
గదిలో ఈ ఫ్యాను ఉంటే చాలు, ఇక ఏసీ అవసరమే ఉండదు. వేసవిని చల్లగా ఆస్వాదించవచ్చు. అమెరికన్ కంపెనీ ‘ఇగో పవర్ ప్లస్’ రూపొందించిన ‘మిస్టింగ్ ఫ్యాన్’ ఇది. దీని పనితీరు దాదాపు ఎయిర్ కూలర్ మాదిరిగా ఉన్నా, ఇది ఎయిర్ కండిషనర్ కంటే సమర్థంగా పనిచేస్తుంది.
ఇందులోని మిస్టింగ్ ఫంక్షన్ పనిచేయడానికి, ఫ్యాన్‌కు అనుబంధంగా ఉన్న సిలిండర్‌లో ఒక బకెట్ నీళ్లు పోసుకుంటే చాలు. దీని స్పీడ్‌ను ఐదు రకాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కనిష్ఠంగా 1500 సీఎఫ్‌ఎం నుంచి గరిష్ఠంగా 5000 సీఎఫ్‌ఎం (క్యూబిక్ ఫీట్ పర్ మినిట్) వరకు గది విస్తీర్ణాన్ని బట్టి దీని వేగాన్ని నియంత్రించుకోవచ్చు.
గది ఉష్ణోగ్రతను ఇది ఏకంగా 20 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గించగలదు. దీని ధర దాదాపు 250 డాలర్లు (రూ.19 వేలు) మాత్రమే. సాధారణ ఫ్యానుకయ్యే విద్యుత్తు ఖర్చే దీనికీ అవుతుంది. ఏసీ మాదిరిగా భారీ బిల్లులు వస్తాయనే భయమే అక్కర్లేదు.
Comments
Please login to add a commentAdd a comment