న్యూయార్క్: కెనడా-భారత్ మధ్య ప్రస్తుతం దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయాన్ని అంటగడుతూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభణకు కారణమైంది. అయితే.. ఈ వ్వవహారంలో అమెరికా ఎవరి పక్షాన ఉంది.?
భారత్‌కూ మినహాయింపు లేదు..?
భారత-కెనడా ప్రతిష్టంభణపై స్పందించిన అమెరికా.. ఇలాంటి వ్యవహారంలో ఏ దేశానికైనా ప్రత్యేక మినహాయింపులు ఉండవని తెల్చి చెప్పింది. ఈ అంశంలో భారత్‌కైనా మినహాయింపు ఉండదని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ స్పష్టం చేశారు. కెనడా ఆరోపణలపై భారత్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు.
కెనడాతో విబేధాలు లేవు..
భారత్‌తో బంధాలను బలోపేతం చేసుకునే దిశలో అమెరికా ఉన్నందున కెనడా వైపు బలంగా మాట్లాడటంలేదని ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన జేక్ సుల్లివన్.. ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. అమెరికా దాని నియమ నిబంధనలకు ఎల్లప్పుడు కట్టుబడి ఉంటుంది. కెనడా ఆరోపణలపై అత్యున్నత స్థాయిలో ఇరుదేశాలతో చర్చిస్తున్నాము. ఈ అంశంపై అమెరికా నిష్పక్షపాతంగా ఉందని అన్నారు. ఇలాంటి అంశాల్లో భారత్‌కైనా మినహాయింపు ఉండదని చెప్పారు.
ఇండియా కెనడా మధ్య చెలరేగిన ఖిలిస్థానీ ఉగ్రవాది హత్యకేసు వివాదంలో.. అమెరికా-కెనడా మధ్య దూరం పెరిగిందనే ఆరోపణలు అవాస్తవని సుల్లివాన్ తెలిపారు. ఇలాంటి ఆరోపణలు ఆందోళనలు కలిగిస్తున్నాయని అన్నారు. ఈ వ్యవహారంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని అమెరికా కోరుకుంటున్నట్లు చెప్పారు. నేరస్థులు ఎవరైనా శిక్ష పాడాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ప్రెసిడెన్షియల్ సూట్ వద్దన్నాడు.. విమానాన్ని కాదన్నాడు!
Comments
Please login to add a commentAdd a comment