Flipkart Big Saving Days Sale: Check Out Early Access, Bank Deals and Discounts - Sakshi
Sakshi News home page

బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ వచ్చేస్తోంది: ఫోన్లు, గృహోపకరణాలపై ఆఫర్లే ఆఫర్లు

Published Wed, Aug 2 2023 2:59 PM | Last Updated on Wed, Aug 2 2023 5:28 PM

Flipkart Big Saving Days Sale Check Out Early Access Bank Deals and Discounts - Sakshi

Flipkart Big Saving Days Sale: ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరోసేల్‌ను ప్రకటించింది. ఇండిపెండెన్స్‌డే సేల్‌కంటే ముందు ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్  షురూ చేయ నుంది. ఆగస్టు 4 నుంచి 9వ తేదీవరకు నిర్వహించే  ఈసేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై తగ్గింపు ధరలను అందించనుంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ తరువాత కస్టమర్లను ఆకట్టుకునేందు భారీ తగ్గింపులను ప్రకటించనుంది.డిస్కౌంట్లపై అదనపు వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 

ముఖ్యంగా యాపిల్‌ ఐఫోన్‌, శాంసంగ్‌ తదితర టాప్‌ దిగ్గజ కంపెనీల స్మార్ట్‌ఫోన్లపై భారీ డీల్స్‌ను అందించనుంది. ఐఫోన్ 14, ఐఫోన్ 11 తగ్గింపు ధరలకు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం,ఇవి రూ. 68,999 రూ. 41,999కి జాబితా చేయగా, జనాదరణ పొందిన 5జీ స్మార్ట్‌ఫోన్‌లపై గణనీయమైన ధరల తగ్గింపు సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, రాబోయే సేల్‌లో ఎక్కువ తగ్గింపులను అందిస్తుందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. (Today August 2nd gold price గుడ్‌ న్యూస్‌: దిగొస్తున్న పసిడి, వెండి ధరలు)

అదేవిధంగా పిక్సెల్‌ 6ఏ, శాసంగ్‌ జెడ్‌ ఫ్లిప్‌ 3, గూగుల్‌, నథింగ్‌, పోకో, ఒప్పో, వివో, రియల్‌మీ వంటి అనేక ఇతర స్మార్ట్‌ఫోన్‌లు కూడా ధర తగ్గింపులను అందుకోనున్నాయి. దీంతోపాటు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ ద్వారా కస్టమర్‌లు ఐదు శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆశించవచ్చు.ఐసీఐసీఐ, కోటక్‌ క్రెడిట్/డెబిట్ కార్డ్ ఈఎంఐపై  గరిష్టంగా 4,500 తక్షణ తగ్గింపు లభిస్తుంది.  (రూ. 26,399కే యాపిల్‌ ఐఫోన్‌14: ఎలా?)

అలాగే ఫ్యాషన్‌తోపాటు టీవీలు, ఉపకరణాలు, ఆహారం, పానీయాలు, క్రీడలు & ఫిట్‌నెస్, కారు & బైక్ ఉపకరణాలు, బేబీ కేర్‌ ప్రొడక్ట్స్‌ తదితరాలపై  60 శాతం  వరకు భారీ తగ్గింపు పొందవచ్చు . ఇంకా బైక్‌లు & స్కూటర్‌లు (ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో సహా) రూ.56,500 నుండి ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. టీవీలు, ఇతర గృహోపకరణాలపై  75 శాతం డిస్కౌంట్‌. స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌ ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement