రూ. 3,500 కోట్ల అమ్మకాలు లక్ష్యం..
న్యూఢిల్లీ: ఈ పండుగ సీజన్‌లో ఎలక్ట్రానిక్స్ విభాగం నుంచి రూ.3,500 కోట్ల అమ్మకాలు సాధించాలని శామ్‌సంగ్ లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది పండుగల సీజన్ అమ్మకాలతో పోల్చితే 40% వృద్ధి లక్ష్యమని శామ్‌సంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ జైన్ బుధవారం చెప్పారు. రెండు కొత్త ఆల్ట్రా హెచ్‌డీ టీవీలను విడుదలచేసినట్లు పేర్కొన్నారు. 55 అంగుళాల టీవీ ధర రూ.3.24 లక్షలు, 65 అంగుళాల టీవీ ధర రూ.4.35 లక్షలుగా నిర్ణయించామన్నారు.
లేటెస్ట్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ డెవలప్‌మెంట్స్‌ను అందిపుచ్చుకునేలా ఈ టీవీలను అప్‌గ్రేడ్ కిట్‌తో అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి కిట్‌లను అందిస్తున్న తొలి కంపెనీ తమదేనన్నారు. సైడ్-బై-సైడ్ ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్, స్లీక్ ఫ్లోర్ స్టాండింగ్ ఎయిర్ కండీషనర్, స్మార్ట్ మైక్రో ఓవెన్ తదితర ఉత్పత్తులను కూడా విడుదల చేశామని అతుల్ జైన్ పేర్కొన్నారు.