న్యూఢిల్లీ: రియల్టీ రంగ కంపెనీ సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ మరోసారి పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. దీనిలో భాగంగా ఈక్విటీ జారీ ద్వారా రూ. 400 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది.
కంపెనీ ఇంతక్రితం 2022 మార్చిలోనూ ఐపీవో చేపట్టేందుకు ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇష్యూ నిధుల్లో రూ. 285 కోట్లు అనుబంధ సంస్థల రుణ చెల్లింపులకు, రూ. 35 కోట్లు భూముల కొనుగోలుకి, మిగిలిన నిధులను ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. గతేడాది(2022–23) రూ. 306 కోట్ల ఆదాయం, రూ. 32 కోట్ల నికర లాభం ఆర్జించింది.
Comments
Please login to add a commentAdd a comment