సాధారణంగా గర్ల్‌ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేసేటప్పుడూ వారి స్థాయిని బట్టి గోల్డ్ లేదా డైమండ్ రింగ్‌తో చేస్తారు. పోనీ మరీ మిడిల్‌క్లాస్ అయితే రోల్డ్ గోల్డ్ లేదా స్టీలు రింగ్‌తో ప్రపోజ్ చేస్తారు. అలా ఇలా కాకుండా ఏకంగా సిమ్మెంట్ రింగ్‌తో ప్రపోజ్ చేసి పెద్ద షాక్ ఇచ్చాడు ఓ వ్యక్తి. వాట్ సిమ్మెంట్ రింగా..? అని అందరూ కంగుతిన్నారు. అస్సలు అలాంటి రింగు ఉంటుందా..అని అనుకోకుండి.
ఎందుకంటే..
చైనాకు చెందిన 36 ఏళ్ల గ్యూయు తన గర్లఫ్రెండ్‌కి సిమ్మెంట్ రింగ్‌తో ప్రపోజ్ చేశాడు. ఈ రింగే ఇవ్వడానికి కారణం..గ్యూయూ నిర్మాణాలకు సంబంధించి వాటర్ ప్రూఫింగ్ నాణ్యత కోసం సరికొత్త సిలికాన్ అయాన్ పదార్థాన్ని కనుగొన్నాడు. ఈ ఆవిష్కరణ బీజింగ్ 2022 ఒలింపిక్స్ అరెనాలో ఉపయోగించాడరు. అంతేగాదు ఈ ఆవిష్కరణకు గానూ 2016లో సింఘువా కిహాంగ్ స్కాలర్‌షిప్ గోల్డ్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డు వేడుకలోనే అతడు తన గర్ల్‌ఫ్రెండ్‌కి తాను తయారు చేసిన ఆవిష్కరణతో చేసిన సిమెంట్ రింగుతో ప్రపోజ్ చేశాడు.
ప్రస్తుతం వారిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇప్పుడామె అతడి భార్య కూడా. నాటి ఆ వీడియో ప్రస్తుతం చైనీస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతేకాదండోయ్ గ్యూయూ తన వందేళ్ల ప్రేమ ఎన్నటికి చెక్కు చెదరదని ఈ ఉంగరం సూచిస్తుందని చెబుతున్నాడు.
నిజంగా గ్రేట్ తన ఆవిష్కరణతోనే గర్లఫ్రెండ్‌కి రింగ్ అందించడం అనేది మర్చిపోలేని, వెలకట్టలేని గొప్ప గిఫ్ట్. అయితే నెటిజన్లు మాత్రం బంగారం లేదా డైమండ్ కాకపోయిన ఫ్యాన్సీ ఉంగరమైన పెట్టోచ్చు గదా మరీ ఇంత చీప్‌గానా? అని మండిపడుతూ పోస్టులు పెట్టారు. కాగా, 2017లో,గ్యూయు గార్డెక్స్‌ను స్థాపించారు. అతని ఆవిష్కరణని నేషనల్ స్పీడ్ స్కేటింగ్ ఓవల్‌లో ఉపయోగించారు. దీన్ని ఐస్ రిబ్బన్ అని కూడా పిలుస్తారు. కేవలం దీన్ని బీజింగ్ 2022 వింటర్ ఒలింపిక్స్ కోసం నిర్మించారు.
(చదవండి: స్కై వాటర్: సూర్యరశ్మి, గాలితో వాటర్..!)
Comments
Please login to add a commentAdd a comment