data security
-
హెచ్‌సీఎల్ నుంచి డేటా ట్రస్ట్ షీల్డ్
న్యూఢిల్లీ: ఐటీ రంగ సంస్థ హెచ్‌సీఎల్‌టెక్ తాజాగా యూఎస్‌కు చెందిన చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ సహకారంతో డేటా ట్రస్ట్ షీల్డ్ పేరుతో ఎంటర్ప్రైస్ డేటా సెక్యూరిటీ సర్వీసులను ప్రారంభించింది. క్లౌడ్ వ్యవస్థలో సున్నిత సమాచార రక్షణను ఇది మెరుగుపరుస్తుందని కంపెనీ తెలిపింది.ఇంటెల్ ట్రస్ట్ డొమైన్ ఎక్స్టెన్షన్స్ (ఇంటెల్ టీడీఎక్స్), ఇంటెల్ ట్రస్ట్ అథారిటీ వంటి విశ్వసనీయ సాధనాలను ఉపయోగించడం ద్వారా క్లౌడ్ కార్యకలాపాల సమయంలో సున్నిత సమాచారాన్ని భద్రపరచడానికి డేటా ట్రస్ట్ షీల్డ్ రూపొందించినట్టు వివరించింది. ఈ సొల్యూషన్ గూగుల్ క్లౌడ్‌లో పరీక్షించామని, భవిష్యత్తులో ఇతర భారీ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లతో అనుసంధానిస్తామని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: రూ.5 లక్షల కోట్ల ఐటీ కంపెనీ.. వారసురాలికి గ్రీన్సిగ్నల్ఈ సేవలు డేటా భద్రతలో ఒక ప్రధాన ముందడుగు అని, అధిక స్థాయి రక్షణను అందిస్తుందని హెచ్‌సీఎల్‌టెక్ ఈవీపీ ఆనంద్ స్వామి వివరించారు. ఇంటెల్ అధునాతన సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ఈ సొల్యూషన్ డిజిటల్ ఆస్తులను సురక్షితం చేస్తుందని, క్లౌడ్ వ్యవస్థపై విశ్వాసం పెంచుతుందని అన్నారు. -
డేటా షేరింగ్‌పై సెబీ చర్చాపత్రం
డేటా గోప్యత, జవాబుదారీతనం మొదలైన పరిశోధనల కోసం డేటాను షేర్ చేసుకోవడానికి ప్రత్యేక విధానాలు రూపొందించుకోవాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదించింది. ఈమేరకు స్టాక్ ఎక్ఛ్సేంజీలు, ఇతర మార్కెట్ ఇన్ఫ్రా సంస్థలు (ఎంఐఐ) సొంత విధానాలను ఏర్పాటు చేసుకోవాలని సెబీ తెలిపింది.వాణిజ్య అవసరాల కోసం షేర్ చేసుకునే డేటా గోప్యత, జవాబుదారీతనం..వంటి అంశాలపై సెబీ చర్చాపత్రాన్ని రూపొందించింది. సెబీలో భాగమైన మార్కెట్ డేటా అడ్వైజరీ కమిటీ(ఎండీఏసీ) సూచనల ప్రకారం మార్కెట్ డేటాకు బాధ్యత వహించాల్సిన సంస్థలు డేటా సేకరణ, ప్రాసెసింగ్, స్టోరేజ్, షేరింగ్, గోప్యత పాటించడం, యాక్సెస్ ఇవ్వడం మధ్య సమతూకంతో వ్యవహరించేలా తగు విధానాలను రూపొందించుకోవాలి. ఎంఐఐలు డేటాను రెండు కేటగిరీల కింద వర్గీకరించాలి. ఒకటి బహిరంగంగా షేర్ చేసుకునే డేటా. రెండు..గోప్యంగా ఉంచాల్సిన డేటా. కేవైసీ వివరాలు, వ్యక్తులు, సంస్థలను గుర్తించేందుకు పరోక్షంగా ఉపయోగపడే డేటా రెండో కేటగిరీ పరిధిలోకి వస్తుంది. మార్కెట్లో స్థిరమైన విధానాలను పాటించేలా చూడటం ఈ పాలసీ లక్ష్యంగా సెబీ తెలిపింది. ఈ ప్రతిపాదనలపై అక్టోబర్ 29లోగా సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: గరిష్ఠాలను చేరిన బంగారం ధర! -
ఐటీ పరిశ్రమలో డేటా భద్రత డొల్లేనా..?
న్యూఢిల్లీ: ఐటీ పరిశ్రమలో డేటా భద్రత అంతంత మాత్రమేనా..? అమెరికాకు చెందిన డేటా సెక్యూరిటీ సంస్థ ‘రుబ్రిక్’ నిర్వహించిన సర్వేలో ఐటీ కంపెనీల యాజమాన్యాలు చెప్పిన మాటలు వింటే నిజమేనని అనిపిస్తోంది. తమ కంపెనీ డేటా పాలసీలో భద్రత అంశం లోపించినట్టు భారత్‌లో 49 శాతం ఐటీ కంపెనీలు చెప్పడం గమనార్హం. తమ వ్యాపార డేటాపై సైబర్ దాడులు జరిగినట్టు పేరొందిన బ్రాండ్లు ప్రస్తావించాయి. అంతేకాదు వచ్చే 12 నెలల కాలంలో సున్నితమైన డేటాను కోల్పోయే రిస్క్ అధికంగా ఉందని 30 శాతం సంస్థలు చెప్పాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెండు సంస్థలకు గాను ఒక సంస్థ గడిచిన ఏడాది కాలంలో సున్నితమైన డేటాను కోల్పోయినట్టు చెప్పడం గమనార్హం. అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్, ఆ్రస్టేలియా, సింగపూర్, భారత్‌లో ఈ ఏడాది జూన్ 30 నుంచి జూలై 11 మధ్య ఈ సర్వే జరిగింది. గడిచిన ఏడాది కాలంలో ఒకటికి మించిన సార్లు డేటా చోరీ జరిగినట్టు ప్రతి ఆరు సంస్థలకు గాను ఒకటి చెప్పింది. డేటా భద్రత విషయంలో సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ అధ్యయనం మరోసారి వెలుగులోకి తీసుకొచ్చినట్టయింది. కృత్రిమ మేథ (ఏఐ)తోపాటు క్లౌడ్ అధునాతన సైబర్ భద్రత విషయంలో అవకాశాలు కల్పిస్తున్నట్టు ఈ సర్వే తెలిపింది. దాడులను ఎదుర్కొనే సన్నద్ధత భారత్‌లో 54 శాతం ఐటీ కంపెనీలు సైబర్ నేరస్థుల చర్యలు తమ సంస్థ డేటాకు రిస్‌్కగా పేర్కొన్నాయి. వీటిలో 34 శాతం సంస్థలు సైబర్ దాడుల రిస్‌్కను ఎదుర్కొంటున్నట్టు తెలిపాయి. ఏఐను అమలు చేయడం వల్ల సున్నిత డేటాను కాపాడుకోవచ్చని 54 శాతం కంపెనీలు పేర్కొన్నాయి. ఎలాంటి ప్రభావం చూపించదని 24 శాతం కంపెనీలు అభిప్రాయం తెలియజేశాయి. ‘‘డేటా చోరీ వ్యాపారాలను నిరీ్వర్యం చేయగలదు. అందుకని డేటాను కాపాడుకునే విషయంలో స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. అది సైబర్ దాడులను కాచుకుని వ్యాపారం స్థిరంగా కొనసాగేలా ఉండాలి’’అని రుబ్రిక్ జీరో ల్యాబ్స్ హెడ్స్టీవెన్ స్టోన్ పేర్కొన్నారు. -
Data Protection Bill: భద్రత ఉన్నట్టేనా?
చిరకాలంగా చెబుతున్న, వింటున్న మాట ఇప్పుడు కార్యరూపంలోకి వస్తోంది. ఐరాసలోని 194 దేశాల్లో దాదాపు 137 దేశాల తర్వాత ఎట్టకేలకు భారత్ సైతం వ్యక్తిగత డిజిటల్ డేటా భద్రత (డీపీడీపీ) చట్టాన్ని తీసుకొచ్చే ఘట్టంలో చివరి మజిలీకి చేరుకుంది. అయిదేళ్ళలో అనేక ముసాయిదాలు, మార్పులు చేర్పుల తర్వాత తాజా డీపీడీపీ బిల్లు – 2023ను లోక్‌సభ సోమవారం ఆమోదించింది. ఇంతకాలంగా డేటా భద్రత విషయంలో సరైన చట్టం, వ్యవస్థ లేని భారత్ ఆ లోటును ఇక పూరిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వానికి మినహాయింపులపై గత నవంబర్ నాటి ప్రతిపాదిత బిల్లులోనే నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేసినా, అవే అంశాలు కొత్త బిల్లులోనూ చోటుచేసుకోవడం విడ్డూరం. ప్రైవేట్ సంస్థలు వ్యక్తుల డేటా నిర్వహణలో పాటించాల్సిన అంశాలపై కఠినమైన అంశాలు పొందుపరచిన ఈ బిల్లులో అసలంటూ కొంత మంచి ఉన్నా, కేంద్రానికి తిరుగులేని సెన్సార్ అధికారాలు దఖలు చేయడం లాంటి చెడూ చోటుచేసుకోవడమే విషాదం. పౌరులకు వ్యక్తిగత గోప్యత హక్కు ఉందంటూ తొమ్మిది మంది సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 2017లోనే నొక్కిచెప్పింది. అది అంతర్జాతీయ ప్రమాణంగా నిలిచి, డిజిటల్ యుగంలో గోప్యత హక్కుకు తలెత్తిన సవాళ్ళను ముందుకు తెచ్చింది. ఈ హక్కుపై జరిగిన విస్తృత చర్చ ప్రతిఫలమే తాజా డీపీడీపీ బిల్లు. 2017లోనే కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఓ నిపుణుల సంఘాన్ని నియమించింది. తర్వాత 2021 డిసెంబర్లో ‘డేటా భద్రత బిల్లు’ (డీపీబీ) విడుదలైంది. అనేక అభ్యంతరాలు రావడంతో 2022 ఆగస్ట్‌లో కేంద్ర ఐటీ మంత్రి పార్లమెంట్లో ఆ బిల్లును ఉపసంహరించుకొని, నవంబర్‌లో ‘డీపీడీపీ’ ముసాయిదాను పౌరసమాజ సంప్రతింపులకు ఉంచారు. గమ్మత్తేమిటంటే, జనాభిప్రాయాలను ప్రభుత్వం బహిర్గతం చేయలేదు సరికదా సమాచార హక్కు చట్టం కింద కోరినా తోసిపుచ్చింది. తీరా ఏడాది తర్వాత ఏ ప్రాతిపదికన కొత్తగా మార్పుచేర్పులు చేశామన్నది చెప్పకుండానే పాలకులు 2023 డీపీడీపీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. లోక్‌సభలో మెజారిటీ ఉంది గనక సులభంగా ఆమోదమూ పొందారు. వ్యక్తిగత డేటాను ఇతరులు యథేచ్ఛగా వాడే వీలులేకుండా చూడడం ఈ బిల్లు ప్రధానోద్దేశం. తీరా బిల్లు చూస్తే, అసలు ఆ భద్రత విషయంలోనే రాజీ పడ్డారనిపిస్తుంది. కార్పొరేట్లు గనక సున్నితమైన డేటాపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ఇప్పటి దాకా ఐటీ చట్టం కింద వారు బాధితులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉండేది. తీరా ఇప్పుడీ బిల్లులోని ఓ క్లాజు వల్ల ఆ ఊరట కూడా బాధితు డికి లేకుండా పోతోంది. ఇంకా విచిత్రమేమంటే, డేటా భద్రతకు భంగం కలిగిందని వీధికెక్కినవారి పైనే జరిమానా వేయచ్చు. పస లేని ఆరోపణ చేస్తే రూ. 10 వేల దాకా జుల్మానా వేయవచ్చు. ఫిర్యాదు చేయదలచిన వారికి ఇదో అడ్డంకి. నిజానికి, డేటా ఉల్లంఘనలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఈ ఏడాది జూన్‌లో కోవిన్ పోర్టల్ నుంచి టీకాలేసుకున్న వారి వ్యక్తిగత వివరాలు టెలిగ్రామ్ యాప్‌లో దర్శనమిచ్చాయి. అలాగే, జూలైలో 12 వేల మంది బ్యాంక్ ఉద్యోగుల గోప్యమైన రికార్డులూ టెలిగ్రామ్‌లో తిరిగాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికీ, అధికారులకూ ఈ డేటా వినియోగం, ఉల్లంఘనల్లో అయిదు అంశాల ప్రాతిపదికన ఈ బిల్లులో మినహాయింపులు దక్కాయి. మునుపటి బిల్లులోనూ మినహాయింపులున్నా తాజా బిల్లులో వాటిని విస్తరించడం గమనార్హం. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టు... దాదాపు రెండు దశాబ్దాల క్రితం 2005లో వచ్చిన సమాచార హక్కు చట్టానికి ఈ కొత్త బిల్లులోని అంశాలు తూట్లు పొడిచే ప్రమాదం ఉందనేది ఒక విశ్లేషణ. పౌరుల గోప్యత హక్కును కాపాడడం మాట దేవుడెరుగు, సమాచార హక్కును ఇది నీరు గారుస్తోందని విమర్శకుల మాట. ఈ డీపీడీపీ బిల్లు దెబ్బతో ప్రభుత్వం నుంచి సమాచార సేకరణలో పారదర్శకత తగ్గిపోయి, ప్రభుత్వ – ప్రైవేట్ సంస్థల ప్రయోజనాలకు ప్రజల డేటా మరింత పారదర్శకమవుతుందనేది వారి అభిప్రాయం. అలాగే, వ్యక్తిగత డేటాకూ, సున్నిత మైన వ్యక్తిగత డేటాకూ మధ్య తేడాను సైతం ఈ బిల్లు గుర్తించకపోవడంతో సున్నితమైన డేటాకు అదనపు భద్రత లేకుండా పోతోంది. ఇక, సమాచారాన్ని సృష్టించే జనరేటివ్ కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీకి సంబంధించిన నియంత్రణల ఊసు ఈ బిల్లులో లేదు. వ్యక్తిగత గోప్యతకు సంబంధించి చట్టం తేవడానికే సుదీర్ఘకాలం తీసుకున్న మన ప్రభుత్వాలు ఏఐ విషయంలోనూ అదే పద్ధతి అవలంబిస్తే కష్టమే. కాబట్టి, ఏఐ నియమ నిబంధనల రూపకల్పనకు తక్షణం నడుం బిగించాల్సి ఉంది. డేటా భద్రత బిల్లు కింద ఏర్పాటుచేసే ‘డేటా ప్రొటెక్షన్ బోర్డ్’ సైతం వట్టి పర్యవేక్షక సంస్థ. అదీ పూర్తిగా ప్రభుత్వ అజమాయిషీ కిందే నడుస్తుంది. ఛైర్మన్ సహా సభ్యులందరినీ కేంద్రమే నియమి స్తుంది. వెరసి, పాలకుల చేతిలో కీలుబొమ్మగా బోర్డు స్వతంత్రత, అధికారాలు అన్నీ పరిమితమే. తద్విరుద్ధంగా యూరప్ వగైరాల్లో డేటా భద్రత చట్టాలు, దాని కావలి సంస్థలు బలంగా ఉన్నాయి. ఫ్రాన్స్‌లో అంగీకార విధానాల్ని ఉల్లంఘించినందుకు గూగూల్పై అక్కడి కావలి సంస్థ 5 కోట్ల యూరోల జరిమానా వేయగలగడమే నిదర్శనం. డేటా భద్రతకు మించిన అసలు సమస్య... విచ్చల విడిగా సాగుతున్న డేటా సేకరణను అరికట్టడం! అంతర్జాతీయ నిపుణుల మాట సైతం అదే. మన దేశంలోని ఈ ప్రబల సమస్యపై ఇప్పటికీ చర్చే జరగకపోవడం విషాదం. అలాగే, అవగాహన, డిజి టల్ అక్షరాస్యత అంతంత మాత్రమైన దేశంలో, ఊపిరి సలపని పనిభారమున్న న్యాయవ్యవస్థ మధ్య నిజంగా గోప్యతకు హాని కలిగినా ఈ బిల్లుతో పౌరులు న్యాయం పొందగలరా? -
డేటా భద్రం.. ‘ఈనాడు’ మెదడే ఛిద్రం
సాక్షి, అమరావతి: అవసరంలేని ప్రజల వ్యక్తిగత, సున్నితమైన సమాచారాన్ని ఏమాత్రం సేకరించడంలేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ‘సంక్షేమ పథకాలలో అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోకుండా సంతృప్త స్థాయిలో ఆయా పథకాలను అర్హులందరికీ అందజేసేందుకు.. ఆయా పథకాల అమలులో అవినీతి అన్నదే లేకుండా పూర్తి పారదర్శకంగా వాటిని అందించేందుకు అవసరమయ్యే సమాచారాన్ని మాత్రమే ప్రభుత్వం సేకరిస్తుంది. కానీ.. ‘ఈనాడు’, ఆ సంస్థ యజమాని తమకు నచ్చని జగన్ ప్రభుత్వంపట్ల ప్రజల్లో విషబీజాలు నాటేందుకు అబద్ధపు రాతలనే నమ్ముకుంది. నిజానికి.. ప్రభుత్వ పథకాల అమలులో ఏ సంబంధంలేని ప్రజల ఓటరు ఐడీ, ఎవరు ఏ మొబైల్ ఫోన్లు వాడుతున్నారు, పాన్‌కార్డు వివరాలు ఏంటి, ఎవరికెంత అప్పు ఉంది వంటి ప్రజల సున్నిత సమాచారాన్ని సైతం చంద్రబాబు తన హయాంలో ప్రజాసాధికారిత సర్వే పేరుతో సేకరించింది. ఈ డేటాను సరిగ్గా ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే ‘సంఘమిత్ర’ ప్రతినిధుల మొబైల్ ఫోన్లలో ప్రత్యక్షమయ్యాయి. ఆ యాప్ వినియోగించే ఐటీ సంస్థలపై అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం పోలీసులు కేసు నమోదు చేయడం పెద్ద రాజకీయ దుమారం రేపింది. రాష్ట్ర ప్రజల వ్యక్తిగత గోప్యత నిజంగా ప్రమాదంలో పడిన ఆ సమయంలో ప్రజల పక్షాన నిలబడాల్సిన ‘ఈనాడు’ కళ్లు మూసేసుకుంది. తమకేమి తెలీదన్నట్లు చోద్యం చూసింది. కానీ, అదే ‘ఈనాడు’ ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఓటరు ఐడీ తదితర వివరాలేవీ సేకరించకపోయినా, సేకరించి రాజకీయ దురి్వనియోగానికి పాల్పడుతున్నట్లు నానా యాగీ చేస్తూ మెదడు చిట్లినట్లు రంకెలు వేస్తోంది. ‘ప్రమాదంలో వ్యక్తిగత గోప్యత’ అంటూ తప్పుడు రాతలతో జగన్ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకుంది’.. అంటూ రాష్ట్ర ప్రభుత్వం మీడియాకు ‘ఫ్యాక్ట్‌చెక్’ను విడుదల చేసింది. ఆ వివరాలివీ.. ఈనాడు ఆరోపణ: ప్రజల డేటా సేకరణకు సంబంధించి సీఎం జగన్మోహన్రెడ్డి అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వంపై ఆరోపణలు చేసి, ఇప్పుడు తనూ ప్రజల సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు.. వాస్తవం: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రజా సాధికార సర్వే పేరుతో ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలకు సంబంధంలేని అనేక వ్యక్తిగత వివరాలను సేకరించారు. ఓటరు ఐడీ, ఒక్కో ఇంట్లో ఎన్ని మొబైల్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల వివరాలు, ఇంటి విస్తీర్ణం ఎంత, ఎన్ని గదులున్నాయి, ఒక్కో ఇంట్లో ఉన్న బ్యాంకు లోన్లు వంటి అతి సున్నిత సమాచారం సేకరించింది. పథకాలకు సంబంధంలేని ప్రజల వ్యక్తిగత డేటా అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం సేకరించినా ‘ఈనాడు’ ఏనాడూ దానిని తప్పుపట్టలేదు. కానీ, అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సాధికార సర్వేలో సేకరించిన ఈ డేటా ఇతరుల చేతికి వెళ్లింది. ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పథకాల అమలుకు సంబంధంలేని ఓటరు ఐడీ వంటి వివరాలను సేకరించలేదు. ఈనాడు ఆరోపణ: ప్రజలకు సంబంధించిన సమాచారం ఈ ప్రభుత్వం ఎందుకు సేకరిస్తోంది? ప్రభుత్వం సమాధానం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాలు–సేవల కోసం లబి్ధదారుల గుర్తింపు ప్రక్రియకు అవసరమైన సమాచార సేకరణ మాత్రమే జరుగుతోంది. ఇందులో ఏ సమాచారం ఎందుకంటే.. కుటుంబ సభ్యుల వివరాలు: పథకాల అమలులో ఆయా కుటుంబాల్లో అర్హులను గుర్తించేందుకు.. కులం: కాపునేస్తం, ఈబీసీ నేస్తం వంటి కులం ఆధారిత పథకాల్లో అర్హుల గుర్తింపునకు.. కుల ధ్రువీకరణ పత్రాలు వంటివి జారీ కోసం.. ఆధార్ నెంబరు (ముసుగు ఫార్మాట్లోనే): పథకాల అమలులో అక్రమాలకు తావులేకుండా బయోమెట్రిక్ ఆధారంగా లబ్దిదారుల గుర్తింపునకు.. మతం: వైఎస్సార్ షాదీ తోఫా వంటి మత ఆధారిత పథకాల అమలుకు.. అడ్రసు: లబ్దిదారులకు ఇంటి వద్దే పథకాల అమలుకోసం.. మొబైల్ నెంబరు: పారదర్శకత ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ పథకాల సమాచారం నేరుగా ఆ లబ్దిదారులకే ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ రూపంలో తెలియజేసేందుకు.. వృత్తి: ప్రభుత్వం అమలుచేస్తున్న నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా వంటి వృత్తి ఆధారిత పథకాల్లో లబ్ధిదారుల గుర్తింపు కోసం.. పుట్టిన తేదీ: వివిధ పథకాల అమలులో లబి్ధదారుల వయస్సు నిర్ధారణ కోసం.. లింగం (మగ లేదా ఆడ వివరాలు): కేవలం మహిళల కోసమే ప్రభుత్వం ప్రత్యేకంగా అమలుచేస్తున్న పథకాల కోసం.. కుటుంబంలో మిగిలిన సభ్యుల బంధుత్వం వివరాలు: పుట్టిన తేదీ, ఆదాయ ధ్రువీకరణ, మరణ ధ్రువీకరణ వంటి పత్రాల జారీకోసం.. వివాహ పరిస్థితి: వైఎస్సార్ కళ్యాణమస్తు పథకం ద్వారా లబ్దిదారుల గుర్తింపునకు.. ఈనాడు ఆరోపణ: సేకరించిన సమాచారం ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్తుంది.. వాస్తవం: అందుకు అవకాశమేలేదు. సేకరించిన సమాచారం వెంటనే పూర్తి భద్రత ఉండే ప్రభుత్వ డేటా సర్వర్‌కు మాత్రమే నేరుగా చేరుతుంది. సర్వే పూర్తయిన తర్వాత ఆ వివరాలు కూడా వలంటీర్ల యాప్‌లో ఉండవు. ‘ఈనాడు’ పేర్కొన్నట్లు గృహ సర్వేలో ఇచి్చన వివరాలను ఉపయోగించి భూమి యాజమాన్యాన్ని మార్చడం వంటివి ఎట్టి పరిస్థితిలోనూ సాధ్యపడదు. లబి్ధదారుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేయడం ఎట్టిపరిస్థితుల్లో సాధ్యపడదు. ఈనాడు ఆరోపణ: పౌరుల నుండి బయోమెట్రిక్ తీసుకుంటున్నారు. ఈ వివరాలు సేకరణ సురక్షితం కాదు.. వాస్తవం: ఆధార్ నెంబరు ఆధారంగా లబ్ధిదారుని బయోమెట్రిక్ తీసుకునే సమయంలో ఈ బయోమెట్రిక్‌లు మొబైల్ పరికరంలో లేదా స్టేట్ డేటాబేస్‌లో నిల్వచేయబడవు. కట్టుదిట్టంగా డేటా సేకరణ.. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ పటిష్ట భద్రతా చర్యలతో రూపొందించిన యాప్‌ల ద్వారానే ప్రభుత్వ కార్యక్రమాలకు అవసరమైన డేటాను సేకరిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టంచేసింది. వలంటీర్ల ద్వారా వివరాలు సేకరించాక అవి నేరుగా ప్రభుత్వ డేటా సెంటరుకు చేరతాయని.. అవి వలంటీర్ల యాప్‌లో కూడా నిల్వఉండవని తేలి్చచెప్పింది. అలాగే, ప్రభుత్వ డేటా సెంటరు నుంచి ఆ డేటాను గుర్తింపు పొందిన ప్రభుత్వ అధికారులు అనుమతి పొందిన కంప్యూటర్ ద్వారా మాత్రమే వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని.. అది కూడా వ్యక్తి సమాచారం మొత్తం కాకుండా పరిమిత పరిధిలోనే ఆ డేటాను వినియోగించుకునేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లున్నాయని ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు.. అన్ని యాప్‌లు హైలెవల్ సెక్యూరిటీ ఫీచర్లతో డెవలప్ చేయబడ్డాయని, సైబర్ దాడులకు సైతం అవకాశంలేకుండా భద్రతా చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం వివరించింది. -
టిక్‌టాక్.. 60 నిమిషాలే 18 ఏళ్లలోపు వారికి వర్తింపు
వాషింగ్టన్: టిక్‌టాక్ వల్ల వినియోగదారుల డేటా భద్రతకు ముప్పు వాటిల్లుతోందని ఒకవైపు ఆరోపణలు వెల్లువెత్తుతుండగా, మరోవైపు యాప్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లలోపు యూజర్లు ఒకరోజులో కేవలం ఒక గంటపాటే యాప్‌ను వినియోగించేలా పరిమితి విధించినట్లు టిక్‌టాక్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ అధినేత కార్మాక్ కీనన్ బుధవారం ప్రకటించారు. గంట సమయం దాటిన తర్వాత వీడియోలు ఆగిపోతాయని తెలిపారు. గంట తర్వాత మళ్లీ యాప్‌లో వీడియోలు చూడాలంటే పాస్‌కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుందని అన్నారు. ఇక 13 ఏళ్లలోపు యూజర్లు పాస్‌కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మరో 30 నిమిషాలపాటు మాత్రమే వీడియోలు తిలకించేందుకు వీలుంటుందని, ఆ తర్వాత ఆగిపోతాయని పేర్కొన్నారు. -
టెక్ సంస్థలకు జవాబుదారీతనం ఉండాలి
న్యూఢిల్లీ: ఫేస్బుక్, గూగుల్ వంటి బడా టెక్ కంపెనీలు.. సమాజం పట్ల జవాబుదారీతనంతో ఉండేలా చూసేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. ఈ దిశగా భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను.. వాక్ స్వాతంత్య్రానికి వ్యతిరేకమైనవిగా ప్రచారం చేయరాదని ఆయన స్పష్టం చేశారు. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ నిర్వహించిన వార్షిక ఎన్టీఎల్ఎఫ్ (నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్షిప్ ప్రోగ్రాం) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చంద్రశేఖర్ ఈ విషయాలు తెలిపారు. దేశీయంగా పరిస్థితుల రీత్యా అభ్యంతరమైన కంటెంట్‌ను తొలగించాలంటూ యూట్యూబ్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలను ప్రభుత్వం ఇటీవల తరచుగా ఆదేశిస్తుండటాన్ని.. వాక్స్వాతంత్య్రంపై దాడిగా కొన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘బడా టెక్ కంపెనీలు, టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌లు తాము సర్వీసులు అందించే సమాజం, వర్గాల పట్ల మరింత జవాబుదారీతనంతో వ్యవహరించేలా చూడాలంటే, దేశాలు పరస్పరం సహకరించుకోవాలి‘ అని చంద్రశేఖర్ చెప్పారు. సైబర్ నేరాలు, సైబర్‌భద్రత తదితర అంశాల్లో పాటించాల్సిన నియంత్రణపరమైన సూత్రాలను రూపొందించుకోవాలని పేర్కొన్నారు. డేటా భద్రత బిల్లుకు మరింత సమయం.. డేటా భద్రత బిల్లును ప్రవేశపెట్టడంపై జాప్యం జరిగే అవకాశం ఉందని మంత్రి ఈ సందర్భంగా సూచనప్రాయంగా తెలిపారు. దీనిపై హడావుడిగా చట్టం చేసి ఆ తర్వాత సవరణలు చేస్తూ పోయే యోచన ప్రభుత్వానికి లేదని మంత్రి స్పష్టం చేశారు. ఈ బిల్లుకు మద్దతుగా, వ్యతిరేకంగా భారీ స్థాయిలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని, అనేక సలహాలు.. సూచనలు కూడా వస్తున్నాయని ఆయన తెలిపారు. వీటన్నింటిపై చర్చలు కొనసాగుతున్నాయని వివరించారు. గోప్యతకి సంబంధించిన ఆందోళనలపై స్పందిస్తూ.. భద్రత, నమ్మకం, జవాబుదారీతనం, స్వేచ్ఛ మొదలైనవన్నీ పరస్పర విరుద్ధమైన సూత్రాలని.. సౌలభ్యాన్ని బట్టి ఎంచుకోవడం మారుతూ ఉంటుందని చంద్రశేఖర్ చెప్పారు. అయితే, ప్రభుత్వ విధానాల రీత్యా భద్రత, నమ్మకం అత్యంత ముఖ్యమైనవిగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ‘దేశాన్ని డిజిటైజ్ చేయడం ఎంత ముఖ్యమో, మన ప్రజాస్వామ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవడం .. వినియోగించే టెక్నాలజీ విశ్వసనీయమైనదిగా, జవాబుదారీతనంతో కూడుకున్నదై ఉండేలా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం‘ అని మంత్రి అభిప్రాయపడ్డారు. 55 వేలకు పైగా ఫ్రెషర్ల హైరింగ్: ఇన్ఫీ దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా భారీగా నియామకాలు చేపట్టనుంది. సుమారు 55,000 మంది పైచిలుకు ఫ్రెషర్లను నియమించుకునే యోచనలో ఉంది. ఎన్టీఎల్ఎఫ్లో పాల్గొన్న సందర్భంగా కంపెనీ సీఈవో సలిల్ పరేఖ్ ఈ విషయాలు తెలిపారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కాలేజ్ గ్రాడ్యుయేట్ల నియామకాలు 55,000 స్థాయిలో ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా ఇదే స్థాయిలో లేదా ఇంతకన్నా ఎక్కువే రిక్రూట్ చేసుకుంటాం‘ అని వివరించారు. ఇంజినీరింగ్, సైన్స్ గ్రాడ్యుయేట్లకు టెక్నాలజీ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని పరేఖ్ తెలిపారు. ఆవిష్కరణలపై కంపెనీలు దృష్టి పెట్టాలి: విప్రో సీఈవో థియెరీ కొత్త ఆవిష్కరణలను రూపొందించడంపై కంపెనీలు మరింతగా కసరత్తు చేయాలని ఎన్టీఎల్ఎఫ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విప్రో సీఈవో థియెరీ టెలాపోర్ట్ అభిప్రాయపడ్డారు. ఈ టెక్నాలజీ దశాబ్దంలో మరింత సమర్ధత పెంచుకోవడం, బాధ్యతాయుతంగా పనిచేయడంపై దృష్టి పెట్టడంతో పాటు ప్రతిభావంతులను అట్టే పెట్టుకునేలా తమ విధానాలను సవరించుకోవాలని సూచించారు. అన్ని పరిశ్రమలు, మార్కెట్లలోని సంస్థలు తమ వ్యాపార సమస్యలను పరిష్కరించుకునేందుకు డిజిటల్ బాట పడుతున్నాయని, రాబోయే సంవత్సరాల్లో ఈ ధోరణి మరింతగా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. -
రియల్టీ పెట్టుబడులపై రాబడి మన దగ్గరే ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: విదేశీ పెట్టుబడుల ఆకర్షణీయమైన ప్రాంతంగా భారత్ నిలిచింది. అభివృద్ధి చెందిన దేశాల కంటే రియల్టీ పెట్టుబడులపై ఎక్కువ రాబడి మన దగ్గర్నుంచే కనిపిస్తుందని ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కొలియర్స్ తెలిపింది. 2030 నాటికి ఇండియా మూడో అతిపెద్ద వినియోగదారు ఆర్ధిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇది పారిశ్రామిక రంగంలో నూతనోత్సాహాన్ని నింపుతుందని పేర్కొంది. సాంకేతికత దేశం బలంగా ఉన్నప్పటికీ.. నెమ్మదిగా తయారీ రంగానికి గమ్యస్థానంగా మారుతోందని తెలిపింది. డేటా సెంటర్, సీనియర్ లివింగ్, స్టూడెంట్ హౌసింగ్, కోలివింగ్ వంటి ప్రత్యామ్నాయ రియల్ ఎస్టేట్ విభాగాలలో పెట్టుబడుల వరద పారుతోంది. సాంకేతిక వినియోగం పెరగడంతో డేటా భద్రత చట్టం అనివార్యమైంది. దీంతో డేటా సెంటర్లలో పెట్టుబడులు పెరిగాయని కొలియర్స్ ఇండియా డైరెక్టర్ పీయూష్ గుప్తా తెలిపారు. గతేడాది దేశీయ ప్రత్యామ్నాయ రియల్టీలో 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని రిపోర్ట్ వెల్లడించింది. 2020తో పోలిస్తే ఇది 26 శాతం మేర వృద్ధిరేటని పేర్కొంది. అధిక నాణ్యత, సాంకేతికత, పాలన, కస్టమర్ సర్వీస్‌లలో గణనీయమైన మార్పులు వచ్చాయి. డేటా వేర్‌హౌస్‌లు, షేర్డ్ స్పేస్ (రెసిడెన్షియల్ లేదా కమర్షియల్), ప్రాప్‌టెక్ వంటి కొత్త వ్యాపారాలు ఊపందుకున్నాయి. మెరుగైన పాలన, గడువులోగా డెలివరీలు, నగదు లభ్యతతో నివాస సముదాయాల మార్కెట్లో సానుకూలత తిరిగొచ్చింది. నివాస రంగంలో 900 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది నాలుగేళ్లలో అత్యధికం. పెట్టుబడిలో అందుబాటు, మధ్యతరగతి గృహాలు 64 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ–కామర్స్ డిమాండ్‌తో గత ఐదేళ్లలో పారిశ్రామిక, గిడ్డంగుల విభాగంలో గరిష్ట స్థాయిలో 1.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడిదారులు, డెవలపర్లు, ప్రాపర్టీ యజమానులు స్థిరమైన అభివృద్ధి వైపు దృష్టిసారించారు. దేశంలో గ్రీన్ బాండ్లు, గ్రీన్ ఫైనాన్సింగ్ ఎక్కువ ఆమోదం పొందుతున్నాయి. -
డేటా చోరీ.. గోప్యతకు గోరీ
వ్యక్తిగత సమాచార భద్రత! ‘అబ్బో! అది దుర్వినియోగమైతే ఎలా...?’ మన సమాజం ఒక్కసారిగా అప్రమత్తమైంది. సదరు ప్రాధాన్యతను నిజంగా గుర్తించిందా? ఏమో! పరస్పర సందేశాల మార్పు ఉపకరణం (మెసే జింగ్ యాప్) ‘వాట్సాప్’ను మునివేళ్లపై నిలిపి, నిర్ణయాన్ని వాయిదా వేసుకునేలా చేసిందంటే నిజమేనేమో! అనిపిస్తుంది. ‘ఫలానా తేదీ లోపు మా కొత్త గోప్యతా విధానానికి అంగీకారం తెలపండి లేదా సేవల నుంచి వైదొలగండి’ అన్న వాట్సాప్, భారతీయుల్లో పెల్లుబికిన వ్యతిరేకత దెబ్బకు వెనక్కి తగ్గింది. వాయిదాతో తన ప్రతిపాదన మూడు నెలలు వెనక్కి నెట్టింది. ‘మీ సమాచార వివరాలు చూడబోము, వాడబోము’ అని వినియోగ దారుల్ని నమ్మించే కాళ్లబేరానికొచ్చింది. ఎందుకంటే, 40 కోట్ల అకౌంట్లతో ఈ దేశంలో తనకున్న అతి పెద్ద మార్కెట్ పడిపోతే ఎలా? భయం! తాజా ప్రతిపాదన నచ్చక లక్షలాదిమంది వేగంగా ‘సిగ్నల్’ ‘టెలిగ్రామ్’ వంటి ప్రత్యామ్నాయ యాప్‌లకు దారి మళ్లడంతో జడు సుకుంది. కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి నిద్రమత్తు వదిలినట్టు లేచి, వాట్సాప్‌ను ప్రశ్నావళితో గద్దిస్తోంది. అసలు మీ విధానమేంటి? మా పౌరుల నుంచి మీరేం సమాచారం సేకరిస్తున్నారు? ఇక్కడ–యూర ప్లో తేడాలెందుకు? అని ప్రశ్నలు సంధిస్తోంది. గోప్యత విధానంలో మార్పులేమీ తేకండి అంటోంది. వాట్సాప్ ప్రతిపాదన వాయిదా పడిందే తప్ప సమస్య తొలగిపోలేదు. ప్రమాదం నిరంతరం పొంచి ఉంటుందన్నది నిజం. సామాజిక మాధ్యమాలన్నింటితోనూ ఈ ప్రమాదం ఉంది, ఉంటుంది. తమ వినియోగదారుల నుంచి వేర్వేరు రూపాల్లో సేకరించే, పొందే, నిల్వ చేసే, అనుసంధానమయ్యే వ్యక్తిగత సమాచారం వారి వద్ద ‘డాటా’గా నిక్షిప్తం అవుతుంది. దాన్ని వారు గోప్యంగా ఉంచాలి. ఉంచుతు న్నామనే చెబుతారు. కానీ, ఉంచరు. వేర్వేరు వ్యాపార అవసరాలకు తామే వాడినట్టు, వ్యాపార ప్రయోజ నాలున్న మూడో పక్షానికి అమ్ముకున్నట్టు చాలా సార్లు వెల్లడయింది. ఇప్పుడదే పెద్ద సమస్య! అది తప్పించాలంటే పౌరుల వ్యక్తిగత సమాచారానికి ప్రభుత్వ పరమైన భద్రత కావాలి. చట్టపరమైన రక్షణ ఏర్పడాలి. దానికి కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న ‘వ్యక్తిగత సమా చార రక్షణ చట్టం’ (పీడీపీ) పకడ్బందిగా ఉండాలి. తగిన నిఘా, నియంత్రణ వ్యవస్థలతోనే వ్యక్తిగత సమాచార దోపిడీ, దుర్వినియో గానికి కళ్లెం వేయగలం. ఉచిత సేవ, ధనార్జన యావ! ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచ గతి మారింది. కమ్యూని కేషన్ రంగంలో శాస్త్ర–సాంకేతిక విప్లవమే వచ్చింది. ఎన్నో విధాలుగా సమాచారం సేకరించడం, ప్రోదిచేయడం, మార్పిడి చేయడం నుంచి క్లౌడ్ కంప్యూటింగ్‌తో అపరిమితంగా, గోప్యంగా దాచిపెట్టడం వరకు ఆశ్చర్యకరమైన పరిణామాలొచ్చాయి. దొంగచాటుగా, బహిరంగంగా అమ్ముకోవడమూ రివాజయింది. డిజిటల్ ఎకానమీలో ఇదే ఓ ఇంధన మైంది. ఈ–కామర్స్‌కు రాచబాట పడింది. క్షణాల్లో సమాచార మార్పిడి జరిగిపోతోంది. వ్యాపార–వాణిజ్య వ్యవహారాల్లో పెను మార్పులకు వాకిళ్లు తెరుచు కున్నాయి. ఫేస్బుక్, వాట్సాప్, ట్విటర్, గూగుల్... ఇలా ఎన్నెన్నో వైవిధ్యభరిత ఉపకరణాలొచ్చాయి. ఈ– కామర్స్ ప్రక్రియలో మెసేజింగ్ యాప్‌లూ బలపడ్డాయి. కరోనా మహమ్మారి మనుషుల భౌతిక కదలికల్ని కట్టడి చేసిన దరిమిళా.. వస్తు, సేవల రంగంలో ‘ఆన్లైన్’ ఒక కీలక ప్రక్రియ అయిపోయింది. అంతకు ముందునుంచే సామాజిక మాధ్యమ వేదికలతో కోట్లమంది అనుసంధానమయ్యారు. వారెవరు, ఎక్కడివారు, ఎంత వయసు, ఏం చేస్తుంటారు, ఆదాయమెంత, వ్యయమెంత, అభిరుచులేంటి, వ్యవహా రాలేంటి... ఒక్కటేమిటి? వారికి సంబంధించిన సమస్త సమాచారం ఆయా యాప్‌లలోకి చేరుతోంది. ఇంకోరకంగా చెప్పాలంటే, మనమే.. వారిని ఆహ్వానించడమే కాక చొచ్చుకు వచ్చేంత చనువిచ్చాం. నిజానికి ఈ సమాచారమంతా వారు గోప్యంగా ఉంచాలి. నిర్దేశించిన అవసరానికే వినియోగించాలి. అలా కాకుండా వేర్వేరు వ్యాపార సంస్థలకు విక్రయిస్తు న్నారు. ఆయా కంపెనీల వ్యాపార వృద్ధికి తోడ్పడే వాణిజ్య ప్రకటనలు చేర్చడానికి, భావజాల వ్యాప్తికి, ఆలోచనా సరళిని ప్రభా వితం చేయడానికీ... ఇలా ఎన్నో వ్యాపార, కొన్ని చోట్ల రాజకీయ అవసరాలకు పౌరుల వ్యక్తిగత గోప్య సమాచారాన్ని వాడుకుంటున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, గూగుల్ వంటివి రుసుమేమీ తీసుకోకుండా ఉచిత సేవలు అందిస్తున్నట్టే ఉంటుంది. కానీ, తమ విని యోగదారుల సమాచారాన్ని అందివ్వడం–అమ్ముకోవడం ద్వారా వస్తోత్పత్తి, సేవా విక్రయ సంస్థల నుంచి పెద్దమొత్తాల్లో వారు డబ్బు గడిస్తున్నారు. ఇదో పెద్ద వ్యాపారం. సదరు యాప్ సంస్థలు పౌరుల వ్యక్తిగత ఉనికి వివరాలే కాకుండా ఆశలు, ఆకాంక్షలు, ఆలోచనల్లోకి చొరబడటంతో సగటు మనిషి వ్యక్తిగత సమాచారం అంగడి వస్తువయింది. ప్రతొక్కరి బతుకు వాల్పోస్టరయింది. వాట్సాప్ గగుర్పాటే సాక్ష్యం! సమాచార గోప్యత విషయంలో వాట్సాప్ కొత్త ప్రతిపాదన ఏక పక్షంగా ఉన్నందున నిలిపివేయాలన్న ఒక అడ్వకేటు పిటిషన్ విచా రిస్తూ డిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘అది ప్రయివేటు యాప్, మీ సమాచారానికి భద్రత లేదనుకుంటే అక్కడ్నుంచి తొలగించండి, వారి సేవల నుంచి మీరు తొలగిపోండి, భద్రత ఉన్న వేరే యాప్‌కు మారండి’ అని జస్టిస్ సంజయ్ సచ్దేవ్ అన్నారు. అదంత చిన్న విషయమా? కోట్ల మందికి సంబంధించిన అంశం. తమ వద్ద వినియోగదారుల సమాచారం ‘తొలికొస నుంచి కడకొస దాకా’ గోప్యమే! అని హామీ ఇస్తాయి. ఈ హామీకి ఎందుకు కట్టుబడవు? అన్నది మౌలిక ప్రశ్న. తమ కొత్త విధానానికి అంగీకారం తెలపండి అని వాట్సాప్ ప్రకటించాక వారం (జనవరి5–11)లోనే ప్రత్యా మ్నాయ యాప్ ‘సిగ్నల్‘ను దేశంలో 33 లక్షల మంది డౌన్లోడ్ చేసు కున్నారు. అదే వారంలో వాట్సాప్ డౌన్లోడ్లు 39 శాతం తగ్గాయి. దేశంలో ప్రతి నాలుగో వ్యక్తి వాట్సాప్ వినియోగదారుడే! వారు జారి పోతున్న ఆ వేగం చూసి వాట్సాప్ జడుసుకుంది. సత్వర దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఏ ప్రయోజనాలు లేకుంటే ఇంత దేబిరింపు దేనికి? నిజానికి వారి ఉద్దేశం కొత్త గోప్యత నిబంధనల ప్రకారం తాము సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో పంచుకోవడానికి వినియోగదారులు సమ్మతించడం. సమ్మతిలేని వారు వైదొలగడం. ఫేస్బుక్ ఇక యథేచ్చగా సదరు సమాచారాన్ని తన, తన ఒప్పంద వ్యాపార సంస్థలు స్వేచ్ఛగా విని యోగించుకోవడం. వాణిజ్య ప్రకటనల ఆదాయాన్ని పెంచుకోవడం. ఉభయత్రా లాభం! ఇదీ తలంపు. కానీ, ఇప్పుడిస్తున్న తాజా వివరణ ప్రకారం కేవలం వ్యాపార అకౌంట్ల విషయంలో తప్ప సాధారణ పౌరుల వ్యక్తిగత సమాచారం, కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు, ప్రేమికులు వంటి వారి సంభాషణల జోలికి రామంటున్నారు. అసలు అలాంటి డాటాను మేం చూడం, వాడం అని నమ్మబలుకు తోంది. కానీ, పౌరులకు అనుమానాలు న్నాయి. ఆ భయ–సందేహాలతో ఇవాళ పౌరులు ప్రత్యామ్నాయ ‘యాప్’లకు వెళ్లవచ్చు! కానీ, రేపు ఏదో రోజు అదే ఫేస్‌బుకో, మరో పోటీదారో ప్రత్యామ్నాయ యాప్‌లను కొనరని, మంచి ధర పలికితే అవి మాత్రం అమ్ముడు పోవని గ్యారెంటీ లేదు. వ్యక్తిగత సమాచారం చౌర్యానికి గురయ్యే ప్రమాద ఆస్కారం నుంచి పౌరులకు శాశ్వత రక్షణ కావాలి. సర్కార్‌పై కన్నేయాల్సిందే! వ్యక్తిగత సమాచార దుర్వినియోగ ప్రమాదంపై మెసేజింగ్ యాప్‌ల పట్ల పౌరులు ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రభుత్వాల పట్ల కూడా అంతే అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం అధికారికంగా సేకరించిన ఆధార్ సమాచారం లోగడ దుర్వినియోగమైన సందర్భాలెన్నో వెలుగు చూశాయి. పౌరుల ఫోన్ నంబర్ల సమాచారాన్ని పదిహేడు పైసల చొప్పున అమ్ముకున్న నీచ ఘటనలున్నాయి. సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం గత సంవత్సరం విస్పష్టంగా తేల్చి చెప్పే వరకు వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కే కాదని కేంద్ర ప్రభుత్వం భావించిన, వాదించిన దేశం మనది. పౌరుల హక్కుల కన్నా కార్పొరేట్ల వ్యాపార ప్రయోజనాలకు పెద్దపీట వేసే సర్కార్ల ఎత్తుల్ని పసిగట్టాల్సిందే! వ్యక్తిగత సమాచార భద్రత పేరిట ఇప్పుడు తీసుకురానున్న పీడీపీ చట్టం ఎంత పకడ్బందీ అన్నదీ కాపెట్టుకొని ఉండాలి. ఎందుకంటే, గత శీతాకాల సమావేశాల్లోనే ముసాయిదాను పార్లమెంటు ముందుకు తెచ్చినా, అభ్యంతరాల నడుమ సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపారు. అధికార భాజపా ఎంపీ మీనాక్షీ లేకీ నేతృత్వం లోని జేపీసీ సంప్రదింపుల ప్రక్రియ ముగించి, చట్టం పేరుతో సహా 89 సవరణలతో తుది ముసాయిదాను ఇటీవలే సిద్ధం చేసింది. రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఆమోదింపచేయాలన్నది తలంపు. ప్రయివేటు యాప్‌ల నుంచి, సామాజిక మాధ్యమాల నుంచి పౌరుల వ్యక్తిగత సమాచారానికి భద్రత అనే వంకతో సదరు సమాచారాన్ని కేంద్రం తన గుప్పెట్లోకి, నియంత్రణలోకి తెచ్చుకునేలా ముసాయిదా ఉందనే విమ ర్శలున్నాయి. అప్పుడది, రాజ్యాంగం పౌరులకు కల్పించిన వ్యక్తిగత సమాచార గోప్యతా హక్కుకే భంగకరం! వ్యక్తిగత–వ్యక్తిగతం కాని సమాచారాన్ని నిర్వచించడమైనా, సదరు డాటా సేకరణ–నిర్వహణ– నిలువ–వినియోగం, దుర్వినియోగ నియంత్రణ, భద్రత వంటి విషయాల్లో ఎటువంటి చట్టరక్షణ కల్పిస్తారన్నది ముఖ్యం. నిన్నటి వాట్సాప్ ఎత్తుగడైనా, రేపు మరే ఆన్లైన్ యాప్ నిర్వహకులో చేసే లోపాయికారి ప్రతిపాదనలనైనా.. ఈ చట్టం ఎలా నిలువరిస్తుంది? అన్నది చట్టరూపకల్పనను బట్టే ఉంటుంది. అందుకే, ప్రజాప్రతి నిధులు, పౌర సమాజం అప్రమత్తంగా ఉండాలి. రెండు నియంత్రణలూ ఉండాలి చట్టం ఒక్కటే సరిపోదు. గట్టి చట్టం అమల్లోకి వచ్చాక ఏర్పాటయ్యే రక్షణ ప్రాధికార సంస్థ, నియంత్రణ వ్యవస్థ పనితీరు ముఖ్యం. నిఘా –నియంత్రణ వ్యవస్థలు గోప్యత ఉల్లంఘనలకు ప్రతిస్పందించడమే కాకుండా ముందస్తు నివారణా వైఖరితో పనిచేయాలి. చట్టాలు చేసే– ఉల్లంఘించే వారి మధ్య పిల్లి–ఎలుక ఆట ఎప్పుడూ ఉంటుంది. ఒక నిబంధన తమని అడ్డగిస్తే, దాన్ని అధిగమించి పని కానిచ్చుకునే సాంకేతికతను నేరబుద్ది కలిగిన సంస్థలు సృష్టించుకుంటాయి. ఇదొక చక్రీయ ప్రక్రియ. పౌరులు కూడా స్వీయ నియంత్రణ పాటించాలి. ఉచితంగా వస్తుందంటే చాలు, ఏ ఆధునిక సదుపాయమైనా నిబంధ నలు చదువకుండానే గుడ్డిగా సమ్మతి తెలుపడం మానుకోవాలి. అవసరం ఉన్నా, లేకున్నా వ్యక్తిగత, సున్నితమైన సమాచారాన్ని ఎక్కడపడితే అక్కడ పంచుకునే అలవాట్లను తగ్గించుకోవాలి. తెలిసో తెలియకో.. కనీస గోప్యత లేకుండా సొంత జీవితాన్ని ఎంతగా బజారుకీడ్చుకుంటున్నామో... కొంచెం ఇంగితంతో వ్యవహరిస్తేనే మనకూ, సమాజానికీ మంచిది. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
టిక్‌టాక్ కంప్లీట్ ఆఫ్‌లైన్
న్యూఢిల్లీ : భారత్‌లో టిక్‌టాక్‌తో సహా 59 చైనీస్ యాప్‌లపై కేంద్రం సోమవారం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో గూగుల్ ప్లే స్టోర్,యాప్ స్టోర్లలో టిక్‌టాక్‌తో పాటు మిగిలిన కొన్ని యాప్‌లను తొలగించారు. మరోవైపు ఆయా ఫోన్లలో ఇన్స్టాల్ అయి ఉన్న యాప్స్ మాత్రం మామూలుగా పనిచేస్తూ వచ్చాయి. అయితే కొద్దిసేపటి నుంచి మొబైల్ ఫోన్లలో, డెస్క్‌టాప్ వర్షన్లో టిక్‌టాక్ యాప్ సేవలు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా టిక్‌టాక్ యాప్ పూర్తిగా ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిపోయింది. టిక్‌టాక్ యాప్ ఓపెన్ చేస్తున్న వినియోగదారులకు.. నెట్వర్క్ ఎర్రర్ కనిపిస్తుంది. (చదవండి : టిక్‌టాక్‌పై నిషేధం) అలాగే యాప్ ఓపెన్ చేసేవారికి ‘భారత ప్రభుత్వం టిక్‌టాక్‌తో సహా 59 యాప్‌లపై నిషేధం విధించింది. మేము భారత ప్రభుత్వ ఆదేశాన్ని పాటించే పనిలో ఉన్నాం. అలాగే సమస్యను పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడానికి, పరిష్కారం కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. ఇండియాలో ఉన్న మా వినియోగదారుల భద్రత మాకు అత్యంత ప్రధానమైంది’ అనే సందేశం కనిపిస్తుంది. మరోవైపు భారత్‌లో తమ యాప్‌ను నిషేధించడంపై టిక్‌టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ స్పందిస్తూ.. తమ వినియోగదారుల డేటాను చైనా సహా ఏ విదేశీ ప్రభుత్వానికి ఇవ్వలేదని, భవిష్యత్తులో కూడా అలా చేయబోమని వివరణ ఇచ్చారు. భారత చట్టాల ప్రకారం, డేటా ప్రైవసీ, సెక్యూరిటీ నిబంధనలన్నీ పాటిస్తున్నామంటూ టిక్‌టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ ఒక ప్రకటన విడుదల చేశారు.(చదవండి : నిషేధంపై టిక్‌టాక్ స్పందన) -
ప్లేస్టోర్ నుంచి టిక్‌టాక్ తొలగింపు
న్యూఢిల్లీ : చైనా యాప్ టిక్‌టాక్‌ను గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గూగుల్, యాపిల్ మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నాయి. టిక్‌టాక్, హెలో, షేర్ ఇట్తో సహా 59 చైనీస్ యాప్స్‌ను నిషేధిస్తూ చైనాకు భారత్ షాకిచ్చింది. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, ప్రజాభద్రత దృష్ట్యా ఈ యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర సర్కారు సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ వెబ్ ఇండెక్స్ లెక్కల ప్రకారం గతేడాది జూన్ నాటికి భారతదేశంలో 12 కోట్ల మంది నెలవారీ టిక్‌టాక్ వినియోగదారులు ఉన్నారు. తమ యాప్‌ను నిషేధించిన నేపథ్యంలో ఈరోజు తమ వివరణ వినడానికి ప్రభుత్వం అంగీకరించిందని టిక్‌టాక్ ఇండియా తెలిపింది. (చైనాకు షాక్; టిక్‌టాక్‌పై నిషేధం) -
చైనాకు షాక్; టిక్‌టాక్‌పై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: భారత్–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. చైనా వస్తువులు, మొబైల్ అప్లికేషన్లు(యాప్స్) నిషేధించాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా పెరుగుతూ వచ్చింది. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, ప్రజాభద్రత దృష్ట్యా మొత్తం 59 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర సర్కారు ప్రకటించింది. ఈ ప్రకటనలో చైనా పేరు ఎక్కడా ప్రస్తావించకపోయినా.. దాదాపు ఈ యాప్‌లన్నీ చైనాకు చెందినవే. బాగా పాపులర్ అయిన టిక్‌టాక్, హెలో, యూసీ బ్రౌజర్, న్యూస్ డాగ్ వంటి యాప్‌లు సహా మొత్తం 59 యాప్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. భద్రతాపరమైన కారణాల దృష్ట్యా వీట న్నింటిపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సోమవారం రాత్రి ప్రకటించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69ఏ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలు–2009ని అనుసరించి భద్రతాపరంగా పొంచి ఉన్న ముప్పు ఆధారంగా 59 యాప్‌లను నిషేధిస్తున్నట్టు తెలిపింది. ఇవి దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, దేశరక్షణ, ప్రజా భద్రతకు హాని కలిగించే కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నట్టు సమాచారం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. 130 కోట్ల మంది భారతీయుల గోప్యతను కాపాడాల్సి ఉందని అభిప్రాయపడింది. నిషేధిత యాప్‌లు ఇవే.. భారతీయుల ప్రయోజనాల పరిరక్షణకే.. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో లభ్యమయ్యే కొన్ని మొబైల్ యాప్‌లు భారతదేశం వెలుపల ఉన్న సర్వర్లకు మన దేశ వినియోగదారుల డేటాను అనధికారికంగా చేరవేస్తున్నట్లు, రహస్యంగా, దొంగతనంగా డేటాను పంపిస్తున్నట్టు ఐటీ శాఖకు అనేక ఫిర్యాదులు అందాయి. ఇది చాలా ఆందోళన కలి గించే విషయమైనందున అత్యవసర చర్యలు చేపట్టినట్టు కేంద్రం వెల్లడించింది. ఈ హానికరమైన యాప్‌లను నిరోధించడానికి భారత సైబర్ క్రైమ్ కో–ఆర్డినేషన్ సెంటర్, హోం మంత్రిత్వ శాఖ కూడా సమగ్ర సిఫార్సులను పం పాయి. డేటా సెక్యూరిటీ, గోప్యతకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు అందినట్టు ఐటీ శాఖ తెలిపింది. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌కు కూడా డేటా భద్రత, గోప్యతలకు సంబం ధించి ఫిర్యాదులు అందాయి. దేశ సార్వభౌమత్వానికి, పౌరుల గోప్యతకు హాని కలిగించే మొబైల్ యాప్స్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయని కేంద్రం పేర్కొంది. వీటిని ప్రాతిపదికగా తీసుకోవడంతోపాటు, దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు ఇలాంటి యాప్స్ ముప్పు కలిగిస్తున్నాయన్న విశ్వసనీయమైన సమాచారాన్ని స్వీకరించి ఇకపై ఈ యాప్స్‌ను వినియోగించేందుకు అనుమతి నిరాకరిస్తున్నట్టు తేల్చిచెప్పింది. మొబైల్, నాన్ మొబైల్ ఇంటర్నెట్ ఆధారిత డివైజెస్లలోనూ వీటి వినియోగాన్ని నిషేధిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ చర్య కోట్లాది మంది భారతీయ మొబైల్, ఇంటర్నెట్ వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షిస్తుందని తెలిపింది. ఈ నిర్ణయం భారత సైబర్ స్పేస్ భద్రత, సార్వభౌమత్వాన్ని పటిష్టం చేసుకునే దిశగా తీసుకున్న చర్యగా అభివర్ణించింది. చైనాకు ఘాటైన హెచ్చరిక యాప్‌లపై నిషేధం విధించడం చైనా ఎగుమతులు, దిగుమతులపై ఇప్పటికిప్పుడు ఎలాంటి ప్రభావం చూపకపోవచ్చని సమాచారం. ఆయా యాప్‌లు వాణిజ్య ప్రకటనల ద్వారా భారత్‌లో రూ.వేల కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నాయి. టిక్‌టాక్ మొత్తం వినియోగదారుల్లో 30 శాతం మంది మన దేశం నుంచే ఉన్నట్టు అంచనా. ప్రస్తుతం భారత ప్రభుత్వం తీసుకున్న చర్య వల్ల ఆయా కంపెనీల ఆదాయం గణనీయంగా పడిపోవడమే కాకుండా వాటి విలువ తగ్గుతుంది. చైనా యాప్ రెవెన్యూలో 2016 నుంచి ఏటా 140 శాతం వృద్ధిరేటు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. చైనా యాప్‌లపై నిషేధం విధించడంతో భారతీయ యాప్ మార్కెట్ విస్తరించే అవకాశం ఉంది. టిక్‌టాక్ వంటి యాప్‌లకు పోటీగా ఇప్పటికే చింగారీ వంటి స్వదేశీ యాప్ నిలదొక్కుకుంటోంది. అలాగే న్యూస్‌డాగ్, హెలో వంటి న్యూస్ అగ్రిగేటర్లకు దీటైన స్వదేశీ యాప్స్ నిలదొక్కుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. చైనా దుందుడుకు చర్యలకు తగిన సమాధానంగానే యాప్‌లపై నిషేధం విధించినట్లు అవగతమవుతోంది. మొబైళ్లలో వచ్చే యాప్‌ల పరిస్థితి ఏంటి? ఇప్పటికే చైనా తయారీ మొబైల్స్ భారత్‌లో అత్యధికంగా వినియోగంలో ఉన్నాయి. ఈ నిషేధిత యాప్‌ల్లో చాలా వరకు మొబైల్ ఫోన్లలోనే ఇన్‌బిల్ట్‌గా నిర్మితమై ఉన్నాయి. వాటిని తొలగించేందుకు అవకాశం లేదు. కేంద్రం నిషేధించినప్పటికీ కొత్తగా వాటిని డౌన్లోడ్ చేసుకోకపోయినా పాత యాప్‌లు వినియోగంలో ఉంటాయని సంబంధిత కంపెనీలు ప్రచారం చేస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. -
సెలెక్ట్ కమిటీకి ‘డేటా’ బిల్లు
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో.. పౌరుల సమాచార భద్రతకు ఉద్దేశించిన ‘వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు’పై (పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు) కేంద్రప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఈ బిల్లును జాయింట్ సెలెక్ట్ ప్యానల్ పరిశీలనకు పంపిస్తున్నట్లు ఐటీ మంత్రి రవి శంకర్ చెప్పారు. ఈ కమిటీ బిల్లుకు సంబంధించిన నివేదికను బడ్జెట్ సమావేశాల్లోపు అందించనున్నట్లు తెలుస్తోంది. కాగా, సమాచార భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు అభ్యంతరాలు లేవనెత్తడం తెల్సిందే. ఈ బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపాలని కోరారు. ఆందోళనల నేపథ్యంలో బిల్లును కమిటీ పరిశీలనకు పంపారు. కమిటీలో ఎంపీలు మిథున్‌రెడ్డి, మీనాక్షి లేఖి తదితరులు ఉన్నారు. -
సైబర్ ఇన్సూరెన్స్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: కీలకమైన సమాచార భద్రతకు సవాళ్లు పెరిగిపోతున్న నేపథ్యంలో... సైబర్ ఇన్సూరెన్స్‌కు ఆదరణ పెరుగుతోంది. 2018లో ఈ విభాగం వార్షికంగా 40 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీఎస్‌సీఐ) నివేదిక వెల్లడించింది. డేటా ఉల్లంఘనలు జరిగితే ఎదురయ్యే ఆర్థిక పరిణామాలను తట్టుకునేందుకు సైబర్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపింది. భారత మార్కెట్ ఇప్పటికీ ఆరంభ దశలోనే ఉందని, 2018 నాటికి 40% వృద్ధి నమోదైనట్టు తెలిపింది. అంతర్జాతీయంగా సైబర్ ఇన్సూరెన్స్ మార్కెట్ 2017 నాటికి 4.2 బిలియన్ డాలర్లు (రూ.29,400కోట్లు) ఉండగా, ఏటా 27 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేస్తోందని పేర్కొంది. -
ఆదమరిస్తే అంతే సంగతి...
టెలికం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్) చైర్మన్ ఆర్.ఎస్.శర్మ ఈ మధ్య ఉన్నట్టుండి హాట్ టాపిక్ అయ్యారు. కారణం... చేతనైతే నా డేటా హ్యాక్ చేయండంటూ తన ఆధార్ నెంబర్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. హ్యాకర్లకు సవాల్ విసిరారు. ఇంది కొంత విమర్శలకు దారితీసినా... తన డేటా భద్రతపై తనకున్న నమ్మకమే అలా చేయించిందనే వాదనలు ఎక్కువగా వినిపించాయి. ఇది నిజమే కావచ్చు. కాకపోతే శర్మ మాదిరిగా అందరూ తమ డేటా భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకోగలరా? తీసుకోగలరని గట్టిగా చెప్పలేం. ఎందుకంటే డేటా దుర్వినియోగం రోజురోజుకీ పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తూనే ఉంది. అందుకే ఆర్బీఐ, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తమ పరంగా వ్యవస్థలను పటిష్ట పరిచి, ఈ విషయంలో ప్రజల్లో అవగాహన కోసం చర్యలు తీసుకుంటున్నాయి. ‘‘మన వ్యక్తిగత డేటాను బయటపెడితే ఎవరూ కూడా రక్షించలేరు’’ అనేది లక్ష్మీ విలాస్ బ్యాంకు రిటైల్ బ్యాంకింగ్ హెడ్ పీరుష్ జైన్ మాట. ఈ నేపథ్యంలో డేటా రక్షణ కోసం ఏ చర్యలు తీసుకోవాలో నిపుణుల సూచనల ఆధారంగా తెలియజేసే కథనమే ఇది... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం వైఫైకి రక్షణ తప్పనిసరి... మీ వైఫై కనెక్షన్‌ను భద్రంగా చూసుకోవడం అత్యంత ప్రధానం. చాలా పరికరాలు ఇపుడు వైఫైతో కనెక్ట్ అయిపోతున్నాయి. అందుకే డేటా చోరులు మీ వైఫై నెట్‌వర్క్‌లోకి చొరబడి సున్నితమైన డేటాకు హాని తలపెట్టొచ్చు. కాబట్టి మీరు వాడని సమయాల్లో వైఫైను స్విచాఫ్ చేయడం మంచిది. క్లిష్టమైన పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవడం, దాన్ని తరచుగా మారుస్తుండడం వంటివి చేయాలి. ఇన్విజిబుల్... అంటే మీ నెట్వర్క్ మరొకరికి సెర్చ్‌లో కనిపించకుండా ఉండే ఆప్షన్ ఎంచుకుంటే ఇంకా మంచిది. ఉచితం కనెక్షన్లతో ప్రమాదమే... బహిరంగ ప్రదేశాల్లో పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లను వినియోగించుకోవడానికి కాస్తంత దూరంగా ఉండాలనేది నిపుణుల సూచన. ‘‘పబ్లిక్ వైఫై నెట్వర్క్ వినియోగించే సమయంలో నేరగాళ్లు మీ పరికరం ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించే ప్రమాదం ఉంటుంది. మీ ప్రమేయం లేకుండానే జాతి వ్యతిరేక కార్యకలాపాలకు మీ పరికరాలను వాడుకునే ప్రమాదం కూడా ఉంది’’ అని అర్క సీఈవో శివంగి నందకర్ణి చెప్పారు. పరికరాలకు కవచం... అధిక భద్రతా ప్రమాణాలు, నాణ్యతతో కూడిన యాంటీవైరస్, యాంటీ మాల్వేర్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఉచిత సాఫ్ట్వేర్లకు దూరంగా ఉండడం మంచిదన్నది నిపుణుల సూచన. బ్లూటూత్‌ను సైతం వినియోగంలో లేని సమయంలో కచ్చితంగా ఆఫ్‌లోనే ఉంచుకోవాలి. ఆన్లైన్ లావాదేవీలకు ఓటీపీ వస్తుండడంతో మొబైల్‌కు తప్పకుండా పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు తెలిసిన వారు కూడా మీ మొబైల్‌ను దుర్వినియోగం చేసే వీలుంటుంది. యాప్స్ పట్ల జర జాగ్రత్త! నిజానికి ఈ రోజుల్లో చాలా వరకు డేటా చౌర్యం అన్నది మొబైల్ యాప్స్ ద్వారానే జరుగుతోందన్నది నిపుణుల హెచ్చరిక. యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్న సమయంలో కాంటాక్టుల సమాచారం, ఎస్ఎంఎస్ల సమాచారం, మీడియా యాక్సెస్, లొకేషన్ యాక్సెస్, కెమెరా తదితర అనుమతులు అడుగుతుండడం అందరికీ అనుభవమే. తద్వారా మీ మొబైల్లోని ఆయా సమాచారాన్ని ఇవి కాపీ చేసేస్తుంటాయి. మీ ఫోన్లో సేవ్ చేసి ఉన్న ఇతరుల సమాచారాన్ని కూడా కొట్టేస్తుంటాయి. అలాగని ముఖ్యమైన యాప్స్‌ను వాడకుండా ఉండటం, డిలీట్ చేసుకోవడం సాధ్యం కాదనే చెప్పాలి. కాకపోతే ఒకసారి సెట్టింగ్స్‌లోకి వెళ్లి పర్మిషన్స్ చూడాలి. అనవసరమైన పర్మిషన్స్‌ను తీసేయాలి. అలాగే, తప్పనిసరి అయిన యాప్స్ వినియోగానికే పరిమితం కావడం మంచిది. మరో ముఖ్యమైన అంశమేంటంటే ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ యాప్ స్టోర్ నుంచి కాకుండా ప్రయివేటు వెబ్సైట్ల నుంచి ఇన్స్టాల్ చేసుకునే యాప్స్‌కు దూరంగా ఉండటమే మంచిది. ఈమెయిల్ అలర్ట్ ఈ మెయిల్ అన్నది ఎంతో కీలకమైనదిగా చాలా మంది భావించడం లేదు. ఈ మెయిల్ అనేది ఓ వ్యక్తికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల వివరాలకు, వ్యక్తిగత వివరాలకు కేంద్రం వంటిది. కనుక ఈ మెయిల్‌కు కఠినమైన పాస్‌వర్డ్‌ను పెట్టుకోవాలి. సెకండ్ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ కూడా ఉండడం మంచిది. కొత్త డివైజ్‌పై మెయిల్ లాగిన్ అయిన ప్రతిసారీ అలర్ట్ వస్తుంటుంది. దీంతో అప్రమత్తం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కార్డులు భద్రం సుమా!! ఏటీఎం కేంద్రాలు కూడా మోసాలకు నిలయాలవుతున్నాయి. మీరు ఏటీఎం కేంద్రంలో కార్డు స్వైప్ చేసే చోట క్లోనింగ్ పరికరాలను మోసగాళ్లు ఉంచి, అందులో స్వైప్ చేసిన కార్డుల సమాచారాన్ని కొట్టేస్తున్న ఘటనలు నమోదవుతూనే ఉన్నాయి. అందుకే ఏటీఎం కేంద్రాల్లో కార్డులను స్వైప్ చేసే చోట క్లోనింగ్ పరికరాలున్నాయేమోనని గమనించాలి. క్లోనింగ్ పరికరాల ద్వారా కొట్టేసిన సమాచారంతో మోసగాళ్లు తమకు అనువైన చోట మోసాలకు పాల్పడుతుంటారు. అలాగే, పిన్ నంబర్ ఎంటర్ చేసే సమయంలో అడ్డుగా ఓ చేయిని ఉంచడం ద్వారా చోరీకి అవకాశం లేకుండా చూసుకోవచ్చు. కార్డు వివరాలను ఆన్లైన్ రిటైలర్లతో పంచుకోవద్దు. పిన్ నంబర్ కూడా తరచుగా మారుస్తుండాలి. ఎక్కువగా జనసంచారం లేని ప్రాంతాల్లోని ఏటీఎంలను నేరగాళ్లు ఎంపిక చేసుకుంటుంటారు. కనుక రిమోట్ ప్రాంతాల్లో కాకుండా జన్మసమ్మర్థ ప్రాంతాల్లో, సెక్యూరిటీ ఉన్న ఏటీఎంలను ఎంచుకోవడం ఒకింత నయం. ఇక రెస్టారెంట్లు, పీవోఎస్ మెషిన్ల వద్ద కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కార్డులను అక్కడి సిబ్బందికి ఇచ్చి పక్కకు వెళ్లిపోకూడదు. ఈ లోపు వారు స్కిమ్మింగ్ పరికరంపై దాన్ని స్వైప్ చేయడం ద్వారా డేటా చోరీ అయ్యే ప్రమాదం ఉంటుంది. మీ సమక్షంలోనే కార్డును స్వైప్ చేసేలా చూసుకోవాలి. పాస్‌వర్డ్‌లకు రక్షణ ఉందా? నేడు ఆన్లైన్లో దాదాపు ప్రతీ పోర్టల్ రిజిస్టర్ చేసుకోవాలని కోరుతున్నాయి. దీంతో యూజర్ ఐడీ, పాస్వర్డ్ సెట్ చేసుకోవడం, ఆ తర్వాత వాటిని గుర్తుంచుకోలేక మర్చిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఒకరు ఎన్నో పోర్టల్స్‌లో లాగిన్ అవుతుంటారు. అన్నింటి వివరాలూ గుర్తుంచుకోవడం కష్టమే మరి. అందుకే వీటిని ఎక్కడైనా నమోదు చేసుకోవాలి. అందుకోసం మీకు మాత్రమే అర్థమయ్యే కోడ్ భాషలో రాసుకోవడం మంచిది. సామాజిక మాధ్యమాల వద్ద... ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో సున్నితమైన డేట్ ఆఫ్ బర్త్, ఇల్లు, కార్యాలయం చిరునామాలు, ఫోన్ నంబర్లు తదితర సమాచారాన్ని పోస్ట్ చేయకుండా జాగ్రత్తపడాలి. కొందరు డేట్ ఆఫ్ బర్త్ అన్నది పాస్‌వర్డ్‌గానూ పెట్టుకుంటుంటారు. కనుక ఈ వివరాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ‘లక్కీడ్రా’ లీకేజీ లక్కీ డ్రా గెలుచుకున్నారని, వివరాలు తెలియజేస్తూ క్లెయిమ్ చేసుకోవాలనే తరహా ప్రకటనల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. వివరాలు తీసుకున్న తర్వాత వాటిని వ్యాపార సంస్థలకు విక్రయిం చి సొమ్ము చేసుకునేవారున్నారు. మీ ఫోన్ బిల్లులు, బ్యాంకు స్టేట్మెంట్లలోనూ కీలకమైన వివరాలు ఉంటాయని మర్చిపోవద్దు. లక్కీ డ్రా గెలుచుకున్నారని సైబర్ నేరగాళ్లు మెయిల్స్ ద్వారానూ వ్యక్తిగత వివరాల తస్కరణకు ప్రయత్నిస్తుంటారు. మధ్యవర్తుల ద్వారా... టెలికం కంపెనీల ఏజెంట్లు, ఇతర మధ్యవర్తిత్వ సంస్థల ద్వారానూ మీ వ్యక్తిగత సమాచారం లీకయ్యే ప్రమాదం పొంచి ఉంది. మంచి వ్యవస్థలను కలిగి ఉన్న సంస్థల ద్వారానే సేవలను పొందడం ఒకింత సురక్షితం. యాప్స్‌తో ప్రమాదం మీరు ఇన్స్టాల్ చేసుకునే యాప్స్ పేరున్న మంచి సంస్థలవి అయితే ఫర్వాలేదు. కానీ, అంతగా తెలియనివి, థర్డ్ పార్టీ యాప్స్‌తో చాలా ప్రమాదం కొనితెచ్చుకున్నట్టే. ఎందుకంటే ఆ యాప్స్‌కు మీరిచ్చే పర్మిషన్స్‌తో మొబైల్లోని సమాచారం అంతా కొల్లగొడుతుంటారు. బ్యాంకు నుంచి అంటూ కాల్స్ వస్తే? కొందరు మోసగాళ్లు మీకు ఖాతా ఉన్న బ్యాంకు శాఖ నుంచి కాల్ చేస్తున్నామంటూ మీ వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. వివరాలు చెప్పారో ఆ తర్వాత మీ ఖాతాలో ఉన్నదంతా ఊడ్చేయగలరు. హైదరాబాద్‌లోని జ్ఞానేంద్రకు ఎదురైన అనుభవం ఇందుకు ఉదాహరణ. జ్ఞానేంద్ర ఎస్బీఐ నుంచి గృహ రుణం తీసుకుని ఈఎంఐ చెల్లిస్తున్నాడు. ఈఎంఐ చెల్లింపునకు రెండు రోజుల ముందు ఓ రోజు ఓ వ్యక్తి జ్ఞానేంద్రకు కాల్ చేసి ‘‘మీ డెబిట్ కార్డు బ్లాక్ అయింది. ఈఎంఐ చెల్లింపులకు సమస్య ఎదురుకాకుండా ఉండేందుకు గాను అన్‌బ్లాక్ చేయాలి. కార్డు వివరాలు ఓ సారి చెప్పండి’’ అని కోరాడు. అతడికి జ్ఙానేంద్ర తన కార్డు వివరాలు చెప్పగా, ఆ తర్వాత అరగంటకే అతని బ్యాంకు ఖాతా నుంచి ఐదు లావాదేవీల్లో రూ.50,000 డెబిట్ చేసుకున్నాడు. జ్ఞానేంద్ర బ్యాంకులు, పోలీసు స్టేషన్, ఆర్బీఐ చుట్టూ తిరిగినా ప్రయోజం లేకపోయింది. కనుక ఈ తరహా కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇక నేరగాళ్లు వెండర్ల నుంచి వ్యక్తుల ఖాతా నంబర్, ఫోన్ నంబర్, ఆధార్ నంబర్, చిరునామా, డేట్ ఆఫ్ బర్త్ తదితర సమాచారాన్ని సేకరించి, ఆ వివరాల ఆధారంగా తాము మోసానికి ఎంచుకున్న వారికి కాల్ చేస్తుంటారు. బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామంటూ ‘‘మీ ఖాతాలో సమస్య ఉంది. యూజర్ ఐడీ, పాస్వర్డ్ రీసెట్ చేయాలి లేదా ఓటీపీ చెప్పండి’’ అని అడగడం ద్వారా ఖాతాల్లోని నగదును కొల్లగొట్టేయగలరు. నిజానికి బ్యాంకు సిబ్బంది కస్టమర్లకు కాల్ చేసి ఈ తరహా సమాచారాన్ని అడగడం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. బ్యాంకు కస్టమర్ కేర్‌కు కాల్ చేసిన సందర్భంలోనే వివరాలను నమోదు చేయాల్సి వస్తుంది. -
యాప్స్‌కీ టెల్కోల నిబంధనలే వర్తిస్తాయి
న్యూఢిల్లీ: డేటా భద్రతకు నిర్దిష్టమైన చట్టం వచ్చే దాకా మొబైల్ డివైజ్‌లు, యాప్స్, బ్రౌజర్స్ మొదలైన వాటన్నింటికీ టెల్కోలకు అమలు చేస్తున్న నిబంధనలే వర్తిస్తాయని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ చెప్పారు. డేటాను హ్యాండిల్ చేసే డిజిటల్ సంస్థలన్నింటిపైనా నియంత్రణ ఉండాలని సూచించడంలో ట్రాయ్ తనకి అప్పగించిన బాధ్యతల పరిధిని దాటి వ్యవహరించిందన్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. అంతిమంగా యూజర్లే తమ తమ డేటాకు యజమానులని, ఇతరత్రా సంస్థలన్నీ కస్టోడియన్లు మాత్రమేనని శర్మ స్పష్టం చేశారు. డేటాకు సంబంధించి భౌతిక ప్రపంచంలోనూ, డిజిటల్ ప్రపంచంలోనూ యాజమాన్య హక్కుల స్వభావం పూర్తి భిన్నంగా ఉంటుందన్నారు. ‘‘డిజిటల్ ప్రపంచంలో ఒకే డేటా ఏకకాలంలో అనేక సంస్థలు, వ్యక్తుల దగ్గర ఉండొచ్చు. ఇలాంటప్పుడు సదరు డేటాపై యాజమాన్య హక్కులు ఎవరికుంటాయి, ఎవరి నియంత్రణలో ఉంటుంది? అనే ప్రశ్న తలెత్తుతుంది. మాకు అప్పగించిన బాధ్య త కూడా దీన్ని పరిష్కరించమనే. అంతిమంగా యూజరే సదరు డేటాకు హక్కుదారు అవుతారని, వ్యవస్థలోని మిగతా సంస్థలన్నీ కూడా కస్టోడియన్స్ మాత్రమేనని సిఫార్సు చేశాం‘ అని శర్మ వివరించారు.ఇప్పటికే అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఈ విధానానికి కట్టుబడి ఉంటున్న నేపథ్యంలో తమ సిఫార్సులకు పెద్ద వ్యతిరేకత ఉండబోదని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
భారత్‌లో సర్వర్ల ఏర్పాటు తప్పనిసరి
న్యూఢిల్లీ: భారతీయుల డేటాకు మరింత భద్రత కల్పించే దిశగా డేటా హోస్టింగ్ సంస్థలన్నీ దేశీయం గా సర్వర్లను ఏర్పాటు చేయడం తప్పనిసరి చేస్తూ కేంద్రం చర్యలు తీసుకోనుంది. దీనికోసం 2022 దాకా గడువిస్తూ మే 1న ప్రకటించే కొత్త టెలికం విధానం ముసాయిదాలో నిబంధనలు పొందుపర్చనుంది. ఇందులో దేశీ యూజర్లకు సంబంధించిన మెసేజ్‌లు, ఈమెయిల్స్ మొదలైన వివరాలన్నీ దేశీయంగానే ఉండేలా... సర్వర్లను ఇక్కడే ఏర్పాటు చేయాలని టెలికం సర్వీస్ ప్రొవైడర్స్‌కు ప్రభుత్వం సూచించే అవకాశం ఉందని అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వ సేవలు, విద్య, వైద్యం మొదలైనవి అందరికీ సులభతరంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఈ డేటా ఉపయోగపడగలదని ప్రభుత్వం భావిస్తోందని, ఇందులో భాగంగానే ఈ మేరకు సూచనలు చేయొచ్చని పేర్కొన్నారు. డేటా భద్రతకు లోకలైజేషన్ కీలకం: పేటీఎం సీవోవో కిరణ్ వాసిరెడ్డి దేశంలో డిజిటల్ పేమెంట్ సర్వీసుల్లో గణనీయమైన వృద్ధి నమోదవుతోంది. ఈ నేపథ్యంలో కన్సూమర్ డేటా గోప్యతకు, భద్రతకు పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లందరూ డేటా లోకలైజేషన్‌కు అధిక ప్రాధాన్యమివ్వాలని, దీనిపై ఇన్వెస్ట్ చేయాలని పేటీఎం పేర్కొంది. ‘‘భారతదేశపు పేమెంట్ వ్యవస్థల భద్రతకు డేటా లోకలైజేషన్ కీలకం. దేశంలో కస్టమర్లకు పేమెంట్ సేవలను అందించాలనుకుంటున్న ప్రతి సంస్థ ఈ నిబంధనను కచ్చితంగా అనుసరించాలి’’ అని పేటీఎం సీవోవో కిరణ్ వాసిరెడ్డి తెలిపారు -
డేటా భద్రతపై తక్షణం చట్టం తేవాలి
న్యూఢిల్లీ: డిజిటలైజేషన్ పెరుగుతున్న నేపథ్యంలో డేటా ప్రైవసీకి సంబంధించి సాధ్యమైనంత త్వరలో ఒక చట్టాన్ని రూపొందించాలని ఆర్థిక అంశాల పార్లమెంటరీ స్థాయీ సంఘం.. ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అలాగే, సమాచార మౌలిక అంశాలపై సమన్వయం కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎం వీరప్ప మొయిలీ సారథ్యంలోని స్థాయీ సంఘం ఈ మేరకు డిజిటల్ ఎకానమీపై నివేదికను పార్లమెంటుకు సమర్పించింది. సైబర్ నేరాలను సమర్ధంగా ఎదుర్కొనేందుకు సుశిక్షితులైన నిపుణుల కొరతపై కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. దేశం డిజిటల్ వైపు మళ్లుతున్న తరుణంలో క్లోనింగ్ వంటి ఏటీఎం మోసాలు మొదలైనవి భారీగా పెరుగుతున్నాయని, సామాన్యులు మోసాలబారిన పడుతున్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలో డేటా భద్రత కోసం చట్టం తేవాలని, మోసాలపై ఫిర్యాదులు చేసేందుకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని సూచించింది. -
భారత్‌తో సమాచార మార్పిడి భద్రం: స్విట్జర్లాండ్
న్యూఢిల్లీ/బెర్న్: భారతదేశంలో ప్రస్తుతం అమలవుతున్న డేటా సెక్యూరిటీ, సమాచార గోప్యత చట్టాలు పటిష్టంగా ఉన్నాయని, ‘ఆటోమెటిక్ ఎక్సే్చంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్’ ఒప్పందంలో ఆ దేశం చేరేందుకు అనువుగా ఉన్నాయని స్విట్జర్లాండ్ ప్రభుత్వం పేర్కొంది. స్విస్ బ్యాంకు ఖాతాల వివరాల్ని పంచుకునేందుకు భారత్‌తో సమాచార మార్పిడి ఒప్పందం కోసం నోటిషికేషన్‌ను స్విట్జర్లాండ్ ఆదివారం గెజిట్‌లో ప్రచురించింది. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే స్విస్ బ్యాంకుల్లోని నల్ల కుబేరుల వివరాల్ని పొందేందుకు భారత్‌కు అవకాశం ఏర్పడుతుంది. నోటిఫికేషన్ విడుదల చేస్తూ.. బీమా, ఇతర ఆర్థిక సేవల రంగంలో భారత్ మార్కెట్లో ప్రవేశించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు స్విస్ పేర్కొంది. -
భారత్ లోనే డేటా సెంటర్ ఏర్పాటు: షియోమీ
న్యూఢిల్లీ: భారతీయ కస్టమర్లకు మెరుగైన సేవలందించేందుకు, సమాచారానికి కట్టుదిట్టమైన భద్రత కల్పించే విధంగా వచ్చే సంవత్సరంలోగా భారత్ లోనే డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని చైనా మొబైల్ ఫోన్ కంపెనీ షియోమీ వెల్లడించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ భాగస్వామ్యంతో కలిసి నిర్వహించే డేటా సెంటర్ కు 'ఆపిల్ ఆఫ్ చైనా' అని పేరు పెట్టనున్నట్టు షియోమీ తెలిపింది. చైనా దేశానికి సంబంధించిన కస్టమర్ల డేటాను యూఎస్, సింగపూర్ సర్వర్లకు తరలించే కార్యక్రమాన్ని ఇప్పటికే షియోమీ కంపెనీ చేపట్టింది. షియోమీ కంపెనీ ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో డేటా సెంటర్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు షియోమీ ఓ ప్రకటనలో తెలిపింది. భారత్ లో ఏర్పాటు చేసే డేటా సెంటర్ ద్వారా భారతీయ కస్టమర్ల సమాచారానికి ఎలాంటి ముప్పు ఉండదు అని పీటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షియోమీ ఉపాధ్యక్షుడు హ్యూగో బర్రా తెలిపారు.