April-June quarter
-
ఏసీ కంపెనీలకు కలిసొచ్చిన వేసవి
ముంబై: వేసవిలో ఠారెత్తించిన ఎండలు ఏసీ తయారీ కంపెనీలకు కాసుల వర్షం కురిపించాయి. ఎండ తీవ్రతతో ఉక్కపోత, వేడిమి తట్టుకోలేక ప్రజలు భారీగా ఏసీలను కొనుగోలు చేశారు. ఏప్రిల్ – జూన్ క్వార్టర్లో రికార్డు స్థాయి విక్రయాలు జరగడంతో వోల్టాస్, బ్లూ స్టార్, వర్ల్‌పూల్ ఆఫ్ ఇండియా, జాన్సన్ హిటాచి, హావెల్స్ కంపెనీల ఆదాయాలు రెండింతలు పెరిగాయి. నికరలాభాలు రెండురెట్ల వృద్ధి నమోదు చేశాయి. రూం ఏసీల వార్షిక విక్రయాలు 14 మిలియన్లకు చేరొచ్చని కన్జూమర్ ఎల్రక్టానిక్స్ అండ్ అప్లయెన్స్ మానుఫ్యాక్చరర్స్(సీఈఏఎంఏ) ప్రెసిడెంట్ సునీల్ వచానీ తెలిపారు. → టాటా గ్రూప్ వోల్టాస్ ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 10 లక్షల ఏసీలను విక్రయించింది. మొత్తం ఆదాయం రూ.5 వేల కోట్లు సాధించింది. ఇదే క్యూ1లో నికరలాభం రెండు రెట్లు పెరిగి రూ.335 కోట్లుగా, నిర్వహణ ఆదాయం 46% ఎగసి రూ.4,921 కోట్లుగా నమోదైంది. మొత్తం ఏసీ మార్కెట్లో ఈ సంస్థ 21.2 శాతం వాటాతో అగ్రస్థానాన్ని నిలుపుకుంది. → తొలి క్వార్టర్లో బ్లూ స్టార్ నికర లాభం రెండురెట్లు పెరిగి రూ.168.76 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. నిర్వహణ ఆదాయం 28.72 శాతం ఎగసి రూ.2,865 కోట్లుగా నమోదైంది. దేశవాప్తంగా ఎండల తీవ్రత నేపథ్యంలో ఏసీల అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గత ఏడాదితో పోలి్చతే ఈ వేసవిలో ఏసీల అమ్మకాలు రెట్టింపు అయ్యాయని బ్లూ స్టార్ అధికారి ఒకరు తెలిపారు. → వర్ల్‌పూల్ ఆఫ్ ఇండియా నికరలాభం 89.4 శాతం పెరిగి రూ.145.3 కోట్లకు చేరింది. నిర్వహణ అదాయం 22.5% ఎగసి రూ.2,496.9 కోట్లకు చేరింది. ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజరేటర్లకు డిమాండ్ భారీగా పెరగడంతో పరిశ్రమతో పోలిస్తే తమ కంపెనీ ఆదాయ వృద్ధి అధికంగా ఉందని కంపెనీ తెలిపింది. → లాయిడ్స్ బ్రాండ్ ఏసీ విక్రయాల ద్వారా రూ.67.39 కోట్ల నికరలాభాన్ని ఆర్జించినట్లు హావెల్స్ ప్రకటించింది. ఈ క్యూ1లో లాయిడ్ బ్రాండ్ విక్రయాలు రూ. 1,929 కోట్లకు చేరా యి. కంపెనీ మొత్తం ఆదాయంలో ఏసీల విక్రయ వ్యాపారం ద్వారా అధిక భాగం సమకూరిందని త్రైమాసిక ఫలితాల సందర్భంగా హావెల్స్ యాజమాన్యం చెప్పుకొచి్చంది. → హిటాచి బ్రాండ్లతో గృహ వినియోగ ఏసీల విక్రయించే జాన్సన్ కంట్రోల్స్ జూన్ క్వార్టర్ ఆదాయం 76% పెరిగి రూ.982 కోట్లకు చేరింది. వాణిజ్య విభాగంలోనూ చెప్పుకొదగిన అమ్మకాలు జరిగినట్లు కంపెనీ తెలిపింది. -
సోలార్ విద్యుత్ ఇన్స్టలేషన్లలో క్షీణత
న్యూఢిల్లీ: సోలార్ అదనపు విద్యుత్ సామర్థ్యం ఏర్పాటు ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 1.7 గిగావాట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఏర్పాటైన 4 గిగావాట్లతో పోలిస్తే 58 శాతం తగ్గినట్టు మెర్కామ్ ఇండియా సంస్థ తెలిపింది. జూన్ త్రైమాసికంలో సోలార్ మార్కెట్‌కు సంబంధించి నివేదికను విడుదల చేసింది. ఇక ఈ ఏడాది మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో ఏర్పాటైన 1.9 గిగావాట్ల ఇన్స్టాలేషన్స్తో పోలి్చనా 10 శాతం తగ్గింది. జూన్ త్రైమాసికంలో కొత్తగా ఏర్పాటైన సోలార్ విద్యుత్ సామర్థ్యంలో 77 శాతం భారీ ప్రాజెక్టుల రూపంలో ఉంది. అంటే 1.3 గిగావాట్లు ఈ రూపంలోనే సమకూరింది. రూఫ్‌టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లు 23 శాతం వాటా ఆక్రమించాయి. ఇక ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల్లో, 3.6 గిగావాట్ల సోలార్ ఇన్స్టాలేషన్లు నమోదయ్యాయి. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో ఏర్పాటైన 7.6 గిగావాట్లతో పోల్చి చూసినప్పుడు 53 శాతం తగ్గినట్టు తెలుస్తోంది. ఇక దేశం మొత్తం మీద సోలార్ విద్యుత్ ఇన్స్టాలేషన్ సామర్థ్యం జూన్ చివరికి 66 గిగావాట్లుగా ఉంది. జూన్ త్రైమాసికంలో భారీ సోలార్ ఇన్స్టాలేషన్లలో గుజరాత్ 41 శాతం వాటా ఆక్రమించింది. ఆ తర్వాత రాజస్థాన్‌లో 20 శాతం, కర్ణాటకలో 14 శాతం చొప్పున ఏర్పాటయ్యాయి. ముఖ్యంగా ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మద్య దేశంలో 8.4 గిగావాట్ల నూతన విద్యుత్ సామర్థ్యం సమకూరగా, అందులో 43 శాతం సోలార్ రూపంలోనే ఉండడం గమనించొచ్చు. ప్రాజెక్టుల్లో జాప్యం.. ప్రాజెక్టుల్లో జాప్యం, విస్తరణ ఇతర కారణాల వల్ల పెద్ద ఎత్తున ప్రాజెక్టులు వచ్చే ఏడాదికి వాయిదా పడినట్టు మెర్కామ్ క్యాపిటల్ గ్రూప్ సీఈవో రాజ్ ప్రభు తెలిపారు. 2024 సంవత్సరం ఎంతో ఆశావహంగా ఉందన్నారు. సోలార్ విడిభాగాలు, ప్రాజెక్టుల వ్యయాలు వేగంగా తగ్గుతుండడం ఈ పరిశ్రమ వృద్దికి ప్రేరణగా నిలుస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో సోలార్ ఇన్స్టాలేషన్లు బలహీనంగా ఉన్నాయి. దీంతో రెండో త్రైమాసికంలో ఇన్స్టాలేషన్లు మరింత నిదానించాయి. కొన్ని భారీ సోలార్ ప్రాజెక్టుల విస్తరణకు అనుమతులు వచ్చాయి. అయినా కానీ భూమి, బదిలీ అంశాలు జనవరి–జూన్ త్రైమాసికంలో ఇన్స్టాలేషన్లపై ప్రభావం చూపించాయి’’అని రాజ్‌ప్రభు వివరించారు. -
హైదరాబాద్‌లో అద్దె ఇళ్లకు డిమాండ్
హైదరాబాద్: హైదరాబాద్ మార్కెట్లో అద్దె ఇళ్లకు డిమాండ్ బలంగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల కాలంలో (2023లో క్యూ2) అంతకుముందు మూడు నెలలతో పోలిస్తే అద్దె ఇళ్లకు డిమాండ్ (అన్వేషణ) 22 శాతం పెరిగింది. అదే సమయంలో అద్దె ఇళ్ల సరరా జూన్ త్రైమాసికంలో అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే 2.1 శాతం తగ్గింది. సగటు అద్దె ధరల్లో త్రైమాసికం వారీగా 4.5 శాతం పెరుగుదల నమోదైంది. ఈ వివరాలను ప్రముఖ రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫామ్ మ్యాజిక్‌బ్రిక్స్ ‘రెంటల్ ఇండెక్స్, ఏప్రిల్–జూన్ 2023’ను విడుదల చేసింది. ► గచ్చిబౌలి, కొండాపూర్ ఈ రెండూ హైదరాబాద్‌లో ఎక్కువ మంది అద్దె ఇళ్ల కోసం అన్వేషిస్తున్న ప్రాంతాలుగా (మైక్రో మార్కెట్) ఉన్నాయి. కీలకమైన ఉపాధి కేంద్రాలకు ఇవి సమీపంగా ఉండడం, ఓఆర్ఆర్కు సైతం చక్కని అనుసంధానత కలిగి ఉండడం అనుకూలతలుగా మ్యాజిక్‌బ్రిక్స్ పేర్కొంది. ► భాగ్యనగరంలో ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమైన ప్రాంతాల్లో (ప్రైమ్ లొకాలిటీస్) 2బీహెచ్‌కే ఇంటి అద్దె ధరలు రూ.20,000–32,000 మధ్య ఉంటే, 3బీహెచ్‌కే ధరలు రూ.30,000–45,000 మధ్య ఉన్నాయి. ► కిరాయిదారులు ఫరి్న‹Ù్డ 2బీహెచ్‌కే ఇళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. మొత్తం మార్కెట్లో ఫరి్న‹Ù్డ 2బీహెచ్‌కే యూనిట్ల వాటాయే 55 శాతంగా ఉంటోంది. 1 బీహెచ్‌కే ఇళ్ల డిమాండ్ 23 శాతంగా ఉంటే, 3 బీహెచ్‌కే ఇళ్ల డిమాండ్ 20 శాతం చొప్పున ఉంది. ► కానీ, 2బీహెచ్‌కే ఇళ్ల సరఫరా 58 శాతం ఉంటే, 1 బీహెచ్‌కే 13 శాతం, 3బీహెచ్‌కే 25 శాతం, అంతకుమించిన ఇళ్ల సరఫరా 4 శాతం చొప్పున ఉంది. ► ముఖ్యంగా రూ.10,000–20,000 మధ్య అద్దె లున్న ఇళ్లకే 55 శాతం మంది మొగ్గు చూపిస్తున్నారు. ఆ తర్వాత 19 శాతం ఆసక్తి రూ.20,000 –30,000 మధ్య ధరలశ్రేణి ఇళ్లకు ఉంది. ► అది కూడా 1,000–1,500 చదరపు అడుగుల ఇళ్లకే 50 శాతం డిమాండ్ ఉంది. కానీ, వీటి సరఫరా 39 శాతంగానే ఉంది. అద్దె ఇళ్లకు డిమాండ్ 18 శాతం దేశవ్యాప్తంగా 13 ప్రముఖ పట్టణాల్లో అద్దె ఇళ్లకు డిమాండ్ జూన్ త్రైమాసికంలో, ఏప్రిల్ త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 18.1 శాతం పెరిగినట్టు మ్యాజిక్‌బ్రిక్స్ తెలిపింది. అదే సమయంలో సరఫరా చూస్తే 9.6 శాతమే పెరిగిందని.. ఇళ్ల అద్దెలు 4.9 శాతం ఎగిసినట్టు మ్యాజిక్ బ్రిక్స్ తన రెంటల్ ఇండెక్స్ నివేదికలో వెల్లడించింది. మ్యాజిక్ బ్రిక్స్ ప్లాట్‌ఫామ్‌పై 2 కోట్ల మంది కస్టమర్ల అన్వేషణ, ప్రాధాన్యతల ఆధారంగా ఈ వివరాలను రూపొందించింది. త్రైమాసికం వారీగా (సీక్వెన్షియల్‌గా) చూస్తే బెంగళూరులో 8.1 శాతం, నవీ ముంబైలో 7.3 శాతం, గురుగ్రామ్‌లో 5.1 శాతం చొప్పున అద్దెలు పెరిగాయి. ఢిల్లీ, ముంబైలో మాత్రం నికరంగా తగ్గాయి. దేశవ్యాప్తంగా చూస్తే ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో అద్దె ఇళ్లకు డమాండ్ అత్యధికంగా 27.25 శాతం పెరగ్గా, ఆ తర్వాత అత్యధిక డిమాండ్ హైదరాబాద్ మార్కెట్లోనే (22 శాతం) నమోదైంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో 18.35 శాతం, పుణెలో 19.3 శాతం, బెంగళూరులో 12.8 శాతం చొప్పున డిమాండ్ పెరిగింది. 13 పట్టణాల్లో మొత్తం డిమాండ్‌లో ఒకటి, రెండు పడక గదుల ఇళ్లకే 80 శాతం మేర ఉంది. 53 శాతం డిమాండ్ 2బీహెచ్‌కే ఇళ్లకు ఉంది. సరఫరా కూడా ఈ విభాగంలోనే ఎక్కువగా ఉంది. ‘‘గడిచిన ఏడాది కాలంలో ప్రముఖ పట్టణాల్లో అద్దె ఇళ్లకు డిమాండ్ పెరిగింది. ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వస్తుండడం, విద్యార్థుల రాక ఇందుకు మద్దతుగా ఉంది. ప్రాపరీ్టల విలువలు గణనీయంగా పెరిగిపోవడంతో వాటిని అద్దెకు ఇవ్వడం కంటే విక్రయించే అవకాశాలను యజమానులు సొంతం చేసుకున్నారు. ఇది సరఫరా తగ్గేందుకు దారితీసింది. దీనికితోడు అధిక డిమాండ్‌తో కొన్ని పట్టణాల్లో చెప్పుకోతగ్గ అద్దెలు పెరిగాయి’’అని మ్యాజిక్‌బ్రిక్స్ సీఈవో సు«దీర్ పాయ్ వివరించారు. హెదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో అద్దెలు ప్రాంతం 2బీహెచ్‌కే 3బీహెచ్‌కే గచ్చిబౌలి 24,000 35,000 కొండాపూర్ 21,000 30,000 హైటెస్ సిటీ 32,000 47,000 మాధాపూర్ 21,000 30,000 కోకాపేట్ 23,000 33,000 నార్సింగి 22,000 32,000 కూకట్పల్లి 16,000 23,000 బంజారాహిల్స్ 20,000 30,000 నల్లగండ్ల 21,000 30,000 జూబ్లీహిల్స్ 23,000 33,000 మణికొండ 17,000 24,000 నోట్: 2బీహెచ్‌కే 900 ఎస్ఎఫ్టీ చదరపు అద్దె 3బీహెచ్‌కే 1300 ఎస్ఎఫ్టీ చదరపు అద్దె -
ఆశావహ బాటనే ఎకానమీ... అంచనాలన్నీ అనుకూలమే..
అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతిలోనూ భారత్ ఎకానమీ పురోగతి బాటనే నడుస్తుందనడంలో సందేహాలు అక్కర్లేదని విశ్లేషణా సంస్థలు పేర్కొంటున్నాయి. వృద్ధి, ద్రవ్యోల్బణం, ఎగుమతులు తక్షణం ఎకానమీ పురోగతికి అనుగుణంగా ఉంటాయన్నది వాటి అభిప్రాయం. స్థూల ఆర్థిక రంగానికి సంబంధించి కొన్ని విశ్లేషణలను పరిశీలిస్తే... న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ కాలంలో 8.5 శాతానికి చేరుకుంటుందని ఇక్రా రేటింగ్స్ మంగళవారం ఒక నివేదికలో పేర్కొంది. గత జనవరి–మార్చి త్రైమాసికంలో నమోదైన 6.1 శాతం వృద్ధిరేటు నుంచి గణనీయంగా కోలుకుంటుందని వివరించింది. వేగవంతమైన వృద్ధికి విస్తృత స్థాయిలో డిమాండ్, సేవల రంగంలో రికవరీ కారణమని పేర్కొంది. మొదటి త్రైమాసికంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)అంచనాలు 8.1 శాతం మించి ఇక్రా అంచనాలు ఉండడం గమనార్హం. సేవల డిమాండ్‌లో నిరంతర పురోగతి, మెరుగైన పెట్టుబడి కార్యకలాపాలు, ముఖ్యంగా ప్రభుత్వ మూలధన వ్యయంలో పెరుగుదల, కొన్ని రంగాలలో మార్జిన్లు పెరగడం, వివిధ వస్తువుల ధరలు అదుపులోనికి రావడం వంటి అంశాలు జూన్ జూన్ త్రైమాసికానికి సంబంధించి తమ వృద్ధి అంచనాను పెంచాయని ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ అదితీ నాయర్ తెలిపారు. కేంద్రం, 23 రాష్ట్ర ప్రభుత్వాల (అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, గోవా, మణిపూర్, మేఘాలయ మినహా) మొత్తం మూలధన వ్యయం మొదటి త్రైమాసిక వ్యయం 76 శాతం పెరిగి రూ.1.2 లక్షల కోట్లకు, నికర రుణాలు 59.1 శాతం పెరిగి రూ.2.8 లక్షల కోట్లకు పెరిగినట్లు ఆమె వెల్లడించారు. ఆధునికీకరణ, కొత్త ప్రాజెక్టులు, మూలధన వస్తువుల దిగుమతుల ప్రయోజనం కోసం మూల ధన సంబంధిత అంతర్జాతీయ వాణిజ్య రుణాలు క్యూ1లో 13.0 బిలియన్ డాలర్లని పేర్కొన్న నివేదిక, 2022–23 పూర్తి ఆర్థిక సంవత్సరంలో పోల్చితే (9.6 బిలియన్ డాలర్లు) అధికమని పేర్కొంది. కాగా, ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఇంకా కొంత అనిశ్చితి నెలకొన్నట్లు పేర్కొంది. 6 శాతం వృద్ధి మాత్రమే నమోదుకావచ్చని అంచనావేసింది. ద్రవ్యోల్బణం ఒత్తిడి తాత్కాలికమే ఆర్థికశాఖ నివేదిక టమోటా ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆహార పదార్థాలపై ధరల ఒత్తిడి తాత్కాలికంగానే ఉంటుందని మంగళవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే పెరిగిన ద్రవ్యోల్బణ ఒత్తిడిని ఎదుర్కోవటానికి ప్రభుత్వం, ఆర్బీఐ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం మూలధన వ్యయం కోసం పెంచిన కేటాయింపులు ఇప్పుడు ప్రైవేట్ పెట్టుబడుల పెరుగుదలకూ దారితీస్తున్నాయని పేర్కొన్న ఆర్థిక మంత్రిత్వశాఖ.. దేశీయ వినియోగం, పెట్టుబడి డిమాండ్ వృద్ధిని ముందుకు తీసుకువెళతాయని తన జూలై నెలవారీ ఎకనామిక్ రివ్యూలో పేర్కొంది. జూలైలో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం దాటి 15 నెలల గరిష్ట స్థాయిలో 7.44 శాతానికి పెరిగిన నేపథ్యంలో ఆర్థికశాఖ ఎకానమీకి సంబంధించి తాజా భరోసాను ఇచి్చంది. ద్రవ్యోల్బణం తగ్గుదలకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటోందని, కొత్త స్టాక్ కూడా మార్కెట్లోకి వస్తోందని ఆర్థికశాఖ తెలిపింది. ఇవన్నీ ద్రవ్యోల్బణం కట్టడికి దారితీస్తాయని విశ్లేíÙంచింది. తగిన రుతుపవనాలు, ఖరీఫ్ సాగు గణనీయమైన పురోగతితో వ్యవసాయ రంగం ఊపందుకుంటోందని అంచనావేసింది. గోధుమలు, బియ్యం సమీకరణ బాగుందని తెలిపింది. దేశంలో ఆహార భద్రతను పెంచడానికి ఆహార ధాన్యాల బఫర్ స్టాక్ స్థాయిలను కేంద్రం పెంచుతుందని తెలిపింది. ప్రైవేట్ రంగం పెట్టుబడులను పెంచేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోందని పేర్కొంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) 14 కీలక రంగాలకు ప్రోత్సాహకాలను అందిస్తోందన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. పీఎం గతి శక్తి, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ)తో కలిసి కొత్త మౌలిక సదుపాయాలను సృష్టించడంలో ప్రైవేట్–రంగం భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుందని తెలిపింది. 800 బిలియన్ డాలర్లు దాటిన విదేశీ వాణిజ్యం సేవల రంగం సాయం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ మందగించినప్పటికీ, 2023 ప్రథమార్థంలో భారతదేశం సేవల విభాగాలలో ఆరోగ్యకరమైన పెరుగుదల.. దేశం మొత్తం అంతర్జాతీయ వాణిజ్యానికి భరోసాను అందించిందని ఆర్థిక విశ్లేషనా సంస్థ–గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనీíÙయేటివ్ (జీటీఆర్ఐ) తన తాజా నివేదికలో పేర్కొంది. 2023 జనవరి–జూన్ మధ్య భారత్ వస్తువులు, సేవల వాణిజ్యం 800 బిలియన్ డాలర్లు దాటినట్లు జీటీఆర్ఐ నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం, సమీక్షా కాలంలో వస్తు, సేవల ఎగుమతులు 1.5 శాతం పెరిగి 385.4 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు ఇదే కాలంలో 5.9 శాతం ఎగసి 415.5 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక వేర్వేరుగా చూస్తే.. వస్తు ఎగుమతులు 8.1 శాతం తగ్గి 218.7 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దిగుమతులు 8.3 శాతం క్షీణించి 325.7 బిలియన్ డాలర్లకు పడ్డాయి. కాగా, సేవల ఎగుమతులు మాత్రం 17.7 శాతం పెరిగి 166.7 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు 3.7 శాతం పెరిగి 89.8 బిలియన్ డాలర్లకు చేరాయి. ఎస్బీఐ అంచనా 8.3 శాతం బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మొదటి త్రైమాసికంలో 8.3 శాతం వృద్ధి అంచనాలను వేసింది. ఆర్బీఐ అంచనాలకు మించి ఈ విశ్లేషణ నమోదుకావడం గమనార్హం. ఆర్థిక సంవత్సరం మొత్తంలో 6.5 శాతం వృద్ధి నమోదవుతుందని తమ 30 హై ఫ్రీక్వెన్సీలతో కూడిన ఆరి్టఫిషియల్ న్యూట్రల్ నెట్వర్క్ (ఏఎన్ఎన్) అంచనా వేస్తున్నట్లు గ్రూప్ చీఫ్ ఎకమిస్ట సౌమ్య కాంతి ఘోష్ ఈ మేరకు విడుదలైన ఒక నివేదికలో పేర్కొన్నారు. నివేదిక ప్రకారం, జూలై–సెపె్టంబర్లో 6.5 శాతం, అక్టోబర్–డిసెంబర్ మధ్య 6 శాతం, జనవరి–మార్చి (2024)లో 5.7 శాతం వృద్ధి నమోదవుతుంది. ఆర్బీఐ ఈ నెల మొదట్లో జరిగిన పాలసీ సమీక్ష 2023–24లో దేశ జీడీపీ 6.5 శాతం ఉంటుందని అంచనావేస్తుండగా, క్యూ1లో 8 శాతం, క్యూ2లో 6.5 శాతం, క్యూ3లో 6 శాతం, క్యూ4లో 5.7 శాతంగా ఉంటుందని విశ్లేషించింది. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6 శాతంగా అంచనా. -
హైదరాబాద్ మార్కెట్లో పెరిగిన ఇళ్ల సరఫరా
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 5 శాతం పెరిగి 99,989 యూనిట్లుగా ఉన్నాయి. దేశంలోని తొమ్మిది ముఖ్య పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు ఏప్రిల్–జూన్ కాలంలో 1,22,213 యూనిట్లుగా నమోదయ్యాయి. అదే సమయంలో నూతన సరఫరా 1,10,468 యూనిట్లుగానే ఉంది. దీంతో మొత్తం మీద అమ్ముడుపోని ఇళ్ల నిల్వలు తగ్గినట్టు ప్రాప్‌ఈక్విటీ సంస్థ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. తొమ్మిది పట్టణాల్లో కలిపి అమ్ముడుపోని యూనిట్లు 2 శాతం తగ్గి 5,15,169 యూనిట్లుగా ఉన్నాయి. మార్చి త్రైమాసికం చివరికి వీటి సంఖ్య 5,26,914 యూనిట్లుగా ఉంది. ► టైర్–1 పట్టణాల్లో అత్యధికంగా థానేలో విక్రయం కాని ఇళ్ల నిల్వలు 21 శాతంగా (1,07,179 యూనిట్లు) ఉన్నాయి. మార్చి చివరికి ఉన్న 1,09,511 యూనిట్లతో పోలిస్తే 2 శాతం తగ్గాయి. ► ముంబైలో అమ్ముడుపోని ఇళ్లు 3 శాతం తగ్గి 60,911 యూనిట్లుగా ఉన్నాయి. మార్చి చివరికి ఇవి 62,735 యూనిట్లుగా ఉండడం గమనార్హం. నవీ ముంబైలో మాత్రం 31,735 యూనిట్ల నుంచి 32,997 యూనిట్లకు పెరిగాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో అమ్ముడుపోని ఇళ్ల యూనిట్లు 26 శాతం తగ్గి 42,133 యూనిట్లకు పరిమితమయ్యాయి. ► చెన్నైలో వీటి సంఖ్య 18 శాతం తగ్గి 19,900 యూనిట్లుగా ఉంది. ► పుణెలో పరిస్థితి విరుద్ధంగా ఉంది. ఇక్కడ అమ్ముడుపోని ఇళ్ల యూనిట్లు జూన్ త్రైమాసికం చివరికి 9 శాతం పెరిగి 75,905 యూనిట్లకు చేరాయి. ► బెంగళూరు మార్కెట్లోనూ అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 4 % పెరిగి 52,208 యూనిట్లుగా నమోదైంది. ► కోల్‌కతా పట్టణలో 20 శాతం పెరిగి 21,947 యూనిట్లుగా ఉన్నాయి. ఇళ్ల ధరలపై గృహ రుణాల ప్రభావం నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక నివాస గృహాల అందుబాటు ధరలపై పెరిగిన రుణ రేట్ల ప్రభావం పడినట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ఈ ఏడాది జనవరి–జూన్ కాలానికి ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాలకు సంబంధించి ‘అఫర్డబులిటీ ఇండెక్స్’ నివేదికను విడుదల చేసింది. ఓ సగటు గృహస్థుడి ఈఎంఐ–ఆదాయ నిష్పత్తి రేటును నైట్‌ఫ్రాంక్ అఫర్డబులిటీ ఇండెక్స్ తరచూ ట్రాక్ చేస్తుంటుంది. ఓ గృహస్థుడు తన ఇంటి రుణ ఈఎంఐని చెల్లించేందుకు వీలుగా అతడి ఆదాయ నిష్పత్తిని పరిశీలిస్తుంటుంది. 2023లో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లో ఇళ్ల కొనుగోలు సామర్థ్యంపై గృహ రుణాల రేట్ల ప్రభావం పడినట్టు నైట్‌ఫ్రాంక్ తెలిపింది. దేశవ్యాప్తంగా టాప్–8 పట్టణాల్లో అహ్మదాబాద్ అందుబాటు ధరలతో కూడిన ఇళ్ల మార్కెట్‌గా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడి ఈఎంఐ–ఆదాయ నిష్పత్తి 23 శాతంగా ఉంది. ఆ తర్వాత 28 శాతంతో పుణె, కోల్‌కతా, 28 శాతంతో చెన్నై, బెంగళూరు, 30 శాతంతో ఢిల్లీ ఎన్సీఆర్, 31 శాతంతో హైదరాబాద్, 55 శాతంతో ముంబై వరుస స్థానాల్లో ఉన్నాయి. నైట్‌ఫ్రాంక్ అఫర్డబులిటీ ఇండెక్స్ ప్రకారరం ఒక పట్టణంలో 40 శాతం నిష్పత్తి ఉందంటే.. ఆ పట్టణంలోని నివాసులు సగటున తమ ఆదాయంలో 40 శాతాన్ని ఇంటి రుణ ఈఎంఐ కింద చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నట్టు అర్థం. 40 శాతం ఉంటే అందుబాటు ధరలుగా పరిగణిస్తుంది. 50 శాతానికి పైగా రేషియో ఉందంటే ఇళ్ల ధరలు అందుబాటులో లేనట్టుగా భావిస్తుంది. -
క్యూ1లో ఆటోమొబైల్ ఎగుమతులు డౌన్
ముంబై: భారత ఆటోమొబైల్ ఎగుమతులు ఏప్రిల్–జూన్ మధ్య కాలం(క్యూ1)లో 28 శాతం తగ్గిపోయాయి. ఆఫ్రికాతో పాటు ఇతర అభివృద్ధి చెందుతున్న (వర్థమాన)దేశాల్లో ద్రవ్య సంక్షోభ పరిస్థితులు ఇందుకు కారణమయ్యాయి. వాహన పరిశ్రమ సమాఖ్య సియామ్ తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించాయి. తొలి త్రైమాసికంలో మొత్తం 10.32 లక్షల యూనిట్లు ఎగుమతయ్యాయి. గతేడాది ఇదే క్వార్టర్ ఎగుమతులు 14.25 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇది 28% తక్కువగా ఉంది. ► ఈ జూన్ త్రైమాసికంలో మొత్తం ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు అయిదు శాతం తగ్గి 1,52,156 యూనిట్లుగా నమోదయ్యాయి. కాగా 2022 ఏప్రిల్–జూన్ కాలంలో 1,60,116 యూనిట్లగా ఉన్నాయి. ► వార్షిక ప్రాతిపదిక ప్యాసింజర్ కార్ల ఎగుమతులు 1,04,400 యూనిట్ల నుంచి 94,793 యూనిట్లకు పడిపోయాయి. ► యుటిలిటీ వెహికల్స్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 55,419 యూనిట్లకు స్వల్పంగా తగ్గాయి. గత ఏడాది ఇదే కాలంలో 55,547 యూనిట్లు ఉన్నాయి. ► ద్విచక్ర వాహనాల ఎగుమతులు ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో 11,48,594 యూనిట్ల నుంచి 31 శాతం క్షీణించి 7,91,316 యూనిట్లకు చేరుకున్నాయి. ► వాణిజ్య వాహనాల ఎగుమతులు మొదటి త్రైమాసికంలో 14,625 యూనిట్లకు పడిపోయాయి. 2022–23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ కాలంలో 19,624 యూనిట్ల నుండి 25 శాతం తగ్గాయి. ► త్రీవీలర్ ఎగుమతులు కూడా గత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో 97,237 యూనిట్ల నుంచి సమీక్షా కాలంలో 25 శాతం క్షీణించి 73,360 యూనిట్లకు చేరుకున్నాయి. ► ‘‘ఆఫ్రికా, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో కరెన్సీల విలువ తగ్గింపు ప్రభావంతో తొలి త్రైమాసికంలో అన్ని వాహన విభాగ ఎగుమతులు తగ్గిపోయాయి. ఈ దేశాలు విదేశీ మారకద్రవ్య లభ్యత సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ అంశం వాహనాల అమ్మకాలను పరిమితం చేస్తోంది. అయినప్పటికీ ఈ మార్కెట్లలో కస్టమర్ల నుంచి వాహనాలకు డిమాండ్ ఉంది’’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు. -
ఏప్రిల్–జూన్‌లో వేడి సెగలు!
న్యూఢిల్లీ: వాయవ్య ప్రాంతం మినహా దాదాపు భారతదేశమంతటా ఈ ఏప్రిల్ నుంచి జూన్ నెలదాకా సాధారణం కంటే కాస్త ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. సంబంధిత వివరాలను శనివారం ప్రకటించింది. ‘ 2023 ఎండాకాలంలో మధ్య, తూర్పు, వాయవ్య భారతంలో సాధారణం కంటే ఎక్కువగా హీట్‌వేవ్ రోజులు కొనసాగవచ్చు. దేశవ్యాప్తంగా సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలు కొద్దిగా అధికం కావచ్చు. అయితే దక్షిణ భారతదేశంలో, ఇంకొన్ని వాయవ్య ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సాధారణంగా, సాధారణం కంటే తక్కువగా నమోదుకావచ్చు’ అని వాతావరణ శాఖ తన అంచనాల్లో పేర్కొంది. మైదాన ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌ను, తీరప్రాంతాల్లో 37 డిగ్రీల సెల్సియస్‌ను, కొండ ప్రాంతాల్లో 30 డిగ్రీల సెల్సియస్‌ను దాటినా, ఆ సీజన్లో ఆ ప్రాంతంలో సాధారణంగా నమోదవ్వాల్సిన ఉష్ణోగ్రత కంటే 4.5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే దానిని హీట్‌వేవ్‌గా పరిగణిస్తారు. భారత్‌లో 1901 నుంచి ఉష్ణోగ్రతల నమోదును గణిస్తుండగా ఈ ఏడాది ఫిబ్రవరి.. అత్యంత వేడి ఫిబ్రవరిగా రికార్డులకెక్కడం గమనార్హం. అయినాసరే సాధారణం కంటే ఎక్కువగా(29.9 మిల్లీమీటర్లకు బదులు 37.6 మిల్లీమీటర్లు) వర్షపాతం నమోదవడం, ఏడుసార్లు పశ్చిమ అసమతుల్యతల కారణంగా మార్చి నెలలో ఉష్ణోగ్రతలు మామూలు స్థాయిలోనే కొనసాగిన విషయం విదితమే. గత ఏడాది మార్చి నెల మాత్రం గత 121 సంవత్సరాల్లో మూడో అతి పొడిబారిన మార్చి నెలగా రికార్డును తిరగరాసింది. భారత్‌లో రుతుపవనాల స్థితిని ప్రభావితం చేసే దక్షిణఅమెరికా దగ్గర్లోని పసిఫిక్ మహాసముద్ర జలాలు చల్లబడే(లా నినో) పరిస్థితి బలహీన పడిందని వాతావరణ శాఖ తెలిపింది. లా నినో పరిస్థితి లేదు అంటే ఎల్ నినో ఉండబోతోందని అర్థం. ఎల్ నినో అనేది అక్కడి సముద్ర జలాలు వేడెక్కడాన్ని సూచిస్తుంది. అప్పుడు అక్కడి నుంచి వచ్చే గాలుల కారణంగా భారత్‌లో రుతుపవనాల సీజన్లో తక్కువ వర్షాలు కురుస్తాయి. అయితే మే నెలకల్లా పరిస్థితులు మారే అవకాశముందని భిన్న మోడల్స్ అంచనాల్లో తేలిందని వాతావరణ శాఖ తెలిపింది. -
ఎకానమీకి కరెంట్ అకౌంట్ సవాళ్లు!
ముంబై: భారత్ ఎకానమీకి కరెంట్ అకౌంట్ కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అంచనావేస్తోంది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో కరెంట్ అకౌంట్లో తీవ్ర లోటు (క్యాడ్) నమోదుకావచ్చని, ఇది ఏకంగా 36 నెలల గరిష్ట స్థాయిలో 3.4 శాతంగా (స్థూల దేశీయోత్పత్తి– జీడీపీ విలువలో) ఉండే వీలుందని తన తాజా నివేదికలో అంచనావేసింది. విలువలో ఇది 28.4 బిలియన్ డాలర్లు. గత ఏడాది ఇదే కాలంలో కరెంట్ అకౌంట్లో లోటులేకపోగా 0.9 శాతం మిగులు (6.6 బిలియన్ డాలర్లు) నెలకొంది. గత ఆర్థిక సంవత్సరం చివరి మార్చి త్రైమాసికంలో కరెంట్ అకౌంట్ లోటు 1.5 శాతం (13.4 బిలియన్ డాలర్లు). అయితే తదుపరి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఇది ఏకంగా 3.4 శాతానికి చేరుతుందన్న అంచనాలు నెలకొనడం గమనార్హం. ఇప్పటికే ఇక్రా హెచ్చరికలు... భారత్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) సీఏడీ– క్యాడ్ సవాళ్లు తప్పవని దేశీయ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఇప్పటికే వెలువరించిన నివేదికలో అంచనావేసింది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ లోటు అదే కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చితే 5 శాతానికి చేరే వీలుందని ఇక్రా అభిప్రాయపడింది. అదే విధంగా 2022–23లో 3.5 శాతంగా (120 బిలియన్ డాలర్లు) ఉండే వీలుందని అంచనావేసింది. దేశం నుంచి ఎగుమతులు తగ్గుతుండడం, దిగుమతుల పెరుగుదల, దీనితో భారీగా పెరగనున్న వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం) వంటి అంశాలు క్యాడ్ ఆందోళనకు కారణమని ఇక్రా విశ్లేషించింది. జూలై, ఆగస్టు నెలల్లో దేశంలోకి భారీ దిగుమతులు జరగ్గా, ఎగుమతులు నామమాత్రపు వృద్ధిని నమోదుచేసుకుంటున్నాయి. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్య లోటు భారీగా పెరిగిపోతోంది. ఫారెక్స్ దన్ను... అయితే దేశానికి ప్రస్తుతం ఫారెక్స్ విలువ దన్ను పటిష్టంగా ఉంది. 2021 సెప్టెంబర్ 3తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు చరిత్రాత్మక రికార్డు 642 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే అటు తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత నిల్వలు భారత్ దాదాపు 10 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా. భారత్ వద్ద ప్రస్తుతం (26 ఆగస్టు నాటికి 561 బిలియన్ డాలర్లు) విదేశీ మారకద్రవ్య నిల్వలు అంతర్జాతీయ ఒత్తిడులను తట్టుకోడానికి దోహదపడతాయి. కరెంట్ అకౌంట్... అంటే! ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలోకి వచ్చీ–దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్ అకౌంట్ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్ అకౌంట్ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు. -
రియల్టీ భవిష్యత్తు ఏంటో?
సాక్షి, హైదరాబాద్: దేశీయ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికం నిరాశపరిచింది. కరోనా రెండో దశ వ్యాప్తి చెందడంతో రియల్టీ మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిన్నదని నైట్‌ఫ్రాంక్–ఫిక్కీ–నరెడ్కో సర్వే వెల్లడించింది. వచ్చే ఆరు నెలలలో ఆశాజనక రియల్టీ మార్కెట్‌పై డెవలపర్లు గంపెడాశలతో ఉన్నారని 29వ ఎడిషన్ రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ఇండెక్స్ క్యూ2–2021 తెలిపింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1)లో 57గా ఉన్న సెంటిమెంట్ స్కోర్ క్యూ2 నాటికి 35కి పడిపోయిందని పేర్కొంది. అయితే గతేడాది క్యూ2లో ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి చేరిన 22 స్కోర్‌తో పోలిస్తే ప్రస్తుత క్షీణత తీవ్రత తక్కువేనని తెలిపింది. ఫ్యూచర్ సెంటిమెంట్ స్కోర్‌ను పరిశీలిస్తే.. ఈ ఏడాది క్యూ1లో 57గా ఉండగా.. క్యూ2 నాటికి స్వల్పంగా తగ్గి 56 స్కోర్‌కు చేరిందని.. అయినా ఇది ఆశావాద జోన్లోనే కొనసాగుతుందని పేర్కొంది. రియల్టీ మార్కెట్లో సెంటిమెంట్ స్కోర్ 50ని దాటితే ఆశావాదం జోన్‌గా, 50గా ఉంటే తటస్థం, 50 కంటే తక్కువగా ఉంటే నిరాశావాద జోన్‌గా పరిగణిస్తుంటారు. కోవిడ్ వ్యాక్సినేషన్ వేగవంతం, నిరంతర ఆర్థిక కార్యకలాపాల మీద ఆధారపడి భవిష్యత్తు రియల్టీ సెంటిమెంట్ స్కోర్ ఆశాజనకంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశీర్ బైజాల్ తెలిపారు. కరోనాతో రియల్టీ మార్కెట్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ.. నివాస, కార్యాలయ విభాగాలకు అంతర్లీన డిమాండ్ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది క్యూ2లో సర్వే పాల్గొన్న 40 శాతం మంది ఆఫీసు లీజు కార్యకలాపాలు వచ్చే ఆరు నెలల కాలంలో మెరుగవుతాయని అభిప్రాయపడ్డారు. క్యూ1లో ఇది 34 శాతంగా ఉంది. అలాగే 21 శాతం మంది ఆఫీస్ అద్దెలు పెరుగుతాయని.. 40 శాతం మంది స్థిరంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. 2021 క్యూ2లో 50 శాతం మంది వచ్చే 6 నెలల్లో నివాస విక్రయాలు, లాంచింగ్స్‌లో వృద్ధి నమోదవుతుందని ఆశిస్తున్నారని సర్వే వెల్లడించింది. -
రియల్టీ భవిష్యత్తు ఏంటో?
న్యూఢిల్లీ: దేశీయ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికం నిరాశపరిచింది. కరోనా రెండో దశ వ్యాప్తి చెందడంతో రియల్టీ మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిన్నదని నైట్‌ఫ్రాంక్–ఫిక్కీ–నరెడ్కో సర్వే వెల్లడించింది. వచ్చే ఆరు నెలలలో ఆశాజనక రియల్టీ మార్కెట్‌పై డెవలపర్లు గంపెడాశలతో ఉన్నారని 29వ ఎడిషన్ రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ఇండెక్స్ క్యూ2–2021 తెలిపింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1)లో 57గా ఉన్న సెంటిమెంట్ స్కోర్ క్యూ2 నాటికి 35కి పడిపోయిందని పేర్కొంది. అయితే గతేడాది క్యూ2లో ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి చేరిన 22 స్కోర్‌తో పోలిస్తే ప్రస్తుత క్షీణత తీవ్రత తక్కువేనని తెలిపింది. ఫ్యూచర్ సెంటిమెంట్ స్కోర్‌ను పరిశీలిస్తే.. ఈ ఏడాది క్యూ1లో 57గా ఉండగా.. క్యూ2 నాటికి స్వల్పంగా తగ్గి 56 స్కోర్‌కు చేరిందని.. అయినా ఇది ఆశావాద జోన్లోనే కొనసాగుతుందని పేర్కొంది. రియల్టీ మార్కెట్లో సెంటిమెంట్ స్కోర్ 50ని దాటితే ఆశావాదం జోన్‌గా, 50గా ఉంటే తటస్థం, 50 కంటే తక్కువగా ఉంటే నిరాశావాద జోన్‌గా పరిగణిస్తుంటారు. ఈ సర్వేను డెవలపర్లు, బ్యాంక్‌లు, ఆర్ధిక సంస్థల సరఫరా మీద ఆధారపడి జరుగుతుంటుంది. కోవిడ్ వ్యాక్సినేషన్ వేగవంతం, నిరంతర ఆర్ధిక కార్యకలాపాల మీద ఆధారపడి భవిష్యత్తు రియల్టీ సెంటిమెంట్ స్కోర్ ఆశాజనకంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశీర్ బైజాల్ తెలిపారు. కరోనాతో రియల్టీ మార్కెట్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ.. నివాస, కార్యాలయ విభాగాలకు అంతర్లీన డిమాండ్ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. -
కోవిడ్ వ్యాక్సిన్
న్యూఢిల్లీ: అనుమతులు వస్తే కోవిడ్–19 వ్యాక్సిన్ కోవాగ్జిన్ వచ్చే ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య విడుదల చేయాలని భావిస్తున్నట్టు భారత్ బయోటెక్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో మూడవ దశ ఔషధ ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేయడంపైనే ప్రస్తుతం దృష్టిసారించామని కంపెనీ ఇంటర్నేషనల్ ఈడీ సాయి ప్రసాద్ తెలిపారు. మూడవ దశ ప్రయోగాలకు సంబంధించిన బలమైన ప్రయోగాత్మక సాక్ష్యాల ఏర్పాటు, సమాచారం, సామర్థ్యం, భద్రతా సమాచారం ఆధారంగా భారత నియంత్రణ సంస్థల నుంచి అన్ని అనుమతులు లభిస్తే 2021 రెండవ త్రైమాసికంలో వ్యాక్సిన్ విడుదల చేస్తామన్నారు. కాగా, ప్రస్తుత నెలలోనే ఫేజ్–3 ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. ఇందుకు డీసీజీఐ నుంచి కంపెనీ అనుమతులను పొందింది. 14 రాష్ట్రాల్లో 25–30 కేంద్రాల్లో ఔషధ ప్రయోగాలు జరగనున్నాయని సాయి ప్రసాద్ చెప్పారు. ఇందుకోసం ఒక్కో ఆసుపత్రిలో సుమారు 2,000 మంది వాలంటీర్లను నియమించుకుంటామని చెప్పారు. వ్యాక్సిన్ అభివృద్ధి, కొత్త తయారీ కేంద్రాలు, మూడవ దశ ఔషధ ప్రయోగాలకు సుమారు రూ.350–400 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వంతోపాటు ప్రైవేటు సంస్థలకూ ఈ వ్యాక్సిన్‌ను విక్రయిస్తామన్నారు. వ్యాక్సిన్ ఎగుమతికై పలు దేశాలతో చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని వివరించారు. ధర ఇంకా నిర్ణయించలేదని స్పష్టం చేశారు. -
67 శాతం పడిపోయిన ఇళ్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో 67 తగ్గినట్టు ప్రాప్‌ఈక్విటీ అనే సంస్థ తెలిపింది. ఈ కాలంలో 21,294 ఇళ్ల యూనిట్లు అమ్ముడుపోయినట్టు గణాంకాలను విడుదల చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 64,378 యూనిట్లు (ఇళ్లు/ఫ్లాట్లు)గా ఉన్నట్టు తెలిపింది. ‘‘నోయిడాను మినహాయిస్తే మిగిలిన ఎనిమిది ప్రధాన పట్టణాల్లో అమ్మకాలు పడిపోయాయి. గురుగ్రామ్‌లో అత్యధికంగా 79 శాతం క్షీణత నెలకొంది. కేవలం 361 ఇళ్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇక హైదరాబాద్‌లో 74 శాతం తగ్గి 996 ఇళ్ల విక్రయాలు నమోదు కాగా, చెన్నైలోనూ ఇంతే స్థాయిలో అమ్మకాలు తగ్గాయి. బెంగళూరులో 73 శాతం, కోల్‌కతాలో 75 శాతం చొప్పున అమ్మకాలు క్షీణించాయి. ముంబైలో 63 శాతం తగ్గి కేవలం 2,818 యూనిట్లకే విక్రయాలు పరిమితమైనట్టు’’ ప్రాప్‌ఈక్విటీ తెలిపింది. నోయిడాలో మాత్రం గతేడాది ఇదే కాలంతో పోలిస్తే విక్రయాలు 5 శాతం పెరిగి 1,177 యూనిట్లుగా నమోదైనట్టు పేర్కొంది. -
అలహాబాద్ బ్యాంక్ లాభం 128 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అలహాబాద్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ క్వార్టర్లో రూ.128 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ1లో రూ.1,944 కోట్ల నికర నష్టాలు వచ్చాయని అలహాబాద్ బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు తగ్గడంతో ఈ క్యూ1లో లాభాల బాట పట్టామని అలహాబాద్ బ్యాంక్ తెలిపింది. అంతకు ముందటి క్వార్టర్(గత క్యూ4లో) రూ.3,834 కోట్ల నికర నష్టాలు వచ్చాయని పేర్కొంది. ఇక గత క్యూ1లో రూ.4,794 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.4,747 కోట్లకు తగ్గిందని తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.2,590 కోట్ల నుంచి రూ.1,102 కోట్లకు తగ్గాయని వివరించింది. మిశ్రమంగా రుణ నాణ్యత.. బ్యాంక్ రుణ నాణ్యత మిశ్రమంగా నమోదైంది. స్థూల మొండి బకాయిలు పెరగ్గా, నికర మొండి బకాయిలు తగ్గాయి. గత క్యూ1లో 15.97 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 17.43 శాతానికి పెరిగాయి. నికర మొండి బకాయిలు 7.32% నుంచి 5.71%కి చేరాయి. సీక్వెన్షియల్‌గా చూస్తే, గత క్యూ4లో స్థూల మొండి బకాయిలు 17.55%, నికర మొండి బకాయిలు 5.22%గా ఉన్నాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంక్ షేర్ 5.6% నష్టంతో రూ.36.85 వద్ద ముగిసింది. -
40 ఏళ్ల కనిష్టానికి పీపీఎఫ్ వడ్డీరేటు
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు కనీసం 40 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఏప్రిల్-జూన్ క్వార్టర్లో పీపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీరేటును 7.9 శాతం ఆఫర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా త్రైమాసిక సమీక్షలో భాగంగా పీపీఎఫ్‌లపై వడ్డీరేటును 8 శాతం నుంచి 7.9 శాతానికి తగ్గించేందుకు ఆర్థికమంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. పీపీఎఫ్ వడ్డీరేట్లతో పాటు ఇతర చిన్న పొదుపు ఖాతాలపై కూడా వడ్డీరేట్లను పడిపోతున్నాయి. గతేడాది ఏప్రిల్ నుంచి పీపీఎఫ్ లాంటి చిన్నపొదుపు ఖాతాలపై త్రైమాసిక ప్రాతిపదికన వడ్డీరేట్లు నిర్ణయిస్తున్నారు. అంతకమునుపు వరకు వీటిని ఏడాదికోసారి సమీక్షించేవారు. అయితే రానున్న కాలంలో పీపీఎఫ్ వడ్డీరేట్లు మరింత తగ్గుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నారు. పీపీఎఫ్ వడ్డీరేట్లు తగ్గుతున్నప్పటికీ, పెట్టుబడులకు ఇదే మంచి ఆప్షన్ అని విశ్లేషకులు చెప్పారు. బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే, పాజిటివ్ రియర్ రిటర్న్స్ ను అందించడంలో పీపీఎఫ్ లు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని తెలిపారు. దీర్ఘకాలిక ట్యాక్స్-ప్రీ ప్రొడక్ట్ లలో పెట్టుబడులు పెట్టి ప్రయోజనాలు పొందాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. -
బీహెచ్ఈఎల్ లాభం రూ. 194 కోట్లు
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో ప్రభుత్వ రంగ దిగ్గజం బీహెచ్ఈఎల్ నికర లాభం భారీగా క్షీణించి రూ. 193.5 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2013-14) ఇదే కాలంలో రూ. 465.4 కోట్ల లాభాన్ని ఆర్జించింది. విద్యుత్, పారిశ్రామిక విభాగాల నుంచి అమ్మకాలు పడిపోవడం ప్రభావం చూపినట్లు కంపెనీ తెలిపింది. ఇక ఆదాయం కూడా రూ. 6,353 కోట్ల నుంచి రూ. 5,068 కోట్లకు క్షీణించింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కంపెనీ షేరు దాదాపు 1% లాభంతో రూ. 224 వద్ద ముగిసింది. విద్యుత్ విభాగం ఆదాయం రూ. 5,379 కోట్ల నుంచి రూ. 4,144 కోట్లకు క్షీణించగా, పారిశ్రామిక విభాగం ఆదాయం సైతం రూ. 1,293 కోట్ల నుంచి రూ. 1,133 కోట్లకు తగ్గింది. కాగా, ఐదు ఇతర పీఎస్‌యూలతో కలసి రాజస్తాన్‌లో 4,000 మెగావాట్ల భారీ సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్ట్‌ను బీహెచ్ఈఎల్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే ఇది అత్యంత భారీ ప్రాజెక్ట్‌కాగా, ఈ జేవీలో బీహెచ్ఈఎల్కు 26% వాటా ఉంటుంది. మిగిలిన సంస్థలలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్(ఎస్ఈసీఐ) 23%, సంభార్ సాల్ట్(ఎస్ఎస్ఎల్) 16%, పీజీసీఐఎల్ 16%, సట్లుజ్ జల్ విద్యుత్(ఎస్జేవీఎన్ఎల్) 16%, రాజస్తాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్(ఆర్ఈఐఎల్) 3% చొప్పున వాటాలను కలిగి ఉంటాయి. ఈ ప్రాజెక్ట్‌కు పరికరాలను బీహెచ్ఈఎల్ సరఫరా చేస్తుంది. -
పరోక్ష పన్ను వసూళ్లలో స్వల్ప వృద్ధి
న్యూఢిల్లీ: పరోక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (2014-15, ఏప్రిల్-జూన్) 4.6 శాతం పెరిగాయి. విలువ రూపంలో ఈ మొత్తం రూ.1.13 లక్షల కోట్లు. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఈ మొత్తం రూ.1.08 లక్షల కోట్లు. వసూళ్లు స్వల్పంగా మాత్రమే పెరగడానికి ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాల వసూళ్లు క్షీణించడం, మాంద్యం కారణంతో తయారీ రంగంలో క్రియాశీలత లేకపోవడం వంటి అంశాలు కారణమని అధికార వర్గాలు తెలిపాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో పరోక్ష పన్ను వసూళ్ల లక్ష్యం గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 25 శాతం అధికంగా (6,24,902 కోట్లు) ఉండాలని బడ్జెట్ నిర్దేశిస్తోంది. లక్ష్యంతో పోల్చితే జూన్ క్వార్టర్ వసూళ్ల స్పీడ్ చాలా తక్కువగా ఉండడం గమనార్హం. ఆర్థిక సంవత్సరం మొత్తంలో నిర్దేశిత లక్ష్యాన్ని చేరడం సవాలేనని సీబీఈసీ చైర్పర్సన్ శాంతి సుందరం ఇటీవల ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. క్యూ1లో విభాగాల వారీగా... ఎక్సైజ్ సుంకాల వసూళ్లలో అసలు వృద్ధిలేకపోగా 0.2 శాతం క్షీణించాయి. వసూళ్లు రూ.35,159 కోట్లు. కస్టమ్స్ సుంకాల వసూళ్లూ 3.1 శాతం క్షీణించాయి. రూ.39,549 కోట్లుగా నమోదయ్యాయి. సేవల పన్నులు మాత్రం 19.1 శాతం వృద్ధితో రూ.38,862 కోట్లుగా నమోదయ్యాయి.