
న్యూఢిల్లీ: హోమ్ అప్లయెన్సెస్ దిగ్గజం ఎల్‌జీ ఎల్రక్టానిక్స్ ఇండియా పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదముద్ర వేసింది. తద్వారా దక్షిణ కొరియా దిగ్గజం ఎల్‌జీ దేశీ అనుబంధ సంస్థ రూ. 15,000 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వెరసి దేశీయంగా లిస్టయిన రెండో దక్షిణ కొరియా కంపెనీగా నిలవనుంది. గతేడాది అక్టోబర్‌లో హ్యుందాయ్ మోటార్స్ ఇండియా పబ్లిక్ ఇష్యూ చేపట్టి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన విషయం విదితమే.
ఎల్‌జీ ఎల్రక్టానిక్స్ ఇండియా 2024 డిసెంబర్‌లో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా మాతృ సంస్థ 15 శాతం వాటాకు సమానమైన 10.18 కోట్ల షేర్లను విక్రయించనుంది. గత నెలలో ఐపీవోపై కంపెనీ రోడ్‌షోలను సైతం ప్రారంభించింది. హోమ్ అప్లయెన్సెస్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్‌లో దేశీయంగా ఎల్‌జీ టాప్ ర్యాంక్ సంస్థలలో ఒకటిగా నిలుస్తోంది. కంపెనీ ప్రొడక్టులలో వాషింగ్ మెషీన్లు, లెడ్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, మైక్రోవేవ్‌లు, వాటర్ ఫిల్టర్లు తదితరాలున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా, మహారాష్ట్రలోని పుణేలో తయారీ యూనిట్లను కలిగి ఉంది. 2023–24లో రూ. 64,088 కోట్ల ఆదాయం అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment