Ac Bills
-
ఏసీ కంపెనీలకు కలిసొచ్చిన వేసవి
ముంబై: వేసవిలో ఠారెత్తించిన ఎండలు ఏసీ తయారీ కంపెనీలకు కాసుల వర్షం కురిపించాయి. ఎండ తీవ్రతతో ఉక్కపోత, వేడిమి తట్టుకోలేక ప్రజలు భారీగా ఏసీలను కొనుగోలు చేశారు. ఏప్రిల్ – జూన్ క్వార్టర్లో రికార్డు స్థాయి విక్రయాలు జరగడంతో వోల్టాస్, బ్లూ స్టార్, వర్ల్‌పూల్ ఆఫ్ ఇండియా, జాన్సన్ హిటాచి, హావెల్స్ కంపెనీల ఆదాయాలు రెండింతలు పెరిగాయి. నికరలాభాలు రెండురెట్ల వృద్ధి నమోదు చేశాయి. రూం ఏసీల వార్షిక విక్రయాలు 14 మిలియన్లకు చేరొచ్చని కన్జూమర్ ఎల్రక్టానిక్స్ అండ్ అప్లయెన్స్ మానుఫ్యాక్చరర్స్(సీఈఏఎంఏ) ప్రెసిడెంట్ సునీల్ వచానీ తెలిపారు. → టాటా గ్రూప్ వోల్టాస్ ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 10 లక్షల ఏసీలను విక్రయించింది. మొత్తం ఆదాయం రూ.5 వేల కోట్లు సాధించింది. ఇదే క్యూ1లో నికరలాభం రెండు రెట్లు పెరిగి రూ.335 కోట్లుగా, నిర్వహణ ఆదాయం 46% ఎగసి రూ.4,921 కోట్లుగా నమోదైంది. మొత్తం ఏసీ మార్కెట్లో ఈ సంస్థ 21.2 శాతం వాటాతో అగ్రస్థానాన్ని నిలుపుకుంది. → తొలి క్వార్టర్లో బ్లూ స్టార్ నికర లాభం రెండురెట్లు పెరిగి రూ.168.76 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. నిర్వహణ ఆదాయం 28.72 శాతం ఎగసి రూ.2,865 కోట్లుగా నమోదైంది. దేశవాప్తంగా ఎండల తీవ్రత నేపథ్యంలో ఏసీల అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గత ఏడాదితో పోలి్చతే ఈ వేసవిలో ఏసీల అమ్మకాలు రెట్టింపు అయ్యాయని బ్లూ స్టార్ అధికారి ఒకరు తెలిపారు. → వర్ల్‌పూల్ ఆఫ్ ఇండియా నికరలాభం 89.4 శాతం పెరిగి రూ.145.3 కోట్లకు చేరింది. నిర్వహణ అదాయం 22.5% ఎగసి రూ.2,496.9 కోట్లకు చేరింది. ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజరేటర్లకు డిమాండ్ భారీగా పెరగడంతో పరిశ్రమతో పోలిస్తే తమ కంపెనీ ఆదాయ వృద్ధి అధికంగా ఉందని కంపెనీ తెలిపింది. → లాయిడ్స్ బ్రాండ్ ఏసీ విక్రయాల ద్వారా రూ.67.39 కోట్ల నికరలాభాన్ని ఆర్జించినట్లు హావెల్స్ ప్రకటించింది. ఈ క్యూ1లో లాయిడ్ బ్రాండ్ విక్రయాలు రూ. 1,929 కోట్లకు చేరా యి. కంపెనీ మొత్తం ఆదాయంలో ఏసీల విక్రయ వ్యాపారం ద్వారా అధిక భాగం సమకూరిందని త్రైమాసిక ఫలితాల సందర్భంగా హావెల్స్ యాజమాన్యం చెప్పుకొచి్చంది. → హిటాచి బ్రాండ్లతో గృహ వినియోగ ఏసీల విక్రయించే జాన్సన్ కంట్రోల్స్ జూన్ క్వార్టర్ ఆదాయం 76% పెరిగి రూ.982 కోట్లకు చేరింది. వాణిజ్య విభాగంలోనూ చెప్పుకొదగిన అమ్మకాలు జరిగినట్లు కంపెనీ తెలిపింది. -
మండుతున్న ఎండలు.. ఏసీ కొంటున్నారా..? జాగ్రత్తలివే..
ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏడాది భారీగా వేసవి తాపం ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే ఇంట్లో తీవ్ర ఉక్కపోత మొదలైంది. ఫ్యానులు, కూలర్లు ఉన్నా గది అంతా చల్లదనం రాక ఇబ్బందులు పడుతున్నారు. దాంతో చాలా మంది ఏసీలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ యాప్‌లు, రిటైల్ స్టోర్‌ల్లో వీటి అమ్మకాలు ఇప్పటికే ఊపందుకున్నాయి. అయితే వాటిని కొనుగోలు చేసేపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఐసెర్ రేటింగ్ కొందరు సరైన అవగాహన లేక పెద్ద గదులకు తక్కువ సామర్థ్యం ఉన్న ఏసీలు కొనుగోలు చేస్తారు. 110 చదరపు అడుగులు పరిమాణంలో గది ఉంటే 1 టన్ను, 110-150 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన గదికి 1.5 టన్నులు, 150-190 చదరపు అడుగుల గదికి 2 టన్నుల సామర్థ్యమున్న ఏసీని ఎంచుకోవాలి. ఏసీ కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా ఐసెర్ (ఐఎస్‌ఈఈఆర్) రేటింగ్ చూడాలి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ ప్రమాణాల ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు ఐసెర్ రేటింగ్ మారుతుంది. ప్రస్తుతం ఐసెర్ రేట్ 5 అంత కంటే ఎక్కువ ఉంటే ఫైవ్ స్టార్ ఉంటుంది. రేటింగ్ 4.4- 4.99 మధ్య ఉంటే ఫోర్ రేటింగ్ ఉంటుంది. రేటింగ్‌లో తేడా వల్ల విద్యుత్తు వినియోగంలో మార్పు ఉంటుంది. ఇన్వర్టర్తో మేలు చాలా ఇళ్లల్లో నిత్యం ఏసీని ఉపయోగించే వారు ఇన్వర్టర్తో కూడిన ఏసీ కొనుగోలు చేసుకోవాలి. ఇది విద్యుత్తును పొదుపు చేస్తుంది. మోటారు వేగాన్ని నియంత్రిస్తూ గది ఉష్ణోగ్రతను సర్దుబాటు చేస్తుంది. నాన్ ఇన్వర్టర్ ఏసీల్లో ఈ వెసులుబాటు ఉండదు. కేవలం ఆన్, ఆఫ్ మాత్రమే ఉంటాయి. కేవలం వేసవిలో మాత్రమే రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు ఉపయోగించేవారు నాన్ ఇన్వర్టర్ ఏసీ కొనుక్కోవచ్చు. మార్కెట్లో చాలా వరకు కన్వర్ట్‌బుల్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. చిన్న గదిలో 1.5 టన్నుల సామర్థ్యం కలిగిన వాటిని ఏర్పాటు చేసినా.. అవసరం మేరకు 1 టన్ను, 0.8 టన్ను ఇలా సమర్థ్యాన్ని మార్చుకోవచ్చు. సామర్థ్యం తగ్గించడం వల్ల అవుట్డోర్ యూనిట్‌లోని ఫ్యాన్ వేగం తగ్గి విద్యుత్తు పొదుపు అవుతుంది. ఇదీ చదవండి: 8.8 కి.మీ క్యాబ్ రైడ్ ధర చూసి షాక్.. చివరికి ఏమైందంటే.. ధరల మధ్య వ్యత్యాసం ఏసీ కొనుగోలు చేసేప్పుడే తప్పకుండా స్టెబిలైజర్ కొనాలి. వోల్టేజ్ హెచ్చుతగ్గుల పరిధి దాటినప్పుడు స్టెబిలైజర్ లేకుంటే ఏసీ పాడవుతుంది. వోల్టేజ్ హెచ్చుతగ్గుల వల్ల పాడైతే వారంటీ ఉండదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలా కంపెనీలు స్మార్ట్ ఏసీలను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వాటిని యాప్‌ల ద్వారానూ నిర్వహించవచ్చు. ఏసీ కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా వారంటీ చూసుకోవాలి. ఈ-కామర్స్ సంస్థల మధ్య ధరల విషయంలో తేడాలు ఉంటాయి. ఆఫర్లు ఉంటే గమనించాలి. కొన్ని సందర్భాల్లో ఈ-కామర్స్ సంస్థల కంటే కంపెనీల డీలర్ల వద్ద కూడా తక్కువ ధరకు లభిస్తాయి. -
వేసవిలో ఇల్లు చల్లగా ఉండాలంటే..
ఇంకా వేసవికాలం పూర్తిగా రానేలేదు. ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం దాదాపు 12 నుంచి సాయంత్రం 4 వరకు విపరీతమైన వేడి ఉంటుంది. దాంతో బయట పనులకు వెళ్లలేని పరిస్థితులున్నాయి. అలా అని ఇంట్లో ఉందామంటే కూడా వేడి తాళలేకపోతున్నారు. ఒకవేళ తప్పని పరిస్థితిలో బయటకు వెళ్లినా ఇంటికి వస్తే హాయిగా చల్లగా ఉండాలి.. రాత్రిపూట ఉక్కపోత లేకుండా ప్రశాంతంగా నిద్రపట్టాలి.. ఏసీ వేసుకుంటే సరిపోతుంది కదా అంటారా? నిజమే కానీ అందరి ఇళ్లలో ఆ సౌకర్యం ఉండదు కదా.. దాన్ని భరించే స్థోమత చాలామందికి లేదు. ఇలాంటి వారు తక్కువ ఖర్చుతో వేసవిలో ఇంటిని చల్లగా ఉండేలా చూసుకోవచ్చు. అందుకు మార్కెట్లో రకరకాల పద్ధతులను పాటిస్తున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. చల్లదనాన్ని ఇచ్చే పెయింట్లు.. దాదాపు అన్ని ఇళ్లు నిర్మాణానికి కాంక్రీటే వినియోగిస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో సిమెంట్, ఇతర రేకుల ఇళ్లు ఉన్నాయి. ఇవి ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. దాంతో ఆ ఇళ్ల లోపల ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. దీనికి పరిష్కారంగా పైకప్పులపై తెల్లని పెయింట్‌ను వేసుకోవడం ద్వారా చాలావరకు ఉపశమనం కల్గుతుంది. ఇంటిపై పడిన కిరణాలు తెలుగు రంగు కారణంగా పరావర్తనం చెంది వాతావరణంలో కలిసిపోతాయి. ఇందుకోసం పైకప్పుపై సున్నం మొదలు మార్కెట్లో దొరికే కూల్ రూఫ్ పెయింట్స్ వరకు వినియోగించవచ్చు. దీనివల్ల భవనంపైన 20 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తగ్గుతుంది. ఇంటి లోపల 2.1 నుంచి 4.3 డిగ్రీల వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్లాస్టిక్ షీట్స్‌తో రక్షణ.. బస్తీల్లో బిల్డింగ్‌లతోపాటు చాలావరకు రేకుల ఇళ్లు ఉంటాయి. వాటిలోనే ఎక్కువ మంది జీవిస్తుంటారు. వీరు తక్కువ ఖర్చుతో పైకప్పుపై ప్లాస్టిక్ షీట్స్‌ను పరిస్తే చాలు. గాలులకు ఎగిరిపోకుండా చూసుకోవాలి. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని దేవరకొండ బస్తీలో కొన్ని ఇళ్లపై ప్లాస్టిక్ షీట్స్‌ను పరిచి వేడి తగ్గించడం ద్వారా బస్తీవాసుల్లో అవగాహన కల్పించారు. ఆరేడు డిగ్రీల వరకు లోపల వేడి తగ్గినట్లు గుర్తించారు. సోలార్ ప్లేట్లతో.. ఇంటిని చల్లగా ఉంచడంతోపాటు విద్యుత్తును ఉత్పత్తిచేస్తూ అవసరాలకు వాడుకునేలా సోలార్ ప్లేట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. మూడు కిలోవాట్లకు సబ్సిడీ పోను రూ.1.10 లక్షలు ఖర్చువుతుంది. నెలకు 360 యూనిట్ల వరకు ఉత్పత్తి అవుతుంది. ఇంటికి అవసరమైన విద్యుత్తును వాడుకుని మిగిలిన దాన్ని గ్రిడ్‌కు అనుసంధానం చేయవచ్చు. డిస్కం నుంచి యూనిట్‌కు రూ.5 లపైన తిరిగి పొందవచ్చు. ఇదీ చదవండి.. కదిలే ఇళ్లు.. సకల సౌకర్యాలు! మొక్కలను పెంచడంతో.. ఇంటిపైన ఖాళీ స్థలంలో మొక్కలను పెంచవచ్చు. దాంతో వేసవిలో చల్లగా ఉండేలా చూసుకోవచ్చు. రకరకాల పూలు, అలంకరణ మొక్కలు, కూరగాయలు పెంచుకోవచ్చు. అయితే అంతకంటే ముందు వాటర్ లీకేజీలు లేకుండా వాటర్‌ఫ్రూపింగ్ చేయించాలి. ఇంటి చుట్టూ మొక్కలు, నీడనిచ్చే చెట్లు ఉంటే చల్లగా ఉంటుంది. -
ఎవరైనా వావ్ అనాల్సిందే, ఏసీకి దీటైన ఫ్యాను..ధర ఇంత తక్కువా!
గదిలో ఈ ఫ్యాను ఉంటే చాలు, ఇక ఏసీ అవసరమే ఉండదు. వేసవిని చల్లగా ఆస్వాదించవచ్చు. అమెరికన్ కంపెనీ ‘ఇగో పవర్ ప్లస్’ రూపొందించిన ‘మిస్టింగ్ ఫ్యాన్’ ఇది. దీని పనితీరు దాదాపు ఎయిర్ కూలర్ మాదిరిగా ఉన్నా, ఇది ఎయిర్ కండిషనర్ కంటే సమర్థంగా పనిచేస్తుంది. ఇందులోని మిస్టింగ్ ఫంక్షన్ పనిచేయడానికి, ఫ్యాన్‌కు అనుబంధంగా ఉన్న సిలిండర్‌లో ఒక బకెట్ నీళ్లు పోసుకుంటే చాలు. దీని స్పీడ్‌ను ఐదు రకాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కనిష్ఠంగా 1500 సీఎఫ్ఎం నుంచి గరిష్ఠంగా 5000 సీఎఫ్ఎం (క్యూబిక్ ఫీట్ పర్ మినిట్) వరకు గది విస్తీర్ణాన్ని బట్టి దీని వేగాన్ని నియంత్రించుకోవచ్చు. గది ఉష్ణోగ్రతను ఇది ఏకంగా 20 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గించగలదు. దీని ధర దాదాపు 250 డాలర్లు (రూ.19 వేలు) మాత్రమే. సాధారణ ఫ్యానుకయ్యే విద్యుత్తు ఖర్చే దీనికీ అవుతుంది. ఏసీ మాదిరిగా భారీ బిల్లులు వస్తాయనే భయమే అక్కర్లేదు. -
2,900 కోట్లకు లెక్క చెప్పండి
* ‘ఏసీ’ బిల్లులపై అన్ని శాఖలకు ఆర్థిక శాఖ సర్క్యులర్ మెమో * లేదంటే మే జీతాల నిలుపుదల హెచ్చరిక * ఈ మొత్తంలో వ్యవసాయ శాఖ బిల్లులే రూ.1500 కోట్లు! సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తేదీకి ముందుగానే వేల కోట్ల రూపాయల ఏసీ (సంక్షిప్త ఆకస్మిక) బిల్లులు, పీడీ (వ్యక్తిగత డిపాజిట్లు) ఖాతాల్లోని సొమ్ముల లెక్క తేల్చాలని ఆర్థిక శాఖ అధికారులు, అకౌంటెంట్ జనరల్ నిర్ణయించారు. ఏసీ బిల్లుల రూపంలో లెక్కలు చెప్పకుండా ఉన్న రూ.2,900 కోట్లకు ఈ నెలాఖరులోగా లెక్కలు చెపుతూ డీసీ బిల్లులను (వివరణాత్మక బిల్లులు) సమర్పించాలని, లేదంటే మే నెల వేతనాలను నిలుపుదల చేస్తామని ఆర్థిక శాఖ అన్ని శాఖలను హెచ్చరించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అజేయ కల్లం సోమవారం ప్రత్యేకంగా సర్క్యులర్ మెమో జారీ చేశారు. ఏకంగా రూ.2,900 కోట్ల ఏసీ బిల్లులకు లెక్కలు చూపకపోవడాన్ని కాగ్ ప్రమాదకర పరిస్థితి అంటూ వ్యాఖ్యానించింది. ఆర్థిక శాఖ ఈ విషయూన్ని తన మెమోలో ప్రస్తావించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇకనుంచి జూన్ 1వ తేదీ వరకు ఎటువంటి ఏసీ బిల్లులకు నిధులు మంజూరు చేయకుండా నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. ఇకనుంచి ప్రతి నెల వేతనాల బిల్లులు సమర్పించే అధికారి ఆయా శాఖలకు చెందిన ఏసీ బిల్లుల వివరాలను కూడా తెలియజేయాలని సూచించారు. అలా తెలియచేయని అధికారి వేతనాలను నిలుపుదల చేయాల్సిందిగా ఖజానా కార్యాలయ అధికారులను ఆదేశించారు. పలు శాఖలకు చెందిన రూ.2,900 కోట్ల ఏసీ బిల్లుల్లో ఒక్క వ్యవసాయ శాఖకు సంబంధించిన బిల్లులే రూ.1500 కోట్ల వరకు ఉన్నాయి. అత్యవసర ఖర్చుల కోసం ఏసీ బిల్లుల కింద అధికారులు నిధులు డ్రా చేసుకుంటారు. అయితే వాటికి నెల రోజుల్లోగా డీసీ (వివరణాత్మక) బిల్లులను ఓచర్లతో సహా సమర్పించాల్సి ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంస్థలు, శాఖలకు సంబంధించిన 72 వేల పీడీ (వ్యక్తిగత డిపాజిట్లు) ఖాతాల్లో రూ.13,000 కోట్లు ఉన్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ మొత్తం నిధులను రాష్ట్ర ఖజానాకు జమ చేయాలని అన్ని శాఖలను ఆదేశించారు.