Public issue
-
ఐపీవోలపై కంపెనీల కసరత్తు..
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధులను సమీకరించుకునేందుకు మరిన్ని కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఇందుకు సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేస్తున్నాయి. తాజాగా స్టడ్స్ హెల్మెట్స్, పార్క్ మెడి వరల్డ్, ఎస్ఐఎస్ క్యాష్ సర్వీస్ మొదలైన సంస్థలు తమ ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. ఇక ఐపీవో సన్నాహాల్లో ఉన్న ఒక్కొక్క సంస్థ వివరాలను చూస్తే.. రూ. 1,260 కోట్ల పార్క్ మెడి వరల్డ్ ఇష్యూ.. పార్క్ బ్రాండ్ కింద హాస్పిటల్ చెయిన్ నిర్వహించే పార్క్ మెడి వరల్డ్ సంస్థ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,260 కోట్లు సమీకరించనుంది. దీనికి సంబంధించిన ముసాయిదా పత్రాలను సెబీకి సమర్పించింది. ఈ ఇష్యూ కింద రూ. 900 కోట్లు విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్ అజిత్ గుప్తా రూ. 300 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. ప్రీ–ఐపీవో ప్లేస్మెంట్ కింద రూ. 192 కోట్లు సమీకరించే యోచనలో కంపెనీ ఉంది. ఇష్యూ ద్వారా సేకరించిన నిధుల్లో రూ. 410 కోట్ల మొత్తాన్ని రుణాలను తీర్చేసేందుకు, రూ. 110 కోట్లను కొత్త ఆస్పత్రి నిర్మాణం, అనుబంధ సంస్థలైన పార్క్ మెడిసిటీ (ఎన్సీఆర్), బ్లూ హెవెన్స్‌కి చెందిన ప్రస్తుత ఆస్పత్రుల విస్తరణ కోసం కంపెనీ వినియోగించుకోనుంది. 3,000 పైచిలుకు పడకల సామర్థ్యంతో ఉత్తరాదిలో పార్క్ మెడి వరల్డ్ రెండో అతి పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ చెయిన్‌గా కార్యకలాపాలు సాగిస్తోంది. న్యూఢిల్లీ, జైపూర్, ఫరీదాబాద్ తదితర ప్రాంతాల్లో కంపెనీకి 13 మల్టీ–సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఉన్నాయి. ఎస్ఐఎస్.. షేర్ల జారీతో రూ. 100 కోట్లు.. క్యాష్ లాజిస్టిక్స్ సేవల సంస్థ ఎస్ఐఎస్ క్యాష్ సర్వీస్ తాజాగా షేర్లను జారీ చేయడం ద్వారా ఐపీవో కింద రూ. 100 కోట్లు సమీకరించనుంది. ప్రమోటర్ సంస్థలు ఎస్ఐఎస్ లిమిటెడ్, ఎస్ఎంసీ ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ 37.15 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనున్నాయి. తాజా షేర్ల విక్రయం ద్వారా వచ్చే నిధుల్లో రూ. 37.59 కోట్లను వాహనాల కొనుగోళ్లు, ఫ్యాబ్రికేషన్‌కు, రూ. 30 కోట్ల మొత్తాన్ని రుణాల చెల్లింపు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆదాయంపరంగా 17–18 శాతం మార్కెట్ వాటాతో పరిశ్రమలో రెండో అతి పెద్ద సంస్థగా ఎస్ఐఎస్ క్యాష్ సర్వీసెస్ నిలుస్తోంది. 2024 డిసెంబర్ 31తో ముగిసిన తొమ్మిది నెలల్లో కంపెనీ రూ. 530 కోట్ల ఆదాయాన్ని రూ. 39 కోట్ల లాభాన్ని ఆర్జించింది. సందిగ్ధంలో కొన్ని.. మరోవైపు, ఎంబసీ గ్రూప్ ప్రమోట్ చేస్తున్న వర్క్‌స్పేస్ ఆపరేటర్ వుయ్‌వర్క్ ఇండియా మేనేజ్మెంట్ ఐపీవో ప్రతిపాదనను సెబీ పక్కన పెట్టింది. ఇందుకు నిర్దిష్ట కారణాలేమీ వెల్లడి కాలేదు. ఇష్యూ కింద ప్రమోటర్ సంస్థ ఎంబసీ బిల్డ్‌కాన్, 1 ఏరియల్ వే టెనెంట్ అనే ఇన్వెస్టరు 4.37 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానం కింద విక్రయించే యోచనలో ఉన్నాయి. అటు ఫెర్టిలిటీ క్లినిక్ చెయిన్ ఇందిరా ఐవీఎఫ్ తమ ఐపీవో ముసాయిదా పత్రాలను వెనక్కి తీసుకుంది. ఐపీవో సన్నాహాల సమయంలోనే కంపెనీ వ్యవస్థాపకుడు అజయ్ మూర్దియాపై బాలీవుడ్ బయోపిక్ విడుదల కావడమనేది ఇష్యూను పరోక్షంగా ప్రభావితం చేస్తుందని సెబీ అభిప్రాయం వ్యక్తం చేయడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందిరా ఐవీఎఫ్ ఐపీవో పత్రాలను దాఖలు చేసిన సుమారు నెల రోజుల్లో మార్చి 21న చిత్రం విడుదలైంది. ఇందులో అనుపమ్ కేర్, ఈషా డియోల్ నటించారు.ఓఎఫ్ఎస్ మార్గంలో స్టడ్స్.. పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధులను సమీకరించడంపై హెల్మెట్ల తయారీ సంస్థ స్టడ్స్ యాక్సెసరీస్ రెండోసారి కసరత్తు చేస్తోంది. ఏడేళ్ల క్రితం 2018లో ఇందుకు సంబంధించి సెబీ నుంచి అనుమతులు పొందినప్పటికీ, అప్పట్లో ముందుకెళ్లలేదు. తాజా ప్రతిపాదన ప్రకారం ఇనీíÙయల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ఉంటుంది. ప్రమోటర్ గ్రూప్, ఇతరత్రా షేర్హోల్డర్లు 77.9 లక్షల షేర్లను విక్రయించనున్నారు. ఇది పూర్తిగా ఓఎఫ్ఎస్ రూపంలో ఉంటుంది కాబట్టి ఐపీవో ద్వారా సమీకరించిన నిధులేమీ కంపెనీకి లభించవు. స్టడ్స్ యాక్సెసరీస్ సంస్థ ’స్టడ్స్’, ’ఎస్ఎంకే’ బ్రాండ్ల కింద టూ–వీలర్ హెల్మెట్లను తయారు చేస్తోంది. అలాగే స్టడ్స్ బ్రాండ్ కింద గ్లవ్స్, హెల్మెట్ లాకింగ్ డివైజ్‌లు, రెయిన్ సూట్లు వంటి యాక్సెసరీలను ఉత్పత్తి చేస్తోంది. దేశవ్యాప్తంగానే కాకుండా 70 పైచిలుకు దేశాల్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది. అమెరికాలో ఓ’నీల్ అనే సంస్థకు, ’డేటోనా’ బ్రాండ్ పేరిట జే స్క్వేర్డ్ అనే సంస్థకు హెల్మెట్లు తయారు చేసి అందిస్తోంది. 2024 సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల వ్యవధిలో కంపెనీ రూ. 285 కోట్ల ఆదాయంపై రూ. 33 కోట్ల నికర లాభం ఆర్జించింది. పేస్ డిజిటెక్ అదే బాటలో..న్యూఢిల్లీ: టెలికం టవర్, ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల విభాగంలో సొల్యూషన్లు అందించే పేస్ డిజిటెక్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 900 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయాలని భావిస్తోంది. తద్వారా రూ. 900 కోట్లు సమీకరించనుంది. టెలికం మౌలిక సదుపాయాల విభాగంలో సేవలందించే కంపెనీ ఐపీవోకు ముందు రూ. 180 కోట్ల ప్లేస్మెంట్ చేపట్టే యోచనలో ఉంది. ఇష్యూ నిధుల్లో రూ. 630 కోట్లు పెట్టుబడి వ్యయాలకు కేటాయించనుంది. 2024 సెప్టెంబర్‌తో ముగిసిన 6 నెలల్లో రూ. 1,188 కోట్ల ఆదాయం, రూ. 152 కోట్ల నికర లాభం సాధించింది. -
ఐపీఓకు ఎల్జీ ఎల్రక్టానిక్స్ రెడీ
న్యూఢిల్లీ: హోమ్ అప్లయెన్సెస్ దిగ్గజం ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదముద్ర వేసింది. తద్వారా దక్షిణ కొరియా దిగ్గజం ఎల్జీ దేశీ అనుబంధ సంస్థ రూ. 15,000 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వెరసి దేశీయంగా లిస్టయిన రెండో దక్షిణ కొరియా కంపెనీగా నిలవనుంది. గతేడాది అక్టోబర్‌లో హ్యుందాయ్ మోటార్స్ ఇండియా పబ్లిక్ ఇష్యూ చేపట్టి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన విషయం విదితమే. ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా 2024 డిసెంబర్లో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా మాతృ సంస్థ 15 శాతం వాటాకు సమానమైన 10.18 కోట్ల షేర్లను విక్రయించనుంది. గత నెలలో ఐపీవోపై కంపెనీ రోడ్‌షోలను సైతం ప్రారంభించింది. హోమ్ అప్లయెన్సెస్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్‌లో దేశీయంగా ఎల్జీ టాప్ ర్యాంక్ సంస్థలలో ఒకటిగా నిలుస్తోంది. కంపెనీ ప్రొడక్టులలో వాషింగ్ మెషీన్లు, లెడ్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, మైక్రోవేవ్‌లు, వాటర్ ఫిల్టర్లు తదితరాలున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా, మహారాష్ట్రలోని పుణేలో తయారీ యూనిట్లను కలిగి ఉంది. 2023–24లో రూ. 64,088 కోట్ల ఆదాయం అందుకుంది. -
ఐపీవో బాటలో ఎల్సీసీ ప్రాజెక్ట్స్
న్యూఢిల్లీ: ఈపీసీ సంస్థ ఎల్సీసీ ప్రాజెక్ట్స్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. వీటి ప్రకారం ఐపీవోలో భాగంగా రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో .29 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను పరికరాల కొనుగోలు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా నీటి పారుదల, నీటి సరఫరా ప్రాజెక్టుల విభాగాలలో ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్(ఈపీసీ) సేవలు అందిస్తోంది. రెండు దశాబ్దాల కాలంలో కంపెనీ ఆనకట్టలు, బ్యారేజీలు, హైడ్రాలిక్ స్ట్రక్చర్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు తదితర ప్రాజెక్టులను పూర్తి చేసింది. -
ఐపీవో రూట్లో ఫోన్‌పే
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ద్వారా దేశీ స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యేందుకు ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్‌పే కసరత్తు ప్రారంభించింది. ఈ ఏడాది పదో వార్షికోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో తమ సంస్థకు ఇదొక కీలక మైలురాయి అవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫోన్‌పే పోటీ సంస్థలు పేటీఎం, మొబిక్విక్ ఇప్పటికే దేశీ మార్కెట్లలో లిస్టయిన సంగతి తెలిసిందే. సింగపూర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన ఫోన్‌పే 2022లో తమ ప్రధాన కార్యాలయాన్ని భారత్‌కి మార్చుకుంది. 2023లో చివరిసారిగా నిధులు సమీకరించినప్పుడు ఫోన్‌పే వేల్యుయేషన్‌ను 12 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టారు. ఫోన్‌పేలో వాల్‌మార్ట్‌కి చెందిన లక్సెంబర్గ్ సంస్థ ఫిట్ హోల్డింగ్స్ ఎస్‌ఏఆర్‌ఎల్‌కి 83.91 శాతం, జనరల్ అట్లాంటిక్ సింగపూర్‌కి 5.14 శాతం, ఫోన్‌పే సింగపూర్ విభాగానికి 6.7 శాతం వాటాలు ఉన్నాయి. -
4 ఐపీవోలకు సెబీ సై
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా నాలుగు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో డాక్టర్ అగర్వాల్స్ హెల్త్కేర్సహా కాసాగ్రాండ్ ప్రీమియర్ బిల్డర్, హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీగ్రీన్ ఎక్సెల్ ఈపీసీ ఇండియా చేరాయి. గతేడాది సెప్టెంబర్– అక్టోబర్ మధ్య కాలంలో ఈ కంపెనీలు సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. అయితే మౌరి టెక్, అమంటా హెల్త్‌కేర్ ఐపీవో ప్రణాళికల నుంచి వెనక్కి తగ్గాయి. వివరాలు చూద్దాం.. ఐకేర్ కంపెనీ పీఈ దిగ్గజాలు టెమాసెక్ హోల్డింగ్స్, టీపీజీలకు పెట్టుబడులున్న డాక్టర్ అగర్వాల్స్ హెల్త్‌కేర్ ఐపీవోలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 6.95 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ ప్రధానంగా కంటి పరిరక్షణ(ఐ కేర్) సరీ్వసులు అందిస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 195 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలినవాటిని ఇతర సంస్థల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. రియల్టీ డెవలపర్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా రియల్టీ రంగ కంపెనీ కాసాగ్రాండ్ ప్రీమియర్ బిల్డర్ రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థల రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.మౌలిక రంగ సంస్థ ఈపీసీ ఇన్ఫ్రా, టోల్ వసూళ్ల కంపెనీ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీవోలో భాగంగా రూ. 105 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 31 లక్షల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ప్రమోటర్లకు ప్రస్తతం 71.58 శాతం వాటా ఉంది. ఈక్విటీ జారీ నిధులను సాధారణ కార్పొరేట్, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వెచ్చించనుంది. మెషీనరీ తయారీ ఇథనాల్ ప్లాంట్లను రూపొందించే రీగ్రీన్ ఎక్సెల్ ఈపీసీ ఇండియా పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. దీనిలో భాగంగా రూ. 350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.14 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ ప్రధానంగా ఇథనాల్ ప్లాంట్ల డిజైనింగ్, తయారీ, సరఫరా తదితర కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వెనకడుగులో.. ఐటీ సొల్యూషన్ల కంపెనీ మౌరి టెక్, ఆరోగ్య పరిరక్షణ సంస్థ అమంటా హెల్త్‌కేర్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలను విరమించుకున్నాయి. గతేడాది సెపె్టంబర్– అక్టోబర్‌లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. అయితే డిసెంబర్లోనే పత్రాలను వెనక్కి తీసుకున్నాయి. ఇందుకు కారణాలు వెల్లడికాలేదు. ఐపీవోలో భాగంగా హైదరాబాద్ కంపెనీ మౌరి టెక్ రూ. 440 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయాలని భావించింది. వీటితోపాటు మరో రూ. 1,060 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచాలని ప్రణాళికలు వేశారు. ఇక ఫార్మా రంగ కంపెనీ అమంటా హెల్త్‌కేర్ ఐపీవోలో భాగంగా 1.25 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయాలని తొలుత భావించింది. కంపెనీ ప్రధానంగా మెడికల్ పరికరాలు, స్టెరైల్ లిక్విడ్ ప్రొడక్టుల తయారీలో ఉంది. -
ట్రిపుల్ ధమాకా!
గతవారం పబ్లిక్ ఇష్యూ పూర్తి చేసుకున్న విశాల్ మెగామార్ట్, సాయి లైఫ్ సైన్సెస్, మొబిక్విక్ కంపెనీల షేర్లు బుధవారం స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యాయి. ఈ మూడు కంపెనీల షేర్లు భారీ ప్రీమియం ధరతో లిస్టయ్యాయి. ఈక్విటీ మార్కెట్ నష్టాల్లో ట్రేడవుతున్నా.., వీటికి కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో తొలిరోజే మొబిక్విక్ షేరు అత్యధికంగా 90%, విశాల్ మెగామార్ట్ 44%, సాయి లైఫ్ సైన్సెస్ 42 శాతం లాభాలను ఇన్వెస్టర్లకు పంచాయి. విశాల్ మెగామార్ట్ దేశవ్యాప్తంగా సూపర్‌మార్ట్‌లను నిర్వహిస్తున్న విశాల్ మెగామార్ట్ షేరు ఎన్ఎస్ఈలో ఇష్యూ ధర (రూ.78)తో పోలిస్తే 33% ప్రీమియంతో రూ.104 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 46% ఎగసి రూ.114 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 44% లాభంతో రూ.112 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.50,444 కోట్లుగా నమోదైంది.మొబిక్విక్ సిస్టమ్స్మొబిక్విక్ పేరుతో ఫిన్‌టెక్ సేవలు అందించే వన్ మొబిక్విక్ సిస్టమ్స్ షేరు బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.279)తో పోలిస్తే 59% ప్రీమియంతో రూ.442 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో ఏకంగా 90.21% ఎగసి రూ.531 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి అదే స్థాయి (రూ.530) వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.4,120 కోట్లుగా నమోదైంది. సాయి లైఫ్ సైన్సెస్ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సాయి లైఫ్ సైన్సెస్ షేరు ఎన్ఎస్ఈలో ఇష్యూ ధర (రూ.549)తో పోలిస్తే 18% ప్రీమియంతో రూ.650 వద్ద లిస్టయ్యింది. ఒక దశలో 42% ఎగసి రూ.780 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 40% లాభంతో రూ.768 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,974 కోట్లుగా నమోదైంది. -
వారమంతా.. ఐపీవోల సందడి..
న్యూఢిల్లీ: ఐపీవోల జాతరతో ఈ వారమంతా మార్కెట్ సందడిగా ఉండనుంది. చిన్నా, పెద్దవి కలిపి మొత్తం 11 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వస్తున్నాయి. రూ. 18,500 కోట్లు సమీకరించబోతున్నాయి. విశాల్ మెగామార్ట్, సాయి లైఫ్ సైన్సెస్, ఫిన్‌టెక్ సంస్థ వన్ మొబిక్విక్ సిస్టమ్స్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం మీద అయిదు పెద్ద సంస్థల ఇష్యూలు, ఆరు చిన్న–మధ్య తరహా సంస్థల (ఎస్ఎంఈ) ఇష్యూలు వీటిలో ఉన్నాయి. ఆరు ఎస్ఎంఈలు సుమారు రూ. 150 కోట్లు సమీకరించనున్నాయి. వివిధ రంగాలకు చెందిన సంస్థల ఐపీవోలు.. కొత్త షేర్ల జారీ, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానాల్లో ఉండనున్నాయి. ప్రస్తుత షేర్హోల్డర్లు తమ వాటాలను విక్రయించుకునేందుకు, సంస్థలు విస్తరణ ప్రణాళికల కోసం నిధులను సమీకరించుకునేందుకు, రుణాలను తిరిగి చెల్లించివేసేందుకు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం నిధులను సమకూర్చుకునేందుకు కంపెనీలకు ఈ ఇష్యూలు ఉపయోగపడనున్నాయి. మహారాష్ట్ర ఎన్నికలు, ఉత్తర్ ప్రదేశ్ లోక్‌సభ బై–ఎలక్షన్ల ఫలితాలతో మార్కెట్లో సానుకూల సెంటిమెంటు నెలకొందని, ఐపీవోలు విజయవంతమయ్యేందుకు ఇది దోహదపడగలదని ఆన్లైన్ బ్రోకరేజీ సంస్థ ట్రేడ్జినీ సీవోవో డి. త్రివేశ్ తెలిపారు.2024లో ఇప్పటివరకు రూ. 1.4 లక్షల కోట్ల సమీకరణ..ఈ ఏడాది ఇప్పటివరకు 78 మెయిన్ బోర్డ్ కంపెనీలు, పబ్లిక్ ఇష్యూల ద్వారా దాదాపు రూ. 1.4 లక్షల కోట్లు సమీకరించాయి. వీటిలో హ్యుందాయ్ మోటర్ ఇండియా, స్విగ్గీ, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ వంటి దిగ్గజ ఇష్యూలు ఉన్నాయి. 2023లో 57 సంస్థలు రూ. 49,436 కోట్లు సమీకరించాయి. గత కొన్నాళ్లుగా ఇటు ఇష్యూయర్లు అటు ఇన్వెస్టర్లలోను ప్రైమరీ మార్కెట్లపై గణనీయంగా ఆసక్తి పెరిగింది. గడిచిన అయిదు ఆర్థిక సంవత్సరాల్లో ఐపీవో ఇన్వెస్టర్లు భారీగా లాభాలు పొందారు. 2021–2025 ఆర్థిక సంవత్సరాల మధ్యలో వచి్చన 236 ఐపీవోలు .. రిటైల్ ఇన్వెస్టర్లకు సగటున 27 శాతం మేర లిస్టింగ్ లాభాలు అందించాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.ఇష్యూల వివరాలు..→ విశాల్ మెగా మార్ట్, సాయి లైఫ్ సైన్సెస్, మొబిక్విక్ ఇష్యూలు డిసెంబర్ 11న ప్రారంభమై 13న ముగుస్తాయి. ఇన్వెంచరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్, ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇనిస్టిట్యూట్ ఐపీవోలు డిసెంబర్ 12న, 13న ప్రారంభమవుతాయి. → విశాల్ మెగామార్ట్ ఐపీవో ద్వారా రూ. 8,000 కోట్లు సమీకరిస్తోంది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ఉంటుంది. ప్రమోటర్ కేదారా క్యాపిటల్‌కి చెందిన సమాయత్ సరీ్వసెస్ ఓఎఫ్ఎస్ కింద షేర్లను విక్రయిస్తోంది. ధర శ్రేణి ఒక్కో షేరుకు రూ. 74–78గా నిర్ణయించారు. → సాయి లైఫ్ సైన్సెస్ ఐపీవోకి సంబంధించి ధర శ్రేణి రూ. 522 నుంచి రూ. 549 వరకు ఉంటుంది. కంపెనీ మొత్తం రూ. 3,043 కోట్లు సమీకరిస్తోంది. ఇందులో రూ. 950 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఓఎఫ్ఎస్ కింద ప్రమోటర్లు, ఇన్వెస్టర్ షేర్హోల్డర్లు, ఇతర షేర్హోల్డర్లు 3.81 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. → మొబిక్విక్ ఐపీవో రూ. 572 కోట్లు సమీకరిస్తోంది. ఇందుకోసం 2.05 కోట్ల షేర్లను తాజాగా జారీ చేస్తోంది. ధర శ్రేణి ఒక్కో షేరుకు రూ. 265–279 వరకు ఉంటుంది. → ఇన్వెంచరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్ ఐపీవో పూర్తిగా ఓఎఫ్ఎస్ రూపంలో ఉంటుంది. ఇష్యూ పరిమాణం రూ. 2,500 కోట్లు. → ఇక ఎస్ఎంఈ ఐపీవోల విషయానికొస్తే ధనలక్ష్మి క్రాప్ సైన్స్ (డిసెంబర్ 9–11) టాస్ ది కాయిన్ లిమిటెడ్.. జంగిల్ క్యాంప్స్ ఇండియా (రెండూ డిసెంబర్ 10–12), సుప్రీమ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్.. పర్పుల్ యునైటెడ్ సేల్స్ (డిసెంబర్ 11–13), యశ్ హైవోల్టేజ్ (డిసెంబర్ 12–16) సంస్థలు ఉన్నాయి. -
రెండు కంపెనీలు ఐపీవో బాటలో
న్యూఢిల్లీ: తాజాగా రెండు కంపెనీలు పబ్లిక్ ఇష్యూ బాట పట్టాయి. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేశాయి. జాబితాలో ఎల్పీజీ, కెమికల్స్ స్టోరేజీ కంపెనీ ఏజిస్ వొపాక్ టెర్మినల్స్తోపాటు.. సోలార్ ప్యానళ్ల తయారీ కంపెనీ సాత్విక్ గ్రీన్ ఎనర్జీ చేరాయి. వివరాలు చూద్దాం.. రూ. 3,500 కోట్లపై దృష్టి ఏజిస్ లాజిస్టిక్స్ అనుబంధ కంపెనీ ఏజిస్ వొపాక్ టెర్మినల్స్ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. వీటి ప్రకారం ఐపీవోలో భాగంగా రూ. 3,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. తద్వారా రూ. 3,500 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోకంటే ముందుగా షేర్ల జారీ ద్వారా రూ. 700 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. దీంతో ఐపీవో పరిమాణం ఆమేర తగ్గవచ్చు. ఇష్యూ నిధుల్లో రూ. 2,027 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 671 కోట్లు పెట్టుబడి వ్యయాలకు వెచి్చంచనుంది. వీటితో మంగళూరువద్ద క్రియోజెనిక్ ఎల్పీజీ టెర్మినల్‌ను ఏర్పాటు చేయనుంది. మిగిలిన నిధులను కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీలో ప్రస్తుతం వొపాక్ ఇండియా బీవీకి 50.1 శాతం, ఏజిస్ లాజిస్టిక్స్‌కు 47.31 శాతం చొప్పున వాటా ఉంది. 2024 జూన్‌కల్లా దేశవ్యాప్తంగా 18 స్టోరేజీ ట్యాంకులను నిర్వహిస్తోంది. పెట్రోలియం, వెజిటబుల్ ఆయిల్, లూబ్రికెంట్స్, ఎల్పీజీ, ప్రొపేన్, బ్యుటేన్ తదితరాల నిల్వకు వీటిని వినియోగించవచ్చు. రూ. 1,150 కోట్లకు రెడీ సోలార్ ఫొటో వోల్టాయిక్ మాడ్యూళ్ల తయారీ కంపెనీ సాత్విక్ గ్రీన్ ఎనర్జీ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. వీటి ప్రకారం స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ ద్వారా రూ. 1,150 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. దీనిలో రూ. 850 కోట్లు తాజా ఈక్విటీ జారీ ద్వారా, మరో రూ. 300 కోట్లు ప్రమోటర్ల షేర్ల విక్రయం ద్వారా సమకూర్చుకోనుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా 90 శాతంగా నమోదైంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 553 కోట్లు ఒడిషాలో 4 గిగావాట్ల సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ ప్లాంటు ఏర్పాటుపై వెచి్చంచనుంది. మరో రూ. 96 కోట్లు అనుబంధ సంస్థ సాత్విక్ సోలార్ ఇండస్ట్రీస్ రుణ చెల్లింపులకు కేటాయించనుంది. 2024 జూన్‌కల్లా 1.8 గిగావాట్ల నిర్వహణ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కంపెనీ ప్రధానంగా సోలార్ ప్రాజెక్టులకు ఎండ్టు ఎండ్ ఈపీసీ సరీ్వసులను అందిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రూ. 246 కోట్ల ఆదాయం, రూ. 21 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. -
స్విగ్గీ ఐపీవో ‘డెలివరీ’ ఓకే
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ, క్విక్‌కామర్స్ దిగ్గజం స్విగ్గీ పబ్లిక్ ఇష్యూకి మెరుగైన స్పందన లభించింది. చివరి రోజు శుక్రవారానికల్లా 3.6 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. కంపెనీ 16.01 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 57.53 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు అందాయి. క్విబ్ విభాగంలో 6 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 0.41 రెట్లు చొప్పున బిడ్స్ లభించాయి. అయితే రిటైల్ ఇన్వెస్టర్లు 1.14 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. రూ. 371–390 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 11,327 కోట్లు సమకూర్చుకుంది. మంగళవారం (5న) యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 5,085 కోట్లు సమీకరించిన విషయం విదితమే. రూ. 95,000 కోట్ల విలువలో కంపెనీ ఐపీవోకు రావడం గమనార్హం! ఆక్మే సోలార్... 2.75 రెట్లు స్పందన పునరుత్పాదక ఇంధన రంగ కంపెనీ ఏసీఎంఈ (ఆక్మే) సోలార్ పబ్లిక్ ఇష్యూకి బాగానే ఆదరణ దక్కింది. చివరి రోజు శుక్రవారానికల్లా 2.75 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. కంపెనీ 5.82 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 16 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. క్విబ్ విభాగంలో 3.54 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 0.97 రెట్లు చొప్పున బిడ్స్ నమోదయ్యాయి. అయితే రిటైల్ ఇన్వెస్టర్లు 3.1 రెట్లు అధికంగా దరఖాస్తు చేయడం గమనార్హం! రూ. 275–289 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 2,900 కోట్లు సమకూర్చుకుంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.1,300 కోట్లు లభించాయి. -
ఐపీవోలకు సెబీ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా రెండు కంపెనీలను అనుమతించింది. ఈ జాబితాలో ఆరోగ్య బీమా సేవలందించే నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఆరోగ్య పరిరక్షణ సర్వీసుల సంస్థ పారస్ హెల్త్‌కేర్ లిమిటెడ్ ఉన్నాయి. నివా బూపా జులైలోనూ, పారస్ హెల్త్ ఆగస్ట్‌లోనూ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. వివరాలు చూద్దాం.ఆసుపత్రుల సంస్థ పారస్ హెల్త్ బ్రాండుతో ఆసుపత్రుల చైన్‌ను నిర్వహిస్తున్న పారస్ హెల్త్‌కేర్ ఐపీవోలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.5 కోట్ల షేర్లను కంపెనీ ప్రమోటర్, ప్రస్తుత వాటాదారు సంస్థ ఆఫర్ చేయనున్నాయి. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, అనుబంధ సంస్థలు పారస్ హెల్త్‌కేర్(రాంచీ) ప్రయివేట్, ప్లస్ మెడికేర్ హాస్పిటల్స్ ప్రయివేట్‌లో పెట్టుబడులకు( రుణ చెల్లింపులు) వెచి్చంచనుంది. హర్యానా, బీహార్, యూపీ, రాజస్తాన్, జేఅండ్కేలలో సంస్థ పారస్ హెల్త్ పేరుతో 8 ఆసుపత్రులను నిర్వహిస్తోంది. మొత్తం 2,135 పడకలతో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. రూ. 3,000 కోట్లపై కన్నుగతంలో మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీగా సేవలందించిన నివా బూపా ఐపీవోలో భాగంగా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 2,200 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్ విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 3,000 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ప్రస్తుతం కంపెనీలో యూకే దిగ్గజం బూపా(సింగపూర్ హోల్డింగ్స్) 62.27 శాతం వాటాను కలిగి ఉంది. ఫెటిల్ టోన్ ఎల్ఎల్పీకు 27.86 శాతం వాటా ఉంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 625 కోట్లు మూలధన పటిష్టతకు వినియోగించనుంది. స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ తదుపరి రెండో స్టాండెలోన్ హెల్త్ ఇన్సూరర్‌గా బూపా నివా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కానుంది. ఐపీవో బాటలో జారోవిద్యా రంగ సంస్థ జారో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్(జారో ఎడ్యుకేషన్) పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 170 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ విక్రయానికి ఉంచనున్నారు. ప్రస్తుతం ప్రమోటర్లకు కంపెనీలో 85 శాతానికిపైగా వాటా ఉంది. ఐపీవో నిధుల్లో రూ. 81 కోట్లు బ్రాండ్ విస్తరణకు, రూ. 48 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. -
ఐపీఓ ద్వారా రూ. 5,430 కోట్ల సమీకరణ
ముంబై: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కంపెనీ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ ఇష్యూకి రూ. 440–463 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 25న ప్రారంభమై 29న ముగియనుంది. ఇష్యూలో భాగంగా రూ. 1,250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 4,180 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ సంస్థ గోస్వామి ఇన్ఫ్రాటెక్ విక్రయానికి ఉంచనుంది. వెరసి ఐపీవో ద్వారా కంపెనీ రూ. 5,430 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 32 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 600 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 320 కోట్లు దీర్ఘకాలిక మూలధన అవసరాలకు, మరో రూ. 80 కోట్లు కన్స్ట్రక్షన్ పరికరాల కొనుగోలుకి వెచ్చించనుంది.కంపెనీ ప్రధానంగా ఐదు విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. ఇవి.. మెరైన్ అండ్ ఇండస్ట్రియల్, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైడ్రో, అండర్‌గ్రౌండ్, ఆయిల్ అండ్ గ్యాస్. 2024 జూన్ 30కల్లా కంపెనీ ఆర్డర్‌బుక్ విలువ రూ. 31,747 కోట్లకు చేరింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో రూ. 3,154 కోట్ల ఆదాయం, దాదాపు రూ. 92 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
హ్యుందాయ్ మెగా ఐపీవో రెడీ
దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ దేశీ అనుబంధ యూనిట్ మెగా పబ్లిక్ ఇష్యూకి రంగం సిద్ధమైంది. 2003లో జపనీస్ అగ్రగామి మారుతీ సుజుకీ ఐపీవో తర్వాత మరో టాప్ ఆటోమొబైల్ సంస్థ లిస్ట్ కానుంది. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీవోగా హ్యుందాయ్ సరికొత్త రికార్డ్ సృష్టించనుంది. న్యూఢిల్లీ: రెండు దశాబ్దాల తదుపరి మరో ఆటో రంగ దిగ్గజం నిధుల సమీకరణకు వస్తోంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్(హెచ్ఎంఐఎల్) పబ్లిక్ ఇష్యూ ఈ నెల15న ప్రారంభంకానుంది. 17న ముగియనున్న ఇష్యూకి ఒక్కో షేరుకి రూ. 1,865–1,960 చొప్పున ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్ సంస్థ హ్యుందాయ్ మోటార్ కంపెనీ 14,21,94,700 షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా 3.3 బిలియన్ డాలర్లు(రూ. 27,870 కోట్లు) సమీకరించాలని భావిస్తోంది. దీంతో ఇంతక్రితం 2022 మే నెలలో బీమా దిగ్గజం ఎల్ఐసీ రూ. 21,000 కోట్లు సమీకరించిన ఇష్యూని అధిగమించనుంది. వెరసి దేశీయంగా అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డు నెలకొల్పనుంది. లిస్టింగ్ తదుపరి కంపెనీ మార్కెట్ విలువ 19 బిలియన్ డాలర్ల (రూ.1.6 లక్షల కోట్లు)కు చేరనుంది.క్రెటా ఈవీ వస్తోంది.. దేశీయంగా కార్ల తయారీ, అమ్మకాలలో మారుతీ సుజుకీ తదుపరి హ్యుందాయ్ మోటార్ ఇండియా రెండో ర్యాంకులో నిలుస్తున్న సంగతి తెలిసిందే. 2025 జనవరి–మార్చి కాలంలో క్రెటా ఈవీని ప్రవేశపెట్టాలని చూస్తున్నట్లు హెచ్ఎంఐఎల్ పేర్కొంది. రానున్న కొన్నేళ్లలో మరో 4 ఈవీలను విడుదల చేసే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. 1996లో కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీ వివిధ విభాగాలలో 13 మోడళ్లను విక్రయిస్తోంది. ప్రపంచంలోనే ఇండియా అత్యంత ఆసక్తికరమైన మార్కెట్‌గా కంపెనీ ఎండీ, సీఈవో అన్సూ కిమ్ ఐపీవో రోడ్‌షో సందర్భంగా పేర్కొన్నారు. ఐపీవో ద్వారా కంపెనీ బ్రాండ్ మరింత మందికి చేరువవు తుందన్నారు. -
స్విగ్గీ ఐపీవో సన్నాహాలు
న్యూఢిల్లీ: ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ దిగ్గజం స్విగ్గీ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సవరించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 3,750 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 18.52 కోట్ల(అంచనా విలువ రూ. 6,665 కోట్ల) షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి రూ. 10,000 కోట్లకుపైగా సమీకరించే వీలున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంతక్రితం స్విగ్గీ దాఖలు చేసిన రహస్య దరఖాస్తుకు ఈ వారం మొదట్లో సెబీ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. కాని్ఫడెన్షియల్ విధానంలో స్విగ్గీ ఏప్రిల్ 30న సెబీకి తొలుత దరఖాస్తు చేసింది. దీని తదుపరి తిరిగి అప్డేటెడ్ ఫైలింగ్ చేయవలసి ఉంటుంది. మూడు వారాలపాటు వీటిపై పబ్లిక్ నుంచి అభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఆపై మరోసారి అప్డేటెడ్ సమాచారంతో దరఖాస్తు చేయవలసి ఉంటుంది. ఈ బాటలో రెండోసారి దరఖాస్తు చేశాక ఐపీవో చేపట్టేందుకు వీలుంటుందని మార్కెట్ వర్గాలు తెలియజేశాయి. నిధుల వినియోగమిలా ఐపీవో ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 137 కోట్లను అనుబంధ సంస్థ స్కూట్సీ రుణ చెల్లింపులకు, మరో రూ. 982 కోట్లు క్విక్ కామర్స్ విస్తరణలో భాగంగా డార్క్ స్టోర్ నెట్వర్క్ విస్తరణకు స్విగ్గీ వినియోగించనుంది. ఈ బాటలో రూ. 586 కోట్లు టెక్నాలజీ, క్లౌడ్ మౌలికసదుపాయాలకు, రూ. 930 కోట్లు బ్రాండ్ మార్కెటింగ్‌పైనా వెచి్చంచనుంది. 2014లో ఏర్పాటైన స్విగ్గీ 2024 ఏప్రిల్‌కల్లా 13 బిలియన్ డాలర్ల విలువను సాధించింది. -
సెబీ కీలక నిర్ణయం.. యూపీఐ తప్పనిసరి
న్యూఢిల్లీ: డెట్ సెక్యూరిటీల పబ్లిక్ ఇష్యూ దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసే దిశగా సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. రిటైల్ ఇన్వెస్టర్లు యూపీఐ ద్వారా నిధులను బ్లాక్ (బ్యాంక్ ఖాతాలో స్తంభన) చేసుకునే ఆప్షన్‌తోనే రూ.5లక్షల వరకు దరఖాస్తు చేసుకోవాలని సెబీ కోరింది.అదే సమయంలో సెల్ఫ్ సర్టిఫైడ్ సిండికేట్ బ్యాంక్‌లు లేదా స్టాక్ ఎక్స్చేంజ్ ప్లాట్‌ఫామ్ తదితర ప్రత్యామ్నాయ విధానాల్లోనూ ఇన్వెస్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుందని స్పష్టం చేసింది. కొత్త నిబంధనలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఈక్విటీ పబ్లిష్ ఇష్యూలకు యూపీఐ బ్లాక్ ఆప్షన్ అవకాశం అందుబాటులో ఉన్న సంగతి విదితమే.‘‘డెట్ సెక్యూరిటీ పబ్లిక్ ఇష్యూలకు మధ్యవర్తుల ద్వారా (స్టాక్ బ్రోకర్లు, డీపీలు, రిజిస్ట్రార్ తదితర) దరఖాస్తు చేసుకునే వ్యక్తిగత ఇన్వెస్టర్లు, దరఖాస్తు రుసుం రూ.5 లక్షల వరకు ఉంటే వారు యూపీఐ బ్లాకింగ్ ఆప్షన్నే ఉపయోగించుకోవాలి’’అని సెబీ తన సర్క్యులర్‌లో కోరింది. -
సెనోరెస్ ఫార్మా ఐపీవో బాట
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ రంగ కంపెనీ సెనోరెస్ ఫార్మాస్యూటికల్స్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 500 కోట్ల ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 27 లక్షల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ప్రాస్పెక్టస్ ప్రకారం ప్రీఐపీవో ప్లేస్మెంట్లో భాగంగా రూ. 100 కోట్లను సమీకరించే యోచనలో ఉంది. దీంతో ఐపీవో పరిమాణాన్ని కుదించే అవకాశముంది. అర్హతగల కంపెనీ ఉద్యోగులకు కొంతమేర షేర్లను రిజర్వ్ చేయనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో కొంతమేర అట్లాంటాలోని స్టెరైల్ ఇంజక్షన్ల తయారీ ప్లాంటు ఏర్పాటుకు వెచి్చంచనుంది. ఈ బాటలో అనుబంధ సంస్థల వర్కింగ్ క్యాపిటల్, ఇతర సంస్థల కొనుగోళ్లు తదితరాలకు సైతం నిధులు వినియోగించనుంది. -
హ్యుందాయ్ క్రెటా ఈవీ వచ్చేస్తోంది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా క్రెటా ఎలక్ట్రిక్ వెహికల్‌ను తీసుకొస్తోంది. 2025 జనవరి–మార్చి మధ్య ఈ మోడల్ దేశీ రోడ్లపై పరుగులు తీస్తుందని కంపెనీ ప్రకటించింది. ఒకసారి చార్జింగ్‌తో 550 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యంతో క్రెటా ఈవీ రూపుదిద్దుకుంటోందని సమాచారం. ధర రూ. 22–26 లక్షల మధ్య ఉంటుంది. హ్యుందాయ్ ఇండియా పబ్లిక్ ఇష్యూకు వస్తున్న సంగతి తెలిసిందే. సెబీకి దాఖలు చేసిన పత్రాల ప్రకారం భారత్‌లో నాలుగు ఈవీలను ప్రవేశపెట్టాలన్నది సంస్థ ప్రణాళిక. వీటిలో మాస్ మార్కెట్ మోడల్‌తోపాటు హైఎండ్, ప్రీమియం ఈవీలు సైతం ఉన్నాయి. ఈవీ విభాగంలో కంపెనీ ప్రస్తుతం దేశంలో అయానిక్ 5, కోనా ఎలక్ట్రిక్ విక్రయిస్తోంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా 17.5 శాతం వాటా విక్రయించాలన్నది సంస్థ లక్ష్యం. తద్వారా రూ.25,000 కోట్లు సమీకరించనుంది. దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్.. బ్యాటరీ ఈవీ, హైబ్రిడ్ ఈవీ, ప్లగ్–ఇన్ హైబ్రిడ్ ఈవీ, మైల్డ్ హైబ్రిడ్ ఈవీ, ఫ్యూయల్ సెల్ ఈవీలను తయారు చేస్తోంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ వ్యాపారం కోసం కంపెనీ గతేడాది తమిళనాడులో రూ.20,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. చెన్నై ప్లాంటును ఈవీలు, ఎస్‌యూవీల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. -
బడా ఐపీఓల బొనాంజా!
ఈ ఆర్థిక సంవత్సరం (2024–25)లో కూడా పబ్లిక్ ఇష్యూల హవా కొనసాగనుంది. అయితే ఈ ఏడాది ప్రత్యేకతేమిటంటే దిగ్గజ కంపెనీలు భారీస్థాయిలో నిధుల సమీకరణకు క్యూ కడుతున్నాయి. ఈ జాబితాలో ఆటో దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా సహా.. స్విగ్గీ, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఆఫ్కన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితరాలు చేరాయి. రూ.60,000 కోట్లకు పైగా నిధులను సమీకరించేందుకు చురుగ్గా సన్నాహాలు చేస్తున్నాయి.ముంబై: కొద్ది రోజులుగా సెకండరీ మార్కెట్లు మళ్లీ దూకుడు చూపుతున్నాయి. రోజుకో కొత్త గరిష్టాలను తాకుతున్నాయి. ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 77,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 23,500కు చేరాయి. ఈ నేపథ్యంలో పలు అన్‌లిస్టెడ్ దిగ్గజాలు పబ్లిక్ ఇష్యూలవైపు దృష్టి పెట్టాయి. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు సెబీ తలుపుతడుతున్నాయి. తద్వారా భారీస్థాయిలో నిధుల సమీకరణకు తెరతీయనున్నాయి. వెరసి ఈ ఏడాది ప్రైమరీ మార్కెట్ సరికొత్త రికార్డుకు వేదికకానున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది (2023–24) పలు చిన్న, మధ్యతరహా కంపెనీలు ఆసక్తి చూపడంతో సగటున ఐపీవో ఇష్యూ పరిమాణం రూ. 815 కోట్లుగా నమోదైంది. ఇక 2022–23లో ఒక్కో ఇష్యూ సగటు పరిమాణం రూ. 1,409 కోట్లుకాగా.. 2021–22లో రూ. 2,105 కోట్లు. అయితే ఈ ఏడాది వీటికి మించి అంటే రెట్టింపు అంతకంటే ఎక్కువ సగటు పరిమాణం నమోదుకానున్నట్లు స్టాక్ మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. లిస్టింగ్‌వైపు చూపు... రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిబంధనలకు అనుగుణంగా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిస్టింగ్ బాటలో సాగుతోంది. సెబీ అనుమతితో రూ. 7,000 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఆఫ్కన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైతం ఐపీవో ద్వారా రూ. 7,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇక ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ రూ. 8,000 కోట్ల నిధులను సమకూర్చుకోవాలని చూస్తోంది. ఈ బాటలో ఈవీ స్కూటర్ల కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ రూ. 5,500 కోట్లు, ఎన్ఎస్డీఎల్ రూ. 4,500 కోట్లు, వరీ ఎనర్జీస్ రూ. 3,000 కోట్ల, ఎమ్క్యూర్ రూ. 2,300 కోట్ల చొప్పున సమీకరించనున్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేశాయి. కాగా.. ఈ ఏడాది ఇప్పటికే 8 కంపెనీలు ఐపీవోల ద్వారా మొత్తం రూ. 14,600 కోట్లు అందుకున్నాయి.ఎల్ఐసీ రికార్డుకు చెక్!దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ దేశీ విభాగం ఐపీవో అనుమతి కోసం సెబీకి తాజాగా దరఖాస్తు చేసింది. తద్వారా 15–20 శాతం వాటా విక్రయించే వ్యూహంలో ఉంది. దీంతో 3.3–5.6 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 25,000 కోట్లు) అందుకునే వీలున్నట్లు అంచనా. ఫలితంగా 2022–23లో రూ. 21,000 కోట్లు సమీకరించిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఇష్యూని అధిగమించనుంది. దేశీయంగా అతిపెద్ద ఐపీవోగా సరికొత్త రికార్డు నెలకొల్పే అవకాశముంది. -
ఐపీవోకు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 7,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోలో భాగంగా రూ. 4,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో రూ. 3,000 కోట్ల విలువైన షేర్లను మాతృ సంస్థ బజాజ్ ఫైనాన్స్ విక్రయానికి ఉంచనుంది. ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు సన్నాహాలు ప్రారంభించింది. ఎగువ స్థాయి(అప్పర్ లేయర్) ఎన్‌బీఎఫ్‌సీగా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 2025 సెపె్టంబర్‌కల్లా పబ్లిక్ ఇష్యూ చేపట్టవలసి ఉంది. కాగా.. భవిష్యత్ అవసరాలరీత్యా ఐపీవో నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ వద్ద 2015లోనే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రిజిస్టర్ అయ్యింది. డిపాజిట్లు స్వీకరించని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా కొనసాగుతోంది. రెసిడెన్షియల్, కమర్షియల్ ఆస్తుల కొనుగోలు, ఆధునీకరణ తదితరాలకు ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది. ఆర్బీఐ వద్ద అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా గుర్తింపు పొందింది. గృహ రుణాలు, మారి్టగేజ్, లీజ్ రెంటల్ డిస్కౌంటింగ్ తదితర సేవలు సమకూర్చుతోంది. గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో 38 శాతం వృద్ధితో రూ. 1,731 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇటీవల గృహ రుణ కంపెనీలు ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండియా షెల్టర్ ఫైనాన్స్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన సంగతి తెలిసిందే. -
వొడాఫోన్ భారీ ఎఫ్‌పీవో
న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న టెలికం సంస్థ వొడాఫోన్–ఐడియా (వీఐ) భారీ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో)కి తెరతీయనుంది. దీని ద్వారా రూ. 18,000 కోట్లు సమీకరించనుంది. ఏప్రిల్ 18–22 మధ్య ఎఫ్‌పీవో ఉండనుంది. ఇందుకోసం షేరు ధర రూ. 10–11 శ్రేణిలో ఉంటుంది. ఇటీవల ప్రమోటరు సంస్థకు ప్రిఫరెన్షియల్ షేర్ల కేటాయింపునకు సంబంధించి నిర్ణయించిన రూ. 14.87 రేటుతో పోలిస్తే ఇది సుమారు 26 శాతం తక్కువ. కనీసం 1,298 షేర్లకు బిడ్ చేయాల్సి ఉంటుంది. ఎఫ్‌పీవో ద్వారా సేకరించిన నిధులను 4జీ నెట్వర్క్ విస్తరణ, 5జీ నెట్‌వర్క్‌ల ఏర్పాటుతో పాటు పన్నులు, బాకీలు చెల్లించడానికి వొడాఫోన్ ఐడియా వినియోగించుకోనుంది. 2020లో యస్ బ్యాంక్ రూ. 15,000 కోట్ల ఫాలో ఆన్ తర్వాత ఇదే అతి పెద్ద ఎఫ్‌పీవో కానుంది. బ్రిటన్ టెలికం సంస్థ వొడాఫోన్ గ్రూప్ భారత్‌లో తన వ్యాపారాన్ని ఐడియా సెల్యులార్తో విలీనం చేయడం ద్వారా 2018లో వొడాఫోన్ ఐడియా ఏర్పడింది. ప్రస్తుతం రూ. 2.1 లక్షల కోట్ల రుణభారంతో మనుగడ కోసం సతమతమవుతోంది. శుక్రవారం వొడాఫోన్–ఐడియా షేరు రూ. 12.96 వద్ద క్లోజయ్యింది. జీక్యూజీ, ఎస్బీఐ ఎంఎఫ్ ఆసక్తి.. ఈ ఎఫ్‌పీవోలో దాదాపు 800 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 6,500 కోట్లు) వరకు ఇన్వెస్ట్ చేయాలని జీక్యూజీ పార్ట్నర్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్ఆర్ఐ రాజీవ్ జైన్ సారథ్యంలోని అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ జీక్యూజీ పార్ట్నర్స్ 500 మిలియన్ డాలర్లు, ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్ 200–300 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఎన్టీపీసీ గ్రీన్ ఐపీవో సన్నాహాలు
ముంబై: పీఎస్‌యూ దిగ్గజం ఎన్టీపీసీ అనుబంధ కంపెనీ.. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల ఎంపికను చేపట్టినట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా పునరుత్పాదక రంగ కంపెనీ రూ. 10,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. తద్వారా 2022లో బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ తదుపరి అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకి తెరతీయనుంది. నిధులను సోలార్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా తదితర భవిష్యత్ ప్రాజెక్టులు, విస్తరణ ప్రణాళికలకు పెట్టుబడులుగా వెచ్చించనుంది. ఐపీవో కోసం ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యూరిటీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, నువామా వెల్త్ మేనేజ్మెంట్ను షార్ట్‌లిస్ట్ చేసింది. -
ఐపీవోవైపు ఎన్ఎస్ఈ చూపు
ముంబై: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్ఎస్ఈ) పబ్లిక్ ఇష్యూ యోచనలో ఉంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతులు లభించిన తదుపరి సవరించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయనున్నట్లు ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశి‹Ùకుమార్ చౌహాన్ వెల్లడించారు. వెరసి సెబీ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించాక మరోసారి ఐపీవో సన్నాహాలు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అధిక రిస్కులుగల డెరివేటివ్స్‌లో లావాదేవీలు చేపట్టవద్దంటూ ఈ సందర్భంగా రిటైల్ ఇన్వెస్టర్లను హెచ్చరించారు. ఈ విభాగంలో తగినంత సమాచారమున్న ఇన్వెస్టర్లు మాత్రమే ట్రేడింగ్ చేయగలరని తెలియజేశారు. సెబీ పరిశీలన ప్రకారం 10మంది ట్రేడర్లలో 9మంది నష్టపోయినట్లు ప్రస్తావించారు. ఇప్పటికే బీఎస్ఈ బొంబాయి స్టాక్ ఎక్సే్ఛంజీ(బీఎస్ఈ) 2017లోనే పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. సెబీ నిబంధనల ప్రకారం ఎన్ఎస్ఈలో లిస్టయ్యింది. అయితే లిస్టింగ్ సమయంలో చౌహాన్ బీఎస్ఈ సీఈవోగా బాధ్యతలు నిర్వహించడం గమనార్హం! ఎక్సే్ఛంజీ సుపరిపాలన విషయంలో కొంతమంది మాజీ ఎగ్జిక్యూటివ్‌లు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన ఆరోపణలతో ఎన్ఎస్ఈపై సెబీ దర్యాప్తునకు తెరతీసిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్ఎస్ఈ లిస్టింగ్ ప్రణాళికలకు బ్రేక్ పడింది. కోలొకేషన్ సౌకర్యాలను అక్రమంగా వినియోగించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. తద్వారా కొంతమంది ట్రేడింగ్ సభ్యులకు ముందస్తు ప్రవేశం కలి్పంచినట్లు ఆరోపణలు తలెత్తాయి. కాగా.. 2016 డిసెంబర్లో ఎన్ఎస్ఈ ఐపీవో చేపట్టేందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 10,000 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసింది. దీనిలో భాగంగా ఎన్ఎస్ఈ వాటాదారులు 22 శాతం ఈక్విటీని విక్రయించేందుకు ఆసక్తి చూపారు. అయితే 2020లోనూ ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో విక్రమ్ లిమాయే సెబీ అనుమతుల తదుపరి ఐపీవో ప్రాసెస్‌ను ప్రారంభించేందుకు ప్రణాళికలు వేసినప్పటికీ ముందుకుసాగలేదు. -
భారతీ హెక్సాకామ్ ఐపీవోకు రెడీ
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ అనుబంధ సంస్థ భారతీ హెక్సాకామ్ పబ్లిక్ ఇష్యూ వచ్చే నెల 3న ప్రారంభంకానుంది. వెరసి కొత్త ఆరి్థక సంవత్సరం(2024–25)లో వెలువడిన తొలి పబ్లిక్ ఇష్యూగా నిలవనుంది. ఏప్రిల్ 5న ముగియనున్న ఇష్యూలో భాగంగా టెలీకమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ 7.5 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఫలితంగా ప్రస్తుత వాటాదారు సంస్థకు ఐపీవో నిధులు అందనున్నాయి. ఇవి కంపెనీ ఈక్విటీలో 15 శాతానికి సమానంకాగా.. గతంలో 10 కోట్ల షేర్లను ఆఫర్ చేయాలని సంకలి్పంచిన సంగతి తెలిసిందే. యాంకర్ ఇన్వెస్టర్లకు 2న షేర్లను కేటాయించనుంది. కంపెనీ లిస్టయ్యేందుకు ఈ నెల రెండోవారంలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతిని పొందింది. కంపెనీలో భారతీ ఎయిర్టెల్ వాటా 70 శాతంకాగా.. ప్రభుత్వ రంగ టెలీకమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా మిగిలిన 30 శాతం వాటాను కలిగి ఉంది. -
టాటా సన్స్ మెగా ఐపీవో!
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా సన్స్ పబ్లిక్ ఇష్యూకి రానున్నట్లు ఈక్విటీ మార్కెట్ రీసెర్చ్ సంస్థ స్పార్క్ క్యాపిటల్ పేర్కొంది. టాటా గ్రూప్ ఎన్బీఎఫ్సీ హోల్డింగ్ కంపెనీ విలువను రూ. 7.8 లక్షల కోట్లుగా మదింపు చేసింది. గ్రూప్ కంపెనీల ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం విలువ మదింపు చేయగా.. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రానున్న 18 నెలల్లో టాటా సన్స్ ఐపీవో చేపట్టనున్నట్లు తెలియజేసింది. అప్పర్‌లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా ఆర్బీఐ గతేడాది గుర్తింపునిచి్చన నేపథ్యంలో 2025 సెపె్టంబర్‌కల్లా తప్పనిసరిగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ కావలసి ఉన్నట్లు స్పార్క్ పేర్కొంది. ఇందుకు ఏడాదిన్నర కాలంలో పబ్లిక్ ఇష్యూ చేపట్టవలసి ఉంటుందని తెలియజేసింది. దీంతో సంక్లిష్టంగా ఉన్న గ్రూప్ హోల్డింగ్ నిర్మాణం సరళతరమయ్యేందుకు వీలుంటుందని అభిప్రాయపడింది. కాగా.. ఇటీవల వెలువడిన సమాచారం ప్రకారం కంపెనీ రూ. 11 లక్షల కోట్ల విలువను అందుకోగలదని వెల్లడించింది. వెరసి ఐపీవో పరిమాణం రూ. 55,000 కోట్లుగా ఉండవచ్చని అంచనా వేసింది. టాటా సన్స్ హోల్డింగ్స్‌లో 80 శాతం మోనిటైజబుల్ కానప్పటికీ పునర్వ్యవస్థీకరణ కారణంగా కంపెనీ రీరేటింగ్ను సాధించే వీలున్నట్లు పేర్కొంది. విలువ జోడింపు అన్‌లిస్టెడ్ పెట్టుబడులతో పలు మార్గాల ద్వారా టాటా సన్స్‌కు అదనపు విలువ జమకానున్నట్లు స్పార్క్ క్యాపిటల్ తెలియజేసింది. ఇటీవల సెమీకండక్టర్స్ తదితర ఆధునికతరం విభాగాలలోకి టాటా గ్రూప్ ప్రవేశించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. టాటా ఎలక్ట్రానిక్స్.. చిప్ తయారీ ప్రణాళికలు ప్రకటించిన విషయం విదితమే. టాటా టెక్నాలజీస్, టాటా మెటాలిక్స్, ర్యాలీస్ తదితర అనుబంధ సంస్థలను పేర్కొంది. ఫలితంగా టాటా గ్రూప్ మరో రూ. 1–1.5 లక్షల కోట్ల విలువను జోడించుకోనున్నట్లు అంచనా వేసింది. లిస్టెడ్, అన్ లిస్టెడ్ కంపెనీలు, ప్రిఫరెన్స్ షేర్లు, ఫండ్స్‌లో పెట్టుబడులను పరిగణించి విలువను మదింపు చేసింది. టీసీఎస్ బలిమి టాటా సన్స్ విలువలో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ అతిపెద్ద వాటాను ఆక్రమిస్తోంది. టీసీఎస్ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం టాటా సన్స్ వాటా విలువ రూ. 10 లక్షల కోట్ల వరకూ ఉంటుంది. అన్‌లిస్టెడ్ కంపెనీలు, పెట్టుబడులుకాకుండా గ్రూప్‌లోని ఇతర లిస్టెడ్ దిగ్గజాలు టాటా మోటార్స్, టాటా పవర్, ఇండియన్ హోటల్స్‌లో యాజమాన్య వాటాలు కలిగి ఉంది. టాటా కెమికల్స్‌లో అత్యధిక స్థాయి(కంపెనీ విలువలో 80 శాతం)లో యాజమాన్య హక్కులను కలిగి ఉంది. కాగా.. టాటా సన్స్‌లో దొరాబ్జీ టాటా ట్రస్ట్ 28 శాతం, రతన్ టాటా ట్రస్ట్ 24 శాతం, సైరస్ మిస్త్రీ కుటుంబ పెట్టుబడి సంస్థ(స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్) 9 శాతం, ఇతర ప్రమోటర్లు 14 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. -
వొడా ఐడియా నిధుల బాట
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా నిధుల సమీకరణకు ప్రతిపాదించింది. ఈ అంశంపై చర్చించేందుకు కంపెనీ బోర్డు ఈ నెల 27న సమావేశం కానున్నట్లు కంపెనీ పేర్కొంది. నిధుల సమీకరణకున్న అన్ని అవకాశాలను బోర్డు పరిశీలించనున్నట్లు తెలియజేసింది. రైట్స్, పబ్లిక్ ఆఫర్, ప్రిఫరెన్షియల్ కేటాయింపులు, క్విప్ తదితర మార్గాలతోపాటు.. ఒకేసారి లేదా దశలవారీగా నిధుల సమీకరణకు తెరతీసే అంశంపై నిర్ణయించనున్నట్లు వివరించింది. వెరసి ఈక్విటీ లేదా రుణ మార్గాలలో నిధుల సమీకరణ చేపట్టనున్నట్లు బీఎస్ఈకి వొడాఫోన్ ఐడియా తాజాగా వెల్లడించింది. విదేశీ ఇన్వెస్టర్లకు చోటు నగదు సవాళ్లను ఎదుర్కొంటున్న వొడాఫోన్ ఐడియా కంపెనీ బలిమికి కట్టుబడి ఉన్నట్లు ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లా తాజాగా స్పష్టం చేశారు. బిర్లా గ్రూప్ డెకరేటివ్ పెయింట్ల బిజినెస్‌లోకి ప్రవేశిస్తున్న సందర్భంగా వొడాఫోన్‌లో విదేశీ ఇన్వెస్టర్లకు చోటు కలి్పంచేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. అయితే బోర్డులో విదేశీ ఇన్వెస్టర్లు ఎప్పుడు ప్రవేశిస్తారన్న అంశంపై ఇప్పుడే చెప్పలేమన్నారు. ఇందుకు వ్యూహాత్మకంగా తగిన ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. వొడాఫోన్ ఐడియాలో ఆదిత్య బిర్లా గ్రూప్ సహప్రమోటర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో కంపెనీ రూ. 6,986 కోట్లకు నికర నష్టాన్ని తగ్గించుకుంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 7,990 కోట్ల నష్టం ప్రకటించింది. దాదాపు రూ. 756 కోట్ల అనూహ్య లాభాలు నష్టాలు తగ్గేందుకు సహకరించాయి. భారీ రుణ భారాన్ని మోస్తున్న వొడాఫోన్ ఐడియా మొబైల్ టెలికం రంగంలోని ప్రత్యర్ధి సంస్థలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. నిధుల సమీకరణ వార్తలతో వొడాఫోన్ ఐడియా షేరు బీఎస్ఈలో 6.3 శాతం జంప్‌చేసి రూ. 16.30 వద్ద ముగిసింది. -
ఆశీర్వాద్ మైక్రోకు సెబీ బ్రేకులు
న్యూఢిల్లీ: ఎన్బీఎఫ్సీ.. మణప్పురం ఫైనాన్స్ అనుబంధ సంస్థ ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలకు తాజాగా సెబీ బ్రేకు వేసింది. సంస్థ దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను ప్రస్తుతానికి పక్కనపెట్టింది. అయితే వెబ్సైట్లో సెబీ ఇందుకు కారణాలను వెల్లడించలేదు. ఈక్విటీ జారీ ద్వారా రూ. 1,500 కోట్ల సమీకరణకు వీలుగా ఆశీర్వాద్ మై క్రో 2023 అక్టోబర్‌లో సెబీకి దరఖాస్తు చేసింది. సాధారణంగా ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన 30 రోజుల్లోగా సెబీ పరిశీలనా పత్రాన్ని జారీ చేస్తుంది. తద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు అనుమతిస్తుంది. కాగా.. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మూలధన పటిష్టతకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో ఆశీర్వాద్ మైక్రో పే ర్కొంది. 2008లో తమిళనాడులో ప్రారంభమైన కంపెనీ ప్రస్తుతం 1,684 బ్రాంచీలతో దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించింది. గతేడాది(2022–23)కల్లా నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) రూ. 10,041 కోట్లకు చేరాయి. ఈ వార్తల నేపథ్యంలో మణప్పురం ఫైనాన్స్ షేరు బీఎస్ఈలో దాదాపు 5 శాతం పతనమై రూ. 168 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 163 వద్ద కనిష్టాన్ని తాకింది. -
పబ్లిక్ ఇష్యూ యోచనలో ఐఐఎఫ్‌సీఎల్
ప్రభుత్వ రంగ సంస్థ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌సీఎల్) పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2024–25)లో స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు కంపెనీ ఎండీ పీఆర్ జైశంకర్ పేర్కొన్నారు. ఇందుకు త్వరలోనే కన్సల్టేషన్ కార్యక్రమానికి తెరతీయనున్నట్లు కంపెనీ వ్యవస్థాపక రోజు సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీలో కేంద్రానికి 100% వాటా ఉంది. కంపెనీ ఏర్పాటయ్యాక ఇప్పటివరకూ 750 ప్రాజెక్టులకు రూ. 2.5 లక్షల కోట్ల రుణాలందించినట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో రూ. 1,076 కోట్ల నికర లాభం ఆర్జించగా.. ఈ ఏడాది(2023–24) రూ. 1,500 కోట్ల లాభం సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. -
ఐపీవో బాటలో మొబిక్విక్
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ యూనికార్న్ మొబిక్విక్ సిస్టమ్స్ లిమిటెడ్ రెండేళ్ల తర్వాత మరోసారి పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 700 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. కంపెనీ ఇంతక్రితం 2021 జూలైలో రూ. 1,900 కోట్ల సమీకరణ ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు ప్రణాళికలు వేసింది. ఇందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. అయితే ఆపై ప్రతికూల మార్కెట్ పరిస్థితుల కారణంగా పబ్లిక్ ఇష్యూ యోచనను విరమించుకుంది. 2021 నవంబర్‌లో ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకుంది. కాగా.. ప్రస్తుత ప్రణాళికల ప్రకారం రూ. 700 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. ఐపీవోకంటే ముందుగా సెక్యూరిటీల కేటాయింపు ద్వారా రూ. 140 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇది జరిగితే ఆమేరకు ఐపీవో పరిమాణం తగ్గనుంది. కంపెనీలో ప్రధాన వాటాదారు పీక్ ఎక్స్‌వీ పార్ట్‌నర్స్‌తోపాటు.. బజాజ్ ఫైనాన్స్, అబుధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌కు పెట్టుబడులున్నాయి. -
ఐపీఓకి ఓలా... సెబీకి దరఖాస్తు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ ఓలా ఎలక్ట్రిక్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. వెరసి రెండు దశాబ్దాల తదుపరి ఆటోరంగ కంపెనీ ఐపీవో ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ కానుంది. కాగా.. ఇష్యూలో భాగంగా రూ. 5,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 9,51,91,195 షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థ ఓసీటీ ఏర్పాటు చేస్తున్న ఓలా గిగాఫ్యాక్టరీ కోసం పెట్టుబడి వ్యయాలుగా వినియోగించనుంది. -
ఇండియా షెల్టర్ ఐపీవో రెండో రోజుకి 4.3 రెట్లు స్పందన
అందుబాటు ధరల గృహ రుణాల కంపెనీ ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పబ్లిక్ ఇష్యూ రెండో రోజుకల్లా విజయవంతమైంది. 4.34 రెట్లు అధిక స్పందనను సాధించింది. కంపెనీ 1.79 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. గురువారాని(14)కల్లా 7.76 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 7.33 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 5 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. అయితే అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 84 శాతమే సబ్స్క్రయిబ్ అయ్యింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా రూ. 400 కోట్ల విలువైన షేర్లనుప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచారు. షేరుకి రూ. 469–493 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1200 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. మంగళవారం(12న) యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 360 కోట్లు అందుకుంది. ప్రధానంగా టైర్–2, టైర్–3 పట్టణాలలో మధ్యాదాయ, తక్కువ ఆదాయ వర్గాల వారికి గృహ రుణాలు సమకూర్చుతోంది. -
ఆజాద్ ఇంజినీరింగ్ @ రూ. 740 కోట్లు సమీకరణ లక్ష్యం
ఇంజినీరింగ్ ప్రొడక్టుల కంపెనీ ఆజాద్ ఇంజినీరింగ్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. లిస్టింగ్ కోసం ఈ హైదరాబాద్ కంపెనీ సెపె్టంబర్లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 240 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో రూ. 500 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 740 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఈక్విటీ జారీ నిధులను పెట్టుబడి వ్యయాలు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ కస్టమర్లలో జనరల్ ఎలక్ట్రిక్, హనీవెల్ ఇంటర్నేషనల్, మిత్సుబిషీ హెవీ ఇండస్ట్రీస్, సీమెన్స్ ఎనర్జీ, ఈటన్ ఏరోస్పేస్ తదితర గ్లోబల్ దిగ్గజాలున్నాయి. కాగా.. ఇప్పటికే పార్క్ బ్రాండ్ హోటళ్ల కంపెనీ ఏపీజే సురేంద్ర పార్క్ హోటల్స్, హెల్త్‌టెక్ సంస్థ మెడీ అసిస్ట్ హెల్త్‌కేర్ సరీ్వసెస్, క్రయోజెనిక్ ట్యాంకుల తయారీ కంపెనీ ఐనాక్స్ ఇండియా, లగ్జరీ ఫరీ్నచర్ తయారీ కంపెనీ స్టాన్లీ లైఫ్‌స్టైల్స్ ఐపీవోలు చేపట్టేందుకు సెబీ నుంచి అనుమతులు పొందిన సంగతి తెలిసిందే. -
క్రెడో బ్రాండ్స్ @ రూ. 266–280
మఫ్టీ బ్రాండ్ జీన్స్ తయారీ కంపెనీ క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్ ఈ నెల 19న పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. 21న ముగియనున్న ఇష్యూలో భాగంగా 1.96 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. షేరుకి రూ. 266–280 ధరల శ్రేణిలో చేపట్టనున్న ఇష్యూ ద్వారా రూ. 550 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 18న షేర్లను కేటాయించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 53 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. పురుషుల మధ్యస్థాయి ప్రీమియం, ప్రీమియం క్యాజువల్ వేర్ దుస్తుల తయారీలో కంపెనీ కార్యకలాపాలు విస్తరించింది. దేశీయంగా 404 ప్రత్యేక బ్రాండ్ ఔట్లెట్స్, 1,807 టచ్‌పాయింట్స్‌సహా 71 లార్జ్ ఫార్మాట్, 1332 మల్టీ బ్రాండ్ స్టోర్ల ద్వారా విక్రయాలు నిర్వహిస్తోంది. గతేడాది(2022–23) ఆదాయం 46 శాతం ఎగసి రూ. 498 కోట్లను అధిగమించింది. నికర లాభం 117 శాతం దూసుకెళ్లి రూ. 77.5 కోట్లను తాకింది. -
హ్యాపీ ఫోర్జింగ్స్ @ రూ. 808–850
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల కంపెనీ హ్యాపీ ఫోర్జింగ్స్ ఈ నెల 19న పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. 21న ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో 71.6 లక్షల షేర్లను ప్రమోటర్, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. షేరుకి రూ. 808– 850 ధరల శ్రేణిలో చేపట్టనున్న ఇష్యూ ద్వారా దాదాపు రూ. 1,009 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 18న షేర్లను కేటాయించనుంది. ఈక్విటీ జారీ నిధులను ఎక్విప్మెంట్, ప్లాంట్లు, మెషీనరీ కొనుగోలుతోపాటు.. రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 17 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. లూధియానా కంపెనీ ఆటో విడిభాగాలు, వ్యవసాయ పరికరాలు, ఇండస్ట్రియల్ మెషీనరీ విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. కస్టమర్లలో అశోక్ లేలాండ్, జేసీబీ ఇండియా, ఎంఅండ్ఎం, ఎస్ఎంఎల్ ఇసుజు, టాటా కమిన్స్ తదితరాలున్నాయి. గతేడాది(2022–23) ఆదాయం 39 శాతం ఎగసి రూ. 1,197 కోట్లకు చేరగా.. నికర లాభం 47 శాతం జంప్‌చేసి రూ. 209 కోట్లను తాకింది. -
డోమ్స్ ఐపీవోకు రిటైలర్ల క్యూ..
న్యూఢిల్లీ: పెన్సిళ్ల తయారీ దిగ్గజం డోమ్స్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూకి తొలి రోజే(బుధవారం) ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. కంపెనీ 88 లక్షలకుపైగా షేర్లను ఆఫర్ చేయగా.. 5 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. వెరసి 5.7 రెట్లు అధిక సబ్స్క్రిప్షన్ లభించింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్లు ఏకంగా 19 రెట్లు అధికంగా దరఖాస్తు చేయడం విశేషం! ఈ బాటలో సంస్థాగతేతర ఇన్వెస్టర్లు 8 రెట్లు బిడ్ చేయగా.. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) నుంచి కేవలం 6% మాత్రమే స్పందన నమోదైంది. ఇష్యూ లో భాగంగా కంపెనీ రూ. 350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుండగా.. మరో రూ. 850 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,200 కోట్లు సమీకరించనుంది. ఒక్కో షేరుకి రూ. 750–790 చొప్పున ధరల శ్రేణిని ప్రకటించిన కంపెనీ మంగళవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 538 కోట్లు సమకూర్చుకుంది. -
IPO: పబ్లిక్ ఇష్యూల జోరు! 5 కంపెనీలు.. రూ. 4,200 కోట్లు
న్యూఢిల్లీ: మార్కెట్లో సానుకూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూ బాట పట్టాయి. ఈ వారం ఏకంగా ఐదు కంపెనీలు ఇన్షీయల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు వస్తున్నాయి. ఈ జాబితాలో ఇండియా షెల్టర్ ఫైనాన్స్, డోమ్స్ ఇండస్ట్రీస్, ఐనాక్స్ ఇండియా, మోతిసన్స్ జ్యుయలర్స్, సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిసి సుమారు రూ. 4,200 కోట్ల పైచిలుకు సమీకరించనున్నాయి. గత నెల 10 కంపెనీల పబ్లిక్ ఇష్యూలు విజయవంతమైన నేపథ్యంలో తాజా ఐపీవోలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టాటా గ్రూప్ నుంచి 2004 తర్వాత (టీసీఎస్) దాదాపు ఇరవై ఏళ్లకు వచ్చిన టాటా టెక్నాలజీస్ ఇష్యూకు భారీ స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ ఆఖరు వరకు మొత్తం మీద 44 ఇష్యూల ద్వారా కంపెనీలు రూ. 35,000 కోట్లు సమీకరించాయి. స్థూల ఆర్థిక పరిస్థితులు, లిస్టింగ్ లాభాలు పటిష్టంగా ఉండటం వంటి అంశాల కారణంగా గత కొద్ది వారాలుగా ఐపీవో మార్కెట్ బాగా సందడిగా ఉందని ఆనంద్ రాఠీ అడ్వైజర్స్ డైరెక్టర్ వి. ప్రశాంత్ రావు చెప్పారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం కూడా పాలనపరమైన స్థిరత్వాన్ని కోరుకునే ఇన్వెస్టర్లకు, తద్వారా మార్కెట్‌కు ఉత్సాహాన్ని ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఐపీవోలు ఇవీ.. ఇండియా షెల్టర్ ఫైనాన్స్ (ఐఎస్ఎఫ్), డోమ్స్ ఇండస్ట్రీస్ ఇష్యూలు డిసెంబర్ 13–15 మధ్య ఉండనున్నాయి. ఇవి రెండూ చెరి రూ. 1,200 కోట్లు సమీకరించనున్నాయి. ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కొత్తగా రూ. 800 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా, ఇన్వెస్టర్ షేర్హోల్డర్లు రూ. 400 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనున్నారు. షేరు ధర శ్రేణి రూ. 469–493గా ఉండనుంది. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను భవిష్యత్తు వ్యాపార కార్యకలాపాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. మరోవైపు, పెన్సిళ్ల తయారీ సంస్థ డోమ్స్ ఇండస్ట్రీస్ రూ. 350 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, రూ. 850 కోట్ల విలువ చేసే షేర్లను ఓఎఫ్ఎస్ ద్వారా విక్రయించనుంది. ఐపీవో ధర శ్రేణి రూ. 750–790గా ఉంటుంది. క్రయోజెనిక్ స్టోరేజ్ ట్యాంకుల తయారీ సంస్థ ఐనాక్స్ సీవీఏ పూర్తిగా ఓఎఫ్ఎస్ కింద 2.21 కోట్ల షేర్లను విక్రయించి రూ. 1,459 కోట్లు సమీకరించనుంది. షేరు ధర శ్రేణి రూ. 627– 660గా ఉంటుంది. నిధులను కంపెనీతో పాటు అనుబంధ సంస్థలైన ఎకార్డ్ ఎస్టేట్స్, ఐకానిక్ ప్రాపర్టీ డెవలపర్స్, స్కైలైన్ రియల్టీ రుణాల చెల్లింపునకు, స్థల సమీకరణ మొదలైన అవసరాలకు వినియోగించుకోనుంది. ఐనాక్స్ ఇ ష్యూ డిసెంబర్ 14న ప్రారంభమై 18న ముగుస్తుంది. 17 ఏళ్ల క్రితం ఐనాక్స్ లీజర్ (మలీ్టప్లెక్స్ విభాగం) ఐపీవోకి వచ్చాక ఐనాక్స్ గ్రూ ప్ నుంచి మరో కంపెనీ పబ్లిక్ ఇష్యూకు రా వడం ఇదే ప్రథమం. ప్రస్తుతం ఐనాక్స్ లీజర్.. పీవీఆర్ గ్రూప్‌లో భాగంగా ఉంది. 1992లో ఏ ర్పాటైన కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలోరూ. 980 కోట్ల ఆదాయంపై రూ. 152 కోట్ల నికర మార్జిన్ నమోదు చేసింది. మూడు ప్లాంట్లు ఉండగా, నాలుగో ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. మోతీసన్స్ జ్యుయలర్స్ 2.74 కోట్ల షేర్లను కొత్తగా జారీ చేయనుంది. సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ రూ. 400 కోట్ల విలువ చేసే షేర్లను జారీ కొత్తగా జారీ చేయనుంది. ఈ రెండు ఇష్యూలు డిసెంబర్ 18న ప్రారంభమై 20న ముగుస్తాయి. ఐపీవోల ద్వారా సేకరించిన నిధులను వ్యాపార విస్తరణ, పెట్టుబడులు, రుణాల చెల్లింపు మొదలైన అవసరాల కోసం ఈ సంస్థలు వినియోగించుకోనున్నాయి. -
అయిదు ఐపీవోలకు సెబీ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇండియా షెల్టర్ ఫైనాన్స్, పెన్సిళ్ల తయారీ సంస్థ డోమ్స్ ఇండస్ట్రీస్ తదితర అయిదు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు (ఐపీవో) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, శివ ఫార్మాకెమ్, ఒనెస్ట్ సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వీటికి నవంబర్ 7–16 మధ్య సెబీ అబ్జర్వేషన్ లెటర్స్ (ఓఎల్) జారీ చేసింది. ఐపీవోకి సెబీ ఆమోదముద్రగా ఓఎల్‌ను పరిగణిస్తారు. ఇండియా షెల్టర్ ఫైనాన్స్ రూ. 1,800 కోట్లు సమీకరించనుంది. డోమ్స్ కొత్తగా రూ. 350 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా, ప్రమోటర్లు రూ. 850 కోట్ల వరకు విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 575 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, ప్రస్తుత ఇన్వెస్టర్లు, 40,51,516 షేర్లను విక్రయించనున్నారు. శివ ఫార్మాకెమ్ ఐపీవో పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ విధానంలో ఉండనుంది. ప్రమోటర్లు రూ. 900 కోట్ల వరకు విలువ చేసే షేర్లను విక్ర యించనున్నారు. ఎఫ్ఎంసీజీ సంస్థ ఒనెస్ట్ రూ. 77 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, ప్రమోటర్లు.. ఇతర వాటాదా రులు 32.5 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. -
పబ్లిక్ ఆఫర్.. బంపర్ హిట్!
టాటా టెక్ @ 69 రెట్లు న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సరీ్వసుల కంపెనీ కి భారీ స్పందన లభించింది. ఇన్వెస్టర్లు క్యూ కట్టడంతో చివరి రోజు శుక్రవారానికల్లా 69 రెట్లుపైగా అధిక సబ్ర్స్కిప్షన్ లభించింది. కంపెనీ 4.5 కోట్లకుపైగా షేర్లను ఆఫర్ చేయగా.. 312 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 203 రెట్లు బిడ్స్ దాఖలుకాగా.. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 62 రెట్లు, రిటైలర్ల నుంచి 17 రెట్లు చొప్పున దరఖాస్తులు లభించాయి. టీసీఎస్ (2004) తదుపరి రెండు దశాబ్దాలకు టాటా గ్రూప్ నుంచి వస్తున్న ఐపీవోకాగా.. షేరుకి రూ. 475–500 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 3,043 కోట్లు అందుకుంది. ఫ్లెయిర్ రైటింగ్..@47 రెట్లు పెన్నులు, స్టేషనరీ ప్రొడక్టుల కంపెనీ ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్ ఐపీవో చివరి రోజు శుక్రవారానికల్లా 47 రెట్లు అధిక సబ్‌్రస్కిప్షన్‌ను సాధించింది. కంపెనీ 1,44,13,188 షేర్లను ఆఫర్ చేయగా.. 67 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి. క్విబ్ విభాగంలో 116 రెట్లు అధిక బిడ్స్ నమోదుకాగా, రిటైలర్ల నుంచి 13 రెట్లు బిడ్స్ దాఖలయ్యాయి. ఫెడ్‌ఫినా@ 22 రెట్లు ఫెడరల్ బ్యాంక్ అనుబంధ సంస్థ ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఫెడ్‌ఫినా) ఐపీవోకు మంచి స్పందన లభించింది. 5.59 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 12 కోట్లకుపైగా షేర్లకు (2.2 రెట్లు) బిడ్స్ వచ్చాయి. క్విబ్ విభాగంలో 3.5 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 1.5 రెట్లు, రిటైలర్ల నుంచి 1.8 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. గాంధార్ ఆయిల్ @ 64 రెట్లు ప్రైవేట్ రంగ కంపెనీ గాంధార్ ఆయిల్ రిఫైనరీ (ఇండియా) ఐపీవో చివరి రోజు శుక్రవారానికల్లా 64 రెట్లు అధిక సబ్‌్రస్కిప్షన్‌ను సాధించింది. కంపెనీ 2,12,43,940 షేర్లను ఆఫర్ చేయగా.. 136 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల (క్విబ్) విభాగంలో 129 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 62 రెట్లు, రిటైలర్ల నుంచి 29 రెట్లు చొప్పున బిడ్స్ దాఖలయ్యాయి. దీంతో షేరుకి రూ. 160–169 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 501 కోట్ల మేర నిధులను సమీకరించింది. ఇష్యూలో భాగంగా రూ. 302 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 1.17 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచింది. ఈ నాలుగు ఇష్యూలకూ గురువారాని (30)కల్లా షేర్ల కేటాయింపు జరిగే వీలుంది. రిఫండ్స్ శుక్రవారం, షేర్లు సోమవారం (4న) రావచ్చు. వచ్చే నెల 5న స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కానున్నట్లు తెలుస్తోంది. -
ఇరెడా ఐపీవో సక్సెస్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ మినీరత్న సంస్థ ఇండియన్ రెనెవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఐఆర్ఈడీఏ–ఇరెడా) పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. చివరి రోజు గురువారానికల్లా 39 రెట్లు అధిక స్పందన నమోదైంది. కంపెనీ 47 కోట్లకుపైగా షేర్లను ఆఫర్ చేయగా.. 1,827 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు దాఖలయ్యాయి. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 24 రెట్లు, రిటైలర్ల నుంచి దాదాపు 8 రెట్లు అధికంగా బిడ్స్ లభించాయి. అర్హతగల కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో అయితే దాదాపు 105 రెట్లు అధికంగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. రూ. 30–32 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూలో భాగంగా సోమవారం(20న) యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 643 కోట్లు సమీకరించిన సంగతి తెలిసిందే. ఈక్విటీ వివరాలిలా ఐపీవోలో భాగంగా 40.31 కోట్ల ఈక్విటీ షేర్లను ఇరెడా తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా కంపెనీ ప్రమోటర్ కేంద్ర ప్రభుత్వం 26.88 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచింది. ఈక్విటీ జారీతో రూ. 1,290 కోట్లు, ప్రభుత్వ వాటాకు రూ. 860 కోట్ల చొప్పున లభించనున్నాయి. వెరసి ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ. 2,150 కోట్లు సమకూర్చుకోనుంది. గతేడాది మే నెలలో బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ లిస్టింగ్ తదుపరి మళ్లీ ప్రభుత్వ రంగ సంస్థ పబ్లిక్ ఇష్యూకి రావడం విశేషం! కాగా.. ఈక్విటీ జారీ నిధులను కంపెనీ భవిష్యత్ పెట్టుబడి అవసరాలరీత్యా మూలధన పటిష్టతకు వినియోగించనుంది. -
సిగ్నేచర్ గ్లోబల్ @ రూ. 366–385
ముంబై: రియల్టీ రంగ కంపెనీ సిగ్నేచర్ గ్లోబల్(ఇండియా) లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రూ. 366–385 ధరల శ్రేణిని కంపెనీ ప్రకటించింది. ఐపీవో ఈ నెల 20న ప్రారంభమై 22న ముగియనుంది. ఇష్యూలో భాగంగా రూ. 603 కోట్ల విలువైన ఈక్విటీని కంపెనీ తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 127 కోట్ల విలువైన షేర్లను సైతం విక్రయానికి ఉంచనుంది. వెరసి రూ. 730 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 330 కోట్లు సమకూర్చుకునే లక్ష్యంతో ఉంది. కంపెనీ గతేడాది జులైలో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇష్యూ నిధుల్లో రూ. 432 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు కంపెనీ చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ పేర్కొన్నారు. గతేడాది చివరికల్లా రూ. 1,100 కోట్ల నికర రుణ భారం నమోదైనట్లు వెల్లడించారు. మిగిలిన నిధులను ఇతర సంస్థలు, భూముల కొనుగోళ్లకు కేటాయించనున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లకు 78.35 శాతం వాటా ఉంది. ఐఎఫ్‌సీ 5.38 శాతం వాటాను కలిగి ఉంది. అనుబంధ సంస్థ సిగ్నేచర్ బిల్డర్స్ ప్రయివేట్ లిమిటెడ్ ద్వారా గురుగ్రామ్‌లోని సోలెరా ప్రాజెక్టుతో 2014లో కార్యకలాపాలు ప్రారంభించింది. -
ఐపీవో అక్రమాల నిధుల పంపిణీ
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. 2003–05 మధ్య కాలంలో నమోదైన ఐపీవో అవకతవకల నుంచి సమీకరించిన నిధుల పంపిణీని మరోసారి చేపట్టింది. మూడో దశలో భాగంగా దాదాపు రూ. 15 కోట్లను 2.58 లక్షల ఇన్వెస్టర్లకు పంపిణీ చేయనుంది. ఈ బాటలో ఇప్పటికే 2010 ఏప్రిల్‌లో రూ. 23.28 కోట్లు, 2015 డిసెంబర్లో రూ. 18.06 కోట్లు ఇన్వెస్టర్లకు పంచిపెట్టింది. పబ్లిక్ ఇష్యూల అక్రమాల కేసులలో భాగంగా సమీకరించిన నిధులను అర్హతగల ఇన్వెస్టర్లకు సెబీ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. 2003–05 మధ్య కాలంలో మొత్తం 21 ఐపీవోలకు సంబంధించి సెబీ అక్రమాలను గుర్తించింది. వీటిపై దర్యాప్తు పూర్తయ్యాక సంబంధిత వ్యక్తుల నుంచి చట్టవిరుద్ధంగా ఆర్జించిన లాభాలను రాబట్టే చర్యలు చేపట్టింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి డీపీ వాధ్వా అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఆదేశాల ప్రకారం సంబంధిత ఇన్వెస్టర్లకు నిధుల పంపిణీని చేపడుతోంది. -
ఐపీవోకు మళ్లీ ఫెడ్‌ఫినా రెడీ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ అనుబంధ కంపెనీ ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సరీ్వసెస్(ఫెడ్‌ఫినా) మరోసారి పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 7.03 కోట్ల షేర్లను ప్రమోటర్ ఫెడరల్ బ్యాంక్, ప్రస్తుత వాటాదారు ట్రూనార్త్ ఫండ్ వీఐ ఎల్ఎల్పీ.. విక్రయానికి ఉంచనున్నాయి. వీటిలో ఫెడరల్ బ్యాంక్ 1.65 కోట్లు, ట్రూ నార్త్ ఫండ్ 5.38 కోట్ల షేర్లను ఆఫర్ చేయనున్నాయి. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ అవసరాలరీత్యా టైర్–1 మూలధన పటిష్టతకు వినియోగించనుంది. కాగా.. ఇంతక్రితం 2022 ఫిబ్రవరిలోనూ ఫెడ్‌ఫినా లిస్టింగ్ కోసం ఫెడరల్ బ్యాంక్ సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. తద్వారా రూ. 900 కోట్ల ఈక్విటీ జారీతోపాటు ఆఫర్ ఫర్ సేల్కు ప్రణాళికలు వేసిన విషయం విదితమే. -
సూరజ్ ఎస్టేట్ ఐపీవో బాట
న్యూఢిల్లీ: రియల్టీ రంగ కంపెనీ సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ మరోసారి పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. దీనిలో భాగంగా ఈక్విటీ జారీ ద్వారా రూ. 400 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. కంపెనీ ఇంతక్రితం 2022 మార్చిలోనూ ఐపీవో చేపట్టేందుకు ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇష్యూ నిధుల్లో రూ. 285 కోట్లు అనుబంధ సంస్థల రుణ చెల్లింపులకు, రూ. 35 కోట్లు భూముల కొనుగోలుకి, మిగిలిన నిధులను ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. గతేడాది(2022–23) రూ. 306 కోట్ల ఆదాయం, రూ. 32 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
ఈ నెల 17 నుంచి నెట్వెబ్ ఐపీవో
న్యూఢిల్లీ: దేశీ సర్వర్ల తయారీ సంస్థ నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) జూలై 17న ప్రారంభమై 20న ముగియనునంది. ఇష్యూలో భాగంగా రూ. 206 కోట్ల విలువ చేసే ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుండగా, 85 లక్షల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనున్నారు. సంజయ్ లోధా, వివేక్ లోధా, నవీన్ లోధా, నీరజ్ లోధా, అశోకా బజాజ్ ఆటోమొబైల్స్ .. ఓఎఫ్ఎస్ ద్వారా షేర్లను విక్రయించనున్నారు. షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధుల్లో సుమారు రూ. 33 కోట్లను పెట్టుబడి వ్యయాలకు, రూ. 128 కోట్లను దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, రూ. 22.5 కోట్లను రుణాల చెల్లింపు తదితర అవసరాల కోసం వినియోగించుకోనున్నారు. దేశీయంగా ఉన్న అతి కొద్ది సర్వర్ల తయారీ సంస్థల్లో ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్‌కు చెందిన నెట్వెబ్ టెక్నాలజీస్ కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకానికి కూడా ఎంపికైంది. -
సెన్కో గోల్డ్ @ రూ. 301–317
కోల్‌కతా: జ్యువెలరీ రిటైల్ కంపెనీ సెన్కో గోల్డ్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రూ. 301–317 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూ నేడు(4న) ప్రారంభమై గురువారం(6న) ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు సోమవారం(3న) షేర్లను విక్రయించనుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 270 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 135 కోట్ల విలువైన షేర్లను కంపెనీలో ప్రస్తుత వాటాదారు సంస్థ సైఫ్ పార్ట్నర్స్ ఇండియా ఐవీ లిమిటెడ్ విక్రయానికి ఉంచనుంది. ప్రస్తుతం సైఫ్ పార్ట్నర్స్కు కంపెనీలో 19.23 శాతం వాటా ఉంది. దీనిలో 8–9 శాతం వాటాను ఆఫర్ చేయనున్నట్లు సెన్కో ఎండీ, సీఈవో సువంకర్ సేన్ పేర్కొన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 47 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 196 కోట్లు వర్కింగ్ క్యాపిటల్‌కు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకూ వినియోగించనుంది. కంపెనీ 13 రాష్ట్రాలలో మొత్తం 140 షోరూములను నిర్వహిస్తోంది. ఎస్పీసీ లైఫ్ సైన్సెస్ రెడీ ఐపీవోకు సెబీ గ్రీన్‌సిగ్నల్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రెడియంట్స్ తయా రీ కంపెనీ ఎస్పీసీ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. కంపెనీ ప్రాస్పెక్టస్‌కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. ఇష్యూలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా 89.39 లక్షల షేర్లను ప్రమోటర్ స్నేహల్ రాజీవ్‌భాయ్ పటేల్ విక్రయానికి ఉంచనున్నారు. మళ్లీ ఐపీవోకు అక్మే ఫిన్.. ప్రాస్పెక్టస్ దాఖలు నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అక్మే ఫిన్‌ట్రేడ్(ఇండియా) లిమిటెడ్ మరోసారి పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. కంపెనీ తొలుత ఫిబ్రవరి 16న దాఖలు చేసిన ప్రాస్పెక్టస్‌ను సెబీ ఏప్రిల్ 27న వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. దీంతో కంపెనీ తిరిగి తాజా ప్రాస్పెక్టస్‌ను సెబీకి అందించింది. -
ఐఐఎఫ్ఎల్ నిధుల సమీకరణ
ముంబై: బ్యాంకింగేతర సంస్థ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ రుణ మార్కెట్ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధపడుతోంది. మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా రూ. 1,500 కోట్లు సమకూర్చుకోవాలని చూస్తున్నట్లు కంపెనీ తాజాగా పేర్కొంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 300 కోట్ల విలువైన సెక్యూర్డ్ రీడీమబుల్ ఎన్సీడీలను విక్రయించనున్నట్లు తెలియజేసింది. వీటికి 9 శాతంవరకూ రిటర్నులను ఆఫర్ చేస్తోంది. ఈ నెల 9న వీటిని జారీ చేయనున్నట్లు వెల్లడించింది. నిధులను వ్యాపారాభివృద్ధి, మూలధన పటిష్టతకు వినియోగించనున్నట్లు పేర్కొంది. ఇష్యూకి అధిక సబ్స్క్రిప్షన్ లభిస్తే మరో రూ. 1,200 కోట్ల విలువైన ఎన్సీడీలను సైతం కేటాయించేందుకు గ్రీన్ షూ అప్షన్‌ను ఎంచుకున్నట్లు తెలియజేసింది. వెరసి రూ. 1,500 కోట్లను సమీకరించే వీలున్నట్లు తెలియజేసింది. 60 నెలల కాలానికిగాను ఇన్వెస్టర్లకు 9 శాతం వరకూ రిటర్నులను ఆఫర్ చేస్తున్నట్లు వెల్లడించింది. 24 నెలలు, 36 నెలల కాలావాధితోనూ బాండ్లను కేటాయించనున్నట్లు పేర్కొంది. వడ్డీని వార్షికంగా లేదా నెలవారీ చెల్లించనున్నట్లు తెలియజేసింది. కంపెనీ ఏప్రిల్‌లో 40 కోట్ల డాలర్ల విలువైన డాలర్ బాండ్లను తిరిగి చెల్లించిన సంగతి తెలిసిందే. వీటిని 2020 ఫిబ్రవరిలో జారీ చేసింది. -
బాల్కో లిస్టింగ్‌పై ప్రభుత్వ దృష్టి
న్యూఢిల్లీ: మెటల్ రంగ సంస్థ భారత్ అల్యూమినియం కంపెనీ(బాల్కో)లో మిగిలిన 49 శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉంది. అంతేకాకుండా సంస్థ ప్రమోటర్ గ్రూప్ వేదాంతా చేపట్టిన ఆర్బిట్రేషన్‌ను ఉపసంహరింప చేయాలని చూస్తున్నట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. ఇందుకు వీలుగా వేదాంతాతో గనుల శాఖ, దీపమ్ ప్రాథమిక చర్చలు ప్రారంభించినట్లు తెలియజేశారు. మిగిలిన వాటా విషయంలో అధిక విలువ వివాదంపై 2009లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాల్కో ఆర్బిట్రేషన్ కేసును దాఖలు చేసింది. కాగా.. బాల్కో ప్రమోటర్లతో ప్రాథమిక చర్చలు చేపట్టినట్లు పాండే వెల్లడించారు. ఈ విషయంలో మరింత లోతుగా చర్చించనున్నట్లు తెలియజేశారు. కంపెనీని స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ చేయాలంటే ఆర్బిట్రేషన్ కేసును వెనక్కి తీసుకోవలసి ఉన్నట్లు వివరించారు. ఇందుకు ప్రమోటర్లు ఒప్పుకుంటే పబ్లిక్ ఇష్యూకి సన్నాహాలు ప్రారంభిస్తామని తెలియజేశారు. వాటా విక్రయం ఇలా 2001లో ప్రభుత్వం మెటల్ పీఎస్‌యూ.. బాల్కోలో 51 శాతం వాటాను స్టెరిలైట్ ఇండస్ట్రీస్‌కు విక్రయించింది. వేదాంతా గ్రూప్ అనుబంధ కంపెనీ స్టెరిలైట్ ఇందుకు రూ. 551 కోట్లు వెచ్చించింది. మిగిలిన 49 శాతం వాటా ప్రభుత్వం వద్దే ఉంది. ఒప్పందంలోని కాల్ ఆప్షన్ ప్రకారం 2004లో స్టెరిలైట్ మిగిలిన 49 శాతం వాటా కోసం ప్రభుత్వానికి రూ. 1,099 కోట్లు ఆఫర్ చేసింది. అయితే వాటా విలువ అంతకంటే అధికమని కాగ్ నివేదిక పేర్కొనడంతో ప్రభుత్వం ఆఫర్‌ను తిరస్కరించింది. దీంతో 2009లో ప్రమోటర్ వేదాంతా గ్రూప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించింది. బాల్కో ఆర్బిట్రేషన్ అంశం హిందుస్తాన్ జింక్ కేసు(2009)ను పోలి ఉన్నట్లు ఈ సందర్భంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే 2021 నవంబర్‌లో సుప్రీం కోర్టు ఓపెన్ మార్కెట్ విక్రయానికి ప్రభుత్వాన్ని అనుమతించింది. తద్వారా 29.5 శాతం వాటాను విక్రయించేందుకు ప్రభుత్వానికి వీలు చిక్కింది. 2022లో ప్రమోటర్ సంస్థ వేదాంతా ఆర్బిట్రేషన్‌ను ఉపసంహరించడంతో ప్రభుత్వం హిందుస్తాన్ జింక్‌లో వాటాను అమ్మేందుకు సన్నాహాలు చేస్తోంది. -
ఐపీవోకి జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా
న్యూఢిల్లీ: రుణ భారాన్ని తగ్గించుకునేందుకు, విస్తరణ ప్రణాళికలను అమలు చేసేందుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) రానుంది. దీని ద్వారా రూ. 2,800 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను (డీఆర్‌హెచ్‌పీ) నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఇప్పటికే జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లో భాగమైన జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్.. స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయి ఉన్నాయి. దీంతో గ్రూప్ నుంచి జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా మూడో లిస్టెడ్ కంపెనీ కానుంది. కంపెనీకి వార్షికంగా 153.43 మిలియన్ టన్నుల కమోడిటీ కార్గో హ్యాండ్లింగ్ స్థాపిత సామర్థ్యం ఉంది. 2022 డిసెంబర్ 31 నాటికి సంస్థకు నికరంగా రూ. 2,875 కోట్ల రుణాలు ఉన్నాయి. 2022–23 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా రూ. 447 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
మళ్లీ ఐపీవోకు టీవీఎస్ సప్లై చైన్
న్యూఢిల్లీ: టీవీఎస్ మొబిలిటీ గ్రూప్ కంపెనీ టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ మరోసారి పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయడంతోపాటు.. ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు మరో 2 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ ఇంతక్రితం 2022 ఫిబ్రవరిలో ప్రాథమిక పత్రాలను దాఖలు చేయడం ద్వారా సెబీ నుంచి అదే ఏడాది మే నెలలో లిస్టింగ్‌కు అనుమతి పొందింది. తద్వారా రూ. 2,000 కోట్లు సమీకరించాలని ప్రణాళికలు వేసింది. అయితే మార్కెట్ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఐపీవో యోచనకు స్వస్తి పలికింది. నిబంధనల ప్రకారం అనుమతి పొందాక గడువు(ఏడాది)లోగా పబ్లిక్ ఇష్యూ చేపట్టకుంటే తిరిగి తాజాగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. -
2 కంపెనీల ఐపీవోలకు సెబీ ఓకే
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా రెండు కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా నిధుల సమీకరణకు నాస్డాక్ లిస్టెడ్ కంపెనీ ఎబిక్స్ ఇంక్ అనుబంధ సంస్థ ఎబిక్స్‌క్యాష్ లిమిటెడ్, స్పెషాలిటీ కెమికల్ తయారీ కంపెనీ సర్వైవల్ టెక్నాలజీస్లను అనుమతించింది. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు అనుమతించమంటూ ఈ రెండు కంపెనీలు 2022 మార్చి, డిసెంబర్ మధ్య కాలంలో సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేశాయి. రూ. 6,000 కోట్లపై కన్ను ఐపీవో ద్వారా ఎబిక్స్‌క్యాష్ లిమిటెడ్ రూ. 6,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇందుకు వీలుగా తాజా ఈక్విటీని జారీ చేయనుంది. ఇష్యూ నిధులను అనుబంధ సంస్థలు ఎబిక్స్ ట్రావెల్స్, ఎబిక్స్‌క్యాష్ వరల్డ్ మనీ.. వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనుంది. అంతేకాకుండా ఎబిక్స్ మారిషస్ జారీ చేసిన తప్పనిసరిగా మార్పడికి లోనయ్యే డిబెంచర్ల చెల్లింపులతోపాటు.. వ్యూహాత్మక కొనుగోళ్లు, పెట్టుబడులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం వెచ్చించనుంది. కంపెనీ పేమెంట్ సొల్యూషన్స్, ట్రావెల్, ఫైనాన్షియల్ టెక్నాలజీస్, బీపీవో సర్వీసులు, స్టార్టప్‌ల ఏర్పాటులో టెక్నాలజీ ఆధారిత డిజిటల్ ప్రొడక్టులు, సర్వీసులను అందిస్తోంది. రూ. 1,000 కోట్లకు సై ఐపీవోలో భాగంగా సర్వైవల్ టెక్నాలజీస్ రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,000 కోట్ల సమీకరణపై కన్నేసింది. నిధుల్లో రూ. 175 కోట్లను వర్కింగ్ క్యాపిటల్, ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్ సర్వీసెస్(సీఆర్ఏఎంఎస్– క్రామ్స్) విభాగంలో ప్రధానంగా కంపెనీ కార్యకలాపాలు విస్తరించింది. హెటెరోసైక్లిక్, ఫ్లోరో ఆర్గానిక్ ప్రొడక్ట్ గ్రూప్‌ల నుంచి ఎంపిక చేసిన ఉత్పత్తులను కంపెనీ రూపొందిస్తోంది. -
నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ ఐపీవోకు రెడీ
న్యూఢిల్లీ: గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌కు పెట్టుబడులున్న నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ పబ్లిక్ ఇష్యూ ప్రణాళికల్లో ఉంది. గతేడాది నవంబర్‌లో ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసిన కంపెనీ మే నెలలో ఐపీవో చేపట్టే యోచనలో ఉంది. తద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. వెరసి దేశీయంగా తొలి రిటైల్ రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్)గా నిలవనుంది. నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ రిటైల్ రీట్.. 17 నిర్వహణలోగల షాపింగ్ మాల్స్ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. ఇవి 14 పట్టణాలలో 9.8 మిలియన్ చదరపు అడుగులలో విస్తరించి ఉన్నాయి. వీటి విలువ రూ. 23,000 కోట్లు. బ్లాక్‌స్టోన్ స్పాన్సర్ చేసిన మూడో రీట్‌గా ఇది నిలవనుంది. ఇప్పటికే దేశీయంగా సంస్థకు పెట్టుబడులున్న రీట్ ఎంబసీ ఆఫీస్ పార్క్స్, మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ లిస్టయ్యాయి. మరో కంపెనీ బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్టీ ట్రస్ట్ సైతం స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కాగా.. ఇవన్నీ ఆఫీస్ ఆస్తులపైనే ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ మాత్రం రిటైల్ రియల్టీ ఆస్తులపై ఇన్వెస్ట్ చేయడం ద్వారా అద్దె ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఐపీవో నిధులను కొంతమేర రుణ చెల్లింపులకు వినియోగించే వీలుంది. 2022 జూన్‌కల్లా రూ. 4,500 కోట్ల రుణ భారాన్ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. -
ఐపీవో యోచనలో బ్యాంక్ బజార్
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ కంపెనీ బ్యాంక్ బజార్.కామ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉంది. రానున్న 12–18 నెలల్లోగా ఐపీవోకు వెళ్లే ప్రణాళికల్లో ఉన్న ట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. బ్యాంకింగ్ దిగ్గజాలతో భాగస్వామ్యం ద్వారా కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్న కంపెనీ మార్చితో ముగి సి న గతేడాది(2022–23) రూ. 160 కోట్ల ఆదాయం సాధించింది. ఏడాది నుంచి ఏడాదిన్నర లోగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యే యోచనలో ఉన్నట్లు ఒక ప్రకటనలో బ్యాంక్ బజార్.కామ్ తెలియజేసింది. -
గో డిజిట్ మళ్లీ ఐపీవో బాట
న్యూఢిల్లీ: సాధారణ బీమా సేవలందించే గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ మళ్లీ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. కెనడియన్ సంస్థ ఫెయిర్‌ఫాక్స్ గ్రూప్‌నకు పెట్టుబడులున్న కంపెనీ ఉద్యోగుల గుర్తింపు ఆధారిత రైట్స్ స్టాక్ పథకంలో తగిన సవరణలు చేసింది. తద్వారా సెబీకి మరోసారి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఈ ఏడాది జనవరి 30న సెబీ మరింత సమాచారాన్ని కోరుతూ 2022 ఆగస్ట్‌లో గో డిజిట్ సమర్పించిన ప్రాస్పెక్టస్‌ను వెనక్కి పంపింది. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ఎప్రిషియేన్ రైట్స్ పథకం నిబంధనల అమలుపై తొలి ప్రాస్పెక్టస్‌ను సెబీ తిప్పి పంపిన విషయం విదితమే. ఆపై ఉద్యోగుల స్టాక్ ఆప్షన్ పథకంలో సవరణలకు వాటాదారులు, బోర్డు ఆమోదముద్ర వేశాయి. రూ. 1,250 కోట్ల ఈక్విటీ జారీ ఐపీవో అప్డేటెడ్ ప్రాస్పెక్టస్ ప్రకారం గో డిజిట్ రూ.1,250 కోట్ల ఈక్విటీని జారీ చేయనుంది. వీటికి అదనంగా 10.94 కోట్ల షేర్లను ప్రమోటర్ గో డిజిట్ ఇన్ఫోవర్క్స్తోపాటు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. క్రికెటర్ విరాట్ కోహ్లీ, అతని భార్య, నటి అనుష్క శర్మ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. -
4 ఐపీవోలకు సెబీ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా నాలుగు కంపెనీల నిధుల సమీకరణ ప్రణాళికలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో సైయంట్ డీఎల్ఎం, రాశి పెరిఫెరల్స్, హెల్త్విస్టా ఇండియా, జాగిల్ ప్రీపెయిడ్ ఓషియన్ సర్వీసెస్ ఉన్నాయి. ఇవన్నీ 2022 జూలై– 2023 జనవరి మధ్య సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. తద్వారా పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు మార్చి 29–31 మధ్య అనుమతి పొందాయి. వెరసి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు దారి ఏర్పడింది. ఐటీ సొల్యూషన్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అందించే రాశి పెరిఫెరల్స్ ఐపీవోలో భాగంగా రూ. 750 కోట్లను సమీకరించే యోచనలో ఉంది. పూర్తిగా షేర్ల జారీ ద్వారా నిధులను సమకూర్చుకోనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 400 కోట్లను రుణ చెల్లింపులు, రూ. 200 కోట్లు వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఎలక్ట్రానిక్స్ తయారీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఎలక్ట్రానిక్స్ తయారీ సర్వీసుల సంస్థ సైయంట్ డీఎల్ఎం సైతం రూ. 740 కోట్లు సమకూర్చుకోవాలని చూస్తోంది. ఇందుకు అనుగుణంగా తాజా ఈక్విటీ జారీకి తెరతీయనుంది. ఈ నిధులను మూలధన అవసరాలు, విస్తరణ వ్యయాలు, రుణ చెల్లింపులు, ఇతర కంపెనీల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. హెల్త్‌కేర్ సేవలు పోర్టీ బ్రాండుతో ఆసుపత్రుల బయట ఆరోగ్య పరిరక్షణ సేవలందించే హెల్త్విస్టా ఇండియా ఐపీవో ద్వారా రూ. 1,000 కోట్ల సమీకరణపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 5.62 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థ మెడీబిజ్ ఫార్మా వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, రుణ చెల్లింపులు, మెడికల్ పరికరాల కొనుగోళ్లు, ఇతర కంపెనీల కొనుగోళ్లకు వినియోగించనుంది. ఫైనాన్షియల్ సేవలు ఐపీవోలో భాగంగా ఫైనాన్షియల్ సేవలందించే ఫిన్‌టెక్ కంపెనీ జాగిల్ ప్రీపెయిడ్ ఓషియన్ సర్వీసెస్ రూ. 490 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 1.05 కోట్ల షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను వినియోగదారులను పెంచుకోవడం, టెక్నాలజీ, ప్రొడక్టుల అభివృద్ధి, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. -
ఎవలాన్ టెక్ @ 415–436
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ తయారీ సర్వీసుల కంపెనీ ఎవలాన్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకి రూ. 415–436 ధరల శ్రేణి ప్రకటించింది. ఏప్రిల్ 3న ప్రారంభంకానున్న ఇష్యూ 6న ముగియనుంది. తద్వారా కంపెనీ రూ. 865 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్లకు ఈ నెల 31న షేర్లను విక్రయించనుంది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 545 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. షేర్ల జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 34 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. ఏప్రిల్ 18న షేర్లు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కానున్నాయి. ఎండ్టుఎండ్ ఎలక్ట్రానిక్ మ్యాన్యుఫాక్చరింగ్ సర్వీస్ సొల్యూషన్లు అందిస్తున్న ఎవలాన్ టెక్ 1999లో ఏర్పాటైంది. యూఎస్‌తోపాటు దేశీయంగా 12 తయారీ ప్లాంట్లను నిర్వహిస్తోంది. 2021–22లో రూ. 840 కోట్ల ఆదాయం సాధించింది. -
ఐపీవోకు సెబీతో మామాఎర్త్ చర్చలు
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీతో చర్చలు నిర్వహిస్తున్నట్లు హోనసా కన్జూమర్ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. బలహీన మార్కెట్ పరిస్థితుల కారణంగా ఐపీవోను పక్కనపెట్టినట్లు మీడియాలో వెలువడిన వార్తల నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ బ్రాండ్లు మామాఎర్త్, ద డెర్మా కో మాతృ సంస్థ వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఐపీవోకు అనుమతి పొందే బాటలో ముసాయిదా ప్రాస్పెక్టస్‌పై సెబీతో చర్చిస్తున్నట్లు కంపెనీ సీఈవో, సహవ్యవస్థాపకుడు వరుణ్ అలగ్ వెల్లడించారు. నిబంధనల ప్రకారం సెబీ అనుమతి పొందాక ఐపీవో చేపట్టేందుకు 12 నెలల గడువు ఉంటుందని, తదుపరి బ్యాంకర్లతో చర్చిస్తామని తెలియజేశారు. 2022 డిసెంబర్లో కంపెనీ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా 4.68 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. షేర్లను ఆఫర్ చేయనున్న ప్రమోటర్లు, ఇన్వెస్టర్లలో వరుణ్, ఘజల్ అలగ్, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కుంద్రా, రోహిత్ కుమార్ బన్సల్ తదితరులున్నారు. -
ఎవలాన్ టెక్నాలజీస్ ఐపీవో
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ తయారీ సర్వీసుల కంపెనీ ఎవలాన్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఏప్రిల్ 3న ప్రారంభంకానున్న ఇష్యూ 6న ముగియనుంది. తద్వారా కంపెనీ రూ. 865 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్లకు ఈ నెల 31న షేర్లను విక్రయించనుంది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 545 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. షేర్ల జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కాగా.. తొలుత ఐపీవో ద్వారా రూ. 1,025 కోట్ల సమీకరణకు కంపెనీ ప్రణాళికలు వేసింది. అయితే ఇష్యూ కంటే ముందుగా షేర్ల ప్లేస్మెంట్ ద్వారా రూ. 160 కోట్లు సమకూర్చుకుంది. రూ. 80 కోట్లు తాజా ఈక్విటీ, మరో రూ. 80 కోట్లు సెకండరీ షేర్ల అమ్మకం ద్వారా ఈ నిధులు అందుకుంది. వీటిలో యూనిఫై ఫైనాన్షియల్ ప్రయివేట్ లిమిటెడ్, అశోకా ఇండియా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ నుంచి రూ. 60 కోట్లు చొప్పున లభించగా.. ఇండియా ఎకార్న్ ఫండ్ నుంచి రూ. 40 కోట్లు సమకూరినట్లు ఎవలాన్ వెల్లడించింది. 1999లో షురూ.. ఎండ్టుఎండ్ ఎలక్ట్రానిక్ మ్యాన్యుఫాక్చరింగ్ సర్వీస్ సొల్యూషన్లు అందిస్తున్న ఎవలాన్ 1999లో ఏర్పాటైంది. కంపెనీ క్లయింట్లలో క్యోసన్ ఇండియా, జోనర్ సిస్టమ్స్ ఇంక్, కొలిన్స్ ఏరోస్పేస్, ఈ ఇన్ఫోచిప్స్, యూఎస్ మలబార్ కంపెనీ, మెగ్గిట్, సిస్టెక్ కార్పొరేషన్ తదితరాలున్నాయి. యూఎస్‌తోపాటు దేశీయంగా 12 తయారీ ప్లాంట్లను నిర్వహిస్తోంది. 2021–22లో రూ. 840 కోట్ల ఆదాయం సాధించింది. 2022 జూన్‌కల్లా రూ. 1,039 కోట్ల విలువైన ఆర్డర్‌బుక్‌ను కలిగి ఉంది. -
ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్ ఐపీవో కుదింపు
ముంబై: ఎన్బీఎఫ్సీ.. ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణ లక్ష్యాన్ని కుదించుకుంది. తొలుత వేసిన రూ. 1,600 కోట్లలో రూ. 400 కోట్లమేర కోత పెట్టుకుంది. వెరసి రూ. 1,200 కోట్ల సమీకరణకు సిద్ధపడుతోంది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 450 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ గతేడాది నవంబర్‌లో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది. ఐపీవోలో భాగంగా ప్రయివేట్ ప్లేస్మెంట్ ద్వారా రూ. 150 కోట్లు సమకూర్చుకోనున్నట్లు కంపెనీ పేర్కొంది. దీంతో ఆఫర్ పరిమాణం తగ్గే అవకాశముంది. ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) ఏప్రిల్–డిసెంబర్ కాలంలో రూ. 525 కోట్ల ఆదాయం సాధించింది. -
రెండు ఇష్యూలకు సెబీ చెక్
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టే బాటలో రెండు కంపెనీలు దాఖలు చేసిన ప్రాస్పెక్టస్‌లకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా చెక్ పెట్టింది. ఫైనాన్షియల్ రంగ కంపెనీలు బీవీజీ ఇండియా లిమిటెడ్, ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇండియా దరఖాస్తులను సెబీ తిప్పి పంపింది. కాగా.. మౌలిక సదుపాయాల రంగ కంపెనీ ఆర్అండ్బీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ దాఖలు చేసిన ప్రాస్పెక్టస్‌కు సెబీ ఈ నెల 3న గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వెరసి కంపెనీ పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణ చేపట్టేందుకు దారి ఏర్పడింది. సమీకృత సర్వీసుల కంపెనీ బీవీజీ ఇండియా 2021 సెప్టెంబర్‌లో సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు, పీఈ ఇన్వెస్టర్ సంస్థ 3ఐ గ్రూప్.. మరో 71.96 లక్షలకుపైగా షేర్లను ఆఫర్ చేయనున్నారు. అయితే సెబీ ప్రాస్పెక్టస్‌కు చెక్ పెట్టింది. రూ. 1,330 కోట్ల కోసం ఐపీవో ద్వారా రూ. 1,330 కోట్ల సమీకరణకు ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2021 మే నెలలో సెబీకి ప్రాస్పెక్టస్ దఖలు పరచింది. జులైలో సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఇష్యూ చేపట్టలేదు. సెబీ అనుమతి పొందిన తదుపరి ఏడాదిలోగా నిధుల సమీకరణను పూర్తి చేయవలసి ఉన్న సంగతి తెలిసిందే. ఐపీవో చేపట్టేందుకు లభించిన గడువు 2022 జులైలో ముగియడంతో ఆగస్ట్‌లో తిరిగి సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 625 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రమోటర్లు, కంపెనీ ప్రస్తుత వాటాదారులు మరో 1.7 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. అయితే ఈ నెల తొలి వారంలో బీవీజీ ఇండియా, ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ ప్రాస్పెక్టస్‌లను సెబీ తిప్పి పంపింది. ఎయిరాక్స్ నేలచూపు మెడికల్ పరికరాల తయారీ కంపెనీ ఎయిరాక్స్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ ప్రయత్నాలను విరమించుకుంది. ఐపీవో ద్వారా రూ. 750 కోట్ల సమీకరణ కోసం 2022 సెప్టెంబర్‌లో సెబీకి సమర్పించిన ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకుంది. ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీ ప్రమోటర్లు సంజయ్ భరత్ కుమార్ జైస్వాల్, ఆషిమా సంజయ్ జైస్వాల్ షేర్లను విక్రయించేందుకు సిద్ధపడ్డారు. పీఎక్స్ఏ ఆక్సిజన్ జనరేటర్ తయారీలో ఉన్న కంపెనీ గత నెలలో ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకుంది. -
3 ఐపీవోలకు సెబీ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మూడు కంపెనీలను అనుమతించింది. ఫస్ట్‌మెరిడియన్ బిజినెస్ సర్వీసెస్, ఐఆర్ఎం ఎనర్జీ లిమిటెడ్, లోహియా కార్ప్ నిధుల సమీకరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ కంపెనీలు 2022 సెప్టెంబర్– 2023 జనవరి మధ్య కాలంలో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. ఫస్ట్‌మెరిడియన్ సిబ్బంది నియామక(స్టాఫింగ్) సంస్థ ఫస్ట్‌మెరిడియన్ బిజినెస్ సర్వీసెస్ లిమిటెడ్ ఐపీవో ద్వారా రూ. 740 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 690 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్‌సహా ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. అంతేకాకుండా మరో రూ. 50 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ప్రధానంగా ప్రమోటర్ సంస్థ మ్యాన్‌పవర్ సొల్యూషన్స్ రూ. 615 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనుంది. కాగా.. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఐఆర్ఎం ఎనర్జీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా సిటీ గ్యాస్ పంపిణీ కంపెనీ ఐఆర్ఎం ఎనర్జీ 1.01 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 650–700 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిధులను తమిళనాడులోని నమక్కల్, తిరుచిరాపల్లిలలో బిజినెస్(సిటీ గ్యాస్ పంపిణీ) నెట్వర్క్ విస్తరణకు అవసరమైన పెట్టుబడి వ్యయాలకు కేటాయించనుంది. అంతేకాకుండా రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకూ వినియోగించనుంది. పీఎన్జీ, సీఎన్జీ పంపిణీ చేసే కంపెనీ గుజరాత్, పంజాబ్‌లోనూ కార్యకలాపాలు విస్తరించింది. లోహియా కార్ప్ టెక్నికల్ టెక్స్టైల్స్ ఉత్పత్తికి వినియోగించే మెషినరీ తయారీ కంపెనీ లోహియా కార్ప్ ఐపీవోలో భాగంగా 3.17 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు వీటిని ఆఫర్ చేయనున్నారు. 2022 మార్చి31కల్లా కంపెనీ 90 దేశాలలో 2,000 మంది కస్టమర్లను కలిగి ఉంది. ప్రధానంగా పాలీప్రొపిలీన్, హైడెన్సిటీ పాలీఎథిలీన్ వొవెన్ ఫ్యాబ్రిక్, సేక్స్ తదితర టెక్నికల్ టెక్స్టైల్స్ తయారీకి వినియోగించే మెషీనరీ, పరికరాలను కంపెనీ రూపొందిస్తోంది. -
ఫ్యాబిండియా ఐపీవో రద్దు
న్యూఢిల్లీ: కళాత్మక వస్తువులు, లైఫ్‌స్టైల్ ఉత్పత్తుల రిటైల్ రంగ కంపెనీ ఫ్యాబిండియా పబ్లిక్ ఇష్యూ యోచనను విరమించుకుంది. ప్రస్తుత మార్కెట్ ఆటుపోట్ల నేపథ్యంలో ఐపీవో ద్వారా రూ. 4,000 కోట్ల సమీకరణ ప్రణాళికలను రద్దు చేసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. వెరసి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించింది. ఇష్యూ పరిమాణంరీత్యా ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేనట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలియజేశారు. ఐపీవో ద్వారా 2.5 కోట్ల షేర్లను ఆఫర్ చేయాలని భావించింది. ప్రాస్పెక్టస్ గడువు 2023 ఏప్రిల్‌తో ముగియనున్న నేపథ్యంలో తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఎన్సీడీల స్వచ్చంద చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు నిధులను వెచ్చించాలని కంపెనీ తొలుత ప్రణాళికలు వేసింది. -
డివ్జీ టార్క్ ఇష్యూ @ రూ. 560–590
న్యూఢిల్లీ: ఆటోమోటివ్ విడిభాగాల కంపెనీ డివ్జీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూ మార్చి 1న ప్రారంభంకానుంది. 3న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 560–590గా నిర్ణయించింది. తద్వారా రూ. 412 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ నేడు(28న) ప్రారంభంకానుంది. ఐపీవోలో భాగంగా రూ. 180 కోట్ల ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 39.34 లక్షల షేర్లను ప్రస్తుత ఇన్వెస్టర్లు, వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను పెట్టుబడి వ్యయాలు, తయారీ సౌకర్యాల పరికరాల కొనుగోలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 25 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. కంపెనీ ప్రధానంగా సిస్టమ్ లెవెల్ ట్రాన్స్ఫర్ కేస్, టార్క్ కప్లర్, డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సొల్యూషన్లు అందిస్తోంది. క్లయింట్ల జాబితాలో ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ ఆటో పార్ట్స్ తదితరాలున్నాయి. మార్చి 14న కంపెనీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ అయ్యే వీలుంది. -
పబ్లిక్ ఇష్యూకి ఐడియాఫోర్జ్
న్యూఢిల్లీ: డ్రోన్ తయారీ కంపెనీ ఐడియాఫోర్జ్ టెక్నాలజీ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని ఐపీవోలో భాగంగా కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 48,69,712 షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 50 కోట్లను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు రూ. 135 కోట్లు, ప్రొడక్ట్ డెవలప్మెంట్కు రూ. 40 కోట్లు చొప్పున వెచ్చించనుంది. 2007లో ఏర్పాటైన కంపెనీ దేశీయంగా మానవరహిత ఏరియల్ వాహనా(యూఏవీ)లను రూపొందిస్తోంది. తద్వారా ఈ విభాగంలో అతిపెద్ద కంపెనీగా నిలుస్తోంది. కంపెనీ కస్టమర్ల జాబితాలో సాయుధ దళాలు, పోలీసు, అటవీ శాఖలు, విపత్తు నిర్వహణా దళాలు తదితరాలున్నాయి. -
ఐపీవో బాటలో సర్వైవల్ టెక్
న్యూఢిల్లీ: స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీ సర్వైవల్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 800 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, సంబంధిత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. ప్రధానంగా విజయ్ కుమార్ రఘునందన్ ప్రసాద్ అగర్వాల్ రూ. 544 కోట్లకుపైగా విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 175 కోట్లను వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కాంట్రాక్ట్ రీసెర్చ్, తయారీ సర్వీసుల(క్రామ్స్) ఈ కంపెనీ ప్రధానంగా స్పెషాలిటీ కెమికల్స్ రూపొందిస్తోంది. దేశీయంగా హెటెరోసైక్లిక్, ఫ్లోరో ఆర్గానిక్ ప్రొడక్ట్ గ్రూప్‌లకు చెందిన ప్రత్యేకతరహా ఉత్పత్తుల తయారీలోగల కొద్దిపాటి సంస్థలలో ఒకటిగా నిలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరం(2021–22) రూ. 312 కోట్ల ఆదాయం, రూ. 73 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. -
ఐపీవో దిశలో రెండు కంపెనీలు
న్యూఢిల్లీ: తాజాగా రెండు కంపెనీలు పబ్లిక్ ఇష్యూ బాట పట్టాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ భారత్ హైవేస్ ఇన్విట్, వైట్ ఆయిల్స్ తయారీ కంపెనీ గాంధార్ ఆయిల్ రిఫైనరీ ఈ జాబితాలో చేరాయి. ఈ రెండు సంస్థలూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. వివరాలు ఇలా.. రూ. 2,000 కోట్లకు రెడీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా భారత్ హైవేస్ ఇన్విట్ బుక్బిల్డింగ్ ద్వారా రూ. 2,000 కోట్ల విలువైన యూనిట్లను ఆఫర్ చేయనుంది. తద్వారా రూ. 2,000 కోట్లు సమకూర్చుకోనుంది. నిధులను ప్రాజెక్టŠస్ ఎస్పీవీకి చెందిన కొన్ని రుణాల చెల్లింపుతోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఎస్పీవీ ప్రాజెక్టŠస్లో.. పోర్బందర్– ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, వారణాశి– సంగమ్ ఎక్స్‌ప్రెస్‌వే, జీఆర్ సంగ్లీ– సోలాపూర్ హైవే, జీఆర్ అక్కల్కోట్– సోలాపూర్ హైవే, జీఆర్ ఫగ్వారా ఎక్స్‌ప్రెస్‌వే, జీఆర్ గుండుగొలను– దేవరాపల్లి హైవే ఉన్నాయి. 2022 ఆగస్ట్‌లో ఏర్పాటైన భారత్ హైవేస్ ఇన్విట్ ప్రాజెక్ట్ ఎస్పీవీలో ప్రతీ ప్రాజక్టులోనూ 100 శాతం చొప్పున వాటా కొనుగోలు చేయనుంది. ప్రాథమికంగా 49 శాతం వాటాను సొంతం చేసుకుంటుంది. రూ. 500 కోట్లపై కన్ను పబ్లిక్ ఇష్యూలో భాగంగా గాంధార్ ఆయిల్ రిఫైనరీ రూ. 357 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 1.2 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 500 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, ఎక్విప్మెంట్ కొనుగోలుసహా.. సిల్వస్సా ప్లాంటులో ఆటోమోటివ్ ఆయిల్ తయారీ సామర్థ్య విస్తరణకు అవసరమైన సివిల్ వర్క్‌లకూ వెచ్చించనుంది. అంతేకాకుండా తలోజా ప్లాంటులో పెట్రోలియం జెల్లీతోపాటు.. సంబంధిత కాస్మెటిక్ ప్రొడక్టుల తయారీ విస్తరణకు సైతం వినియోగించనుంది. వైట్ ఆయిల్స్ తయారీకి మరిన్ని బ్లెండింగ్ ట్యాంకులను సైతం ఏర్పాటు చేయనుంది. -
3 ఐపీవోలకు సెబీ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పబ్లిక్ ఇష్యూలను చేపట్టేందుకు తాజాగా మూడు కంపెనీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ జాబితాలో ఆఫీసర్స్ చాయిస్ విస్కీ తయారీ కంపెనీ అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిల్లరీస్, లైడ్ లైటింగ్ సొల్యూషన్ల సంస్థ ఐకియో లైటింగ్, ఆటో విడిభాగాల కంపెనీ డివ్జీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ సిస్టమ్స్ చేరాయి. ఈ మూడు సంస్థలూ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు సెప్టెంబర్, అక్టోబర్లలో సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. కాగా.. అక్టోబర్‌లో మోటిసన్స్ జ్యువెలర్స్ దాఖలు చేసిన ముసాయిదా పత్రాలను ఈ నెల 16న రిటర్న్ చేసినట్లు వెబ్సైట్లో సెబీ పేర్కొంది. ఇతర వివరాలు చూద్దాం.. అలైడ్ బ్లెండర్స్ ఐపీవోలో భాగంగా అలైడ్ బ్లెండర్స్ రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో రూ. 1,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్ సంస్థ విక్రయానికి ఉంచనున్నాయి. ప్రధానంగా బినా కిషోర్ చాబ్రియా రూ. 500 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ దేశీ తయారీ విదేశీ మద్యం(ఐఎంఎఫ్ఎల్) విభాగంలో 10 బ్రాండ్లు కలిగి ఉంది. ప్రధాన బ్రాండ్లలో ఆఫీసర్స్ చాయిస్ విస్కీ, జాలీ రోజర్ రమ్, క్లాస్ 21 వోడ్కా తదితరాలున్నాయి. డివ్జీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా డివ్జీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 31,46,802 షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను పెట్టుబడి వ్యయాలతోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. తయారీకి వీలుగా ఎక్విప్మెంట్ కొనుగోలు చేయనుంది. కంపెనీ ప్రధానంగా సిస్టమ్ లెవల్ ట్రాన్స్ఫర్ కేస్, టార్క్ కప్లర్, డ్యూయల్ క్లచ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ సొల్యూషన్స్ తదితరాలను అందిస్తోంది. ఐకియో లైటింగ్ ఐపీవోలో భాగంగా ఐకియో లైటింగ్ రూ. 350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 75 లక్షల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులలో రూ. 50 కోట్లను రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. మరో రూ. 237 కోట్లను సొంత అనుబంధ సంస్థ ఐకియో సొల్యూషన్స్ నోయిడాలో ఏర్పాటు చేయనున్న యూనిట్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా లెడ్ లైటింగ్ సొల్యూషన్స్ అందిస్తోంది. -
పబ్లిక్ ఇష్యూల హవా
న్యూఢిల్లీ: ఈ వారం ప్రైమరీ మార్కెట్ ఊపందుకుంది. బుధవారం(14న) ముగిసిన శూల వైన్యార్డ్స్కు 2.33 రెట్లు అధిక స్పందన లభించగా.. గురువారం(15న) ముగిసిన మరో రెండు ఐపీవోలు విజయవంతమయ్యాయి. ఇవి ల్యాండ్మా ర్క్ కార్స్, అబాన్స్ హోల్డింగ్స్‌కాగా.. సోమ (21), మంగళ(22)వారాల్లో మరో రెండు కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వస్తున్నాయి. ఈ ప్రభావంతో హెల్త్‌కేర్ టెక్ సంస్థ ఇండెజీన్ లిమిటెడ్ తాజాగా పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇతర వివరాలు చూద్దాం.. ల్యాండ్‌మార్క్ కార్స్ చివరి రోజుకల్లా ప్రీమియం ఆటోమొబైల్ డీలర్ షిప్ కంపెనీ ల్యాండ్‌మార్క్ కార్స్ ఐపీవోకు 3 రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్ లభించింది. కంపెనీ 80,41, 805 షేర్లు ఆఫర్ చేయగా.. 2.46 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగం నుంచి 8.71 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 1.32 రెట్లు అధికంగా బిడ్స్ నమోదయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో మాత్రం 59 శాతానికే దరఖాస్తులు వచ్చాయి. షేరుకి రూ. 481–506 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 552 కోట్లు సమకూర్చుకుంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. అబాన్స్ హోల్డింగ్స్ ఫైనాన్షియల్ సర్వీసుల కంపెనీ అబాన్స్ హోల్డింగ్స్ ఐపీవోకు చివరి రోజుకల్లా కేవలం 1.1 రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్ లభించింది. కంపెనీ 1,28,00,000 షేర్లు ఆఫర్ చేయగా.. 1.40 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగం నుంచి 4.1 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 1.48 రెట్లు అధికంగా బిడ్స్ నమోదయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో మాత్రం 40 శాతానికే దరఖాస్తులు వచ్చాయి. ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 256–270కాగా.. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థ అబాన్స్ ఫైనాన్స్ పెట్టుబడులకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఎలిన్ ధర ఖరారు ఎలక్ట్రానిక్స్ తయారీ సర్వీసుల కంపెనీ ఎలిన్ ఎలక్ట్రానిక్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 234–247 ధరల శ్రేణిని ప్రకటించింది. ఈ నెల 20–22 మధ్య చేపట్టనున్న ఇష్యూ ద్వారా రూ. 475 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. తొలుత రూ. 760 కోట్లపై కన్నేసినప్పటికీ టార్గెట్‌లో కోత పెట్టుకుంది. వెరసి ఇష్యూలో భాగంగా రూ. 175 కోట్ల ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా రూ. 300 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, యూపీ, గోవా యూనిట్ల విస్తరణ, ఆధునీకరణసహా ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 60 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. కంపెనీ లైటింగ్, ఫ్యాన్లు, చిన్నతరహా కిచెన్ అప్లయెన్సెస్, తదితర విభాగాలలో ప్రధాన బ్రాండ్లకు ఎండ్టు ఎండ్ ప్రొడక్ట్ సొల్యూషన్స్ అందిస్తోంది. ఫ్రాక్షనల్ హెచ్‌పీ మోటార్స్ తయారీలో పేరొందింది. మార్చితో ముగిసిన గతేడాది(2021–22) ఆదాయం 27 శాతం జంప్‌చేసి రూ. 1,094 కోట్లకు చేరగా.. నికర లాభం 12 శాతం మెరుగుపడి రూ. 39 కోట్లను తాకింది. ఇండెజీన్ లిమిటెడ్ హెల్త్‌కేర్ టెక్ కంపెనీ ఇండెజీన్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. గ్లోబల్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమపై దృష్టి పెట్టిన కంపెనీ ఐపీవో ద్వారా రూ. 3,200 కోట్లు సమీకరించాలని చూస్తోంది. దీనిలో భాగంగా రూ. 950 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా కంపెనీ ప్రస్తుత ఇన్వెస్టర్లు మరో 3.63 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. సోమవారం కేఫిన్.. 19న ప్రారంభంకానున్న పబ్లిక్ ఇష్యూలో భాగంగా కేఫిన్ ప్రమోటర్ సంస్థ జనరల్ అట్లాంటిక్ సింగపూర్ ఫండ్ పీటీఈ రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీని ఆఫర్ చేయనుంది. వెరసి ఐపీవో ద్వారా సమీకరించే రూ. 1,500 కోట్లు ప్రమోటర్ సంస్థకు చేరనున్నాయి. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ సంస్థకు 74.37 శాతం వాటా ఉంది. కాగా.. 2021లో కొటక్ మహీంద్రా బ్యాంకు కేఫిన్‌లో 9.98 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఐపీవోకు రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 40 షేర్ల(ఒక లాట్)కు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. కంపెనీ ప్రధానంగా దేశీ మ్యూచువల్ ఫండ్స్, ఏఐఎఫ్‌లు, వెల్త్ మేనేజర్స్ తదితరాలకు ఇన్వెస్టర్ సొల్యూషన్స్ అందిస్తోంది. -
వచ్చే వారం 2 ఐపీవోలు
న్యూఢిల్లీ: వచ్చే వారం రెండు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు రానున్నాయి. ఫైనాన్షియల్ సర్వీసుల ప్లాట్‌ఫామ్ కేఫిన్ టెక్నాలజీస్ ఇష్యూ ఈ నెల 19న ప్రారంభమై 21న ముగియనుంది. ఇందుకు షేరుకి రూ. 347–366 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇక ఎలక్ట్రానిక్స్ తయారీ సర్వీసుల కంపెనీ ఎలిన్ ఎలక్ట్రానిక్స్ ఐపీవో 20న మొదలై 22న ముగియనుంది. వివరాలు చూద్దాం.. రూ. 1,500 కోట్లకు రెడీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా కేఫిన్ ప్రమోటర్ సంస్థ జనరల్ అట్లాంటిక్ సింగపూర్ ఫండ్ పీటీఈ రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీని ఆఫర్ చేయనుంది. వెరసి ఐపీవో ద్వారా సమీకరించే రూ. 1,500 కోట్లు ప్రమోటర్ సంస్థకు చేరనున్నాయి. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ సంస్థకు 74.37 శాతం వాటా ఉంది. కాగా.. 2021లో కొటక్ మహీంద్రా బ్యాంకు కేఫిన్‌లో 9.98 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఐపీవోకు రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 40 షేర్ల(ఒక లాట్)కు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 16న షేర్లను కేటాయించనుంది. కంపెనీ ప్రధానంగా దేశీ మ్యూచువల్ ఫండ్స్, ఏఐఎఫ్‌లు, వెల్త్ మేనేజర్స్ తదితరాలకు ఇన్వెస్టర్ సొల్యూషన్స్ అందిస్తోంది. రూ. 475 కోట్లకు పరిమితం ఎలిన్ ఎలక్ట్రానిక్స్ ఐపీవో ద్వారా రూ. 475 కోట్లు మాత్రమే సమీకరించనుంది. మొదట్లో రూ. 760 కోట్లను సమకూర్చుకోవాలని భావించినప్పటికీ తదుపరి టార్గెట్‌లో కోత పెట్టుకుంది. ఇష్యూలో భాగంగా రూ. 175 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 300 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, కంపెనీ ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలు, పెట్టుబడి వ్యయాలకు వినియోగించనుంది. తద్వారా ఘజియాబాద్(యూపీ), వెర్నా(గోవా)లోని ప్లాంట్ల విస్తరణను చేపట్టనుంది. లైటింగ్, ఫ్యాన్లు, చిన్నతరహా కిచెన్ అప్లయెన్సెస్ తదితర విభాగాలలో ప్రధాన బ్రాండ్లకు ఎండ్టు ఎండ్ ప్రొడక్ట్ సొల్యూషన్స్ అందిస్తోంది. -
టాటా టెక్నాలజీస్ ఐపీవో
న్యూఢిల్లీ: అనుబంధ సంస్థ టాటా టెక్నాలజీస్‌లో పాక్షిక వాటాను విక్రయించే అవకాశాలను అన్వేషిస్తున్నట్లు ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ పేర్కొంది. ఇందుకు పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. సోమవారం(12న) సమావేశమైన ఐపీవో కమిటీ తాజా ప్రతిపాదనకు సూత్రప్రాయ అనుమతినిచ్చినట్లు తెలియజేసింది. అయితే మార్కెట్ పరిస్థితులు, అవసరమైన, సెబీ సహా నియంత్రణ సంస్థల అనుమతులు ఆధారంగా ఐపీవోను చేపట్టనున్నట్లు వివరించింది. టాటా టెక్నాలజీస్ గ్లోబల్ ఇంజినీరింగ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సర్వీసులందిస్తోంది. ఆటోమోటివ్, ఏరోస్పేస్, ఇండస్ట్రియల్ హెవీ మెషీనరీ తదితర పరిశ్రమలకు సర్వీసులు సమకూర్చుతోంది. విదేశీ విస్తరణ మార్చితో ముగిసిన గతేడాది(2021–22) 47.35 కోట్ల డాలర్ల(సుమారు రూ. 3,910 కోట్లు) ఆదాయం సాధించింది. ఎయిర్‌బస్‌కు వ్యూహాత్మక సరఫరాదారుగా నిలుస్తున్న కంపెనీ ఇటీవలే ఫ్రాన్స్‌లోని టోలౌజ్లో ఇన్నోవేషన్ కేంద్రాన్ని ప్రారంభించింది. తద్వారా అంతర్జాతీయ ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు ప్రొడక్ట్ ఇంజినీరింగ్, డిజిటల్ సర్వీసులను అందించనుంది. సస్టెయినబుల్ మొబిలిటీ సొల్యూషన్స్ అభివృద్ధికి సహకరించేందుకు ఈ ఏడాది జూన్‌లో ఫాక్స్‌కాన్ ప్రారంభించిన ఎంఐహెచ్ కన్సార్షియంలో చేరింది. దీంతో పరిశ్రమలో సహకారానికి ప్రోత్సాహాన్నివ్వనుంది. హార్మనీ కన్సార్షియం మొబిలిటీ(ఎంఐహెచ్)లో సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, సర్వీసుల రంగాలకు చెందిన 2,300 సభ్య సంస్థలున్నాయి. -
ఫెడ్ పాలసీ, ద్రవ్యోల్బణం దారి చూపొచ్చు!
ముంబై: ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పరపతి సమావేశ నిర్ణయాలు ఈ వారం మార్కెట్లకు దారి చూపొచ్చని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. ఇదే వారంలో మూడు కంపెనీల ఐపీఓ లతో పాటు ఇటీవల పబ్లిక్ ఇష్యూ పూర్తి చేసుకున్న యూనిపార్ట్స్ ఇండియా ఎక్సే్చంజీల్లో లిస్టింగ్ కానుంది. అంతర్జాతీయంగా బ్యారెల్ బ్రెంట్ క్రూ డాయిల్ ధర 80 డాలర్లకు చేరింది. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి విలువ ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ట్రేడర్లు తమ పొజిషన్లను సమతూకం చేసుకోవాలి. పతనాన్ని కొనుగోలుకు అవకాశంగా మలుచుకోవాలి అని నిపుణులు చెబుతున్నారు. ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక మందగమన భయాలు, ఫెడ్ రిజర్వ్ సమావేశానికి ముందు అప్రమత్తత తదితర పరిణామాల నేపథ్యంలో గతవారంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా సెన్సెక్స్ 687 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లు నష్టపోయాయి. ‘ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్ అధిక విలువ వద్ద ట్రేడవుతోంది. ఆదాయాల వృద్ధి మందగించ వచ్చనే అంచనాలు సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపొచ్చు. స్టాక్ సూచీలు ఈ వారంలో పరిమితి శ్రేణిలో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ స్థిరీకరణ దిశగా సాగొచ్చు. ఆర్థిక మాంద్య భయాల తో ఐటీ షేర్లలో అత్యధిక లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఆర్బీఐ కఠిన ద్రవ్య విధానానికే మొగ్గుచూపినప్పట్టికీ.., బ్యాంక్ నిఫ్టీ స్థిరంగా రాణించడం కలిసొచ్చే అంశంగా ఉంది. అయితే గతవారం నిఫ్టీ కీలకమైన 18,500 స్థాయిని కోల్పోయింది. అమ్మకాల ఒత్తిడి కొనసాగితే 18,400– 18,300 శ్రేణిలో తక్షణ మద్దతు లభించవచ్చు. ఎగువ స్థాయిలో 18,650–18,700 పరిధిలో నిరోధం ఎదురుకావచ్చు’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ప్రపంచ పరిణామాలు బ్రిటన్ జీడీపీ, పారిశ్రామికోత్పత్తి, నవంబర్ వాణిజ్య లోటు డేటా నేడు(సోమవారం)విడుదల అవుతుంది. రేపు(మంగళవారం) అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలను ప్రకటిస్తుంది. ఎల్లుండి(బుధవారం) ఫెడ్ రిజర్వ్ కమిటీ సమావేశ నిర్ణయాలు, యూరోజోన్ నవంబర్ పారిశ్రామికోత్పత్తి డేటా, చైనా నవంబర్ వాహన విక్రయాలు, బ్రిటన్ ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి కానున్నాయి. గురువారం అమెరికా నవంబర్ రిటైల్ అమ్మకాలతో పాటు పారిశ్రామికోత్పత్తి డేటా విడుదల అవుతుంది. అదే రోజున యూరోపియన్ కేంద్ర బ్యాంక్(ఈసీబీ) వడ్డీరేట్ల ప్రకటనతో పాటు జపాన్ వాణిజ్య లోటు గణాంకాలు.., చైనా పారిశ్రామికోత్పత్తి, నిరుద్యోగ రేటు, రిటైల్ అమ్మకాల డేటా..., బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీరేట్ నిర్ణయాలు వెల్లడి కానున్నాయి. వారాంతపు రోజైన శుక్రవారం అమెరికా, యూరోజోన్, బ్రిటన్ తయారీ రంగ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు విడుదల అవుతాయి. అదేరోజున యూరోజోన్ అక్టోబర్ వాణిజ్య లోటు, నవంబర్ ద్రవ్యోల్బణ డేటాతో పాటు విడుదల కానుంది. స్థూల ఆర్థిక గణాంకాలు నేడు నవంబర్ దేశీయ వినియోగదారుల సూచీ ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం, అక్టోబర్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెల్లడి కానున్నాయి. డబ్ల్యూపీ ద్రవ్యోల్బణ డేటా ఎల్లుండి(బుధవారం), వాణిజ్య లోటు గణాంకాలు(గురువారం) విడుదల అవుతుంది. అలాగే శుక్రవారం ఆర్బీఐ డిసెంబర్ తొమ్మిదో తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, ఇదే నెల రెండో తేదీతో ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. ఇదే వారంలో వాహన పరిశ్రమ సమాఖ్య సియామ్ నవంబర్ వాహన విక్రయ డేటా, ఐఆర్డీఏఐ ఈ ఏడాది ప్రధమార్థం తొలి ప్రీమియం గణాంకాలు వెల్లడికానున్నాయి. ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశం మంగళవారం(నవంబర్ 13న) ప్రారంభం కానుంది. మరుసటి రోజు(బుధవారం) ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ద్రవ్య కమిటీ నిర్ణయాలను వెల్లడించనున్నారు. వరుసగా నాలుగుసార్లు వడ్డీరేట్లను 75 బేసిస్ పాయింట్లు చొప్పున ఫెడ్ ఈసారి మాత్రం 50 బేసిస్ పాయింట్లకు పరిమితం కావచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ మరుసటి రోజే(గురువారం) బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్‌లు తమ ద్రవ్య విధాన వైఖరిని వెల్లడించనున్నాయి. ఏడు రోజుల్లో రూ.4,500 కోట్ల అమ్మకాలు దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు ఈ డిసెంబర్ (1–11 తేదీల మధ్య)లో ఇప్పటి వరకు రూ.4500 కోట్ల ఈక్విటీలను విక్రయించారు. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ విలువ దిగిరావడం ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన వైఖరి(బుధవారం)కి ముందు ఎఫ్ఐఐలు అప్రమత్తత వహిస్తూ చివరి మూడు రోజుల్లో నికరంగా రూ.3,300 కోట్లను ఉపసహరించుకున్నారు. ‘‘భారత ఈక్విటీ మార్కెట్ సగటు కంటే అధిక విలువ వద్ద ట్రేడవుతుంది. కావున ఎఫ్ఐఐలు చౌక వాల్యూయేషన్లతో ట్రేడవుతున్న చైనా, కొరియా వంటి స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఎఫ్ఐఐలు ఆసక్తి చూపుతున్నారు. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన వైఖరి వరకు భారత ఈక్విటీలపై విదేశీ ఇన్వెస్టర్లు బేరీష్ వైఖరినే కలిగి ఉండొచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ తెలిపారు. కాగా గడిచిన నవంబర్‌లో రూ. 36,329 కోట్లను కొన్నారు. -
ఐపీవోకు నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్
న్యూఢిల్లీ: గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బ్లాక్‌స్టోన్ పెట్టుబడులున్న నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక పత్రాలు దాఖలు చేసింది. తద్వారా 50 కోట్ల డాలర్లు(సుమారు రూ. 4,000 కోట్లు) సమీకరించే ప్రణాళికలు ప్రకటించింది. వెరసి దేశీయంగా పబ్లిక్ ఇష్యూకి వస్తున్న తొలి రిటైల్ రంగ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్)గా నిలవనుంది. కంపెనీకి 14 నగరాలలో నిర్వహణలోగల 17 షాపింగ్ మాల్స్ ఉన్నాయి. వీటిలో 3,000 స్టోర్స్ ఉన్నాయి. కోటి చదరపు అడుగుల ప్రాంతాన్ని కవర్ చేస్తున్న ఈ పోర్ట్‌ఫోలియో విలువ 300 కోట్ల డాలర్లుగా అంచనా. 2023 క్యాలండర్ ఏడాది తొలి అర్ధభాగంలో ఐపీవో చేపట్టే వీలున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మూడో రీట్.. నెక్సస్ సెలెక్ట్ బ్లాక్‌స్టోన్ పెట్టుబడులు గల మూడో రీట్కాగా.. తొలుత ఎంబసీ ఆఫీస్ పార్క్స్, తదుపరి మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్లను వెలువరించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా ప్రజాదరణ పొందిన రీట్‌ను దేశీయంగా కొద్దికాలంక్రితమే అనుమతించారు. వీటి ద్వారా రియల్టీ ఆస్తుల విలువను అన్‌లాక్ చేయడంతోపాటు.. రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులకూ వీలు కలుగుతుంది. ప్రస్తుతం దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో మూడు రీట్లు ఎంబసీ ఆఫీస్ పార్క్స్, మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్, బ్రూక్‌ఫీల్డ్ ఇండియా లిస్టయ్యాయి. అయితే ఇవి లీజ్డ్ ఆఫీస్ ఆస్తులుకాగా.. నెక్సస్ సెలెక్ట్ రిటైల్ రియల్టీ ఆస్తులతో కూడిన తొలి అద్దె ఆదాయ కంపెనీ కావడం గమనార్హం! -
కళామందిర్‌కు సెబీ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: సంప్రదాయ దుస్తుల విక్రయ సంస్థ సాయి సిల్క్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఐపీవో ద్వారా రూ. 1,200 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఇష్యూలో భాగంగా రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా 1.80 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. కళామందిర్, వరమహాలక్ష్మి సిల్క్స్, కేఎల్ఎం, మందిర్ బ్రాండ్లతో కంపెనీ రిటైల్ స్టోర్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈక్విటీ జారీ నిధులను 25 కొత్త స్టోర్లు, 2 వేర్‌హౌస్‌ల ఏర్పాటుకు వినియోగించనుంది. అంతేకాకుండా రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలు తదితరాలకు సైతం కేటాయించనుంది. కంపెనీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులలో 50 స్టోర్లను నిర్వహిస్తోంది. రూ. 2,400 కోట్లపై కేఫిన్ కన్ను ఫైనాన్షియల్ సర్వీసుల ప్లాట్‌ఫామ్ కేఫిన్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా అనుమతించింది. ఐపీవో ద్వారా కంపెనీ రూ. 2,400 కోట్లు సమకూర్చుకోవాలని ప్రణాళికలు వేసింది. కంపెనీ ప్రమోటర్ జనరల్ అట్లాంటిక్ సింగపూర్ ఫండ్ పీటీఈ లిమిటెడ్ వాటాను విక్రయించనుంది. ప్రస్తుతం కేఫిన్‌లో జనరల్ అట్లాంటిక్ దాదాపు 75 శాతం వాటాను కలిగి ఉంది. గతేడాది ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం కొటక్ మహీంద్రా 9.98 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఐపీవో దరఖాస్తును కంపెనీ మార్చిలో సెబీకి దాఖలు చేసింది. -
ఈ వారమంతా ఐపీవోల హవా..
న్యూఢిల్లీ: ఇటీవల జోరు చూపుతున్న ప్రైమరీ మార్కెట్ ఈ వారం మరింత కళకళలాడనుంది. నాలుగు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపడుతున్నాయి. ఈ జాబితాలో మెడంటా బ్రాండుతో ఆసుపత్రులను నిర్వహిస్తున్న గ్లోబల్ హెల్త్ లిమిటెడ్, సూక్ష్మ రుణాల సంస్థ ఫ్యూజన్ మైక్రోఫైనాన్స్ లిమిటెడ్, కేబుళ్లు, వైర్ హార్నెస్ అసెంబ్లీస్ తయారీ కంపెనీ డీసీఎక్స్ సిస్టమ్స్, స్నాక్స్ తయారీ కంపెనీ బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ ఉన్నాయి. ఇవి ఉమ్మడిగా రూ. 4,700 కోట్లు సమీకరించాలని భావిస్తున్నాయి. వీటితోపాటు నవంబర్లోనే యూనిపార్ట్స్ ఇండియా, ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్ సైతం ఐపీవోలకు రానున్నాయి. వివరాలు చూద్దాం.. 31 నుంచి షురూ సోమవారం(31) నుంచి ప్రారంభమైన డీసీఎక్స్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూ నవంబర్ 2న ముగియనుంది. నవంబర్ 2న మొదలుకానున్న ఫ్యూజన్ మైక్రో ఇష్యూ 4న ముగియనుంది. ఈ బాటలో గ్లోబల్ హెల్త్, బికాజీ ఫుడ్స్ ఐపీవోలు నవంబర్ 3న ప్రారంభమై 7న ముగియనున్నాయి. 2022లో ఇప్పటివరకూ 22 కంపెనీలు ఐపీవోల ద్వారా రూ. 44,000 కోట్లు సమకూర్చుకున్నాయి. 2021లో మొత్తం 63 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టి రూ. 1.19 లక్షల కోట్లను సమీకరించిన విషయం విదితమే. డీసీఎక్స్ సిస్టమ్స్ ఐపీవోలో భాగంగా డీసీఎక్స్ సిస్టమ్స్ రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. షేరుకి రూ. 197–207 ధరలో పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 225 కోట్లు సమకూర్చుకుంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సొంత అనుబంధ సంస్థ రేనియల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్‌లో పెట్టుబడులు తదితరాలకు వినియోగించనుంది. ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్ ఐపీవోలో భాగంగా ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్ రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయ నుంది. వీటికి జతగా ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 1,36,95,466 షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. షేరుకి రూ. 350–368 ధరలో చేపడు తున్న ఇష్యూ ద్వారా రూ. 1,104 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఈక్విటీ జారీ నిధులను మైక్రోఫైనాన్స్ మూలధన బలిమికి వినియోగించనుంది. గ్లోబల్ హెల్త్ ఐపీవోలో భాగంగా గ్లోబల్ హెల్త్ రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రస్తుత వాటాదారులు 5.08 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. షేరుకి రూ. 319–336 ధరలో చేపడుతున్న ఇష్యూ ద్వారా రూ. 2,206 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. బికాజీ ఫుడ్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా షేరుకి రూ. 285–300 ధరల శ్రేణిని బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ తాజాగా ప్రకటించింది. తద్వారా రూ. 881 కోట్లు సమీకరించనున్నట్లు వెల్లడించింది. ఆఫర్లో భాగంగా ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 2.94 కోట్ల షేర్ల ను విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ వార్షికంగా 29,380 టన్నుల బికనీర్ భుజియా తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్యాకేజ్డ్ రసగుల్లా, సోన్ పాపి డి, గులాబ్ జామూన్ తదితరాలను సైతం తయా రు చేస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 50 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. రిటైలర్ల ఆసక్తి సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇకపై ప్రైమరీ మార్కెట్ మందగించే వీలున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. అయితే కొత్త కంపెనీలలో పెట్టుబడి అవకాశాలపట్ల ఇన్వెస్టర్లు ఆసక్తిని ప్రదర్శిస్తుండటంతో ఇష్యూలు సక్సెస్ అవుతున్నట్లు తెలియజేశారు. సంపన్న వర్గాలు, రిటైల్ ఇన్వెస్టర్ల భారీ పెట్టుబడులు ఇందుకు దోహదం చేస్తున్నట్లు వివరించారు. -
ఐపీవోకు ఇండియాఫస్ట్ లైఫ్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ప్రమోట్ చేసిన ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. బ్యాంకింగ్ వర్గాల సమాచారం ప్రకారం ఐపీవో ద్వారా కంపెనీ రూ. 2,000–2,500 కోట్లు సమకూర్చుకునే వీలుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా దాదాపు 14.13 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ఇతర వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ప్రమోటర్ సంస్థ బీవోబీ 8.9 కోట్లకుపైగా షేర్లను ఆఫర్ చేయనుంది. కార్మెల్ పాయింట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా 3.92 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.30 కోట్లకుపైగా షేర్లను అమ్మకానికి ఉంచనున్నాయి. ఇండియాఫస్ట్ లైఫ్‌లో బీవోబీ వాటా 65 శాతంకాగా.. కార్మెల్ పాయింట్(వార్బర్గ్ పింకస్)కు 26 శాతం, యూనియన్ బ్యాంక్‌కు 9 శాతం చొప్పున వాటా ఉంది. ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో ఇండియాఫస్ట్ లైఫ్ పేర్కొంది. -
డీసీఎక్స్ సిస్టమ్స్ ఐపీవో @ రూ. 500 కోట్లు
న్యూఢిల్లీ: కేబుళ్లు, వైర్ హార్నెస్ అసెంబ్లీల తయారీ సంస్థ డీసీఎక్స్ సిస్టమ్స్ తాజాగా పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ద్వారా రూ. 500 కోట్లు సమీకరించనుంది. ఇందుకోసం షేరు ధర శ్రేణిని రూ. 197–207గా నిర్ణయించింది. ఐపీవో అక్టోబర్ 31న ప్రారంభమై నవంబర్ 2న ముగుస్తుంది. ఐపీవో కింద కొత్తగా జారీ చేసే ఈక్విటీ షేర్ల పరిమాణాన్ని రూ. 500 కోట్ల నుంచి రూ. 400 కోట్లకు సంస్థ తగ్గించింది. ప్రమోటర్లు (ఎన్‌సీబీజీ హోల్డింగ్స్, వీఎన్‌జీ టెక్నాలజీ) ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో రూ. 100 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. ఇన్వెస్టర్లు కనీసం 72 షేర్లకు బిడ్ చేయాల్సి ఉంటుంది. ఇష్యూలో 75 శాతాన్ని క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (క్యూఐఐ), 15 శాతాన్ని సంస్థాగతయేతర ఇన్వెస్టర్లకు, 10 శాతాన్ని రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ. 1,102 కోట్లుగా నమోదైంది. ఆర్డరు బుక్ 2020 మార్చి నాటికి రూ. 1,941 కోట్లుగా ఉండగా 2022 మార్చి నాటికి రూ. 2,369 కోట్లకు పెరిగింది. -
భారత్‌కు మారిన ఫోన్‌పే ప్రధాన కార్యాలయం
న్యూఢిల్లీ: త్వరలో పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) రానున్న నేపథ్యంలో ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే తమ కార్యాలయ చిరునామాను సింగపూర్ నుంచి భారత్‌కు మార్చుకుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తయినట్లు సంస్థ తెలిపింది. గత ఏడాది కాలంగా ఫోన్‌పే సింగపూర్‌కు చెందిన ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసులు, వెల్త్ బ్రోకింగ్ మొదలైన వ్యాపారాలు, అనుబంధ సంస్థలు అన్నింటిని ఫోన్‌పే ప్రైవేట్ లిమిటెడ్–ఇండియాకు బదలాయించినట్లు వివరించింది. మరోవైపు, 3,000 మంది ఉద్యోగులకు ఫోన్‌పే ఇండియా కొత్త ప్లాన్ కింద కొత్త ఎసాప్ (ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్స్)లను జారీ చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్‌లు సమీర్ నిగమ్, రాహుల్ చారి, బుర్జిన్ ఇంజినీర్ కలిసి ఫోన్‌పేను ప్రారంభించారు. దీన్ని ఫ్లిప్‌కార్ట్ 2016లో కొనుగోలు చేసింది. అటుపైన 2018లో ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ కొనుగోలు చేయడంతో ఫోన్‌పే కూడా వాల్‌మార్ట్‌లో భాగంగా మారింది. ప్రస్తుతం 8–10 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనలో ఉంది. -
ఐనాక్స్ విండ్ రుణరహితం
ముంబై: పబ్లిక్ ఇష్యూ తదుపరి రుణరహిత కంపెనీగా ఆవిర్భవించనున్నట్లు పవన విద్యుత్ సొల్యూషన్స్ సంస్థ ఐనాక్స్ విండ్ తాజాగా పేర్కొంది. ఐపీవో చేపట్టేందుకు సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసిన కంపెనీ అనుమతుల కోసం చూస్తోంది. ప్రమోటర్లు కంపెనీకి పెట్టుబడులు అందించనున్నట్లు తెలియజేసింది. వీటితోపాటు.. ఐపీవో నిధులను వెచ్చించడం ద్వారా రుణరహితంగా మారనున్నట్లు వివరించింది. ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీకి 2022 జూన్‌కల్లా రూ. 1,718 కోట్ల స్థూల రుణ భారం నమోదైంది. రూ. 222 కోట్లమేర నగదు నిల్వలున్నాయి. నికరంగా రూ. 1,495 కోట్ల రుణాలను కలిగి ఉంది. అయితే ప్రయివేట్ ప్లేస్‌మెంట్‌కింద రెండు ప్రమోటర్ సంస్థలు మార్పిడిరహిత బాండ్ల ద్వారా రూ. 800 కోట్లను కంపెనీకి అందించనున్నట్లు ఐనాక్స్ విండ్ తెలియజేసింది. ఐనాక్స్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ రూ. 600 కోట్లు, ఐనాక్స్ విండ్ ఎనర్జీ రూ. 200 కోట్లు చొప్పున పంప్చేయనున్నాయి. వీటితోపాటు ఐపీవో నిధులను సైతం రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు ఐనాక్స్ విండ్ వివరించింది. తద్వారా ఐపీవో తదుపరి రుణరహిత కంపెనీగా ఆవిర్భవించే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేసింది. -
ఐపీవోకు బ్లూజెట్ హెల్త్‌కేర్
న్యూఢిల్లీ: ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రెడియంట్స్ తయారీ కంపెనీ బ్లూ జెట్ హెల్త్‌కేర్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు అక్షయ్ భన్సారీలాల్ అరోరా, శివేన్ అక్షయ్ అరోరా దాదాపు 2.17 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఐపీవో ద్వారా రూ. రూ. 1,800– 2,100 కోట్ల మధ్య సమీకరించాలని కంపెనీ భావిస్తున్నట్లు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. ముంబై కంపెనీ బ్లూ జెట్ ప్రధానంగా స్పెషాలిటీ ఫార్మాస్యూటికల్, హెల్త్‌కేర్ సంబంధ ఇన్‌గ్రెడియంట్స్, ఇంటర్మీడియట్లను రూపొందిస్తోంది. ఇన్నోవేటర్ ఫార్మాస్యూటికల్, మల్టీనేషనల్ జనరిక్ కంపెనీలకు ప్రత్యేకతరహా ప్రొడక్టులను సరఫరా చేస్తోంది. గతేడాది(2021–22) ఆదాయం 37 శాతం ఎగసి రూ. 683 కోట్లను అధిగమించింది. నికర లాభం 34 శాతం జంప్‌చేసి దాదాపు రూ. 182 కోట్లకు చేరింది. కంపెనీ రుణరహితంకాగా.. మహారాష్ట్రలోని షహద్, అంబర్నాథ్, మహద్లలో మూడు ప్లాంట్లను కలిగి ఉంది. -
డ్రీమ్‌ఫోక్స్ ఐపీవోకు రిటైలర్ల క్యూ
న్యూఢిల్లీ: విమానాశ్రయ సర్వీసులు పొందేందుకు వీలు కల్పించే అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్‌ఫోక్స్ పబ్లిక్ ఇష్యూకి రిటైలర్ల నుంచి భారీ డిమాండ్ నెలకొంది. ఇష్యూ తొలి రోజు(బుధవారం) రిటైల్ విభాగంలో 5.4 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. షేరుకి రూ. 308–326 ధరలో చేపట్టిన ఇష్యూలో భాగంగా కంపెనీ 94,83,302 షేర్లను విక్రయానికి ఉంచింది. 1.03 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. వెరసి 1.1 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. ఇష్యూ శుక్రవారం(26న) ముగియనుంది. ఐపీవోలో భాగంగా మంగళవారం యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్ల జారీ ద్వారా రూ. 253 కోట్లు సమకూర్చుకుంది. ఆఫర్లో భాగంగా ప్రమోటర్లు మొత్తం 1.72 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచారు. ఐపీవో తదుపరి చెల్లించిన మూలధనంలో ఇది 33 శాతం వాటాకు సమానం! రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 46 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. -
28 ఐపీవోలు .. రూ. 45,000 కోట్లు
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూలై మధ్య కాలంలో 28 కంపెనీలు పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)ల ద్వారా రూ. 45,000 కోట్లు సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతినిచ్చింది. వీటిలో 11 సంస్థలు ఇప్పటికే రూ. 33,254 కోట్లు సమీకరించాయి. వీటిలో సింహభాగం వాటా ప్రభుత్వ రంగ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌దే (రూ. 20,557 కోట్లు) ఉంది. ఏప్రిల్–మే నెలల్లోనే చాలా సంస్థలు ఐపీవోకి వచ్చాయి. మే తర్వాత పబ్లిక్ ఇష్యూలు పూర్తిగా నిల్చిపోయాయి. ప్రస్తుతం మార్కెట్లో పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోవడంతో తగిన సమయం కోసం పలు సంస్థలు వేచి చూస్తున్నాయని మర్చంట్ బ్యాంకింగ్ సంస్థలు తెలిపాయి. వీటిలో చాలా మటుకు కంపెనీలు రోడ్‌షోలు కూడా పూర్తి చేశాయని ఆనంద్ రాఠీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ డైరెక్టర్ ప్రశాంత్ రావు చెప్పారు. ఐపీవోలకు అనుమతులు పొందిన సంస్థలలో ఫ్యాబ్ఇండియా, భారత్ ఎఫ్ఐహెచ్, టీవీఎస్ సప్లయ్ చైన్ సొల్యూషన్స్, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, మెక్లియోడ్స్ ఫార్మాస్యూటికల్స్, కిడ్స్ క్లినిక్ ఇండియా తదితర సంస్థలు ఉన్నాయి. సెంటిమెంట్ డౌన్: గత ఆర్థిక సంవత్సరంలో (2021–22) 52 కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా రికార్డు స్థాయిలో రూ. 1.11 లక్షల కోట్లు సమీకరించాయి. కొత్త తరం టెక్నాలజీ స్టార్టప్‌ల ఇష్యూలపై ఆసక్తి నెలకొనడం, రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా పాలుపంచుకోవడం, లిస్టింగ్ లాభాలు తదితర అంశాలు ఇందుకు దోహదపడ్డాయి. అయితే, ప్రస్తుతం సెకండరీ మార్కెట్ భారీగా కరెక్షన్కు లోను కావడం, పేటీఎం.. జొమాటో వంటి డిజిటల్ కంపెనీల పనితీరు ఘోరంగా ఉండటం, ఎల్ఐసీ వంటి దిగ్గజం లిస్టింగ్‌లో నిరాశపర్చడం వంటివి ఇన్వెస్టర్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటెజిస్ట్ వీకే విజయకుమార్ వివరించారు. క్యూలో మరిన్ని కంపెనీలు. పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ .. ఐపీవో ప్రాస్పెక్టస్ దాఖలు చేసేందుకు గత రెండు నెలలుగా కంపెనీలు క్యూ కడుతుండటం గమనార్హం. జూన్–జూలైలో మొత్తం 15 కంపెనీలు సెబీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. సూలా విన్‌యార్డ్స్, అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలర్స్, ఉత్కర్‡్ష స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సాయి సిల్క్ కళామందిర్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. చిన్న నగరాల్లో అద్భుతంగా రా>ణించిన వ్యాపార సంస్థల ప్రమోటర్లు ఇప్పుడు కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ముందుకు వస్తున్నారని మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఎండీ అభిజిత్ తారే తెలిపారు. త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా నమోదవుతుండటం, ఆర్థిక డేటా కాస్త ప్రోత్సాహకరంగా కనిపిస్తుండటం తదితర అంశాలు, ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో సహేతుకమైన ధరతో వచ్చే కంపెనీల ఐపీవోలకు సానుకూలంగా ఉండవచ్చని పేర్కొన్నారు. -
మళ్లీ పబ్లిక్ ఇష్యూల సందడి
న్యూఢిల్లీ: రెండున్నర నెలల తదుపరి మళ్లీ ప్రైమరీ మార్కెట్‌కు జోష్ రానుంది. ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ సర్వీసుల కంపెనీలలో సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ పబ్లిక్ ఇష్యూ నేడు(12న) ప్రారంభంకానుంది. ఎవలాన్ టెక్నాలజీస్ అయితే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. మరోవైపు ఆరోగ్య పరిరక్షణ రంగ సంస్థ యథార్ధ్ హాస్పిటల్ అండ్ ట్రౌమా కేర్ సర్వీసెస్ ఐపీవో దరఖాస్తుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ బాటలో పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా ఫిన్‌కేర్ సాŠమ్ల్ ఫైనాన్స్ బ్యాంక్ రెండోసారి సెబీకి దరఖాస్తు చేసింది. వివరాలు చూద్దాం.. ఎస్జీఎస్ టెక్.. నేటి(శుక్రవారం) నుంచి ప్రారంభంకానున్న ఐపీవో ద్వారా సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ రూ. 840 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. 18న ముగియనున్న ఇష్యూకి రూ. 209–220 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇంతక్రితం మే 24–26న ఏథెర్ ఇండస్ట్రీస్ ఐపీవో చేపట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ 11 కంపెనీలు లిస్టింగ్ ద్వారా రూ. 33,254 కోట్లు సమీకరించిన సంగతి తెలిసిందే. వీటిలో ఎల్ఐసీ వాటా రూ. 20,557 కోట్లు. కాగా.. సిర్మా ఎస్జీఎస్ ఐపీవోలో భాగంగా రూ. 766 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా 33.69 లక్షల షేర్లను వీణా కుమారి టాండన్ విక్రయానికి ఉంచనున్నారు. నిధులను పెట్టుబడి వ్యయాలు, ఆర్అండ్డీ విస్తరణ, కార్పొరేట్ అవసరాలు తదితరాలకు వినియోగించనుంది. కంపెనీ కస్టమర్లలో ఏవో స్మిత్, టీవీఎస్ మోటార్, యురేకా ఫోర్బ్స్ తదితరాలున్నాయి. యథార్ధ్.. రెడీ ఢిల్లీ–ఎన్సీఆర్లో మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్వహిస్తున్న యథార్ధ్ హాస్పిటల్ అండ్ ట్రౌమా కేర్ సర్వీసెస్ ఐపీవోకు సెబీ అనుమతించింది. ఇష్యూలో భాగంగా రూ. 610 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 65.51 లక్షల షేర్లను ప్రమోటర్లు, తదితర సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. కంపెనీ ఏప్రిల్‌లో దరఖాస్తు చేసింది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు, కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఎవలాన్ టెక్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ సర్వీసుల కంపెనీ ఎవలాన్ టెక్నాలజీస్ ఐపీవోకు వీలుగా సెబీకి దరఖాస్తు చేసింది. తద్వారా రూ. 1,025 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఇష్యూలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా రూ. 625 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనుంది. ఫిన్‌కేర్.. మళ్లీ ఐపీవో చేపట్టేందుకు సెబీ నుంచి లభించిన ఏడాది గడువు గత నెలలో ముగియడంతో ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మరోసారి దరఖాస్తు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 625 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు మరో 1.7 కోట్ల షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు, భవిష్యత్ పెట్టుబడి అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ఇంతక్రితం రూ. 1,330 కోట్ల సమీకరణకు 2021 మే నెలలో ప్రాస్పెక్టస్ దాఖలు చేయగా.. అదే ఏడాది జులైలో సెబీ ఓకే చేసింది. బిబాకు చెక్ ఫ్యాషన్, సంప్రదాయ దుస్తుల కంపెనీ బిబా ఫ్యాషన్ పబ్లిక్ ఇష్యూకి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాత్కాలికంగా చెక్ పెట్టింది. వివరాలు వెల్లడికానప్పటికీ దరఖాస్తును పెండింగ్‌లో ఉంచినట్లు సెబీ వెబ్సైట్ పేర్కొంది. కంపెనీ ఏప్రిల్ 12న ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 90 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేసే యోచనలో ఉంది. వీటికి జతగా మరో 2.77 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. 1986లో ఏర్పాటైన కంపెనీ బిబా బ్రాండుతో మహిళా ఫ్యాషన్ దుస్తులను రూపొందిస్తోంది. -
ఐపీఓ బాటలో ఫోన్‌పే
న్యూఢిల్లీ: గ్లోబల్ రిటైలింగ్ కంపెనీ వాల్‌మార్ట్ గ్రూప్‌లోని యూపీఐ చెల్లింపుల దిగ్గజం ఫోన్‌పే పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్‌కు మెజారిటీ వాటాగల కంపెనీ ఇందుకు బ్యాంకర్లు, న్యాయ సలహాదారు సంస్థలను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా కంపెనీ 8–10 బిలియన్ డాలర్ల(రూ. 62,000– 78,000 కోట్లు) విలువను ఆశిస్తున్నట్లు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. నిధులతో యూపీఐ ఆధారిత చెల్లింపుల నిర్వహణతోపాటు ఫైనాన్షియల్ సర్వీసుల పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించే ప్రణాళికలున్నట్లు పేర్కొన్నాయి. మేడిన్ ఇండియా సంస్థగా ఆవిర్భవించే బాటలో రిజిస్టర్డ్ హోల్డింగ్ సంస్థను సింగపూర్ నుంచి భారత్‌కు మార్చే యోచనలో ఉన్నట్లు తెలియజేశాయి. ఈ ప్రతిపాదనను ఇప్పటికే ఫోన్‌పే బోర్డు అనుమతించడం గమనార్హం! దేశీయంగా ఊపిరి ఇటీవల పలు కంపెనీలు విదేశాలలో లిస్టింగ్‌కు ప్రాధాన్యత ఇస్తుంటే డిజిటల్ చెల్లింపుల కంపెనీ ఫోన్‌పే మాత్రం దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు ఆసక్తి చూపుతోంది. స్నేహపూర్వక వ్యాపార నియంత్రణలు, పన్ను చట్టాలు గల యూఎస్ లేదా సింగపూర్‌లో లిస్టింగ్‌కు పలు స్టార్టప్‌లు చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫోన్‌పేను నిజానికి ఫ్లిప్‌కార్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్స్ సమీర్ నిగమ్, రాహుల్ చారి, బర్జిన్ ఇంజినీర్ ఏర్పాటు చేశారు. తదుపరి 2016లో ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసింది. 2018లో ఫోన్‌పే సహా ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్ సొంతం చేసుకుంది. 2023కల్లా... ఫోన్‌పే లాభాల్లోకి ప్రవేశించిన వెంటనే పబ్లిక్ ఇష్యూ చేపట్టాలని చూస్తున్నట్లు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. 2023కల్లా టర్న్అరౌండ్ కాగలదని అంచనా వేస్తున్నట్లు తెలియజేశాయి. దేశీయంగా యూపీఐ లావాదేవీలు జోరందుకోవడంతో ఈ డిసెంబర్‌కల్లా సిబ్బంది సంఖ్యను 5,200కు చేర్చుకునే సన్నాహాల్లో ఉంది. ప్రస్తుతం 2,600 మంది ఉద్యోగులను కలిగిన ఫోన్‌పే మరో 2,800 ఉపాధి అవకాశాలకు తెరతీసినట్లు తెలుస్తోంది. భారీ విలువలో ప్రమోటర్లు ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్‌ల నుంచి ఫోన్‌పే 70 కోట్ల డాలర్లు సమీకరించింది. దీంతో 2020లో కంపెనీ విలువ 5.5 బిలియన డాలర్లకు చేరింది. ఈ బాటలో టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, టెన్సెంట్ తదితర దిగ్గజాల నుంచి 1.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించింది. యూపీఐ విభాగంలో నెలవారీ లావాదేవీల్లో కంపెనీ 47 శాతం మార్కెట్ వాటాతో అగ్రపథంలో ఉంది. వెల్త్‌డెస్క్, ఓపెన్‌క్యూ, గిగ్ఇండియాలను కొనుగోలు చేసిన కంపెనీ మ్యూచువల్ ఫండ్, ఎన్‌బీఎఫ్‌సీలైసెన్సులకు దరఖాస్తు చేసింది. ప్రస్తుతం ఎంఎఫ్ పంపిణీ లైసెన్స్‌ను కలిగి ఉంది. వెల్త్‌మేనేజ్‌మెంట్ ప్రొడక్టుల్లో భాగంగా స్టాక్స్, ఈటీఎఫ్‌లను జమ చేసుకుంటోంది. బంగారంలో పెట్టుబడులకు వీలు కల్పిస్తూ యూపీఐ సిప్‌ను ప్రవేశపెట్టింది. -
ఎల్ఐసీ ఐపీవో సక్సెస్
న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ సక్సెస్ అయ్యింది. షేరుకి రూ. 902–949 ధరలో ఈ నెల 4న ప్రారంభమైన ఇష్యూ 9న(సోమవారం) ముగిసింది. చివరి రోజుకల్లా ఇష్యూ మొత్తం 2.95 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. దాదాపు 16.21 కోట్ల షేర్లను ప్రభుత్వ ఆఫర్ చేయగా.. 47.83 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. క్విబ్ కోటాలో 2.83 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 2.91 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. ఇక రిటైలర్ల విభాగంలో ఆఫర్ చేసిన 6.9 కోట్ల షేర్లకుగాను 13.77 కోట్ల షేర్ల కోసం(దాదాపు రెట్టింపు) దరఖాస్తులు లభించాయి. పాలసీదారుల నుంచి 6 రెట్లు, ఉద్యోగుల నుంచి 4.4 రెట్లు అధికంగా బిడ్స్ వచ్చాయి. పాలసీదారులకు రూ. 60, ఉద్యోగులు, రిటైల్ ఇన్వెస్టర్లకు రూ. 45 చొప్పున ఐపీవో ధరలో ఎల్ఐసీ రాయితీ ఇచ్చింది. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 3.5 శాతం వాటాను విక్రయానికి ఉంచిన సంగతి తెలిసిందే. తద్వారా రూ. 20,600 కోట్లవరకూ సమకూర్చుకుంది. ఇతర హైలైట్స్ ► ఐపీవోలో భాగంగా దరఖాస్తుదారులకు ఎల్ఐసీ షేర్లను ఈ నెల 12కల్లా కేటాయించనుంది. ► బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో ఎల్ఐసీ ఈ నెల 17న(మంగళవారం) లిస్ట్‌కానుంది. ► రూ. 20,557 కోట్ల సమీకరణ ద్వారా ఎల్ఐసీ అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డు నెలకొల్పింది. తదుపరి ర్యాంకుల్లో రూ. 18,300 కోట్లతో పేటీఎమ్(2021), రూ. 15,500 కోట్లతో కోల్ ఇండియా(2010), రూ. 11,700 కోట్లతో రిలయన్స్ పవర్(2008) నిలిచాయి. ఆత్మనిర్భర్ భారత్ బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ అన్ని విభాగాల్లోనూ విజయవంతమైనట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంతా పాండే తెలియజేశారు. ఇది ఆత్మనిర్భర్ భారత్‌కు ఉదాహరణగా పేర్కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు ఎల్ఐసీ ఆఫర్‌ను సక్సెస్ చేసినట్లు తెలియజేశారు. తద్వారా విదేశీ ఇన్వెస్టర్లపైనే ఆధారపడిలేమని నిరూపణ అయినట్లు వ్యాఖ్యానించారు. ఇది దేశీ క్యాపిటల్ మార్కెట్లు మరింత బలపడేందుకు దోహదం చేయగలదని అభిప్రాయపడ్డారు. -
నేటితో ఎల్ఐసీ ఐపీవో ముగింపు
న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. షేరుకి రూ. 902–949 ధరలో ఈ నెల 4న ప్రారంభమైన ఇష్యూ నేడు(9న) ముగియనుంది. ఆదివారానికల్లా ఇష్యూ మొత్తం 1.8 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. దాదాపు 16.21 కోట్ల షేర్లకుగాను 29 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. రిటైలర్ల విభాగంలో ఆఫర్ చేసిన 6.9 కోట్ల షేర్లకుగాను 10.99 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. పాలసీదారుల నుంచి 5 రెట్లు, ఉద్యోగుల నుంచి 3.8 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. ఇక నాన్‌ఇన్‌స్టిట్యూషనల్ విభాగంలో 1.24 రెట్లు బిడ్స్ దాఖలుకాగా.. క్విబ్ కోటాలో మాత్రం 0.67 శాతమే స్పందన కనిపించింది. పాలసీదారులకు రూ. 60, ఉద్యోగులు, రిటైల్ ఇన్వెస్టర్లకు రూ. 45 చొప్పున ఎల్ఐసీ ఐపీవో ధరలో రాయితీ ఇస్తోంది. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 3.5 శాతం వాటాను విక్రయానికి ఉంచిన సంగతి తెలిసిందే. తద్వారా రూ. 20,600 కోట్లవరకూ సమకూర్చుకోవాలని చూస్తోంది. 5 కోట్ల మార్క్ తొలిసారి 5 కోట్ల అప్లికేషన్ల మైలురాయిని దాటిన ఐపీవోగా ఎల్ఐసీ నిలిచినట్లు పేటీఎమ్ మనీ సీఈవో వరుణ్ శ్రీధర్ పేర్కొన్నారు. వినియోగదారుల నుంచి భారీ స్పందన కనిపిస్తున్నట్లు చెప్పారు. ఒక్కో దరఖాస్తుపై సగటు పెట్టుబడికంటే అధికంగా రూ. 29,000 చొప్పున లభిస్తున్నట్లు తెలియజేశారు. యూపీఐ ద్వారా ఐపీవోకు రూ. 5 లక్షలవరకూ అనుమతించడంతో హెచ్ఎన్ఐ పెట్టుబడులు సైతం తరలివస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఎల్ఐసీ అమ్మక పరిమాణం ఓకే
ముంబై: పబ్లిక్ ఇష్యూలో భాగంగా బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీలో 3.5 శాతం వాటాను విక్రయించడమే ప్రస్తుత పరిస్థితుల్లో సరైన పరిమాణమని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. తద్వారా ఐపీవోలోకి ఒక్కసారిగా భారీ పెట్టుబడులు తరలి వచ్చేందుకు వీలుండదని తెలియజేశారు. ప్రస్తుత సమస్యాత్మక మార్కెట్ వాతావరణంలో ఎల్ఐసీ వాటా విక్రయాన్ని రూ. 20,557 కోట్లకు పరిమితం చేయడం సరైన చర్యగా పేర్కొన్నారు. ఎల్ఐసీ ఇష్యూ అందరికీ.. ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్లకు విలువ చేకూర్చగలదని అభిప్రాయపడ్డారు. వెరసి ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూపై అధికారికంగా వివరాలు వెలువడ్డాయి. తొలుత 5 శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధపడ్డ ప్రభుత్వం మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా 3.5 శాతానికి తగ్గించుకుంది. 22.13 కోట్ల షేర్ల విక్రయం ద్వారా రూ. 20,557 కోట్లు లభించగలవని భావిస్తోంది. ఇష్యూ మే 4న ప్రారంభమై 9న ముగియనున్నట్లు అంచనా. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 902–949గా నిర్ణయించిన విషయం విదితమే. పాలసీదారులు, ఉద్యోగులు, రిటైలర్లకు ఇష్యూ ధరలో రూ. 60–40 వరకూ రాయితీని ప్రకటించింది. ఎల్ఐసీ.. మే 17న స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కానున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా. -
రెయిన్బో ఐపీవో @ రూ. 517–542
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూకి సంబంధించి షేరు ధర శ్రేణిని రూ. 517–542గా నిర్ణయించినట్లు పిల్లల ఆస్పత్రుల చెయిన్ రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ వెల్లడించింది. ఐపీవో ద్వారా రూ. 1,581 కోట్లు సమీకరిస్తున్నట్లు సంస్థ సీఎండీ రమేష్ కంచర్ల శుక్రవారమిక్కడ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాలతో పాటు పరిస్థితులను బట్టి ఇతర పొరుగు దేశాలకు కూడా కార్యకలాపాలు విస్తరించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఐపీవో కింద కొత్తగా జారీ చేసే షేర్ల ద్వారా రూ. 280 కోట్లు సమీకరించనుండగా .. ప్రమోటర్లు, ఇతర ఇన్వెస్టర్లు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో 2.4 కోట్ల వరకూ షేర్లను విక్రయించనున్నారు. ఇన్వెస్టర్లు కనీసం 27 షేర్లకు బిడ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం 1,500గా ఉన్న పడకల సంఖ్యను వచ్చే మూడేళ్లలో మరో 500 మేర పెంచుకోనున్నట్లు సీఎఫ్‌వో ఆర్ గౌరీశంకర్ పేర్కొన్నారు. రెయిన్బో ఐపీవో ఏప్రిల్ 27న ప్రారంభమై 29న ముగుస్తుంది. ఇష్యూలో 35 శాతం భాగాన్ని రిటైల్ ఇన్వెస్టర్లకు అర్హత కలిగిన ఉద్యోగుల కోసం 3 లక్షల షేర్లు కంపెనీ కేటాయిస్తోంది. వారికి ఇష్యూ తుది ధరపై రూ. 20 డిస్కౌంటు లభిస్తుంది. -
ఎల్ఐసీ మెగా ఐపీవోకి సన్నాహాలు..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మెగా పబ్లిక్ ఇష్యూ కోసం సన్నాహాలు వేగం పుంజుకుంటున్నాయి. యాంకర్ ఇన్వెస్టర్లుగా 50–60 సంస్థలను కేంద్రం షార్ట్‌లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వీటిలో బ్లాక్‌రాక్, శాండ్స్ క్యాపిటల్, ఫిడెలిటీ ఇన్వెస్ట్మెంట్స్, స్టాండర్డ్ లైఫ్, జేపీ మోర్గాన్ మొదలైనవి ఉన్నట్లు సమాచారం. త్వరలోనే యాంకర్ ఇన్వెస్టర్ల జాబితాను కేంద్రం ఖరారు చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇష్యూను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదిత ఇన్వెస్టర్ల నుంచి కూడా ప్రభుత్వం అభిప్రాయాలు తీసుకుందని ఒక అధికారి తెలిపారు. ఇందుకోసం నిర్దిష్ట వేల్యుయేషన్ శ్రేణిని వారి ముందు ఉంచినట్లు వివరించారు. ఆయా ఇన్వెస్టర్ల అభిప్రాయాల మేరకు ఎల్ఐసీ వేల్యుయేషన్ దాదాపు రూ. 7 లక్షల కోట్ల మేర ఉంటుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. వేల్యుయేషన్ ఆకర్షణీయంగా కనిపిస్తుండటంతో మదుపు చేసేందుకు ఆసక్తి చూపే ఇన్వెస్టర్ల సంఖ్య మరింతగా పెరుగుతోందని అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో వేల్యుయేషన్‌పైనా సత్వరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. 25 శాతం డ్రాపవుట్..: ఆసక్తిగా ఉన్న ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఎంత మేరకు పెట్టుబడులు పెడతాయో తెలుసుకునేందుకు అత్యున్నత స్థాయి కమిటీ.. వాటి నుంచి ప్రతిపాదనలు తీసు కున్నట్లు అధికారి చెప్పారు. ఇప్పటికే షార్ట్‌లిస్ట్ చేసిన సంస్థల్లో దాదాపు 25% ఇన్వెస్టర్లు పక్కకు తప్పుకునే (డ్రాపవుట్) అవకాశం ఉందని భావిస్తున్నట్లు వివరించారు. మరింత మంది ఇన్వెస్టర్లను భాగస్వాములను చేసేందుకు, సెబీ నిబంధనల మేరకు .. ఐపీవోలో విక్రయించే షేర్ల సంఖ్యను కూడా కేంద్రం పెంచవచ్చని తెలిపారు. సుమారు 12 యాంకర్ ఇన్వెస్టర్లు దాదాపు రూ. 18,000 కోట్ల పెట్టుబడులకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఇష్యూ ద్వారా 31.6 కోట్ల షేర్ల (దాదాపు 5% వాటా) విక్రయం ద్వారా రూ. 63,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. మారిన పరిస్థితులతో 7% వరకు వాటాలను విక్రయించే అవకాశముందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. మే 12 దాటితే మళ్లీ ఐపీవో ప్రతిపాదనలను సెబీకి సమర్పించాల్సి రానున్న నేపథ్యంలో ఏదేమైనా పబ్లిక్ ఇష్యూను ఏప్రిల్‌లోనే ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
ఎల్ఐసీ ప్రాస్పెక్టస్‌లో క్యూ3 ఫలితాలు అప్డేట్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ తమ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూకి సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను తాజా క్యూ3 ఫలితాలతో అప్డేట్ చేసింది. సదరు పత్రాలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. సెబీ నిబంధనల ప్రకారం డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలతో అప్డేట్ చేసిన ప్రాస్పెక్టస్‌ను సమర్పించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటి ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో ఎల్ఐసీ నికర లాభం రూ. 235 కోట్లుగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో నమోదైన రూ. 7.08 కోట్లతో పోలిస్తే ఈసారి అదే వ్యవధిలో లాభం రూ. 1,672 కోట్లకు పెరిగింది. ప్రతిపాదిత ఐపీవో కింద 5 శాతం వాటాల (31.6 కోట్ల షేర్లు) విక్రయం ద్వారా సుమారు రూ. 60,000 కోట్లు సమీకరించవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం రూ. 78,000 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకున్నప్పటికీ ఇప్పటిదాకా కేవలం రూ. 12,423 కోట్లు మాత్రమే సేకరించగలిగింది. మిగతా మొత్తాన్ని ఎల్ఐసీ ఐపీవో ద్వారా భర్తీ చేసుకోవచ్చని భావించింది. ఇందుకోసం మార్చిలోనే పబ్లిక్ ఇష్యూ కోసం సన్నాహాలు చేసుకున్నప్పటికీ రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతల కారణంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుండటంతో వాయిదా వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. సెబీకి కొత్తగా మరోసారి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం తీసుకున్న అనుమతులతో పబ్లిక్ ఇష్యూకి వెళ్లేందుకు ప్రభుత్వానికి మే 12 వరకూ గడువు ఉంది. అతి పెద్ద ఐపీవో..: అంతా సజావుగా జరిగితే భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇది అతి పెద్ద ఐపీవో కానుంది. ఒక్కసారి లిస్టయ్యిందంటే ఎల్ఐసీ మార్కెట్ విలువ.. రిలయన్స్, టీసీఎస్ వంటి దిగ్గజాలను కూడా మించిపోనుంది. ఇప్పటిదాకా అత్యంత భారీ ఐపీవో రికార్డు.. పేటీఎం పేరిట ఉంది. 2021లో పేటీఎం రూ. 18,300 కోట్లు సమీకరించింది. ఆ తర్వాత స్థానాల్లో కోల్ ఇండియా (2010లో రూ. 15,500 కోట్లు), రిలయన్స్ పవర్ (2008లో రూ. 11,700 కోట్లు) ఉన్నాయి. -
పోరు జెండా: మల్లు స్వరాజ్యం
మల్లు స్వరాజ్యం... పోరాటానికి పర్యాయ పదం భూమికోసం.. భుక్తికోసం... పేద ప్రజల విముక్తికోసం సొంత జీవితాన్ని వదిలిపెట్టిన స్ఫూర్తి చరిత పట్టుకుంటే పదివేల బహుమానమన్న నిజాం సర్కార్‌పై బరిగీసి ఎక్కు పెట్టిన బందూక్ చావుకు వెరవని గెరిల్లా యోధురాలు అసెంబ్లీలో ఆమె మాట తూటా పదవి లేకపోయినా ప్రజా సమస్యలే ఎజెండా ఆమె పోరాటాల ఎర్రజెండా.. అన్నం పెట్టి... ఆలోచన మార్చుకుని.. బాల్యంలో ఓ ఘటన మల్లు స్వరాజ్యం ఆలోచనను మార్చేసింది. అప్పట్లో వడ్లను కూలోల్లే దంచేటోళ్లు. ముఖ్యంగా ఆడవాళ్లు. పుట్లకొద్ది దంచినా కూలీ ఉండదు. రోజుల తరబడి పని జరిగేది. అలా దంచుతున్న ఎల్లమ్మ అనే కూలీ కళ్లు తిరిగి పడిపోయింది. అక్కడే కాపలాగా ఉన్న స్వరాజ్యం నీళ్లు తీస్కపోయి తాగించారు. అన్నం తినలేదని చెబితే.. అన్నం తీసుకొచ్చి తినిపించారు. మిగిలిన కూలీలు తినలేదంటే... చూస్తే అన్నం లేదు. బియ్యం నానబెట్టుకుని తింటామంటే వాళ్లకు సాయం చేశారు. అట్లా సాయపడ్డందుకు ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగింది. స్వరాజ్యం చిన్నాయనలు తప్పుబట్టి తిట్టిండ్రు. అప్పుడు వాళ్లమ్మ చొక్కమ్మ అండగా నిలబడ్డది. ‘చిన్న పిల్ల ఏమనకండి’ అని వెనకేసుకొచ్చింది. కష్టం చేసే వ్యక్తికి తినే హక్కెందుకు లేదోనన్న ఆలోచన ఆనాడే స్వరాజ్యం మనసులో అంకురించింది. అక్కడినుంచే ఆమె తిరుగుబాటు నేర్చుకున్నారు. మనుసులో ముద్రించుకుపోయిన ‘అమ్మ’ స్వరాజ్యంపై వాళ్లమ్మ చొక్కమ్మ ప్రభావం ఎక్కువ. బిడ్డను రాణీరుద్రమలా పెంచాలి అనుకునేవారామె. స్వరాజ్యం ఎనిమిదో ఏట తండ్రి మరణించాడు. అప్పటికే అన్న భీమిరెడ్డి నర్సింహారెడ్డి (బీఎన్)ఆంధ్రమహాసభ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. ఆయన ప్రోత్సాహంతో బాలల సంఘం పెట్టారు స్వరాజ్యం. అన్న తెచ్చిచ్చిన మాక్సీం గోర్కీ ‘అమ్మ’ పుస్తకాన్ని వాళ్లమ్మతో కలిసి చదివారు. రాత్రి దాలిలో పాలు కాగబెట్టి.. తోడెయ్యడం కోసం వాటిని ఆరబెట్టినప్పుడు కూర్చుని చదివిన ఆ పుస్తకంలోని అక్షరం అక్షరం ఆమె మనసులో ముద్రించుకుపోయింది. ఆ పుస్తకంలోని అమ్మ పాత్ర వాళ్లమ్మను, ఆమెను ప్రభావితం చేసింది. అందుకే బీఎన్ని సాషా అని పిలుచుకునేవారామె. కొడుకుతోపాటు కూతురు స్వరాజ్యం పోరాటంలోకి వెళ్తానంటే అడ్డుపడలేదు సరికదా... ప్రోత్సహించి ఉద్యమాల్లోకి పంపించిందా అమ్మ. తన 11వ ఏట గెరిల్లా యుద్ధంలో శిక్షణ, ఆత్మరక్షణా పద్ధతులు నేర్చుకున్నారు. 12 ఏళ్ల వయసులోనే ఆంధ్రమహాసభలో చేరారామె. ఆ తరువాత వారిల్లు ఆంధ్ర మహాసభకు కేంద్రమయ్యింది. కూలీరేట్ల పెంపు... పెద్ద మలుపు.. తెలంగాణలో వెట్టిచాకిరీ, భూస్వాముల దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, కూలీ పెంచాలని ఉద్యమం మొదలైంది. తమది దొరల కుటుం» మే అయినా... ఊళ్లో ఉన్న జీతగాళ్లు, కూలోళ్లందరినీ కూడగట్టి సమ్మె చేద్దామని ప్లాన్. అప్పటికే పోలీస్ పటేల్ అయిన స్వరాజ్యం చిన్నాయన తుంగతుర్తి పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో బీఎన్ని అరెస్టు చేయడానికి పోలీసులు వచ్చారు. తల్లి పోలీసులను దర్వాజ కాడనే అడ్డుకుంటే... అన్నను ఊరుదాటించారు స్వరాజ్యం. ఆయన వెళ్తూ ‘నేను పోతున్న... సమ్మె జరిగేట్టు చూడాలె’ అంటూ బాధ్యతను పెట్టాడు. తెల్లారి వాడలన్ని తిరిగి పనికి పోవద్దని చెప్పారామె. అయినా వినలేదు... తన చిన్నాన్న పనిలోకే పోతున్నరని తెలిసి, వాగులో వాళ్లకడ్డం పడుకున్నది. ‘మీరు కూలికి పోవాలంటే.. నన్ను దాటుకుపోండి’ అని పట్టుబట్టారామె. భూస్వాముల పిల్ల కనుక ఆమెను దాటి వెళ్లలేకపోయారు. ఆరోజుకు వెనుదిరిగిండ్రు. మరునాడు పనిలోకి రానందుకు వాళ్ల చిన్నాయన కూలోళ్లను పిలిచి పంచాయతీపెట్టిండ్రు. అది తెలిసిన స్వరాజ్యం.. ‘దెబ్బ నామీద పడ్డంకనే వాళ్ల మీద పడాలి’ అంటూ బాబాయి దౌర్జన్యాన్ని అడ్డుకున్నారు. రేటు పెంచితే తప్ప పనిలోకి రాలేమన్నరు కూలీలు. అప్పటిదాకా సోలెడున్న కూలీ... మూడు సోలెలు అయ్యింది. సమ్మె జయప్రదమైంది. అది స్వరాజ్యం ఉద్యమ జీవితంలో తొలి అడుగు. ఆమె గొంతెత్తితే స్వరాజ్యం... గొంతెత్తితే తెలంగాణ నేల ఊగింది ఉయ్యాల. చిన్నప్పటినుంచే ఆమెకు పాటంటే ప్రాణం. బాగా పాడుతోందని ఆంధ్రమహాసభ సమావేశాల్లో పాడించేవాళ్లు. పాలకుర్తి ఐలమ్మ పోరాటానికి మద్దతుగా సంఘం నిలబడాలనుకున్నది. పాలకుర్తిలో మీటింగ్ పెట్టారు. ఆ సభలో పాటలు పాడేందుకు స్వరాజ్యంను తీసుకెళ్లారు బీఎన్. సభ సక్సెస్ అయ్యింది. ఐలమ్మ పోరాటం ఫలించింది. ‘విస్నూరు దొర చేతిలో సచ్చినా సరే... భూమిని వదలను’ అని పోరు జేసిన ఐలమ్మ తనకు స్ఫూర్తి’ అని చెప్పేవారామె.. ‘ఏనాడు గడీలనొదిలి వాడల్లో జొరబడ్డానో... ఆ వాడలే నా ఉద్యమ జన్మస్థానాలు. నా ఉపన్యాసాలకు విషయాన్ని, నా పాటలకు బాణీలని, నా జీవితానికొక చరిత్రను ఇచ్చింది వాళ్లే’ అన్న స్వరాజ్యం 13 ఏళ్ల వయసులోనే విప్లవగీతమయ్యారు. విసునూరు దేశ్‌ముఖ్ దురాగతాలను ఎండగట్టే ఉయ్యాల పాటలను ప్రచారానికి ఆయుధంగా చేసుకుంది. 15 ఏళ్ల వయసులో ఆమె ఉపన్యాసాలు విని జనం ఉర్రూతలూగారు. 16 ఏళ్లకే గెరిల్లా... భూస్వాముల దగ్గరున్న ఆయుధాల స్వాధీనంతో మొదలైన పోరు.. పోలీసు క్యాంపుల దాకా కొనసాగింది. గ్రామాల మీద దాడి చేసిన పోలీసుల దగ్గర్నుంచి ఆయుధాలు గుంజుకోవడంలో మహిళలకు శిక్షణ నిచ్చారు స్వరాజ్యం. ఆకునూరు, మాచిరెడ్డిపల్లి, సూర్యాపేట, మల్లారెడ్డిగూడెం, పోరాటాల్లో్ల కీలక పాత్ర పోషించారు స్వరాజ్యం. కడివెండి పోరాటంలో మహిళలను కూడగట్టడంలో ఆమెది ప్రధాన భూమిక. నల్గొండ, వరంగల్జిల్లాల్లో దాదాపు పదిహేను సాయుధ పోరాటాలు ఆమె నాయకత్వంలో జరిగాయి. తాడి, ఈత చెట్లపై నిజాం సర్కార్పెత్తనాన్ని సవాలు చేస్తూ... ‘గీసేవాడిదే చెట్టు.. దున్నేవాడిదే భూమి’ నినాదానికి పార్టీ పిలుపునిచ్చింది. సూర్యాపేట తాలూకాలో నిర్వహణ బాధ్యతలు స్వరాజ్యానికి అప్పగించారు. గ్రామరాజ్యాలు, గ్రామ రక్షణ మహిళా దళాలు ఏరా>్పటు చేయడం, తాళ్ల పంపకం, భూ పంపకం సమర్థవంతంగా నిర్వహించారు స్వరాజ్యం. ఎన్నటికీ మరవని సంఘటన... ఓ కోయగూడెంలో షెల్టర్ తీసుకున్నది దళం. ఆ ఇంట్లో బాలింత, ఆమె తల్లిద్రండులు ఉన్నారు. ఎట్ల తెలిసిందో ఏమో పోలీసులు గుడిసెను చుట్టుముట్టిన్రు. లోపలికి వస్తే స్వరాజ్యంను చూస్తారని దర్వాజ దగ్గరకెళ్లింది ఇంటి యజమాని సమ్మక్క. చంటిపిల్లను తీసుకుని స్వరాజ్యం బయటపడ్డది. కానీ ఆ కోయ స్త్రీని స్వరాజ్యం అనుకుని అరెస్టు చేసి తీసుకెళ్లారు పోలీసులు. వెంటనే వెనక్కి వచ్చి ఆ పసిబిడ్డను వెనక్కి ఇచ్చేయడానికి లేదు. రెండు మూడు రోజులు దళంతో ఉంచుకోవాల్సి వచ్చింది. పాలు సరిగ్గా దొరక్క శిశువు మరణించింది. తాను స్వరాజ్యం కాదని పోలీసులకూ చెప్పలేదు. వారం రోజుల తరువాత నిజం తెలుసుకున్న పోలీసులు ఆమెను వదిలిపెట్టారు. ఆమె గ్రామానికి వచ్చాక వెళ్లి కలిసింది దళం. ఆ తల్లిని చూసి కన్నీల్లు పెట్టుకున్నారు స్వరాజ్యం. ‘నీ బిడ్డను ఎత్తుకునిపోయి తప్పు చేశాను. వదిలిపెట్టినా బాగుండేదేమో’ అని పశ్చాత్తాప పడ్డారు. ‘నా బిడ్డ కోసం నువ్వు ఏడుస్తున్నవు... కానీ ప్రజలకోసం నిన్ను వదులుకున్నది కదా మీ అమ్మ’ అని ఓదార్పు మాటలు పలికిందట ఆమె. ఆ ఇద్దరు తల్లుల త్యాగాన్ని నేనెప్పటికీ మరవను అని చెప్పేవారామె. బియ్యం బుక్కి... సాయుధ పోరాట విరమణ తరువాత.. 1954లో ఆమె పేరు మీద ఉన్న పదివేల రివార్డును ఎత్తివేసింది ప్రభుత్వం. అదే ఏడు హైదరాబాద్‌లో విశాలాంధ్ర మహాసభ జరిగింది. ఏడేళ్ల అజ్ఞాతవాసం తరువాత వేదికనెక్కిన ఆమెను చూడగానే ప్రజలు చేసిన కరతాళ ధ్వనులతో ప్రాంతమంతా మారుమోగిపోయింది. ఆమె ప్రసంగం విన్న జనం ఉర్రూతలూగారు. ఆ సభ అనంతరం మల్లు వెంకటనర్సింహారెడ్డిని వివాహం చేసుకున్నారు. భూస్వామ్య కుటుంబంనుంచి వచ్చినా... తల్లిద్రండుల నుంచి నుంచి గుంటెడు జాగ కూడా తీసుకోలేదు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తిండి సరిగ్గా లేని రోజులు. ఎప్పుడూ జొన్న గటక, జొన్నరొట్టెలే అన్నట్టుగా ఉండేది. దొరకక ఓసారి బియ్యం దొరికినయ్. అప్పుడు స్వరాజ్యం పచ్చి బాలింత. ఆకలైతుంటే... అవి వండి తినేసరికి ఆలస్యమైతదని పచ్చిబియ్యం బుక్కి కడుపు నింపుకొన్నారు. ఎన్ని ఇబ్బందులొచ్చినా... ఎంచుకున్న మార్గంలో కష్టాలుంటయి మధ్యలో కంగారు పడితే లాభం లేదని బలంగా నమ్మారామె. ఏనాడూ తన మార్గం తప్పలేదు. నిజాయితీని వీడలేదు. ఎమ్మెల్యేగా మాటల తూటాలు.. సాయుధ పోరాట విరమణ తరువాత... 1978లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు స్వరాజ్యం. 5వేల ఓట్ల తేడాతో విజయం సాధించారామె. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచాక ఆమె అసెంబ్లీకి వెళ్తే... బంట్రోతు లోపలికి వెళ్లనివ్వలేదు. ‘నేను ఎమ్మెల్యేను’ అని ఆమె చెప్పుకున్నా నమ్మలేదు. అంత సాదాసీదాగా అసెంబ్లీకి వెళ్లేవారామె. చట్టసభల్లో తన బాధ్యతనూ ఉద్యమంలాగే భావించారు. ఆమె సమస్యలపై స్వరాజ్యం మాట్లాడితే...అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ‘మాటలు తూటాల లెక్కన పేలుస్తున్నవ్... ఇది బహిరంగసభ కాదు. అసెంబ్లీ’ అన్నారు. ఒక్కసారి మైక్ పట్టుకున్నారంటే అంతలా ఉండేది ఆమె వాగ్ధాటి. పోరాటం చేయని సమస్య లేదు... భూదానోద్యమంలో ఇచ్చినవి, పోరాటకాలంలో కమ్యూనిస్టులు పంచిన భూములు యూనియన్ ప్రభుత్వం వచ్చిన తరువాత మళ్లీ ఆక్రమించుకున్నరు దొరలు. ఎమ్మెల్యేగా ఉండి తిరిగి వాటిని ప్రజలకు అప్పగించడానికి రాజీలేని పోరాటం చేశారు. 900 ఎకరాల భూమిని తిరిగి ప్రజలకు అందజేశారు. ఎమ్మెల్యే పదవీ వీడాక కూడా ఆమె పోరాట పంథాను వీడలేదు. 1993లో సంపూర్ణ మద్యనిషేధంలో ఆమెది చురుకైన పాత్ర. తండ్రి ఆస్తిలో ఆడపిల్లలకు సమానహక్కు, వరకట్న వ్యతిరేక చట్టం, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్, మహిళల పేరిట భూ పంపిణీ... స్వరాజ్యం పోరాటం చేయని సమస్యే లేదు. గ్రామాల్లో తిరిగి పనిచేసినా.. తుపాకీ పట్టి గెరిల్లాగా ఉన్నా, అసెంబ్లీలో నిలబడినా ఎక్కడైనా, ఎప్పుడైనా ఆమెది పోరాటమే. దోపిడీ ఉన్నంతకాలం పోరాటం ఉంటుంది. పోరాటాలు ఉన్నంత కాలం.. మల్లు స్వరాజ్యం పేరు ఉంటుంది. -
ఐపీవోకు 2 కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: కొత్తగా రెండు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు రానున్నాయి. జాబితాలో మల్టీ స్పెషాలిటీ పిడియాట్రిక్ ఆసుపత్రుల చైన్ రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ లిమిటెడ్, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ సర్వీసుల సంస్థ ఈముద్ర చేరాయి. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి తాజాగా అనుమతులు పొందాయి. ఐపీవో చేపట్టేందుకు వీలుగా గతేడాది చివర్లో రెండు కంపెనీలు సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. ఇతర వివరాలు చూద్దాం.. రెయిన్బో చిల్డ్రన్స్ ఐపీవోలో భాగంగా హైదరాబాద్ సంస్థ రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ రూ. 280 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 2.4 కోట్ల షేర్లను వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 2,000 కోట్లకుపైగా సమకూర్చుకునే వీలుంది. యూకేకు చెందిన సీడీసీ గ్రూప్ తొలుత 1999లో చిన్నపిల్లలకు ప్రత్యేకించిన రెయిన్బో ఆసుపత్రిని హైదరాబాద్‌లో నెలకొల్పింది. ఈ ఆసుపత్రి 50 పడకలతో ఏర్పాటుకాగా.. తదుపరి కంపెనీ విస్తరణ బాటలో సాగింది. దీంతో 2021 సెప్టెంబర్‌కల్లా 1500 పడకలతో కూడిన 14 ఆసుపత్రులు, మూడు క్లినిక్‌లకు విస్తరించింది. ఈముద్ర దేశీయంగా అధికారిక సర్టిఫైయింగ్ లైసెన్స్ కలిగిన అతిపెద్ద సంస్థగా ఈముద్ర నిలుస్తోంది. 2021 మార్చికల్లా డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ మార్కెట్లో వాటాను 37.9 శాతానికి పెంచుకుంది. 2020 మార్చికల్లా ఈ వాటా 36.5 శాతంగా నమోదైంది. కాగా.. పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, పరికరాల కొనుగోలు, డేటా సెంటర్ల ఏర్పాటు వ్యయాలు తదితరాల కోసం వెచ్చించనుంది. -
ఎల్ఐసీ ఐపీవోపై ప్రభుత్వం దృష్టి
న్యూఢిల్లీ: బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ చేపట్టే బాటలో ప్రభుత్వం ప్రణాళికలకు తుదిరూపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇష్యూకి ధరల శ్రేణితోపాటు.. పాలసీదారులు, రిటైలర్లకు డిస్కౌంట్, రిజర్వ్ చేయనున్న షేర్ల సంఖ్య తదితరాలపై కసరత్తు చేస్తున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఈ వివరాలను త్వరలోనే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేయనున్నట్లు తెలియజేశాయి. అయితే రష్యా– ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తుండటంతో ప్రస్తుతం ప్రభుత్వం వేచిచూసే ధోరణిలో ఉన్నట్లు తెలియజేశాయి. ముసాయిదా పత్రాలకు సెబీ నుంచి ఆమోదముద్ర పడటంతో తుది పత్రాల(ఆర్‌హెచ్‌పీ)ను దాఖలు చేయవలసి ఉన్నట్లు పేర్కొన్నాయి. 5 శాతం వాటా: పబ్లిక్ ఇష్యూలో భాగంగా బీమా దిగ్గజం ఎల్ఐసీలో ప్రభుత్వం 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్ల షేర్లను విక్రయించే యోచనలో ఉంది. ఇందుకు వీలుగా ఫిబ్రవరి 13న ప్రాస్పెక్టస్(డీఆర్‌హెచ్‌పీ)ను దాఖలు చేయగా.. ఈ వారం మొదట్లో సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ బాటలో ఆర్హెచ్పీను సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వాధికారి ఒకరు వెల్లడించారు. 5 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం రూ. 60,000 కోట్లకుపైగా సమీకరించాలని భావిస్తోంది. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి సవరించిన రూ. 78,000 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని అందుకోవాలని చూస్తున్న సంగతి తెలిసిందే. -
ఎల్ఐసీ ఐపీవోకు సెబీ ఓకే
న్యూఢిల్లీ: బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకి మార్గం సుగమమైంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఎల్ఐసీ దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌కు సెబీ తాజాగా ఓకే చెప్పింది. వెరసి దరఖాస్తు చేసిన నెల రోజుల్లోగా ఒక కంపెనీ ఐపీవోకు అనుమతించి రికార్డు సృష్టించింది. దీంతో బీమా దిగ్గజంలో 5 శాతం వాటా విక్రయానికి ప్రభుత్వానికి వీలు చిక్కనుంది. ఎల్ఐసీ లిస్టింగ్ ద్వారా ప్రభుత్వం రూ. 63,000 కోట్లకుపైగా సమీకరించే ప్రణాళికల్లో ఉన్న సంగతి తెలిసిందే. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి(2021–22) నిర్దేశించుకున్న డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ. 78,000 కోట్లను సాధించేందుకు అవకాశమేర్పడింది. అయితే ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో ఐపీవో చేపట్టడంపై ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు అధికారిక వర్గాలు ఇప్పటికే తెలియజేశాయి. పూర్తి వాటా... ఎల్ఐసీలో ప్రభుత్వానికి 100 శాతం(దాదాపు 632.5 కోట్ల షేర్లు) వాటా ఉంది. ఐపీవోలో భాగంగా 5 శాతం వాటా(31.6 కోట్ల షేర్లు)ను విక్రయానికి ఉంచనుంది. ఎల్ఐసీ ఉద్యోగులకు, పాలసీదారులకు ఐపీవో ధరలో డిస్కౌంటును ఆఫర్ చేయనుంది. గతేడాది సెప్టెంబర్‌లో కంపెనీ అంతర్గత విలువను మిల్లిమన్ అడ్వయిజర్స్ రూ. 5.4 లక్షల కోట్లుగా మదింపు చేసింది. దీంతో రూ. 16 లక్షల కోట్ల మార్కెట్ విలువను పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్టాక్ ఎక్సే్ఛంజీలలో ఎల్ఐసీ లిస్టయితే అతిపెద్ద ఐపీవోగా రికార్డు నెలకొల్పనుంది. 2021లో రూ. 18,300 కోట్ల సమీకరణకు వచ్చిన పేటీఎమ్ ప్రస్తుతం అతిపెద్ద ఇష్యూగా నమోదైన విషయం విదితమే. అంతక్రితం 2010లో కోల్ ఇండియా రూ. 15,500 కోట్లు, 2008లో రిలయన్స్ పవర్ రూ. 11,700 కోట్లు సమీకరించడం ద్వారా భారీ ఐపీవోలుగా నిలిచాయి. -
ఎల్ఐసీ ఐపీవో వాయిదా!
న్యూఢిల్లీ: బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశముంది. రష్యా– ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తెలియజేశారు. దీంతో స్టాక్ మార్కెట్లు భారీ ఆటుపోట్లను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు ప్రస్తావించారు. దీంతో ఎల్ఐసీ వాటా విక్రయ అంశాన్ని పునఃపరిశీలించే వీలున్నట్లు తెలియజేశారు. ఒకవేళ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం(2021–22)లోనే చేపట్టేందుకు కట్టుబడితే.. ఇది ప్రగతిశీల విషయమేనని వ్యాఖ్యానించారు. అయితే ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని తెలియజేశారు. ‘2022 ఎకనమిక్స్ ఆఫ్ కాంపిటీషన్ లా’పై నిర్వహించిన ఏడో జాతీయ సదస్సులో భాగంగా పాండే ఈ విషయాలను ప్రస్తావించారు. ఈ నెల 31తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో పాండే వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ఏడాదికి సవరించిన డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ. 78,000 కోట్లను సాధించే బాటలో ప్రభుత్వం ఎల్ఐసీలో 5 శాతం వాటా విక్రయానికి ప్రణాళికలు వేసిన విషయం విదితమే. -
మార్చిలో లిస్టింగ్‌కు సన్నాహాలు...
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీని మార్చిలో లిస్టింగ్ చేసేందుకు సన్నద్ధమై ఉన్నట్లు కంపెనీ చైర్మన్ ఎంఆర్ కుమార్ తాజాగా పేర్కొన్నారు. అయితే ఇటీవల రష్యా, ఉక్రెయిన్, అమెరికా మధ్య నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నట్లు తెలియజేశారు. ఈ ఆరి్థక సంవత్సరం(2021–22) ముగిసేలోగా ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూని పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా దాడిచేయనున్న అంచనాలతో అమెరికా అప్రమత్తమైన నేపథ్యంలో కుమార్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ అనిశి్చత పరిస్థితులు తలెత్తడంతో స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తున్నాయి. మరోపక్క యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపులో సాగనున్న సంకేతాలు ఇస్తోంది. దీంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెలలో 1–18 మధ్య నికరంగా రూ. 18,856 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. వెరసి వరుసగా ఐదో నెలలోనూ అమ్మకాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితులను సునిశితంగా గమనిస్తున్న ట్లు కుమార్ తాజాగా పేర్కొన్నారు. కాగా.. ఐపీఓ ద్వారా దాదాపు రూ. 63,000 కోట్ల సమీకరణతో సరికొత్త రికార్డును సృష్టించే అవకాశం ఉంది. వీళ్లకూ డిస్కౌంట్..: ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి యోజన(పీఎంజేజేబీవై) సబ్‌్రస్కయిబర్లకు సైతం ఎల్ఐసీ ఐపీవో ధరలో డిస్కౌంటును అందించనున్నట్లు కుమార్ వెల్లడించారు. పాలసీదారులకు ఇస్తున్నట్లే వీరికీ తగ్గింపును ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 2015లో ప్రారంభమైన పీఎంజేజేబీవై పొదుపు ఖాతా కలిగిన 18–50 ఏళ్ల వయసులోపు వారికి రూ. 330 వార్షిక ప్రీమి యంతో రూ. 2 లక్షల బీమా కవరేజీ అందిస్తోంది. ఎల్ఐసీ.. ద లీడర్ బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ ప్రభుత్వ రుణ సాధనాలలో అత్యధిక స్థాయిలో ఇన్వెస్ట్ చేసిన కంపెనీగా నిలుస్తున్నట్లు స్వీస్ బ్రోకరేజీ యూబీఎస్ సెక్యూరిటీస్ తాజాగా పేర్కొంది. మొత్తం జీసెక్యూరిటీస్‌లో 19 శాతాన్ని కలిగి ఉన్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఈక్విటీలలోనూ అతిపెద్ద వాటాదారు, ఫండ్ మేనేజర్‌గానూ నిలుస్తున్నట్లు తెలియజేసింది. 520 బిలియన్ డాలర్ల విలువైన నిర్వహణలోని ఆస్తులను కలిగి ఉన్నట్లు నివేదికలో యూబీఎస్ పేర్కొంది. మొత్తం ఈక్విటీలలో 4 శాతం వాటాతో ప్రభుత్వం(ప్రమోటర్) తదుపరి ఒకేఒక అతిపెద్ద వాటాదారుగా రికార్డును నెలకొలి్పనట్లు వివరించింది. 2021 డిసెంబర్‌కల్లా బ్లూచిప్ కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో 10 శాతం, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐటీసీలలో 5 శాతం చొప్పున వాటాలను కలిగి ఉంది. వీటితోపాటు బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ, ఎస్బీఐలో 4 శాతం వాటా ఉంది. ఇక డైవర్సిఫైడ్ దిగ్గజం ఎల్‌అండ్‌టీలోనూ 4 శాతం వాటాను పొందింది. ప్రతిఏటా కుటుంబ పొదుపు రూ. 100లో రూ. 10 వరకూ ఎల్ఐసీకి చేరుతున్నట్లు తెలియజేసింది. -
మెగా ఐపీవోకి ఎల్ఐసీ రెడీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ప్రతిపాదిత మెగా పబ్లిక్ ఇష్యూ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇందుకు సంబంధించి.. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే .. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ఈ విషయం తెలిపారు. దాదాపు 5% వాటాకి సరిసమానమైన 31.63 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నట్లు వివరించారు. ఈ ఇష్యూ ద్వారా ప్రభుత్వం దాదాపు రూ. 63,000 కోట్లు సమీకరించవచ్చని మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం ..ఐపీవోలో కొంత భాగాన్ని అర్హత కలిగిన ఉద్యోగులు, పాలసీదారులకు కేటాయించనున్నారు. పబ్లిక్ ఇష్యూలో ఉద్యోగులకు కేటాయించే వాటా గరిష్టంగా 5%, పాలసీదారులకు 10%గా ఉంటుంది. నిర్దిష్ట మదింపు విధానం కింద 2021 సెప్టెంబర్ 30 ఆఖరు నాటికి ఎల్ఐసీ విలువ సుమారు రూ. 5.4 లక్షల కోట్లుగా ఉన్నట్లు అంతర్జాతీయ యాక్చువేరియల్ సంస్థ మిల్లిమన్ అడ్వైజర్స్ లెక్క వేసింది. ఐపీవో ద్వారా వచ్చే నిధులు మొత్తం ప్రభుత్వానికే వెడతాయి. పూర్తిగా ప్రభుత్వ షేర్లనే విక్రయిస్తుండటంతో ఈ ఐపీవో 100% ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపం లో ఉండనుంది. ఎల్ఐసీ కొత్తగా షేర్లను జారీ చేయదు. ‘2021 మార్చి ఆఖరు నాటి గణాంకాల ప్రకారం కొత్త ప్రీమియంల విషయంలో ఎల్ఐసీకి 66% మార్కెట్ వాటా ఉంది. అలాగే 28.3 కోట్ల పాలసీలు, 13.5 లక్షల మంది ఏజెంట్లు ఉన్నారు‘ అని పాండే పేర్కొన్నారు. అయితే, ఎల్ఐసీ మార్కె ట్ వేల్యుయేషన్ గురించి గానీ పాలసీదారులు లేదా ఎల్ఐసీ ఉద్యోగులకు గానీ ఎంత డిస్కౌంట్ ఇచ్చేదీ ప్రాస్పెక్టస్‌లో వెల్లడించలేదు. భారీ మార్కెట్ వాటా .. ప్రస్తుతం దేశీయంగా 24 జీవిత బీమా కంపెనీలు ఉండగా ప్రభుత్వ రంగంలో ఎల్ఐసీ ఒక్కటే ఉంది. అదే అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఒక్కసారి లిస్టయ్యిందంటే, మార్కెట్ క్యాపిటలైజేషన్‌పరంగా ఎల్ఐసీ దేశంలోనే అతి పెద్ద కంపెనీగా ఆవిర్భవిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఎల్ఐసీ లాభం రూ. 1,437 కోట్లుగా నమోదైంది. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనాల ప్రకారం.. 2020 గణాంకాలు బట్టి దేశీయంగా మొత్తం స్థూల ప్రీమియంలలో 64.1 శాతం వాటాతో ఎల్ఐసీ ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థగా ఉంది. ఈ వాటాల విలువ 56.405 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. తద్వారా ప్రీమియంలపరంగా ఎల్ఐసీ .. అంతర్జాతీయంగా టాప్ జీవిత బీమా సంస్థల జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఇక రెండో స్థానంలో ఉన్న ఎస్బీఐ లైఫ్‌కి 8 శాతం మార్కెట్ వాటా ఉంది. ఇలా మొదటి, రెండో స్థానాల్లోని కంపెనీల మార్కెట్ వాటాల్లో ఇంత భారీ వ్యత్యాసం ప్రపంచంలో ఎక్కడా లేదని క్రిసిల్ తెలిపింది. చైనా మార్కెట్‌కు సంబంధించి పింగ్ యాన్ ఇన్సూరెన్స్‌కు అక్కడ అత్యధికంగా 21 శాతం, రెండో స్థానంలోని చైనా లైఫ్ ఇన్సూరెన్స్‌కు 20 శాతం వాటా ఉంది. 2021 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రీమియం ప్రాతిపదికన భారత జీవిత బీమా పరిశ్రమ విలువ రూ. 5.7 లక్షల కోట్ల నుంచి రూ. 6.2 లక్షల కోట్లకు చేరింది. మార్చిలో ఇష్యూకి అవకాశం .. ఎల్ఐసీ ఐపీవోకు గతేడాది జూలైలోనే ఆమోదముద్ర వేసింది. షేర్ క్యాపిటల్‌ను రూ. 100 కోట్ల నుంచి రూ. 6,325 కోట్లకు పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఎల్ఐసీ ఐపీవోని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించుకున్న నేపథ్యంలో పబ్లిక్ ఇష్యూ మార్చిలో ఉండవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 78,000 కోట్ల నిధులు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకున్నప్పటికీ ఇప్పటిదాకా ఎయిరిండియాలో విక్రయం, ఇతర ప్రభుత్వ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ. 12,030 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎల్ఐసీలో ప్రభుత్వానికి 100 శాతం వాటాలు (632,49,97,701 షేర్లు) ఉన్నాయి. -
మార్చిలో ఎల్ఐసీ ఐపీవో
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ మార్చిలో వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను వచ్చే వారం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించనుంది. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే ఈ విషయాలు వెల్లడించారు. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ నుంచి అనుమతుల కోసం వేచిచూస్తున్నారని, అవి వచ్చాక షేర్ల విక్రయం తదితర అంశాలతో కూడిన ముసాయిదా ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) దాఖలు చేస్తారని పేర్కొన్నారు. సెబీ అనుమతులు కూడా వచ్చాక మార్చిలో లిస్టింగ్ ఇష్యూకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పాండే వివరించారు. ‘ఐఆ ర్డీఏఐ అనుమతులు వచ్చిన 7–10 రోజుల్లోగా ఎల్ఐసీ ఐపీవోకి సంబంధించి ప్రాస్పెక్టస్ దాఖలు అవుతుంది. సెబీతో ఇప్పటికే వివిధ అంశాలపై చర్చిస్తున్నాం. ఇష్యూ పరిమాణం తదితర అంశాలన్నీ డీఆర్‌హెచ్‌పీలో ఉంటాయి. ఐఆర్ఎఫ్సీ, రైల్‌టెల్ తరహాలోనే ఐపీవోలో కొంత భాగం యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయిస్తారు‘ అని ఆయన పేర్కొన్నారు. ఇష్యూలో సుమారు 10 శాతాన్ని పాలసీదారుల కోసం కేటాయించనున్నారు. ఎల్ఐసీ మెగా ఐపీవో నిర్వహణ కోసం గోల్డ్‌మన్ శాక్స్ (ఇండియా) సెక్యూరిటీస్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా తదితర 10 మర్చంట్ బ్యాంకింగ్ సంస్థలు ఎంపికయ్యాయి. ఎల్ఐసీ ఇష్యూ ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ గతేడాది జూలైలో ఆమోదముద్ర వేసింది. ఎఫ్‌డీఐ పాలసీకి మార్పులు..: ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకి సంబంధించి ఆర్థిక శాఖ అభిప్రాయాల మేరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విధానానికి తగు మార్పులు చేస్తున్నట్లు పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అనురాగ్ జైన్ తెలిపారు. సవరణలకు కేంద్ర కేబినెట్ త్వరలో ఆమోదముద్ర వేయగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సెబీ నిబంధనల ప్రకారం సాధారణంగా కంపెనీల పబ్లిక్ ఇష్యూల్లో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) షేర్లను కొనుగోలు చేయవచ్చు. కాకపోతే ఎల్ఐసీది కార్పొరేషన్ హోదా కావడంతో ఎఫ్‌పీఐలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు షేర్లను కొనుగోలు చేసేందుకు ఎఫ్‌డీఐ నిబంధనలను సడలించాల్సి ఉంటుందని జైన్ వివరించారు. టాప్ 3 బీమా బ్రాండ్‌గా ఎల్ఐసీ ఎల్ఐసీ గతేడాది దాదాపు 8.656 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 64,722 కోట్లు) బ్రాండ్ వేల్యుయేషన్‌తో పటిష్టమైన బీమా బ్రాండ్ల కేటగిరీలో ప్రపంచంలోనే మూడో స్థానంలో నిల్చింది. అలాగే బీమా రంగానికి సంబంధించి అన్ని కేటగిరీలు కలిపి.. అత్యంత విలువైన బ్రాండ్లలో 10వ స్థానం దక్కించుకుంది. లండన్‌కి చెందిన బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం 2021లో అంతర్జాతీయంగా టాప్ 100 బీమా సంస్థల విలువ 6% క్షీణించింది. అయితే, ఎల్ఐసీ బ్రాండ్ విలువ మాత్రం 2020తో పోలిస్తే 6.8% పెరిగి, దేశంలోనే అత్యంత పటిష్టమైన, అతి పెద్ద బ్రాండ్‌గా మారింది. ఈ క్రమంలో ప్రపంచంలో అత్యంత విలువైన బ్రాండ్ల జాబితాలో 238వ స్థానం నుంచి 32 స్థానాలు ఎగబాకి 206వ ర్యాంకుకు చేరింది. బ్రాండ్ ఫైనాన్స్ ప్రకారం 2022లో ఎల్ఐసీ మార్కెట్ విలువ 2022లో 59.21 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 43.40 లక్షల కోట్లు), 2027 నాటికి 78.63 బిలియన్ డాలర్లకు (రూ. 58.9 లక్షల కోట్లు) చేరవచ్చని అంచనా. బీమా బ్రాండ్లలో చైనాకు చెందిన పింగ్ యాన్ టాప్‌లో ఉంది. -
మార్చికల్లా ఎల్ఐసీ ఐపీవో
న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూని మార్చికల్లా చేపట్టే వీలున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇందుకు వీలుగా ఈ నెలాఖరుకల్లా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయనున్నట్లు తెలియజేశారు. ఈ అంశంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత వారం సంబంధిత మంత్రివర్గంలోని అత్యున్నత అధికారులతో సమీక్ష నిర్వహించడం గమనార్హం! 2021 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసిక ఆర్థిక ఫలితాలకు తుదిరూపునిస్తున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఫండ్ విభజన అంశం సైతం తుది దశకు చేరుకుంటున్నట్లు వెల్లడించాయి. ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదట్లో సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసే వీలున్నట్లు ఒక అధికారి తెలియజేశారు. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ముగిసేలోగా ఐపీవోను చేపట్టనున్నట్లు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా.. మార్చితో ముగియనున్న ఈ ఏడాదిలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వం రూ. 1.75 లక్షల కోట్ల సమీకరణ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు ఎల్ఐసీ ఐపీవో కీలకంగా నిలవనున్నట్లు పరిశ్రమ వర్గాలు వివరించాయి. -
ఏజీఎస్ ట్రాన్సాక్ట్ ఐపీవో 19న
న్యూఢిల్లీ: పేమెంట్ సొల్యూషన్స్ అందించే ఏజీఎస్ ట్రాన్సాక్ట్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 19న ప్రారంభంకానుంది. 21న ముగియనున్న ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 680 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. అయితే తొలుత రూ. 800 కోట్లు సమకూర్చుకోవాలని వేసిన ప్రణాళికలను తాజాగా సవరించుకుంది. ఐపీవోలో భాగంగా కంపెనీ ప్రమోటర్‌తోపాటు, ప్రస్తుత వాటాదారులు రూ. 680 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనున్నారు. ప్రధానంగా ప్రమోటర్ రవి బి.గోయల్ రూ. 677 కోట్లకుపైగా విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నారు. తొలుత రూ. 792 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయించాలని ప్రణాళికలు వేయడం గమనార్హం. కాగా.. కంపెనీ సమీకృత ఓమ్నీ చానల్ పేమెంట్ సొల్యూషన్స్ అందిస్తోంది. ప్రధానంగా బ్యాంకులు, కార్పొరేట్లకు డిజిటల్, నగదు ఆధారిత సొల్యూషన్స్ సమకూర్చుతోంది. ఇంతక్రితం 2015లో ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్ రూ. 1,350 కోట్ల పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తదుపరి 2018లో ఐపీవో ద్వారా రూ. 1,000 కోట్ల సమీకరణకు సెబీ నుంచి అనుమతులు పొందింది. అయితే ఈ ప్రణాళికలను అమలు చేయలేదు. -
ఐపీవో నిధుల వినియోగానికి కళ్లెం
ముంబై: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పబ్లిక్ ఇష్యూ నిధుల వినియోగంసహా మ్యూచువల్ ఫండ్ తదితర పలు విభాగాలలో నిబంధనలను సవరించింది. మంగళవారం(28న) సమావేశమైన సెబీ బోర్డు ప్రిఫరెన్షియల్ షేర్లు, ఫండ్ పథకాల నిలిపివేత, సెటిల్మెంట్ విధానాలు, కంపెనీ ఎండీ పునర్నియామకం, ఒత్తిడిలోపడ్డ రుణాలలో పెట్టుబడులు వంటి పలు మార్గదర్శకాలలో మార్పులకు తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వివరాలు చూద్దాం.. ముందస్తు అనుమతి... సెబీ తాజా సవరణలు అమలులోకి వచ్చాక కంపెనీ ఎండీ, హోల్‌టైమ్ డైరెక్టర్ లేదా మేనేజర్ ఎంపికకు ఇకపై వాటాదారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవలసి ఉంటుంది. సాధారణ వాటాదారుల సమావేశంలో తిరస్కారానికి గురైన అధికారుల ఎంపిక లేదా పునర్నియామకానికి ముందస్తు అనుమతిని పొందవలసి ఉంటుంది. ఇక మార్కెట్లను ముంచెత్తుతున్న పబ్లిక్ ఇష్యూలపైనా సెబీ దృష్టి సారించింది. 2022లో మరిన్ని కంపెనీల ఐపీవోల నేపథ్యంలో ఇష్యూ నిధుల విని యోగంపై ఆంక్షలు విధించింది. స్పష్టతలేని కంపెనీయేతర వృద్ధి అవకాశాలకు వినియోగించదలచిన నిధులకు ఇవి వర్తించనున్నాయి. కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలు ఐపీవోలో విక్రయానికి ఉంచదలచిన షేర్ల సంఖ్యపైనా పరిమితులు అమలుకానున్నాయి. యాంకర్ ఇన్వెస్టర్లకు జారీ చేసే ఈక్విటీలో 50%కి లాకిన్ పిరియడ్ 90 రోజులకు పెరగనుంది. మిగిలిన వాటాకు ప్రస్తుత 30 రోజుల గడువే అమలుకానుంది. సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించే నిధులపైనా సెబీ పర్యవేక్షణ ఉంటుంది. కొత్త టెక్ ఐపీవోలు.. ఇటీవల కొత్తతరహా టెక్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధుల సమీకరణ చేపడుతున్న నేపథ్యంలో సెబీ తాజా నిబంధనలకు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగుకు వీలుగా ఐపీవోలకు వస్తున్న కంపెనీల ధరల శ్రేణి నిర్ణయంపై ఆంక్షలు ఉండబోవని సెబీ చైర్పర్సన్ అజయ్ త్యాగి స్పష్టం చేశారు. ప్రైస్ డిస్కవరీ(ధరల నిర్ణయం) అనేది మార్కెట్ ఆధారితమని, ప్రపంచవ్యాప్తంగా ఈ విధానాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. కాగా.. సెబీ తాజా నిర్ణయాలలో భాగంగా ఒత్తిడిలోఉన్న రుణాల(ఆస్తుల)లో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రత్యేక సిట్యుయేషన్ ఫండ్స్(ఎస్‌ఎస్‌ఎఫ్‌లు)కు తెరలేవనుంది. కేవలం మొండి రుణాలలో ఇన్వెస్ట్ చేసేందుకే వీటిని ప్రత్యామ్నాయ పెట్టుబడి పథకాల(ఏఐఎఫ్‌లు)లో ఉపవిభాగం కింద అనుమతించనున్నారు. దివాలా చట్టంలో భాగంగా ఆర్బీఐ నిబంధనలు అనుమతించిన మొండి రుణాల కొనుగోలుకే ఎస్ఎస్ఎఫ్కు అవకాశముంటుంది. ఈ బాటలో ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ(ఏఆర్సీ)లు, ఒత్తిడిలోపడ్డ కంపెనీలు జారీ చేసిన సెక్యూరిటీలలోనూ బోర్డు మార్గదర్శకాలకు అనుగుణంగా ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రిఫరెన్స్ షేర్లు ప్రిఫరెన్షియల్ పద్ధతిలో షేర్ల జారీ ద్వారా నిధుల సమీకరణ చేపట్టే కంపెనీలకు ధరల నిర్ణయం, లాకిన్ వంటి అంశాలలోనూ సెబీ నిబంధలను సరళీకరించింది. వీటితోపాటు లాకిన్ పీరియడ్‌లో ఉన్నప్పటికీ ప్రిఫరెన్షియల్ పద్ధతిలో పొందిన షేర్లను ప్రమోటర్లు తనఖాలో ఉంచేందుకు నిబంధనలను సరళీకరించింది. ఇక లిక్విడిటీగల కంపెనీ ప్రిఫరెన్షియల్ ఇష్యూకి ఫ్లోర్ ధరను 90–10 రోజుల సగటు ధర కంటే అధికంగా నిర్ణయించవలసి ఉంటుంది. ఇల్లిక్విడ్ సెక్యూరిటీ విషయంలో రిజిస్టర్డ్ స్వతంత్ర విలు వ మదింపు సంస్థ ఫ్లోర్ ధరను నిర్ణయించవచ్చు. ప్రస్తుతం 2 లేదా గత 26 వారాల్లో అత్యధిక ధరను ఫ్లోర్ ధరగా నిర్ణయిస్తుండటం తెలిసిందే. ఎంఎఫ్ ఇన్వెస్టర్లు.. మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) ఇన్వెస్టర్లకు రక్షణ కల్పిస్తూ సెబీ నిబంధనలను సవరించింది. వీటి ప్రకారం ఎంఎఫ్లకు చెందిన మెజారిటీ ట్రస్టీలు ఏవైనా పథకాలను నిలిపివేయదలిస్తే యూనిట్ హోల్డర్ల నుంచి తప్పనిసరిగా అనుమతిని తీసు కోవలసి ఉంటుంది. అంతేకాకుండా 2023–24 ఆర్థిక సంవత్సరం నుంచి ఎంఎఫ్‌లు తప్పనిసరిగా దేశీ ప్రమాణాల ప్రకారం ఖాతాలను నిర్వహించవలసి వస్తుంది. ఇక సెటిల్మెంట్ దరఖాస్తులను కంపెనీలు షోకాజ్ నోటీసు జారీ అయిన 60 రోజుల్లోగా దాఖలు చేయవలసి ఉంటుంది. అంతర్గత కమిటీ సమావేశం తదుపరి సవరించిన సెటిల్మెంట్ షరతులను 15 రోజుల్లోగా తెలియజేయవలసి ఉంటుంది. తద్వారా సెటిల్మెంట్ ప్రక్రియల నిబంధనలను క్రమబద్ధీకరించింది. -
ఐపీవోకు మూడు కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: ఈ క్యాలండర్ ఏడాదిలో సెకండరీ మార్కెట్లతో పోటీ పడుతున్న ప్రైమరీ మార్కెట్ పలు అన్‌లిస్టెడ్ కంపెనీలకు ప్రోత్సాహాన్నిస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది 65 కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా ఉమ్మడిగా సుమారు రూ. 1.3 లక్షల కోట్లు సమీకరించాయి. ఈ బాటలో తాజాగా మరో మూడు సంస్థలు ఐపీవో బాట పట్టాయి. జాబితాలో స్పోర్ట్స్, అథ్లెటిక్ ఫుట్‌వేర్ కంపెనీ క్యాంపస్ యాక్టివ్‌వేర్, ట్రావెల్ సర్వీసుల సంస్థ టీబీవో టెక్ లిమిటెడ్, ఐటీ ఆధారిత సొల్యూషన్ల కంపెనీ ప్రొటియన్ ఈగోవ్ టెక్నాలజీస్ చేరాయి. ఈ మూడు కంపెనీలూ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు అనుమతిని కోరుతూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా దరఖాస్తు చేశాయి. వివరాలు చూద్దాం.. క్యాంపస్ యాక్టివ్‌వేర్ స్పోర్ట్స్, అధ్లెస్యూర్ ఫుట్‌వేర్ విభాగంలో క్యాంపస్ బ్రాండును కలిగిన క్యాంపస్ యాక్టివ్‌వేర్ నిధుల సమీకరణ సన్నాహాలు ప్రారంభించింది. ఐపీవోలో భాగంగా 5.1 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. ప్రమోటర్లు, కంపెనీ ప్రస్తుత వాటాదారులు వీటిని ఆఫర్ చేయనున్నారు. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లు హరి కృష్ణ అగర్వాల్, నిఖిల్ అగర్వాల్‌కు సంయుక్తంగా 78.21 శాతం వాటా ఉంది. 2005లో ప్రారంభమైన క్యాంపస్ బ్రాండు విలువరీత్యా ఆర్గనైజ్డ్ మార్కెట్లో 15 శాతం వాటాను కలిగి ఉంది. టీబీవో టెక్ ట్రావెల్ సర్వీసుల కంపెనీ టీబీవో టెక్ లిమిటెడ్ ఐపీవో ద్వారా రూ. 2,100 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఇందుకు వీలుగా రూ. 900 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. మరో రూ. 1,200 కోట్ల విలువైన ఈక్విటీని ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. తాజా ఈక్విటీ నిధులను వ్యూహాత్మక కొనుగోళ్లు, క్రయవిక్రయాల ప్లాట్‌ఫామ్ అభివృద్ధి, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. ప్రొటియన్ ఈగోవ్ గతంలో ఎన్ఎస్డీఎల్ ఈ గవర్నెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా వ్యవహరించిన ప్రొటియన్ ఈగోవ్ టెక్నాలజీస్ నిధుల సమీకరణకు సిద్ధపడుతోంది. దీనిలో భాగంగా పబ్లిక్ ఇష్యూ ద్వారా 1.2 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ చేయనుంది. 1995లో ప్రారంభమైన ప్రభుత్వంతో చేతులు కలపడం ద్వారా గ్రీన్‌ఫీల్డ్ టెక్నాలజీ సొల్యూషన్లను అందిస్తోంది. ఐటీ ఆధారిత సేవల ఈ కంపెనీ జాతీయస్థాయిలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్తతరహా ప్రజాసంబంధ ఈగవర్నెన్స్ సొల్యూషన్లు సమకూరుస్తోంది. -
ఐపీవోలకు గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మూడు కంపెనీలు దాఖలు చేసిన పబ్లిక్ ఇష్యూ ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో ట్రావెల్ ప్లాట్‌ఫామ్ ఇక్సిగో నిర్వాహక కంపెనీ లే ట్రావెన్యూస్ టెక్నాలజీ లిమిటెడ్, కార్డియాక్ స్టెంట్ల తయారీ సంస్థ సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్, ఆహారం, పానీయాల సంస్థ కెవెంటర్ ఆగ్రో ఉన్నాయి. ► పబ్లిక్ ఇష్యూ ద్వారా ఇక్సిగో రూ. 1,600 కోట్లు సమీకరించే ప్రణాళికలు వేసింది. తాజా ఈక్విటీ నిధులను ఇతర కంపెనీల కొనుగోళ్లు, కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ► ఐపీవో ద్వారా సహజానంద్ మెడికల్ రూ. 1,500 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ► పబ్లిక్ ఇష్యూలో భాగంగా కెవెంటర్ ఆగ్రో రూ. 350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 1.07 కోట్లకుపైగా షేర్లను మండాలా స్వీడే ఎస్పీవీ విక్రయానికి ఉంచనుంది. తాజా ఈక్విటీ నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలకు వెచ్చించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కెవెంటర్ ఆగ్రో పేర్కొంది. -
గో ఫ్యాషన్ ఐపీవోకు భారీ స్పందన
న్యూఢిల్లీ: మహిళల దుస్తుల బ్రాండ్ గో కలర్స్ మాతృ సంస్థ గో ఫ్యాషన్ ఇండియా పబ్లిక్ ఇష్యూకు (ఐపీవో) భారీ స్పందన లభించింది. బుధవారం ప్రారంభమైన కొద్ది గంటల్లోనే 2.46 రెట్లు సబ్స్క్రిప్షన్ నమోదైంది. నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్ఎస్ఈ) డేటా ప్రకారం 80.79 లక్షల షేర్లను ఆఫర్ చేస్తుండగా 1.99 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్ల (ఆర్ఐఐ) విభాగంలో భారీ డిమాండ్ కనిపించింది. ఇది 12.14 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. ఐపీవో ద్వారా గో ఫ్యాషన్ రూ. 1,013.6 కోట్లు సమీకరిస్తోంది. ఇష్యూకి షేరు ధర శ్రేణి రూ. 655–690గా ఉంది. సమీకరించే నిధుల్లో కొంత భాగాన్ని 120 ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ల ఏర్పాటు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు మొదలైన వాటి కోసం కంపెనీ వినియోగించుకోనుంది. గో కలర్స్ బ్రాండ్ కింద మహిళలకు సంబంధించిన చుడీదార్లు, లెగ్గింగ్‌లు మొదలైన వాటిని గో ఫ్యాషన్ విక్రయిస్తోంది. -
నాలుగు లిస్టింగ్‌లు... రెండు ఐపీవోలు
నాలుగు లిస్టింగ్‌లు.., రెండు పబ్లిక్ ఇష్యూల ప్రారంభంతో ఈ వారం దలాల్ స్ట్రీట్ కళకళలాడనుంది. పేటీఎంతో సహా మొత్తం నాలుగు కంపెనీల షేర్లు ఈ వారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఇందులో నేడు పీబీ ఫిన్‌టెక్, సిగాచీ ఇండస్ట్రీస్, ఎస్‌జేఎస్ ఎంటర్ప్రైజెస్ షేర్ల లిస్టింగ్ కార్యక్రమం ఉంది. ఈ మూడు కంపెనీలు ప్రాథమిక మార్కెట్ నుంచి రూ.6,550 కోట్ల సమీకరించాయి. దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసుకున్న పేటీఎం షేర్లు గురువారం లిస్ట్ కానున్నాయి. ఇదే వారంలో టార్సన్స్ ప్రొడక్ట్స్, గో ఫ్యాషన్లు కంపెనీలు ఐపీవో ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. ల్యాబొరేటరీ ఉపకరణాల తయారీ సంస్థ టార్సన్స్ ప్రొడక్ట్స్ పబ్లిక్ ఇష్యూ నేడు ప్రారంభం కానుంది. బుధవారం (నవంబర్ 17)తో ముగిసే ఐపీవో ద్వారా కంపెనీ రూ.1,023 కోట్లను సమీకరించనుంది. గో ఫ్యాషన్ ఇండియా పబ్లిక్ ఇష్యూ బుధవారం మొదలవుతుంది. వచ్చే సోమవారం(22వ తేదీ)తో ముగిసే ఇష్యూ ద్వారా రూ.1,014 కోట్లను సమీకరించనుంది. ఇందుకు రూ. 655–690 ధరల శ్రేణిని ప్రకటించింది. -
సఫైర్ ఫుడ్స్ ఐపీవో సక్సెస్
న్యూఢిల్లీ: కేఎఫ్‌సీ, పిజ్జా హట్ ఔట్లెట్ల నిర్వాహక కంపెనీ సఫైర్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్ చేపట్టిన పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. రూ. 1,120–1,180 ధరల శ్రేణిలో వచ్చిన ఇష్యూ చివరి రోజు గురువారానికల్లా 6.6 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. ఐపీవోలో భాగంగా కంపెనీ 96,63,468 షేర్లను ఆఫర్ చేయగా.. 6.39 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. తద్వారా కంపెనీ రూ. 2,073 కోట్లు సమకూర్చుకోనుంది. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 7.5 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల కోటాలో 3.46 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. రిటైల్ ఇన్వెస్టర్లు సైతం 8.7 రెట్లు అధికంగా బిడ్స్ వేశారు. సోమవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 933 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. మొత్తం 1.75 కోట్ల షేర్ల వరకూ విక్రయానికి ఉంచింది. గో ఫ్యాషన్ రెడీ ఈ నెల 17 నుంచి గో ఫ్యాషన్ ఇండియా లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ప్రారంభంకానుంది. గో కలర్స్ బ్రాండుతో మహిళా దుస్తులను తయారు చేస్తున్న కంపెనీ తద్వారా రూ. 800 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ఇష్యూ 22న ముగియనుంది. ఐపీవోలో భాగంగా రూ. 125 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో 1.28 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనుంది. -
నైకా లిస్టింగ్ బంపర్ హిట్.. ఒక్కరోజులోనే లక్ష కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటల్
ముంబై: సౌందర్య, సంరక్షణ ఉత్పత్తుల ఈ–కామర్స్ వేదిక ‘నైకా’ లిస్టింగ్‌లో అదరగొట్టింది. బీఎస్ఈలో ఇష్యూ ధర రూ.1,125తో పోలిస్తే 80 శాతం ప్రీమియంతో రూ.2,018 వద్ద లిస్ట్ అయ్యింది. స్టాక్ మార్కెట్ అమ్మకాల ఒత్తిడిలో ట్రేడ్ అవుతున్నప్పటి.., ఈ షేరుకు ఏ మాత్రం డిమాండ్ తగ్గలేదు. ఓ దశలో ఏకంగా 100% శాతం దూసుకెళ్లి రూ.2,248 స్థాయిని అందుకుంది. చివర్లో అతి స్వల్ప లాభాల స్వీకరణ జరగడంతో 96 శాతం లాభంతో రూ.2,206 ట్రేడింగ్‌ను ముగిచింది. బీఎస్ఈ ఎక్సే్చంజీలో మొత్తం 3.43 కోట్ల షేర్లు చేతులు మారాయి. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ మార్కెట్ విలువ లక్ష కోట్ల పైన రూ.1.04 లక్షల వద్ద స్థిరపడింది. తద్వారా దేశీయ ఎక్సే్చంజీల్లోని లిస్టెడ్ కంపెనీల్లో 55వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ–కామర్స్ విభాగంలో ఈ స్థాయి లాభాలతో ఎక్సే్చంజీల్లో లిస్టయిన తొలి కంపెనీ ఇది. నైకా బంపర్ లిస్టింగ్ ఊతంతో కంపెనీ వ్యవస్థాపకురాలు ఫల్గుణీ నాయర్ కుటుంబ సంపద ఏకంగా 7.5 బిలియన్ డాలర్లకు ఎగిసింది. కంపెనీలో ప్రమోటర్ కుటుంబానికి 54.22% వాటాలు ఉన్నాయి. క్లోజింగ్ ధర ప్రకారం వీటి విలువ సుమారు 55,900 కోట్లు (7.5 బిలియన్ డాలర్లు). చదవండి: వాట్ ఏ టెర్రిఫిక్ స్టోరీ - మంత్రి కేటీఆర్ -
పేటీఎం ఐపీవోకు ఇన్వెస్టర్ల క్యూ..
ముంబై: డిజిటల్ చెల్లింపు సేవల దిగ్గజం పేటీఎం ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) 1.89 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ 4.83 కోట్ల షేర్లను పబ్లిక్ ఇష్యూలో విక్రయానికి ఉంచగా, స్టాక్ ఎక్సే్చంజీల గణాంకాల ప్రకారం 9.14 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం సత్వరం ఓవర్ సబ్‌స్క్రైబ్ కాగా, ఇష్యూ ఆఖరు రోజైన బుధవారం నాడు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) సహా సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా భారీగా రంగంలోకి దిగారు. దీంతో వారికి కేటాయించిన షేర్లకు 2.79 రెట్లు బిడ్లు వచ్చాయి. దీంతో వచ్చే వారం పేటీఎం లిస్టింగ్ భారీగా ఉండనుందని అంచనాలు నెలకొన్నాయి. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయర్స్ (క్యూఐబీ)కు 2.63 కోట్ల షేర్లను కేటాయించగా, 7.36 కోట్ల షేర్లకు బిడ్స్ వచ్చాయి. ఇక రిటైల్ ఇన్వెస్టర్లకు 87 లక్షల షేర్లు ఆఫర్ చేయగా ఈ విభాగం 1.66 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. నవంబర్ 15న షేర్లను అలాట్ చేయనుండగా, 18న లిస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. లిస్టింగ్ రోజున పేటీఎం దాదాపు 20 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.50 లక్షల కోట్లు) పైగా వేల్యుయేషన్ దక్కించుకోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. కోల్ ఇండియాను మించిన ఇష్యూ.. ఇప్పటిదాకా దేశీయంగా అత్యంత భారీ ఐపీవోగా కోల్ ఇండియా పబ్లిక్ ఇష్యూనే ఉంది. కోల్ ఇండియా దాదాపు దశాబ్దం క్రితం రూ. 15,000 కోట్లు సమీకరించింది. ప్రస్తుతం పేటీఎం ఐపీవో విలువ దాన్ని మించి ఏకంగా రూ. 18,300 కోట్లుగా ఉంది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ. 1.39 లక్షల కోట్ల వేల్యుయేషన్‌తో.. షేరు ధర శ్రేణి రూ. 2,080 – 2,150గా కంపెనీ నిర్ణయించింది. విజయ్ శేఖర్ శర్మ 2000లో వన్97 కమ్యూనికేషన్స్‌ని (పేటీఎం మాతృ సంస్థ) ప్రారంభించారు. దాదాపు దశాబ్దం క్రితం మొబైల్ రీచార్జి, డిజిటల్ చెల్లింపు సేవల సంస్థగా ఏర్పాటైన పేటీఎం .. 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతర్జాతీయ దిగ్గజ ఇన్వెస్టర్లు యాంట్ గ్రూప్, సాఫ్ట్ బ్యాంక్ మొదలైన వాటికి ఇందులో పెట్టుబడులు ఉన్నాయి. సఫైర్ ఫుడ్స్‌కు 1.07 రెట్ల స్పందన న్యూఢిల్లీ: కేఎఫ్‌సీ, పిజా హట్ అవుట్‌లెట్స్ నిర్వహణ సంస్థ సఫైర్ ఫుడ్స్ ఇండియా పబ్లిక్ ఇష్యూ రెండో రోజున పూర్తి స్థాయిలో సబ్‌స్క్రైబ్ అయింది. 96.63 లక్షల షేర్లను ఆఫర్ చేస్తుండగా 1.03 కోట్ల షేర్లకు (1.07 రెట్లు) బిడ్స్ వచ్చినట్లు ఎన్ఎస్ఈ గణాంకాల్లో వెల్లడైంది. రిటైల్ వ్యక్తిగత ఇన్వెస్టర్ల (ఆర్ఐఐ) విభాగం 5.38 రెట్లు, సంస్థాగతయేతర ఇన్వెస్టర్ల విభాగం 29 శాతం, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయర్స్ (క్యూఐబీ) విభాగం 3 శాతం మేర సబ్‌స్క్రైబ్ అయ్యాయి. ఈ ఇష్యూ ద్వారా సఫైర్ ఫుడ్స్ రూ. 2,073 కోట్లు సమీకరిస్తోంది. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 933 కోట్లు సమీకరించింది. ఐపీవో ధరల శ్రేణి షేరు ఒక్కింటికి రూ. 1,120–1,180గా కంపెనీ నిర్ణయించింది. మార్చి 31 నాటికి సఫైర్ ఫుడ్స్ భారత్, మాల్దీవుల్లో 204 కేఎఫ్‌సీ రెస్టారెంట్లను.. భారత్, శ్రీలంక, మాల్దీవుల్లో 231 పిజా హట్ రెస్టారెంట్లను, శ్రీలంకలో రెండు టాకో బెల్ రెస్టారెంట్లను నిర్వహిస్తోంది. -
పేటీఎమ్ మెగా ఐపీవో రెడీ
కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్లతో పోటీ పడుతున్న ప్రైమరీ మార్కెట్ వచ్చే వారం మరింత స్పీడందుకోనుంది. డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్‌సహా మూడు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టనున్నాయి. వెరసి సెకండరీ మార్కెట్ మరింత కళకళలాడనుంది. న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లలో వచ్చే వారం ఐపీవోల సందడి నెలకొననుంది. పేటీఎమ్ బ్రాండుతో డిజిటల్ సేవలందిస్తున్న వన్97 కమ్యూనికేషన్స్‌తోపాటు.. కేఎఫ్‌సీ, పిజ్జా హట్ ఔట్లెట్ల నిర్వాహక కంపెనీ సఫైర్ ఫుడ్స్, ఐటీ సర్వీసుల సంస్థ లేటెంట్ వ్యూ అనలిటిక్స్ పబ్లిక్ ఇష్యూలకు తెరలేవనుంది. మూడు కంపెనీల ఇష్యూలనూ కలిపితే రూ. 21,000 కోట్లను సమకూర్చుకునే అవకాశముంది. కాగా.. ఈ వారం ఎఫ్ఎస్ఎన్ ఈకామర్స్ వెంచర్స్, నైకా, ఫినో పేమెంట్స్ బ్యాంక్, పీబీ ఫిన్‌టెక్(పాలసీబజార్), ఎస్‌జేఎస్ ఎంటర్ప్రైజెస్, సిగాచీ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూలను చేపట్టిన సంగతి తెలిసిందే. పేటీఎమ్ ఐపీవో సోమవారం(8న) ప్రారంభమై బుధవారం(10న) ముగియనుంది. సఫైర్ ఫుడ్స్ ఐపీవో 9–11 మధ్య, లేటెంట్ వ్యూ అనలిటిక్స్ 10–12 మధ్య పబ్లిక్ ఇష్యూలను చేపట్టనున్నాయి. పేటీఎమ్ జోరు ఐపీవో ద్వారా వన్97 కమ్యూనికేషన్స్ రూ. 18,300 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇందుకు షేరుకి రూ. 2,080–2,150 ధరల శ్రేణిని నిర్ణయించింది. ఇష్యూలో భాగంగా రూ. 8,300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో రూ. 10,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. దీంతో కంపెనీ విలువ రూ. 1.48 లక్షల కోట్లను తాకనుంది. ఐపీవో విజయవంతమైతే.. కోల్ ఇండియా తదుపరి రెండో పెద్ద ఇష్యూగా నిలవనుంది. ఇంతక్రితం 2010లో కోల్ ఇండియా అత్యధికంగా రూ. 15,200 కోట్లు సమకూర్చుకుంది. బుధవారం పేటీఎమ్ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 8,235 కోట్లు సమీకరించింది. సఫైర్ ఫుడ్స్ ఇలా ఐపీవోకు రూ. 1,120–1,180 ధరల శ్రేణిని సఫైర్ ఫుడ్స్ ప్రకటించింది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు, కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్‌చేసిన సంస్థలు 1.757 కోట్ల షేర్లను ఆఫర్ చేయనున్నాయి. తద్వారా రూ. 2,073 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. సఫైర్ ఫుడ్స్ మారిషస్ 55.69 లక్షలు, డబ్ల్యూడబ్ల్యూడీ రూబీ 48.46 లక్షలు, అమెథిస్ట్ 39.62 లక్షలు, క్యూఎస్ఆర్ మేనేజ్మెంట్ ట్రస్ట్ 8.5 లక్షల షేర్లు చొప్పున విక్రయానికి ఉంచనున్నాయి. లేటెంట్ వ్యూ అనలిటిక్స్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా లేటెంట్ వ్యూ అనలిటిక్స్ రూ. 474 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో రూ. 126 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయించనున్నారు. ఐపీవోకు రూ. 190–197 ధరల శ్రేణిని ప్రకటించింది. తద్వారా రూ. 600 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. ప్రమోటర్ వి.వెంకటరామన్ రూ. 60.14 కోట్లు, వాటాదారుడు రమేష్ హరిహరన్ రూ. 35 కోట్లు, గోపీనాథ్ కోటీశ్వరన్ రూ. 23.52 కోట్ల విలువైన వాటాలను ఆఫర్ చేయనున్నారు. 46 కంపెనీలు ఈ కేలండర్ ఏడాది(2021)లో ఇప్పటివరకూ 46 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచ్చాయి. తద్వారా ఉమ్మడిగా రూ. 80,102 కోట్లను సమీకరించాయి. ఏడాది పూర్తయ్యేసరికి ప్రైమరీ మార్కెట్ ద్వారా నిధుల సమీకరణ రూ. లక్ష కోట్లను మించగలదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది(2020)లో ఐపీవోల ద్వారా 15 కంపెనీలు కేవలం రూ. 26,611 కోట్లు సమకూర్చుకున్నాయి. గతంలో 2017లో మాత్రమే ఈ స్థాయిలో 36 కంపెనీలు ప్రైమరీ మార్కెట్ ద్వారా రూ. 67,147 కోట్లను అందుకోవడం ద్వారా రికార్డు నెలకొల్పాయి! -
పీబీ ఫిన్‌టెక్ ఐపీవో నవంబర్ 1న ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ బీమా ప్లాట్‌ఫాం పాలసీబజార్, రుణాలకు సంబంధించిన పోర్టల్ పైసాబజార్‌ల మాతృ సంస్థ పీబీ ఫిన్‌టెక్ తాజాగా తమ పబ్లిక్ ఇష్యూ వివరాలను ప్రకటించింది. ప్రతిపాదిత ఐపీవో నవంబర్ 1న ప్రారంభమై 3న ముగుస్తుంది. షేరు ధర శ్రేణి రూ. 940–980గా ఉంటుందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ యశీష్ దహియా వర్చువల్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ ఇష్యూ ద్వారా సుమారు రూ. 5,710 కోట్లు సమీకరించనున్నట్లు తెలిపారు. ఇన్వెస్టర్లు కనీసం 15 షేర్ల కోసం బిడ్ చేయాల్సి ఉంటుంది. ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను తమ బ్రాండ్లకు మరింత ప్రాచుర్యం కల్పించడానికి, వ్యాపార వృద్ధి అవకాశాలు మెరుగుపర్చుకోవడానికి, ఆఫ్‌లైన్‌లో కూడా విస్తరించడానికి వినియోగించుకోనున్నట్లు దహియా పేర్కొన్నారు. అలాగే వ్యూహాత్మక పెట్టుబడులు .. కొనుగోళ్లకు, విదేశాల్లోనూ విస్తరణ ప్రణాళికల కోసం కూడా కొంత మేర నిధులు ఉపయోగించుకోనున్నట్లు ఆయన వివరించారు. ఇష్యూలో భాగంగా కొత్తగా రూ. 3,750 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా, ప్రస్తుత షేర్హోల్డర్లు దాదాపు రూ. 1,960 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రయించనున్నారు. ఇష్యూలో భాగంగా 75 శాతం భాగాన్ని అర్హత గల సంస్థాగత ఇన్వెస్టర్లకు, 15 శాతాన్ని సంస్థాగతయేతర ఇన్వెస్టర్లకు, 10 శాతాన్ని రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించనున్నారు. -
పేటీఎమ్ ఐపీవోకు సెబీ ఓకే
న్యూఢిల్లీ: డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం పేటీఎమ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ను పొందినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గోప్యత పాటించే షరతుతో అనుమతించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెలాఖరుకల్లా పేటీఎమ్ ఐపీవోకు వచ్చే వీలున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఐపీవో ద్వారా రూ. 16,600 కోట్లు సమీకరించాలని పేటీఎమ్ మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ భావిస్తోంది. వెరసి దేశీ ప్రైమరీ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఇష్యూగా నిలిచే వీలుంది. ఇంతక్రితం 2010లో పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియా రూ. 15,200 కోట్ల సమీకరణ ద్వారా భారీ ఐపీవోగా రికార్డ్ సాధించింది. కాగా.. వేగవంత లిస్టింగ్‌కు వీలుగా ఐపీవోకు ముందు నిర్వహించే(ప్రీఐపీవో) షేర్ల విక్రయాన్ని రద్దు చేసుకునే యోచనలో పేటీఎమ్ ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ విలువ నిర్ధారణలో వ్యత్యాసాలు ఇందుకు కారణంకాదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. రూ. 1.47–1.78 లక్షల కోట్ల విలువను పీటీఎమ్ ఆశిస్తోంది. యూఎస్ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫైనాన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న విలువ మదింపు నిపుణులు అశ్వథ్ దామోదరన్ తాజాగా పేటీఎమ్ అన్‌లిస్టెడ్ షేర్లకు ఒక్కొక్కటీ రూ. 2,950 చొప్పున విలువను అంచనా వేయడం గమనార్హం! పబ్లిక్ ఇష్యూలో భాగంగా పేటీఎమ్ రూ. 8,300 కోట్ల విలువైన తాజా ఈక్వి టీని జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 8,300 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనుంది. -
మార్కెట్ రన్.. ఐపీఓలు ధనాధన్!
కొద్ది నెలలుగా సెకండరీ మార్కెట్ రేసు గుర్రంలా దౌడు తీస్తోంది. దీంతో మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 61,000 పాయింట్ల మైలురాయినీ అధిగమించింది. ఈ ప్రభావంతో మరోపక్క ప్రైమరీ మార్కెట్ సైతం స్పీడందుకుంది. ఇప్పటికే ఈ ఏడాది పలు కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కాగా.. మరిన్ని సంస్థలు పబ్లిక్ ఇష్యూలకు సై అంటున్నాయి. వెరసి 2017లో ప్రైమరీ మార్కెట్ సాధించిన నిధుల సమీకరణ రికార్డ్ తుడిచిపెట్టుకుపోనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముంబై: గతేడాదిని మించుతూ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22)లోనూ పలు సుప్రసిద్ధ కంపెనీలు ఐపీవో బాట పట్టాయి. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేస్తున్నాయి. ఇప్పటికే స్టాక్ ఎక్సే్ఛంజీలలో జొమాటోసహా పలు కంపెనీలు విజయవంతంగా లిస్ట్‌కాగా.. ఇకపైనా మరిన్ని సంస్థలు ప్రైమరీ మార్కెట్ తలుపు తట్టనున్నాయి. తద్వారా భారీ స్థాయిలో నిధుల సమీకరణకు సిద్ధపడుతున్నాయి. సుమారు 35 కంపెనీలు క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో పబ్లిక్ ఇష్యూలకు రానున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఉమ్మడిగా ఈ కంపెనీలు రూ. 80,000 కోట్లను సమకూర్చుకోనున్నట్లు అంచనా వేశారు. ఫలితంగా 2017లో ఐపీవోల ద్వారా 35 కంపెనీలు ఉమ్మడిగా సమీకరించిన రూ. 67,147 కోట్ల రికార్డు మరుగున పడనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇక బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ సైతం ఈ ఏడాదిలో లిస్టింగ్‌ను సాధిస్తే చరిత్రాత్మక రికార్డు నమోదవుతుందని తెలియజేశారు. పేటీఎమ్ భారీగా.. ఈ ఏడాది మూడో త్రైమాసికం(క్యూ3)లో పలు ప్రయివేట్ కంపెనీలు పబ్లిక్ లిమిటెడ్‌గా ఆవిర్భవించనున్నాయి. మార్కెట్లు నిలకడగా కొనసాగితే డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్‌సహా 35 కంపెనీలు ఐపీవోలను చేపట్టనున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. క్యూ3లో ఐపీవోకు రానున్న జాబితాలో రూ. 16,600 కోట్ల సమీకరణ లక్ష్యాన్ని ప్రకటించిన పేటీఎమ్ను ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. అధిక స్థాయిలో నిధులను ఆశిస్తున్న ఇతర కంపెనీలలో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్(రూ. 7,300 కోట్లు), స్టార్ హెల్త్ అండ్ అల్లీడ్ ఇన్సూరెన్స్(రూ.7,000 కోట్లు), పాలసీ బజార్ (రూ. 6,000 కోట్లు), ఎమ్క్యూర్ ఫార్మా(రూ. 5,000 కోట్లు), వంటనూనెల దిగ్గజం అదానీ విల్మర్(రూ. 4,500 కోట్లు), బ్యూటీ ప్రొడక్టుల సంస్థ నైకా(రూ. 4,000 కోట్లు), పెన్నా సిమెంట్స్ తదితరాలున్నాయి. 14 కంపెనీలు రెడీ క్యూ3లో లిస్టింగ్ బాట పట్టనున్న ఇతర సంస్థలలో పారదీప్ ఫాస్ఫేట్స్, వేదాంత్ ఫ్యాషన్స్, సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్, నార్తర్న్ ఆర్క్ సైతం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సంస్థలు రూ. 2,000–2,500 కోట్ల స్థాయిలో నిధుల సమీకరణ చేపట్టే వీలున్నట్లు తెలియజేశాయి. ఇప్పటికే 14 కంపెనీలు సెబీ నుంచి అనుమతులు సైతం పొందాయి. వీటిలో పారదీప్ ఫాస్ఫేట్స్, గో ఎయిర్‌లైన్స్, రుచీ సోయా ఇండస్ట్రీస్, ఆరోహణ్ ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఉత్కర్‡్ష స్మాల్ ఫైనాన్స్, ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ చేరాయి. ఇవి రూ. 22,000 కోట్లు సమకూర్చుకునే అవకాశముంది. ఈ బాటలో ఇప్పటికే మరో 64 కంపెనీలు సెబీ వద్ద ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయడం గమనార్హం! నాణ్యమైన కంపెనీలు చేపట్టే ఐపీవోల కోసం కొంతమంది ఇన్వెస్టర్లు సెకండరీ మార్కెట్లో అమ్మకాలు చేపట్టే అవకాశమున్నట్లు ఈ సందర్భంగా మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఎల్ఐసీ వంటి భారీ ఇష్యూల సమయంలో సెకండరీ మార్కెట్లో కొంతమేర లిక్విడిటీ కొరత నెలకొనవచ్చని వివరించారు. 6 కంపెనీలకు సెబీ ఓకే పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఆరు కంపెనీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. జాబితాలో నైకా, అదానీ విల్మర్, స్టార్ హెల్త్ అండ్ అల్లీడ్ ఇన్సూరెన్స్, పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్, లేటెంట్ వ్యూ అనలిటిక్స్, సిగాచీ ఇండస్ట్రీస్ చేరాయి. ఈ కంపెనీలన్నీ ఐపీవో ద్వారా నిధులు సమీకరించేందుకు అనుమతించమంటూ సెబీకి ఈ ఏడాది మే– ఆగస్ట్ మధ్యకాలంలో దరఖాస్తు చేశాయి. వీటికి ఈ నెల 11–14 మధ్య అనుమతులు మంజూరయ్యాయి. మరోవైపు ఐఎల్ఎస్ హాస్పిటల్స్ నిర్వాహక సంస్థ జీపీటీ హెల్త్‌కేర్ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు అనుమతించమంటూ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 450–500 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలుస్తోంది. పెన్నా సిమెంట్స్ రూ1,300 కోట్లు... పబ్లిక్ ఇష్యూలో భాగంగా హైదరాబాద్ కంపెనీ పెన్నా సిమెంట్స్ రూ. 1,300 కోట్ల విలువైన తాజా ఈక్విటీని జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్ మరో రూ. 250 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నారు. కాగా.. ఐపీవోలో భాగంగా లేటెంట్ వ్యూ అనలిటిక్స్ రూ. 474 కోట్ల విలువైన తాజా ఈక్విటీని జారీ చేయనుంది. ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు మరో రూ. 126 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. ఈ బాటలో సెల్యులోజ్ ఆధారిత ప్రొడక్ట్ తయారీ కంపెనీ సిగాచీ ఇండస్ట్రీస్ ఐపీవోకింద 76.95 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. -
9 నెలల్లో రెండు దశాబ్దాల రికార్డ్
న్యూఢిల్లీ: బుల్లిష్‌గా ఉన్న ఇన్వెస్టర్ల సెంటిమెంటును ప్రతిబింబిస్తూ దేశీ ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. ఈ కేలండర్ ఏడాది(2021) తొలి 9 నెలల్లో 72 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచ్చాయి. తద్వారా జనవరి– సెపె్టంబర్ మధ్య కాలంలో 970 కోట్ల డాలర్ల(రూ. 72,500 కోట్లు)ను సమీకరించాయి. వెరసి రెండు దశాబ్దాల తదుపరి అత్యధిక పెట్టుబడులను సమకూర్చుకున్నాయి. ఇందుకు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో నెలకొన్న ప్రోత్సాహకర పరిస్థితులు దోహదం చేసినట్లు కన్సలి్టంగ్ కంపెనీ ఈవై తాజాగా రూపొందించిన నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం గ్లోబల్ ట్రెండ్ మద్దతుతో దేశీయంగా క్యూ3(జులై–సెపె్టంబర్)లో లావాదేవీల సంఖ్య మరింత జోరందుకుంది. 72 ఐపీవోలలో డైవర్సిఫైడ్ ఇండ్రస్టియల్ ప్రొడక్టుల విభాగం నుంచి 15, కన్జూమర్ ప్రొడక్ట్స్ రిటైల్ విభాగం నుంచి 11 చొప్పున కంపెనీలు నిధులను సమీకరించాయి. 31 ఐపీవోలు సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 31 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. తద్వారా 5 బిలియన్ డాలర్లను సమకూర్చుకున్నాయి. వీటిలో డైవర్సిఫైడ్ ఇండ్రస్టియల్ ప్రొడక్టుల నుంచి 8 కంపెనీలు, టెక్నాలజీ విభాగం నుంచి 5 సంస్థలు పెట్టుబడులను సమీకరించాయి. ఈ రంగాల నుంచి జొమాటో, నువోకో విస్టాస్ కార్ప్, కెమ్‌ప్లాస్ట్ సన్మార్ భారీ ఇష్యూలను చేపట్టాయి. 2017 నాలుగో త్రైమాసికం తదుపరి దేశీ మార్కెట్లో ఈ క్యూ3 అత్యధిక లావాదేవీలకు నెలవైనట్లు ఈవై నిపుణులు ప్రశాంత్ సింఘాల్ తెలియజేశారు. కాగా.. ఇంతక్రితం 2018 తొలి 9 నెలల్లో ప్రైమరీ మార్కెట్ ద్వారా 130 కంపెనీలు నిధులను అందుకున్నాయి. అక్టోబర్–డిసెంబర్(క్యూ4)లోనూ కొత్తతరం, టెక్నాలజీ ఆధారిత కంపెనీలు ఐపీవోలకు రానున్నట్లు సింఘాల్ పేర్కొన్నారు. రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల సెన్సెక్స్ 60,000 పాయింట్ల మార్క్‌ను సైతం అధిగమించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా జులై–సెపె్టంబర్లో 2020 క్యూ3తో పోలిస్తే డీల్స్ 11 శాతం అధికమయ్యాయి. 2007లో నమోదైన గరిష్ట డీల్స్‌తో పోలిస్తే మరింత అధికంగా 18 శాతం పుంజుకున్నాయి. 2021 క్యూ3లో 547 ఐపీవోల ద్వారా కంపెనీలు 106.3 బిలియన్ డాలర్లు సమకూర్చుకున్నాయి. తొలి 9 నెలల్లో చూస్తే 1,635 కంపెనీలు 331 బిలియన్ డాలర్ల విలువైన పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఇది కంపెనీలలో 87 శాతం, పెట్టుబడుల సమీకరణలో 99 శాతం వృద్ధి. తొలి 9 నెలల్లో ప్రపంచవ్యాప్త ఐపీవో సమీకరణ నిధుల్లో 3 శాతం(9.7 బిలియన్ డాలర్లు) వాటాను దేశ మార్కెట్ ఆక్రమించింది. ఐపీవోల సంఖ్యలో అయితే 4.4 శాతానికి చేరింది. ఇక గ్లోబల్ మార్కెట్లలోనూ 2020 పూర్తి ఏడాదితో పోలిస్తే క్యూ3లో డీల్స్తోపాటు, నిధుల సమీకరణ అత్యధికంగా నమోదుకావడం విశేషం! -
2 నెలల్లో 30 కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: కొద్ది నెలలుగా సందడి చేస్తున్న ప్రైమరీ మార్కెట్ మరోసారి కళకళలాడనుంది. రానున్న రెండు నెలల్లో కనీసం 30 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టనున్నాయి. తద్వారా రూ. 45,000 కోట్లకుపైగా సమీకరించే అవకాశమున్నట్లు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు తెలియజేశాయి. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు సిద్ధపడుతున్న కంపెనీలలో టెక్నాలజీ ఆధారిత కంపెనీలదే పైచేయిగా నిలవనున్నట్లు పేర్కొన్నాయి. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో చేపట్టిన ఐపీవో విజయవంతంకావడంతో పలు టెక్నాలజీ సంబంధ కంపెనీలు నిధుల సమీకరణకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశాయి. తొలుత పీఈ ఫండ్స్ జొమాటో తదితర ఆధునికతరం కంపెనీలు తొలుత ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) సంస్థల నుంచి నిధులను సమకూర్చుకుంటున్నాయి. అయితే ఇటీవల సెకండరీ మార్కెట్లు సరికొత్త రికార్డులతో కదం తొక్కుతున్న నేపథ్యంలో ప్రైమరీ మార్కెట్లు సైతం జోరందుకున్నాయి. దీంతో టెక్ ఆధారిత నవతరం కంపెనీలకు ఐపీవోలు మరో మార్గాన్ని చూపుతున్నాయి. వెరసి నిధుల సమీకరణ ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు క్యూ కడుతున్నట్లు ఏంజెల్ వన్ ఈక్విటీ వ్యూహకర్త జ్యోతి రాయ్ పేర్కొన్నారు. కారణాలివీ. కోవిడ్–19 సెకండ్ వేవ్ నుంచి ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి పుంజుకోనుందన్న అంచనాలకుతోడు విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు), దేశీ ఫండ్స్ పెట్టుబడులు మార్కెట్లకు జోష్‌నిస్తున్నట్లు రాయ్ పేర్కొన్నారు. మరోవైపు రిటైల్ ఇన్వెస్టర్లు సైతం రికార్డ్ స్థాయిలో పెట్టుబడులకు దిగుతుండటం దీనికి జత కలుస్తున్నట్లు తెలియజేశారు. వెరసి సెకండరీ మార్కెట్ బాటలో ప్రైమరీ మార్కెట్ సైతం సందడి చేస్తున్నట్లు వివరించారు. ఇకపైన ఇదే పరిస్థితి కొనసాగితే మరో ఏడాదిపాటు మార్కెట్లు బుల్ జోరులో కదిలే వీలున్నట్లు ఇన్వెస్ట్19 వ్యవస్థాపకుడు, సీఈవో కౌశలేంద్ర జెరోధా, ట్రూ బీకన్ సహవ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ రంగం ఇందుకు దోహదం చేయనున్నట్లు అంచనా వేశారు. 40 కంపెనీలు ఈ ఏడాది(2021)లో ఇప్పటివరకూ 40 కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా ఉమ్మడిగా రూ. 64,217 కోట్లు సమీకరించాయి. బుధవారం నుంచీ ప్రారంభకానున్న ఐపీవో ద్వారా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ రూ. 2,778 కోట్లు సమకూర్చుకోనుంది. మరోవైపు వాటాల విక్రయం ద్వారా పవర్‌గ్రిడ్ ఇన్విట్ రూ. 7,735 కోట్లు, బ్రూక్‌ఫీల్డ్ రియల్టీ ట్రస్ట్ రూ. 3,800 కోట్లు చొప్పున నిధులను సమీకరించాయి. కాగా.. 2020లో 15 కంపెనీలు రూ. 26,611 కోట్లు మాత్రమే సమకూర్చుకున్న విషయం విదితమే. ఇంతక్రితం 2017లో మాత్రమే 36 కంపెనీలు రూ. 67,147 కోట్లను ఐపీవోల ద్వారా అందుకున్నాయి. జాబితా ఇలా.. అక్టోబర్–నవంబర్‌లో పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు రానున్నాయి. జాబితాలో పాలసీ బజార్ రూ. 6,017 కోట్లు, ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్ రూ. 4,500 కోట్లు, నైకా రూ. 4,000 కోట్లు, సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ రూ. 2,000 కోట్లు, మొబిక్విక్ సిస్టమ్స్ రూ. 1,900 కోట్లు తదితరాలున్నాయి. జాబితాలో ఇంకా నార్థర్న్ ఆర్క్ క్యాపిటల్ రూ. 1,800 కోట్లు, శాఫైర్ ఫుడ్స్ రూ. 1,500 కోట్లు, ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 1,330 కోట్లు, స్టెరిటైల్ పవర్ రూ. 1,250 కోట్లు, రేట్‌గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్ రూ. 1,200 కోట్లు, సుప్రియా లైఫ్‌సైన్స్ రూ. 1,200 కోట్లు చేరినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. -
పరస్ డిఫెన్స్‌కు ఇన్వెస్టర్ల క్యూ
న్యూఢిల్లీ: పరస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకి ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. దరఖాస్తులు వెల్లువెత్తడంతో ఇష్యూ ఏకంగా 304 రెట్లు అధికంగా సబ్ర్‌స్కయిబ్ అయ్యింది. మంగళవారం(21న) ప్రారం భమైన ఇష్యూ గురువారం(23)తో ముగిసింది. వెరసి షేరుకి రూ. 165–175 ధరలో చేపట్టిన ఇష్యూలో భాగంగా కంపెనీ 71.4 లక్షలకుపైగా షేర్లను విక్రయానికి ఉంచింది. అయితే చివరి రోజుకల్లా 217 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 170 రెట్లు, నాన్‌ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కేటగిరీలో 928 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. ఇక రిటైల్ ఇన్వెస్టర్లు సైతం 112 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. ఇష్యూలో భాగంగా కంపెనీ 17,24,490 షేర్లను విక్రయించడంతోపాటు.. రూ. 141 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ ముందురోజు(20న) యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు ద్వారా రూ. 51 కోట్లు సమకూర్చుకుంది. ఓయో ఐపీవో సన్నాహాలు రూ. 8,000 కోట్ల సమీకరణ లక్ష్యం న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ కంపెనీ ఓయో పబ్లిక్ ఇష్యూ ప్రణాళికల్లో ఉంది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి వచ్చే వారంలో దరఖాస్తు చేయనుంది. ఐపీవో ద్వారా 120 కోట్ల డాలర్లు(రూ. 8,000 కోట్లు) సమీకరించాలని ఆశిస్తోంది. ఇందుకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు జేపీ మోర్గాన్, సిటీ, కోటక్ మహీంద్రా క్యాపిటల్‌ను ఎంపిక చేసుకుంది. -
ఐపీవోకు బజాజ్ ఎలక్ట్రానిక్స్
న్యూఢిల్లీ: కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్ మరో రెండు ఇష్యూలతో సందడి చేయనుంది. తాజాగా రెండు కంపెనీలు ఐపీవో బాట పట్టాయి. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. జాబితాలో హైదరాబాద్ కేంద్రంగా మన్నికైన వినియోగ వస్తువులు, ఎలక్ట్రానిక్స్ విక్రయించే ‘బజాజ్ ఎల్రక్టానిక్స్’తోపాటు.. రక్షణ రంగ పీఎస్‌యూలకు ఎల్రక్టానిక్స్ పరికరాలు సరఫరా చేసే డేటా ప్యాటర్న్స్ చేరింది. వివరాలు చూద్దాం.. ఎల్రక్టానిక్స్ మార్ట్ ఇండియా కన్జూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్.. ఎల్రక్టానిక్స్ మార్ట్ ఇండియా(ఈఎంఐఎల్) పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 500 కోట్లు సమకూర్చుకోవాలని ఆశిస్తోంది. బజాజ్ ఎలక్ట్రానిక్స్, కిచెన్ స్టోర్లను నిర్వహించే ఈ కంపెనీ ఐపీవోలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ నిధులలో రూ. 134 కోట్లు విస్తరణ వ్యయాలకు, రూ. 200 కోట్లు పెట్టుబడి అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. మరో రూ. 50 కోట్లను రుణ చెల్లింపులుకు వెచి్చంచనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. పవన్ కుమార్ బజాజ్, కరణ్ బజాజ్ ఏర్పాటు చేసిన ఈఎంఐఎల్ తెలుగు రాష్ట్రాలలో వేగంగా వృద్ధి చెందుతోంది. కోటి కస్టమర్లతోపాటు.. 7.5 లక్షల చదరపు అడుగుల రిటైల్ స్పేస్‌ను కలిగి ఉంది. 2,600 మంది నిపుణులతో 90 స్టోర్లను నిర్వహిస్తోంది. కంపెనీ ఆడియో అండ్ బియాండ్ పేరుతో మరో ప్రత్యేకత కలిగిన స్టోర్ల ఏర్పాటు సన్నాహాల్లో ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో మరిన్ని స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఈఎంఐఎల్ తెలియజేసింది. అంతేకాకుండా ఢిల్లీలోనూ ప్రవేశించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. డేటా ప్యాటర్న్స్.. రక్షణ, వైమానిక రంగాలలో వినియోగించే ఎల్రక్టానిక్ వ్యవస్థలను సరఫరా చేసే డేటా ప్యాటర్న్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 600–700 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు, వాటాదారులు మరో 60,70,675 షేర్లను సైతం విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, కార్పొరేట్ అవసరాలు, విస్తరణ తదితరాలకు వినియోగించనుంది. చెన్నై కంపెనీ డేటా ప్యాటర్న్స్ ప్రధానంగా రాడార్లు, నీటిఅడుగున పనిచేసే కమ్యూనికేషన్, ఏవియానిక్స్ తదితర పలు పరికరాలను రూపొందిస్తోంది. తొలి నానో శాటిలైల్ నియుశాట్ను అభివృద్ధి చేసింది. హరిఓం పైప్ ఇండస్ట్రీస్ స్టీల్ ఉత్పత్తుల తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ హరిఓం పైప్ ఇండస్ట్రీస్ ఐపీవోకు రానుంది. సెబీ వద్ద ఈ మేరకు పత్రాలను దాఖలు చేసింది. ఇష్యూ ద్వారా రూ.100–120 కోట్లను సమీకరిస్తారు. 85 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయిస్తారు. ప్రారంభ వాటా అమ్మకం ద్వారా వచ్చే మొత్తాన్ని మూలధన అవసరాలు, విస్తరణకు ఖర్చు చేస్తారు. గృహ, మౌలిక, వ్యవసాయం, వాహన, సౌర, ఫ్యాబ్రికేషన్, ఇంజనీరింగ్ రంగాలకు అవసరమైన స్టీల్ ఉత్పత్తులను కంపెనీ తయారు చేస్తోంది. తెలంగాణలోని సంగారెడ్డి వద్ద నూతన ప్లాంటును కంపెనీ స్థాపించనుంది. 2020–21లో రూ.255 కోట్ల టర్నోవర్‌పై రూ.15 కోట్ల నికరలాభం ఆర్జించింది. -
ఎల్ఐసీ ఐపీవోకు మర్చంట్ బ్యాంకర్లు రెడీ
న్యూఢిల్లీ: బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూని చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం 10 మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేసింది. జాబితాలో గోల్డ్‌మన్ శాక్స్ ఇండియా సెక్యూరిటీస్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, నోమురా ఫైనాన్షియల్ అడ్వయిజరీ అండ్ సెక్యూరిటీస్ ఇండియా, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్, జేఎం ఫైనాన్షియల్, యాక్సిస్ క్యాపిటల్, బీవోఎఫ్‌ఏ సెక్యూరిటీస్, జేపీ మోర్గాన్ ఇండియా, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కొటక్ మహీంద్రా క్యాపిటల్ ఉన్నాయి. ఎల్ఐసీ ఐపీవోను నిర్వహించేందుకు ప్రభుత్వం బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్స్సహా మరికొంతమంది ఇతర సలహాదారులను ఎంపిక చేసినట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఇష్యూకి న్యాయసలహాదారుల నియామకానికి కూడా బిడ్స్ స్వీకరిస్తున్నట్లు తెలియజేశారు. వీటి దాఖలుకు ఈ నెల 16న గడువు ముగియనుంది. ఈ బాటలో ఇప్పటికే ఎల్ఐసీ విలువను నిర్ధారించేందుకు మిల్లీమ్యాన్ అడ్వయిజర్స్ ఎల్ఎల్పీ ఇండియాను ప్రభుత్వం ఎంపిక చేసుకుంది.11 -
విజయా డయాగ్నోస్టిక్స్ ఐపీవో ఓకే
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ చైన్ విజయా డయాగ్నొస్టిక్స్ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. ఇష్యూ చివరి రోజు శుక్రవారానికల్లా 4.54 రెట్లు అధికంగా దరఖాస్తులు వచ్చాయి. షేరుకి రూ. 522–531 ధరలో చేపట్టిన ఇష్యూలో భాగంగా 2.5 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం 11.36 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. క్విబ్ విభాగంలో 13 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 1.3 రెట్లు, రిటైలర్ల నుంచి 1.1 రెట్లు చొప్పున స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 566 కోట్లు సమీకరించిన సంగతి తెలిసిందే. వెరసి రూ. 1,895 కోట్లు సమకూర్చుకుంది. ఇక స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ అమీ ఆర్గానిక్స్ ఐపీవోకు ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. ఇష్యూకి 64.5 రెట్లు అధిక స్పందన లభించింది. షేరుకి రూ. 603–610 ధరలో చేపట్టిన ఇష్యూలో భాగంగా 65.4 లక్షల షేర్లను ఆఫర్ చేసింది. 42.22 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి. క్విబ్ కోటా 87 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగంలో 155 రెట్లు, రిటైలర్ల నుంచి 13 రెట్లు అధిక దరఖాస్తులు వచ్చాయి. -
రేసు గుర్రాల్లా యూనికార్న్‌లు
ముంబై: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇటీవల స్టార్టప్‌లు దూకుడు చూపుతున్నాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటూ పలు విభాగాలలో కంపెనీలు ఆవిర్భవిస్తున్నాయి. వెరసి దేశీయంగా స్టార్టప్‌ల హవా నెలకొంది. ఇప్పటికే బిలియన్ డాలర్ల (రూ. 7,300 కోట్లు) విలువను అందుకున్న స్టార్టప్‌లు 60కు చేరాయి. వీటిని యూనికార్న్‌లుగా వ్యవహరించే సంగతి తెలిసిందే. దేశీ స్టాక్ మార్కెట్లు బుల్ ట్రెండ్‌లో సాగుతున్నాయి. దీంతో ప్రైమరీ మార్కెట్ ఎన్నడూలేని విధంగా కళకళలాడుతోంది. ఈ బాటలో స్టార్టప్ యూనికార్న్‌లు సైతం పబ్లిక్ ఇష్యూల బాటపడుతున్నాయి. రానున్న రెండేళ్లలో 18 పెద్ద స్టార్టప్‌లు ఐపీవోలకు రానున్నట్లు వాల్‌స్ట్రీట్ బ్రోకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ అమెరికా(బీవో ఎఫ్ఏ) ఒక నివేదికలో పేర్కొంది. 12 బిలియన్ డాలర్లు... ఈ ఏడాదిలోనే దేశీయంగా 20 స్టార్టప్‌లు కొత్తగా యూనికార్న్ హోదాను అందుకున్నాయి. ఫలితంగా వీటి సంఖ్య 60ను తాకింది. స్టార్టప్‌లలో కొద్ది నెలలుగా భారీ స్థాయిలో పెట్టుబడులు తరలి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరికల్లా వీటి సంఖ్య 100 మార్క్‌ను చేరవచ్చని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. గ్లోబల్ దిగ్గజం క్రెడిట్ స్వీస్ సైతం ఈ మార్చిలో ఇదే తరహా అంచనాలు వెలువరించడం గమనార్హం! రానున్న 24 నెలల్లో పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధులను సమీకరించేందుకు దిగ్గజాలు బైజూస్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎమ్, ఓలా, ఓయో తదితరాలు ప్రణాళికలు వేశాయి. అంతేకాకుండా పాలసీబజార్, పెప్పర్ఫ్రై, ఇన్మోబి, గ్రోఫర్స్, మొబిక్విక్, నైకా, ఫ్రెష్‌వర్క్స్, పైన్‌ల్యాబ్స్, ఫార్మ్ఈజీ, డెలివరీ, డ్రూమ్, ట్రాక్సన్ సైతం ఇదే బాటలో నడవనున్నాయి. తద్వారా సుమారు 18 కంపెనీలు 12 బిలియన్ డాలర్లు(రూ. 88,000 కోట్లు) వరకూ సమీకరించే యోచనలో ఉన్నట్లు బీవోఎఫ్‌ఏ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఎండీ గౌరవ్ సింఘాల్ తెలియజేశారు. భారీ ఇష్యూలు.. ఇప్పటికే సెబీ వద్ద పలు స్టార్టప్ దిగ్గజాలు ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. వీటిలో పేటీఎం(రూ. 16,600 కోట్లు), ఓలా(రూ. 11,000 కోట్లు), పాలసీబజార్ (రూ. 6,000 కోట్లు), నైకా(రూ. 4,000 కోట్లు), మొబిక్విక్(రూ. 1,900 కోట్లు) ఉన్నాయి. ఇటీవల రూ. 6,300 కోట్లు సమీకరించిన జొమాటో స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన విషయం విదితమే. దేశీయంగా యూనికార్న్‌లు ఐపీవోలు చేపట్టడం ద్వారా సంప్రదాయ కుటుంబ బిజినెస్‌ల ట్రెండ్‌లో మార్పులను తీసుకువచ్చే వీలున్నట్లు సింఘాల్ అభిప్రాయపడ్డారు. దేశీ స్టాక్ మార్కెట్ల క్యాపిటలైజేషన్(విలువ)లో ఇంటర్నెట్ ఆధారిత కంపెనీల వాటా 1 శాతానికంటే తక్కువేనని పేర్కొన్నారు. యూఎస్ మార్కెట్లో 40 శాతం మార్కెట్ వాటాను ఇవి ఆక్రమిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం దేశీ ఈక్విటీ మార్కెట్ల విలువ రూ. 250 లక్షల కోట్లను తాకిన సంగతి తెలిసిందే. రానున్న ఐదేళ్ల కాలంలో యూనికార్న్‌ల సంఖ్య రెట్టింపుకావచ్చని అంచనా వేశారు. ఈ ఏడాది యూనికార్న్ హోదాకు చేరిన కంపెనీలలో షేర్‌చాట్, గ్రో, గప్‌షుప్, మీషో, ఫార్మ్ఈజీ, బ్లాక్‌బక్, డ్రూమ్, ఆఫ్‌బిజినెస్, క్రెడ్, మోగ్లిక్స్, జెటా, మైండ్టికిల్, బ్రౌజర్‌స్టాక్, ఆప్‌గ్రేడ్ తదితరాలున్నాయి. త్వరలో మరో 32... ఫ్యూచర్ యూనికార్న్ జాబితాలో చేరగల మరో 32 కంపెనీలను హురున్ ఇండియా తాజాగా ప్రస్తావించింది. ఇవి ఇప్పటికే 50 కోట్ల డాలర్ల విలువను అందుకున్నట్లు తెలియజేసింది. ఈ బాటలో 20 కోట్ల డాలర్ల విలువను సాధించిన మరో 54 సంస్థలు సైతం జోరు మీదున్నట్లు పేర్కొంది. భవిష్యత్‌లో యూనికార్న్‌లుగా ఆవిర్భవించగల కంపెనీల విలువను 36 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. దేశీయంగా 60 కోట్లమంది ఇంటర్నెట్ యూజర్లున్నట్లు తెలియజేసింది. 2025కల్లా ఈ సంఖ్య 90 కోట్లను తాకనున్నట్లు వివరించింది. ప్రస్తుతం అత్యధిక యూనికార్న్‌లున్న దేశాల జాబితాలో అమెరికా(396), చైనా(277) తదుపరి మూడో ర్యాంకులో భారత్ నిలుస్తున్నట్లు పేర్కొంది. -
విజయా డయాగ్నొస్టిక్ ఐపీవో @ రూ. 522–531
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెల్త్‌కేర్ సేవల సంస్థ విజయా డయాగ్నొస్టిక్ సెంటర్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ సెప్టెంబర్ 1న ప్రారంభమై 3న ముగియనుంది. దీనికి సంబంధించి షేరు ఒక్కింటి ధర శ్రేణిని రూ. 522–531గా సంస్థ నిర్ణయించింది. కనీస బిడ్ లాట్ 28 షేర్లుగా ఉంటుంది. ఈ ఇష్యూ ద్వారా విజయా డయాగ్నోస్టిక్ దాదాపు రూ. 1,895 కోట్లు సమీకరించనుంది. ఆఫర్ ఫర్ సేల్ విధానంలో ఉండే ఈ ఐపీవోలో ప్రమోటరు ఎస్ సురేంద్రనాథ్ రెడ్డితో పాటు ఇన్వెస్టర్లయిన కారకోరం లిమిటెడ్, కేదార క్యాపిటల్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్–కేదార క్యాపిటల్ ఏఐఎఫ్ 1 దాదాపు 3.56 కోట్ల దాకా షేర్లను విక్రయించనున్నాయి. సురేంద్రనాథ్ రెడ్డి 50.98 లక్షల షేర్లు, కారకోరం 2.95 కోట్లు, కేదార క్యాపిటల్ 11.02 లక్షల షేర్లు విక్రయిస్తాయి. దీంతో ప్రమోటర్లు, ప్రస్తుత షేర్‌హోల్డర్ల వాటా 35 శాతం మేర తగ్గనుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్‌నకు 59.78 శాతం, కారకోరం లిమిటెడ్‌కు 38.56 శాతం, కేదారకు 1.44 శాతం వాటాలు ఉన్నాయి. విస్తరణ ప్రణాళికలు .. ప్రస్తుతం తమకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలతో పాటు కోల్‌కతా, నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో మొత్తం 80 పైచిలుకు డయాగ్నొస్టిక్ సెంటర్లు ఉన్నాయని సంస్థ సీఈవో సుప్రీతా రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోకి విస్తరించనున్నట్లు వివరించారు. దక్షిణాదిన హైదరాబాద్‌కి 4–5 గంటల ప్రయాణ దూరంలో ఉండే చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు తూర్పున కోల్‌కతా తదితర ప్రాంతాలపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. -
లిస్టింగ్ రోజే అమ్మకాలు
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి నాలుగు నెలల్లో పబ్లిక్ ఇష్యూల హవా నెలకొంది. అయితే ఐపీవోలో షేర్లు పొందిన ఇన్వెస్టర్లు లిస్టింగ్ రోజునే అమ్మకాలకు ఆసక్తి చూపుతున్నారు. వెరసి ఏప్రిల్–జులై మధ్య కాలంలో 52 శాతం మంది ఇన్వెస్టర్లు తొలి రోజునే అలాట్ అయిన షేర్లను విక్రయించినట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషణ పేర్కొంది. మరో 20 శాతం మంది లిస్టయిన వారం రోజుల్లోపే షేర్లను వొదిలించుకున్నట్లు తెలియజేసింది. మోతీలాల్‌కు చెందిన బ్రోకింగ్, పంపిణీ విభాగం చేసిన విశ్లేషణ ప్రకారం ఐపీవో క్లయింట్లలో 64 శాతం మంది సగటున కనీసం రెండు ఇష్యూలకు దరఖాస్తు చేశారు. ఈ ఏడాది తొలి 4 నెలల్లో 5.7 లక్షల మంది ఇన్వెస్టర్లు పబ్లిక్ ఇష్యూల బాట పట్టగా.. గతేడాది(2020–21) ఇదే కాలంలో 5.1 లక్షల మంది మాత్రమే వీటికి సబ్స్క్రయిబ్ చేశారు. రాష్ట్రాల వారీగా మొత్తం ఐపీవో క్లయింట్లలో దాదాపు 70 శాతం మంది గుజరాత్, రాజస్తాన్, మహారాష్ట్రలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కంపెనీలు సైతం క్యూ కట్టడంతో ఈ ఏడాది ఏప్రిల్–జులైలో 36 పబ్లిక్ ఇష్యూలు వచ్చాయి. గతేడాది ఇదే కాలంలో 17 ఇష్యూలు మాత్రమే నమోదయ్యాయి. 61 శాతం మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేశారు. గ్లెన్‌మార్క్ లైఫ్సైన్సెస్కు అత్యధికంగా 68 శాతం మంది క్లయింట్లు అప్లై చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకూ 40 కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ సాధించడం ద్వారా రూ. 68,000 కోట్లు సమకూర్చుకున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ నివేదిక తెలియజేసింది. ఈ బాటలో ఏడాది చివరికల్లా 100 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను పూర్తిచేసుకునే వీలున్నట్లు అంచనా వేసింది. -
ఎల్ఐసీ ఐపీవో నిర్వహణకు క్యూ
న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ నిర్వహణకు మర్చంట్ బ్యాంకర్ సంస్థలు క్యూ కడుతున్నాయి. సుమారు 16 సంస్థలు ఇందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెట్టుబడులు, ఆస్తుల నిర్వహణ సంస్థ(దీపమ్) వద్ద మంగళ, బుధవారాల్లో ఈ కంపెనీలు ప్రెజంటేషన్ ఇవ్వనున్నాయి. 23న ఐపీవో నిర్వహణ వివరాలు ఇవ్వనున్న విదేశీ బ్యాంకర్ల జాబితాలో బీఎన్పీ పరిబాస్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, డీఎస్పీ మెరిల్ లించ్, గోల్డ్‌మన్ శాక్స్ ఇండియా, హెచ్ఎస్బీసీ సెక్యూరిటీస్, జేపీ మోర్గాన్ ఇండియా, నోమురా ఫైనాన్షియల్ అడ్వయిజర్స్ ఉన్నాయి. ఈ బాటలో 24న యాక్సిస్ క్యాపిటల్, డీఏఎం క్యాపిటల్ అడ్వయిజర్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, జేఎం ఫైనాన్షియల్, కొటక్ మహీంద్రా క్యాపిటల్, ఎస్బీఐ క్యాపిటల్ ప్రెజంటేషన్‌ను ఇవ్వనున్నాయి. -
అదానీ విల్మర్ ఐపీవోకు సెబీ చెక్
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు ఫార్చూన్ బ్రాండ్ వంట నూనెల కంపెనీ అదానీ విల్మర్ పెట్టుకున్న దరఖాస్తును క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పక్కనపెట్టింది. దీంతో ఐపీవో ద్వారా రూ. 4,500 కోట్లను సమీకరించాలని భావించిన కంపెనీకి ప్రస్తుతం చెక్ పడింది. ఈ అంశంపై సెబీ ఎలాంటి స్పష్టతనూ ఇవ్వకపోవడం గమనార్హం! అదానీ విల్మర్ ఈ నెల 3న సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. కాగా.. దరఖాస్తును పక్కనపెట్టిన విషయంపై సెబీ నుంచి ఎలాంటి సమాచారమూ అందలేదని అదానీ గ్రూప్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. సెబీ నిబంధనలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. భవిష్యత్‌లోనూ నిబంధనలకు అనుగుణంగా అన్నివిధాలా స్పందించనున్నట్లు వివరించారు. -
మెట్రో బ్రాండ్స్ ఐపీవో బాట
న్యూఢిల్లీ: ఫుట్‌వేర్ రిటైలర్ మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 250 కోట్ల ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన సంస్థలు 2.19 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి. మెట్రో, మోచీ, వాక్‌వే తదితర బ్రాండ్ల ఫుట్‌వేర్ కంపెనీ ప్రీఐపీవో ప్లేస్‌మెంట్‌కింద రూ. 10 కోట్లను సమీకరించనుంది. తాజా ఈక్విటీ ద్వారా సమీకరించే నిధులను కొత్త స్టోర్ల ఏర్పాటుకు వినియోగించనున్నట్లు వెల్లడించింది. 1955లో మెట్రో బ్రాండుతో తొలిసారి ముంబైలో స్టోర్‌ను ప్రారంభించిన కంపెనీలో సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలాకు సైతం పెట్టుబడులున్నాయి. 2021 మార్చికల్లా కంపెనీ దేశవ్యాప్తంగా 134 పట్టణాలలో 586 స్టోర్లను నిర్వహిస్తోంది. -
లిస్టెడ్ సంస్థల చేతిలో 60 శాతం బీమా వ్యాపారం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఎల్ఐసీ కూడా పబ్లిక్ ఇష్యూ పూర్తి చేసుకుని లిస్టయితే.. దేశీయంగా బీమా వ్యాపారంలో దాదాపు 60 శాతం వాటా లిస్టెడ్ కంపెనీలదే ఉంటుందని ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి అమిత్ అగర్వాల్ తెలిపారు. యాక్చువేరీస్ డే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. అంతర్జాతీయంగా సవాళ్లు నెలకొన్నప్పటికీ విస్తృతమైన, పటిష్టమైన ఆర్థిక విధానాలతో వర్ధమాన ఎకానమీగా భారత్ వృద్ధి బాటలో ముందుకు సాగుతోందని అగర్వాల్ చెప్పారు. రెండు దశాబ్దాల క్రితం బీమా రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత నుంచి ఇన్సూరెన్స్ పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు. 2000 సంవత్సరంలో ఎనిమిది సంస్థలు ఉండగా.. ప్రస్తుతం వీటి సంఖ్య 69కి చేరిందని వివరించారు. ప్రస్తుతం నాలుగు జీవిత బీమా సంస్థలు, రెండు సాధారణ బీమా సంస్థలతో పాటు ప్రభుత్వ రంగ రీ–ఇన్సూరెన్స్ సంస్థ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా లిస్టయిన బీమా కంపెనీల్లో ఉన్నాయి. -
కార్‌ట్రేడ్ టెక్ ఐపీఓ... బంపర్ స్పందన
ముంబై: కార్‌ట్రేడ్ టెక్ ఐపీఓకు మంచి స్పందన లభించింది. చివరి రోజు నాటికి 20.29 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.29 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టగా.., మొత్తం 26.31 కోట్లు బిడ్లు దాఖలైనట్లు ఎక్సే్చంజీ గణాంకాలు తెలిపాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులు(క్విబ్) విభాగంలో 35.45 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల కోటాలో 41 రెట్ల అధిక స్పందన నమోదైంది. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 2.75 రెట్లు అధిక దరఖాస్తులు వచ్చాయి. ఈ ఐపీఓ ఆగస్ట్ 9న ప్రారంభమై ఇదే నెల 11వ తేదీన ముగిసింది. ధరల శ్రేణి రూ.1,585–1,618గా నిర్ణయించి కంపెనీ రూ.2999 కోట్లు సమకూర్చుకుంది. నువాకో విస్టాస్ ఐపీఓకు స్పందన అంతంతే! సిమెంట్ తయారీ కంపెనీ నువాకో విస్టాస్ ఐపీఓకు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. మూడవ రోజు నాటికి 1.71 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 6.25 కోట్ల షేర్లను జారీ చేసింది. మొత్తం 10.70 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. ఇందులో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్ విభాగంలో 4.23 రెట్లు, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటాలో 66%, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 73% ఎక్కువగా దరఖాస్తులు లభించాయి. ఈ ఐపీఓ కూడా ఆగస్ట్ 9న ప్రారంభమై, ఆగస్ట్ 11వ తేదీన ముగిసింది. ధరల శ్రేణి రూ. 560–570 గా నిర్ణయించింది. -
ఆదిత్య బిర్లా ఏఎంసీ ఐపీవోకు సై
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా అనుమతించింది. ఐపీవోలో భాగంగా కంపెనీ ఈక్విటీలో 13.5 శాతం వాటాకు సమానమైన 3.88 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. ప్రమోటర్ సంస్థలు ఏబీ క్యాపిటల్ 28.51 లక్షలు, సన్ లైఫ్ (ఇండియా) ఏఎంసీ ఇన్వెస్ట్మెంట్స్ 3.6 కోట్లు చొప్పున ఈక్విటీ షేర్లను ఆఫర్ చేయనున్నాయి. పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా ఆస్తుల నిర్వహణ జేవీ.. ఏబీ సన్ లైఫ్ ఏఎంసీ ఏప్రిల్‌లోనే సెబీకి దరఖాస్తు చేసింది. ఐపీవో ద్వారా కంపెనీ రూ. 1,500–2,000 కోట్లు సమకూర్చుకోవచ్చని మార్కెట్ నిపుణుల అంచనా. ఇప్పటికే ఏఎంసీలు.. నిప్పన్ లైఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, యూటీఐ లిస్టింగ్ సాధించిన సంగతి తెలిసిందే. -
ఐపీవోకు జెమినీ వంట నూనెలు
హైదరాబాద్: వంట నూనెల తయారీ సంస్థ జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతిని కోరుతూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 2,500 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోలో భాగంగా ప్రమోటర్లతోపాటు.. కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వాటాదారులు సైతం వాటాలను విక్రయానికి ఉంచనున్నట్లు జెమినీ ఎడిబుల్స్ తెలియజేసింది. ప్రదీప్ చౌధరి రూ. 25 కోట్లు, అల్కా చౌధరి రూ. 225 కోట్లు, గోల్డెన్ ఆగ్రి ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ రూ. 750 కోట్లు, బ్లాక్ రివర్ ఫుడ్ 2పీటీఈ రూ. 1,250 కోట్లు, ఇన్వెస్ట్మెంట్ అండ్ కమర్షియల్ ఎంటర్ప్రైజ్ పీటీఈ రూ. 250 కోట్లు చొప్పున ఈక్విటీని ఆఫర్ చేయనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. వాటాల వివరాలిలా ప్రస్తుతం జెమినీ ఎడిబుల్స్లో గోల్డెన్ అగ్రికి 56.27 శాతం, అల్కా చౌధరికి 11.56 శాతం, బ్లాక్ రివర్ ఫుడ్‌కు 25 శాతం, ఇన్వెస్ట్మెంట్ అండ్ కమర్షియల్‌కు 6.6 శాతం, ప్రదీప్‌కు 0.57 శాతం చొప్పున వాటా ఉంది. ఫ్రీడమ్ బ్రాండ్‌తో జెమినీ ఎడిబుల్స్ వంట నూనెలు విక్రయించే సంగతి తెలిసిందే. వంట నూనెలు, స్పెషాలిటీ ఫ్యాట్స్ తయారీ, పంపిణీ, బ్రాండింగ్‌ను కంపెనీ నిర్వహిస్తోంది. ఐపీవో ద్వారా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో ఈక్విటీ షేర్లను లిస్టింగ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. కాగా.. ఇటీవలే ఫార్చూన్, ఆధార్ బ్రాండ్ వంట నూనెల దిగ్గజం అదానీ విల్మర్ సైతం సెబీకి ఐపీఓ కోసం దరఖాస్తు చేయడం గమనార్హం! -
ఈ వారం 4 ఐపీవోలు
న్యూఢిల్లీ: ఇటీవల కొనసాగుతున్న ప్రైమరీ మార్కెట్ల హవా నేపథ్యంలో ఈ వారం మరో 4 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టనున్నాయి. జాబితాలో నిర్మా గ్రూప్ కంపెనీ నువోకో విస్టాస్ కార్పొరేషన్, ఆటో క్లాసిఫైడ్ సంస్థ కార్‌ట్రేడ్ టెక్, గృహ రుణాల సంస్థ ఆప్టస్ వేల్యూ హౌసింగ్ ఫైనాన్స్, స్పెషాలిటీ కెమికల్ కంపెనీ కెమ్‌ప్లాస్ట్ సన్మార్ ఉన్నాయి. నువోకో విస్టాస్, కార్‌ట్రేడ్ టెక్ నేడు(9న) ప్రారంభంకానుండగా.. ఆప్టస్ వేల్యూ, కెమ్‌ప్లాస్ట్ సన్మార్ మంగళవారం(10న) ఇష్యూకి రానున్నాయి. తద్వారా ఉమ్మడిగా రూ. 14,628 కోట్లు సమీకరించనున్నాయి. నువోకో, కార్‌ట్రేడ్ ఇష్యూలు 11న, ఆప్టస్, కెమ్‌ప్లాస్ట్ 12న ముగియనున్నాయి. గత వారం సైతం 4 కంపెనీలు ఐపీవోలు చేపట్టిన సంగతి తెలిసిందే. దేవయాని ఇంటర్నేషనల్, క్రిస్నా డయాగ్నోస్టిక్స్, విండ్లాస్ బయోటెక్, ఎగ్జారో టైల్స్ సంయుక్తంగా రూ. 3,614 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. రూ. 30,666 కోట్లు గత ఆర్థిక సంవత్సరం(2020–21) 30 కంపెనీలు ఐపీవోలకు రావడం ద్వారా రూ. 31,277 కోట్లు సమీకరించాయి. ఈ బాటలో ప్రస్తుత ఏడాది(2021–22)లో ఇప్పటివరకూ 16 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. మొత్తం రూ. 30,666 కోట్లు అందుకున్నాయి. వెరసి తొలి ఐదు నెలల్లోనే గతేడాదిని మించి నిధులను సమకూర్చుకోగలిగాయి. ఈ ఏడాది ఇకపై మరో రూ. 70,000 కోట్ల విలువైన ఇష్యూలు మార్కెట్లను తాకనున్నట్లు శాంక్టమ్ వెల్త్ మేనేజ్మెంట్ ఈక్విటీస్ హెడ్ హేమంగ్ కాపసీ పేర్కొన్నారు. ఐపీవో నిధులను ప్రధానంగా రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నాయి. ఇతర వివరాలు నువోకో విస్టాస్ ఐపీవోకు ధరల శ్రేణి రూ. 560–570కాగా.. రూ. 5,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇక కార్‌ట్రేడ్ ఇష్యూకి ధరల శ్రేణి రూ. 1,585–1,618గా నిర్ణయించింది. తద్వారా రూ. 2,999 కోట్లవరకూ అందుకోవాలని చూస్తోంది. ఆప్టస్ వేల్యూ ఇష్యూకి ధరల శ్రేణి రూ. 346–353కాగా.. రూ. 2,780 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. ఇక రూ. 3,850 కోట్ల ఐపీవోకు కెమ్‌ప్లాస్ట్ సన్మార్ రూ. 530–541 ధరల శ్రేణిని ప్రకటించింది. -
నిర్మా గ్రూప్ నువోకో ఐపీవోకు రెడీ
న్యూఢిల్లీ: నిర్మా గ్రూప్‌నకు చెందిన సిమెంట్ రంగ కంపెనీ నువోకో విస్టాస్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ నెల 9న ప్రారంభంకానున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 560–570గా కంపెనీ ప్రకటించింది. ఐపీవోలో భాగంగా ప్రమోటర్ సంస్థ నియోగీ ఎంటర్ప్రైజెస్ రూ. 3,500 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనుంది. అంతేకాకుండా మరో రూ. 1,500 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 5,000 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో కంపెనీ ఉంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 26 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. నువోకో విస్టాస్ ఐదు సమీకృత, ఐదు గ్రైండింగ్, ఒక బ్లెండింగ్ యూనిట్‌తోపాటు 11 సిమెంట్ ప్లాంట్లను కలిగి ఉంది. ప్రస్తుతం వార్షికంగా 22.32 ఎంఎంటీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. చత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, రాజస్తాన్, హర్యానాలలో సిమెంట్ తయారీ ప్లాంట్లను నిర్వహిస్తోంది. గతంలో లఫార్జ్ ఇండియాగా కార్యకలాపాలు సాగించిన కంపెనీ 2020 ఫిబ్రవరిలో ఇమామీ గ్రూప్ సిమెంట్ బిజినెస్‌ను కొనుగోలు చేసింది. -
జొమాటో ప్రస్థానం.. పిజ్జా డెలివరీపై అసంతృప్తితో
సాక్షి, వెబ్‌డెస్క్: ఆఫీసులో పనిలో మునిగిపోయాడు ఓ ఉద్యోగి.. లంచ్ టైం దాటి పోయింది. బాగా ఆకలేస్తుంది.. బయటకు వెళ్లి తిందామంటే కుదరదు.. ఏం చేయాలి.. వంటరాని బ్యాచిలర్ బాబుకి వేడి వేడిగా బిర్యానీ తినాలనిపించింది.. ఏం చేస్తాడు.. పిజ్జా కావాలని ఇంట్లో పిల్లలు గోల.. అప్పుడా ఇల్లాలు ఏం చేస్తుంది.. ఈ ప్రశ్నల్నింటికి ఒక్కటే సమాధానం.. జొమాటో. చేతిలో మొబైల్ ఉంటే.. ప్రపంచం మన గుప్పిట్లో ఎలా ఉంటుందో.. సెల్ఫోన్లో జొమాటో యాప్ ఉంటే.. మన జేబులోనే రెస్టారెంట్, దాబా, చైనీస్ ఫాస్ట్‌ఫుడ్ ఇలా అన్ని ఉన్నట్లే. దాదాపు 12 ఏళ్ల క్రితం ప్రారంభమైన జొమాటో స్టార్టప్ ఇప్పుడు మన దేశంలో నంబర్ 1 ఫుడ్ డెలివరీ యాప్‌గా నిలిచింది. కొన్ని రోజుల క్రితం జొమాటో పబ్లిక్ ఇష్యూకు వెళ్లింది. అది సూపర్ హిట్ అయ్యింది. షేర్లు నమోదైన తొలిరోజే 66 శాతం ప్రతిఫలాన్ని ఇవ్వడమే కాక.. కంపెనీ మార్కెట్ విలువ లక్ష కోట్ల రూపాయల మైలు తాకింది. ఈరోజు విజయ పథంలో దూసుకుపోతున్న జొమాటో అసలు ఎలా ప్రారంభం అయ్యింది అనే దాని వేనక ఓ ఆసక్తికర కథనం ఉంది. ఆ వివరాలు జొమాటో వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ మాటల్లోనే.. ‘‘నేను ఐఐటీలో చదువుతున్నప్పుడు ఆన్లైనలో పిజ్జా ఆర్డర్ చేసేవాడిని. కానీ అది ఎప్పుడు నాకు నచ్చేది కాదు. ఓ సారి లేట్ అయితే.. మరోసారి నాకు నచ్చిన పిజ్జా దొరికేది కాదు. ఐఐటీలో ఉన్నన్ని రోజులు ఈ సమస్యను ఎదుర్కొన్నాను. చదువు పూర్తయిన తర్వాత బైన్ కంపెనీలో చేరాను. అక్కడ నా సహోద్యుగులు క్యాంటిన్లో లభించే పరిమిత ఆహారం పట్ల అసంతృప్తిగా ఉండేవారు’’ అని దీపిందర్ గుర్తు చేసుకున్నారు. ‘‘క్యాంటీన్లో తక్కువ ఐట్సం ఉండేవి. దగ్గర్లోని రెస్టారెంట్‌కు వెళ్దామంటే కుదిరేది కాదు. దీని గురించి ఆలోచిస్తున్న సమయంలో నే నాకు పంకజ్ చద్దాతో పరిచయం ఏర్పడింది. ఇద్దరం దీని గురించి ఆలోచించి.. ఓ మార్గం కనుకొన్నాము. మా కంపెనీ పక్కనే ఉన్న కేఫ్స్, రెస్టారెంట్ మెనుని కంపెనీ ఇంటర్నెట్లోకి ఫోన్ నంబర్లతో అప్లోడ్ చేశాం. ఫుడీబే.కామ్ పేరుతో వీకెండ్ వెంచర్‌గా నడిపాం. ఇది బాగా క్లిక్ అయ్యింది. జాబ్ చేస్తూనే దీన్ని చూసుకునేవాళ్లం’’ అని తెలిపారు గోయల్. ‘‘ఈ క్రమంలో నా భార్యకు ఢిల్లీ యూనివర్శిటీలో జాబ్ వచ్చింది. దాంతో నా ఉద్యోగానికి రాజీనామా చేసి.. పూర్తి దృష్టి దీని మీదనే పెట్టాను. వెంచర్‌ని విస్తరించే ప్రయత్నాలు ప్రారంభించాను. మొదట దీని గురించి నా తల్లిదండ్రులతో సహా ఎవ్వరికి చెప్పలేదు. ఏడాదిలోపే దేశంలోని ఆరు ప్రముఖ నగరాల్లోని వేల కొద్ది రెస్టారెంట్లు మా స్టార్టప్‌లో లిస్ట్ అయ్యాయి’’ అని చెప్పుకొచ్చారు. టొమాటో స్ఫూర్తితో జొమాటో.. ‘‘స్టార్టప్ అభివృద్ధి అవుతున్న క్రమంలో దాని పేరు మార్చాలని భావించాం. కొత్తగా, వినూత్నంగా, కస్టమర్లకు బాగా గుర్తుండే పేరు కోసం ఆలోచించాం. అప్పుడు టొమాటో తట్టింది. భారతీయ వంటకాల్లో టొమాటో తప్పనిసరి. మా యాప్ కూడా అలానే అభివృద్ధి చెందాలని భావించి టొమాటో స్ఫూర్తితో జొమాటో అని పేరు పెట్టాం’’ అని దీపిందర్ తెలిపారు. ప్రస్తుతం భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌లలో ఒకటైన జొమాటో అంతర్జాతీయ విస్తరణకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా టర్కీ, బ్రెజిల్, న్యూజిలాండ్, ఇండోనేషియా సహా 19 దేశాల్లో సేవలందిస్తుంది. టేబుల్ బుకింగ్స్, హోమ్ డెలివరీ, రెస్టారెంట్, నైట్లైప్ గైడ్లలోకి ప్రవేశించి.. ముందుకు సాగుతుంది. ప్రస్తుతం ఈ కంపెనీలో 5,500 మంది పైచిలుకు మంది పని చేస్తున్నారు. -
గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్ ఐపీవోకు సై
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ కంపెనీ గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ నెల 27న ప్రారంభంకానున్న ఐపీవోకు ధరల శ్రేణి రూ. 695–720గా కంపెనీ ప్రకటించింది. 29న ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 1,060 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 63 లక్షల షేర్లను సైతం విక్రయానికి ఉంచనుంది. మాతృ సంస్థ గ్లెన్‌మార్క్ ఫార్మా వీటిని ఆఫర్ చేస్తోంది. తద్వారా కంపెనీ మొత్తం రూ. 1,514 కోట్లవరకూ సమకూర్చుకోవాలని ఆశిస్తోంది. ఐపీవో నిధులను ప్రమోటర్లు ప్రత్యేక కంపెనీగా విడదీస్తున్న ఏపీఐ బిజినెస్ కొనుగోలుతోపాటు, పెట్టుబడి వ్యయా లు తదితరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. లిస్టెడ్ హెల్త్‌కేర్ కంపెనీ గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్‌కు అనుబంధ సంస్థ అయిన గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్ అధిక విలువగల ఏపీఐలను రూపొందిస్తోంది. ఈ నాన్కమోడిటైజ్డ్ ఏపీఐలను గుండె సంబంధిత, కేంద్ర నాడీమండల వ్యాధుల చికిత్సలో వినియోగిస్తారు. వీటితోపాటు జీర్ణాశయ వ్యాధులు, యాంటీఇన్ఫెక్టివ్స్ తదితర చికిత్సలో వినియోగించే ఏపీఐలను కూడా కంపెనీ తయారు చేస్తోంది. -
ఎల్ఐసీ ఐపీవోకు సలహాదారులు కావలెను
న్యూఢిల్లీ: బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కు సంబంధించి మర్చంట్ బ్యాంకర్లు, న్యాయ సలహాదారుల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గరిష్టంగా పది వరకు మర్చంట్ బ్యాంకర్లు, ఒక న్యాయ సలహా సేవల సంస్థను ‘పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం’ (దీపమ్) ఎంపిక చేయనుంది. బిడ్ల దాఖలుకు ఆగస్ట్ 6 వరకు గడువు ఇచ్చింది. గత వారమే ఎల్ఐసీ ఐపీవోకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసిన విషయం తెలిసిందే. 2022 జనవరి–మార్చి మధ్యలో ఎల్ఐసీని స్టాక్ మార్కెట్లలో లిస్ట్ చేయాలన్న ప్రణాళికతో ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం, పెట్టుబడుల ఉపసంహరణ రూపంలో రూ.1.75 లక్షల కోట్లను సమకూర్చుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక. ఇప్పటివరకు కేవలం రూ.7,500 కోట్ల మేరకే సమీకరించింది. ప్రధానంగా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వాటాల విక్రయం, ఎల్ఐసీ ఐపీవో రూపంలో గణనీయమైన మొత్తం సమకూరనుంది. -
జొమాటో సరికొత్త రికార్డ్: ఆ అంశంలో తొలి సంస్థగా..
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో పబ్లిక్ ఇష్యూ నేటి (బుధవారం) నుంచీ ప్రారంభం కానుంది. షేరుకి రూ.72-76 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ.9,375 కోట్లను సమీకరించాలని జొమాటో భావిస్తోంది. ఇష్యూ శుక్రవారం (16న) ముగియనుంది. చైనీస్ దిగ్గజం యాంట్ గ్రూప్ పెట్టుబడులున్న జొమాటో ఈ ఐపీవో ద్వారా స్టాక్ ఎక్చేంజీలలో లిస్ట్ కానున్న తొలి దేశీ యూనికార్న్ స్టార్టప్‌గా నిలవనుంది. అంతేకాకుండా పబ్లిక్ ఇష్యూకి వచ్చిన తొలి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థగానూ ఆవిర్భవించనుంది. మరోవైపు 2020 మార్చిలో ఐపీవో ద్వారా రూ.10,341 కోట్లు సమీకరించిన ఎస్బీఐ కార్డ్స్ తదుపరి అతిపెద్ద ఇష్యూగా నిలవనుంది. వెరసి ఈ జనవరిలో వచ్చిన ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) ఇష్యూని అధిగమించనుంది. ఐపీవోలో భాగంగా జొమాటో రూ. 9,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. 5 లిస్టెడ్ కంపెనీలు వెనక్కి... దేశీ స్టాక్ మార్కెట్లలో ఇప్పటికే ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ కంపెనీలు ఐదు లిస్టింగ్ పొందాయి. డోమినోస్ పిజ్జా రెస్టారెంట్ల సంస్థ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, మెక్‌డొనాల్డ్స్ సంస్థ వెస్ట్‌లైఫ్ డెవలప్మెంట్, బర్గర్ కింగ్ ఇండియా, బార్బిక్యు నేషన్ హాస్పిటాలిటీ, స్పెషాలిటీ రెస్టారెంట్స్. ఇష్యూ తదుపరి జొమాటో విలువ రూ.64,365 కోట్లను తాకనుంది. వెరసి ఈ విభాగంలోని లిస్టెండ్ కంపెనీల ఉమ్మడి మార్కెట్ విలువను జొమాటో అధిగమించనుంది. జూబిలెంట్ మార్కెట్ విలువ రూ.40,771 కోట్లుకాగా.. వెస్ట్‌లైఫ్ మార్కెట్ క్యాప్ రూ.8,381 కోట్లు. యాంకర్ పెట్టుబడులు: ఐపీవోలో భాగంగా మంగళవారం(13న) యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి జొమాటో 56 కోట్ల డాలర్లు (సుమారు రూ. 4,150 కోట్లు) సమీకరించినట్లు తెలుస్తోంది. షేరుకి రూ.76 ధరలో విక్రయించినట్లు సమాచారం. -
ఐపీవో ప్రారంభానికి ముందే దరఖాస్తు!
న్యూఢిల్లీ: ప్రైమరీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయదలచిన రిటైల్ ఇన్వెస్టర్లకు డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్ సైతం సర్వీసులు అందించనుంది. డీమ్యాట్ ఖాతాలను తెరవడం ద్వారా ఇందుకు అవకాశాన్ని కల్పిస్తోంది. పేటీఎమ్ వినియోగదారులు ఇక నుంచీ పబ్లిక్ ఇష్యూలకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో పబ్లిక్ ఇష్యూని వేదిక చేసుకుంది. జొమాటో ఇష్యూ బుధవారం నుంచీ ప్రారంభంకానుంది. అంతకంటే ముందుగానే అప్లై చేసుకునేందుకు పేటీఎమ్ వీలు కల్పిస్తోంది. అయితే ఐపీవో ప్రారంభమయ్యాకే దరఖాస్తుల ప్రాసెసింగ్ ఉంటుంది. రిటైలర్లకు జోష్...: ఐపీవో తేదీకంటే ముందుగానే దరఖాస్తు చేసుకునేందుకు పేటీఎమ్ వీలు కల్పించడంతో మరింతమంది రిటైల్ ఇన్వెస్టర్లు ప్రైమరీ మార్కెట్ బాట పట్టే అవకాశముంది. నిజానికి సాధారణ పద్ధతిలో ఐపీవో ప్రారంభమయ్యాకే బిడ్స్‌కు వీలుంటుంది. కాగా.. గత రెండు రోజులుగా ప్రారంభమైన పేటీఎమ్ మనీ ప్లాట్‌ఫామ్ ద్వారా భారీస్థాయిలో రిటైలర్లు జొమాటో పబ్లిక్ ఇష్యూకి దరఖాస్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రీఐపీవో అప్లికేషన్ పేరుతో ఇందుకు వీలు కల్పించింది. వెరసి మార్కెట్ సమయాల్లో బిజీగా ఉండే యువత, తదితరులకు అన్నివేళలా ఐపీవోకు అప్లై చేసేందుకు దారి చూపుతోంది. ఈ ఆర్డర్లను పేటీఎమ్ మనీ ప్లాట్‌ఫామ్ ద్వారా నమోదు చేస్తుంది. ఆపై పబ్లిక్ ఇష్యూ ప్రారంభమయ్యాక ఎక్సే్ఛంజీలకు బదిలీ చేస్తుంది. పబ్లిక్ ఇష్యూ దరఖాస్తుకు సంబంధించిన సమాచారాన్ని సైతం వినియోగదారుడు అన్నివేళలా తెలుసుకునేందుకు వీలుంటుంది. భారీ స్పందన లభించే కొన్ని ఐపీవోలకు దరఖాస్తు సమయంలో సర్వర్ల సమస్యలు తలెత్తినప్పటికీ పేటీఎమ్ ఫీచర్ ప్రయోజనకరంగా ఉంటుందని కంపెనీ పేర్కొంటోంది. ఐపీవోకు ఓకే... తాజాగా నిర్వహించిన అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎం)లో భాగంగా రూ. 12,000 కోట్ల సమీకరణకు ప్రతిపాదించిన పబ్లిక్ ఇష్యూకి పేటీఎమ్ వాటాదారులు అనుమతించారు. సెకండరీ సేల్ ద్వారా మరో రూ. 4,600 కోట్లను సమకూర్చుకోనున్నట్లు తెలుస్తోంది. వెరసి రూ. 16,600 కోట్ల ఐపీవో చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఈజీఎంలో కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మను నాన్‌ప్రమోటర్‌గా సవరించే ప్రతిపాదనకూ వాటాదారులు ఆమోదముద్ర వేశారు. కంపెనీలో విజయ్‌కు ప్రస్తుతం 14.61 శాతం వాటా ఉంది. అయితే పేటీఎమ్ చైర్మన్, ఎండీ, సీఈవోగా కొనసాగనున్నారు. భారీ డిమాండ్ గత కొద్ది నెలలుగా ప్రైమరీ మార్కెట్ కళకళలాడుతోంది. దరఖాస్తుదారులు అధికమయ్యా రు. మార్కెట్ వేళల్లో పనులు, దరఖాస్తు సమయంలో ఆలస్యాలు తదితరాల కారణంగా కొంత మంది వీటిని మిస్ అవుతున్నారు. దీంతో ఎలాం టి అవకాశాలు కోల్పోకుండా ఆధునిక ఫీచర్స్‌ను రూపొందించాం. తద్వారా వినియోగదారులు సులభంగా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించాం. ఒకే క్లిక్‌తో దరఖాస్తు చేసుకోవచ్చు. – వరుణ్ శ్రీధర్, సీఈవో పేటీఎమ్ మనీ -
ఎల్ఐసీలో కొత్తగా సీఈవో పోస్ట్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూకి సంబంధించి కేంద్రం చర్యలు వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా కంపెనీలో చైర్మన్ పోస్టును చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా మారుస్తూ సంబంధిత నిబంధనలకు మార్పులు చేసింది. దీని ప్రకారం ఇకపై ఎల్ఐసీకి సీఈవో, ఎండీ మాత్రమే ఉండనున్నారు. జూలై 7న ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుత విధానం ప్రకారం ఎల్ఐసీలో ఒక చైర్మన్, నలుగురు ఎండీల విధానం అమల్లో ఉంది. ఎల్ఐసీ లిస్టింగ్‌కు మార్గం సుగమం చేసే దిశగా కంపెనీ అధీకృత షేర్ క్యాపిటల్‌ను రూ. 25,000 కోట్లకు పెంచే ప్రతిపాదనకు కూడా కేంద్రం ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. -
నీరసించిన ‘సిప్’ పెట్టుబడులు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్/క్రమానుగత పెట్టుబడులు) రూపంలో వచ్చే పెట్టుబడులు గత ఆర్థిక సంవత్సరంలో (2020–21) 4% తగ్గి రూ.96,080 కోట్లుగా ఉన్నాయి. సగటున చూస్తే ప్రతీ నెలా రూ.8,000 కోట్ల మేర పెట్టుబడులు వచ్చినట్టు తెలుస్తోంది. కరోనా కారణంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల ప్రభావం సిప్ పెట్టుబడులపై చూపించింది. 2019–20 సంవత్సరంలో ఇన్వెస్టర్లు సిప్ రూపంలో వివిధ పథకాల్లోకి రూ.1,00,084 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడం గమనార్హం. సిప్‌తో పెట్టుబడులపై రిస్క్ తగ్గుతుంది. మార్కెట్లు గరిష్ట విలువల వద్ద, కనిష్ట విలువల వద్ద క్రమంగా పెట్టుబడులకు వీలు కల్పిస్తుంది. కనుక దీర్ఘకాలంలో రిస్క్‌ను అధిగమించి మెరుగైన రాబడులకు అందుకునే అవకాశం ఉంటుంది. గత కొన్నేళ్లలో సిప్ పెట్టుబడులను గమనించినట్టయితే.. 2016–17లో రూ.43,921 కోట్లు, 2017–18లో రూ.67,190 కోట్లు, 2018–19లో రూ.92,693 కోట్ల చొప్పున మ్యూచువల్ ఫండ్స్‌లోకి వచ్చాయి. ఏటా పురోగతి ఉన్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ప్రతికూల పరిస్థితుల ప్రభావం..: ‘‘టీకాలు ఇచ్చే కార్యక్రమం విజయవంతం కావడం, అంచనాలకు మించి ఆర్థిక పురోగతి, అధిక ఆదాయాలు సిప్ పెట్టుబడులపై రానున్న రోజుల్లో ప్రభావం చూపించే అంశాలు’’ అని ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి తెలిపారు. కరోనా కారణంగా లాక్డౌన్లతో కొందరు ఇన్వెస్టర్లు సిప్‌లను నిలిపివేసినట్టు తెలుస్తోందని క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ సీఈవో జిమ్మీ పటేల్ పేర్కొన్నారు. ‘‘సిప్ పెట్టుబడులు గత రెండు సంవత్సరాల్లో అధికంగానే ఉన్నాయి. మార్కెట్లలో అనిశ్చితులు పెరగడంతో ఇన్వెస్టర్లు సిప్ పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్నారు’’ అని బ్రోకరేజీ సంస్థ షేర్‌ఖాన్ తెలిపింది.. 2020–21లో పబ్లిక్ ఇష్యూల సందడి పబ్లిక్ ఇష్యూల రూపంలో నిధుల సమీకరణ గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2020–21) రెట్టింపు స్థాయిలో నమోదైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. రైట్స్ ఇష్యూ రూపంలో నిధుల సమీకరణ 15 శాతం పెరిగినట్టు తెలిపింది. కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసిన సమయంలోనూ నిధుల సమీకరణ జోరుగా సాగినట్టు పేర్కొంది. 2020–21లో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (తొలి పబ్లిక్ ఆఫర్/ఐపీవో), ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో/లిస్టెడ్ సంస్థ తిరిగి పబ్లిక్ ఇష్యూ చేపట్టడం)కు 55 కంపెనీలు వచ్చాయి. అలాగే, 21 రైట్స్ ఇష్యూలు విజయవంతంగా పూర్తయ్యాయి. ‘‘2020–21లో పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ.46,030 కోట్లు, రైట్స్ ఇష్యూల ద్వారా రూ.64,059 కోట్లను సమీకరించాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో (2019–20) ఇది రూ.21,382 కోట్లు, రూ.55,670 కోట్లుగా ఉంది. 115 శాతం, 15% చొప్పున వృద్ధి నమోదైంది. -
18 నుంచి ఐఆర్ఎఫ్సీ ఐపీవో
న్యూఢిల్లీ: పీఎస్‌యూ సంస్థ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఆర్ఎఫ్సీ) పబ్లిక్ ఇష్యూ ఈ నెల 18న ప్రారంభంకానుంది. తద్వారా కంపెనీ రూ. 4,600 కోట్లను సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ సంస్థ(దీపమ్) కార్యదర్శి టీకే పాండే వెల్లడించారు. ఈ నెల 20న ముగియనున్న ఐపీవోకు ధరల శ్రేణి రూ. 25–26గా తెలియజేశారు. ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు ఈ నెల 15న షేర్లను కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ విలువ రూ. 10 కాగా.. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 575 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. 178 కోట్ల షేర్లు పబ్లిక్ ఇష్యూలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 178.2 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో ప్రభుత్వం 59.4 కోట్ల షేర్లను ఆఫర్ చేయనుంది. మరో 118.8 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ ద్వారా ప్రభుత్వానికి రూ. 1,544 కోట్లు లభించనున్నాయి. వెరసి తొలిసారి రైల్వే రంగ ఎన్బీఎఫ్సీ స్టాక్ మార్కెట్లలో లిస్ట్‌కానున్నట్లు నిపుణులు తెలియజేశారు. 1986లో ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్ఎఫ్సీ ప్రధానంగా దేశ, విదేశీ ఫైనాన్షియల్ మార్కెట్ల నుంచి చౌకగా నిధులను సమీకరిస్తుంటుంది. తద్వారా దేశీ రైల్వే విభాగానికి ఆస్తుల కొనుగోలు, ఫైనాన్సింగ్ తదితర సేవలను అందిస్తుంటుంది. అంతేకాకుండా దేశీ రైల్వేల అధిక బడ్జెటరీ వ్యయాలకు అవసరమైన నిధులు సమకూర్చుతుంది. 2017 ఏప్రిల్‌లో కేంద్ర కేబినెట్ రైల్వే కంపెనీలను స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఫలితంగా ఇర్కాన్ (ఐఆర్సీవోఎన్) ఇంటర్నేషనల్, రైట్స్(ఆర్ఐటీఈఎస్), రైల్ వికాస్ నిగమ్, రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) ఇప్పటికే ఎక్సే్చంజీల్లో లిస్ట్ అయ్యాయి. -
హైదరాబాద్ కంపెనీ ఎంటీఏఆర్ ఐపీవో బాట
ముంబై, సాక్షి: ఇంజినీరింగ్ సొల్యూషన్స్ కంపెనీ ఎంటీఏఆర్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసింది. తద్వారా రూ. 600-650 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. కంపెనీ 7 తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. వీటిలో తెలంగాణలోని హైదరాబాద్‌లో కంపెనీకి ఎగుమతుల కోసం ప్రత్యేకించిన యూనిట్ ఉంది. తద్వారా రక్షణ, వైమానిక, ఇంధన రంగాలకు అవసరమైన కీలక పరికరాలను సరఫరా చేస్తోంది. (ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్.. ఐపీవోకు రెడీ) నాలుగు దశాబ్దాలుగా ఇంజినీరింగ్ విభాగంలో ఎంటీఏఆర్ టెక్నాలజీస్ కార్యకలాపాలు విస్తరిస్తూ వస్తోంది. ప్రధానంగా ప్రెసిషన్ ఇంజినీరింగ్ విభాగంలో కంపెనీకి పట్టుంది. న్యూక్లియర్, ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్లు, ఏరోస్పేస్ ఇంజిన్లు, మిసైల్ సిస్టమ్స్, ఎయిర్‌క్రాఫ్ట్ తదితరాలకు పలు కీలక విడిభాగాలను రూపొందిస్తోంది. న్యూక్లియర్ రంగంలో 14, అంతరిక్ష విభాగంలో 6, శుద్ధ ఇంధన రంగంలో 3 చొప్పున కీలక ప్రొడక్టులను తయారు చేస్తోంది. 2020 నవంబర్‌కల్లా రూ. 356 కోట్లకుపైగా విలువైన ఆర్డర్లను కలిగి ఉంది. (2020: ఐపీవో నామ సంవత్సరం) -
ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్.. ఐపీవోకు రెడీ
ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా ప్రైమరీ మార్కెట్ కళకళలాడుతుండటంతో తాజాగా మరో కంపెనీ ఐపీవో బాట పట్టింది. మునిసిపల్ సోలిడ్ వేస్ట్(ఎంఎస్‌డబ్ల్యూ) విభాగంలో కార్యకలాపాలు కలిగిన ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. సోమవారం(21) నుంచి ప్రారంభంకానున్న ఇష్యూ బుధవారం(23న) ముగియనుంది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 313-315కాగా.. తద్వారా రూ. 300 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. దీనిలో భాగంగా రూ. 85 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. 47 షేర్లు ఒక లాట్‌గా నిర్ణయించింది. ఫలితంగా రిటైల్ ఇన్వెస్టర్లు ఇదే పరిమాణంలో రూ. 2 లక్షల విలువకు మించకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. (బెక్టర్స్ ఫుడ్ విజయం వెనుక మహిళ) రూ. 90 కోట్లు ఇష్యూలో భాగంగా ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 90 కోట్లను సమీకరించింది. టాటా ఏఐజీ జనరల్, మసాచుసెట్స్ టెక్నాలజీ, 238 ప్లాన్ అసోసియేట్స్, ఎస్బీఐ ఫండ్ తదితర 10 సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. షేరుకి రూ. 315 ధరలో 28.57 లక్షలకుపైగా షేర్లను ఈ సంస్థలకు ఆంటోనే కేటాయించింది. కంపెనీ ఇంతక్రితం ఈ ఏడాది మార్చిలో ఐపీవోకు సన్నాహాలు చేసుకున్నప్పటకీ కోవిడ్-19 కారణంగా మార్కెట్లు నీరసించడంతో వెనకడుగు వేసింది. ఐపీవో నిధులను అనుబంధ సంస్థల ద్వారా పీసీఎంసీ WTE ప్రాజెక్టుకు, రుణ చెల్లింపులకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకూ వినియోగించనున్నట్లు ప్రాస్పక్టస్‌లో పేర్కొంది. కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన మారిషస్‌కు చెందిన లీడ్స్, టామ్‌బ్రిడ్జ్, క్యామ్‌బ్రిడ్జ్, గిల్డ్‌ఫోర్డ్ పబ్లిక్ ఇష్యూలో వాటాలు విక్రయించనున్నాయి. (30 రోజుల్లో 100 శాతం లాభాలు) కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ వేస్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ రంగంలో దేశీయంగా గల ఐదు టాప్ కంపెనీలలో ఒకటి ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్. మూడు రకాల ప్రాజెక్టులను చేపడుతోంది. మునిసిపల్ సోలిడ్ వేస్ట్, సీఅండ్‌టీ ప్రాజెక్ట్స్, ఎంఎస్‌డబ్ల్యూ ప్రాసెసింగ్ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. ప్రధానంగా ఎంఎస్‌డబ్ల్యూ సర్వీసులలో పూర్తిస్థాయి సేవలను అందిస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. వీటిలో సోలిడ్ వేస్ట్ కలెక్షన్, రవాణా, ప్రాసెసింగ్, డిస్పోజల్ సర్వీసులున్నట్లు తెలియజేసింది. మునిసిపాలిటీలకు అత్యధికంగా సర్వీసులు అందిస్తున్నట్లు పేర్కొంది. ల్యాండ్ ఫిల్ నిర్మాణం, నిర్వహణ విభాగంలోనూ కార్యకలాపాలను విస్తరించింది. ఎంఎస్‌డబ్ల్యూ ఆధారిత డబ్ల్యూటీఈ సర్వీసుల్లో పట్టు సాధించింది. ప్రస్తుతం నవీముంబై, థానే, ఉత్తర ఢిల్లీ, మంగళూరు మునిసిపల్ తదితర 25 ప్రాజెక్టులను చేపట్టింది. 18 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. వీటిలో 12 ప్రాజెక్టులు ఎంఎస్‌డబ్ల్యూ సీఅండ్‌టీ విభాగంలోనివే. 1147 వాహనాలను కలిగి ఉంది. 969 వాహనాలకు జీపీఎస్‌ను అనుసంధానించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో రూ. 207 కోట్ల ఆదాయం, రూ. 29 కోట్ల నికర లాభం ఆర్జించింది. కుటుంబ సభ్యులు, ప్రమోటర్లకు 24.73 శాతం వాటా ఉంది. -
బెక్టర్స్ ఫుడ్ ఐపీవో- వెల్లువెత్తిన బిడ్స్
ముంబై, సాక్షి: ప్రీమియం బిస్కట్ల తయారీ కంపెనీ బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ పబ్లిక్ ఇష్యూకి అన్ని వర్గాల నుంచీ బిడ్స్ వెల్లువెత్తాయి. ఇష్యూ చివరి రోజు గురువారానికల్లా 198 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. ఐపీవోలో భాగంగా కంపెనీ 1.32 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 262 కోట్ల షేర్లకుపైగా బిడ్స్ దాఖలయ్యాయి. ప్రధానంగా సంపన్న వర్గాల నుంచి 621 రెట్లు అధికంగా దరఖాస్తులు రాగా.. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి సైతం 29 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి 177 రెట్లు అధికంగా బిడ్స్ లభించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీల డేటా వెల్లడించింది. రూ. 288 ధరలో బెక్టర్ ఫుడ్ పబ్లిక్ ఇష్యూకి ధరల శ్రేణి రూ. 286-288కాగా.. తద్వారా కంపెనీ రూ. 540 కోట్లు సమీకరించింది. ఐపీవో ప్రారంభానికి ముందురోజు సోమవారం(14న) యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 162 కోట్లు సమకూర్చుకుంది. షేరుకి రూ. 288 ధరలో హెచ్డీఎఫ్సీ లైఫ్, గోల్డ్‌మన్ శాక్స్, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్, ఎస్బీఐ డెట్ హైబ్రిడ్ తదితర 7 ఎంఎఫ్లకు షేర్లను కేటాయించింది. ఐపీవో నిధులను విస్తరణతోపాటు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. రాజ్‌పురా యూనిట్లో బిస్కట్ల తయారీకి కొత్త లైన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసింది. (బర్గర్‌కింగ్ పుష్- బెక్టర్స్ ఫుడ్ ఐపీవోకు రెడీ) దిగ్గజ కస్టమర్లు బర్గర్ కింగ్, మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ, పిజ్జా హట్ తదితర గ్లోబల్ ఫాస్ట్‌ఫుడ్ చైన్స్(క్యూఎస్ఆర్)కు బెక్టర్ ఫుడ్స్ బన్స్ సరఫరా చేస్తోంది. బెక్టర్స్ క్రీమికా పేరుతో సొంతంగా ప్రీమియం బిస్కట్లను తయారు చేస్తోంది. ఇంగ్లీష్ ఒవెన్ బ్రాండుతో సొంత బ్యాకరీ ప్రొడక్టులను సైతం రూపొందిస్తోంది. లూధియానాకు చెందిన కంపెనీ ఇంతక్రితం 2018లోనూ పబ్లిక్ ఇష్యూ ప్రయత్నాలు చేసింది. సెబీ అనుమతించినప్పటికీ మార్కెట్ పరిస్థితులు అనుకూలించకపోవడంతో విరమించుకుంది. (30 రోజుల్లో 100 శాతం లాభాలు) పోటీ ఎక్కువే.. లిస్టెడ్ దిగ్గజాలు ఐటీసీ, బ్రిటానియాతోపాటు.. పార్లే ఇండియా, మోడర్న్, హార్వెస్ట్ గోల్డ్ కంపెనీలతో బెక్టర్స్ ఫుడ్ పోటీ పడుతోంది. గ్లోబల్ ఫాస్ట్‌ఫుడ్ చైన్స్‌కు భారీ స్థాయిలో బన్స్ సరఫరా చేయడంతోపాటు.. ఫ్రోజెన్ డఫ్ విభాగంలోకీ ప్రవేశించింది. తద్వారా ఈ విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉన్న బేకర్స్ సర్కిల్‌తో పోటీని ఎదుర్కొంటోంది. 2019 మార్చికల్లా బెక్టర్స్ ఫుడ్ ఆదాయం రూ. 762 కోట్లను తాకింది. రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది. దేశీయంగా బిస్కట్లు, బేకరీ ప్రొడక్టుల రిటైల్ మార్కెట్ విలువ 7 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 52,000 కోట్లు)గా అంచనా. గత ఐదేళ్లలో వార్షికంగా 9 శాతం వృద్ధిని సాధిస్తూ వస్తోంది. మార్కెట్ విలువలో బిస్కట్లు, రస్కులు, వేఫర్స్, కేకులు 89 శాతం వాటాను ఆక్రమిస్తున్నాయి. బన్నులు, పిజ్జా బేస్‌లు తదితరాల వాటా 11 శాతమని పరిశ్రమ నిపుణులు తెలియజేశారు! -
నేటి నుంచి బెక్టర్స్ ఫుడ్.. పబ్లిక్ ఇష్యూ
ముంబై, సాక్షి: ప్రీమియం బిస్కట్ల తయారీ కంపెనీ బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ పబ్లిక్ ఇష్యూ నేడు(15న) ప్రారంభమైంది. 17న(గురువారం) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 286-288కాగా.. తద్వారా రూ. 540 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోలో భాగంగా సోమవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 162 కోట్లు సమకూర్చుకుంది. షేరుకి రూ. 288 ధరలో హెచ్డీఎఫ్సీ లైఫ్, గోల్డ్‌మన్ శాక్స్, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్, ఎస్బీఐ డెట్ హైబ్రిడ్ తదితర 7 ఎంఎఫ్లకు షేర్లను కేటాయించింది. ఐపీవోలో భాగంగా కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన సంస్థలు వాటాలను విక్రయించనున్నాయి. ఐపీవో నిధులను విస్తరణ వ్యయాలు, తదితర సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. రాజ్‌పురా యూనిట్లో బిస్కట్ల తయారీకి కొత్త లైన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసింది. (బర్గర్ కింగ్ ఐపీవో.. స్పందన సూపర్) దిగ్గజ కస్టమర్లు బర్గర్ కింగ్, మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ, పిజ్జా హట్ తదితర గ్లోబల్ ఫాస్ట్‌ఫుడ్ చైన్స్(క్యూఎస్ఆర్)కు బెక్టర్ ఫుడ్స్ బన్స్ సరఫరా చేస్తోంది. బెక్టర్స్ క్రీమికా పేరుతో సొంతంగా ప్రీమియం బిస్కట్లను తయారు చేస్తోంది. ఇంగ్లీష్ ఒవెన్ బ్రాండుతో సొంత బ్యాకరీ ప్రొడక్టులను సైతం రూపొందిస్తోంది. లూధియానాకు చెందిన కంపెనీ ఇంతక్రితం 2018లోనూ పబ్లిక్ ఇష్యూ ప్రయత్నాలు చేసింది. సెబీ అనుమతించినప్పటికీ మార్కెట్ పరిస్థితులు అనుకూలించకపోవడంతో విరమించుకుంది. (బర్గర్ కింగ్ లిస్టింగ్.. అ‘ధర’హో) పోటీ ఎక్కువే.. లిస్టెడ్ దిగ్గజాలు ఐటీసీ, బ్రిటానియాతోపాటు.. పార్లే ఇండియా, మోడర్న్, హార్వెస్ట్ గోల్డ్ కంపెనీలతో బెక్టర్స్ ఫుడ్ పోటీ పడుతోంది. గ్లోబల్ ఫాస్ట్‌ఫుడ్ చైన్స్‌కు భారీ స్థాయిలో బన్స్ సరఫరా చేయడంతోపాటు.. ఫ్రోజెన్ డఫ్ విభాగంలోకీ ప్రవేశించింది. తద్వారా ఈ విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉన్న బేకర్స్ సర్కిల్‌తో పోటీని ఎదుర్కొంటోంది. 2019 మార్చికల్లా బెక్టర్స్ ఫుడ్ ఆదాయం రూ. 762 కోట్లను తాకింది. రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది. దేశీయంగా బిస్కట్లు, బేకరీ ప్రొడక్టుల రిటైల్ మార్కెట్ విలువ 7 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 52,000 కోట్లు)గా అంచనా. గత ఐదేళ్లలో వార్షికంగా 9 శాతం వృద్ధిని సాధిస్తూ వస్తోంది. మార్కెట్ విలువలో బిస్కట్లు, రస్కులు, వేఫర్స్, కేకులు 89 శాతం వాటాను ఆక్రమిస్తున్నాయి. బన్నులు, పిజ్జా బేస్‌లు తదితరాల వాటా 11 శాతమని పరిశ్రమ నిపుణులు తెలియజేశారు! -
బర్గర్ కింగ్.. బ్లాక్‌బస్టర్ లిస్టింగ్
ముంబై, సాక్షి: అంతర్జాతీయ ఫాస్ట్‌ఫుడ్(QSR) చైన్ల దిగ్గజం బర్గర్ కింగ్ తొలి రోజు స్టాక్ ఎక్స్ఛేంజీలలో భారీ లాభాలతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 60కాగా.. ఎన్ఎస్ఈలో ఏకంగా 85 శాతం ప్రీమియంతో రూ. 111 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. వెరసి రూ. 51లాభంతో లిసయ్యింది. తదుపరి రూ. 119 వరకూ ఎగసింది. ప్రస్తుతం రూ. 111 వద్ద ట్రేడవుతోంది. బీఎస్ఈలోనూ. 115 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇటీవలే ముగిసిన బర్గర్ కింగ్ పబ్లిక్ ఇష్యూ దాదాపు 157 రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్ లభించిన సంగతి తెలిసిందే. 7.44 కోట్ల షేర్లను కంపెనీ అమ్మకానికి ఉంచగా.. మొత్తం 1,167 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖయ్యాయి. రూ. 59-60 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 810 కోట్లను సమకూర్చుకుంది. ఇష్యూ నిధులలో కొంతమేర బర్గర్ కింగ్ రెస్టారెంట్స్ పేరుతో కొత్త కంపెనీ ఏర్పాటుకు వినియోగించనున్నట్లు మాతృ సంస్థ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. అంతేకాకుండా స్టోర్ల విస్తరణకూ వినియోగించనుంది. ఇష్యూకి ముందు రోజు కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 364 కోట్లకుపైగా సమకూర్చుకుంది. (బర్గర్‌కింగ్ పుష్- బెక్టర్స్ ఫుడ్ ఐపీవోకు రెడీ) ఐదేళ్లలో.. గ్లోబల్ క్యూఎస్ఆర్ చైన్ సంస్థ బర్గర్ కింగ్ దేశీయంగా ఐదేళ్లక్రితం ఏర్పాటైంది. ఈ ఐదేళ్లలో రెస్టారెంట్ల ఏర్పాటురీత్యా వేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. మాస్టర్ ఫ్రాంచైజీ ఒప్పందాల ద్వారా బర్గర్ కింగ్ బ్రాండును దేశీయంగా విస్తరిస్తోంది. అంతర్జాతీయంగా బర్గర్ బ్రాండ్లలో నెట్వర్క్ రీత్యా ఈ కంపెనీ రెండో ర్యాంకులో నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 18,000 రెస్టారెంట్లు కలిగి ఉంది. 2020 సెప్టెంబర్‌కల్లా దేశీయంగా 261 రెస్టారెంట్లను ఏర్పాటు చేసింది. ఫ్రాంచైజీలతో కలిపి దేశవ్యాప్తంగా 57 పట్టణాలలో విస్తరించింది. 2017లో రూ. 233 కోట్లుగా నమోదైన ఆదాయం 2019కల్లా రూ. 633 కోట్లకు జంప్‌చేసింది. ఇదే సమయంలో నష్టాలు రూ. 72 కోట్ల నుంచి రూ. 38 కోట్లకు తగ్గాయి. కాగా.. జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్, వెస్ట్‌లైఫ్ డెవలప్మెంట్ కంపెనీలను దేశీయంగా లిస్టయిన ప్రధాన ప్రత్యర్ధి సంస్థలుగా పేర్కొనవచ్చు. జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్.. డోమినోస్ పిజ్జా రెస్టారెంట్లను నిర్వహిస్తుంటే.. వెస్ట్‌లైఫ్ డెవలప్మెంట్.. మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్లను నిర్వహిస్తున్న విషయం విదితమే. -
బర్గర్ కింగ్ ఐపీవోకు రిటైలర్ల క్యూ
న్యూఢిల్లీ, సాక్షి: అంతర్జాతీయ ఫాస్ట్‌ఫుడ్(QSR) చైన్ల దిగ్గజం బర్గర్ కింగ్ పబ్లిక్ ఇష్యూ నేడు ముగియనుంది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 59-60కాగా.. రెండో రోజు గురువారానికల్లా 9.4 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 38 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించడం గమనార్హం! ఇష్యూలో భాగంగా ప్రమోటర్ సంస్థ క్యూఎస్ఆర్ ఏసియా పీటీఈ 6 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచింది. వీటికి జతగా మరో రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 810 కోట్లను సమకూర్చుకోవాలని భావిస్తోంది. వెరసి 7.44 కోట్ల షేర్లను అమ్మకానికి ఉంచగా.. గురువారం(3) వరకూ దాదాపు 70 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖయ్యాయి. ఐపీవో నిధులలో కొంతమేర బర్గర్ కింగ్ రెస్టారెంట్స్ పేరుతో కొత్త కంపెనీ ఏర్పాటుకు వినియోగించనున్నట్లు మాతృ సంస్థ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. అంతేకాకుండా స్టోర్ల విస్తరణకూ వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 250 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇష్యూకి ముందు రోజు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 364 కోట్లకుపైగా సమకూర్చుకుంది. ఐదేళ్లలో.. గ్లోబల్ క్యూఎస్ఆర్ చైన్ సంస్థ బర్గర్ కింగ్ దేశీయంగా ఐదేళ్లక్రితం ఏర్పాటైంది. ఈ ఐదేళ్లలో రెస్టారెంట్ల ఏర్పాటురీత్యా వేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. మాస్టర్ ఫ్రాంచైజీ ఒప్పందాల ద్వారా బర్గర్ కింగ్ బ్రాండును దేశీయంగా విస్తరిస్తోంది. అంతర్జాతీయంగా బర్గర్ బ్రాండ్లలో నెట్వర్క్ రీత్యా ఈ కంపెనీ రెండో ర్యాంకులో నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 18,000 రెస్టారెంట్లు కలిగి ఉంది. 2020 సెప్టెంబర్‌కల్లా దేశీయంగా 261 రెస్టారెంట్లను ఏర్పాటు చేసింది. ఫ్రాంచైజీలతో కలిపి దేశవ్యాప్తంగా 57 పట్టణాలలో విస్తరించింది. 2017లో రూ. 233 కోట్లుగా నమోదైన ఆదాయం 2019కల్లా రూ. 633 కోట్లకు జంప్‌చేసింది. ఇదే సమయంలో నష్టాలు రూ. 72 కోట్ల నుంచి రూ. 38 కోట్లకు తగ్గాయి. కాగా.. జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్, వెస్ట్‌లైఫ్ డెవలప్మెంట్ కంపెనీలను దేశీయంగా లిస్టయిన ప్రధాన ప్రత్యర్ధి సంస్థలుగా పేర్కొనవచ్చు. జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్.. డోమినోస్ పిజ్జా రెస్టారెంట్లను నిర్వహిస్తుంటే.. వెస్ట్‌లైఫ్ డెవలప్మెంట్.. మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్లను నిర్వహిస్తున్న విషయం విదితమే. -
బర్గర్ కింగ్ ఐపీవో ధర రూ. 59-60
న్యూఢిల్లీ, సాక్షి: అంతర్జాతీయ ఫాస్ట్‌ఫుడ్(QSR) చైన్ల దిగ్గజం బర్గర్ కింగ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. డిసెంబర్ 2న(బుధవారం) ప్రారంభంకానున్న ఇష్యూ 4న(శుక్రవారం) ముగియనుంది. ఐపీవోకు ధరల శ్రేణి రూ. 59-60. ఇష్యూలో భాగంగా ప్రమోటర్ సంస్థ క్యూఎస్ఆర్ ఏసియా పీటీఈ 6 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచుతోంది. వీటికి జతగా మరో రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 810 కోట్లను సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇష్యూ నిధులను బర్గర్ కింగ్ రెస్టారెంట్స్ పేరుతో కొత్త కంపెనీ ఏర్పాటుకు వినియోగించనున్నట్లు మాతృ సంస్థ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. అంతేకాకుండా సాధారణ కార్పొరేట్ అవసరాలకూ వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 250 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంతకంటే అధికంగా కావాలనుకుంటే ఇదే గుణిజాల్లో రూ. 2 లక్షల విలువ మించకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ కానుంది. ఐదేళ్లలో.. గ్లోబల్ క్యూఎస్ఆర్ చైన్ సంస్థ బర్గర్ కింగ్ దేశీయంగా ఐదేళ్లక్రితం ఏర్పాటైంది. ఈ ఐదేళ్లలో రెస్టారెంట్ల ఏర్పాటురీత్యా వేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. మాస్టర్ ఫ్రాంచైజీ ఒప్పందాల ద్వారా బర్గర్ కింగ్ బ్రాండును దేశీయంగా విస్తరిస్తోంది. అంతర్జాతీయంగా బర్గర్ బ్రాండ్లలో నెట్వర్క్ రీత్యా ఈ కంపెనీ రెండో ర్యాంకులో నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 18,000 రెస్టారెంట్లు కలిగి ఉంది. 2020 సెప్టెంబర్‌కల్లా దేశీయంగా 261 రెస్టారెంట్లను ఏర్పాటు చేసింది. ఫ్రాంచైజీలతో కలిపి దేశవ్యాప్తంగా 57 పట్టణాలలో విస్తరించింది. 2017లో రూ. 233 కోట్లుగా నమోదైన ఆదాయం 2019కల్లా రూ. 633 కోట్లకు జంప్‌చేసింది. ఇదే సమయంలో నష్టాలు రూ. 72 కోట్ల నుంచి రూ. 38 కోట్లకు తగ్గాయి. కాగా.. దేశీయంగా లిస్టయిన ప్రత్యర్ధి సంస్థ జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ స్థాయిలో బర్గర్ కింగ్‌కు ప్రీమియం విలువ లభించకపోవచ్చని ఏంజెల్ బ్రోకింగ్ సహచర ఈక్విటీ విశ్లేషకులు కేశవ్ లహోటీ ఐపీవో సందర్భంగా అంచనా వేశారు. జూబిలెంట్.. లాభాలు సాధిస్తున్నకంపెనీ కావడంతోపాటు పిజ్జా బ్రాండు దేశీయంగా వినియోగదారులను బాగా ఆకట్టుకుంటున్నట్లు అభిప్రాయపడ్డారు. -
గ్లాండ్ ఫార్మా ఐపీవో సోమవారమే
ముంబై: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన హెల్త్ కేర్ కంపెనీ గ్లాండ్ ఫార్మా పబ్లిక్ ఇష్యూ సోమవారం(9న) ప్రారంభంకానుంది. షేరుకి రూ. 1,490-1,500 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 6,480 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. బుధవారం(11) ముగియనున్న ఇష్యూలో భాగంగా కంపెనీ దాదాపు 3.5 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచింది. వీటికి జతగా రూ. 1,250 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇష్యూకి 13 షేర్లు ఒక లాట్ కాగా.. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 13 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. వారాంతాన షేరుకి రూ. 1,500 ధరలో యాంకర్ సంస్థలకు 1.29 కోట్లకుపైగా షేర్లను జారీ చేసింది. తద్వారా రూ. 1,944 కోట్లు సమీకరించింది. ఇన్వెస్ట్ చేసిన యాంకర్ కంపెనీల జాబితాలో స్మాల్ క్యాప్ వరల్డ్ ఫండ్, గోల్డ్ మన్ శాక్స్, సింగపూర్ ప్రభుత్వ సంస్థతోపాటు.. 18 దేశీ మ్యూచువల్ ఫండ్స్ చేరాయి. చైనీస్ పేరెంట్.. ఇంజక్టబుల్ ప్రొడక్టుల తయారీ గ్లాండ్ ఫార్మాకు ప్రమోటర్.. చైనీస్ దిగ్గజం ఫోజన్ గ్రూప్. హాంకాంగ్, షాంఘైలలో లిస్టయిన ఫోజన్ ఫార్మాకు కంపెనీలో 74 శాతం వాటా ఉంది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఫోజన్ ఫార్మా దాదాపు 1.94 కోట్ల గ్లాండ్ ఫార్మా షేర్లను విక్రయానికి ఉంచింది. తద్వారా చైనీస్ మాతృ సంస్థ కలిగిన తొలి కంపెనీగా గ్లాండ్ ఫార్మా దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను విస్తరణ ప్రణాళికలు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్ లో గ్లాండ్ ఫార్మా పేర్కొంది. అతిపెద్ద ఇష్యూ దేశీయంగా గ్లాండ్ ఫార్మా అతిపెద్ద ఫార్మా ఐపీవోగా ఆవిర్భవించనున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంతక్రితం దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన ఎరిస్ లైఫ్ సైన్సెస్(2017) రూ. 1,741 కోట్లను సమీకరించింది. 2015లో ఐపీవోకు వచ్చిన ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ రూ. 1,350 కోట్లు, 2016లో లిస్టయిన లారస్ ల్యాబ్స్ రూ. 1,350 కోట్లను సమకూర్చుకున్నాయి. బ్యాక్ గ్రౌండ్ ఇంజక్టబుల్ ఔషధాల తయారీ కంపెనీ గ్లాండ్ ఫార్మా.. హైదరాబాద్‌లో నాలుగు, విశాఖపట్టణంలో మూడు చొప్పున మొత్తం ఏడు ప్లాంట్లను కలిగి ఉంది. యాంటీడయాబెటిక్, యాంటీ మలేరియా, యాంటీ ఇన్ఫెక్టివ్స్, కార్డియాక్ తదితర పలు విభాగాలకు చెందిన ప్రొడక్టులను తయారు చేస్తోంది. గుండె వ్యాధులు, తదితర సర్జరీలలో వినియోగించే హెపరిన్ తయారీలో కంపెనీ పేరొందింది. సొంతంగానూ, కాంట్రాక్టు పద్ధతిలోనూ ప్రొడక్టులను రూపొందిస్తోంది. ఫ్రెసినియస్ కాబి(యూఎస్ఏ), ఎథెనెక్స్ ఫార్మాస్యూటికల్, సాజెంట్ ఫార్మా తదితర దిగ్గజాలకు ప్రొడక్టులను విక్రయిస్తోంది. యూఎస్, యూరప్, కెనడా తదితర 60 దేశాలకు అమ్మకాలను విస్తరించింది. పటిష్ట ఆర్అండ్ డీని కలిగి ఉంది. యూఎస్ లో 267 ఏఎన్ డీఏలకు ఫైలింగ్ చేసింది. వీటిలో 215 వరకూ అనుమతులు పొందింది. -
గ్లాండ్ ఫార్మా ఐపీవోకు సెబీ గ్రీన్‌సిగ్నల్
ఇంజక్టబుల్ ఔషధాల తయారీ కంపెనీ గ్లాండ్ ఫార్మా పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ఫార్మా రంగ కౌంటర్లకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో నవంబర్‌కల్లా గ్లాండ్ ఫార్మా ఐపీవోను చేపట్టవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. తద్వారా చైనీస్ కంపెనీ మాతృ సంస్థగా కలిగిన గ్లాండ్ ఫార్మా తొలిసారి దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానున్నట్లు పేర్కొంటున్నాయి. ఐపీవో ద్వారా రూ. 6,000 కోట్లను సమీకరించాలని గ్లాండ్ ఫార్మా భావిస్తోంది. మార్చి పతనం తదుపరి కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతుండటంతో పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వస్తున్న విషయం విదితమే. అయితే గత మూడు సంవత్సరాలలో దేశీయంగా ఒక్క ఫార్మా కంపెనీ కూడా పబ్లిక్ ఇష్యూకి రాకపోవడం గమనార్హం! ఇంతక్రితం 2017 జూన్‌లో ఎరిస్ లైఫ్‌సైన్స్ లిస్టయ్యాక తిరిగి గ్లాండ్ ఫార్మా ఐపీవో బాట పట్టినట్లు నిపుణులు తెలియజేశారు. కంపెనీ వివరాలు.. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్లాండ్ ఫార్మాకు మాతృ సంస్థ చైనీస్ ఫోజన్ గ్రూప్. ఐపీవోలో భాగంగా మాతృ సంస్థ ఫోజన్ గ్రూప్ కొంతమేర వాటాను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. రూ. 4,750 కోట్ల విలువైన వాటాతోపాటు.. తాజాగా రూ. 1,250 కోట్ల విలువైన షేర్లను జారీ చేయనున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఐపీవో నిధులను విస్తరణ వ్యయాలు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. హాంకాంగ్‌లో లిస్టయిన ఫోజన్ గ్రూప్ 2017 అక్టోబర్‌లో 1.09 బిలియన్ డాలర్లకు గ్లాండ్ ఫార్మాలో 74 శాతం వాటాను కొనుగోలు చేసింది. 1978లో పీవీఎన్ రాజు కంపెనీని ఏర్పాటు చేశారు. 1999 నుంచీ డాక్టర్ రవి పెన్మెత్స వైస్‌చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. తదుపరి 2019లో యాజమాన్యానికి సలహాదారునిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఎండీ, సీఈవోగా శ్రీనివాస్ ఎస్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫార్మా ప్రొడక్టులు గ్లాండ్ ఫార్మా ప్రధానంగా జనరిక్ ఇంజక్టబుల్ ఫార్మా ప్రొడక్టులను రూపొందిస్తోంది. కంపెనీ యూఎస్, యూరోపియన్ మార్కెట్ల నుంచి అత్యధికంగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. హైదరాబాద్‌లో నాలుగు, విశాఖపట్టణంలో మూడు చొప్పున మొత్తం ఏడు ప్లాంట్లను కలిగి ఉంది. యాంటీడయాబెటిక్, యాంటీ మలేరియా, యాంటీ ఇన్ఫెక్టివ్స్, కార్డియాక్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ తదితర పలు విభాగాలకు చెందిన ప్రొడక్టులను తయారు చేస్తోంది. గుండెపోటు, తదితర సమయాలలో చేసే సర్జరీలలో వినియోగించే హెపరిన్ తయారీలో కంపెనీ పేరొందింది. -
ఈక్విటాస్ స్మాల్ బ్యాంక్ ఐపీవో రేపు
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూ మంగళవారం(20) ప్రారంభంకానుంది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 32-33కాగా.. 450 షేర్లను ఒక లాట్‌గా కేటాయించారు. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 450 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 518 కోట్లవరకూ సమకూర్చుకోవాలని భావిస్తోంది. నేడు యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించడం ద్వారా కొంతమేర నిధులను సమీకరించనుంది. ఇష్యూ నిధులతో టైర్-1 క్యాపిటల్‌ను పటిష్టపరచుకోనుంది. తద్వారా భవిష్యత్ అవసరాలకు వినియోగించుకోనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. కంపెనీ తొలుత పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,000 కోట్లు సమీకరించాలని ఆశించింది. కనీస పెట్టుబడుల నిష్పత్తి మెరుగుపడటంతోపాటు, క్యాపిటల్ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ప్రణాళికలను సవరించుకున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ప్రమోటర్ వాటా పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.2 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటికి అదనంగా రూ. 280 కోట్ల విలువైన షేర్లను సైతం జారీ చేయనుంది. ఐపీవో తదుపరి బ్యాంక్‌లో ప్రమోటర్ల వాటా 82 శాతానికి పరిమితంకానుంది. 2021 సెప్టెంబర్‌కల్లా ఈ వాటాను 40 శాతానికి తగ్గించుకోవలసి ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఆపై 2028 సెప్టెంబర్‌కల్లా 26 శాతానికి పరిమితం చేసుకోవలసి ఉన్నట్లు వివరించారు. మూడో కంపెనీ పబ్లిక్ ఇష్యూ పూర్తయ్యాక ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన మూడో కంపెనీగా నిలవనుంది. ఎన్బీఎఫ్సీ ఈక్విటాస్ హోల్డింగ్స్‌కు పూర్తి అనుబంధ సంస్థ ఇది. ఇప్పటికే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్ పొందాయి. క్రిసిల్ నివేదిక ప్రకారం బ్యాంకింగ్ ఔట్లెట్స్ ద్వారా 2019లో ఈక్విటాస్ స్మాల్ బ్యాంక్ తొలి ర్యాంకులో నిలిచింది. ఈ విభాగంలో నిర్వహణలోని ఆస్తులు, డిపాజిట్ల రీత్యా రెండో పెద్ద సంస్థగా ఆవిర్భవించింది. దేశీయంగా ఏయూఎంలో 16 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. -
ఏంజెల్ బ్రోకింగ్‌కు యాంకర్ నిధులు
దేశంలో నాలుగో పెద్ద బ్రోకింగ్ సేవల కంపెనీ ఏంజెల్ బ్రోకింగ్ పబ్లిక్ ఇష్యూ నేటి నుంచి ప్రారంభమైంది. గురువారం(24న) ముగియనున్న ఇష్యూలో భాగంగా ఒక్కో షేరుకీ రూ. 305-306 ధరల శ్రేణిని కంపెనీ ప్రకటించింది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు, కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన సంస్థలు రూ. 300 కోట్ల విలువైన వాటాను విక్రయించనున్నాయి. దీనికి అదనంగా మరో రూ. 300 కోట్ల విలువైన షేర్లను ఏంజెల్ బ్రోకింగ్ జారీ చేయనుంది. తద్వారా రూ. 600 కోట్లను సమీకరించాలని ఆశిస్తోంది. ఏంజెల్ బ్రోకింగ్ ఐపీవోకు కనీస లాట్ 49 షేర్లు. అంటే ఆసక్తి కలిగిన రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 49 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. యాంకర్ పెట్టుబడులు ఐపీవోలో భాగంగా ఏంజెల్ బ్రోకింగ్ తాజాగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 180 కోట్లు సమకూర్చుకుంది. షేరుకి రూ. 306 ధరలో 58.8 లక్షల షేర్లను 12 సంస్థలకు కేటాయింంచింది. ఏంజెల్ బ్రోకింగ్‌లో ఇన్వెస్ట్ చేసిన యాంకర్ సంస్థలలో గోల్డ్‌మన్ శాక్స్ ఇండియా, మెక్వారీ ఫండ్ సొల్యూషన్స్, ఇన్వెస్కో ట్రస్టీ, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తదితరాలున్నాయి. బ్యాక్‌గ్రౌండ్.. టెక్నాలజీ ఆధారిత ఫైనాన్షియల్ సర్వీసులను ఏంజెల్ బ్రోకింగ్ అందిస్తోంది. ప్రధానంగా బ్రోకింగ్, అడ్వయజరీ, మార్జిన్ ఫండింగ్, షేర్ల తనఖాపై రుణాలు తదితరాలను క్లయింట్లకు సమకూర్చుతోంది. 7.7 లక్షల మంది యాక్టివ్ కస్టమర్లను కలిగి ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. 6.3 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. క్లయింట్ల రీత్యా దేశంలోనే నాలుగో పెద్ద బ్రోకింగ్ సంస్థగా ఏంజెల్ నిలుస్తోంది. జూన్‌కల్లా కంపెనీ నెట్‌వర్త్ రూ. 639 కోట్లను అధిగమించింది. ఏంజెల్ బ్రోకింగ్.. ఈ ఏడాది అంటే 2020లో పబ్లిక్ ఇష్యూకి వస్తున్న 8వ కంపెనీ కావడం గమనార్హం! -
కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్ ఐపీవో 21న
కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 21న(సోమవారం) ప్రారంభంకానుంది. ఇష్యూకి రూ. 338-340 ధరల శ్రేణికాగా.. తద్వారా రూ. 318 కోట్లను సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. 23న(బుధవారం) ముగియనున్న ఇష్యూలో భాగంగా 45 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటితోపాటు మరో రూ. 165 కోట్ల విలువచేసే షేర్లను తాజాగా జారీ చేయనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 44 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. యాంకర్ నిధులు ఐపీవోలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్ తాజాగా రూ. 95.4 కోట్లను సమకూర్చుకుంది. షేరుకి రూ. 340 ధరలో 28.06 లక్షల షేర్లను జారీ చేసింది. ఫార్మాస్యూటికల్ కెమికల్స్ తయారీ కంపెనీ.. కెమ్కాన్లో ఇన్వెస్ట్ చేసిన యాంకర్ సంస్థలలో ఐడీఎఫ్సీ ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్, డైనమిక్ ఈక్విటీ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ చైల్డ్‌కేర్ ప్లాన్, మిరాయి అసెట్ ఫండ్స్, టాటా మల్టీ అసెట్ అపార్చునిటీస్ ఫండ్ తదితరాలున్నాయి. ప్రమోటర్ల వాటా విక్రయం కెమ్‌కాన్ స్పెషాలిటీ కెమికల్స్‌లో ప్రమోటర్లయిన అగర్వాల్, గోయల్ కుంటుంబీకులకు 100 శాతం వాటా ఉంది. ఐపీవోలో భాగంగా కేఆర్ అగర్వాల్, ఎన్వీ గోయల్ 22.5 లక్షల షేర్లు చొప్పున విక్రయించనున్నారు. ఇవికాకుండా కంపెనీ రూ. 165 కోట్ల విలువచేసే ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ నిధులను తయారీ సామర్థ్య విస్తరణ, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కెమ్‌కాన్ పేర్కొంది. బ్యాక్‌గ్రౌండ్ కెమ్‌కాన్ ప్రధానంగా హెచ్ఎండీఎస్, సీఎంఐసీగా పేర్కొనే స్పెషలైజ్డ్ కెమికల్స్‌ను రూపొందిస్తోంది. వీటిని ఫార్మాస్యూటికల్ రంగంలో వినియోగిస్తారు. అంతేకాకుండా ఇన్ఆర్గానిక్ బ్రోమైడ్స్లోనూ ఉపయోగిస్తారు. కాల్షియం, జింక్, సోడియం బ్రోమైడ్స్గా పిలిచే వీటిని అత్యధికంగా చమురు క్షేత్రాల పరిశ్రమలో వినియోగిస్తారు. ఆయిల్వెల్ కంప్లీషన్ కెమికల్స్‌గా వీటిని సంబోధిస్తారు. ఫ్రాస్ట్ అండ్ సల్లివాన్ నివేదిక ప్రకారం దేశీయంగా హెచ్ఎండీఎస్ కెమికల్స్‌ను కెమ్‌కాన్ మాత్రమే తయారు చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో మూడో పెద్ద కంపెనీగా నిలుస్తోంది. కెమికల్ ఉత్పత్తులను యూఎస్, ఇటలీ, జర్మనీ, జపాన్, రష్యా తదితర పలు దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఫార్మా రంగంలో హెటెరో ల్యాబ్స్, లారస్ ల్యాబ్స్, అరబిందో తదితర పలు కంపెనీలను కస్టమర్లుగా కలిగి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 262 కోట్ల ఆదాయం, రూ. 70 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించింది. నికర లాభం రూ. 49 కోట్లుగా నమోదైంది. -
సోమవారం నుంచీ క్యామ్స్ పబ్లిక్ ఇష్యూ
స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈకి భారీ వాటా ఉన్న కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్- క్యామ్స్(CAMS) పబ్లిక్ ఇష్యూని చేపడుతోంది. సోమవారం (ఈ నెల 21న) ప్రారంభంకానున్న పబ్లిక్ ఇష్యూకి రూ. 1229-1230 ధరల శ్రేణిని ఎన్ఎస్ఈ ఇప్పటికే ప్రకటించింది. బుధవారం(23న) ముగియనున్న ఇష్యూలో భాగంగా 1.82 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో 1,82,500 షేర్లను ఉద్యోగులకు కేటాయించనుంది. వీటిని ఐపీవో ధరలో రూ. 122 డిస్కౌంట్‌కు జారీ చేయనున్నట్లు క్యామ్స్ తెలియజేసింది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 12 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇష్యూ ద్వారా రూ. 2242 కోట్లవరకూ సమకూర్చుకోవాలని క్యామ్స్ భావిస్తోంది. యాంకర్ నిధులు ఐపీవోలో భాగంగా క్యామ్స్.. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి దాదాపు రూ. 667 కోట్లను సమీకరించింది. షేరుకి రూ. 1230 ధరలో 35 సంస్థలకు షేర్లను విక్రయించింది. క్యామ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన సంస్థలలో స్మాల్ క్యాప్ వరల్డ్ ఫండ్, సింగపూర్ ప్రభుత్వం, అబుదభీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీతోపాటు 13 దేశీ మ్యూచువల్ ఫండ్ కంపెనీలున్నాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల ప్రకారం క్యామ్స్‌లోల మొత్తం 37.48 శాతం వాటాను పబ్లిక్ ఇష్యూ ద్వారా ఎన్ఎస్ఈ విక్రయించనుంది. తద్వారా కంపెనీ నుంచి ఎన్ఎస్ఈ వైదొలగనుంది. క్యామ్స్‌లో ప్రధాన ప్రమోటర్ కంపెనీ గ్రేట్ టెరైన్‌కు 43.53 శాతం వాటా ఉంది. ఐపీవో తదుపరి ఈ వాటా 30.98 శాతానికి పరిమితంకానుంది. పీఈ దిగ్గజం వార్బర్గ్ పింకస్‌కు చెందిన కంపెనీ ఇది. ఇతర వివరాలు.. 1988లో ఏర్పాటైన క్యామ్స్‌లో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ)కి 37.48 శాతం వాటా ఉంది. ప్రధాన ప్రమోటర్ గ్రేట్ టెరైన్ 43.53 శాతం వాటాను కలిగి ఉంది. దేశీయంగా మ్యూచువల్ ఫండ్స్‌కు అతిపెద్ద రిజిస్ట్రార్, ట్రాన్స్ఫర్ ఏజెంట్‌గా సేవలందిస్తోంది. దేశీ ఎంఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తుల సగటు రీత్యా చూస్తే క్యామ్స్ 70 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2020 జులైకల్లా దేశంలోని అతిపెద్ద 15 ఫండ్ హౌస్‌లలో 9 సంస్థలను క్లయింట్లుగా కలిగి ఉంది. టాప్-5 ఎంఎఫ్‌లలో నాలుగింటికి సేవలందిస్తోంది. -
ఏంజెల్ బ్రోకింగ్ ఐపీవో ధర రూ. 305-306
దేశంలో నాలుగో పెద్ద బ్రోకింగ్ సేవల కంపెనీ ఏంజెల్ బ్రోకింగ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు ఒక్కో షేరుకీ రూ. 305-306 ధరల శ్రేణిని ఖరారు చేసింది. ఇష్యూ ఈ నెల 22న(మంగళవారం) ప్రారంభమై 24న(గురువారం) ముగియనుంది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు, కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన సంస్థలు రూ. 300 కోట్ల విలువైన వాటాను విక్రయించనున్నాయి. దీనికి అదనంగా మరో రూ. 300 కోట్ల విలువైన షేర్లను ఏంజెల్ బ్రోకింగ్ జారీ చేయనుంది. తద్వారా రూ. 600 కోట్లను సమీకరించాలని ఆశిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్.. పబ్లిక్ ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు సైతం ఏంజెల్ బ్రోకింగ్ షేర్లను విక్రయించనుంది. తద్వారా ఈ నెల 21న నిధులు సమకూర్చుకోనుంది. ఐపీవోకు కనీస లాట్ 49 షేర్లు. అంటే ఆసక్తి కలిగిన రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 49 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. కాగా.. టెక్నాలజీ ఆధారిత ఫైనాన్షియల్ సర్వీసులను ఏంజెల్ బ్రోకింగ్ అందిస్తోంది. ప్రధానంగా బ్రోకింగ్, అడ్వయజరీ, మార్జిన్ ఫండింగ్, షేర్ల తనఖాపై రుణాలు తదితరాలను క్లయింట్లకు సమకూర్చుతోంది. 7.7 లక్షల మంది యాక్టివ్ కస్టమర్లను కలిగి ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. 6.3 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. క్లయింట్ల రీత్యా దేశంలోనే నాలుగో పెద్ద బ్రోకింగ్ సంస్థగా ఏంజెల్ నిలుస్తోంది. జూన్‌కల్లా కంపెనీ నెట్‌వర్త్ రూ. 639 కోట్లను అధిగమించింది. ఏంజెల్ బ్రోకింగ్.. ఈ ఏడాది అంటే 2020లో పబ్లిక్ ఇష్యూకి వస్తున్న 8వ కంపెనీ కావడం గమనార్హం! -
రూట్ మొబైల్ ఐపీవోకు యాంకర్ నిధులు
ఐపీవోలో భాగంగా ఓమ్నిచానల్ క్లౌడ్ కమ్యూనికేషన్ సర్వీసుల సంస్థ రూట్ మొబైల్.. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 180 కోట్లు సమీకరించింది. షేరుకి రూ. 350 ధరలో 15 సంస్థలకు దాదాపు 51.43 లక్షల షేర్లను జారీ చేసింది. ఐపీవోలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలలో ఎస్బీఐ ఎంఎఫ్, ఎస్బీఐ లైఫ్, గోల్డ్‌మన్ శాక్స్, ఐసీఐసీఐ ప్రు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తదితరాలున్నాయి. లాట్ 40 షేర్లు రూట్ మొబైల్ పబ్లిక్ ఇష్యూ నేడు ప్రారంభమైంది. శుక్రవారం(11న) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 345-350. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 40 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంతకంటే అధికంగా కావాలనుకుంటే రూ. 2 లక్షలకు మించకుండా బిడ్స్ దాఖలు చేయవచ్చు. ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు సందీప్ కుమార్ గుప్తా, రాజ్‌దీప్ కుమార్ గుప్తా రూ. 360 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. వీటికి అదనంగా మరో రూ. 240 కోట్ల విలువైన షేర్లను కంపెనీ జారీ చేయనుంది. తద్వారా రూ. 600 కోట్లను సమీకరించాలని రూట్ మొబైల్ భావిస్తోంది. చెల్లింపులు, కొనుగోళ్లు తదితర వ్యూహాత్మక అవసరాలకు నిధులను వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. కంపెనీ వివరాలు రూట్ మొబైల్ 2004లో ఏర్పాటైంది. 30,150 మందికిపైగా క్లయింట్లకు సేవలందించినట్లు పబ్లిక్ ఇష్యూ సందర్భంగా కంపెనీ వెల్లడించింది. ప్రధానంగా ఎంటర్ప్రైజెస్, మొబైల్ ఆపరేటర్, బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ విభాగాలలో క్లయింట్లకు సేవలు అందిస్తున్నట్లు తెలియజేసింది. కంపెనీ సర్వీసులలో అప్లికేషన్ టు పీర్(A2P), పీటూఏ, 2వే మెసేజింగ్, ఓటీటీ బిజినెస్ మెసేజింగ్, వాయిస్, ఓమ్ని చానల్ కమ్యూనికేషన్ తదిరాలున్నాయి. ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, మధ్యప్రాచ్యం, ఉత్తర అమెరికాలలో సర్వీసులు అందిస్తున్నట్లు తెలియజేసింది. గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో నికర లాభం స్వల్పంగా పెరిగి రూ. 80 కోట్లకు చేరువైనట్లు తెలియజేసింది. విదేశాలలో సేవలందిస్తున్న 27 మందిసహా కంపెనీ సిబ్బంది సంఖ్య 291కు చేరినట్లు వెల్లడించింది. ఇప్పటికే లిస్టయిన అఫ్లే ఇండియాతో రూట్ మొబైల్ కార్యకలాపాలను పోల్చవచ్చని విశ్లేషకులు ఈ సందర్భంగా తెలియజేశారు. -
హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీవో.. భలే రెస్పాన్స్
డిజిటల్ టెక్నాలజీ ఆధారిత సాఫ్ట్వేర్ సేవలందించే హ్యాపీయెస్ట్ మైండ్స్ పబ్లిక్ ఇష్యూ నేడు(9న) ముగియనుంది. సోమవారం ప్రారంభమైన ఇష్యూ నేటి మధ్యాహ్నానికల్లా 34 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా 2.3 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 79.44 కోట్ల షేర్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. రిటైల్ విభాగంలో 50 రెట్లు, సంపన్న వర్గాల నుంచి 80 రెట్లు అధికంగా స్పందన లభించగా.. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి 6 రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్ లభించింది. ఇతర వివరాలు.. హ్యాపీయెస్ట్ మైండ్స్ ఇష్యూకి ధరల శ్రేణి రూ. 165-166కాగా.. రూ. 702 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. షేరు ముఖ విలువ రూ. 2కాగా.. రిటైల్ ఇన్వెస్టర్లకు ఒక్కో లాట్ 90 షేర్లుగా నిర్ణయించారు. ఇంతకంటే అధికంగా కావాలనుకుంటే.. రూ. 2 లక్షలకు మించకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇష్యూలో భాగంగా కంపెనీ తొలినాళ్లలో ఇన్వెస్ట్ చేసిన జేపీ మోర్గాన్ ఇన్వెస్ట్‌మెంట్‌కు చెందిన సీఎండీబీ-2 తమకున్న 19.4 శాతం వాటా(2.72 కోట్ల షేర్లకుపైగా) విక్రయించనుంది. ప్రమోటర్ అశోక్ సూతా 84.14 లక్షల షేర్లను విక్రయించనున్నారు. ఐటీ సర్వీసుల రంగం నుంచి ఇంతక్రితం 2016లో ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ పబ్లిక్ ఇష్యూ చేపట్టిన విషయం విదితమే. యాంకర్ నిధులు ఐపీవోలో భాగంగా హ్యాపీయెస్ట్ మైండ్స్.. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 316 కోట్లను సమీకరించింది. షేరుకి రూ. 166 ధరలో 1.9 కోట్ల షేర్లను జారీ చేసింది. సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్, జీఐసీ పీటీఈ, ఎవెండస్ క్యాపిటల్, ఐఐఎఫ్ఎల్ అసెట్ మేనేజ్మెంట్ తదితర 25 సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. కాగా.. హ్యాపీయెస్ట్ మైండ్స్ ఇష్యూకి అనధికార(గ్రే) మార్కెట్లో 50 శాతం ప్రీమియం పలుకుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బ్యాక్‌గ్రౌండ్.. దేశీ సాఫ్ట్వేర్ రంగంలో అత్యంత అనుభవశాలి అయిన అశోక్ సూతా 2011లో హ్యాపీయెస్ట్ మైండ్స్‌ను ఏర్పాటు చేశారు. 2000లో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన సాఫ్ట్వేర్ సేవల మధ్యస్థాయి కంపెనీ మైండ్‌ట్రీకి సైతం సూతా సహవ్యవస్థాపకుడుగా వ్యవహరించారు. ఐటీ దిగ్గజం విప్రోలో 1984-99 మధ్య కాలంలో పలు హోదాలలో సేవలందించారు. క్లౌడ్, సెక్యూరిటీ, అనలిటిక్స్ విభాగాలలో సాఫ్ట్వేర్ సేవలు అందిస్తున్న హ్యాపీయెస్ట్ మైండ్స్ గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో రూ. 714 కోట్ల ఆదాయం ఆర్జించింది. గత మూడేళ్లలో సగటున 20.8 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. డిజిటల్ టెక్నాలజీస్ ద్వారానే 97 శాతం ఆదాయం ఆర్జిస్తున్నట్లు సూతా పేర్కొన్నారు. డిజిటల్ బిజినెస్ సర్వీసెస్, ప్రొడక్ట్ ఇంజినీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ సర్వీసుల పేరుతో మూడు ప్రధాన విభాగాలను కంపెనీ నిర్వహిస్తోంది.