consumer electronics market
-
ఏసీ కంపెనీలకు కలిసొచ్చిన వేసవి
ముంబై: వేసవిలో ఠారెత్తించిన ఎండలు ఏసీ తయారీ కంపెనీలకు కాసుల వర్షం కురిపించాయి. ఎండ తీవ్రతతో ఉక్కపోత, వేడిమి తట్టుకోలేక ప్రజలు భారీగా ఏసీలను కొనుగోలు చేశారు. ఏప్రిల్ – జూన్ క్వార్టర్లో రికార్డు స్థాయి విక్రయాలు జరగడంతో వోల్టాస్, బ్లూ స్టార్, వర్ల్‌పూల్ ఆఫ్ ఇండియా, జాన్సన్ హిటాచి, హావెల్స్ కంపెనీల ఆదాయాలు రెండింతలు పెరిగాయి. నికరలాభాలు రెండురెట్ల వృద్ధి నమోదు చేశాయి. రూం ఏసీల వార్షిక విక్రయాలు 14 మిలియన్లకు చేరొచ్చని కన్జూమర్ ఎల్రక్టానిక్స్ అండ్ అప్లయెన్స్ మానుఫ్యాక్చరర్స్(సీఈఏఎంఏ) ప్రెసిడెంట్ సునీల్ వచానీ తెలిపారు. → టాటా గ్రూప్ వోల్టాస్ ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 10 లక్షల ఏసీలను విక్రయించింది. మొత్తం ఆదాయం రూ.5 వేల కోట్లు సాధించింది. ఇదే క్యూ1లో నికరలాభం రెండు రెట్లు పెరిగి రూ.335 కోట్లుగా, నిర్వహణ ఆదాయం 46% ఎగసి రూ.4,921 కోట్లుగా నమోదైంది. మొత్తం ఏసీ మార్కెట్లో ఈ సంస్థ 21.2 శాతం వాటాతో అగ్రస్థానాన్ని నిలుపుకుంది. → తొలి క్వార్టర్లో బ్లూ స్టార్ నికర లాభం రెండురెట్లు పెరిగి రూ.168.76 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. నిర్వహణ ఆదాయం 28.72 శాతం ఎగసి రూ.2,865 కోట్లుగా నమోదైంది. దేశవాప్తంగా ఎండల తీవ్రత నేపథ్యంలో ఏసీల అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గత ఏడాదితో పోలి్చతే ఈ వేసవిలో ఏసీల అమ్మకాలు రెట్టింపు అయ్యాయని బ్లూ స్టార్ అధికారి ఒకరు తెలిపారు. → వర్ల్‌పూల్ ఆఫ్ ఇండియా నికరలాభం 89.4 శాతం పెరిగి రూ.145.3 కోట్లకు చేరింది. నిర్వహణ అదాయం 22.5% ఎగసి రూ.2,496.9 కోట్లకు చేరింది. ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజరేటర్లకు డిమాండ్ భారీగా పెరగడంతో పరిశ్రమతో పోలిస్తే తమ కంపెనీ ఆదాయ వృద్ధి అధికంగా ఉందని కంపెనీ తెలిపింది. → లాయిడ్స్ బ్రాండ్ ఏసీ విక్రయాల ద్వారా రూ.67.39 కోట్ల నికరలాభాన్ని ఆర్జించినట్లు హావెల్స్ ప్రకటించింది. ఈ క్యూ1లో లాయిడ్ బ్రాండ్ విక్రయాలు రూ. 1,929 కోట్లకు చేరా యి. కంపెనీ మొత్తం ఆదాయంలో ఏసీల విక్రయ వ్యాపారం ద్వారా అధిక భాగం సమకూరిందని త్రైమాసిక ఫలితాల సందర్భంగా హావెల్స్ యాజమాన్యం చెప్పుకొచి్చంది. → హిటాచి బ్రాండ్లతో గృహ వినియోగ ఏసీల విక్రయించే జాన్సన్ కంట్రోల్స్ జూన్ క్వార్టర్ ఆదాయం 76% పెరిగి రూ.982 కోట్లకు చేరింది. వాణిజ్య విభాగంలోనూ చెప్పుకొదగిన అమ్మకాలు జరిగినట్లు కంపెనీ తెలిపింది. -
పండుగ సీజన్‌పై పెద్ద ఆశలు...
న్యూఢిల్లీ: ఈ ఏడాది పండుగ సీజన్లో అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధిస్తాయని గృహోపకరణాలు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అంచనా వేస్తోంది. కరోనా తీవ్రత నేపథ్యంలో పనిమనుషులు ఇళ్లలోకి రాని పరిస్థితి, వర్క్ ఫ్రమ్ హోమ్ వాతావరణ నేపథ్యం విక్రయాలను పెంచేందుకు తోడ్పడతాయని కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ తయారీ పరిశ్రమ (సీఈఏఎంఏ) విశ్లేషిస్తోంది. లాక్డౌన్ సడలింపుతో ఈ జూలైలో కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అమ్మకాల్లో వృద్ధిని సాధించగా, ఆగస్ట్ నుంచి గృహోపకరణాల విభాగపు విక్రయాల్లోనూ వృద్ధిని చూస్తున్నట్లు సీఈఏఎంఏ పేర్కొంది. ఆగస్ట్‌లో ఓనమ్ పండుగ సందర్భంగా జరిగిన అమ్మకాలు అంచనాలను మించడంతో పరిశ్రమలో మరింత ఆశావహ వాతావరణం నెలకొంది. అమ్మకాల వృద్ధి ఇందుకే... వ్యవస్థలో నెలకొన్న డిమాండ్‌కు తగ్గట్లు పలు కంపెనీలు తమ మార్కెటింగ్ వ్యూహాలను అమలు పరుస్తున్నాయి. ఉత్పత్తులపై క్యాష్‌బ్యాక్ ప్రకటనలు, వారంట్లతో పాటు వాయిదాల పద్ధతి గడువు పెంపు, ఎక్సే్చంజ్ ఆఫర్లు, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ లాంటి పద్ధ్దతులను అనుసరిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. అలాగే కోవిడ్–19 నేపథ్యంలో ప్రజలు ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫలితంగా ఈ తరహా పరికరాలకు డిమాండ్ భారీగా పెరిగింది. వీటికే అధిక డిమాండ్... కరోనాతో గృహ శ్రామిక శక్తి(పని మనుషుల) కొరత నెలకొనడంతో వాషింగ్ మెíషీన్, మైక్రోవేవ్, డిష్‌వాష్ బార్, రిఫ్రిజిరేటర్ లాంటి ఎలక్ట్రానిక్స్ పరికరాలకు అధిక డిమాండ్ నెలకొందని సీఈఏఎంఏ తెలిపింది. వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పాటు కరోనా తో దాదాపు అందరూ ఇం టికే పరిమితం కావడంతో టీవీలు, హోమ్, పర్సనల్ ఆడియోలకు మంచి గిరాకీ నెలకొంది. ఆందోళనలూ ఉన్నాయ్... పరిశ్రమ ఆశావాదాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ స్థానిక రిటైలర్లు, బ్రాండ్ల విషయంలో సీఈఏఎంఏ కొంత ఆందోళనను వ్యక్తం చేసింది. ద్రవ్య కొరత కారణంగా గత సీజన్లలో మాదిరి స్కీములు, ప్రమోషన్లు లాంటి కార్యక్రమాలను వారు నిర్వహించలేకపోవచ్చని చెప్పుకొచ్చింది. అలాగే ఫోన్లు, ల్యాప్æట్యాప్స్, టీవీ లాంటి పరికరాల్లో ఉత్పత్తి కొరత కారణంగా బ్రాండ్ల సమస్య నెలకొని ఉంది. కంపెనీల ఆశాభావం... ఓనమ్‌తో పండుగ సీజన్ ప్రయాణాన్ని సానుకూలంగా ప్రారంభించామని, గతేడాదితో పోలిస్తే ఈ విభాగాల్లో అమ్మకాలు ఇప్పటికే 20 శాతం వృద్ధిని సాధించాయని సోనీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ నయ్యర్ తెలిపారు. పండుగ సీజన్ ముగిసేనాటికి 30శాతం అమ్మకాలను సాధిస్తామని ఆయన అన్నారు. మరోవైపు ఓనమ్ సందర్భంగా ప్యానసోనిక్ అమ్మకాలు కిందటేడాదితో పోలిస్తే 18 శాతం వృద్ధిని సాధించాయి. ఈ పండుగ సీజన్ విక్రయాల్లో 20శాతం వృద్ధిని సాధిస్తామని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. దక్షిణ కొరియా దిగ్గజం ఎల్జీ సైతం ఇదే కాలంలో 30శాతం అమ్మకాల వృద్ధిని ఆశిస్తోంది. -
రూ. 3,500 కోట్ల అమ్మకాలు లక్ష్యం..
న్యూఢిల్లీ: ఈ పండుగ సీజన్లో ఎలక్ట్రానిక్స్ విభాగం నుంచి రూ.3,500 కోట్ల అమ్మకాలు సాధించాలని శామ్సంగ్ లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది పండుగల సీజన్ అమ్మకాలతో పోల్చితే 40% వృద్ధి లక్ష్యమని శామ్సంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ జైన్ బుధవారం చెప్పారు. రెండు కొత్త ఆల్ట్రా హెచ్డీ టీవీలను విడుదలచేసినట్లు పేర్కొన్నారు. 55 అంగుళాల టీవీ ధర రూ.3.24 లక్షలు, 65 అంగుళాల టీవీ ధర రూ.4.35 లక్షలుగా నిర్ణయించామన్నారు. లేటెస్ట్ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ డెవలప్‌మెంట్స్‌ను అందిపుచ్చుకునేలా ఈ టీవీలను అప్‌గ్రేడ్ కిట్‌తో అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి కిట్లను అందిస్తున్న తొలి కంపెనీ తమదేనన్నారు. సైడ్-బై-సైడ్ ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్, స్లీక్ ఫ్లోర్ స్టాండింగ్ ఎయిర్ కండీషనర్, స్మార్ట్ మైక్రో ఓవెన్ తదితర ఉత్పత్తులను కూడా విడుదల చేశామని అతుల్ జైన్ పేర్కొన్నారు.