న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మూడు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో బిబా ఫ్యాషన్స్, కీస్టోన్ రియల్టర్స్, ప్లాజా వైర్స్, హేమానీ ఇండస్ట్రీస్ చేరాయి. సంప్రదాయ దుస్తుల ఫ్యాషన్ లేబుల్ బిబా ఫ్యాషన్ ఏప్రిల్‌లో సెబీకి దరఖాస్తు చేసింది. వార్‌బర్గ్ పింకస్, ఫేరింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఐపీవోలో భాగంగా రూ. 90 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది.
వీటికి జతగా మరో 2.77 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. జూన్‌లో దరఖాస్తు చేసిన రుస్తోంజీ గ్రూప్ కంపెనీ కీస్టోన్ రియల్టర్స్ ఐపీవో ద్వారా రూ. 850 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. దీనిలో రూ. 700 కోట్లమేర ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ఇక రూ. 2,000 కోట్ల సమీకరణకు వీలుగా ఆగ్రోకెమికల్ తయారీ కంపెనీ హేమానీ ఇండస్ట్రీస్ మార్చిలో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. వైర్లు, అల్యూమినియం కేబుళ్ల కంపెనీ ప్లాజా వైర్స్ మే నెలలో దరఖాస్తు చేసింది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా 1,64,52,000 ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది.
చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు!
Comments
Please login to add a commentAdd a comment