విశాల్‌తో హన్సిక ఓకే అంటుందా? | Hansika to pair up with Vishal again? | Sakshi
Sakshi News home page

విశాల్‌తో హన్సిక ఓకే అంటుందా?

Published Tue, Apr 12 2016 2:47 AM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM

విశాల్‌తో హన్సిక ఓకే అంటుందా?

విశాల్‌తో హన్సిక ఓకే అంటుందా?

కోలీవుడ్‌లో హీరోయిన్ల విషయానికొస్తే నయనతార, సమంత, కాజల్ అగర్వాల్, తమన్నా, హన్సిక లాంటి వారే ఎక్కువ అవకాశాలను దక్కించుకుంటున్నారన డం వాస్తవం. పారితోషికం ఎక్కువైనా ప్రముఖ కథానాయకులు, దర్శక నిర్మాతలు వీరినే కోరుకుంటున్నారన్నది నిజం. ఇప్పుడు తమిళసినిమా పరిమాణం మారింది అనడం కంటే విస్తీర్ణత పెరిగిందని చెప్పడం కరెక్ట్‌గా ఉంటుంది. ఇక్కడి ప్రముఖ హీరోలు తమిళంతో పాటు తెలుగు తదితర ఇతర భాషల్లోనూ పాపులారిటీని తద్వారా మార్కెట్‌ను పెంచుకునే విధంగా దృష్టిపెడుతున్నారన్నది వాస్తవం. అందులో భాగంగానే బహుభాషల్లో ప్రాచుర్యం గల హీరోయిన్లను తమకు జంటగా ఎంపిక చేసుకుని లబ్ధి పొందాలని భావిస్తున్నారు.

నటుడు విశాల్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ అభిమానులున్నారు.ఆయన చిత్రాలకు అక్కడ కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఇలాంటి వన్నీ లెక్కలేసుకుని తన చిత్రాల్లో హీరోయిన్ల ఎంపిక విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని భావించవచ్చు. ప్రస్తుతం నటిస్తున్న మరుదు చిత్రంలో తెలుగమ్మాయి శ్రీదివ్యను తనకు జంటగా ఎంచుకున్నారు. ఈ చిత్రం పూర్తి కావచ్చింది. దీంతో తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు. సురాజ్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు.

ఇందులో ఆయనకు ప్రతినాయకుడిగా జగపతిబాబు నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక హాస్యం నుంచి కథానాయకుడిగా అవతారమెత్తిన నటుడు వడివేలు చాలా కాలం తరువాత ఈ చిత్రం ద్వారా హాస్యపాత్రకు మారనున్నారు.అదే విధంగా ఇందులో నటించే హీరోయిన్ ఎవరన్నది ఇంకా స్పష్టతకు రాలేదు.ఇంతకు ముందు ప్రేమమ్ చిత్రంలో నటించిన మలయాళ భామ మడినా సెబాస్టియన్ నటించనుందనే ప్రచారం జరిగింది.

తాజాగా అందాలరాశి హన్సికను నటింపజేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఈ అమ్మడు ఇప్పటికే విశాల్‌తో ఆంబళ చిత్రంలో రొమాన్స్ చేసిందన్నది గమనార్హం.ఆ చిత్రం మంచి విజయానే సొంతం చేసుకుంది. దీంతో కమర్షియల్ అంశాలకు వినోదాన్ని జోడించి తెరకెక్కించనున్న ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. మరి హన్సిక రెండోసారి విశాల్‌తో డ్యూయెట్లకు సై అంటుందా? అన్నది తేలాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement