న్యూఢిల్లీ: యావత్తు దేశాన్ని కలవరపాటుకు గురిచేసిన శ్రద్ధా హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. దర్యాప్తు చేసే కొద్దీ పలు ఆసక్తికర విషయాలు బయటకీ వస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు అఫ్తాబ్ అమీన్ పునావాలా తన ప్రియురాలు శ్రద్ధా వాకర్ మృతదేహాన్ని కోయడానికి ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 5 నుంచి 6 అంగుళాల మధ్య ఉన్న ఐదు కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అంతేగాదు ఈ ఆయుధాలను ఉపయోగించాడా? లేదా అని తెలుసుకోవడం కోసం వాటిని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపించినట్లు తెలిపారు. ఐతే అఫ్తాబ్ పోలీసులు విచారణలో శ్రద్ధా శరీర భాగాలను కోసి దాదాపు 300 లీటర్ల ఫ్రిజ్‌లో ఉంచి సమీపంలోని అడవిలో పడేసినట్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోలీసులు మృతదేహాన్ని కోయడానికి ఉపయోగించిన ఆయుధాలు కోసం ముమ్మరంగా గాలించారు.
ఐతే ఈ దర్యాప్తు సమయంలో పోలీసులకు మరో షాకింగ్ ట్విస్ట్ తగిలింది. అప్తాబ్ ఆ రోజు శ్రద్ధా వాకర్‌ని హత్య చేసిన తదనంతరం ఒక వైద్యురాలితో డేటింగ్ చేసినట్లు తేలింది. ఆమెకు శ్రద్ధా ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అఫ్తాబ్ తీహార్ జైలులో ఉన్నాడని, అతన్ని గట్టి భద్రత నడుమ బహు జాగ్రత్తగా ఉంచినట్లు జైలు అధికారులు పేర్కొన్నారు.
(చదవండి: చంపి ముక్కలుగా నరికేస్తానని అఫ్తాబ్ బెదిరించాడు.. వెలుగులోకి 2020 నాటి ఫిర్యాదు)
Comments
Please login to add a commentAdd a comment