ఫ్లిప్ కార్ట్ లో ఎంఐ3 మళ్లీ మ్యాజిక్!
ఫ్లిప్ కార్ట్ లో ఎంఐ3 మళ్లీ మ్యాజిక్!
Published Wed, Aug 20 2014 5:50 PM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM
బెంగళూరు: ఆన్ లైన్ అమ్మకాలలో సియోమి కంపెనీ రూపొందించిన ఎంఐ3 మోబైల్ సంచలనం రేపుతోంది. కేవలం ఇంటర్నెట్ లో ఫ్లిప్ కార్ట్.కామ్ లో లభ్యమయ్యే ఎంఐ3 మొబైల్ ఫోన్ ఆగస్టు 19 తేదిన నిర్వహించిన ఆన్ లైన్ అమ్మకాల్లో 20 వేల ఫోన్లు కేవలం కొద్ది సెకన్లలో అమ్ముడు పోయాయి. ఆన్ లైన్ లో ఈ మొబైల్ ఫోన్ అమ్మకానికి పెట్టడం ఇది ఐదవ సారి. జూలై 22 తేది నుంచి ఐదు దఫాలుగా కొనసాగుతున్న అమ్మకాల్లో ఇప్పటి వరకు 70 వేల ఫోన్లు అమ్మినట్టు నిర్వాహకులు వెల్లడించారు.
తొలి దఫాలో 40 నిమిషాలకే స్టాక్ అమ్మకాలు పూర్తయ్యాయని, రెండవ బ్యాచ్ లో ఐదు సెకన్లు, మూడవ బ్యాచ్ లో రెండు సెకన్లలోనే అమ్మకాలు పూర్తయ్యాయిన సంగతి తెలిసిందే. ఆరవ దఫా అమ్మకాలను ఆగస్టు 26 తేదిన నిర్వహించనున్నట్టు ప్రకటించారు. వినియోగదారులు ఎంఐ3ని చేజిక్కించుకునేందుకు రిజిస్ట్రేషన్లను ఆగస్టు 19 తేది నుంచి ఆగస్టు 25 తేది వరకు కొనసాగించనున్నట్టు ఫ్లిఫ్ కార్ట్ తెలిపింది.
Advertisement
Advertisement