Suraj
-
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు అరెస్ట్
బెంగళూరు: ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు జేడీ(ఎస్) ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణను లైంగిక వేధింపుల కేసులో హాసన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. హాసన్ జిల్లాలోని హోలెనరసిపుర పోలీసు స్టేషన్లో జేడీఎస్ కార్యకర్త చేతన్.. సూరజ్ రేవణ్ణపై లౌంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఈమేరకు పోలీసులు సూరజ్ రేవణ్ణను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించడాన్ని ఆయన తిరస్కరించటంతో పోలీసులు సూరజ్‌ను బెంగళూరు తీసుకువచ్చారు. ఇవాళ ఆయనకు పొటెన్సీ పరీక్ష నిర్వహించనున్నారు.తనపై సూరజ్ రేవణ్ణ లైంగిక వేధింపలకు పాల్పడినట్లు జేడీఎస్ కార్యకర్త చేతన్, మరోవ్యక్తి హోలెనరసిపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘సూరజ్ ఫామ్ హైజ్‌లో జూన్ 16 తేదీన నాపై లైంగికంగా దాడి చేశాడు. బదులుగా నాకు రాజకీయంగా ఎదగటానికి సాయం చేస్తాననని బలవంతంగా లైంగిక దాడికి దిగాడు. ఈ ఘటన జరిగిన తర్వాత సూరజ్‌కు మెసెజ్ చేస్తే.. ‘ఏం కాదు. అంతా సర్దుకుంటుంది’అని రిప్లై ఇచ్చాడు’అని కార్యకర్త చేతన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఫిర్యాదుపై స్పందించిన సూరజ్, అతని స్నేహితుడు శివకుమార్ తమను బ్లాక్మెయిల్ చేయడానికే చేతన్, మరోవ్యక్తి అసత్య లైంగిక ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేశారని అన్నారు. చేతన్ అనే వ్యక్తి తమతో స్నేహంగా ఉంటూ ఉద్యోగం కావాలని కోరితే.. ఉద్యోగం కోసమనే తాను సూరజ్‌ను పరిచయం చేశానని శివకుమార్ తెలిపారు. -
సూరజ్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు
బనశంకరి: జేడీఎస్‌కు చెందిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడి, నగ్న వీడియోల కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. తాజాగా ప్ర జ్వల్ తమ్ముడు డాక్టర్ సూరజ్ రేవణ్ణ (36)పై కూడా లైంగిక వేధింపుల కే సు నమోదైంది. ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ తనపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డారని చేతన్ కే.ఎస్. అనే జేడీఎస్ కార్యకర్త శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హాసన్ జిల్లా అరకలగూడుకు చెందిన చేతన్ వీడియోల ను కూడా విడుదల చేయడంతో కన్నడ రాజకీయాల్లో మరోసారి సంచల నం చెలరేగింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో పరిచయమైన సూరజ్ ఫాంహౌస్‌కు పిలిచి లైంగిక దాడికి యతి్నంచాడని చేతన్ ఆరోపించాడు. డబ్బులు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేతన్, అతని బంధువు డబ్బులు డిమాండ్ చేశారని, ఇవ్వకపోతే లైంగిక వేధింపుల కేసు పెడతామని బ్లాక్మెయిల్ చేశారని సూరజ్ రేవణ్ణ ముఖ్య అనుచరుడైన శివకుమార్ సైతం శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో స్నేహం చేసిన చేతన్.. సూరజ్ రేవణ్ణ బ్రిగేడ్‌కు పనిచేయడం ప్రారంభించాడని, కుటుంబ ఖర్చులకు డబ్బు ఇవ్వాలని కోరగా తాను నిరాకరించడంతో సూరజ్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు పెడతామని బెదిరింపులకు దిగారని శివకుమార్ పేర్కొన్నారు. మొదట రూ. 5 కోట్లు తర్వాత దాన్ని తగ్గించి రూ. 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని అన్నా రు. శివకుమార్ ఫిర్యాదుతో చేతన్, అతని బంధువుపై కేసు నమోదైంది. -
స్పెయిన్‌లో భర్తతో కలిసి చిల్ అవుతున్న మౌనీ రాయ్ (ఫొటోలు)
-
హబ్బీతో మౌనీరాయ్ విషు సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. నిశ్చితార్థం రోజే దుర్మరణం!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నటుడు సూరజ్ మెహర్( 40) మృతి చెందారు. అర్ధరాత్రి ట్రక్కును కారు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సూరజ్ మెహర్ సహచరుడు, డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇవాళ ఒడిశాలో అతనికి నిశ్చితార్థం జరగాల్సి ఉంది. శుభకార్యం జరగాల్సిన నటుడి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. బుధవారం అర్థరాత్రి తన సినిమా షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సూరజ్ మెహర్ ప్రస్తుతం "ఆఖ్రీ ఫైస్లా" అనే చిత్రంలో నటిస్తున్నారు. సూరజ్ ముఖ్యంగా విలన్ పాత్రలతో ఫేమస్ అయ్యారు. సూరజ్ మెహర్ బిలాస్‌పూర్‌లోని సరియా గ్రామానికి చెందిన వారుగా తెలుస్తోంది. -
గది తలుపులు తీయగా.. కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం! ఒక్కసారిగా..
మెదక్: పరిశ్రమలో పని చేయడానికి వచ్చిన మహిళ హత్యకు గురైంది. ఈ సంఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ కరుణాకర్‌రెడ్డి కథనం ప్రకారం.. కాళ్లకల్ గ్రామ శివారులో సర్వేనంబర్ 86లో గల గీతా ప్యానల్ ప్రొడక్ట్ పరిశ్రమ ఉంది. కాగా రెండేళ్ల క్రితం సూరజ్, రజనీదేవి చౌహాన్ (40) పరిశ్రమలో పని కోసం వచ్చారు. వారికి పని ఇచ్చి పరిశ్రమలోనే లేబర్ గదిని కేటాయించినట్లు పరిశ్రమ యజమాని ప్రవీణ్ పటేల్ తెలిపారు. కాగా ఈ నెల 19న సూరజ్ గదికి తాళం వేసి వెళ్లిపోయాడు. కాగా బుధవారం గదిలో నుంచి దుర్వాసన రావడంతో కార్మికులు యజయాని ప్రవీణ్ పటేల్‌కు సమాచార మిచ్చారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు పరిశ్రమ వద్దకు వచ్చి గది తలుపులు తీయగా కుళ్లిన స్థితిలో రజనీదేవి మృతదేహం కనిపించింది. దీంతో ఈమెను సూరజ్ హత్య చేసి వెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తులో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
సూరజ్ ఎస్టేట్ ఐపీవో బాట
న్యూఢిల్లీ: రియల్టీ రంగ కంపెనీ సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ మరోసారి పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. దీనిలో భాగంగా ఈక్విటీ జారీ ద్వారా రూ. 400 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. కంపెనీ ఇంతక్రితం 2022 మార్చిలోనూ ఐపీవో చేపట్టేందుకు ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇష్యూ నిధుల్లో రూ. 285 కోట్లు అనుబంధ సంస్థల రుణ చెల్లింపులకు, రూ. 35 కోట్లు భూముల కొనుగోలుకి, మిగిలిన నిధులను ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. గతేడాది(2022–23) రూ. 306 కోట్ల ఆదాయం, రూ. 32 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
షాకింగ్: ఓనర్‌పై కత్తులతో దాడి.. అడ్డొచ్చిన మరో ఇద్దరినీ దారుణంగా..!
గాంధీనగర్: గుజరాత్‌లోని సూరత్‌లో ఆదివారం షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పనిలోంచి తీసేశాడనే కోపంతో ఫ్యాక్టరీ యజమాని, ఆయన ఇద్దరు బందువులను దారుణంగా పొడిచి చంపేశారు ఇద్దరు వర్కర్లు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఒకరు మైనర్‌గా గుర్తించామని, వారిని ఇటీవలే పని లోంచి తీసేసినట్లు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. కల్పేశ్ ధోలకియాకు సూరత్‌లో వేదాంత టెక్సో పేరిటా ఎంబ్రయిడరీ ఫ్యాక్టరీ ఉంది. 10 రోజుల క్రితం పనిలోంచి తొలగించిన ఇద్దరు కార్మికులు ఆదివారం ఉదయం 9 గంటలకు ధోలకియాను కలిసేందుకు ఫ్యాక్టరీకి వచ్చారు. తమను పనిలోంచి తీసేయడంపై యజమానితో గొడవకు దిగారు. ఈ క్రమంలోనే అందులో ఒకరు కత్తి తీసి ధోలకియాను పొడిచాడు. అక్కడే ఉన్న కల్పేశ్ తండ్రి ధంజిభాయ్, అతడి మామ ఘన్‌శ్యామ్ రజోడియాలు కలుగజేసుకుని వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిని సైతం కత్తులతో పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు నిందితులు. హుటాహుటిన ముగ్గురిని స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు సూరత్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ హర్షద్ మెహత తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని, వారిలో ఒకరు జువెనైల్‌గా పేర్కొన్నారు. నైట్ డ్యూటీ సమయంలో వారు చేసిన తప్పిదం వల్ల ఇరువురిని పనిలోంచి తీసేసినట్లు గుర్తించామన్నారు. వారికి ఇవ్వాల్సిన జీతం మొత్తం ఇచ్చినట్లు చెప్పారు. ఇదీ చదవండి: ‘మా తల తీసేయమన్నా బాగుండేది’.. వర్శిటీల్లో నిషేధంపై అఫ్గాన్ మహిళల ఆవేదన -
World Wrestling:32 ఏళ్ల తర్వాత...
రోమ్ (ఇటలీ): సుదీర్ఘ నిరీక్షణకు తెర పడింది. ప్రపంచ రెజ్లింగ్ అండర్–17 చాంపియన్‌షిప్‌లో గ్రీకో రోమన్ విభాగంలో భారత్‌కు 32 ఏళ్ల తర్వాత స్వర్ణ పతకం లభించింది. మంగళవారం జరిగిన 55 కేజీల గ్రీకో రోమన్ విభాగంలో భారత యువ రెజ్లర్ సూరజ్ విజేతగా అవతరించాడు. ఫైనల్లో సూరజ్ 11–0తో ఫరైమ్ ముస్తఫయెవ్ (అజర్బైజాన్)పై విజయం సాధించాడు. తద్వారా 1990లో పప్పూ యాదవ్ తర్వాత ప్రపంచ అండర్–17 చాంపియన్‌షిప్‌లో గ్రీకో రోమన్ విభాగంలో పసిడి పతకం నెగ్గిన భారత రెజ్లర్‌గా సూరజ్ గుర్తింపు పొందాడు. -
ధిక్కారణాధికారాన్ని తొలగించలేరు!
న్యూఢిల్లీ: కోర్టులకు ఉండే ధిక్కార శిక్షాధికారాన్ని ఎలాంటి చట్టంతో తొలగించలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక ఎన్జీఓ చైర్‌పర్సన్‌ను కోర్టు ధిక్కారం కింద విచారిస్తూ గతంలో విధించిన రూ.25 లక్షల జరిమానాను చెల్లించకపోవడం ధిక్కరణేనని స్పష్టం చేసింది. ముద్దాయివి ధిక్కరణ చర్యలేనని, అలాంటి వాటిని శిక్షించకుండా కోర్టు వదిలేయదని జస్టిస్ సంజయ్ కిషన్‌తో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. సూరజ్ ట్రస్ట్ ఇండియా అనే సంస్థ అధిపతి రాజీవ్ దైయాపై కోర్టు ధిక్కార ఆరోపణలను సుప్రీం విచారించింది. గతంలో రాజీవ్ 64 ప్రజాప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశారు. అయితే ఒక్కదాంట్లో కూడా విజయం సాధించలేదు. దీంతో రాజీవ్‌కు సుప్రీంకోర్టు రూ.25 లక్షల జరిమానాను 2017లో విధించింది. దీనిపై పునఃపరిశీలన జరపాలని రాజీవ్ తాజాగా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు రాజీవ్‌ది ధిక్కారమేనని తేలి్చచెప్పింది. రాజీవ్ కోర్టులపై బురద జల్లుతున్నాడని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు ధిక్కారణాధికారం తమకు రాజ్యాంగం ఇచి్చందని తెలిపింది. రాష్ట్రపతితో జస్టిస్ ఎన్.వి. రమణ భేటీ సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ బుధవారం ఢిల్లీలో రాష్ట్రపతి రామ్నా«థ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. శనివారం విజ్ఞాన్ భవన్లో న్యాయ సేవలపై అవగా హనా కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. ఈ సదస్సు వివరాలను జస్టిస్ ఎన్.వి.రమణ రాష్ట్రపతికి వివరించారు. -
అప్పగింతల కర్ర
అమ్మాయిని పంపిస్తున్నాం. ‘సర్దుకుపోవాలి తల్లీ..’ ‘గుట్టును గడప దాటనివ్వకు బుజ్జీ..’ ‘అణకువగా ఉండు బంగారం..’ ‘మాటంటే నొచ్చుకోకు బిడ్డా..’ అన్నీ చెప్పాల్సిన మాటలే. వీటితో పాటు.. ఇవ్వాల్సిన కర్ర కూడా ఒకటి ఉంది. అప్పగింతల కర్ర! ధీమాకు.. ధైర్యానికి. అతడింకా నోరు విప్పలేదు. ‘నువ్వేనా నీ భార్యను చంపింది?’ ‘అవును’. ఎలా చంపావు? ‘ఆమె పడుకుని ఉన్న మంచం మీదికి పామును వదిలి కాటేయించాను’. ‘పాము ఎక్కడిది నీకు?’ ‘పాములోళ్ల దగ్గర పదివేలకు కొన్నాను’. ‘పాములోళ్లు నీకెలా తెలుసు?’ ‘యూట్యూబ్‌లో అడ్రస్ పట్టుకున్నాను’ ఉన్నది ఉన్నట్లు ఇంత బాగా చెబుతుంటే అతడు నోరు విప్పకపోవడం ఏమిటి? అవును. విప్పడంలేదు. ‘నీ భార్యను ఎందుకు చంపావు?’ అనే ప్రశ్నకు అతడింకా నోరు విప్పలేదు. అయితే అతడు నోరు విప్పడం అన్నది పోలీసులకు అవసరమే కానీ.. మన స్టోరీకి కాదు. మనక్కావలసింది.. అలాంటి వ్యక్తిని భర్తగా అమ్మాయిలు ఎందుకు భరిస్తూనే ఉంటారని! అలాంటి వ్యక్తితో సర్దుకుని పొమ్మని అమ్మాయిల తల్లిదండ్రులు అమ్మాయిలకు ఎందుకు చెబుతూనే ఉంటారని! అలాంటి వ్యక్తి అంటే? ∙∙ కట్నంగా ఐదు లక్షల క్యాష్ ఇచ్చారు. కిలో బంగారం ఇచ్చారు. కారు కొనిపెట్టారు. వరుడి చెల్లి చదువుకు డబ్బిచ్చారు. చదువుకే కాదు, చదువుకోడానికి టూ–వీలర్ కావాలంటే ఆ చెల్లికి వీలర్‌ని కూడా కానుకగా ఇచ్చారు. ఇక వరుడి తండ్రిగారు.. ఆయనకు బాడుగలకు తిప్పే లోడ్–వ్యాన్ కావాలంటే దాన్నీ కొనిపెట్టారు. ఇన్ని చేశాక పెళ్లి చేసుకున్నాడు. భార్యను తీసుకెళ్లాడు. అదూర్ అతడిది. పట్టణంతిట్ట జిల్లాలో ఉంటుంది. వధువుది ఆంచల్. కొల్లం జిల్లాలో ఉంటుంది. కేరళలోని జిల్లాలివి. 2018 మార్చి 26న పెళ్లయింది. 2020 మే 7న భార్యను చంపేశాడు. ఈ రెండేళ్ల కాలంలో భార్యతో అతడు ఏం మాట్లాడినా ఒకేమాట.. డబ్బు! ఇంకా తీసుకురా, ఇంకా తీసుకురా. ఆ ఇంకా.. నెలవారీ అయింది. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం అతడిది. ఆమె గృహిణి. ఉద్యోగంలో నెల నెల జీతం రాకపోయినా, భార్య నుంచి నెలనెలా ‘జీతాన్ని’ ఏర్పాటు చేసుకున్నాడు అతడు! అతడు సూరజ్. ఆమె ఉత్తర. ఏడాది వయసున్న కొడుకు. ‘పాపం ఇక మావాళ్లు డబ్బు ఇవ్వలేరండీ’ అన్నందుకు ఆ ఇంట్లోకి పాము దూరింది. మొదట ఆ పాము అతడి మెదడులోకి ప్రవేశించి, తర్వాత ఆమె బెడ్రూమ్లోకి పాకింది. మార్చి 2 ఆ రోజు. పాము చేత ఆమెను కాటేయించాడు. రెండునెలలు ఆసుపత్రిలో ఉంది. ‘అదృష్టం బాగుండి బతికింది. అది మామూలు పాము అయి ఉండదు’ అన్నారు డాక్టర్లు. అదూర్‌లోని ఆసుపత్రి నుంచి నేరుగా ఆంచల్‌లోని పుట్టింటికి తీసుకెళ్లారు ఉత్తరను ఆమె తల్లిదండ్రులు. రెండో అటెంప్ట్ ఆమె పుట్టింట్లోనే మే 7న చేశాడు సూరజ్. ఈసారి కోబ్రాను ప్రయోగించాడు. ఆమె చనిపోయింది. ∙∙ అల్లుడు ఎలాంటివాడో తెలుస్తూ ఉన్నప్పుడు కూతుర్ని అతడితో ఎందుకు ఉండనిస్తారు తల్లిదండ్రులు? కూతురు చెప్తూనే ఉంటుంది.. మెంటల్‌గా టార్చర్ పెడుతున్నాడనీ, చంపేస్తానని బెదిరిస్తున్నాడనీ, తను ఇంటికొస్తుంటేనే భయం వేస్తుందనీ..! అంతులేని డబ్బు ఆశ ఉన్నవాడి దగ్గర కూతురు ప్రాణాలకు ఎప్పటికైనా ప్రమాదమే అని ఎందుకు అనుకోరు తల్లిండ్రులు? అలాంటి భర్త లేకపోయినా ఏం కాదు.. మేమొస్తున్నాం, మాతో వచ్చేయ్. అతడిని వదిలేద్దాం అని ఎందుకు ధైర్యం ఇవ్వరు? ఒడ్డున ఉండి ప్రశ్నించినంత సులభం కాకపోవచ్చు వీటికి సమాధానాలు. ఎన్నో భయాలు ఉంటాయి. భర్తకు దూరంగా ఉందని తెలిస్తే పిల్ల పలచనై పోతుందన్న భయం ఉంటుంది. రేపు ఎప్పుడైనా.. బిడ్డకు తండ్రి లేడా అనే మాట వస్తుందన్న భయం ఉంటుంది. ఎన్ని భయాలున్నా.. పిల్ల ప్రాణం పోతుందేమోనన్న భయం కన్నా పెద్దవా?! దేశంలో రోజుకు 21 మంది భర్తలు డబ్బు కోసం తమ భార్యల్ని చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి! అమ్మాయి తల్లిదండ్రులు, అన్నదమ్ములు అమ్మాయికి కొంచెం సపోర్ట్‌గా ఉంటే ఇంట్లోకి పాము దూరక ముందే, ఆమె తన చేతిలోకి కర్రను తీసుకుంటుంది. ఆ కర్ర.. విడాకులే కానక్కర్లేదు. ‘నాకు నువ్వు అక్కర్లేదు’ అని చెప్పి బయటికి వచ్చే ధైర్యం కూడా కావచ్చు. పెళ్లినాటి ఫొటో : సూరజ్, ఉత్తర ఉత్తర ఫొటోతో ఆమె తల్లిదండ్రులు మణిమేఖల, విజయసేనన్ -
దేవెగౌడ మనవడిపై హత్యాయత్నం కేసు
బెంగళూరు: కర్ణాటకలో గురువారం 15 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికల నేపథ్యంలో జేడీఎస్‌కు షాక్ తగిలింది. నలుగురు బీజేపీ కార్యకర్తల మీద హత్యాయత్నం చేశారంటూ మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మనవడు సూరజ్ రేవన్నపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. హసన్ జిల్లాలోని చన్నరాయపట్న పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. జేడీఎస్ నుంచి బీజేపీలోకి మారిన కార్యకర్తల ఇళ్లపై దాదాపు 150–200 మంది వచ్చి దాడి చేశారని, ఆస్తులను ధ్వంసం చేశారని బీజేపీ ఆరోపించింది. గాయపడిన తమ కార్యకర్తలను ఆస్పత్రికి తరలించామని చెప్పారు. సరైన సమయానికి పోలీసులు రాకపోయి ఉంటే పరిస్థితి మరింత చేజారేదని అన్నారు. దీంతో సూరజ్ సహా ఆరు మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అయితే ఈ ఆరోపణలను జేడీఎస్ ఖండించింది. -
ఇక మీతోనూ వార్ చేస్తా!
సాక్షి, సిటీబ్యూరో: ‘పోలీసులపై నాలుగేళ్ల నుంచి పోరాటం చేస్తున్నా. ఇప్పుడు మీరు నన్ను అరెస్టు చేస్తున్నారు కదా..! ఇకపై మీ మీదా వార్ చేస్తా’... సైబర్ క్రైమ్ పోలీసులను ఉద్దేశించి ఈ మాటలు అన్నది ఏ తీవ్రవాదో, ఉగ్రవాదో కాదు. డీజీపీ సహా పోలీసు ఉన్నతాధికారులపై ఫేస్బుక్లో అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్టైన సీతాఫల్మండి వాసి సూరజ్ కుమార్. ఇటీవల అతడిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఇతను ఈ పని చేయడం వెనుక కుట్రలు లేవని, కేవలం ఓ చిన్న వివాదంలో తలదూర్చి, పోలీసులను అపార్థం చేసుకుని అనుచిత వ్యాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. సీతాఫల్మండి ప్రాంతానికి చెందిన సూరజ్‌కుమార్ ఎంసీఏ పూర్తి చేశాడు. కొన్నాళ్లు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేసినా మానేశాడు. దాదాపు మూడేళ్ల క్రితం ఇతడి ఇంటి సమీపంలో స్థానికులు రోడ్డు పక్కన ఓ ప్రార్థన స్థలం నిర్మించారు. దీంతో సూరజ్ సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఈ నిర్మాణం చట్ట విరుద్ధమని, తక్షణం కూల్చేయాలంటూ చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అది సున్నితమైన అంశం కావడం, నిర్మాణం అభ్యంతరకంగానూ లేకపోవడంతో పోలీసులు ఈ ఫిర్యాదును పట్టించుకోలేదు. దీంతో స్థానిక ఏసీపీ, డీసీపీలతో పాటు పోలీసు కమిషనర్ వరకు వెళ్ళిన సూరజ్ దీనిపై ఫిర్యాదు చేశాడు. ఓ దశలో న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. చివరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సైతం లేఖ రాశాడు. ఇవన్నీ పూర్తి కావడానికి మూడేళ్ళు పట్టింది. ఎవరూ తన విషయాన్ని పట్టించుకోవట్లేదనే ఉద్దేశంతో విచక్షణ కోల్పోయిన సూరజ్ కొన్ని రోజుల క్రితం తన ఫేస్బుక్ పేజ్‌లో డీజీపీతో పాటు మరికొందరు అధికారులు/అధికారిణు లను ఉద్దేశించి అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. దీనిపై డీజీపీ కార్యాలయం గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ గంగాధర్ నేతృత్వంలోని బృందం కొన్ని గంటల్లోనే ఛేదించింది. సీతాఫల్‌మండీలోని సూరజ్ ఇంటికి వెళ్ళి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అధికారుల్ని ఉద్దేశించి ‘భద్రతా కారణాల నేపథ్యంలో నేను ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నా. నా వివరాలు, చిరునామా మీకు ఎలా తెలిశాయి?’ అంటూ ప్రశ్నించాడు. అంతటితో ఆగకుండా ‘సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు రావాలంటే ముందు నాకు ఫోన్ ఇవ్వండి. ప్రతిపక్ష నేతలు, మీడియాతో మాట్లాడిన తర్వాతే మీతో వస్తా. లేదంటే నా భద్రతకు గ్యారెంటీ లేదు’ అంటూ హడావుడి చేశాడు. ఇతడిని సైబర్ క్రైమ్ ఠాణాకు తీసుకువచ్చిన అధికారులు వివిధ కోణాల్లో విచారించారు. సూరజ్‌లో మార్పు రావాలనే ఉద్దేశంతో అలాంటి పనులు చేయవద్దని హితవు పలికారు. దీంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అతను ‘ఇప్పటి వరకు పోలీసుల పైనే యుద్ధం చేస్తున్నా. ఇకపై మీతోనూ (సైబర్ క్రైమ్ పోలీసులు) వార్ చేస్తా’ అంటూ వ్యాఖ్యానించాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలతో జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
స్వచ్ఛమైన ప్రేమ
‘‘టు ఫ్రెండ్స్’ హీరో కార్తీక్ కోసం ఈ వేడుకకు వచ్చా. అతనికి ఉజ్వల భవిష్యత్తు ఉండాలి. రైతు కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చిన అనంతరాముడు అగ్ర నిర్మాతగా ఎదగాలి’’ అని హీరో శ్రీకాంత్ అన్నారు. సూరజ్, అఖిల్ కార్తీక్ హీరోలుగా, సోనియా, ఫర హీరోయిన్లుగా శ్రీనివాస్ జి.ఎల్.బి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టు ఫ్రెండ్స్’. ట్రూ లవ్ ఉపశీర్షిక. ముళ్లగూరు లక్ష్మీదేవి సమర్పణలో ముళ్లగూరు అనంతరాముడు, ముళ్లగూరు రమేష్ నాయుడు నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో అనంతరాముడు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం నిర్మాణంలో కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. సినిమా బాగా రావడం వల్ల వాటిని అనుభవ పాఠాలుగా తీసుకున్నా. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని కన్నడంలో రిలీజ్ చేయగా, మంచి వసూళ్లు సాధించింది’’ అన్నారు. -
ఇద్దరు స్నేహితులు
ఆనంతలక్షి్మ క్రియేష¯Œ ్స పతాకంపై ముళ్లగూరు లక్షీ్మదేవి సమర్పణలో ముళ్లగూరు ఆనంతరాముడు–ముళ్లగూరు రమేష్ నాయుడు తెలుగు–కన్నడ భాషల్లో నిర్మించిన సినిమా ‘టు ఫ్రెండ్స్’. సూరజ్, అఖిల్ కార్తిక్, సోనియా, ఫరా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ జి.ఎల్.బి దర్శకుడు. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను అవిభక్త ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య విడుదల చేశారు. ‘‘అన్ని రంగాల్లో అసాధారణ విజయాలు సాధిస్తున్న అనంత రాముడు సినిమా రంగంలోనూ సక్సెస్ అవ్వాలి’’ అన్నారు రోశయ్య. ‘‘సినిమా రంగం మోసపూరితమైనదని చాలామంది భయపెట్టారు. కానీ నాకెలాంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదు. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీస్తాను’’ అన్నారు అనంత రాముడు. ‘‘ఖర్చుకు వెనకాడకుండా నిర్మాతలు అందించిన సహాయ సహకారాల వల్ల సినిమా బాగా తీయగలిగాను’’ అన్నారు దర్శకుడు. దర్శకులు బి. గోపాల్, మారుతి, నిర్మాతలు సి. కల్యాణ్, రామసత్యనారాయణ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. -
నిజమైన ప్రేమ
సూరజ్, అఖిల్ కార్తీక్ హీరోలుగా, సోనియా, ఫర హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘టు ఫ్రెండ్స్’. ‘ట్రూ లవ్’ అనేది ఉపశీర్షిక. శ్రీనివాస్ జి.ఎల్.బి దర్శకత్వంలో ముళ్లగూరు లక్ష్మీదేవి సమర్పణలో ముళ్లగూరు అనంతరాముడు, ముళ్లగూరు రమేష్ నాయుడు నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను నిర్మాత సి.కల్యాణ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నేను నిర్మాత అయ్యేందుకు కారకులైన నారపురెడ్డి మిత్రులు ముళ్లగూరు ఆనంతరాముడుగారు నిర్మించిన ‘టు ఫ్రెండ్స్’ ట్రైలర్ విడుదల చేసే అవకాశం నాకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘విద్య, వ్యవసాయం, స్థిరాస్తి, ఫైనాన్స్.. వంటి పలు రంగాల్లో విజయాలు సాధించిన నేను సినిమా రంగంలోనూ విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది. భవిష్యత్తులోనూ మరిన్ని మంచి సినిమాలు తీస్తా’’ అన్నారు ముళ్లగూరు అనంతరాముడు. ‘‘ఖర్చుకు వెనకాడకుండా నిర్మాతలు అందించిన సహాయ సహకారాల వల్లే ఈ సినిమా బాగా వచ్చింది’’ అన్నారు శ్రీనివాస్ జి.ఎల్.బి. -
‘సూరజ్’ సాగు సూపర్!
కరువుకు కేరాఫ్‌గా మారిన మెట్ట/చల్కా నేలల్లో రైతులు ఇప్పుడు దేశీ పత్తి వంగడాలతో తెల్ల బంగారం పండిస్తున్నారు. మూడేళ్ల నుంచి ఎలాంటి రసాయనిక ఎరువులను ముట్టుకోకుండా సిరుల పంటను సాగు చేస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో, తక్కువ పెట్టుబడితో లాభాలు ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలో రైతులు సూరజ్ రకం నాన్ బీటీ – దేశీ పత్తి సాగుతో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు. నిత్యం కరువుతో కాలం వెళ్లదీసే జనగామ ప్రాంత చల్కా/మెట్ట భూముల రైతులు సేంద్రియ పద్ధతుల్లో దేశీ పత్తిని సాగు చేస్తున్నారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సుస్థిర వ్యవసాయ కేంద్రం(సి.ఎస్.ఎ.) మార్గదర్శకత్వంలో లింగాల ఘనపురం రైతులు మూడేళ్ల నుంచి సేంద్రియ పద్ధతుల్లో సూరజ్ అనే సూటిరకం నాన్‌బీటీ పత్తిని సాగు చేస్తున్నారు. ఆదర్శ సేంద్రియ రైతు కో ఆపరేటివ్, ఏనబావి సేంద్రియ సహకార సంఘం ఆధ్వర్యంలో.. మాణిక్యపురం, ఎనబావి, కళ్లెం, సిరిపురం, జీడికల్, వనపర్తి గ్రామాల్లోని 32 మంది రైతులు 62 ఎకరాల్లో వర్షాధారంగానే నాన్‌బీటీ పత్తిని సాగు చేస్తున్నారు. లింగాల ఘనపురం మండలం సిరిపురానికి చెందిన రైతు కుబర్ల గిరిబాబు డిగ్రీ వరకు చదువుకొని, పది ఎకరాల భూమిలో కొంతకాలం బీటీ పత్తి సాగు చేశారు. బీటీ పత్తి విత్తనాల వల్లనే బొంతపురుగు వంటి కొత్త కీటకాలు పంటను ఆశించి నష్టం చేస్తున్నాయనే భావనతో గిరిబాబు సి.ఎస్.ఎ. తోడ్పాటుతో పదేళ్ల క్రితం నుంచే సేంద్రియ సాగు చేపట్టారు. ఈ ఖరీఫ్‌లో మూడు ఎకరాల్లో నాన్‌బీటీ పత్తితోపాటు వరి, కంది పంటలను కూడా సాగు చేశారు. బీటీ పత్తి రైతులు రసాయనాల కోసమే అధికంగా ఖర్చు చేస్తూ అప్పులపాలవుతున్నారన్నారు. సేంద్రియ సాగులో ప్రాణాంతకమైన సమస్యలేమీ లేవన్నారు. తక్కువ పెట్టుబడితోనే పంటలు పండిస్తున్నామని, తమ పంటకు మార్కెట్లో గిరాకీ ఉందని గిరిబాబు(99126 88157) అన్నారు. సేంద్రియ సాగుతో లాభాలు ఇవీ... ► ఎలాంటి రసాయనిక ఎరువులు, పురుగు మందులు, కలుపు మందుల అవసరం లేదు. ► సూరజ్ వంటి నాన్ బీటీ, దేశీ పత్తి విత్తనాల వల్ల భూసారం దెబ్బతినదు. ► ఈ పత్తి నుంచి విత్తనాలు తీసి, మళ్లీ వాడుకోవచ్చు. ప్రతి ఏటా కంపెనీల నుంచి విత్తనాలు కొనక్కర్లేదు. ► చెరువు మట్టి, జీవామృతం, వర్మీ కంపోస్టు, పశువుల పేడ ద్వారా భూమిని సారవంతం చేస్తారు. ► వేపద్రావణం, వావిలాకు కషాయం, పచ్చిమిర్చి, వెల్లుల్లి ద్రావణం పిచికారీ చేస్తారు. నాన్ బీటీ పత్తి విత్తనాలతో రైతులకు మేలు.. ► బీటీ పత్తి విత్తనాల మాదిరిగా దేశీ పత్తి రకాల సాగులో రసాయనాల అవసరం ఉండదు. ► వర్షధారంగా ఎకరానికి 4–8 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ► పత్తిని అమ్ముకోవడానికి దూరప్రాంతాలకు వెళ్లే అవసరం లేదు. దేశీ పత్తితో వస్త్రాలు నేసే సంస్థలే నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేస్తాయి∙ ► ఎలాంటి కమీషన్లు ఉండవు. ► ప్రస్తుతం సీసీఐ క్వింటా పత్తికి రూ.4,000 చెల్లిస్తుంటే.. నాన్‌బీటీ పత్తికి రూ. 5,100 ధర పలుకుతున్నది. ప్రభుత్వం ప్రోత్సహించాలి! దేశీ పత్తి రకం సూరజ్ తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారంగా తేలిక నేలల్లో సాగుకు అనుకూలమైనది. ఈ సంవత్సరం సహజాహారం ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో కొందరు రైతులతో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయించాం. చేనేత సంస్థలు మల్కా, అభిహార రైతుల నుంచి సూరజ్ దేశీ పత్తి(28–32 ఎం.ఎం. పింజ)ను అధిక ధరకు కొనుగోలు చేశాయి. సూరజ్ సూటి రకం కావడంతో విత్తనాలను తిరిగి వాడుకోవచ్చు. దీని సాగును ప్రభుత్వం ప్రోత్సహించాలి. తద్వారా మన చేనేత కార్మికులకు సేంద్రియ పత్తి స్థానికంగానే అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం 150 క్వింటాళ్ల వరకు సూరజ్ విత్తనాలు ఉన్నాయి. ఆసక్తిగల రైతులు సహజ ఆహారం ప్రొడ్యూసర్ కంపెనీ(85007 83300)ని గానీ, కిసాన్ కాల్ సెంటర్ (85009 83300)ను గానీ సంప్రదించవచ్చు. – డా. జీవీ రామాంజనేయులు, డైరెక్టర్ జనరల్, సుస్థిర వ్యవసాయ కేంద్రం ramoo@csa-india.org చేతి కష్టమే పెట్టుబడి! రెండు ఎకరాల్లో నాన్‌బీటీ పత్తిని సాగు చేస్తున్నా. మూడు సంవత్సరాల నుంచి ఇదే సాగు. వర్షం పడితేనే నీళ్లు. బోరు, బావి లేవు. డిసెంబర్ నాటికే పంట పూర్తిగా అయిపోతుంది. డిసెంబర్లో వర్షం పడితే మరో రెండు నెలలు పంట వస్తుంది. చేతుల కష్టమే పెట్టుబడి. ఇప్పటికైతే నష్టపోలేదు. డబ్బుల దగ్గర , ధర విషయంలో ఎలాంటి కిరికిరి లేదు. – మూటకోరు యాదగిరి (70324 64439), సేంద్రియ పత్తి రైతు, సిరిపురం, జనగామ జిల్లా మందులు కొనడం మానేశా! నాకు ఎకరం 20 సెంట్ల భూమి ఉంది. మూడేళ్ల నుంచి నాన్‌బీటీ పత్తిని వేస్తున్నా. విత్తనాల నుంచి మొదలుకొని ఎరువులు, కషాయాలు అన్నీ నావే. ఎకరానికి రూ.8 వేల వరకు పెట్టుబడి అవుతుంది. పత్తిని అమ్మితే మాత్రం రూ. 20 వేల వరకు వస్తున్నాయి. పురుగుల మందులు కొనడం పూర్తిగా మానేశాం. రవాణా ఖర్చులు, కటింగ్‌లు, కమీషన్లు లేవు. శరీరంపై ప్రభావం చూపే మందుల వాడకం లేదు. నీటి సౌలతి ఉంటే ఎక్కువ దిగుబడి వచ్చేది. నాన్బీటీతో లాభాలే తప్ప నష్టాలు లేవు. – చెన్నూరి ఉప్పలయ్య (95025 06186), సేంద్రియ నాన్‌బీటీ పత్తి రైతు, సిరిపురం, జనగామ జిల్లా – ఇల్లందుల వెంకటేశ్వర్లు, సాక్షి, జనగామ జిల్లా ఫొటోలు: గోవర్ధనం వేణుగోపాల్ -
నిజమైన ప్రేమ
ప్రేమ గొప్పదా? స్నేహం గొప్పదా? అనే అంశాలను చర్చిస్తూ రూపొందిన తెలుగు, కన్నడ సినిమా ‘2 ఫ్రెండ్స్’. ట్రూ లవ్... ఉపశీర్షిక. సూరజ్ హీరోగా జి.ఎల్.బి. శ్రీనివాస్ దర్శకత్వంలో మళ్ళగూరు అనంతరాముడు, మళ్ళగూరు రమేశ్‌నాయుడు నిర్మించిన ఈ సినిమా చిత్రీకరణతో పాటు డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం రీ–రికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ప్రేమ, స్నేహం, వినోదంతో రూపొందిన మంచి సందేశాత్మక చిత్రమిది. ఇప్పటి యువత ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోంది. కాలేజీ రోజుల్లోనే యువత భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. అటువంటి సమయంలో వారు ప్రేమ, స్నేహం అంశాలను ఎలా చూస్తున్నారనేది సినిమా’’ అన్నారు. రవీంద్రతేజ, సానియా, స్నిగ్ధ, కార్తీక్, సారా, ధనరాజ్, కోట శ్రీనివాసరావు, జయప్రకాశ్‌రెడ్డి, వై. విజయ, శ్రీలక్ష్మీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ, మాటలు, సంగీతం: పోలూర్ ఘటికాచలం. -
‘సినిమాను అడ్డుకుని అన్ని థియేటర్లు తగలబెట్టాలి’
సాక్షి, న్యూఢిల్లీ : చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ‘పద్మావతి’ సినిమాపై వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇదివరకే ఈ సినిమాను పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో నిషేధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీని తీసిన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, హీరోయిన్ దీపికా పదుకొనేల తలలు తెచ్చి ఇచ్చే వారికి రూ. 10 కోట్లు వీకెండ్ ఆఫర్ అంటూ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ సీనియర్ నేత సూరజ్ పాల్ అము.. మరోసారి ఏకంగా ఫిల్మ్ ఇండస్ట్రీని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలోని యువత, సమస్యలపై పోరాటానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులు తలుచుకుంటే ప్రతి సినిమాను అడ్డుకుని థియేటర్లను తగలబెట్టగలరు. ప్రతి సినిమా అడ్డుకోవడానికి వారిలో ఆ సామర్థ్యం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ్ భారత్‌లో భాగంగా సినిమాలను సమూలంగా నాశనం చేయాలంటూ’ బీజేపీ నేత సూరజ్ పాల్ చేసిన తాజా వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇలాంటి సినిమాలను మరొకరు తీయవద్దని, లేదంటే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు ఈ సినిమాకు వ్యతిరేకంగా రాజ్‌పుత్ వర్గీయులు ఆందోళన నిర్వహిస్తుండటంతో డిసెంబర్ 1న రావాల్సి ఉన్న ఈ సినిమా విడుదల తాత్కాలికంగా నిలిచిపోయింది. పద్మావతి విడుదలకు ముందే రాజ్‌పుత్ వర్గీయులతో పాటు కర్ణిసేన బృందానికి సినిమా ప్రివ్యూ చూపించి, వివాదాలకు కేంద్ర బిందువైన సీన్లను తొలగించాలని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి పలువురు కేంద్ర మంత్రులతో పాటు కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సూచించారు. కాగా, మూవీని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ’పద్మావతి’ విడుదలపై తాము జోక్యం చేసుకోలేమని, అది పూర్తిగా సెన్సార్ బోర్డు పరిధిలోని అంశమని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. -
విశాల్‌తో హన్సిక ఓకే అంటుందా?
కోలీవుడ్‌లో హీరోయిన్ల విషయానికొస్తే నయనతార, సమంత, కాజల్ అగర్వాల్, తమన్నా, హన్సిక లాంటి వారే ఎక్కువ అవకాశాలను దక్కించుకుంటున్నారన డం వాస్తవం. పారితోషికం ఎక్కువైనా ప్రముఖ కథానాయకులు, దర్శక నిర్మాతలు వీరినే కోరుకుంటున్నారన్నది నిజం. ఇప్పుడు తమిళసినిమా పరిమాణం మారింది అనడం కంటే విస్తీర్ణత పెరిగిందని చెప్పడం కరెక్ట్‌గా ఉంటుంది. ఇక్కడి ప్రముఖ హీరోలు తమిళంతో పాటు తెలుగు తదితర ఇతర భాషల్లోనూ పాపులారిటీని తద్వారా మార్కెట్‌ను పెంచుకునే విధంగా దృష్టిపెడుతున్నారన్నది వాస్తవం. అందులో భాగంగానే బహుభాషల్లో ప్రాచుర్యం గల హీరోయిన్లను తమకు జంటగా ఎంపిక చేసుకుని లబ్ధి పొందాలని భావిస్తున్నారు. నటుడు విశాల్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ అభిమానులున్నారు.ఆయన చిత్రాలకు అక్కడ కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఇలాంటి వన్నీ లెక్కలేసుకుని తన చిత్రాల్లో హీరోయిన్ల ఎంపిక విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని భావించవచ్చు. ప్రస్తుతం నటిస్తున్న మరుదు చిత్రంలో తెలుగమ్మాయి శ్రీదివ్యను తనకు జంటగా ఎంచుకున్నారు. ఈ చిత్రం పూర్తి కావచ్చింది. దీంతో తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు. సురాజ్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇందులో ఆయనకు ప్రతినాయకుడిగా జగపతిబాబు నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక హాస్యం నుంచి కథానాయకుడిగా అవతారమెత్తిన నటుడు వడివేలు చాలా కాలం తరువాత ఈ చిత్రం ద్వారా హాస్యపాత్రకు మారనున్నారు.అదే విధంగా ఇందులో నటించే హీరోయిన్ ఎవరన్నది ఇంకా స్పష్టతకు రాలేదు.ఇంతకు ముందు ప్రేమమ్ చిత్రంలో నటించిన మలయాళ భామ మడినా సెబాస్టియన్ నటించనుందనే ప్రచారం జరిగింది. తాజాగా అందాలరాశి హన్సికను నటింపజేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఈ అమ్మడు ఇప్పటికే విశాల్‌తో ఆంబళ చిత్రంలో రొమాన్స్ చేసిందన్నది గమనార్హం.ఆ చిత్రం మంచి విజయానే సొంతం చేసుకుంది. దీంతో కమర్షియల్ అంశాలకు వినోదాన్ని జోడించి తెరకెక్కించనున్న ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. మరి హన్సిక రెండోసారి విశాల్‌తో డ్యూయెట్లకు సై అంటుందా? అన్నది తేలాల్సి ఉంది. -
శ్రీవారికి ప్రేమగా వంట
కథానాయికగా వెండితెరపై తళుక్కుమన్న కామ్నా జెఠ్మలాని.. ఇప్పుడు ఇల్లాలి పాత్రలో ఒదిగిపోయింది. ఎనిమిది నెలల కిందట ఏడడుగులు నడిచిన ఈ ముద్దుగుమ్మ.. కలవారి కోడలిగా కొత్త ఇన్నింగ్స మొదలెట్టింది. శుక్రవారం మాదాపూర్‌లోని వీవీనగర్‌లో జీసీ హైపర్ మార్కెట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కామ్నా ‘సిటీ ప్లస్’తో కాసేపు ముచ్చటించింది. పుట్టింది, పెరిగింది ముంబైలోనే. అమ్మ, నాన్న, నేను తమ్ముడు, చెల్లి.. మై ఫ్యామిలీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. నాన్న ట్రాన్స్పోర్ట్ బిజినెస్. అమ్మ హౌస్‌వైఫ్. తమ్ముడు కూడా ఇప్పుడు బిజినెస్‌లో ఉన్నాడు. నేను మా ఇంట్లో 65 ఏళ్ల తర్వాత పుట్టిన ఆడపిల్లను. అందుకే అల్లారుముద్దుగా చూసుకుంటారు. టెక్స్టైల్ డిజైనింగ్ చేశాను. సినిమాల్లోకి రాకపోయి ఉంటే డిజైనర్‌గా సెటిల్ అయి ఉండేదాన్ని. ఫ్యూచర్లో పిల్లలకు సంబంధించిన ఒక ఇన్నోవేటివ్ ఫీల్డ్‌ను నెలకొల్పుతాను. ఎప్పటికీ మరచిపోలేను కాలేజ్ డేస్‌లో కల్చరల్ ప్రోగ్రామ్స్, ముఖ్యంగా ఫ్యాషన్ షోలో ఉత్సాహంగా పాల్గొనేదాన్ని. ఓ షో చూసిన డెరైక్టర్ హీరోయిన్గా అవకాశం ఇచ్చారు. సినిమాల కోసమే 9 ఏళ్ల కిందట మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చా. అప్పుడు శిల్పకళావేదికలో పెర్ఫార్మెన్స్ ఇచ్చా. అప్పటికి నేనెవరో తెలియకపోయినా.. అక్కడున్నవారంతా నన్నెంతో అభినందించారు. ఆరోజు మరచిపోలేను. ఏనాటి బంధమో... నాకు హైదరాబాద్‌తో ఏదో తెలియని అనుబంధం ఉంది. సిటీలో బాగా నచ్చే ప్లేస్ గోల్కొండ ఫోర్ట్. అక్కడ షూటింగ్ కోసమని వారం రోజులు ఉన్నాను. ఎంతో ఎంజాయ్ చేశాను. ఈ తొమ్మిదేళ్లలో హైదరాబాద్ ఎంతో మారిపోయింది. నేను ఫస్ట్‌టైం సిటీకి వచ్చినప్పుడు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో దిగాను. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ సూపర్బ్. అక్కడ రోడ్లు, చెట్లు, వ్యూ.. కొత్తగా అనిపిస్తాయి. బంజారాహిల్స్ చట్నీస్ రెస్టారెంట్లో సెట్ దోశ భలే ఇష్టం. కొత్తగా.. హ్యాపీగా... ఎనిమిది నెలల కిందట పెళ్లయింది. పక్కా అరేంజ్డ్ మ్యారేజ్. మా అత్తగారిల్లు బెంగళూరు. అక్కడే ఉంటున్నా. మా ఆయన సూరజ్. మెకానికల్ ఇంజనీర్. ఆయనకు స్పేర్ పార్ట్స్ ఇండస్ట్రీ ఉంది. షూటింగ్‌లకు ప్యాకప్ చెప్పినా నో ప్రాబ్లమ్. నా లైఫ్ ఫుల్ సెక్యూర్డ్. మా శ్రీవారి హైట్ 6.2 అడుగులు.. ఆయన పక్కన నిల్చుంటే క్రేజీగా అనిపిస్తుంది. నా వంటల ఎక్స్పరిమెంట్స్ అంటే ఆయనకు ఇష్టం. మా అమ్మకు ఫోన్ చేసి మరీ ప్రేమగా వండి పెడుతుంటాను. నేను ప్రాపర్ హోమ్ మేకర్నని అనుకుంటున్నాను. కుకింగ్, నా భర్తను, అత్తయ్యను చూసుకోవడం ఇవన్నీ కొత్తగా ఉన్నా హ్యాపీగానే ఉంది. - శిరీష చల్లపల్లి -
అంజలిని తొలగించలేదు
తమ చిత్రం నుంచి నటి అంజలిని తొలగించలేదని దర్శకుడు సూరజ్ వెల్లడించారు. జయం రవి హీరోగా ఈయన దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కుతోంది. లక్ష్మీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇద్దరు కథా నాయికల్లో ఒకరిగా నటి అంజలిని ఎంపిక చేశారు. అంజలి తన పిన తల్లితో మనస్పర్థల కారణంగా గత ఏడాది మార్చిలో అనూహ్యంగా హైదరాబాద్ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అదే విధంగా తన పిన్ని, దర్శకుడు కలైంజయం వలన తనకు ప్రాణానికి ముప్పు ఉందని ఫిర్యాదు కూడా చేశారు. అయితే కలైంజయం చిత్రం ఊరు చుట్టి పురాణం చిత్రంలో కొన్ని రోజులు నటించిన అంజలి ఆ చిత్రాన్ని పూర్తి చేయలేదు. ఇలాంటి పరిస్థితిలో అంజలి మళ్లీ కోలీవుడ్‌లో నటించడానికి సిద్ధం అవడంతో దర్శకుడు కలైంజయం ఆమె రీ ఎంట్రీని అడ్డుకుంటానని ప్రకటించారు. తన చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత అంజలి ఇతర తమిళ చిత్రాల్లో నటించాలని ఆయన పట్టుబడుతున్నారు. ఈ విషయమై కలైంజయం ఇప్పటికే దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేశారు. దీంతో జయంరవి సరసన నటించే చిత్రం నుంచి అంజలిని తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి స్పందించిన ఆ చిత్ర దర్శకుడు సూరజ్ తమ చిత్రం నుంచి అంజలిని తొలగించినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. అంజలినే తమ చిత్ర హీరోయిన్ అని సూరజ్ స్పష్టం చేశారు.