Xiaomi
-
మార్కెట్లోకి షావొమీ రెడ్మీ-14సీ 5జీ.. బడ్జెట్ ఫోన్
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ఫోన్ల దిగ్గజ కంపెనీ షావొమీ (Xiaomi) సరికొత్త 5జీ ఫోన్‌ను విడుదల చేయనుంది. రెడ్మీ -14సీ 5జీ (Redmi 14C 5G) పేరుతో జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ స్మార్ట్‌ఫోన్ భారతీయ వినియోగదారుల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరీ తయారు చేశామని కంపెనీ ప్రతినిధి సందీప్ శర్మ తెలిపారుహైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను వివరించారు. భారత్‌లో 5జీ స్మార్ట్ఫోన్ల వినియోగం వేగంగా పెరుగుతున్నప్పటికీ ఇప్పటివరకూ కేవలం 16 శాతం మంది వినియోగదారులు మాత్రమే 5జీ ఫోన్లు కలిగి ఉన్నారని.. మరింత మంది అత్యధిక వేగంతో పని చేసే 5జీ ఫోన్లను అందుబాటులోకి తెచ్చే క్రమంలో భాగా షావొమీ రెడ్మీ-14సీని అందుబాటులోకి తెచ్చిందని ఆయన వివరించారు. స్టార్‌లైట్ బ్లూ, స్టార్‌డస్ట్ పర్పుల్, స్టార్‌గేజ్ బ్లాక్ పేరుతో ప్రత్యేకంగా డిజైన్‌తో కూడిన మూడు రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుందని తెలిపారు.నాలుగు నానోమీటర్ల ప్రాసెసర్ డిజైన్..రెడ్మీ - 14సీ 5జీలో స్మార్ట్‌ఫోన్‌లో అత్యాధునిక స్నాప్‌డ్రాగన్ 4జెన్-2 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. నాలుగు నానోమీటర్ల ప్రాసెసర్ (Processor) అర్కిటెక్చర్ కారణంగా సెకనుకు 2.5 జీబీబీఎస్ల వేగాన్ని అందుకోగలగడం దీని ప్రత్యేకత. 5జీ వేగాలను అందుకునేందుకు వీలుగా ఎక్స్-61 మోడెమ్‌ను ఏర్పాటు చేశారు. స్క్రీన్ సైజ్ 6.88 అంగుళాల హెచ్డీ (HD) డిస్ప్లే కాగా.. రెఫ్రెష్ రేటు 120 హెర్ట్ట్జ్. అలాగే డాట్ డ్రాప్ డిస్ప్లే కలిగి ఉండి.. గరిష్టంగా 600 నిట్స్ ప్రకాశాన్ని ఇస్తుంది.ఇక స్టోరేజీ విషయానికి వస్తే 12 జీబీల ర్యామ్ (RAM) (6జీబీ + అవసరమైతే మరో 6 జీబీ) కలిగి ఉంటుంది. 128 జీబీల రామ్ సొంతం. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా ఒక టెరాబైట్ వరకూ స్టోరేజీని పెంచుకోవచ్చు. 50 ఎంపీల ఏఐ-డ్యుయల్ కెమెరా వ్యవస్థతోపాటు 8 ఎంపీల సెల్ఫీ కెమెరాతో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత షావొమీ హైపర్ ఓఎస్‌పై పని చేస్తుంది.ధర.. అందుబాటులోకి ఎప్పుడు?రెడ్మీ 14సీ 5జీ ఈ నెల 10వ తేదీ నుంచి షావోమీ స్టోర్లతోపాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లలోనూ అందుబాటులోకి రానుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ కలిగగిన ప్రాథమిక మోడల్ ధర రూ.9999లు కాగా.. స్టోరేజీ 128 జీబీ, మెమరీ నాలుగు జీబీలుండే ఫోన్ ధర రూ.10,999లు.. 6 జీబీ మెమరీ, 128 జీబీ స్టోరేజీ ఉన్న ఫోన్ ధర రూ.11,999లు అని సందీప్ శర్మ తెలిపారు. -
స్మార్ట్‌ఫోన్ కంపెనీ కారు.. లక్ష మంది కొనేశారు
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ 'షియోమీ' (Xioami) గత ఏడాది ఆటోమొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగానే కంపెనీ డిసెంబర్ 2024లో ఎస్‌యూ7 (SU7) పేరుతో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. షియోమీ లాంచ్ చేసిన ఈ కారును ఇప్పటికి లక్ష మంది కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..షియోమీ ఎస్‌యూ7 మార్కెట్లో అడుగు పెట్టి ఇంకా సంవత్సరం పూర్తి కాలేదు, అప్పుడే లక్ష యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది అంటే.. చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఎస్‌యూ7 కారు లక్ష యూనిట్ల సేల్స్ పొందిన విషయాన్ని కంపెనీ ఫౌండర్ & సీఈఓ 'లీ జున్' తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటో కూడా షేర్ చేశారు. ఈ ఏడాది చివరి నాటికి షియోమీ ఎస్‌యూ7 మొత్తం 1.30 లక్షల సేల్స్ పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు.షియోమీ ఎస్‌యూ7షియోమీ ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ కారు స్టాండర్డ్, ప్రో, మ్యాక్స్ అనే మూడు వెర్షన్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.25.18 లక్షలు, రూ. 28.67 లక్షలు, రూ. 34.97 లక్షలు. ఇవి మూడు చూడటానికి చాలా మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటాయి. కాబట్టి ఎక్కువమంది వీటిని ఇష్టపడి కొనుగోలు చేశారు. కంపెనీ కూడా తన కస్టమర్లకు డెలివరీలను వేగంగా చేయడానికి.. ఉత్పత్తిని కూడా వేగవంతం చేసింది.ఇదీ చదవండి: ఆఫ్రికన్ దేశాలకు ఇండియన్ బైకులు: ప్యూర్ ఈవీ ప్లాన్ ఇదే..ఆరు కలర్ ఆప్షన్లలో లభించే షియోమీ ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ కారు 5.28 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 210 కిమీ/గం కాగా.. ఇది 400 న్యూటన్ మీటర్ టార్క్, 299 పీఎస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులోని 73.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జీతో గరిష్టంగా 800కిమీ రేంజ్ అందిస్తుంది.The 100,000th Xiaomi SU7 has found its owner! She chose Radiant Purple and shared, "I’ve always been a Xiaomi Fan and picked the Pro for its smart driving and range." pic.twitter.com/c8G8GrVzwO— Lei Jun (@leijun) November 18, 2024 -
షావోమి ఇండియా ప్రెసిడెంట్ మురళీకృష్ణన్ రాజీనామా
షావోమి ఇండియా ప్రెసిడెంట్.. బీ మురళీకృష్ణన్ ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఆరు సంవత్సరాలు కంపెనీలో పనిచేసిన మురళీకృష్ణన్ అకడమిక్ రీసెర్చ్ వైపు వెళ్తున్న కారణంగా షావోమికి రాజీనామా చేసినట్లు సమాచారం.షియోమీ ఇండియా అధ్యక్షుడిగా తన పదవికి రాజీనామా చేసినప్పటికీ.. స్వతంత్ర వ్యూహాత్మక సలహాదారుగా కొనసాగుతారని సంస్థ వెల్లడించింది. 2018లో షావోమి ఇండియాలో అడుగుపెట్టిన మురళీకృష్ణన్ 2022లో కంపెనీ ఇండియా ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించారు. అంతకంటే ముందు ఈయన సంస్థలో కీలక పదవులను చేపట్టారు.ఇదీ చదవండి: శుభవార్త.. మరోమారు తగ్గిన బంగారం, వెండి ధరలుఇటీవలే పది సంవత్సరాల వార్షికోత్సవాన్ని షావోమి ఇండియా పూర్తి చేసుకుంది. 2023లో మను కుమార్ జైన్ కంపెనీని వీడిన తరువాత.. సంస్థ నుంచి వెళ్తున్న వారిలో మురళీకృష్ణన్ రెండో వ్యక్తి. అయితే మురళీకృష్ణన్ స్థానంలోకి ఎవరు వస్తారనే విషయాన్ని కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుతం కంపెనీ సీఓఓగా సుధీన్ మాథుర్, సీఎఫ్ఓగా సమీర్ రావు, సీపీఓగా వరుణ్ మదన్, సీఎమ్ఓగా అనుజ్ శర్మ ఉన్నారు. -
భారత్‌లో అడుగెట్టిన షియోమీ ఎలక్ట్రిక్ కారు ఇదే.. ఫోటోలు చూశారా?
గత ఏడాది గ్లోబల్ మార్కెట్లో అరంగేట్రం చేసిన కొత్త ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ సెడాన్‌ను.. షియోమీ ఎట్టకేలకు భారతదేశంలో తన 10వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రదర్శించింది. లేటెస్ట్ డిజైన్, ఫీచర్స్ కలిగిన ఈ కారును సంస్థ సాయర్ ఎల్ఐ (Sawyer Li) నాయకత్వంలో రూపొందించింది. ఈయన గతంలో బీఎండబ్ల్యూ విజన్ కాన్సెప్ట్ వంటి కార్ల రూపకల్పనలో ఐదేళ్లు పనిచేశారు.చూడటానికి బీవైడీ సీల్ మాదిరిగా ఉండే ఈ కారు.. ఏరోడైనమిక్ డిజైన్ పొందుతుంది. కాబట్టి ఇది మినిమలిస్టిక్ లేఅవుట్‌తో ఒక పెద్ద టచ్‌స్క్రీన్ సెంటర్ స్టేజ్, ఒక డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, పెద్ద హెడ్స్-అప్ డిస్ప్లే, పనోరమిక్ రూఫ్ వంటివి పొందుతుంది.షియోమీ ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ కారు 73.6 కిలోవాట్, 94.3 కిలోవాట్, 101 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతుంది. చైనీస్ లైట్-డ్యూటీ వెహికల్ టెస్ట్ సైకిల్ (CLTC) ప్రకారం.. ఇది 800కిమీ కంటే ఎక్కువ పరిధిని అందిస్తుందని తెలుస్తోంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 265 కిమీ.భారతదేశంలో కంపెనీ ఈ కారును ఎప్పుడు లాంచ్ చేస్తుందనే విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే దేశీయ విఫణిలో లాంచ్ అయితే దీని ధర రూ. 24.79 లక్షల నుంచి రూ. 34.42 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. -
ఎంఐ ఎ1 స్పెషల్ ఎడిషన్
సాక్షి, ముంబై: షావోమి తన పాపులర్ స్మార్ట్‌ఫోన్ ఎంఐ ఎ1 లో కొత్త ఎడిషన్ విక్రయాలను ప్రారంభిస్తోంది. క్రిస్మస్ సందర్భంగా రెడ్ కలర్ వెర్షన్ లో దీన్ని కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రేపు (డిసెంబర్12వ తేదీనుంచి) ఫ్లిప్‌కార్ట్, ఎంఐ హోం స్టోర్స్ద్వారా ప్రత్యేకంగా విక్రయించనుంది. గ్లోబల్ హాలిడే సీజన్‌ను సెలబ్రేట్ చేస్తున్న షావోమి ఇండియాలో కూడా క్రిస్మస్ సేల్‌ను ప్రకటించింది. ఈ ఎంఐ ఎ1 రెడ్ స్పెషల్ ఎడిషన్ రూ. 13,999 ధరలో బ్లాక్, గోల్డ్ అండ్ రోజ్ గోల్డ్ ఎడిషన్‌లో లభిస్తుంది. భారత్‌లో ఈ ఏడాది సెప్టెంబర్‌లో ధర రూ. 14,999కి లాంచ్ చేసిన కంపెనీ ఇటీవల దీనిపై వెయ్యి రూపాయల పర్మినెంట్ డిస్కౌంట్ ప్రకటించింది. ఎంఐ ఎ1 ఫీచర్లు 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆండ్రాయిడ్ 7.1.2 నౌగాట్ 2గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్ 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 3080 ఎంఏహెచ్ బ్యాటరీ -
తొలి సేల్కు ముందే 10 లక్షల రిజిస్ట్రేషన్లు
'దేశ్ కా స్మార్ట్‌ఫోన్'గా షావోమి ఇటీవల ప్రవేశపెట్టిన రెడ్మి 5ఏ స్మార్ట్‌ఫోన్‌కు అనూహ్య స్పందన వస్తోంది. తొలి సేల్కు ముందే ఈ స్మార్ట్‌ఫోన్ 10 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లను పొందింది. ఎంఐ.కామ్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ రిజిస్ట్రేషన్ల వెల్లువ కొనసాగింది. ఈ స్మార్ట్‌ఫోన్ రేపటి(డిసెంబర్ 7) నుంచి తొలిసారి విక్రయానికి వస్తోంది. రెండు వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.4,999కాగ, 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 6,999 రూపాయలు. అయితే బేస్ మోడల్ ధర 5999 రూపాయలు. వెయ్యి రూపాయల డిస్కౌంట్‌తో బేస్ మోడల్‌ను రూ.4,999కే విక్రయిస్తుంది. ''1 మిలియన్ మార్కును పొందాం. ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది. ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్‌లలో తొలిసారి విక్రయానికి వస్తున్న రెడ్మి 5ఏకు 1 మిలియన్‌కు పైగా రిజిస్ట్రేషన్లు పొందాం. యే హాయ్#దేశ్ కా స్మార్ట్‌ఫోన్'' అని షావోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ తెలిపారు. ఏ డార్క్ గ్రే, గోల్డ్, రోజ్ గోల్గ్ కలర్ వేరియంట్స్‌లో ఇది లభ్యం. రెడ్మి 5ఏ ఫీచర్లు 5 అంగుళాల హెచ్డీ తాకే తెర స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ నోగట్, ఎంఐయూఐ 9 వెర్షన్ 2జీబీ ర్యామ్, 3జీబీ ర్యామ్ 16జీబీ, 32జీబీ స్టోరేజ్ 128జీబీ వరకు విస్తరించుకునే అవకాశం 13 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 3000ఎంఏహెచ్ బ్యాటరీ -
రెడ్మి 5, 5 ప్లస్ లాంచ్ డేట్స్ ఫిక్స్
షావోమి రెడ్మి 5, రెడ్మి 5 ప్లస్ స్మార్ట్ఫోన్ల లాంచింగ్ తేదీ వివరాలు అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 7న ఈ స్మార్ట్ఫోన్లను తీసుకురాబోతున్నట్టు తెలిపింది. 18:9 యాస్పెప్ట్ రేషియో డిస్ప్లేలతో ఈ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ రెండు స్మార్ట్ఫోన్లలో రెడ్మి 5కి చైనీస్ టెలికమ్యూనికేషన్స్ సర్టిఫికేషన్ అథారిటీ టీనా నుంచి క్లియరెన్స్ కూడా వచ్చింది. దీనికి సంబంధించి కొన్ని స్పెషిఫికేషన్లను కూడా బహిర్గతం చేసింది. రెడ్మి 5కు 5.7 అంగుళాల హెచ్‌డీప్లస్ డిస్ప్లే, యాస్పెక్ట్ రేషియో 18:9, స్మార్ట్‌ఫోన్‌కు వెనుకవైపు ఫింగర్‌ప్రింట్ స్కానర్, స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, వెనుకవైపు కెమెరా 12ఎంపీ సెన్సార్, ముందు వైపు 5 ఎంపీ కెమెరా, 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ నోగట్ 7.0 ఫీచర్లుంటాయని తెలుస్తోంది. ఈ ఫోన్ అంచనా ధర రూ.13,700గా వెల్లడవుతోంది. రెడ్మి నోట్ 4 కంటే కాస్త ఎక్కువనే. అదేవిధంగా కాస్త పెద్దదిగా రెడ్మి 5 ప్లస్ స్మార్ట్‌ఫోన్, రెడ్మి 5 కంటే పెద్దదిగా ఉంటుందని తెలుస్తోంది. రెడ్మి 5 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌కు 5.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీప్లస్ డిస్ప్లే, ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్, వెనుకవైపు రెండు కెమెరాలు, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయని రిపోర్టులు చెబుతున్నాయి. కాగ, షావోమి అత్యంత ప్రతిష్టాత్మకమైన దేశ్ కా స్మార్ట్‌ఫోన్ నేడు విడుదల కాబోతుంది. దేశీయ స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీకి ఇది అతిపెద్ద ఆశ్చర్యకరమైన విషయమని షావోమి తెలిపింది. -
శాంసంగ్ స్థాయికి చేరిన షావోమి
భారత్‌లో నెంబర్ వన్ స్మార్ట్‌ఫోన్ కంపెనీగా దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ స్థాయికి చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారి షావోమి చేరుకుంది. సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్లో టాప్ స్లాట్‌లోకి షావోమి కూడా చేరుకున్నట్టు రీసెర్చ్ సంస్థ ఐడీసీ తెలిపింది. ఏడాది మూడో క్వార్టర్లో 9.2 మిలియన్ స్మార్ట్ఫోన్ల రవాణాతో షావోమి మార్కెట్ షేరు 23.5 శాతంగా నమోదైంది. దేశంలో అత్యంత వేగవంతంగా దూసుకెళ్తున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండులల్లో షావోమి కూడా ఉందని, ఈ ఏడాది మూడో క్వార్టర్లో కంపెనీ వృద్ధి రేటు కనీసం 300 శాతం(ఏడాది ఏడాదికి)గా ఉన్నట్టు ఐడీసీ తన క్వార్టర్లీ మొబైల్ ఫోన్ ట్రాకర్, క్యూ3 2017లో మంగళవారం పేర్కొంది. శాంసంగ్ సీక్వెన్షియల్‌గా(క్వార్టర్ క్వార్టర్‌కు) 39 శాతం వృద్ధిని నమోదుచేయగా.. ఏడాది ఏడాదికి 23 శాతం వృద్ధిని నమోదుచేసింది. శాంసంగ్ మార్కెట్ వాల్యులో 60 శాతం దాన్ని కీమోడల్స్ గెలాక్సీ జే2, గెలాక్సీ జే7 నెక్ట్స్, గెలాక్సీ జే7 మ్యాక్స్లున్నాయి. షావోమి బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా రెడ్మి నోట్4 నిలిచింది. ఈ క్వార్టర్లో నాలుగు మిలియన్ల రెడ్మి నోట్4 యూనిట్లను షావోమి రవాణా చేసింది. వచ్చే క్వార్టర్లలో శాంసంగ్, షావోమి రెండు తమ ఛానల్స్‌ను మరింత బలోపేతం చేసుకుంటాయని, తీవ్రమైన పోటీకర స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో లీడర్షిప్ కోసం ఈ రెండు కంపెనీలు పోటీ పడనున్నాయని ఐడీసీ ఇండియా సీనియర్ అనాలిస్ట్ ఉపాసన జోషి చెప్పారు. షావోమికి వెబ్సైట్ ద్వారా నమోదవుతున్న విక్రయాలు అధికంగా ఉన్నాయి. మొత్తంగా ఆన్లైన్ ఛానల్ ద్వారా వచ్చే షేరు 32 శాతం నుంచి 37 శాతం పెరిగింది. భారత మార్కెట్లోకి ప్రవేశించిన మూడేళ్లలోనే ఎక్కడా చూడనంత వృద్ధిని చూశామని షావోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, షావోమి వైస్‌ప్రెసిడెంట్ మను జైన్ తెలిపారు. అతి తక్కువ సమయంలో అన్ని రంగాల్లోనూ మార్కెట్ లీడర్‌గా నిలిచిన తొలి బ్రాండు తమదేనన్నారు. -
సెల్ఫీ ఔత్సాహికుల కోసం సరికొత్త స్మార్ట్‌ఫోన్
-
ఈ బ్రాండ్ న్యూ సిరీస్ ప్రమోటర్‌గా కత్రీనా
సాక్షి, ముంబై: చైనా మొబైల్ మేకర్ షావోమి భారత మార్కెట్లో తన దూకుడును మరింత పెంచేంది. తాజాగా వై1 సిరీస్‌లో సరికొత్త బిగ్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. ఇ-తరాన్ని లక్ష్యంగా చేసుకుని, బ్రాండ్ కొత్త సిరీస్‌ను ప్రత్యేకంగా భారత మార్కెట్లో ఆవిష్కరించింది వై 1 సిరీస్‌లో మూడు వైవిధ్యమైన డివైస్‌లను ఆకర్షణీయమైన ఫీచర్లు, ఆకట్టుకునే ధరలో, వినూత్న రంగుల్లో విడుదల చేసింది. అలాగే నవంబర్ మధ్యనాటికి ఎంఐయుఐ అప్‌గ్రేడ్ కూడా లభించనుందని ప్రకటించింది. అంతేకాదు వీటికి బాలీవుడ్ భామ కత్రీనా కైఫ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనుంది. కత్రీనా సైన్ చేసిన రెడ్ మి వై1 మొబైల్స్‌ను ప్రత్యేకంగా అందించనుంది. రెడ్ మి వై 1, 3జీబీ/ 32 జీబీ వేరియంట్ రూ .8,999, 4జీబీ /64జీబీ వేరియంట్ కోసం రూ. 10,999లుగా నిర్ణయించింది. అలాగే రెడ్మి వై 1 లైట్ పేరుతో బడ్జెట్‌ధరలో రూ .6,999 కే అందిస్తోంది. నవంబరు 8 మధ్నాహ్నం 12గంటలనుంచి ఎంఐ, అమెజాన్‌లలో విక్రయానికి లభిస్తుందని తెలిపింది. ఈ డివైస్‌తో ఇన్ఫ్రారెడ్ రిమోట్‌ను కూడా ఉచితంగా అందిస్తోంది. రెడ్ మి వై 1 ఫీచర్స్ 5.5 అంగుళాల హెచ్డీ స్క్రీన్ కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఫ్లాష్ సెల్ఫీ కెమెరా 3080ఎంఏహెచ్ బ్యాటరీ రెడ్ మి వై1 లైట్ ఫీచర్స్ 5.5 అంగుళాల హెచ్డీ స్క్రీన్, కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 425 ప్రాసెసర్ 2జీబీ ర్యామ్ 16 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా 3080 ఎంఏహెచ్ బ్యాటరీ Presenting Katrina Kaif as the face of our brand new series – Redmi Y1. RT to win a personally signed #Redmi Y1 by Katrina Kaif. pic.twitter.com/L05X0bcnhc — Redmi India (@RedmiIndia) November 2, 2017 -
రెడ్ మి నోట్ 5 ఏ లాంచ్..ఫీచర్లు?
బీజింగ్: ప్రముఖ చైనా మొబైల్ మేకర్ షావోమి మరో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. రెడ్ మి 4 ఏ, రెడ్మి నోట్ 4తో అమ్మకాల సునామీ సృష్టించిన షావోమి ఈ విజయ పరంపరలో మరో డివైస్‌ను చైనాలో విడుదల చేసింది. గత నెలలో రెడ్మి నోట్ 5 ఏ పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ కొత్త వెర్షన్ ప్రారంభించింది. కొత్త 4జీబీ ర్యామ్ వేరియంట్ లో దీని ధరను రూ.12వేలకు కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. పాత వెర్షన్ లోని స్నాప్ డ్రాగెన్ 425 ప్రాసెసర్ మెరుగుపర్చి( క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఆధారిత 435 ప్రాసెసర్) కొత్త వేరియంట్‌ను లాంచ్ చేసింది. ప్లాటినం సిల్వర్, షాంపైన్ గోల్డ్ రోజ్ గోల్డ్ కలర్స్‌లో చైనాలో ప్రస్తుతానికి లభిస్తోంది. 2జీబీ, 16జీబీ స్టోరేజ్,ధర రూ. 6700, 3జీబీ, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను కూ. 8645 ధరలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టులో చైనాలో లాంచ్ చేసింది. అయితే ఈ ఏడాది చివరిలోపు ఇండియాలో కూడా లాంచ్ చేయనుందని తెలుస్తోంది. అధికారిక సమాచారం వచ్చేంతవరకు ఎపుడు లాంచ్ చేయనుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్సే. రెడ్ మీ నోట్ 5 ఏ 5.5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే 720x1280 పిక్సల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ నౌగట్ 7.1.1 4 జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ స్టోరేజ్ 128 దాకా విస్తరించుకునే సదుపాయం 13 ఎంపీ రియర్ కెమెరా 16ఎంపి ఫ్రంట్‌కెమెరా 3080 ఎంఏహెచ్ బ్యాటరీ -
షావోమి సూపర్ నోట్‌బుక్
సాక్షి, బీజింగ్: షావోమి వరుస లాంచింగ్ లతోమ దూసుకుపోతోంది. ఎంఐ మిక్స్2, నోట్ బుక్ 3, నోట్ బుక్ ప్రో ల్యాప్‌ట్యాప్‌ను సోమవారం చైనాలో లాంచ్ చేసింది. 15.6 అంగుళాల డిస్ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ , 8వ జనరేషన్ ఇంటెల్‌కోర్ ఐ7 ప్రాసెసర్‌తో నోట్‌బుక్‌ను పరిచయం చేసింది. మూడు వేరియంట్లలో దీన్న విడుదల చేసింది. డ్యూయల్ కూలింగ్ సిస్టం , టచ్‌ప్యాడ్ విత్ ఫింగర్ పింట్ సెన్సర్, మెగ్నీషియం అలోయ్ ఫ్రేమ్ డాల్బీ అట్మోస్ ఇతర ఫీచర్లుగా నిలవనున్నాయి. అలాగే ఆపిల్ మ్యాక్ బుక్ ప్రో కీబోర్డుతో పోలిస్తే 19 శాతం పెద్దదైన బ్యాక్లిట్ కీబోర్డు దీని సొంతం . అలాగే16జీబీ ర్యామ్, ఫాస్ట్‌చార్జింగ్ ప్రత్యేకతలుగా కంపెనీ చెబుతోంది. కోర్ ఐ7, 8 జీబీ మోడల్ ధర రూ. 68,700 గాను, ఇంటెల్ కోర్ ఐ5 8 జీబీ ర్యామ్ మోడల్ ధర రూ.62,800గాను, ఇంటెల్ కోర్ ఐ7 16జీబీ రూ.54,900గాను ఉండనుంది. ఇది త్వరలో చైనాలో విక్రయాలు మొదలుకానున్నాయి. ఇతర మార్కెట్లలో అందుబాటుపై అధికారిక వివరాలకోసం వెయిట్ చేయాల్సిందే. -
ఎంఐ మిక్స్ 2లాంచ్.. ఫీచర్స్ తెలిస్తే..
సాక్షి, బీజింగ్: మొబైల్ దిగ్గజం షావోమి మరో రెండు ఉత్పత్తులను లాంచ్ చేసింది. ఎంఐ మిక్స్ 2 పేరుతో మరో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను, ఎంఐ నోట్‌బుక్ ప్రో ను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా ఎంఐమిక్స్కు సక్సెసర్‌గా ఎంఐమిక్స్ 2ను సోమవారం చైనా మర్కెట్లో ప్రవేశపెట్టింది. చైనాలో ఈ మధ్యాహ్నం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వీటిని విడుదల చేసింది. భారీ స్క్రీన్, ర్యామ్, స్టోరేజ్ కెపాసిటీ తమ ప్రత్యేకతలుగా కంపెనీ చెబుతోంది. ఎంఐ మిక్స్ 2 ఫీచర్స్ 5.99 ఫుల్ స్క్రీన్ డిస్ప్లే 6/8 జీబీ ర్యామ్ 64/128 256/ ఇంటర్నల్ స్టోరేజ్ 16ఎంపీ రియర్ కెమెరా విత్ సోనీ సెన్సర్ 12ఎంపీసెల్ఫీ కెమెరా 3400 ఎంఏహెచ్ బ్యాటరీ మరోవైపు ఇది ఐ ఫోన్ 7కి గట్టి పోటీఇవ్వనుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. 6జీబీ ర్యామ్ / 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,299(సుమారు రూ.32,335) యెన్లుగాను, 6జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ 3,599 (సుమారు రూ.36వేలు) యెన్‌గాను, 6జీబీ ర్యామ్ / 256 జీబీ స్టోరేజ్ 3,999 (సుమారు రూ.39 వేలు) యెన్ గాను కంపెనీ నిర్ణయించింది. అంతేకాదు సూపర్ బ్లాక్ కలర్ లో ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ రియర్ కెమరా రింగ్‌ను 18 క్యారెట్ల బంగారు రింగ్‌ను అమర్చడం మరో విశేషంగా ఉంది. -
షావోమి బిగ్ లాంచ్ : ఎంఐ ఏ1
సాక్షి, ముంబై: చైనా మొబైల్ మేకర్ షావోమి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం లాంచ్ చేసింది. బిగ్ లాంచ్ అంటూ ఊరిస్తూ వచ్చిన కంపెనీ ఎంఐ ఎ 1 పేరుతో డ్యుయల్ రియర్ కెమెరాలతో దీన్ని మార్కెట్లో ప్రవేశపెట్టింది. షావోమి గ్లోబల్లాంచ్ 2017లో ఇండియాలో మొట్ట మొదటి రెండు రియర్ కెమెరాలతో స్మార్ట్‌ఫోన్‌ను ఎంఐ లవర్స్‌కి అందుబాటులోకి తెచ్చింది. ఆన్లైన్ రీటైలర్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా లభించనుంది. ఫుల్ మెటల్‌బాడీ, ప్రీమియం డిజైన్ , 10వీ స్మార్ట్ పీఏ హై క్వాలిటీ ఆడియో, యూఎస్బీ టైప్-సీ పోర్ట్లతోపాటు డ్యూయల్ కెమెరా(ఫ్లాగ్ షిప్)(డీఎస్ఎల్ఆర్ ఎక్స్పీరియన్స్ ఇన్ పాకెట్) వన్ వైడ్ యాంగిల్ కెమెరా, వన్ వర్టికల్ కెమెరా తమ తాజా డివైస్ ప్రత్యేకతలుగా కంపెనీ చెబుతోంది. క్రియేటెడ్ బై షావోమి, పవర్డ్ బై గూగుల్ అని షావోమి తెలిపింది. దీని ధరను రూ.14,999గా నిర్ణయించింది. అయితే సెప్టెంబర్ 12వ తేదీ మధ్యాహ్నం నుంచి ఇది విక్రయానికి అందుబాటులోఉండనుంది. అంతేకాదు ఈ ఏడాది చివరి నాటికి గూగుల్ తాజా ఓఎస్ ఓరియో ఆప్డేట్ అందిస్తుందిట. ఎంఐ ఏ1 ఫీచర్లు 5.5 ఫుల్ హెచ్డీ డిస్ప్లే కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ క్వాల్కం స్నాప్ డ్రాగన్ 625 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ నౌగట్ 7.1 4 జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నల్‌స్టోరేజ్ 128 దాకా విస్తరించుకునే అవకాశం 12 ఎంపీ పిక్సెల్ డ్యుయల్ రియర్ కెమెరా 5ఎంపీ సెల్ఫీ కెమెరా 3080 ఎంఏహెచ్ బ్యాటరీ -
రెడ్మి 4, ఎంఐ మ్యాక్స్ 2లపై పేటీఎం క్యాష్‌బ్యాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఈ-కామర్స్ ఫ్లాట్ఫామ్స్లపై సంచలన విక్రయాలను నమోదుచేస్తున్న రెడ్మి ఫోన్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. షావోమి పాపులర్ స్మార్ట్ఫోన్లు రెడ్మి నోట్4, ఎంఐ మ్యాక్స్ 2 స్మార్ట్ఫోన్లపై పేటీఎం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. ఎంఐ స్టోర్ యాప్, ఎం.కామ్ వెబ్‌సైట్‌పై ఈ రెండు స్మార్ట్ఫోన్లను పేటీఎం డిజిటల్ వాలెట్ ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.300 క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్టు ఈ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ తెలిపింది. వాలెట్‌లోనే ఈ రూ.300 క్యాష్‌బ్యాక్ లభించనుంది. కేవలం ఒకే ఒక్క లావాదేవీకి, ఒకే యూజర్‌కు ఈ పేటీఎం క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. షావోమి రెడ్మి నోట్4 స్మార్ట్‌ఫోన్ 2017 తొలి క్వార్టర్లో అత్యధికంగా రవాణా అయిన స్మార్ట్‌ఫోన్‌గా తాజా రిపోర్టుల్లో నిలిచింది. ఆండ్రాయిడ్ 7.0 నోగట్ ఆధారితంగా ఎంఐయూఐ 8 ద్వారా రెడ్మి నోట్4 పనిచేస్తుంది. 5.5 అంగుళాల పుల్ హెచ్డీ 2.5డీ కర్వ్డ్ గ్లాస్ ఐపీఎస్ డిస్ప్లేను, స్నాప్‌డ్రాగన్ 625 ఎస్ఓసీని కలిగి ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ 2జీబీ ర్యామ్, 3జీబీ ర్యామ్, 4జీబీ ర్యామ్ వేరియంట్లలో ఇది లాంచ్ అయింది. ఎంఐ మ్యాక్స్ 2 స్మార్ట్‌ఫోన్ కూడా ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ ఆధారితంగా ఎంఐయూఐ 8 ద్వారా పనిచేస్తుంది. 2గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ఎస్ఓసీతో 4జీబీ ర్యామ్‌ను ఇది కలిగి ఉంది. 6.44 అంగుళాల ఫుల్-హెచ్డీ డిస్ప్లే, 12ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా దీనిలో ఫీచర్లు. -
రెడ్మి 4ఏలో కొత్త వేరియంట్ లాంచ్
రెడ్మి 4ఏ స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్‌ను షావోమి మంగళవారం లాంచ్ చేసింది. ఒరిజినల్ హ్యాండ్‌సెట్‌కు అదనపు ర్యామ్, స్టోరేజ్‌తో ఈ వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొత్తగా తీసుకొచ్చిన ఈ వేరియంట్ 3జీబీ ర్యామ్, 32జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. దీని ధర 6,999 రూపాయలు. ఎంఐ.కామ్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా, పేటీఎం, టాటా క్లిక్‌లలో గురువారం నుంచి ఈ ఫోన్ విక్రయానికి వస్తోంది. '' సర్ప్రైజ్, మేము అద్భుతమైన ధర రూ.6,999లో రెడ్మి 4ఏ(3జీబీ ర్యామ్+32జీబీ ఫ్లాష్ మెమరీ) కొత్త వేరియంట్‌ను లాంచ్ చేస్తున్నాం'' అని షావోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, షావోమి వైస్‌ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది మార్చిలో రెడ్మి 4ఏ స్మార్ట్‌ఫోన్‌ను షావోమి లాంచ్‌చేసిన సంగతి తెలిసిందే. దీని ధర రూ.5,999. లాంచ్ చేసినప్పుడు ఈ ఫోన్‌కు 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ కలిగి ఉంది. ప్రస్తుతం స్టోరేజ్‌ను, ర్యామ్‌ను మరింత పెంచుతూ కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రెడ్మి 4ఏ ఫీచర్లు... హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ కార్డు స్లాట్ ఎంఐయూఐ 8 ఆధారిత ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో 5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే 1.4గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ స్నాప్‌డ్రాగన్ 425ఎస్ఓసీ 13 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 4జీ వాయిస్ఓవర్ ఎల్టీఈ 3120 ఎంఏహెచ్ బ్యాటరీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను మైక్రోఎస్డీ కార్డు ద్వారా 128జీబీ వరకు పెంపు -
3 వేరియంట్లలో రెడ్మి 5ఏ వచ్చేసింది!
సాక్షి: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ముఖ్యంగా ఆన్లైన్ పరంగా తిరుగులేకుండా దూసుకెళ్తున్న షావోమి, రెడ్మి నోట్ 5 సిరీస్ తొలి స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేసింది. రెడ్మి నోట్ 5ఏ పేరుతో దీన్ని లాంచ్ చేసింది. మూడు వేరియంట్లతో రెండు మోడల్స్(స్టాండర్డ్ ఎడిషన్, హై ఎడిషన్)లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. మొత్తంగా మూడు ర్యామ్, మెమరీ స్టోరేజ్ వేరియంట్లు ఈ మోడల్స్‌లో భాగం. బేస్ వేరియంట్ 2జీబీ ర్యామ్+16జీబీ స్టోరేజ్‌ను కలిగి ఉంది. దీని ధర 699 యువాన్లు అంటే సుమారు 6,700 రూపాయలు. అదేవిధంగా మిగతా రెండు ప్రీమియం వేరియంట్లలో ఒకటి 3జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజ్‌ను కలిగి ఉండగా.. రెండోది 4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్‌ను కలిగి ఉంది. 3జీబీ ర్యామ్ వేరియంట్ ధర 899 యువాన్లు అంటే సుమారు 8,600 రూపాయలు. 4జీబీ ర్యామ్ వేరియంట్ ధర 1,199 యువాన్లు అంటే సుమారు 11,500 రూపాయలు. ఈ మూడు వేరియంట్లు ఎంఐ.కామ్, జేడీ.కామ్‌లలో నేటి(మంగళవారం) నుంచే విక్రయానికి వస్తున్నాయి. ఈ మూడు వేరియంట్లు షాంపైన్ గోల్డ్, రోజ్ గోల్డ్, ప్లాటినం సిల్వర్ రంగుల్లో లభ్యం కానున్నాయి. స్లీక్ మెటల్ యూనిబాడీ, వెనుకవైపు యాంటీనా బ్యాండ్స్, సింగిల్ కెమెరా సెటప్, ముందు వైపు నేవిగేషన్ బటన్స్ ఉన్నాయి. కిందివైపు యూఎస్బీ టైప్-సీ పోర్టు, డ్యూయల్ స్పీకర్ గ్రిల్స్, టాప్ ఎడ్జ్‌లో 3.5ఎంఎం ఆడియో జాక్, ప్రీమియం వేరియంట్లకు వెనుకైపు ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో ఇది రూపొందింది. రెడ్మి నోట్ 5ఏ ఫీచర్ల విషయానికొస్తే... 5.5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే లేటెస్ట్ ఎంఐయూఐ 9 సాఫ్ట్వేర్ రెండు సిమ్ స్లాట్స్(నానో+నానో) మెమరీని పెంచుకోవడానికి మైక్రోఎస్డీ స్లాట్(128జీబీ వరకు విస్తరణ) స్టాండర్డ్ వేరియంట్‌కు స్నాప్‌డ్రాగన్ 425 ఎస్ఓసీ ప్రీమియం వేరియంట్‌కు స్మాప్‌డ్రాగన్ 435 ఆక్టాకోర్ ప్రాసెసర్ విత్ యాడ్రినో 505 జీపీయూ 13 ఎంపీ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ స్టాండర్డ్ వేరియంట్‌కు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రీమియం వేరియంట్లకు ఫ్రంట్ కెమెరా 16మెగాపిక్సెల్ 3080 ఎంఏహెచ్ బ్యాటరీ -
రెడ్మి నోట్ 5ఏ నేడే లాంచింగ్
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న షావోమి నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ నేడు మార్కెట్లోకి రాబోతుంది. రెడ్మి 4 సిరీస్ పాపులారిటీ అనంతరం రెడ్మి 5 సిరీస్‌లో స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసేందుకు షావోమి సిద్ధమైంది. ఈ సిరీస్‌లో భాగంగా రెడ్మి నోట్ 5ఏను రెండు వేరియంట్లలో నేడు షావోమి మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గత వారంలోనే రెడ్మి నోట్ 5ఏ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 21న లాంచ్ చేయనున్నట్టు షావోమి ధృవీకరించింది. ప్రస్తుతం ఇది చైనీస్ మార్కెట్లలోకి మాత్రమే ప్రవేశించబోతుంది. మరికొన్ని నెలల్లో భారత్‌లోకి వచ్చేయనుంది. గిజ్బోట్ నివేదిక ప్రకారం రెడ్మి నోట్ 5ఏ మూడు కార్డు స్లాట్స్‌ను కలిగి ఉండబోతుంది. రెండు సిమ్ కార్డు కోసం కేటాయిస్తుండగా.. మూడోది మైక్రో ఎస్డీ కార్డుకు కేటాయించనుంది. అంచనాల ప్రకారం రెడ్మి నోట్ 5ఏ ఫీచర్లు... 5.5 అంగుళాల హెచ్డీ 720పీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ ఓఎస్ బేసిక్ మోడల్ : క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ఎస్ఓసీ 2జీబీ ర్యామ్ 16జీబీ స్టోరేజ్ 128 జీబీ వరకు విస్తరణ మెమరీ 16 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా టాప్ మోడల్ : ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 435 ఎస్ఓసీ 3 జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ 128 జీబీ వరకు విస్తరణ మెమరీ రెండు వైపుల 16 ఎంపీ సెన్సార్స్ -
అందుకే ‘నోట్-4’ కాలింది: షావోమి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఇటీవల రెడ్మి నోట్-4 కాలి భావన సూర్యకిరణ్ అనే యువకుడికి గాయాలైన ఘటనపై చైనా కంపెనీ షావోమీ స్పందించింది. ఇందులో తమ తప్పేమీ లేదనే రీతిలో... ఫోన్‌ను విపరీతమైన ఒత్తిడికి గురి చేసినందునే ఈ ఘటన చోటుచేసుకుని ఉంటుందని పేర్కొంది. కస్టమర్‌తో పలుమార్లు మాట్లాడిన అనంతరం కాలిపోయిన ఫోన్‌ను తెప్పించుకుని పరిశీలించామని ఫోన్‌పై వేరే ఒత్తిడితో బ్యాక్ కవర్‌తో పాటు బ్యాటరీ ప్రభావితమైందని, స్ర్కీన్ దెబ్బతిన్నదని ప్రాథమికంగా వెల్లడైందని కంపెనీ పేర్కొంది. ఫోన్ దెబ్బతినడానికి సరైన కారణమేంటనేది పూర్తి పరిశోధన అనంతరం తేలుతుందని తెలిపింది. సంబంధిత వార్త... కాలిపోయిన 'నోట్-4'.. యువకుడికి గాయాలు! -
భారత్‌లోకి షావోమి తొలి డ్యూయల్-కెమెరా ఫోన్
న్యూఢిల్లీ : చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రెండే స్మార్ట్ఫోన్లను డ్యూయల్ రియర్ కెమెరాలతో లాంచ్ చేసింది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు ఇంకా భారత్‌లోకి ప్రవేశించలేదు. త్వరలోనే ఈ రెండు స్మార్ట్ఫోన్లలో ఒకటి అంటే తొలి డ్యూయల్ కెమెరా షావోమి స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి రాబోతుంది. ఈ విషయాన్ని షావోమి మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ తన మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. '' ఇంకా మీరు ఎన్నో రోజులు వేచిచూడాల్సిన పనిలేదు. షావోమి తొలి డ్యూయల్ కెమెరా ఫోన్ వచ్చే నెలలో భారత్‌లోకి వచ్చేస్తోంది. అయితే అదేంటో మీరు గెస్ చేయగలరా?'' అని జైన్ ట్వీట్ చేశారు. అయితే ఈ రెండు స్మార్ట్ఫోన్లలో ఒకటి షావోమి ఎంఐ 5ఎక్స్‌ను గత నెలలోనే చైనా మార్కెట్లోకి లాంచ్ చేశారు. 4GB+64GB తో దీన్ని అక్కడ ప్రవేశపెట్టారు. దీని ధర అక్కడ 1,499 యువాన్లు. భారత్‌లో సుమారు 14,200 రూపాయల వరకు ఉండొచ్చు. ఈ ఫోన్ అతిపెద్ద ఆకర్షణ, వెనుకవైపు రెండు కెమెరాలు. రెండు కూడా 12 మెగాపిక్సెల్వే. ఫ్రంట్ వైపు రియల్-టైమ్ బ్యూటిఫికేషన్ ఫీచర్‌తో 5ఎంపీ కెమెరాను అమర్చింది కంపెనీ. 5.5 అంగుళాల ఫుల్-హెచ్డీ డిస్ప్లే, ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 128జీబీ విస్తరణ మెమరీ, 3080ఎంఏహెచ్ బ్యాటరీ దీనిలో మిగతా ఫీచర్లు. ఇక ఎంఐ 6 విషయానికి వస్తే, ఈ స్మార్ట్‌ఫోన్‌ను షావోమి ఈ ఏడాది ఏప్రిల్‌లో లాంచ్ చేసింది. క్వాల్కామ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 835 ఫ్లాగ్షిప్ ఎస్ఓసీతో ఇది రూపొందింది. 6జీబీ ర్యామ్, 5.15 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 3.5ఎంఎం ఆడియో జాక్, 64జీబీ, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 3,350 ఎంఏహెచ్ బ్యాటరీ దీనిలో ఫీచర్లు. ఈ ఫోన్‌కు కూడా 12ఎంపీ లెన్స్‌తో వెనుకవైపు రెండు కెమెరాలున్నాయి. దీంతో 4కే వీడియో రికార్డింగ్ సామర్థ్యం కలిగి ఉంది. ముందు వైపు 8ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఇది రూపొందింది. -
షావోమీ ఎంఐ 6సి స్మార్ట్‌ఫోన్..త్వరలో
చైనీస్ మొబైల్ మేకర్ షావోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'ఎంఐ 6సీ'ని త్వరలో విడుదల చేయనుంది. చైనీస్ సామాజిక సైట్ బైడులో ధర, స్టోరేజ్, స్పెసిఫికేషన్స్, డిజైన్ వివరాలు బహిర్గతమయ్యాయి. ప్రధానంగా 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదల కానుంది. స్టోరేజ్ ఆధారంగా వీటి ధరలు వరుసగా రూ.18,900, రూ.23,600గా ఉండనుంది. అలాగే ఈ ఫోన్‌కు సంబంధించిన లీక్ అయిన వెనుక, ముందు భాగాల ఫోటోల ఆధారంగా వెనుకవైపు ద్వంద్వ కెమెరా సెటప్ లేదు. ఫ్లాష్ మాడ్యూల్‌తోపాటు పైన ఒకే ప్రధాన సెన్సార్ మాత్రమే ఉంది. అయితే, లీక్ ఫ్లాష్ ప్రక్కన ఉన్న నల్లని విండో 5 మెగాపిక్సెల్ ద్వితీయ కెమెరాగా కనిపిస్తోంది. రీసెంట్ లీక్ ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఇలా ఉండనున్నాయని అంచనా. షావోమీ 'ఎంఐ 6సీ' ఫీచర్లు 5.1 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.1 నూగట్ 4/6 జీబీ ర్యామ్ 64/128 జీబీ స్టోరేజ్ 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 4100 ఎంఏహెచ్ బ్యాటరీ -
రూ.10,000లోపు బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ షావోమిదే...
న్యూఢిల్లీ: దేశంలో రూ.10,000లోపు బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్స్‌లో షావోమి అగ్రస్థానం దక్కించుకుంది. 2017 రెండో త్రైమాసికానికి సంబంధించి రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది. షావోమికి చెందిన ‘రెడ్మి నోట్–4’, ‘రెడ్మి–4’ స్మార్ట్ఫోన్లు వరుసగా 7.2 శాతం, 4.5 శాతం మార్కెట్ వాటాతో తొలి రెండు స్థానాలను ఆక్రమించాయి. ఇక 4.3 శాతం వాటాతో శాంసంగ్ ‘గెలాక్సీ జే2’ మూడో స్థానంలో ఉంది. ఒప్పొ ఏ37, శాంసంగ్ గెలాక్సీ జే7 వరుసగా 3.5 శాతం, 3.3 శాతం వాటాలతో నాలుగు, ఐదో స్థానంలో ఉన్నాయి. 2017 తొలి అర్ధభాగంలో రూ.10,000లోపు విభాగంలో ‘రెడ్మి నోట్–4’ టాప్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా అవతరించిందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ తెలిపారు. -
షావోమి ‘మి మ్యాక్స్ 2’ వచ్చింది...
ధర రూ. 16,999 న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా ‘మి మ్యాక్స్ 2’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.16,999గా ఉంది. ఇందులో 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ స్క్రీన్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ, 12 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5,300 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొంది. ‘మి మ్యాక్స్ 2’ స్మార్ట్‌ఫోన్స్ జూలై 27 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నవి. కాగా కంపెనీ తన మూడో వార్షికోత్సవం సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్స్‌ను జూలై 20, 21 తేదీల్లో మి.కామ్, మి హోమ్స్‌లో కస్టమర్లకు అందుబాటులో ఉంచుతోంది. -
3వ వార్షికోత్సవం: ఒక్క రూపాయికే రెడ్మి 4ఏ
ఎంఐ మ్యాక్స్ 2ను షావోమి గ్రాండ్‌గా మంగళవారం భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ లాంచింగ్ సందర్భంగానే కంపెనీ తమ ఎంఐ 3వ వార్షికోత్సవాన్ని భారత్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయనున్నట్టు వెల్లడించింది. ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కంపెనీ ఓ స్పెషల్ సేల్‌ను కూడా నిర్వహించనుంది. జూలై 20, జూలై 21వ తేదీల్లో తమ యాక్ససరీస్‌పై బంపర్ డిస్కౌంట్లు, ఒక్క రూపాయికే ఫ్లాష్ సేల్‌ను అందిస్తుంది. కొత్తగా లాంచైన స్మార్ట్ఫోన్లు రెడ్మి 4, రెడ్మి నోట్4లను కంపెనీ ఈ సేల్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఒక్క రూపాయి ఫ్లాష్ సేల్ కింద రెడ్మి 4ఏ, వై-ఫై రిపీటర్ 2, 10,000 ఎంఏహెచ్ ఎంఐ పవర్ బ్యాంక్ 2లను అందుబాటులో ఉంచుతున్నట్టు షావోమి చెప్పింది. గోయిబిబో ద్వారా దేశీయ హోటల్స్ బుకింగ్ చేసుకునే వారికి రూ.2000 తగ్గింపును షావోమి ప్రకటించింది. అంతేకాక ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్, 8000 రూపాయలకు మించి లావాదేవీలు చేస్తే ఒక్కో కార్డుపై 500 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను ఇవ్వనున్నట్టు తెలిపింది. కొత్తగా లాంచైన ఎంఐ మ్యాక్స్ 2 స్మార్ట్‌ఫోన్ కూడా జూలై 20వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులోకి రానుంది. అప్పటి నుంచి స్టాక్స్ అయిపోయే వరకు దీని విక్రయించనున్నామని కంపెనీ చెప్పింది. రెడ్మి 4, రెడ్ మి నోట్ 4, రెడ్మి 4ఏ స్మార్ట్ఫోన్లు కూడా ఈ రెండు రోజుల సేల్‌లో అందుబాటులో ఉంటాయి. ఎంఐ క్యాప్సల్స్ ఇయర్‌ఫోన్స్, ఎంఐ హెడ్‌ఫోన్స్ కంఫర్ట్, ఎంఐ ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్స్ ప్రొ హెచ్డీ, ఎంఐ ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్స్ బేసిక్, ఎంఐ సెల్ఫీ స్టిక్, ఎంఐ వీఆర్ ప్లే వంటి యాక్ససరీస్‌పై 300 రూపాయల వరకు కంపెనీ డిస్కౌంట్‌ను ఆఫర్ చేయనుంది. 10 రెడ్మి 4ఏ ఫోన్లు, 10000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న 25 పవర్ బ్యాంకులు, 15 వైఫై రిపీటర్ 2 యూనిట్లు ఒక్క రూపాయి ఫ్లాష్ సేల్‌లో యూజర్లకు అందుబాటులో ఉంటాయి. ఈ ఫ్లాష్ సేల్‌ను యూజర్లు తమ సోషల్ ఛానళ్ల ద్వారా కూడా షేర్ చేసుకోచ్చని షావోమి పేర్కొంది. రెండు రోజుల్లోనూ ఈ ఫ్లాష్ సేల్ ఉదయం 11 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకి నిర్వహించనుంది. -
బిగ్ ఈజ్ బ్యాక్: షియోమి కొత్త ఫోన్
భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న షియోమి, వచ్చే వారంలో న్యూఢిల్లీలో ఓ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ లాంచ్ ఈవెంట్ కోసం ఆహ్వానాలు సైతం పంపిస్తోంది. ఇంతకీ ఈ ఈవెంట్లో లాంచ్ చేయబోయేది ఏంటో తెలుసా. మే నెలలో చైనాలో లాంచ్ చేసిన ఎంఐ మ్యాక్స్2 స్మార్ట్‌ఫోన్. ఈ నెల 18న ఎంఐ మ్యాక్స్2 స్మార్ట్‌ఫోన్‌ను షియోమి భారత్‌లో లాంచ్ చేయబోతుందని తెలుస్తోంది. దీని ధర కూడా సుమారు రూ.16,100గానే ఉండబోతుందట. ''బిగ్ ఈజ్ బ్యాక్'' అనే ట్యాగ్‌లైన్‌తో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో ఆవిష్కరించింది. దీని ప్రత్యేక ఆకర్షణ పెద్ద స్క్రీన్, బ్యాటరీ. ఎంఐ మ్యాక్స్‌ను పోలిన మాదిరిగానే ఎంఐ మ్యాక్స్ 2 డిజైన్ కూడా ఉంది. ఎంఐ మ్యాక్స్2 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి.. 6.44 అంగుళాలతో ఫుల్ హెచ్డీ డిస్ప్లే 5300ఎంఏహెచ్ బ్యాటరీ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ఎస్ఓసీ 4జీబీ ర్యామ్ 64జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియంట్లు 12ఎంపీ రియర్ కెమెరా 5ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఎంఐయూఐ ఆధారిత ఆండ్రాయిడ్ నోగట్ 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్బీ టైప్ సి, క్విక్ చార్జ్ 3.0. అయితే రెండు స్టోరేజ్ వేరియంట్లను భారత్‌లో లాంచ్ చేస్తుందో లేదో ఇంకా స్పష్టంకాలేదు. -
షియోమి బిగ్ సర్ప్రైజ్, ఏంటది?
టెక్ ఇండస్ట్రీకి షియోమి బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతుంది. ఎంఐ, రెడ్మి సిరీస్ స్మార్ట్ఫోన్లతో ఆన్లైన్ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న షియోమి, మూడో సబ్-బ్రాండును లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ నెల చివర్లోనే షియోమి తన మూడో సబ్-బ్రాండును ప్రకటించబోతుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఎంఐ, రెడ్మి బ్రాండులు ఎక్కువగా ఆన్లైన్ రిటైల్‌ను ఫోకస్ చేస్తే, ఈ మూడో సబ్-బ్రాండు ఆఫ్‌లైన్ మార్కెట్లో గట్టిపోటీ ఇవ్వనుందని తెలుస్తోంది. అయితే ఈ మూడు సబ్-బ్రాండు ఏంటన్నది ఇంకా తెలియరాలేదు. వివో, ఒప్పో లాంటి ఈ సబ్-బ్రాండు తీవ్ర పోటీ ఇస్తుందని చైనీస్ న్యూస్ వెబ్సైట్ మైడ్రైవర్స్రిపోర్టు చేసింది. దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లను పెంచి చైనా ఆఫ్‌లైన్ మార్కెట్లోనూ తన సత్తాన్ని చాటాలని షియోమి ప్లాన్ చేస్తుందని జీఎస్ఎంఏరినా తెలిపింది. అయితే ఒప్పో, వివోలకు వేల కొద్దీ స్టోర్లలో బలమైన పంపిణీ నెట్‌వర్క్‌లు ఉన్నాయి. ఆన్లైన్ స్పేస్‌లో మాత్రం షియోమినే తిరుగులేని స్థాయిలో ఉంది. షియోమి కాస్త ఆలస్యంగానే ఆఫ్‌లైన్ మార్కెట్‌పై దృష్టిసారించడం ప్రారంభించినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి.. ఇటీవలే కంపెనీ భారత్‌లోనూ తన తొలి ఎంఐ హోమ్ స్టోర్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఆశ్చర్యకరంగా షియోమి నుంచి రాబోతున్న కొత్త స్మార్ట్ఫోన్లు అప్‌కమింగ్ సబ్-బ్రాండులో ఉండనున్నాయని లీకేజీలు చెబుతున్నాయి. ఈ స్మార్ట్ఫోన్లను కూడా షియోమి ఈ నెల చివర్లోనే లాంచ్ చేస్తోంది. -
ఆ ఫోన్లలోనౌగట్ 7.0తో అప్డేట్..త్వరలో
ముంబై: షియోమి స్మార్మ్‌ఫోన్ లవర్స్‌కి శుభవార్త. చైనా మొబైల్ తయారీ దారు షియోమి మరిన్ని ఫోన్లను అప్డేట్ చేయనుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. జూన్ నెలలో ఎంఐ మ్యాక్స్‌ను ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టంతో ఎంఐయూఐ అప్డేట్ను అందించిన షియోమి.. త్వరలో మరికొన్ని ఫోన్లకు నౌగట్ ఓఎస్‌తో అప్డేట్ను ఇవ్వనుంది. త్వరలో ఎంపిక చేసిన 14 ఫోన్లకు ఈ అప్డేట్ అందుతుందని సమాచారం. అయితే జాబితాలో రెడ్మి 4 లేదని తెలుస్తోంది. గిజ్మో చైనా అదించిన సమాచారం ప్రకారం రెడ్మి ఎంఐ 4 ఎక్స్, షియోమి ఎంఐ మ్యాక్స్, ఎంఐ నోట్ 2, రెడ్మి నోట్ 4 ఎక్స్, ఎంఐ మిక్స్, ఎంఐ 5, ఎంఐ 5ఎస్, ఎంఐ 5ఎస్ ప్లస్, షియోమి ఎంఐ 6, ఎంఐ మ్యాక్స్ 2, ఎంఐ 5సి, రెడ్మి 4 ఎక్స్ తదితర ఫోన్లు అప్డేట్ అందుకోనున్న జాబితాలో ఉన్నాయి. అయితే ఆశ్యర్యకరంగా రెడ్ 4ను దీన్నుంచి మినహాయింపునిచ్చింది. కాగా ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ 7.1 శాతం డివైస్‌లు అప్డేట్కాగా, 7.1 ఓ ఎస్తో 0.5 శాతం డివైస్ అప్డేట్ అయ్యాయి.ముఖ్యంగా మొబైల్ ఆపరేటింగ్ స్టేషన్ గూగుల్ పిక్సెల్ , పిక్సెల్ ఎక్స్ఎల్ లతో ప్రారంభించబడింది. అలాగే నెక్సస్ స్మార్ట్ఫోన్లలోనూ, పిక్సెల్ టాబ్లెట్, నెక్సెస్ ప్లేయర్ సహా ఇతర ఆండ్రాయిడ్ డివైస్‌లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. -
రెడ్మి నోట్5 ఫుల్ స్పెషిఫికేషన్లు ఇవేనట..
బడ్జెట్ స్మార్ట్ఫోన్లతో షియోమి మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రెడ్మి నోట్4 విజయవంతమైన నేపథ్యంలో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్మి నోట్5తో మన ముందుకు రాబోతుంది షియోమి. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ ఫుల్ స్పెషిఫికేషన్లు కూడా ఆన్లైన్లో లీకైపోయాయి. ఒరిజినల్ రెడ్మి నోట్4 మాదిరిగానే ఇది ఫుల్ మెటల్ బాడీతో మార్కెట్లోకి రాబోతుందని తెలుస్తోంది. అయితే ఈసారి తీసుకొస్తున్న ఎడిషిన్లో ఫింగర్ ప్రింట్ స్కానర్‌లో కంపెనీ మేజర్ రీఫ్రెష్ చేసిందని లీకేజీ వివరాలు వెల్లడిస్తున్నాయి. రెడ్మి నోట్ 4కు ఫింగర్ ప్రింట్ స్కానర్ వెనుకవైపు ఉంటే, ఈ ఫోన్లో ముందు వైపు ఉండబోతుందని లీకేజీల టాక్. అంతేకాక లీకేజీ వివరాల ప్రకారం రెడ్మి నోట్5 స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల డిస్ప్లేతో, క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 3జీబీ/4జీబీ ర్యామ్, 32జీబీ/64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 16 ఎంపీ రియర్ కెమెరా, 13ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఛార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ, బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ, 3,790 ఎంఏహెచ్ బ్యాటరీ దీనిలో ఇతర ప్రత్యేకతలని లీకేజీ వివరాలు చెబుతున్నాయి. ఎంఐయూఐ ఆధారిత ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ ఓఎస్‌ను ఇది కలిగి ఉండబోతుందని లీకేజీలు పేర్కొంటున్నాయి. కాగ, రెడ్మి నోట్ 4ను కంపెనీ ఈ ఏడాది జనవరిలోనే భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. 2జీబీ, 3జీబీ 4జీబీ ర్యామ్ మోడల్లను 9,999 రూపాయలు, 10,999రూపాయలు, 12,999 రూపాయల ధరల శ్రేణిలో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. -
డోంట్ వర్రీ: ఆ స్మార్ట్ఫోన్ల రేట్లు పెరగవు!
న్యూఢిల్లీ : వామ్మో నేటి నుంచి జీఎస్టీ వచ్చేసింది.. ఇక కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుక్కోవాలంటే వెనుకా ముందు ఆలోచించాల్సిందేనని భయపడుతున్నారా? అయితే ఇలాంటి భయాలేమీ అక్కర్లేదట. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండు తయారీదారులు కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్ చెప్పారు. జీఎస్టీ కారణంతో తమ ధరలను పెంచబోమని శాంసంగ్, షియోమి, ఒప్పో, జియోనీ, ఇంటెక్స్, లావా కంపెనీలు చెప్పాయి. కొత్త పన్ను విధానంతో పడబోయే వ్యయాన్ని తామే భరించాలని కూడా కంపెనీలు నిర్ణయించాయి. దీంతో ఈ కంపెనీల స్మార్ట్ఫోన్లపై జీఎస్టీ ప్రభావం లేనట్టనేని తెలుస్తోంది. జీఎస్టీ ప్రభావం తమ ధరలపై పడదని జియోనీ మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ వోహ్రా చెప్పారు. ''ప్రస్తుతం మార్కెట్లో భిన్నమైన పన్ను విధానం ఉంది. కొన్ని మార్కెట్లో నీవే పన్ను కడితే, కొన్ని మార్కెట్లో పన్నులను నీవే పొందుతావు'' అని చెప్పారు. జీఎస్టీ వల్ల పన్నుభారం పెరుగుతుందని, కానీ వాటిని కంపెనీలే భరించాలని నిర్ణయించినట్టు తెలిపారు. చైనీస్ కంపెనీలు షియోమి, ఒప్పోలతో పాటు దేశీయ హ్యాండ్సెట్ తయారీదారి లావా కూడా నేటి నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ ప్రభావంతో రేట్లను పెంచమని చెప్పాయి. సంబంధిత వర్గాల సమాచారం మేరకు శాంసంగ్ కూడా ప్రస్తుత మోడల్స్ రేట్లను పెంచకూడదని నిర్ణయించిందని తెలిసింది. అయితే కొత్త మోడల్స్‌పై జీఎస్టీ రేటు 12 శాతాన్ని విధించాలని చూస్తున్నట్టు సమాచారం. అధికారికంగా మాత్రం కంపెనీ ఇంకా ఎలాంటి వివరాలను ప్రకటించలేదు. మైక్రోమ్యాక్స్ మాత్రం దీనిపై కామెంట్ చేయడానికి నిరాకరించింది. ఇండస్ట్రీ డేటా ప్రకారం మొత్తం 29 రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో మొబైల్ ఫోన్లపై 5 శాతం వ్యాట్ రేటు, 1 శాతం ఎక్సైజ్ డ్యూటీ ఉన్నాయి. అంటే మొత్తంగా మొబైల్ ఫోన్లపై 6 శాతం పన్ను ఉంది. జీఎస్టీ కింద వీటికి 12 శాతం పన్ను రేటు విధించారు. అంటే ప్రస్తుతమున్న దానికంటే 4-5 శాతం ఎక్కువ. కొన్ని రాష్ట్రాల్లో వ్యాట్ రేట్లు ఎక్కువగా ఉన్నందున వారికి జీఎస్టీ రేట్లు తక్కువగానే ఉన్నాయి. వ్యాట్ రేటు తక్కువగా ఉన్న పంజాబ్, రాజస్తాన్, చండీఘర్ లాంటి రాష్ట్రాల్లో జీఎస్టీ ప్రభావంతో స్మార్ట్ఫోన్ల ధరలు పెరుగుతుండగా.. వ్యాట్ ఎక్కువగా ఉన్న గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో జీఎస్టీ ప్రభావంతో ధరలు తగ్గనున్నాయి. -
షియోమి ఫోన్లకు జియో సూపర్ ఆఫర్
న్యూఢిల్లీ: షియోమి ఫోన్ వినియోగదారులకు శుభవార్త. రిలయన్స్ జియో షియోమి వినియోగదారులకు సూపర్ ఆఫర్ ప్రకటించింది. షియోమి ఫోన్లో జియో సిమ్ ఉపయోగిస్తున్నట్లయితే ఈ కొత్త ఆఫర్ మీసొంతం. గతంలో నోకియా స్మార్ట్ఫోన్లకు ప్రత్యేక మొబైల్ డేటా ప్యాక్ అందిచిన జియో తాజాగా షియోమి వినియోగదారులకు అదే తరహాలో డేటా ప్యాక్‌ను అందించబోతోంది. షియోమి ఫోన్లో జియో సిమ్ వాడుతూ ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న వినియోగదారులకు 30జీబీ అదనపు డేటాను ఇవ్వనుంది. రూ.309తో రీచార్జ్ చేసుకున్నప్పుడు అదనంగా 5జీబీ అందిస్తుంది. ఇలా ఆరు సార్లు ఇస్తుంది. ఈ అదనపు డేటా తదుపరి నెలకు పొడిగించబదు. ఆ నెలలోనే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఆఫర్‌కు అర్హమైన షియోమి ఫోన్ల జాబితా ► రెడ్ మి 2 , ► రెడ్ మి 2, ► ప్రైమ్ రెడ్ మి 3, ► రెడ్ మి 3ఎస్, ► రెడ్ మి 3ఎస్ ప్లస్, ► రెడ్ మి 3ఎస్ ప్రైమ్, ► రెడ్ మి 4, ► రెడ్ మి 4ఏ, ► రెడ్ మి నోట్ 3, ► రెడ్ మి నోట్ 4, ► రెడ్ మి నోట్ 4జి, ► రెడ్ మి నోట్ 4జి ప్రైమ్, ► ఎమ్ఐ 4ఐ, ► ఎమ్ఐ 5, ► ఎమ్ఐ మాక్స్, ► ఎమ్ఐ మాక్స్ ప్రైమ్ -
రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న షియోమి రెడ్మి 4
అతితక్కువ సయమంలో వినియోగదారులను మన్ననలను పొందిన ఫోన్లలో షియోమి రెడ్ మి ముందజలో ఉంటుంది. రెడ్ మి నోట్ 4, రెడ్ మి 4ఏ గ్రాండ్ సక్సెస్ అనంతరం మరో అదరగొట్టే స్మార్ట్ ఫోన్ రెడ్ మి 4ను షియోమి గతనెలలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఫోన్ రికార్డ్స్ బ్రేక్ చేసింది. లాంచ్ అయిన 30 రోజుల్లో ఈ ఫోన్ 10 లక్షల యూనిట్లు అమ్ముడు పోయాయి. రెడ్ మి 4 స్మార్ట్ ఫోన్ ను కంపెనీ ఫ్లాష్ సేల్, ప్రీ-ఆర్డర్స్ ద్వారా విక్రయిస్తోంది. తమకు ఇది అతిపెద్ద మైలురాయి అని కంపెనీ పేర్కొంది. భారత్ లో తమ జర్నీ ప్రారంభించినప్పటి నుంచి రెడ్ మి 4 స్మార్ట్ ఫోన్ తమ రికార్డులన్నింటిన్నీ బ్రేక్ చేస్తుందని కంపెనీ ఎంతో ఆనందంతో వ్యక్తంచేసింది. మూడు స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ ను కంపెనీ లాంచ్ చేసింది. 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర 6,999 రూపాయలు, 3జీబీ ర్యామ్, 32జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ ధర 8,999 రూపాయలు, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 10,999 రూపాయలుగా ఉంది. అమెజాన్ ఇండియా, ఎంఐ.కామ్ లలో కంపెనీ ప్రతివారం ఫ్లాష్ సేల్స్, ప్రీ-ఆర్డర్లను చేపడుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసినప్పుడే షియోమి ఈ ఫోన్ కచ్చితంగా రెడ్ మి3 ఎస్ వేరియంట్ల విక్రయాలను నమోదుచేస్తుందని ఆశాభావం వ్యక్తంచేసింది. గతేడాదిలో లాంచ్ అయిన రెడ్ మి 3ఎస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ ''హ్యయస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్స్ ఆన్ లైన్'' గా నిలిచింది. ఈ ఫోన్ 40 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదుచేసింది. రెడ్ మి 4 కీలక స్పెషిఫికేషన్స్... 5 అంగుళాల హెచ్డీ డిస్ ప్లే విత్ 2.5డీ కర్వ్డ్ గ్లాస్ 4100ఎంఏహెచ్ బ్యాటరీ 1.4గిగాహెడ్జ్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 435 ఆక్టా-కోర్ చిప్ 2జీబీ, 3జీబీ, 4జీబీ ర్యామ్ మైక్రో ఎస్డీకార్డు ద్వారా 128జీబీ వరకు విస్తరణ మెమరీ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో 13ఎంపీ రియర్ కెమెరా 5ఎంపీ ఫ్రంట్ కెమెరా డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ 4జీ ఎల్టీఈ బ్లాక్, మెటల్ రంగుల్లో అందుబాటు వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ హైబ్రిట్ సిమ్ ట్రే -
షియామి ఫ్యాన్స్‌కు శుభవార్త: నో మోర్ వెయిటింగ్
న్యూఢిల్లీ: చైనా మొబైల్ మేకర్ షియామి తన స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు శుభవార్త అందించింది. ఫ్లాష్ సేల్‌లో తప్ప మిగతా సమయాల్లో లభించని స్మార్ట్ఫోన్లను ఇకపై ప్రి బుకింగ్‌కు అందుబాటులో ఉంచింది. శుక్రవారం మధ్నాహ్నం 12 గంటల నుంచి వీటి ప్రీ ఆర్డర్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ముఖ్యంగా రెడ్ మి నోట్ 4, రెడ్ మి 4, రెడ్ మి 4 ఏ స్మార్ట్ఫోన్లు ప్రీ ఆర్డర్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. నిమిషాల వ్యవధిలోనే రికార్డ్ అమ్మకాలను నమోదు చేస్తూ.. అవుట్ ఆఫ్ స్టాక్ గా ని లుస్తున్న షియామి తాజా డివైస్‌లను అధికారిక వెబ్సైట్లో కొనుగోలుకు అనుమతిస్తుంది. అయితే క్యాష్ అన్ డెలివరీ సదుపాయం మాత్రం అందుబాటులో లేదని కంపెనీ ప్రకటించింది. క్రెడిట్, డెబిట్, నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్ వాలెట్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఒకసారి రెండు ఉత్పత్తులను కొనుగోలుకు మాత్రం అవకాశం. అయితే ప్రొడక్ట్స్ బట్టి ప్రీ-ఆర్డర్ చేసే యూనిట్ల సంఖ్య మారుతుందని షియామి తెలిపింది. అలాగే ప్రతి ఫోన్లో ఐఆర్‌సెన్సర్, ఎంఐ రిమోట్ ఆప్ లభిస్తుందని చెప్పింది. ఇండియాలో వీటి ధరలు ఇలా ఉన్నాయి. రెడ్ మి నోట్ 4 ధర రూ. 9,999 రెడ్ మి 4 ధర రూ. 6,999 రెడ్ మి 4 ఏ రూ. 5,999 -
షియామి అభిమానులకు పండగే
కొచ్చి: క్రేజీఫోన్లతో ఆకట్టుకుంటున్న చైనా మొబైల్‌దిగ్గజం షియామి తన అభిమానులకు శుభవార్త అందించింది. రాబోయే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 100 ఎంఐ హోం స్టోర్లను ప్రారంభించనున్నట్టు తెలిపింది. కస్టమర్ ప్రతిస్పందనను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రత్యేకమైన ఆఫ్‌లైన్ రిటైల్ అవులెట్లను తెరవాలని యోచిస్తోంది. ఎంఐ తాజా స్మార్ట్పోన్లు, రెడ్మి 4, రెడ్మి 4ఏ , ఎంఐ రౌటర్ సీ కేరళ మొబైల్ మార్కెట్లో షియామి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను జైన్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఎంఐ హెం స్టోర్లు షియామి ఇంటర్నెట్ + కొత్త రిటైల్ విధానాన్ని సూచిస్తా యన్నారు. ఇంటర్నెట్ సామర్ధ్యంతో ఇ-కామర్స్ సేవలను ఆఫ్‌లైన్ రిటైల్ ద్వారా యూజర్ అనుభవాన్ని జోడించనున్నామన్నారు. తన మొదటి స్టోర్‌ను గత నెలలో బెంగళూరులో ప్రారంభించిన షియామి ప్రారంభ దశలో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నైలలో రాబొయే కొన్ని నెలల్లో ప్రారంభించనుంది. బెంగళూరులో ప్రారంభించిన మై హోమ్ స్టోర్‌లో మొదటిరోజు మొదటి 12 గంటల్లోపు 5 కోట్ల విక్రయాలను రికార్డు చేశామని మను జైన్ చెప్పారు. అలాగే ప్రస్తుతం 225 సర్వీసుసెంటర్లను వచ్చే నెలనాటికి 500 కి పెంచాలని భావిస్తన్నట్టు చెప్పారు. అలాగే చిన్న గిడ్డంగులను తెరిచి విడిభాగాల సరఫరాను మెరుగుపరచనున్నామన్నారు. -
రెడ్ మి 4ఏ ఫ్లాష్ సేల్: స్పెషల్ ఆఫర్లు
ముంబై: చైనా మొబైల్ దిగ్గజం షియామి తన జీ ఫోన్ రెడ్మీ 4 ఏ విక్రయాలను మరోసారి ప్రారంభించింది. బుధవారం మధ్నాహ్నం 12గం. లనుంచి అమెజాన్ లో ప్రత్యేకంగా ఈ అమ్మకాలు మొదలయ్యాయి. అంతేకాదు రెడ్మీ 4ఏ కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. ఈ ఫ్లాష్ సేల్ తో పాటు రూ. 349 కు కస్టమర్లు ఎంఐ కేసులను ఆఫర్ చేస్తోంది. దీని అసలు ధర రూ. 399 . అలాగే ఆసక్తిగల కస్టమర్లు ఎంఐ బేసిక్ హెడ్ ఫోన్లను 599 రూపాయలు పొందవచ్చు. ముఖ్యంగా మొదటి లక్ష కస్టమర్లకు కిండ్లే యాప్ ద్వారా బుక్స్ కొనుగోలుపై రూ.200 క్రెడిట్ అందిస్తోంది. ఐడియా సెల్యులార్ రెడ్ మి 4ఏ కొనుగోలుపై 28 జీబీ 4జీ డేటాను తన చందాదారులకు అందిస్తోంది. రోజుకు 1జీబీ ఈ డేటాను పొందడానికి కస్టమర్లు 28 రోజుల వాలిడిటీతో రూ .343 తో రీఛార్జ్ చేసుకోవాలి. దీంతోపాటు అదనంగా రోజుకి 300 నిమిషాల టాక్ టైం ఫ్రీ. -
రెడ్మీ 4 సేల్ ఒక గంట మాత్రమే..
న్యూడిల్లీ: చైనా మొబైల్ దిగ్గజం షియామి తన క్రేజీ మొబైల్ అమ్మకాలను మరోసారి ప్రారంభించింది. మంగళవారం కేవలం ఒకగంట పాటు రెడ్ 4 స్మార్ట్‌ఫోన్‌ను విక్రయించనుంది. మధ్యాహ్నం 12గం. ఎంఐ.కామ్, ఆన్లైన్ రీటైలర్ అమెజాన్ లో ప్రత్యేకంగా అందుబాటులో ఉండనుందని షియామి ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్స్‌లో, 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్, 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, మూడు వేరియంట్లలో, రూ .6,999 , రూ.8999, రూ. 10,999 ధరల్లో లభ్యంకానుంది. మధ్నాహ్నం 12:00 గంటల నుండి 1:00 గంటల మధ్య కేవలం ఒక గంట మాత్రమే అందుబాటులో ఉండనుంది. You don't need to keep track of the score, 'cause everyone is already saying the winner is Redmi 4. Sale starts at noon! pic.twitter.com/zFd8c2co8X — Redmi India (@RedmiIndia) May 30, 2017 హిస్టరీ రిపీట్: 2.5 లక్షలకుపైగా ఫోన్లు అమ్మకం -
భారీ స్క్రీన్ , పెద్ద బ్యాటరీ: ఎంఐ మాక్స్ 2 లాంచ్
న్యూఢిల్లీ: బడ్జెట్ ధరల్లో స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేస్తూ ఫోన్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్న చైనా మొబైల్ మేకర్ షియోమి మరో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. గురువారం ఎంఐ మాక్స్ 2 ఫ్లాబ్లెట్ను చైనా మార్కెట్లో ప్రవేశపెట్టింది. అదీ సరసమైన ధరకే. మి మాక్స్ కు సక్సెసర్‌గా అంచనాలకు తగ్గట్టుగానే భారీ స్క్రీన్ పెద్ద బ్యాటరీ లాంటి అదిరిపోయే ఫీచర్లతో ఎంఐ మ్యాక్స్ 2ను విడుదల చేసింది. రెండు స్టోరేజ్ వేరియంట్లలో (64 జీబీ, 128 జీబీ) లభ్యంకానుంది. ఈ హ్యాండ్ సైట్ వెనుకవైపు వేలిముద్ర స్కానర్ అమర్చింది. అ లాగే ఐఆర్ బ్లాస్టర్ ( టీవీలకు, ఏసీలకు రిమోట్‌గా వాడుకునేలా) ను పొందుపర్చింది. స్టీరియో స్పీకర్లను అమర్చడం అతిపెద్ద ఇంప్రూవ్‌మెంట్‌గా కంపెనీ చెబుతోంది. 64 జీబీ వేరియంట్ D 1,699 యెన్లు ( సుమారు రూ. 16,000) 128జీబీ వేరియంట్ 1,999 యెన్లు (సుమారు రూ.19,000) ధరలుగా నిర్ణయించింది. జూన్ 1 నుంచి చైనా విక్రయాలు ప్రారంభంకానున్నాయి. ఎంఐ మాక్స్ 2 ఫీచర్స్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టమ్ 6.44 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ప్లే 1920x1080 పిక్సెల్ రిజల్యూషన్ 4 జీబీ ర్యామ్ 64జీబీ/128 జీబీ ఇంటర్నెనల్ స్టోరేజ్ మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా వరకు విస్తరించుకునే సదుపాయం కూడా 12ఎంపీ రియర్ కెమెరా 5ఎంపీ ఫ్రంట్ కెమెరా సెల్ఫీ షూటర్ 5300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం Max out with #MiMax2 - #BIGDISPLAYBIGGERBATTERY! -
ఓపెనింగ్ రోజే షియోమికి 5 కోట్ల రెవెన్యూలు
చైనా ఎలక్ట్రానిక్, మొబైల్ తయారీ దిగ్గజం షియోమికి ఇటీవల పెరుగుతున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మార్కెట్లో షియోమి ప్రొడక్ట్ర్ లు సంచలనాలు సృష్టిస్తున్నాయి. దీంతో ఆఫ్ లైన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోనూ తన సత్తా చాటేందుకు ఎంఐ హోమ్ స్టోర్ పేరుతో షియోమి వచ్చేసింది. మే 20న షియోమి తన తొలి ఎంఐ హోమ్ స్టోర్ ను బెంగళూరులో ప్రారంభించింది. ప్రారంభించిన 12 గంటల్లోనే ఎంఐ హోమ్ కు 5 కోట్ల రెవెన్యూలు వచ్చి, రికార్డులు సృష్టించాయి. 10వేల మందికి పైగా కస్టమర్లు ఓపెనింగ్ డే రోజు ఎంఐ హోమ్ స్టోర్ వద్ద షియోమి ఫోన్లు, ఎకో సిస్టమ్ ఉత్పత్తులు, యాక్ససరీస్ కొనుగోలు చేసినట్టు కంపెనీ ప్రకటించింది. ఈ రెవెన్యూల్లో ఎక్కువగా టాప్ సెల్లింగ్ రెడ్ మి ఫోన్లు రెడ్ మి4, రెడ్ మి 4ఏ, రెడ్ మి నోట్4ల నుంచే వచ్చినట్టు కంపెనీ తెలిపింది. దీనిలో ఆడియో ఆక్ససరీస్, ఎంఐ వీఆర్ ప్లే, ఎంఐ ఎయిర్ ఫ్యూరిఫైయర్ 2, కొత్తగా లాంచ్ చేసిన ఎంఐ రూటర్ 3సీ, ఎంఐ బ్యాండ్ 2లు కూడా ఉన్నాయి. చైనా, హాంకాంగ్ వంటి మార్కెట్ల తర్వాత ఎంఐహోమ్ స్టోర్ ను ఏర్పాటుచేసిన భారత మార్కెట్ ఐదవది. దీనిలో స్మార్ట్ ఫోన్లు, పవర్ బ్యాంక్స్, హెడ్ ఫోన్లు, ఫిట్ నెస్ బ్యాండ్లు, ఎయిర్ ఫ్యూరిఫైయర్స్, ఇతర ఎకో సిస్టమ్ ప్రొడక్ట్ లు దొరుకుతాయి. వచ్చే రెండేళ్లలో 100 ఎంఐ హోమ్ స్టోర్లను ఏర్పాటుచేయాలని షియోమి ప్లాన్ చేస్తోంది. ఎంఐ హోమ్ స్టోర్లు తర్వాత వచ్చే మెట్రో సిటీల్లో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నైలు ఉన్నాయి. -
అదరగొట్టే ఫీచర్లతో రెడ్ మి4 లాంచ్
రెడ్ మి నోట్ 4, రెడ్ మి 4ఏ గ్రాండ్ సక్సెస్ అనంతరం మరో అఫార్డబుల్ స్మార్ట్ ఫోన్ ను అదరగొట్టే ఫీచర్లతో షియోమి భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. రెడ్ మి 4 పేరుతో ఈ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మూడు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలో దీన్ని లాంచ్ చేసింది. 2జీబీ ర్యామ్+16జీబీ స్టోరేజ్ ను 6,999 రూపాయలకు, 3జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజ్ ను 8,999 రూపాయలకు, 4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్ ను 10,999రూపాయలకు ఈ ఫోన్ అందుబాటులోకి వస్తోంది. రెడ్ మి 3ఎస్, 3ఎస్ ప్రైమ్ సక్సెసర్ గా ఇది మార్కెట్లోకి వచ్చింది. మే 23 నుంచి ఈ ఫోన్ అమెజాన్.ఇన్, ఎంఐ.కామ్ రెండు ఆన్ లైన్ స్టోర్లలో విక్రయానికి రానుంది. ఎంఐ హోమ్ స్టోర్ నుంచి అయితే మే 20 నుంచే అందుబాటులో ఉండనుంది. ఆసక్తిగల వినియోగదారులు నేటి నుంచే ఈ ఫోన్ ను ఎంఐ.కామ్ ఉచితంగా బుక్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. రెడ్ మి 4 కీలక స్పెషిఫికేషన్స్... క్వాల్ కామ్ 1.4గిగాహెడ్జ్ స్నాప్ డ్రాగన్ 435 ఆక్టా-కోర్ చిప్ 4100ఎంఏహెచ్ బ్యాటరీ 5 అంగుళాల హెచ్డీ డిస్ ప్లే విత్ 2.5డీ కర్వ్డ్ గ్లాస్ మైక్రో ఎస్డీకార్డు ద్వారా 128జీబీ వరకు విస్తరణ మెమరీ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో 13ఎంపీ రియర్ కెమెరా డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ 5ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 4జీ ఎల్టీఈ బ్లాక్, మెటల్ రంగుల్లో అందుబాటు వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ హైబ్రిట్ సిమ్ ట్రే -
షియామి హయ్యస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ ఇదే!
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ షియామి భారత్‌లో స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో శరవేగంగా దూసుకుపోతోంది. ప్రతి నాలుగు సెకండ్లకు అయిదు రెడ్ మీ ఫోన్లు అమ్ముడుపోతున్నాయని ఇప్పటికే సగర్వంగా ప్రకటించిన షియోమి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను షేక్ చేస్తోంది . కంపనీ తాజా గణంకాలను శనివారం ప్రకటించింది. ముఖ్యంగా రెడ్ మి 3ఎస్ డివైస్‌లపై ఆశ్చర్యకరమైన అమ్మకాలను నమోదు చేసింది. కేవలం తొమ్మిదినెలల్లో 40లక్షల రెడ్ మి 3ఎస్ స్మార్ట్ఫోన్లను విక్రయించినట్టు తెలిపింది. దీంతో ఆన్లైన్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. ఇండస్ట్రీలో రూ.10ల లోపు స్మార్ట్ఫోన్ల సెగ్మెంట్ లో ఇది గేమ్ చేంజర్‌గా నిలిచిందని కంపెనో ఒక ప్రకటనలో తెలిపింది. కాగా కాగా2 జీబీ వేరియంట్ ధర రూ. 9999, 3జీబీ వేరియంట్ ధర రూ. 11,999 ధరలో 2016, ఆగష్టులో లాంచ్ చేసింది. ప్రీమియం మెటల్‌బాడీతో విడుదల చేసిన రెడ్ మి 3 ఎస్ ను, 5 అంగుళాల హెచ్డీ స్క్రీన్, 128 జీబీదాకా ఎక్స్‌పాండబుల్ మొబరీ, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 4100 ఎంఏహెచ్ బ్యాటరీ, బరువు 144 గ్రాములు తదితర ఫీచర్లతో దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
భారత్‌లో షావోమి తొలి రిటైల్ స్టోర్!!
‘మి హోమ్ స్టోర్’ పేరుతో బెంగళూరులో ఏర్పాటు ► మే 20 నుంచి అందుబాటులోకి బెంగళూరు: ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ‘షావోమి’ తాజాగా తన తొలి ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ ‘మి హోమ్ స్టోర్’ను బెంగళూరులో ఏర్పాటు చేసింది. దీన్ని మే 20 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తామని కంపెనీ తెలిపింది. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 100కు పైగా ‘మి హోమ్ స్టోర్ల’ ఏర్పాటును లక్ష్యంగా నిర్దేశించుకున్నామని పేర్కొంది. రానున్న నెలల్లో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై నగరాల్లో రిటైల్ స్టోర్లను ప్రారంభిస్తామని తెలిపింది. కస్టమర్లు షావోమి కంపెనీకి సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్, పవర్ బ్యాంక్స్, హెడ్‌ఫోన్స్, ఫిట్నెస్ బ్రాండ్స్, ఎయిర్ ఫ్యూరిఫయర్స్ వంటి తదితర ప్రొడక్టులను ‘మి హోమ్ స్టోర్’లకు వెళ్లి ప్రత్యక్షంగా కొనుగోలు చేయవచ్చని వివరించింది. ఇంటర్నెట్ప్లస్, న్యూ రిటైల్ కాన్సెప్ట్ ఆధారంగా ఈ స్టోర్లను ఏర్పాటు చేస్తున్నామని షావోమి వైస్ ప్రెసిడెంట్ మనూ జైన్ తెలిపారు. కస్టమర్లు తమ ప్రొడక్టులను మి.కామ్‌లో ప్రి–బుకింగ్ చేసుకొని, వాటిని ఈ స్టోర్లలో కలెక్ట్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
రెడ్ మి 4ఏ సేల్..ఎక్స్‌క్లూజివ్ గా వారికే!
అతి తక్కువ ధరలో లాంచ్ అయిన షియోమి రెడ్ మి 4ఏ స్మార్ట్ ఫోన్, విక్రయాల్లో సంచలనాలు రేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ ఫోన్ నేడు విక్రయానికి వస్తోంది. ఎక్స్ క్లూజివ్ ఆన్ లైన్ రిటైల్ పార్టనర్ అమెజాన్ ఇండియాల్లో షియోమి దీన్ని విక్రయానికి ఉంచుతోంది. అయితే ముందస్తు మాదిరిగా కాకుండా.. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రైబర్లకు మాత్రమే ఈ పరిమితంగా ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. నేటి నుంచి అమెజాన్ డిస్కౌంట్ల పండుగ గ్రేట్ ఇండియన్ సేల్ ప్రారంభమైన నేపథ్యంలో రెడ్ మి 4ఏ కూడా విక్రయానికి వస్తోంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఈ ఫోన్ సేల్ ను కంపెనీ చేపట్టనుంది. గ్రేట్ ఇండియన్ సేల్ లో సిటీ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులపై ఆఫర్ చేసే క్యాష్ బ్యాక్ ఆఫర్లు దీనికి వర్తించవు. గ్రేట్ ఇండియన్ సేల్ లో భాగంగా సిటి బ్యాంకు కార్డులపై డెస్క్ టాప్ సైట్ ద్వారా కొనుగోలుచేసే ప్రొడక్ట్స్ పై అదనంగా 10 శాతం, యాప్ ద్వారా కొనుగోలు చేస్తే 15 శాతం క్యాష్ బ్యాక్ లను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్ కొనుగోలుపై ఐడియా ప్రీపెయిడ్ యూజర్లకు అందించే డేటా ఆఫర్లు మాత్రం నేటి సేల్ లో అందుబాటులో ఉంటాయి. 343 రూపాయల రీఛార్జ్ ప్యాక్ పై యూజర్లు 28జీబీ 4జీ డేటాను పొందవచ్చు. డేటాతో పాటు రెడ్ మి 4ఏ కస్టమర్లు రోజుకు 300 నిమిషాల ఉచిత కాల్స్, నెలకు 3000 ఉచిత ఎస్టీడీ, లోకల్ ఎస్ఎంఎస్ లు పొందుతారు. 28 రోజుల వరకు మాత్రమే ఈ ఆఫర్లు వాలిడ్ లో ఉంటాయి. -
‘రెడ్ మి 4’ కమింగ్ సూన్..ధర ఎంత?
ముంబై: స్మార్ట్ఫోన్లతో ప్రపంచవ్యాప్తంగా ఫోన్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్న చైనా మొబైల్ దిగ్గజం షియోమి మరింత వేగంగా దూసుకుపోతోంది. రెడ్ మి సిరీస్ లో భాగంగా తాజాగా ' రెడ్ మి 4' స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేసేందుకు రడీ అవుతోంది. అతిచవక ధరలో ఆ స్మార్ట్‌ఫోన్ ను మే 16న ఒక ప్రత్యేక కార్యక్రమంలో లాంచ్ చేయనుంది. ఎక్స్ సిరీస్‌లో అతి ఖరీదైన డివైస్‌లను లాంచ్ చేసిన సంస్థ, రెడ్ మి 3 కి అప్‌గ్రేడెడ్ వెర్షన్ గా రెడ్ మి 4 ను స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ తో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. దీని ధరను చౌక ధరలో సుమారు రూ.8వేలుగా నిర్ణయించనుందని తెలుస్తోంది. లుక్స్‌లో రెడ్ మి3, 3 ఎస్ ను పోలి ఉండి, మెటల్ యూనిబాడీ డిజైన్త వెనుక ప్యానెల్లో వేలిముద్ర స్కానర్ కూడా పొందుపరిచింది. అలాగే అతి తక్కువ ధరలో స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2 జీబీర్యాం, 16 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను కూడా లాంచ్ చేయనుంది. దీని ధర ఇండియాలో సుమారు రూ. 6,905గా ఉండనుంది. షియామి వైస్ ప్రెసిడెంట్, ఎండీ, మను కుమార్ రెడ్మి మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతోందని ఇటీవల ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈనెలలో ఇదిరెండవ అతిపెద్ద ప్రకటన కానుందంటూ ట్వీట్ చేయడంతో మరిన్ని ఆసక్తి నెలకొంది. రెడ్ మి 4 ఫీచర్లపై అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. రెడ్ మి 4 ఫీచర్లు 5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 6.0మార్షమల్లౌ 1.4 ఆక్టా కోర్ ప్రాపెసర్ 3జీబీ ర్యామ్ 32జీబీ ఇంటర్నెట్ మొమరీ, మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 128జీబీ దాకా విస్తరించుకునే సౌకర్యం 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 5మెగాపిక్సెల్ సెల్పీ కెమెరా 4,100 ఎంఏహెచ్ బ్యాటరీ Announcing the launch of a new Redmi phone! This will be the 2nd BIG announcement of the month ☺️ Coming soon. Stay tuned #PowerInYourHand pic.twitter.com/jvzGCY2oyR — Manu Kumar Jain (@manukumarjain) May 5, 2017 -
సెకన్లలో ఆ ఫోన్ అవుటాఫ్ స్టాక్
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమి ఏదైనా కొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొస్తుందంటే చాలు. ఆన్ లైన్ వినియోగదారులందరూ ఎప్పుడెప్పుడు కొంద్దామా? అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ కంపెనీ ఫోన్లు ఫ్లాష్ సేల్ కు వచ్చిన సెకన్లలో అమ్ముడుపోతున్నాయి. ఇదే తరహాలో ఇటీవలే అదిరిపోయే ఫీచర్లతో చైనా మార్కెట్లోకి వచ్చిన ఎంఐ 6 ఫ్లాగ్ షిప్ కు అనూహ్య స్పందన వచ్చింది. నిన్న చైనాలో ఈ ఫోన్ తొలి ఫ్లాష్ సేల్ కు వచ్చింది. ఫ్లాష్ సేల్ కు వచ్చిన వెంటనే ఎంఐ 6 స్మార్ట్ ఫోన్లు అవుటాఫ్ స్టాక్ అయ్యాయి. సెకన్లలోనే స్టాకంతా అమ్ముడుపోయినట్టు కంపెనీ ప్రకటించింది. ఎంఐ 6 తర్వాతి ఫ్లాష్ సేల్ మే 5న కంపెనీ నిర్వహించనుంది. అయితే ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతుందా? లేదా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొన్ని రిపోర్టులైతే, ఎంఐ6ను భారత్ లో లాంచ్ చేయడం లేదని చెబుతున్నాయి. కంపెనీ సైతం ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 2.45గిగాహెడ్జ్ స్నాప్ డ్రాగన్ 835 చిప్ సెట్, 6జీబీ ర్యామ్, 64/128జీబీ స్టోరేజ్, డ్యూయల్ లెన్స్ రియర్ కెమెరా, ఆల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్, నాలుగు వైపులు కర్వ్డ్ గ్లాస్/ సెరామిక్ బాడీ, 3,350ఎంఏహెచ్ బ్యాటరీ దీనిలో ఫీచర్లు. ఈ ఫోన్ ధర సుమారు రూ.23,999గా ఉంది. -
షియోమి ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్
గత కొన్ని రోజులుగా ఊరించిన ఎంఐ 6 స్మార్ట్ ఫోన్ ను షియోమి ఈ నెల 19న చైనాలో లాంచ్ చేసేసింది. కానీ షియోమి స్మార్ట్ ఫోన్ లవర్స్ అంచనావేసిన విధంగా దాంతో పాటు లాంచ్ అవుతుందనుకున్న ఎంఐ 6 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ మార్కెట్లోకి తీసుకురాకుండా వారిని నిరాశపరిచింది. మరికొన్ని నెలల్లో ఎలాగో ఎంఐ 6 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను షియోమి లాంచ్ చేస్తుందని ఊహాగానాలు టెక్ వర్గాల్లో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. కానీ వీరి అంచనాలను తలకిందులు చేస్తూ షాకింగ్ న్యూస్ వెలువడింది. షియోమి ఎంఐ 6 ప్లస్ లాంచింగ్ ను పూర్తిగా రద్దు చేసిందని చైనాకు చెందిన ఓ రిపోర్టు రివీల్ చేసింది. ఎంఐ 6 సిరీస్ లో ఒకే ఒక్క స్మార్ట్ ఫోన్ అది ఇటీవలే లాంచ్ అయిన కొత్త ఫోనేనని రిపోర్టు తెలిపింది. ఇక ఈ సిరీస్ లో ఎలాంటి ఫోన్ ను ఇప్పట్లో షియోమి తీసుకురాదని జిజ్మోచైనా రిపోర్టు చేసింది. ఈ రిపోర్టు ఎంఐ 6 ప్లస్ లాంచ్ కోసం ఎదురుచూస్తున్న షియోమి ఫ్యాన్స్ కు నిరాశకలిగించింది. ఎంఐ 6 ప్లస్ స్మార్ట్ ఫోన్ బదులు, ఎంఐ నోట్ 3 స్మార్ట్ ఫోన్ ను షియోమి లాంచ్ చేస్తుందని ఈ రిపోర్టు వెల్లడించింది. ఎంఐ నోట్ 2 సక్సెస్ తో ఎంఐ నోట్ 3 ను విడుదల చేయడానికి షియోమి వర్క్ చేస్తుందని, ఈ ఫోన్ ను సెప్టెంబర్ లో లాంచ్ చేయనుందని పేర్కొంది. అదేవిధంగా ఇటీవలే అదిరిపోయే ఫీచర్లతో చైనాలో లాంచ్ అయిన ఎంఐ 6 స్మార్ట్ ఫోన్ కూడా భారత్ కు రాదని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. అయితే ఎంఐ నోట్ 3 లాంచింగ్ కు సంబంధించి, ఎంఐ 6 ప్లస్ రద్దుకు సంబంధించి ఇప్పటివరకు షియోమి ఎలాంటి కన్ ఫర్మేషన్ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. -
షియోమి ఎంఐ6 వచ్చేస్తోంది..
షియోమి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న తన లేటెస్ట్ ఫ్లాగ్ ఫిప్ ఫోన్ ఎంఐ6 లాంచింగ్ తేదీలను ప్రకటించింది. తమ 2017 ఫ్లాగ్ షిప్ ఎంఐ6ను ఏప్రిల్ 19న విడుదల చేయబోతున్నట్టు పేర్కొంది. బీజింగ్ లో జరుగబోయే ఈవెంట్లో దీన్ని లాంచ్ చేస్తామని షియోమి గ్లోబల్ ఫేస్ బుక్ గ్లోబల్ పేజీలో తెలిపింది. మార్కెట్లో ఇప్పటికే ఉన్న ఎన్నో ఫ్లాగ్ షిప్ ఫోన్లకు ఇది కిల్లర్ గా రాబోతుందట. ఇప్పటికే సంచలనాలతో మార్కెట్లో దూసుకెళ్తున్న షియోమి, అదిరిపోయే ఫీచర్లతో దీన్ని లాంచ్ చేస్తుందని టెక్ వర్గాలంటున్నాయి. 5.1 అంగుళాల 1080పీ డిస్ ప్లే, 4కే వీడియోలను షూట్ చేసుకునే వీలుగా 12 ఎంపీ రియర్ కెమెరా, 4కే వీడియోలను రికార్డు చేసుకునేందుకు 8ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఇది స్మార్ట్ ఫోన్ వినియోగదారులను అలరించనుందట. స్నాప్ డ్రాగన్ 835 చిప్ సెట్, 4జీబీ లేదా 6జీబీ ర్యామ్ ఆప్షన్స్, 64జీబీ/128జీబీ స్టోరేజ్ ఆప్షన్స్, ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ దీనిలో మిగతా ఫీచర్లని తెలుస్తోంది. ఎంఐ 6 మోడల్ ధర 2,199 యన్స్(సుమారు రూ.20వేలు) ఉండొచ్చని తెలుస్తోంది. -
అదిరిపోయే ఫీచర్లతో ఎంఐ మాక్స్ 2
న్యూఢిల్లీ: బడ్జెట్ ధరల్లో స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేస్తూ ఫోన్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్న చైనా మొబైల్ మేకర్ షియోమి మరో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ ను తీసుకురాబోతోంది. అదీ సరసమైన ధరకే. షియోమి ఎంఐ మ్యాక్స్ 2గా చెబుతున్న స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కొన్ని ఫీచర్లు బయటికొచ్చాయి. ఇప్పటికే షియోమి అప్ కమింగ్ డివైస్ లు ఎంఐ 6, ఎంఐ 6 ప్లస్ భారీగా ఆసక్తి నెలకొంది. అలాగే వీటి ఫీచర్లకు సంబంధించి రూమర్లు వ్యాపిస్తున్నప్పటికీ మి మాక్స్ 2 ఫీచర్స్ మాత్రం ఆకర్షణీయంగా ఉండడం విశేషం. మి మాక్స్ కు సక్సెసర్‌గా ఇది మార్కెట్లో లాంచ్ కానుంది. శక్తివంతమైన క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్‌ను ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో వాడినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఎంఐ మ్యాక్స్ 2లో వేగవంతమైన ఛార్జింగ్ సామర్ధ్యంతో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని వాడారట. ఇక కెమెరా విషయానికి వస్తే ఎంఐ 5ఎస్‌లో వాడిన కెమెరానే దీనిలో కూడా వాడినట్లు తెలుస్తోంది. వెనుకవైపు 12ఎంపీ సోనీ ఐఎంఎక్స్378 కెమెరా ఉంటుంది. ఇక సెల్ఫీల కోసం 5ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుందని అంచనా. ధర 1499 -1699 యెన్ లుగా అంటే సుమారు రూ. 14వేల నుంచి రూ. 16వేల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. షియోమి ఆక్సిజన్ గా పిలుస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఇలా ఉండబోతున్నాయి. ఎంఐ మాక్స్ 2 ఫీచర్స్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టమ్ 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ప్లే 1920x1080 పిక్సెల్ రిజల్యూషన్ 4 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా దీన్ని విస్తరించుకునే సదుపాయం కూడా 12ఎంపీ రియర్ కెమెరా 5ఎంపీ ఫ్రంట్ కెమెరా సెల్ఫీ షూటర్ 5000 ఎంఏహెచ్ అయితే లాంచింగ్ సమయం, విక్రయాలు ఎపుడు మొదలుకానున్నాయనే అంశాలపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. మరోవైపు షియామి ఎంఐ 6 ఏప్రిల్ 19 న లాంచ్ కానుంది. 203-day wait for you since our #Mi5s launch, 7 years for Mi. #Mi6 is a guaranteed performance beast. Can't wait to show you what's to come! pic.twitter.com/hPA60ec8QX — Mi (@xiaomi) April 11, 2017 -
రెడ్ మి 4 ఏ ఫ్లాష్ సేల్, మరోసారి
న్యూఢిల్లీ: చైనా మొబైల్ తయారీ దారు షియామి విడుదల చేసిన తాజా స్టార్ట్‌ఫోన్ రెడ్ మి 4 ఏ ను మిస్ అయ్యామని బాధపడుతున్నారా? అయితే మీకో శుభవార్త. అతి తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ మరోసారి విక్రయానికి రానుంది. కంపెనీ ఈ నెల 13న ఫ్లాష్ సేల్ నిర్వహస్తోంది. దాదాపు హై ఎండ్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లతో కేవలం రూ. 5,999లకే అందిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ పై ఇప్పటికే ఫోన్ లవర్స్‌లో మాంచి క్రేజ్ నెలకొంది. సేల్ ప్రకటించిన ప్రతీసారి హాట్ కేకుల్లా అమ్ముడుపోతూ కేవలం నిమిషాల వ్యవధిలోనే లక్షల యూనిట్ల విక్రయాలు నమోదవుతున్న సంగతి తెలిసిందే. డార్క్ గ్రే , గోల్డ్ అండ్ రోజ్ గోల్డ్ కలర్స్ లో ఏప్రిల్ 13 మూడోసారి విక్రయించబోతోంది. మధ్యాహ్నం 12 గంటలనుంచి, ఎం.కామ్, అమెజాన్ ద్వారా ఆన్లైన్ లో కొనుగోలు చేయవచ్చని షియామి ప్రకటించింది. రెడ్ మీ 4 ఏ లాంచ్ ఫీచర్లు 5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే 720×1280 పిక్సెల్ రిజల్యూషన్, 6.0 ఆండ్రాయిడ్ మార్షమల్లౌ, క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 425 చిప్సెట్ 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 13ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3,120 ఎంఏహెచ్‌బ్యాటరీ -
ఇండియన్స్ ఇష్టపడే ఫోన్ ఏదో తెలుసా?
భారత వినియోగదారులు ఎక్కువగా షియోమి స్మార్ట్ ఫోన్లను ఇష్టపడుతున్నారని తాజా సర్వేలో వెల్లడైంది. శామ్ సంగ్, యాపిల్, లెనొవో, వన్ ప్లస్, మైక్రోమ్యాక్స్ లాంటి టాప్ బ్రాండ్లను తోసిరాజని చైనా కంపెనీ షియోమి అగ్రస్థానంలో నిలవడం విశేషం. భారతీయుల్లో మోస్ట్ పాపులర్, వాంటెడ్ బ్రాండ్ గా షియామి నిలిచిందని స్ట్రాటజీ ఎనలిటిక్స్ సర్వే తెలిపింది. తాము ప్రస్తుతం వాడుతున్న స్మార్ట్ ఫోన్లను పక్కకు పెట్టి ఈ ఏడాదిలో షియామి ఫోన్లు తీసుకోవాలనుకుంటున్నట్టు సర్వేలో 26 శాతం మంది ఆండ్రాయిడ్ వినియోగదారులు చెప్పారు. శామ్ సంగ్ ఫోన్లు కావాలనుకుంటున్న వారికి కంటే ఈ సంఖ్య రెట్టింపు. దాదాపు 12 శాతం మంది శామ్ సంగ్ వైపు మొగ్గు చూపారు. ఆన్ లైన్ లో కొనుక్కునే సౌలభ్యం, నెట్ వర్క్ స్పీడ్, చిప్ సెట్ పనితీరు, కెమెరా, స్క్రీన్ పరిమాణం, రిజల్యూషన్ తదితర ఫీచర్లను వినియోగదారులు పరిగణనలోకి తీసుకుంటున్నారని స్ట్రాటజీ ఎనలిటిక్స్ నివేదిక వెల్లడించింది. భారత్ లో ఆన్ లైన్ అమ్మకాల్లోనూ షియోమి ముందుంది. 29.3 మార్కెట్ వాటాతో షియోమి అగ్రస్థానంలో ఉందని ఎనలిస్ట్ సంస్థ ఐడీసీ తెలిపింది. 'ఇండియా స్మార్ట్ ఫోన్ పరిశ్రమ రోజురోజుకు మారుతోంది. వినియోగదారులు టెక్నాలజీని సమర్థవంతంగా అర్థం చేసుకుంటూ తమకు కావాల్సిన ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్లనే ఎంచుకుంటున్నారు. భారత మార్కెట్ లో షియోమి దూసుకుపోతోంది. షియోమి ఫోన్ల అమ్మకాల్లో 125 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది కొత్త ఫోన్ కొనాలకునే ఆండ్రాయిడ్ యూజర్లలో ఎక్కువ మంది షియోమి బ్రాండ్ పట్ల మొగ్గు చూపుతున్నార'ని స్ట్రాటజీ ఎనలిటిక్స్ సీనియర్ ఎనలిస్ట్ రాజీవ్ నాయర్ తెలిపారు. -
లీకైన షియోమి ఫోన్లు: అదరగొట్టే ఫీచర్లివే!
స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సంచలన విక్రయాలతో దూసుకెళ్తున్న షియోమి, మరో రెండు స్మార్ట్ ఫోన్లతో వినియోగదారుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్ల స్పెషిఫికేషన్లు లాంచింగ్ ముందే ఆన్ లైన్ లో లీకైపోయాయి. డిస్ప్లే, ప్రాసెసర్, స్టోరేజ్, కెమెరా వంటి అన్ని ప్రత్యేకతలు ఆన్ లైన్ లో దర్శనమిస్తున్నాయి. షియోమి ఎంఐ 6, షియోమి ఎంఐ 6 ప్లస్‌ల పేరుతో ఈ రెండు స్మార్ట్ ఫోన్లు ఏప్రిల్ 11న లాంచ్ కాబోతున్నాయి. లీకైన వీటి స్పెషిఫికేషన్ వివరాలు ఓ సారి చూద్దాం... ఎంఐ 6 స్మార్ట్ ఫోన్ స్పెషిఫికేషన్లు... 5.15 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ప్లే 2.45 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835ఎస్ఓసీ 32జీబీ, 64జీబీ లేదా 128జీబీ స్టోరేజ్ వేరియంట్లు 4జీబీ లేదా 6జీబీ ర్యామ్ 19ఎంపీ సోనీ ఐఎంఎక్స్400 సెన్సార్‌తో ప్రైమరీ కెమెరా 8ఎంపీ ఫ్రంట్ షూటర్ 3200 ఎంఏహెచ్ బ్యాటరీ(నాన్-రిమూవబుల్) ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో దీని ధరలు సుమారు రూ.19,000 నుంచి రూ.26,000 మధ్యలో ఉంటాయట. ఎంఐ 6 ప్లస్ స్మార్ట్ ఫోన్ స్పెషిఫికేషన్లు... 5.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ప్లే 2.45 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835ఎస్ఓసీ 64జీబీ లేదా 128జీబీ స్టోరేజ్ వేరియంట్లు 6జీబీ ర్యామ్ 12ఎంపీతో డ్యూయల్ కెమెరా ఫ్రంట్ 8ఎంపీ సెల్ఫీ షూటర్ 4500ఎంఏహెచ్ బ్యాటరీ (నాన్ రిమూవబుల్) ఆండ్రాయిడ్ 7.0 నోగట్ దీని ధరలు సుమారు రూ.24,680 నుంచి రూ.33,226 మధ్యలో ఉంటాయట. -
భారత్‌లో 20,000 ఉద్యోగాలే లక్ష్యం: షావోమి
న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా భారత్‌లో భారీగా ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా పెట్టుకుంది. ఇండియా తమకు చాలా కీలకమైన మార్కెట్ అని, ఇక్కడ వచ్చే మూడేళ్లలో 20,000 మందికి ఉపాధి కల్పిస్తామని షావోమి వ్యవస్థాపకుడు లీ జున్ తెలిపారు. ఆయన ఎకనమిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమిట్–2017లో పాల్గొన్నారు. ఇండియన్ ఆన్లైన్ మార్కెట్లో విజయవంతమైన తాము ఆఫ్‌లైన్ మార్కెట్‌పై దృష్టి కేంద్రీకరించామని తెలిపారు. భారత్‌లో విక్రయమౌతోన్న ఫోన్లలో 95 శాతం మేడిన్ ఇండియావేనని పేర్కొన్నారు. కాగా షావోమి కంపెనీ 2014 జూలైలో ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. 2015 ఆగస్ట్‌లో తొలి ప్లాంట్‌ను ప్రారంభించింది. 2016 మార్చి నాటికి కంపెనీకి చెందిన 75 శాతం ఫోన్లు దేశీయంగానే తయారవుతున్నాయి. కాగా షావోమి కంపెనీ ఫాక్స్‌కాన్‌తో కలిసి ఏపీలో రెండో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. -
నిమిషాల్లోనే ఆ ఫోన్ అవుటాఫ్ స్టాక్!
న్యూఢిల్లీ : చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ షియోమి ఇటీవల ప్రవేశపెడుతున్న స్మార్ట్ ఫోన్లకు ఆన్ లైన్ లో అనూహ్య స్పందన వస్తోంది. సంచలన విక్రయాలు నమోదుచేసిన రెడ్ మి నోట్ 4 అనంతరం, నేడు ప్రత్యేకంగా అమెజాన్ ప్లాట్‌ఫామ్‌పై తీసుకొచ్చిన తన లేటెస్ట్ మోడల్ రెడ్ మి4 ఏ ఫోన్‌కు భలే గిరాకి వచ్చింది. అమెజాన్ ప్లాట్‌ఫామ్ పైకి విక్రయానికి వచ్చిన ఆ ఫోన్, నిమిషాల్లోనే పూర్తిగా అమ్ముడుపోయింది. రెడ్మి 4ఏ తొలి సేల్ కూడా నేడే కావడం విశేషం. తర్వాతి సేల్ మార్చి 30న కంపెనీ నిర్వహిస్తోంది. రెడ్ మి3 విజయంతో రెడ్మి 4ఏ ను కంపెనీ మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఫోన్ కొన్నవారికి లాంచ్ ఆఫర్లను కూడా కంపెనీ ప్రకటించింది. 5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, హెచ్డీ రెజుల్యూషన్(720పీ), క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 425 64-బిట్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్, 128జీబీ వరకు విస్తరణ మెమరీ, 13ఎంపీ రియర్ కెమెరా, 5ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3120 ఎంఏహెచ్ బ్యాటరీ దీనిలో ప్రత్యేకతలు. దీని ధర కూడా రూ.5,999లే కావడం విశేషం. -
షావోమి నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్
⇒ రెడ్మి 4ఏ ..ధర రూ.5,999 ⇒ భారత్‌లో చౌక ధర షావోమి ఫోన్ ⇒ భారత్‌లో షావోమి రెండో ప్లాంట్.. శ్రీ సిటీలో ఏర్పాటు న్యూఢిల్లీ: చైనా మొబైల్ ఫోన్ కంపెనీ షావోమి కొత్త స్మార్ట్ ఫోన్, రెడ్మి 4ఏను మార్కెట్లోకి తెచ్చింది. స్మార్ట్‌ఫోన్ ధర రూ.5,999 అని షావోమి ఇండియా తెలిపింది. భారత్‌లో తమ కంపెనీ అందిస్తున్న చౌక ధర ఫోన్ ఇదేనని షావోమి ఇండియా హెడ్ మను జైన్ పేర్కొన్నారు. ఈ డ్యుయల్ సిమ్ 4జీ ఫోన్లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5 అంగుళాల హెచ్డీ డీస్ప్లే, 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, , 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్. 3120 ఎంఏహెచ్ బ్యాటరీ, తదితర ఫీచర్లున్నాయని వివరించారు. అమెజాన్ ఇండియా, మిడాట్‌కామ్ వెబ్సైట్ల ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఈ 4జీ ఫోన్ రూ.7,000 ధర ఉన్న స్మార్ట్‌ఫోన్ కేటగిరీలో ఎక్కు వగా అమ్ముడవుతున్న మైక్రోమ్యాక్స్ ఫోన్లకు గట్టిపోటీనివ్వగలదని పరిశ్రమ వర్గాలంటున్నాయి. శ్రీ సిటీలో ప్లాంట్.. భారత్‌లో రెండో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని మను జైన్ పేర్కొన్నారు. ఫాక్స్‌కాన్ భాగస్వామ్యంతో ఈ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి పెట్టుబడి వివరాలను ఆయన వెల్లడించలేదు. రెండో ప్లాంట్ కూడా పూర్తిగా అందుబాటులోకి వస్తే, భారత్‌లో ఒక సెకన్‌కు ఒక ఫోన్‌ను తయారు చేయగలమని మను జైన్ పేర్కొన్నారు. ఈ రెండు ప్లాంట్లు కలసి 5 వేల మంది వరకూ ఉపాధిని కల్పిస్తాయని, వీరిలో 90 శాతం మంది మహిళలే అని వివరించారు. భారత్‌లో తమ ఫోన్లకు ఉన్న డిమాండ్‌ను ఈ రెండు యూనిట్లు 95 శాతం వరకూ తీర్చగలవని పేర్కొన్నారు. -
రెడ్ మీ 4 ఏ లాంచ్..ధర వింటే
న్యూఢిల్లీ: చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమి మరో సరికొత్త మొబైల్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. అతి తక్కువ ధరలో దీని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ధరను కంపెనీ రూ. 5,999లుగా నిర్ణయించింది. రెడ్ 4 ఏ పేరుతో ప్రత్యేక ధరలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. డార్క్ గ్రే , గోల్డ్ అండ్ రోజ్ గోల్డ్ కలర్స్ అందుబాటులోకి తెచ్చింది. డ్యుయల్ సిమ్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ లాంటి ఇతర అన్ని ప్రధాన ఫీచర్లన్నీ ఇందులో పొందుపరచింది. మార్చి 23 మధ్యాహ్నం 12 గంటలనుంచి అమెజాన్ ద్వారా ప్రత్యేకంగా అందుబాటులో ఉండనుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. రెడ్ మీ 4 ఏ లాంచ్ ఫీచర్లు 5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే 720x1280 పిక్సెల్ రిజల్యూషన్, 6.0 ఆండ్రాయిడ్ మార్షమల్లౌ, క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 425 చిప్ సెట్ 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ మెమరీ, 13ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3,120 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఇండియాలో చాలా ఫాస్ట్‌గా అమ్ముడుపోతున్న ఫోన్ ఇదే!
రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదుచేస్తున్న రెడ్ మి నోట్4 సరికొత్త ఘనతను సాధించింది. భారత్ లో చాలా త్వరగా అమ్ముడుపోతున్న స్మార్ట్ ఫోన్ గా రెడ్మి నోట్ 4 నిలుస్తుందని షియోమి వెల్లడించింది. 2016లో 1 బిలియన్ రెవెన్యూలను తాకిన షియోమి, ఈ సందర్భంగా రెడ్మి నోట్4 సంచలన విక్రయాలను సృష్టిస్తుందని పేర్కొంది. విక్రయానికి వచ్చిన తొలి 45 రోజుల్లోనే 1 మిలియన్ యూనిట్ల రెడ్మి నోట్4 ఫోన్లు అమ్ముడుపోయినట్టు మంగళవారం వెల్లడించింది. జనవరి 23న ఈ ఫోన్ తొలి విక్రయానికి వచ్చింది. ప్రతి నాలుగు సెకన్లకు ఒక ఫోన్ అమ్ముడుపోతుందని, తొలిరోజు సేల్ లో పది నిమిషాల్లోనే 2,50,000 యూనిట్లను వినియోగదారులు కొనుగోలు చేశారని కంపెనీ రివీల్ చేసింది. ఎలాంటి ప్రి-రిజిస్ట్రేషన్లు లేకుండా ఫ్లిప్ కార్ట్, మి.కామ్ ద్వారా కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ ను విక్రయిస్తోంది. ఎంపికచేసిన రోజుల్లో మాత్రమే ఈ ఫోన్ విక్రయానికి వస్తోంది. విక్రయానికి వచ్చిన కొద్ది సేపట్లోనే వినియోగదారులు భారీ ఎత్తున దీన్ని కొనుగోలు చేస్తున్నారు. నేడు(బుధవారం) మళ్లీ ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్, మి.కామ్ లలో విక్రయానికి వస్తోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. ఇదే రోజు షియోమికి ప్రత్యర్థిగా ఉన్న లెనోవో మోటో జీ5 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేయబోతుంది. మూడు మెమరీ యూనిట్లలో రెడ్మి నోట్4ను షియోమి లాంచ్ చేసింది. రూ.9,999కు 2జీబీ ర్యామ్/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్, రూ.10,999కు 3జీబీ ర్యామ్/32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, రూ.12,999కు 4జీబీ ర్యామ్/64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. -
షియోమి నుంచి కొత్త ప్రొడక్ట్.. ఏంటది?
స్మార్ట్ ఫోన్ బ్రాండ్‌గా ఫుల్ ఫేమస్ అయిన చెనీస్ దిగ్గజం షియోమి ఇప్పటికే మి స్మార్ట్ స్కేల్, మి స్మార్ట్ కెమెరా, మి స్కూలర్ వంటి పలు ప్రొడక్ట్ లను మార్కెట్లోకి పరిచయం చేసింది. ప్రస్తుతం మరో కొత్త ప్రొడక్ట్ తో వినియోగదారుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. షియోమి ఈ వారంలోనే ఓ కొత్త ప్రొడక్ట్ ను మార్కెట్లోకి తీసుకొస్తుందని, అది కాఫీ మిషిన్ అని తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ మిషన్ ను యూజర్లు స్మార్ట్ ఫోన్ల ద్వారా కూడా ఆపరేట్ చేసుకునే విధంగా కంపెనీ రూపొందించిందని రిపోర్టులు చెబుతున్నాయి. మార్చి 7న దీన్ని లాంచ్ చేయనుందని తెలుస్తోంది. షియోమి తన ప్రొడక్ట్ రేంజ్ ను విస్తరించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే పలు ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఎయిర్ ఫ్యూరిఫైయర్స్, పెన్స్ దగ్గర్నుంచి స్మార్ట్ కుకర్స్ వరకు షియోమి ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ బ్రాండులో అత్యంత ప్రాచుర్యం పొందిన షియోమి తర్వాతి ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ షియోమి మి6. -
రెడ్ మి నోట్ 4 బ్లాక్ ఈజ్ కమింగ్...
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియోమీ రెడ్ మీ నోట్ 4 లో కొత్త వేరియంట్ అమ్మకాలకు తెరలేపింది. రికార్డు అమ్మకాలతో దూసుకుపోయిన ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్ కలర్ వేయింట్ అమ్మకాలను భారత మార్కెట్లలో బుధవారం నుంచి ప్రారంభించింది. పాపులర్ రెడ్మీ నోట్ 4 లో బ్లాక్ వేరియంట్ ను లాంచ్ చేయనున్నట్టు గత వారం ప్రకటించింది. ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్ ద్వారా ఈరోజు (మార్చి 1) మధ్యాహ్నం 12 గంటలకు ఈ విక్రయాలను ప్రారంభించనుంది. జనవరిలో లాంచ్ అయిన రెడ్ మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్ హాట్‌కేకుల్లా అమ్ముడుబోయిన సంగతి తెలిసిందే. మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చిన కేవలం పది నిమిషాల్లోనే ఏకంగా 2.5 లక్షల ఫోన్లను విక్రయించినట్టు సంస్థ పేర్కొంది. రెడ్మీ నోట్ 4 మూడు వేరియంట్లలో లభిస్తోంది. 2జీబీ ర్యామ్, 32 జీబీ ఇన్‌బిల్ట్ మెమరీ.. 3జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ.. 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇన్‌బిల్ట్ మెమరీతో ఇవి లభిస్తున్నాయి. ధరలు వరుసగా రూ.9,999, రూ.10,999, రూ.12,999 ధరల్లో లభిస్తున్నాయి. రెడ్ మీ నోట్ 4 ఫీచర్లు 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ 2.5డి కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 గ్రాఫిక్స్ 2/3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్ 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.1 4100 ఎంఏహెచ్ బ్యాటరీ -
వాలెంటైన్స్ డేకి స్పెషల్ రెడ్మి ఫోన్
రెడ్మి నోట్4 సంచలన విజయంతో ఓ ఊపుమీదున్న చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి మరో కొత్త ఫోన్‌తో వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. రెడ్మి నోట్ 4ఎక్స్ పేరుతో ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను చైనీస్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఛాంపైన్ గోల్డ్, చెర్రి పౌడవర్, ప్లాటినం సిల్వర్ గ్రే, మ్యాట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో దీన్ని తీసుకొచ్చింది. వాలెంటైన్స్ డే సందర్భంగా హ్యాట్సూన్ గ్రీన్ రంగులో రెడ్ మి నోట్ 4 ఎక్స్ స్పెషల్ వేరియంట్‌ను అందుబాటులో ఉంచనుంది. ప్రస్తుతమైతే, రెడ్మి నోట్ 4ఎక్స్ హ్యాట్ సూన్ గ్రీన్ కలర్ వేరియంట్ పరిమితంగా అందుబాటులో ఉండనుంది. దాని ధర, ప్రత్యేకతలు వాలెంటైన్స్ డేనే ప్రకటించనుంది. మిగతా వేరియంట్ల ధర, ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయో కంపెనీ తెలుపలేదు. ప్రస్తుతం కొన్ని ప్రత్యేకతలను మాత్రమే కంపెనీ తన అధికారిక వెబ్సైట్లో ఉంచింది. రెడ్మి నోట్ 4ఎక్స్ కొన్ని ఫీచర్లు... 5.5 అంగుళాల ఫుల్-హెచ్డి డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 4100 ఎంఏహెచ్ బ్యాటరీ ఫుల్ మెటల్ బాడీ, ఫింగర్ ప్రింట్ స్కానర్ డ్యూయల్ సిమ్ వెర్షన్ గూగుల్ ఆండ్రాయిడ్ నోగట్ -
వాలెంటైన్స్ డే స్పెషల్‌గా షియోమి కొత్త ఫోన్
వాలెంటైన్స్ డే రోజు జీవిత భాగస్వామికి స్పెషల్‌గా ఏం ఇవ్వాలా అని తెగ ప్లాన్స్ వేస్తుంటారు. అయితే ఈ సారి స్పెషల్ స్మార్ట్ఫోనే ఎందుకు కాకూడదు. ఇదే ఆలోచనతో చైనీస్ హ్యాండ్సెట్ దిగ్గజం షియోమి వినియోగదారుల ముందుకు రాబోతుంది. రెడ్మి నోట్4తో భారత్, చైనాలో సంచలన స్థాయిలో విక్రయాలు రికార్డు చేసిన షియోమి వాలెంటైన్స్ డేకి ఓ కొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. రెడ్ మి నోట్4 సిరీస్‌లో రెడ్ మి నోట్ 4ఎక్స్ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తోంది. రిపోర్టుల ప్రకారం, సైట్ వైబో లాగా చైనీస్ ట్విట్టర్లో షియోమికున్న అధికార పేజీలో ఈ విషయాన్ని వెల్లడించిందట. వాలెంటైన్స్ డే ఫిబ్రవరి 14న చైనాలో తమ అప్‌కమింగ్ రెడ్ మి నోట్ 4ఎక్స్ లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించినట్టు తెలిసింది. ఈసారి కంపెనీ లవ్ సీజన్లో తమ విక్రయాలను మరింత పెంచుకునేందుకు ప్లాన్ వేసిందని రిపోర్టులు పేర్కొన్నాయి. భాగస్వామికి ప్రేమతో గిఫ్ట్‌గా స్మార్ట్‌ఫోన్ ఇవ్వడం ఓ మంచి ఆలోచనని అంటున్నాయి. రెడ్మి నోట్4 సిరీస్‌లో రాబోతున్న తర్వాతి డివైజ్ రెడ్మి నోట్ 4ఎక్స్ అని టీజర్ ధృవీకరిస్తోంది. కానీ డివైజ్ రిఫరెన్స్ ఇమేజ్ను కంపెనీ చూపించలేదు. ముందస్తు లీక్స్ ప్రకారం వాలెంటైన్స్ కానుకగా రాబోతున్న రెడ్మి నోట్ 4ఎక్స్ ఫీచర్లు ఇలా ఉన్నాయి... 5.5 అంగుళాల ఫుల్-హెచ్డి డిస్ప్లే 2 గిగాహెడ్జ్ డెకా-కోర్ సీపీయూ మీడియా టెక్ హీలియో ఎక్స్20 లేదా క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 653 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్ 16జీబీ, 32జీబీ, 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వేరియంట్లు ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ వెనుక వైపు ఫింగర్‌ప్రింట్ సెన్సార్ -
షియోమి ఎంఐ 6 ఫీచర్లు ఇవే..!
ముంబై: ఎంఐ ఫోన్లతో స్మార్ట్ ఫోన్ల రంగంలో విప్లవానికి నాందిపలికిన చైనా మొబైల్ మేకర్ షియోమి తన తరువాత ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ ఎంఐ 6 ను త్వరలోనే లాంచ్ చేయబోతోంది. అయితే కంపెనీ అధికారికంగా ఆ ఫ్లాగ్షిప్ ఫోన్ వివరాలు ప్రకటించలేదు. కానీ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్,ధర తదితర వివరాలు ఆన్ లైన్ లీక్ అయ్యాయి. అయితే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ మాత్రం తమ స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించడంలేదనీ కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. అటు మరో ప్రముఖ మొబైల్ మేకర్ శాంసంగ్ కూడా యండబ్ల్యూసీకి దూరం. సిరామిక్ బాడీతో మూడు వేరియంట్లలో ఇది వినియోగదారుల ముందుకు రానుంది. ఆన్ లైన్ లో చక్కర్దు కొడుతున్న నివేదికలు ప్రకారం 4 జీబీ, 6జీబీ ర్యామ్ తో ఫుల్ సిరామిక్ బాడీతో వస్తోంది. మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ప్రీమియం వెర్షన్ ను 6జీబీ ర్యామ్ , డ్యూయల్ ఎడ్జ్ స్క్రీన్ వేరియంట్ గా రూపొందించింది. రెండు స్నాప్ డ్రాగెన్ 835 చిప్సెట్ , ఒకటి మీడియా టెక్ ఎక్స్30 ప్రాసెసర్ వెర్షన్ తో రానున్నాయి. ఆండ్రాయిడ్ 7.0 నోగట్, ఎంఐయుఐ8, 218జీజీ, 256 జీబీ స్టోరేజ్ కెపాసిటీ 12 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 3000ఎంఏహెచ్ బ్యాటరీ మీడియా టెక్ ప్రాసెసర్ ఎంఐ 6 వేరియంట్ సుమారుగా రూ 19,800, స్నాప్ డ్రాగెన్ 835 చిప్ సెట్ సుమారుగా రూ. 24,800 కి, డ్యూయల్ ఎడ్జ్ స్క్రీన్ వేరియంట్ రూ 29,800 ధరకి అందుబాటులోకి రానుందట. -
ఫేస్బుక్ గూటికి టాప్ గ్లోబల్ టెక్ ఎగ్జిక్యూటివ్
షియోమీ సంస్థకు రాజీనామా చేసిన హ్యోగో బర్రా కొత్త ప్రస్థానం ఎక్కడినుంచో తెలుసా? ఫేస్బుక్ ఎమోషనల్ లెటర్ ద్వారా షియోమికి గుడ్ బై చెబుతున్నట్టు సింబాలిక్ గా వెల్లడించిన బర్రా ఫేస్ బుక్ గూటికి చేరారు. ఈ టాప్ గ్లోబల్ టెక్ ఎగ్జిక్యూటివ్ ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్ లో కొలువుదీరారు. వర్చువల్ రియాలిటీ విభాగం వ్యాపారాన్ని హ్యోగో బర్రా లీడ్ చేయనున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఫేస్ బుక్ అధిపతి మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. వినూత్నమైన మొబైల్స్ తో లక్షలాదిమంది ఫోన్ వినియోగదారులకు చేరువైన హ్యోగో తన టీంలో చేరడం సంతోషంగా ఉందన్నారు. వర్చువల్ రియాలీటీ తో జుకర్, బర్రా ల ఆకర్షణీయ ఫోటోను కూడా పోస్ట్ చేశారు. ఓక్లస్ వీఆర్ హెడ్ గా బర్రాను నియమించుకుందనీ, వర్చువల్ రియలిటీ, ప్రధాన కంప్యూటింగ్ వేదికను ఆయన లీడ్ చేయనున్నారని ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా సీఈవో వెల్లడించారు. వాస్తవిక మరియు అనుబంధ వాస్తవికత టెక్నాలజీలు భవిష్యత్తు ప్రధాన కంప్యూటింగ్ ప్లాట్ ఫాం లన్న తన నమ్మకాన్ని బర్రా విశ్వసించారని తెలిపారు. బర్రా తమ సంస్థకు కొత్త అనుభవాలను పంచునున్నారనే విశ్వసాన్ని జుకర్ బర్గ్ వ్యక్తంచేశారు. 2014 లో ఈ (ఓక్లస్ యూనిట్) ను ఫేస్ బుక్ సొంతం చేసుకుంది. బర్రా ను స్వాగతించిన ఓక్లస్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసింది. కాగా చైనా మొబైల్ మేకర్ షియోమికి హ్యుగో బర్రా ఇటీవల గుడ్ బై చెప్పారు. త్వరలో బీజింగ్ నుంచి పుట్టిల్లు సిలికాన్ వ్యాలీకి చేరుతున్నట్టు ప్రకటించిన బర్రా కంప్యూటింగ్ ప్లాట్ ఫాంలో వర్చ్యువల్ అండ్ అగ్ మెంటెడ్ రియాల్టీ కీలక పాత్ర పోషించనున్నాయనే అభిప్రాయాన్ని ఫేస్ బుక్ పోస్ట్ లో వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. Please welcome Hugo Barra, our new VP of VR at Facebook! https://t.co/zuYdrXkIUY pic.twitter.com/GezeEu7QiV — Oculus (@oculus) January 26, 2017 -
ఫ్లిప్‌కార్ట్‌లో ఆ ఫోన్‌కు భలే గిరాకి
రెడ్ మి నోట్ 3తో మొబైల్ ప్రియులను అమితంగా ఆకట్టుకున్న షియోమి, కొత్త సంవత్సరంలో రెడ్ మి నోట్ 4తో వినియోగదారుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్‌ను నేటి(సోమవారం) మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో, మి.కామ్‌లో షియోమి అందుబాటులో ఉంచింది. ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌పై దీన్ని ప్రవేశపెట్టిన ఒక్కటే ఒక్క నిమిషంలో ఈ ఫోన్‌కు భలే గిరాకి వచ్చిందట. ఒక్క నిమిషంలోనే నోట్ 4 స్టాక్ అంతా అయిపోయిందట. మూడు వేరియంట్లలో దీన్ని షియోమి ప్రవేశపెట్టింది. రూ.9,999కు 2జీబీ ర్యామ్/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్, రూ.10,999కు 3జీబీ ర్యామ్/32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, రూ.12,999కు 4జీబీ ర్యామ్/64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. నేటి నుంచి గోల్డ్, డార్క్ గ్రే రంగుల ఫోన్లే అందుబాటులో ఉండనున్నాయి. మేట్ బ్లాక్ కలర్ వేరియంట్ కొన్ని వారాల తర్వాత మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది. షియోమి రెడ్ మీ నోట్ 4 ఫీచర్లు.... 2.5డి కర్వ్డ్ గ్లాస్‌తో 5.5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే 2గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ 13 మెగాపిక్సెల్ కెమెరా 85 డిగ్రీల వైడ్ యాంగిల్‌తో 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 128జీబీ వరకు విస్తరణ మెమరీ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇన్ఫ్రార్డ్ సెన్సార్ ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో, మిఐయూఐ 8.0 ఆండ్రాయిడ్ నోగట్ 7.0 టెస్టింగ్ 4జీ వీవోఎల్టీఈ, మైక్రో యూఎస్బీ, బ్లూటూత్, జీపీఎస్ కింది వైపు డ్యూయల్ స్పీకర్స్ 4100 ఎంఏహెచ్ బ్యాటరీ 175 గ్రాముల బరువు కాగా.. చైనాలో ఈ ఫోన్ ను గత ఆగస్టులోనే విడుదల చేసింది. రెడ్ మీ నోట్ 4 స్మార్ట్ ఫోన్ గోల్డ్, బ్లాక్ సిల్వర్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. 20శాతం బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచినట్టు ప్రకటించింది. -
ఫ్లిప్‌కార్ట్.. జడేజా.. ఓ సరదా గొడవ
చవక ధరలకే స్మార్ట్ ఫోన్లు అందించే షియోమి సంస్థ తన ఆల్ రౌండర్ ఫోన్ రెడ్మీ నోట్ 4ను ఈనెల 19న విడుదల చేస్తోంది. కానీ, టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు మాత్రం అది నచ్చలేదు. అందుకే ట్విట్టర్లో సరదాగా ఓ చిన్నపాటి గొడవేసుకున్నాడు. కేవలం తమ సైట్లో మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా అమ్మకాలు సాగబోతున్న షియోమి రెడ్మి నోట్ 4 గురించి ఫ్లిప్‌కార్ట్ సంస్థ టీజింగ్‌గా ఒక ట్వీట్ చేసింది. ''భారత కొత్త ఆల్‌రౌండర్ జనవరి 19న మమ్మల్ని విజిట్ చేస్తున్నారు. ఎవరో ఏంటో తెలుసా?'' అని అందులో పేర్కొంది. వెంటనే 'సర్' రవీంద్ర జడేజా దానికి రెస్పాండ్ అయ్యాడు. ఆ ప్రకటన చేయడానికి ముందు తనను సంప్రదించాలి కదా, ఎందుకు చేయలేదు అని అడిగాడు. ఆ కార్యక్రమాన్ని జనవరి 20వ తేదీకివాయిదా వేయాలని కోరాడు. తనకు 19వ తేదీన ఒక మ్యాచ్ ఉంది కాబట్టి అలా చేయాలన్నాడు. దానిపై ఇక నెటిజన్లు విపరీతంగా స్పందించారు. ఒకరి తర్వాత ఒకరుగా దానిమీద ట్వీట్లు వెల్లువెత్తించారు. దాంతో ఫ్లిప్‌కార్ట్ ఆశించిన స్పందన వచ్చినట్లయింది. షియోమి రెడ్మి నోట్ 3 మార్కెట్లో క్లిక్ కావడంతో.. దాదాపు దాని ధరలోనే మరికొంత అప్‌గ్రేడెడ్ వెర్షన్, మరింత ఎక్కువ బ్యాటరీ సామర్థ్యంతో నోట్ 4ను తీసుకొస్తోంది. (పూర్తి వివరాలకు చదవండి: నోట్ 3 ధరకే రెడ్మి నోట్ 4?) India's new all-rounder is visiting us on January 19th. One of the best in India! Any guesses who it is? — Flipkart (@Flipkart) 14 January 2017 @Flipkart Why this Kolaveri di? Should have informed me before announcing? Anyway, got a match on the 19th… let's push this to 20th? — Ravindrasinh jadeja (@imjadeja) 14 January 2017 -
నోట్ 3 ధరకే రెడ్మి నోట్ 4?
చవక ధరలతో స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న షియోమి.. తన రెడ్మి నోట్ 4ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. మరో మూడు రోజుల్లో ఇది భారత మార్కెట్లలోకి రానుంది. జనవరి 19వ తేదీన దీన్ని మార్కెట్లోకి తెస్తామని షియోమి కంపెనీ ప్రకటించింది. షియోమి రెడ్మి నోట్ 3 మార్కెట్లో క్లిక్ కావడంతో.. దాదాపు దాని ధరలోనే మరికొంత అప్‌గ్రేడెడ్ వెర్షన్, మరింత ఎక్కువ బ్యాటరీ సామర్థ్యంతో నోట్ 4ను తీసుకొస్తోంది. మరి దాని గురించిన వివరాలు తెలుసుకోవాలని ఉందా..? ఆ సినిమా గురించిన కొన్ని అంచనాలు ఇలా ఉన్నాయి. డిస్ప్లే దీనికి 5.5 అంగుళాల డిస్ప్లే, 2.5 డ్రాగన్ గ్లాస్‌తో ఉంటుందని అంచనా. దీని బరువు 160-165 గ్రాముల మధ్య ఉండొచ్చు. మెటల్ బాడీ, వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటాయంటున్నారు. ప్రాసెసర్ షియోమి రెడ్మి నోట్ 4లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ ఉండి, మూడు రకాల వేరియంట్లలో వస్తుందని అంటున్నారు. ప్రధానంగా 2 జీబీ, 3 జీబీ, 4 జీబీ ర్యామ్‌లు ఉండనున్నాయి. వీటి ఇంటర్నల్ మెమరీ 32, 64 జీబీలుగా ఉంటుంది. డ్యూయల్ సిమ్ సపోర్టుతో పాటు 4జి ఎల్టీఈ కనెక్టివిటీ, హైబ్రిడ్ సిమ్ ట్రే ఉంటాయి. 128 జీబీ వరకు మెమొరీని పెంచుకోవచ్చు. కెమెరాలు షియోమి రెడ్మి నోట్4లో 13 మెగాపిక్సెళ్ల వెనక కెమెరా, 5 మెగా పిక్సెళ్ల ఫ్రంట్ కెమెరా ఉండొచ్చు. బ్యాటరీ దీని బ్యాటరీ సామర్థ్యం కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. 4100 ఎంఏహెచ్ లి-పాలీమర్ బ్యాటరీ, త్వరగా చార్జి అయ్యేలా ఉంటుంది. అయితే.. ఈ బ్యాటరీ ఫోన్లోనే ఫిక్స్ అయి ఉంటుంది తప్ప, పాతవాటిలా బయటకు తీయడానికి కుదరదు. ఆపరేటింగ్ సిస్టమ్ ఈ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా అత్యాధునికమైన ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో 6.0 ఉంటుందని, దాంతోపాటు షియోమి ఎంఐయూఐ 8 వెర్షన్ ఉంటుందని చెబుతున్నారు. ధర షియోమి స్మార్ట్ ఫోన్లు అంటేనే ధరలు అందుబాటులో ఉంటాయని ప్రసిద్ధి. గతంలో 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 2 జీబీ ర్యాం ఉన్న నోట్ 3ని 10వేల రూపాయల ధరకు ఇవ్వగా, ఇప్పుడు అదే రేంజిలో ఉన్న నోట్ 4ను కూడా దాదాపు అదే ధరకు ఇస్తారని అంటున్నారు. అదే 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ అయితే 12వేలు, 4 జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ ఉన్నదైతే 15వేలు ధరలు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
జాంట్ చైనాతో జతకట్టిన షియోమి
బీజింగ్ : స్మార్ట్‌ఫోన్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో తనదైన హవా సాగిస్తున్న చైనీస్ టెక్నాలజీ కంపెనీ షియోమి, వర్చ్యువల్ రియాల్టీ కంటెండ్ ప్రొవైడర్ జాంట్ చైనాతో జతకట్టింది. రెండు కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందంతో షియోమి గత అక్టోబర్‌లో లాంచ్ చేసిన వీఆర్ హెడ్సెట్ల కోసం జాంట్ చైనా ఓ యాప్‌ను రూపొందించనుంది. మార్కెటింగ్, టెక్నాలజీ విషయంలో రెండు కంపెనీలు ఒకదానికొకటి కలిసి పనిచేస్తాయని వెల్లడించాయి. వీఆర్ వీడియో షూటింగ్, ఎడిటింగ్, డిస్ట్రిబ్యూషన్లో జాంట్ కంపెనీ ప్రస్తుతం నిమగ్నమై ఉందని జిన్హువా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. షాంఘై మీడియా గ్రూప్, చైనా మీడియా క్యాపిటల్‌తో కలిసి ఈ ఏడాది జాంట్ చైనాను కంపెనీ ఆవిష్కరించింది. జాంట్తో కలిసి హై క్వాలిటీ వీఆర్ వీడియోలను తాము అందిస్తామని విశ్వసిస్తున్నట్టు షియోమి తెలిపింది. షియోమితో భాగస్వామ్యం తమకు మరింత విశ్వాసాన్ని అందిస్తుందని జాంట్ చైనా కూడా పేర్కొంది. 2016లో చైనా వీఆర్ మార్కెట్ 5.55 బిలియన్ యువాన్లు. వీఆర్ స్టార్టప్‌లకు ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్లకు నిధులు అందించడం కోసం బైడు, ఆలీబాబా, టెన్సెంట్‌లు ఆ స్టార్టప్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇటీవల కాలంలో మొబైల్ వీఆర్‌లోకి మరలడానికి ఫోన్ తయారీసంస్థల మధ్య పోటీ తీవ్రతరమైంది. -
క్రిస్మస్ కానుకగా షియోమి బంపర్ ఆఫర్లు
క్రిస్మస్ కానుకగా షియోమి బంపర్ డిస్కౌంట్లు ప్రకటించింది. ''వెరీ మి క్రిస్మస్ సేల్'' కింద మి5 స్మార్ట్‌ఫోన్, కూపన్స్, యాక్ససరీస్ వంటి వాటిపై డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నట్టు షియోమి బుధవారం వెల్లడించింది. సోమవారం నుంచి బుధవారం వరకు ఈ డిస్కౌంట్లు వినియోగదారులకు అందుబాటులో ఉంచినట్టు కంపెనీ పేర్కొంది. అయితే ఈ సేల్ ఆఫర్ కేవలం తమ ఆన్స్టోర్ Mi.com/in ద్వారా కొనుగోలు చేసిన వాటికే వర్తించనుందని షియోమి తెలిపింది. స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్‌తో లాంచ్ అయిన మొదటి ఫోన్ షియోమి మి5. క్రిస్మస్ సేల్ కింద ఈ ఫోన్ ధరపై రూ.3000 డిస్కౌంట్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఆఫర్లో ఈ ఫోన్ రూ.19,999కే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. రూ.24,999కు లాంచ్ అయిన ఈ ఫోన్ ధరను కంపెనీ రూ.22,999లకు తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కంపెనీ ఆఫర్ చేస్తున్న డిస్కౌంట్‌పై రూ.19,999కే లభ్యమవుతోంది. అయితే ఇది కేవలం పరిమిత కాల వ్యవధిలోనే. అయితే కేవలం షియోమి మి5 స్మార్ట్‌ఫోన్‌పై కంపెనీ ధరను తగ్గించింది. ఇతర పాపులర్ రెడ్మి సిరీస్ స్మార్ట్ఫోన్లపై కంపెనీ ఎలాంటి ఆఫర్లను ప్రకటించలేదు. మి5 స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్‌తో పాటు రూ.1,899 ధర కల్గిన 20,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంకుపై రూ.600 డిస్కౌంట్‌ను కంపెనీ అందిస్తోంది. అదేవిధంగా 10,000 ఎంఏహెచ్ పవర్ బ్యాంకు ధరపై కూడా రూ.300 ఫ్లాట్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ కింద రూ.1,799 ధర కల్గిన మి ఇన్-ఇయర్ ప్రొ హెడ్‌ఫోన్స్ ధర రూ.1,599కు దిగొచ్చింది. మి యూఎస్బీ ఫ్యాన్‌ను రూ.149కు( అసలు ధర రూ.249), మి ఎల్ఈడీ లైట్‌ను రూ.199(అసలు ధర రూ.249)కు అందుబాటులోకి తీసుకొస్తోంది. -
రెడ్ మి 4 కమింగ్ సూన్!
ముంబై: స్మార్ట్ ఫోన్లతో ప్రపంచ వ్యాప్తంగా ఫోన్ లవర్స్ ను ఆకట్టుకుంటున్న చైనా మొబైల్ మేకర్ షియోమి మరింత వేగంగా దూసుకుపోతోంది. తాజాగా రెడ్ మి సిరీస్ లో భాగంగా ' రెడ్ మి 4' స్మార్ట్ ఫోన్ నులాంచ్ చేసేందుకు రడీ అవుతోంది. ఈ ఏడాది జనవరి లో లాంచ్ రెడ్ మి 3 కి అప్‌గ్రేడెడ్ వెర్షన్ గా రెడ్ మి 4 విడుదలకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. నవంబర్ లో మార్కెట్ లో లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం. చైనీస్ సర్టిఫికేషన్ సైట్ తెనా లో లీక్ అయిన వివరాలు ప్రకారం రెడ్ మి 4 ఫీచర్లు ఇలా ఉండనున్నాయి. 5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 1.4 ఆక్టా కోర్ ప్రాపెసర్ 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్ పాండబుల్ 13 ఎంపీరియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 ఎంపీ ముందు కెమెరా 4100 బ్యాటరీ సామర్థ్యంతో లాంచ్ కానున్న ఈ స్మార్ట్ ఫోన్ ధరను రూ.7వేలు గా నిర్ణయించినట్టు అంచనా. అయితే దీనిపై షియామి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
భారత్‌లో షియోమి అనూహ్య నిర్ణయం!
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల కంపెనీ షియోమి బుధవారం అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించింది. తన టాప్ ఫ్లాగ్షిప్ మోడళ్లయిన ఎంఐ నోట్-2, ప్యూచరిస్టిక్ ఎం మాక్స్ ఫోన్లను భారత్‌లో విడుదల చేయబోమని స్పష్టం చేసింది. అదేవిధంగా నెలకిందట విడుదలైన ఎంఐ 5ఎస్‌ను కూడా భారత్‌లో అమ్మబోమని స్పష్టం చేసింది. హైఎండ్ టెక్నాలజీ, టాప్ ఫీచర్లతో కూడిన ఎంఐ నోట్-2ను, ప్యూచరిస్టిక్ ఎంఐ మాక్స్ మోడళ్లను షియోమి బుధవారం చైనాలో విడుదల చేసింది. అయితే, ఎక్కువమొత్తంలో ధర ఉండే తన ఫ్లాగ్షిప్ మోడళ్లకు భారత్‌లో మార్కెట్ చాలా స్పల్పంగా ఉంది. దీనికితోడు భారత్‌లో ఏడాదికి ఒకటే హైఎండ్ ఫోన్‌ను విడుదల చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఈ కొత్త మోడళ్లను ఇక్కడ అమ్మడం లేదని కంపెనీ తాజాగా స్పష్టత ఇచ్చింది. షియోమి తాజా నిర్ణయం ఆ కంపెనీ ఫోన్లు ఇష్టపడే భారతీయులకు నిరాశ కలిగించేదే. అయితే, హైఎండ్ టెక్నాలజీతో వచ్చిన ఎంఐ-5 ఫోన్‌కు భారత్‌లో పెద్దగా ఆదరణ లభించలేదు. అంతేకాకుండా షియోమి భారత్ కన్నా తన ప్రధాన మార్కెట్ అయిన చైనాపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. ఇతర విదేశీ మార్కెట్ల మీద అంతగా దృష్టి పెట్టడం లేదు. రెండేళ్లుగా భారత్ మార్కెట్లో ఉన్నా ఫ్లాగ్షిప్ మోడళ్లకు తమకు పెద్దగా మార్కెట్ లేదని, అంతేకాకుండా ఏడాదికి ఒక హైఎండ్ ఫోన్‌ను మాత్రమే విడుదల చేయాలన్న నిర్ణయం కారణంగా తమ కొత్త ఫోన్లను భారత్‌కు పంపడం లేదని షియోమి చైనా వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ హ్యుగో బర్రా వెల్లడించారు. 5.7 అంగుళాల 3డీ టచ్ డిస్ ప్లే.. 23 ఎంపీ బ్యాక్ కెమెరా, 12 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో అత్యాధునిక ఫీచర్లతో విడుదలైన ఎంఐ నోట్-2 ధర చైనా మార్కెట్ ప్రకారం సుమారుగా రూ. 27,700 నుంచి రూ. 29,700 మధ్య ఉండే అవకాశముంది. -
ఎంఐ నోట్ 2 ఫీచర్లు అదుర్స్!
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది. ఎంఐ నోట్ 2 పేరుతో సరికొత్త ఫోన్ ను షియోమీ విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన టీజర్ ను ట్విట్టర్, ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. రెండు వంపుల(డ్యూయల్ కర్వడ్) ప్రత్యేకత కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ను అక్టోబర్ 25న మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్టు షియోమీ వెల్లడించింది. అయితే ఈఫోన్ కు సంబంధించిన ఫీచర్లు అధికారికంగా వెల్లడికానప్పటికీ కొన్ని వివరాలు బయటకు లీకయ్యాయి. అనధికారికంగా వెల్లడైన ఫీచర్లు ఫోన్ ప్రియులను ఆటక్టునేలా ఉన్నాయి. అల్ట్రా థిన్ డిప్లేతో కూడిన ఎంఐ నోట్ 2 ఫోన్ ను 4 జీబీ, 6 జీబీ వేరియంట్ విడుదల చేయనున్నట్టు సమాచారం. ఎంఐ నోట్ 2 ఫోన్ ఫీచర్లు 5.7 అంగుళాల 3డీ టచ్ డిస్ ప్లే 23 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 318 కెమెరా 12 ఎంపీ ఫ్రంట్ కెమెరా 4100 ఎంఏహెచ్ బ్యాటరీ 4 జీబీ ర్యామ్/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ 6 జీబీ ర్యామ్/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆండ్రాయిడ్ 6 మార్ష్ మాలో ఓఎస్ స్నాప్ డ్రాగన్ 821 చిప్ సెట్ డ్యుయల్ సిమ్ సపోర్ట్ 4 జీబీ ఫోన్ ధర సుమారు రూ. 27,700 6 జీబీ ఫోన్ ధర సుమారు రూ. 29,700 -
18 రోజుల్లో 10 లక్షల షావోమి ఫోన్ల విక్రయం
బీజింగ్: చైనా మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ ఈ దీపావళి పండుగ సీజన్లో ఒక్క భారత్‌లోనే 18 రోజుల్లో 10 లక్షల ఫోన్లను విక్రయించింది. వచ్చే ఐదేళ్లలో భారత్‌లో అతిపెద్ద మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీగా అవతరించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు షావోమి వ్యవస్థాపకుడు, సీఈవో లీ జున్ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న మొబైల్ హ్యాండ్సెట్ మార్కెట్ భారతదేశమేనని, తమ గ్లోబలైజేషన్ లక్ష్యాల సాకారానికి భారత్ అత్యంత కీలకమని చెప్పారాయన. చైనా తర్వాత ఇండియానే తమ అతి పెద్ద మొబైల్ మార్కెట్‌గా అభివర్ణించారు. ‘‘ఇండియాలో ఇన్వెస్ట్మెంట్లు పెంచుతాం. కార్యకలాపాలను మరింత విస్తరిస్తాం’’ అని లీ వివరించారు. భారత్‌లో ఇప్పటికే పలు చైనా కంపెనీలు రకరకాల వ్యూహాలతో అమ్మకాలు పెంచుకుంటున్నాయి. షావోమీ అమ్మకాలు చైనాలో ఈ మధ్య తగ్గాయి. ఈ నేపథ్యంలో ఇండియాలో షావొమీ వాటా పెరగటం గమనార్హం. అందుకే ఈ కంపెనీ భారత్‌కు అధిక ప్రాధాన్యమిస్తోంది. -
షియోమీ సంచలన ఆఫర్.. ప్చ్!
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ ప్రకటించిన రూపాయి సేల్ వినియోగదారులను ఉసూరు మనిపించింది. రూపాయికే స్మార్ట్ ఫోన్ దక్కించుకోవాలని ప్రయత్నించిన యూజర్లుకు నిరాశే ఎదురైంది. దీపావళి అమ్మకాల్లో భాగంగా రెడ్ మీ 3ఎస్ ప్రైమ్ స్మార్ట్ ఫోన్ ను రూపాయికే విక్రయిస్తామని షియోమీ ప్రకటించడంతో కోట్లాది మంది ఎంఐ వెబ్ సైట్ లో తమ వివరాలు నమోదు చేసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మొదలయ్యే ఫ్లాష్ అమ్మకాల కోసం ముందుగానే ఎంఐ వెబ్ సైట్ ను ఓపెన్ చేసి వేచి చూశారు. ఫ్లాష్ అమ్మకాలు మొదలయి సెకన్ సమయం అయినా గడవకుండానే రెడ్ మీ 3ఎస్ ప్రైమ్ స్మార్ట్ ఫోన్లు అమ్ముపోయాయన్న సందేశం చూసి వినియోగదారులు నిరుత్సాహానికి గురయ్యారు. అయితే కేవలం 30 ఫోన్లు మాత్రమే రూపాయికి విక్రయిస్తామని షియోమీ ముందుగానే ప్రకటించింది. ఫోన్లు తక్కువ, పోటీ ఎక్కువ కారణంగానే అతి తక్కువ సమయంలో అమ్మకాలు పూర్తయినట్టు భావిస్తున్నారు. దీపావళి అమ్మకాలకు ప్రచారం కోసమే షియోమీ రూపాయి ఆఫర్ ప్రకటించిందని వినియోగదారులు పెదవి విరుస్తున్నారు. అయితే షియోమీ ప్రకటించినట్టుగా 30 మందికైనా ఫోన్లు దక్కాయో, లేదో చూడాలి. కాగా, రెడ్ మీ 3ఎస్(రూ.6,499) , రెడ్ మీ 3ఎస్ ప్రైమ్ ( రూ.8,499) స్మార్ట్ ఫోన్లను ఈ రోజు లాంచ్ చేసిన వెంటనే ఈరోజుకు అమ్మకాలు పూర్తయినట్టు ఎంఐ వెబ్ సైట్ లో కనబడింది. ఈ రెండు ఫోన్లను దక్కించుకునేందుకు రేపు, ఎల్లుండి కూడా అవకాశముంది. -
షియోమీ దివాలీ ఆఫర్లు..బంపర్ ప్రైజ్ ఏంటో తెలుసా?
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ స్పెషల్ దీపావళి సేల్ ఆఫర్లు ప్రవేశపెట్టింది. షియోమీ ఉత్పత్తుల కొనుగోళ్లపై 'దివాలి విత్ మి' ఆఫర్ ను ప్రకటించింది. ఎంఐ స్టోర్ యాప్ ద్వారా అక్టోబర్17-19 వరకు బంపర్ సేల్ ఆఫర్లను వినియోగదారులకు అందించుంది. రెడ్ మి ఉత్పత్తులపై రూ. 500 నుంచి 3000 వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది. స్మార్ట్ ఫోన్, ఇతర యాక్ససరీస్ తో పాటు ఎంఐ బ్రాండ్ ప్యూరి ఫయర్లను ఈ సేల్ కోసం ప్రత్యేకంగా లాంచ్ చేయనుంది. వీటిని స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ ద్వారా అందించనుంది. అక్టోబర్ 17న 30 రెడ్ మి 3ఎస్ ప్రైమ్ స్మార్ట్ ఫోన్లు, 100 బ్లూటూత్ స్పీకర్లు, 100 ఎంఐ బ్యాండ్ అక్టోబర్ 18న 30 రెడ్ మి నోట్ 3 స్మార్ట్ ఫోన్లు(16 జీబీ), 100 20,000 ఎంఎహెచ్ పవర్ బ్యాంకులు అక్టోబర్ 19న 30 ఎంఐ 4 ఫోన్లు, 100 ఎంఐ బ్యాండ్ 2 అందుబాటులో ఉంటాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ విక్రయాలు ప్రారంభమవుతాయని షియామీ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే కొనుగోలుదారులు అందరికీ పండుగ కానుకగా ల్యాప్ టాప్ స్టికర్లు అందిస్తోంది. రూ 5000-15000 మధ్య కొనుగోలు చేస్తే ఒక కీ చైన్, రూ 15,000 పైన ఎంఐ యూఎస్బీ ని ఉచితంగా అందించనుంది. దీంతో పాటుగా ఎంఐ మాక్స్ ప్రైమ్ స్మార్ట్ ఫోన్ ను కూడా లాంచ్ చేయనుంది. స్నాప్ డ్రాగెన్ 652, 128జీబీ/ 4జీబీ వేరియంట్, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్స్ లో రూ.19,000 (మూడు వేల తగ్గింపు)తో విడుదల చేస్తుంది. అలాగే మూడు రోజులలో ఎంఐ 5ను జీరో శాతం వడ్డీ ఈఎంఐతో రూ 22.999 ధరకు అందుబాటులో ఉంచనుంది మరోవైపు ఎంఐ స్టోర్ లో ఆన్ లైన్ గేమ్ పోటీ కూడా నిర్వహిస్తోంది. గో స్మాష్ గేమ్ ద్వారా కూపన్లు, డిస్కౌంట్లు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. అక్టోబర్ 10 నుంచి 16 వరకు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు డిస్కౌంట్ కూపన్లు అందిస్తోంది. అంతేకాదు మరో బంపర్ ఆఫర్ కూడా ఉంది. మూడు రోజుల ఆఫర్ ముగిసిన తరువాత బంపర్ బహుమతి గా ఎంఐ వాక్యూమ్ రోబో గెలుచుకోవచ్చు. లక్కీ డ్రా ద్వారా విజేతను ఎంపిక చేయనుంది. వినియోగదారులు ముందుగా ఎంఐ యాప్, షియోమి వెబ్ సైట్ లో రిజిస్టర్ కావాలి. -
72 గంటల్లో సెకనుకు రెండు స్మార్ట్ఫోన్ల విక్రయం
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ మేకర్ షియోమి ఈ పండుగ సీజన్ లో దూసుకుపోతోంది. షియోమీ ఆన్ లైన్ అమ్మకాల్లో బిగ్గెస్ట్ గెయినర్ గా నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా షియోమీ ప్రకటించింది అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ టాటా క్లిక్ లాంటి ఇ-కామర్స్ సైట్ల ద్వారా 72 గంటల్లో ప్రతిసెకనుకు తమ స్మార్ట్ ఫోన్లు రెండు అమ్ముడుపోతున్నాయని ప్రకటించింది. గత ఏడాది పండుగ సీజన్ లో 5 లక్షల ఫోన్లను విక్రయించగా ఈ ఏడాది కేవలం మూడు రోజుల్లోనే ఈ లక్ష్యాన్ని చేరుకున్నామని షియోమి ఇండియా బిజినెస్ హెడ్ మను జైన్ తెలిపారు. ఆరు నెలల వ్యూహం, ముందస్తు ప్రణాళికతో చేసిన లాంచింగ్ లు దీనికి దోహదపడ్డాయని తెలిపారు. ఒక్క రోజులోనే రెండు లక్షల 70వేల మధ్యస్థాయి రెడ్ మీ 3ఎస్ స్మార్ట్ ఫోన్లు అమ్ముడు బోయాయన్నారు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే తమ విక్రయాలకు జోష్ పెంచిందన్నారు. అలాగే అమెజాన్ లో రెడ్ మీ నోట్ 3 టాప్ సెల్లింగ్ డివైస్ గా నిలిచిందని వెల్లడించారు. ఇంత భారీ పరిమాణంలో డివైస్ లను అందించడానికి తమ తయారీ భాగస్వామి ఫాక్స్ కాన్ ఓవర్ టైం పని పనిచేసిందన్నారు. అయినప్పటికీ , అమెజాన్ లో ప్రస్తుతం తమ స్మార్ట్ ఫోన్లన్నీ ఔట్ ఆఫ్ స్టాక్ అని మను తెలిపారు. -
షావోమి నుంచి ఎయిర్ ప్యూరిఫయర్
ధర రూ.9,999 • ‘మి బ్యాండ్-2’ కొత్త వెర్షన్ కూడా విడుదల • వచ్చే ఏడాది మార్కెట్లోకి స్మార్ట్ రైస్ కుక్కర్! న్యూఢిల్లీ: చైనా ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా ‘మి ఎయిర్ ప్యూరిఫయర్-2’ని భారత్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ.9,999గా ఉంది. ఇండియాలో హోమ్ కేటగిరి విభాగంలో కంపెనీ విడుదల చేస్తోన్న తొలి ఉత్పత్తి ఇదే. ఇందులో ఇన్‌బిల్ట్ సెన్సార్స్, ఆటో మోడ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. కొత్త ఎయిర్ ప్యూరిఫయర్‌లో ఇన్‌బిల్ట్ వై-ఫై అమర్చామని, అందువల్ల ఈ పరికరం మి హోమ్ యాప్‌తో కనెక్ట్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఫిల్టర్ల కాలం చెల్లిపోతే ఇది మనకు తెలియజేస్తుందని తెలిపింది. కాగా ఫిల్టర్ల రిప్లేస్మెంట్కు రూ.2,499 ఖర్చవుతుందని పేర్కొంది. ఈ ఎయిర్ ఫ్యూరిఫయర్లు మి.కామ్‌లో సెప్టెంబర్ 26 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అక్టోబర్ 2 నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని వివరించింది. వచ్చే ఏడాదిలో స్మార్ట్ రైస్ కుక్కర్‌ను మార్కెట్లోకి తెస్తామని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ హుగో బర్రా తెలిపారు. కాగా క్రౌడ్‌ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌ను త్వరలోనే భారత్ మార్కెట్లోకి ప్రవేశపెడతామని పేర్కొన్నారు. ఇక్కడ హార్డ్‌వేర్ స్టార్టప్స్ తయారు చేసిన ప్రొడక్ట్‌లను కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. తద్వారా స్టార్టప్స్ నిధుల సమీకరణకు షావోమి తనవంతు సహకారమందిస్తుంది. ‘మి బ్యాండ్-2’ కొత్త వెర్షన్ విడుదల షావోమి ఎయిర్ ప్యూరిఫయర్‌తోపాటు ‘మి బ్యాండ్-2’ కొత్త వెర్షన్ మార్కెట్లోకి తెచ్చింది. దీని ధర రూ.1,999గా ఉంది. ఇందులో ఓఎల్ఈడీ డిస్ప్లే, 20 రోజుల బ్యాటరీ లైఫ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ‘మి బ్యాండ్-2’ అనేది ఫిట్నెస్, స్లీప్, హార్ట్ రేట్ ట్రాకర్ పరికరం. దీని సాయంతో ఫోన్‌ను అన్‌లాక్ చేసుకోవచ్చు. పలు యాప్ అలర్ట్స్‌ను పొందొచ్చు. ఇది మి.కామ్‌లో సెప్టెంబర్ 27 నుంచి, అమెజాన్‌లో సెప్టెంబర్ 30 నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. -
షియోమి ఎయిర్ ప్యూరిఫైర్2 వచ్చేసింది!
న్యూఢిల్లీ : చైనీస్ బహుళ జాతీయ కంపెనీ షియోమి రెండు కొత్త ఉత్పత్తులను భారత మార్కెట్లోకి ఆవిష్కరించింది. మి ఎయిర్ ప్యూరిఫైర్ 2 తో పాటు, వేరియబుల్ బ్యాండు మి బ్యాండు 2ను భారత వినియోగదారుల చెంతకు తీసుకొచ్చింది. ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్తో గృహోపకరణలోకి అడుగుపెట్టిన షియోమి, తాజాగా మి ఎయిర్ ప్యూరిఫైర్ 2 పేరుతో మరో ఉత్పత్తిని తీసుకొచ్చింది. రూ.9999కు ఈ మి ఎయిర్ ప్యూరిఫైర్ 2ను , మి డాట్ కామ్‌లో సెప్టెంబర్ 26 నుంచి అందుబాటులో ఉంచనున్నట్టు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ ప్లాట్ఫామ్లో దీన్ని అక్టోబర్ 2 నుంచి విక్రయిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. అదేవిధంగా మి బ్యాండు 2ను 1,999రూపాయలకు మి డాట్ కామ్‌లో సెప్టెంబర్ 27 నుంచి అందుబాటులో ఉంచుతున్నట్టు పేర్కొంది. సెప్టెంబర్ 30 నుంచి కూడా ఈ బ్యాండును అమెజాన్‌లో కొనుగోలు చేసుకోవచ్చని వెల్లడించింది. పాత వెర్షన్‌తో పోలిస్తే మి ఎయిర్ ఫ్యూరిఫైర్ 2 డిజైన్ చాలా దృఢంగా ఉంటుందని కంపెనీ చెపుతోంది. మి ఎయిర్ ప్యూరిఫైర్ 2, భారత ఎయిర్ ప్యూరిఫైర్ రంగంలో సమూల మార్పులు తీసుకొస్తుందని షియోమి వైస్ ప్రెసిడెంట్ హ్యగో బరా తెలిపారు. వై-ఫై కనెక్షన్‌తో దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చని చెప్పారు. సంప్రదాయం ఎయిర్ ప్యూరిఫైర్ల మాదిరిగా కాకుండా మూలమూలలా గాలిని ఇది శుద్ధి చేస్తుందని 360 డిగ్రీల్లో ఇది పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతన్న వాటికంటే ఇది చాలా అధికం. ఎయిర్ ఫ్యూరిఫైర్ 2 గాలిలోని కాలుష్యాన్ని 99.7 శాతం వరకు తగ్గిస్తుందని షియోమి వెల్లడించింది.అంతే కాకుండా దీని క్లీన్ ఎయిర్ డెలివరీ రేట్ (సీఏడీఆర్) సామర్థ్యం గంటకు 330 క్యూబిక్ మీటర్లని పేర్కొంది. మి బ్యాండు 2 పేరుతో తీసుకొచ్చిన వేరియబుల్ బ్యాండు ఓలెడ్ డిస్ప్లేతో, తక్కువ బరువు కలిగి ఉంటుందని షియోమి తెలిపింది. ఇది చాలా స్లిమ్‌గా ఉంటుందని చెప్పింది. దీన్ని బ్యాటరీ లైఫ్ 20 రోజుల వరకు ఉంటుందని కంపెనీ హామీ ఇచ్చింది. -
రెడ్మి 4, మి నోట్ 2 ఫోటోల లీకేజీ హల్చల్
ఇంకా ఒక నెలలోనే కస్టమర్ల ముందుకు గ్రాండ్ ఈవెంట్‌గా రావాలనుకున్న షియోమి రెడ్మి 4, మి నోట్ 2లు లీక్‌ల బారినపడ్డాయి. రెండు స్మార్ట్‌ఫోన్ ఇమేజ్‌లు ఆన్లైన్లో లీకయ్యాయి. ఈ లీకేజీ ఫోటోల్లో ఈ రెండు స్మార్ట్ఫోన్లు మెటల్ యూనిబాడీస్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇతర కీలక స్పెషిఫికేషన్లు హల్చల్ చేస్తున్నాయి. రెడ్మి 4 లీకేజీ వివరాలు.. రౌండ్ అంచులతో మెటల్ యూనిబాడీని రెడ్మి 4 కలిగి ఉందని..పైనా, కింద యాంటీనా బ్యాండ్స్ ఉన్నట్టు లీకేజీ ఇమేజ్‌లు చూపిస్తున్నాయి. వెనుకవైపు కెమెరా టాప్ సెంటర్లో ఉండి, దానిపక్కనే కుడివైపున ఫ్లాష్ ఉంది. కెమెరా లెన్స్ కింద ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా ఈ ఫోన్ కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. కెపాసిటివ్ నావిగేషన్ బటన్స్ ఫ్రంట్న కింద వైపు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆధారిత ఎమ్ఐయూఐ 8, ఐదు అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌తో రెడ్మి 4 ఫోన్ వినియోగదారుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ముందస్తు లీక్‌లు మాత్రం ఈ వేరియంట్ 3జీబీ ర్యామ్, 32 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ అని వెల్లడించాయి. 4100 బ్యాటరీ సామర్థ్యంతో 7వేల రూపాయలకు ఇది లాంచ్ కాబోతుందని అంచనా. ఆగస్టు 25న చైనాలో మెగా ఈవెంట్‌గా ఈ ఫోన్‌ను లాంచ్ చేయాలని షియోమి భావిస్తోంది. మి నోట్ 2 స్మార్ట్‌ఫోన్ లీకేజ్‌లు.... రెడ్మి 4 స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించిన రెండో వారంలోనే అంటే సెప్టెంబర్ 2న మి నోట్ 2ను షియోమి ఆవిష్కరించనున్నట్టు వెల్లడవుతోంది. మి నోట్ 2కు సంబంధించి కొన్ని లీక్‌లు మాత్రమే ఆన్లైన్లో దర్శనమిస్తున్నాయి. వెనుకాల డ్యుయల్ కెమెరా, గెలాక్సీ నోట్ 7 మాదిరిగా కర్వ్డ్ డిస్ప్లే, ముందు బాగాన ఫింగర్‌ప్రింట్ స్కానర్, రెండు స్పీకర్ గ్రిల్స్ ఉన్నట్టు లీక్‌లో తెలుస్తోంది. ముందస్తు లీకేజీల బట్టి ఈ ఫోన్ రెండు మెమెరీ వేరియంట్లు 6 జీబీ ర్యామ్/ 64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్/ 128 జీబీ స్టోరేజ్ తో ఈ ఫోన్ అలరించనుందట. దీని ధర కూడా రూ.25 వేలు, రూ.28 వేలుగా ఉంటుందని అంచనా. మెటల్ బాడీ, ఫింగర్‌ప్రింట్ స్కానర్, అమోలెడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 821 ఎస్ఓసీ, 3600ఎంఏహెచ్ బ్యాటరీ లీకేజీలోని మి నోట్ 2 ప్రత్యేకతలు. -
స్మార్ట్ బాటలో షియోమీ
ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో ఉన్న షియోమీ 'స్మార్ట్’ బాట పట్టింది. భారత్‌లో స్మార్ట్ఫోన్లు, ఫిట్నెస్ బ్యాండ్, పవర్ బ్యాకప్, యాక్సెసరీస్‌ను విక్రయిస్తున్న ఈ సంస్థ వినూత్న స్మార్ట్ ఉపకరణాలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫయర్లను పరిచయం చేయనుంది. టీవీలు, రౌటర్లు, వాటర్ ప్యూరిఫయర్లు, మస్కిటో రెపెల్లెంట్, ఎలక్ట్రికల్ బైసికిల్, డ్రోన్, బూట్లు, రైస్ కుకర్, ల్యాప్‌టాప్‌ల వంటి స్మార్ట్ ప్రొడక్ట్స్‌ను సైతం కంపెనీ తయారు చేస్తోంది. వచ్చే ఏడాది నుంచి వీటిని దశలవారీగా ఇక్కడి మార్కెట్లోకి తీసుకు రావాలని నిర్ణయించినట్టు షియోమీ ఇండియా హెడ్ మను జైన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు చెప్పారు. ప్రతి ఉపకరణాన్ని స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించవచ్చని తెలిపారు. వేటికవే ప్రత్యేకం.. షియోమీ వాటర్ ప్యూరిఫయర్‌లో నాలుగు ఫిల్టర్లుంటాయి. ఏది పాడైనా వెంటనే కస్టమర్ స్మార్ట్‌ఫోన్‌కు, అలాగే కంపెనీ కేంద్ర కార్యాలయానికి సమాచారం వెళ్తుంది. ఒక్క క్లిక్‌తో ఫిల్టర్‌ను ఆర్డరివ్వొచ్చు. టెక్నీషియన్ అవసరం లేకుండానే అయిదు నిముషాల్లో బిగించొచ్చు కూడా. ఎన్ని క్యాలరీలు ఖర్చు చేశామో చెప్పే షూస్, బియ్యం రకం, వంటకాన్నిబట్టి సమయానుకూలంగా వండే రైస్ కుకర్, ఏడు కిలోల బరువున్న మడవగలిగే ఎలక్ట్రికల్ బైసికిల్, వెంట తీసుకెళ్లగలిగే మస్కిటో రెపెల్లెంట్ కస్టమర్ల మదిని చూరగొంటాయని కంపెనీ తెలిపింది. చైనాలో షియోమీ స్మార్ట్ టీవీలకు 4.40 లక్షల గంటల కంటెంట్ అందుబాటులో ఉంది. భారత్‌లో కంటెంట్ సిద్ధమవగానే టీవీలను ప్రవేశపెట్టనుంది. మరో రెండు ప్లాంట్లు.. కంపెనీ ప్రతి మూడు నెలలకు 10 లక్షలకుపైగా స్మార్ట్ఫోన్లను విక్రయిస్తోంది. ప్రస్తుతం శ్రీసిటీలోని ఫాక్స్‌కాన్ ప్లాంటులో షియోమీ కోసం ప్రత్యేకంగా నెలకొల్పిన యూనిట్లో మొబైళ్లను తయారు చేస్తున్నారు. మరో రెండు ప్లాంట్ల ఏర్పాటుకు పలు రాష్ట్రాలతో కంపెనీ సంప్రదిస్తోంది. ప్రతి స్మార్ట్‌ఫోన్ 4జీ, ఎల్టీఈ టెక్నాలజీని సపోర్ట్ చేస్తాయి. అలాగే అంతర్జాతీయంగా లభించే మోడళ్లకు పలు మార్పులు చేసి భారత్‌లో విడుదల చేస్తోంది. గతంలో స్మార్ట్ఫోన్లను చైనాలో విడుదలైన 6-9 నెలలకు భారత్‌కు తీసుకువచ్చేవారు. ఇప్పుడు రెండు నెలలలోపే ప్రవేశపెడుతోంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఎక్స్‌క్లూజివ్ స్టోర్లను తెరుస్తామని మను జైన్ చెప్పారు. -
షావోమి నుంచి మరో 2 స్మార్ట్ ఫోన్లు
న్యూఢిల్లీ : చైనా మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా రెడ్మీ సిరీస్‌లో మరో రెండు ఫోన్లను మార్కెట్లోకి తెచ్చింది. ‘రెడ్మీ 3ఎస్’, ‘రెడ్మీ 3ఎస్ ప్రైమ్’ ధరలు వరుసగా రూ.6,999, రూ.8,999. ‘రెడ్మీ 3ఎస్’లో 5 అంగుళాల స్క్రీన్, 1.4 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ మెమరీ, 13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4,100 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఇక ‘రెడ్మీ 3ఎస్ ప్రైమ్’లో 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ, ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి తదితర ఫీచర్లు ఉన్నాయని తెలిపింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్.. ఫ్లిప్‌కార్ట్ సహా కంపెనీ వెబ్సైట్లో వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. రెడ్మీ 3ఎస్ ప్రైమ్ అమ్మకాలు ఆగస్ట్ 9 నుంచి, రెడ్మీ 3ఎస్ విక్రయాలు ఆగస్ట్ 16 నుంచి జరుగుతాయని కంపెనీ తెలిపింది. -
రెడ్మి 3ఎస్ వచ్చేస్తోంది!
చైనా యాపిల్‌గా పేరొందిన షియోమి రెడ్మి సిరీస్‌లో మరో కొత్త ఫోన్ వచ్చేస్తోంది. తొలుత రెడ్మి 1ఎస్, తర్వాత 2ఎస్‌లను రిలీజ్ చేసిన ఈ సంస్థ.. తాజాగా రెడ్మి 3ఎస్ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఈ కొత్త ఫోన్ బుధవారమే భారతీయ మార్కెట్లలోకి వచ్చేస్తోంది. ఈ కొత్త ఫోన్ ధర రూ. 10వేల లోపే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే కంపెనీ మాత్రం దీని ధర ఎంతో ఇంకా చెప్పలేదు. రెడ్మి సిరీస్‌లో 2, 2ప్రైమ్ తర్వాత వస్తు్న్న ఈ ఫోన్‌ను తొలుత చైనా మార్కెట్లో విడుదల చేశారు. ఫోన్ ఫీచర్లు ఇవీ.. ప్రాసెసర్ - క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 430 ర్యామ్ - 2 జీబీ స్క్రీన్ - 5 అంగుళాల డిస్ప్లే వెనక కెమెరా - 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా - 5 మెగాపిక్సెల్ బ్యాటరీ - 4100 ఎంఏహెచ్ ఇంటర్నల్ మెమొరీ - 16 జిబి ఆండ్రాయిడ్ వెర్షన్ - 5.1 లాలిపాప్ -
"రెడ్ మి ప్రో" టీజర్ వచ్చేసింది
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమి, కొత్తగా మార్కెట్లోకి లాంచ్ చేయబోతున్న రెడ్ మి ప్రో ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందా..? అయితే ఉత్సాహవంతులైన యూజర్ల కోసం షియోమి, రెడ్ మి ప్రో టీజర్ ను విడుదల చేసేసింది. చైనీస్ టెక్ కంపెనీ వైబోలో తన టీజింగ్ ను ప్రారంభించింది. ఓలెడ్ డిస్ ప్లే, మీడియా టెక్స్ 10-కోర్ ప్రాసెసర్ తో రెడ్ మి ప్రో మార్కెట్లోకి రాబోతున్నట్టు షియోమి హింట్ ఇచ్చింది. జూలై 27న చైనాలో ఈ ఫోన్ లాంచింగ్ కు సిద్ధమైంది. మొదటి టీజర్ లో ఓలెడ్ పింగ్ వంట చేస్తున్న ప్రముఖ చెఫ్ లియు షి షి దృశ్యాలు, దీంతో తర్వాత రాబోతున్న స్మార్ట్ ఫోన్ ఓలెడ్ డిస్ ప్లే అని తెలుస్తోంది. ఈ డిస్ ప్లేతో బ్యాక్ లైట్ లేకుండానే అంకెలను, టైమ్ ను చూసుకునే వీలుంటుందట. అదేవిధంగా రెండో టీజర్ ద్వారా రెడ్ మి ప్రో ప్రాసెసర్, డెకా కోర్ ప్రాసెసర్ అని హింట్ ఇచ్చేసింది. అయితే ఈ టీజర్ లో సైజు, రెసుల్యూషన్ గురించి ఎలాంటి వివరాలను విడుదల చేయలేదు. గత కొంతకాలంగా చక్కర్లు కొట్టిన లీక్ లో ఈ ఫోన్ 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలోతో రన్ కాబోతుందని సమాచారం. యూనిబాడీ మెటల్ డిజైన్ తో ఇది రాబోతుందట. అయితే ఫింగర్ ప్రింట్ స్కానర్ వెనుక వైపు మిస్ అయి, ముందు వైపు ఉంటుందని ముందస్తు లీక్ లు వెల్లడించాయి. బ్లూటూత్, 4జీ ఎల్టీఈ, వాయిస్ ఓవర్ ఎల్టీఈ, వై-ఫై 802.11ఏసీ, జీపీఎస్ లు లీకేజీలోని రెడ్ మి ప్రో ఫీచర్లు.. మరి ఈ లీక్ లన్నీ నిజమవుతూ రెడ్ మి ప్రో విడుదల అవుతాదో లేదో జూలై 27వరకు వేచి చూడాల్సిందే. -
షియోమి నుంచి స్మార్ట్ టూత్ బ్రష్
చౌక ధరల్లో మొబైల్ ఫోన్ల ఆవిష్కరణలో బాగా ప్రాచుర్యం పొందిన చైనా ఎలక్ట్రిక్ దిగ్గజం షియోమి తన స్మార్ట్ ప్రపంచాన్ని వివిధ ఉత్పత్తులకు విస్తరిస్తోంది. తాజాగా స్మార్ట్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ను లాంచ్ చేసింది. చైనీస్ స్టార్టప్ సోకేర్ క్యాసెల్స్ భాగస్వామ్యంతో 35డాలర్లకు(రూ.2,350) "సోకేర్ ఎక్స్ 3" పేరుతో స్మార్ట్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. బ్లూటూత్ సహాయంతో ఈ బ్రష్ ను స్మార్ట్ ఫోన్ కు కనెక్ట్ చేసుకుని కంట్రోల్ చేసుకొనే వెసులుబాటును షియోమి కల్పించింది. వైర్ లెస్ సపోర్టుతో ఈ టూత్ బ్రష్ కు చార్జింగ్ పెట్టుకోవచ్చు. 1000ఏంఏహెచ్ బ్యాటరీ కలిగిన ఈ టూత్ బ్రష్ కు ఒక్కసారి చార్జింగ్ చేస్తే, 25 రోజులు వాడుకోవచ్చని కంపెనీ వెల్లడించింది..టూత్ బ్రష్ బ్యాటరీ లైఫ్ ను డిస్ ప్లే చేయడానికి ప్రత్యేకంగా ఓ యాప్ కూడా ఉండనుంది. చాలా సెన్సిటివ్ గా, పళ్లను లోతుగా శుభ్రపరచడానికి ఇది ఉపయోగపడుతుందని గిజ్మో చైనా రిపోర్టు పేర్కొంది. ఐపీఎక్స్7 సర్టిఫైడ్ తో వాటర్ ఫ్రూప్ ను ఇది కలిగి ఉంది. షియోమి క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ ఫాంపై దీన్ని కంపెనీ ఆవిష్కరించింది. ఆగస్టు నుంచి దీని షిప్పింగ్ ప్రారంభమవుతుంది. గత వారమే షియోమి, పోర్టబుల్ మస్కిటో రిపీలెంట్ డివైజ్ ను రూ.270లకు లాంచ్ చేసింది. ప్రస్తుతం ఇది చైనాలో అందుబాటులో ఉంది.