AC
-
పెరిగిన ఏసీ రైళ్ల ట్రిప్పులు.. ప్రయాణికులకు తిప్పలు!
దాదర్: పశ్చిమ రైల్వే మార్గంలో ఏసీ లోకల్ రైళ్ల 13 ట్రిప్పులు పెంచడంతో సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏసీ లోకల్ రైళ్ల కారణంగా నాన్ ఏసీ రైళ్ల ట్రిప్పులు తగ్గిపోయాయి. రైల్వే అధికారులు అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముంబైకర్ల ప్రయాణం ఠండా, ఠండా, కూల్ కూల్‌గా సాగాలనే ఉద్దేశంతో తొలుత సెంట్రల్ రైల్వే మార్గంలో ఏసీ లోకల్ రైళ్లను ప్రవేశపెట్టారు. మొన్నటి వరకు ఫాస్ట్ మార్గంలో పరుగులు తీసిన ఏసీ లోకల్ రైళ్లు ఇప్పుడు స్లో మార్గంలో కూడా సేవలందిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.సెంట్రల్ రైల్వే మార్గంలో ఏసీ లోకల్ రైళ్లకు ప్రయాణికుల నుంచి వస్తున్న విశేష స్పందనను దృష్టిలో ఉంచుకుని పశ్చిమ మార్గంలో కూడా ప్రవేశ పెట్టారు. ప్రారంభంలో చార్జీలు చాలా ఎక్కువ ఉండటం వల్ల గిట్టుబాటు కాకపోయేది. దీంతో ప్రయాణికులు ఏసీ లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు కొంత వెనకడుగు వేశారు. దీనిపై దృష్టిసారించిన రైల్వే అధికారులు ప్రయాణికుల సంఖ్య తగ్గడానికి గల కారణాలను వెలికి తీశారు. ఏసీ చార్జీలు ఫస్ట్ క్లాస్ కంటే చాలా ఎక్కువ ఉండటమేనని గుర్తించారు. దీంతో అనేక మంది ఏసీ లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు ముఖం చాటేస్తున్నట్లు తేలింది. దీనిపై విచారణ జరిపిన అధికారులు చార్జీలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు కొద్ది నెలల కిందట చార్జీలు తగ్గించడంతో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఫలితంగా ఉదయం, సాయంత్రం పీక్ హవర్స్‌లో రద్దీ కారణంగా డోరు మూసుకోలేని పరిస్థితి ఎదురవుతోంది. ముఖ్యంగా ఏసీ లోకల్ రైళ్లు డోరు మూసుకోనిదే ముందుకు కదలవు. గత్యంతరం లేక ప్లాట్‌ఫామ్‌పై విధులు నిర్వహిస్తున్న రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రయాణికులను బలవంతంగా లోపలికి నెడుతున్నారు. ఇది రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో జరుగుతున్నదే. దీన్ని సీరియస్‌గా తీసుకున్న రైల్వే అధికారులు ఏసీ రైళ్ల సంఖ్య పెంచాలని నిర్ణయించారు. ఉదయం, సాయంత్రం రద్దీ కొంతమేర తగ్గుతుందని భావించారు. ఆ ప్రకా>రం గత బుధవారం నుంచి 13 ఏసీ లోకల్ రైళ్లను పెంచారు. దీంతో ప్రస్తుతం వాటి సంఖ్య 96 నుంచి 109కి చేరింది. ఏసీ రైళ్ల సంఖ్య పెరగడంతో రద్దీ కొంతమేర తగ్గింది. కానీ ఏసీ రైళ్ల కారణంగా నాన్ ఏసీ లోకల్ రైళ్ల సంఖ్య తగ్గిపోయింది. గతంలో కూడా ఇలాగే ఏసీ లోకల్ రైళ్ల ట్రిప్పులు పెంచడతో నాన్ ఏసీ రైళ్ల తగ్గిపోయింది. ఫలితంగా సాధారణ లోకల్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. పెంచిన ఏసీ లోకల్ రైళ్లను ఫాస్ట్ మార్గంలో నడుపుతున్నారు. 13 ట్రిప్పుల్లో ఆరు ట్రిప్పులు విరార్–చర్చిగేట్ స్టేషన్ల మధ్య, భాయిందర్–చర్చిగేట్ మధ్య మూడు ట్రిప్పుల చొప్పున, ఒక ట్రిప్పు చర్చిగేట్–విరార్ (డౌన్) మధ్య ఇలా మొత్తం 13 ట్రిప్పులు పెరిగాయి. -
ఉన్ని దుప్పటి... ఉతికేది నెలకోసారే!
సాక్షి, హైదరాబాద్: చూడ్డానికి అందంగా ఉంటాయి.. తాకితే మెత్తగా ఉంటాయి.. కానీ, కప్పుకొంటే మాత్రం కంపు కొడుతుంటాయి. రైళ్లలోని ఏసీ కోచ్‌లలో ప్రయాణికులకు అందిస్తున్న దుప్పట్ల పరిస్థితి ఇది. ఈ ఉన్ని దుప్పట్లను వరు సగా 30 రోజులపాటు 30 మంది ప్రయాణికులు వాడుకున్నాకగానీ ఉతకడం లేదు. అయితే, వాటిని నిత్యం మడత నలగకుండా బ్రౌన్ కలర్ కవర్లో పెట్టి అందిస్తుండటంతో శుభ్రం చేసినవే అని ప్రయాణికులు భ్రమపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వాటిని శుభ్రం చేయకుండా 30 రోజులకంటే ఎక్కువే వాడాల్సి వస్తోంది. ఎప్పటికప్పుడు శుభ్రం చేసే లాండ్రీ వ్యవస్థ లేకపోవటమే దీనికి కారణం.మూడు నెలల నుంచి నెలకోసారి..గతంలో ఉన్ని దుప్పట్లను మూడు నెలలకోసారి ఉతికేవారు. 2010లో దాన్ని రెండు నెలలకు మార్చారు. అవి అపరిశుభ్రంగా ఉంటున్నాయన్న ఫిర్యాదులతో కనీసం నెలకోసారి ఉతకాలన్న నిర్ణయం తీసుకుని అమలులోకి తెచ్చారు. ఉన్ని దుప్పట్లను కనీసం పక్షం రోజులకోమారైనా ఉతకాలన్నది రైల్వే బోర్డు సూచన. కానీ దాన్ని అమలు చేసే పరిస్థితి లేదు. పాడయ్యే అవకాశం.. ⇒ ఉన్ని దుప్పట్లను నిత్యం ఉతకటం సాధ్యం కాదు. అలా చేస్తే అవి వెంటనే పాడైపోతాయి. రెండు నెలలకోసారి ఉతికే పద్ధతి ఉన్న సమయంలో ఉన్ని దుప్పటి జీవితకాలాన్ని నాలుగేళ్లుగా లెక్కగట్టారు. నెలకోసారి ఉతకటంతో రెండేళ్లకు తగ్గించారు. 15 రోజులకోమారు ఉతికితే ఏడాదే మన్నుతుంది. ఈ కారణంతో ఉతకటం లేదన్న అభిప్రాయం కూడా ఉంది. అయితే, డ్రైక్లీనింగ్తోపాటు ఇతర ఆధునిక పద్థతుల్లో నాణ్యత దెబ్బతినకుండా తరచూ శుభ్రం చేయాలన్న సూచనలను రైల్వే అధికారులు పట్టించుకోవటం లేదు. త్వరలో సమస్యకు పరిష్కారం: దక్షిణ మధ్య రైల్వే ⇒ భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో బెడ్‌రోల్స్ వినియోగించాల్సి రానున్నందున, వాటిని ఎప్పటికప్పుడు ప్రమాణాల మేరకు శుభ్రం చేసే వ్యవస్థను అందుబాటులోకి తేబోతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కొత్తగా బీఓఓటీ పద్ధతిలో భారీ సామర్థ్యంతో ఆధునిక లాండ్రీలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. హైదరాబాద్/సికింద్రాబాద్, కాచిగూడల్లో 48 టన్నుల సామర్థ్యంతో, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నర్సాపూర్‌లలో 10 టన్నుల సామర్థ్యంతో, తిరుపతిలో 22 టన్నులు, కాకినాడలో 6 టన్నులు, నాందేడ్, పూర్ణాలలో 8 టన్నుల సామర్థ్యంతో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది.‘సాధారణ బెడ్‌రోల్స్‌ను నిత్యం ప్రమాణాల ప్రకారం శుభ్రం చేసి అందిస్తున్నాం. శుభ్రపరిచే క్రమాన్ని సీసీటీవీల ద్వారా పర్యవేక్షిస్తున్నాం. ఉన్ని దుప్పట్లను మాత్రం నెలకోసారి శుభ్రం చేస్తున్నాం. అవి దుర్వాసనతో ఉన్నా, ఇతర అపరిశుభ్రతతో కనిపించినా వెంటనే శుభ్రం చేస్తున్నాం. రెండు బెడ్ïÙట్లు ఇస్తున్నందున.. వాటిల్లో ఒకదాన్ని ఈ దుప్పటితో కలిపి వాడటం వల్ల ఉన్ని దుప్పటి అంత తొందరగా అపరిశుభ్రంగా మారదు’అని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. శుభ్రమైన బెడ్ రోల్స్‌ను అందించేందుకు వాటి చార్జీని రైలు టికెట్ ధరలో భాగంగా వసూలు చేస్తుండటం కొసమెరుపు. ఎందుకీ పరిస్థితి?దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నిత్యం 116 రైళ్లలోని ఏసీ కోచ్‌లలో ఈ బెడ్ రోల్స్ సరఫరా చేయాల్సి ఉంది. నిత్యం ప్రతి బెర్త్‌కు రెండు బెడ్ïÙట్లు, ఒక టవల్, దిండు కవర్ అందిస్తారు. నిత్యం 38 వేల దుప్పట్లు, 1, 52,000 బెడ్‌షీట్స్ సరఫరా చేస్తున్నారు. వీటిని ఉతికించి శుభ్రపరిచేందుకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏడు చోట్ల మెకనైజ్డ్ లాండ్రీలున్నాయి. రోజుకు 2 టన్నుల బెడ్‌రోల్స్‌ను శుభ్రపరిచే సామర్థ్యంతో సికింద్రాబాద్‌లో డిపార్ట్మెంటల్ లాండ్రీ ఉంది. ఇది రైల్వే సొంత లాండ్రీ. కాచిగూడలో 12 టన్నుల సామర్థ్యం, తిరుపతిలో 2.5 టన్నులు, కాకినాడలో 4 టన్నులు, విజయవాడలో 1.5 టన్నులు, నాందేడ్‌లో 1.5 టన్నుల సామర్థ్యం కలిగిన లాండ్రీలున్నాయి. ఇవన్నీ ప్రైవేట్ సంస్థలు బీఓఓటీ (బిల్ట్ ఓవన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్) పద్ధతిలో ఏర్పాటు చేసినవి. అయితే, ఇవి దక్షిణ మధ్య రైల్వే అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ఇటీవల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే నడిపిన కొన్ని ప్రత్యేక రైళ్లలోని ఏసీ కోచ్‌లలో బెడ్ రోల్స్ సరఫరా చేయలేదు. ఈ విషయాన్ని ముందుగానే రైల్వేశాఖ ప్రకటించింది. క్రమంగా ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో రైళ్ల సంఖ్య కూడా పెంచాల్సి వస్తోంది. ఇటీవల థర్డ్ ఏసీ ఎకానమి పేరుతో కొత్త క్లాస్‌ను సృష్టించటంతో రైళ్లలో ఏసీ కోచ్‌ల సంఖ్య పెరిగింది. ఫలితంగా బెడ్ రోల్స్ సంఖ్య కూడా పెంచాల్సి వచి్చంది. కానీ, వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరిచే సామర్థ్యం లేకుండాపోయింది. -
రూ.3,793 కోట్లు లాభం.. ఏసీలకు గిరాకీ
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ (పీజీసీఐఎల్) సెప్టెంబర్ త్రైమాసికానికి రూ.3,793 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.3,781 కోట్లతో పోలిస్తే కేవలం రూ.12 కోట్లు పెరిగింది. ఆదాయం రూ.11,530 కోట్ల నుంచి రూ.11,846 కోట్లకు వృద్ధి చెందింది. స్థిరాస్తుల స్థూల విలువ రూ.2,78,983 కోట్లకు చేరింది. సెప్టెంబర్ క్వార్టర్లో రూ.38,575 కోట్ల విలువ చేసే ఎనిమిది ప్రాజెక్టులకు పవర్‌గ్రిడ్ విజయవంతమైన బిడ్డర్‌గా అర్హత సాధించింది.రూ.4.5 డివిడెండ్..వాటాదారుల వద్దనున్న ప్రతి షేరుకు రూ.4.50 చొప్పున మధ్యంతర డివిడెండ్ ఇచ్చేందుకు కంపెనీ బోర్డు నిర్ణయించింది. అలాగే పవర్‌గ్రిడ్ కాలా అంబ్ ట్రాన్స్మిషన్, పవర్‌గ్రిడ్ పర్లి ట్రాన్స్మిషన్, పవర్‌గ్రిడ్ వరోరా ట్రాన్స్మిషన్, పవర్‌గ్రిడ్ జబల్పూర్ ట్రాన్స్‌మిషన్‌ను పవర్‌గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (పీజీఇని్వట్)కు విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు ధర పెద్దగా మార్పుచెందకుండా రూ.318 వద్ద క్లోజ్ అయింది. బ్లూస్టార్ ఆకర్షణీయ ఫలితాలుకూలింగ్ ఉత్పత్తుల సంస్థ బ్లూస్టార్ లిమిటెడ్ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మెరుగైన పనితీరు ప్రదర్శించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.71 కోట్ల నుంచి రూ.96 కోట్లకు దూసుకుపోయింది. 35 శాతం వృద్ధి నమోదైంది. ఆదాయం 22 శాతం వృద్ధితో రూ.2,276 కోట్లుగా నమోదైంది. బలమైన ఆర్డర్ల పైప్‌లైన్‌తో అన్ని విభాగాల్లోనూ మెరుగైన పనితీరు చూపించినట్టు.. కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్ కొనసాగినట్టు బ్లూస్టార్ తెలిపింది. ఎలక్ట్రో మెకానికల్ ప్రాజెక్టులు, వాణిజ్య ఏసీ సిస్టమ్స్ ఆదాయం 33 శాతం పెరిగి రూ.1,428 కోట్లకు చేరింది. ఈ విభాగం మార్జిన్లు 2.2 శాతం బలపడ్డాయి. ఎలక్ట్రో మెకానికల్ ప్రాజెక్టుల విభాగంలో తయారీ రంగం, డేటా సెంటర్ల నుంచి వృద్ధి కనిపించింది. యూనిటీ ప్రొడక్టుల (రూమ్ ఏసీలు కూడా) ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.767 కోట్లుగా నమోదైంది. ప్రొఫెషనల్ ఎల్రక్టానిక్స్, ఇండ్రస్టియల్ సిస్టమ్స్ ఆదాయం స్వల్పంగా క్షీణించి రూ.80 కోట్లుగా ఉంది.ఇదీ చదవండి: ట్యాక్సీ మాఫియానే ప్రధాన ఓటు బ్యాంకు!ఏసీల వ్యాపారం సానుకూలంఅన్ని విభాగాల్లోనూ అవకాశాలు ఆశావహంగా ఉన్నట్టు, రూమ్ ఏసీలు, వాణిజ్య ఏసీల వ్యాపారం మంచి పనితీరు చూపిస్తున్నట్టు సంస్థ చైర్మన్, ఎండీ ఎస్ అద్వానీ తెలిపారు. 2024–25 సంవత్సరం పట్ల సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. డైరెక్టర్ పీవీ రావును ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా (ప్రాజెక్టులు, సొల్యూషన్లు) నియమించినట్టు సంస్థ ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్లూస్టార్ షేరు ఒక శాతానికి పైగా పెరిగి రూ.1,878 వద్ద క్లోజ్ అయింది. -
ప్రముఖ దేవాలయంలో ఏసీ నుంచి కారుతున్న నీళ్లు.. తాగేందుకు ఎగబడుతున్న భక్తులు
ప్రజల్లో దైవ భక్తి రోజురోజుకి శృతి మించుతోంది. ప్రముఖ దేవాలయంలో ఏర్పాటు చేసిన ఏసీల నుంచి కారే నీటిని తాగుతున్నారు. ఒంటిపై చల్లుకుని పునీతులం అయ్యామని తెగ సంబరపడిపోతున్నారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వ్రిందావన్ నగరంలో ప్రముఖ ప్రసిద్ధ ‘బాంకే బిహారీ’ అనే శ్రీకృష్ణుని దేవాలయం ఉంది. అయితే ఆ దేవాలయంలో దైవ దర్శనానికి భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. వస్తూ.. వస్తూ తమ వెంట టీ తాగే కప్పులను తెచ్చుకుంటున్నారు. శ్రీకృష్ణుడి దర్శనం అనంతరం గుడికి వెనుక భాగంలో ఏనుగు శిల్పం నుంచి కారుతున్న నీటిని దక్కించుకునేందుకు ఎగబడుతున్నారు.Serious education is needed 100%People are drinking AC water, thinking it is 'Charanamrit' from the feet of God !! pic.twitter.com/bYJTwbvnNK— ZORO (@BroominsKaBaap) November 3, 2024ఆ నీటిని టీ కప్పుల్లో నింపుకున్న భక్తులు తాగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొంతమంది భక్తులు నీటిని సేకరించడానికి కప్పులను ఉపయోగిస్తుండగా.. మరికొందరు చేతిలో తీర్ధం తీసుకున్నట్లుగా ఏసీ నుంచి కారే నీటిని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. వెలుగులోకి వచ్చిన పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఆలయ నిర్మాణ సమయంలో ఏసీలను ఏర్పాటు చేశారు. ఆ ఏసీల నుంచి కారే నీటిని బయట విడుదలయ్యేలా ఏనుగు ఆకారంలో ఉండే గొట్టాలను అమర్చారు. ఇప్పుడు ఏనుగు ఆకారంలో ఉండే గొట్టాల ద్వారా విడుదలవుతున్న నీటినే భక్తులు తాగుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో.. వీడియోలు తీసిన వారు.. ఏనుగు శిల్పం నుంచి ఏసీ విడుదల చేసే నీరు కారుతుందని చెబుతున్న మాటలు వినబడుతున్నాయి. అయినప్పటికీ అనేక మంది ఆలయానికి వెళ్లేవారు నీటిని తాగడం లేదంటే తమపై చల్లుకోవడం చేస్తున్నారు. మరికొందరు ఏనుగు శిల్పం నోటి నుండి కారుతున్న 'చరణ్ అమృతం’ (దేవుడు తమని ఆశీర్వదిస్తున్నారనే సూచికగా) భావిస్తున్నారు. శ్రీకృష్ణుడి పాదాల నుండి వస్తున్న పవిత్ర జలం అంటూ భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు.PLEASE DO NOT DRINK AIR CONDITIONING WATER!Cooling and air conditioning systems are breeding grounds for many types of infections including fungus, some really hellish. Exposure to air conditioning condensed water can lead to a terrifying disease known as Legionnaires'… https://t.co/FhOly0P7Dj— TheLiverDoc (@theliverdr) November 3, 2024వైరల్ అవుతున్న వీడియోలపై డాక్టర్లు సైతం స్పందిస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోల్లో.. దేవాలయంలో అమర్చిన ఏసీల నుంచి వచ్చే నీరని తాగొద్దని కోరుతున్నారు. ఏసీ నుంచి వచ్చే నీటిని తాగడం వల్ల ప్రాణాంతకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకుతుందని హెచ్చరిస్తున్నారు. -
ఫ్రిజ్.. ఏసీ.. మైక్రోవేవ్.. దీర్ఘాయుష్మాన్‌భవ!
ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, డిష్ వాషర్లు తదితర ఎల్రక్టానిక్స్ గృహోపకరణాలపై ఇప్పుడు వారంటీ వార్ నడుస్తోంది. వైట్ గూడ్స్ కంపెనీలు తమ ఉత్పత్తులకు పోటీ పడి మరీ ఏళ్లకు ఏళ్లు రక్షణ కలి్పస్తున్నాయి. ముఖ్యంగా ఖరీదైన ఉత్పత్తులపై 10–20 ఏళ్ల పాటు బ్రాండ్ వారంటీని అందిస్తున్నాయి. ఈ వ్యూహంతో డిమాండ్ కూడా పెరుగుతోందనేది పరిశ్రమ వర్గాల మాట! – సాక్షి, బిజినెస్ డెస్క్కన్జూమర్ డ్యూరబుల్స్ తయారీ సంస్థలు సేల్స్ పెంచుకోవడానికి కొత్త రూట్లో వెళ్తున్నాయి. ఎల్జీ, శాంసంగ్, హయర్, గోద్రెజ్, వోల్టాస్, పానాసోనిక్ వంటి దిగ్గజ బ్రాండ్లన్నీ తమ ఉత్పత్తుల్లో ప్రధానమైన విడిభాగాలకు 10 ఏళ్ల వరకు వారంటీ ఇస్తున్నాయి. ఏసీ, రిఫ్రిజిరేటర్ల కంప్రెషర్ల వంటి వాటికి ఇవి వర్తిస్తాయి. ఇక వాషింగ్ మెషీన్, డిష్ వాషర్ మోటార్లపై ఏకంగా 20 ఏళ్ల వరకూ వారంటీ లభిస్తోంది. కొన్ని కంపెనీలైతే ఈ ఆఫర్లను ‘లైఫ్ టైమ్’ వారంటీగా కూడా పేర్కొంటుండటం విశేషం. ముఖ్యంగా 35 ఏళ్లు పైబడిన వినియోగదారులు అధిక వారంటీ ఆఫర్లకు బాగా ఆకర్షితులవుతున్నారని, దీంతో అమ్మకాలు కూడా పుంజుకుంటున్నట్లు ఎలక్ట్రానిక్స్ రిటైలర్లు చెబుతున్నారు.రేటు ఎంత ఎక్కువైతే.... వారంటీ విషయంలో ఉత్పత్తుల రేటు కీలకంగా నిలుస్తోంది. ఎంత ప్రీమియం లేదా ఖరీదైన ఉత్పత్తి అయితే వారంటీ అంత ఎక్కువ కాలం ఆఫర్ చేస్తున్నాయి కంపెనీలు. కొన్ని బ్రాండ్లైతే మార్కెట్ వాటాను పెంచుకోవడం కోసం పరిశ్రమ ప్రమాణాలకు మించి ఒకట్రెండు సంవత్సరాలు అధికంగా కూడా వారంటీని అందిస్తుండటం గమనార్హం. ఉదాహరణకు, హయర్, వోల్టాస్ బెకో రిఫ్రిజిరేటర్ కంప్రెషర్లపై 12 ఏళ్లు వారంటీ లభిస్తోంది.ఎల్జీ వారంటీ వ్యవధి 10 ఏళ్లు మాత్రమే. ఇక వాషింగ్ మెషీన్ ఇన్వర్టర్ మోటార్‌పై శాంసంగ్, హయర్ 20 ఏళ్ల వారంటీని ఆఫర్ చేస్తుండగా... వోల్టాస్ బెకో, గోద్రెజ్ విషయంలో ఈ వ్యవధి 10 ఏళ్లు ఉంటోంది. అయితే, మొత్తం ఉత్పత్తిపై, అలాగే అన్ని విడిభాగాలపై పూర్తిస్థాయి వారంటీని మాత్రం దాదాపు అన్ని ప్రోడక్టులపై కంపెనీలన్నీ ఒకేలా ఇస్తున్నాయి. ఒక ఏడాది లేదంటే గరిష్టంగా మూడేళ్ల వరకు మాత్రమే పరిమితం చేస్తున్నాయి. ప్రధాన విడిభాగాలపైనే... చాలా కంపెనీలు ఎల్రక్టానిక్స్ గృహోపకరణాల్లో ప్రధాన విడిభాగంపైనే ఎక్కువ కాలం వారంటీని ఇవ్వడానికి ప్రధాన కారణం.. దానికి మన్నిక అధికంగా ఉండటమే. అయితే, సుదీర్ఘ వ్యవధి పాటు వారంటీ ఇచ్చేందుకు కంపెనీలు కొంత ఎక్కువ మొత్తాన్ని పక్కనబెట్టాల్సి వస్తోందని పరిశ్రమ ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. పోటీ తీవ్రంగా ఉండటంతో ఈ వ్యయాల భారాన్ని కస్టమర్లపై మోపేందుకు కంపెనీలు వెనకాడుతున్నాయి. ఉదాహరణకు, ఫ్లాట్ ప్యానెల్ టీవీ సెట్లపై చాలా బ్రాండ్లు మూడేళ్ల వారంటీ ఇచ్చేందుకు భారీగా వెచ్చించాయి. మరోపక్క, ఈ రోజుల్లో టీవీ ప్యానెల్స్ 12–18 నెలల్లోనే పాడవుతున్న పరిస్థితి. దీంతో వారంటీ మేరకు కొత్త టీవీ ఇవ్వడం కోసం కంపెనీలకు తడిసిమోపెడైనట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.⇒ అధిక వారంటీ వ్యవధి వల్ల అప్‌గ్రేడ్ కొనుగోళ్లపై ప్రభావం లేదంటున్న పరిశ్రమ వర్గాలు. ⇒ యువ కస్టమర్లు తమ కొనుగోలు నిర్ణయంలో వారంటీ అంశాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం విశేషం.వారంటీ తీరకుండానే మార్చేస్తున్నారు... వాస్తవానికి వారంటీ అనేది కొనుగోళ్ల విషయంలో కీలకమైనప్పటికీ... యువ కస్టమర్లు దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. వారు వినూత్న ఫీచర్లకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుండటం విశేషం. పాత ప్రోడక్ట్ స్థానంలో కొత్తది కొనే వినియోగదారులపై కూడా సుదీర్ఘ వారంటీ పెద్దగా ప్రభావం చూపడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ‘బ్రాండ్లు ఏటా కొంగొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. కొత్త టెక్నాలజీ పేరుతో పాత ప్రోడక్టులను మార్చేసేలా ప్రోత్సహిస్తున్నాయి. మరోపక్క, ఎక్కువ ఏళ్ల పాటు వారంటీ ఇవ్వడం విచిత్రం. అధిక వారంటీకి కస్టమర్లు ప్రాధాన్యం ఇస్తున్నా, వాస్తవ వాడకంలో పెద్దగా ఉపయోగం లేకుండా పోతోంది’ అని ఒక రిటైల్ స్టోర్ డైరెక్టర్ అభిప్రాయపడ్డారు. -
గంటల తరబడి ఏసీతో అనర్థాలెన్నో!
గతకొద్దేళ్లుగా పర్యావరణ కాలుష్యం, మానవ కార్యకలాపాలు కారణంగా సమ్మర్లో ఎండలు దంచి కొట్టాయి. సూర్యుడి భగభగలు మాములుగా లేదు. అంతేగాదు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్, ఆంటోనియో గుటెర్రెస్ సైతం ప్రజలు అధిక వేడిని ఎదుర్కొటున్నారని, బిలయన్లమంది ప్రజలు ప్రాణాంతక వేడి తరంగాలతో అల్లాడుతున్నారంటూ హెచ్చరించారు. అంతేగాదు ఇటీవల ఎన్నడూ చూడని విధంగా ఉష్ణోగ్రతలు ఏకంగా 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. దీంతో సామాన్య ప్రజలు సైతం అప్పో సొప్పో చేసి మరీ కూలర్ లేదా ఏసి కొనుక్కుని ఉపశమనం పొందుతున్నారు. ఈ విపరీతమైన వేడికి భయపడే ఏసీ గదుల్లో గంటల్లకొద్ది నిద్రిస్తున్నారు. కొందరైతే తెల్లవార్లు ఏసీ ఆన్‌చేసి పడుకుంటారు. అయితే ఇలా చేయడం అస్సలు మంచిది కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఏసీలో పడుకోవడం వల్ల కలిగే దుష్పరిణామాలు..పొడి కళ్ళు: ఏసీ గాలి నుంచి తేమను తొలగిస్తుంది. ఇది కళ్లను పొడిగా చేసి.. దురద, అసౌకర్యానికి దారితీస్తుంది.బద్ధకం: చల్లని ఉష్ణోగ్రతలు జీవక్రియ రేటును తగ్గించి, శరీర ప్రక్రియలను నెమ్మదిస్తాయి. ఇది అలసట, మగతకు దారితీస్తుంది.నిర్జలీకరణం: పొడి గాలి వేగవంతమైన తేమ నష్టాన్ని కలిగిస్తుంది. తగినంతగా నీళ్లను తాగకపోతే నిర్జలీకరణానికి దారితీస్తుంది.పొడి లేదా దురద చర్మం: తక్కువ తేమ చర్మం తేమను కోల్పోయేలా చేసి చర్మ పొడిబారినట్లుగా అయిపోతుంది. దీంతో ఒక విధమైన దురద, చికాకుకు కలుగుతుంది.తలనొప్పి: ఆకస్మిక ఉష్ణోగ్రత మార్పులు, చల్లని పొడి గాలి తలనొప్పి, సైనస్‌కు కారణమవుతుంది.శ్వాసకోశ సమస్యలు: చల్లని మరియు పొడి గాలి వాయుమార్గాలను చికాకుపెడుతుంది, ఉబ్బసం మరియు అలెర్జీల వంటి అధ్వాన్నమైన పరిస్థితులు.అలెర్జీలు, ఉబ్బసం: ఎయిర్ కండిషనింగ్‌లో దుమ్ము ధూళి వంటి అలెర్జీ కారకాలను కలిగి ఉంటాయి. ఇది అలెర్జీ ప్రతిచర్యలను ప్రేరేపిస్తుంది.శబ్ద కాలుష్యం: నిరంతరం హమ్మింగ్ చేయడం వల్ల నిద్రకు భంగం కలిగించి, చికాకు కలిగిస్తుంది.అంటువ్యాధులు: పేలవంగా నిర్వహించబడే ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలు బాక్టీరియా, వైరస్లు,శిలీంధ్రాలు వ్యాప్తి చెందుతాయి.నవజాత శిశువులపై ప్రభావంఎయిర్ కండీషనర్లను సరిగ్గా ఉపయోగిస్తే నవజాత శిశువులకు సురక్షితంగా ఉంటుందని చెప్పారు. తల్లిదండ్రులు శిశువు శరీర ఉష్ణోగ్రతకు ఉష్ణోగ్రతను నియంత్రించాలి, సర్దుబాటు చేయాలి. నవజాత శిశువును గదిలోకి తీసుకురావడానికి కనీసం 20 నిమిషాల ముందు AC ఆన్ చేయాలి, అదికూడా 25-27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మధ్య ఉంచాలి. దగ్గు, న్యుమోనియా వంటి వ్యాధుల బారినపడకుండా ఉండేలా చల్లటి గాలికి ప్రత్యక్షంగా గురికాకుండా జాగ్రత్తపడాలి. కొంతమంది నవజాత శిశువులకు కూడా చల్లని ఉష్ణోగ్రతలకు అలెర్జీని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి విపరీతమైన చలికి దూరంగా ఉండాలి. అంతే కాకుండా దుమ్ము వంటి అలర్జీలను నివారించడానికి ఎయిర్ కండీషనర్లను తరచుగా శుభ్రం చేయాలి.(చదవండి: ఈగను చంపడంతో ..ఏకంగా కన్నే పోగొట్టుకున్నాడు..!) -
స్పైస్‌జెట్ విమానంలో పనిచేయని ఏసీ.. ప్రయాణికుల అవస్థలు
న్యూఢిల్లీ: విమానంలో సాంకేతిక లోపాలు, అనుచిత ఘటనలు, బెదిరింపు కాల్స్.. వంటివి తరుచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ విమానంలో ఏసీ పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గాలి లేక ఉక్కపోతతో కొందరు అవస్థలు పడ్డారు. ఈ ఘటన స్పైస్ జెట్ విమానంలో చోటుచేసుకుంది.న్యూ ఢిల్లీ నుంచి దర్బంగా వెళుతున్న SG 476 విమానంలో సుమారు గంటకు పైగా ఏసీ పని చేయలేదు దీంతో ప్రయాణికులు ఉక్కపోతతో అల్లాడారు. కొందరు అస్వస్థతకు గురయ్యారు. వెంటిలేషన్ లేకపోవడం వల్ల గాలి కోసం తమ చేతిలో ఉన్న వస్తువులతో విసురుకుంటూ కనిపించారు. వృద్ధులు చిన్నపిల్లలతో సహా అనేక మంది ప్రయాణీకులు ఉక్కపోతతో అవస్థలు పడ్డారు. విమానంలోని పరిస్థితిని తోటి వారు డియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది."నేను ఢిల్లీ నుంచి దర్భంగాకు స్పైస్ జెట్‌లో ప్రయాణిస్తున్నాను. ఢిల్లీ విమానాశ్రయంలో చెక్ ఇన్ తర్వాత గంట వరకు ఏసీ ఆన్ చేయలేదు. విమానం లోపల ఉష్ణోగ్రత 40 డిగ్రీలు ఉంది. విమానం టేకాఫ్ కాగానే ఏసీ ఆన్ చేశారు’’ అని ప్రయాణీకుడు రోహన్‌కుమార్ తెలిపారు.#WATCH | SpiceJet passengers travelling from Delhi to Darbhanga (SG 476) had to wait inside an aircraft without air conditioning (AC) for over an hour amid the ongoing heatwave, with several feeling unwell. pic.twitter.com/cIj2Uu1SQT— ANI (@ANI) June 19, 2024 వీడియోపై స్పందించిన విమానయాన సంస్థ ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. సాంకేతిక సమస్యతో ఈ పరిస్థితి నెలకొందని, ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటామని వివరణ ఇచ్చింది. -
ఏసీ చల్లదనానికి.. రామ చిలుకల సేద!
అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నా పగటి ఉష్టోగ్రతల్లో పెద్దగా మార్పు రావడం లేదు. వేడిగాలులతో జనం అల్లాడుతున్నారు. కూలర్లు, ఏసీలు లేకుండా ఉండలేకపోతున్నారు. ఇక్కడ మనుషులే కాదు, ఇతర ప్రాణులు కూడా ఈ వేడికి తట్టుకోలేకపోతున్నాయనడానికి ఈ చిత్రమే ఉదాహరణ. అదేంటొో చూసేయండి..కరీంనగర్ భాగ్యనగర్‌లోని అపార్ట్మెంట్లో ఒక గదికి ఏసీ అమర్చబడి ఉండడంతో.. ఆ గోడ రంధ్రంలోంచి చల్లటి గాలి వీస్తుంది. వాతావరణ వేడిని తట్టుకోలేని రామచిలుకలు ఏసీ రంధ్రం వద్ద అలరిస్తూ కనిపించాయి. అవి వంతులవారీగా, ఒకదాని తరువాత మరొకటి.. ఆ రంధ్రంలో దూరుతూ.. ఏసీ నుంచి వస్తున్న చల్లటి గాలికి సేదతీరుతూ ఉన్నాయి. వెంటనే ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ఇవి చదవండి: ఆ నేత ఆలోచన 'వేరేలెవెల్'..గెలుపుని కూడా పర్యావరణ హితంగా..! -
‘పాపం..దొంగ గారు.. ఏసీ చూడగానే ఫ్లాట్!’ కట్ చేస్తే..!
దేశంలోఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోద వుతున్నాయి. ఏసీ, ఫ్యాన్లు లేనిదే క్షణం కూడా ఉండలేని పరిస్థితి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. చోరీకి వచ్చిన ప్రబుద్ధుడు, ఎంచక్కా ఏసి వేసుకొని ఆదమరిచి నిద్ర పోయిన ఘటన, ఫోటో వైరల్‌గా మారింది.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఉన్న ఇంట్లోకి చోరీకి చొరడ్డాడో వ్యక్తి. అసలే పగలూ రాత్రి తేడా లేకుండా మండే ఎండలు పైగా పూర్తిగా మద్యం మత్తులో ఉన్న అతగాడు, ఏసీ చూడగానే మైమరిచిపోయాడు. ఏసీ ఆన్ చేసుకొని, నేలమీదే ఒక దిండు వేసుకుని హాయిగా గుర్రు కొట్టి నిద్ర పోయాడు. తెల్లవారేక ఇంటి ముందు గేటు తెరిచి ఉండడంతో వారణాసిలో విధులు నిర్వహిస్తున్న సదరు ఇంటి యజమాని డాక్టర్ సునీల్ పాండేకు సమాచారం అందించారు పొరుగువారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి చ్చింది. సంఘటనా చేరుకున్న పోలీసులు కూడా విస్తుపోయారు. చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని అలాగే గాఢనిద్రలోకి జారుకున్నాడు. చిత్రం వైరల్‌గా మారింది. దొంగ తనం చేయాలనే ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి నిద్రపోయాడని డీసీపీ నార్త్ జోన్ ఆర్ విజయ్ శంకర్ తెలిపారు. అతణ్ని అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి చర్యలకు ఉపక్రమించారు. -
16కు తగ్గదు.. 30కి పెరగదు.. ఏసీతో ఎందుకలా?
ఎండ వేడిమికి దేశంలోని పలు ప్రాంతాల్లోని జనం ఉక్కపోతతో చెమటలు చిందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏసీలు, కూలర్లు జనానికి ఉపశమనం కల్పిస్తున్నాయి. అయితే బయటి ఉష్ణోగ్రత 45 డిగ్రీలు లేదా దానికిమించినప్పుడు ఏసీలు, కూలర్లు అందించే చల్లదనం ఎవరికీ ఏమాత్రం సరిపోవడం లేదు.ఎయిర్ కండీషనర్లో 16 డిగ్రీల కంటే తక్కువ, 30 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలను సెట్ చేయలేం. ఏసీలోని కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా, ఒకే మాదిరిగా ఉంటాయి. అయితే దీనికి కారణం ఏంటి?ఏసీ రిమోట్లో ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉండదనే సంగతి మనకు తెలిసిందే. ఏ బ్రాండ్ ఏసీలోనైనా కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల కంటే తక్కువకు ఉండదు. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది ఏసీ మరమ్మతుకు గురికావడం. రెండోది వినియోగదారుల ఆరోగ్యానికి హానికరంగా పరిణమించడం.అన్ని ఎయిర్ కండీషనర్లలో ఇవాపొరేటర్ ఉంటుంది. ఇది శీతలకరణి సహాయంతో గదిని చల్లబరుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఏసీ ఉష్ణోగ్రత 16 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే ఆ ఇవాపొరేటర్లో మంచు పేరుకుపోతుంది. దీంతో అది త్వరగా మరమ్మతుకు గురవుతుంది. అలాగే వినియోగదారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే ఏ ఏసీలోనైనా ఉష్ణోగ్రత 16 డిగ్రీల కంటే తక్కువ ఉండదు.ఇక ఏసీలోని గరిష్ట ఉష్ణోగ్రత విషయానికొస్తే అది 30 డిగ్రీలకు మించి ఉండదు. సాధారణంగా ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్నప్పుడు మనకు ఏమాత్రం ఇబ్బందిగా అనిపించదు. అయితే ఉష్ణోగ్రత అంతకు మించినప్పుడు ఉక్కపోతకు గురవుతాం. అలాగే ఏసీ ఉష్ణోగ్రతను 30 కంటే ఎక్కువగా ఉంచడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే 30 డిగ్రీలకు మించి ఏసీ ఉంటే దాని నుంచి వేడి గాలి వీస్తుంది. నిజానికి ఎయిర్ కండీషనర్ పని గాలిని చల్లబరచడం. వేడి చేయడం కాదు. -
మండుతున్న ఎండలు.. ఏసీ కొంటున్నారా..? జాగ్రత్తలివే..
ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏడాది భారీగా వేసవి తాపం ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే ఇంట్లో తీవ్ర ఉక్కపోత మొదలైంది. ఫ్యానులు, కూలర్లు ఉన్నా గది అంతా చల్లదనం రాక ఇబ్బందులు పడుతున్నారు. దాంతో చాలా మంది ఏసీలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ యాప్‌లు, రిటైల్ స్టోర్‌ల్లో వీటి అమ్మకాలు ఇప్పటికే ఊపందుకున్నాయి. అయితే వాటిని కొనుగోలు చేసేపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఐసెర్ రేటింగ్ కొందరు సరైన అవగాహన లేక పెద్ద గదులకు తక్కువ సామర్థ్యం ఉన్న ఏసీలు కొనుగోలు చేస్తారు. 110 చదరపు అడుగులు పరిమాణంలో గది ఉంటే 1 టన్ను, 110-150 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన గదికి 1.5 టన్నులు, 150-190 చదరపు అడుగుల గదికి 2 టన్నుల సామర్థ్యమున్న ఏసీని ఎంచుకోవాలి. ఏసీ కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా ఐసెర్ (ఐఎస్‌ఈఈఆర్) రేటింగ్ చూడాలి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ ప్రమాణాల ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు ఐసెర్ రేటింగ్ మారుతుంది. ప్రస్తుతం ఐసెర్ రేట్ 5 అంత కంటే ఎక్కువ ఉంటే ఫైవ్ స్టార్ ఉంటుంది. రేటింగ్ 4.4- 4.99 మధ్య ఉంటే ఫోర్ రేటింగ్ ఉంటుంది. రేటింగ్‌లో తేడా వల్ల విద్యుత్తు వినియోగంలో మార్పు ఉంటుంది. ఇన్వర్టర్తో మేలు చాలా ఇళ్లల్లో నిత్యం ఏసీని ఉపయోగించే వారు ఇన్వర్టర్తో కూడిన ఏసీ కొనుగోలు చేసుకోవాలి. ఇది విద్యుత్తును పొదుపు చేస్తుంది. మోటారు వేగాన్ని నియంత్రిస్తూ గది ఉష్ణోగ్రతను సర్దుబాటు చేస్తుంది. నాన్ ఇన్వర్టర్ ఏసీల్లో ఈ వెసులుబాటు ఉండదు. కేవలం ఆన్, ఆఫ్ మాత్రమే ఉంటాయి. కేవలం వేసవిలో మాత్రమే రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు ఉపయోగించేవారు నాన్ ఇన్వర్టర్ ఏసీ కొనుక్కోవచ్చు. మార్కెట్లో చాలా వరకు కన్వర్ట్‌బుల్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. చిన్న గదిలో 1.5 టన్నుల సామర్థ్యం కలిగిన వాటిని ఏర్పాటు చేసినా.. అవసరం మేరకు 1 టన్ను, 0.8 టన్ను ఇలా సమర్థ్యాన్ని మార్చుకోవచ్చు. సామర్థ్యం తగ్గించడం వల్ల అవుట్డోర్ యూనిట్‌లోని ఫ్యాన్ వేగం తగ్గి విద్యుత్తు పొదుపు అవుతుంది. ఇదీ చదవండి: 8.8 కి.మీ క్యాబ్ రైడ్ ధర చూసి షాక్.. చివరికి ఏమైందంటే.. ధరల మధ్య వ్యత్యాసం ఏసీ కొనుగోలు చేసేప్పుడే తప్పకుండా స్టెబిలైజర్ కొనాలి. వోల్టేజ్ హెచ్చుతగ్గుల పరిధి దాటినప్పుడు స్టెబిలైజర్ లేకుంటే ఏసీ పాడవుతుంది. వోల్టేజ్ హెచ్చుతగ్గుల వల్ల పాడైతే వారంటీ ఉండదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలా కంపెనీలు స్మార్ట్ ఏసీలను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వాటిని యాప్‌ల ద్వారానూ నిర్వహించవచ్చు. ఏసీ కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా వారంటీ చూసుకోవాలి. ఈ-కామర్స్ సంస్థల మధ్య ధరల విషయంలో తేడాలు ఉంటాయి. ఆఫర్లు ఉంటే గమనించాలి. కొన్ని సందర్భాల్లో ఈ-కామర్స్ సంస్థల కంటే కంపెనీల డీలర్ల వద్ద కూడా తక్కువ ధరకు లభిస్తాయి. -
ఏసీ నీటిని ఉపయోగించొచ్చా! ఆరోగ్యానికి మంచిదేనా?
వేసవి వచ్చిందంటే చాలు ఒక్కసారిగా అందరి ఇళ్లలో ఫ్యాన్ల కంటే ముందు ఏసీలు ఆన్ అయిపోతాయి. సూర్యుడి భగ భగలకు తాళ్లలేక చల్లటి ఏసిలో ఉండే కాస్త ప్రాణం లేచొచ్చిందరా బాబు అని అంటారు. అలాంటి ఏసీలను ఆన్ చేసినప్పుడూ నీళ్లు రావడం జరుగుతుంది. కంప్లసరీ ఆన్ చేసే వ్యవధిని బట్టి నీళ్లు ఎక్కువగా బయటకు రావడం జరుగుతుంది. అయితే ఈ నీటిని చాలా మంది పారబోసేస్తారు. వినయోగించరు. కానీ ఈ నీటిని హాయిగా ఉయపయోగించొచ్చట. మండు వేసవిలో ఉండే నీటి కొరతకు చెక్‌పెట్టేలా ఈ నీటిని ఆదా చేసుకోవచ్చని అంటున్నారు. ఇది ఏసీ నీరు కదా! సురక్షితమేనా? అంటే.. ఏసీ నుంచి వచ్చే వాటర్ కాబట్టి దీన్ని ఏసీ వాటర్ అంటున్నాం. కానీ, దీన్ని 'ఏసీ కండెన్సేట్ వాటర్' అంటారు. ఈ నీటిని మొక్కలకు నీరు పోయడానికి ఉపయోగించవచ్చు. ఎయిర్ కండీషనర్ నుంచి వచ్చే నీరు డిస్టిల్డ్ వాటర్ లాగా ఉంటుంది. స్వేదనజలం టీడీఎస్ (Total dissolved solids) సున్నాకి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఇది మొక్కలకు అనుకూలంగా ఉంటుంది. ఏసీ కండెన్సేట్ నీటి టీడీఎస్ (టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్) విలువ 40 నుంచి 80 మధ్య మారుతూ ఉంటుంది. పర్యావరణంలో కాలుష్య స్థాయి, ఏసీ పరిస్థితితో ఈ విలువ పెరగవచ్చు. క్రమం తప్పకుండా సర్వీస్ చేయబడే క్లీన్ ఏసీ తక్కువ టీడీఎస్ విలువను కలిగి ఉంటుంది. 'అవుట్డోర్ ప్లాంట్స్' ఏసీ కండెన్సేట్ నీటిని ఉపయోగించడం వల్ల ఎటువంటి సమస్య లేదు. ఈ నీరు మొక్కలకు ఊహించదగిన నీటి స్థాయిలను అందించడంలో సహాయపడుతుంది. చిన్న కుండలు, కంటైనర్లలో 'ఇండోర్ ప్లాంట్లు' నీరు తాగుటకు, కొన్నిసార్లు AC నీటిని ఉపయోగించడం లేదా సాధారణ పంపు నీటిలో కలపడం మంచిది.అయితే నీటిపారుదల కోసం ఉపయోగించే నీరు ఎసిటిక్గా ఉండటానికి తగినది కాదు. ఈ నీరు pHస్కేల్లో తటస్థంగా ఉండాలి. పారిశ్రామిక ప్రాంతం లేదా డ్రెయిన్ దగ్గర ప్రాంతాల్లో ఏసీ నీరు కొద్దిగా ఎసిటిక్గా ఉండవచ్చు. అలాంటప్పుడూ ఈ ఎసిటిక్ నీటిని నీటిపారుదల కోసం ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇది మొక్కలకు హాని కలిగించవచ్చు. వాటి స్వభావాన్ని ప్రభావితం చేస్తుంది. పారిశ్రామిక ప్రాంతంలో ఉండేవారు ఈ నీటిపారుదల ప్రయత్నాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే..? ఇది మొక్కలకు హాని కలిగించవచ్చు. వాటి స్వభావాన్ని ప్రభావితం చేస్తుంది. అంతేగాదు మొక్కలు ఎండిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ నీటిలో మినరల్స్, ఖనిజాలు లేకపోవడం వల్ల మొక్కల ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది. అలాగే ఈ ఏసీ నీటిని ఆదా చేయాలనుకుంటే..ఈ నీటితో వంటగది పాత్రలను కూడా కడగవచ్చు. ఏసీ కండెన్సేట్ నీటిలో బ్యాక్టీరియా, లోహాలు ఉంటాయి కాబట్టి ఈ నీటిని గిన్నెలు కడగడానికి, ఫ్లోర్ క్లీన్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఇలాంటి పనులకు ఉపయోగించడం మంచిదే కానీ కాని వంటగదిలోని పాత్రలను ఏసీ నీటితో శుభ్రం చేశాక మళ్లీ మంచినీళ్లు(శుభ్రమైన)తో మరొకసారి పాత్రలను కడగాల్సి ఉంటుంది. వేసవికాలంలో నీటి సమస్య ఉంటుంది కాబట్టి అందుకు ప్రత్యామ్నాయంగా ఈ నీటిని ఇలా ఉపయోగించొచ్చు. (చదవండి: కొండచిలువలు తినడం మంచిదంటున్న శాస్త్రవేత్తలు!) -
ఫ్రిజ్‌లు, ఏసీలు.. కొంటున్నారా? గ్యారెంటీపై ప్రభుత్వం కీలక సూచన!
రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు వంటి వైట్‌గూడ్స్‌పై ఇచ్చే గ్యారెంటీ లేదా వారంటీకి సంబంధించి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ వాటి తయారీ, విక్రయ కంపెనీలకు కీలక సూచనలు చేసింది. ఆయా ఉపకరణాల వారంటీ లేదా గ్యారెంటీ విధానాలను సవరించాలని కోరింది. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు వంటి వంటి ఉపకరణాలపై వారంటీ లేదా గ్యారంటీని అవి కొనుగోలు చేసిన తేదీ నుంచి వర్తింపజేస్తారు. అలా కాకుండా వాటిని ఇన్స్టాల్ చేసిన తేదీ నుంచి వర్తింపజేయాలని పరిశ్రమలు, రిటైల్ అసోసియేషన్లు, వైట్ గూడ్స్ తయారీదారులకు ప్రభుత్వ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఒక లేఖలో సూచించారు. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు వంటి ఉపకరణాలను సాధారణంగా శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులే ఇన్స్టాలేషన్ చేస్తుంటారు. వాటిని సరిగ్గా ఇన్స్టాల్ చేసే వరకు వినియోగదారులు ఆ వస్తువులను ఉపయోగించలేరు. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, వినియోగదారులు ఉత్పత్తిని ఉపయోగించలేనప్పుడు వారంటీ లేదా గ్యారెంటీ వ్యవధిని ప్రారంభించడం వినియోగదారుల రక్షణ చట్టం, 2019 ప్రకారం అన్యాయమైన వాణిజ్య పద్ధతిని ఏర్పరుస్తుంది. కొనుగోలు తేదీ నుంచి వారంటీ లేదా గ్యారెంటీ వ్యవధిని ప్రారంభించడం వలన వినియోగదారు సాధారణంగా ఆనందించే మొత్తం వారంటీ వ్యవధిలో తగ్గింపునకు దారి తీస్తుంది. ఈ-కామర్స్ ద్వారా చేసిన కొనుగోళ్ల విషయంలో ఈ సమస్య మరింతగా పెరిగింది. ఇక్కడ ఉత్పత్తి డెలివరీలో అదనపు సమయం ఉంటుంది. -
ప్రాణం తీసిన ఏసీ
సాక్షి, చైన్నె: ఏసీలో ఏర్పడిన మంటలు, పొగ కారణంగా ఊపిరి ఆడకపోవడంతో తల్లి కుమార్తె మరణించారు. శనివారం ఈ ఘటన అంబత్తూరు సమీపంలోని చోటు చేసుకుంది. వివరాలు.. చైన్నె శివారులోని అంబత్తూరు మీనంబేడు ఏకాంబర నగర్లో ఆదిల(50) తన కుమార్తె నష్రీన్(16)తో నివాసం ఉన్నారు. ఆమె భర్త రహ్మన్ ఇటీవల మరణించాడు. తమ బంధువుకు చెందిన ఇంట్లో వీరు అద్దెకు ఉన్నారు. నష్రీన్ సమీపంలోని పాఠశాలలో ప్లస్–2 చదువుతోంది. ఆదిల అదే ప్రాంతంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నారు. శనివారం ఉదయం వీరు నివాసం ఉన్న ఇంటి నుంచి పొగ రావడాన్ని ఇరుగు పొరుగు వారు గుర్తించారు. తలుపులు పగుల కొట్టి చూడగా... లోపల తల్లికుమార్తె స్పృహ తప్పిపడి ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. తర్వాత ఆ ఇద్దరు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం కీల్పాకం ఆస్పత్రికి పోలీసులు తరలించారు. విచారణలో ఏసీలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు, పొగ రావడంతో కారణంగా ఊపిరి ఆడక ఆ ఇద్దరూ మరణించినట్లు తేలింది. -
శునకాల కోసం హైటెక్ ఏసీ
కుక్కలను పెంచుకోవడం చాలామందికి సరదా అయినా, కాలాలకు అనుగుణంగా వాటి సంరక్షణను చూసుకోవడం మాత్రం సమస్యగానే ఉంటుంది. వేసవి తాకిడికి మనుషులే అల్లాడిపోతారు. ఇక వేసవిలో శునకాల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేసవిలో మనుషులకైతే ఏసీలు ఉన్నాయి గాని, పాపం పెంపుడు జంతువుల పరిస్థితి ఏమిటి? వాటికి మాత్రం ఏసీ సౌకర్యం ఉండొద్దా అనే ఆలోచనతో కొరియన్ డిజైనర్ స్యూంగ్మెన్ లీ ‘ఇగ్లూ’ తరహాలో పెంపుడు కుక్కల కోసం హైటెక్ ఏసీ ఇంటికి రూపకల్పన చేసింది. ఇది పూర్తిగా శునకాలకు సౌకర్యవంతంగా ఉంటుంది. విశ్రాంతి సమయంలో ఇందులోకి వెళ్లేలా పెంపుడు శునకాలకు అలవాటు చేస్తే చాలు. ఇది పూర్తిగా ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. దీని ప్రవేశమార్గంలోని సెన్సర్లు శునకం లోపలకు ప్రవేశిస్తుండటాన్ని గుర్తించి, వెంటనే ఇందులోని ఏసీ పనిచేసేలా చేస్తాయి. శునకం శరీర ఉష్ణోగ్రతకు అనుగుణంగా చల్లదనం కలిగిస్తాయి. బయట వేసవి తాపం ఎంతలా ఉన్నా, ఇందులో శునకాలు చల్లగా సేదదీరవచ్చు. దీని ధర 160 డాలర్లు (రూ.13,221) మాత్రమే! -
హైకావా అప్లయెన్సెస్ తో ఎక్స్పర్ట్ ఏసి సొల్యూషన్స్.. జొఇనింగ్ హాండ్స్
-
ఆ విమానంలో ప్రయాణం.. గంటన్నరపాటు నరకం అంటున్న ప్యాసింజర్లు
ఇటీవల విమాన ప్రయాణికులకు సంబంధించిన అంశాలు వార్తల్లో నిలుస్తున్నాయి. ప్రయాణికులు అసభ్యకరంగా ప్రవర్తించడమో, లేదా సిబ్బంది దురుసుగా ప్రవర్తించడమో లాంటి ఘటనలు తెరపైకి వస్తున్నాయి. అనంతరం వీటిపై చర్యలు కూడా తీసుకుంటున్నారు. అయితే వీటిని పునరావృతం కాకుండా మాత్రం చేయలేకపోతున్నారు అధికారులు. తాజాగా ఇండిగో విమానంలోని ప్యాసింజర్లు గంటకు పైగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన ఇండిగో విమానంలో చండీఘడ్ నుంచి జైపూర్ వెళుతుండగా ఈ పరిస్థితి ఎదురైనట్టు సమాచారం. దీనిపై పంజాబ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అమరీందర్ సింగ్ రాజా వార్రింగ్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఏముందంటే... విమానంలో ఏసీలు పనిచేయకపోవడంతో తాము 90 నిమిషాల పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డాం. తొలుత తాము విమానంలోకి వెళ్లేందుకు దాదాపు 15 నిమిషాల వరకు సెగలు కక్కుతున్న వాతావరణంలో క్యూలో నిలబడాల్సి వచ్చిందన్నారు. ఆ తరువాత ఏసీ ఆన్‌లో లేనప్పటికీ విమానాన్ని టేకాఫ్ చేసినట్లు చెప్పారు. అమరీందర్ సింగ్ దీనిపై స్పందిస్తూ.. ‘‘విమానం బయలుదేరిన సమయం నుంచి ప్రయాణం ముగిసే వరకూ ప్రయాణికులందరూ ఏసీ లేక ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇంత పెద్ద సమస్యను ఎవరు పట్టించుకోలేదు. శ్వేదం తుడుచుకునేందుకు మా అందరికీ ఎయిర్‌హాస్టస్ బోలెడన్ని టిష్యూ పేపర్లు ఇచ్చింది. ప్రయాణికులు తమ వద్ద ఉన్న పేపర్లు, టిష్యులతో విసురుకుంటూ కనిపించారు’’ అసలు విమానంలో ఈ పరిస్థితి ఏంటో నాకు అర్థంకావడంలేదన్నారు. కాగా ఈ ట్వీట్‌ను డీజీసీఏ, ఏఏఐలను కూడా ట్యాగ్ చేశారు. కొంద మంది ప్రయాణికులు 90 నిమిషాలు నరకం అనుభవించినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా.. ఇండిగో విమానంలో సాంకేతిక లోపం సంభవించడం ఇది మూడవది. శుక్రవారం ఢిల్లీ వెళ్లే ఇండిగో విమానాన్ని పాట్నాలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఇంజిన్ వైఫల్యం కారణంగా విమానం టేకాఫ్ అయిన మూడు నిమిషాల తర్వాత ఈ అత్యవసర ల్యాండింగ్ జరిగింది. ఈ విమానం ఉదయం 9.11 గంటలకు పాట్నాలోని జై ప్రకాష్ నారాయణ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి రాంచీకి తిరిగి వస్తున్న మరో విమానంలో కూడా సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం టేకాఫ్ అయిన అరగంట తర్వాత, పైలట్ ఈ విషయాన్ని ప్రకటించాడు. విమానాన్ని తిరిగి ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువెళుతున్నట్లు చెప్పాడు. Had one of the most horrifying experiences while traveling from Chandigarh to Jaipur today in Aircraft 6E7261 by @IndiGo6E. We were made to wait for about 10-15 minutes in the queue in the scorching sun and when we entered the Plane, to our shock, the ACs weren't working and the… pic.twitter.com/ElNI5F9uyt — Amarinder Singh Raja Warring (@RajaBrar_INC) August 5, 2023 -
సహజసిద్ధమైన 'ఏసీ'లు..అందుకు ఆ పురుగుల గూడే .!
సాధారణంగా వేసవి వచ్చేదంటే అమ్మో!.. ఉక్కపోతా అంటూ అరిచేస్తాం. ఏసీలు, కూలర్లు పెట్టేసి.. వేలల్లో కరెంట్ బిల్లులు కట్టేసి హమ్మయ్యా అనుకుంటాం. జేబు చిల్లు పెట్టుకోవడానికి రెడీ అయిపోతాం గానీ సహజసిద్ధంగా ఇంటిని ఎలా కూల్‌గా ఉంచుకోవచ్చో ఆలోచించం. ఎందకంటే ఎలాగో విద్యుత్ సౌకర్యం, డబ్బులు కట్టే సామర్థ్యం రెండు ఉన్నాయి. ఇక మరో ఆలోచన కాదు గదా!.. ఆ పదం వరకు కూడా వెళ్లం. కానీ ఈ ఎడారి దేశంలోని ఓ నగరం అన్ని దేశాలకు ఆదర్శంగా నిలవడమేగాక దాని వినూత్న ఆలోచన విధానంతో అందనంత ఎత్తులో ఉంది ఆ నగరం. వివరాల్లోకెళ్తే..ఇరాన్లో ఎడారి నగరమైన యాజ్డ్లో వేడి అలా ఇలా ఉండదు. తట్టుకోవడం చాల కష్టం, కనీస అవసరాలు ఉండవు. పైగా కావల్సినంత విద్యుత్ కూడా ఉండే అవకాశమే లేదు కూడా. అలాంటి ఆ ప్రాంతం అందుబాటులో ఉన్న వనరులతోటే అద్భుతాలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పైగా 2017లో యునెస్కోలో వారసత్వ ప్రదేశాల జాబితాలో స్థానం దక్కించుకుంది. ఇంతకీ ఆ నగరంలో అంత గొప్పగా ఏముందంటే..ఆ నగరంలో ఇళ్లన్ని ఎత్తులో ఉండి పైన చిమ్నీ లాంటి టవర్లు ఉంటాయి. వేడి గాలిని ఇంట్లోకి రాకుండా నిరోధించి, చల్లగా ఉండేలా చేస్తుంటాయి ఆ టవర్లు. ఒకరకంగా చెప్పాలంటే వాటిని 'సహజసిద్ధమైన ఏసీ'లని చెప్పొచ్చు. నివాసాలను చల్లబర్చడానికి వీలుగా వీటిని ఏర్పాటు చేశారు. వీటిని విండ్ క్యాచర్లు అంటారు. ఇది మధ్యప్రాచ్యంలోని పర్షియన్ సామ్రాజ్య కాలం నాటి నిర్మాణంగా భావిస్తారు నిపుణులు. నిజానికి వేసవిలో అక్కడ సుమారు 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు ఉంటాయి. దీంతో శతాబ్దాలకు ముందే అప్పటి వాళ్లే ఇళ్లను కూల్‌గా ఉంచడానికి వీలుగా ఇలాంటి నిర్మాణంలో ఇళ్లను నిర్మించారు. ప్రజలు దాన్ని ఇప్పటకీ కొనసాగిస్తుండటం విశేషం. విద్యుత్ గురించి తెలియక మునుపే మా పూర్వికులు ఇలాంటి ఇళ్లను కనుగొన్నారు, దాన్నే మేము కొనసాగించడమే కాకుండా ఆ వారసత్వాన్ని కాపాడుకుంటున్నాం అని గర్వంగా ఇరాన్ పర్యాటక మంత్రిత్వ శాఖ డిప్యూటీ అబ్డోల్మాజిద్ షాకేరి చెబుతున్నారు. ఇక్కడ ఇళ్లపై ఉండే 'విండ్ క్యాచర్'(చల్లటి గాలిని ఇచ్చేవి) టవర్లు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనవి. తమ పూర్వీకులు చెదపురుగుల గూడుని బేస్ చేసుకుని ఇలా ఇళ్లను నిర్మించినట్లు ఇరాన్ వాసులు చెబుతున్నారు. ఈ ఇళ్లు ఆధునిక సిమెంట్ భవనాలకు అత్యంత విరుద్ధం. ఇవి బంకమట్టి ఇటుకతో నిర్మించే శతాబ్దాల నాటి సంప్రదాయ రీతి కట్టడాల నిర్మాణం. ఇక్కడ ఇంకో అద్భుతమైన నిర్మాణం ఉంది. అది భూగర్భ జల వ్యవస్ధ. దీన్ని ఖానాట్స్ అని పిలుస్తారు. భూగర్భ బావులు, లేదా చిన్న కాలువలు అని చెప్పొచ్చు. అక్కడ ఇళ్లు వేడి ఎక్కకుండా ఉండటానికి ఇవి కూడా ఒక కారణం అని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇరాన్లో ప్రస్తుతం 33వేల ఖానాట్లు ఉన్నాయని చెబుతున్నారు. ఇరాన్ అధికారులు ఈ ఖానాట్స్లను ఎండిపోకుండా పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్నారు. మిగతా దేశాలు ఇలాంటి ప్రకృతిసిద్ధంగా లభించే గాలిని వినియోగించుకునే ప్రయత్నం చేస్తే మంచి గాలి పీల్చి ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే గాక వాతావరణంలో కార్బన్ స్థాయిలు తగ్గించినవాళ్లము అవుతాం కదా ఆలోచించండి!. (చదవండి: టాయిలెట్ క్లీనర్.. కానీ మనం కూల్‌డ్రింక్స్‌లా తాగేస్తున్నామా..!) -
ఇండియా ఫస్ట్ ఏసీ ట్రైన్ - ఆశ్చర్యగొలిపే నిజాలు!
మన దేశంలో ఈ రోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైల్వే విస్తరించి ఉంది. అయితే ఒకప్పుడు అంటే భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు రైల్వే అనేది కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండేది. ఇప్పుడు ట్రైన్లో ఉండే జనరల్, ఏసీ, స్లీపర్ వంటి కోచ్‌లు ఉండేవి కాదు కేవలం ఫస్ట్ (ఏసీ కోచ్) అండ్ సెకండ్ క్లాసులు మాత్రమే ఉండేవి. ఈ ఏసీ కోచ్‌లు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఎక్కడ మొదలయ్యాయి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఏసీ కోచ్ లేదా ఫస్ట్ క్లాసులో కేవలం బ్రిటీష్ వారు మాత్రమే ప్రయాణించాలి. వారి అవసరాలకు అనుగుణంగా చల్లగా ఉండటానికి ఏసీ బోగీలను ఏర్పాటు చేసుకున్నారు. భారతీయులకు వీటిలోకి అనుమతి ఉండేది కాదు. ఇండియన్స్ సెకండ్ క్లాసులోనే ప్రయాణించాలి. ఏసీ బోగీలుగా పిలువబడే వాటికి ఏసీలకు బదులు ఐస్ బ్లాక్స్ ఉపయోగించే వారు. వీటిని నేరుగా ఫ్లోర్‌లోనే ఉంచేవారని తెలుస్తోంది. ఈ రైలు మొదట 1928లో ముంబైలోని బల్లార్డ్ పీర్ స్టేషన్ నుంచి ఢిల్లీ, బటిండా, ఫిరోజ్‌పూర్, లాహోర్ మీదుగా ప్రయాణించేది. ఆ తరువాత 1930లో సహరాన్ పూర్, అంబాలా, అమృత్సర్, లాహోర్కి మళ్లించారు. ఈ రైలు పేరు 'ఫ్రాంటియర్ మెయిల్' (Frontier Mail). ఆ తరువాత ఇది 1996లో గోల్డెన్ టెంపుల్ మెయిల్ పేరుతో వినియోగంలో ఉండేది. (ఇదీ చదవండి: రైతు దశ తిప్పిన టమాట.. ఇది చూస్తే ఆగుతుంది నోటమాట!) ఫ్రాంటియర్ మెయిల్ ప్రత్యేకతలు.. నిజానికి ఫ్రాంటియర్ మెయిల్ అనేది బ్రిటీష్ వారి కాలంలో అత్యంత విలాసవంతమైన ట్రైన్. కొన్ని నివేదికల ప్రకారం ఇది సుమారు 35 రైల్వే స్టేషన్స్‌లో ఆగుతూ 1893 కిమీ ప్రయాణిస్తుందని సమాచారం. ఒక సారికి ఇది 1300 మంది ప్రయాణికులను తీసుకెళ్లేదని, టెలిగ్రామ్స్ వంటి వాటిని తీసుకెళ్లడానికి కూడా దీన్ని ఉపయోగించేవారని తెలుస్తోంది. -
రైలు ప్రయాణికులకు ఊరట.. ఏసీ రైళ్లలో తగ్గనున్న ఛార్జీలు..
న్యూఢిల్లీ: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సహా 50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉండే అన్ని రైళ్లలో ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌ల ఛార్జీలను 25 శాతం మేర తగ్గించనున్నట్లు రైల్వే బోర్డు శనివారం తెలిపింది. అనుభూతి, విస్తాడోమ్ కోచ్‌లు సహా ఏసీ సౌకర్యం ఉండే అన్ని రైళ్లకు ఇది వర్తిస్తుందని వివరించింది. ఇతర వాహన ప్రయాణ ఛార్జీలను బట్టి కూడా రాయితీని నిర్ణయిస్తామని పేర్కొంది. వనరులను గరిష్ట స్థాయిలో వినియోగించుకునేందుకు వీలుగా ఏసీ కోచ్‌ల్లో ప్రయాణాలపై డిస్కౌంట్ పథకాలను ప్రకటించే అధికారాన్ని జోనల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లకు అప్పగించాలని రైల్వేశాఖ నిర్ణయించిందని కూడా వివరించింది. ‘ప్రాథమిక ఛార్జీపై గరిష్టంగా 25 శాతం వరకు రాయితీ ఉంటుంది. రిజర్వేషన్ ఛార్జ్, సూపర్ ఫాస్ట్ సర్‌చార్జ్, జీఎస్టీ మొదలైన తదితర ఛార్జీలు అదనం. ఆక్యుపెన్సీ ఆధారంగా ఏదైనా లేదా అన్ని తరగతులలో డిస్కౌంట్ అందించవచ్చు’అని రైల్వే బోర్డు పేర్కొంది. ‘గత 30 రోజుల్లో 50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న కొన్ని సెక్షన్లలోని రైళ్లలో విభాగాల వారీగా రాయితీ ఉంటుంది. డిస్కౌంట్ పథకం తక్షణం అమల్లోకి వస్తుంది. ఇప్పటికే బుక్ చేసుకున్న ప్రయాణికులకు చార్జీల వాపస్ ఉండదు’అని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండే, కొన్ని తరగతులకు ఫ్లెక్సీ ఫేర్ అమల్లో ఉన్న కొన్ని రైళ్లకు ఈ రాయితీ పథకం వర్తించదు. పండగలు, సెలవు రోజుల్లో ప్రత్యేకంగా నడిపే రైళ్లల్లో రాయితీ ఉండదు. రాయితీ స్కీమ్ వందేభారత్ రైళ్లకు కూడా వర్తిస్తుందని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఇదీ చదవండి: టేకాఫ్ కష్టమని దింపారు -
ట్రక్కుల్లో ఏసీ క్యాబిన్లు.. ముసాయిదా నోటిఫికేషన్‌కు నితిన్ గడ్కరీ ఆమోదం!
న్యూఢిల్లీ: రవాణా ట్రక్కుల్లో డ్రైవర్ల క్యాబిన్లకు ఏసీలు అమర్చడాన్ని తప్పనిసరి చేసే ముసాయిదా నోటిఫికేషన్‌కు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. ఎన్2, ఎన్3 ట్రక్కుల క్యాబిన్లకు ఏసీలను బిగించడం తప్పనిసరి అని ఈ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. రహదారి భద్రతలో ట్రక్ డ్రైవర్లు కీలక పాత్ర పోషిస్తున్నట్టు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ట్రక్కు డ్రైవర్లకు సౌకర్యవంతమైన పని వాతావరణం కల్పించడంతో ఈ నిర్ణయం కీలక మైలురాయిగా అభివర్ణించారు. ఇది వారి పనితీరును సైతం మెరుగుపరుస్తుందన్నారు. Approved the draft notification to mandate the installation of air-conditioning systems in the cabins of trucks belonging to categories N2 and N3. Truck drivers play a crucial role in ensuring road safety. This decision marks a significant milestone in providing comfortable… — Nitin Gadkari (@nitin_gadkari) July 6, 2023 -
ఏసీలో ఎక్కువసేపు ఉంటున్నారా? జాగ్రత్త.. ఇవి తెలుసుకోవాల్సిందే
ఈమధ్య కాలంలో ఏసీల వినియోగం బాగా పెరిగింది.ఇల్లు, ఆఫీస్,ప్రయాణాల్లోనూ ఏసీలో ఉండటానికే ఇష్టపడతాం.కాస్త వేడిగా అనిపిస్తే చాలు ఏసీ లేకుండా ఉండలేకపోతున్నారు. అలా ఏసీల వినియోగం ప్రస్తుతం వ్యసనంగా మారిపోయింది. కానీ ఈ ఎయిర్ కండీషనర్ శరీరాన్ని ఎంత దారుణంగా ప్రభావితం చేస్తుందో తెలుసా? రోజులో ఎక్కుసేపు ఏసీలో ఉంటే ‘సిక్ బిల్డింగ్ సిండ్రోమ్’ వచ్చే ప్రమాదం ఉంది. ఏసీ వినియోగం మితిమీరితే శరీరంపై కలిగే దుష్ప్రభావాలు ఏంటన్నది ఈ స్టోరీలో చదివేయండి. ► ఏసీలు వేయగానే డోర్లు మూసేస్తాం. దీనివల్ల బయటి గాలి లోపలికి రాదు. దీంతో ఆక్సిజన్ తక్కువ అయి తలనొప్పి వస్తుంది. నిర్లక్ష్యం చేస్తే మైగ్రేన్‌కు కూడా దారితీస్తుంది. ► ఏసీ వల్ల రక్తంలో ఆక్సిజన్ తక్కువై శరీరం త్వరగా ఆలసిపోతుంది. లోబీపీ వస్తుంది. ► ఎక్కువ సేపు ఏసీలో ఉండడం వల్ల శరీరంలో తేమ తగ్గుతుంది.దీని కారణంగా, చర్మం పగుళ్లు ఏర్పడి పొడిగా మారుతుంది. ► ఎక్కువగా ఏసీలో ఉండే వ్యక్తులు తలనొప్పి వంటి సమస్యలను తరచూ ఎదుర్కొంటారు. ► ఏసీ చల్లదనం వల్ల డీహైడ్రేషన్‌కు గురవుతాం. ఏసీలో ఉండటం వల్ల ఎక్కువ శాతం నీరు తాగాలనిపించదు. ఇది కిడ్నీ సమస్యకు కూడా దారితీయొచ్చు. ► ఆస్తమాతో బాధపడుతున్న వాళ్లు ఏసీలకు దూరంగా ఉండటమే మంచిదే. ► ఎక్కువ సేపు ఏసీలో గడిపేవారు ముక్కు, గొంతుకు సంబంధించిన శ్వాసకోశ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గొంతు పొడిబారడం, రినిటిస్ వంటి సమస్యలతో ఇబ్బందిపడతారు. ► ఏసీల వల్ల మరో సమస్య ఎలుకలు సెంట్రల్ ఏసీల్లో గూడు కట్టుకుంటాయి. వ్యర్థాలను అక్కడే తింటాయి. ఫలితంగా ఏసీల్లో వాతావరణం విషపూరితం అవుతుంది. మనకు రకరకాల వ్యాధులు వస్తాయి. నెలకోసారి అయినా ఏసీలను క్లీన్ చేయాలి. అందుకే ఎక్కువ సేపు బయటి వాతావరణం పై ఆధారపడాలి. కిటికీలు, డోర్లు తెరిచిపెట్టాలి. సాధ్యమైనంత వరకు ఏసీలకు దూరంగా ఉండాలి. -
కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో మొరాయించిన ఏసీలు
(విశాఖ ఉత్తర): విశాఖ నుంచి మహబూబ్ నగర్ బయలుదేరిన కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో ఏసీలు మొరాయించాయి. దీంతో శుక్రవారం చాలా మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం సాయంత్రం 6.40 గంటలకు కాచిగూడ ఎక్స్‌ప్రెస్ విశాఖ నుంచి బయలుదేరింది. థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ బోగీల్లో ప్రయాణికులు గేటు వద్ద నిల్చుని ఆపసోపాలు పడ్డారు. రైలు ప్లాట్ ఫాం మీద పెట్టిన వెంటనే ఏసీలు ఆన్ చేయాలి.. కానీ శుక్రవారం అలా జరగలేదు. రైల్వే సిబ్బంది మాత్రం ఏసీలు ఆన్‌లోనే ఉన్నాయని, రైలు నిలిపి ఉంచినపుడు పవర్ మోటార్లు పనిచేయవన్నారు. రైలు రన్నింగ్ ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ఏసీలు పనిచేస్తాయని బదులిచ్చారు. -
ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు
నిప్పులుగక్కే ఎండల్లో నిలబడి ట్రాఫిక్ విధులు నిర్వర్తించే పోలీసులకు ఏసీ హెల్మెట్లు ఇచ్చేందుకు అనంతపురం రేంజ్ డీఐజీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి, అనంతపురం జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు శ్రీకారం చుట్టారు. గంట చార్జింగ్ పెడితే ఎనిమిది గంటలపాటు ఏసీ హెల్మెట్ పనిచేస్తుంది. రూ.13 వేలు విలువజేసే ఈ హెల్మెట్లను హైదరాబాద్ నుంచి తెప్పించనున్నారు. ముందుగా ఏసీ హెల్మెట్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకునేందుకు డీఐజీ, ఎస్పీతోపాటు డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, సీఐ వెంకటేశ్‌నాయక్ అనంతపురం క్లాక్‌టవర్ వద్ద బుధవారం ట్రాఫిక్ విధుల్లో ఉన్న పోలీసులకు స్వయంగా ఏసీ హెల్మెట్లు ధరింపజేశారు. హెల్మెట్ పెట్టుకున్నపుడు తలకు చల్లగా ఉందని, సౌకర్యవంతంగా ఉందని సిబ్బంది తెలిపారు. త్వరలోనే అవసరమైనన్ని హెల్మెట్లు తెప్పిస్తామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. –అనంతపురం శ్రీకంఠంసర్కిల్ -
ట్రెండ్ మారింది గురూ! ఏసీకి ఫ్యాన్స్! ఖర్చుకు తగ్గేదేలే!
సాక్షి, హైదరాబాద్: రైలు ప్రయాణం అంటేనే హడావుడి. త్వరగా బయలుదేరి రైలు అందుకోవడం.. ఏ మూలనో కాసింత చోటు సంపాదించుకుని హమ్మయ్య అనుకోవడం.. రోజుల తరబడి వెయిటింగ్ లిస్టులో ఉన్నవారు చివరికి ఏదో ఒక బెర్త్ కన్ఫర్మ్ అయితే చాలు అని ఆశపడటం ఇన్నాళ్లుగా కనిపించేంది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. సౌకర్యవంతమైన ప్రయా ణానికి జనం మొగ్గు చూపుతున్నారు. జనరల్, నాన్ ఏసీ స్లీపర్ క్లాస్ బోగీల కంటే.. ఏసీ బోగీల్లో ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారు. దూరంతో, కాలంతో సంబంధం లేకుండా వేసవిలోనైనా, చలికాలంలోనైనా.. ఏసీ కోచ్‌లో సీట్లు దొరికాకే ప్రయాణానికి సిద్ధమవు తున్నారు. ఒంటరిగా ప్రయాణించినప్పుడు ఏదో ఒక బోగీలో ప్రయాణం చేసినా.. ఇంటిల్లిపాది కలిసి వెళితే మాత్రం ఏసీపై దృష్టిపెడుతున్నారు. థర్డ్ ఏసీకి ప్రాధాన్యం.. సాధారణ స్లీపర్ చార్జీలతో పోల్చుకుంటే ఏసీ ప్రయాణానికి చార్జీలు చాలా ఎక్కువే. ఫస్ట్, సెకండ్ ఏసీ బోగీలకైతే చాలా ఎక్కువ. అయితే అటు సౌకర్యం, ఇటు కాస్త అందుబాటులో ఉండటంతో థర్డ్ ఏసీ బోగీల్లో ప్రయాణానికి జనం మొగ్గుచూపుతున్నారు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి స్లీపర్ క్లాస్ చార్జీ రూ.450 వరకు ఉంటుంది. అదే థర్డ్ ఏసీలో రూ.1,100 వరకు ఉంటుంది. అయినా 12 గంటల పాటు ప్రయాణం కావడంతో టికెట్ ధర ఎక్కువే అయినా వీటిలో ప్రయాణిస్తున్నారు. ఇక ఏసీ బోగీల్లో దుప్పట్లు, బెడ్షీట్లు అందజేయడం, రెండు వైపులా డోర్లు లాక్ చేసే సదుపాయం వల్ల ప్రయాణంలో భద్రత ఉంటుందనే భరోసా.. రాత్రంతా ప్రశాంతంగా నిద్రించి ఉదయాన్నే గమ్యస్థానానికి చేరుకొనే అవకాశం ఉంటాయి. కొన్నిరైళ్లలో ఏసీ బోగీల్లో ఐఆర్సీటీసీ కేటరింగ్ సదుపాయం కూడా లభిస్తోంది. దక్షిణ మధ్య రైల్వేలో ప్రతిరోజు సుమారు 650 రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుండగా.. వీటిలో 230కిపైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి. ఈ రైళ్లలో ప్రతిరోజు లక్షకుపైగా థర్డ్ ఏసీ బెర్తులు భర్తీ అవుతున్నట్టు అంచనా. సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ చార్జీలు బాగా ఎక్కువే అయినా.. దూర ప్రాంత ప్రయాణాల్లో సెకండ్ ఏసీకి కూడా డిమాండ్ పెరుగుతోంది. ఇవి రోజూ సుమారు 30 వేల బెర్తులు భర్తీ అవుతున్నట్లు అంచనా. స్లీపర్ బోగీలు తగ్గిస్తూ.. అన్ని ప్రధాన రైళ్లలో స్లీపర్ కోచ్‌లను తగ్గించి థర్డ్ ఏసీ బోగీలను పెంచుతున్నారు. గతంలో 1.5 లక్షల వరకు స్లీపర్ బెర్తులు అందుబాటులో ఉంటే.. ఇప్పుడవి లక్షకు తగ్గినట్టు అంచనా. ఇదే సమయంలో ప్రయాణికుల డిమాండ్‌కు తగినట్టు థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ బెర్తులు పెంచారు. హైదరాబాద్ నుంచి విశాఖ, బెంగళూరు, ముంబై, దానాపూర్, రెక్సాల్, భువనేశ్వర్ తదితర రూట్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువ. ఈ రూట్లలో నడిచే రైళ్లలో స్లీపర్ బెర్తుల సంఖ్య సగానికి సగం తగ్గించినట్టు సమాచారం. ‘‘స్లీపర్ బోగీలకు డిమాండ్ లేదని చెప్పలేం. దిగువ మధ్య తరగతి, సాధారణ ప్రయాణికులకు తమ బడ్జెట్లో ప్రయాణ సదుపాయాన్ని అందజేసేవి స్లీపర్ క్లాస్ బోగీలే. కానీ ఇటీవల కాలంలో ఏసీ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు..’’ అని దక్షిణ మధ్య రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. ఇక ముందుఅన్నీ ఏసీ రైళ్లే.. రానున్న కాలంలో పూర్తిగా ఏసీ రైళ్లు మాత్రమే పట్టా లెక్కనున్నట్టు రైల్వే శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లు విజయవంతంగా పరుగులు తీస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖ, తిరుపతి పట్టణాలకు వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. డిమాండ్ బాగుండటంతో తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో బోగీల సంఖ్యను పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. త్వరలో బెంగళూరుకు వందేభారత్ అందుబాటులోకి రానుంది. అలాగే ఢిల్లీ, ముంబై తదితర నగరాలకు కూడా పూర్తి ఏసీ సదుపాయం ఉన్న వందేభారత్ రైళ్లను నడపనున్నారు. దక్షిణ మధ్య రైల్వే గణాంకాలివీ.. ♦ ప్రతి రోజు వచ్చే ఆదాయం: రూ.10 కోట్లు ♦ మొత్తం ప్రయాణికుల రైళ్లు: 650 ♦ రోజూ రాకపోకలు సాగించే ప్రయాణికులు 10.50 లక్షలు ♦ స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించేవారు 2.50 లక్షలు ♦ ఏసీ బోగీల్లో ప్రయాణించేవారు 1.50 లక్షలు ♦ థర్డ్ ఏసీ ప్రయాణికులు 1.10 లక్షలు ♦ సెకండ్ ఏసీ ప్రయాణికులు 30వేలు ♦ ఫస్ట్ ఏసీ ప్రయాణికులు 10వేల లోపు -
సారీ.. నో ఏసీ.. అలంకారప్రాయంగా ఏసీ బస్ షెల్టర్లు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో ఏసీ బస్షెల్టర్లు అలంకారప్రాయంగా మారాయి. ఏ ఒక్క షెల్టర్లోనూ ఏసీ సదుపాయం లేదు. ఏసీ ఉంటే తప్ప ఆ షెల్టర్లలో కూర్చోవడం సాధ్యం కాదు. ఒక్క ఏసీ మాత్రమే కాదు. తాగునీళ్లు, టాయిలెట్లు వంటి కనీస సౌకర్యాలు కూడా లేవు. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అక్కరకు రాని షెల్టర్లలో కూర్చొని ఎదురు చూసేందుకు అవకాశం లేకపోవడంతో ప్రయాణికులు మండుటెండలోనే పడిగాపులు కాయాల్సివస్తోంది. ఏర్పాటులోనే ఆర్భాటం.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ట్మాకంగా అయిదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఏసీ షెల్టర్లు నేతిబీర చందంగా మారాయి. అద్దాల డోర్లతో బ్రహ్మాండమైన లుక్ కనిపిస్తుంది. కానీ డోర్లు తెరిస్తే అన్నీ లుకలుకలే. ఏసీ షెల్టర్లతో పాటు నాన్ ఏసీ షెల్టర్ల ఏర్పాటును అప్పట్లో ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. వ్యాపార ప్రకటనలపై వచ్చే ఆదాయంతో వీటిని నిర్వహించాలి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన సదుపాయాలను ప్రయాణికులకు అందజేయాలి. ఈ షెల్టర్లను ఏర్పాటు చేసిననప్పటి నుంచి వ్యాపార ప్రకటనల ద్వారా ఆయా సంస్థలకు ఆదాయం లభిస్తోంది. ప్రయాణికులకు మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీస సౌకర్యాలు అందడం లేదు. తార్నాక, సికింద్రాబాద్, బేగంపేట్, బషీర్‌బాగ్, కోఠి, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, శిల్పారామం, ఖైరతాబాద్ తదితర చోట్ల బస్షెల్టర్లను ఏర్పాటు చేశారు. రెండు కేటగిరీలుగా షెల్టర్లను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ నివేదిక ప్రకారం నగరంలో సుమారు 1800 బస్షెల్టర్లు అవసరం. కొన్ని చోట్ల పాతకాలపు షెల్టర్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని శిథిలమయ్యాయి. రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం కారణంగా, గతంలో మెట్రో పనుల దృష్ట్యా షెల్టర్లను తొలగించారు. ఇలా షెల్టర్లు లేని చోట ఆధునిక పద్ధతిలో కట్టించేందుకు చర్యలు చేపట్టారు.ఈ క్రమంలోనే మొదట ఏసీ షెల్టర్లకు శ్రీకారం చుట్టారు. కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు, శిల్పారామం, దిల్సుఖ్నగర్, ఖైరతాబాద్, తదితర 10 ప్రాంతాల్లో ఏసీ షెల్టర్లను ఏర్పాటు చేశారు. ప్రారంభించిన కొద్ది రోజులు మాత్రమే ఏసీ ఉంది. ఆ తరువాత ఎక్కడా పని చేయడం లేదు. అప్పట్లో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని సీసీ కెమెరాలు, ప్యానిక్ బటన్లు, మొబైల్ చార్జింగ్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఆ సదుపాయాలు ఏవీ అందుబాటులో లేదు. ప్రకటనలకే.. తార్నాక, బేగంపేట్ వంటి పలు చోట్ల ఏర్పాటు చేసిన నాన్ ఏసీ షెల్టర్లు బస్టాపులతో సంబంధం లేకుండా ఉన్నాయి. కేవలం వాటికి వ్యాపార ప్రకటనలకే ఏర్పాటు చేసినట్లుగా ఉన్నాయి. ఆ షెల్టర్లకు పర్లాంగ్ దూరంలో బస్సులు ఆగుతాయి. జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, ముఖ్యంగా జనం దృష్టిని ఆకర్షించేందుకు అవకాశం ఉన్న చోట ఈ తరహా ప్రకటనలతో షెల్టర్లు ఏర్పాటు కావడం గమనార్హం. -
ఎగిరే ఏసీ! ఇల్లంతా తిరిగేస్తుంది.. సూపర్ గ్యాడ్జెట్
ఏసీ ఉంటే ఆ హాయి వేరే అయినా, ఏసీని అమర్చుకోవడం అంత తేలిక కాదు. నానా తంటాలు పడితే గాని, ఇంట్లోని కోరుకున్న గదిలో ఏసీ అమర్చుకోలేం. ఏసీ అమర్చుకున్న గదిలో తప్ప మిగిలిన గదుల్లో పరిస్థితి మామూలే! ఇల్లంతటికీ ఏసీ కావాలనుకుంటే, గదికో ఏసీ చొప్పున పెట్టించుకోవాలి. దీనంతటికీ ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఇంత ప్రయాస లేకుండానే ఇల్లంతటికీ ఏసీ వాతావరణాన్ని పంచేందుకు ఇటలీకి చెందిన ‘మిరే ఓజ్లెమ్–ఈఆర్’ డ్రోన్ ఏసీని రూపొందించింది. దీనిని ఆన్ చేయగానే, ఇది గాల్లో చక్కర్లు కొడుతూ ఇల్లంతా తిరుగుతుంది. ఇంట్లోని మనుషుల శరీర ఉష్ణోగ్రతను పసిగట్టి, అందుకు అనుగుణంగా గదిలోని ఉష్ణోగ్రతను వెచ్చబరచడం లేదా చల్లబరచడం చేస్తుంది. ఇంట్లోని ప్రతి గదిలోనూ ఇది తిరుగుతూ ఉష్ణోగ్రతలను అవసరానికి అనుగుణంగా మారుస్తూ ఉంటుంది. అలాగే, ఇందులోని ‘అరోమా డిఫ్యూజర్’లో మనకు నచ్చిన సెంటును నింపి పెట్టుకుంటే, ఇంట్లోని వాతావరణాన్ని ఆహ్లాదభరితంగా మార్చడమే కాకుండా, మనసును సేదదీర్చే పరిమళాలను కూడా వెదజల్లుతుంది. మార్కెట్లోకి త్వరలోనే విడుదల కానున్న ఈ డ్రోన్ ఏసీ ధరను ఇంకా ప్రకటించలేదు. (ఇదీ చదవండి: Vivo Y56 5G: వివో వై సిరీస్‌లో మరొకటి.. ధర రూ.20వేల లోపే!) -
ఫ్యాన్.. ఏసీ ఆన్.. హీటెక్కుతున్న 'గ్రేటర్'.. భారీగా విద్యుత్ వినియోగం
సాక్షి, సిటీబ్యూరో: భానుడి ప్రతాపం అప్పుడే మొదలైంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు విద్యుత్ శాఖకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. సాధారణంగా శివరాత్రి తర్వాత ఎండల తాకిడి పెరుగుతుంది. ఈసారి మాత్రం ముందుగానే ఎండలు మండుతుండటంతో గ్రేటర్లో విద్యుత్ డిమాండ్ పెరిగింది. . ఉదయం 10 గంటల తర్వాత సూర్యుడు సుర్రుమంటున్నాడు. మధ్యాహ్నం పూట బయటికి రావాలంటేనే నగరవాసులు కాస్త ఆలోచిస్తున్నారు. శనివారం గరిష్ఠంగా 35.4 సెల్సియస్ డిగ్రీలు, కనిష్ఠంగా 16.8 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భగ్గున మండుతున్న ఎండలకు ఉక్కపోత తోడవడంతో ఉపశమనం కోసం సిటీజన్లు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వినియోగిస్తున్నారు. 57 ఎంయూలకుపైగా.. ► వాతావరణంలో ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ మార్పులను శరీరం తట్టుకోలేక పోతోంది. నిజానికి చలి కారణంగా నిన్న మొన్నటి వరకు ఫ్యాన్లు పెద్దగా వాడలేదు. ప్రస్తుతం ఉక్కపోత ప్రారంభం కావడంతో ఏకంగా ఏసీలను ఆన్ చేస్తున్నారు. కేవలం గృహ విద్యుత్ మాత్రమే కాకుండా వాణిజ్య వినియోగం భారీగా నమోదవుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు పూర్తి స్థాయిలో పని చేస్తుండటమే ఇందుకు కారణం. ► ఫిబ్రవరి మొదటి వారంలో నగరంలో రోజు సగటు విద్యుత్ డిమాండ్ 52 మిలియన్ యూనిట్లు ఉండగా, ప్రస్తుతం 57 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. రెండో శనివారం విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు. వర్కింగ్ డేస్‌తో పోలిస్తే.. సెలవు దినాల్లో వినియోగం కొంత తగ్గాల్సి ఉంది. కానీ ఇందుకు విరుద్ధంగా రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మార్చి చివరి నాటికి 75 నుంచి 80 ఎంయూలకు చేరుకునే అవకాశం ఉన్నట్లు డిస్కం అంచనా వేసింది. హీటెక్కుతున్న డీటీఆర్లు ఒక్కసారిగా విద్యుత్ వినియోగం పెరగడంతో సబ్స్టేషన్లలోని ఫీడర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. ఆయిల్ లీకేజీలను సరి చేయకపోవడంతో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఒత్తిడి తట్టుకోలేక పేలిపోతున్నాయి. తాజాగా శనివారం పాతబస్తీ దారుíÙఫాలోని ఓ డీటీఆర్ నుంచి మంటలు వ్యాపించి భారీ శబ్దంతో పేలిపోవడంతో స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు. వేసవి ప్రారంభానికి ముందే లైన్ల పునరుద్ధరణ, లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, డీటీఆర్‌లలో ఆయిల్ లీకేజీల నియంత్రణ, ఎర్తింగ్ ఏర్పాటు, లూజు లైన్లను సరి చేయడం వంటి పనులు పూర్తి చేయాల్సి ఉన్నా.. అధికారులు ఇప్పటి వరకు వాటిపై దృష్టిపెట్టకపోవడం ఆందోళన కలిగిస్తోంది. చదవండి: ఆల్‌టైం రికార్డు సృష్టించిన చికెన్ ధర.. కేజీ రూ.720..! -
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. తక్కువ ధరకే ఏసీ ప్రయాణం, వచ్చేస్తోంది!
చెన్నై: పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తక్కువ చార్జీలతో ఏసీ బోగీలతో కూడిన రైళ్లను ప్రవేశపెట్టేందుకు దక్షిణరైల్వే ఏర్పాట్లు చేసింది. ‘పేదల రథం’ పేరుతో ఆధునిక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. బస్సులతో పోల్చుకుంటే చార్జీలు స్వల్పం, సౌకర్యాలు అధికం కావడం వల్ల ప్రయాణికులు రైలు ప్రయాణాలకే ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. ఈ కారణంగా రిజర్వేషన్లు చేసుకునే వారి సంఖ్య పెరగడంతో టిక్కెట్లు దొరక్క అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లలో రెండు లేదా మూడు ఏసీ బోగీలు మాత్రమే ఉంటున్నాయి. వీటిని టూ టైర్, త్రీ టైర్ బోగీలుగా విభజించి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. వీటిల్లో కుర్చీల సంఖ్య కూడా పరిమితంగా ఉన్నందున ఏసీ బోగీల్లో ప్రయాణం దాదాపు అసాధ్యంగా మారింది. ఈ పరిస్థితిని నివారించి ఏసీ బోగీలను కింది, మధ్యతరగతి ప్రజలకు సైతం అందుబాటులోకి తెచ్చేందుకు దక్షిణ రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. ఈ రైళ్లకు “పేదల రథం’ అని పేరుపెట్టారు. అత్యాధునిక వసతులతో తయారవుతున్న ఒక్కో బోగీలో 83 మంది ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిల్లో పడుకుని కూడా ప్రయాణించవచ్చు. సీసీ టీవీ, కెమెరాలు అమరుస్తారు. 110–130 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడతాయి. చెన్నై పెరంబూరులోని ఇంటెగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో తుదిమెరుగులు దిద్దుకుంటున్న ఈ రైలు బోగీల్లో ప్రయాణం మరో ఏడాదికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. చెన్నైకి ఆధునిక సిటీ బస్సులు కాలం చెల్లిన సిటీ బస్సుల స్థానంలో అత్యాధునిక బస్సులను తీసుకురానున్నారు. తొలిదశలో 242 బస్సులు చెన్నై రోడ్లలో సందడి చేయనున్నాయి. గ్రేటర్ చెన్నై ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ పరిధిలో 3,454 సిటీ బస్సులు నడుస్తున్నాయి. రోజుకు సగటున 30 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. వీరిలో 10.5 శాతం మంది మహిళలు ఉచిత పథకం కింద ప్రయాణిస్తున్నారు. ప్రతిరోజూ రోడ్డెక్కే 3,300 బస్సుల్లో వెయ్యి బస్సులు పాతబడిపోయి మూలపడేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. సిటీ బస్సులను 9 ఏళ్లకు మించి వినియోగించరాదనే నిబంధనను దాటి ప్రయాణిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జర్మన్ నిధుల సహకారంతో ప్రభుత్వం చెన్నైకి 242, మధురై, కోయంబత్తూరుకు చెరో 100 లెక్కన మొత్తం 644 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. తొలి విడతగా 242 బస్సుల కొనుగోలుకు టెండర్లు పిలిచారు. అత్యంత ఆధునికమైన బస్సుల్లో పూర్తిస్థాయి రక్షణకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. జీపీఎస్, సీసీటీవీ కెమెరాలు, ఎమర్జెన్సీ బటన్లు, అత్యవసర ద్వారాలు, రానున్న బస్‌స్టేషన్, చేరుకోబోతున్న ప్రాంతాలను తెలిపే డిజిటల్ బోర్డులను అమరుస్తారు. చదవండి: Indian Railways: మన డేటాతో రైల్వే వ్యాపారం! -
వావ్! వాట్ ఏ కూల్ గ్యాడ్జెట్.. పది నిమిషాల్లోనే మీ వాతావరణం మారుస్తుంది
వేసవిలో ఆరుబయట వనభోజనాలు, పిక్నిక్ పార్టీలు చేసుకునేందుకు ఎవరైనా సాహసిస్తారా? వేసవి ఎండలను తలచుకుంటేనే ముచ్చెమటలు పోస్తాయి, ఇక ఆరుబయట పిక్నిక్ పార్టీలు కూడానా అని అనుకుంటున్నారా? మరేం ఫర్వాలేదు ఈ ఫొటోలో కనిపిస్తున్న పోర్టబుల్ ఎయిర్ కండిషనర్ వెంట ఉంటే, వేసవిలోనైనా ఆరుబయట వనభోజనాలు, పిక్నిక్ పార్టీలు భేషుగ్గా చేసుకోవచ్చు. ఇళ్లల్లో అమర్చుకునే ఏసీల మాదిరిగా దీనికి ఇన్స్టాలేషన్ బెడద ఉండదు. ఎక్కడికంటే అక్కడకు తేలికగా తీసుకుపోవచ్చు. దీని బరువు పది కిలోలు మాత్రమే. పవర్ అడాప్టర్ ద్వారా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ఉష్ణోగ్రతను 16 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ వరకు కోరుకున్న రీతిలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆన్ చేసుకున్న పది నిమిషాల వ్యవధిలోనే పరిసరాల్లోని ఉష్ణోగ్రతను ఇది ఇట్టే చల్లబరచేస్తుంది. చైనాకు చెందిన ‘నైట్‌కోర్’ బహుళజాతి సంస్థ ఈ పోర్టబుల్ ఏసీని అందుబాటులోకి తెచ్చింది. చదవండి: Smartphone Printer: సెల్ఫీ లవర్స్ కోసం.. అదిరిపోయే ఫీచర్ ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం! -
ఎగబడి కొంటున్న జనం.. మూడు సార్లు ధరలు పెంచినా, రికార్డు స్థాయి అమ్మకాలు!
ఈ ప్రపంచంలో ప్రతీది ఇంటర్ లింక్, ఒకదాని ప్రభావం మరోకదానిపై చూపిస్తుంది. ఈ మాట ఓ సినిమాలోని డైలాగ్. సరిగ్గా అలాంటిదే ఏసీ విక్రయాల విషయంలో జరిగింది. ఈ ఏడాది పెరిగిన ఎండల తీవ్రత ఏసీల విక్రయాలపై ప్రభావం చూపింది. ఎంతలా అంటే గత ఆరు నెలల్లో మూడు సార్లు ధరలు పెంచినా.. అవేవి ప్రజలు పట్టించుకోకుండా ఏసీలను కొనుగోలు చేశారు. దీంతో ఈ ఏడాది ప్రథమార్థంలో సూమారు 60 లక్షలు ఏసీలు దేశవ్యాప్తంగా అమ్ముడయ్యాయి. చదవండి: Netflix Subscription: మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన నెట్‌ఫ్లిక్స్.. తక్కువ ధరలకే కొత్త ప్లాన్! వోల్టాస్ కంపెనీ(Voltas) దాదాపు 1.2 మిలియన్ యూనిట్ల రెసిడెన్షియల్ ఏసీలను విక్రయించగా, ఎల్జీ(LG) ఎలక్ట్రానిక్ ఇండియా ఒక మిలియన్ యూనిట్లకు పైగా రెసిడెన్షియల్ ఇన్వర్టర్ ఎయిర్ కండీషనర్లను విక్రయించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. కాగా జనవరి-జూన్ కాలంలో ఎల్జీ సంస్థ ఏసీ విభాగం నుంచి ₹4,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. హిటాచీ, డైకిన్, పానాసోనిక్, హైయర్ వంటి ఇతర ఎయిర్ కండీషనర్ తయారీదారులు కూడా తమ యూనిట్ అమ్మకాలలో ఇదే జోరు కొనసాగినట్లు చెప్పారు. ద్వితీయార్ధంలో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని వారు భావిస్తున్నారు. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (CEAMA) ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా మాట్లాడుతూ.. ఈ ఏడాది అమ్మకాల పరంగా మొదటి భాగం అద్భుతంగా ఉందన్నారు. జనవరి నుంచి జూన్ వరకు ఏసీ(AC) మార్కెట్ (దేశీయ) 6 మిలియన్ యూనిట్లకు అమ్ముడయ్యాయని తెలిపారు. గతంలో ఈ స్థాయిలో అమ్మకాలు లేవని, రెండవ సగం దాదాపు 2.5 మిలియన్ యూనిట్ల విక్రయాలు జరుగుతాయని భావిస్తున్నట్లు చెప్పారు. చదవండి: Google Play Store: 8 యాప్‌లను డిలీట్ చేసిన గూగుల్.. మీరు చేయకపోతే డేంజరే! -
ఎవరైనా వావ్ అనాల్సిందే, ఏసీకి దీటైన ఫ్యాను..ధర ఇంత తక్కువా!
గదిలో ఈ ఫ్యాను ఉంటే చాలు, ఇక ఏసీ అవసరమే ఉండదు. వేసవిని చల్లగా ఆస్వాదించవచ్చు. అమెరికన్ కంపెనీ ‘ఇగో పవర్ ప్లస్’ రూపొందించిన ‘మిస్టింగ్ ఫ్యాన్’ ఇది. దీని పనితీరు దాదాపు ఎయిర్ కూలర్ మాదిరిగా ఉన్నా, ఇది ఎయిర్ కండిషనర్ కంటే సమర్థంగా పనిచేస్తుంది. ఇందులోని మిస్టింగ్ ఫంక్షన్ పనిచేయడానికి, ఫ్యాన్‌కు అనుబంధంగా ఉన్న సిలిండర్‌లో ఒక బకెట్ నీళ్లు పోసుకుంటే చాలు. దీని స్పీడ్‌ను ఐదు రకాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కనిష్ఠంగా 1500 సీఎఫ్ఎం నుంచి గరిష్ఠంగా 5000 సీఎఫ్ఎం (క్యూబిక్ ఫీట్ పర్ మినిట్) వరకు గది విస్తీర్ణాన్ని బట్టి దీని వేగాన్ని నియంత్రించుకోవచ్చు. గది ఉష్ణోగ్రతను ఇది ఏకంగా 20 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గించగలదు. దీని ధర దాదాపు 250 డాలర్లు (రూ.19 వేలు) మాత్రమే. సాధారణ ఫ్యానుకయ్యే విద్యుత్తు ఖర్చే దీనికీ అవుతుంది. ఏసీ మాదిరిగా భారీ బిల్లులు వస్తాయనే భయమే అక్కర్లేదు. -
పెట్టుబడులకు ఏపీ కీలకం
సాక్షి, అమరావతి/వరదయ్యపాళెం(తిరుపతి): దక్షిణాది రాష్ట్రాల్లో అమ్మకాలకు, ఎగుమతులకు ఆంధ్రప్రదేశ్ కీలక రాష్ట్రమని, దీర్ఘకాలిక వ్యాపారాభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ఇక్కడ భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు జపాన్‌కు చెందిన ప్రపంచ నెంబర్‌వన్ ఏసీ కంపెనీ డైకిన్ వెల్లడించింది. భారీ వినియోగం ఉండే మూడు రాష్ట్రాలకు సమీపంలో ఉన్న వ్యూహాత్మక ప్రదేశమైన శ్రీసిటీలో రూ.1,000 కోట్లతో భారీ ఏసీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు డైకిన్ ఇండియా ఎండీ, సీఈఓ కన్వాల్జీత్ జావా తెలిపారు. శ్రీసిటీలో గురువారం డైకిన్ ఏసీ తయారీ కేంద్రానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో భారత్‌లోని జపాన్ రాయబారి సతోషి సుజుకీ, చెన్నైలోని జపాన్ కాన్సుల్ జనరల్ మసయుకి టాగా, ఫ్యుజిత సీనియర్ ఎండీ నయోకి నిషియొక, శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి, కన్వాల్జీత్ జావా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జావా మాట్లాడుతూ.. తమ ప్రపంచవ్యాప్త వినియోగదారులకు ఉత్తమ సేవలందించేందుకు అవసరమైన గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థను విస్తరించడం, సమతుల్యం చేయడం లక్ష్యంగా సంస్థ దీర్ఘకాలిక వృద్ధి ప్యూహంలో (ప్యూజన్–2025) భాగంగా ఈ పెట్టుబడి చాలా ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. శ్రీసిటీ ఫ్యాక్టరీ çవ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. కేవలం ఏసీ తయారీనే కాకుండా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యకలాపాలు, అంతర్జాతీయ మార్కెట్ అవసరాలు, ఉత్పత్తి సేవలను అందించనున్నట్లు తెలిపారు. అంచెలంచెలుగా పెట్టుబడిని మరింత పెంచనున్నట్లు జావా వెల్లడించారు. శ్రీసిటీ డొమెస్టిక్ టారిఫ్ జోన్లో 75.5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేస్తున్న ఈ ప్లాంట్ జూలై 2023 నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు. అలాగే, సంవత్సరానికి 1.5 మిలియన్ ఏసీ యూనిట్లతో పాటు కంప్రెసర్లు, కంట్రోలర్ బోర్డులు, ఇతర విడిభాగాలను తయారుచేయగల ఈ ప్లాంట్ ద్వారా మొత్తం మూడువేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఇది డైకిన్‌కు దేశంలో మూడో కేంద్రం కాగా.. అతిపెద్ద తయారీ కేంద్రం కూడా. భారత్‌లోని జపాన్ రాయబారి సతోషి సుజుకీ మాట్లాడుతూ.. జపాన్–భారత్ ఆర్థిక భాగస్వామ్యానికి ఇది మరో ముందడుగుగా అభివర్ణించారు. గత నెలలో జపాన్, భారత్ ప్రధానుల మధ్య జరిగిన సమావేశంలో రెండు దేశాల ఆర్థిక, వాణిజ్య సంబంధాలు పెద్దఎత్తున బలపడేందుకు పరస్పర అంగీకారం కుదిరిందన్నారు. అలాగే, భారత్‌లో రానున్న ఐదేళ్లలో రూ.3 లక్షల కోట్ల మేర జపాన్ పెట్టుబడులను లక్ష్యంగా నిర్దేశించారని తెలిపారు. ఇందులో భాగంగానే నేడు డైకిన్ ఇండియా తొలి అడుగు వేసిందన్నారు. కోవిడ్ తర్వాత తొలి భారీ పెట్టుబడి ఇది.. ఇక దేశంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో నెంబర్‌వన్‌గా వున్న ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల నిమిత్తం డైకిన్ గ్రూప్ ఎంపిక చేసుకున్నందుకు శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి అభినందనలు తెలియచేశారు. కోవిడ్ అనంతరం అధికారికంగా, పెద్దఎత్తున నిర్వహించిన పరిశ్రమ భూమిపూజ కార్యక్రమం ఇదేనని.. అలాగే, పీఎల్ఐ (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్) స్కీం కింద దక్షిణాదిలో ఏర్పాటవుతున్న తొలి భారీ తయారీ కేంద్రం కూడా ఇదేనన్నారు. శ్రీసిటీ జపనీస్ ఎనక్లేవ్లో ఇది 27వ జపాన్ కంపెనీ అని చెప్పడానికి సంతోషిస్తున్నామన్నారు. కోవిడ్ సమయంలో జపాన్ ప్రతినిధుల కోసం ఇక్కడ ప్రత్యేక సదుపాయాలు కల్పించామని.. త్వరలో మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని రవీంద్ర తెలిపారు. -
5% పెరగనున్న ఏసీల ధరలు
న్యూఢిల్లీ: వేసవి ఎండల నుంచి ఉపశమనానికి ఏసీ కొనుగోలు చేయాలనుకుంటున్న వారు ఈ సీజన్లో అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఎదురుకానుంది. ముడి సరుకుల ధరలు పెరిగిపోవడంతో కంపెనీలు మార్జిన్లపై ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. దీంతో ఈ సీజన్లో అమ్మకాలు రెండంకెల స్థాయిలో పెరుగుతాయని అంచనా వేసుకుంటున్న కంపెనీలు.. తయారీ భారాన్ని తగ్గించుకునేందుకు ఉత్పత్తుల ధరలను 5 శాతం వరకు పెంచాలనుకుంటున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో వేసవి సగటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువే నమోదు అవుతాయంటూ భారత వాతావరణ శాఖ తాజా అంచనాలు కూడా ఏసీల విక్రయాలపై కంపెనీల్లో ఆశలు పెంచాయి. గత రెండు వేసవి సీజన్లలో కరోనా వైరస్ ఉధృతి కారణంగా అమ్మకాలు ఆశించిన మేర లేవు. దీంతో అప్పుడు నిలిచిన డిమాండ్ కూడా తోడయ్యి, ఈసీజన్లో అమ్మకాలు జోరుగా ఉండొచ్చని వోల్టాస్, హిటాచి, ఎల్జీ, ప్యానాసోనిక్, గోద్రేజ్ అప్లయన్సెస్ అంచనా వేస్తున్నాయి. ఏసీ తయారీ కంపెనీలు గత త్రైమాసికంలో ధరలను ఒక విడత పెంచాయి. ఏసీల తయారీలో వినియోగించే అల్యూమినియం, కాపర్ ధరలు గణనీయంగా పెరగడంతో ఈ పనిచేయక తప్పలేదు. ఉదాహరణకు గతేడాది వరకు 3 స్టార్ ఇన్వర్టర్ స్లి్పట్ ఏసీ ధర రూ.33,500 స్థాయిలో ఉంటే, తాజాగా దీని ధర రూ.36,500–37,000కు చేరడం గమనార్హం. మరోవైపు ధరల భారం వినియోగదారులపై పడకుండా ఉండేందుకు ఆకర్షణీయమైన ఈఎంఐ పథకాలను కూడా అందిస్తున్నాయి. ‘‘2021–22లో ధరలను రెండంకెల స్థాయిలో పెంచాల్సి వచ్చింది. ఇది ఈ వేసవి సీజన్లో వినియోగదారుల కొనుగోళ్లకు ప్రతికూలంగా మారదని భావిస్తున్నాం. కస్టమర్ల సౌలభ్యం కోసం ఆఫర్లకుతోడు, సులభ ఈఎంఐ ఆప్షన్లను అందిస్తున్నాం’’అని వోల్టాస్ ఎండీ, సీఈవో ప్రదీప్ బక్షి తెలిపారు. మే నుంచి ధరల భారం.. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ తయారీదారుల సంఘం (సీఈఏఎంఏ) వార్షిక విక్రయాల్లో 40–50 శాతం మేర ఈ వేసవి సీజన్లో నమోదవుతాయని అంచనా వేస్తోంది. గడిచిన 18 నెలల్లో కన్జ్యూమర్ అప్లయన్సెస్ ధరలు 15 శాతం మేర పెరిగినట్టు తెలిపింది. కమోడిటీ ద్రవ్యోల్బణం, ముడిసరుకుల ధరల పెరుగుదల భారాన్ని పరిశ్రమ చూస్తున్నట్టు పేర్కొంది. ‘‘ధరల పెరుగుదల ప్రభావం వినియోగదారులపై వెంటనే ఉండకపోవచ్చు. ఎందుకంటే మార్చి–ఏప్రిల్ నెలలకు సరిపడా నిల్వలు ఇప్పటికే సమకూర్చడం జరిగింది. మే నుంచి తదుపరి ధరల పెరుగుదల అమల్లోకి రావచ్చు’’ అని సీఈఏఎంఏ ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ తెలిపారు. ఈ సీజన్లో వినియోగ డిమాండ్ దెబ్బతినకుండా రేట్ల పెంపును అమలు చేయడం తమకు సవాలని జాన్సన్ కంట్రోల్స్ హిటాచి ఎయిర్ కండీషనింగ్ ఇండియా చైర్మన్, ఎండీ, గుర్మీత్ సింగ్ పేర్కొన్నారు. ధరల భారం సర్దుబాటు చేసుకునేందుకు తమవైపు నుంచి వీలైనంత ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. గతేడాది ఇచ్చి న ఆఫర్లను సైతం ప్రస్తుత సీజన్‌కు వచ్చే సరికి తగ్గించేసినట్టు గుర్మీత్‌సింగ్ తెలిపారు. తాము ధరల పెంపు విషయంలో వేచి చూస్తున్నట్టు గో ద్రేజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్ కమల్‌నంది తెలిపారు. ‘గత 2 వేసవి సీజన్లపై లాక్డౌన్ ప్రభావం పడింది. దాంతో చాలా మంది కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు. ఈ సీజన్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండడం, హైబ్రిడ్ పని నమూనా వినియోగ డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తాయని అంచనా వేస్తున్నాం’ అని కమల్ నంది తెలిపారు. -
క్యాబ్‌లో ప్రయాణించే వారికి షాకింగ్ న్యూస్..!
రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగాయి. కాగా గత వారం రోజుల నుంచి ఇంధన ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో క్యాబ్ డ్రైవర్లు షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎసీ ఆన్ చేస్తే ఎక్స్ట్రా..! ఇంధన ధరల పెంపుతో క్యాబ్ డ్రైవర్లు భారీగా ప్రభావితమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో క్యాబ్స్‌లో ప్రయాణికులు ఏసీని ఆన్ చేయమని కోరితే దానికి అదనంగా వసూలు చేస్తామని డ్రైవర్లు నిర్ణయించుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. కాగా ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. వాహనాల్లో ఎసీను స్విచ్ ఆన్ చేయాలంటే అదనంగా చెల్లించాలనే బోర్డులను ఆయా క్యాబ్ సంస్థల డ్రైవర్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఏసీలను ఆన్ చేసినందుకుగాను రూ. 50 నుంచి రూ. 100 మేర అదనపు ఛార్జీలను వసూలు చేస్తామనే స్టికర్స్‌ను క్యాబ్ సంస్థల డ్రైవర్లు కారులో ఏర్పరిచారు. భారీ నష్టం..! ఆయా క్యాబ్ కంపెనీలు అందించిన సర్వీసులకు గాను క్యాబ్ డ్రైవర్లు వారికి ప్రతి రైడ్‌లో 25 నుంచి 30 శాతం వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఏసీ ఆన్ చేయడంతో కారు మైలేజ్ సుమారు మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల మేర తేడా వస్తుందని క్యాబ్ డ్రైవర్లు పేర్కొంటున్నారు. ఇంధన ధరలు పెరగడంతో ఇక భారం మోయలేమని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్ యూనియన్ పేర్కొంది. ఏసీని ఆన్ చేస్తే క్యాబ్ అగ్రిగేటర్లకు కమిషన్ ఇవ్వడం అసాధ్యమని యూనియన్ పేర్కొంది. క్యాబ్ ప్రయాణికులకు ఈ విషయంపై అవగాహన కల్పిస్తోన్నట్లు పేర్కొంది. అంతేకాకుండా ప్రస్తుత క్యాబ్ ఛార్జీలపై రవాణా శాఖ జోక్యం చేసుకోవాలని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్ యూనియన్ కోరింది. చదవండి: ఓటీటీ దెబ్బకు ఇండియన్ బిగెస్ట్ సినిమా బ్రాండ్ల విలీనం..! -
మరింత విలాసవంతంగా రైలు ప్రయాణాలు..!
న్యూ ఢిల్లీ: రానున్న రోజుల్లో రైలు ప్రయాణాలు మరింత సౌకర్యవంతంగా ఉండనున్నాయి. త్వరలోనే సరికొత్త ‘ఎసీ ఎకానమీ' కోచ్‌లను ఇండియన్ రైల్వేస్ ప్రారంభించనుంది. కోవిడ్ రాకతో ఈ కోచ్‌ల తయారీకి ఆటంకం ఏర్పడింది. ఈ కోచ్‌లను కపుర్తాలా, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తయారు చేసింది. ప్రస్తుతం ఉన్న ఎసీ 3-టైర్ కంటే తక్కువగా, నాస్ ఎసీ స్లీపర్ కంటే ఎక్కువగా ఎసీ ఎకానమీ కోచ్ ధరలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ కోచ్‌ల రాకతో ప్రయాణికులకు తక్కువ ధరలో ఎసీ ప్రయాణాలను ఇండియన్ రైల్వేస్ అందించనుంది. కాగా ఎసీ ఎకానమీ కోచ్‌ల అధికారిక పేరును, లాంచ్ డేట్లను ఇండియన్ రైల్వేస్ ఇంకా నిర్ణయించలేదు. కపుర్తాలా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తయారుచేసిన కోచ్‌లను దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేసినట్లు తెలుస్తోంది. ఎసీ ఎకానమీ కోచ్‌ల ఫీచర్లు ప్రతి కోచ్‌లో కనిపించే 72 బెర్తులకు బదులుగా 83 బెర్తులను కలిగి ఉంటుంది. ఇది ప్రయాణీకుల సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రతి బెర్త్‌లో వ్యక్తిగత రీడింగ్ లైట్లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లతో పాటు బెర్త్‌లకు స్వంత ఎసీ వెంట్ల ఏర్పాటు ఉంది. ప్రతి కంపార్ట్మెంట్లో ఫోల్డబుల్ స్నాక్ టేబుల్, వాటర్ బాటిళ్ల హోల్డర్లు, మ్యాగజైన్స్, మొబైల్ ఫోన్ల హోల్డర్లను అమర్చారు. ఈ ఎసీ ఎకానమీ కోచ్‌లు దివ్యాంగులకు అనువుగా ఉంటాయి. కంపార్ట్మెంట్లకు వీల్ చైర్ యాక్సెస్‌ను ఏర్పాటు చేశారు. Despite Covid-19 restrictions affecting production in workshops, Rail Coach Factory, Kapurthala rolls out 15 coaches of 3 Tier AC Economy class with updated design, divyangjan friendly doors & toilets, with a plan to produce 248 such coaches this fiscal. pic.twitter.com/CFijKEVWdl — Ministry of Railways (@RailMinIndia) June 2, 2021 -
మూడు వాగులు.. ఆరు కిలోమీటర్లు..
సాక్షి, ఆసిఫాబాద్(తిర్యాణి): పల్లె ప్రగతి పనుల పరిశీలనకు కుమ్రంభీం జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్‌రెడ్డి అటవీ బాటపట్టారు. బుధవారం తిర్యాణి మండలం రోంపెల్లి నుంచి గుండాల గ్రామం వరకు దట్టమైన అటవీ ప్రాంతంలో ఆరు కిలోమీటర్ల నడకలో మూడు వాగులు దాటారు. గుండాలలో పల్లె ప్రగతి పనులు, జలపాతం సందర్శించారు. గ్రామస్తులతో సమావేశమై ఎకో టూరిజం డెవలప్మెంటు ద్వారా గుండాల జలపాతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, తద్వారా ఇక్కడి 20 మంది యువకులకు స్వయం ఉపాధి లభిస్తుందని తెలిపారు. జలపాతం వద్ద గుడారాలను ఏర్పాటు చేసి పర్యాటకుల సంఖ్య మరింత పెరిగేలా చర్యలు చేపడతామని, రొంపెల్లి నుంచి గుండాల వరకు రోడ్డు సౌకర్యం కోసం ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలిపారు. ఆయన వెంట గిన్నెదరి ఫారెస్టు రేంజ్ అధికారి ప్రణయ్, ఈజీఎస్ ఏపీవో శ్రవణ్‌కుమార్, సర్పంచ్ జంగుబాయి, పంచాయతీ కార్యదర్శి రాధాకిషన్, ఆదివాసీ నాయకులు శంకర్, కోవ మెతిరాం, సీతారాం, అశోక్ ఉన్నారు. -
కూల్ కూల్‌గా రైలు ప్రయాణం
సాక్షి, అమరావతి: రైళ్లలోని త్రీటైర్ ఏసీ బోగీల్లో చాలీచాలనీ ఏసీ.. ఇరుకు బెర్త్‌లతో ఇక్కట్లు.. అటూ ఇటూ నడిచేందుకు అవస్థలకు ఇక చెక్ పడనుంది. త్రీటైర్ ఏసీ రైలు ప్రయాణం మరింత కూల్ కూల్‌గా మారనుంది. జర్మనీకి చెందిన ‘లింక్ హాఫ్మన్ బుష్’ (ఎల్‌హెచ్‌బీ) సాంకేతిక పరిజ్ఞానంతో సౌకర్యవంతంగా రూపొందించిన అధునాతన బోగీలను రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. పంజాబ్ కపుర్తలాలోని కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేసిన అధునాతన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను దేశవ్యాప్తంగా అన్ని మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో దశలవారీగా ప్రవేశపెట్టనుంది. తద్వారా తక్కువ చార్జీలతో అత్యంత సౌకర్యవంతమైన ఏసీ రైలు ప్రయాణాన్ని అందుబాటులోకి రానుంది. సౌకర్యం.. భద్రత ► ప్రస్తుతం ఉన్న కోచ్‌లలో అప్పర్ బెర్త్‌కే ఏసీ సరిగా వస్తుంది. మిడిల్, లోయర్ బెర్త్‌లకు చల్లదనం సరిగా రాదు. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లలో ఈ సమస్య ఉండదు. చల్లదనాన్ని అందించేందుకు ప్రతి బెర్త్ వద్ద ఏసీ వెంట్ ఏర్పాటు చేశారు. దీనివల్ల అప్పర్, మిడిల్, లోయర్, సైడ్ బెర్త్‌లకూ సమాన రీతిలో చల్లదనం వస్తుంది. ► మెరుగుపరచిన మాడ్యులర్ డిజైన్లతో బెర్త్‌లు రూపొందించారు. బెర్త్‌ల పొడవు, వెడల్పు పెంచారు. అప్పర్, మిడిల్, లోయర్ బెర్త్‌ల మధ్య దూరాన్ని కొంత పెంచారు. ► మొబైల్ ఫోన్లు, నీళ్ల సీసాలు, పేపర్లు పెట్టుకునేందుకు ప్రతి బెర్త్‌కు ప్రత్యేకంగా హోల్డర్లు ఏర్పాటు చేశారు. ► ప్రత్యేకంగా రీడింగ్ ల్యాంప్, మొబైల్ ఫోన్ చార్జింగ్ పాయింట్ పెట్టారు. ► కంటికి ఇబ్బందిలేని రీతిలో ప్రకాశవంతమైన లైట్లను ఏర్పాటు చేశారు. కోచ్ అంతటా లైట్ల కాంతి ప్రసరించేలా డిజైన్ చేశారు. ► ప్రస్తుతం ఉన్న కోచ్‌లలో 72 బెర్త్‌లు ఉన్నాయి. కొత్తగా రూపొందించిన ఈ కోచ్‌లలో 83 బెర్త్‌లు ఉంటాయి. ► కోచ్‌లకు పెద్ద తలుపులు ఏర్పాటు చేయడంతోపాటు నడవా (బెర్త్‌ల మధ్య ఖాళీ జాగా) విశాలంగా ఉంటుంది. దాంతో దివ్యాంగులకు ఇబ్బందులు తొలగుతాయి. ► భద్రతకు మరింత ప్రాధాన్యమిచ్చారు. టాయిలెట్లు పెద్దగా ఏర్పాటు చేశారు. అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో.. ఒక్కో కోచ్ తయారీకి రూ.3 కోట్లు ఖర్చవుతుంది. రాజధాని, శతాబ్ధి, దురంతో, జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లు మినహా మిగిలిన అన్ని రైళ్లలోనూ వీటిని అందుబాటులోకి తెస్తారు. 2021–22లో 248 కోచ్‌లు తయారు చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది నుంచి కోచ్‌ల తయారీని ఇంకా పెంచాలని భావిస్తోంది. త్రీ టైర్ ఏసీ కోచ్‌లో ప్రయాణ చార్జీలను రైల్వే బోర్డు త్వరలో నిర్ణయించనుంది. -
ఏసీ విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి
ఎయిర్ కండిషనర్స్‌తో ఆరోగ్యపరంగా కొన్ని ప్రయోజనాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. వృత్తిరీత్యా ఏసీలో గడపాల్సి వచ్చి వాటి కారణంగా ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంటే ఆ నష్టాలను తెలుసుకుని వాటి గురించి జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే వాటి నుంచి ఆశించే ప్రయోజనం ఉంటుంది. ఎయిర్ కండిషనర్‌తో ప్రయోజనాలివి... ► ఎయిర్ కండిషనర్ కారణంగా గది ఎప్పుడూ ఒకేలాంటి వాతావరణం లో ఉంటుంది. ఇలా ఉంచడం ద్వారా వాతావరణ మార్పుల వల్ల వచ్చే అనర్థాలూ, అనారోగ్యాల బారిన మనం పడకుండా చూస్తాయవి. ► కొన్ని అధునాతన ఎయిర్ కండిషనర్స్‌తో ఉండే కొన్ని ఫిల్టర్స్ చాలా సూక్ష్మస్థాయిలో ఉండే కాలుష్యాల (మైక్రోస్కోపిక్ పొల్యుటెంట్స్) నుంచి మనల్ని కాపాడతాయి. ► బయటి చప్పుళ్లు లోపలికి వినిపించనివ్వకుండా శబ్ద కాలుష్యం నుంచి ఎయిర్ కండిషనర్స్ మనల్ని కాపాడుతాయి. నష్టాలివి... ► పైన పేర్కొన్న ప్రయోజనాలిచ్చే ఇవే ఎయిర్‌కండిషనర్లతో కొన్ని నష్టాలూ ఉంటాయి. అవి... ► బయటి ఫ్రెష్ గాలులు చాలాకాలం పాటు సోకకుండా ఉన్నందున కొందరిలో ఏసీ కారణంగా కార్డియోవాస్కు్కలార్ సమస్యలు, శ్వాసకోశ సమస్యలైన ఆస్థమా, పిల్లికూతలు రావచ్చు. ► కొందరిలో ఏసీ వల్ల ఒకరకం నిమోనియా అయిన లెజియోన్నేరిస్ వంటి వ్యాధులూ రావచ్చు. ► కొందరిలో అదేపనిగా ఏసీలో ఉన్నవారు నీళ్లు తక్కువగా తాగుతూ ఉండటంతో కిడ్నీలో స్టోన్స్ ఏర్పడవచ్చు. ► కొందరిలో చర్మంపై దురదలు, తలనొప్పులు, అలసట వంటివి రావచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ► ఎప్పుడూ ఏసీలో ఉండేవారు అప్పుడప్పుడూ చల్లగాలికి వచ్చి ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటూ ఉండాలి. దానికోసం వాతావరణంలో కాలుష్యం తక్కువగా ఉండే వేళల్లో (సాధారణంగా ఉదయం వేళల్లో) ఆరుబయటికి రావడం మంచిది. ► ఏసీలోని ఫిల్టర్స్ తరచూ శుభ్రపరుస్తూ ఉండాలి. ► ఏసీలోని ఫిల్టర్స్‌ను సబ్బుతో కడగాల్సి వచ్చినప్పుడు అవి పూర్తిగా ఆరిన తర్వాతే వాటిని బిగించాలి. ► ఏసీ కారణంగా ఆరోగ్యంపై దుష్ప్రభావాలు కనిపిస్తుంటే (అంటే ఏసీ సరిపడనివాళ్లు) వాటిని వీలైనంతగా అవాయిడ్ చేయాలి. లేదా తక్కువగా వాడాలి. చదవండి: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్.. ఓపెనింగ్ ఎప్పుడంటే! డ్రగ్స్ కేసులో అరెస్టైన సంజన రహస్య పెళ్లి..ఫోటో వైరల్ -
తక్కువ ఛార్జీలతో ఏసీ రైలు ప్రయాణం!
సాక్షి, న్యూఢిల్లీ: తక్కువ ఛార్జీలతో ఏసీ రైలు ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు భారతీయ రైల్వే త్వరలో ప్రవేశపెట్టనున్న థర్డ్ ఏసీ ఎకానమీ క్లాస్ కోచ్‌లను కపుర్తలా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సిద్ధం చేసింది. ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయిందని రైల్వే శాఖ తెలిపింది. రాజధాని, శతాబ్ది, దురంతో, జన శతాబ్ది, తదితర ప్రత్యేక తరహా రైళ్లు మినహాయించి.. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడిచే ఇతర మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ థర్డ్ ఏసీ ఎకానమీ క్లాస్ కోచ్‌ను అందుబాటులోకి తెస్తారు. ప్రతి బెర్త్‌కు ఏసీ డక్ట్ అమర్చారు. చదివేటపుడు తగిన వెలుతురొచ్చేలా ప్రతి బెర్త్ వద్ద లైట్లు ఏర్పాటుచేశారు. బెర్త్ వద్ద మొబైల్ చార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి తెచ్చారు. మధ్య, ఎగువ బెర్త్‌లకు చేరుకునేందుకు అనుకూల డిజైన్‌తో నిచ్చెనలు రూపొందించారు. -
దేశంలో ఫస్ట్ ఏసీ రైల్వే టర్మినల్
బెంగళూరు రైల్వే టెర్మినల్ ను దేశంలోనే తొలిసారిగా సెంట్రలైజ్డ్ ఎయిర్ కండీషనింగ్, తదితర అధునాతన సదుపాయాలతో నిర్మించారు. దీనికి ప్రఖ్యాత ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరును పెట్టారు. దేశంలోనే మొట్టమొదటి ఏసీ టర్మినల్ నిర్మాణానికి రూ.314 కోట్ల ఖర్చు అయ్యింది. ఈ నెలాఖరులో ప్రారంభించడానికి ఏసీ రైల్వే టర్మినల్ సర్వం సిద్ధమైంది. "భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరుతో బెంగళూరులో నిర్మించిన తొలి ఏసీ రైల్వే టర్మినల్ త్వరలో ప్రజలకు వినియోగంలోకి రానున్నదని" రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. Named after one of the foremost Civil Engineers Bharat Ratna Sir M Visvesvaraya, India's first centralised AC Railway terminal in Bengaluru is all set to become operational soon. pic.twitter.com/L2agyUevd1 — Piyush Goyal (@PiyushGoyal) March 13, 2021 బెంగళూరుతో అనుసంధానానికి మరిన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో బయప్పనహల్లిలో న్యూ కోచ్ టర్మినల్ నిర్మాణానికి 2015-16లో ప్రణాళిక సిద్ధం చేశామని సౌత్ వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ చెప్పారు. భారతదేశంలో మొట్ట మొదటి ఈ సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్డ్ రైల్వే టెర్మినల్ ను బెంగళూరు విమానాశ్రయం తరహాలో నిర్మించినట్లు పేర్కొన్నారు. ఈ స్టేషన్ నుంచి ప్రతిరోజు 50 రైళ్లను నడపనున్నారు. 4,200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టర్మినల్ రోజు 50 వేల మంది వరకు స్టేషన్‌ను సందర్శించడానికి అనుకూలంగా ఉంటుంది. టెర్మినల్‌లోఏడు ప్లాట్‌ఫారమ్‌లు, 3 పిట్ లైన్లు ఉన్నాయి.ప్రయాణికుల సౌకర్యార్థం రెండు సబ్‌వేలు, ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఎస్కలేటర్లు, వీఐపీ లాంజ్, ఫుడ్ కోర్టు, అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాలు, రియల్ టైం ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టం తదితర వసతులు కల్పించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. చదవండి: కొత్త ఏసీ కొనాలనుకునే వారికి షాక్! ఆన్లైన్ లో నకిలీ వస్తువులు అమ్మితే ఇక అంతే! -
మార్కెట్ లోకి నోకియా ఏసీలు..
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కీలక ప్రకటన చేసింది. ప్రముఖ టెలీకమ్యూనికేషన్స్ కంపెనీ 'నోకియా'తో కలిసి 'మేడిన్ ఇండియా' నోకియా ఎయిర్ కండీషనర్స్ ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. నోకియా బ్రాండ్ తో రాబోతున్న ఏసీలు ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఇందులో స్వచ్ఛమైన గాలి కోసం 6-ఇన్ -1 ఫిల్టర్లు, యాంటీమైక్రోబయల్ అయానైజర్ ఇన్ బిల్డ్ గా రానున్నట్లు పేర్కొంది. ఇందులో ఇంటెలిజెంట్ మోషన్ డిటెక్షన్ సిస్టమ్, 4-ఇన్ -1 అడ్జస్ట్బుల్ ఇన్వర్టర్ మోడ్ కూడా ఉంది. నోకియా ఏసీలో స్మార్ట్ డయాగ్నోసిస్, షెడ్యూలింగ్ ప్రోగ్రామ్, కస్టమైజ్డ్ యూజర్ ప్రొఫైల్స్ ఉంటాయి. అలాగే సెల్ఫ్ క్లీనింగ్ టెక్నాలజీ, యాంటీ-కరోసివ్ బ్లూ ఫిన్ టెక్నాలజీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉన్న రాగితో తయారు చేసిన ఇంటర్నల్స్, టర్బో క్రాస్ ఫ్యాన్ ఫ్లో, డ్యూయల్ రోటరీ కంప్రెసర్, ట్రిపుల్ ఇన్వర్టర్ టెక్నాలజీ వంటివి కూడా ఇందులో ఉన్నాయి. వైఫై కనెక్టెడ్ స్మార్ట్ క్లైమాట్ కంట్రోల్ ఫీచర్లతో నోకియా ఏసీలను ఆపరేట్ చేసుకునే విధంగా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. స్మార్ట్ఫోన్లతో కూడా ఈ ఏసీలను ఆపరేట్ చేయొచ్చని నోకియా తెలిపింది. డిసెంబర్ 29,2020 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో 30,999 రూపాయల నుంచి నోకియా ఏసీలు విక్రయించనున్నారు. -
షాకింగ్: ఏసీ పైపులో 40 పాము పిల్లలు
సాక్షి,మీరట్ : ఉత్తర ప్రదేశ్ లో భీతి గొలిపే సంఘటన వెలుగు చూసింది. మీరట్ జిల్లాలోని ఒక గ్రామంలో ఒక రైతుకు చెందిన ఏసీలో పాము కాపురం పెట్టింది. ఏకంగా 40 పిల్లలు బయటపడటం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఈ సంఘటన సోమవారం రాత్రి కంకర్‌ఖేరా పోలీసు స్టేషన్ పరిధిలోని పావ్లీ ఖుర్ద్ గ్రామంలో జరిగింది. శ్రద్ధానంద్ అనే రైతు తన ఇంట్లో ముందు నేలమీద ఒక పాము పిల్లను చూశారు. దాన్ని తీసి అవతల పారేశారు. కొద్దిసేపటి తరువాత, నిద్రించేందుకు తన గదికి వెళ్లేసరికి మంచం మీద మరో మూడింటిని చూశారు. దీంతో ఏసీని ఓపెన్ చేసి మరింత నిశితంగా పరిశీలించినపుడు ఏసీ పైపులో 40 పాము పిల్లలను చూసి షాక్ అయ్యారు. ఈ వార్త వ్యాపించడంతో స్థానిక ప్రజలు శ్రద్ధానంద్ ఇంటి వద్ద గుమిగూడారు. చివరకు స్థానికుల సహాయంతో, రైతు వాటిని సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. చాలా కాలంగా ఏసీ వాడకపోవడం, లేదా సర్వీసింగ్ చేయకపోవడంతో పాములు గుడ్లు పెట్టి ఉండవచ్చని, ఆ గుడ్ల నుంచి పిల్లలు ఇపుడు బయటకు వచ్చాయని స్థానిక పశువైద్యుడు వత్సల్ అభిప్రాయపడ్డారు. చదవండి : ఉద్యోగులకు రెనాల్ట్ ఇండియా వరాలు -
ఏసీ ప్రమాదం: బీజేడీ నేతతో సహా ముగ్గురి మృతి
భువనేశ్వర్ : అధికార బీజేడీ నాయకుడు ఆలేఖ్ చౌదరి ఇంట్లో శుక్రవారం వేకువజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆలేఖ్ చౌదరి సహా మొత్తం ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బరంపురలోని గుసానినువాగం, పాణిగ్రహి వీధిలో నివాసం ఉంటున్న ఆలేఖ్ చౌదరి రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆయన గదిలోని ఏసీ(ఎయిర్ కండిషనర్)లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ఆ గదిలో నిద్రిస్తున్న ఆలేఖ్ చౌదరికి మెలుకువ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఆయన కుటుంబ సభ్యులను ఇంటి నుంచి బయటకు పంపించేశారు. అనంతరం తన గదిలో నిద్రిస్తున్న బావమరిది భగవాన్ పాత్రో, బంధువు సునీల్ బెహరాను కాపాడేందుకు వెళ్లిన ఆయనకి ఊపిరాడకపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి, అదే గదిలో పడిపోయారు. ఎంతసేపటికీ ఆయన ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడ ఎగసిపడుతున్న మంటలను ఆర్పివేసి, అందులో అపస్మారక స్థితిలో పడి ఉన్న వారిని వైద్య సేవల నిమిత్తం ఎంకేసీజీ మెడికల్‌కు తరలించారు. అయితే అప్పటికే వారు చనిపోయినట్లు సమాచారం. బరంపురం సహకార సమితి మాజీ చైర్మన్‌గా, బీజేడీ గంజాం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఆయన సేవలందించారు. మంచి జనాదరణ ఉన్న నేతగా గుర్తింపు ఉంది. ఇదిలా ఉండగా, ఆయన మరణ వార్త విన్న ఎంపీ చంద్రశేఖర సాహు, ఎమ్మెల్యే విక్రమ్ పండా ఎంకేసీజీ ఆస్పత్రి చేరుకుని, వారి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇదే విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు పాణిగ్రాహి వీధిలో దర్యాప్తు చర్యలు ప్రారంభించారు. ఘటన ఎలా జరిగిందన్న విషయంపై అక్కడి ప్రత్యక్ష సాక్షుల నుంచి సమాచారం సేకరించారు. అంతిమ వీడ్కోలు.. పోస్టుమార్టం అనంతరం ఇంటికి తీసుకువచ్చిన ఆలేఖ్ చౌదరి మృతదేహానికి అంత్యక్రియలు జరిపారు. ఈ సందర్భంగా బీజేడీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, బంధువర్గం ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. -
చల్లగా.. హాయిగా..!
లక్డీకాపూల్: నగరంలో ఎండలు మండిపోతున్నాయి. వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు, కూలర్లకు డిమాండ్ పెరిగింది. షోరూమ్‌లకు కొనుగోలుదారులు క్యూ కడుతున్నారు. దీంతో నగరంలోని ఆయా ఎలక్ట్రానిక్ షాపులు కిటకిటలాడుతున్నాయి. లాక్డౌన్ కారణంగా రెండు నెలలుగా మూతపడిన ఇవి ఆంక్షల సడలింపుతో మళ్లీ కొత్త కళను సంతరించుకున్నాయి. రోహిణి కార్తె అరుదెంచిన నేపథ్యంలో ఎండ తీవ్రత పెరిగింది. ఉక్కపోత, వేడిని తట్టుకోవడం కష్టతరంగా తయారైంది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కారణంగా ఇంటిల్లిపాదీ ఇంటికి పరిమితమయ్యారు. కార్యాలయాలు, పాఠశాలలు మూతపడడంతో పిల్లలు సహా ఇళ్లలోనే ఉండిపోయారు. ఈ పరిస్థితుల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో ఉపశమనం కోసం ఒక్కసారిగా ఏసీలు, కూలర్లకు గిరాకీ పెరిగింది. ఎండను సైతం లెక్క చేయక.. గ్రేటర్ ప్రజలు సోమవారం నగరంలోని ఎలక్ట్రానిక్ షోరూమ్‌ల ఎదుట ఎండను సైతం లెక్కడ చేయకుండా బారులు తీరారు. ఈ క్రమంలో పంజగుట్ట, చందానగర్, మియార్పూర్, కొండాపూర్, గచ్చిబౌలి, ముషీరాబాద్, తార్నాక, హబ్సిగూడ, సికింద్రాబాద్, అబిడ్స్, కోఠి, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల్లోని ఎలక్ట్రానిక్ షోరూమ్‌లకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో చిన్న చిన్న ఎలక్ట్రానిక్ షాపులు సైతం కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. -
సెంట్రలైజ్డ్ ఏసీతో కరోనా వ్యాప్తి
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం లాక్డౌన్ విధించినప్పటికీ కొన్ని సంస్థలు, రంగాలకు మినహాయింపునిచ్చింది. దీంతో ఆయా సంస్థలు, కార్యాలయాలు, పరిశ్రమల ఉద్యోగులు భౌతిక దూరం పాటిస్తూ విధులకు హాజరవుతున్నాయి. అయితే గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల హెచ్చరించింది. ఈ క్రమంలో సెంట్రలైజ్డ్ ఏసీలు వినియోగించే కార్యాలయాలతో పాటు ఏసీలు, ఎయిర్ కూలర్లు వినియోగించే విషయంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ హీటింగ్, రిఫ్రిజిరేటింగ్ అండ్ ఎయిర్ కండిషనర్ ఇంజనీర్స్ (ఐఎస్హెచ్ఆర్ఏఈ) పలు రకాల సూచనలు చేసింది. ప్రయోగాత్మక పద్ధతుల ఆధారంగా చేసిన ఈ సూచనలకు అనుబంధంగా కేంద్ర ప్రజా పనుల శాఖ (సీపీడబ్ల్యూడీ) మార్గదర్శకాలు జారీ చేసింది. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా కొనసాగుతున్న కార్యాలయాల్లో ఏసీలు, ఎయిర్ కూలర్లు, ఫ్యాన్లు వినియోగించే సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు ఈ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. ఏసీలు, కూలర్లు ఎలా వాడాలంటే... సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్డ్ సిస్టంలో గాలి అంతా అదే ప్రాంతంలో ఉంటుంది. ఈ సిస్టం పనిచేసే విస్తీర్ణంలో గాలి ఒక చోటు నుంచి మరోచోటుకు ప్రయాణిస్తుంది. దీంతో కరోనా వైరస్ సోకిన వ్యక్తి ఒకసారి సెంట్రలైజ్డ్ ఏసీ సిస్టం ఉన్న ప్రాంతంలోకి వస్తే వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. ఈక్రమంలో వైరస్ వ్యాప్తిని నిరోధించాలంటే జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ఈ క్రమంలో ఏసీ ఉష్ణోగ్రతలను ఎలా ఉంచాలనే విషయంలోనూ సీపీడబ్ల్యూడీ సూచనలు చేసింది. ► గది ఉష్ణోగ్రత 24–30 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్య ఉండేలా చూడాలి. గాలిలో తేమ స్థాయి 40–70 డిగ్రీల మధ్య ఉండాలి. తక్కువ తేమ, ఉష్ణోగ్రతలుంటే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ► ఇళ్లలో వినియోగించే స్ల్పిట్ ఏసీ ఫిల్టర్ల ను, కార్యాలయాల్లో వినియోగించే సెం ట్రలైజ్డ్ ఏసీల డక్ట్‌లను శుభ్రపరచాలి. ► ఎయిర్ కండిషనర్లు పనిచేస్తున్నప్పటికీ బయటి నుంచి గాలిలోనికి వచ్చేలా, గదిలోని గాలి బయటకు వెళ్లేలా కిటికీలను తెరిచిపెట్టడం మంచిది. ఏసీలు వాడకుంటే మాత్రం తలుపులు, కిటికీ లు, వెంటిలేటర్లు తెరిచి ఉంచాలి. ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఎల్లప్పుడూ ఆన్‌లోనే ఉంచాలి. ► ఇళ్లు, కార్యాలయాల్లో ఎయిర్ కూలర్లు వాడుతున్న వారు బయటి గాలి వాటికి తగిలేలా జాగ్రత్తపడాలి. ►ఎయిర్ కూలర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు క్రిమిసంహారకాలతో శుభ్రం చేసుకోవాలి. తరచూ నీటిని ఖాళీ చేసి, మళ్లీ నింపుకోవాలి. ►ఫ్యాన్లు వినియోగించేవారు కిటీకీలను కొద్దిగా తెరిచి ఉంచాలి. ఫ్యాన్ వాడే గదిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటే, వెంటిలేషన్ కోసం దాన్ని ఆన్ చేసి పెట్టడం మంచిది. -
చలికాలం హెల్మెట్ సరే మరి ఎండాకాలం..?
కర్ణాటక, యశవంతపుర : వేసవిలో మండే ఎండలకు హెల్మెట్ ధరించటమంటే తలకు మించిన భారంగా భావిస్తారు. అయితే సమస్యను పరిష్కారించటానికి బెంగళూరుకు చెందిన మెకానికల్ ఇంజనీర్ హెల్మెట్‌కు ఏసీ సాధనాన్ని తయారు చేశారు. దీనికి ‘వాతానుకూల’ అని నామకరణం చేశారు. వేసవిలో చల్లగాను, చలికాలంలో వేడిగా ఉండటానికి ఈ పరికరాన్ని తయారు చేశారు. బహుళజాతి సంస్థలలో డైరెక్టర్‌గా పని చేస్తున్న ఆర్టీ నగరకు చెందిన సందీప్ దహియా ఈ సాధనాన్ని అవిష్కరించారు. ఉపయోగదారుల ఉత్పత్తులను తయారు చేసే పరికరాలను విన్యాసం(డిజైన్) చేయటంలో సిద్ధహస్తుడిగా సందీప్ దహియాకు పేరుంది. ఆయన ఆర్టీనగరలో గ్యారేజీ కం వర్క్‌షాపును కూడా నడుపుతున్నారు. యువకుడు సందీప్ దహియా చేసిన ఏసీ హెల్మెట్‌పై అందరినీ అకర్షిస్తోంది. వీపుపై జాకెట్‌కు వెనుక తగిలించుకుని హెల్మెట్‌కు ఏసీ గాలి వచ్చేలా సాధనాన్ని తయారు చేశారు. నాలుగేళ్ల నుండి హెల్మెట్‌పై ప్రయోగం గత నాలుగేళ్ల నుండి సందీప్ దహియా హెల్మెట్లపై అనేక ప్రయోగాలను చేస్తున్నారు. బైకుకు ఉయోగించే 12 ఓల్ట్ సామర్థ్యంగల బ్యాటరీ (డీసీ)ని ఇందుకు ఉయోగించారు. బెంగళూరు నగరంలాంటి ప్రాంతాల్లో సిగ్నల్స్ పడగానే తలలో వేడికి కొందరు హెల్మెట్లను తీసేస్తారు. అలా ఎందుకు తీయాలో ఒక అలోచన వచ్చింది. దీనిపై సీరియస్‌గా దృష్టి సారించిన సందీప్ దహియా ఏసీ హెల్మెట్‌ను ఎలాగైనా తయారు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. నేను కూడా హెల్మెట్ జీవరక్షణ ధరిస్తున్నట్లు భావించా. హెల్మెట్ ధరించటంతో తలలో వేడి పుడుతుంది. దీంతో వెంట్రుకలు రాలిపోతున్నట్లు కొందరు అంటుంటారు. ఈ కారణంతో తను తయారు చేసే హెల్మెట్ అన్ని వాతావారణాలకు అనుకూలంగా ఉండలానే ఉద్దేశంతోనే ‘వాతానుకూల’గా హెల్మెట్‌కు పేరు పెట్టినట్లు సందీప్ దహియా వివరించారు. ఏర్ కూల్‌తో 1.7 కేజీలు మాములుగా ప్రస్తుతం ఉపయోగిస్తున్న హెల్మెట్ 8 వందల గ్రాముల నుండి రెండు కేజీలుంటాయి. అయితే ఈ హెల్మెట్ 1.7 కేజీల బరువు ఉంది. ఇందులో రెండు భాగాలుగా విభజించారు. వీపుపై బ్యాక్‌ప్యాక్‌తో ఏసీ పరికరాన్ని తగిలించుకోవాలి. అక్కడ నుండి రబ్బర్ ట్యాబ్ ద్వారా తలకు ధరించిన హెల్మెట్‌కు ఏసీ గాలిని అందిస్తుంది. వేడిని చల్లగా మార్చే ఏర్ కూలింగ్ పని చేస్తుంది. ఈ చల్లదనాన్ని అందిస్తున్న పరికరాలకు నీరు అవసరంలేదు. ఈ సాధనం సెమి కండక్టర్‌తో అనుసంధానం చేశారు. ఈ సాధనం ద్వారా వేడిని తగ్గించవచ్చు. పెచ్చుకోవచ్చు. హెల్మెట్‌కు బ్యాటరితో ఎలాంటి సంబధం లేదు. రబ్బర్ నుండి గాలిని హెల్మెట్‌కు అందిలా వ్యవస్థను కల్పించారు. ఏసీని నియంత్రించటానికి సాధనంలో ఒక చిన్న రిమోట్‌ను కూడా ఉపయోగించారు. ఇప్పుటి వరకు డిమాండ్ ఆధారంగా 40 మంది వినియోగదారులకు ఏసీ హెల్మెట్‌ను తయారు చేసి ఇచ్చినట్లు సందీప్ తెలిపారు. ఆర్టీ నగరలోని తన ఇంటీ నుండి యుబీ సీటీలో తను పని చేస్తున్న అఆఫీసు వరకు ఏసీ హెల్మెట్‌ను సందీప్ దహియా ఉపయోగిస్తున్నా రు. బైక్‌పై వెళ్తుండగా అనేక మంది వీపుపై ఉన్న యంత్రం ఏమిటని అడుగుతున్నారు. హెల్మెట్ ఏసీ అని చెప్పగానే అందరూ ఆశ్చర్యంగా గమనిస్తున్నట్లు సందీప్ వివరించారు. దీనికి అవుతున్న ఖర్చును మాత్రం చెప్పటం లేదు. పరికరాల ఉపయోగాన్ని బట్టి ధరలుంటాయని సందీప్ తెలిపారు. కనీసం రూ. మూడు వేల నుండి ఏడు వేల వరకు ధర ఉండవచ్చు. -
రూ.800కే ఏసీ..
గాంధీనగర్ : ఏసీ ఇప్పటికీ చాలామందికి ఖరీదైన వ్యవహారమే. అయితే ఇకపై ఏసీల కోసం అంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదంటున్నారు మనోజ్ పటేల్. గుజరాత్‌లోని వడోదరలో తన పేరుతోనే ఓ డిజైన్ స్టూడియో నిర్వహిస్తున్న ఈ వ్యక్తి.. రూ.800తోనే ఏసీ తయారు చేశారు. ఒక్కసారి మట్టికుండలోని నీటి చల్లదనాన్ని గుర్తు చేసుకోండి. మట్టిలోని అతిసూక్ష్మ రంధ్రాల గుండా వెళ్లే నీరు ఆవిరి కావడం చల్లదనానికి కారణమని తెలిసిన విషయమే. సరిగ్గా ఇదే ఆలోచనతోనే మనోజ్ పటేల్ చిన్నసైజు ఏసీ తయారు చేశారు. కాకపోతే ఇందులో మట్టికి బదులుగా పింగాణీ ఉపయోగిస్తారు. ప్రస్తుతం మనోజ్ పటేల్ మూడు మోడళ్ల ఏసీని తయారు చేశారు. ఒకదాంట్లో పైన ట్యాంకులోని నీటి మోతాదును చెప్పేందుకు ఓ సూచికతో పాటు ఓ మొక్క పెంచేందుకు ఏర్పాట్లు ఉంటాయి. ఆఫీసులు, ఇళ్లల్లో వాడుకోగల వ్యక్తిగత ఏసీ మూడోది. గది ఉష్ణోగ్రతలను 32 డిగ్రీల నుంచి 23 డిగ్రీల స్థాయికి తీసుకు రాగల ఈ ఏసీలకు విద్యుత్ అవసరమే ఉండదు. వ్యక్తిగత పింగాణీ ఏసీలో మాత్రం ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది. పైగా ట్యాంకును ఒకసారి నింపితే 10–12 రోజుల వరకు ఆ నీటినే వాడుకోవచ్చు. పింగాణీ, రాళ్లు, మట్టి మాత్రమే వాడటం వల్ల ఖర్చు తక్కువగా ఉంటుందంటున్నారు మనోజ్. -
టీవీలు, ఏసీలు ఆన్‘లైనే’...
న్యూఢిల్లీ: టీవీలు, ఏసీలు వంటి వినియోగ ఉత్పత్తుల గురించి ఆన్లైన్లో అధ్యయనం చేసి, వీడియోలు చూసిన తర్వాతే కొనుక్కునే ధోరణి పెరుగుతోంది. ఇలా డిజిటల్ మాధ్యమం ప్రభావంతో జరిగే కన్జూమర్ డ్యూరబుల్స్ అమ్మకాల పరిమాణం 2023 నాటికి 23 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. టెక్ దిగ్గజం గూగుల్ ఇండియా, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కొనుగోలు ప్రక్రియలో ఏ దశలోనైనా కొనుగోలుదారు ఇంటర్నెట్‌ని వినియోగించిన పక్షంలో సదరు లావాదేవీని డిజిటల్ మాధ్యమం ప్రభావిత లావాదేవీగా పరిగణించి ఈ నివేదికను రూపొందించారు. ‘ప్రస్తుతం కన్జూమర్ డ్యూరబుల్స్ అమ్మకాల్లో దాదాపు 28% విక్రయాలు డిజిటల్ మాధ్యమంతో ప్రభావితమైనవే ఉంటున్నాయి. 2023 నాటికి ఇది 63%కి పెరగవచ్చు. విలువపరంగా చూస్తే 23 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చు. ఇందులో సుమారు 10 బిలియన్ డాలర్ల మేర అమ్మకాలు ఆన్లైన్ విక్రయాలే ఉంటాయని అంచనా‘ అని నివేదిక వివరించింది. టీవీలు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లు, చిన్న గృహోపకరణాలు, వాటర్ ప్యూరిఫయర్లు, మైక్రోవేవ్ ఒవెన్లు మొదలైన ఉత్పత్తుల ధరలపై 33% డిజిటల్ ప్రభావం ఉంటోంది. కొనుగోలు నిర్ణయాలపై డిజిటల్ ప్రభావం.. నివేదిక ప్రకారం.. కొనుగోలు నిర్ణయాలపై డిజిటల్ మాధ్యమం ప్రభావం గణనీయంగా పెరుగుతోంది. ఇలా ప్రభావితమైన వారి సంఖ్య గడిచిన నాలుగేళ్లలో రెట్టింపయ్యింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో వీరి సంఖ్య 5 రెట్లు పెరగ్గా, మహిళా కొనుగోలుదారుల సంఖ్య 10 రెట్లు పెరిగింది. కొనుగోలుకు ముందు దాదాపు 80% మంది డిజిటల్ ప్రభావిత కొనుగోలుదారుల్లో ఏ బ్రాండు కొనాలి వంటి అంశాలపై సందిగ్ధత ఉంటోంది. దీంతో వారు సగటున దాదాపు 2–3 వారాలు ఆన్లైన్లో అధ్యయనం చేశాకే కొంటున్నారు. సెర్చి, సోషల్ మీడియా, బ్లాగ్లు, ఆన్లైన్ వీడియోలు మొదలైనవి ఆన్లైన్ రీసెర్చ్‌లో ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపార సంస్థలు కూడా కొనుగోలుదారులకు చేరువయ్యేలా డిజిటల్ వ్యూహాలు అమలు చేస్తున్నాయని గూగుల్ ఇండియా కంట్రీ డైరెక్టర్ (సేల్స్) వికాస్ అగ్నిహోత్రి చెప్పారు. -
రైల్లో ఊహించని పరిణామం.. వీడియో వైరల్
ఇళ్ళల్లోని ఏసీ నుంచి వాటర్ లీక్ కావడం అప్పుడప్పుడూ అందరికీ ఎదురయ్యే సంఘటనే. అయితే మనం ప్రయాణిస్తున్న రైలు బోగీలోని ఏసీ నుంచి సడెన్‌గా వరద పారితే..ఒక్కసారిగా ఆందోళన పుట్టదూ...! సంఘమిత్ర సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఏసీ కోచ్‌లోని ఏసీ లోంచి అకస్మాత్తుగా వరదలాగా నీరు ఉబికి వచ్చింది. ఈ ఊహించని పరిణామానికి బోగిలో గందరగోళ పరిస్థతి ఏర్పడింది. ప్రయాణికులందరూ ఒక్కసారిగా ఆందోళనకు లోనయ్యారు. ముఖ్యంగా ఆయా బెర్త్‌లలోని సీనియర్ సిటిజన్లు బాగా ఇబ్బంది పడ్డారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రయాణీకుల్లో ఒకరు రికార్డు చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. संगमित्रा सुपर फ़ास्ट A1 का हाल, यात्री परेशान, pic.twitter.com/6pSzqKPjmB — suyagya rai (@RaiSuyagya) June 29, 2019 -
ఉక్కిరి బిక్కిరి..!
వేసవిలో ప్రయాణమంటేనే భయమేస్తుంది. అందుకే చాలామంది రైళ్లలో ఏసీ కోచ్‌లలో రిజర్వేషన్ చేయించుకుని ప్రయాణిస్తున్నారు. ఛార్జీని కూడా లెక్క చేయకుండా రిజర్వేషన్ చేయించుకుంటే ఆ ఏసీలు కూడా సరిగా పనిచేయక ప్రయాణంలో అవస్థలు పడుతున్నామని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు. రాజంపేట: ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఏసీ కోచ్‌లు ఉన్నాయి. ఈ కోచ్‌లో ప్రయాణం రిజర్వేషన్ కంటే రెట్టింపు ధర ఉంటుంది. అయినప్పటికి నేటి వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రయాణికులు ఛార్జీలు ఎక్కువైనప్పటికి వెనుకాడకుండా ఏసీ కోచ్‌లో ప్రయాణం సాగిస్తున్నారు. అయితే అందుకు తగ్గట్టుగా రైల్వే శాఖ ఎప్పటికప్పుడు సత్వర చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందనే విమర్శలు ప్రయాణికుల నుంచి వినిపిస్తున్నాయి. తాజాగా దేశ రాజధానికి జిల్లా మీదుగా నడిచే హంససఫర్ (కశ్మీరు)రైలు ఫార్మసిన్‌లోని ఏసీ కోచ్‌లో ప్రయాణికులు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. వెంకటాద్రి, రాయలసీమ, చెన్నై–ముంబయి మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌రైళ్లు, మధురై, కరేకల్, షిర్డి, బాలాజి ఎక్స్‌ప్రెస్ రైళ్లలోనూ ఏసీ కోచ్‌లు ఉన్నాయి. వీటిలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురవుతోందని తెలుస్తోంది. తరచూ మొరాయిస్తున్న ఏసీలు.. వేసవిలో రైళ్ల ప్రయాణాలు జోరందుకున్నాయి. అదీ ఎక్కువగా ఏసీలో ప్రయాణాలు ఎక్కువగా సాగుతున్నాయి. అయితే పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు చేరుకుంటున్నాయి. దీంతో నిరంతరం భానుడి సెగల మధ్య నడిచే రైళ్ల ఫార్మసిన్‌లోని ఏసీ కోచ్‌లలో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. ఫలితంగా ఏసీ కోచ్‌లో చల్లటి వాతావరణం లేకపోవడంతో పాటు, వెలుపలి గాలి లోపలికి వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో ప్రయాణికులు అల్లాడిపోతున్నారు. ముందస్తు చర్యలేవీ.. ఏసీ కోచ్‌ల విషయంలో ముందస్తు చర్యలేవీ రైల్వేశాఖ చేపట్టడం లేదనే విమర్శలున్నాయి. నేటి పరిస్థితుల్లో ఉష్ణోగ్రతల స్థాయి రోజురోజుకు పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితిలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సి ఉందని ప్రయాణికులు అంటున్నారు. రైలు బయలుదేరే సమయంలో సంబంధిత శాఖ సిబ్బంది ఏసీ కోచ్‌ల స్థితిగతులను పరిశీలిస్తారు. ఆ తర్వాత ఎండింగ్, స్టార్టింగ్ ప్రాంతాల్లో సీఎన్డబ్లు్య డిపార్టుమెంట్స్ ఉంటాయి. మార్గమధ్యంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే ఇద్దరు మెకానికల్‌లు అందుబాటులో ఉంటారు. ఏసీ కోచ్‌లో సమస్యలు వస్తే అప్పటికప్పుడే పరిష్కరిస్తారు. వీరివల్ల కూడా కాని సమయంలో ఇక డిపోకు వచ్చిన తర్వాతే ఆ సమస్య పరిష్కారమవుతుంది. ఏసీలు ట్రిప్.. వాతావరణంలో ఉష్ణోగ్రతల మార్పు తారస్థాయికి చేరుకుంటోంది. ఉష్ణోగ్రత పెరుగుతోంది. దీంతో ఎల్‌హెచ్‌బీ వంటి ఆధునిక కోచ్‌లున్న రైళ్లలో ఏసీల వ్యవస్థ ప్రత్యేకంగా ఉంటుంది. మెకానిక్‌లు ఏసీ కోచ్‌లో అందుబాటులో ఉండాలి. అయితే ఏ కోచ్‌లో మెకానిక్‌లు ఉంటారో తెలియక ప్రయాణికులు వారి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నెలకొంటోంది. ఏసీలు పనిచేయకుంటే.. ప్రతి రైలు ఫార్మిసిన్‌లో ఆరు నుంచి నాలుగు లోపు ఏసీ కోచ్‌లు ఉన్నాయి. ఒక్కో ఏసీ కోచ్‌లో 56 మంది ప్రయాణికులు ఉంటారు. ఏసీలు సక్రమంగా పనిచేయడంలేదనే ఆరోపణలు ప్రయాణికుల నుంచి వెలువడుతున్నాయి. ఫ్యాన్లు కూడా లేకపోవడంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పిల్లలు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఫ్యాన్లను ఏసీ కోచ్‌లలో ఏర్పాటు చేయాల్సిన అంశంపై రైల్వేశాఖ దృష్టి సారించాల్సి ఉందని ప్రయాణికులు పేర్కొంటున్నారు. -
లైట్లు, ఫ్యాన్లు వేసే వేళ..
విద్యుత్ సామాజిక సంపద. దీని వినియోగాన్ని తగ్గించుకుంటే ఎంతో మేలు. అసలే వేసవి. ఆపై కరెంట్ వాడకం విరివిగా ఉంటుంది. విద్యుత్ అవసరాలకు– ఉత్పత్తికి మధ్య వ్యత్యాసం ఉంటుంది. బిల్లు ఎంత వచ్చినా చెల్లించేందుకు డబ్బు ఉన్నంత మాత్రాన సరిపోదు. విద్యుత్‌ను ఆదా చేయకపోవడంతో పలు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అందరికీ అన్ని రకాల విద్యుత్ అవసరాలు తీరాలంటే దీనికి తగినట్లు విద్యుత్ సరఫరా జరగాలి. ఇవన్నీ సవ్యంగా అమలు కావాలంటే కరెంట్ ఆదాపై నగర వాసులు శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా వేసవిలో విద్యుత్ ఆదా సామాజిక బాధ్యతగా భావించాలి. బస్తీల నుంచి బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్ వాసుల వరకు గుర్తించాలి. విద్యుత్ వాడకంలో పొదుపు పాటిస్తే ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయని తెలుసుకోవాలి. విద్యుత్‌ను ఎలా ఆదా చేయవచ్చో తెలుసుకుందాం. – సాక్షి, సిటీబ్యూరో వాషింగ్ మెషిన్లు వినియోగిస్తున్నప్పుడు.. దుస్తులు ముందుగా నానబెట్టండి. వాషింగ్ మెషిన్లను ఫుల్ లోడ్‌తో వాడుతూ.. టైమర్‌ను తక్కువగా సెట్ చేసుకోవాలి. సరైన పాళ్లలో మాత్రమే నీరు, డిటెర్జంట్ వాడాలి. రిన్స్ చేయడానికి చల్ల నీరు మాత్రమే వాడాలి. ఎలక్ట్రిక్ డ్రయింగ్ ద్వారా కాకుండా వీలైనంత వరకు దుస్తుల ఆరుబయట ఆరబెట్టుకోవాలి. పీక్ లోడ్ సమయాల్లో (సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది గంటలు) మెషిన్ వాడవద్దు. రిఫ్రిజిరేటర్ వాడేటప్పుడు.. ఫ్రిజ్ డోర్ ఎక్కువసార్లు తెరవకూడదు. ఫ్రిజ్ థర్మోస్టాట్‌ను మీడియంలో సెట్టింగ్ చేసుకోవాలి. వేడిని ప్రేరేపించే ప్రదేశాలకు వీలైనంత దూరంగా ఫ్రిజ్ ఉండాలి. గోడకు అర అడుగు దూరంగా, గాలి బాగా వీచే ప్రదేశంలో ఫ్రిజ్ ఉంచాలి. స్టార్ సామర్థ్యమున్న ఫ్రిజ్‌లను వాడాలి. ప్రెషర్ ఆన్ అవుతున్నా, బాడీ అమితంగా వేడెక్కినా మెకానిక్‌తో చెక్ చేయించుకోవాలి. గీజర్లుఉపయోగించినప్పుడు.. అక్కర్లేని సమయాల్లో స్విచ్ఛాఫ్ చేయాలి. అవసరమైనప్పుడు మాత్రమే గీజర్లను ఆన్ చేయండి. థర్మోస్టాట్ సెటింగ్‌ను 35 నుంచి 45 డిగ్రీల మధ్యలో ఉంచాలి. గీజరు స్విచ్‌ను బాత్రూంలో ఏర్పాటు చేసుకోండి. తద్వారా వెంటనే ఆఫ్ చేయడానికి వీలుంటుంది. అపార్టుమెంట్లు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, కమ్యూనిటీ క్లబ్‌లు, క్యాంటిన్లలో గీజర్లు విధిగా వాడాలి. పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల్లో.. అంతగా అత్యవసరం కాని లోడ్‌ను, పీక్ లోడ్ సమయం నుంచి (సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది) మిగిలిన సమయానికి మార్చాలి. దీనివల్ల నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుంది. విద్యుత్ బిల్లు ఆదా చేసుకోవచ్చు. పవర్ ఫేక్టర్ వీలైనంతవరకు 0.99 పైబడి మెయింటెన్ చేయాలి. నాన్ లీనియర్ లోడ్, అధికంగా ఉన్న పరిశ్రమల్లో హార్మోనిక్ ఫిల్టర్లు వాడాలి. బ్లోయర్లు, పంప్సెట్లు, ఎయిర్ కంప్రెషర్లు తదితర సాధనాలలో వేరియబుల్ స్పీడ్ డ్రైవ్స్, ‘వి’ బెల్టులకు బదులు ప్లాట్ బెల్ట్స్, స్టార్–డెల్టా–స్టార్ స్టార్టర్లను, తక్కువ రాపిడి బేరింగులు మొదలైనవి వాడి విద్యుత్ ఆదా చేసుకోవచ్చు. లోడుకు అనుగుణంగా కేబుల్ పరిమాణం, పరికరాల సామర్థ్యం, అధిక విద్యుత్ ఆదా గల మోటార్ల వినియోగం, పంప్సెట్ల వాడకం, ఆటోమెషన్ తదితర అంశాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యర్థ పదార్థాలను తగ్గింపు, పునర్వినియోగంలో శ్రద్ధ వహించాలి. స్టార్ సామర్థ్యమున్న ట్రాన్స్ఫార్మర్లు ఎంపిక చేసుకోవడం, మూడు ఫేజ్లలోనూ సమానంగా లోడును సర్దుబాటు చేసుకోవడం ద్వారా సరఫరాలో మరింత నాణ్యత పొందవచ్చు. పరికరాల మన్నిక వృద్ధి చెందుతుంది. ఏసీ ఫిల్టర్‌ను శుభ్రపర్చుకోవాలి.. ఏసీ ఆన్‌లో ఉండగా తలుపులు, కిటికీలను మూసి ఉంచండి. కిటికీలకు సన్‌ఫిల్మ్, కర్టెన్లను వాడండి. ఇంటి టెర్రస్‌పై కూల్ హోమ్ పెయింట్ వేయడం, రూఫ్ గార్డెన్‌ను పెంచడం ద్వారా ఏసీపై లోడ్ తగ్గించవచ్చు. ఏసీకి దగ్గరలో టీవీ, లైట్లు వంటివి ఉంచకూడదు. ఏసీ యూనిట్‌పై చెట్ల నీడ పడేలా చూసుకోండి. స్టార్ సామర్థ్యమున్న ఎయిర్ కండిషనర్స్‌ను వాడండి. లైట్లు, ఫ్యాన్లు వేసే వేళ.. వీలైనంత వరకు సహజమైన వెలుతురు, గాలి వచ్చేలా చూసుకోవాలి. అవసరం లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లను ఆపివేయాలి. ఫిల్మెంట్ బల్బులకు బదులుగా ఎనిమిది రెట్లు అధిక సామర్థ్యంతో పనిచేసే, అంతే వెలుగునిచ్చే ఎల్ఈడీ బల్బులను వాడాలి. ట్యూబ్‌లైట్లకు ఎలక్ట్రానిక్ చోక్ అమర్చుకోవచ్చు. కొత్తవి కొనేటప్పుడు విద్యుత్ ఆదా చేసే ట్యూబ్‌లైట్లు తీసుకోవచ్చు. నెలకోసారి బల్బులను శుభ్రపరచుకోవాలి. ఫ్యాన్లకు ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్లను అమర్చుకోండి. బల్బులు, ట్యూబ్‌లైట్లకు దుమ్ము చేరకుండా శుభ్రం చేసుకోవాలి. వంటగదిలో వినియోగించే వస్తువులు.. మిక్సీలో వేసే పదార్థాలను ముందుగా నానబెట్టడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. పొడి పదార్థాలను సాధ్యమైనంత మేరకు గ్రైండింగ్ చేయకపోవడమే ఉత్తమం. ఇండక్షన్ స్టౌలకు బదులు మైక్రోవేవ్ ఓవెన్లు వాడితే 50 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. అడుగుభాగాన సమతలంగా ఉన్న స్టవ్‌లను వాడడం ద్వారా వేడి బాగా వ్యాపించి విద్యుత్ ఆదా అవుతుంది. సోలార్ వాటర్ హీటర్లు వాడాలి.. సాధ్యమైనంతవరకు సోలార్ వాటర్ హీటర్లనే వాడండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పీక్ లోడ్ సమయాల్లో వాడవద్దు. -
విమానంలో సాంకేతిక లోపం; ఏసీ లేకుండానే ప్రయాణం
సాక్షి, తిరుపతి: తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. సాయంత్రం 6 గంటలకు బయలుదేరాల్సిన విమానంలో ఏసీ పనిచేయకపోవడంతో అధికారులు దానిని నిలిపివేశారు. ఈ కారణంగా ప్రయాణికులు మూడు గంటల పాటు విమానాశ్రయంలోనే వేచి ఉన్నారు. ఆ తర్వాత ఏసీ పనిచేస్తుందని విమానాన్ని ప్రయాణానికి సిద్ధం చేశారు. తీరా బయలుదేరిన సమయంలో ఏసీ మళ్లీ పనిచేయలేదు. దీంతో ఏసీ లేకుండానే ప్రయాణికులు హైదరాబాద్‌కు పయనమయ్యారు. స్పైస్‌జెట్ సేవలపై ప్రయాణికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
ఎయిర్ కూలర్.. ఎయిర్ కండీషన్..ఏది బెస్ట్ ?
వేసవి ఆరంభంలోనే భానుడు ప్రతాపం చూయిస్తున్నాడు. ఈ సారి ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వేసవిని ఎదుర్కొనేందుకు నగరవాసులు ముందస్తు ఏర్పాట్లను చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కూలర్లు, ఏసీలకు డిమాండ్ పెరిగింది. ఏసీల వినియోగం ఇతరత్రా అంశాలపై ఆన్ డిమాండ్ సర్వీసెస్ మార్కెట్ ప్లేస్ అర్బన్ క్లాప్ అనే సంస్థ చేసిన ఓ అధ్యయనం ఆసక్తికర అంశాలను వెల్లడించింది. సాక్షి సిటీబ్యూరో: వేసవిలో వినియోగించి ఆ తర్వాత పక్కన పెట్టేస్తారు. చాలా నెలల తర్వాత తిరిగి వినియోగించే ముందు కూలర్ ఏసీలకు సర్వీసింగ్ తప్పనిసరి. ఇప్పటికే ఇళ్లలో ఉన్నవారు వాటి మరమ్మతుల కోసం చూస్తున్నారు. కూలరైనా, ఏసీ అయినా 90 శాతంపైగా మంది వేసవిలోనే వాడుతున్నారు. నగరంలో ఏసీల వినియోగం పెరిగిపోతుంది. ఇప్పటికే ఏసీ మెయిన్టెనెన్స్ కోసం ఎలక్ట్రీషియన్ని పిలిపించిన వారు కొందరైతే, ఆ లైన్లో ఉన్నవారు మరికొందరు. ఏసీల వినియోగం ఏ విధంగా ఉంటుందన్న అంశమై ఆన్ డిమాండ్ సర్వీసెస్ మార్కెట్ ప్లేస్ అర్బన్ క్లాప్ అనే సంస్థ ఓ అధ్యయనం చేసింది. దాదాపు 84 శాతం మంది తాము ప్రతి వేసవిలోనూ కనీసం ఒక్కమారైనా ఏసీ మరమ్మతు సేవలను వినియోగించుకుంటున్నారని తేలింది. దేశవ్యాప్తంగా ఏసీలను అధికంగా వినియోగిస్తున్న నగరాలలో హైదరాబాద్ ఒకటి. అందుకే పేరొందిన బ్రాండ్లన్నీ తమ ఉత్పత్తి తొలి ఆవిష్కరణలూ ఇక్కడే చేయడం ఎక్కువైంది. ఎయిర్ కూలర్.. ఎయిర్ కండీషన్..ఏది బెస్ట్ అంటే... ఎయిర్ కూలర్.. ఎయిర్ కండీషన్.. ఏది బెస్ట్ అంటే నగరవాసులు మాత్రం ఎయిర్ కండీషన్కే ఓటేస్తున్నారు. దాదాపు 19 శాతం మంది ఈ వేసవిలో ఏసీ కొనుగోలు చేస్తామంటుంటే, 5 మంది మాత్రం అద్దెకు తీసుకుంటామంటున్నారు. అయితే, ఏసీ కండీషన్లో ఉంటేనే విద్యుత్ బిల్ కూడా తగ్గుతుందని భావిస్తున్నారు. నగరంలో గత వేసవిలో ప్రతి ఒక్కరూ తాము సాధారణంగా వేసవిలో చెల్లించే కరెంట్ బిల్లుతో పోలిస్తే చాలా ఎక్కువగానే చెల్లించామంటున్నారు. దాదాపు 37 శాతం మంది రూ. రూ. 1,500 నుంచి రూ. 3 వేలు కరెంట్ బిల్లు చెల్లిస్తే, 17 శాతం మంది రూ. 3 వేల నుంచి రూ. 5 వేల బిల్లు చెల్లించారు. 10 శాతం మంది రూ. 5 వేలకు పైగానే బిల్లు చెల్లించామని చెబుతున్నారు. ప్రతి పదిళ్లలో మూడింట ఏసీలు.. సర్వేలో పాల్గొన్న వారిలో 36 శాతం మంది ఒక ఏసీ ఉందని చెప్పారు. రెండు ఏసీలు ఉన్నాయన్నవారు 25 శాతం కాగా, మూడు ఏసీలున్న వారు 15 శాతం మంది ఉన్నారు. మూడు కన్నా ఎక్కువ ఏసీలు వాడుతున్న వారు 14 శాతం ఉన్నారు. అద్దెకు ఏసీలను తీసుకునే వారు 10 శాతం వరకు ఉంటారని తేలింది. నగరం మొత్తం మీద 40 శాతం ఇళ్లలో కనీసం ఒక్క ఏసీ కామన్‌గా మారిం దని అర్బన్ క్లాప్ అధ్యయనం వెల్లడిస్తోంది. ఏడు గంటలు ఏసీ వినియోగం నగరంలో 29 శాతం మంది రాత్రంతా అంటే సుమారు 7 గంటలు ఏసీ వాడుతున్నామని చెబుతున్నారు. అందువల్లే మరమ్మతులు కూడా అధికంగానే ఉంటున్నాయని చెబుతోంది అర్బన్ క్లాప్ అధ్యయనం. తమ అధ్యయనంలో 31 శాతం మంది వేసవి సీజన్లో తమ ఏసీ ఒకటికన్నా ఎక్కువసార్లే బ్రేక్ డౌన్ అయిందంటున్నారు. 82 శాతం మంది అయితే సీజన్ ప్రారంభానికి ముందే మరమ్మతులు చేయించుకుంటున్నారు. నాణ్యమైన ఏసీ సర్వీసింగ్‌కు రూ. వెయ్యి వరకు ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు. దాదాపు 26 శాతం మంది ఈ తరహాలోనే ఆలోచిస్తున్నారని ఆ అధ్యయనం వెల్లడించింది. తక్కువ కరెంట్‌కే ఓటు.. కరెంట్ వినియోగం తక్కువగా ఉండాలి. ఎక్కువ చల్లదనం అందించాలనుకునే వారు నగరంలో ఎక్కువే. దీంతో 5 స్టార్ ఇన్వర్టర్ ఏసీలకు నగరంలో డిమాండ్ అధికంగా ఉంది. సంవత్సరానికి 750 యూనిట్ల విద్యుత్ దాటకూడదని కోరుకుంటున్న నగరవాసులు అధిక సంఖ్యలోనే ఉన్నారు. దాదాపు 50 శాతం మంది కాస్త ఉక్కపోత వస్తే చాలు ఏసీ ఆన్ చేస్తున్నారని లెక్క తేలింది. 15 శాతం మంది రోజుకు 4–6 గంటలు వినియోగిస్తున్నామని చెప్పారు. -
కూలింగ్ ఛాలెంజ్!
పిసరంత కరెంటుతో రాత్రంతా చల్లదనాన్ని ఇచ్చే ఏసీ ఉంటే ఎలా ఉంటుంది? ఇలాంటి అద్భుత ఆవిష్కరణతో... మన జేబులకు పడే నెలవారీ చిల్లులు తగ్గడం ఒక్కటే కాదు.. భూతాపోన్నతికి అడ్డుకట్ట వేయడమూ సాధ్యమవుతుంది. భూమ్మీద ఇప్పటికే కోటిన్నర ఏసీలు ఉండగా... 2050 నాటికి మరో 330 కోట్లు వచ్చి చేరతాయన్న అంచనాలు బలపడుతున్న తరుణంలో భారత ప్రభుత్వం ఓ వినూత్నమైన పోటీ ప్రకటించింది. ఎల్ఈడీల తరహాలో అతితక్కువ విద్యుత్తుతో పనిచేసే ఏసీలను డిజైన్ చేసి తయారు చేసిన వాళ్లకు ఏకంగా రూ.21 కోట్ల బహుమతి ప్రకటించింది. గ్లోబల్ కూలింగ్ ప్రైజ్ అనే పేరుతో ప్రకటించిన ఈ పోటీలో తయారయ్యే ఏసీ గరిష్టంగా 700 వాట్ల విద్యుత్తును మాత్రమే వాడుకోవాలి. అంతేకాకుండా ఒకవేళ నీటిని ఉపయోగించి చల్లదనాన్ని కలిగించే పక్షంలో అది రోజుకు 14 లీటర్లకు మించకూడదు. వచ్చే ఏడాది జూన్ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆ తరువాత ఆగస్టులో పది మంది ఫైనలిస్టులను ఎంపిక చేసి వారికి రూ.14 కోట్లు అందించి నమూనాల తయారీకి పురమాయిస్తారు. 2020 నవంబరు, డిసెంబర్లలో పోటీ విజేతను ప్రకటిస్తారు. -
ఏసీ, ఫ్రిజ్ ధరలకు రెక్కలు!!
ఏసీ, వాషింగ్ మెషీన్, రిఫ్రిజిరేటర్ (ఫ్రిజ్), మైక్రోవేవ్, ఇతర వంటింటి ఉపకరణాలు కొనాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే కొనేయండి. ఎందుకంటే ఈ నెల్లో వీటి ధరలు 2–5 శాతంమేర పెరిగే అవకాశముంది. రూపాయి మారకం విలువ క్షీణించడం.. క్రూడ్ ధరల్లో పెరుగుదల.. స్టీల్, కాపర్ వంటి కీలకమైన ముడిపదార్థాల ధరలు ఎగబాకటం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణాలని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. రూ.400–రూ.1,500 శ్రేణిలో పెంపు.. ప్రీమియం మోడళ్ల ధరల పెరుగుదల నికరంగా రూ.400 నుంచి రూ.1,500 శ్రేణిలో ఉండొచ్చని పరిశ్రమ ఎగ్జిక్యూటివ్స్ చెప్పారు. రూపాయి పతనం, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల వంటి అంశాల కారణంగా మార్చి నుంచి తమపై ఒత్తిడి పెరిగిందని కంపెనీలు పేర్కొంటున్నాయి. అందువల్ల డిమాండ్ అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ధరలు పెంచాల్సిన పరిస్థితి తలెత్తిందని తెలిపాయి. ‘జూన్ నుంచి ధరల పెంపు దశల వారీగా ఉంటుంది. ఇక్కడ కస్టమర్ల సెంటిమెంట్ దెబ్బ తినకుండా చూసుకోవడం ప్రధానం. కొత్త సరుకు మార్కెట్లోకి రావడం కూడా పెంపునకు మరో కారణం’ అని గోద్రెజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది చెప్పారు. ప్రస్తుతమున్న పాత సరుకు వల్ల పరిశ్రమ గత రెండు నెలల నుంచి ధరల పెంపును వాయిదా వేస్తూ వస్తోందని పేర్కొన్నారు. గోద్రెజ్ 2–3 శాతం శ్రేణిలో ధరలను పెంచనుంది. దేశీ అతిపెద్ద ఎయిర్ కండీషనర్ తయారీ సంస్థ వోల్టాస్ తాజాగా ధరలను దాదాపు 3 శాతంమేర పెంచింది. వర్ల్‌పూల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ డిసౌజా మాట్లాడుతూ.. పరిశ్రమ చర్యల ఆధారంగా తాము కూడా ధరలను పెంచొచ్చని తెలిపారు. అయితే ఎంతమేర పెంపు ఉంటుందనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఎల్జీ, శాంసంగ్ ప్రొడక్టుల ధరలు 5% జంప్? దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ, శాంసంగ్ కంపెనీలు వాటి ఉత్పత్తుల ధరలను 5 శాతం మేర పెంచే అవకాశముంది. ఈ అంశాన్ని ఇప్పటికే తమ ట్రేడర్లకు ఇవి తెలియజేసినట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. అయితే ఈ సంస్థలు అధికారికంగా మాత్రం ఇంకా దీనిపై ఏమీ చెప్పలేదు. ధరల పెంపు ప్రభావాన్ని సాధ్యమైనంత వరకూ తగ్గించడానికి ప్రమోషనల్ ఆఫర్లను అందించే ప్రయత్నం చేస్తున్నామని వోల్టాస్ ఎండీ ప్రదీప్ బక్షి తెలిపారు. పానాసోనిక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ శర్మ మాట్లాడుతూ.. ‘‘కమోడిటీ ధరల పెరుగుదల వల్ల ఒత్తిడి బాగా పెరిగింది. కాబట్టి ధరలను ఎప్పట్లానే కొనసాగించలేం. రూపాయి మారకం విలువలో మళ్లీ క్షీణత మొదలైనా.. ఉత్పత్తి వ్యయాల పెరిగినా.. అప్పుడు ధరల పెంపు అనివార్యమవుతుంది’’ అని వివరించారు. రూపాయి దెబ్బ పరిశ్రమ తన ధరల వ్యూహాలకు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువను 66 వద్ద బెంచ్‌మార్క్‌గా నిర్దేశించుకుంటుంది. కానీ ఇప్పుడు రూపాయి 67కు పైనే ఉంది. జనవరి నుంచి చూస్తే డాలర్‌తో రూపాయి 7%మేర క్షీణించింది. ప్రస్తుతం రూపాయి విలువ 67.11గా ఉంది. ఇక స్టీల్ ధరలు 7–8% పెరిగాయి. కాపర్ ధరలూ పెరిగాయి. ‘‘కాపర్‌ను ఎక్కువగా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కొన్ని రసాయనాల ధరలు తగ్గడం కొంత ఉపశమనం. దీనివల్ల కంపెనీలు ఉత్పత్తి వ్యయాలను నియంత్రించుకుంటున్నాయి. అయితే ఇది ఎక్కువ రోజులు సాధ్యపడదు’’ అని పలువురు ఎగ్జిక్యూటివ్‌లు పేర్కొన్నారు. మరొకవైపు ధరల పెంపుపై రిటైలర్లు మిశ్రమంగా స్పందించారు. -
ఈ వేసవికి ఏసీలు లేనట్టే!
అన్నవరం సత్యదేవుడికి భక్తుల సంఖ్య పెరిగింది. ఆదాయం కూడా పెరిగింది. వేసవి సెలవులు కావడంతో సత్యదేవుని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. రత్నగిరి అంతా కాంక్రీటు జంగిల్‌గా మారడం, కొత్తగా నిర్మించిన స్వామివారి ఆలయాన్ని గ్రానెట్స్తో నిర్మించడంతో ఆలయంలో వేడి విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ఆలయంలో ఉక్కపోత మరింత పెరిగిపోయింది. వేసవి ప్రారంభంలో ఆలయాన్ని ఏసీ చేయించేందుకు దేవస్థానం పాలకమండలి, అధికారులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. భక్తులతోపాటు అర్చకులు కూడా ఉక్కపోతను తట్టుకోలేని పరిస్థితిలో ఉంటే.. అధికారులు మాత్రం ఇదేమీ పట్టించుకోవడం లేదు. అన్నవరం (ప్రత్తిపాడు): సత్యదేవుని ఆలయాన్ని ఏసీ చేసే పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత మార్చి నుంచి స్వామివారి ఆలయాన్ని ఏసీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. వారానికో పని చొప్పున చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకవైపు వేసవి ఎండ తీవ్రతకు ప్రధానాలయంలో ఉక్కబోత భరించలేక భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోజుకు దాదాపు ఎనిమిది గంటలు ఆలయంలోనే ఉండి భక్తులకు సేవలందించే అర్చకస్వాముల పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రస్తుతం ఆలయంలోకి ఏసీ గొట్టాలు అమర్చే పనులు చేస్తున్నారు. గదులు ఇంకా నాలుగైదు రోజులు పనిచేస్తే తప్ప ఆలయం ఏసీ వేసే ప్రక్రియ కాదని భావిస్తున్నారు. వేసవి ప్రారంభానికి ముందే చేస్తామన్నారు ఈ ఏడాది వేసవి ప్రారంభానికి ముందే సత్యదేవుని ఆలయాన్ని ఏసీ చేయాలని ఫిబ్రవరి రెండో వారంలో రూ.7 లక్షల అంచనాతో టెండర్ పిలిచారు. రూ.6,14,900తో ఆలయంలో క్లోజ్డ్ ఏసీలు అమర్చేందుకు కాకినాడకు చెందిన నవ్యకళా ఎయిర్ కంట్రోల్ సిస్టమ్ సంస్థ టెండర్ దాఖలు చేసింది. ఈ మొత్తానికి జీఎస్టీ అదనం. మొత్తం రూ.ఏడు లక్షలు వరకూ అవుతుందని అంచనా వేశారు. మార్చి 11న పాలకమండలి ఈ టెండర్‌ను ఖరారు చేసింది. పనులు వెంటనే ప్రారంభించాలని ఈఓ జితేంద్ర ఆదేశాలిచ్చారు. ఏప్రిల్ 15న ఏసీ మెషీన్లను దేవస్థానానికి తీసుకువచ్చారు. వాటిని అదే నెలాఖరున ఆలయం వద్దకు చేర్చారు. ఈ నెల 4వ తేదీన ఆలయం శిఖరానికి చేర్చారు. 15వ తేదీ నుంచి మెషీన్ల నుంచి చల్లని గాలి లోపలకు వచ్చేందుకు గొట్టాలు అమర్చే పనులు ప్రారంభించారు. ఆలయం లోపల మాత్రం పైపులు లేకుండా ఆలయ కిటికీల ద్వారా చల్లని గాలి లోపలకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏసీ మెషీన్ల సామర్థ్యం ఎక్కువ అయినందున పావు గంటలోనే ఆలయం అంతా చల్లబడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది సగం వేసవికాలం అయిపోయింది. సాధ్యమైనంత త్వరగా ఏసీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని భక్తులు అంటున్నారు. -
ఏసీ వల్లనేనా ఈ సమస్య?
నా వయసు 35. ఈ వేసవిలో ఆఫీసులో ఎక్కువగా ఏసీలోనే ఉంటున్నాను. నేను గమనించినదేమిటంటే... ఇటీవల నేను తీవ్రమైన అలసటతో బాధపడుతున్నాను. నా సమస్య ఏసీ వల్లనేనా? నాకు సరైన పరిష్కారం చెప్పండి. – ప్రణీత, హైదరాబాద్ ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో చాలా ఎక్కువ సేపు గడపడం వల్ల కొందరిలో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చాలామందికి మంచి సౌకర్యంగా అనిపించే ఏసీ, మరికొందరి ఆరోగ్యానికి కొన్ని రకాలఅనర్థాలు తెచ్చిపెట్టవచ్చు. ఏసీ వల్ల దాదాపు ఐదు ప్రధానమైన సమస్యలు వస్తాయి. అవి... తీవ్రమైన అలసట : చాలాసేపు ఏసీలో గడపడంతో పాటు ఆ ఏసీ వల్ల చల్లదనం ఎక్కువగా ఉంటే కొందరిలో పనిముగిసే సమయానికి భరించలేని తలనొప్పి, తీవ్రమైన నిస్సత్తువ వంటి లక్షణాలు కనిపిస్తాయి. చల్లటి వాతావరణంలో కండరాలకు తగినంత రక్తప్రసరణ జరగకపోవడం వల్ల అలసటకు గురవుతారు. పొడి చర్మం : చాలాసేపు ఏసీలో గడిపేవారి చర్మంపై తేమ తగ్గుతుంది. దాంతో వారి చర్మం పొడిగా అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపించే వారు తమ చర్మంపై మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులు తీవ్రం కావడం : కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారిలో... అంటే ఆర్థరైటిస్, న్యూరైటిస్ (నరాల చివరలు మొద్దుబారి స్పర్శ తెలియకపోవడం లేదా కాళ్లు, చేతులు తిమ్మిర్లు పట్టడం) వంటి జబ్బులు ఉన్నవారిలో సమస్యలు తీవ్రమవుతాయి. కొందరిలో ఈ న్యూరైటిస్ కారణంగా నిస్సత్తువ కలిగే అవకాశాలు ఎక్కువ. అలవాటైతే వేడిని తట్టుకోలేకపోవడం : గతంలో వేడి వాతావరణంలో ఉన్నవారైనప్పటికీ నిత్యం ఏసీలో ఉండటం అలవాటైన వారు ఇక ఏమాత్రం వేడిమిని భరించలేరు. వేసవిలో బయటకు రావడమే కష్టంగా అనిపిస్తుంది. శ్వాస సమస్యలు : చాలాసేపు ఏసీ కారులో మూసి ఉన్న డోర్స్, గ్లాసెస్ వల్ల అక్కడి సూక్ష్మజీవులు అక్కడే తిరుగుతుండటం వల్ల తేలిగ్గా శ్వాససంబంధమైన వ్యాధులకు గురవుతుంటారు. అందుకే నిత్యం ఏసీలో ఉండేవారు తప్పనిసరిగా ప్రతి రెండు గంటలకు ఒకసారి కాసేపు బయటకు వచ్చి స్వాభావిక వాతావరణంలో పదినిమిషాల పాటైనా గడిపి వెళ్తుండాలి. అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. డాక్టర్ సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ఇన్వర్టర్ ఏసీల హవా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏసీ అనగానే ముందు గుర్తొచ్చేది కరెంటు బిల్లు. మామూలు బిల్లుకు... ఏసీ వాడితే వచ్చే కరెంటు బిల్లుకు దాదాపు మూడు నాలుగు రెట్లు తేడా ఉంటుంటుంది. అందుకే అంతా విద్యుత్‌ను ఆదా చేసే ఏసీలకే ఓటేస్తారు. ఫలితంగానే ఈ మధ్య ఇన్వర్టర్ ఏసీలకు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. మొత్తం పరిశ్రమలో 2016లో ఇన్వర్టర్ విభాగం వాటా కేవలం 14 శాతమే. గతేడాది ఇది రెండింతలకుపైగా పెరిగి 32 శాతానికి చేరింది. 2018లో ఇన్వర్టర్ ఏసీల వాటా 60 శాతానికి చేరడం ఖాయమని ఎల్జీ చెబుతోంది. సాధారణ 5 స్టార్ ఏసీలతో పోలిస్తే ఇన్వర్టర్ మోడల్‌కు ధరలో పెద్దగా వ్యత్యాసం లేకపోవడం కూడా డిమాండ్‌కు కారణమని పరిశ్రమ చెబుతోంది. దాదాపు అన్ని కంపెనీలూ ఈ విభాగంలో పెద్ద ఎత్తున మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. ఏసీల నాణ్యత ప్రమాణాలను బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ) కఠినతరం చేయడంతో మెరుగైన మోడళ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. కఠిన ప్రమాణాలు ఇక్కడే.. భారత్‌లో 2018 జనవరి 1 నుంచి ‘ఇండియన్ సీజనల్ ఎనర్జీ ఎఫీషియెన్సీ రేషియో (ఐఎస్‌ఈఈఆర్)’ పేరిట ఏసీలకు కొత్త స్టార్ రేటింగ్ ప్రమాణాలు అమల్లోకి వచ్చాయి. వీటి వల్ల ఏసీకి వినియోగించే విద్యుత్ 40 శాతానికి తగ్గింది. అలాగే 5 స్టార్ ఏసీ కాస్తా 3 స్టార్ అయింది. కొత్త రేటింగ్స్‌కు అనుగుణంగా తక్కువ విద్యుత్‌ను ఖర్చు చేసే విధంగా అత్యంత నాణ్యమైన ఏసీలను కంపెనీలు తయారు చేయాల్సిందే. ప్రపంచంలో విద్యుత్‌ను అత్యంత సమర్థవంతంగా వినియోగించే ఉత్పాదనగా భారత 5 స్టార్ ఏసీ నిలిచినట్లు బ్లూ స్టార్ జాయింట్ ఎండీ బి.త్యాగరాజన్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. రెండు మూడేళ్లలో ఇన్వర్టర్ విభాగమే మార్కెట్‌ను పూర్తిగా కైవసం చేసుకుంటుందని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఏసీ బిజినెస్ హెడ్ విజయ్ బాబు ధీమా వ్యక్తంచేశారు. కోటి యూనిట్ల దిశగా.. దేశవ్యాప్తంగా 2017లో 55–60 లక్షల ఏసీలు అమ్ముడయ్యాయి. 2020 నాటికి ఒక కోటి యూనిట్లను దాటవచ్చని బ్లూ స్టార్ అంచనా వేస్తోంది. వచ్చే మూడేళ్లు పరిశ్రమ సగటున 15% వృద్ధిని నమోదు చేస్తుందని బ్లూస్టార్ చెబుతోంది. భారత్‌లో కస్టమర్లు ఏడేటళ్లకు ఒకసారి ఏసీని మారుస్తున్నారట. పైపెచ్చు గతంలో ఒక ఏసీకే పరిమితమైన వారు ఇప్పుడు అదనపు ఏసీలను సమకూర్చుకుంటున్నారు. 50% మంది కస్టమర్ల ఆలోచన ఏసీకి అయ్యే విద్యుత్ ఖర్చు గురించేనట. ఇవన్నీ తాజా సర్వేలో వెల్లడైన అంశాలు. కాగా, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ) ప్రకారం రోజుకు 8 గం టల చొప్పున 200 రోజులు 1.5 టన్ను ఇన్వర్టర్ ఏసీ వినియోగిస్తే 5 స్టార్ మోడల్‌కు సుమారు 850 యూనిట్లు, 3 స్టార్‌కు అయితే 1,050 యూ నిట్లు విద్యుత్ ఖర్చు అవుతుంది. మోడల్‌ను బట్టి స్వల్పంగా యూనిట్లలో తేడా ఉంటుంది. సాధారణ ఏసీ మోడల్ అయితే ఇన్వర్టర్ ఏసీ కంటే 70% అధికంగా విద్యుత్ ఖర్చవుతుంది. -
వేడెక్కనున్న ఏసీల ధరలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ వేసవిలో భానుడి ప్రతాపానికితోడు ఎయిర్ కండీషనర్ల ధరలు సైతం వేడెక్కనున్నాయి. మోడల్‌నుబట్టి 5 నుంచి 10 శాతం దాకా విక్రయ ధర అధికం కానుంది. మార్చి 1 నుంచే కొత్త ధరలు అమలులోకి రానున్నట్టు తెలుస్తోంది. ఏసీల తయారీలో వాడే ప్రధాన విడిభాగాల వ్యయాలు పెరగడమే ఇందుకు కారణం. ఇవన్నీ కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. 2018 జనవరి 1 నుంచి అమలవుతున్న నూతన స్టార్ రేటింగ్ ప్రమాణాలతో ఏసీల ధరలు ఇప్పటికే 15 శాతం దాకా అధికమయ్యాయి. విదేశాలపైనే ఆధారం.. ఏసీ తయారీలో కంప్రెసర్, కాపర్ పైప్, మోటారు ప్రధాన విడిభాగాలు. భారత్‌లో వీటి తయారీ జరగడం లేదు. వీటి కోసం ఇక్కడి కంపెనీలు విదేశాలపై ఆధారపడుతున్నాయి. మొత్తంగా ఒక్కో ఏసీలో 60–70 శాతం విడిభాగాలు దిగుమతి అవుతున్నవే. థాయ్‌లాండ్, తైవాన్, జపాన్, చైనా నుంచి ఇవి వస్తున్నాయి. స్పేర్‌పార్ట్స్ ధరలు పెరుగుతూ వస్తున్నాయని తయారీ కంపెనీలు చెబుతున్నాయి. దీంతో విక్రయ ధర మార్చి 1 నుంచి 5–10 శాతం అధికం కానుందని జనరల్ బ్రాండ్ ఏసీలను విక్రయిస్తున్న ఈటా జనరల్ సీఈవో ఎం.ఇజాజుద్దీన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కొత్త రేటింగ్ విధానం.. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఏసీలకు నూతన స్టార్ రేటింగ్ విధానం భారత్‌లో అమలులోకి వచ్చింది. దీని ప్రకారం 5 స్టార్ ఏసీ కాస్తా 3 స్టార్ అయింది. తక్కువ విద్యుత్‌ను ఖర్చు చేసేలా అత్యంత నాణ్యమైన ఏసీలను కంపెనీలు తయారు చేయాల్సిందే. కొత్త స్టార్ రేటింగ్ అమలు కావడంతో ఇప్పటికే మోడళ్ల ధరలు 15 శాతం దాకా అధికమయ్యాయి. ఏసీలపై గతంలో వ్యాట్తోసహా ఇతర పన్నులు 25–26 శాతం ఉండేవి. ఇప్పుడు జీఎస్టీ 28 శాతం వసూలు చేస్తున్నారు. ఇదీ ఏసీల విపణి.. భారత ఏసీ మార్కెట్లో 30 బ్రాండ్ల దాకా పోటీపడుతున్నాయి. 2017లో భారత్‌లో సుమారు 60 లక్షల యూనిట్ల ఏసీలు అమ్ముడయ్యాయి. పరిశ్రమ 15–20 శాతం వార్షిక వృద్ధి నమోదు చేస్తోంది. మార్కెట్లో 60–65 శాతం వాటా 3 స్టార్ ఏసీలదే. స్ప్లిట్ ఏసీలు 90 శాతం ఆక్రమించాయి. మిగిలిన 10 శాతం విండో ఏసీలు ఉంటాయి. మొత్తం విపణిలో ఇన్వర్టర్ ఏసీలు 20 శాతం వాటా దక్కించుకున్నాయి. వచ్చే రెండేళ్లలో ఈ విభాగం 40–50 శాతానికి చేరడం ఖాయమని జనరల్ బ్రాండ్ అంటోంది. 5 స్టార్ ఏసీ సగటు ధర రూ.50–55 వేలుంది. ఇదే ధరలో ఇన్వర్టర్ మోడల్ రావడం కూడా వీటి అమ్మకాలు దూసుకెళ్లడానికి కారణం అవుతోంది. భారత్‌లో తయారీ.. ఏటా 15–20% వృద్ధి నమోదు చేస్తున్న భారత ఏసీల మార్కెట్లో తయారీకి మరిన్ని విదేశీ కంపెనీలు ఉత్సాహం కనబరుస్తున్నాయి. హిటాచీ ఇటీవలే తయారీ ప్రారంభించింది. జీఎంసీసీ త్వరలో కార్యకలాపాలు సాగించనుంది. ఫుజిట్సు జనరల్, అకాయ్ సైతం ప్లాంటు ఏర్పాటుకు పూనుకుంటున్నాయి. దైకిన్ మూడో ప్లాంటును దక్షిణాదిన నెలకొల్పేందుకు ప్రణాళిక చేస్తోంది. చైనా కంపెనీ మిడియా పుణేలో స్థాపిస్తున్న ప్లాంటు డిసెంబర్‌కల్లా సిద్ధం అవుతోంది. ఇక విక్రయ కంపెనీలు మెట్రోలను వీడి చిన్నపట్టణాలపై ఫోకస్ చేస్తున్నాయి. ప్రస్తుతం 70% విక్రయాలు మెట్రోల్లో జరుగుతున్నా మార్కెట్ స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తోంది. -
పెరగనున్న ఫ్రిజ్‌లు, ఏసీ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: అంచనాలకనుగుణంగానే జీఎస్టీ కౌన్సిల్ తాజా నిర్ణయంతో రిఫ్రిజిరేటర్లు, ఏసీ రేట్లు మోత మోగనున్నాయి. గోద్రేజ్ గ్రూప్ నకు కన్జ్యూరబు్ డ్యూరబుల్స్ సంస్థ వీటి ధరలను త్వరలోనే పెంచనున్నట్టు ప్రకటించింది. ముడిసరుకు, తయారీ ఖర్చు పెరగడంతో ఈ ధరలను కూడా 3 నుంచి 6శాతం పెంచే యోచనలో ఉన్నట్టు సోమవారం గోద్రెజ్ వెల్లడించింది. అలాగే పెరుగుతున్న గిరాకీ నేపథ్యంలో పోర్ట్‌పోలియో విస్తరణ, ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో రూ. 200 కోట్లు పెట్టుబడితో షిర్వాల్‌లో కొత్త ప్లాంట్‌ను నిర్మిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెలలో దీని నిర్మాణాన్ని ప్రారంభించబోతున్నామన్నారు. ‘తయారీ వస్తువులు ఉక్కు ధరలు 10-15 శాతం, ప్లాస్టిక్స్ 6-7 శాతం, రాగి 40-50 శాతం పెరిగాయని, దీంతో తమ ఉత్పత్తుల ధరలను పెంచాల్సిన అవసరం వచ్చిందని తెలిపింది. అంతేకాదు నవంబర్, డిసెంబర్లలో ఏసీలు, ఫ్రిజ్‌ల ధరలు 3 నుంచి 6శాతం పెరుగుతాదని గోద్రేజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది చెప్పారు. రా మెటీరియల్ ధరలను బట్టి ఈ ధరల పెంపు ఉంటుందన్నారు. మరోవైపు పండగ సీజన్ రావడంతో జులై నుంచి ధరలు పెంచలేదని గోద్రేజ్ పేర్కొంది. ఇప్పుడు నిర్వహణ ఖర్చులు పెరగడంతో ధరల పెంపు గురించి యోచిస్తున్నామని ప్రకటించడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో 20 శాతానికిపైగా వృద్ధిని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. కాగా ప్రస్తుతం రిఫ్రిజిరేటర్లు, ఎసీల విభాగం ప్రస్తుతం కంపెనీ మొత్తం ఆదాయంలో 75 శాతం వాటాను కలిగి ఉన్నాయి. జీఎస్టీ తర్వాత ఏసీ, ఫ్రిజ్‌లపై పన్నులు కూడా పెరిగాయి. ముఖ్యంగా అంతకు ముందు ఏసీలు, ఫ్రిజ్‌లపై 23-25శాతం జీఎస్టీ పన్ను ఉండగా.. ప్రస్తుతం ఇవి 28శాతం జీఎస్టీ శ్లాబులోకి చేర్చిన సంగతి తెలిసిందే. -
ఏసీ ఎక్కడున్నా 18 శాతం జీఎస్టీ
రెస్టారెంట్లలో పన్నుపై సీబీఈసీ స్పష్టత న్యూఢిల్లీ: ఏసీ రెస్టారెంట్లలో జీఎస్టీ కింద 18 శాతం పన్ను ప్రస్తుతం అమల్లో ఉండగా, అదే రెస్టారెంట్లో ఏసీ లేని విభాగంలో వడ్డించే ఆహారంపైనా, తీసుకెళ్లే పార్సిళ్లపైనా 18 శాతం పన్ను పడనుంది. ఈ విషయాన్ని కేంద్ర ఎక్సేజ్ కస్టమ్స్ మండలి (సీబీఈసీ) స్పష్టం చేసింది. వాస్తవానికి ఏసీ లేని హోటళ్లు, రెస్టారెంట్లలో జీఎస్టీ 12 శాతంగా, ఏసీ రెస్టారెంట్లు, లిక్కర్ లైసెన్స్ కలిగి ఉన్న వాటిపై 18 శాతం, 5 స్టార్ హోటళ్లపై 28 శాతం జీఎస్టీని ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో రెస్టారెంట్, బార్ కలిగి ఉన్న చోట ఏసీ, నాన్ ఏసీ రెండు విభాగాలనూ నిర్వహిస్తుండడంతో పన్ను రేటు ఎంత పడుతుందన్న సందేహాలు ఎదురయ్యాయి. వీటికి సీబీఈసీ స్పష్టత ఇచ్చింది. రెస్టారెంట్లో ఎక్కడో ఒక చోట ఏసీ ఉంటే, ఆహారం ఏ విభాగంలో సరఫరా చేశారన్న దానితో సంబంధం లేకుండా 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని పేర్కొంది. -
కారు, ఫ్రిడ్జ్, ఏసీ ఉందా? అయితే వాటికి అనర్హులే!
పట్టణ ప్రాంతాల్లో ప్రతి 10 మంది గృహదారులలో ఆరుగురు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. ప్రభుత్వం అందించే ప్రజాసంక్షేమ పథకాలకు తాము అర్హులవుతామో కాదోనని... ఎందుకంటే తాజాగా ప్రభుత్వ ప్యానెల్ సమర్పించిన నివేదికల్లో నాలుగు రూముల ఇళ్లు లేదా నాలుగు కార్ల వాహనం లేదా ఎయిర్కండీషనర్ ఏదీ ఉన్న సంక్షేమ పథక ప్రయోజనాల నుంచి తొలగించాలని వెల్లడించింది. అంతేకాక రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, టూ-వీలర్స్ మూడు కలిగి ఉన్న పట్టణ ప్రాంత ప్రజలను ఆటోమేటిక్‌గా సంక్షేమ పథకాలకు అనర్హులు చేయాలని వివేక్ దేబ్రాయ్ కమిటీ ప్రతిపాదించింది. సామాజిక ఆర్థిక సర్వే చేపట్టిన ఈ కమిటీ ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు ఉంచింది. నివాసిత, వృత్తిపరమైన, సామాజిక లేమి వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఆటోమేటిక్‌గా పట్టణ ప్రాంత ప్రజలకు సంక్షేమ పథకాల ప్రయోజనకారులుగా అవకాశం కల్పించాలని కూడా ఈ కమిటీ సూచించింది. పాలిథిన్ గోడ్ లేదా రూఫ్ కలిగి ఉన్న ఇళ్ల గృహదారులు, లేదా అసలు ఇళ్లు లేని గృహదారులకు ప్రయోజనాలను అందించాలని చెప్పింది. అంతేకాక ఆదాయం లేని వారికి, కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు లేని వారికి లేదా కుటుంబానికి పెద్దగా పిల్లలే ఉంటున్న వారికి సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందించాలని పేర్కొంది. మిగతా ప్రజలు వారు, ప్రజాసంక్షేమ ప్రయోజనాలు పొందుతారో లేదో? అంచనావేసుకోవాలని పేర్కొంది. హసిమ్ ప్యానల్ ప్రతిపాదల ప్రకారం 41 శాతం పట్టణ ప్రాంత ప్రజలు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలకు అర్హులవుతారో కారో అంచనావేసుకోవాల్సి ఉండగా.. తాజాగా వివేక్ దేబ్రాయ్ కమిటీ సూచించిన ప్రతిపాదనలో 59 శాతం మంది తమ అర్హతను అంచనావేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సంబంధిత వర్గాలు చెప్పాయి. -
ఆగిపోయిన ఏసీ.. విమానంలో ఉక్కిరిబిక్కరి
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణీకులంతా గోల చేశారు. దాదాపు ఆందోళనకు దిగినంత పనిచేశారు. అందుకు కారణం విమానంలో ఎయిర్ కండిషన్ వ్యవస్థ ఆగిపోవడమే ఇందుకు కారణమైంది. అయితే, చివరకు విమానం ఎలాంటి ప్రమాదం లేకుండానే సురక్షితంగా దిగింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం 168మంది ప్రయాణీకులతో ఏఐ-880 విమానం పశ్చిమ బెంగాల్‌లోని బగ్దోగ్రా నుంచి ఢిల్లీకి బయల్దేరగా అనూహ్యంగా ఏసీ ఆగిపోయింది. అయితే, కంగారు పడాల్సిన పని లేదని, వెంటనే వస్తుందని చెప్పారు. కానీ, అలా జరగలేదు. దీంతో సరిగా ఊపిరి ఆడక తీవ్ర ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఆక్సిజన్ మాస్కులు పెట్టుకున్నా అవీ పనిచేయలేదు. దీంతో ప్రయాణీకులంతా విమానంలో ఇచ్చిన వార పత్రికలను తీసుకొని విసనకర్రల మాదిరిగా ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. కోపంతో సిబ్బందిపై అరవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కొంతమంది వీడియోలు తీస్తుండగా అలా చేయొద్దంటూ సిబ్బంది ఫోన్లు లాక్కునే ప్రయత్నం చేశారు. ఇదే విషయంపై ఎయిర్ ఇండియాను ప్రశ్నించగా సాంకేతిక లోపం కారణంగా ఈ సమస్య తలెత్తిందని, విచారణకు ఆదేశించామని చెప్పారు. -
మీ ఏసీలు పాములకు పుట్టలేమో చూడండి?
పాము ఎక్కడ ఉంటుందని ప్రశ్నిస్తే ఎవరైనా టక్కున పుట్టలో ఉంటుందని చెబుతారు. కానీ, ఈ రోజుల్లో పాము ఎక్కడ ఉంటుందని ప్రశ్నించినప్పుడు కూడా అలాంటి పాత సమాధానమే చెబితే పప్పులో కాలేసినట్లే అవుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో పాములు పుట్టలు వదిలేసి ఏసీల్లో కూడా దూరిపోతున్నాయి. ఈ మాట నిజమే. ఓ కుటుంబానికి ఈ అనుభవం స్వయంగా ఎదురైంది. తమ ఎయిర్ కండిషన్లో దూరిన పామును చూసి వారు బిత్తర పోయారు. ఇంకాస్త ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే అప్పటి వరకు ఏసీలో నిద్రించిన ఆ పాము కాస్త వారు అలా చూస్తుండగానే ఓ ఎలుకని చూసి బుస్సుమంటూ సగానికి పైగా బయటకొచ్చి నేరుగా దాన్ని నోట కరిచిపట్టింది. ఆ వెంటనే చక్కగా తన ఏసీ గదులు పడుకొని ఆరగించేందుకు తిరిగి మళ్లీ అదే ఏసీలోకి దూరిపోయింది. ఇదంతా చూసిన ఆ కుటుంబ సభ్యులు గజగజా వణికిపోతూనే ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియో తెగ వైరల్ అవుతోంది. -
విస్తీర్ణాన్ని బట్టి ఏసీ ఎంపిక!
గది విస్తీర్ణాన్ని బట్టి ఏసీని ఎంపిక చేసుకోవాలి. 120–140 చ.అ. ఉండే గదిలో 1 టన్ను, 150–180 చ.అ. ఉండే గదిలో 1.5 టన్నులు, 180–240 చ.అ. విస్తీర్ణం ఉండే గదిలో 2 టన్నుల ఏసీ సరిపోతుంది. ఒకవేళ పడక గది దక్షిణం, పశ్చిమ దిశల్లో ఉంటే ఎండ ఎక్కువుంటుంది కాబట్టి సాధారణం కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఏసీని తీసుకోవాలి. టన్ను ఏసీ బదులు 1.5 టన్ను ఏసీని ఎంచుకోవటం ఉత్తమం. ⇒ ఒకవేళ 3–4 నెలలు... రోజులో 8–10 గంటల పాటు ఏసీని వినియోగిస్తే కనీసం త్రీ స్టార్ రేటింగ్ ఉన్న ఏసీని తీసుకోవటం ఉత్తమం. ఒకవేళ 5–7 నెలల పాటు వినియోగిస్తే మాత్రం ఫైవ్ స్టార్ ఏసీని తీసుకోవటం మేలు. సాక్షి, హైదరాబాద్: ఎండాకాలం వచ్చేసిందంటే చాలు.. కూలరో లేక ఎయిర్ కండీషనర్ (ఏసీ)ని కొనడంలో బిజీ బిజీగా ఉంటారు. నిజం చెప్పాలంటే ఇంటికి ఎలాంటి ఏసీని కొనాలో చాలా మందికి తెలియదు. బ్రాండ్ ఎంపిక బెస్టా? లేక స్టార్ రేటింగ్ ముఖ్యమా? అని నిపుణులనడితే.. గది విస్తీర్ణాన్ని బట్టి ఏసీ ఎంపిక ఉంటుందంటున్నారు. ఇళ్లల్లో ఎక్కువగా వినియోగించే ఏసీలు విండో, స్లి్పట్ రకాలే. అయితే ప్రస్తుతం విండో కంటే స్లి్పట్ ఏసీలను ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. పెద్దగా చప్పుడు లేకుండా చల్లదనాన్ని ఇవ్వడమే దీని ప్రత్యేకత. డైకిన్, ఎల్జీ, శామ్సంగ్, వోల్టాస్, బ్లూస్టార్, క్యారియర్, లాయిడ్, ఓ జనరల్, మిట్సుబిషి, వర్ల్‌పూల్ వంటి ఎన్నో బ్రాండ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పోటాపోటీగా ఆయా సంస్థలు సరికొత్త సదుపాయాలతో మార్కెట్లో రెడీగా ఉన్నాయి. ప్రారంభ ధరలు రూ.25 వేల నుంచి ఉన్నాయి. కొనాలంటే స్టార్ ఉండాల్సిందే.. ఏసీ కొనాలంటే కొనుగోలుదారులు ముందుగా చూసేది స్టార్ గుర్తులే. ఎందుకంటే ఎనర్జీ ఎఫిసియెన్సీ అనేది ఎంత విద్యుత్‌ను ఆదా చేస్తుందనే తెలియజేస్తుంది మరి. అందుకే ప్రస్తుతం ప్రతి సంస్థ కూడా స్టార్ రేటింగ్ ఏసీలను తయారు చేస్తున్నాయి. ఏసీపై ఒక స్టార్ ముద్రించి ఉంటే 5 శాతం విద్యుత్ ఆదా అవుతుందని అర్థం. స్టార్ల సంఖ్య పెరుగుతుంటే విద్యుత్ ఆదా కూడా పెరుగుతుంది. ఒక్కో స్టార్ గుర్తు పెరుగుతుంటే ధర కూడా రూ.2,500 పెరుగుతుంది. ఫైవ్ స్టార్ స్లి్పట్ ఏసీతో పోల్చుకుంటే ఇన్వర్టర్ ఏసీ ధర 20 శాతం అధికంగా ఉంటుంది. -
ఏసీలకు జీఎస్టీ కాక..మండనున్న ధరలు
న్యూఢిల్లీ: ఒకవైపు జీఎస్టీ బిల్లు అమలుకు కేంద్ర ప్రభుత్వం శరవేగంగా పావులు కదుపుతోంది. మరోవైపు జీఎస్టీ ఆధారిత పన్ను రేట్ల ప్రభావం ఎయిర్ కండీషనర్ల ధరలపై పడనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. జీఎస్టీ 28శాతం పన్ను పరిధిలోకి ఏసీలు రావడం మూలంగా ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. ఎయిర్ కండిషనర్లపై 18శాతం సెస్ విధించినా కూడా ప్రస్తుత ఉన్న ధరలతో పోలిస్తే 2.5శాతం పెరగనున్న ఉత్పత్తి ఖర్చులతో పాటు.. మొత్తం సేవలపై 18శాతం కలిపి ఏసీలు ధరలు మండిపోనున్నాయని బ్లూస్టార్ ఎండీ త్యాగరాజన్ అభిప్రాయపడ్డారు. మరోవైపు 2018 జనవరి 1 నుంచి జీఎస్టీ కొత్త ఎనర్జీ రేటింగ్ విధానాన్ని పరిచయం చేస్తే ... ధరలు ఇంకా పెరుగుతాయన్నారు. దీంతో వచ్చే ఏడాదినాటికి ప్రస్తుతం 5 స్టార్ రేటింగ్ ఏసీలు ధరలకు..3 స్టార్ ఏసీల ధరలు చేరుకుంటాయని అభిప్రాయపడ్డారు. సాధారణంగా 40 శాతం ఏసీల సేల్స్ జూన్ మాసానికంటే ముందే జరుగుతాయని, కానీ జీఎస్టీ పన్ను రేటు స్పష్టత కోసం వినియోగదారులు వేచి చూస్తున్నారని చెప్పారు. గత ఏడాది మొత్తం మార్కెట్ 20 శాతం వృద్ధి చెందగా, బ్లూస్టార్ 35శాతం వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. వినియోగ వస్తువుల ధరలు పెరిగిన కారణంగా మార్కెట్ గ్రోత్15-20శాతం ఉంటే..తమ మార్కెట్ కూడా 20-25 శాతం వృద్ధి చెందుతుందని త్యాగరాజన్ అంచనా వేశారు. జీఎస్టీ ఆధారిత పన్నుపై మరో నెలలో క్లారిటీ రావచ్చే ఆశాభావాన్నివ్యక్తం చేశారు. జమ్మూ, ఆంధ్ర ప్రదేశ్ శ్రీ సిటీ లోబ్లూ స్టార్ కొత్త ప్లాంట్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభంకానున్నాయి. కాగా కొత్తగా అమలు చేయనున్న వస్తు సేవా పన్నుకు సంబంధించిన ఐదు ముసాయిదా బిల్లులకు జీఎస్టీ కౌన్సిల్ గురువారం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం గరిష్ట జీఎస్టీ రేటు 28 శాతంతో పాటుగా అదనంగా గరిష్టంగా 15 శాతం సెస్ విధించాలని సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. -
అహోబిలం ఏసీగా గాయత్రి
కర్నూలు(న్యూసిటీ): ఆళ్లగడ్డ మండలం అహోబిలంలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఉపకమిషనర్‌గా(ఏసీగా) బి.గాయత్రి దేవిని నియమించారు. రాయలసీమలోని కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు ఉపకమిషనర్‌గా గాయత్రి దేవి ఉన్నారు. అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వాణి గత నెల 23వ తేదీ నుంచి సెలవుపై వెళ్లారు. దీంతో ఎఫ్ఏసీ(ఫుల్ అడిషనల్ చార్జ్)గా గాయత్రి దేవిని నియమిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వై.వి.అనురాధ కర్నూలుకు ఉత్తర్వులు పంపారు. లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం 6 ఏ కేటగిరీ కిందకు వస్తుంది. అంతేకాక రాష్ట్రంలోని అతిపెద్ద వైష్ణవ దేవాలయాల్లో ఇది ఒకటి కావడం గమనార్హం. -
ఏసీ ఒక సైకో..
దేవాదాయశాఖ ఉద్యోగుల డిమాండ్ ఏసీపై బిగుస్తున్న ఉచ్చు సిబ్బందంతా మూకుమ్మడి సెలవులు టర్నర్ చౌల్టీ్ర వద్ద వంటావార్పుతో నిరసన కొత్త కమిషనర్‌ను నియమించే వరకు పోరాటం ఆగదని స్పష్టం డాబాగార్డెన్: దేవాదాయశాఖ సహాయ కమిషనర్ ఇ.వి.పుష్పవర్థన్‌పై ఉచ్చు బిగుసుకుంటోంది. కార్యనిర్వహణాధికారులే కాదు.. ఆలయాల మేనేజర్లు, సిబ్బంది కూడా ఏసీ పై మండిపడతున్నారు. కార్యాలయంలో ఉన్న సిబ్బందంతా మాస్ లీవ్ పెట్టి మరీ కార్యనిర్వహణాధికారుల పోరాటంలో భాగస్వాములయ్యారు. ఈ మేరకు బుధవారం టర్నర్ చౌల్టీ్ర ప్రాంగణంలో దేవాదాయ శాఖ సిబ్బంది వంటా వార్పు కార్యక్రమం చేపట్టి నిరసన తెలిపారు. నియంతగా వ్యవహరిస్తున్న ఏసీ డౌన్ డౌన్.. అంటూ నినాదాలు చేశారు. మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తూ.. నిజారుుతీ ముసుగులో అవినీతి చేస్తున్న ఏసీపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కార్యాలయానికి వస్తున్న ఉప కమిషనర్ ఎన్వీఎస్ మూర్తి వాహనాన్ని అడ్డుకుని ఏసీని వెంటనే బదిలీ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. ఈ సందర్భంగా ఉప కమిషనర్ మాట్లాడుతూ మీ డిమాండ్‌ను..మీరిచ్చిన వినతి పత్రాన్ని అధికారుల దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లినట్టు తెలిపారు. ఏసీ ఒక సైకో.. సహాయ కమిషనర్ ఒక సైకోల ప్రవర్తిస్తున్నాడని కార్యనిర్వాహణాధికారులు ఆరోపించారు. అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతున్నారని, మహిళా ఉద్యోగినులకు పక్కన కూర్చొబెట్టుకుని వేధిస్తున్నారన్నారు. ఒక్కొక్కర్ని టార్గెట్ చేసి సస్పెన్స చేస్తానని బెదిరిస్తూ మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని వాపోయారు. ప్రేమసమాజానికి సంబంధించిన స్థల విషయంలో సారుుప్రియా రిసార్ట్స యాజమాన్యం వద్ద రూ.5లక్షలు అక్రమంగా తీసుకున్నారని ఆరోపించారు. 2014 ఆగస్టు ఒకటిన విధుల్లోకి చేరిన నాటి నుంచి నిరంకుశ ధోరణి సాగిస్తున్నారని మండిపడ్డారు. ఎటువంటి ఆరోపణలు లేకుండా, విచారణ చేపట్టకుండా సిబ్బందిని డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారని దుయ్యబట్టారు. కొత్త సహాయ కమిషనర్‌ను నియమించే వరకూ సెలవులోనే కొనసాగుతామని హెచ్చరించారు. నల్లబ్యాడ్జీలతో నిరసన.. సహాయ కమిషనర్ ఇ.వి.పుష్పవర్థన్‌పై తక్షణ చర్యలు కోరుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగులు తలపెట్టిన సామూహిక సెలవులకు మద్దతుగా కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన ఉద్యోగుల సంక్షేమ సంఘం నల్ల బ్యాడ్జీలు ధరంచి సంఘీభావం తెలిపారు. మరో వైపు నిన్నమొన్నటి వరకు ఏసీకి అనుకూలంగా వ్యవహరించిన వారంతా ఉద్యమిస్తున్న ఉద్యోగులకు మద్దతు ప్రకటించడంతో ఏసీ ఏకాకిగా మిగిలారు. నేటి నుంచి నిరాహారదీక్షలు.. మాస్ లీవ్‌లో భాగంగా జిల్లా దేవాదాయశాఖ ఉద్యోగులు, ఆలయాల మేనేజర్లు, సిబ్బంది అందరూ గురువారం నుంచి నిరాహారదీక్షలకు దిగనున్నట్టు కార్యనిర్వహణాధికారుల సంఘం అధ్యక్షుడు అల్లు జగన్నాథం, కార్యదర్శి బండారు ప్రసాద్, సహాయ కార్యదర్శులు శ్రీనివాసరావు, ఎం.ఎల్.ఎన్.శాస్తి్ర, కార్యనిర్వహణాధికారులు కె.శిరీష, భానురాజా అధిక సంఖ్యలో ఈవోలు, ఆలయాల మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
దేవాదాయ శాఖ ఏసీగా సులోచన బాధ్యతలు స్వీకరణ
నల్లగొండ కల్చరల్ : దేవాదాయ శాఖ నల్లగొండ అసిస్టెంట్ కమిషనర్‌గా అన్నెపర్తి సులోచన గురువారం బాధ్యతలు స్వీకరించారు. కనగల్లు మండలం దర్వేశిపురం శ్రీ రేణుకా యల్లమ్మ దేవాలయంలో ఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న సులోచన అసిస్టెంట్ కమిషనర్‌గా పదోన్నతి పొందారు. ఇప్పటివరకు ఇన్చార్జి అసిస్టెంట్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రామచందర్‌రావు కార్యాలయ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. -
యాగాల వల్లే దేశం సుభిక్షం
అన్నవరప్పాడు (పెరవలి) : వేద పండితులు నిర్వహిస్తున్న యాగాలు, అర్చకులు చేస్తున్న పూజల వల్లనే దేశం సుభిక్షంగా ఉందని దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్ దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో వేద పండితుడు ఖండవల్లి సూర్యనారాయణ చార్యులు రచించిన ‘సంక్షిప్త ప్రతిష్ఠా సరళి గ్రం«థం’ను గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 1721 దేవాలయాలకు గాను 710 దేవాదాయ శాఖా అధీనంలో ఉన్నాయని అన్నారు. వీట న్నింటికీ కమిటీలు వేస్తున్నామని, ఇప్పటికీ 80 శాతం పూర్తి చేశామని చెప్పారు. జిల్లాలో ప్రముఖ దేవాలయాలైన భీమవరం మావుళ్లమ్మ అమ్మవారు, ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయాలను కలుపుతూ టూరిజం ఏర్పాటు చేస్తున్నామని, ఇది త్వరలోనే భక్తులకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. గత నెలలో దేవాలయాలన్నింటిలో నిర్వహించిన వరుణ, అరుణయాగం, సహస్ర ఘటాభిషేకం వల్లనే మూడు రోజులుగా రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయని తెలిపారు. శాస్త్రాలు, పురాణాలు ఆధారంగా క్రతువుల్లో చేసే యాగాల ఫలమే ప్రపంచశాంతికి, దేశ సుఖశాంతులకు దోహదం చేస్తున్నాయని అన్నారు. తొలుత ఆయనకు పండితులు వేద మంత్రాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలకగా వేదపండితులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆ శాఖ ఇ¯Œæస్పెక్టర్ శ్రీనివాస్, ఈవో వీఎస్ఎస్ బ్రహ్మారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
అవసరాన్ని బట్టి కూలింగ్...
♦ శాంసంగ్ నూతన రిఫ్రిజిరేటర్లు ♦ ధరల శ్రేణి రూ.15-82 వేలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం శాంసంగ్ నూతన శ్రేణి ఉత్పత్తులను హైదరాబాద్ మార్కెట్లో బుధవారం విడుదల చేసింది. వీటిలో రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, మైక్రోవేవ్ ఓవెన్లు ఉన్నాయి. రిఫ్రిజిరేటర్ల విభాగంలో స్మార్ట్ కన్వర్టిబుల్ 5 ఇన్ 1 శ్రేణిలో 393-670 లీటర్ల మోడళ్లను ప్రవేశపెట్టింది. వీటి ధర రూ.45,000-82,500 మధ్య ఉంది. ట్విన్ కూలింగ్ ప్లస్ టెక్నాలజీతో రూపొందిన ఈ రిఫ్రిజిరేటర ్ల కూలింగ్ స్థాయిని కస్టమర్లు అవసరాన్ని బట్టి నిర్ణయించుకోవచ్చు. ఫ్రిజ్, ఫ్రీజర్‌కు వేర్వేరు ఎయిర్ఫ్లోస్ ఉన్నాయి. దీంతో చేపల వంటి ఉత్పత్తుల వాసన మరొక ఉత్పాదనకు సోకదు.ఆహారోత్పత్తులు 7 రోజుల దాకా తాజాగా ఉంటాయని కంపెనీ చెబుతోంది. వీటితోపాటు స్మార్ట్ డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ విభాగంలో 192-230 లీటర్ల సామర్థ్యంతో రిఫ్రిజిరేటర్లను ప్రవేశపెట్టారు. ప్రారంభ ధర రూ.15,100. రిఫ్రిజిరేటర్ల విపణిలో తమకు 40.5% వాటా ఉందని శాంసంగ్ కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ భుటాని ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ప్రపంచంలో తొలిసారిగా 8 పోల్ మోటార్‌తో డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్‌తో కూడిన ఏసీలను కంపెనీ రూపొందించింది. సంప్రదాయ ఏసీలతో పోలిస్తే 43% వేగంగా చల్లబరుస్తుంది. బయటి వాతావరణం 58 డిగ్రీలున్నా గదిని కూల్ చేస్తుందని కంపెనీ వెల్లడించింది. ఏసీల్లో అంతర్గతంగా స్టెబిలైజర్‌ను పొందుపరిచారు. రూమ్ ఏసీ విభాగంలో 49 రకాలను రూ.30,800-67,000 ధరలో ప్రవేశపెట్టారు. -
అధికారులకు ఏసీలు.. కార్మికులకు కూలర్లు
ఇదేనా ‘ఒకే కుటుంబం.. ఒకే గమ్యం.. ఒకే లక్ష్యం’ స్ఫూర్తి యాజమాన్యం తీరుపై కార్మికుల ఆగ్రహం ఖమ్మం(ఇల్లెందుఅర్బన్): ఒకే కుటుంబం..ఒకే గమ్యం..ఒకే లక్ష్యం నినాదంతో కొనసాగుతున్న సింగరేణి యాజమాన్యం ఆచరణలో మాత్రం విఫలమవుతోందని కార్మిక నేతలు విమర్శిస్తున్నారు. ప్రతి ఏడాది వేసవిలో మండుతున్న ఎండల నుంచి అధికారులు ఉపశమనం పొందేందుకు వీలుగా వారి క్వార్టర్లకు ఏసీలు ఏర్పాటు చేసుకునేందుకు యాజమాన్యం అవకాశం కల్పించింది. కార్మికులను మాత్రం కూలర్లకే పరిమితం చేశారు. ప్రస్తుత ఎండల వేడిమికి కూలర్లు సైతం పని చేయలేని స్థితిలో ఉన్నాయి. కూలర్లు వేసినా కార్మికులు ఉక్కపోత, వేడిమితో క్వార్టర్లల్లో ఉండలేకపోతున్నారు. మొదటి, సెకండ్ షిప్టుల్లో పని చేసి ఇంటికి వచ్చిన కార్మికులకు కంటి నిండా నిద్రలేకుండాపోతోంది. ఇంట్లో ఉన్న వేడిమికి ఒళ్లు మంటతో తల్లడిల్లిపోతున్నారు. ప్రస్తుతం ఉన్న వేతనాలతో కార్మికులు ఏసీలను సైతం కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. కానీ కార్మికుల క్వార్టర్లకు ఏసీలు ఏర్పాటు చేసుకునేందుకు యాజమాన్యం నుంచి అనుమతిలేదు. దీంతో కార్మికులు నిస్సహాయస్థితిలో ఉండిపోతున్నారు. కార్మిక సంఘాల నేతలు ఈ సమస్యను పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. ఓపెన్‌కాస్టుల్లో పని చేసే కార్మికులు మాత్రం ఇరుకుగదులు గల క్వార్టర్లలో ఏసీలు వసతి లేకపోవడంతో నరకయాతన అనుభవిస్తున్నారు. కూలర్లు, ఏసీల కింద పని చేసే అధికారుల క్వార్టర్లకు మాత్రం ఏసీలకు అనుమతిస్తున్న యాజమాన్యం అగ్నికుంపటిలో ఎనిమిది గంటలు పని చేసి వచ్చే తమ క్వార్టర్లుకు ఏసీ ఏర్పాటుకు ఎందుకు అనుమంతించడంలేదంటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం పునరాలోచించి కార్మికుల క్వార్టర్లకు కూడా ఏసీలను బిగించుకుని అవకాశం కల్పించాలని కార్మిక నేతలు కోరుతున్నారు. -
ఎక్కువగా ఏసీని వాడుతున్నారని..
ఆంగ్మలీ: ఏసీని ఎక్కువగా ఉపయోగిస్తున్నారనే కారణంతో రిటైర్డ్ రైల్వే ఉద్యోగి.. భార్య, కొడుకుతో గొడవపడి వారిని చంపేశాడు. ఏసీ ఆన్ చేసుకుని నిద్రపోతున్న భార్య, కొడుకును చూసి ఆవేశాన్ని అణుచుకోలేక పోయిన 81 ఏళ్ల పాల్ వారిద్దరినీ ఇనుప రాడ్డుతో కొట్టాడు. కొడుకు థామస్ అక్కడిక్కడే మరణించగా, భార్య మేరీ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయినట్టు పోలీసులు చెప్పారు. కేరళలోని ఆంగ్మలీలో ఈ ఘటన జరిగింది. తల్లి, బిడ్డలను రాడ్‌తో కొట్టిన తర్వాత బంధువులకు ఫోన్ చేసి పాల్ జరిగిన విషయం చెప్పాడు. అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసినా వృద్ధాప్యం కారణంగా చేసుకోలేకపోయాడు. గత కొద్ది రోజులుగా తన కుటుంబ సభ్యులు ఏసీని ఎక్కువగా వాడుతున్నారని, దీనివల్ల కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని, కేవలం పెన్షన్‌తో కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టమవుతోందని, అందుకే వారిని చంపినట్లు పాల్ పోలీసుల విచారణలో తెలిపాడు. -
‘ఈజీ కమ్యూట్’తో హ్యాపీ ప్రయాణం
ఉద్యోగుల కోసం హైదరాబాద్‌లో ఏసీ బస్ సర్వీసులు ♦ జీపీఆర్ఎస్ వాహనాలు, ఏసీ, ఉచిత వైఫై కూడా.. ♦ ఈ ఏడాది చివరి నాటికి ముంబై, ♦ బెంగళూరుకు విస్తరణ ♦ రూ.50 లక్షల నిధుల సమీకరణపై దృష్టి ♦ ‘సాక్షి స్టార్టప్ డైరీ’తో ఈజీ కమ్యూట్ కో-ఫౌండర్ రాహుల్ జైన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : హైదరాబాద్‌లో ప్రయాణం.. అది కూడా బస్సులో అంటే మాములు విషయం కాదు. బస్సు ఎప్పుడొస్తుందో తెలియదు. వచ్చినా సీటు దొరుకుతుందన్న గ్యారంటీ లేదు! పోనీ ఆటోలో వెళదామంటే మీటర్ పేరుతో జేబుగుల్ల! బైక్ మీదో కారులోనో వెళదామంటే ట్రాఫిక్ చిక్కులు!! ఈ కష్టాలన్నీ నగరవాసులకు నిత్యం ఎదురయ్యేవే. వీటి నుంచి బయటపడేయడానికి వచ్చిన స్టార్టప్ కంపెనీయే... ఈజీ కమ్యూట్. ఇంట్రా సిటీ ఏసీ బస్ సర్వీసెస్‌లను అందిస్తున్న ఈ స్టార్టప్ సేవల గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. జీపీఆర్ఎస్తో వాహనం ఎప్పుడొస్తుందో తెలుసుకునే వీలు.. సౌకర్యవంతమైన సీటు, ఫుల్లీ లోడెడ్ ఏసీతో పాటూ ఉచిత వైఫై!! ఉద్యోగ రీత్యా కొన్నేళ్ల పాటు స్వయంగా ఎదుర్కొన్న ప్రయాణ కష్టాలే ఈజీ కమ్యూట్ స్టార్టప్ స్థాపనకు కారణమంటున్నారు సంస్థ సహ వ్యవస్థాపకుడు రాహుల్ జైన్. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. నా స్వస్థలం బెంగళూరు. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డా. హైటెక్‌సిటీలో కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్‌గా పనిచేసేవాణ్ణి. లింగంపల్లిలోని కొత్తగూడలో నివాసం. ఇంటి నుంచి ఆఫీసుకు రోజూ 15 కి.మీ. ప్రయాణం. దీనికోసం అష్టకష్టాలు పడేవాణ్ణి. లింగంపల్లి నుంచి ఆల్విన్ చౌరస్తా వరకు షేర్ ఆటోలో ప్రయాణం. అది కూడా డ్రైవర్ పక్కన కడ్డీలకు ఆనుకొను వేలాడుతూ!!. ఆ వేలాడే ప్రయాణం ఎంత కష్టమో మాటల్లో చెప్పలేం. సీటులో ఇమడలేక శరీరం పిప్పి అయ్యేది. దాని తాలుకు ప్రభావం ఆఫీసు పనిపై పడేది. ఇలా మూడేళ్లు ప్రయాణ నరకం అనుభవించా. ఓ రోజు టెక్నాలజీ మీటప్‌లో భాగంగా ట్రిపుల్ ఐటీ విద్యార్థి మయాంక్ చావ్లాను కలిశా. మా ఇద్దరికీ ఎదురైన కామన్ సమస్య.. ప్రయాణ కష్టాలే. దీనికి టెక్నాలజీతో పరిష్కారం చూపించాలనుకున్నాం. ఇంకేముంది రూ.10 లక్షల పెట్టుబడితో 2015 అక్టోబర్‌లో మొబైల్ ఆధారిత ఇంట్రా సిటీ ఏసీ బస్ సర్వీసెస్ సేవలైన ఈజీ కమ్యూట్‌ను ప్రారంభించాం. ఎలా వినియోగించుకోవాలంటే.. ఈజీ కమ్యూట్ సేవల్ని మూడు స్టెప్పులో వినియోగించుకోవచ్చు. ముందుగా అందుబాటులో ఉన్న రూట్లలో పికప్ మరియు డ్రాప్‌ల స్థానాన్ని ఎంచుకోవాలి. తర్వాత సమయాన్ని, సీట్‌ను నిర్ధారించుకోవాలి. ఆ తర్వాత యూజర్ తన ఈ-వ్యాలెట్ నుంచి డబ్బులు చెల్లిస్తే సరి. వెంటనే యూజర్‌కు బుకింగ్ ఐడీ, సీట్, వాహనం నంబర్, సమయం ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయి. వాహనం బయలుదేరిన సమయం? ప్రస్తుతం ఎక్కడుంది? నిర్ధారిత స్థానానికి ఎప్పుడొస్తుంది? గమ్యస్థానానికి ఎప్పుడు చేరుకుంటుంది? వంటి విషయాల్ని జీపీఆర్ఎస్ ఆధారంగా యూజర్ తన మొబైల్ నుంచే తెలుసుకోవచ్చు కూడా. కి.మీ.కు రూ.3-5 చార్జీ.. ప్రస్తుతం ఉదయం 14, సాయంత్రం 10 రూట్లలో మొత్తం 24 రూట్లలో ప్రయాణ సేవలందిస్తున్నాం. సంబంధిత రూట్లలో కొన్ని.. ఎల్బీనగర్, ఈసీఐఎల్, ఉప్పల్, దిల్సుఖ్నగర్, రాంనగర్, రామాంతపూర్, ప్రగతినగర్, నిజాంపేట్, నాగోల్, కొండాపూర్, ఏఎస్‌రావ్ నగర్, మారెడ్‌పల్లి, మాదాపూర్ ఉన్నాయి. ప్రస్తుతం 8,000 రిజిస్టర్ యూజర్లున్నారు. రోజుకు 210 మంది మా సేవల్ని వినియోగించుకుంటున్నారు. కి.మీ.కు రూ.3-5 చార్జీ ఉంటుంది. మొత్తంగా ఒక వైపు ప్రయాణానికి రూ.40-80 అవుతుంది. ఈజీ కమ్యూట్ ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో చెప్పేందుకు గాను రెండు సార్లు ఉచిత ప్రయాణాన్ని కూడా అందిస్తున్నాం. రూ.50 లక్షల నిధుల సమీకరణ.. వాహనాల కోసం పలువురితో ఒప్పందాలు చేసుకున్నాం. టెంపో ట్రావెలర్, వింగర్, జైలో, ఇన్నోవా, టవేరా మొత్తం 14 వాహనాలున్నాయి. వీటి సీటింగ్ సామర్థ్యం 210. వాహన ఓనర్లకు కి.మీ.కు రూ.2-4 మధ్య కమీషన్ రూపంలో చెల్లిస్తాం. 2 నెలల్లో యూజర్ల సంఖ్యను 20 వేలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ‘‘ప్రస్తుతం నెలకు రూ.2 కోట్ల వ్యాపారాన్ని చేస్తున్నాం. ఈ ఏడాది ముగింపు లోగా బెంగళూరు, ముంబైల్లోనూ సేవల్ని విస్తరించనున్నాం. ఇందుకుగాను తొలిసారిగా నిధుల సమీకరణ చేయనున్నాం. సీడ్ రౌండ్లో భాగంగా రూ.50 లక్షల పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ఏంజెల్ ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉన్నారు. మరో 2-3 నెలల్లో డీల్‌ను పూర్తి చేస్తాం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
చోరీలు చేస్తున్న ఇద్దరు మహిళలు ఆరెస్ట్
బంజారాహిల్స్ : ఇళ్లలోకి చొరబడి ఎయిర్ కండీషనర్లు చోరీ చేస్తున్న హోంగార్డు భార్యతో సహా మరో మహిళను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36 లోని ఫ్లాట్ నంబర్ 733లో ఈ నెల 16న ఇద్దరు మహిళలు చొరబడి ఎయిర్కండీషన్లు చోరీచేసి వాటిని విక్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిఘా పెట్టారు. ఈనెల 21న అలగితోలు కళమ్మ (22), సంతలూరు అశ్విని అలియాస్ వెన్నెల(20) అనే మహిళలు ఏసీలు అమ్ముతున్నట్లు గమనించారు. ఈ మహిళలను అదుపులోకి తీసుకుని విచారించగా... ఈ ఏసీలు జూబ్లీహిల్స్‌లో చోరీ చేసినట్టు వెల్లడించారు. ఫిలింనగర్లో దుర్గాభవానీనగర్‌లో నివసిస్తున్న వీరిద్దరూ కలిసి కొంతకాలం నుంచి చోరీలకు పాల్పడుతున్నారు. కాగా, నిందితురాలు అలగితోలు కళమ్మ భర్త పవన్ నగరంలో హోంగార్డుగా పనిచేస్తున్నట్టు తెలిసింది. కళమ్మ, అశ్వినిలను అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. -
ఒళ్లంత చల్లంత..
వేసవి తాపాన్ని తగ్గించే పనిలో ఇంట్లో కూలర్లు.. ఏసీలు.. నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. ఇంట్లో ఉండగా భానుడి భగభగల నుంచి తప్పించుకున్నా.. బయటకు వెళ్లినప్పుడు మాత్రం మండుటెండకు మాడక తప్పదు. వడగాలికి వాడిపోకుండా కూల్‌గా ఉండేలా మొబైల్ కూలర్‌ను కనుగొన్నాడు మల్కాజిగిరికి చెందిన పోసూరి రవికిరణ్. బస్‌లో, కారులో వెళ్లేటప్పుడు ఈ ట్రావెల్ కూలర్ మీకు చల్లదనాన్ని అందిస్తుంది. అరచేతిలో ఇమిడే బుల్లి కూలర్ లో అరగ్లాస్ నీరు పోస్తే చాలు. బ్యాటరీతో నడిచే ఈ కూలర్‌ను పీవీసీ పైపు, బుల్లి ఫ్యాన్ బ్లేడ్ వంటి ఇతర పరికరాలతో రూపొందించాడు. దీన్ని తయారు చేయడానికి అయిన ఖర్చు రూ.150 మాత్రమే. - అల్వాల్ -
ఇదేం పని?
పేరుకే బాలల హక్కుల కమిషన్ కనీస సౌకర్యాలు నిల్ రెండు నెలల క్రితమే సర్కారుకు నోటీసులు లోకాయుక్త ఆదేశాలూ బేఖాతరు సాక్షి, సిటీబ్యూరో: ఈ చిత్రంలో టేబుల్ చూడ్డానికి చాలా అందంగా ఉంది. కానీ దాన్ని నిలబెట్టడానికి ఇటుకలు, రాళ్లు ఆధారంగా ఉంచాల్సిందే.. ఫ్యాన్లు, ఏసీ.. అన్నీ ఉన్నట్టే ఉంటాయి. పనిచేసేది అనుమానమే.. ఉన్నదే ఒక్క గది.. చూడబోతే స్టోర్‌రూమ్‌ను తలపిస్తుంది.. ఇదీ బాలల హక్కుల కమిషన్ దుస్థితి. ఆర్భాటంగా కమిషన్ ఏర్పాటైతే చేశారు కానీ.. అందులోని బాధ్యులెవరూ ఇక్కడ పట్టుమని పది నిమిషాలు కూర్చుని పనిచేసే పరిస్థితి లేదు. అప్పటి ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో బాలల హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ఫిబ్రవరి 19న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సభ్యులుగా (ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా) రహీముద్దీన్, పి.అచ్యుతరావు, ఎం.సుమిత్ర, ఎస్.మురళీధర్‌రెడ్డి, మమతా రఘువీర్, ఎస్.బాలరాజును నియమించింది. నెలైనా వీరికి కార్యాలయం సమకూర్చలేదు. దీంతో సభ్యులు కార్యకలాపాలను తమ ఇళ్ల నుంచే సాగించారు. కమిషన్ కష్టాలు పత్రికలలో రావడంతో లోకాయుక్త సుమోటోగా స్వీకరించి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కమిషన్‌కు కార్యాలయం, సిబ్బందిని కేటాయించాలని ఆదేశించింది. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ డెరైక్టర్ శ్యాంసుందరికి నోటీసులు కూడా జారీ చేశారు. అయితే నేటి వరకు లోకాయుక్త ఆదేశాలపై, నోటీసుపై ఎలాంటి స్పందన లేదు. తూతూ మంత్రంగా యూసుఫ్‌గూడలోని మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన ఓ కార్యాలయంలో చిన్నపాటి గదిని మాత్రం ఇచ్చారు. అందులో ఆరుగురు సభ్యులకు కలిసి మూడంటే మూడే కుర్చీలు (అవి కూడా కాలు విరిగినవి) సమకూర్చారు. ఇక తాగేందుకు మంచినీటి సౌకర్యం లేదు. సౌకర్యాలు ఈ రకంగా ఉంటే ఇక ఒక్కరంటే ఒక్క సిబ్బందినీ ఇంతవరకూ కేటాయించలేదు. 2013 జీఓ నెంబర్ 5 ప్రకారం కమిషన్ సభ్యులకు ఏ ఒక్క సౌకర్యం కల్పించలేదు. కార్యకలాపాలు సాగేందుకు వీలు లేక.. దీన స్థితిలో బాలల హక్కుల కమిషన్ ఉందంటే బాలలపై ప్రభుత్వం ఒలకబోస్తున్న ప్రేమ ఎంతో అర్థమవుతోంది. -
భగ్గుమంటున్న భానుడు
సిటీలో పగలు సెగలు అనారోగ్యం పాలవుతున్న సిటిజన్లు సాక్షి, సిటీబ్యూరో: భానుడు భగ్గున మండుతున్నాడు. ఉదయం 10 గంటలకే సూర్యుడు సెగలు కక్కుతున్నాడు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు వేడికి అల్లాడుతున్నారు. మండె ఎండలకు ఉక్కపోత తోడవ్వడంతో సిటిజన్లు అసౌకర్యానికి గురవుతున్నారు. పగలు కరెంట్ సరఫరా నిలిపివేస్తుండటంతో ఇంట్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు పనిచేయక పోవడంతో ఇరుకైన అపార్ట్‌మెంటుల్లో నివాసం ఉండేవారు ఉక్కకు తట్టుకోలేక పోతున్నారు. తాజాగా సోమవారం గరిష్ట 35.6, కనిష్ట 21.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్ తర్వాత మరెలా ఉంటుందోనని సిటిజన్లు భయపడుతున్నారు. గ్రేటర్లో రోజు రోజుకు పెరుగుతున్న వాహన, పారిశ్రామిక కాలుష్యం వల్ల వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చమట పొక్కులతో చికాకే..: ఎండ తీవ్రతకు చిన్నారులు,వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, టూవీలర్స్‌పై ప్రయాణించే మా ర్కెటింగ్ ఉద్యోగులు, యువ తీయువకులు చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. తెల్లవారు జామున చలి, మధ్యాహ్నం ఎండ వల్ల చర్మం పొడిబారుతోంది. ఉక్కపోత వల్ల మెడ, కాళ్లు, చేతులపై పొక్కులు వస్తున్నాయి. ముఖం వాడిపోవడంతో పాటు నుదురు, బుగ్గలపై నల్లని మచ్చలు ఏర్పడుతున్నాయి. మానసికంగా ఎంతో అలసి పోవడంతో పాటు వడదెబ్బ, జ్వరం బారిన పడుతున్నారు. సాధ్యమైనంత వరకు ఎండలో భయటికి వెళ్లక పోవడమే ఉత్తమం. తప్పని పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సి వస్తే వాటర్ బాటిల్, గొడుగు విధిగా వెంట తీసుకెళ్లాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. టైట్ జీన్స్ వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ సూర్యుని వైపు చూడటం వల్ల కిరణాల తాకిడికి చూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. తేలికైన తెల్లని కాటన్ దుస్తులు ధరించాలి. టైట్ జీన్స్, బిగుతు లోదుస్తులు వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. చిన్నారులకు చెమట పొక్కులు రాకుండా కూల్ పౌడర్లు వాడాలి. చన్నీటితో రోజుకు రెండుసార్లు స్నానం చేయాలి. - డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్, నిలోఫర్ చిన్నపిల్లల వైద్యశాల సన్‌లోషన్స్ రాసుకోవాలి చిన్నారులు, వద్ధులు, గర్భిణులు, బాలింతలు సాధ్యమైనంత వరకు బయటికి వెళ్లకూడదు. ఏమైన పనులు ఉంటే ఉదయం పూర్తి చేసుకుని ఎండ ముదిరే సమయానికి ఇంటికి చేరుకోవాలి. స్కిన్ గ్లో తగ్గకుండా ఉండాలంటే బయటికి వెళ్లే ముందు చర్మానికి సన్‌లోషన్స్ అప్లైయ్ చేయాలి. - డాక్టర్ మన్మోహన్, ప్రొఫెసర్ ఉస్మానియా మెడికల్ కళాశాల మసాలా ఫుడ్డు వద్దేవద్దు మసాలా ఫుడ్డుకు బదులు, సులభంగా జీర్ణం అయ్యే పెరుగు అన్నం తీసుకోవాలి. కలుషిత నీరు కాకుండా శుభ్రమైన ఫ్యూరిఫైడ్ మంచి నీటిని వాడాలి. శీతల పానీయాలకు బదులు పండ్ల రసాలు, కొబ్బారి బొండాలు తాగాలి. డీహైడ్రేషన్ కాకుండా ఉండేందుకు రోజుకు కనీసం ఐదు లీటర్ల మంచి నీరు తాగాలి. - డాక్టర్ సంగీత, అపోలో, డీఆర్డీఎల్ చలువ అద్దాల ఎంపికలో జాగ్రత్త సూర్యుని వైపు చూడటం వల్ల కిరణాల తాకిడికి చూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. రోడ్డుసైడ్ లభించే కూలింగ్ గ్లాసులు కంటికి మేలు చేయక పోగా మరింత హాని చేస్తాయి. యాంటి రిఫ్లెక్షన్ బ్లాక్, బ్రౌన్ కలర్ గ్లాసులు ఎంపిక చేసుకోవాలి. ఇంటి నుంచి బయటికి వెళ్లి వచ్చిన ప్రతిసారి కళ్లను శుభ్రం చేసుకోవాలి. - డాక్టర్ రవీందర్, ప్రముఖ కంటి వైద్యనిపుణుడు -
టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీల ధరలు దిగొస్తాయ్!
రేట్ల తగ్గింపు పరిశీలిస్తున్నాం: ఎల్జీ, ప్యానాసోనిక్ న్యూఢిల్లీ: ఫ్రిజ్‌లు, టీవీలు, ఏసీలు ఇతరత్రా కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలుదిగొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కన్జూమర్ గూడ్స్‌పై ఎక్సైజ్ సుంకాన్ని 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తామని ఆర్థిక మంత్రి పి. చిదంబరం మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదించడంతో ఈ రంగంలోని కంపెనీలు స్పందించాయి. ధరలు తగ్గించే విషయమై ప్యానాసానిక్ ఇండియా, ఎల్జీ ఇండియా కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ తగ్గింపు ప్రభావాన్ని మదింపు చేస్తున్నామని వెల్లడించాయి. మార్కెట్ పరిస్థితులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ధరలపై నిర్ణయం తీసుకుంటామని ఎల్జీ ఇండియా ఎండీ సూన్ క్వాన్ పేర్కొన్నారు. ఈ బడ్జెట్ సానుకూలంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మార్కెట్ పరిస్థితులను ఈ బడ్జెట్ మెరుగుపరుస్తుందని, తయారీ రంగానికి ఊపునిస్తుందని ఆయన చెప్పారు. వినియోగదారుల సెంటిమెంట్ సానుకూలంగా మారుస్తుందని, కొత్త వస్తువుల కొనుగోళ్లకు ప్రోత్సాహాన్నిస్తుందని పేర్కొన్నారు. 2 శాతం ఎక్సైజ్ సుంకం తగ్గింపు అనేది ధరలపై పెద్దగా ప్రభావం చూపనప్పటికీ, ఇది ఆహ్వానించదగ్గ చర్య అని ప్యానాసానిక్ ఇండియా ఎండీ మనీష్ శర్మ చెప్పారు.