మనీలా: దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతంలో ఆదివారం ఫిలిప్పీన్స్, చైనా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ కోస్ట్ గార్డ్ నౌక, మిలటరీ రవాణా బోటులను చైనా కోస్ట్‌గార్డ్ షిప్, దానితోపాటే వచ్చిన చైనా నౌక ఢీకొట్టాయని ఫిలిప్పీన్స్ అధికారులు తెలిపారు.
ఘటనలో తమ సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదని, నౌకలకు వాటిల్లిన నష్టంపై అంచనా వేస్తున్నామన్నారు. తమ నౌకలు వేగంగా ప్రయాణించకపోయుంటే చైనా నౌకల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లేదని చెప్పారు. థామస్ షోల్ వద్ద ఉన్న ఫిలిప్పీన్స్ మెరైన్ పోస్టుకు సమీపంలో ఈ నెలలో చోటుచేసుకున్న రెండో ఘటన ఇది అని చెప్పారు. ఫిలిప్పీన్స్ అంతర్జాతీయ నిబంధలను ఉల్లంఘిస్తూ తమ నౌకల ప్రమాదాలకు కారణమవుతోందని చైనా ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment