SEBI approval
-
రెండు ఐపీవోలకు సెబీ గ్రీన్ సిగ్నల్
రియల్టీ సంస్థ కల్పతరు లిమిటెడ్‌తోపాటు, హైప్రెసిషన్ ఇంజినీరింగ్ కంపెనీ యూనిమెక్ ఏరోస్పేస్ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్ పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐపీవోలో కల్పతరు పూర్తిగా తాజా ఈక్విటీని జారీ చేయనుంది. యూనిమెక్ ఏరోస్పేస్ తాజాగా ఈక్విటీ జారీసహా ప్రమోటర్లు షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈ ఏడాది ఆగస్టులో రెండు కంపెనీలు సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి.రూ.1,590 కోట్లపై దృష్టికల్పతరు కంపెనీ ప్రాస్పెక్టస్ ప్రకారం సంస్థ ఐపీవోలో భాగంగా రూ.1,590 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ఐపీవో నిధుల్లో దాదాపు రూ.1,193 కోట్లు కల్పతరు గ్రూప్ కంపెనీ రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. కల్పతరు గ్రూప్‌లో కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్, ప్రాపర్టీ సొల్యూషన్స్(ఇండియా), శ్రీ శుభం లాజిస్టిక్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: అంతా ఓకే.. కేవలం వ్యక్తులపైనే ఆరోపణలు..రూ.500 కోట్ల సమీకరణఐపీవోలో భాగంగా యూనిమెక్ ఏరోస్పేస్ రూ.250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు మరో రూ.250 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో కొంతమేర మెషీనరీ, పరికరాల కొనుగోలు ద్వారా విస్తరణకు వినియోగించనుంది. ఈ బాటలో వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, రుణ చెల్లింపులు తదితరాలకు సైతం నిధులను వెచ్చించనుంది. -
డేటా షేరింగ్‌పై సెబీ చర్చాపత్రం
డేటా గోప్యత, జవాబుదారీతనం మొదలైన పరిశోధనల కోసం డేటాను షేర్ చేసుకోవడానికి ప్రత్యేక విధానాలు రూపొందించుకోవాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదించింది. ఈమేరకు స్టాక్ ఎక్ఛ్సేంజీలు, ఇతర మార్కెట్ ఇన్ఫ్రా సంస్థలు (ఎంఐఐ) సొంత విధానాలను ఏర్పాటు చేసుకోవాలని సెబీ తెలిపింది.వాణిజ్య అవసరాల కోసం షేర్ చేసుకునే డేటా గోప్యత, జవాబుదారీతనం..వంటి అంశాలపై సెబీ చర్చాపత్రాన్ని రూపొందించింది. సెబీలో భాగమైన మార్కెట్ డేటా అడ్వైజరీ కమిటీ(ఎండీఏసీ) సూచనల ప్రకారం మార్కెట్ డేటాకు బాధ్యత వహించాల్సిన సంస్థలు డేటా సేకరణ, ప్రాసెసింగ్, స్టోరేజ్, షేరింగ్, గోప్యత పాటించడం, యాక్సెస్ ఇవ్వడం మధ్య సమతూకంతో వ్యవహరించేలా తగు విధానాలను రూపొందించుకోవాలి. ఎంఐఐలు డేటాను రెండు కేటగిరీల కింద వర్గీకరించాలి. ఒకటి బహిరంగంగా షేర్ చేసుకునే డేటా. రెండు..గోప్యంగా ఉంచాల్సిన డేటా. కేవైసీ వివరాలు, వ్యక్తులు, సంస్థలను గుర్తించేందుకు పరోక్షంగా ఉపయోగపడే డేటా రెండో కేటగిరీ పరిధిలోకి వస్తుంది. మార్కెట్లో స్థిరమైన విధానాలను పాటించేలా చూడటం ఈ పాలసీ లక్ష్యంగా సెబీ తెలిపింది. ఈ ప్రతిపాదనలపై అక్టోబర్ 29లోగా సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: గరిష్ఠాలను చేరిన బంగారం ధర! -
ఎన్ఎస్ఈ ప్రతిపాదనను తోసిపుచ్చిన సెబీ..
ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ వేళల పెంపు ప్రతిపాదనను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తిరస్కరించింది. స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ చేసిన ప్రతిపాదనకు సెబీ తాజాగా నో చెప్పింది. ఈ అంశంపై స్టాక్ బ్రోకర్ల నుంచి ఎలాంటి స్పందన లభించకపోవడంతో సెబీ తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్‌కుమార్ చౌహాన్ పేర్కొన్నారు.దశలవారీగా ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో లావాదేవీలు చేపట్టే వేళలను పెంచలంటూ ఎన్ఎస్ఈ.. సెబీకి దరఖాస్తు చేసింది. అయితే ఇందుకు స్టాక్ బ్రోకర్ల అభిప్రాయాలను కోరినప్పటికీ స్పందన లభించకపోవడంతో సెబీ దరఖాస్తును తిప్పిపంపినట్లు ఎన్ఎస్ఈ వెల్లడించింది. ఫలితంగా ప్రస్తుతానికి ట్రేడింగ్ వేళల పెంపు ప్రతిపాదన వీగిపోయినట్లేనని తెలియజేసింది.ఇదీ చదవండి: ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్!ప్రపంచ మార్కెట్ల నిరంతర సమాచారం కారణంగా తలెత్తే ఓవర్‌నైట్ రిస్క్‌లను తగ్గించుకునేందుకు వీలుగా ఎన్ఎస్ఈ ట్రేడింగ్ వేళల పెంపు ప్రతిపాదనకు తెరతీసింది. రోజువారీ(ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 3.30వరకూ) సెషన్ ముగిశాక కమోడిటీ డెరివేటివ్స్ తీరులో సాయంత్రం 6–9 గంటల మధ్య ట్రేడింగ్‌కు గతేడాది సెప్టెంబర్‌లో ప్రతిపాదించినట్లు ఎన్ఎస్ఈ బిజినెస్ డెవలప్మెంట్ చీఫ్ శ్రీరామ్ కృష్ణన్ పేర్కొన్నారు. తదుపరి స్టాక్ బ్రోకర్ల స్పందననుబట్టి క్రమంగా రాత్రి 11.55 వరకూ పొడిగించేందుకు యోచించినట్లు తెలియజేశారు. -
హెచ్‌బిట్స్ ఆల్టర్నేటివ్ ఫండ్‌కు సెబీ ఆమోదం
న్యూఢిల్లీ: అంకుర సంస్థ హెచ్‌బిట్స్ ప్రతిపాదిత రూ. 500 కోట్ల ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌కు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతినిచి్చంది. ఈ ఫండ్ ద్వారా సేకరించిన నిధులను కమర్షియల్ రియల్ ఎస్టేట్‌పై ఇన్వెస్ట్ చేయనున్నట్లు హెచ్‌బిట్స్ వెల్లడించింది. ఈ పెట్టుబడులపై ఇన్వెస్టర్లు 18–20 శాతం మేర రాబడులు అందుకునే అవకాశం ఉందని పేర్కొంది. మే నెలాఖరున సెబీ నుంచి అనుమతి లభించిందని, ప్రస్తుతం ఫ్యామిలీ ఆఫీస్‌లు, అత్యంత సంపన్నులు, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, ఇంటర్నేషనల్ ఫండ్స్ నుంచి నిధులు సమీకరిస్తున్నామని వివరించింది. ప్రస్తుతం హెచ్‌బిట్స్ తొమ్మిది ప్రాపరీ్టలవ్యాప్తంగా రూ. 220 కోట్ల అసెట్స్‌ను నిర్వహిస్తోంది. 50,000 మంది పైచిలుకు రిజిస్టర్డ్ యూజర్లు ఉన్నారు. -
నాలుగు ఐపీవోలకు సెబీ ఓకే..
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మూడు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో బిబా ఫ్యాషన్స్, కీస్టోన్ రియల్టర్స్, ప్లాజా వైర్స్, హేమానీ ఇండస్ట్రీస్ చేరాయి. సంప్రదాయ దుస్తుల ఫ్యాషన్ లేబుల్ బిబా ఫ్యాషన్ ఏప్రిల్‌లో సెబీకి దరఖాస్తు చేసింది. వార్బర్గ్ పింకస్, ఫేరింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఐపీవోలో భాగంగా రూ. 90 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 2.77 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. జూన్‌లో దరఖాస్తు చేసిన రుస్తోంజీ గ్రూప్ కంపెనీ కీస్టోన్ రియల్టర్స్ ఐపీవో ద్వారా రూ. 850 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. దీనిలో రూ. 700 కోట్లమేర ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ఇక రూ. 2,000 కోట్ల సమీకరణకు వీలుగా ఆగ్రోకెమికల్ తయారీ కంపెనీ హేమానీ ఇండస్ట్రీస్ మార్చిలో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. వైర్లు, అల్యూమినియం కేబుళ్ల కంపెనీ ప్లాజా వైర్స్ మే నెలలో దరఖాస్తు చేసింది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా 1,64,52,000 ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
మదుపరులకు శుభవార్త.. ఎల్ఐసీ ఐపీఓకు సెబీ ఆమోదం..!
న్యూఢిల్లీ: పెట్టుబడిదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎల్ఐసీ ఐపీఓకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆమోదం తెలిపింది. సాధారణంగా ఏదైనా ఒక కంపెనీ ఐపీఓకు దరఖాస్తు చేసుకున్న 30-40 రోజుల తర్వాత సెబీ ఆమోదం తెలుపుతుంది. కానీ, ఎల్ఐసీ ఐపీఓ విషయంలో మార్కెట్ రెగ్యులేటర్ 22 రోజుల్లో ఆమోదం తెలపడం విశేషం. ఎల్ఐసీ ఫిబ్రవరిలో తన ముసాయిదా పత్రాలను మార్కెట్ రెగ్యులేటర్ సంస్థకు దాఖలు చేసింది. బీమా కంపెనీలో 100 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వ కలిగి ఉంది. ఎల్ఐసీలో 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్లకు పైగా ఈక్విటీ షేర్లను రూ.10 ముఖ విలువతో ప్రభుత్వం విక్రయించనుంది. దీంతో, కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రూ.63,000 కోట్ల వరకు వచ్చి చేరతాయని మర్చంట్ బ్యాంకర్ల అంచనా. తద్వారా ఇదే దేశీయంగా అతిపెద్ద ఇష్యూగా నిలవనుంది. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) రూపంలో జరగనుంది. సంస్థలో 100 శాతం వాటా (632.49 కోట్ల షేర్లను) కలిగిన ప్రభుత్వం 5 శాతం వాటాను ఇలా విక్రయించనుంది. కొత్తగా షేర్లు ఏమీ జారీ చేయడం లేదు. ఒకసారి సెబీ అనుమతి లభించిన తర్వాత ఐపీఓకి వెళ్లడమే ఇక తరువాయి. అది ఎప్పడన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది. (చదవండి: డెట్ ఇష్యూల్లో రూ.5 లక్షల వరకు పెట్టుబడులకు యూపీఐ) -
రెండు లక్షల కోట్ల రూపాయల ఐపీవో! భారీ పబ్లిక్ ఇష్యూ!
దిగ్గజ స్టాక్ ఎక్సే్ంజీ ఎన్ఎస్ఈ పబ్లిక్ ఇష్యూకి మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈ అంశంపై తాజాగా తీసుకున్న న్యాయ సలహాలు ఎన్ఎస్ఈ ఆఫర్ జారీకి అనుకూలంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గతంలో ఆల్గో ట్రేడింగ్ కుంభకోణం నేపథ్యంలో సెబీ ఇందుకు విముఖత చూపిన సంగతి తెలిసిందే. కాగా.. ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో లీడర్‌గా నిలుస్తున్న నేషనల్ స్టాక్ ఎక్సేంజీ (ఎన్ఎస్ఈ) పబ్లిక్ ఇష్యూకి భారీ స్థాయిలో స్పందన లభించనున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. వివరాలు చూద్దాం.. NSE Likely to Get Clearance from SEBI for Big Ticket IPO: నేషనల్ స్టాక్ ఎక్సే్ంజీ త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో ఆల్గోరిథమ్ ట్రేడింగ్ స్కామ్ నేపథ్యంలో రెడ్‌సిగ్నల్ ఇచ్చిన సెబీ తాజాగా న్యాయపరమైన అంశాలను తీసుకుని, ఆఫర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో తిరిగి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయడానికి ఎన్ఎస్ఈకి సెబీ అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తద్వారా త్వరలో ఎన్ఎస్ఈ ఐపీవో చేపట్టే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా.. ఇప్పటికే అనధికార(గ్రే) మార్కెట్లో ఎన్ఎస్ఈ షేరు రూ.3,000–4,000 శ్రేణిలో కదులుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. అతిపెద్ద ఇష్యూ ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో దాదాపు ఏకచత్రాధిపత్యం వహిస్తున్న ఎన్ఎస్ఈ పబ్లిక్ ఇష్యూకి భారీ స్పందన లభించే వీలుంది. ఐపీవో ద్వారా ఎన్ఎస్ఈ రూ. 2 లక్షల కోట్ల విలువను సాధించవచ్చని అంచనా. నిజానికి 2016 డిసెంబర్లోనే లిస్టింగ్‌కు వీలుగా ఎన్ఎస్ఈ సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. అయితే తదుపరి ఆల్గో ట్రేడింగ్ మోసం బయటపడటంతో సెబీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అజయ్ త్యాగి ఎన్ఎస్ఈ ఐపీవోకు చెక్ పెట్టారు. ఎక్సే్ంజీ సహలొకేషన్ల సర్వర్ల ద్వారా డేటా చౌర్యం జరిగినట్లు ఆరోపణల నేపపథ్యంలో సెబీ దర్యప్తుకు సైతం ఆదేశించింది. సెబీ చర్యలు ఆల్గో స్కామ్ నేపథ్యంలో 2019 మే నెలలో సెబీ రూ.1,000 కోట్లు చెల్లించమంటూ ఎన్ఎస్ఈని ఆదేశించింది. అంతేకాకుండా ఎక్సే్ంజీ సీనియర్ అధికారులపై కేసులు నమోదు చేసింది. కాగా.. ప్రస్తుతం ఈ కేసు కోర్టుల పరిధిలో ఉన్నప్పటికీ సెబీ తాజాగా న్యాయ సలహా పొందినట్లు తెలుస్తోంది. ఎన్ఎస్ఈలో వాటా విక్రయానికి కోర్టు అభ్యంతరం చెప్పకపోవడంతో తిరిగి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయవలసిందిగా ఎన్ఎస్ఈను సెబీ ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. మరోపక్క కుంభకోణంలో పాత్ర ఉన్నట్లు కేసులు నమోదైన అధికారులను ఎక్సే్ంజీ నుంచి తొలగించడం సానుకూల అంశంగా నిలవనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. సెబీ రూ.1,000 కోట్ల జరిమానా విధింపుపై ఎన్ఎస్ఈ శాట్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బీఎస్ఈతో పోలిస్తే ఇప్పటికే లిస్టింగ్‌ను సాధించిన మరో స్టాక్ ఎక్సే్ంజీ దిగ్గజం బీఎస్ఈ గత 12 నెలల ఆర్జనను పరిగణిస్తే 38 పీఈ (నిష్పత్తి)లో ట్రేడవుతున్నట్లు బ్రోకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే అతిభారీ ప్రయివేట్ డీల్స్ నమోదయ్యే ఎన్ఎస్ఈ విలువ 80–100 స్థాయిలో ఉండవచ్చని అంచనా వేస్తున్నాయి. దీంతో ఎన్ఎస్ఈ ఐపీవో ధరల శ్రేణి సైతం ప్రీమియంలో నిర్ణయంకావచ్చని భావిస్తున్నాయి. ఈక్విటీ డెరివేటివ్స్‌లో దాదాపు ఏకచత్రాధిపత్యం వహిస్తున్న కారణంగా ఎన్ఎస్ఈ 80 శాతం ఇబిటా మార్జిన్లు సాధిస్తున్నట్లు చెబుతున్నారు. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 2021 మార్చికల్లా ఎన్ఎస్ఈ నిర్వహణ ఆదాయంలో 60 శాతం వృద్ధిని సాధించింది. రూ. 5,625 కోట్లను ఆర్జించింది. నికర లాభం సైతం 89 శాతం జంప్‌చేసి రూ. 3,574 కోట్లను తాకింది. అయితే గతేడాది అనుబంధ సంస్థ క్యామ్స్(సీఏఎంఎస్)లో వాటా విక్రయం ద్వారా పొందిన ఆదాయం నికర లాభాల్లో కలసి ఉన్న విషయం గమనార్హం! చదవండి:కొనసాగుతున్న ఐపీవోల సందడి -
16 వేల కోట్ల రూపాయల ఐపీవో.. డ్యాన్స్‌తో అదరగొట్టిన సీఈవో
చిన్న మొక్కగా మొదలైన స్టార్టప్ కంపెనీలు పెద్ద వట వృక్షంలా ఎదిగితే దాన్ని స్థాపించిన వ్యక్తుల ఆనందానికి హద్దే ఉండదు. ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నారు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ. సెబీ తాజా నిర్ణయంతో ఆయనలో ఉప్పొంగిన సంతోషం కట్టలు తెంచుకుని చక్కని నృత్యంగా మారింది. సెబీ గ్రీన్ సిగ్నల్ ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం గత కొంత కాలంగా తమ సేవలను మరింతగా విస్తరించే యోచనలో ఉంది. దీంతో నిధుల సమీకరణ ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది. అందులో భాగంగా ఏడాది కాలంగా పబ్లిక్ ఇష్యూకి వచ్చేందుకు సన్నహకాలు చేస్తోంది. కాగా తాజాగా పేటీఎంకి సంబంధించి ఇన్షియల్ పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కి సెక్యూరిటీ ఎక్సేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అనుమతి ఇచ్చింది. రూ, 16,600 కోట్లు పేటీఎం సంస్థ ఐపీవో ద్వారా రికార్డు స్థాయిలో రూ. 16,600 కోట్ల రూపాయలను మార్కెట్ నుంచి సమీకరించనుంది. దీంతో పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఆనందంతో డ్యాన్స్ చేశారు. సెబీ నుంచి అనుమతులు వచ్చాయనే విషయం తెలియగానే సంస్థకు చెందిన ఉద్యోగులతో కలిసి ఆఫీసులో చిందులేశారు. అమితాబ్ పాటకి బిగ్‌బి అమితాబ్ నటించిన లావారిస్ సినిమాలో అప్‌నీతో జైసే తైసే పాటకి లయబద్దంగా నృత్యం చేస్తూ విజయ్ శేఖర్ శర్మ తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ వీడియోను మరో పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రస్తుతం విజయ్ శేఖర్‌కి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. జోమాటో తర్వాత స్టాక్ మార్కెట్లో స్టార్టప్‌లు సంచలనం సృష్టిస్తున్నాయి. జోమాటో సృష్టించిన ప్రకంపనలు ఇంకా ఆగకముందే మరోసారి మార్కెట్లో అలజడి రేపేందుకు పేటీఎం రెడీ అయ్యింది. Scenes at Paytm office after SEBI approves one of India’s largest IPOs 😀😀@vijayshekhar pic.twitter.com/6yQHKVBm39 — Harsh Goenka (@hvgoenka) October 24, 2021 -
ఇండిగో పెయింట్స్ ఐపీవో బాట
ముంబై: పీఈ దిగ్గజం సీక్వోయయా క్యాపిటల్ అండగా దేశీ మార్కెట్లో కార్యకలాపాలు విస్తరించిన ఇండిగో పెయింట్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసింది. ఐపీవోలో భాగంగా సీక్వోయా క్యాపిటల్ 58.4 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనుంది. అంతేకాకుండా వీటికి అదనంగా రూ. 300 కోట్ల విలువచేసే ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ప్రమోటర్ హేమంత్ జలాన్ సైతం కొంతమేర వాటాను విక్రయించనున్నారు. తద్వారా కంపెనీ రూ. 1,000 కోట్లను సమీకరించే యోచనలో ఉంది. చదవండి: చదవండి: (ఐపీవోలకు తొందరపడుతున్న కంపెనీలు) ప్రాస్పెక్టస్ ప్రకారం ఇండిగో పెయింట్స్ ఐపీవో నిధులను కంపెనీకున్న తయారీ ప్లాంట్ల విస్తరణకు ప్రధానంగా వినియోగించనుంది. తమళినాడులోని పుదుకొట్టాయ్‌లోగల ప్లాంటు తయారీ సామర్థ్యాన్ని పెంచనుంది. మరికొన్ని నిధులను రుణ చెల్లింపులకూ వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. పుణేకు చెందిన ఇండిగో పెయింట్స్ ప్రధానంగా వివిధ డెకొరేటివ్ పెయింట్లను రూపొందిస్తోంది. దేశవ్యాప్తంగా పంపిణీ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. కంపెనీకి తమిళనాడు, రాజస్తాన్, కేరళలలో మొత్తం మూడు తయారీ యూనిట్లు ఉన్నాయి. పబ్లిక్ ఇష్యూకి కొటక్ మహీంద్రా క్యాపిటల్, ఎడిల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బుక్‌రన్నింగ్ లీడ్ మేనేజర్స్‌గా వ్యవహరించనున్నాయి. చదవండి:(గ్లాండ్ ఫార్మా ఐపీవో సోమవారమే) -
గ్లాండ్ ఫార్మా ఐపీవోకు సెబీ గ్రీన్‌సిగ్నల్
ఇంజక్టబుల్ ఔషధాల తయారీ కంపెనీ గ్లాండ్ ఫార్మా పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ఫార్మా రంగ కౌంటర్లకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో నవంబర్‌కల్లా గ్లాండ్ ఫార్మా ఐపీవోను చేపట్టవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. తద్వారా చైనీస్ కంపెనీ మాతృ సంస్థగా కలిగిన గ్లాండ్ ఫార్మా తొలిసారి దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానున్నట్లు పేర్కొంటున్నాయి. ఐపీవో ద్వారా రూ. 6,000 కోట్లను సమీకరించాలని గ్లాండ్ ఫార్మా భావిస్తోంది. మార్చి పతనం తదుపరి కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతుండటంతో పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వస్తున్న విషయం విదితమే. అయితే గత మూడు సంవత్సరాలలో దేశీయంగా ఒక్క ఫార్మా కంపెనీ కూడా పబ్లిక్ ఇష్యూకి రాకపోవడం గమనార్హం! ఇంతక్రితం 2017 జూన్‌లో ఎరిస్ లైఫ్‌సైన్స్ లిస్టయ్యాక తిరిగి గ్లాండ్ ఫార్మా ఐపీవో బాట పట్టినట్లు నిపుణులు తెలియజేశారు. కంపెనీ వివరాలు.. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్లాండ్ ఫార్మాకు మాతృ సంస్థ చైనీస్ ఫోజన్ గ్రూప్. ఐపీవోలో భాగంగా మాతృ సంస్థ ఫోజన్ గ్రూప్ కొంతమేర వాటాను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. రూ. 4,750 కోట్ల విలువైన వాటాతోపాటు.. తాజాగా రూ. 1,250 కోట్ల విలువైన షేర్లను జారీ చేయనున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఐపీవో నిధులను విస్తరణ వ్యయాలు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. హాంకాంగ్‌లో లిస్టయిన ఫోజన్ గ్రూప్ 2017 అక్టోబర్‌లో 1.09 బిలియన్ డాలర్లకు గ్లాండ్ ఫార్మాలో 74 శాతం వాటాను కొనుగోలు చేసింది. 1978లో పీవీఎన్ రాజు కంపెనీని ఏర్పాటు చేశారు. 1999 నుంచీ డాక్టర్ రవి పెన్మెత్స వైస్‌చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. తదుపరి 2019లో యాజమాన్యానికి సలహాదారునిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఎండీ, సీఈవోగా శ్రీనివాస్ ఎస్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫార్మా ప్రొడక్టులు గ్లాండ్ ఫార్మా ప్రధానంగా జనరిక్ ఇంజక్టబుల్ ఫార్మా ప్రొడక్టులను రూపొందిస్తోంది. కంపెనీ యూఎస్, యూరోపియన్ మార్కెట్ల నుంచి అత్యధికంగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. హైదరాబాద్‌లో నాలుగు, విశాఖపట్టణంలో మూడు చొప్పున మొత్తం ఏడు ప్లాంట్లను కలిగి ఉంది. యాంటీడయాబెటిక్, యాంటీ మలేరియా, యాంటీ ఇన్ఫెక్టివ్స్, కార్డియాక్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ తదితర పలు విభాగాలకు చెందిన ప్రొడక్టులను తయారు చేస్తోంది. గుండెపోటు, తదితర సమయాలలో చేసే సర్జరీలలో వినియోగించే హెపరిన్ తయారీలో కంపెనీ పేరొందింది. -
కంపెనీలు, దలాల్ స్ట్రీట్‌కు సెబీ దన్ను
కోవిడ్-19 కారణంగా నీరసిస్తున్న స్టాక్ మార్కెట్లు, కార్పొరేట్లకు దన్నుగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ నిబంధనలు సవరించింది. తద్వారా ప్రమోటర్లు తమ వాటాను పెంచుకునేందుకు వీలు కల్పించడంతోపాటు.. కంపెనీలకు అదనపు నిధులు సమకూరేందుకు దారి ఏర్పాటుకానుంది. సెబీ నిర్ణయాలు మార్కెట్లకు దన్నునిచ్చే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. వచ్చే మార్చివరకూ వచ్చే ఏడాది(2021) మార్చివరకూ అమలులో ఉండే విధంగా సెబీ ప్రిఫరెన్షియల్ కేటాయింపుల నిబంధనలను సరళీకరించింది. దీంతో కంపెనీల ప్రమోటర్లు ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా 10 శాతం వరకూ వాటాను పెంచుకునేందుకు వీలుంటుంది. ఇప్పటివరకూ 5 శాతం వాటా పెంపునకు మాత్రమే నిబంధనలు అనుమతిస్తున్నాయి. కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డవున్ కారణంగా పలు కంపెనీలకు నిధుల ఆవశ్యకత ఏర్పడింది. దాదాపు మూడు నెలలుగా అమ్మకాలు క్షీణించడంతో కార్యకలాపాల నిర్వహణకు అదనపు నిధుల అవసరం ఏర్పడుతున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. ఓపెన్ ఆఫర్‌కు నో సవరించిన నిబంధనల ప్రకారం లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లు ఈ ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వరకూ ఈక్విటీ వాటాను ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా పొందవచ్చు. అయినప్పటికీ పబ్లిక్ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ప్రకటించవలసిన అవసరం ఉండదు. ఇప్పటివరకూ 5 శాతంవరకే ఈ పరిమితి అమలవుతోంది. ఫలితంగా అటు ప్రమోటర్లు తమ వాటాను పెంచుకునేందుకు వీలు చిక్కడంతోపాటు.. కంపెనీలకు అదనపు నిధులు లభించనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఎఫ్‌వో శాలిభద్ర షా పేర్కొన్నారు. ప్రమోటర్లకు ఈక్విటీగా మార్పిడికి వీలయ్యే సెక్యూరిటీల జారీ ద్వారా కంపెనీలు వేగంగా నిధులు సమకూర్చుకునేందుకు వీలుంటుందని తెలియజేశారు. సెబీ తాజా నిర్ణయం ద్వారా ప్రమోటర్లు బోర్డులో మరింత మంది వ్యూహాత్మక ఇన్వెస్టర్లకు అవకాశం కల్పించేందుకు మార్గమేర్పడుతుందని జిరోధా సీఐవో నిఖిల్ కామత్ పేర్కొన్నారు. మార్కెట్లకు ప్లస్ విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు), దేశీ ఫండ్స్(డీఐఐలు)తో పోలిస్తే ప్రమోటర్లు దీర్ఘకాలిక ఇన్వెస్టర్లుగా నిలుస్తారు గనుక లిస్టెడ్ కంపెనీలకు మరింత బలమొస్తుందని విశ్లేషకులు వివరించారు. ఇది అంతిమంగా స్టాక్ మార్కెట్లకు జోష్‌నిస్తుందని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ హెడ్ గౌరవ్ గార్గ్ తెలియజేశారు. ప్రమోటర్ నిధుల ద్వారా కంపెనీలకు నిలకడ లభిస్తుందని, ఇది ఇన్వెస్టర్లలోనూ విశ్వాసాన్ని పెంచుతుందని శామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఉమేష్ మెహతా విశ్లేషించారు. -
ఇండిగో ఐపీఓకు ఆమోదం
న్యూఢిల్లీ: చౌక ధరల్లో విమానయాన సర్వీసులందజేసే ఇండిగో సంస్థ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఐపీఓ ద్వారా ఇండిగో రూ.2,500 కోట్లు సమీకరించనున్నది. ఐపీఓలో భాగంగా రూ.1,272 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. మరోవైపు ప్రస్తుతమున్న వాటాదారుల వద్దనున్న 3 కోట్ల షేర్లను కూడా ఇంతే మొత్తానికి ఈ ఐపీఓ ద్వారా ఆఫర్ చేయాలని ఇండిగో భావిస్తోంది. ఈ ఐపీఓకు సంబంధించిన ముసాయిదా పత్రాలను ఈ ఏడాది జూన్‌లోనే ఇండిగో సెబీకి సమర్పించింది. ఈ ఐపీఓకు సిటీగ్రూప్, జేపీ మోర్గాన్ ఇండియా, మోర్గాన్ స్టాన్లీ, బార్క్లేస్, యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా, కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీలు మేనేజర్లుగా వ్యవహరిస్తాయి. దేశంలో లాభాలార్జిస్తున్న రెండు విమాన యాన సంస్థల్లో ఇండిగో ఒకటి కాగా, రెండోది గో ఎయిర్.