ఆకర్షిస్తున్న టెక్ దిగ్గజం
తర్వాతి స్థానాల్లో టీసీఎస్, అమెజాన్
ర్యాండ్‌స్టాడ్ బ్రాండ్ రీసెర్చ్ వెల్లడి
న్యూఢిల్లీ: భారత్‌లో ఉద్యోగులకు అత్యంత ఆకర్షణీయమైన సంస్థగా మైక్రోసాఫ్ట్ మొదటి స్థానంలో నిలిచింది. టీసీఎస్, అమెజాన్ రెండు, మూడో స్థానాల్లో ఉన్నట్టు ‘ర్యాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్‌ఈబీఆర్) 2024’ నివేదిక తెలిపింది. ఆర్థిక సామర్థ్యం, మంచి పేరు, కెరీర్‌లో చక్కని పురోగతి అవకాశాలు ఈ మూడూ ఉద్యోగులు ప్రధానంగా చూసే అంశాలు.
వీటి పరంగా మైక్రోసాఫ్ట్ ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. టాటా పవర్, టాటా మోటార్స్, శామ్‌సంగ్ ఇండియా, ఇన్ఫోసిస్, ఎల్‌అండ్‌టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, మెర్సెడెస్ బెంజ్ వరుసగా టాప్–10లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 1,73,000 మంది ప్రతినిధులు, 6,084 కంపెనీల అభిప్రాయాలను సర్వేలో భాగంగా ర్యాండ్‌స్టాడ్ తెలుసుకుంది. భారత్ నుంచి 3,507 మంది అభిప్రాయాలు స్వీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment