home appliances
-
గృహోపకరణాలకు డిమాండ్ ఆశాజనకం
న్యూఢిల్లీ: పెద్ద గృహోపకరణాల మార్కెట్ ప్రస్తుత ఏడాది మొదటి ఆరు నెలల్లో (జనవరి–జూన్) విలువ పరంగా 18 శాతం వృద్ధిని చూసినట్టు ఎన్ఐక్యూ సంస్థ ఒక నివేదికలో తెలిపింది. గృహాల్లో ముఖ్యమైన ఉత్పత్తులకు డిమాండ్ బలంగా ఉన్నట్టు పేర్కొంది. ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, డిష్వాషర్లు, వాషింగ్ మెషిన్లను పెద్ద గృహోపకరణాలుగా(ఎండీఏ) పేర్కొంటారు. ఎయిర్ కండీషనర్ల (ఏసీలు) అమ్మకాలు విలువ పరంగా 30 శాతం వృద్ధి చెందగా, రిఫ్రిజిరేటర్ల విలువ 7 శాతం పెరిగింది. 2023తో పోలి్చతే ఈ వృద్ధి మూడు రెట్లు అధికమని ఎన్ఐకే (గతంలో జీఎఫ్కే) నివేదిక తెలిపింది. ఇక చిన్న గృహోపకరణాల అమ్మకాల విలువ 29 శాతం వృద్ధి చెందినట్టు వెల్లడించింది. ఇళ్లల్లో సౌకర్యాన్నిచ్చే ఉత్పత్తుల పట్ల వినియోగదారుల్లో ఆసక్తి ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది. ఎక్కువ సదుపాయాలతో (ఫీచర్లు) కూడిన ప్రీమియం ఉత్పత్తుల పట్ల కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారని, ఇదే గృహోపకరణాల అమ్మకాల విలువలో చక్కని వృద్ధికి సాయపడుతున్నట్టు వివరించింది. 9కిలోలు అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన వాషింగ్ మెషిన్ల అమ్మకాల విలువ 30 శాతం పెరిగింది. మెరుగైన పనితీరు, వినూత్న ఫీచర్లను కస్టమర్లు చూస్తున్నట్టు తెలిపింది. ఏసీల్లోనూ ఇదే విధమైన ధోరణి ఉందంటూ.. ఇంధనాన్ని ఆదా చేసే 5 స్టార్ రేటింగ్, అధిక కూలింగ్ సామర్థ్యం కలిగిన ఏసీల విక్రయాలు 59 శాతం (విలువ పరంగా) పెరిగినట్టు ఎన్ఐక్యూ నివేదిక తెలిపింది. సైడ్ బై సైడ్, ఫ్రెంచ్ డోర్, 3/4 డోర్ రిఫ్రిజిరేటర్ల అమ్మకాల విలువ 11 శాతం పెరిగింది. డిమాండ్ కొనసాగుతుంది.. ఈ తరహా గృహోపకరణాలను ఇప్పటికీ తక్కువ మందే వినియోగిస్తున్నందున.. భవిష్యత్తులో మరింత వృద్ధికి అవకాశాలున్నట్టు, ఇది పరిశ్రమ విస్తరణకు అవకాశాలు కలి్పస్తున్నట్టు ఎన్ఐక్యూ నివేదిక తెలిపింది. స్మారŠోట్ఫన్, మొబైల్ ఫోన్ల విభాగంలో వృద్ధి పరిమాణం పరంగా 6 శాతం నమోదు కాగా, విలువ పరంగా 12 శాతం వృద్ధి కనిపించింది. కన్జ్యూమర్ టెక్, డ్యూరబుల్స్ విభాగంలో భారత్ అత్యంత వేగంగా వృద్ధి సాధిస్తున్న మార్కెట్ అని ఈ నివేదిక తెలిపింది. 2030 నాటికి భారత్‌లోని మధ్యతరగతి వాసులు, ఉన్నత వర్గీయుల కంటే మరింత మొత్తం ఖర్చు చేయనున్నట్టు అంచనా వేసింది. -
కెన్‌స్టార్ నుంచి నూతన ఉత్పత్తులు
హైదరాబాద్: ప్రముఖ గృహోపకరణాల సంస్థ కెన్‌స్టార్.. పెద్ద సైజు హోమ్ అప్లయన్సెస్‌ను విడుదల చేసింది. వీటిల్లో డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు, స్లి్పట్ ఎయిర్ కండీషనర్లు, ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్లు ఉన్నాయి. వీటి ఆవిష్కరణతో అన్ని రకాల గృహోపకరణాలు అందిస్తున్న కంపెనీగా మారింది. ప్రధాన విభాగాలైన ఎయిర్ కూలర్లు, చిన్నపాటి గృహోపకరణాలు, వాటర్ హీటర్లపైనా తమ దృష్టి కొనసాగుతుందని కంపెనీ ప్రకటించింది. కూలర్ల విభాగంలో నంబర్ 1 కంపెనీగా అవతరిస్తామని పేర్కొంది. 2023–24 సంవత్సరంలో కంపెనీకి మైలురాయి అని, 55 శాతం వృద్ధిని సాధించినట్టు కెన్‌స్టార్ సీఈవో సునీల్ జైన్ ప్రకటించారు. -
Lok sabha elections 2024: ఎన్నికల ఎఫెక్ట్... టూ వీలర్లు, ఫ్రిజ్ సేల్స్ రయ్!
సార్వత్రిక ఎన్నికల కారణంగా ఆటోమొబైల్, గృహోపకరణాల మార్కెట్లో సందడి నెలకొంది. ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ టూ వీలర్లు, గృహోపకరణాలకు ఒక్కసారిగా డిమాండ్ పుంజుకుంది. ఇదంతా ఎన్నికల చలవేనంటున్నాయి పరిశ్రమ వర్గాలు. నిజానికి వీటి కొనుగోళ్లు కొద్ది నెలలుగా తీవ్రంగా మందగించాయి. ఎన్నికల హడావుడి మొదలయ్యాక ఏప్రిల్, మే నెలల్లో వీటి అమ్మకాలు భారీగా పెరిగాయి. 125 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం, రూ.లక్ష వరకు ధర ఉన్న చిన్న టూ వీలర్ల విక్రయాల్లో 33 శాతం వృద్ధి నమోదైందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) ప్రెసిడెంట్ మనీశ్ రాజ్ సింఘానియా వెల్లడించారు. కరోనా విలయం తర్వాత ప్రీమియం టూ వీలర్లకు డిమాండ్ పుంజుకుంటున్నా ఎంట్రీ లెవెల్ విభాగంలో మాత్రం అమ్మకాలు నత్తనడకన వచ్చాయి. ‘‘కానీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వాలిచ్చే ప్రోత్సాహకాలకు తోడు పారీ్టలు సైతం భారీగా ఖర్చుకు తెరతీయడంతో అల్పాదాయ కుటుంబాల చేతిలో డబ్బులు ఆడుతున్నాయి. దాంతో చిన్న టూ వీలర్లు, ఫ్రిజ్‌ల వంటివాటిని భారీగా కొంటున్నారు’ అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మండుటెండల దెబ్బకు రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, కూలర్ల కొనుగోళ్లు పెరిగాయి. ఎంట్రీ లెవెల్ సింగిల్ డోర్ ఫ్రిజ్‌లు శరవేగంగా అమ్ముడవుతున్నాయని గోద్రెజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది పేర్కొన్నారు. ‘‘చాలాకాలంగా ఈ విభాగంలో అమ్మకాల వృద్ధి సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. ఇప్పుడు మాత్రం ప్రీమియం సెగ్మెంట్‌తో సమానంగా వీటి సేల్స్ నమోదవుతున్నాయి’’ అని వివరించారు. ఎన్నికల ఖర్చు రికార్డ్... రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం 2024లో సార్వత్రిక ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వ్యయం గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టనుంది. ఈ ఏడాది ఎన్నికల సీజన్లో పార్టీలు, అభ్యర్థుల ఖర్చు రూ.1.35 లక్షల కోట్లు దాటొచ్చని స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్)కు చెందిన ఎన్. భాస్కరరావు అంచనా వేశారు. -
భారత్‌లోకి దేవూ రీఎంట్రీ...
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా దిగ్గజం పోస్కో దేవూ తాజాగా భారత మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈసారి కన్జూమర్ ఎల్రక్టానిక్స్, గృహోపకరణాలు, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంపై దృష్టి పెట్టింది. కెల్వాన్ ఎల్రక్టానిక్స్ అండ్ అప్లయెన్సెస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. లిథియం హైబ్రిడ్ ఇన్వర్టర్లు, ఎల్ఈడీ టీవీలను విక్రయించే కెల్వాన్ .. కొత్తగా దేవూ బ్రాండ్ కింద ఇంధన, విద్యుత్ రంగానికి సంబంధించిన ఉత్పత్తులతో పాటు కన్జూమర్ ఎల్రక్టానిక్స్ను కూడా ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం విక్రయాల పరిమాణాన్ని బట్టి తాము సొంతంగా తయారీ ప్లాంటు ఏర్పాటు చేసే అవకాశం ఉందని, మొత్తం మీద మార్కెటింగ్, పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలు మొదలైన వాటిపై వచ్చే మూడేళ్లలో రూ. 300 కోట్ల మేర ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందని కెల్వాన్ ఎండీ హెచ్ఎస్ భాటియా తెలిపారు. భారత మార్కెట్లో వేగవంతమైన వృద్ధికి అవకాశాలు ఉన్నాయని, కెల్వాన్ ఎల్రక్టానిక్స్‌తో 10 ఏళ్ల పాటు బ్రాండ్ లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకున్నామని దేవూ ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్ చాన్ రియు తెలిపారు. తొలి దశలో కార్లు, ద్విచక్ర వాహనాలకు బ్యాటరీలను అందించడంతో పాటు సోలార్ బ్యాటరీలు, ఇన్వర్టర్లను కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో ఎల్ఈడీ టీవీలు, ఆడియో స్పీకర్లు, ఎయిర్ ప్యూరిఫయర్లు, కూలర్లు, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు మొదలైన గృహోపకరణాలను కూడా అందించే యోచ నలో ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ–బైక్‌లు, ఈ–సైకిల్స్నూ ఆవిష్కరించే ప్రణాళికలు ఉన్నట్లు చాన్ రియు వివరించారు. సియెలోతో ఎంట్రీ.. 1995లో దేవూ తొలిసారిగా సియెలో కారుతో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అటుపైన నెక్సియా, మ్యాటిజ్ కార్లను ప్రవేశ పెట్టింది. 2001లో దేవూకి సంబంధించిన చాలా మటుకు అసెట్స్‌ను జనరల్ మోటర్స్ కొనుగోలు చేసింది. అంతిమంగా 2003–04 నుంచి భారత్‌లో కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. రాబోయే రోజుల్లో భారత్‌లో ఎలక్ట్రిక్ టూ–వీలర్లకు గణనీయంగా డిమాండ్ పెరగవచ్చన్న అంచనాల నేపథ్యంలో, తిరిగి ఇన్నాళ్లకు మళ్లీ దేశీ మార్కెట్లోకి రావడంపై దేవూ కసరత్తు చేస్తోంది. -
ఎల్రక్టానిక్స్, గృహోపకరణాలకు జోష్!
న్యూఢిల్లీ: గృహోపకరణాలు, కన్జ్యూమర్ ఎల్రక్టానిక్ పరిశ్రమ ఈ ఏడాది అమ్మకాలపై బలమైన అంచనాలను పెట్టుకుంది. పండుగల సీజన్‌కుతోడు, వన్డే ప్రపంచ క్రికెట్ కప్ పోటీలు ఉండడంతో అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 20 శాతం వృద్ధి నమోదు అవుతుందని అంచనా వేస్తోంది. ఏటా పండుగల సీజన్లో అధిక విక్రయాలు నమోదవుతుండడం సాధారణమే. కాకపోతే ఈ ఏడాది క్రికెట్ పోటీలు కూడా రావడం అమ్మకాలకు కలిసొస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 1987 తర్వాత పండుగల సీజన్ సమయంలో క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంట్ రావడం ఇదే మొదటిసారి కానుంది. దీంతో టీవీలు, ముఖ్యంగా పెద్ద తెరల సెట్లు, ఆడియో ఉత్పత్తులు, సౌండ్ బార్లు, హెడ్ఫోన్లు, ఇయర్‌బడ్స్ అధికంగా అమ్ముడుపోతాయనే అంచనాలు నెలకొన్నాయి. సంప్రదాయ, చిన్న తెరల టీవీల స్థానంలో 55 అంగుళాల పెద్ద టీవీలను వినియోగదారులు కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయని కంపెనీలు భావిస్తున్నాయి. ప్రీమియం, అల్ట్రా ప్రీమియం అయిన క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలకు సైతం డిమాండ్ ఉంటుందని అంచనాతో ఉన్నాయి. వన్డే వరల్డ్‌కప్ అక్టోబర్ 5న ప్రారంభం అవుతుండగా, నవంబర్ 9న ముగియనుంది. ఆకర్షణీయమైన ఆఫర్లు గత సీజన్ల మాదిరే ఈ ఏడాది కూడా వడ్డీ రహిత రుణ సదుపాయం, కొత్త మోడళ్ల ఆవిష్కరణ, విస్తృత ప్రచారంతో అమ్మకాలు పెంచుకోవాలని ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల కంపెనీలు యోచిస్తున్నాయి. ప్రస్తుత పండుగల సమయంలో అమ్మకాలు గతేడాది స్థాయిలోనే ఉండొచ్చు. కాకపోతే ఈ ఏడాది ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నాం. వీటి అమ్మకాలు 30% పెరగొచ్చు. కాకపోతే మాస్ విభాగం (తక్కువ ధరల ఉత్పత్తులు) ఒత్తిడిని ఎదుర్కొనవచ్చు. ఈ ఏడాది ఆరంభం నుంచి ద్రవ్యోల్బణ ప్రభావం కొనసాగుతోంది. దీంతో విచక్షణారహిత వినియోగంపై ఒత్తిడి నెలకొంది. రుతుపవనాల్లో వ్యత్యాసం, కొన్ని రాష్ట్రాల్లో సరైన వర్షాలు కురవకపోవడం వ్యవసాయ ఆదాయాన్ని ప్రభావితం చేస్తుంది. ఇవి మాస్ ఉత్పత్తుల అమ్మకాలపై ప్రభావం పడేలా చేస్తాయి. కనుక ఈ విభాగంలో అమ్మకాలు ఏమంత మెరుగ్గా ఉంటాయని భావించడం లేదు’’అని గోద్రేజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది వివరించారు. -
నకిలీ విక్రేతలపై టీటీకే ప్రెస్టీజీ కఠిన చర్యలు
హైదరాబాద్: ప్రెస్టీజీ బ్రాండు పేరుతో నకిలీ ఉపకరణాలు అమ్ముతున్న విక్రేతలపై టీటీకే ప్రెస్టీజీ చట్టపరమైన చర్యలు చేపట్టింది. తెలుగు రాష్ట్రాల్లో బ్రాండ్‌ను దురి్వనియోగం చేస్తూ మోసాలకు పాల్పడుతున్న కొందరు విక్రేతలపై ఫిర్యాదు దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో శివసాయి కేంద్రం, తెలంగాణలో బెథల్ ఇండస్ట్రీస్‌పై ఫిర్యాదు చేసింది. ఈ రెండు కేసుల్లోనూ తక్షణం స్పందించిన పోలీసులు నకిలీ వస్తువులను స్వా«దీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. ‘టీటీకే బ్రాండ్ విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. నకిలీలపై ఏమాత్రం అనుమానం ఉన్నా వెంటనే మా దృష్టికి తీసుకురావాలి’ అని సంస్థ ఒక ప్రకటనలో కోరింది. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్ వచ్చేస్తోంది: ఫోన్లు, గృహోపకరణాలపై ఆఫర్లే ఆఫర్లు
Flipkart Big Saving Days Sale: ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరోసేల్‌ను ప్రకటించింది. ఇండిపెండెన్స్‌డే సేల్కంటే ముందు ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ షురూ చేయ నుంది. ఆగస్టు 4 నుంచి 9వ తేదీవరకు నిర్వహించే ఈసేల్‌లో స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై తగ్గింపు ధరలను అందించనుంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ తరువాత కస్టమర్లను ఆకట్టుకునేందు భారీ తగ్గింపులను ప్రకటించనుంది.డిస్కౌంట్లపై అదనపు వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ముఖ్యంగా యాపిల్ ఐఫోన్, శాంసంగ్ తదితర టాప్ దిగ్గజ కంపెనీల స్మార్ట్ఫోన్లపై భారీ డీల్స్‌ను అందించనుంది. ఐఫోన్ 14, ఐఫోన్ 11 తగ్గింపు ధరలకు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం,ఇవి రూ. 68,999 రూ. 41,999కి జాబితా చేయగా, జనాదరణ పొందిన 5జీ స్మార్ట్ఫోన్లపై గణనీయమైన ధరల తగ్గింపు సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, రాబోయే సేల్‌లో ఎక్కువ తగ్గింపులను అందిస్తుందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. (Today August 2nd gold price గుడ్ న్యూస్: దిగొస్తున్న పసిడి, వెండి ధరలు) అదేవిధంగా పిక్సెల్ 6ఏ, శాసంగ్ జెడ్ ఫ్లిప్ 3, గూగుల్, నథింగ్, పోకో, ఒప్పో, వివో, రియల్మీ వంటి అనేక ఇతర స్మార్ట్ఫోన్లు కూడా ధర తగ్గింపులను అందుకోనున్నాయి. దీంతోపాటు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కస్టమర్లు ఐదు శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆశించవచ్చు.ఐసీఐసీఐ, కోటక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ ఈఎంఐపై గరిష్టంగా 4,500 తక్షణ తగ్గింపు లభిస్తుంది. (రూ. 26,399కే యాపిల్ ఐఫోన్14: ఎలా?) అలాగే ఫ్యాషన్‌తోపాటు టీవీలు, ఉపకరణాలు, ఆహారం, పానీయాలు, క్రీడలు & ఫిట్నెస్, కారు & బైక్ ఉపకరణాలు, బేబీ కేర్ ప్రొడక్ట్స్ తదితరాలపై 60 శాతం వరకు భారీ తగ్గింపు పొందవచ్చు . ఇంకా బైక్‌లు & స్కూటర్లు (ఎలక్ట్రిక్ స్కూటర్లతో సహా) రూ.56,500 నుండి ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. టీవీలు, ఇతర గృహోపకరణాలపై 75 శాతం డిస్కౌంట్. స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. -
గృహోపకరణాల విభాగంలోకి ఫినోలెక్స్ కేబుల్స్
హైదరాబాద్: చిన్నపాటి గృహోపకరణాల విభాగంలోకి ఫినోలెక్స్ కేబుల్స్ అడుగు పెట్టింది. ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్ కేబుల్స్‌లో ప్రముఖ సంస్థగా ఉన్న ఫినోలెక్స్.. క్రీజ్ ఫ్రీ ఐరన్ శ్రేణిని (ఇస్త్రీ పెట్టె) విడుదల చేసింది. 750 వాట్ నుంచి 1600వాట్ సామర్థ్యంతో డ్రై, స్టీమ్ ఐరన్ బాక్స్‌లను తీసుకొచ్చింది. అందుబాటు ధరకే, దీర్ఘకాలం పాటు మన్నే ఉత్పత్తులను కస్టమర్లకు అందించాలన్న లక్ష్యంలో భాగమే నూతన శ్రేణి ఉత్పత్తుల విభాగంలోకి ప్రవేశించడమని సంస్థ తెలిపింది. 25వేలకు పైగా అవుట్లెట్లలో ఇవి లభిస్తాయని, వచ్చే ఏడాది కాలంలో లక్ష స్టోర్లలో దేశవ్యాప్తంగా విక్రయానికి అందుబాటులో ఉంచుతామని ఫినోలెక్స్ కేబుల్స్ ప్రకటించింది. చదవండి భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపు, అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్‌కు భారీ షాక్! -
‘ప్రీమియం ఉత్పత్తులకు’ సై!
న్యూఢిల్లీ: పండుగల విక్రయాలు జోరుగా సాగాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ కంపెనీల అంచనాలను మించి అమ్మకాలు నమోదయ్యాయి. ముఖ్యంగా ప్రీమియం (ఖరీదైన), మధ్య శ్రేణి ఉత్పత్తులకు ఎక్కువ డిమాండ్ కనిపించింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు విక్రయాలకు అడ్డుపడకపోవడం వాటిని ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఈ ఏడాది పండుగల సీజన్లో విక్రయాలు విలువ పరంగా 30 శాతం, సంఖ్యా పరంగా 20 శాతం వృద్ధిని చూసినట్టు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అప్లయన్సెస్ తయారీదారుల సంఘం (సీఈఏఎంఏ) ప్రకటించింది. ‘‘ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలు మంచిగా సాగాయి. మధ్యశ్రేణి నుంచి ఖరీదైన ఉత్పత్తుల వరకే చూస్తే అమ్మకాల్లో 30 శాతం, విలువలో 40–50 శాతం వృద్ధి నమోదైంది. ముఖ్యంగా పండుగల చివరి మూడు రోజుల్లో ఎక్కువ డిమాండ్ కనిపించింది’’అని సీఈఏఎంఏ ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ తెలిపారు. కానీ, ఆరంభ ధరల్లోని ఉత్పత్తుల అమ్మకాలు ఈ పండుగల సీజన్లో 10–15 శాతం తగ్గినట్టు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒత్తిళ్లు ఒక కారణం అయితే, కొందరు వినియోగదారులు ఆరంభ స్థాయి నుంచి తదుపరి గ్రేడ్ ఉత్పత్తులకు మారిపోవడం మరో కారణమని వివరించారు. ఖరీదైన వాటికి ఆదరణ.. ఖరీదైన గృహోపకరణాలకు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ప్యానాసోనిక్ మార్కెటింగ్ ఇండియా ఎండీ ఫుమియసు ఫుజిమోరి తెలిపారు. ఈ పండుగ సీజన్లో ఏసీలు, పెద్ద తెరల టీవీలు, హోమ్ అప్లయన్సెస్ విక్రయాలు డబులు డిజిట్లో పెరుగుతాయన్న అంచనాతో ఉన్నట్టు చెప్పారు. ‘‘విలువ పరంగా చూస్తే ఇన్వెస్టర్ ఏసీల అమ్మకాల్లో 38 శాతం వృద్ధి నమోదైంది. ఎల్ఈడీ టీవీల అమ్మకాలు 10 శాతం పెరిగాయి. 4కే టీవీల అమ్మకాల్లో అయితే ఏకగా 34 శాతం వృద్ధి కనిపించింది. టాప్లోడ్ వాషింగ్ మెషిన్లలో 13 శాతం అధిక వృద్ధి నమోదైంది’’అని ఫుజిమోరి వివరించారు. విద్యుత్‌ను ఆదా చేసే ఏసీలు, వినియోగం సులభంగా ఉండే ఉత్పత్తులకు కస్టమర్లు ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. ఈ వృద్ధి ఇలాగే స్థిరంగా కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ త్రైమాసికంలో అధిక వృద్ధి ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ హెచ్‌యూఎల్ ఎండీ సంజీవ్ మెహతా స్పందిస్తూ.. సెప్టెంబర్ త్రైమాసికంలో విక్రయాలు ఇటీవలి కాలంలోనే ఎక్కువగా నమోదైనట్టు చెప్పారు. దీపావళి తర్వాత విక్రయాల తీరును కూడా గమనించాల్సి ఉంటుందన్నారు. తక్కువ ధరల వాటితో పోలిస్తే ప్రీమియం ఉత్పత్తులకు మంచి ఆదరణ ఉన్నట్టు చెప్పారు. ‘‘ప్రీమియం బ్రాండ్ల అమ్మకాలు పాపులర్ బ్రాండ్ల కంటే మించి ఉన్నాయి. అలాగే, చౌక ఉత్పత్తులతో పోలిస్తే పాపులర్ ఉత్పత్తుల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి’’అని సంజీవ్ మెహతా వివరించారు. ప్రీమియం విభాగంలో వృద్ధి ఎక్కువగా ఉండడం ప్రజల వద్ద ఖర్చు పెట్టే ఆదాయం పెరిగిందనడానికి సూచనగా పేర్కొన్నారు. -
భారత్‌లో తొలిసారి, కొత్త వాషింగ్ మెషీన్ వచ్చిందోచ్.. నోటితో చెప్తే ఉతికేస్తుంది!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఎలక్ట్రానిక్ డివైజ్‌లలో బోలెడు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన డివైజ్‌లు, మిషీన్లు మరో ఏడాదికల్లా అదనపు ఫీచర్లతో కస్టమర్లను పలకరిస్తున్నాయి. తాజాగా టచ్ ప్యానెల్, వాయిస్ కంట్రోల్‌తో ఫ్రంట్‌లోడ్ వాషింగ్ మెషీన్ (Washing Machine) మార్కెట్లోకి వచ్చేసింది. ఈ తరహా టెక్నాలజీతో రావడం భారత్‌లో ఇదే తొలిసారి. ఈ వాషింగ్ మెషీన్‌ను హోమ్ అప్లయెన్సెస్, కన్జ్యుమర్ ఎలక్ట్రానిక్ సంస్థ హయర్(Haier) విడుదల చేసింది. ప్రత్యేకంగా ఇందులో ఏఐ డైనమిక్ బ్యాలన్స్ సిస్టమ్, ఇన్‌బిల్ట్ వాయిస్ కంట్రోల్, డైరెక్ట్ మోషన్ మోటర్ వంటి అత్యాధునిక ఫీచర్లు కలిగి ఉంది. డైరెక్ట మోషన్ మోటార్ అదిరిపోయే ఫీచర్లు కొత్త వాషింగ్ మెషీన్లో ఇంటిగ్రేటెడ్ డైరెక్ట్ మోషన్ మోటార్ ఉంది. ఇది గణనీయంగా మెషిన్ వైబ్రేషన్‌ని తగ్గిస్తుంది, తద్వారా మిషన్ సౌండ్ లేకుండా పని చేస్తుంది. అంతేకాకుండా ఈ ఫీచర్ మెషీన్ లైఫ్టైంను కూడా పెంచుతుంది. ఇందులో 30పైగా వాషింగ్ ప్రోగ్రామ్‌లతో డిజైన్ చేయబడింది. పాటు వివిధ రకాల బట్టలను సునాయాసంగా వాష్ చేసేస్తుంది. అదనంగా హై-ఎఫిషియన్సీ ABT (యాంటీ బాక్టీరియల్ టెక్నాలజీ) ఉంది. ఇందులోని డిటర్జెంట్ డిస్పెన్సర్‌ను శుభ్రంగా ఉంచుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ టెక్నాలజీ డ్యూయల్ స్ప్రే టెక్నాలజీ, బ్యాక్టీరియా, అలెర్జీ కారకాలను సమర్థవంతంగా తొలగించే పూరిస్టీమ్ ఫీచర్ కూడా ఉంది. అంతేకాకుండా కస్టమర్లు ఇంట్లో ఎక్కడ నుంచైనా ఇచ్చే ఆదేశాలతో ఈ వాషింగ్ మెషీన్‌ను కంట్రోల్ చేయవచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. మార్కెట్లో 10కేజీల దీని ధర రూ.96వేల వరకు ఉంది. చదవండి: టాటా టియాగో ఈవీకి రెస్పాన్స్ అదిరింది.. రికార్డ్ బుకింగ్స్‌తో షాకైన కంపెనీ! -
పండుగ విక్రయాలపై భారీ ఆశలు
న్యూఢిల్లీ: గృహోపకరణాలు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కంపెనీలు ఈ విడత పండుగల విక్రయాలపై మంచి సానుకూల అంచనాలతో ఉన్నాయి. దీపావళి వరకు కొనసాగే పండుగల కాలంలో విక్రయాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 35 శాతం మేర పెరుగుతాయని లెక్కలు వేసుకుంటున్నాయి. ప్రీమియం ఉత్పత్తులకు డిమాండ్ పెరగడాన్ని సానుకూలంగా చూస్తున్నాయి. అయితే, కొన్ని కంపెనీలు మాత్రం అప్రమత్త ధోరణితో ఉన్నాయి. ప్యానాసోనిక్, ఎల్జీ సోనీ, శామ్సంగ్, హయ్యర్, గోద్రేజ్ అప్లయన్సెస్, వోల్టాస్, థామ్సన్, బీఎస్‌హెచ్ హోమ్ అప్లయన్సెస్ క్రితం ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది విక్రయాలపై మంచి ఆశలే పెట్టుకున్నాయి. క్రితం ఏడాది విక్రయాలపై కరెనా రెండో విడత తదనంతర పరిణామాలు ప్రభావం చూపించడం గమనార్హం. కంపెనీల ఏడాది పాటు విక్రయాల్లో 35 శాతం వరకు ఓనమ్ నుంచి దీపావళి మధ్యే నమోదవుతుంటాయి. ఈ విడత పండుగల సీజన్లో రూ.75,000 కోట్ల విక్రయాలు నమోదు కావచ్చని పరిశ్రమ అంచనా వేస్తోంది. పథకాలు, ఆఫర్లు.. పండుగల సమయాల్లో విక్రయాలు పెంచుకునేందుకు అప్లయన్సెస్ కంపెనీలు మంచి ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే ఎక్కువ కాలం పాటు వారంటీ, సులభంగా చెల్లించే ఈఎంఐ పథకాలను ఆఫర్ చేస్తున్నాయి. చిన్న పట్టణాల నుంచి ఆరంభ స్థాయి మాస్ ఉత్పత్తుల విక్రయాల విషయంలో కంపెనీలు కొంత ఆందోళనతోఉన్నాయి. ఎందుకంటే ఇంకా చిన్న పట్టణాల్లో విచక్షణారహిత వినియోగం పుంజుకోలేదు. అలాగే, దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో వర్షపాత లోటు నెలకొనడం, ఉత్పత్తుల ధరలను 7–8 శాతం మేర పెంచడం విక్రయాలపై ప్రభావం చూపుతుందా? అని కంపెనీలు సందేహంతో ఉన్నాయి. బెడిసి కొట్టదుగా..? ‘‘వర్షపాతం దేశవ్యాప్తంగా ఎలా నమోదైందన్నది వినియోగదారుల సెంటిమెంట్‌పై ప్రభావం చూపిస్తుంది. ప్రీమియం ఉత్పత్తుల విభాగం ఎప్పటి మాదిరే మంచి వృద్ధిని చూస్తోంది. కానీ, మాస్ (తక్కువ, మధ్య స్థాయి) ఉత్పత్తుల అమ్మకాలపైనే మాలో ఆందోళన ఉంది’’అని గోద్రేజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది తెలిపారు. ఈ పండుగల సీజన్లో స్మార్ట్ ఏసీలు, పెద్ద సైజు తెరల టీవీలు, గృహోపరణాలు డబుల్ డిజిట్ విక్రయాలను నమోదు చేస్తాయని అంచనా వేస్తున్నట్టు ప్యానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా చైర్మన్ మనీష్ శర్మ పేర్కొన్నారు. వినియోగదారులు నేడు తమ ఎంపికల విషయంలో స్పృహతో వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. వినియోగ డిమాండ్ పుంజుకుంటుందని, పండుగల విక్రయాలు పెరుగుతాయని భావిస్తున్నట్టు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ తయారీదారుల సంఘం ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ తెలిపారు. పండుగల విక్రయాలు ఇప్పటికే జోరుగా సాగుతున్నట్టు సోనీ ఇండియా ఎండీ సునీల్ నాయర్ వెల్లడించారు. ఎల్జీ ఇండియా పండుగల డిమాండ్‌కు అనుకూలంగా మలుచుకుని, విక్రయాలు పెంచుకునేందుకు కొన్ని కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది. కరోనా ముందుకంటే అధిక విక్రయాలను నమోదు చేస్తామన్న నమ్మకాన్ని ఎల్జీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దీపక్ బన్సాల్ వ్యక్తం చేశారు. పండుగల విక్రయాలు ఓనమ్, వినాయక చవితి సందర్భంగా సానుకూలంగా ఉన్నట్టు శామ్సంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోహన్‌దీప్ సింగ్ తెలిపారు. 55 అంగుళాలు అంతకుమించి సైజు టీవీలు, 300కు పైగా లీటర్ల సామర్థ్యం ఉన్న రిఫ్రిజిరేటర్లు, 8కేజీలు, అంతకంటే పెద్ద వాషింగ్ మెషిన్లకు డిమాండ్ ఉన్నట్టు చెప్పారు. -
కేక్‌లతో పాటు.. బ్రెడ్స్, బన్స్.. బేక్ చేయొచ్చు! దీని ధర ఎంతంటే!
అకేషన్ ఏదైనా.. లొకేషన్ ఎక్కడైనా.. సెలబ్రేషన్ అనగానే కేక్ ఉండాల్సిందే. ఆ కేక్స్‌ని నచ్చే ఫ్లేవర్స్‌లో హాట్‌హాట్‌గా తయారు చేసిపెడుతుందీ ఎలక్ట్రిక్ కేక్ మేకర్. ఇందులో కేవలం కేక్సే కాదు.. బ్రెడ్స్, బన్స్, కప్‌కేక్స్.. ఇలా చాలా రకాలను బేక్ చేసుకోవచ్చు. దీంట్లో బేక్, గ్రిల్ వంటి ఆప్షన్స్‌తో పాటు.. లో–గ్లూటెన్ ఫ్రీ కేక్, సుగర్ ఫ్రీ కేక్, ఫ్రూట్ కేక్ వంటివీ బేక్ చేసుకోవడానికి రెసిపీ బుక్ కూడా లభిస్తుంది. డివైజ్‌కి సరిపడే.. బ్లాక్ కలర్ పాత్ర, దానికి తగ్గ మూత ఉంటాయి. ఆ పాత్ర అడుగున.. గరిటెలాంటి పరికరం బిగించి ఉంటుంది. దాంతో కేక్స్ మాత్రమే కాదు.. ఫ్రైలు, కూరలనూ వండుకోవచ్చు. -ధర 189 డాలర్లు (రూ.14,946) చదవండి: 1 Pot Multi Cooker: నాన్‌స్టిక్ మినీ ఓవెన్.. ధర రూ.12,034..! ‘క్రీస్ కప్స్’.. కాఫీతోనే కప్పులు తయారీ..! -
ఎగబడి కొంటున్న జనం.. మూడు సార్లు ధరలు పెంచినా, రికార్డు స్థాయి అమ్మకాలు!
ఈ ప్రపంచంలో ప్రతీది ఇంటర్ లింక్, ఒకదాని ప్రభావం మరోకదానిపై చూపిస్తుంది. ఈ మాట ఓ సినిమాలోని డైలాగ్. సరిగ్గా అలాంటిదే ఏసీ విక్రయాల విషయంలో జరిగింది. ఈ ఏడాది పెరిగిన ఎండల తీవ్రత ఏసీల విక్రయాలపై ప్రభావం చూపింది. ఎంతలా అంటే గత ఆరు నెలల్లో మూడు సార్లు ధరలు పెంచినా.. అవేవి ప్రజలు పట్టించుకోకుండా ఏసీలను కొనుగోలు చేశారు. దీంతో ఈ ఏడాది ప్రథమార్థంలో సూమారు 60 లక్షలు ఏసీలు దేశవ్యాప్తంగా అమ్ముడయ్యాయి. చదవండి: Netflix Subscription: మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన నెట్‌ఫ్లిక్స్.. తక్కువ ధరలకే కొత్త ప్లాన్! వోల్టాస్ కంపెనీ(Voltas) దాదాపు 1.2 మిలియన్ యూనిట్ల రెసిడెన్షియల్ ఏసీలను విక్రయించగా, ఎల్జీ(LG) ఎలక్ట్రానిక్ ఇండియా ఒక మిలియన్ యూనిట్లకు పైగా రెసిడెన్షియల్ ఇన్వర్టర్ ఎయిర్ కండీషనర్లను విక్రయించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. కాగా జనవరి-జూన్ కాలంలో ఎల్జీ సంస్థ ఏసీ విభాగం నుంచి ₹4,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. హిటాచీ, డైకిన్, పానాసోనిక్, హైయర్ వంటి ఇతర ఎయిర్ కండీషనర్ తయారీదారులు కూడా తమ యూనిట్ అమ్మకాలలో ఇదే జోరు కొనసాగినట్లు చెప్పారు. ద్వితీయార్ధంలో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని వారు భావిస్తున్నారు. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (CEAMA) ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా మాట్లాడుతూ.. ఈ ఏడాది అమ్మకాల పరంగా మొదటి భాగం అద్భుతంగా ఉందన్నారు. జనవరి నుంచి జూన్ వరకు ఏసీ(AC) మార్కెట్ (దేశీయ) 6 మిలియన్ యూనిట్లకు అమ్ముడయ్యాయని తెలిపారు. గతంలో ఈ స్థాయిలో అమ్మకాలు లేవని, రెండవ సగం దాదాపు 2.5 మిలియన్ యూనిట్ల విక్రయాలు జరుగుతాయని భావిస్తున్నట్లు చెప్పారు. చదవండి: Google Play Store: 8 యాప్‌లను డిలీట్ చేసిన గూగుల్.. మీరు చేయకపోతే డేంజరే! -
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్: భారీ డిస్కౌంట్స్
సాక్షి, ముంబై: ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఈ ఏడాది కూడా బిగ్ బచత్ ధమాల్ సేల్‌ను ప్రారంభించింది. జూలై 1 నుంచి 3వ తేదీ వరకు ఈ ధమాకా సేల్ కొనసాగనుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. దీంతోపాటు ఫోన్ ఉపకరణాలు, ల్యాప్‌టాప్‌లు, గాడ్జెట్లు, దుస్తులు, గృహోపకరణాలను కూడా తగ్గింపు ధరల్లో అందిస్తోంది. భారీ తగ్గింపులతో పాటు, తన కస్టమర్లకు నోకాస్ట్ ఈఎంఐ, ఉచిత డెలివరీ కూడా ఉంది. అలాగే వినియోగదారుల షాపింగ్ సౌలభ్యం కోసం, ఫ్లిప్‌కార్ట్ కొత్త పేజీని సృష్టించింది. ఈజీగా ఇక్కడ పూర్తి సమాచారాన్ని పొందొచ్చు. వివో ఎక్స్ 70 ప్రో: 8జీబీ ర్యామ్, 128 స్టోరేజ్ వేరియంట్ రూ.46,990. అందమైన ఫోటోలకు కేరాఫ్ ఎడ్రస్ ఈ ఫోన్. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు ఇన్-బిల్ట్ గింబల్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అందిస్తుంది. మోటరోలా ఎడ్జ్ 20 ప్రొ 5జీ: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో ఈ మొబైల్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,999కి అందుబాటులో ఉంది. దీనివాస్తవ ధర 45,999. స్మార్ట్‌ఫోన్‌లో 108+16 +8ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరాతో లభ్యమవుతున్న ఈ ఫోన్ ఫోటోలంటే ఇష్టపడే వారికి కూడా ఇది మంచి ఆప్షన్. పోకో 5జీ ప్రొ: బడ్జెట్ ధరలో లభించే 5జీ స్మార్ట్‌ఫోన్. 6 జీబీ వేరియంట్ ధర 14,499లకే లభ్యం. దీని అసలు ధర 16,499. ఐఫోన్ 12 మినీ: ఐఫోన్ 12 మినీ 128 జీబీ స్టోరేజ్ మోడల్ ఈ సేల్‌లో రూ. 49,999కి అందుబాటులో ఉంది. దీని వాస్తవ ధర 59,900. ఐఫోన్ 13 లాంటి ఇతర ఆపిల్ ఫోన్లపై డిస్కౌంట్లు ఉన్నాయి. పోకో ఎఫ్4 5జీ: పోకో లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ పోకో ఎఫ్4 5జీ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.27,999కి అందుబాటులో ఉంది. దీంతోపాటు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే, అదనంగా 3 వేల తగ్గింపు లభిస్తుంది. -
టీవీలు,గృహోపకరణాలపై శాంసంగ్ మరో కీలక నిర్ణయం!
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే ఫీచర్ ఫోన్లు, గెలాక్సీ ఎఫ్ఈ స్మార్ట్ ఫోన్ల తయారీ నిలిపివేసింది. అయితే తాజాగా టీవీలు, హోం అప్లయన్సెస్‌ల తయారీని తగ్గిస్తున్నట్లు తేలింది. వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ఆధారంగా..జాతీయ అంతర్జాతీయ పరిణామాలు, తగ్గుతున్న కన్జ్యూమర్ డిమాండ్లతో పాటు ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కారణంగా ఆయా ప్రొడక్ట్‌ల అమ్మకాలు తగ్గినట్లు తెలుస్తోంది. అందుకే ప్రొడక్షన్ తగ్గించి, ఉన్న వాటిని అమ్మేందుకు సిద్ధమైంది. After phones, #SouthKorean tech giant #Samsung (@Samsung ) is now reportedly reducing the production of its #TVs and home appliances. pic.twitter.com/xAgpIDiRgx — IANS (@ians_india) June 26, 2022 సాధారణంగా ఏదైనా సంస్థ మార్కెట్లో అమ్మే వస్తువు వారం లేదా రెండు వారాల్లో అమ్ముడు పోతుంది. కానీ ఈ ఏడాది క్యూ2లో నెలలు గడుస్తున్నా శాంసంగ్‌కు చెందిన వస్తువులు అమ్ముడు పోవడం లేదని, గతేడాది ఇదే క్యూ2లో ఏ వస్తువైనా అలా అమ్మకానికి పెట్టిన రెండు వారాల్లో అమ్ముడు పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రొడక్ట్‌ల ధరలు ఎక్కువగా ఉండడం, ఆర్ధిక మాధ్యం, ఇతర కారణాల వల్ల కొనుగోలు దారులు ప్రొడక్ట్‌లపై ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసేందుకు ఇష్టపడడం లేదు. దీంతో తయారు చేసిన ప్రొడక్ట్‌లు అమ్ముడు పోక మిగిలిపోతున్నాయి. వాటిని సేల్ చేసేందుకు తయారీలో శాంసంగ్ పరిమితి విధిస్తూ నిర్ణయించుకున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. -
Gorilla Fan: ఈ ఫ్యాన్‌తో కరెంటు బిల్లు తక్కువ! అందుకే ఇలా!
‘ఫ్యాన్ కంపెనీ స్టార్టప్ మొదలుపెట్టాలనుకుంటున్నాను’ అని మనోజ్ మీనా తన ఆలోచనను చెబితే నవ్వి తేలికగా తీసుకున్నవారే తప్ప భుజం తట్టినవారు తక్కువ. ‘ఇప్పటికే మార్కెట్లో బోలెడు ఫ్యాన్ కంపెనీలు ఉన్నాయి. ఇక పెద్ద కంపెనీల సంగతి సరే సరే. వాటిని వదిలి మీ ఫ్యాన్ కోసం జనాలు వస్తారా?’ అడిగాడు ఒక మిత్రుడు. నిజమే మరీ...బోలెడు పోటీ! ఇలాంటి సమయంలోనే ‘మా ప్రత్యేకత ఏమిటి?’ అనే ప్రశ్న ముందుకు వస్తుంది. అయితే వారి ప్రత్యేకతే కంపెనీ విజయానికి బాటలు వేసింది. మనోజ్ మీనా, శిబబ్రత్దాస్లు ఐఐటీ, బాంబే గ్రాడ్యూయెట్స్. మనోజ్ మీనా ఫౌండర్‌గా ‘ఆటంబెర్గ్ టెక్నాజీస్’ మొదలైంది. తరువాత దాస్ కో–ఫౌండర్‌గా చేరాడు. ఇద్దరికీ కాలేజిరోజుల నుంచి ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ అంటే ఇష్టం. దీనికి సంబంధించిన కార్యక్రమాలు, పోటీలలో ఉత్సాహంగా పాల్గొనేవారు. ఆటంబెర్గ్ టెక్నాజీస్ వారి ‘గొరిల్లా ఫ్యాన్’ విజయవంతం కావడానికి కారణం... సంప్రదాయ సీలింగ్ ఫ్యాన్లతో పోల్చితే ఇవి ఇంధనాన్ని ఆదా చేస్తాయి. కరెంటు బిల్లు బరువును తగ్గిస్తాయి. ఈ ఫ్యాన్‌ను ఆన్ చేయాలన్నా, ఆఫ్ చేయాలన్నా, స్పీడ్ తగ్గించాలన్నా, పెంచాలన్నా గోడకు ఉన్న స్విచ్ దాకా వెళ్లనక్కర్లేదు. చేతిలో ఉన్న స్మార్ట్ రిమోట్‌తో చేయవచ్చు. సామాన్యుడికి ఇంతకంటే కావాల్సింది ఏమిటి! సామాన్యులే కాదు ఈ ఫ్యాన్లను ఇన్ఫోసిస్, ఆదిత్య బిర్లా గ్రూప్...లాంటి పెద్ద కంపెనీలు కొనుగోలు చేయడం విశేషం. బంగ్లాదేశ్, నైజీరియా...మొదలైన దేశాలకు గొరిల్లా ఫ్యాన్లు ఎగుమతి అవుతున్నాయి. ఈ మేడిన్–ఇండియా కంపెనీ 2017లో నేషనల్ ఎంటర్‌పెన్యూర్‌షిప్ అవార్డ్ గెలుచుకుంది. ఇక్కడితో ఆగిపోలేదు. గ్లోబల్ క్లైమెట్ సాల్వర్ అవార్డ్(వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్) గెలుచుకుంది. గ్లోబల్ క్లీన్టెక్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ విన్నర్‌గా నిలిచింది. ప్రధానమంత్రి నీతి ఆయోగ్ ‘ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్’ గుర్తింపు పొందింది. ఫోర్బ్స్ 30 అండర్ 30 ‘సైన్స్ అండ్ గ్రీన్ టెక్నాలజీ’ విభాగంలో, ఫోర్బ్స్ 30 అండర్ 30 ఏషియా ‘ఇండస్ట్రీ, మాన్యుఫాక్చరింగ్ అండ్ ఎనర్జీ’ విభాగంలో చోటు సంపాదించింది. ‘మార్కెట్ బజ్వర్డ్స్ను గుడ్డిగా ఫాలో కావద్దు. ఉదాహరణకు...ఆటోమేషన్ అనేది మూడు, నాలుగు సంవత్సరాల క్రితం మార్కెట్ బజ్‌వర్డ్. తరువాత ఐవోటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) బజ్‌వర్డ్‌గా మారింది. వాటి వెంట పరుగులు తీసేముందు... వినియోగదారులకు వాటిని ఎలా అందుబాటులోకి తేవాలనేదానిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. సమంజసమైన ధరలలో ప్రాడక్ట్‌ను వినియోగదారులకు చేరువ చేయగలిగితే ఆ ప్రాడక్ట్ మార్కెట్లో బెస్ట్‌సెల్లర్‌గా నిలుస్తుంది’ అంటాడు ‘ఆటంబెర్గ్ టెక్నాలజీస్’ కో–ఫౌండర్ దాస్. ఇక ఇన్వెస్టర్స్ గురించి ఫౌండర్ మనోజ్ మీనా ఇలా అంటాడు... ‘మన కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్టర్స్ ఆసక్తి చూపడం సంతోషించదగిన విషయమే అయినా సరిౖయెన ఇన్వెస్టర్స్‌ను ఎంపిక చేసుకోవడం అనేది ఒక సవాలు’. అయితే ముంబై కేంద్రంగా మొదలైన ‘ఆటంబెర్గ్’ కంపెనీ మొదట్లో అనూహ్యమైన విజయమేమీ సాధించలేదు. మొదటి ఆరు నెలలు జీరోరెవెన్యూ వెక్కిరించింది. మరోవైపు రకరకాల ఆర్థిక ఒత్తిళ్లు. ఇద్దరినీ తీవ్రమైన నిరాశ కమ్మేసింది. ఆ సమయంలో తాత్వికుల మాట ‘ఆగనంత వరకు నీ ప్రయాణం ఎంత నెమ్మదిగా సాగుతుంది అనేది ముఖ్యం కాదు’ పదేపదే గుర్తు తెచ్చుకొని ధైర్యం తెచ్చుకునేవారు. ఆర్ అండ్ బీ, ట్రైనింగ్, ఫండ్ రైజింగ్, భాగస్వాములను వెదుక్కోవడం....ఒక్కటా రెండా, ఎన్నెన్నో విషయాలు తలకు మించిన భారం అయ్యాయి. అయినప్పటికీ భయానికి ఎక్కడా తలవంచలేదు. వారి ఆశ వృథా పోలేదు. మెల్లగా అయినా సరే కంపెనీ వృద్ధిరేటు పెరుగుతూ పోయింది. కూలర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్, ఏసీ...మొదలైన అప్లికేషన్లపై పనిచేస్తున్న ‘ఆటంబెర్గ్’ భవిష్యత్‌లో హౌజ్‌హోల్డ్ కన్జ్యూమర్ అప్లికేషన్లలో అత్యున్నతస్థాయి విజయాలు సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. చదవండి: ఐ యామ్ ఏబుల్.. వైకల్యాన్నే కాదు, మా నైపుణ్యాలనూ చూడండి..! -
టన్నుకు రూ. 5,000 భారం
న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో స్టీల్ ధరలకు మరోసారి రెక్కలు వచ్చాయి. హాట్ రోల్డ్ కాయిల్ (హెచ్ఆర్సీ), టీఎంటీ బార్స్ ధరలను టన్నుకు రూ.5,000 మేర కంపెనీలు పెంచేశాయి. దీంతో హెచ్ఆర్ ధర టన్నుకు రూ.66,000కు చేరగా, టీఎంటీ బార్స్ ధర రూ.65,000కు చేరింది. దీంతో మౌలిక రంగం, రియల్ ఎస్టేట్ ఆటోమొబైల్, గృహోపకరణాలు సహా ఎన్నో రంగాలపై దీని ప్రభావం పడనుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం సరఫరాపై పడడం తాజా ధరల పెరుగుదలకు నేపథ్యంగా ఉంది. గత కొన్ని రోజులుగా ధరలు పెరిగాయని, రానున్న వారాల్లో మరింత పెరగొచ్చని, ఉక్రెయిన్–రష్యా సంక్షోభంపై ఇది ఆధారపడి ఉంటుందని తెలిపాయి. ‘‘అంతర్జాతీయ సరఫరా వ్యవస్థపై యుద్ధ ప్రభావం నెలకొంది. దీంతో ముడి సరుకుల ధరలు పెరిగాయి. కోకింగ్ కోల్ టన్ను 500 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. కొన్ని వారాల క్రితంతో పోలిస్తే ముడి సరుకుల ధరలు 20 శాతం వరకు పెరిగాయి’’ అని పరిశ్రమ ప్రతినిధి ఒకరు తెలిపారు. స్టీల్ తయారీలో ప్రధానంగా వినియోగించే కోకింగ్ కోల్ అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతులే తీరుస్తున్నాయి. యుద్ధం ఆగకపోతే ధరలపై ప్రభావం ‘‘రష్యా, ఉక్రెయిన్ రెండూ కూడా స్టీల్ తయారీ, ఎగుమతి చేస్తున్న దేశాలు. దీనికి అదనంగా ముడి సరుకులైన కోకింగ్ కోల్, సహజ వాయువులను కూడా అవి సరఫరా చేస్తున్నాయి. రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం ముగియకపోతే అది కచ్చితంగా డిమాండ్–సరఫరాపై ప్రభావం చూపిస్తుంది. దాంతో తయారీ వ్యయాలు పెరిగిపోతాయి’’ అని టాటా స్టీల్ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ తెలిపారు. ప్రపంచ స్టీల్ అసోసియేషన్లోనూ నరేంద్రన్ సభ్యుడిగా ఉన్నారు. తాము పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని, తమ కస్టమర్లు, భాగస్వాములపై ప్రభావం పడకుండా అత్యవసర ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. -
వినియోగదారులకు భారీ షాక్, వీటి ధరలు పెరగనున్నాయ్
వినియోగదారులకు గృహోపకరణ సంస్థలు భారీ షాకివవ్వనున్నాయి. జనవరి ఫెస్టివల్ సీజన్ నుంచి మార్చి ఈ మూడు నెలల మధ్య కాలంలో ఫ్రిజ్, ఏసీల ధరలు భారీగా పెంచనున్నాయి. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్ సెస్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ (సీఈఏఎంఏ) ప్రకారం..ముడి సరకుతో పాటు సరుకు రవాణా పెరగడంతో కన్జ్యూమర్ డ్యూరబుల్ ఐటమ్స్‌ను 5 నుంచి 10 శాతం వరకు పెంచేందుకు ఆయా కంపెనీలు వస్తువుల ధరల్ని పెంచేందుకు సిద్ధమయ్యాయి. కమోడిటీస్, గ్లోబల్ ఫ్రైట్, ముడి సరుకు పెరుగుదలతో రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్ కేటగిరీలలో ఉత్పత్తుల ధరలను 3 నుండి 5 శాతం వరకు పెంచడానికి చర్యలు తీసుకున్నామని హైయర్ అప్లయన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ సతీష్ తెలిపారు. ఇప్పటికే ఏసీల ధరలను 8శాతం వరకు పెంచిన పానాసోనిక్, మరింత పెంచే ఆలోచనలో ఉందని, అందుకే గృహోపకరణాల ధరల పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఎయిర్ కండీషనర్లు ఇప్పటికే దాదాపు 8 శాతం పెరిగాయి.పెరుగుతున్న వస్తువులు, సప్లయ్ చైన్ ధరల్ని బట్టి వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, గృహోపకరణాల ధరల పెరగొచ్చని పానాసోనిక్ ఇండియా డివిజనల్ డైరెక్టర్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఫుమియాసు ఫుజిమోరి అన్నారు. కాగా, భారత్‌లో రూ.75 వేల కోట్లున్న ఇండియన్ అప్లయన్స్ మార్కెట్ కోవిడ్ కారణంగా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. లాక్డౌన్, చిప్ కొరతతో పాటు ఉత్పత్తులు తగ్గి పోవడం,అదే సమయంలో డిమాండ్లు పెరగడంతో పలు కంపెనీలు వస్తువుల ధరల్ని పెంచేందుకు సిద్ధమయ్యాయి. చదవండి: 2022 జనవరి 1 నుంచి పెరిగే, తగ్గే వస్తువుల జాబితా ఇదే..! -
కొత్త ఏడాది..కొత్త బాదుడు.. 2022లో సామాన్యుడికి చుక్కలే..!
2021లో అన్ని ధరలు ఆకాశాన్ని తాకాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డిజీల్ ధరలు సెంచరీ దాటేశాయి. ఇంధన ధరల పెంపుతో ఆహార పదార్థాల, ట్రాన్స్పోర్ట్ చార్జీలు పెంపు సామాన్యుల నెత్తి మీద పడ్డాయి. ఈ ఏడాది అధిక ద్రవ్యోల్భణం సామాన్యులకు ఊపిరి ఆడకుండా చేసింది. 2021లో టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్భణం ప్రతినెల పెరుగుతూనే వచ్చింది. గత నెలలో డబ్ల్యూపీఐ ఏకంగా 14.23 శాతంగా నమోదయ్యింది. గడచిన దశాబ్దకాలంలో ఈ స్థాయి ద్రవ్యోల్భణం ఇదే తొలిసారి. ఇక కొత్త ఏడాది రాబోతుంది. వచ్చే ఏడాదిలో కూడా ఆయా ధరలు మరోసారి ఆకాశాన్ని తాకే అవకాశం ఉందని తెలుస్తోంది. ► ఇప్పటికే ఆయా ఆటోమొబైల్ దిగ్గజం కంపెనీలు 2022 వాహనాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.అధిక ఇన్పుట్, లాజిస్టిక్స్ ఖర్చులు అలాగే సరఫరా అంతరాయాలు మార్జిన్లను దెబ్బతీస్తున్నందున, భారత్‌లోని దిగ్గజ తయారీ కంపెనీలు, కన్స్యూమర్ కంపెనీలు రాబోయే ఏడాదిలో మరోసారి ధరల పెంపును పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ► ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ ( ఎఫ్ఎంసిజి ) కంపెనీలు వచ్చే మూడు నెలల్లో ఆయా వస్తువుల ధరలను సుమారు 4-10 శాతం మేర పెంచే అవకాశం ఉంది. గత రెండు త్రైమాసికాల్లో హిందూస్ధాన్ యూనీలివర్, డాబర్, బ్రిటానియా, మారికో ఇతర ఎఫ్ఎమ్సీజీ కంపెనీలు సుమారు 5-12 శాతం మేర ధరలను పెంచాయి. ఒకవేళ ద్రవ్యోల్బణం తగ్గకపోతే, నాల్గవ త్రైమాసికంలో మరో రౌండ్ ధరల పెరుగుదల అనివార్యమని డాబర్ సీఈవో మోహిత్ మల్హోత్రా అన్నారు. ► భారత్‌లో కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ కంపెనీలు ఈ నెలలో రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు , ఎయిర్ కండీషనర్లపై ఇప్పటికే 3-5 శాతం మేర ధరలను పెంచాయి. అయితే వచ్చే ఏడాది నుంచి మరో సారి ధరలను పెంచే అవకాశం ఉంది. సుమారు 6-10 శాతం మేర హోమ్ అప్లియెన్స్ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 2020 నుంచి వైట్ గూడ్స్ ధరల పెరుగుదల ఇది నాల్గోసారి. అధిక ఇన్‌పుడ్ కాస్ట్, చిప్స్ కొరత, సప్లై చైయిన్ రంగాల్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా ధరలు పెరగనున్నాయి. ► గార్మెంట్స్, ఫుట్‌వేర్, టెక్స్టైల్స్ ప్రొడక్ట్‌లపై 5శాతం నుంచి 12శాతం వరకు జీఎస్స్టీను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కొత్తగా వసూలు చేయనున్న జీఎస్టీ జనవరి 1, 2022 నుంచి అమల్లోకి రానుంది. దీంతో బట్టలు, చెప్పులు ఇతర ఉత్పత్తుల ధరలు భారీగా పెరగనున్నాయి. ► దేశంలోని వాహన తయారీదారులు 2022 నుంచి వాహనాల ధరల పెంపును తెలపగా, అవి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణుల భావిస్తున్నారు. మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా, వోక్స్వ్యాగన్, టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకెఎం), హీరో మోటోకార్ప్ వంటి ప్రముఖ వాహన కంపెనీలు ముడి సరుకుల ధరలు పెరగడంతో ఏడాది పొడవునా అనేక సార్లు ధరలను పెంచాయి. ఈ నెల ప్రారంభంలో మారుతీ సుజుకీ కొత్త సంవత్సరంలో వాహనాల ధరలను మళ్లీ పెంచనున్నట్లు తెలిపింది . ఇది గత సంవత్సరంలో కంపెనీ ధరలను పెంచడం నాల్గవది, 18 నెలల్లో ఆరవది. ► ఉత్పాదకతను మెరుగుపరచడానికి కంపెనీలు అంతర్గత చర్యలు తీసుకునప్పటికీ, స్టీల్, రాగి, ప్లాస్టిక్, అల్యూమినియం వంటి ముడి పదార్థాల ధరలలో అపూర్వమైన పెరుగుదల ఉంది. దీంతో వాహనాల పెంపు అనివార్యమైంది. 2022లో సామాన్యులకు మరోసారి గట్టి షాకే తగ్గలనుంది. ఎఫ్ఎమ్సీజీ, వాహనాలు, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉంది. చదవండి: ఎలక్ట్రిక్ వాహనకొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్..! -
Power Saving Tips: ఈ టిప్స్ పాటిస్తే కరెంట్ బిల్లులు తక్కువ రావడం ఖాయం!
Power Saving Tips For House: ఎండా కాలం, చలి కాలం, వానా కాలం.. ఇలా సీజన్లతో సంబంధం లేకుండా కరెంట్ బిల్లులు సామాన్యుడికి గుబులు పుట్టిస్తున్నాయి. ఈమధ్య కాలంలో బిల్లులు ఎక్కువగా వస్తున్నాయంటూ చాలామంది గగ్గోలు పెడుతూ.. కరెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతుండడం చూస్తున్నాం. మరి కరెంట్ వినియోగం కూడా అదే స్థాయిలో ఉంటోంది కదా!. అందుకే ఆదా చేసే మార్గాలు ఉన్నప్పుడు.. కరెంట్ బిల్లులను తగ్గించుకోవడం మన చేతల్లోనే ఉంటుందని గుర్తు చేస్తున్నారు నిపుణులు. పైగా అవి సింపుల్ చిట్కాలే!. వ్యాంపైర్ అప్లియెన్సెస్.. కరెంట్‌ను జలగల్లా పీల్చేస్తాయి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్. కాబట్టే వీటికి వ్యాంపైర్ అని పేరు పెట్టారు. విశేషం ఏంటంటే.. ఆఫ్‌లో ఉన్నా కూడా ఇవి ఎంతో కొంత కరెంట్‌ను లాగేస్తుంటాయి కూడా. సెల్‌ఫోన్ ఛార్జర్ల మొదలు.. వైఫై రూటర్లు, టీవీలు, కంప్యూటర్లు, ఐరన్బాక్స్లు, వాషింగ్‌మెషీన్, ల్యాప్‌ట్యాప్‌లు.. ఇలా ఫ్లగ్గులో ఉండి కూడా ఆఫ్‌లో ఉన్నప్పుడు కరెంట్‌ను తీసుకుంటాయి. అందుకే వినియోగించనప్పుడు వాటిని ఫ్లగ్‌ల నుంచి తొలగించాల్సి ఉంటుంది. ఈరోజుల్లో స్టాండ్‌బై మోడ్ ఆప్షన్‌తో వస్తున్నా.. అవి ఎంతో కొంత వాట్లలో పవర్‌ను లాగేస్తున్నాయి. కాబట్టి, వీటి విషయంలో ఈ చిన్న సలహా పాటిస్తే బెటర్. సంబంధిత కథనం: ఆఫ్ చేసినా ఇవి కరెంట్ లాగేస్తాయని తెలుసా? కెపాసిటీకి తగ్గట్లు.. వాషింగ్ మెషిన్, గ్రీజర్-వాటర్ హీటర్, ఏసీలు.. ఇలా హెవీ అప్లయెన్సెస్ ఏవి వాడినా కరెంట్ బిల్లు ఎక్కువగానే వస్తుంటుంది. కానీ, వాటిని వాడే విధానంలో తేడాల వల్లే బిల్లులు అంతలా వస్తుంటాయని తెలుసా?. కాబట్టి, ఒక పద్దతిలోనే వాటిని వాడాల్సి ఉంటుంది. ఉదాహరణకు వాషింగ్ మెషిన్‌ను ఫుల్ కెపాసిటీతో కాకుండా తక్కువ కెపాసిటీతో ఉపయోగించడం. అంటే తక్కువ బట్టలు వేసి.. రెగ్యులర్‌గా ఉతకడం. దీనివల్ల ఫుల్ కెపాసిటీ టైంలో పడే లోడ్ పడి కరెంట్ ఎక్కువ ఖర్చు అవుతుంది. వాషింగ్ మెషిన్లు మాత్రమే కాదు.. ఏసీలు, హీటర్లు, గ్రీజర్లు.. ఇలా ఏవైనా సరే వాటి లెవల్‌కు తగ్గట్లుగా స్మార్ట్‌గా ఉపయోగించడం వల్ల కరెంట్ బిల్లులను తగ్గించుకున్న వాళ్లు అవుతాం. ఇక కొత్తగా అప్లియెన్సెస్ కొనాలనుకుంటే.. వాటి రేటింగ్‌ను పరిగణనలోకి తీసుకోవడం అస్సలు మరవద్దు. తద్వారా కరెంట్ కన్జంప్షన్ తగ్గుతుంది. కరెంట్ సేవింగ్‌లో ఇదే ముఖ్యం బల్బులు, సీలింగ్ ఫ్యాన్లు ఇంటి ప్రాథమిక అవసరాలు. అలాగే కరెంట్ బిల్లుల విషయంలో వీటి భాగస్వామ్యం కూడా ఎక్కువే!. చివరికి కరెంట్ తక్కువ లాగుతాయనుకునే.. సీఎల్ఎఫ్, ఎల్ఈడీ బల్బులు సైతం ఆఫ్ కరెంట్‌ను ఎక్కువే తీసుకుంటాయి. కాబట్టి, అవసరం లేనప్పుడు వాటిని ఆఫ్ చేయడం, తక్కువ స్పేస్‌లో పని చేస్తున్నప్పుడు ఫోర్టబుల్ ల్యాంపులు, స్టడీ ల్యాంపులు ఉపయోగించడం బెటర్. పాతవి ఎక్కువే.. పాత అప్లియెన్సెస్.. కొత్తగా వస్తున్నవాటికన్నా ఎక్కువ ఎనర్జీని లాగేస్తాయి. అందుకు కారణం.. ఆప్టియం ఏజ్. అంటే కాలం చెల్లడంలాంటిదన్నమాట. అందుకే పాత అప్లియెన్సెస్‌ను మార్చేసి.. మంచి రేటింగ్ ఉన్న అప్లియెన్సెస్‌ను ఉపయోగించాలి. మాటిమాటికీ అక్కర్లేదు.. మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, దోమల బ్యాట్లు, ఛార్జింగ్ లైట్లు.. అవసరం లేకున్నా ఛార్జింగ్ పెట్టడం కొందరికి ఉండే అలవాటు. ముఖ్యంగా సెల్‌ఫోన్ ఛార్జింగ్‌ల విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ, దీనివల్ల కరెంట్ అడ్డగోలుగా కాలుతుంది. అందుకే అత్యవసం అయితేనే ఛార్జింగ్ పెట్టాలి. అవసరం లేనప్పుడు ఫ్లగ్‌ల నుంచి ఛార్జర్లను తొలగించాలి మరిచిపోవద్దు. కరెంట్ బిల్లులు మోగిపోవడానికి, మీటర్ గిర్రున తిరగడం ఒక్కటే కారణం కాదు. ఎంత ఉపయోగిస్తున్నామనేది మన చేతుల్లోనే ఉంటుంది. కానీ, చిన్న చిన్న జాగ్రత్తలు, టిప్స్ పాటిస్తూ కరెంట్‌ను ఆదా చేయడంతో పాటు జేబుకు చిల్లుపడకుండా చూసుకోవచ్చు. -
ఈ ఎలక్ట్రిక్ గాడ్జెట్ బార్బెక్యూ స్టైల్లో వండిపెడుతుంది..
ఉద్ధేశ్యపూర్వకంగా ఆహారాన్ని వృద్ధా చేయడం ఎవరికీ మనస్కరించదు. కాని కొన్ని సార్లు ప్యాకెట్లు కట్ చేశాక తిరిగి ఉపయోగించుకోలేం. ఈ ఎలక్ట్రిక్ పరికరాలు అవసరాన్ని బట్టి ప్యాకెట్‌ని కట్ చేస్తాయి. బార్బెక్యూ స్టైల్లో వండి వార్చెస్తాయి. ఇంకా ఎన్నో.. సరసమైన ధరల్లోనే.. కట్టర్ – సీలర్ ఈ రోజుల్లో పప్పు, ఉప్పు దగ్గర నుంచి స్నాక్స్, మసాలా పౌడర్స్ వరకూ అన్నీ ప్యాకెట్స్‌లోనే లభిస్తున్నాయి. వాటిని ఒక్కసారి కట్ చేస్తే.. ఏదో ఒక మూత ఉన్న బాక్స్‌లో దాచి పెట్టాల్సిందే. లేదంటే పురుగుపట్టడమో, మెత్తపడిపోవడమో, పాడైపోవడమో.. ఇలా ఏదొక సమస్యతో చెత్తబుట్టలో వెయ్యాల్సిన పరిస్థితి. అలాంటి సమస్యని దూరం చేస్తుంది ఈ కట్టర్ – సీలర్. కట్ చేసిన ప్లాస్టిక్ కవర్ని తిరిగి అతికిస్తుంది. లోపలున్నది బయటికి రాకుండా.. బయట గాలి లోపలికి వెళ్లకుండా చేస్తుంది. అవసరాన్ని బట్టి ప్యాకెట్‌ని కట్ చేస్తుంది. దీన్ని పిన్నుల మెషిన్ వాడినట్లుగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ 2 ఇన్ 1 డివైజ్‌కి చార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది.పైన ఉన్న రెగ్యులేటర్‌ని అటు ఇటు తిప్పుతూ సరైన రీతిలో అమర్చుకోవడంతో, కట్టర్‌గా లేదా సీలర్గా ఉపయోగించుకోవచ్చు. దీన్ని అందుబాటులో ఉంచుకోవడానికి వెనుక మ్యాగ్నెట్‌తో పాటు ఒకవైపు చిన్న హ్యాంగర్ బెల్ట్ ఉంటుంది. దాంతో ఇనుప వస్తువుకు అటాచ్ చేసుకోవచ్చు లేదా హ్యాంగర్‌కి తగిలించుకోవచ్చు. ఇవే మోడల్స్‌లో బ్యాటరీతో నడిచేవి కూడా అందుబాటులో ఉన్నాయి. అవి చాలా తక్కువ ధరలోనే దొరుకుతున్నాయి. అయితే చార్జింగ్‌తో నడిచే ఇలాంటి డివైజ్‌కి మన్నిక ఎక్కువగా ఉంటుంది. ధర 28 డాలర్లు (రూ.2,111) ర్యాపిడ్ ఎగ్ కుకర్ కూరల నుంచి కేక్స్ వరకూ వంటకాల్లో గుడ్డు మస్ట్ అంటారు కొందరు. ది బెస్ట్ అంటుంటారు ఇంకొందరు. అలాంటి వారి కోసమే ఈ ర్యాపిడ్ ఎగ్ కుకర్. ఇందులో సుమారు తొమ్మిది గుడ్లను ఒకేసారి ఉడికించుకోవడానికి కుకింగ్ ర్యాక్ ఉంటుంది. అడుగున నీళ్లు పోసుకుని, పైన ఆ ర్యాక్ పెట్టుకుని గుడ్లు ఉడికించుకోవచ్చు. లేదంటే ఐదు గుంతలతో కూడిన ఎగ్ పౌచింగ్ ట్రేలో టేస్టీ ఎగ్ పౌచ్‌లు తయారు చేసుకోవచ్చు. అంతే కాకుండా ఆమ్లెట్స్ వేసుకోవడానికి ఆమ్లెట్ ట్రే అదన ంగా లభిస్తాయి. ఈ డివైజ్ మొత్తం నాణ్యమైన స్టెయిన్లెస్ స్టీల్‌తో రూపొందింది. పౌచింగ్ ట్రే ఒక్కటే నాన్ స్టిక్ మెటీరియల్‌తో తయారైంది. ఇక దీనిపైన మూత కూడా చాలా ప్రత్యేకంగా చూడటానికి క్లాస్ లుక్‌తో ఉంటుంది. ఇందులో 5 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకూ టైమర్ స్విచ్ ఉంటుంది. కుకింగ్ పూర్తి అయిన వెంటనే ఇండికేషన్ లైట్ వెలుగుతుంది. ధర 44 డాలర్లు (రూ.3,302) గ్యాస్ ఓవెన్ గ్రిల్ స్నేహితులతో, బంధువులతో దూరప్రాంతాలకు వెళ్లినప్పుడు.. స్వయం పాకాలే బెటర్ అంటారు చాలామంది. అలాంటి వారికోసమే ఈ గ్యాస్ ఓవెన్ గ్రిల్. దీన్ని ఎక్కడికైనా సులభంగా వెంట తీసుకుని వెళ్లొచ్చు. దీనిపై చికెన్, మటన్, ఫిష్ వంటి నాన్‌వెజ్ ఐటమ్స్‌తో పాటు వెజ్ ఐటమ్స్‌ని కూడా.. బార్బెక్యూ స్టైల్లో రెడీ చేసుకోవచ్చు. దీన్ని ఆన్ చేసిన కొన్ని నిమిషాలకే 400 డిగ్రీల సెన్సియస్ టెంపరేచర్‌కు చేరుకుంటుంది. దీని రేడియేషన్ టెక్నాలజీ చాలా వేగంగా ఎముకులను సైతం మెత్తగా ఉడికించేస్తుంది. దీనిపైన కబాబ్స్, కట్లెట్స్ వంటి వెరైటీలతో పాటు.. పెద్ద పిజ్జాని తయారుచేసుకోవచ్చు. గాడ్జెట్‌కి ముందువైపు టెంపరేచర్ సెట్ చేసుకునే రెగ్యులేటర్ ఉంటుంది. పైన ఏ టెంపరేచర్లో నడుస్తుందో సూచించే ఇండికేటర్ కనిపిస్తుంది. దీని అటాచ్డ్ లిడ్(మూత).. కదలకుండా ఉండేందుకు కుడివైపు లాక్ చేసుకునే వీలుంటుంది. వెనుక వైపు మినీ గ్యాస్ సిలెండర్ పెట్టుకుని కుక్ చేసుకోవచ్చు. ధర 178 డాలర్లు (రూ.13,356) చదవండి: 1.5 లీటర్ల కోల్డ్ డ్రింక్ పది నిముషాల్లో తాగేశాడు.. 18 గంటల్లోనే.. -
ధన్‌తేరస్‌కు గృహోపకరణాల జోరు
న్యూఢిల్లీ: ధన్‌తేరస్‌కు ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల అమ్మకాలు జోరుగా సాగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ధన త్రయోదశికి విక్రయాలు 45 శాతం దాకా పెరిగాయని కంపెనీలు అంటున్నాయి. భారీ తెర గల టీవీలు, ప్రీమియం ఉత్పత్తులతో ఈ పండుగ సీజన్లో అమ్మకాలు మెరుగైన వృద్ధిని సాధిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సెమీకండక్టర్ల కొరతతోపాటు నిరంతర ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ కంపెనీలు సానుకూల ఫలితాలను నమోదు చేశాయి. ‘ఈ పండుగల సీజన్లో కస్టమర్ల సెంటిమెంట్ ఆల్–టైమ్ హైలో ఉంది. మహమ్మారి తర్వాత బలంగా ఉద్భవించిన ఈ–కామర్స్ రంగం గ్రామీణ, చిన్న మార్కెట్లలో బ్రాండ్లు చొచ్చుకుపోవడానికి సహాయపడుతోంది’ అని కంపెనీలు చెబుతున్నాయి. ఓనమ్, దసరాతో మొదలైన కొనుగోళ్ల జోరు దీపావళి వరకు కొనసాగుతుందని పరిశ్రమ ఆశగా ఉంది. ఏడాదిలో జరిగే మొత్తం అమ్మకాల్లో పండుగల సీజన్ వాటా 30 శాతం దాకా ఉంది. ప్రీమియం టెలివిజన్లకు.. ఈ ధన్‌తేరస్‌కు పెద్ద తెర గల ప్రీమియం టెలివిజన్లకు మంచి డిమాండ్ ఉందని సోనీ ఇండియా ఎండీ సునీల్ నయ్యర్ తెలిపారు. ప్రధానంగా 55 అంగుళాలు, ఆపైన సైజు టీవీలకు అద్భుత స్పందన ఉందన్నారు. అన్ని రకాల సౌండ్ బార్స్ సైతం అమ్ముడయ్యాయని చెప్పారు. కిత్రం ఏడాదితో పోలిస్తే ఈ ధంతేరస్‌కు 30–35 శాతం అధిక వ్యాపారం చేశామన్నారు. ఫెస్టివల్ సీజన్ అయ్యేంత వరకు ఈ జోష్ ఉంటుందన్నారు. 2020తో పోలిస్తే 24 శాతం వృద్ధి సాధించామని ప్యానాసోనిక్ ఇండియా, దక్షిణాసియా సీఈవో మనీశ్ శర్మ తెలిపారు. పండుగల సీజన్ పూర్తి అయ్యేసరికి 50 శాతం అధిక విక్రయాలు నమోదు చేస్తామన్నారు. స్మార్ట్ 4కే ఆన్‌డ్రాయిడ్ టీవీలు, స్మార్ట్ ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్స్ ఈ వృద్ధిని నడిపిస్తున్నాయని వివరించారు. బలంగా సెంటిమెంట్.. పండుగ సీజన్ పూర్తి అయ్యేనాటికి వృద్ధి మరింతగా ఉంటుందని కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లయాన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సియామా) ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా అన్నారు. కొనుగోళ్ల విషయంలో కస్టమర్ల సెంటిమెంట్ బలంగా ఉందని శామ్సంగ్ చెబుతోంది. 2020తో పోలిస్తే ఈ ఏడాది ధంతేరస్‌కు 20 శాతం అధికంగా అమ్మకాలు సాధించామని శాంసంగ్ ఇండియా కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ ఎస్వీపీ రాజు పుల్లన్ వెల్లడించారు. ఓఎల్ఈడీ టీవీ, అల్ట్రా హెచ్డీ టీవీ, సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్స్, చార్కోల్ మైక్రోవేవ్స్ వంటి ఉత్పత్తులకు స్థిరమైన వృద్ధి చూస్తున్నామని ఎల్జీ ఇండియా కార్పొరేట్ ప్లానింగ్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ బన్సల్ తెలిపారు. గోద్రెజ్ అప్లయాన్సెస్ 45 శాతం వృద్ధి నమోదు చేసింది. 2019లో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల మార్కెట్ భారత్‌లో సుమారు రూ.76,400 కోట్లు ఉంది. -
రియల్మీ నుంచి వాషింగ్ మెషిన్.. వచ్చేది ఎప్పుడంటే?
స్మార్ట్‌ఫోన్ తయారీలో ఇప్పటికే తనదైన ముద్ర వేసిని రియల్మీ మరింతగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో ఉంది. గాడ్జెట్స్ నుంచి హోమ్ అప్లయెన్స్ రంగంలో కాలు మోపేందుకు రంగం సిద్ధం చేసింది. టెక్లైఫ్ బ్రాండ్ హోం అప్లయెన్స్ విభాగంలో ఎల్జీ, శామ్సంగ్ కంపెనీలదే హవా నడుస్తోంది. వీటికి పోటీ ఇచ్చేందుకు రియల్మీ సిద్ధమైంది. అందులో భాగంగా రియల్మీ టెక్లైఫ్ అనే బ్రాండ్‌తో వరుసగా ఉత్పత్తులు రిలీజ్ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా మొదటగా రియల్ మీ నుంచి వాషింగ్ మెషిన్ మార్కెట్లోకి రానుంది. దీపావళి స్మార్ట్‌ఫోన్ రంగంలో నాణ్యత, ఎక్కువ ఫీచర్లు, తక్కువ ధర అనే మూడు సూత్రాలతో రియల్ మీ విజయ బావుటా ఎగురవేసింది. తక్కువ కాలంలోనే ఇండియాలో అత్యధికంగా స్మార్ట్ఫోన్లు అమ్మిన కంపెనీగా రికార్డు సృష్టించింది. మరోసారి సక్సెస్ టెక్నిక్‌ని హోం అప్లయెన్స్ విభాగంలో కూడా రియల్మీ అమలు చేస్తుందని, ధరల యుద్ధం తప్పదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టాప్‌లోడింగ్ వాషింగ్ మెషిన్ ధరకే ఫ్రంట్‌లోడ్ వాషింగ్ మెషిన్ రియల్ తెచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల మాటగా వినిపిస్తోంది. దీపావళి పండక్కి రియల్ మీ నుంచి వాషింగ్ మెషిన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. రియల్మీ విస్తరణ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విజయం సాధించిన వెంటనే ల్యాప్‌ట్యాప్‌ల అమ్మకంలోకి రియల్మీ ప్రవేశించింది. తక్కువ ధరకే నోట్‌బుక్ పేరిట ల్యాప్‌ల్యాప్‌లను మార్కెట్లోకి తెచ్చింది. ఇప్పటికే రియల్మీ నుంచి ట్రిమ్మర్లు, షేవర్లు మార్కెట్లో ఉన్నాయి. చదవండి: భారత్‌లోకి రియల్మీ బుక్ -
ఆఫ్ చేసినా ఇవి కరెంట్ లాగేస్తాయని తెలుసుకోండి
టెక్ ఏజ్‌లో సాంకేతికతకు పవర్ తోడైతేనే రోజువారీ పనులు జరిగేది. విచ్చల విడిగా వాడేస్తూ.. నెల తిరిగే సరికి కరెంట్ బిల్లును చూసి కళ్లు పెద్దవి చేసేవాళ్లు మనలో బోలెడంత మంది. అయితే మనకు తెలియకుండానే కరెంట్‌ను అదనంగా ఖర్చు చేస్తున్నామని తెలుసా?.. అదీ ఆఫ్ చేసినప్పటికీ!. యస్.. మొత్తం పవర్ బిల్లులలో మినిమమ్ 1 శాతం.. పవర్ ఆఫ్ చేసిన ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ వల్ల వస్తుందని ఇండియన్షెల్ఫ్ ఓ కథనం ప్రచురించింది. టెలివిజన్ సెట్స్.. చాలామంది టీవీలు చూస్తూ రిమోట్ ఆఫ్ చేసి వేరే పనుల్లో మునిగిపోతారు. లేదంటే రాత్రిళ్లు పడుకునేప్పుడు టీవీలను స్విచ్ఛాఫ్ చేయకుండా వదిలేస్తారు. ఇలా చేయడం స్టాండ్‌బై మోడ్‌లోకి వెళ్లే టీవీ.. రోజుకి 24 వాట్ల పవర్‌ను తీసుకుంటుంది. ఇది తక్కువే అనిపించినా.. రోజుల తరబడి లెక్క ఎక్కువేగా అయ్యేది!. సెల్‌ఫోన్ ఛార్జర్.. చాలామంది నిర్లక్క్ష్యం వహించేది దీని విషయంలోనే. ఫోన్ ఛార్జింగ్ అయ్యాకో, మధ్యలో ఫోన్ కాల్ వస్తేనో స్విచ్ఛాఫ్ చేయకుండా ఫోన్ నుంచి పిన్ తీసేస్తుంటారు. కానీ, పవర్ బటన్‌ను ఆఫ్ చేయడమో, సాకెట్ నుంచి ఛార్జర్‌ను తీసేయడమో చేయరు. ఛార్జర్ సగటున రోజుకి 1.3 వాట్ల పవర్‌ను లాగేసుకుంటుంది. అంతేకాదు ఛార్జర్ పాడైపోయే అవకాశం.. ఒక్కోసారి పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. వైఫై మోడెమ్.. స్విచ్ఛాఫ్ చేయకుండా ఉంచే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉండేది ఇదే. ఇంటర్నెట్ను ఉపయోగించినా లేకున్నా, వైఫై పరిధి నుంచి మొబైల్స్, తదితర డివైజ్‌లు దూరంగా వెళ్లినా సరే.. 24/7 వైఫైలు ఆన్‌లోనే ఉంటాయి. ప్రత్యేకంగా ఇది ఎంత కరెంట్ కాలుస్తుందనేది ప్రత్యేకంగా చెప్పలేకపోయినా.. ఉపయోగించనప్పుడు, బయటికి వెళ్లినప్పుడు ముఖ్యంగా రాత్రిళ్లు పడుకునేప్పుడు ఆఫ్ చేసి ఫ్లగులు తీసేయడం బెటర్. మైక్రో ఓవెన్స్.. ఇది తక్కువ మంది ఇళ్లలో ఉండొచ్చు. కానీ, చాలామంది వీటిని పూర్తిగా ఆఫ్ చేయకుండా వదిలేస్తుంటారు. కానీ, మైక్రో ఓవెన్స్, ఓవెన్స్‌లు ఒకరోజులో 108 వాట్ల పవర్‌ను లాగేస్తాయి. సో.. వాడనప్పుడు వాటిని అన్‌ఫ్లగ్ చేయడం ఉత్తమం. మరికొన్ని.. పెద్దసైజులో ఉండే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్లు వాషింగ్ మెషిన్స్, ఫ్రిడ్జ్(పెద్దగా పాడయ్యే సామాన్లు లేనప్పుడు)లతో పాటు డ్రైయర్స్, మిక్సర్లు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, టేబుల్ ఫ్యాన్లు, బ్లూటూత్ స్పీకర్లు ఆఫ్ చేయడం ముఖ్యంగా అన్‌ఫ్లగ్ చేయడం మంచిది. వర్క్ ఫ్రమ్ హోంలో చాలామంది ల్యాప్‌టాప్‌లను సిచ్ఛాఫ్ చేసినా అన్‌ఫ్లగ్ చేయరు. అడిగితే చాలామంది టైం ఉండదంటూ సాకులు చెప్తుంటారు. లేదంటే పరధ్యానంలో మరిచిపోతుంటారు. ఇంకొందరు ఓస్ అంతే కదా అని బద్ధకిస్తుంటారు. కానీ, పవర్సేవింగ్ను ఒక బాధ్యతగా గుర్తిస్తే.. కరెంట్‌ను ఆదా చేయడం, అప్లయన్సెస్‌ను పాడవకుండా కాపాడుకోవడంతో పాటు ఖర్చుల్ని తగ్గించుకున్నవాళ్లు అవుతారు. -సాక్షి, వెబ్‌డెస్క్ -
అమెజాన్ మెగా హోమ్ మాన్సూన్ సేల్: 70 శాతం వరకు తగ్గింపు!
ముంబై: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వినియోగదారులకు మెగా హోమ్ మాన్సూన్ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ జూలై 8 నుంచి జూలై 11 వరకు కొనసాగనుంది. గృహోపకరణాలు, కిచెన్ ఉపకరణాలతో సహా వివిధ ఉత్పత్తుల కొనుగోలుపై 70 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా చేసిన కొనుగోళ్లకు పది శాతం, రూ. 1,250 వరకు తక్షణ తగ్గింపును అందిస్తోంది. క్రెడిట్ కార్డుతో ఈఎంఐలో భాగంగా, కనీసం ఐదు వేల రూపాయల విలువ గల వస్తువుల కొనుగోలుపై సుమారు 10శాతం తక్షణ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అమెజాన్ శాంసంగ్, ఎల్జీ, వర్ల్‌పూల్ వంటి సంస్థల వాషింగ్ మెషీన్లపై సుమారు 30శాతం డిస్కౌంట్‌ను ఇవ్వనుంది. ఎల్జీ, శామ్సంగ్, వర్ల్‌పూల్, హైయర్, గోద్రేజ్ వంటి సంస్థల రిఫ్రిజిరేటర్ల కొనుగోలుపై అమెజాన్ ఇండియా 35శాతం తగ్గింపును అందిస్తోంది. గీజర్ల కొనుగోలుపై 35 శాతం వరకు, వాటర్ ప్యూరిఫైయర్లపై 45 శాతం వరకు ,బేసిక్ ఎయిర్ కండీషనర్ల కొనుగోలుపై 60శాతం వరకు మినహాయింపును ఇస్తోంది.