రెడ్‌ మి నోట్‌ 4 బ్లాక్‌ ఈజ్‌ కమింగ్‌... | Xiaomi Redmi Note 4 Matte Black Colour Variant to Go on Sale in India Today | Sakshi
Sakshi News home page

రెడ్‌ మి నోట్‌ 4 బ్లాక్‌ ఈజ్‌ కమింగ్‌...

Published Wed, Mar 1 2017 11:01 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

రెడ్‌ మి నోట్‌ 4 బ్లాక్‌ ఈజ్‌ కమింగ్‌... - Sakshi

రెడ్‌ మి నోట్‌ 4 బ్లాక్‌ ఈజ్‌ కమింగ్‌...

న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమీ   రెడ్ మీ నోట్ 4 లో కొత్త వేరియంట్‌ అమ్మకాలకు తెరలేపింది.  రికార్డు అమ్మకాలతో  దూసుకుపోయిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ బ్లాక్‌ కలర్‌ వేయింట్‌ అమ్మకాలను భారత మార్కెట్లలో బుధవారం నుంచి ప్రారంభించింది. పాపులర్‌ రెడ్‌మీ నోట్‌ 4 లో బ్లాక్‌ వేరియంట్‌ ను లాంచ్‌ చేయనున్నట్టు గత వారం ప్రకటించింది.  ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ.కామ్‌ ద్వారా  ఈరోజు (మార్చి 1) మధ్యాహ్నం 12 గంటలకు ఈ విక్రయాలను  ప్రారంభించనుంది.

జనవరిలో లాంచ్‌ అయిన రెడ్ మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్‌ హాట్‌కేకుల్లా అమ్ముడుబోయిన సంగతి తెలిసిందే.  మార్కెట్‌లోకి అందుబాటులోకి  తెచ్చిన  కేవలం పది నిమిషాల్లోనే ఏకంగా 2.5 లక్షల ఫోన్లను విక్రయించినట్టు సంస్థ పేర్కొంది. రెడ్‌మీ నోట్ 4 మూడు వేరియంట్లలో లభిస్తోంది. 2జీబీ ర్యామ్, 32 జీబీ ఇన్‌బిల్ట్ మెమరీ.. 3జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ.. 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇన్‌బిల్ట్ మెమరీతో ఇవి లభిస్తున్నాయి. ధరలు వరుసగా రూ.9,999, రూ.10,999, రూ.12,999 ధరల్లో లభిస్తున్నాయి.

 రెడ్‌ మీ నోట్ 4 ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 గ్రాఫిక్స్
2/3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1
4100 ఎంఏహెచ్ బ్యాటరీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement