South China Sea
-
ఫిలిప్పీన్స్ నౌకలను ఢీకొట్టిన చైనా కోస్ట్‌గార్డ్ షిప్
మనీలా: దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతంలో ఆదివారం ఫిలిప్పీన్స్, చైనా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ కోస్ట్ గార్డ్ నౌక, మిలటరీ రవాణా బోటులను చైనా కోస్ట్‌గార్డ్ షిప్, దానితోపాటే వచ్చిన చైనా నౌక ఢీకొట్టాయని ఫిలిప్పీన్స్ అధికారులు తెలిపారు. ఘటనలో తమ సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదని, నౌకలకు వాటిల్లిన నష్టంపై అంచనా వేస్తున్నామన్నారు. తమ నౌకలు వేగంగా ప్రయాణించకపోయుంటే చైనా నౌకల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లేదని చెప్పారు. థామస్ షోల్ వద్ద ఉన్న ఫిలిప్పీన్స్ మెరైన్ పోస్టుకు సమీపంలో ఈ నెలలో చోటుచేసుకున్న రెండో ఘటన ఇది అని చెప్పారు. ఫిలిప్పీన్స్ అంతర్జాతీయ నిబంధలను ఉల్లంఘిస్తూ తమ నౌకల ప్రమాదాలకు కారణమవుతోందని చైనా ఆరోపించింది. -
దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు
మనీలా: దక్షిణ చైనా సముద్రంపై పెత్తనం తమదేనంటున్న డ్రాగన్ దేశం దుందుడుకు చర్యకు పాల్పడింది. వివాదాస్పద జలాల్లోని ఫిలిప్పీన్స్ కోస్ట్‌గార్డ్ ఓడపైకి చైనా కోస్ట్‌గార్డ్ షిప్ మిలటరీ గ్రేడ్ లేజర్ కిరణాలను ప్రయోగించింది. దీంతో అందులోని తమ సిబ్బందిలో కొందరికి కొద్దిసేపు కళ్లు కనిపించకుండా పోయాయి. ఈ చర్యతో చైనా తమ సార్వభౌమ హక్కులకు తీవ్ర భంగం కలిగించిందని ఫిలిప్పీన్స్ ఆరోపించింది. తమ ఓడ బీఆర్పీ మలపస్కువాను దగ్గరల్లోని రాతి దిబ్బ వైపు వెళ్లకుండా చైనా ఓడ అడ్డుకుందని తెలిపింది. ఈ క్రమంలో ప్రమాదకరంగా 137 మీటర్ల అతి సమీపానికి చేరుకుందని వివరించింది. -
తుపాను కారణంగా రెండు ముక్కలైన ఓడ... 12 మంది మృతి
బీజింగ్: దక్షిణ చైనా సముద్రంలో ఓడ ధ్వంసమై మునిగిపోయింది. ఈ విషయాన్ని చైనా అధికారులు వెల్లడించారు. ఈ నౌక హాకాంగ్‌కు నైరుతి దిశలో 160 నాటికల్ మైళ్లు (296 కిలోమీటర్లు) దూరంలో రెండుగా ముక్కలై మునిగిపోయిందని తెలిపారు. ఈ దుర్ఘటనలో సుమారు 30 మంది సిబ్బంది గల్లంతైయ్యారని, ఈ ఘటన దక్షిణ చైనా సముద్రం మధ్య భాగంలో ఏర్పడిన చాబా తుపాను కారణంగా చోటు చేసుకుందని పేర్కొన్నారు. హాంకాంగ్ కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం ఏడు గంటలకు ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ తుపాను గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లో తీరాన్ని తాకింది. ఈ నౌక మునిగిపోయిన ప్రదేశానికి 50 నాటికల్ మైళ్ల దూరంలో 12 మంది మృతదేహాలను రెస్కూ సిబ్బంది గుర్తించారు. అదీగాక అక్కడ కఠినమైన వాతావరణ పరిస్థితులు, తీవ్ర గాలులు కారణంగా రెస్కూ ఆపరేషన్ చేపట్టడం కష్ట తరంగా మారింది. ఈ ఘటన జరిగిన వెంటనే శనివారం ముగ్గురిని రక్షించారు. మరొకరిని సోమవారం తెల్లవారుజామున రక్షించారు. ఈ మేరకు ఆ ప్రాంతంలో సుమారు ఏడు విమానాలు, దాదాపు 249 పడవలు, 498 ఫిషింగ్ ఓడలు గల్లంతైన వారి ఆచూకి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెస్కూ ఆపరేషన్‌కి సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by 政府飛行服務隊GovernmentFlyingService (@governmentflyingservice) (చదవండి: పాకిస్తాన్లో ఘోరం.. లోయలో పడిన బస్సు..19 మంది మృతి) -
డ్రాగన్ సైనిక విన్యాసాలు
బీజింగ్: దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దేశం చైనా సైనిక విన్యాసాలు ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆసియాపర్యటన తలపెట్టిన నేపథ్యంలో ఈ విన్యాసాలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. సైనిక విన్యాసాలు గురువారం ప్రారంభమయ్యాయని, సోమవారం వరకు కొనసాగుతాయని హైనన్ ప్రావిన్స్‌లోని చైనా మారిటైమ్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు ప్రకటించింది. విన్యాసాలు జరిగే ప్రాంతంలో ఇతర దేశాల విమానాలకు అనుమతి ఇవ్వడం లేదని తెలిపింది. -
అమెరికా అణు జలాంతర్గామికి ప్రమాదం.. ఆందోళన వ్యక్తం చేసిన చైనా
బీజింగ్: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో అమెరికాకు చెందిన అణు జలాంతర్గామి ‘యూఎస్ఎస్ కనెక్టికట్’ ప్రమాదానికి గురైవ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘యూఎస్ఎస్ కనెక్టికట్’ గత శనివారం అంతర్జాతీయ జలాల్లో నీటి అడుగున దేనినో ఢీకొట్టిందనీ, ఈ ఘటనలో పలువురు నావికులు అంతగా ప్రమాదకరం కాని విధంగా గాయపడ్డారని గురువారం యూఎస్ పసిఫిక్ ఫ్లీట్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘సబ్మెరీన్ కనెక్టికట్ సురక్షితంగానే ఉంది. అందులోని న్యూక్లియర్ ప్రొపల్షన్ ప్లాంట్, ఇతర వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయి’ అని పేర్కొంది. అయితే, ఈ జలాంతర్గామి మునిగిపోయిన ఓడనో, మరే వస్తువునో ఢీకొట్టి ఉంటుందే తప్ప..మరో సబ్‌మెరీన్‌ను మాత్రం కాదని ఓ అధికారి వివరించారు. ప్రస్తుతం ఈ జలాంతర్గామి గ్వామ్ వైపు వెళుతోందని ఆయన చెప్పారు. భద్రతా కారణాల రీత్యానే ఈ ఘటన వివరాలను వెంటనే వెల్లడించలేక పోయినట్లు వివరించారు. కాగా, ప్రమాద ఘటనపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటన జరిగిన ప్రాంతం, ఇతర వివరాలను వెంటనే బహిరంగపర్చాలని డిమాండ్ చేసింది. స్వేచ్ఛా సముద్రయానం పేరుతో ఈ ప్రాంతంలో అమెరికా జరుపుతున్న వాయు, నౌకా విన్యాసాలే ఘటనకు కారణమని నిందించింది. -
ఆ ట్రిబ్యునల్ తీర్పు చెత్త కాగితంతో సమానం!: చైనా
బీజింగ్: దక్షిణ చైనా సముద్రంపై 2016లో అంతర్జాతీయ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు చెత్తకాగితంతో సమానమని చైనా వ్యాఖ్యానించింది. ఆ తీర్పును తాము గౌరవించేది లేదని స్పష్టం చేసింది. ట్రిబ్యునల్ తీర్పును అమెరికా సమర్ధించడం తమపై నింద మోపేందుకు చేసే ప్రహసనమని చైనా ప్రతినిధి జావో లిజ్జియన్ విమర్శించారు. ఇటీవలే తమ సముద్ర జలాల్లోకి వచ్చిన యూఎస్ యుద్ధ నౌకను తరిమి కొట్టామని చైనా ప్రకటించింది. దక్షిన చైనా సముద్రంపై తమకు హక్కుందని చైనా వాదిస్తుండగా, అలాంటిదేమీ లేదంటూ అప్పుడప్పుడు యూఎస్ ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటుంది. ఈ విషయమై ట్రిబ్యునల్ తీర్పును గౌరవించాలని అమెరికా చెబుతుంటుంది. ఈ నేపథ్యంలోనే ఫిలిప్పీన్స్‌కు తమకు ద్వైపాక్షిక ఒప్పందాలున్నందున, దక్షిన చైనా జలాల్లో వాటాలకు సంబంధించి ఫిలిప్పీన్స్‌పై చైనా ఎలాంటి దాడి చేసినా, తాము జోక్యం చేసుకోక తప్పదని యూఎస్ స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ ఆదివారం హెచ్చరించారు. దీనిపై ప్రతిస్పందిస్తూ చైనా తాజా వ్యాఖ్యలు చేసింది. తాము ఆ తీర్పును గౌరవించమని, ఎప్పటిలాగే ఈ జలాలపై తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. దక్షిణ చైనా సముద్రంలోని పరాసెల్స్ దాదాపు వంద ద్వీపాల సముదాయం. వీటిపై చైనా, వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్, మలేసియా, బ్రూనే దేశాలు చారిత్రకంగా తమకే హక్కు ఉందని చెప్పుకుంటున్నాయి. అయితే జులై 12, 2016లో హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం చైనాకు దక్షిణ చైనా సముద్రంపై చారిత్రకంగా ఎలాంటి హక్కూ లేదని తీర్పునిచ్చింది. అంతేగాక, ఫిలిప్పీన్స్‌కు ఉన్న చేపలు పట్టే హక్కును ఉల్లంఘిస్తోందనీ, రెడ్ బ్యాంకు వద్ద చమురు, సహజవాయువు నిక్షేపాల కోసం మైనింగ్ చేయడం ద్వారా ఆ దేశ సార్వభౌమత్వాన్ని చైనా ఖాతరు చేయడం లేదని పేర్కొంది. -
అమెరికా యుద్ధ నౌకను తరిమికొట్టాం: చైనా
బీజింగ్: తమ దేశ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన అమెరికా యుద్ధ నౌకను తరిమికొట్టినట్లు చైనా మిలిటరీ ప్రకటించింది. వివాదాస్పదమైన పారాసెల్ దీవులకు సమీపంలో సోమవారం చైనా జలాల్లోకి అమెరికా యుద్ధనౌక చట్టవిరుద్ధంగా ప్రవేశించినట్లు డ్రాగన్ దేశం తెలిపింది. దక్షిణ చైనా సముద్ర జలాలాపై చైనాకు ఎలాంటి హక్కు లేదని అంతర్జాతీయ కోర్టు తీర్పు వెల్లడించిన ఐదేళ్లకు చైనా ఈ చర్యకు పాల్పడటం గమనార్హం. అమెరికాకు చెందిన యూఎస్ఎస్ బెన్‌ఫోల్డ్ యుద్ధ నౌక చైనా ప్రభుత్వ అనుమతి లేకుండా పారాసెల్స్ జలాల్లోకి ప్రవేశించిందని చైనా ఆర్మీ పీఎల్ఏ సదరన్ థియేటర్ కమాండర్ తెలిపారు. అమెరికా చర్యలు చైనా సార్వభౌమత్వాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమే కాక దక్షిణ చైనా సముద్రం స్థిరత్వాన్ని దెబ్బతీసేవిధంగా ఉన్నాయని ఆరోపించించారు. అమెరికా తక్షణమే ఇలాంటి రెచ్చగొట్టే చర్యలను మానుకోవాలని కమాండర్ ఓ ప్రకటనలో కోరారు. చైనా ఆరోపణలు అవాస్తవం: అమెరికా చైనా ఆరోపణలపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. ఈ మేరకు అగ్ర రాజ్య విదేశాంగ శాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్ స్పందిస్తూ.. ‘‘అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా, పారాసెల్స్ దీవుల పరిసరాల్లో మా యుద్ధ నౌక సంచిరించింది. చైనా సార్వభౌమాత్వానికి భంగం కలిగించామనడం పూర్తిగా అవాస్తవం. అంతేకాక అంతర్జాతీయ చట్టాలు అనుమతించిన ప్రతి చోట అమెరికా ఎగురుతుంది, ప్రయాణిస్తుంది.. పనిచేస్తూనే ఉంటుంది’’ అని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును పట్టించుకోని చైనా చైనాలో జిషాగా పిలిచే పారాసెల్స్ ప్రాంతం వందలాది ద్వీపాలు, కోరల్ దీవులు, సముద్ర సంపదకు పుట్టినిల్లు. ఈ ప్రాంతంపై తమకే హక్కుందని చైనా, వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్, మలేసియా, బ్రూనే దేశాలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో 1970 లలో హైనాన్ ద్వీపానికి ఆగ్నేయంగా 220 మైళ్ళు (350 కిలోమీటర్లు), 250 మైళ్ళు (వియత్నాంకు 400 కిలోమీటర్లు) బంజరు ద్వీపాల గొలుసు అయిన పారాసెల్స్‌ను చైనా తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ ప్రాంతాన్ని వియత్నాం తమదిగా చెప్పుకుంటుంది. అక్కడ దీన్ని హోంగ్ సా అని పిలుస్తారు. అలానే తైవాన్ కూడా దీనిపై తమకే హక్కుందని ప్రచారం చేసుకుంటుంది. ఈ ప్రాంతం గుండా ఏదైనా సైనిక నౌక ప్రయాణించే ముందు మూడు దేశాల నుంచి అనుమతి తీసుకోవాలి. ముందస్తు నోటిఫికేషన్ ఇవ్వాలి. అయితే ఈ వివాదంపై అంతర్జాతీయ న్యాయస్థానం హేగ్ 2016, జూలై 12న సంచలన తీర్పు ఇచ్చింది. చైనా నైన్-డాష్ లైన్‌గా పిలుచుకునే పారాసెల్స్ ప్రాంతంపై బీజింగ్‌కు చారిత్రతకంగా ఎలాంటి హక్కు లేదని తేల్చి చెప్పింది. అంతేకాక ఫిలిప్పీన్స్‌కు ఉన్న చేపలు పట్టే హక్కును ఉల్లంఘిస్తోందని.. రెడ్ బ్యాంక్ వద్ద చమురు, సహజవాయువు నిక్షేపాల కోసం మైనింగ్ చేస్తూ.. ఫిలిఫ్పీన్స్ దేశ సార్వభౌమత్వాన్ని చైనా ఉల్లంఘిస్తుందని తెలిపింది. -
చైనాకు ఆస్ట్రేలియా గట్టి వార్నింగ్!
కాన్బెర్రా: ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. డ్రాగన్ దేశ ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తేలేదని, తమ జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చైనా రాయబార కార్యాలయం నుంచి వచ్చిన అనధికారిక డాక్యుమెంట్, తమ చట్టాల రూపకల్పన, నిబంధనలపై ఎలాంటి ప్రభావం చూపలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ ఏడాది మేలో వాణిజ్య విభాగ విదేశీ ప్రత్యక్ష ఉత్పత్తుల వినియోగం నిబంధనలు మరింత విస్తృతం చేసిన అగ్రరాజ్యం అమెరికా.. తద్వారా చైనీస్ టెలికం దిగ్గజం వావే టెక్నాలజీస్‌ను అమెరికా చట్టాలను ఉల్లంఘించకుండా కట్టడి చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా వావేను విశ్వసనీయత లేని వ్యాపార సంస్థగా అభివర్ణిస్తూ.. చైనా కమ్యూనిస్టు పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఆ సంస్థ పనిచేస్తుందని ఆరోపించింది. (చదవండి: చైనా లక్ష్యంగా 4 దేశాల కీలక ప్రకటన) అంతేగాక ఏదైనా దేశానికి చెందిన 5జీ నెట్వర్క్ మౌలిక సదుపాయాలు గనుక వావే వద్ద ఉన్నట్లయితే, ఆ దేశంపై గూఢచర్యం చేసే అవకాశాలు ఉంటాయన్న సమాచారాన్ని తన మిత్ర దేశాలతో పంచుకుంది. ఈ నేపథ్యంలో యూకే, ఆస్ట్రేలియా ఈ చైనీస్ కంపెనీపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా వావేను బ్యాన్ చేసినట్లు ఆస్ట్రేలియా వెల్లడించింది. అంతేగాక దక్షిణ చైనా సముద్రం, ఇండో- పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేలా వ్యవహరిస్తున్న అమెరికాకు, ఆసీస్ మద్దతుగా నిలుస్తోంది. అంతేగాక కరోనా వైరస్ విషయంలోనూ డ్రాగన్ దేశంపై విరుచుకుపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య గత కొన్నిరోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దౌత్య, వ్యాపార సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో 14 రకాల వేర్వేరు అంశాల్లో ఆసీస్ వైఖరి కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని చైనా పేర్కొంది. (చదవండి: అప్ఘనిస్తాన్‌లో ఆస్ట్రేలియా సైనికుల దాష్టీకాలు) ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వ అధికారి ఒకరు.. ‘‘చైనాను శత్రువుగా భావిస్తే.. చైనా మీ శత్రువుగానే ఉంటుంది’’అంటూ ఆస్ట్రేలియా ను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లు బుధవారం కథనాలు వెలువడ్డాయి. ఈ విషయంపై గురువారం స్పందించిన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్.. ‘‘ మా జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా మా చట్టాలు, మా నిబంధనలు మేం రూపొందించుకుంటాం. అలా చేయకుండా ఓ అనధికారిక పత్రం మమ్మల్ని ఆపలేదు. విదేశీ పెట్టుబడుల అంశంపై మేం అస్సలు రాజీపడబోం. 5జీ టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ ఎలా నిర్మించుకోవాలి, మా సార్వభౌమత్వాన్ని ఎలా కాపాడుకోవాలి అన్న అంశాలపై మాకు స్పష్టత ఉంది’’అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో చైనా జోక్యం అవసరం లేదని పేర్కొన్నారు. కాగా ట్రంప్ హయాంలో డ్రాగన్ దేశంతో విభేదాలు తారస్థాయికి చేరిన శ్వేతసౌధ జాతీయ భద్రతా మండలి ఆస్ట్రేలియా- చైనాల గురించి ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే ఆసీస్ ప్రధాని ఈ మేరకు స్పందించడం గమనార్హం. ‘‘చైనీస్ ఎత్తుగడలు బహిర్గతం చేసే దిశగా ఆస్ట్రేలియా ముందడుగు వేస్తున్న వేళ బీజింగ్ నిరాశకు లోనవుతోంది. తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే క్రమంలో ఆసీస్ తీసుకుంటున్న నిర్ణయాలు, మరికొన్ని దేశాలు కూడా అదే బాటలో నడవడం చూస్తుంటే ఉత్సాహంగా ఉంది’’అని జాతీయ భద్రతా మండలి పేర్కొంది. -
భారత్‌తో చర్చలు.. అమెరికా కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్/న్యూఢిల్లీ: తూర్పు లదాఖ్ సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన పరిస్థితులను గమనిస్తున్నామని, దక్షిణ చైనా సముద్రం సహా ఇండో పసిఫిక్ జలాల్లో దుందుడుకు వైఖరి ప్రదర్శిస్తున్న చైనాకు దీటుగా బదులిచ్చేందుకు భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అగ్రరాజ్యం అమెరికా పునరుద్ఘాటించింది. ఆగ్నేయాసియాలో కీలక దేశమైన భారత్‌కు ఎల్లప్పుడు తన మద్దతు ఉంటుందని పేర్కొంది. 2016 నుంచి ఇండియా తమ మేజర్ డిఫెన్స్ పార్టనర్‌గా మారిందని, గత నాలుగేళ్లుగా ఇరుదేశాల మధ్య రక్షణ రంగానికి సంబంధించిన ఒప్పందాల విషయంలో ఇటీవల కీలక ముందడుగు పడిందని పేర్కొంది. కాగా సైన్య సహకారం, పరస్పర సమాచార మార్పిడి తదితర అంశాలకు సంబంధించిన ఒప్పందాల గురించి భారత్- అమెరికాల మధ్య వచ్చే వారం 2+2 చర్చలు జరుగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బేసిక్ ఎక్స్స్ఛేంజ్ అండ్ కో-ఆపరేషన్ అగ్రిమెంట్(బీఈసీఏ)పై భారత్ సంతకం చేయనుంది. (చదవండి: చైనా పన్నాగం; ఆ తర్వాతే బలగాల ఉపసంహరణ!) శత్రు దేశాలకు దీటుగా బదులిచ్చే క్రమంలో వారి స్థావరాలను గుర్తించి, దాడి చేసేందుకు ఉద్దేశించిన ఎంక్యూ- 9బి వంటి ఆర్మ్డ్ డ్రోన్స్ దిగుమతి తదితర అంశాల గురించి ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదరనుంది. చర్చలు విజయవంతమైన తరుణంలో యూఎస్ గ్లోబల్ జియో- స్పేషియల్ మ్యాపులు ఉపయోగించి క్రూయిజ్ మిసైల్స్, బాలిస్టిక్ క్షిపణుల కచ్చితమైన జాడను తెలుసుకునే వీలు కలుగుతుంది. దీంతో దొంగ దెబ్బ తీయాలనుకునే శత్రు దేశాల వ్యూహాలను చిత్తు చేసి వారికి దీటుగా బదులిచ్చే అవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ పాలనా యంత్రాంగంలోని సీనియర్ అధికారులు శనివారం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘హిమాలయాల నుంచి దక్షిణ చైనా సముద్రం నుంచి వరకు ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దుందుడుకు చర్యలకు బదులిచ్చే క్రమంలో సారూప్య భావజాలం, ఒకే విధమైన ఆలోచనా విధానం కలిగిన ఇండియా వంటి భాగస్వామితో కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. మలబార్ నావికాదళ విన్యాసాల్లో ఆస్ట్రేలియాతో జట్టుకట్టనున్నట్లు ఇటీవల భారత్ చేసిన ప్రకటన పట్ల మాకెంతో సంతోషంగా ఉంది. భారత్‌కు మా మద్దతు ఉంటుంది. సైన్య సహకారం, పరస్పర సమాచార మార్పిడితో ముందుకు సాగుతాం. త్వరలోనే జరుగనున్న చర్చల్లో భాగంగా, ఆగ్నేయాసియా ప్రాంతంలో పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాలు, దక్షిణ చైనా సముద్రం తదితర అంశాల్లో భారత్ భాగస్వామ్యం మరింతగా పెరగడాన్ని స్వాగతిస్తున్నాం. తూర్పు లదాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరగకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది’’ అని పేర్కొన్నారు. కాగా కాగా పరస్పర సైన్య సహకారం, ఇండో- పసిఫిక్ జలాల్లో నిర్మాణాలు చేపట్టకుండా, అక్కడ జరుగుతున్న పరిణామాలపై ఓ కన్నేసి ఉంచి, పరస్పరం సహకరించుకునే క్రమంలో సమాచార మార్పిడి తదితర అంశాల్లో భారత్- అమెరికా ఇప్పటికే మూడు ప్రాథమిక ఒప్పందాలు కుదిరిన విషయం తెలిసిందే. -
యుద్ధానికి సిద్ధంగా ఉండండి: జిన్‌పింగ్
బీజింగ్: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గ్యాంగ్డాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న మిలిటరీ బేస్‌ను సందర్శించారు. దక్షిణ చైనా సముద్రం మీద డ్రాగన్ పెత్తనంపై దిగ్గజ దేశాలు భగ్గుమంటున్న వేళ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మెరైన్ కార్‌్ప్స(నావికా దళం)ను ఉద్దేశించి ప్రసంగించారు. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని, విశ్వసనీయత కలిగి ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ మేరకు చైనా అధికారిక వార్తా సంస్థ షినువా మంగళవారం ఓ కథనం ప్రచురించినట్లు సీఎన్ఎన్ తెలిపింది. ‘‘మీ అందరూ ఈ విషయంపై దృష్టి సారించి, శక్తినంతటినీ కూడగట్టుకుని యుద్ధానికి సన్నద్ధం కావాలి’’ అని జిన్‌పింగ్ వ్యాఖ్యానించినట్లు పేర్కొంది. కాగా వాస్తవాధీన రేఖ వెంబడి దుందుడుకు వైఖరి, దక్షిణ చైనా సముద్రం, ఇండో- పసిఫిక్ జలాలపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్న చైనా తీరు పట్ల అగ్రరాజ్యం అమెరికా సహా భారత్, ఆస్ట్రేలియా, జపాన్ తదితర క్వాడ్ దేశాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. (చదవండి: భారత సరిహద్దులో 60 వేల చైనా సైన్యం: అమెరికా) ఈ నేపథ్యంలో ఈ నాలుగు దేశాల విదేశాంగ మంత్రులు ఇటీవల టోక్యోలో సమావేశమై డ్రాగన్ దేశమే లక్ష్యంగా కీలక ప్రకటన విడుదల చేశారు. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో సమ్మిళిత, స్వేచ్ఛాయుత వాతావరణమే లక్ష్యంగా కలిసి పనిచేస్తామని పునరుద్ఘాటించారు. ఇక ఈ సమావేశం అనంతరం స్వదేశానికి చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చైనాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘భారత ఉత్తర సరిహద్దులో చైనా 60 వేల మంది సైనికులను మోహరించింది. వుహాన్‌లో ఉద్భవించిన ప్రాణాంతక కరోనా వైరస్ గురించి ప్రశ్నించినందుకు ఆస్ట్రేలియాపై వేధింపులకు పాల్పడింది. చైనీస్ కమ్యూనిస్టు పార్టీ పాలన వల్ల ప్రపంచానికి ముప్పు పొంచి ఉంది’’ అంటూ డ్రాగన్ వైఖరిని ఎండగట్టారు. దీంతో మరోసారి అమెరికా- చైనాల మధ్య తలెత్తిన విభేదాలు మరోసారి తారస్థాయికి చేరుకున్నాయి. (సానుకూలంగా చర్చలు.. కానీ) అంతేగాక అమెరికా, తైవాన్‌కు అన్ని రకాలుగా అండగా నిలవడం పట్ల చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. అగ్రరాజ్యం అండతో తమతో సవాలు చేస్తే యుద్ధం తప్పదంటూ తైవాన్ను కూడా హెచ్చరించింది. మరోవైపు.. భారత్‌తోనూ సరిహద్దుల్లో పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న డ్రాగన్, మంగళవారం నాటి మిలిటరీ చర్చల్లో సానుకూల చర్చ జరిగిందని మంగళవారం ప్రకటన విడుదల చేయడం గమనార్హం. అయితే అదే సమయంలో భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకమైన లదాఖ్, జమ్మూ కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో నూతనంగా నిర్మించిన వంతెనల గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో జిన్‌పింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
డ్రాగన్ దూకుడుకు చెక్
సాక్షి, న్యూఢిల్లీ : భారత్- చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో డ్రాగన్ దూకుడుకు చెక్ పెట్టేందుకు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించిన కొద్ది నెలల అనంతరం భారత నౌకాదళం దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో యుద్ధ నౌకను మోహరించింది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతం వద్ద తాము కీలక యుద్ధ నౌకను మోహరించామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయని ఆదివారం ఓ జాతీయ వార్తాఛానెల్ పేర్కొంది. దక్షిణ చైనా సముద్రం ఆవల గస్తీ కాస్తున్న అమెరికన్ యుద్ధ నౌకలతో భారత యుద్ధనౌక సంప్రదింపులు జరుపుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కి ఇక వివాదాస్పద ప్రాంతంలో భారత యుద్ధ నౌకల కదలికలపై డ్రాగన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తూర్పు లడఖ్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో భారత యుద్ధవిమానాల మోహరింపు ప్రాధాన్యత సంతరించుకుంది. దక్షిణ చైనా సముద్రంపై ప్రాబల్యం కలిగిన చైనా ఆ ప్రాంతంలో ఇతర దేశాల యుద్ధవిమానాల ఉనికిని వ్యతిరేకిస్తోంది. మరోవైపు దక్షిణ చైనా సముద్రంపై చైనా ప్రాబల్యానికి చెక్ పెట్టేందుకు అమెరికా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. చదవండి : చైనా దూకుడు: మిస్సైల్ బేస్‌ల నిర్మాణం! -
విమాన విధ్వంస క్షిపణులను ప్రయోగించిన చైనా
బీజింగ్: చైనా నావికా విన్యాసాల్లో భాగంగా మొదటిసారిగా రెండు విమాన విధ్వంసక మిసైల్స్‌ని, దక్షిణ చైనా సముద్రంపైన ప్రయోగించింది. అమెరికా గూఢచార విమానాలు వివాదాస్పద భూభాగంలో తిరుగుతున్నాయని చైనా ఆరోపించింది. దక్షిణ, తూర్పు చైనా సముద్ర ప్రాంతాల్లో ఉన్న వివాదాన్ని దృష్టిలో ఉంచుకొని, చైనా ఈ ప్రాంతంలో సైనిక స్థావరాలను బలోపేతం చేసుకుంది. దక్షిణ చైనా సముద్రంపై తమకే పూర్తి అధికారాలున్నాయని బీజింగ్ పేర్కొంటుండగా, వియత్నాం, మలేషియా, పిలిప్పైన్స్, బ్రూనే, తైవాన్లు విభేదిస్తున్నాయి. ఈ రెండు మిస్సైళ్లు 4 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగలవు. -
ఇండో పసిఫిక్ మెగా నేవీ డ్రిల్
వాషింగ్టన్ : మలబార్ నావికాదళ విన్యాసాలలో పొల్గొనేందుకు భారత్ ఆస్ర్టేలియాను ఆహ్వానించాలని యోచిస్తోంది. ఈ అంశానికి సంబంధించి రాబోయే రెండు వారాల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్వాడ్ సభ్యులతో పాటు కాన్బెర్రా పాల్గొనడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, పరస్పర ప్రయోజనాలను కాపాడుకోవచ్చని అమెరికాకు చెందిన దౌత్యవేత్త స్టీవెన్ బీగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 1992 లో ప్రారంభమైన వార్షిక నావికాదళ విన్యాసాల్లో భాగంగా భారత్, జపాన్, అమెరికా పాల్గొంటుండగా తాజాగా ఆస్ర్టేలియా కూడా ఇందులో పాలుపంచుకోనుంది. కాగా 2015లో జపాన్ ఈ క్వాడ్‌లో శాశ్వత సభ్యుదేశంగా మారిన సంగతి తెలిసిందే. ఇండో-పసిఫిక్‌లో శాంతి, సుస్థిరితను నెలకొల్పాలనే లక్ష్యంతో క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. (దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధ విన్యాసాలు ) ప్రపంచ వ్యాప్తంగా ఇండో- పసిఫిక్ దేశాలతో అమెరికా సహకారం ఎప్పుడూ ఉంటుందని, ఆసియా దేశాలతో కలిసి పనిచేస్తున్నామని స్టీవెన్ బీగన్ అన్నారు. 'తమ విధానం నాలుగు స్తంఢాలపై నిలుస్తుంది. మొదటిది ఐక్యత, రెండోది మా మిత్రదేశాలతో భాగస్వామ్యం, మూడివది సైనిక నిరోధకత, చివరిగా నాలుగవది చైనాకు శక్తివంతమైన ఆర్థిక ప్రత్యామ్నాయం' అని స్టీవెన్ బీగన్ వెల్లడించారు. దక్షిణ చైనా సముద్రం చుట్టుపక్కల ఉన్న ఆయిల్, గ్యాస్ నిల్వలపై కన్నేసే ఇతర దేశాలతో చైనా గొడవపడుతోందని అమెరికా గతంలో ఆరోపించింది. దక్షిణ చైనా సముద్రంలో ఉన్న ఆయిల్, గ్యాస్ నిల్వల్లో 90 శాతం తనదేననేది చైనా వాదన. దీనిపై బ్రూనై, ఫిలిప్పీన్స్, మలేసియా, తైవాన్, వియత్నాం దేశాలు అభ్యంతరం చెబుతున్నాయి. తమకూ ఈ సహజ నిల్వలపై హక్కు ఉందంటున్నాయి. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతంలో చైనా తన ప్రాదేశిక ఆశయాల కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్ దేశాలతో సత్సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నాయని స్టీవెన్ పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ('గ్లోబల్ కామన్స్‌లో ఇది కూడా ఒక భాగమే' ) -
అమెరికాకు బదులిచ్చేందుకు సిద్ధమవుతున్న చైనా!
బీజింగ్: దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా గత కొన్ని రోజులుగా క్రియాశీలక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా యుద్ధ విన్యాసాలు చేపడుతూ గట్టి హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యానికి దీటుగా బదులిచ్చేందుకు చైనా పీపుల్స్ లెబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సైతం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టైప్ 075 అనే ఆంఫీబియస్ అసాల్ట్(ఉభయచర) షిప్పులను రంగంలోకి దించినట్లు సమాచారం. దాదాపు 40 వేల టన్నుల బరువైన టైప్ 075 షిప్ 900 బలగాలను తరలించగల సామర్థ్యం ఉన్న విమాన వాహక నౌక అని, దాదాపు 30 హెలికాప్టర్లను ఒకేసారి మోసుకెళ్లగలిగే శక్తిసామర్థ్యాలు దీని సొంతమని ఇటీవల విడుదలైన సాటిలైట్ ఫొటోగ్రాఫ్‌లను అధ్యయనం చేసిన వెస్ట్రన్ మిలిటరీ నిపుణులు పేర్కొన్నారు. అంతేగాక యూఎస్ ఎఫ్-35బీ మాదిరి షార్ట్ టేకాఫ్ అండ్ వర్టికల్ లాండింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను తయారు చేసే పనిలో చైనా నిమగ్నమై ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. (భారత్-అమెరికా సంయుక్త విన్యాసాలు) కాగా గతేడాది సెప్టెంబరులో తొలి టైప్ 075 షిప్‌ను, ఈ ఏడాది ఏప్రిల్‌లో రెండో షిప్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడో ఆంఫీబియస్ షిప్ నిర్మాణంలో ఉందని, మొత్తంగా ఇలాంటివి ఏడు షిప్పులు తయారు చేయనున్నట్లు చైనా మిలిటరీ అధికారిక ప్రెస్మీట్లో వెల్లడించింది. వీటి ద్వారా ఇదిలా ఉండగా.. దక్షిణ చైనా సముద్రంపై గుత్తాధిపత్యం సాధించేందుకు డ్రాగన్ అన్ని విధాలుగా సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యర్థి బలగాలకు దీటుగా బదులిచ్చేందుకు నావికా దళ బలగాలను పెద్ద ఎత్తున పెంచుకుంటూ పోతున్నట్లు తెలుస్తోంది. చైనాకు 2017లో దాదాపు 10 వేల మెరైన్లు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 25 నుంచి 35 వేలకు చేరిందని అమెరికా, జపాన్ మిలిటరీ ఈ మేరకు అంచనా వేశాయి. ఇక దక్షిణ చైనా సముద్రం చుట్టుపక్కల ఉన్న ఆయిల్, గ్యాస్ నిల్వలపై కన్నేసిన డ్రాగన్ పొరుగు దేశాలను బెదిరింపులకు గురిచేస్తోందని అమెరికా మండిపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ చైనా సముద్రంలో ఏ దేశాల హక్కులను డ్రాగన్ హరించినా ఆయా దేశాలకు ట్రంప్ సర్కారు అండగా ఉంటుందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో స్పష్టం చేశారు. ఈ క్రమంలో భారత్-చైనాల మధ్య సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత యుద్ధనౌకలతో కలిసి సంయుక్త విన్యాసాలు చేపట్టేందుకు అమెరికా నౌకాదళం సిద్ధమైంది. ఇందులో భాగంగా సోమవారం యుద్ధనౌక యూఎస్ నిమిజ్ అండమాన్, నికోబార్ దీవుల సమీపంలో హిందూ మహాసముద్రానికి చేరుకుంది. అండమాన్ నికోబార్ కమాండ్ (ఏఎన్సీ)తో పాటు తూర్పు నావల్ కమాండ్ (ఏఎన్సీ)కు చెందిన నౌకలు ఈ విన్యాసాల్లో పాలుపంచుకున్నాయి. -
'గ్లోబల్ కామన్స్‌లో ఇది కూడా ఒక భాగమే'
ఢిల్లీ : దక్షిణ చైనా సముద్రంపై అమెరికా -చైనా మాటల యుద్ధం నెలకొన్న తరుణంలో వ్యూహాత్మక జలమార్గం గ్లోబల్ కామన్స్‌లో భాగమని భారత్ ప్రకటించింది. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా నావిగేషన్ , చట్టబద్ధమైన వాణిజ్యం కోసం భారత్ నిలుస్తుందని పేర్కొంది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఇదివరకు దక్షిణ చైనా సముద్రం గుండా నావిగేషన్ స్వేచ్ఛ కోసం పోరాడతామని ఆస్ట్రేలియా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఆస్ట్రేలియా చాలా స్థిరమైన స్థానాన్ని అవలంభిస్తుందంటూ ప్రధాని స్కాట్ మోరిసన్ పేర్కొన్నారు. దక్షిణ చైనా సముద్రానికి సంబంధించి చైనా నిబంధనలు ఉల్లంఘించిందని నమ్మే దేశాలకు మద్దతిస్తామని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో ప్రకటన అనంతరం ఆస్ట్రేలియా, భారత్ నుంచి ఈ ప్రకటనలు వచ్చాయి. సముద్ర సామ్రాజ్యాన్ని సృష్టించేందుకు చైనా ప్రయత్నిస్తోందని అమెరికా ఆరోపించించిన సంగతి తెలిసిందే. దక్షిణ చైనా సముద్రానికి సంబంధించి చైనా చేసిన వాదనలను చట్టవిరుద్ధమని జూలై 13న పాంపియో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే కరోనా వైరస్ నేపథ్యంలో రెండు ప్రపంచ శక్తిమంతమైన దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న తరుణంలో జలమార్గంలోనూ ఇబ్బందులను కలిగించడానికి అమెరికా ప్రయత్నిస్తోందని బీజింగ్ ఆరోపించింది. (ఆ ఆరోపణలు అర్థం లేనివి : చైనా) దక్షిణ చైనా సముద్రం చుట్టుపక్కల ఉన్న ఆయిల్, గ్యాస్ నిల్వలపై కన్నేసే ఇతర దేశాలతో చైనా గొడవపడుతోందని అమెరికా గతంలో ఆరోపించింది. దక్షిణ చైనా సముద్రంలో ఉన్న ఆయిల్, గ్యాస్ నిల్వల్లో 90 శాతం తనదేననేది చైనా వాదన. దీనిపై బ్రూనై, ఫిలిప్పీన్స్, మలేసియా, తైవాన్, వియత్నాం దేశాలు అభ్యంతరం చెబుతున్నాయి. తమకూ ఈ సహజ నిల్వలపై హక్కు ఉందంటున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా సంక్షోభం నెలకొన్న సమయంలో చైనా ఆ ప్రాంతంపై అధిపత్యం కోసం ప్రయత్నాలు ముమ్మురం చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతంలో చైనా తన ప్రాదేశిక ఆశయాల కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించిన సంగతి తెలిసిందే (దక్షిణ చైనా సముద్ర వివాదం.. స్పందించిన చైనా) -
చైనాకు షాక్: భారత్-అమెరికా యుద్ధ విన్యాసాలు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్-చైనాల మధ్య సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత యుద్ధనౌకలతో కలిసి సంయుక్త విన్యాసాలు చేపట్టేందుకు అమెరికా నౌకాదళానికి చెందిన యుద్ధనౌక యూఎస్ నిమిజ్ అండమాన్, నికోబార్ దీవుల సమీపంలో హిందూ మహాసముద్రానికి చేరుకుంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో దూకుడు పెంచిన డ్రాగన్‌కు ఈ పరిణామం దీటైన సంకేతం పంపుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. లక్ష టన్నుల బరువుండే అమెరికా నిమిజ్ నౌక 90 యుద్ధ విమానాలను మోయగల సామర్ధ్యం కలిగిఉంది. అండమాన్ నికోబార్ దీవుల్లో జరుగుతున్న విన్యాసాల్లో సబ్మెరైన్లు సహా పలు భారత యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి. అండమాన్ నికోబార్ కమాండ్ (ఏఎన్సీ)తో పాటు తూర్పు నావల్ కమాండ్ (ఏఎన్సీ)కు చెందిన నౌకలు విన్యాసాల్లో పాలుపంచుకుంటున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో వ్మూహాత్మక జలాలపై ప్రపంచ దేశాలన్నింటికీ ఉమ్మడి భాగస్వామ్యం ఉంటుందని భారత్ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ విన్యాసాలు చోటుచేసుకోవడం గమనార్హం. ఈ ప్రాంతంలో శాంతి సుస్ధిరతలను భారత్ కోరుకుంటుందని, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా దక్షిణ చైనా సముద్రంలో స్వేఛ్చా నావిగేషన్, చట్టబద్ధ వాణిజ్యానికి కట్టుబడి ఉన్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. దక్షిణ చైనా సముద్రంలో ఏ దేశాల హక్కులను డ్రాగన్ హరించినా ఆయా దేశాలకు ట్రంప్ యంత్రాంగం అండగా ఉంటుందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో స్పష్టం చేసిన క్రమంలో భారత్ ఈ వ్యాఖ్యలు చేసింది. గత కొద్ది రోజులుగా ట్రంప్ యంత్రాంగం దక్షిణ చైనా సముద్రంపై తన వైఖరిని కఠినతరం చేసింది. ఆ ప్రాంతంలో ఇతర దేశాల ఆందోళనలను విస్మరిస్తూ దక్షిణ చైనా ప్రాంతంలో మారిటైమ్ సామ్రాజ్యం నిర్మించేందుకు చైనా ప్రయత్నిస్తోందని అమెరికా ఆరోపించింది. చదవండి: అగ్ర రాజ్యాల మధ్య వ్యాక్సిన్ వార్ -
‘అమెరికా జోక్యం అనవసరం’
బీజింగ్: సరిహద్దు దేశాలతో కయ్యానికి కాలు దువ్వే చైనాకు షాక్ ఇవ్వడానికి అమెరికా దక్షిణ చైనా సముద్రంలోకి యుద్ధ నౌకలను తరలించిన సంగతి తెలిసిందే. దీనిపై చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో దక్షిణ చైనా విషయంలో అమెరికా చేస్తోన్న ఆరోపణలు పూర్తిగా అన్యాయమైనవని డ్రాగన్ దేశం పేర్కొంది. దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనా పొరుగుదేశాలను బెదిరిస్తోందని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలను కూడా చైనా ఖండించింది. ఈ మేరకు ‘దక్షిణ చైనా సముద్రం విషయంలో అమెరికా కల్పించుకోవడం ఆమోదయోగ్యంగా లేదు. ఈ వివాదంలో అమెరికాకు సంబంధం లేదు. అలాంటప్పుడు ఈ అంశంలో తలదూర్చడం సమంజసం కాదు’ అంటూ అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేకాక స్థిరత్వం కాపాడాలనే నెపంతో అమెరికా ఈ అంశంలో ఉద్రిక్తతలను రేకెత్తిస్తుంది అని చైనా విమర్శించింది. (అందరూ కరోనా బిజీలో ఉంటే.. చైనా మాత్రం) దక్షిణ చైనా సముద్రం చుట్టుపక్కల ఉన్న ఆయిల్, గ్యాస్ నిల్వలపై కన్నేసే ఇతర దేశాలతో చైనా గొడవపడుతోందని అమెరికా గతంలో ఆరోపించింది. దక్షిణ చైనా సముద్రంలో ఉన్న ఆయిల్, గ్యాస్ నిల్వల్లో 90 శాతం తనదేననేది చైనా వాదన. దీనిపై బ్రూనై, ఫిలిప్పీన్స్, మలేసియా, తైవాన్, వియత్నాం దేశాలు అభ్యంతరం చెబుతున్నాయి. తమకూ ఈ సహజ నిల్వలపై హక్కు ఉందంటున్నాయి. ఈ క్రమంలో చైనా దక్షిణ చైనా సముద్రంలో యుద్ధ విన్యాసాలకు ప్లాన్ చేసుకుంది. డ్రాగన్ కంట్రీని కట్టడి చేసేందుకు అమెరికా యుద్ధ విన్యాసాలను నిర్వహించడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ‘దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో శాంతిభద్రతలకు కట్టుబడి ఉంటామని మా భాగస్వాములకు తెలియజేసేందుకే ఈ విన్యాసాలు చేపడుతున్నాం’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, తాము చేయబోయే యుద్ధ విన్యాసాలకు, చైనా యుద్ధ విన్యాసాలు కారణం కాదని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
చైనా సముద్రంలోకి అమెరికా యుద్ధనౌకలు
వాషింగ్టన్: దక్షిణ చైనా సముద్రం(ఎస్సీఎస్)లోకి అమెరికా యుద్ధ విన్యాసాలను నిర్వహించనుంది. ఈ మేరకు రెండు విమానవాహక నౌకలతో పాటు నాలుగు యుద్ధ నౌకలు శనివారానికి ఎస్సీఎస్లో ప్రవేశిస్తాయని వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో వెల్లడించింది. (జూనియర్ ట్రంప్ గర్ల్‌ఫ్రెండ్‌కు కరోనా..) ఎస్సీఎస్లోని పారాసెల్ దీవుల్లో చైనా యుద్ధ విన్యాసాలను ప్లాన్ చేసుకున్న సమయంలోనే అమెరికా కూడా విన్యాసాలకు దిగడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికాకు చెందిన యూఎస్ఎస్ రోనాల్డ్ రీగన్, యూఎస్ఎస్ నిమిట్జ్ విమాన వాహక నౌకలు దక్షిణ చైనా సముద్రంలో యుద్ధ విన్యాసాల్లో పాల్గొంటాయని అడ్మిరల్ జార్జ్ వికాఫ్ పేర్కొన్నారు. (విజృంభిస్తున్న కరోనా డీ614జీ స్టెయిన్) ‘దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో శాంతిభద్రతలకు కట్టుబడి ఉంటామని మా భాగస్వాములకు తెలియజేసేందుకే ఈ విన్యాసాలు చేపడుతున్నాం’ అని ఆయన చెప్పారు. అయితే, తాము చేయబోయే యుద్ధ విన్యాసాలకు, చైనా యుద్ధ విన్యాసాలు కారణం కాదన్నారు. పారాసెల్ ద్వీపంపై వియత్నాంతో చైనా కయ్యానికి కాలు దువ్వుతోంది. ఆ దీవి తమదేనని వాదిస్తోంది. వివాదాస్పద ప్రాంతంలో యుద్ధ విన్యాసాలపై వియత్నాం, ఫిలిప్పీన్స్, చైనాను తప్పుబట్టాయి. ఇలాంటి వ్యవహారశైలి పొరుగు దేశాలతో చైనాకు ఉన్న సంబంధాలపై ప్రభావం చూపుతుందన్నాయి. దక్షిణ చైనా సముద్రం చుట్టుపక్కల ఉన్న ఆయిల్, గ్యాస్ నిల్వలపై కన్నేసే ఇతర దేశాలతో చైనా గొడవపడుతోందని అమెరికా గతంలో ఆరోపించింది. దక్షిణ చైనా సముద్రంలో ఉన్న ఆయిల్, గ్యాస్ నిల్వల్లో 90 శాతం తనదేననేది చైనా వాదన. దీనిపై బ్రూనై, ఫిలిప్పీన్స్, మలేసియా, తైవాన్, వియత్నాం దేశాలు అభ్యంతరం చెబుతున్నాయి. తమకూ ఈ సహజ నిల్వలపై హక్కు ఉందంటున్నాయి. -
ఆ ఆరోపణలు అర్థం లేనివి : చైనా
బీజింగ్ : దక్షిణ చైనా సముద్రంపై పట్టు కోసం చైనా కరోనా వైరస్ వ్యాప్తిని ఉపయోగిస్తుందనే వార్తలను ఆ దేశం కొట్టిపారేసింది. ఆ ఆరోపణలు పూర్తిగా అర్థం లేనివని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తెలిపారు. ఆదివారం రోజున ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దక్షిణ చైనా సముద్రంలో సామ్రాజ్యాన్ని విస్తరించడం కోసం.. చైనా కరోనా వ్యాప్తిని విస్తరిస్తుందనడంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. వైరస్ నిరోధానికి సంబంధించి చైనా.. ఆగ్నేయ ఆసియా దేశాలతో కలిసి పనిచేస్తుందని చెప్పారు. అయితే కొందరు మాత్రం చైనాపై దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిప్డారు. మిలటరీ విమానాలు మోహరించడం, సముద్రంలో గస్తీ నిర్వహించడంతో అస్థిరత సృష్టించేందకు కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయని అమెరికా దాని మిత్రదేశాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చైనా, ఆగ్నేయ ఆసియా దేశాల మధ్య వివాదాలు రేకెత్తించడం కోసమే ఇటువంటి నీచమైన ఆలోచనలు చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, దక్షిణ చైనా సముద్రంపై పట్టు కోసం చైనా చాలా కాలంగా ప్రయత్నిస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో పెద్ద మొత్తంలో చమురు, సహజవాయువు నిక్షేపాలు ఉన్నాయని అంతా భావిస్తున్నారు. ఈ వివాదాస్పద ప్రాంతం నౌకల రవాణాకు కీలకమైనది కూడా. ఈ ప్రాంతం మీద అధిపత్యం కోసం చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్, తైవాన్, బ్రూనై దేశాల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా సంక్షోభం నెలకొన్న సమయంలో చైనా ఆ ప్రాంతంపై అధిపత్యం కోసం ప్రయత్నాలు ముమ్మురం చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతంలో చైనా తన ప్రాదేశిక ఆశయాల కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించిన సంగతి తెలిసిందే.(చదవండి : అమెరికాలో రాజకీయ వైరస్ వ్యాపిస్తోంది) -
భారత్‌పై చైనా దుందుడుకు వైఖరి
వాషింగ్టన్: భారత్ సహా సరిహద్దు దేశాలపై చైనా కవ్వింపు చర్యలకు దిగుతోందని అమెరికా తీవ్రంగా విమర్శించింది. బలవంతంగా సైనిక చర్యలు చేపడుతూ మిలటరీని మోహరిస్తూ దురుసుగా ప్రవర్తిస్తోందని గురువారం అధ్యక్షభవనం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఎల్లో సీ, తూర్పు, దక్షిణ చైనా సముద్రాలు, తైవాన్ జలసంధి, భారత్ చైనా సరిహద్దుల్లో చైనా చేస్తున్న పనులకు, చెబుతున్న మాటలకి పొంతన లేదని ఆ నివేదికలో అగ్రరాజ్యం ధ్వజమెత్తింది. ‘చైనా పట్ల అమెరికా వ్యూహాత్మక ధోరణి’పేరుతో రచిం చిన ఈ నివేదికను అమెరికా ప్రభుత్వం కాంగ్రెస్‌కు సమర్పించింది. చైనాను ఎదుర్కోవడానికి వివిధ దేశాలు, సంస్థలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆ నివేదిక అభిప్రాయపడింది. బలమైన శక్తిగా అవతరిస్తోన్న చైనా తమ ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిని గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తోందని మండిపడింది. చైనా కమ్యూనిస్టు పార్టీ పొరుగు దేశాలపై దురుసుగా ప్రవర్తిస్తోందని విమర్శించింది. నేషనల్ సైబర్ సెక్యూరిటీ చట్టాన్ని తీసుకువచ్చి ప్రపంచ దేశాల సమాచారాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చైనా చూస్తోందని, ఈ చట్టం ద్వారా అందరి డేటాని తస్కరించే పనిలో ఉందని పేర్కొంది. ఇటీవలి కాలంలో భారత్, చైనా సరిహద్దుల్లో సైనికుల మధ్య ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో అధ్యక్షభ వనం ఈ నివేదికను కాంగ్రెస్‌కి సమర్పించడం గమనార్హం. భారత్‌తో చర్చలు జరపాలి దక్షిణ చైనా సముద్రంలో చైనా చేపడుతున్న ఆపరేషన్లకు అదుపులేకుండా పోయిందని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పదవి నుంచి వైదొలగనున్న అలీస్ వెల్స్ అన్నారు. సరిహద్దు దేశాలపై కవ్వింపు చర్యల కు దిగుతూ య« దాతథ స్థితిని, సరిహద్దుల్ని మార్చడానికి చైనా ప్రయత్నిస్తోందని ఆమె మండిపడ్డారు. చైనా ఇప్పటికైనా ఇలాంటి చర్యల్ని కట్టిపెట్టిæ భారత్‌తో చర్చలు జరపాలని అన్నారు. చైనా భారత్‌తో చర్చలు జరిపి సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. మిషిగాన్‌లో కరోనా ఫేస్ షీల్డ్ ధరించిన ట్రంప్ -
అందరూ కరోనా బిజీలో ఉంటే.. చైనా మాత్రం
బీజింగ్: ప్రపంచ దేశాలు కోవిడ్-19 నివారణ చర్యలతో తీరికలేకుండా ఉన్న వేళ వైరస్ పుట్టుకకు కేంద్ర స్థానమైన చైనా మాత్రం దక్షిణ చైనా సముద్రంపై పట్టుసాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతంలో చైనా తన ప్రాదేశిక ఆశయాల కోసం ప్రయత్నిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆరోపించారు. దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్ మలేషియా, బ్రూనైతో ఉద్రిక్తతలకు కారణమైన ప్రాంతంలో డ్రాగన్ దేశం పట్టు పెంచుకుంటోందని పాంపియో పేర్కొన్నారు. (చదవండి: భారతీయులకు కోవిడ్-19ను ఎదుర్కొనే సామర్థ్యం అధికం..) కరోనా పరిస్థితులపై ఆగ్నేయాసియా దేశాల మంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాంపియో ఈ ఆరోపణలు చేశారు. వివాదంలో ఉన్న ప్రాంతంలో మిలటరీ బలగాలు, యుద్ధ నౌకలను మోహరించి చైనా పొరుగు దేశాలను భయపెట్టే యత్నం చేస్తోందని విమర్శించారు. తద్వారా చమురు, సహజయవాయువు ప్రాజెక్టుల అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తోందని అన్నారు. కాగా, పాంపియో ఆరోపణల నేపథ్యంలో యూఎస్ యుద్ధనౌక దక్షిణ చైనా సముద్రంలోని తైవాన్ జలసంధి గుండా నిఘా పెట్టింది. మరోవైపు దక్షిణ చైనా సముద్రం మొత్తాన్ని, ఆ చుట్టుపక్కల ఉన్న దీవులు, దిబ్బల లెక్క తీస్తున్నామని చైనా తమ చర్యను సమర్థించుకుంది. కాగా, దక్షిణ చైనా సముద్రంలో దాదాపు ఎవరూ నివసించని దీవుల సముదాయాలు పరాసెల్స్, స్ప్రాట్లిస్ దీవులపై సార్వభౌమాధికారం ఎవరిదనే విషయంలో చైనా, ఇతర దేశాల మధ్య సుదీర్ఘకాలంగా వివాదం నెలకొంది. ఈ రెండు సముదాయాల్లోని అత్యధిక భూభాగం తమదేనని చైనా వాదిస్తోంది. దీనిపై తమకు వందల ఏళ్లుగా హక్కులు ఉన్నాయని చెబుతోంది. (చదవండి: కరోనా: అదిరిందయ్యా ఐడియా) -
సముద్ర గర్భంలో డ్రాగన్ వాల్
బీజింగ్ : దక్షిణ చైనా సముద్రంలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నీటిగర్భంలో గ్రేట్ వాల్‌ను నిర్మిస్తోంది. ఈ ప్రాంతంలో సముద్రగర్భ యుద్ధతంత్రాల్లో ఆధిపత్యం చెలాయించేందుకు డ్రాగన్ భారీ స్కెచ్‌ను రూపొందిస్తోంది. ఈ క్రమంలో దక్షిణ చైనా సముద్రంలో యుద్ధనౌకల నెట్వర్క్, సబ్‌సర్ఫేస్ సెన్సార్లను సంసిద్ధం చేస్తోంది. వివాదాస్పద ప్రాంతంలో విదేశీ నౌకల కదలికలను పసిగట్టేందుకూ వ్యూహాత్మకంగా చైనా అడుగులువేస్తోంది. మరోవైపు ఈ ప్రాంతంలో చైనా సైన్యం చర్యలకు చెక్‌పెట్టేందుకు దక్షిణ చైనా సముద్రంలో అమెరికా పలు మిషన్స్‌ను చేపట్టింది. అమెరికాకు దీటుగా అగ్రరాజ్యానికి సవాల్ విసురతూ సైనిక పాటవాన్ని చైనా సంతరించుకోవడంతో దక్షిణ చైనా సముద్రం సాయుధ వివాదాలకు, అలజడులకు కేంద్ర బిందువు కానుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
సౌత్ చైనా సీపై డ్రాగన్ డేగ కన్ను
బీజింగ్: వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంపై చైనా మరింత పట్టుబిగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. సముద్రాన్ని 24 గంటల పాటు పరిశీలించేందుకు ప్రత్యేక శాటిలైట్ వ్యవస్థను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సౌత్ చైనా సీలోని చైనాకు సంబంధించిన హైనాన ద్వీపం కేంద్రంతా.. రిమోట్ శాటిలైట్ సెన్సింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చైనా అధికారలు ప్రకటించారు. శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ మిషన్ 2019లో మొదలు పెడుతున్నట్లు శాన్యన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ డైరెక్టర యాంగ్ తియాన్‌లాంగ్ తెలిపారు. ఈ మిషన్‌లో భాగంగా సౌత్ చైనా సీపై మూడు మొదట ఆప్టికల్ శాటిలైట్స్ ప్రయోగిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇదిలాఉండగా.. 2021 నాటికల్లా.. ఇకమరో మూడు ఆప్టికల్ శాటిలైట్లు, రెండు హైపర్స్పెక్ట్రాల్ శాటిలైట్లు, మరో రెండు ఎస్ఏఆర్ రకానికి చెందిన ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నట్లు చైనా అధికారులు తెలిపారు. ఈ ఉపగ్రహ వ్యవస్థ మొత్తం దక్షిణ చైనా సముద్రాన్ని నితరంతం డేగ కళ్లతో కాపు కాస్తుంటాయని చెప్పారు. -
దక్షిణ చైనా సముద్రంపై చైనా, వియత్నాం రాజీ
హనోయ్: దక్షిణ చైనా సముద్రం వివాదం విషయంలో చైనా, వియత్నాం రాజీకొచ్చాయి. ఆ విషయంలో వెనక్కి తగ్గేందుకు ఇరు దేశాలు సోమవారం అంగీకరించాయి. దాదాపు 5 ట్రిలియన్ డాలర్ల నౌకా రవాణా వాణిజ్యం జరిగే ఈ దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనా, వియత్నాంతో పాటు బ్రూనై, తైవాన్, ఫిలిప్పీన్స్ మధ్య ఎంతో కాలంగా వివాదం నలుగుతోంది. ఈ సముద్రంలో చైనా ఓ అడుగు ముందుకేసి మిలిటరీ కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా ఏకంగా కృత్రిమ ద్వీపాలను నిర్మించింది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హనోయ్ పర్యటన సందర్భంగా ఈ సముద్రం విషయంలో శాంతి నెలకొల్పేందుకు కృషి చేస్తామని రెండు దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో అంగీకరించాయి. ‘సమస్యలు మరింత జఠిలం అయ్యే ఎటువంటి చర్యలు కూడా తీసుకోం. తూర్పు సముద్రంలో శాంతి సామరస్యాన్ని పెంపొందిస్తాం’అని పేర్కొన్నాయి. వియత్నాంలోని వివాదాస్పద కోస్తా తీర ప్రాంతంలో చైనా చేపట్టిన చమురు వెలికితీత ప్రాజెక్టును ఈ ఏడాది ప్రారంభంలో వియత్నాం ఆపేసింది. -
మధ్యవర్తిత్వం చేస్తా: ట్రంప్
మనీలా: దక్షిణ చైనా సముద్రంపై మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. వియత్నాం అధ్యక్షుడు త్రాన్ దై క్వాంగ్‌తో ద్వైపాక్షిక భేటీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తానొక మంచి మధ్యవర్తినని, సంబంధిత పక్షాలు కోరితే మధ్యవర్తిత్వానికి తనకేం అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఏర్పాటుచేస్తున్న సైనిక స్థావరాలు, కృత్రిమ ద్వీపాల్ని గత కొంతకాలంగా వియత్నాం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ వివాదంలో మొదటి నుంచి వియత్నాంకు అమెరికా మద్దతుగా ఉంది. వియత్నాంతో పాటు ఫిలిప్పీన్స్, మలేసియా, బ్రూనై, తైవాన్లతో కూడా దక్షిణ చైనా సముద్రం విషయమై చైనాకు గొడవలున్నాయి. పరిష్కరించుకుంటాం: వియత్నాం మరోవైపు ట్రంప్ వియత్నాం పర్యటన ముగించుకుని ఫిలిప్పీన్స్ చేరగానే చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వియత్నాంలో అడుగుపెట్టారు. ఆయనకు వియత్నాం ఘనస్వాగతం పలికింది. జిన్‌పింగ్ పర్యటనలో భాగంగా.. ఇరు దేశాధినేతలు ఆర్థిక సంబంధాల్ని విస్తృతం చేసుకోవడంతో పాటు దక్షిణ చైనా సముద్రంపై కొనసాగుతున్న వివాదం పరిష్కారం దిశగా చర్చలు జరపనున్నారు. శాంతియుత మార్గంలో దక్షిణ చైనా సముద్రంపై కొనసాగుతున్న విభేదాల్ని పరిష్కరించుకుంటామని వియత్నాం అధ్యక్షుడు క్వాంగ్ పేర్కొన్నారు. కిమ్ పొట్టి, లావు అని అన్నానా?: ట్రంప్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య మరోసారి మాటల యుద్ధం కొనసాగింది. కిమ్ తనను ముసలివాడు అనడంపై ట్విటర్లో ట్రంప్ మండిపడ్డారు. ‘నన్ను ముసలివాడు అంటూ కిమ్ ఎందుకు అవమానిస్తున్నాడు. నేనెప్పుడైనా అతన్ని పొట్టి, లావు అన్నానా?’ అని ఎగతాళిగా ట్వీట్ చేశారు. కిమ్‌కు స్నేహితుడిగా ఉండేందుకు తాను ఎంతగానో ప్రయత్నిస్తున్నానని, ఏదొక రోజు అది జరగవచ్చేమో? అని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.