disputed
-
భారత్- కెనడా వివాదం: అమెరికా ఎవరి వైపు..?
న్యూయార్క్: కెనడా-భారత్ మధ్య ప్రస్తుతం దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయాన్ని అంటగడుతూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభణకు కారణమైంది. అయితే.. ఈ వ్వవహారంలో అమెరికా ఎవరి పక్షాన ఉంది.? భారత్‌కూ మినహాయింపు లేదు..? భారత-కెనడా ప్రతిష్టంభణపై స్పందించిన అమెరికా.. ఇలాంటి వ్యవహారంలో ఏ దేశానికైనా ప్రత్యేక మినహాయింపులు ఉండవని తెల్చి చెప్పింది. ఈ అంశంలో భారత్‌కైనా మినహాయింపు ఉండదని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ స్పష్టం చేశారు. కెనడా ఆరోపణలపై భారత్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. కెనడాతో విబేధాలు లేవు.. భారత్‌తో బంధాలను బలోపేతం చేసుకునే దిశలో అమెరికా ఉన్నందున కెనడా వైపు బలంగా మాట్లాడటంలేదని ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన జేక్ సుల్లివన్.. ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. అమెరికా దాని నియమ నిబంధనలకు ఎల్లప్పుడు కట్టుబడి ఉంటుంది. కెనడా ఆరోపణలపై అత్యున్నత స్థాయిలో ఇరుదేశాలతో చర్చిస్తున్నాము. ఈ అంశంపై అమెరికా నిష్పక్షపాతంగా ఉందని అన్నారు. ఇలాంటి అంశాల్లో భారత్‌కైనా మినహాయింపు ఉండదని చెప్పారు. ఇండియా కెనడా మధ్య చెలరేగిన ఖిలిస్థానీ ఉగ్రవాది హత్యకేసు వివాదంలో.. అమెరికా-కెనడా మధ్య దూరం పెరిగిందనే ఆరోపణలు అవాస్తవని సుల్లివాన్ తెలిపారు. ఇలాంటి ఆరోపణలు ఆందోళనలు కలిగిస్తున్నాయని అన్నారు. ఈ వ్యవహారంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని అమెరికా కోరుకుంటున్నట్లు చెప్పారు. నేరస్థులు ఎవరైనా శిక్ష పాడాలని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ప్రెసిడెన్షియల్ సూట్ వద్దన్నాడు.. విమానాన్ని కాదన్నాడు! -
కెనడా-భారత్ ప్రతిష్టంభనకు అగ్గి రాజుకుంది అక్కడే..?
ఒట్టావా: కెనడా-భారత్ మధ్య దౌత్యపరంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో ఆరోపించడం వివాదానికి తెరలేపింది. ఈ పరిణామం తర్వాత ఇరుదేశాలు ‘‘నువ్వా-నేనా’’ అన్నట్లు ఆంక్షలు విధించుకునే స్థాయికి చేరాయి. ఇరు దేశాలు తమ దేశాల్లోని ఇరుపక్షాల దౌత్య వేత్తలను బహిష్కరించుకున్నాయి. అంతటితో ఆగకుండా తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలను కూడా ఇరుదేశాలు జారీ చేశాయి. ఇండియా ఒకడుగు ముందుకేసి కెనడా వీసాలను కూడా రద్దు చేసింది. అయితే.. ఇంతటి చర్యలకు కారణం ఒక్క ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ హత్య కేసుపై ట్రూడో వ్యాఖ్యలు మాత్రమే కారణం కాదు. కొన్ని రోజులుగా ఇరుదేశాల మధ్య రగులుతున్న ఖలిస్థానీ వివాదం, ఇందిరా గాంధీ హత్యపై పోస్టర్లు.. హర్దిప్ సింగ్ హత్య కేసుతో చిలికి చిలికి గాలివానలా మారింది. అమృత్ పాల్‌సింగ్‌తో మొదలు.. పంజాబ్‌లో ఖలిస్థానీ ప్రబోధకుడు అమృత్ పాల్సింగ్పై మార్చిలో భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారులు భారత దౌత్య కార్యాలయం ఎదుటు నిరసనకు దిగారు. దీంతో భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. భారత దౌత్య అధికారుల భద్రత కెనడా ప్రభుత్వం చూసుకోవాలని కోరింది. ఈ చర్యల తర్వాత కెనడాలోని బ్రాంప్టన్‌లో ఇందిరా గాంధీ హత్యను చిత్రీకరిస్తూ ఖలిస్థానీ మద్దతుదారులు ర్యాలీ నిర్వహించారు. దీనిపై కెనడా ప్రభుత్వంపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో ఇలాంటి చర్యలకు మద్దతు తెలపరాదని దుయ్యబట్టారు. ఇండియా, కెనడా మధ్య సంబంధాలకు ఈ చర్యలు ఏమాత్రం మంచిది కాదని హితువు పలికారు. హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య.. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ బ్రిటిష్ కొలంబియాలోని గురుద్వారాలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ను కాల్చి చంపారు. ఈ కేసుపై కెనడా ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. ఈ క్రమంలోనే నిజ్జర్ హత్యకు భారత హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మ, కౌన్సిల్ జనరల్ అపూర్వ శ్రీవాస్తవలే కారణమని పేర్కొంటూ ఖలిస్థానీ మద్దతుదారులు ఆరోపించారు. భారత దౌత్య అధికారులే నిజ్జర్ హత్యకు కారణమని టొరెంటోలో జులై 8న నిర్వహించిన ర్యాలీలోని పాంప్లెట్లలో పేర్కొన్నారు. ఈ పరిణామాలపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. జీ20 సమ్మిట్.. ఆ సారి ఢిల్లీలో జరిగిన జీ20 సమ్మిట్ సందర్భంగా కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాదం పెరుగుతుండటం పట్ల భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత వ్యతిరేక శక్తులకు కెనడా ఆవాసంగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరికలు జారీ చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాదం, మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా వంటి అసాంఘీక శక్తులను అణిచివేయడంలో ఇరుదేశాలు సహకరించుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. దీనికి స్పందించిన ట్రూడ్రో కెనడా భావవ్యక్తీకరణ స్వేచ్చను గౌరవిస్తుందని అన్నారు. శాంతికాముకమైన నిరసనలకు అనుమతి ఉంటుందని పేర్కొంటూ.. అల్లర్లను కూడా సహించబోమని స్పష్టం చేశారు. కొంతమంది చేసే చర్యలకు ఓ వర్గాన్ని మొత్తం ఆపాదించడం సరికాదని అన్నారు. ఇదీ కాకుండా విమానం సాంకేతిక కారణాల వల్ల జీ20 మీటింగ్ అనంతరం కెనడా ప్రధాని ట్రూడో రెండు రోజులు ఢిల్లీలోనే ఉండాల్సి వచ్చింది. భారత ప్రభుత్వం విమానం ఏర్పాట్లు చేసినప్పటికీ ఆయన ఉపయోగించుకోలేదు. దాదాపు 36 గంటలు ఢిల్లీలోనే ఉండి, సాంకేతిక సమస్యలు ముగిశాక కెనడాకు బయలుదేరారు. ఈ పరిణామాల అనంతరం గత సోమవారం నిజ్జర్ హత్య కేసులో భారత ప్రమేయం ఉందని వివాదాస్పదంగా మాట్లాడారు. తమ పౌరుల పట్ల విదేశీ జోక్యం సహించబోమని మండిపడ్డారు. ఇలా.. అమృత్ పాల్ సింగ్‌తో మొదలైన వివాదం.. జీ20 సమ్మిట్ అనంతరం బయటపడింది. ఇదీ చదవండి: Trudeau Avoids Media Questions: ఐరాస వేదికగా ఖలిస్థానీ ప్రశ్నలకు ట్రూడో ఎడముఖం -
24 ఏళ్లయ్యింది.. ఇకనైనా తొలగించండి ప్లీజ్..
బీజింగ్: 1999లో చైనా ద్వీప తీరమైన రెనై రీఫ్ కు వచ్చిన ఫిలిప్పీన్స్ యుద్ధనౌక అప్పటి నుండి అక్కడే నిలిచిపోవడంతో అది శిథిలావస్థకు చేరుకుంది. ప్రస్తుతం మనీలా యుద్ధనౌకను మళ్ళీ మరమ్మతులు చేసి పునరుద్ధరించే ప్రయత్నం చేస్తుండగా దయచేసి దానిని అక్కడి నుంచి తొలగించమని అభ్యర్ధించింది చైనా. చైనా అధికార ప్రతినిధి ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఫిలిప్పీన్స్ అంతర్జాతీయ చట్టాలను అతిక్రమిస్తోందని, ఇప్పటికే ASEAN దేశాలు సంయుక్తంగా నిర్దేశించుకున్న నిబంధనలను ఉల్లంఘించిందని అన్నారు. ఫిలిపీన్స్ కోస్ట్ గార్డ్ బృందం యుద్ధ నౌకలో యధాతధంగా కార్యకలాపాలను కొనసాగిస్తోందని దీని వలన శతృ దేశాలకు నీటి మార్గంలో తమను టార్గెట్ చేయడం సులువయ్యే అవకాశముందన్నది అభిప్రాయపడ్డారు. గడిచిన 24 ఏళ్లలో చైనా అనేకమార్లు ఓడను తొలగించమని ఫిలిప్పీన్స్ ను అభ్యర్ధించగా ఫిలిప్పీన్స్ తీర దళాలు తొలగిస్తామని చెబుతూ కాలాన్ని నెట్టుకుంటూ వచ్చాయి. ఇక ఇప్పుడైతే నౌకకు మరమ్మతులు చేసి చైనా తీరంలోనే పాతుకుపోయే ప్రయత్నం చేస్తోందని చైనా తీర దళాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా చైనా కోస్ట్ గార్డ్ బృందం కూడా నిబంధనలను ఉల్లంఘించి ఫిలిపీన్స్ కోస్ట్ గార్డ్ వైపుగా ఒక నౌకను తరలించింది. అది తప్పు కాదా అంటూ ఎదురు ప్రశ్నించింది ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో ఫిలిప్పీన్స్ తీరానికి చేరువగా వస్తోన్న చైనా ఓడ ఫోటోను కూడా పోస్ట్ చేసింది. అంతే కాదు సెకండ్ థామస్ షోల్ వద్ద చైనా అక్రమాలపై 2020 నుంచి ఇప్పటివరకు 400 సార్లకు పైగా మేము మా నిరసన తెలుపుతూనే ఉన్నామని గుర్తుచేసింది ఫిలిప్పీన్స్ విదేశాంగ శాఖ. In China's own words: how it occupied Mischief Reef w/ a few small huts in 1995, then upgraded it to a large building with helipads, guns in 1999. This is why the Philippines placed BRP Sierra Madre on Second Thomas (Ayungin) Shoal to stand watch in 1999. pic.twitter.com/QiyagaetKj — Jay L Batongbacal (@JayBatongbacal) August 8, 2023 ఇది కూడా చదవండి: పురుగులున్న చీకటి గదిలో ఉంచారు, జీవితాంతం జైల్లోనే ఉంటా: ఇమ్రాన్ ఖాన్ -
భూసేక‘రణం’
సాక్షి ప్రతినిధి, ఏలూరు/జీలుగుమిల్లి : పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కోసం భూములు సేకరించిన వ్యవహారం గిరిజనుల మధ్య చిచ్చు రేపింది. గిరిజనుల ఆధీనంలో ఉన్న భూములను అధికారులు అడ్డగోలుగా కొనుగోలు చేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూమికి సంబంధించి పట్టాలు వేరే వారి పేరిట ఉన్నప్పటికీ కొన్ని దశాబ్దాలుగా తామే సాగు చేసుకుంటున్నామని.. ఆ భూములను పట్టాలు కలిగిన వ్యక్తుల నుంచి కొనుగోలు చేసి నిర్వాసితులకు అప్పగించడం అన్యాయమనే వాదన వినిపిస్తోంది. ఇదికాస్తా స్థానిక గిరిజనులు, స్థానికేతరులైన నిర్వాసిత గిరిజనుల మధ్య అగ్గి రాజేస్తోంది. జిల్లాలోని జీలుగువిుల్లి, బుట్టాయగూడెం మండలాల్లో ఈ తరహా సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. తాజాగా జీలుగుమిల్లి మండలం పి.నారాయణపురంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు కేటాయించిన భూముల్లో స్థానిక గిరిజనులు సర్వే రాళ్లను తొలగించడంతోపాటు మోడల్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంటిని ధ్వంసం చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. తాము సాగు చేసుకుంటున్న భూములను నిర్వాసితులకు కేటాయించడంతో స్థానిక గిరిజనులు అడ్డం తిరుగుతున్నారు. పోలవరం నిర్వాసిత గ్రామాలైన రాజులగొంది, కొరుటూరు, శివగిరి, కొత్త మామిడిగొంది గ్రామాల గిరిజనులకు జీలుగుమిల్లి మండలం పి.నారాయణపురంలో భూమికి భూమితోపాటు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఈ గ్రామంలోని భూములకు అగ్రవర్ణాల పేరుతో పట్టాలు ఉన్నాయి. ఆ భూములను కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. వీటిని పోలవరం నిర్వాసితులకు కేటాయించడంపై ఈ ప్రాంత గిరి జనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వాసిత గిరిజనులు ఆ భూముల్లో సాగు చేసుకునేందుకు ఉపక్రమిస్తుంటే అడ్డుకుంటున్నారు. పి.నారాయణపురం రెవెన్యూ పరిధిలో సుమారు 500 ఎకరాల భూములకు సంబంధించి నిర్వాసిత గిరిజనులు, స్థానిక గిరిజనుల మధ్య వివాదాలు నడుస్తున్నాయి. ఈ భూముల్లో పోలీస్ రక్షణతో పోలవరం నిర్వాసితులు సాగు చేసుకోవాలి్సన పరిస్థితి ఏర్పడింది. రాచన్నగూడెం, పి.నారాయణపురం గ్రామాల్లోని భూముల్లో స్థానిక గిరిజనులు వేసిన పత్తి పంటను గత ఏడాది జూన్ నెలలో పోలీస్ రక్షణతో నిర్వాసిత గిరిజనులు దున్నేశారు. దీనిని అడ్డుకునేందుకు యత్నించిన స్థానిక గిరిజనులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇదిలావుండగా.. పోలవరం నిర్వాసితుల కోసం పి.నారాయణపురంలో కేటాయించిన ఇంటి స్థలాల్లోని సరిహద్దు రాళ్లను స్థానిక గిరిజనులు మంగళవారం తొలగించారు. ఇక్కడ మోడల్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంటి పిల్లర్స్‌ను ధ్వంసం చేశారు. నిర్వాసితులను సాగు చేసుకోని వ్వకపోవడం, ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకోవడంతో గిరిజనుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెవెన్యూ అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారిం చకపోతే భవిష్యత్‌లో మరిన్ని సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.