
మనీలా: దక్షిణ చైనా సముద్రంపై పెత్తనం తమదేనంటున్న డ్రాగన్ దేశం దుందుడుకు చర్యకు పాల్పడింది. వివాదాస్పద జలాల్లోని ఫిలిప్పీన్స్ కోస్ట్‌గార్డ్ ఓడపైకి చైనా కోస్ట్‌గార్డ్ షిప్ మిలటరీ గ్రేడ్ లేజర్ కిరణాలను ప్రయోగించింది. దీంతో అందులోని తమ సిబ్బందిలో కొందరికి కొద్దిసేపు కళ్లు కనిపించకుండా పోయాయి.
ఈ చర్యతో చైనా తమ సార్వభౌమ హక్కులకు తీవ్ర భంగం కలిగించిందని ఫిలిప్పీన్స్ ఆరోపించింది. తమ ఓడ బీఆర్‌పీ మలపస్కువాను దగ్గరల్లోని రాతి దిబ్బ వైపు వెళ్లకుండా చైనా ఓడ అడ్డుకుందని తెలిపింది. ఈ క్రమంలో ప్రమాదకరంగా 137 మీటర్ల అతి సమీపానికి చేరుకుందని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment