Ship Split In 2 By Storm In South China Sea Video Goes Viral - Sakshi
Sakshi News home page

తుపాను కారణంగా రెండుగా ముక్కలైన ఓడ...12 మంది మృతి

Published Mon, Jul 4 2022 5:01 PM | Last Updated on Mon, Jul 4 2022 7:26 PM

Ship Snapped In 2 By Storm In South China Sea Video Viral - Sakshi

బీజింగ్‌: దక్షిణ చైనా సముద్రంలో ఓడ ధ్వంసమై మునిగిపోయింది. ఈ విషయాన్ని చైనా అధికారులు వెల్లడించారు. ఈ నౌక హాకాంగ్‌కు నైరుతి దిశలో 160 నాటికల్ మైళ్లు (296 కిలోమీటర్లు) దూరంలో రెండుగా ముక్కలై మునిగిపోయిందని తెలిపారు. ఈ దుర్ఘటనలో సుమారు 30 మంది సిబ్బంది గల్లంతైయ్యారని, ఈ ఘటన దక్షిణ చైనా సముద్రం మధ్య భాగంలో ఏర్పడిన చాబా తుపాను కారణంగా చోటు చేసుకుందని పేర్కొన్నారు.  హాంకాంగ్‌ కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం ఏడు గంటలకు ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ తుపాను గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో తీరాన్ని తాకింది. ఈ నౌక మునిగిపోయిన ప్రదేశానికి 50 నాటికల్‌ మైళ్ల దూరంలో 12 మంది మృతదేహాలను రెస్కూ సిబ్బంది గుర్తించారు. అదీగాక అక్కడ కఠినమైన వాతావరణ పరిస్థితులు, తీవ్ర గాలులు కారణంగా రెస్కూ ఆపరేషన్‌ చేపట్టడం కష్ట తరంగా మారింది. ఈ ఘటన జరిగిన వెంటనే శనివారం ముగ్గురిని రక్షించారు. మరొకరిని సోమవారం తెల్లవారుజామున రక్షించారు. ఈ మేరకు ఆ ప్రాంతంలో సుమారు ఏడు విమానాలు, దాదాపు 249 పడవలు, 498 ఫిషింగ్ ఓడలు గల్లంతైన వారి ఆచూకి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెస్కూ ఆపరేషన్‌కి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: పాకిస్తాన్‌లో ఘోరం.. లోయలో పడిన బస్సు..19 మంది మృతి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement