డేటా గోప్యత, జవాబుదారీతనం మొదలైన పరిశోధనల కోసం డేటాను షేర్ చేసుకోవడానికి ప్రత్యేక విధానాలు రూపొందించుకోవాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదించింది. ఈమేరకు స్టాక్ ఎక్ఛ్సేంజీలు, ఇతర మార్కెట్ ఇన్‌ఫ్రా సంస్థలు (ఎంఐఐ) సొంత విధానాలను ఏర్పాటు చేసుకోవాలని సెబీ తెలిపింది.
వాణిజ్య అవసరాల కోసం షేర్ చేసుకునే డేటా గోప్యత, జవాబుదారీతనం..వంటి అంశాలపై సెబీ చర్చాపత్రాన్ని రూపొందించింది. సెబీలో భాగమైన మార్కెట్ డేటా అడ్వైజరీ కమిటీ(ఎండీఏసీ) సూచనల ప్రకారం మార్కెట్ డేటాకు బాధ్యత వహించాల్సిన సంస్థలు డేటా సేకరణ, ప్రాసెసింగ్, స్టోరేజ్, షేరింగ్, గోప్యత పాటించడం, యాక్సెస్ ఇవ్వడం మధ్య సమతూకంతో వ్యవహరించేలా తగు విధానాలను రూపొందించుకోవాలి. ఎంఐఐలు డేటాను రెండు కేటగిరీల కింద వర్గీకరించాలి. ఒకటి బహిరంగంగా షేర్ చేసుకునే డేటా. రెండు..గోప్యంగా ఉంచాల్సిన డేటా. కేవైసీ వివరాలు, వ్యక్తులు, సంస్థలను గుర్తించేందుకు పరోక్షంగా ఉపయోగపడే డేటా రెండో కేటగిరీ పరిధిలోకి వస్తుంది. మార్కెట్‌లో స్థిరమైన విధానాలను పాటించేలా చూడటం ఈ పాలసీ లక్ష్యంగా సెబీ తెలిపింది. ఈ ప్రతిపాదనలపై అక్టోబర్ 29లోగా సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: గరిష్ఠాలను చేరిన బంగారం ధర!
Comments
Please login to add a commentAdd a comment