న్యూఢిల్లీ:సిరియా సంక్షోభంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఈ మేరకు సోమవారం(డిసెంబర్ 9) ఒక ప్రకటన విడుదల చేసింది. శాంతియుత, అందరినీ కలుపుకుపోయే రాజకీయ ప్రక్రియ సిరియాలో స్థిరత్వం తీసుకువస్తుందని అభిప్రాయపడింది.
సిరియాలో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని తెలిపింది.సిరియాలోని అన్ని పక్షాలు ఐక్యమత్యం,సార్వభౌమత్వం కోసం పనిచేయాలని సూచించింది. దేశంలోని అన్ని వర్గాల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకోవాలని కోరింది.సిరియా రాజధాని డెమాస్కస్‌లోని భారత ఎంబసీ కొనసాగుతుందని, భారతీయులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎంబసీని సంప్రదించాలని కోరింది. కాగా, సిరియాలో నియంత పాలనను కూలదోసి రెబల్స్ అధికారాన్ని హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: పిల్ల చేష్టలనుకుంటే నియంత పాలన అంతానికి నాంది పలికింది
Comments
Please login to add a commentAdd a comment