భారత్ లోనే డేటా సెంటర్ ఏర్పాటు: షియోమీ
భారత్ లోనే డేటా సెంటర్ ఏర్పాటు: షియోమీ
Published Mon, Oct 27 2014 3:23 PM | Last Updated on Fri, May 25 2018 7:16 PM
న్యూఢిల్లీ: భారతీయ కస్టమర్లకు మెరుగైన సేవలందించేందుకు, సమాచారానికి కట్టుదిట్టమైన భద్రత కల్పించే విధంగా వచ్చే సంవత్సరంలోగా భారత్ లోనే డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని చైనా మొబైల్ ఫోన్ కంపెనీ షియోమీ వెల్లడించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ భాగస్వామ్యంతో కలిసి నిర్వహించే డేటా సెంటర్ కు 'ఆపిల్ ఆఫ్ చైనా' అని పేరు పెట్టనున్నట్టు షియోమీ తెలిపింది.
చైనా దేశానికి సంబంధించిన కస్టమర్ల డేటాను యూఎస్, సింగపూర్ సర్వర్లకు తరలించే కార్యక్రమాన్ని ఇప్పటికే షియోమీ కంపెనీ చేపట్టింది. షియోమీ కంపెనీ ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో డేటా సెంటర్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు షియోమీ ఓ ప్రకటనలో తెలిపింది. భారత్ లో ఏర్పాటు చేసే డేటా సెంటర్ ద్వారా భారతీయ కస్టమర్ల సమాచారానికి ఎలాంటి ముప్పు ఉండదు అని పీటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షియోమీ ఉపాధ్యక్షుడు హ్యూగో బర్రా తెలిపారు.
Advertisement