
ప్రభుత్వ రంగ సంస్థ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌సీఎల్) పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2024–25)లో స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు కంపెనీ ఎండీ పీఆర్ జైశంకర్ పేర్కొన్నారు.
ఇందుకు త్వరలోనే కన్సల్టేషన్ కార్యక్రమానికి తెరతీయనున్నట్లు కంపెనీ వ్యవస్థాపక రోజు సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీలో కేంద్రానికి 100% వాటా ఉంది. కంపెనీ ఏర్పాటయ్యాక ఇప్పటివరకూ 750 ప్రాజెక్టులకు రూ. 2.5 లక్షల కోట్ల రుణాలందించినట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో రూ. 1,076 కోట్ల నికర లాభం ఆర్జించగా.. ఈ ఏడాది(2023–24) రూ. 1,500 కోట్ల లాభం సాధించవచ్చని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment