బీజింగ్: 1999లో చైనా ద్వీప తీరమైన రెనై రీఫ్ కు వచ్చిన ఫిలిప్పీన్స్ యుద్ధనౌక అప్పటి నుండి అక్కడే నిలిచిపోవడంతో అది శిథిలావస్థకు చేరుకుంది. ప్రస్తుతం మనీలా యుద్ధనౌకను మళ్ళీ మరమ్మతులు చేసి పునరుద్ధరించే ప్రయత్నం చేస్తుండగా దయచేసి దానిని అక్కడి నుంచి తొలగించమని అభ్యర్ధించింది చైనా.
చైనా అధికార ప్రతినిధి ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఫిలిప్పీన్స్ అంతర్జాతీయ చట్టాలను అతిక్రమిస్తోందని, ఇప్పటికే ASEAN దేశాలు సంయుక్తంగా నిర్దేశించుకున్న నిబంధనలను ఉల్లంఘించిందని అన్నారు. ఫిలిపీన్స్ కోస్ట్ గార్డ్ బృందం యుద్ధ నౌకలో యధాతధంగా కార్యకలాపాలను కొనసాగిస్తోందని దీని వలన శతృ దేశాలకు నీటి మార్గంలో తమను టార్గెట్ చేయడం సులువయ్యే అవకాశముందన్నది అభిప్రాయపడ్డారు. గడిచిన 24 ఏళ్లలో చైనా అనేకమార్లు ఓడను తొలగించమని ఫిలిప్పీన్స్ ను అభ్యర్ధించగా ఫిలిప్పీన్స్ తీర దళాలు తొలగిస్తామని చెబుతూ కాలాన్ని నెట్టుకుంటూ వచ్చాయి. ఇక ఇప్పుడైతే నౌకకు మరమ్మతులు చేసి చైనా తీరంలోనే పాతుకుపోయే ప్రయత్నం చేస్తోందని చైనా తీర దళాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా చైనా కోస్ట్ గార్డ్ బృందం కూడా నిబంధనలను ఉల్లంఘించి ఫిలిపీన్స్ కోస్ట్ గార్డ్ వైపుగా ఒక నౌకను తరలించింది. అది తప్పు కాదా అంటూ ఎదురు ప్రశ్నించింది ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో ఫిలిప్పీన్స్ తీరానికి చేరువగా వస్తోన్న చైనా ఓడ ఫోటోను కూడా పోస్ట్ చేసింది. అంతే కాదు సెకండ్ థామస్ షోల్ వద్ద చైనా అక్రమాలపై 2020 నుంచి ఇప్పటివరకు 400 సార్లకు పైగా మేము మా నిరసన తెలుపుతూనే ఉన్నామని గుర్తుచేసింది ఫిలిప్పీన్స్ విదేశాంగ శాఖ.
In China's own words: how it occupied Mischief Reef w/ a few small huts in 1995, then upgraded it to a large building with helipads, guns in 1999. This is why the Philippines placed BRP Sierra Madre on Second Thomas (Ayungin) Shoal to stand watch in 1999. pic.twitter.com/QiyagaetKj
— Jay L Batongbacal (@JayBatongbacal) August 8, 2023
ఇది కూడా చదవండి: పురుగులున్న చీకటి గదిలో ఉంచారు, జీవితాంతం జైల్లోనే ఉంటా: ఇమ్రాన్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment