ring
-
ప్రపంచంలో ఇలాంటి రింగ్ మరోకటి లేదు!.. ఎందుకంటే?
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా.. వస్తువులు, ఎలక్ట్రానిక్స్ కూడా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో రోగ్బిడ్ (Rogbid) అనేక సంస్థ ఓ ప్రత్యేకమైన 'ఎస్ఆర్08 అల్ట్రా' పేరుతో స్మార్ట్ రింగ్ రూపొందించింది. ఇది ఇప్పటికి మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని రింగులకంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.రోగ్బిడ్ రూపొందించిన స్మార్ట్ రింగ్ ఒక డిస్ప్లే కూడా కలిగి ఉండటం గమనార్హం. ఇలాంటి డిస్ప్లే కలిగిన రింగ్ మరొకటి లేదు అని సమాచారం. ఇది చూడటానికి ఆకర్షణీయంగా ఉండటం మాత్రమే కాకుండా.. వివిధ సైజుల్లో కూడా లభిస్తుంది. దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే.. 20 రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది.రోగ్బిడ్ ఎస్ఆర్08 అల్ట్రా స్మార్ట్ రింగ్ టైటానియం అల్లాయ్ కేసింగ్ కూడా పొందుతుంది. కాబట్టి ఇది చాలా దృఢంగా ఉంటుంది. దీని గురించి చెప్పుకోవాల్సిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇది వాటర్ ప్రూఫ్ రేటింగ్ పొందింది. కాబట్టి దీనిని 50 మీటర్ల లోతున్న నీటిలో వేసినా మళ్ళీ పనిచేస్తుంది.8.0 మీమీ వెడల్పు, 2.5 మిమీ మన్దమ్ కలిగిన ఈ రింగ్ బరువు 4 గ్రాములు మాత్రమే. ఇది ప్రత్యేక యాప్ ద్వారా ఐఓఎస్, ఆండ్రాయిడ్ వంటి వాటికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రింగులోని ఓఎల్ఈడీ డిస్ప్లేను ట్యాప్ చేస్తే టైమ్, స్టెప్ కౌంట్, హార్ట్ బీట్ రేట్, స్లీప్ ట్రాకింగ్ వంటి వాటికి సంబంధించిన సమాచారాన్ని చూపిస్తుంది.ఇదీ చదవండి: మనిషిలా తడబడిన రోబో - వీడియో వైరల్గోల్డ్, సిల్వర్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ స్మార్ట్ రింగ్ ధర 89.99 డాలర్లు (సుమారు రూ. 7600), ఇది లిమిటెడ్ ఎడిషన్ న్యూఇయర్ గిఫ్ట్ బాక్స్‌లో వస్తుంది. ఈ రింగ్ కొనుగోలు చేయడానికి కంపెనీ అధికారిక వెబ్సైట్ సందర్సించాలి. ఈ రింగ్ కొనుగోలుపైన సంవత్సరం వారంటీ.. ఉచిత రీప్లేస్మెంట్ వంటివి కూడా పొందవచ్చని కంపెనీ వెల్లడించింది. -
చీరలో శోభిత ధూళిపాళ.. ఎంగేజ్మెంట్ రింగ్ చూపిస్తూ.. (ఫోటోలు)
-
అనంత్ రాధిక సంగీత్ కార్యక్రమంలో నీతా లుక్ అదుర్స్..చేతికి హృదయాకారంలో..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ల వివాహ వేడుకలకు సంబంధించిన ప్రతి వేడుక ఓ రేంజ్లో జరుగుతున్నాయి. ఆ వేడుకల్లో ఆ అంబానీ కుటుంబ సభ్యులు ధరించే దుస్తులు, ఆభరణాలు వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి. జూలై 12న అనంత-రాధికల వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివాహానికి ముందు జరిగే సంగీత్ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆ కార్యక్రమంలో నీతా రాణి పింక్ లెహంగా చోళీలో అద్భుతంగా కనిపించారు. ఆ డిజైనర్ లెహంగాకి తగ్గట్లు ఆమె ఎంచుకున్న కాంతీలాల్ ఛోటాలాల రూపొందిచిన వజ్రాభరణాలు మరింత అందాన్ని తెచ్చిపెటట్టాయి ఆమెకు. అలాగే చేతులకు డైమండ్ బ్యాంగిల్స్ ధరించింది. ఈ అలంకరణలో అందరి దృష్టి ఆమె ధరించిన హృదయకారపు ఉంగరంపైనే పడింది. ఇదే ఉంగరాన్ని ఆమె కూతురు ఇషా అంబానీ, మనీష్ మల్హోత్రా దీపావళి బాష్‌లో ధరించింది. ప్రస్తుతం ఈ తల్లి, కూతుళ్ల ద్వయం సేమ్ రింగ్‌ని ధరించడం నెట్టింట కాస్త హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఈ వేడుకలో నీతా ధరించిన ఆభరణాలు చాలా హైలెట్‌గా నిలిచాయి.నీతా ధరించిన ఆభరణాలు..కాంతిలాల్ ఛోటాలాల్ రూపొందించిన ఆభరణాలు నీతా కంఠానికి ఎగ్జాట్‌గా సరిపోయాయి. రోజ్ కట్ డైమండ్లు ఆమె మెడను మిరమిట్లుగొలిపే కాంతితో నింపాయి. ఆమె తలకు ధరించిన పాపిడి బొట్టు, చెవిపోగులు.. ప్రతీదీ కళాత్మకంగా ఉంది. View this post on Instagram A post shared by Miss Diva (@missdivaorg) (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం..ఏకంగా ఓ లగ్జరీ కారు ధర..!) -
గర్ల్‌ఫ్రెండ్‌కి సిమెంట్ రింగ్‌తో ప్రపోజ్..!
సాధారణంగా గర్ల్‌ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేసేటప్పుడూ వారి స్థాయిని బట్టి గోల్డ్ లేదా డైమండ్ రింగ్‌తో చేస్తారు. పోనీ మరీ మిడిల్‌క్లాస్ అయితే రోల్డ్ గోల్డ్ లేదా స్టీలు రింగ్‌తో ప్రపోజ్ చేస్తారు. అలా ఇలా కాకుండా ఏకంగా సిమ్మెంట్ రింగ్‌తో ప్రపోజ్ చేసి పెద్ద షాక్ ఇచ్చాడు ఓ వ్యక్తి. వాట్ సిమ్మెంట్ రింగా..? అని అందరూ కంగుతిన్నారు. అస్సలు అలాంటి రింగు ఉంటుందా..అని అనుకోకుండి.ఎందుకంటే.. చైనాకు చెందిన 36 ఏళ్ల గ్యూయు తన గర్లఫ్రెండ్‌కి సిమ్మెంట్ రింగ్‌తో ప్రపోజ్ చేశాడు. ఈ రింగే ఇవ్వడానికి కారణం..గ్యూయూ నిర్మాణాలకు సంబంధించి వాటర్ ప్రూఫింగ్ నాణ్యత కోసం సరికొత్త సిలికాన్ అయాన్ పదార్థాన్ని కనుగొన్నాడు. ఈ ఆవిష్కరణ బీజింగ్ 2022 ఒలింపిక్స్ అరెనాలో ఉపయోగించాడరు. అంతేగాదు ఈ ఆవిష్కరణకు గానూ 2016లో సింఘువా కిహాంగ్ స్కాలర్షిప్ గోల్డ్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డు వేడుకలోనే అతడు తన గర్ల్‌ఫ్రెండ్‌కి తాను తయారు చేసిన ఆవిష్కరణతో చేసిన సిమెంట్ రింగుతో ప్రపోజ్ చేశాడు. ప్రస్తుతం వారిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇప్పుడామె అతడి భార్య కూడా. నాటి ఆ వీడియో ప్రస్తుతం చైనీస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతేకాదండోయ్ గ్యూయూ తన వందేళ్ల ప్రేమ ఎన్నటికి చెక్కు చెదరదని ఈ ఉంగరం సూచిస్తుందని చెబుతున్నాడు. నిజంగా గ్రేట్ తన ఆవిష్కరణతోనే గర్లఫ్రెండ్‌కి రింగ్ అందించడం అనేది మర్చిపోలేని, వెలకట్టలేని గొప్ప గిఫ్ట్. అయితే నెటిజన్లు మాత్రం బంగారం లేదా డైమండ్ కాకపోయిన ఫ్యాన్సీ ఉంగరమైన పెట్టోచ్చు గదా మరీ ఇంత చీప్‌గానా? అని మండిపడుతూ పోస్టులు పెట్టారు. కాగా, 2017లో,గ్యూయు గార్డెక్స్ను స్థాపించారు. అతని ఆవిష్కరణని నేషనల్ స్పీడ్ స్కేటింగ్ ఓవల్‌లో ఉపయోగించారు. దీన్ని ఐస్ రిబ్బన్ అని కూడా పిలుస్తారు. కేవలం దీన్ని బీజింగ్ 2022 వింటర్ ఒలింపిక్స్ కోసం నిర్మించారు.(చదవండి: స్కై వాటర్: సూర్యరశ్మి, గాలితో వాటర్..!) -
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
ఉంగరం వేలు మన గుండె నరాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకనే మన పెద్దలు ఉంగరం వేలుకి ఉంగరం పెట్టేవారని మనం కథకథలుగా విన్నాం. అలాగే ఆయుర్వేదంలో కూడా వేళ్ల నరాలకు మన శరీరంలోని అవయవాలకు సంబంధం ఉందని చెబుతోంది. అయితే చైనా కంపెనీ ఆ ఉంగరంతోనే మన ఆరోగ్యం పదిలంగా ఉండేలా..సరికొత్త స్మార్ట్ ఉంగరాన్ని తీసుకొచ్చింది.శరీరం పనితీరును, ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించే స్మార్ట్‌వాచీలు, స్మార్ట్ రింగ్‌లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. వాటి కోవలోనిదే ఈ స్మార్ట్ రింగ్. చైనీస్ కంపెనీ ‘అమాజ్‌ఫిట్’ ఇటీవల ఈ స్మార్ట్‌రింగ్‌ను ‘హీలియో రింగ్’ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. వ్యాయామం చేసేవారికి, క్రీడాకారులకు ఉపయోగపడేలా దీనిని రూపొందించారు. ఇందులోని సెన్సర్లు ఎప్పటికప్పుడు శరీరం పనితీరును గమనిస్తూ స్మార్ట్‌వాచీ లేదా స్మార్ట్‌ఫోన్‌కు యాప్ ద్వారా సమాచారాన్ని చేరవేస్తాయి. రక్తంలోని ఆక్సిజన్ స్థాయి, గుండె పనితీరు, ఊపిరితిత్తుల పనితీరు, ఒత్తిడి, నిద్ర తీరు సహా పలు అంశాలపై ఈ ఉంగరం ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ ఉంగరాన్ని కొనుగోలు చేసేవారికి ‘అమాజ్‌ఫిట్’ మూడు నెలల వరకు ‘జెప్ ఆరా’ హెల్త్ సర్వీస్‌ను ఉచితంగా అందిస్తుండటం విశేషం. ఈ స్మార్ట్‌రింగ్ ధర 71 డాలర్లు (రూ.5,914) మాత్రమే! (చదవండి: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?) -
Simhachalam: దర్శనానికి వచ్చి ఉంగరం దొంగిలిస్తారా..?
సింహాచలం: ‘శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దర్శనానికి వచ్చి ఆయన ఉంగరాన్నే దొంగిలిస్తారా? మర్యాదగా దొంగిలించిన ఉంగరాన్ని ఇచ్చేయండి.. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం..’అని సింహాచలం కొండకి వచ్చిన పలువురు భక్తులను దేవస్థానం స్థానాచార్యులు ప్రశ్నించే సరికి వారంతా కంగుతిన్నారు. ‘మేం దొంగల్లా కనిపిస్తున్నామా.! స్వామి దర్శనానికి వస్తే ఉంగరాన్ని దొంగతనం చేశారంటారేంటి? పైగా తాళ్లతో బంధించి తీసుకొస్తారా..’అంటూ భక్తులు ఆవేశంతో స్థానాచార్యులపై గర్జించారు. ‘చూడండీ.. మీరు దొంగతనం చేసినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి. పోలీసులు తీసుకెళ్లకముందే దొంగిలించిన ఉంగరాన్ని మర్యాదగా ఇచ్చేయండి.’ అంటూ స్థానాచార్యులు మరింత గర్జించి అడగటంతో భక్తుల కళ్లంట నీళ్లు గిర్రున తిరిగాయి.దేవస్థానం అర్చకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విజయనగరానికి చెందిన భక్తురాలు తాము ఉంగరం తీయలేదని ఎంత చెబుతున్నా వినకుండా మీరే దొంగ అంటూ పదే పదే ప్రశ్నించడంతో వారంతా ఆగ్రహంతో చిందులు వేశారు. పైగా చేతికున్న ఉంగరాలను చూపెట్టమని.. దొంగిలించిన ఉంగరంలా ఇవి ఉన్నాయంటూ స్థానాచార్యులు అడగటంతో భక్తుల నోటి మాట రాలేదు. చివరికి ఇదంతా వినోదోత్సవంలోని ఘట్టమని తెలుసుకుని భక్తులంతా సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. తమకు మాత్రమే దక్కిన భాగ్యంగా భావించి ఆనందభరితులయ్యారు. ఇదీ సింహగిరిపై బుధవారం నవ్వుల సందడిగా జరిగిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి వినోదోత్సవం. స్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మృగయోత్సవంలో పోయిన ఉంగరం వెతికే ఘట్టాన్ని బుధవారం ఉదయం వినోదోత్సవంగా నిర్వహించారు. ఏడు పరదాల్లో దాగి ఉన్న స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని రాజగోపురం వద్ద పల్లకీలో అధిష్టింపజేశారు. స్వామి దూతగా పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు కర్ర, తాడు పట్టుకుని దర్శనానికి వచ్చిన పలువురు భక్తులను ఉంగరం దొంగిలించారంటూ తాళ్లతో బంధించి రాజగోపురం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ దొంగిలించిన ఉంగరాన్ని ఇవ్వాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.టెక్కలికి చెందిన భక్తులను ప్రశి్నస్తున్న స్థానాచార్యులు ఉత్సవం గురించి తెలియని వాళ్లు కన్నీటిపర్యవంతం చెందారు. ఉత్స వం గురించి తెలిసిన వాళ్లు నవ్వుతూ సమాధానం చెప్పారు. ఈ తరుణంలోనే స్వామిపై ఉన్న ఒక్కొక్క పరదాను తొలగించారు. చివరికి స్వామి చివరి పరదాలోనే ఉంగరం దొరికింది. ఎస్.కోట మండలం బొద్దాంకి చెందిన నూతన దంపతులు ఈశ్వరరావు, మాధవి, ఆరిలోవ ప్రాంతానికి చెందిన మౌళీ, గౌతమి, ఆంధ్రా యూనివర్సిటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యారి్థనులు హిమజ, ప్రత్యూష, లావణ్య, శ్వేత అశ్విని, టెక్కలికి చెందిన అక్కాతమ్ముళ్లు జీవిత, నవీన్‌కుమార్‌లను పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు తాళ్లతో బంధించి తీసుకురాగా వారిని స్థానాచార్యులు ప్రశ్నించారు. విజయనగరం జిల్లా దాసన్నపేటకి చెందిన రోజా అనే మహిళ తన కుమార్తె మిక్కి, అల్లుడు కిశోర్, మనవలతో కలిసి సింహగిరికి రాగా వారిని తాళ్లతో బంధించారు. వాళ్ల చేతికి ఉన్న ఉంగరం.. దొంగిలించిన ఉంగరంగానే ఉందని స్థానాచార్యులు, అర్చకులు అనుమా నం వ్యక్తం చేయడంతో వారంతా వాదనకు దిగారు. నా కూతురుకు, అల్లుడికి నిశి్చతార్థం రోజు పెట్టిన ఉంగరాలు ఇవని, దొంగిలించినవి కాదని స్థానాచార్యులతో రోజా వాదించారు. ఇదిలా ఉండగా దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఇరగవరపు రమణాచార్యులు, ఆలయ కొత్వాల్ నాయక్ లంక సూరిబాబు, ఆలయ ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లు, సూపరింటెండెంట్ వెంకటరమణ, ట్రస్ట్‌బోర్డు మాజీ సభ్యుడు గంట్ల శ్రీనుబాబు సైతం దొంగలుగా పట్టుపట్టారు. తొలుత స్థానాచార్యులను కూడా తాళ్లతోనే బంధించి తీసుకురావడం విశేషం. అదే సమయంలో సింహగిరి వచ్చిన భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు వినోదోత్సవంలో పాల్గొని.. స్వామిని దర్శించుకున్నారు. -
‘రింగ్ ఆఫ్ ఫైర్’ అంటే ఏమిటి? ఈ శనివారం ఆకాశంలో ఏం జరగనుంది?
వచ్చే శనివారం అంటే అక్టోబర్ 14న అంతరిక్షంలో ఒక ప్రత్యేక దృశ్యం కనిపించనుంది. సూర్యుని లోపల ఒక నల్లని ఆకారం ఏర్పడనుంది. ఫలితంగా సూర్యుని చుట్టూ అగ్ని వలయం కనిపించనుంది. దీనినే ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని పిలుస్తారు. సూర్యగ్రహణం కారణంగా సూర్యుడు ఈ రీతిలో కనిపించనున్నాడు. సంవత్సరంలో చివరిసారిగా ఏర్పడే ఈ సూర్యగ్రహణం ప్రత్యేకంగా కనిపించనుంది. సూర్యగ్రహణం సంభవించే ప్రతీసారీ ఇలా జరగదు. చంద్రుని ప్రత్యేక స్థానం కారణంగా ఇలా జరగనుంది. భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు.. చంద్రుని నీడ భూమిపై పడనుంది. అక్టోబరు 14న ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించే సూర్యగ్రహణం సాధారణమైనది కాదు. ఇది కంకణాకృతి సూర్యగ్రహణం. సూర్యగ్రహణం సమయంలో కొన్నిసార్లు సూర్యుడు మొత్తంగా చంద్రుని వెనుక దాక్కుంటాడు. కొన్నిసార్లు మెరుస్తున్న ఉంగరం మాదిరిగా కనిపిస్తాడు. సూర్యుని ప్రకాశాన్ని చంద్రుడు పూర్తిగా కప్పివేసినప్పుడు, సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కంకణాకార సూర్యగ్రహణంలో సూర్యుడు చంద్రుని బ్లాక్ డిస్క్ చుట్టూ ఉండే రింగ్ మాదిరిగా కనిపిస్తాడు. దీనినే యాన్యులస్ అంటారు. సాధారణ సంపూర్ణ సూర్యగ్రహణంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా అడ్డుకుంటాడు. అయితే వార్షిక సూర్యగ్రహణంలో, చంద్రుడు.. భూమి కక్ష్యలో దానికి దూరంగా ఉంటాడు. ఈ కారణంగా చంద్రుడు ఆకాశంలో సూర్యుడి కంటే కొంత చిన్నగా కనిపిస్తూ, సూర్యుడిని అడ్డుకుంటాడు. అంటే సూర్యుడిని పూర్తిగా కవర్ చేయడు. ఈ స్థితిలో సూర్యుని స్థానంలో అగ్ని వలయం కనిపిస్తుంది. కాగా ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఎందుకంటే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో రాత్రి సమయంలో సంభవిస్తుంది. గ్రహణం సమయంలో భారతదేశం చంద్రునికి వ్యతిరేక దిశలో ఉంటుంది. భారతదేశంలో చంద్రుడు కనిపించే సమయానికి, సూర్యగ్రహణం ముగుస్తుంది. ఈ గ్రహణం ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. అయితే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రత్యక్ష ప్రసారం ద్వారా భారతదేశ ప్రజలు ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చు. నాసా తెలిపిన వివరాల ప్రకారం, ఈ సూర్యగ్రహణాన్ని భారత కాలమానం ప్రకారం రాత్రి 8.35 గంటలకు చూడవచ్చు. అమెరికాలో, ఒరెగాన్, కాలిఫోర్నియా, నెవాడా, టెక్సాస్, ఉటా, అరిజోనా, న్యూ మెక్సికో రాష్ట్రాల్లో ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది. మెక్సికో, గ్వాటెమాల, బెలిజ్, హోండురాస్, నికరాగ్వా, పనామా, కొలంబియా, బ్రెజిల్‌లలో ఇది సూర్యాస్తమయానికి ముందు కనిపించనుంది. ఇది కూడా చదవండి: రీల్స్ కోసం సరయూలో అశ్లీల నృత్యం.. రంగంలోకి దిగిన పోలీసులు! -
రెండువేల ఏళ్ల క్రితమే ఇంత అద్భుత ఆభరణమా!
రోమన్ సామ్రాజ్యం గురించి కథలు కథలుగా విన్నాం. అలాగే ఓ సామెత కూడా చెబుతుంటారు రోమ్ నగరం ఒక్కరోజులో నిర్మించలేదని అంటుంటారు. ఒకప్పుడూ రోమ్ నగరం చాలా బావుండేదని, అప్పట్లోనే ఎన్న కళాఖండాలకు, నైపుణ్యాలకు పెట్టింది పేరుగా ఉండేది. ఆ కాలం నాటి ఓ అద్భుతమైన ఆభరణం వెలుగులోకి వచ్చింది. అది ఓ రోమన్ సమాధి నుంచి బయటపడింది. ఆ ఆభరణం క్రీస్తూ శకం ఒకటో శతాబ్దపు కాలాంలోనిదిగా నిపుణులు అంచనా వేశారు. ఆ ఆభరణాన్ని కార్విలయోస్ రింగ్ అని అంటారని చెబుతున్నారు. మాట్రాన్ ఎబుటియా క్వార్టా అనే రోమన్ మహిళ తన కొడుకు కార్విలయస్ జ్ఞాపకార్థం అతడి ముఖ చిత్రం కనిపించేలా తయారు చేయించుకుందని నిపుణులు చెబుతున్నారు. ఆ ఉంగరాన్ని నిశితంగా పరిశీలిస్తే.. రాక్ క్రిస్టల్స్ కింద చనిపోయిన ఆమె కొడుకు ముఖ చిత్రం ఉంది. దీన్ని చూస్తే అప్పట్లోనే ఎంత గొప్ప నైపుణ్యం ఉందని ఆశ్చర్యపోక మానరు. ఈ ఉంగరం హోలోగ్రాఫిక్ ప్రభావాన్నిచూపిస్తోంది. అలాగే నాటి కాలంలోని ఓ గొప్ప మొజాయిక్ ఫ్లోర్ ఇటలీలో బయటపడింది. ఆ కళఖండాన్ని నాటి కళాకారులు ఎంత అద్భుతం తీర్చిదిద్దారో దాన్ని చూస్తేనే అవగతమవుతుంది. ఇది నాటి రోమన్ సామ్రాజ్యంలోనిదేనని, కీస్తూ శకం 4వ లేదా 5వ శతాబ్దం నాటిదని చెబుతున్నారు. రోమన్ సామ్రాజ్యం ఓ వెలుగు వెలుగుతున్నప్పుడూ ఈ అసాధారణ కళాత్మక నైపుణ్యాలు కోకొల్లలుగా ఉండేవని చెబుతున్నారు. Carvilio's Ring is a unique 1st-century AD artifact recovered from Roman tomb. Commissioned by a matron Aebutia Quarta in memory of her son Carvilius the ring features a gold likeness of the deceased beneath a rock crystal lens creating a holographic effect. pic.twitter.com/ZyKjghpHw1 — ThePhotino (@the_photino) June 9, 2023 The Roman mosaic floor located in Montorio, Verona, Italy, is a remarkable archaeological discovery that dates back to the 4th and 5th centuries AD. This intricate mosaic artwork showcases the extraordinary craftsmanship and artistic excellence of the Roman Empire during its… pic.twitter.com/t6ljf1hRny — Historic Vids (@historyinmemes) July 5, 2023 -
ఆకాశంలో ఎరుపు రంగు వలయాకృతి.. గ్రహాంతరవాసుల వాహనమా?
రోమ్: ఎరుపు రంగులో వలయాకృతిలో కన్పిస్తున్న ఈ దృశ్యం ఇటలీలో ఇటీవల కలకలం రేపింది. విస్తుగొలిపే ఈ వింత వలయం సెంట్రల్ ఇటలీలో ఆల్ఫ్స్ పర్వతాల నుంచి అడ్రియాటిక్ సముద్రం దాకా ఆకాశంలో ఏకంగా 360 కిలోమీటర్ల పొడవున విస్తరించి కనువిందు చేసింది. అచ్చం హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా దృశ్యాన్ని తలపించిన ఈ వలయం గ్రహాంతరవాసుల అంతరిక్ష వాహనం అయ్యుండొచ్చని కొందరు భావించారు. సైంటిస్టులు మాత్రం అదేమీ కాదని స్పష్టం చేశారు. కాంతి ఉద్గార క్రమంలో అతి తక్కువ ఫ్రీక్సెన్సీతో కూడిన అడ్డంకులు ఇందుకు కారణమని వారు వివరించారు. ఎల్్వగా పిలిచే ఈ దృగ్విషయం ఒక్కోసారి ఇలాంటి విచిత్రాకారపు వెలుతురు వలయాలకు దారి తీస్తుందని చెప్పుకొచ్చారు. ఈ ఎల్్వలు తుపాను మేఘాలకు పై భాగాల్లో విడుదలయ్యే అత్యంత హెచ్చు విద్యుదయస్కాంత శక్తి వల్ల పుట్టుకొస్తుంటాయట. ఫొటోలోని ఎరుపు వలయం పుట్టుకకు సెంట్రల్ ఇటలీకి దాదాపు 285 కిలోమీటర్లు దక్షిణాన చెలరేగిన తుపాను సందర్భంగా చోటుచేసుకున్న శక్తిమంతమైన మెరుపు కారణమని వారు చెప్పారు. ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ వాల్తెయిర్ బినొటో దీన్ని కెమెరాలో బంధించారు. ఆకాశంలో ఇలాంటి ఆకృతులను ఆయన తొలిసారిగా 2017లో ఫొటో తీశారట. అప్పటి నుంచీ ఇదే పనిలో ఉన్నట్టు చెబుతున్నారాయన. -
మహిళల భద్రతకు.. అక్షరాలా రక్షణ ఇస్తాయి
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మహిళల భద్రతకు ఉపయోగపడే బ్రేస్లెట్ తయారుచేసి అభినందనలు అందుకున్నారు. గోరఖ్‌పుర్‌లోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఇంజినీరింగ్ కాలేజీ’కి చెందిన స్నేహ, అక్షితలు తయారుచేసిన ఈ బ్రేస్‌లెట్‌కు ‘నిర్భయ’ అని పేరు పెట్టారు. ఈ బ్రేస్లెట్ ఉమెన్ సేఫ్టీ యాప్‌కు అనుసంధానమై ఉండడంతో పాటు, అయిదు నంబర్లతో కనెక్టై ఉంటుంది. మరికొన్ని గ్యాడ్జెట్స్ గురించి... ‘బర్డ్ఐ’ అనేది పర్సనల్ సేఫ్టీ అలారమ్. అన్నివేళలా దీన్ని వెంట తీసుకెళ్లవచ్చు. ఆపద సమయంలో పెద్ద శబ్దం, వెలుగుతో ఎటాకర్ను భయపెడుతుంది. చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేస్తుంది. సేఫ్టీగా ఫీలైన సమయంలో డీయాక్టివేట్ చేయవచ్చు. బ్యాగు, పర్స్‌లలో కూడా ఈ పరికరాన్ని తీసుకెళ్లవచ్చు. డ్రైవ్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు కింద పడితే, చుట్టుపక్కల ఎవరూ లేకుంటే... ఇలాంటి సమయంలో యాపిల్ వాచ్ ఎస్ఇ(సిరీస్4)లోని ‘ఫాల్ డిటెక్ట్ ఫీచర్’ ఉపయోగపడుతుంది. ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌ను అప్రమత్తం చేస్తుంది. ‘ది రోడ్ ఐడీ బ్రేస్లెట్’ కూడా ఇలాంటిదే. ‘ది గార్డెడ్ రింగ్’ అనేది ఉత్త రింగ్ మాత్రమే కాదు. సెల్ఫ్ డిఫెన్స్ యాక్సెసరీ కూడా. ఆపద సమయంలో ఈ రింగ్‌లో రహస్యంగా అమర్చిన పదునైన బ్లేడ్‌ను ఉపయోగించుకోవచ్చు. (క్లిక్ చేయండి: ప్రాణాలు కాపాడుతున్న ఐఫోన్లు.. ఎలాగంటే..) -
శ్రద్ధా కేసు: ఐదు కత్తులు స్వాధీనం, వెలుగులోకి మరో ట్విస్ట్
న్యూఢిల్లీ: యావత్తు దేశాన్ని కలవరపాటుకు గురిచేసిన శ్రద్ధా హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. దర్యాప్తు చేసే కొద్దీ పలు ఆసక్తికర విషయాలు బయటకీ వస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు అఫ్తాబ్ అమీన్ పునావాలా తన ప్రియురాలు శ్రద్ధా వాకర్ మృతదేహాన్ని కోయడానికి ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 5 నుంచి 6 అంగుళాల మధ్య ఉన్న ఐదు కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అంతేగాదు ఈ ఆయుధాలను ఉపయోగించాడా? లేదా అని తెలుసుకోవడం కోసం వాటిని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపించినట్లు తెలిపారు. ఐతే అఫ్తాబ్ పోలీసులు విచారణలో శ్రద్ధా శరీర భాగాలను కోసి దాదాపు 300 లీటర్ల ఫ్రిజ్‌లో ఉంచి సమీపంలోని అడవిలో పడేసినట్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోలీసులు మృతదేహాన్ని కోయడానికి ఉపయోగించిన ఆయుధాలు కోసం ముమ్మరంగా గాలించారు. ఐతే ఈ దర్యాప్తు సమయంలో పోలీసులకు మరో షాకింగ్ ట్విస్ట్ తగిలింది. అప్తాబ్ ఆ రోజు శ్రద్ధా వాకర్ని హత్య చేసిన తదనంతరం ఒక వైద్యురాలితో డేటింగ్ చేసినట్లు తేలింది. ఆమెకు శ్రద్ధా ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అఫ్తాబ్ తీహార్ జైలులో ఉన్నాడని, అతన్ని గట్టి భద్రత నడుమ బహు జాగ్రత్తగా ఉంచినట్లు జైలు అధికారులు పేర్కొన్నారు. (చదవండి: చంపి ముక్కలుగా నరికేస్తానని అఫ్తాబ్ బెదిరించాడు.. వెలుగులోకి 2020 నాటి ఫిర్యాదు) -
సమంత చేతికి ఆ ఉంగరాలు? దోషం వల్లే ఇలా చేస్తుందా?
స్టార్ హీరోయిన్ సమంత నటించిన ఉమెన్ సెంట్రిక్ మూవీ యశోద. ఈ సినిమా నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆరోగ్యం బాలేకపోయినా ఆమెయశోద ప్రమోషన్స్‌లో పాల్గొంది. ఈ క్రమంలో సమంత చేతికి ధరించిన ఉంగరాళ్లపై ప్రత్యేకంగా దృష్టి పడింది. ఎప్పుడూ డిజైనర్ వేర్ జ్యువెలరీలో కనిపించే సామ్ తొలిసారిగా ఇలా జాతకాల ప్రకారం రంగురాళ్లను ధరించడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం శారీరకంగా, మానసికంగా భాదపడుతున్న సమంత 'మయోసైటిస్' అనే వ్యాధితో పోరాడుతున్న సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా తన జీవితంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా సమంత ఈమధ్యకాలంలో జాతకాలను కూడా నమ్ముతున్నట్లు తెలుస్తుంది. అందుకే ఆమె చేతికి రంగురాళ్లను ధరించనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె ధరించిన ఉంగరాల్లో ఒకటి కనకపుష్యరాగం ఒకటి. ఇది సంపద, ఆరోగ్యానికి శుభసూచికంగా భావిస్తారట. దీంతో పాటు ఆమె గోమేధకం అనే మరో ఉంగరాన్ని కూడా ధరించింది. ఇది చెడు దృష్టి నుంచి కాపాడుతుందట. దీన్ని ధరించిన వారికి శారీరకంగా, మానసికంగా సత్పలితాలు ఉంటాయట. ఇక సమంత ధరించిన మరో ఉంగరం ముత్యం.. ఇది చంద్రుడు ఒక్కో క్షణంలో బలహీనంగా మారినపుడు ఆ ప్రభావం మన ఆరోగ్యం పై పడకుండా ఉండేలా ఈ ఉంగరాన్ని ధరిస్తారట. మొత్తానికి దీన్ని బట్టి సమంత సెంటిమెంట్లను బాగానే ఫాలో అవుతుందనే టాక్ వినిపిస్తుంది. -
స్మార్ట్ ఉంగరం, మన ఆరోగ్యానికి కనిపెట్టుకుని ఉంటుంది
ఈ ఫొటోలో కనిపిస్తున్నది స్మార్ట్ ఉంగరం. ఉంగరం లోపలి వైపు రాళ్లు పొదిగారేమిటా అనుకుంటున్నారా? అవి రాళ్లూ రత్నాలూ కావు. స్మార్ట్ సెన్సర్ల లైట్లు. ఈ ఉంగరం వేలికి పెట్టుకుంటే, ఇది అనుక్షణం మన ఆరోగ్యానికి కనిపెట్టుకుని ఉంటుంది. దీనిని ఒకసారి చార్జింగ్ చేసుకుంటే, ఇందులోని బ్యాటరీ ఏడురోజుల వరకు ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేస్తుంది. ఫిన్లాండ్కు చెందిన ‘ఓరా’ సంస్థ ఈ స్మార్ట్ ఉంగరాన్ని ‘ఓరా రింగ్ జెన్3 హారిజన్’ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. దీనిని వేలికి పెట్టుకుంటే, మన ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు స్మార్ట్‌ఫోన్‌కు పంపుతుంది. బ్లడ్ ఆక్సిజన్ లెవల్, నిద్రపోయే సమయం, గుండె స్పందనలు, రోజువారీ పనుల్లో మనం ఖర్చు చేసే కేలరీలు తదితర వివరాలను గూగుల్ ఫిట్ లేదా యాపిల్ హెల్త్ యాప్స్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు పంపుతుంది. దీని ధర 349 డాలర్లు (సుమారు రూ.28,500). -
ఒక్క ఉంగరంలోనే ఏకంగా 20 వేల వజ్రాలు... రికార్డు సృష్టించింది
తిరువనంతపురం: భారతదేశంలోని ప్రముఖ ఆభరణాల తయారీ కంపెనీలలో ఒకటైన ఎస్‌డబ్ల్యూఏ ఒక్క ఉంగరంలో ఒకటి రెండూ కాదు దాదాపు 24 వేల వజ్రాలతో ఒక ఉంగరాన్ని రూపొందించింది. కేరళలోని మలప్పురం జిల్లాలో తయారైన ఈ ఉంగరం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తోపాటు ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్సు వంటి ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెలుచుకుంది. ఈ ఉంగరానికి ది టచ్ ఆఫ్ అమీ' అని పేరు పెట్టారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నుంచి లైఫ్‌స్టైల్ యాక్సెసరీ డిజైన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన శ్రీమతి రిజిషా దీన్ని రూపొందించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 24,679 వజ్రాలతో కేరళలో తయారైన ఉంగరం గిన్నిస్ రికార్డు సాధించింది. అత్యధిక వజ్రాలు సెట్ ఇన్ వన్ రింగ్ విభాగం పేరిట ఈ రికార్డును నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా వజ్రాల పరిశ్రమలో ఆధిపత్యం చెలాయించే బెల్జియం వంటి దేశాలను వెనక్కి నెట్టి మరీ ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను గెలుచుకోవడం నిజంగా గొప్ప విజయం అని ఎస్‌డబ్ల్యూఏ కంపెనీ యజమాన్యం చెబుతోంది. (చదవండి: అనధికార భవనాలను కూల్చేయండి! కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు) -
చంద్రబాబు ధరించిన ఉంగరం పై సీఎం జగన్ పంచులు
-
హుజురాబాద్ ఉప ఎన్నిక: వజ్రం, రోటీమేకర్, నోటాకు భారీగానే ఓట్లు
సాక్షి, హైదరాబాద్: ఉప ఎన్నిక ఫలితాల్లో నోటాకు 1,036 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో 2,867 ఓట్లు వచ్చాయి. అప్పుడు బీజేపీ అభ్యర్థి పుప్పాల రఘుకు 1,683 ఓట్లు వచ్చాయి. అప్పుడు నోటా కంటే తక్కువగా ఉన్న బీజేపీ ఇప్పుడు అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుంది. చదవండి: కాంగ్రెస్‌లో కాక రేపుతున్న ‘హుజురాబాద్’ ఫలితం వజ్రం: ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన కంటె సాయన్న 1,942 ఓట్లు సాధించి మూడు ప్రధాన పార్టీల తర్వాత నాలుగో స్థానంలో నిలిచారు. రోటీమేకర్: ప్రజా ఏక్తా పార్టీ నుంచి పోటీ చేసిన సిలివేరు శ్రీకాంత్ 1,913తో ఐదోస్థానం సంపాదించారు. ఉంగరం: స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బుట్టెంగారి మాధవరెడ్డి కేవలం 36 ఓట్లతో అందరి కంటే ఆఖరు స్థానంలో నిలిచారు. చదవండి: హుజురాబాద్ ఫలితాలు: వెక్కి వెక్కి ఏడ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు? పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్ హవా.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లో అధికార టీఆర్ఎస్ హవా కొనసాగింది. 777 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు గాను, 455 ఓట్లు టీఆర్ఎస్కు, 242 ఓట్లు బీజేపీకి, కాంగ్రెస్‌కు 2 పోల్ కాగా.. 48 ఓట్లు చెల్లలేదు. -
చిన్నారి గొంతులో ఇరుక్కున్న ఉంగరం
చెన్నై: చిన్నారి గొంతులో చిక్కుకున్న ఉంగరాన్ని శివగంగై వైద్యులు తొలగించి రికార్డు సాధించారు. శివగంగై ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రి డీన్ రేవతి బుధవారం విలేకరులతో మాట్లాడుతూ మదురై మూకు ప్రాంతానికి చెందిన కళాశాల ప్రొఫెసర్ రామ్‌ప్రసాద్, నిరంజన దంపతుల కుమార్తె మదిమాల (02), ఇటీవల నిరంజన్ ధరించిన నాలుగు గ్రాముల బంగారు ఉంగరం జారి పడిపోవడంతో దాన్ని మింగేసిందని, తర్వాత కొద్దిసేపట్లో ఊపిరాడక వాంతి చేసిందన్నారు. దీంతో బిడ్డను శివగంగై పభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తీసుకెళ్లడంతో వెంటనే ఎక్స్‌రే తీశారని, దీంతో ఆహార నాలిక పైభాగంలో ఉంగరం ఉన్నట్లు తెలిసిందన్నారు. చిన్నారి ఉంగరాన్ని మింగడానికి ముందు ఆహారం తీసుకోవడంతో వెలికి తీయడానికి ఆటంకం ఏర్పడింది. మరుసటిరోజు ఉదయం మత్తు మందు ఇచ్చి వీడియో ఆప్టికల్ ఫోర్సెప్స్, రిజిడ్ ఎండోస్కోపీ ద్వారా ఉంగరాన్ని వెలికి తీసినట్లు తెలిపారు. ప్రస్తుతం బిడ్డ బాగుండడంతో గురువారం డిశ్చార్జ్ చేశారు. సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ బాలమురుగన్, ఈఎన్టీ విభాగం హెడ్ నాగసుబ్రహ్మణ్యన్, ఆర్ఎంఓ రఫీ, వైద్యులు ఆనంద్, వైరవరాజన్, సుందరపాండియన్ వెంట ఉన్నారు. -
వైరల్: అతడు..ఆమె.. ఓ పానీపూరీ ప్రేమ కథ
లవ్ అట్ ఫస్ట్ సైట్లో కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు చూసిన వెంటనే ప్రేమలో పడిపోతుంటారు. కానీ అదే ప్రేమను తెలపాలంటే చాలా కష్టపడుతుంటారు. ఎందుకంటే ప్రేమను మనం ఇష్టపడే వారికి తెలియపరచడం అనేది ఓ మధురానుభూతి. అందుకే ప్రేమించడం సులువు గానీ అది వ్యక్తపరచడం చాలా కష్టమని అంటుంటారు. ఇలా ఇష్టపడే అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేయడం కోసం అబ్బాయిలు చాలానే ఆలోచిస్తుంటారు. అలా ఓ ప్రేమికుడు తను ప్రేయసికి సరికొత్తగా తన ప్రేమను తెలపాలనుకున్నాడు. దాని కోసం ఎంతో ఆలోచించి ఓ క్రేజీ ఐడియాతో తను ప్రేమించిన అమ్మాయికి సరికొత్తగా ప్రేమను వ్యక్తపరిచాడు. ఇంకేముంది కొత్తదనం ఉంటే చాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొట్టేస్తుందన్న విషయం తెలిసిందే. ఆ ప్రేమికుడు తన ప్రేయసిని.. అలా పానిపూరి దుకాణంలో తీసుకెళ్లాడు. ఎలా చెప్పాలా అనుకుంటూ ఉండగా ఆకస్మాత్తుగా అతనికి ఓ ఐడియా మదిలో మెదిలింది. అనుకున్నదే తడువుగా.. ‘పానీపూరీలో ఉంగరం పెట్టి లవ్ ప్రపోజ్’ చేసేశాడు. ఇక ఈ వెరైటీ ప్రపోజల్‌కు అమ్మాయితో పాటు నెటిజన్లు కూడా ఫిదా అయ్యారండోయ్. మామూలుగానే పానీ పూరీ అంటే ఇష్టపడనివారు ఎవరు ఉండరు. దీంతో పానీపూరితో పిల్లను ప్రేమలో పడేశావ్ బ్రో అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఫన్నీ నెటిజన్లు. ఈ పానీపూరి రింగ్ ప్రపోజల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి హల్చల్ చేస్తోంది. i mean,, can’t say no to pani puri Gol gappay or pani puri are enjoyed by everyone and they are a real treat. But none of us would have imagined getting proposed through gol gappay. This man is doing things differently and after bizarre food proposals, pic.twitter.com/OwvGFc1Jd4 — MonthlyAndazeJahan (jiddat group of publications) (@e_monthly) June 3, 2021 చదవండి: Fact Check: వ్యాక్సిన్ తీసుకుంటే అయస్కాంత లక్షణాలు! -
ప్రపోజ్: ప్రేయసి ఉంగరాన్ని ఇంకో లవర్‌కు
ప్రేమించడం గొప్ప కాదు, ఆ ప్రేమను వ్యక్తీకరించడం గొప్ప. చాలామంది చాటుగా ప్రేమిస్తూ ఊహల్లోనే కాలం గడిపేస్తుంటారు. అమ్మాయికు ఎదురు వెళ్లాలన్నా, ఆమెకు మనసులోని మాట చెప్పాలన్నా ధైర్యం చాలదు. క్షణాలు రోజులై, రోజులు నెలలై, నెలలు సంవత్సరాలైనా ప్రేమ విషయం చెప్పకుండా వన్‌సైడ్ లవర్స్‌గానే మిగిలిపోతుంటారు. మరికొందరు మాత్రం ఫోన్ నంబర్ మార్చినంత ఈజీగా ప్రేమికులను మారుస్తుంటారు. ఇక్కడ చెప్పుకునే వ్యక్తి రెండో రకానికి చెందినవాడు. ఇంతకీ ఫ్లోరిడాకు చెందిన ఈ రోమియో ఏం చేశాడో తెలియాలంటే ఇది చదివేయండి.. ఫ్లోరిడా: అమెరికాలోని జోసెఫ్ డేవిస్ ఫ్లోరిడాలోని ఆరెంజ్ సిటీకి చెందిన ఓ యువతి మీద మనసు పారేసుకున్నాడు. ఈ విషయాన్ని సదరు యువతికి చెప్పగా ఆమె కూడా ప్రేమకు పచ్చజెండా ఊపింది. ఇద్దరూ ఉంగరాలు కూడా మార్చుకున్నారు. అంతా బాగానే ఉన్నందుకున్న క్రమంలో ప్రియుడు సరిగా టచ్‌లో లేకుండా పోయాడు. ఓ రోజు అతడి ఫేస్‌బుక్‌ను చూస్తుండగా ఓ అమ్మాయి వేలికి ఉంగరం తొడిగి ఉన్న ఫొటో కనిపించింది. మరీ పరిశీలించి చూస్తే ఆ వజ్రపు ఉంగరం తనదే. ఎందుకైనా మంచిది, అది తనదేనా? కాదా? అన్న అనుమానంతో తన బీరువా అంతా వెతికి చూడగా ఖాళీ ఉంగరం బాక్సు మాత్రమే దర్శనమిచ్చింది. పైగా మరికొన్ని ఆభరణాలు కూడా మాయమైనట్లు గుర్తిచ్చింది. వీటన్నిటి విలువ 6,270 డాలర్లుగా ఉంది. దీంతో ఆగ్రహించిన ఆరెంజ్ సిటీ యువతి అతడిని నిలదీసింది. దీంతో అతడు కొన్నింటిని తిరిగిచ్చేసేందుకు అంగీకరించాడు. ఇంత జరిగాక అతడితో కలిసి జీవితం పంచుకోలేనని నిర్ణయించుకున్న యువతి అతడికి కటీఫ్ చెప్పింది. ఇదిలా వుంటే ఆరెంజ్ సిటీ మహిళ ఆఫీసుకు వెళ్లినప్పుడు తన ప్రియురాలిని తీసుకుని నేరుగా ఆమె ఇంటికే తీసుకెళ్లాడట. ఇక డేవిస్.. జో బబ్రౌన్, మార్కస్ బబ్రౌన్ అనే మారుపేర్లతో చాలామంది అమ్మాయిలను బురిడీ కొట్టించాడని పోలీసులు తెలిపారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడికి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. చదవండి: 'నేను ఏలియన్ని' మస్క్ షాకింగ్ కామెంట్ -
ఇది మామూలు ఉంగరం కాదు!
ఫొటో చూడగానే.. అదేం విచిత్రమైన ఉంగరం రా బాబూ అనిపించిందా? నిజమే ఉంగరం ఆకారం కొంచెం విచిత్రంగా ఉంది కానీ ప్రయోజనం? అబ్బో ఈ రింగు చాలా హాట్ గురూ అనేంత బాగుంటుంది. ఇది మన శరీర ఉష్ణోగ్రతను విద్యుత్తుగా మార్చేస్తుంది.. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో శాస్త్రవేత్తలు దీన్ని సృష్టించారు. థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ (టీఈజీ)లు కొత్తేం కాకున్నా.. దీనికి మాత్రం ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మన పరిసరాల్లోని ఉష్ణోగ్రతకు, శరీరంలోని వేడికి మధ్య ఉన్న తేడా ఆధారంగా విద్యుత్తు ఉత్పత్తి చేస్తుంది ఈ పరికరం. పాలీమైన్ అనే ప్రత్యేక పదార్థంతో తయారైన ఈ ఉంగరం పైభాగంలో చిన్న సైజు టీఈజీలు ఉంటాయి. చర్మం ఎంత మేరకు ఈ పాలీమైన్ పదార్థానికి అతుక్కుని ఉందో అంత విద్యుత్తు తయారు చేయగలదు. కచ్చితమైన లెక్కలు కావాలంటే ప్రతి చదరపు సెంటీమీటర్‌కు ఒక వోల్టు విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. వాచ్‌లు, ఫిట్నెస్ ట్రాకర్లకు ఈ విద్యుత్తు సరిపోతుంది. చేతికి తొడుక్కునే కడియం లాంటిది తయారు చేస్తే విద్యుదుత్పత్తి 5 వోల్టుల వరకు పెంచొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చదవండి: ఒళ్లు కరిగించే మధుమేహ మాత్ర! పిల్లల తారుమారు.. 28 ఏళ్లకు కోటి పరిహారం.. -
శరీర ఉష్ణోగ్రతను విద్యుత్తుగా మార్చేస్తుంది..
ఫొటో చూడగానే.. అదేం విచిత్రమైన ఉంగరం రా బాబూ అనిపించిందా? నిజమే ఉంగరం ఆకారం కొంచెం విచిత్రంగా ఉంది కానీ ప్రయోజనం? అబ్బో ఈ రింగు చాలా హాట్ గురూ అనేంత బాగుంటుంది. ఇది మన శరీర ఉష్ణోగ్రతను విద్యుత్తుగా మార్చేస్తుంది.. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో శాస్త్రవేత్తలు దీన్ని సృష్టించారు. థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ (టీఈజీ)లు కొత్తేం కాకున్నా.. దీనికి మాత్రం ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మన పరిసరాల్లోని ఉష్ణోగ్రతకు, శరీరంలోని వేడికి మధ్య ఉన్న తేడా ఆధారంగా విద్యుత్తు ఉత్పత్తి చేస్తుంది ఈ పరికరం. పాలీమైన్ అనే ప్రత్యేక పదార్థంతో తయారైన ఈ ఉంగరం పైభాగంలో చిన్న సైజు టీఈజీలు ఉంటాయి. చర్మం ఎంత మేరకు ఈ పాలీమైన్ పదార్థానికి అతుక్కుని ఉందో అంత విద్యుత్తు తయారు చేయగలదు. కచ్చితమైన లెక్కలు కావాలంటే ప్రతి చదరపు సెంటీమీటర్‌కు ఒక వోల్టు విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. వాచ్‌లు, ఫిట్నెస్ ట్రాకర్లకు ఈ విద్యుత్తు సరిపోతుంది. చేతికి తొడుక్కునే కడియం లాంటిది తయారు చేస్తే విద్యుదుత్పత్తి 5 వోల్టుల వరకు పెంచొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
40 ఏళ్లుగా జననేంద్రియంలో రబ్బర్ రింగ్
సాక్షి, కర్నూలు(హాస్పిటల్): ఓ 65 ఏళ్ల వృద్ధురాలికి 40 ఏళ్లుగా జననేంద్రియంలో రబ్బర్ రింగ్ అలాగే ఉండి పోయింది. ఇప్పుడు గర్భాశయ సమస్యలు రావడంతో ఆమె ఆసుపత్రికి రాగా వైద్యులు చికిత్స ద్వారా దానిని తొలగించారు. వివరాలను శనివారం కర్నూలు ప్రభుత్వసర్వజన వైద్యశాలలోని గైనిక్ విభాగంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హెచ్‌వోడి డాక్టర్ బి. ఇందిర తెలిపారు. తెలంగాణా రాష్ట్రం గద్వాల నియోజకవర్గం కశ్యాపురం గ్రామానికి చెందిన 65 ఏళ్ల మహిళ మూడు రోజుల క్రితం గైనిక్ విభాగం ఏడవ యూనిట్‌కు వచ్చింది. ఆమె తెల్లమైల, ఎర్రమైల, కడుపునొప్పి సమస్యలు వివరించింది. ఆమెను పరీక్షించిన వైద్యులు జననేంద్రియంలో రబ్బరుతో చేసిన రింగు ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయమై ఆమెను అడగగా 40 ఏళ్ల క్రితం చివరి ప్రసవ సమయంలో గర్భాశయం జారిందని, ప్రసవం చేసిన మంత్రసాని రబ్బర్ రింగ్‌ను జననేంద్రియంలో అమర్చిందని వైద్యులకు తెలిపింది. దీంతో గైనకాలజిస్టు డాక్టర్ సి.మల్లికార్జున్ ఆమెను ఆసుపత్రిలో చేర్చుకుని శనివారం రబ్బరు రింగును తొలగించారు. డాక్టర్ బి. ఇందిర మాట్లాడుతూ గర్భసంచి జారిన వారిలో ఆపరేషన్‌కు ముందు తాత్కాలిక చికిత్సగా రింగ్ పిస్సరిని వాడతారని, కొద్దిమంది సిగ్గుతో ఎవరికీ చెప్పుకోలేక డాక్టర్లకు చూపించుకోరన్నారు. అది యోని మార్గంలో ఎక్కువ సంవత్సరాలు ఉండటం వల్ల అనేక సమస్యలు వస్తాయని, కొన్నిసార్లు క్యాన్సర్ సమస్యలు కూడా వస్తాయని తెలిపారు. సమావేశంలో డాక్టర్ శ్రీలత, డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ మమత, డాక్టర్ వీణ పాల్గొన్నారు. -
ఉంగరం మింగేశాడు.. గొంతులో ఇరుక్కుంది!
సాక్షి, నిజామాబాద్: పిల్లలను అందంగా ముద్దుగా తయారుచేసి.. ఫొటోలు తీసి తల్లిదండ్రులు ముచ్చటపడిపోతుంటారు. తమ వద్ద ఉన్న నగలతో చిన్నారులను అలంకరించి.. సరదా పడుతుంటారు. అయితే, ఇలా పిల్లలను నగలతో అలకరించడం, చిన్నారి శిశువులకు ఉంగరాలు తొడిగే విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. పిల్లలకు అది ప్రమాదంగా పరిణమించవచ్చునని తాజా ఘటన చాటుతోంది. నిజామాబాద్ పట్టణంలో ఓ తల్లిదండ్రులు తమ ఐదు నెలల చిన్నారిని ఉంగరంతో అలంకరించారు. అయితే, చిన్నారి ఆడుతూ.. పాడుతూ అనుకోకుండా ఉంగరం మింగేశాడు. అది గొంతులో ఇరుక్కోవడంతో ఆ శిశువు బాధతో విలవిలలాడిపోయాడు. దీంతో తీవ్ర కలవరపాటుకు లోనైన తల్లిదండ్రులు బాలుడ్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించి.. ఉంగరం గొంతులో ఉన్నట్టు గుర్తించారు. చికిత్స ద్వారా గొంతు నుంచి వైద్యులు ఉంగరాన్ని తొలగించారు. ప్రస్తుతం ఐదు నెలల చిన్నారి యాసిన్ క్షేమంగా ఉన్నాడు. తమ కొడుకు క్షేమంగా బయటపడటంతో తల్లిదండ్రులూ ఊపిరిపీల్చుకున్నారు. -
నిజం రాబట్టేందుకు పూజలు
మీర్‌పేట: ఉంగరం దొంగిలించిందన్న అనుమానంతో నిజం రాబట్టేందుకు మంత్రగత్తెతో పూజలు చేయించిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధి జిల్లెలగూడలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జిల్లెలగూడకు చెందిన నర్సమ్మ అనే మహిళ లలితానగర్‌కు చెందిన అత్తాకోడళ్లు యశోధ, మౌనిక ఇంట్లో అద్దెకు ఉంటూ వాచ్‌మెన్‌గా పనిచేస్తోంది. నెల రోజుల క్రితం మౌనికకు చెందిన ఉంగరం కనిపించకుండా పోయింది. దీంతో నర్సమ్మ ఉంగరాన్ని తీసి ఉంటుందని అనుమానంతో పలుమార్లు ఆమెను నిలదీశారు. తాను ఉంగరాన్ని తీయలేదని చెప్పింది. దీంతో ఆమె నుంచి నిజం రాబట్టేందుకు ఇంటి యజమానులు సోమవారం ఇబ్రహీంపట్నం నుంచి ఓ మంత్రగత్తెను రప్పించారు. సదరు మంత్రగత్తెతో కలిసి సోమవారం ఉదయం నర్సమ్మ ఇంట్లోకి వెళ్లి నిమ్మకాలు, పసుపు పేర్చి పూజలు చేస్తూ ఆమెను భయభ్రాంతులకు గురి చేశారు. దీనిపై స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలు నర్సమ్మ ఫిర్యాదు మేరకు యశోద, మౌనికలను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మంత్రగత్తెను కూడా అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. -
మీ ఉంగరం దేవుడి దగ్గరకు వెళ్లింది
రాంగోపాల్‌పేట్: బాబా భక్తులమంటూ బాబా ఫొటో చేతిలో పెట్టి ఓ గుజరాత్ ముఠా బంగారు ఉంగరం నొక్కేసింది.మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బొల్లారం ప్రాంతానికి చెందిన లక్ష్మణ్ ఈ నెల 26న రిమోట్ కొనుగోలు చేసేందుకు ఆర్పీరోడ్‌కు వచ్చాడు. ఆర్పీరోడ్‌లోని కింగ్స్‌వే హైస్కూల్ వద్ద కారులో కూర్చుని ఉండగా ముగ్గురు వ్యక్తులు సాయిబాబా ఫొటోతో అక్కడికి వచ్చి తాము బాబా భక్తులమని ఏదైనా సహాయం చేయాలని కోరారు. దీంతో లక్ష్మణ్ రూ.60 వారికి ఇవ్వబోగా ‘మీ చేతికి ఉంగరం ఉంది ఉంగరం ఉన్న చేతితో దానం స్వీకరించం’ అని చెప్పారు. దీంతో ఆయన ఉంగరం చేతిలో పెట్టుకుని డబ్బుతో పాటు ఉంగరాన్ని వారి చేతిలో పెట్టాడు. వెంటనే ఉంగరాన్ని చేతితో తీసుకుని చుట్టూ తిప్పి నోట్లో వేసుకున్నట్లు నటించాడు. లక్ష్మణ్ చేతిలో బాబా బొమ్మ పెట్టి వెళ్లిపోతుండగా ఉంగరం ఇవ్వమని కోరాడు. ‘మీ ఉంగరం బాబా దగ్గరకు వెళ్లింది. దానం చేసిన తర్వాత మళ్లీ ఎలా అడుగుతారు అని దబాయిస్తూ అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో లక్ష్మన్ కారు దిగి వారి కోసం గాలించగా గల్లీల్లోనుంచి వెళ్లిపోయారు. దీంతో అతను మహంకాళి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఉంగరం సుమారు తులం బరువు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుజరాత్ ముఠా పనే? సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించన పోలీసులు నిందితులు గుజరాత్ ముఠాగా భావిస్తున్నారు. రంజాన్ సమయంలో వారు భిక్షాటన చేస్తున్నట్లు నటించి దృష్టి మరల్చి చోరీలకు పాల్పడతారన్నారు. ముగ్గురు నిందితుల్లో ఒక బాలుడు కూడా ఉన్నట్లు తెలిసింది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
గాజు ఉంగరమని కొంటే వజ్రమని తేలింది!
లండన్: మనదేశంలో చోర్‌బజార్‌లు ఉంటాయి. అక్కడ అమ్మే సరుకులన్నీ ఒరిజినల్‌గా కనపడే నకిలీ వస్తువులే. అయితే నకిలీదని కొన్న ఓ వస్తువు అసలుదని తేలితే.. జాక్‌పాట్ కొట్టినట్టే కదూ! లండన్‌లో ఓ మహిళకు సరిగ్గా ఇలాగే జరిగింది. వివరాల్లోకెళ్తే.. డెబ్రా గడ్డర్డ్ (55) అనే మహిళ 33 ఏళ్ల కిందట ఓ బూట్ బజార్(స్మగుల్ గూడ్స్ విక్రయించే సంత)లో రూ.925 చెల్లించి ఓ గాజు ఉంగరం కొనుగోలు చేసింది. ఎప్పుడో ముచ్చటపడి కొనుక్కున్న ఆ ఉంగరంలో మిలమిలా మెరిసే గాజు.. గాజు కాదని, 26.27 క్యారెట్ల వజ్రమని తాజాగా తేలింది. వెయ్యి రూపాయలు కూడా ఖర్చుచేయకుండా కొన్న ఉంగరం విలువ ఇప్పుడు ఏకంగా 4,70,000 పౌండ్స్ (భారత కరెన్సీలో రూ.4.33 కోట్లు) అని తెలియడంతో గడ్డర్డ్ ఆనందానికి హద్దే లేకుండాపోయింది. ఆ వజ్రపు ఉంగరాన్ని విక్రయించగా వచ్చే మొత్తాన్ని తన తల్లి కోసం ఖర్చు చేస్తానని చెప్పింది. డెబ్రా గతంలో సామాజిక కార్యకర్తగా పనిచేశారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం ఆమెకు అలవాటు. తన చారిటీ ద్వారా 20 మంది చిన్నారులకు సాయమందించింది. బహుశా.. ఆమె మంచితనమే ఈ విధంగా మేలు చేసిందేమో. -
గురక సమస్యలకు చెక్ పెట్టే హైటెక్ రింగ్
లండన్ : నిద్రలేమి, గురక సమస్యలను నియంత్రించేలా పరిశోధకులు హైటెక్ ఉంగరాన్ని రూపొందించారు. సిలికాన్‌తో తయారుచేసిన ఈ రింగ్‌లో రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్‌ను గుర్తించే సెన్సర్లను అమర్చారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని వేధించే స్లీప్ అప్నియాకు రాత్రి వేళల్లో బ్లడ్ ఆక్సిజన్ రీడింగ్స్ పడిపోవడం ప్రధాన సంకేతంగా భావిస్తారు. అత్యాధునికంగా రూపొందిన ఈ ఉంగరం ద్వారా ఆక్సిజన్ రీడింగ్‌ను పసిగట్టి వైద్యులకు కీలక సమాచారం అందించే వెసులుబాటు ఉంది. తీవ్ర గురక సమస్యలు గుండె పోటు, స్ర్టోక్లకు దారితీసే క్రమంలో ఈ సమస్యను నివారించేందుకు హైటెక్ రింగ్ ఉపయోగకరంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతి మూడు రోజులకు ఓసారి ఈ ఉంగరానికి చార్జింగ్ చేస్తే సరిపోతుందని, ముఖ్యంగా ఒంటరిగా నిద్రించే వారికి ఈ హైటెక్ రింగ్ మేలు చేస్తుందని స్లీప్ ఎక్స్పర్ట్ డాక్టర్ నీల్ స్టాన్లీ చెప్పారు. వచ్చే ఏడాది ఆరంభంలో మార్కెట్లోకి రానున్న ఈ హైటెక్ రింగ్ ధర దాదాపు రూ 7500 ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. -
దొంగను పట్టించిన ఉంగరం
బంజారాహిల్స్: ఉంగరం ఆధారంగా యజమాని కళ్లుగప్పి లక్షల విలువ చేసే ఆభరణాలు కాజేసిన పని మనిషిని బంజారాహిల్స్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.కోటి విలువైన 87 తులాల బంగారు వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్.శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా, కొమ్ములవంచ గ్రామానికి చెందిన సురేష్ బంజారాహిల్స్ రోడ్ నెం. 4లోఉంటున్న క్యాపిటల్ ఫార్చూన్స్ చైర్మన్ సాయిరామ్ మోచర్ల నివాసంలో గత నాలుగేళ్లుగా పని చేస్తున్నాడు. గత నెల 10న సురేష్ ఇంటి యజమానురాలు అపర్ణ బెడ్రూమ్లో నుంచి 43 తులాల బంగారు, వజ్రాభరణాలు, యజమాని తల్లి ఉమ గదిలో నుంచి మరో 44 తులాల బంగారు ఆభరణాలను తస్కరించాడు. వాటిని తన స్వగ్రామానికి తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పగించి యథావిధిగా పనిలో చేరాడు. అదే రోజే సాయిరాం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సురేష్‌తో పాటు మరో 20 మంది సిబ్బందిని ప్రశ్నించారు. ఈ సందర్భంగా సాయిరాం తన నిశ్చితార్థం రోజున అత్తగారు తొడిగిన వజ్రపు ఉంగరం తనకు సెంటిమెంట్ అని ఆ ఒక్కటి దొరికినా బాగుంటుందని తెలిపాడు. సురేష్‌పైనే అనుమానం ఉన్న పోలీసులు కనీసం ఆ ఉంగరం దొరికితే కేసు మూసివేస్తామంటూ నమ్మబలికారు. గత నెల 16న సురేష్ తాను దొంగిలించిన ఉంగరాన్ని తీసుకొచ్చి అపర్ణ బెడ్రూమ్లో బెడ్షీట్లు మార్చే క్రమంలో దులుపుతుండగా ఉంగరం అందులోనుంచి కింద పడినట్లు నటించాడు. ఉంగరం దొరికిందని అపర్ణకు చెప్పడంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది. సురేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమశైలిలో విచారించడంతో నేరం అంగీకరించాడు. దీంతో పోలీసులు నిందితుడి స్వగ్రామానికి వెళ్లి చోరీసొత్తును స్వాధీనం చేసుకున్నారు. అందులో కొన్ని ఆభరణాలను తన స్నేహితులు, బంధువులకు ఇచ్చి నట్లు తేలియడంతో వాటిని కూడా రికవరీ చేశారు. 19 ఆభరణాలు చోరీకి గురైనట్లు యజమాని ఫిర్యాదులో పేర్కొనగా దర్యాప్తులో 24 ఆభరణాలు దొరికాయి. తరచూ తాను బెడ్రూమ్ బీరువాలో నుంచి వీటిని తీసేవాడినని చాలా నగలు ఉండటంతో యజమానులు కనిపెట్టలేదని నిందితుడు తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన డీఐ కె. రవికుమార్, డీఎస్ఐ నాగరాజు గౌడ్లను డీసీపీ అభినందించారు. -
గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించిన సూరత్ ఉంగరం
-
దోషం ఉందని ఉంగరం కాజేసే యత్నం
ఇంద్రకీలాద్రి(విజయవాడ వెస్ట్): కాషాయం కట్టాడు.. నుదిటిన విభూది రాసాడు.. మెడలో రుద్రాక్ష వేశాడు.. ఆకలి అన్నాడు... నీకు దోషం ఉందన్నాడు.. శాంతి చేస్తా.. ఆ తర్వాత అంతా మంచే జరుగుతుందని నమ్మకంగా చెప్పాడు.. తీరా దగ్గరకు వెళ్లే సరికి మాటలతో మాయ చేశాడు.. మత్తు మందు చల్లినట్లుగా అంతా క్షణంలో జరిగిపోయింది.. తీరా రెండు అడుగులు వేసే సరికి చేతికి ఉన్న బంగారపు ఉంగరం మాయమైంది. ఇదీ దుర్గగుడి ఘాట్ రోడ్డు వద్ద ఆదివారం ఓ దొంగ స్వామి నిర్వాకం. భక్తుడిని మాయ చేసి ఉంగరాన్ని కాజేయాలని చూసిన దొంగస్వామిని ఆదివారం భక్తులు పట్టుకుని వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. దొంగస్వామిని పోలీసులు తమదైన శైలిలో విచారించి గతంలో ఇటువంటి ఘటనలకు ఏమైనా సంబంధం ఉందా అనే దిశగా పోలీసులు విచారిస్తున్నారు. సేకరించిన వివరాల ప్రకారం కాకినాడకు చెందిన వంకాయల శ్రీకాంత్, భార్యతో కలిసి అమ్మవారి దర్శనానికై ఇంద్రకీలాద్రికి విచ్చేశాడు. ఘాట్ రోడ్డు ద్వారా కొండపైకి నడుచుకుంటూ వెళ్లేందుకు శ్రీకాంత్ కుటుంబం టోల్‌గేటు వద్దకు వచ్చే సరికి మార్గమధ్యలో ఓ సాధువు కనిపించాడు. మెడలో రుద్రాక్షలు, వంటిపై కాషాయంతో ఉన్న ఆ సాధువు ఆకలిగా ఉంది భోజనం పెట్టించండీ అంటూ అటుగా వచ్చి పోయే భక్తులను అడుగుతున్నాడు. దీంతో శ్రీకాంత్ వెంటనే రూ. 50 తీసి సాధువుకు ఇచ్చాడు. అయితే శ్రీకాంత్ చేయి పట్టుకున్న సాధువు నీకు దోషగుణం ఉందని చెప్పాడు. అంతేకాదు శాంతి చేయాలని చెప్పి శ్రీకాంత్‌ను మాటలోకి దింపాడు. చాకచక్యంగా ఉంగరాన్ని లాగేశాడు. తర్వాత కొద్ది నిమిషాలకు శ్రీకాంత్ యథాస్ధితికి చేరుకోగా, భార్య చేతికి ఉంగరం లేదని గుర్తించింది. దీంతో అప్రమత్తమైన బాధితుడు వెంటనే సాధువును పట్టుకున్నాడు. అక్కడే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న సీఐ రాజేంద్రప్రసాద్‌కు అప్పగించారు. నిందితుడి సమక్షంలో సాధువును తనిఖీ చేయగా, అతని వద్ద ఉంగరం లభించింది. దీంతో సాధువును వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాధువు వేషంలో ఉన్న వ్యక్తి మధ్యప్రదేశ్‌కు చెందిన అశోక్నాగ్గా పోలీసుల విచారణలో తేలింది. అయితే స్టేషన్లోనూ దొంగ సాధువు తన మాటల చాతుర్యంలో తప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. బాధితుడి నుంచి ఫిర్యాదు తీసుకున్న వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఛల్ మోహన్ దొంగా..
గుండె జారి గల్లంతయ్యేలా చేసే చాకులాంటి ఈ కుర్రాడుహీరోయిజంతో అమ్మాయిల దిల్ దోచాడేమో కానీ.. ఉంగరం దొంగిలిస్తాడా? అందునా అప్పన్న దర్శనానికి వచ్చి స్వామిఅంగుళీయకాన్నే కొట్టేస్తాడా? మనకు డౌటే కానీ.. అదే జరిగిందంటున్నారు ఆలయంలో అయ్యవార్లు. అందుకే ‘ఛల్ మోహనరంగా’ అంటూ వచ్చిన హీరో నితిన్‌ను తాళ్లతో కట్టి మరీ నిలదీశారు. స్వామి ఉంగరం ఎక్కడంటూ గద్దించారు. ఆదివారం ఉదయం సింహాచలం ఆలయంలో జరిగిన ఆ ‘దొంగాట’ కథా కమామిషు.. సింహాచలం(పెందుర్తి): ‘ఏమండీ.. చాలా సినిమాల్లో హీరోగా నటించి పేరు తెచ్చుకున్నారు.. పైగా బాగా స్థితిమంతులు. అలాటి మీరు స్వామి వారి ఉంగరాన్ని చోరీ చేశారంటే నమ్మశక్యం కాకుండా ఉంది. మర్యాదగా ఇచ్చేయండి.’ ఇదీ ప్రముఖ నటుడు నితిన్‌కు ఆదివారం సింహగిరిపై ఎదురైన ప్రశ్నల వర్షం. ఆలయ సందర్శనకు వచ్చినప్పుడు ఎదురైన అనుభవం. స్వామి దర్శనానికి వచ్చిన నితిన్‌కు అలయ అలంకారి కరి సీతారామాచార్యులు ఎదురై ఒకమాటైనా మాట్లాడకుండా తాళ్లతో బంధించారు. తర్వాత స్థానాచార్యుడు టి.పి.రాజగోపాల్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన నితిన్‌పై ఎడాపెడా ప్రశ్నలు సంధించారు. దొంగిలించిన ఉంగరాన్ని ఇచ్చేయమన్నారు. ‘నేను తియ్యలేదండి కావాలంటే చెక్ చేసుకోండి’ అని నితిన్ బదులిచ్చారు. ‘శనివారం రాత్రి స్వామివారి ఉంగరం పోయింది. చోరులెవరో కనిపెట్టే పనిలో ఉన్నాం. మాకు ఉంగరం దొరికే వరకు మీరు బందీలుగా ఉండాల్సిందే.’ అని స్థానాచార్యుడు హుకుం జారీ చేశారు. నితిన్‌కు ఇదేం అనుభవం? అని విస్మయపడుతున్నారా? మరేం లేదు.. ఇది సింహగిరిపై జరిగిన వరాహ లక్ష్మీనృసింహస్వామివారి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆదివారం ఉదయం జరిగిన వినోదోత్సవంలో చోటుచేసుకున్న ఘట్టం. ఏటా ఏడు రోజులపాటు జరిగే కల్యాణోత్సవాల్లో భాగంగా ఆరో రోజు రాత్రి దొంగలదోపు ఉత్సవం నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. ఉభయ దేవేరులతో విహారయాత్రకు వెళ్లిన స్వామివారి ఉంగరం కనిపించకపోవడంతో ఆయనకు అదో సమస్య అవుతుంది. ఉంగరం ఉంటేనే రావాలని అమ్మవారు అలుగుతుంది. దీంతో స్వామి మర్నాడు ఉదయం ఉంగరాన్ని వెతుక్కునే పనిలో పడతారు. తన తరపు దూతగా వైదికుల్లో ఒకరిని నియోగించి.. భక్తులను తాళ్లతో బంధించి తీసుకొచ్చి ప్రశ్నింపజేస్తారు. అలా పలువురు భక్తులు ఉంగరం దొంగలనే అభియోగాన్ని ఎదుర్కొంటారు. చివరికి ఎక్కడా ఉంగరం దొరక్కపోయేసరికి.. స్వామికి ఆచ్ఛాదనగా ఉండే పరదాలలో అన్వేషించగా, చివరి పరదాలో ఉంగరం లభిస్తుంది. ఆద్యంతం రక్తికట్టే ఈ వేడుకను వినోదోత్సవంగా అభివర్ణిస్తారు. సింహగిరిపై ఆదివారం వినోదోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవం జరుగుతున్నప్పుడే హీరో నితిన్ స్వామివారి దర్శనానికి సింహగిరికి వచ్చారు. అప్పుడు ఆయన్ని తాళ్లతో బంధించి ప్రశ్నించారు. కన్నీళ్లు.. గొడవలు నితిన్‌ను మాత్రమే కాక.. చాలామంది భక్తులను కూడా అలంకారి కరి సీతారామాచార్యులు బంధించగా.. స్థానాచార్యుడు రాజగోపాల్ కఠినంగా ప్రశ్నించారు. విషయం తెలిసిన భక్తులకు ఇది వినోదంగా ఉండగా.. చాలామంది భక్తులు ఏమీ తెలియక బెంబేలెత్తిపోయారు. స్వామివారి ఉంగరాన్ని తాము తీశామన్న అభియోగం ఎదుర్కోవడంతో వారు కలవరపడ్డారు. ‘స్వామి దర్శనానికి వస్తే దొంగలంటారేమిటండీ.. మేం దొంగల్లా కనిపిస్తున్నామా?’ అని కొందరు గర్జించారు. కొంతమంది వలవలా ఏడ్చేశారు. మరికొందరు స్థానాచార్యులతో వాగ్వాదానికి దిగారు. ఇదంతా చూస్తూ నవ్వుతున్న వారిపై చిర్రుబుర్రుల్లాడారు. చివరికిది వినోదోత్సవం అని తెలుసుకుని స్వామి తమకు కల్పించిన మహాభాగ్యమని ఆనందోత్సాహాలతో వెనుదిరిగారు. ఇలా విజయవాడకు చెందిన అనూష, విశాఖలో డిగ్రీ చదువుతున్న ఖర్గపూర్ వాస్తవ్యులు వందన, పింకీ, వినీత కన్నీరు పెట్టుకున్నారు. శ్రీకాకుళానికి చెందిన తండ్రీకొడుకులు అప్పారావు, ప్రసాద్, విశాఖ విద్యార్ధినులు కావ్య, ప్రమీల స్థానాచార్యులతో వాదులాడారు. విశాఖలో గుర్రంపాలేనికి చెందిన అమిత్, అలేఖ్య, గోపాలపట్నానికి చెందిన నూతన దంపతులు రవి, ఆకాంక్ష ‘దొంగలు’గా చిక్కారు. గీతం కళాశాల బిటెక్ విద్యార్ధినులు మౌనిక, నివేదిత, స్వప్న, శ్రీకాకుళం రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌లో పనిచేస్తున్న మోహన్, మణి దంపతులు తదితరులు ఉంగరం దొంగలుగా పట్టుబడ్డారు. ఆలయ కొత్వాల్ నాయక్, ఏఈవో ఆర్.వి.ఎస్.ప్రసాద్, పీఆర్వో జైమునిలనూ బంధించారు. చివరికి స్థానాచార్యులు, హవల్దార్ కూడా దొంగలుగా చిక్కారు. -
మాయా ఉంగరం
అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న పాప వాళ్ల తాతయ్యతో కలిసి నివసిస్తుండేది. అది శీతాకాలం. వాళ్ల తాతయ్య జబ్బు పడ్డాడు. అతనికి పొగతాగే అలవాటుంది. తాతయ్య పొగాకు కోసం, పాప బయటికొచ్చింది. వాళ్ల ఇంటి పక్కన ఒక రైల్వే స్టేషన్ ఉంది. దానికి అవతల పొగాకు అమ్మే దుకాణం ఉంది. అక్కడకు వెళ్లింది పాప. పొగాకు కొని ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు రైల్వేస్టేషన్లో సైనికులు కనపడ్డారు. ‘‘పాపా, ఏంటి నీ చేతుల్లో ఉన్నది’’ అడిగాడు ఓ సైనికుడు. ‘‘మా తాతయ్య కోసం పొగాకు తీసుకెళ్తున్నాను’’ అంది పాప. ‘‘నాకు కొంచెం అమ్ముతావా?’’ అన్నాడు సైనికుడు. ‘‘లేదు’’ అంది పాప. చిన్నబోయాడు సైనికుడు. ‘‘కొంచెం ఊరికెనే ఇస్తాను’’ అని ఆ సైనికుడికి కొంచెం పొగాకు ఇచ్చింది. ఎంతో ఆనందించిన సైనికుడు పాపకి బహుమతిగా ఓ ‘మాయా ఉంగరం’ ఇచ్చాడు. ‘‘ఇది అద్భుతమైన ఉంగరం. ఈ ఉంగరాన్ని మధ్యవేలుకు పెట్టుకుంటే, నీవు, మీ తాతయ్య ఆరోగ్యంగా ఉంటారు. ఈ ఉంగరాన్ని చూపుడువేలుకి పెట్టుకుంటే, నీవు చాలా ఆనందంగా ఉంటావు’’అన్నాడు సైనికుడు. ఆ సైనికుడికి మంత్రవిద్యలు తెలుసు. పాప ఆనందంతో మాయా ఉంగరాన్ని తీసుకుని సైనికునికి కృతజ్ఞతలు చెప్పింది. దారిలో వెళ్తూ ఆ మాయా ఉంగరాన్ని చిటికెన వేలుకు పెట్టుకుంది. పాప చిటికెన వేలు బాగా చిన్నది. ఉంగరం కొంచెం పెద్దది. కాబట్టి అది జారి మంచులో పడిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. ఏడుస్తూ ఇంటికి పోయి, జరిగిన కథంతా వాళ్ల తాతకు చెప్పింది. తాతకు పొగాకు ఇచ్చింది.‘‘బాధపడకు, మన ఉడుత నీకు సాయం చేస్తుందేమో అడుగు’’ అని సలహా ఇచ్చాడు తాతయ్య.పాప ఉడుతని సాయమడిగింది. ఉడుత ముందు కొంచెం బెట్టు చేసింది. చివరికి ఒప్పుకుంది. ఉడుత, పాప కలిసి రోజూ ఆ ఉంగరం కోసం వెతికేవాళ్లు. చివరికి ఓ రోజు మాయా ఉంగరం పాపకు దొరికింది. పాప ఆనందానికి అవధుల్లేవు. ఉడుతకు కృతజ్ఞతలు చెప్పింది. మాయా ఉంగరాన్ని మధ్య వేలుకు ధరించింది. ఇంటికొచ్చి చూసేసరికి తాతయ్య ఆరోగ్యంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు.‘‘చిన్నారీ! నీవు బయటకు వెళ్తూ తలుపు మూయలేదు. తాజా గాలి గదిలోకి వచ్చింది. నా జబ్బు నయం చేసింది’’ అన్నాడు తాతయ్య.ఉంగరం విశేషం చెప్పింది పాప. తాతయ్య వంట చెరకు నరకడం లాంటి పనుల్లో పడ్డాడు. వంట చేయడానికి పాప, తాతయ్యకు సాయంచేసేది. తరువాతి రోజు పాప మాయా ఉంగరాన్ని తన చూపుడువేలుకు పెట్టుకుంది.వాళ్ల ఇంటిపక్కనున్న అడవి ఎంతో ప్రకాశవంతంగా వెలిగింది. చెట్లు పువ్వులు పూశాయి. పండ్లను కాశాయి. నీలి ఆకాశం ఎంతో అందంగా మెరిసింది. సూర్యుడు మబ్బుల వెనక నుంచి ఠీవిగా బయటకు వచ్చాడు. ఈ దృశ్యాలను చూసి పాప, తాతయ్య, ఉడుత ఆనందంతో నృత్యం చేశారు. వాళ్లు ఈ రోజుకీ ఆనందంగానే ఉన్నారు. - స్వేచ్ఛానువాదం : అనిల్ బత్తుల -
కోహ్లితో అభిమాని ఫొటో.. వైరల్ !
విరాట్ కోహ్లి-అనుష్కల వివాహం ఇటీవల చాలా హాట్ టాఫిక్ మారిన విషయం తెలిసిందే. సఫారీ పర్యటనకు బయలుదేరే ముందు కోహ్లి తనకు క్రికెట్‌పై ఉన్న ఇష్టాన్ని తెలిపారు. క్రికెట్ అంటే తనకు రక్తంతో సమానం అన్నారు. అంతేకాక పెళ్లి తనలో ఏ విధమైన మార్పు తేలేదని కోహ్లి అన్నారు. విరాట్ కేప్ టౌన్లో ప్రాక్టీస్ సెషన్ అనంతరం ఓ అభిమానితో కలిసి ఫొటో దిగారు. ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పెళ్లిలో అనుష్క విరాట్ కోహ్లి వేలికి ఉంగరం తొడిగింది. ఆ రింగ్‌ను మన కెప్టెన్ ఒక గొలుసుతో కలిపి మెడలో వేసుకున్నట్లు ఆ ఫొటోలో కనిపిస్తోంది. సఫారీ పర్యటనలో టీమిండియా మూడు టెస్టు మ్యాచ్‌లు, 6 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. రేపు (జనవరి 5న) కేప్ టౌన్ లో తొలి టెస్టు ప్రారంభకానున్న విషయం తెలిసిందే. -
పికాసో ఉంగరం విలువ ఎంతో తెలుసా..
లండన్: ప్రపంచ ప్రఖ్యాతి పొందిన చిత్రకారుడు పాబ్లో పికాసో తన స్ఫూర్తిదాత, ప్రేయసి, పెయింటర్, కవయిత్రి డోరా మార్కు ఆమె చిత్తరువుతో స్వయంగా చేసి ఇచ్చిన ఉంగరం వేలానికి వచ్చింది. మీరా ఎస్టేట్‌తో పాటు పికాసో ఉంగరాన్ని ఈ నెల 21న వేలం వేయనున్నట్లు సోత్‌బై వేలం సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ ఒక్క ఉంగరానికే ఐదు కోట్ల రూపాయలు వేలం పలుకుతుందని వారు అంచనా వేస్తున్నారు. 1930లో డోరా మార్ ఓ రూబీ ఉంగరాన్ని ధరించడం చూసి పికాసోకు కోపం వచ్చింది. రూబీ కోసం పెయింటింగ్‌ను అమ్మేశావా..? అంటూ పికాసో ప్రశ్నించడం ఆమెకు కోపం తెప్పించింది. వెంటనే ఆమె తన చేతికున్న ఉంగరాన్ని తీసి పక్కనే ఉన్న నదిలో పడేసింది. తప్పు చేశాననుకున్న పికాసో ఆమె చిత్తరువు ఉండేలా ఓ కళాత్మకమైన ఉంగరాన్ని తయారుచేసి ఆమెకు బహూకరించారు. ఆ ఉంగరం ఆమె చనిపోయే వరకు (1977) ఆమె వేలికే ఉంది. పికాసో అప్పటి సమకాలీన ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఈ ఉంగరాన్ని తయారు చేశారని సోత్‌బై వేలం సంస్థ నిర్వాహకులు అంటున్నారు. -
ఉంగరం మింగిన పసిబాలుడు
– తప్పిన ముప్పు – కాపాడిన డాక్టర్ మధుసూదనరావు, శేషఫణి నంద్యాల: నెలరోజులు కూడా నిండని పసిబాలుడు వెండి ఉంగరం మింగాడు. సకాలంలో వైద్యులు ఆపరేషన్ చేసి ప్రాణాపాయం నుంచి రక్షించారు. సోమవారం నంద్యాలలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన అశోక్, లక్ష్మీదేవిలకు ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. వీరికి గత నెల 8వ తేదీన మగబిడ్డ జన్మించాడు. హర్షవర్దన్గా నామకరణం చేసిన ఈ పసిబాలుడి వేలికి తల్లి లక్ష్మిదేవి ప్రేమతో వెండి ఉంగరం తొడిగింది. నోట్లో వేలు పెట్టుకున్న సమయంలో ఉంగరం కడుపులోకి పోయింది. కొద్ది సేపటి తర్వాత ఏడుస్తూ వాంతులు చేసుకోవడంతో అనుమానం వచ్చిన తండ్రి అశోక్ వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. హర్షవర్దన్‌కు ఎక్సరేలు తీసిన వైద్యులు ఉంగరం గొంతులోని అన్నాశయం వద్ద చిక్కుకున్నట్లు గుర్తించారు. వెంటనే కర్నూలు లేదా హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో అశోక్ నంద్యాలలోని మధుమణి నర్సింగ్ హోంకు తీసుకెళ్లాడు. అక్కడ ప్రముఖ అనస్థీయ స్పెషలిస్ట్ శేషఫణి, డాక్టర్ మధుసూదనరావు ఎండోస్కోపీ సర్జరీ ద్వారా హర్షవర్దన్ అన్నాశయంలోని ఉంగరాన్ని బయటకు తీశారు. బిడ్డ ప్రాణాపాయం నుంచి బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. -
అభివృద్ధి పనుల టెండర్లలో రింగ్?
రూ.4.26 కోట్ల పనుల్లో కాంట్రాక్టర్ల ప్రయత్నం కోల్‌సిటీ : రామగుండం నగరపాలక సంస్థలో ఇటీవల పిలిచిన రూ.4.26 కోట్ల అభివృద్ధి పనుల టెండర్లు దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు రింగ్‌కు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 13వ, 14వ ఆర్థిక సంఘం నిధులతోపాటు ఎస్సీ, జనరల్ ఫండ్ నిధులు రూ.4.26 కోట్లతో 52 అభివృద్ధి పనుల కోసం ఆన్లైన్లో ఇంజినీరింగ్ అధికారులు టెండర్లు పిలిచారు. ఈనెల 2న టెండర్లకు షెడ్యూల్ దాఖలు చేయడానికి చివరి గడువు విధించగా, ఆ రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెతో కాంట్రాక్టర్లు వాయిదా వేయాలంటూ వినతిపత్రం సమర్పించారు. దీంతో అధికారులు బుధవారానికి వాయిదా వేశారు. సమయం పొడిగించడంతో కాంట్రాక్టర్ల మధ్య రాజీయత్నాలు జరుపుకోవడానికి మార్గం సులువైంది. మంగళవారం సాయంత్రం కాంట్రాక్టర్లు మార్కండేయకాలనీలోని ఓ రహస్య ప్రాంతంలో మంతనాలు జరిపారని తెలిసింది. కాంట్రాక్టర్లు అందరూ సయోధ్యతతో ఉంటేనే అనుకున్న వారికి పనులు వస్తాయని వారు చర్చించుకున్నట్లు సమాచారం. కాంట్రాక్టర్లు ఏ రేట్లకు షెడ్యూల్ దాఖలు చేశారన్న విషయం బుధవారం సాయంత్రం తెలియనుంది. -
హెల్త్ కాల్ ఇచ్చే రింగ్
టెక్ టాక్ ఆరోగ్యమే మహాభాగ్యం. కాదనేవారెవరూ లేరుగానీ...ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏం తింటున్నాం? తిన్నది శరీరంలోకి ఎలా చేరుతోంది? దానివల్ల లాభనష్టాలేమిటి? అన్నది తెలియాలి. ఈ పనుల్లో కొన్నింటిని చేసిపెట్టేందుకు మార్కెట్లో చాలా పరికరాలున్నాయి. ఫొటోలో కనిపిస్తున్న బయో రింగ్ వీటితోపాటు మరికొన్ని పనులూ చేసిపెడుతుంది. స్వీడన్‌కు చెందిన ఔత్సాహిక శాస్త్రవేత్తలు కొందరు దీన్ని రూపొందించారు. తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రొటీన్ల మోతాదులను లెక్కకట్టడం... మొత్తం కేలరీలు, మీరు ఖర్చుపెట్టినవి వంటి అన్ని వివరాలూ అందిస్తుంది. ఆహారం తీసుకున్న తరువాత మన శరీర కణాల్లోకి చేరే గ్లూకోజ్ మోతాదులను బయో ఇంపెడెన్స్ సెన్సర్ ద్వారా లెక్కకట్టవచ్చు. ప్రత్యేకమైన అల్గారిథమ్‌ల ద్వారా ఆ వివరాలను స్మార్ట్‌ఫోన్‌లోని ఆప్‌కు పంపుతుంది. ఏవైనా పరిమితికి మించి ఉన్నాయని తేలితే వెంటనే ఈ రింగ్‌లోని రెండు వైబ్రేటర్లు మిమ్మల్ని హెచ్చరిస్తాయి. మీ ఎత్తు, బరువులతోపాటు కొన్ని ఇతర వివరాలను అందిస్తే చాలు. మీరు వేసే అడుగులను లెక్కపెట్టేందుకు మూడు అక్షాంశాలపై పనిచేసే యాక్సెలరోమీటర్, గుండెకొట్టుకునే వేగం కోసం చిన్న ఎల్ఈడీ బల్బును ఉపయోగిస్తుంది. ప్రస్తుతానికి దీని ధర 300 డాలర్లు. ఇండిగెగో వెబ్సైట్ ద్వారా ప్రీఆర్డర్ చేయవచ్చు. ఈ ఏడాది నవంబరు నుంచి పంపిణీ ప్రారంభమవుతుంది. -
బైక్ దొంగల అరెస్ట్... 30బైక్‌లు స్వాధీనం
వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఓ కరుడుగట్టిన దొంగల ముఠాను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఐదుగురు సభ్యుల దొంగల ముఠాను మీర్‌పేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 30ద్విచక్ర వాహనాలనుస్వాధీనం చేసుకున్నారు. మీర్‌పేట, వనస్థలిపురం, హయత్‌నగర్, ఎల్బీనగర్, సరూర్‌నగర్, ఆదిబట్ల, ఉప్పల్, మహేశ్వరం పోలీస్‌స్టేషన్ పరిధిలో వీరు బైక్‌లను చోరీ చేసినట్టు పోలీసులు తెలిపారు. -
పెళ్లి కొడుకు ఉంగరం మాయం కొద్దిసేపు ఆగిన పెళ్లి
నారాయణఖేడ్: వివాహ వేడుకల్లో పెళ్లి కొడుకు ఉంగరం మాయమైంది. దీంతో రెండు గంటల పాటు పెళ్లి తంతు ఆగింది. నారాయణఖేడ్ మండలం సత్తెగామ గ్రామంలో బుధవారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన లింగొండ, సంగమ్మల కూతురు భారతికి చిన్న హైదరాబాద్‌కు చెందిన అనిల్‌తో వివాహం బుధవారం సత్తెగామ గ్రామంలో నిర్వహించారు. పురోహితుడు ఈశ్వరయ్యస్వామి వరుడికి బంగారు ఉంగరం, వధువు తాళి, మట్టెలు పల్లెంలో ఉంచి మంత్రాలు ఉచ్ఛరిస్తున్నారు. ఈ క్రమంలో మాంగల్యధారణ సమయంలో ఉంగరం కనిపించకపోవడంతో వివాహ మండపంలో చోరీ కలకలం రేగింది. రెండు గంటల పాటు పెళ్లితంతు నిల్చిపోయింది. చివరకు పెద్దలు జోక్యం చేసుకొని శుభకార్యాన్ని కానిచ్చారు. ఉంగరం ఎవరు మాయం చేశారనేది మిస్టరీగా మారింది. -
ఉంగరం
క్లాసిక్ కథ అమ్హయ్య! ఈ రోజుతో తన కష్టాలన్నీ ఫలిస్తాయి. దేనికైనా ధైర్యం ఉండాలి. ఎటువంటి అద్భుతమైన ఆలోచన తట్టింది తనకి! ఎలాగ మెరుస్తోంది తన అందమైన వేలికి? - ఇంక దీనితో తాను బతుకుని కొత్తగా తీర్చుకోవాలి. సుఖంగా దర్జాగా జీవితం గడపాలి. ఇంతవరకూ తానెంత నీచంగా బతికిందీ తలుచుకుంటేనే అసహ్యం వేస్తోంది. అంట్లు తోమడం, గదులూడ్చడం, వాళ్ళిచ్చే పాసిపోయిన అన్నంతో పాటు తిట్లనీ శాప నార్థాల్నీ మూటకట్టుకుని నిస్సహాయతతో ఉడుకుమోతుతనంతో యింటికి వెళ్ళడమూ - అక్కడ తల్లి రోగంతో మంచం మీద బల్లిలాగా అంటుకుపోయి, తాను ఆలస్యంగా వచ్చి నందుకు ఇంకా తిట్టడమూ - తన వొళ్ళంతా చాకిరితో నొప్పులూ - ఏడుపొచ్చేది తనకి. చచ్చిపోవాలనిపించేది. అందరిలాగా తాను హాయిగా కులాసాగా ఎందుకు బతకకూడదు? పంతులమ్మ కూతురిలా సిల్కు వోణీలు తన కెందుకుండవు? రవణమ్మ బుగ్గలూ వొళ్ళూ ఎలా నిగనిగలాడుతుంటాయో - రెండు పూటలా మీగడ పెరుగూ వెన్నపూసా వేసుకుని తింటుంది కదూ! తన యీడుదే వరహాలు మరి. రోజూ తల్లో పువ్వులు పెట్టుకుని కాటుక పెట్టుకుని సినిమాకు వెళ్తుంటుంది మొగుడితో. మరి తనకి పువ్వులూ సినిమాకి డబ్బులూ ఎప్పుడూ వుండవు. మరి మొగుడూ లేడు! తనలో ఎన్ని కోరికలు! ఎన్ని కలలు! చిన్నప్పట్నుండీ తనకెందుకో ఎగిరిపోవాలనీ, పాటలు పాడాలనీ, నాట్యం చెయ్యాలనీ ఎన్నో ఎన్నో - పొలంగట్టుకాడ కూర్చుని సినిమా పాటలు పాడుతుంటే తనకేసి అందరూ చూసి నవ్వేవారు. తనని వెర్రిదనేవారు. ఏమిటో తన వెర్రి! మంచిబట్టలు కట్టుకోవాలనీ, షోగ్గా సింగారించుకోవాలనీ హాయిగా బతకాలనీ ఎవరనుకోరు! వాళ్ళకి డబ్బూ యిల్లూ ఉన్నా ఎంత అసహ్యంగా బతుకుతారు! ఎంత లేకిగా వుంటారు? వడ్డాణమూ కాసులపేరూ పెట్టుకుని తిరుగుతుంది అమ్మగారు. ‘అమ్మా, ఈవాళ తిరణాల, ఓ బేడ డబ్బు లివ్వండి’ అని అడిగితే దండకం చదువుతుంది. ‘నా దగ్గర ఏం ఒలకడంలేదు. ముష్టిముండా పీనుగని ఒక్క అణా డబ్బులు కూడా నాకివ్వరు. తాళి కట్టాడు కాబట్టి యిలా బతుకుతున్నాను కుక్కిన పేనులాగ. ఈయన్నీ ఈయన డబ్బునీ చూచి పీక కోశాడు మానాన్న’ - అబ్బబ్బ వినలేక వచ్చేస్తాను. ఇవ్వకపోతే మానె, ఇంత అఘాయిత్యంగా మాట్లాడుతుందే విటి: అయ్యగారు ఊళ్ళో లేనప్పుడు ధాన్యం చాటుగా అమ్మి డబ్బు దాచేసుకుంటుంది. పోనీ అయ్యగారిని అడిగితే ఆయన ఒకటే తిట్లు. ‘‘ఈ గది సరీగా ఊడవలేదేం! వెధవ పనితనం నువ్వూ, పైగా డబ్బులు కావాలిట! మీ అమ్మ నిరుడు వైద్యానికి మూడు రూపాయలు తీసుకు వెళ్ళింది. తీర్చడం మాట ఉత్తిదే. అయినా తిరణాలకెందుకే నీకు? వెధవ చిరుతిండి తింటా నికా? రెండు పూటలా తింటున్నావు చాలదూ?’’ ఉక్రోషం వచ్చింది తనకి! తనదగ్గరే డబ్బులుంటే ‘‘ఏడవకయ్యా! ఈ రూపాయి తీసుకుని తిరణాలకెళ్ళి నువ్వే కొనుక్కో’’ అని యిచ్చేసును. ఇవ్వనంటే పోయేది యింతంత మాటలెందుకో! తనకి అందం లేదా! తెలివితేటలు లేవా! సుబ్బయ్యగారి గదిలో ఎవరూ లేనప్పుడు అద్దంలో తన మొహాన్ని చూచుకొనేది. ఎంత అందంగా వుంది తన మొహం - నిగనిగలాడే వొళ్ళూ, మెరిసే కళ్ళూ, బుగ్గమీద సొట్టా - వాళ్ళ అచ్చెమ్మకన్న వెయ్యిరెట్లు నయం. కొంచెం సబ్బు పెట్టి మొహం తోముకుని పువ్వులరైక తొడుక్కుంటే అచ్చెమ్మ డీలా అయి పోదూ! చిన్న కళ్ళూ, లావాటి పెదవులు - దాన్నెవడు మనువు చేసుకుంటాడూ! డబ్బుని చూశా? వెర్రిముండాకొడుకులు. పిల్ల యేపుగా ఊతంగా వుంటే సరదా కాని డబ్బుతో ఏం మనసు తీరుతుందీ? తిని బలిసిన అచ్చెమ్మకి ఎప్పుడూ సొగసులూ సొలపులూ. లేవలేదు, కూర్చోలేదు. తనకున్న విలువ వాళ్ళకుందా. తన అందాన్ని ఊరకే తక్కువకి కొనెయ్య వచ్చునని అను కుంటారు రౌడీ వెధవలు. రోడ్లమ్మటి పోతుంటే కోరగా జోరుగా చూస్తారు. సుబ్బయ్య గారి కోడలు - అదేవిటి అలా చూస్తాడు? జేబులోంచి వెండి రూపాయితీసి మోగిస్తాడు. చెయ్యి వూపుతాడు! మళ్ళీ భయం. వీధి గుమ్మంలో జోడు చప్పుడవగానే గటుక్కున గదిలోకి దూకి తలుపులు వేసుకుంటాడు, వాళ్ళ బాబు వస్తున్నాడని. తన వాళ్ళందరిలాగా తనకెందుకో తృప్తి వుండదు. రంగురంగుల ఊహలు కలవర పెడు తుంటాయి. తనకెన్నో కథలు వచ్చును. ఊరవతల గుడికాడ సాధుబాబా వుండేవాడు. చిన్నప్పుడు తనకి మాంచి కథలు చెప్పేవాడు. తెల్లని గడ్డం, ముడతలు పడిన కళ్ళూ, వళ్ళూ, చిరిగిన బనీనూ వేసుకుని తన్నెంతో ఆప్యా యంగా చూసేవాడు. తాను గొప్పదానినౌతా నని రాజకుమారినవుతానని చెప్పేవాడు. రాజకుమారులు తెల్లని గుర్రాలమీద ఎక్కించేసుకుని తీసుకెళ్ళిపోయి పెళ్ళి చేసు కుంటారట. వాళ్లకి పెద్ద పెద్ద మేడలు, నౌకర్లు, మాంచి పిండివంటలు, జిగేల్మనే నగలు... సీతాలుని ఓ అబ్బాయి అలాగే లేవ తీసుకుపోయాడు. ఏడాది పోయాక మళ్ళీ వచ్చింది సీతాలు. ఎంచక్కావుంది. సిల్కుచీర కట్టుకుంది. బంగారపు గాజులు వేసుకుంది. ఆ అబ్బాయి పట్నం తీసుకెళ్ళి అక్కడ పెళ్ళి చేసుకున్నాడట. వర్తకం చేస్తాడట. ఎంతో డబ్భు లాభం వస్తుందిట! ‘‘నన్ను కూడా తీసుకు పోయేందుకు ఎవడినేనా చూసిపెట్టు సీతాలూ’’ అని అడిగింది ఆ రోజున. ఎంతో బతిమాలు కుంది. సీతాలు విరగబడి నవ్వింది. ‘‘నేను చూసి పెట్టనా. ఓయమ్మ యిదేం సోద్దెమే ’’ అంది. ‘‘నాకేం తక్కువ?’’ అంది తను ఉక్రోషంగా. ‘‘ఇలాంటి బట్టలు వేసుకుంటే ఎలాగ? మాంచి పరికిణీ వోణీ కుట్టించుకో, ఆ మొగుడెవరో వాడే వస్తాడులే’’ అంది సీతాలు. తనకి మంచి బట్టలు ఎలా వస్తాయి? పోనీ సుబ్బయ్యగాడు, వెర్రిపిల్ల చాలాకాలం నుంచి చాకిరీ చేస్తోందని కొనిపెట్టకూడదూ? ఆయన కూతురు అచ్చెమ్మ ఓ చీర యివ్వకూడదూ? ఇలా అనుకునేది తను. కానీ యింత సులువైన ఊహ తట్టనేలేదు ఎప్పుడూ తనకి. సుబ్బయ్య చిన్న కొడుకు బళ్ళో నుంచి వస్తున్నాడు. వాడి వేలిని ఉంగరం మెరిసింది. ఈ కబురూ ఆ కబురూ చెప్పి మిఠాయి కొనిపెట్టి ఉంగరం తీసేసుకుంది. కుర్రనాగన్న యింటి దగ్గర చెప్పగలడా? సుబ్బయ్యగారూ, పెళ్ళామూ ఉంగరం ఎక్కడో పోయిందనుకుంటారు. ఈ ఉంగరం అమ్మితే ఇరవై రూపాయలేనా వస్తాయి. ఆ డబ్బుతో అందమైన బట్టలు కొనుక్కుని కట్టుకుని వెళుతూవుంటే మాంచి రాజకుమారుడులాంటి కుర్రాడు తన్ను చూసి ‘‘ఏయ్ అమ్మాయ్’’ అని నవ్వుతాడు అదోలా. పెళ్ళికొడుకులు నవ్వినట్టు నవ్వుతాడు. అప్పుడు... అయినా తను అందర్నీ నమ్మకూడదు. మంచివాణ్ణి, డబ్బున్న వాడినీ ఏరుకోవాలి. దొరలాగ వుండాలి వాడు. ‘నిన్ను పెళ్ళి చేసి కొంటాను. నువ్వులేందే బతకలేను లచ్చీ’ అనాలి. అప్పుడెంచక్కా వాడిని పెళ్ళి చేసు కుంటుంది. సీతాలులాగా పట్నం వెళ్ళిపో తుంది. ఎప్పుడేనా సుబ్బయ్యగారు యిటువస్తే తనను చూసి ‘అబ్బో’ అని ముక్కు మీద వేలేసు కుంటారు! పెళ్ళి చేసుకోలేకపోతే నలుగురిలో గౌరవం ఉండదు. అందరూ తిడతారు. ఛీ అంటారు. పెళ్ళయితే కాని - మగవాడికి అలుసివ్వకూడదు. దొంగవెధవలు సరదా తీరాక పురుగును దులిపినట్టు దులిపి పారేస్తారు. సింగడు మరి యిదివరకూ ఏం చేశాడు? ఎన్ని కబుర్లు చెప్పాడు? రంగం వెళ్ళిపోదామన్నాడు. తీరా ఓ రోజున మరెవత్తెనో పెళ్ళి చేసుకున్నాడు. తనింకా అప్పుడు చిన్నపిల్ల. ఎంతో ఏడ్చింది. ‘‘ఏంటి యిలా అన్యాయం చేశావ్’’ అంటే ‘నిన్నెవడు పెళ్ళాడుతాడు’ అన్నాడు. నల్లని ఉంగరాల జుట్టు ఉండాలి. తెల్లగా పొడుగ్గా ఉండాలి. మంచి యిల్లు తోటా వుండాలి. అలాంటి అబ్బాయి వచ్చి పెళ్ళి చేసుకోవాలి. తలలో పువ్వులు పెట్టుకొని పెరట్లో పాటలు పాడుతూంటుంది తను. వెనకాలే వచ్చి కళ్ళు మూస్తాడు. చేతులు తీయ కుండానే బుగ్గమీద ముద్దు పెట్టుకుంటాడు. తను మళ్ళీ ఆయన మొహాన్ని దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకుంటుంది. తను రోజూ నీళ్ళు పోసుకుంటుంది. ఘుమఘుమలాడే సబ్బుతో వొళ్ళంతా రుద్దుకుంటుంది. బలే వాసన. ఓసారి సుబ్బయ్యగారి అల్లుడు వదిలేసిన సబ్బు ముక్క తెచ్చుకుని నీళ్ళు పోసుకుంది. తన వొళ్ళు కొత్తగా మెత్తగా పట్టుచీరలా మెరిసిపోయింది. ఒకానొక వేసవిలో ఊరికి దూరంగా ఉన్న ఒక మామిడితోపులో కూర్చుని పగటి కలలు కంటోంది. పదిహేడేళ్ళ దాసీపిల్ల లక్ష్మి చిరిగిన మానిన బట్టలూ సంస్కారంలేని చిక్కబడిన జుట్టూ, ఆమె కళ్ళల్లో ఊహల నిచ్చెనలమీద ఎగబ్రాకే కోర్కెల్ని ఆపలేకపోతున్నాయి. చల్లని పైరుగాలి, ప్రశాంతమైన మామిడితోటా, యౌవనం కొత్తగా వింతగా అలుముకుంటూన్న ఆమె వయస్సూ ఆమె కలల్ని మరింత రెచ్చ గొడుతున్నాయి. తాను దిక్కులేని దాసీపిల్లననీ, తన భవిష్యత్తు ఎప్పుడూ యింతేననీ వాస్తవికంగా ఆమె ఆలోచించగలిగితే అప్పుడీ స్వప్నాలవల్ల కలిగే క్షణికమైన మధురానుభూతి కూడా జీవితంలో లేకుండా చేసుకోవడమే అవుతుందేమో! బతుకు అడుక్కిపొయినకొలదీ బతకడానికి చేయూత స్వప్నం మాత్రమే కాబోలు. అందరూ అభాగిని అయిన లక్ష్మిలాగ కలలు కంటారు. కానీ ఆ కలలు నిజాలౌతా యని నమ్మరు. అక్కడ వాళ్ళు తెలివిగా జాగ్రత్త పడతారు. కాని లక్ష్మిలాంటి అమాయకులూ ఆవేశ హృదయాలూ కలల్ని తరుముకుంటూనే పరుగెత్తుతారు. దానిలో గొప్పితగిలేదీ గొయ్యి వచ్చేదీ చూచుకోరు. రోగిష్టి ఆరోగ్యాన్ని గురించీ, ఆకలితో ఉన్నవాడు రుచికరమైన పిండి వంటల్ని గురించీ, దరిద్రుడు ధనం యిచ్చే సౌఖ్యాన్ని గురించీ ఆలోచించకుండా ఏ చట్టమూ శాసించలేదు. నిజమే. అందుకే భయంకర దరిద్ర పీడితులూ, అంగవికలులూ, దుర్భర వ్యాధిగ్రస్తులూ ఆత్మహత్య చేసుకుని కడతేరకుండా బతుకుతూనే వుంటారు, రేపటి సుఖంకోసం. కళ్ళెంలేని భావనా ప్రపంచంలో విహారం చేస్తూన్న లక్ష్మి తనని ఓ గంట నుండి నారాయణ అదేపనిగా పరికిస్తున్నాడని గమ నించలేకపోయింది. కొంతసేపయ్యాక అతను మెల్లగా ఆమె దగ్గరకు నడచి వచ్చాడు. చామన చాయగా వున్నాడు. పైజామా తొడిగి తెల్లని గ్లాస్కో చొక్కా వేసుకున్నాడు. కాళ్ళకి నల్లని స్లిప్పర్సు, జుట్టు వెనక్కు దువ్వాడు, పెదవులు ఎర్రగా ఉన్నాయి తాంబూల సేవనం వలన. సుబ్బయ్యగారి కొడుకు కన్న, సింగడు కన్న ఎంతో బాగున్నాడు. ఎంతో బాగున్నాడు. చదువుకున్నవాడిలా ఉన్నాడు. లక్ష్మికి ఎదురుగా వచ్చి నిలుచున్నాడు. లక్ష్మి తల పెకైత్తి చూసింది. ఫక్కున నవ్వింది. ఆమెకి కథలో రాజ కుమారుడు నిజంగా వచ్చేసినట్టనిపించింది. ‘‘ఎవరు నువ్వు?’’ అన్నాడు నారాయణ గంభీరంగా. ‘‘ఏం?’’ అంది ఓరగా చూస్తూ లక్ష్మి. ఇంకా ఆమెకు పూర్తిగా మెలకువ రాలేదు. వేలినున్న ఉంగరాన్ని ఆప్యాయంగా చూచుకుంటోంది. ‘‘నీ పేరేవిటి?’’ అడిగాడు నారాయణ. సన్నగా నవ్వి తియ్యగా చూసింది లక్ష్మి జవాబుగా. ‘‘ఈ తోట ఎవరిదో తెలుసునా?’’ ఈసారి కోపంగా అధికారంగా అన్నాడు నారాయణ. ఉలిక్కిపడింది లక్ష్మి ‘‘మీదేంటి బాబూ, ఊరికనే కూర్చున్నాను...’’ భయపడుతూ లేచి నుంచుంది లక్ష్మి. వీడు తనని పెళ్ళి చేసుకోడానికి రాలేదా? నారాయణ గీరగా చూశాడు. అదోవిధంగా దగ్గాడు. లక్ష్మి కూడా గమ్మత్తుగా చూసింది: నవ్వింది. ‘‘నీ పేరేవిటీ?’’ ప్రశ్నించాడు మృదువుగా నారాయణ. ‘‘లచిమి.’’ ‘‘ఈ వూరేనా?’’ ‘‘ఉహు పక్క ఊరు’’ ‘‘ఏం చేస్తుంటావ్?’’ సందేహంగా కనురెప్ప పెకైత్తి నారాయణను చూసింది. దాసీ దాన్నని చెప్పాలా చెప్పకూడదా అని తటపటా యిస్తోంది. నారాయణ మీద చెయ్యివేశాడు. జాలిగా అన్నాడు. ‘‘పాపం. దాసీ పిల్లవా?’’ లక్ష్మి తలూపింది ఔనని. నారాయణ ఈసారి ఆమె బుగ్గలమీద చేత్తోరాశాడు. ‘‘మాంచి దానివి.’’ ఆశగా చూసింది లక్ష్మి! ‘‘అలాగరా - ఆ పక్కకి’’ అని అర్థవంతంగా నవ్వాడు నారాయణ. ‘‘ఎందుకూ?’’ ‘‘ఇక్కడ అందరూ చూస్తారు.’’ తెల్లబోయి చూస్తోంది లక్ష్మి. ‘‘డబ్బులిస్తాను సరేనా, రా.’’ ఛీ, తననింత లోకువగా చూస్తున్నాడేమిటి? తనని ప్రేమించాననీ పెళ్ళి చేసుకుంటాననీ అనడేం అనుకుంది లక్ష్మి. ‘‘నాను సెడిపోయిన దాన్ని కాదు. నానల్లా రాను’’ అంది లక్ష్మి. ‘‘ఇక్కడి కెందుకొచ్చావు మరి?’’ కోపంగా అడిగాడు నారాయణ. ‘‘పెళ్ళి చేసుకుందుకు-’’ అమాయకంగా అంది లక్ష్మి. ‘‘ఎవర్నీ?’’ అన్నాడు. పెళ్ళిచేసుకునేందుకు మామిడి తోపులోకి రావడమెందుకో రకరకాల అనుభవం గల నారాయణకే అర్థమవలేదు. ‘‘నాకు నచ్చినవాణ్ణి, డబ్బున్నవాణ్ణి’’ అంది లక్ష్మి. నారాయణకి లక్ష్మి ఒక్కసారిగా అర్థమై పోయింది, మెల్లగా కబుర్లలోకి దింపాడు. ఆమె ఊహలు పయనించే తోవలేమిటో తెలుసు కున్నాడు. తర్వాత జాలిగా ప్రేమగా అన్నాడు ‘‘నన్ను పెళ్ళి చేసుకుంటావా లక్ష్మీ’’ ‘‘మిమ్మల్నా?’’ ‘‘అవును.’’ ‘‘ఒట్టు?’’ ‘‘ఒట్టు’’ ‘‘మరి సింగడిలాగ..’’ ‘‘సింగడెవడూ?’’ ‘‘దొంగనా...’’... రెండు మాటలలో సింగడెవడో చెప్పింది లక్ష్మి. ‘‘ఛఛ.. నేనలాంటివాణ్ణికాను. నీలాంటి పిల్లకోసమే చూస్తున్నాను. నిన్ను ప్రేమించాను. పెళ్ళి చేసుకుంటాను. పువ్వుల్లో పెట్టి పూజిస్తాను’’ అన్నాడు నారాయణ. ‘‘నిజం?’’ పెద్దకళ్ళలో వెలుగు నిండగా అడిగింది లక్ష్మి. ‘‘ఇంకా నీకు చదువు చెప్పిస్తాను.’’ ‘‘ఓహ్!’’ ‘‘డ్యాన్సు నేర్పిస్తాను.’’ ‘‘అబ్బో.’’ ‘‘మరి ఎప్పుడు పెళ్ళి చేసుకుందాం?’’ అన్నాడు నారాయణ. ‘‘పట్నంలో కాదా పెళ్ళి?’’ - సీతాలుని జ్ఞాపకం చేసుకుంటూ అడిగింది లక్ష్మి. నారాయణ ఓ సెకను ఆలోచించి ‘‘అవును పట్నంలోనే - నేనక్కడేగా ఉండేది’’ అన్నాడు. ‘‘మీరు పట్నంలో ఏం చేస్తుంటారు?’’ నారాయణ చిక్కులో పడ్డాడు. ఈ పల్లెటూరిపిల్ల, అమాయకురాలూ, రొమాంటిక్ ఊహలు ఉన్న లక్ష్మికి ఏం చెపితే పని జరుగు తుందో గటుక్కున ఊహించడం నారాయణ వంటి చురుకైనవాడికేనా కష్టమే. హోటలులో సర్వర్‌గా, కారు క్లీనరుగా, పిక్‌పాకెటర్‌గా, రైలులో మందులమ్మేవాడిగా బహుపాత్రాభి నయం చేసిన నటనావతంసుడు ఆలోచించి అన్నాడు ‘‘మోటారు డ్రైవర్ని.’’ ‘‘అంటే’’ ‘‘పెద్ద పెద్ద మోటారులూ, లారీలూ నడుపుతాను. నేనెలాగ నడుపితే అలాగ వెడతాయి.’’ చక్రం దగ్గర కూర్చుని మోటార్లు నడిపేవాళ్ళని చూడకపోలేదు లక్ష్మి. కాని నారాయణ చెప్పడంలో, ఈ డ్రైవరు పని అసాధారణమైనదిగా తోచింది ఆమెకి. ‘‘బాగా డబ్బొస్తుందా?’’ ‘‘ఓ, కావల్సినంత. మనం హాయిగా బతకొచ్చును.’’ లక్ష్మి హాయిగా బతకటాన్ని ఆలోచిస్తోంది. ‘‘నిన్నెప్పుడూ కారుమీద తిప్పుతాను. పట్నంలో కార్ల మీద పెద్ద పెద్ద వీధుల్లో ఝామ్మని పోతూంటే’’ అన్నాడు నారాయణ. కిలకిల నవ్వింది లక్ష్మి. నారాయణ సమర్థతలో నమ్మకం చిక్కింది. సంజ యెరుపులు కళ్ళల్లో కలలకి మరింత విభ్రమాన్ని చేకూర్చాయి. ‘‘మరి ఎప్పుడు పట్నం వెళ్ళటం?’’ అంది. ‘‘ఆ ఉంగరం ఎక్కడిది నీకు?’’ అన్నాడు నారాయణ లక్ష్మిపై గల శ్రద్ధను విశదపరుస్తూ. ‘‘నాదే.. ఏం?’’ బెదురుగా అంది లక్ష్మి. ‘‘అబద్ధం. నా దగ్గర దబాయించకు.’’ ‘‘నాదే నాదే.. మరి..’’ ‘‘నిజం చెప్పు. లేకపోతే పోలీసులొచ్చి జైల్లో పడేస్తారు నిన్ను. నీ కోసమే చెపుతున్నాను. నమ్మవా నన్ను?’’ లక్ష్మి సంగతంతా చెప్పింది. ‘‘ఈ ఉంగరం నీ దగ్గరుంటే అపాయం వెర్రిదానా. రేపీపాటికి ఖైదులో వుంటావు. ఈ ఉంగరం నా చేతికిచ్చెయి. రాత్రికి రాత్రి కరిగించేసి రూపాయలు తీసుకొస్తాను’’ అన్నాడు నారాయణ ఆత్రంగా. ‘‘నేను మంచి వోణీ పరికిణీ కొనుక్కుందామనుకున్నాను’’ దీనంగా అంది లక్ష్మి. ‘‘పిచ్చిదానా, నేను కొని తీసుకొస్తాను. ఈ చిరిగిన బట్టలతో పట్నం వెళ్ళితే నవ్వుతారు.’’ లక్ష్మి సందేహంగా బెదురుగా బాధగా ఉంగరాన్ని వేలినుంచి మెల్లగా తీసి ఇచ్చింది. ‘‘మరి పెళ్ళి చేసుకుంటావా!’’ అంది. ‘‘ఒట్టు వెయ్యలేదూ?’’ ఒట్టుయొక్క మహత్యాన్ని కిమ్మనకుండా అంగీకరిస్తుంది లక్ష్మి. ‘‘మళ్ళీ ఎప్పుడొస్తారు!’’ ‘‘ఈ రాత్రికి ఎక్కడో ఒకచోట పడుకో. తెల్లారగానే గుడి దగ్గరకు వచ్చి ఉండు. అక్కడికి నేను వస్తాను. రాత్రి కరిగించేసి అమ్మేసి డబ్బులు తీసుకొస్తాను. ఇద్దరం కలసి రెలైక్కి బొంబాయి వెళ్ళిపోదాం ఏం?’’ ‘‘అదేం వూరు? ఛ, నేను రాను.’’ ‘‘బొంబాయి చాలా పే..ద్ద పట్నం లక్ష్మీ.’’ ‘‘సీతాలు మరి చెన్నపట్నం వెళ్ళిందేం?’’ ‘‘వెధవ చెన్నాపట్నం. బొంబాయి ఇంకా గో.. ప్పవూరు. అక్కడ డబ్బు బోలెడు దొరుకుతుంది.’’ లక్ష్మి ఆలోచించింది. ‘‘గుడి కాడనే వుంటాను వస్తారా?’’ ‘‘తప్పకుండా. వెళ్ళొస్తాను - ఏం?’’ లక్ష్మి తలూపింది బెదురుగా. బుగ్గమీద చిటికవేసి గబగబా పొలాలలోంచి నడచి వెళ్ళిపోయాడు నారాయణ. చీకటి పడుతూంటే భయం కలసిన ఆనందంతో కలల మత్తుతో గుడివైపు నడచింది లక్ష్మి. ఆరు, ఏడు, ఎనిమిది. తొమ్మిది కూడా అయింది. లక్ష్మికి ఆకలి ఎక్కువౌతోంది. ఎండ చుర్రుమనగానే గుడి దగ్గర రావిచెట్టు నీడకి వెళ్ళికూర్చుంది. గుడిగోపురం అంత ఎత్తుగా ఎవరు కట్టారా అని చాలాసేపు ఆలోచించింది. గోపురం మీద ఏదో పక్షి వాలింది. లక్ష్మికి సరదా వేసింది. తనకి అంత పైన నుంచి భూమి అన్ని వైపులా చూడాలనిపించింది. కొంతసేపు ముసలి రోగిష్టి తల్లి జ్ఞాపకం వచ్చింది. బొడ్డులో తాళాలు దోపుకున్న సుబ్బయ్యగారు కేకలు వేస్తోన్నట్టు అనిపించింది. మధ్య మధ్య అకారణంగా ఉలిక్కిపడింది. గాలిలోంచి యేదో కమ్మని వాసన వస్తోంటే, లాలాజలాన్ని గుక్కిళ్ళు మింగింది. పూజారి గవరయ్య ఎవరు నువ్వని అడిగాడు. ‘బొమ్మాయి’ వెళ్తున్నానని చెప్పింది. నారాయణ ఎటువైపునుండీ రావడం లేదు. తనని దగా చేశాడా? గుండె కొట్టుకుంది భయంతో, ఆశాభంగంతో కాదు. తప్పకుండా వస్తాడు. తనని పెళ్ళిచేసుకుంటాడు. ఆ కళ్ళలో ఎంత ఇష్టంగా చూశాడు! కాలవ రేవు నుంచి తడిసిన బట్టలతో బిందెలు బుజాన పెట్టుకుని ఆడవాళ్ళు వెళు తున్నారు. గుళ్ళోంచి మంత్రాలు వినపడు తున్నాయి. దేవుణ్ణి తలచుకుని నమస్కరించింది. కళ్ళెత్తి చూసింది. ఎదురుగా సుబ్బయ్యగారు పోలీసులతో. లక్ష్మి కంగారుపడిపోయింది. పారిపోదామనుకుంది. ‘‘ఆగక్కడ’’ గద్దించాడు పోలీసు. లక్ష్మి జబ్బ పట్టుకున్నాడు. ‘‘ఇక్కడ తగులడ్డావా, ఇదేం బుద్ధే నీకు?’’ అన్నాడు సుబ్బయ్య. లక్ష్మి వణుకుతూంది. ‘‘ఏదీ ఉంగరం?’’ వగరుస్తూన్న సుబ్బయ్య గారు గట్టిగా గొంతుచించుకుని అడిగాడు. ‘‘ఉంగరవేంటీ?’’- తనని తాను కాపాడుకుంటానికి ఒకటే మార్గం అయిన అబద్ధాన్ని ఆశ్రయించింది లక్ష్మి. ‘‘రెండు తన్నండి’’ సుబ్బయ్య సలహా ఇచ్చాడు. పోలీసు లాఠీతో వీపు మీద పొడిచాడు. ‘‘అమ్మో’’ అంది లక్ష్మి. ‘‘చెప్పు ఉంగరం ఏంచేశావు?’’ ‘‘నాకు తెల్దు’’ మొరాయించింది లక్ష్మి. పోలీసు మొకాళ్ళ మీద లాఠీతో కొట్టాడు. అరిచింది లక్ష్మి. కళ్లమ్మట నీళ్లు ప్రవాహం కట్టాయి. జనం మూగారు. కొందరు వెకిలిగా నవ్వారు. కొందరసహ్యించు కున్నారు. ‘‘స్టేషనుకి నడు’’ అన్నాడు పోలీసు. మునివేళ్ళ మీద నిలబడి చుట్టూ మూగిన జనంలోకి, జనం అవతల వున్న రోడ్డు వైపూ పరకాయించి ఆశగా చూసింది నారాయణ వస్తున్నాడేమో అని. కానీ జాడ లేదు. తల్లి జ్ఞాపకం వచ్చింది. ఒక్కసారిగా పెద్దపెట్టున ఏడ్చింది రోడ్డు మీద చతికిలబడి. పోలీసు ఒక పక్కా, సుబ్బయ్య ఒక పక్కా నడుస్తోంటే దారి పొడుగునా నారాయణ వస్తాడనీ, తనని విడిపిస్తాడనీ ఆశతో కన్నీళ్ళతో చూస్తూనే ఉంది. రెండు నెలలు జైలులో ఉండేటప్పటికి నారాయణ ఇంక రాడని లక్ష్మికి దృఢమైంది. ఇసుకలాంటి అన్నమూ, చీకటి కొట్టులాంటి జైలుగదీ, మనోవ్యథా... లక్ష్మిని నీరసంగా అసహ్యంగా చేసివేశాయి. ‘ఉంగరమూ పోయింది. పెళ్లీ పోయింది’ అని గొణుగుకునేది ఒక్కతే, కటకటాల్ని పట్టుకుని. మగవాడినెవడినీ నమ్మకూడదనుకుంది. అయినా సుబ్బయ్యగారి కొడుకు ఉంగరం తాను తీస్తే పోలిసులకెందుకూ బాధ అనిపించింది లక్ష్మికి. లక్ష్మి హేతువుకి ఈ చట్టాలు మనుష్యులూ అర్థం లేకుండా కనిపించాయి. రోజూ తెలియకుండా ఏడ్చేది. జ్వరం వచ్చేది. కదలకపోయినా కాళ్ళు లాగేవి. ముసలితల్లి చచ్చిపోయిందేమో అన్న దిగులు, రాత్రుళ్ళు నిద్రలో తనూ నారాయణా ‘బొమ్మాయి’ వెళుతూన్నట్టూ, దారిలో రైలు లోంచి తనని నారాయణ కిందికి తోసేసినట్లు, తన తల చితికి రక్తం ప్రవహించినట్టూ కలవచ్చి ‘బాబోయ్’ అని అరుస్తూ లేచి కూర్చునేది. ఒకరోజు ‘లక్ష్మీ’ అన్న పిలుపు వినబడింది. ఎక్కడా అని తెల్లబోయి గది నలువైపులా చూసింది. ఎవరూ కనబడలేదు. మళ్ళీ ‘లక్ష్మీ ఇక్కడ... నేను’ అన్న మాటలు వినిపించాయి. ధ్వని వచ్చిన వైపే చూసింది. తన గదినాను కున్న గది గోడ పగులులోంచి నారాయణ చూసి నవ్వుతున్నాడు. ‘‘నేనూ-నారాయణని లక్ష్మీ’’ ‘‘నువ్వెలాగొచ్చావు?’’ ఆశ్చర్యంతో అడిగింది లక్ష్మి. ‘‘నిన్న రాత్రి తీసుకువచ్చారు’’ ‘‘ఏం?’’ ‘‘సైకిల్ షాపులో పనికి కుదిరాను. డబ్బు అవసరం వచ్చి సైకిల్ చక్రం అమ్మేశాను. పోలీ సులు వచ్చి ఇక్కడ ఉండమని బతిమాలు కొన్నారు’’ నవ్వుతూ చెప్పాడు నారాయణ. ‘‘బలేగా అయింది సచ్చినోడా-బాగా అయింది’’ కసితో మెటికలు విరిచింది లక్ష్మి. ‘‘నాకిదేమీ కొత్త కాదు పిల్లా. ఇది అయిదోసారి మనం రావడం’’ అన్నాడు నారాయణ తన ఆధిక్యతను నిరూపిస్తూ. ‘‘మంచిదానివి లక్ష్మీ, నీ ఉంగరం అమ్మితే ఇరవైరూపాయలొచ్చినై. వారం రోజులు దర్జాగా వెలిగింది మన బతుకు. సినిమాలూ, కాఫీ హోటళ్ళూ హాయ్ హాయ్’’ ‘‘దొంగనాయాల’’ తిట్టింది లక్ష్మి. ‘‘నీ తిట్లు నాకు తగలవు’’ అన్నాడు. ‘‘అన్నాయం చేశావు దొంగసచ్చినోడా. నా ఉసురు నీకు తగుల్తుంది’’ అంది ఉక్రోషంతో. ‘‘ప్రపంచవే అన్యాయం లక్ష్మీ. ఎవడికి అవసరమైతే వాడే అన్యాయం చేస్తాడు. నువ్వు దొంగతనం చెయ్యలేదూ? నీ దగ్గర్నుంచి నేను కొట్టేశాను’’ ‘‘ఫో...నీ జిమ్మడా’’ ‘‘ఎక్కడికి పోను. ఇక్కడే నీకు సావాసనంగా వుంటాను’’ లక్ష్మి బాధతో మొహం మరోవైపు తిప్పి కూర్చుంది. నారాయణ నవ్వుతూ అన్నాడు.. ‘‘జైలు నుంచి విడిచాక వచ్చి నిన్ను తప్పకుండా పెళ్లిచేసుకుంటానులే’’ అంటూ ఫక్కున నవ్వాడు నారాయణ. లక్ష్మి ఉక్రోషంతో మాట్లాడలేదు. ‘‘అప్పుడు బొంబాయి వెళ్లిపోదాం. ఏది లక్ష్మీ ఇటు చూడు. ఒక ముద్దియ్యి’’ అంటూ ‘ప్చ్’ అని పెదవులతో చప్పుడు చేశాడు నారాయణ. లక్ష్మి దగ్గరున్న నీళ్ల లోటా తీసి పగులు వైపు విసిరింది. పెద్ద చప్పుడయింది. పోలీసు ‘ఏమిటది’ అని కేక వేశాడు. లక్ష్మి మోకాళ్ళ మీద తల ఆన్చి ఏడుస్తోంది. నారాయణ వెకిలినవ్వు జైలుగదిలో కోలాహలంగా ప్రతిధ్వనించింది. - తిలక్ -
ఆ ఉంగరం వెనుక సీక్రెట్!
నాజూకు నడుము ఇలియానా ఎంగేజ్మెంట్ రహస్యంగా అయిపోయిందా?... ఇప్పుడు బాలీవుడ్లో జోరుగా షికారు చేస్తున్న వార్త ఇది. ఈ వార్త రావడానికి కారణం లేకపోలేదు. ఈ మధ్య ఇలియానా వేలికి మెరుస్తున్న ఓ ఉంగరమే ఈ చర్చలకు కారణమైంది. ఆ ఉంగరానికి ఉన్న స్టోన్ తళుకులు చూస్తుంటే, ఖరీదైన వజ్రంలా ఉందని కూడా చెప్పుకుంటున్నారు. ఇలియానా బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ ఆమెకు బహుమతిగా ఇచ్చిన ఉంగరం అయ్యుంటుందనే ఊహాగానాలు ఉన్నాయి. ఇటీవల ఓ ముంబై విలేకరి ఈ ఉంగరం వెనక ఉన్న కథను బయటకు లాగుదామని ప్రయత్నించగా, ఇలియానా చాలా తెలివిగా తప్పించుకున్నారట. ‘మీ వేలికి ఉన్న ఉంగరం గురించి చెబుతారా?’ అని ఆ విలేకరి అడిగితే, ‘ఉంగరం గురించా? చాలా బ్యుటిఫుల్గా ఉంది’ అని అందరూ అంటున్నారని ఇలియానా అన్నారట. ఆ సమాధానానికి ఎలా రియాక్ట్ కావాలో ఆ విలేకరికి అర్థం అయ్యుండదని ఊహించవచ్చు. ‘ఆ ఒక్కటీ అడగొద్దు’ అని ఇలియానా ఇన్‌డెరైక్ట్‌గా ఇలా తెలివిగా సమాధానం చెప్పి ఉంటారు. -
బరిలోకి అమితాబ్ చౌదరి!
-
ఉంగరం... సింగారం
ఫ్యాషన్‌కే ష్యాషన్‌గా ఉండాలనిపిస్తే... ఇదిగో ఇలాంటి పోకడలు పోతుంది! చేతికున్న అయిదు వేళ్లల్లో దేని స్థానం దానికే! అన్నిటికన్నా హొయలు పోయేది ఉంగరం వేలే! పేరులోనే ఉందికదా అందం.. కెంపు, పచ్చ, వజ్రం అన్నీ దాన్ని ధరించడానికే మోజు పడ్తుంటాయి... ఆ సోకులు చూసి ఈర్ష్యపడేనేమో... మిగిలిన వేళ్లూ ఉంగరాలు సింగారించుకోవడం మొదలెట్టాయి ఇలా! అయితే బంగారానికే ఫిక్స్ అయిపోకుండా మెటల్, ప్లాస్టిక్, స్టోన్, వుడ్, బోన్, గ్లాస్ జెమ్స్టోన్లాంటివాటికీ ప్రిఫరెన్స్ పెరిగింది. ఈ క్రేజీని క్యాష్‌చేసుకోవడంలో మార్కెట్టూ ముందుంది. అందుకే బర్త్స్టోన్స్ రింగ్స్, చాంపియన్షిప్రింగ్, కాక్టెయిల్ రింగ్, డాక్టోరల్రింగ పజిల్రింగ్, థంబ్ రింగ్‌లతో లేడీస్‌ని లేటెస్ట్ ట్రెండ్‌వైపు నడిపిస్తున్నాయి! ఇంకా చిత్రమేంటంటే.. రెండు వేళ్లకు ఒకేసారి ధరించేలా డబుల్ ఫింగర్ రింగ్ గింగుర్లుకొడుతోంది. అవిభక్త కవలలను పోలినట్టుండే ఈ ఉంగరం వేళ్లకు వన్నెతెస్తోంది. ఇవీ ఉంగరాల ఊసులు! - శిరీష చల్లపల్లి -
వెలి కొసలలో మెరుపులు... గోళ్ల రింగులు!
గోళ్లు అందంగా కనిపించడానికి వాటికి నెయిల్‌పాలిష్ వేస్తాం. ఇంకాస్త కొత్తగా కనిపించాలంటే పాలిష్‌పైన డిజైన్లు వేయడం చూస్తుంటాం. కానీ గోళ్లకు అందమైన రింగులు తొడిగితే అవి ఇంకెంత మెరిసిపోతాయో తెలపడానికే డిజైనర్లు పోటీపడుతున్నారు. వాటిని తమ మునివేళ్లకు తగిలించుకుని ముదితలు ముచ్చటపడుతున్నారు. ఇప్పటి వరకు వేళ్లకే ఉన్న ఉంగరాలు కాస్తా ఇంకాస్త ముందుకు జరిగి గోళ్లపై హొయలుపోతున్నాయి. ప్రాచీన చైనాలో గోళ్ల సంరక్షణలో భాగంగా ఈ రింగ్ ట్రెండ్ మొదలైంది. గోళ్ల మీద నక్షత్రాలు, కీ చెయిన్లను పోలి ఉండే డిజైన్లు మొదట వచ్చాయి. ఇటీవలి కాలంలో వీటిలో ఎన్నో విభిన్న డిజైన్లు వెలుగు చూస్తున్నాయి. బంగారం, వెండి, స్టీల్‌తో తయారయ్యే ఈ నెయిల్ రింగ్స్‌లో స్వరోస్కి క్రిస్టల్స్ పొదగడంతో మరింత మెరుపులీనుతున్నాయి. స్టైలిష్ యాక్ససరీస్‌లో ‘ఎండ్’ అనేది లేదని నిరూపిస్తున్న ఈ తరహా రింగ్స్ మగువలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆన్‌లైన్‌లోనూ లభిస్తున్న వీటి ధరలు రూ. 200 నుంచి వేల రూపాయల్లో ఉన్నాయి. -
రింగ్ అయ్యూరు!
విజయనగరం రూరల్ : మద్యం వ్యాపారులు మరోసారి రింగ్ అయ్యూరు. 2014-15 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 202 మద్యం దుకాణాలకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులను ఆహ్వానించింది. శుక్రవారం దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసే నాటికి జిల్లాలో 187 దుకాణాలకు దరఖాస్తులు రాగా 40 దుకాణాలకు ఒకొక్క దరఖాస్తు మాత్రమే వచ్చాయి. దీంతో వ్యాపారులు రింగ్ అయినట్టు స్పష్టమైంది. దుకాణాల కేటాయింపునకు అధికారులు నిర్వహించే టెండర్లు, లాటరీ ప్రక్రియకు ముందే ఆయూ ప్రాంతాల్లోని వ్యాపారులు రహస్య సమావేశాలను నిర్వహించి సింగిల్ కోటేషన్‌తో టెండర్లను దక్కించుకున్నట్టు సమాచా రం. ఫలితంగా ప్రభుత్వ ఆదాయూనికి భారీగా గండిపడినట్టు స్పష్టమవుతుంది. ఏజేసీ ఆధ్వర్యంలో లాటరీ... లాటరీ ప్రక్రియను ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు సమక్షంలో శనివారం నిర్వహించారు. పార్వతీపురం డివిజన్ లో 66 మద్యం దుకాణాలుండగా 59 దుకాణాలకు 577 దరఖాస్తులు వచ్చాయి. విజయనగరం డివిజన్లో 136 మద్యం దుకాణాలుండగా 128 దుకాణాలకు 1002 దరఖాస్తులు వచ్చాయి. పార్వతీపురం డివిజన్లో ఏడు దుకాణాలకు, విజయనగరం డివిజన్లో ఎనిమిది దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. లాటరీ ప్రక్రియ లో మొదట సింగిల్ దరఖాస్తులు వచ్చిన దరఖాస్తుదారులకు దుకాణాలను కేటాయించినట్లు ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు ప్రకటించారు. ముందుగా జిల్లాలోని 13 సర్కిల్ కార్యాలయాల పరిధిలోని షీల్డ్ బాక్సులను తెరిచి దరఖాస్తుదారులకు చూపించారు. అనంతరం విజయనగరం యూనిట్ పరిధిలోని సర్కిల్ కార్యాల యాల్లోని దుకాణాలకు లాటరీని నిర్వహించారు. లాటరీ లో దుకాణాలను దక్కించుకున్న వారికి ఏజేసీ నాగేశ్వరరావు తాత్కాలిక లెసైన్సులను అందజేశారు. గందరగోళంగా లాటరీ ప్రక్రియ మద్యం దుకాణాలకు శనివారం నిర్వహించిన లాటరీ ప్రక్రియ గందరగోళంగా మారింది. పట్టణంలోని నాయుడు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన లాటరీ ప్రక్రియకు దరఖాస్తుదారులు పోటెత్తటంతో వారిని నియంత్రించటం అధికారులకు తలనొప్పిగా మారింది. 187 దుకాణాలకు 1580 మంది దరఖాస్తు చేసుకోగా వారందరూ లాటరీ ప్రక్రియలో పాల్గొన్నారు. ఫంక్షన్ హాల్ చిన్నది కావటం అదే సమయానికి భారీ వర్షం కురవటం తో వారంతా హాల్లోకి చొచ్చుకొచ్చారు. అధికారులు సమన్వయంతో వ్యవహరిం చి వారిని నియంత్రించారు. రూ.82 కోట్ల ఆదాయం జిల్లాలోని మద్యం దుకాణాల కేటాయింపు ద్వారా ప్రభుత్వానికి రూ.82 కోట్లకు పైబడి ఆదాయం లభించనుం ది. రూ. లక్షల శ్లాబ్ ఉన్న దుకాణానికి దరఖాస్తు రాలే దు. అలాగే రూ.32.5 లక్షల శ్లాబ్ ఉన్న 13 దుకాణాల కు, రూ.45 లక్షలు శ్లాబ్ ఉన్న దుకాణానికి దరఖాస్తులు రాకపోవటంతో రూ.4.32 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయూనికి గండి పడింది. 202 దుకాణాలు లాటరీలో వెళి తే ప్రభుత్వానికి రూ.86 కోట్ల ఆదాయం లభించనుంది. ధరఖాస్తు ఫీజు ద్వారా రూ.3.95 కోట్ల ఆదాయం మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తుల ఫీజు రూపంలో రూ.3.95 కోట్ల ఆదాయం లభించిందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి.సురేంద్రప్రసాద్ విలేకరులకు తెలిపారు. ఈ ఏడాది 202 మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ విడుదల చేయగా 187 మద్యం దుకాణాలకు 1580 దరఖాస్తులు వచ్చాయన్నారు. దరఖాస్తుల ఫీజు రూ.25 వేలు కాగా, 1580 దరఖాస్తులకు రూ.3.95 కోట్లు ఆదాయం లభించిందన్నారు. 2012-13 సంవత్సరానికి సంబంధించి 202 మద్యం దుకాణాలకుగాను 190 దుకాణాలకు 1592 దరఖాస్తులు రాగా రూ.3.98 కోట్లు ఆదాయం లభించిందన్నారు. నూతన మద్యం విధానం ద్వారా జిల్లాలో జనాభా ప్రాతిపదికన మద్యం దుకాణాలకు నాలుగు శ్లాబ్లుగా విభజించారు. మొదటి శ్లాబ్‌లో రూ. 64లక్షలు కాగా, రెండవ శ్లాబ్‌లో రూ.45 లక్షలు, మూడవ శ్లాబ్‌లో రూ.36లక్షలు, నాల్గవ శ్లాబ్‌లో రూ. 32.5 లక్షలుగా నిర్ణయించటం జరి గిందన్నారు. దరఖాస్తులు రాని 15 మద్యం దుకాణాలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయటం జరుగుతుందన్నారు. మద్యం దుకాణాలు దక్కని దరఖాస్తుదారులు కలెక్టరేట్లోని ఈసీ కార్యాలయంలో ఈఎండీ డీడీలను సోమవారం తిరిగి పొందవచ్చునని ఆయన తెలిపారు. -
టిప్పు సుల్తాన్ ఉంగరమిది
-
టిప్పు సుల్తాన్ ఉంగరమిది
మైసూరును పాలించిన టిప్పు సుల్తాన్ ధరించిన ఉంగరమిది. 1799లో శ్రీరంగపట్టణం వద్ద బ్రిటిష్ సైన్యంతో జరిగిన యు ద్ధంలో ఆయన మరణించినపుడు సుల్తాన్ వేలికి ఈ ఉంగరముందని ఓ కథనం. 41.2 గ్రాముల బరువైన ఈ ఉంగరాన్ని శుక్రవారం లండన్‌లో క్రిస్టీస్ సంస్థ వేలం వేయగా రూ.1.42 కోట్ల ధర పలికింది. -
కదిలే ఉంగరం!
ఉంగరాలందు.. కదిలే ఉంగరం వేరయా.. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి చెందిన స్వర్ణకారుడు కొచ్చెర్ల శివవరప్రసాద్ ఓ కదిలే ఉంగరాన్ని రూపొందించారు. అది కూడా తాబేలు ఆకృతిలో.. నవరత్నాలు పొదిగిన ఈ ఉంగరానికి వెనుక ఓ మరను ఏర్పాటు చేశారు. మర తిప్పితే చాలు తాబేలు తల, కాళ్లు బయటకు వచ్చి లోపలికి వెళ్లేలా రూపొందించారు. 16 గ్రాముల బంగారం, నవరత్నాలతో ఈ ఉంగరాన్ని రూపొందించడానికి 20 రోజుల సమయం పట్టిందని శివవరప్రసాద్ తెలిపారు. వ్యాపారం నిమిత్తం పలు రాష్ట్రాల్లో తిరిగేవారు తమిళనాడు తిరుపూర్ (తాబేలు) ఉంగరాలను ధరిస్తుంటారని, ఆ రాష్ట్రంలోనే వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారని ఆయన చెప్పారు. మన రాష్ట్రంలో ఇలా కదిలే తాబేలు ఉంగరాన్ని తయారు చేసింది మాత్రం తానే అని చెపుతున్నాడు శివవరప్రసాద్. - న్యూస్‌లైన్, తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి) -
హెచ్ఐవీని నిరోధించే రింగ్...
మహిళల్లో హెచ్ఐవీ నిరోధానికి ఉపయోగపడే సరికొత్త ఇంట్రా-వెజైనల్ రింగ్ ఇది. రిట్రోవైరస్(హెచ్ఐవీ)ని నివారించే శక్తిమంతమైన ‘టీనోఫోవిర్’ ఔషధంతో నింపిన ఈ రింగ్‌ను ఇటీవల ఆడ కోతుల్లో పరీక్షించగా.. వంద శాతం ఎస్హెచ్ఐవీని అడ్డుకోగలిగింది. ఒకసారి యోనిలోకి ప్రవేశపెడితే 30 రోజుల వరకూ ఇది పనిచేస్తుందని, దీనిని వచ్చే నవంబరులో 60 మంది స్త్రీలలోనూ పరీక్షించనున్నట్లు న్యూయార్క్‌లోని అల్బర్ట్ ఐన్‌స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.