 5:11 AM | Last Updated on Sun, Jun 23 2024 5:11 AM

JDS MLC Suraj Revanna quizzed on molestation abuse charge

బనశంకరి: జేడీఎస్‌కు చెందిన మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక దాడి, నగ్న వీడియోల కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. తాజాగా ప్ర జ్వల్‌ తమ్ముడు డాక్టర్‌ సూరజ్‌ రేవణ్ణ (36)పై కూడా లైంగిక వేధింపుల కే సు నమోదైంది. ఎమ్మెల్సీ సూరజ్‌ రేవణ్ణ తనపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డారని చేతన్‌ కే.ఎస్‌. అనే జేడీఎస్‌ కార్యకర్త శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హాసన్‌ జిల్లా అరకలగూడుకు చెందిన చేతన్‌ వీడియోల ను కూడా విడుదల చేయడంతో కన్నడ రాజకీయాల్లో మరోసారి సంచల నం చెలరేగింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో పరిచయమైన సూరజ్‌ ఫాంహౌస్‌కు పిలిచి లైంగిక దాడికి యతి్నంచాడని చేతన్‌ ఆరోపించాడు. 

డబ్బులు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్‌ 
చేతన్, అతని బంధువు డబ్బులు డిమాండ్‌ చేశారని, ఇవ్వకపోతే లైంగిక వేధింపుల కేసు పెడతామని బ్లాక్‌మెయిల్‌ చేశారని సూరజ్‌ రేవణ్ణ ముఖ్య అనుచరుడైన శివకుమార్‌ సైతం శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో స్నేహం చేసిన చేతన్‌.. సూరజ్‌ రేవణ్ణ బ్రిగేడ్‌కు పనిచేయడం ప్రారంభించాడని, కుటుంబ ఖర్చులకు డబ్బు ఇవ్వాలని కోరగా తాను నిరాకరించడంతో సూరజ్‌ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు పెడతామని బెదిరింపులకు దిగారని శివకుమార్‌ పేర్కొన్నారు. మొదట రూ. 5 కోట్లు  తర్వాత దాన్ని తగ్గించి రూ. 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారని అన్నా రు. శివకుమార్‌ ఫిర్యాదుతో చేతన్, అతని బంధువుపై కేసు నమోదైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement