ఈ ప్రపంచంలో ప్రతీది ఇంటర్ లింక్, ఒకదాని ప్రభావం మరోకదానిపై చూపిస్తుంది. ఈ మాట ఓ సినిమాలోని డైలాగ్. సరిగ్గా అలాంటిదే ఏసీ విక్రయాల విషయంలో జరిగింది. ఈ ఏడాది పెరిగిన ఎండల తీవ్రత ఏసీల విక్రయాలపై ప్రభావం చూపింది. ఎంతలా అంటే గత ఆరు నెలల్లో మూడు సార్లు ధరలు పెంచినా.. అవేవి ప్రజలు పట్టించుకోకుండా ఏసీలను కొనుగోలు చేశారు. దీంతో ఈ ఏడాది ప్రథమార్థంలో సూమారు 60 లక్షలు ఏసీలు దేశవ్యాప్తంగా అమ్ముడయ్యాయి.
చదవండి: Netflix Subscription: మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన నెట్‌ఫ్లిక్స్.. తక్కువ ధరలకే కొత్త ప్లాన్!
వోల్టాస్ కంపెనీ(Voltas) దాదాపు 1.2 మిలియన్ యూనిట్ల రెసిడెన్షియల్ ఏసీలను విక్రయించగా, ఎల్‌జీ(LG) ఎలక్ట్రానిక్ ఇండియా ఒక మిలియన్ యూనిట్లకు పైగా రెసిడెన్షియల్ ఇన్వర్టర్ ఎయిర్ కండీషనర్‌లను విక్రయించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. కాగా జనవరి-జూన్ కాలంలో ఎల్‌జీ సంస్థ ఏసీ విభాగం నుంచి ₹4,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. హిటాచీ, డైకిన్, పానాసోనిక్, హైయర్ వంటి ఇతర ఎయిర్ కండీషనర్ తయారీదారులు కూడా తమ యూనిట్ అమ్మకాలలో ఇదే జోరు కొనసాగినట్లు చెప్పారు. ద్వితీయార్ధంలో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని వారు భావిస్తున్నారు.
కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (CEAMA) ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా మాట్లాడుతూ.. ఈ ఏడాది అమ్మకాల పరంగా మొదటి భాగం అద్భుతంగా ఉందన్నారు. జనవరి నుంచి జూన్ వరకు ఏసీ(AC) మార్కెట్ (దేశీయ) 6 మిలియన్ యూనిట్లకు అమ్ముడయ్యాయని తెలిపారు. గతంలో ఈ స్థాయిలో అమ్మకాలు లేవని, రెండవ సగం దాదాపు 2.5 మిలియన్ యూనిట్ల విక్రయాలు జరుగుతాయని భావిస్తున్నట్లు చెప్పారు.
చదవండి: Google Play Store: 8 యాప్‌లను డిలీట్ చేసిన గూగుల్.. మీరు చేయకపోతే డేంజరే!
Comments
Please login to add a commentAdd a comment