క్యూ1లో ఆటోమొబైల్‌ ఎగుమతులు డౌన్‌ | Automobile exports from India dip 28percent in Q1 as several markets hit by monetary crisis | Sakshi
Sakshi News home page

క్యూ1లో ఆటోమొబైల్‌ ఎగుమతులు డౌన్‌

Published Tue, Jul 18 2023 5:27 AM | Last Updated on Tue, Jul 18 2023 5:27 AM

Automobile exports from India dip 28percent in Q1 as several markets hit by monetary crisis - Sakshi

ముంబై: భారత ఆటోమొబైల్‌ ఎగుమతులు ఏప్రిల్‌–జూన్‌ మధ్య కాలం(క్యూ1)లో 28 శాతం తగ్గిపోయాయి. ఆఫ్రికాతో పాటు ఇతర అభివృద్ధి చెందుతున్న (వర్థమాన)దేశాల్లో ద్రవ్య సంక్షోభ పరిస్థితులు ఇందుకు కారణమయ్యాయి. వాహన పరిశ్రమ సమాఖ్య సియామ్‌ తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించాయి. తొలి త్రైమాసికంలో మొత్తం 10.32 లక్షల యూనిట్లు ఎగుమతయ్యాయి. గతేడాది ఇదే క్వార్టర్‌ ఎగుమతులు 14.25 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇది 28% తక్కువగా ఉంది.

► ఈ జూన్‌ త్రైమాసికంలో మొత్తం ప్యాసింజర్‌ వాహనాల ఎగుమతులు అయిదు శాతం తగ్గి 1,52,156 యూనిట్లుగా నమోదయ్యాయి. కాగా 2022 ఏప్రిల్‌–జూన్‌ కాలంలో 1,60,116 యూనిట్లగా ఉన్నాయి.  
► వార్షిక ప్రాతిపదిక ప్యాసింజర్‌ కార్ల ఎగుమతులు 1,04,400 యూనిట్ల నుంచి 94,793 యూనిట్లకు పడిపోయాయి.
► యుటిలిటీ వెహికల్స్‌ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 55,419 యూనిట్లకు స్వల్పంగా తగ్గాయి. గత ఏడాది ఇదే కాలంలో 55,547 యూనిట్లు ఉన్నాయి.  
► ద్విచక్ర వాహనాల ఎగుమతులు ఏప్రిల్‌–జూన్‌ మధ్య కాలంలో 11,48,594 యూనిట్ల నుంచి 31 శాతం క్షీణించి 7,91,316 యూనిట్లకు చేరుకున్నాయి.  
► వాణిజ్య వాహనాల ఎగుమతులు మొదటి త్రైమాసికంలో 14,625 యూనిట్లకు పడిపోయాయి. 2022–23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–జూన్‌ కాలంలో 19,624 యూనిట్ల నుండి 25 శాతం తగ్గాయి.
► త్రీవీలర్‌ ఎగుమతులు కూడా గత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో 97,237 యూనిట్ల నుంచి సమీక్షా కాలంలో 25 శాతం క్షీణించి 73,360 యూనిట్లకు చేరుకున్నాయి.  
► ‘‘ఆఫ్రికా, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో కరెన్సీల విలువ తగ్గింపు ప్రభావంతో తొలి త్రైమాసికంలో అన్ని వాహన విభాగ ఎగుమతులు తగ్గిపోయాయి. ఈ దేశాలు విదేశీ మారకద్రవ్య లభ్యత సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ అంశం వాహనాల అమ్మకాలను పరిమితం చేస్తోంది. అయినప్పటికీ ఈ మార్కెట్లలో కస్టమర్ల నుంచి వాహనాలకు డిమాండ్‌ ఉంది’’ అని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజేష్‌ మీనన్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement