ఫ్లిప్‌కార్ట్ బిగ్ అప్‌గ్రేడ్ సేల్ ఈనెల 9 నుంచి ప్రారంభంకానున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన టీజర్ ఇప్పటికే ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో ప్రత్యేక్షమైంది. వారం రోజుల పాటు సాగే ఈ సేల్ ఫిబ్రవరి 15 వరకు కొనసాగనుంది.
ఈ సేల్‌లో భాగంగా పలు ప్రముఖ ఫోన్లపై ఆకర్షణీయ డిస్కౌంట్లు, ఆఫర్లు అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ తెలిపింది. ఫ్లిఫ్‌కార్ట్ అధికారిక సైట్ బిగ్ అప్‌డేట్ సేల్ పేజ్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. ఐఫోన్ 15 ఈ సేల్‌లో తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ హాట్ డివైజ్ ప్రస్తుతం రూ.72,999కి లభించనుంది.
ఇదీ చదవండి: బంగారం ధర ఆల్‌టైమ్‌హైకు చేరనుందా..?
ఐఫోన్ 14, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ, రియల్‌మి 12 ప్రొ+, వివో టీ2 ప్రొ, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 5జీ, మోటో జీ34 5జీ, రెడ్‌మి 12, పోకో ఎం6 ప్రొ, రియల్‌మి సీ53, పోకో ఎం6, రెడ్‌మి 13సీ, పోకో సీ51, మోటో జీ54, రియల్‌మి 11ఎక్స్ వంటి ఫోన్లపైనా ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment