రికార్డు స్థాయిలో లాభాలు
రెండింతలు పెరిగిన ఆదాయాలు
ముంబై: వేసవిలో ఠారెత్తించిన ఎండలు ఏసీ తయారీ కంపెనీలకు కాసుల వర్షం కురిపించాయి. ఎండ తీవ్రతతో ఉక్కపోత, వేడిమి తట్టుకోలేక ప్రజలు భారీగా ఏసీలను కొనుగోలు చేశారు. ఏప్రిల్ – జూన్ క్వార్టర్‌లో రికార్డు స్థాయి విక్రయాలు జరగడంతో వోల్టాస్, బ్లూ స్టార్, వర్ల్‌పూల్ ఆఫ్ ఇండియా, జాన్సన్ హిటాచి, హావెల్స్ కంపెనీల ఆదాయాలు రెండింతలు పెరిగాయి. నికరలాభాలు రెండురెట్ల వృద్ధి నమోదు చేశాయి. రూం ఏసీల వార్షిక విక్రయాలు 14 మిలియన్లకు చేరొచ్చని కన్జూమర్ ఎల్రక్టానిక్స్ అండ్ అప్లయెన్స్ మానుఫ్యాక్చరర్స్(సీఈఏఎంఏ) ప్రెసిడెంట్ సునీల్ వచానీ తెలిపారు.
→ టాటా గ్రూప్ వోల్టాస్ ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 10 లక్షల ఏసీలను విక్రయించింది. మొత్తం ఆదాయం రూ.5 వేల కోట్లు సాధించింది. ఇదే క్యూ1లో నికరలాభం రెండు రెట్లు పెరిగి రూ.335 కోట్లుగా, నిర్వహణ ఆదాయం 46% ఎగసి రూ.4,921 కోట్లుగా నమోదైంది. మొత్తం ఏసీ మార్కెట్‌లో ఈ సంస్థ 21.2 శాతం వాటాతో అగ్రస్థానాన్ని నిలుపుకుంది.
→ తొలి క్వార్టర్‌లో బ్లూ స్టార్ నికర లాభం రెండురెట్లు పెరిగి రూ.168.76 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. నిర్వహణ ఆదాయం 28.72 శాతం ఎగసి రూ.2,865 కోట్లుగా నమోదైంది. దేశవాప్తంగా ఎండల తీవ్రత నేపథ్యంలో ఏసీల అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గత ఏడాదితో పోలి్చతే ఈ వేసవిలో ఏసీల అమ్మకాలు రెట్టింపు అయ్యాయని బ్లూ స్టార్ అధికారి ఒకరు తెలిపారు.
→ వర్ల్‌పూల్ ఆఫ్ ఇండియా నికరలాభం 89.4 శాతం పెరిగి రూ.145.3 కోట్లకు చేరింది. నిర్వహణ అదాయం 22.5% ఎగసి రూ.2,496.9 కోట్లకు చేరింది. ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజరేటర్లకు డిమాండ్ భారీగా పెరగడంతో పరిశ్రమతో పోలిస్తే తమ కంపెనీ ఆదాయ వృద్ధి అధికంగా ఉందని కంపెనీ తెలిపింది.
→ లాయిడ్స్ బ్రాండ్ ఏసీ విక్రయాల ద్వారా రూ.67.39 కోట్ల నికరలాభాన్ని ఆర్జించినట్లు హావెల్స్ ప్రకటించింది. ఈ క్యూ1లో లాయిడ్ బ్రాండ్ విక్రయాలు రూ. 1,929 కోట్లకు చేరా యి. కంపెనీ మొత్తం ఆదాయంలో ఏసీల విక్రయ వ్యాపారం ద్వారా అధిక భాగం సమకూరిందని త్రైమాసిక ఫలితాల సందర్భంగా హావెల్స్ యాజమాన్యం చెప్పుకొచి్చంది.
→ హిటాచి బ్రాండ్లతో గృహ వినియోగ ఏసీల విక్రయించే జాన్సన్ కంట్రోల్స్ జూన్ క్వార్టర్ ఆదాయం 76% పెరిగి రూ.982 కోట్లకు చేరింది. వాణిజ్య విభాగంలోనూ చెప్పుకొదగిన అమ్మకాలు జరిగినట్లు కంపెనీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment