knives
-
వేట కొడవళ్లతో నరుక్కున్న నవ దంపతులు!
కేజీఎఫ్/కోలారు: వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం.. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో గానీ పెళ్లయిన రోజే ఏకాంతంగా ఉన్న సమయంలో ఇద్దరూ ఒకరిని ఒకరు వేట కొడవళ్లతో నరుక్కుని ప్రాణాలు తీసుకున్నారు. కర్ణాటకలోని కోలారు జిల్లా కేజీఎఫ్ పట్టణంలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. కేజీఎఫ్ తాలూకా బైనేహళ్లికి చెందిన శ్రీనివాసులు, లక్ష్మి దంపతుల కుమార్తె లిఖితశ్రీ(19), చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని సంతూరు నివాసి మునియప్ప కుమారుడు నవీన్‌కుమార్(27)లు ప్రేమించుకున్నారు.పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమయ్యారు. లిఖితశ్రీ ఇంటర్ పూర్తి చేయగా, నవీన్ దుస్తుల షాపు నిర్వహిస్తున్నాడు. కాగా, బుధవారం ఉదయం కర్ణాటక చండరసనహళ్లిలోని నవీన్‌కుమార్ సోదరి ఇంట్లో వారిద్దరి పెళ్లి వేడుక జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, బంధువులు సంతోషంగా పాల్గొన్నారు. సాయంత్రం అదే గ్రామంలో ఉన్న నవీన్‌కుమార్ పెదనాన్న ఇంటికి కొత్త జంట వెళ్లింది. ఒక గదిలో విశ్రాంతి తీసుకునే సమయంలో నవ దంపతులు గొడవ పడ్డారు, గట్టిగా కేకలు వేయడంతో బంధువులు తలుపులు తెరిచి చూడగా ఇద్దరు రక్తపు మడుగులో పడి ఉన్నారు.ఇద్దరూ ఆ గదిలో ఉన్న వేట కొడవళ్లతో దాడి చేసుకున్నారని అనుమానాలున్నాయి. వధువు లిఖితశ్రీ ఆస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే మరణించింది. తీవ్ర గాయాలతో ఉన్న నవీన్ కుమార్‌ను అంబులెన్స్‌లో కోలారు ఆస్పత్రికి, అనంతరం బెంగుళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించగా.. గురువారం ఉదయం ప్రాణాలు విడిచాడు. ఇలా కొత్త జంట కొన్ని గంటలకే ఈ లోకాన్ని వీడింది. జిల్లా ఎస్పీ శాంతరాజు, డీఎస్పీ పాండురంగ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ నవదంపతులు ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టమని ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని తల్లిదండ్రులు తెలిపారు. -
తొలిరోజే పుంజుకున్నాయ్
సాక్షి, అమరావతి/భీమవరం/అమలాపురం: భోగి రోజైన ఆదివారం పందెం కోళ్లు జూలు విదిల్చాయి. బరిలోకి దూకి కత్తులు దూశాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కోడి పందేలు మొదలయ్యాయి. గోదావరి జిల్లాల్లో భారీఎత్తున పందేలు జరిగాయి. పశి్చమ గోదావరి జిల్లా భీమవరం, ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకొల్లు, నరసాపురం, ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం, నిడమర్రు, దెందులూరు మండలాలు, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పందేలు సందడిగా సాగాయి. కోనసీమ జిల్లా రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం నియోజకవర్గాల పరిధిలో పలుచోట్ల కోడిపందేలు జోరుగా సాగాయి. కొన్నిచోట్ల బరులకు ప్రత్యేకంగా ఫెన్సింగ్ కూడా వేశారు. పెద్దాపురం, కరప తదితర మండలాల్లో కోడిపందేలు జరిగాయి. తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి రూరల్, కడియం, మండపేట తదితర ప్రాంతాలతోపాటు నల్లజర్ల, నిడదవోలు, పెరవలి, తాళ్లపూడి తదితర మండలాల్లో కోడిపందేలు జోరుగా నిర్వహించారు. వరి చేలు, కొబ్బరి తోటలు, మైదాన ప్రాంతాల్లో భారీ బరులు ఏర్పాటు చేశారు. బెట్టింగ్ స్థాయిని బట్టి బరులు ఏర్పాటు చేశారు. పందేలకు వచ్చే వారికి వీవీఐపీ, వీఐపీ, సామాన్యుల కోసం ప్రత్యేక గ్యాలరీలు నెలకొల్పారు. బరులను ఆనుకుని ప్రత్యేకంగా సిట్టింగ్ (బెంచీలు, కుర్చిలు) ఏర్పాటు చేశారు. బరుల చుట్టూ ఎల్ఈడీ స్క్రీన్లు, ఫ్లడ్‌లైట్లు పెట్టారు. తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడి పందేలు మోస్తరుగా కొనసాగాయి. అన్నిచోట్లా పందేల బరులకు ఆనుకుని గుండాట, పేకాట, కోసు ఆటలు నిర్వహించారు. పందేలకు వచి్చన వారి కోసం బిర్యానీ, మాంసం పకోడి, కూల్‌డ్రింక్స్, సిగరెట్ స్టాల్స్ ఏర్పాటు చేయడంతో జాతరను తలపించింది. గోదావరి జిల్లాల్లో నిర్వహించే కోడి పందేలను తిలకించేందుకు, పందేలు వేసేందుకు బెట్టింగ్ రాయుళ్లు పయనమవడంతో హైదరాబాద్, విజయవాడ మార్గంలో వాహనాల రద్దీ కని్పంచింది. పందేలకు వచి్చన వారితో గోదావరి జిల్లాల్లోని లాడ్జిలు, అతిథి గృహాలు సైతం నిండిపోయాయి. ట్యాగ్లు ఉంటేనే అనుమతి పశి్చమ గోదావరి జిల్లా కాళ్ల మండలంలోని పెదఅమిరం, సీసలి గ్రామాల్లో కోడి పందేలు వీక్షించడానికి ఎల్ఈడీ డిస్ప్లేను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పందేలను వీక్షించడానికి వచ్చే వారి చేతులకు ట్యాగ్లు వేశారు. బరుల వద్ద బౌన్సర్లను ఏర్పాటు చేసి ట్యాగ్లు ఉన్నవారిని మాత్రమే బరుల్లోకి ప్రవేశించే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. పాలకొల్లు నియోజకవర్గంలోని యలమంచిలి మండలం కలగంపూడి, కాపవరం, పూలపల్లి, పాలకొల్లు మండలం, నరసాపురం నియోజకవర్గంలోని మొగల్తూరు మండలం, ఆచంట నియోజకవర్గంలోని కవిటం, తణుకు నియోజకవర్గం అత్తిలి, వేల్పూరు, తేతలి గ్రామాల్లోనూ భారీ స్థాయిలో పందేలు నిర్వహించారు. ఏలూరు జిల్లాలోని కైకలూరు, దెందులూరు, ఉంగుటూరు, చింతలపూడి, ఏలూరు, నూజివీడు నియోజకవర్గాల్లోనూ భారీ స్థాయిలో కోడి పందేలు నిర్వహించారు. ఎన్నికల ఏడాది కావడంతో వివిధ పారీ్టల నేతలు బరులకు వెళ్లి నిర్వాహకులను, పందేల రాయుళ్లను పలకరించారు. అక్కడే కొంత సమయం గడిపి స్థానికులతో మమేకమై ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాగా.. ఈసారి హైదరాబాద్ నుంచి రాజకీయ నేతల రాక పెద్దగా కనిపించలేదు. బుసకొట్టిన ‘కట్టల’ పాములు కోడి పందేలతో పాటు పేకాట, గుండాట వంటి జూద క్రీడల శిబిరాలు కూడా భారీగానే వెలిశాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 200 బరుల్లో పందేలు నిర్వహించగా సుమారు రూ.150 కోట్ల వరకు చేతులు మారినట్టు అంచనా. కోనసీమ జిల్లాలోనూ నోట్ల కట్టలు బుసలు కొట్టినట్టుగా చేతులు మారాయి. కోడి పందేలు నిర్వహించే పెద్ద బరుల వద్ద సొమ్ములు లెక్కించడానికి కౌంటింగ్ మెషిన్లు ఏర్పాటు చేయడం విశేషం. కైకలూరు నియోజకవర్గ పరిధిలోని కలిదిండి మండలం మిలట్రీపేట, మండవల్లి మండలం భైరవపట్నం శిబిరాల వద్ద ఎక్కువ పందేలు గెలిచిన వారికి బుల్లెట్లను బహుమతిగా ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి జూదాలు విపరీతంగా పెరిగాయి. అక్కడ కూడా రూ.కోట్లు చేతులు మారాయి. -
ఇంట్లో పదునైన కత్తులు పెట్టుకోండి: బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
మధ్యప్రదేశ్‌లోని భోపాల్ పార్లమెంటరీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్.. హిందూ కార్యకర్తల హత్యల గురించి మాట్లాడుతూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. హిందువులకు తమపై దాడి చేసిన వారిపై స్పందించే హక్కు ఉందని, అది వారి గౌరవానికి సంబంధించినదని అన్నారు. అలాగే తమను తాము రక్షించుకునే హక్కు ప్రతిఒక్కరికీ ఉన్నందున ఇంట్లో పదునైనా కత్తులు పెట్టుకోవాంటూ పిలుపునిచ్చారు. లవ్ పేరుతో కొందరు జిహాద్ చేస్తున్నారని అందులో ప్రేమ మాత్రం ఉండదని అన్నారు. ఈ మేరకు ప్రగ్యా ఆదివారం జరిగిన సౌత్ రీజియన్ వార్షిక సదస్సులో మాట్లాడుతూ... దేవుడు సృష్టించిన ఈ లోకంలో అణిచివేతదారులను, పాపాత్ములను అంతం చేయాలని లేదంటే ప్రేమకు నిజమైన నిర్వచనం ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో తమపై దాడి చేసిన వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పండి. అంతేగాదు లవ్ జిహాద్ పేరుతో బలవుతున్న అమ్మాయిలను రక్షించండి. బాలికలకు సరైన విలువలు నేర్పండి. శివమొగ్గకు చెందిన హర్షతో సహా హిందువుల కార్యకర్తల హత్యల గురించి ప్రస్తావిస్తూ... స్వీయ రక్షణ కోసం ఇంట్లోని కత్తులనైనా పదును పెట్టుకోవాలన్నారు. ఇంట్లో ఆయుధాలైనా ఉంచుకోండి లేదా కూరగాయాల కోసం ఉపయోగించే పదునైన కత్తులైనా రెడీగా ఉంచుకోండి అని చెప్పారు. ఎప్పుడూ ఎలాంటి పరిస్థిత వస్తుందో తెలియదు కాబట్టి దాడి చేసినప్పుడు వారికి తగిన రీతిలో రిప్లై ఇవ్వడం మన హక్కు అని చెప్పారు. అలాగే మీ పిల్లలను మిషనరీ సంస్థల్లో చదివించకండి అలా చేస్తే తల్లిదండ్రులను అవసాన దశలో వృద్ధాశ్రమాలకు పంపుతారు, స్వార్థపరులుగా మారిపోతారంటూ.. షాకింగ్ కామెంట్లు చేశారు. పిల్లలకు ధర్మం గురించి, శాస్త్రల ప్రాముఖ్యత గురించి తెలియజేయండి. తద్వారా పిల్లలు మన సంస్కృతి, విలువలు గురించి తెలుసుకుంటారని ప్రగ్యా సింగ్ ఠాకూర్ అన్నారు. (చదవండి: నడి రోడ్డుపై అడ్డగించి మరీ...మహిళపై ఓ వ్యాపారి యాసిడ్ దాడి..) -
శ్రద్ధా కేసు: ఐదు కత్తులు స్వాధీనం, వెలుగులోకి మరో ట్విస్ట్
న్యూఢిల్లీ: యావత్తు దేశాన్ని కలవరపాటుకు గురిచేసిన శ్రద్ధా హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. దర్యాప్తు చేసే కొద్దీ పలు ఆసక్తికర విషయాలు బయటకీ వస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు అఫ్తాబ్ అమీన్ పునావాలా తన ప్రియురాలు శ్రద్ధా వాకర్ మృతదేహాన్ని కోయడానికి ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 5 నుంచి 6 అంగుళాల మధ్య ఉన్న ఐదు కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అంతేగాదు ఈ ఆయుధాలను ఉపయోగించాడా? లేదా అని తెలుసుకోవడం కోసం వాటిని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపించినట్లు తెలిపారు. ఐతే అఫ్తాబ్ పోలీసులు విచారణలో శ్రద్ధా శరీర భాగాలను కోసి దాదాపు 300 లీటర్ల ఫ్రిజ్‌లో ఉంచి సమీపంలోని అడవిలో పడేసినట్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోలీసులు మృతదేహాన్ని కోయడానికి ఉపయోగించిన ఆయుధాలు కోసం ముమ్మరంగా గాలించారు. ఐతే ఈ దర్యాప్తు సమయంలో పోలీసులకు మరో షాకింగ్ ట్విస్ట్ తగిలింది. అప్తాబ్ ఆ రోజు శ్రద్ధా వాకర్ని హత్య చేసిన తదనంతరం ఒక వైద్యురాలితో డేటింగ్ చేసినట్లు తేలింది. ఆమెకు శ్రద్ధా ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అఫ్తాబ్ తీహార్ జైలులో ఉన్నాడని, అతన్ని గట్టి భద్రత నడుమ బహు జాగ్రత్తగా ఉంచినట్లు జైలు అధికారులు పేర్కొన్నారు. (చదవండి: చంపి ముక్కలుగా నరికేస్తానని అఫ్తాబ్ బెదిరించాడు.. వెలుగులోకి 2020 నాటి ఫిర్యాదు) -
అదిరిపోయే సోనూసూద్ మరో టాలెంట్
ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తూ తరచూ వార్తల్లో నిలిచే సోనూ సూద్ మళ్లీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. కాకపోతే ఈ సారి తనకున్న మరో స్కిల్ చూపిస్తున్న వీడియోతో మనముందుకు వచ్చాడండోయ్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. కరోనా లాక్డౌన్ సమయంలో ప్రజలకు సహాయం చేయడంతో సోనూ సూద్ ప్రజల దృష్టిలో హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి తన చేతనైన సాయాన్ని ప్రజలకు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. టాలీవుడ్‌కి విలన్‌గా పరిచయమైనప్పటికీ రియల్ లైఫ్‌లో మాత్రం హీరో అనిపించుకున్నాడు. ‘వదల బొమ్మాలి’ అంటూ అరుంధతిలో తన నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక సోనూ సూద్ తన ట్విట్టర్లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అందులో ఎంతో హుషారుగా చాకులకు పదును పెడుతూ తన మరో టాలెంట్‌ను చూపిస్తున్నాడు. నా కొత్త దుకాణానికి స్వాగతం అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ( చదవండి: ‘వైల్డ్ డాగ్’కి ఊహించని ఎదురుదెబ్బ.. షాక్‌లో చిత్ర యూనిట్! ) -
హత్యాయత్నం.. వ్యక్తిపై కత్తులతో దాడి..
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో ఓ వ్యక్తిపై అర్ధారాత్రి హత్యాయత్నం జరిగింది. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని కత్తులతో పొడిచారు. రక్తపు మడుగులో పడి ఉన్న అతని స్థానికులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భూ తగదాలు.. కొడవళ్లతో పరస్పర దాడులు..
సాక్షి, చిత్తూరు : భూ తగదాలతో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘటన జిల్లాలోని మొలకలచెరువు మండలం మలిగివారిపల్లెలో శనివారం చోటుచేసుకుంది. ఇరువురు కొడవళ్లతో పరస్పర దాడులు జరిపారు. మనీ అనే వ్యక్తిపై జయరాం అనే యువకుడు కొడవలితో దాడి చేసి నరికాడు. తీవ్రంగా గాయపడిన మణిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కత్తిపూడిలో దారుణం.. కారం చల్లి కత్తులతో దాడి
-
కత్తిపూడిలో దారుణం.. కారం చల్లి కత్తులతో దాడి
తూర్పు గోదావరి : కత్తిపూడిలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఉపాధ్యాయుడి కుటుంబం లక్ష్యంగా చేసుకొని కత్తులతో దాడి జరిగింది. గొర్రెల రాజు అనే వ్యక్తి కొంతమంది వ్యక్తులతో కలిసి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చంటిబాబు అతడి కుమారుడు నాగబాబు, భార్య లక్ష్మీపై కత్తులతో దాడికి దిగాడు. వారి కళ్లల్లో కారం చల్లి మరీ ఈ దాడికి పూనుకున్నాడు. ఈ దాడిలో చంటిబాబు మెడకు తీవ్ర గాయాలు కాగా కుమారుడు నాగబాబు, లక్ష్మీకి కూడా గాయాలయ్యాయి. దీంతో వీరిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. చంటి బాబు ఒళ్లంతా రక్తసిక్తంగా మారింది. ఈ దాడికి వివాహేతర సంబంధమే కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గొర్రెల రాజు భార్యకు చంటిబాబు కుమారుడికి అక్రమ సంబంధం ఉందనే కారణంతోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. చంటిబాబు అన్నవరం పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. -
టూరిస్ట్ బస్సుల్లో 170 కత్తులు..ఆందోళన !
బహ్రెయిచ్(ఉత్తరప్రదేశ్): భారత్- నేపాల్ సరిహద్దుల్లో పోలీసులు జరిపిన వాహన సోదాల్లో 170 కత్తులు లభించాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. మంగళవారం రాత్రి సరిహద్దు భద్రతా దళం, స్థానిక పోలీసులు కలిసి నేపాల్‌తోపాటు యూపీలోని మిగతా జిల్లాల వైపు వెళ్లే వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్బంగా రెండు బస్సుల్లో 93, 81 చొప్పున కత్తులు లభించాయి. దీనికి సంబంధించి నేపాల్‌కు చెందిన మున్నవర్, ఇర్పాన్, రాజుతోపాటు హర్దోయి జిల్లాకు చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ జుగల్ కిషోర్ తెలిపారు. కాగా, ఈ బస్సులో ప్రయాణికులెవరూ లేరని, పట్టుబడిన వారంతా బస్సు నిర్వాహకులేనని ఆయన వివరించారు. కత్తులను వారు నేపాల్‌కు తీసుకెళ్తున్నామని చెప్పారన్నారు. అయితే, మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని తెలిపారు. పండుగ నేపథ్యంలో కత్తులు పెద్ద సంఖ్యలో లభించడంపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన అనంతరం వాహన లనిఖీలు ముమ్మరం చేశారు. -
ఆస్తి కోసం.. రక్త సంబంధం మరిచారు
ఇల్లంతుకుంట: రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతుకుంట మండలం నర్సక్కపేటలో దారుణం చోటుచేసుకుంది. పొంకటి లింగయ్య(45), పొంకటి కనకయ్య అన్నదమ్ములు. కలిసి మెలిసి ఉండాల్సిన వారు భూమి విషయంలో గొడవకు దిగారు. ఆస్తి కోసం అన్నదమ్ములు రక్త సంబంధం మరిచిపోయారు. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో పరస్పరం కత్తులతో దాడికి దిగి పొడుచుకున్నారు. తీవ్రగాయలపాలైన వారు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాతబస్తీలో కార్డెన్ సెర్చ్
♦ ద్విచక్ర వాహనాలు,మద్యం బాటిళ్లు, కత్తులు, సర్క్యూట్ ♦ మెటీరియల్ స్వాధీనం బహదూర్‌పురా : దక్షిణ మండలం పోలీసుల ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజామున బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని హసన్‌నగర్‌లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 9 మంది రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో 60 ద్విచక్ర వాహనాలు, మరణాయుధాలు, 280 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి సర్క్యూట్ మెటీరియ ల్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజామున 5.30 గంటలకు ప్రారంభమైన ఈ తనిఖీల్లో దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 600 మంది పోలీసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలోని ప్రతి ఇల్లు, గోడౌన్లను శోధించారు. వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఆరుగురు వ్యక్తు ల్లో ఐదుగురు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అరెస్ట్ చేసి బైండోవర్ తరలించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ బాబురావు, చార్మినార్, సంతోష్‌నగర్ ఏసీపీలు అశోక చక్రవర్తి, వి. శ్రీనివాసులు, దక్షిణ మండలంలోని ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వెంటాడి.. వేటాడి...
యువకుడి దారుణ హత్య ► బార్బర్ షాపులోనే దారుణం ► తాడిపత్రిలో కలకలం తాడిపత్రి: తాడిపత్రిలో కలకలం రేగింది. ఓ యువకుడ్ని ప్రత్యర్థులు వెంటాడి.. వేటాడారు. మంగళిషాపులోకి వెళ్లి తలదాచుకున్నా వదల్లేదు. అక్కడే కత్తులతో కసితీరా పొడిచి పరారయ్యారు. పోలీసుల కథనం ప్రకారం... తాడిపత్రి టైలర్స్‌కాలనీలో నివాసం ఉండే నరసింహ(28)ను ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి ఆదివారం సాయంత్రం హత్య చేశారు. జులాయిగా తిరిగే నరసింహ నంద్యాల రోడ్డులో వెళ్తుండగా వెనుక వైపు నుంచి వచ్చిన నలుగురు వ్యక్తులు అతనిపై మొదట రాడ్లతో దాడి చేశారు. వారి నంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి ఓ మంగళషాపులోకి వెళ్లినా వదల్లేదు. షాపులోనే అతనిపై కత్తుల తో దాడి చేసి పరారయ్యరు. తీవ్రంగా యపడిన నరసింహాను చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా కాసేపటికే మరణించాడు. హత్యకు గల కారణాలు, హంతకులు ఎవరనే విషయం తెలియడం లేదు. డీవైఎస్పీ చిదానందరెడ్డి, సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ రామకృష్ణారెడ్డి తమ సిబ్బందితో కలసి నరసింహ మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మారణాయుధాలను విక్రయిస్తున్న అమెజాన్!
మారణాయుధాల అమ్మకాలపై ఆంక్షలు ఉండగా.. వాటిని పట్టించుకోకుండా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ విచ్చలవిడిగా కత్తులను అమ్ముతున్నట్టు తేలింది. 18 ఏళ్ల వయస్సు నిండిన వారికి మాత్రమే పలు ఆంక్షలతో కత్తుల వంటి మారణాయుధాలు అమ్మాల్సి ఉంటుంది. కానీ, అమెజాన్ మాత్రం బ్రిటన్‌లో ఓ 16 ఏళ్ల బాలుడికి పెద్ద కత్తిని అమ్మింది. మడుచుకోవడానికి వీలుండి.. 8.5 సెంటీమీటర్ల పొడవు బ్లేడ్ ఉన్న కత్తిని ఆ బాలుడు 40 పౌండ్లకు అమెజాన్‌లో కొనుగోలు చేశాడు. ఆ కత్తితో స్కూలుకు వెళ్లిన అతను సహచర విద్యార్థిని పొడిచి చంపాడు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఈ కేసులో నిందితుడైన బాలుడిపై హత్య అభియోగాలను కోర్టు ఎత్తివేసినప్పటికీ, మృతికి కారణమైన అభియోగాలతో అతన్ని విచారించాలని నిర్ణయించింది. 18 ఏళ్ల లోపు ఉన్నవారికి మూడు అంగుళాల కన్నా పొడవు ఉన్న కత్తిని అమ్మడం బ్రిటన్‌లో చట్టవిరుద్ధం. అయితే ఆ బాలుడు మాత్రం తాను మేజర్ అని పేర్కొంటూ అమెజాన్‌లో కత్తిని కొనుగోలు చేశాడు. అతని వయస్సు నిర్ధారించుకోకుండానే అమెజాన్ అతడికి కత్తిని డెలివరీ చేసింది. తన వయస్సు గురించి ఆరా తీయకుండా ఉండేందుకు ఆ బాలుడు తెలివిగా డెలివరీని ఇక్కడ ఉంచి వెళ్లండి అంటూ తన ఇంటి డోర్‌కు ఓ లేఖను అంటించాడు. డెలవరీ బాయ్ అదేవిధంగా చేయడంతో అక్రమంగా కొనుగోలుచేసిన కత్తితో అతడు ఘాతుకానికి ఒడిగట్టాడు. తాజాగా గార్డియన్ పత్రిక తమ ఆపరేషన్‌లో భాగంగా ఓ ఇంటి చిరునామాతో అమెజాన్‌లో కత్తిని ఆర్డర్ చేసి.. ఆ బాలుడి మాదిరిగా ఆ ఇంటి డోర్‌కు ఓ లేఖను అంటించింది. ఆ లేఖ ప్రకారం కత్తిని డెలివరీ బాయ్ ఆ చిరునామాలో వదిలేసి వెళ్లాడు. దీంతో కత్తుల వంటి మారణాయుధాల అమ్మకాల్లో అమెజాన్ నిబంధనలను ఏమాత్రం పాటించడం లేదని, పిల్లలకు విచ్చలవిడిగా మారణాయుధాలు అమ్ముతున్నదని తాజా ఉదంతం రుజువు చేస్తున్నదని గార్డియన్ పత్రిక వ్యాఖ్యానించింది. -
నల్లగొండ జిల్లాలో కత్తులతో దాడులు : ఒకరి మృతి
సూర్యాపేట: తన సోదరిను కొందరు ఆకతాయిలు ఆటపట్టిస్తుండటంతో.. ఓ అన్నయ్య తన స్నేహితులతో కలిసి వారిని మందలించడానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరగడంతో.. కర్రలు, కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న రాజు సోదరి మిషన్ నేర్చుకోవడానికి వెళ్లి వస్తున్న సమయంలో కొందరు ఆకతాయిలు ఆమెను ఆట పట్టిస్తుండటంతో.. ఆమె విషయాన్ని తన అన్నకు చెప్పింది. దీంతో రాజు తన స్నేహితుడు ఉపేందర్(22)తో కలిసి స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వద్దకు వెళ్లాడు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం అనంతరం కర్రలు, కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో రాజు స్నేహితుడు ఉపేందర్ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఘట్కేసర్లో కత్తిపోట్లు.. ఒకరి పరిస్థితి విషమం
ఘట్కేసర్: రంగారెడ్డి జిల్లాలో ఆస్తి తగాదాలు తీవ్ర ఘర్షణకు దారితీశాయి. ఘట్కేసర్లోని మైసమ్మగుట్ట వద్ద ఆదివారం రాత్రి జరిగిన గొడవల్లో పలువురు గాయపడ్డారు. రెండు కుటుంబాల మధ్య తలెత్తిన ఆస్తి తగాదాలు ఒక్క కుటుంబంపై మరో కుటుంబం కత్తులతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో నలుగురికి కత్తిపోట్లు తగిలాయి. ఈ ఘటనలో గాయపడిన సంజీవ్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జైల్లో కత్తులు, మొబైల్ ఫోన్లు!
మంగళూరు: కర్ణాటకలోని మంగళూరు జిల్లా జైల్లోని ఖైదీల నుంచి ఆరు కత్తులు, 16 మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత సోమవారం ఈ జైల్లో జరిగిన ఘర్షణలో ఇద్దరు గ్యాంగ్‌స్టర్ ఖైదీలు హత్యకు గురయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు, జైలు అధికారులతో కూడిన దర్యాప్తు బృందం బుధవారం నుంచి మంగళూరు జైల్లో తనిఖీలు నిర్వహిస్తున్నది. ఈ తనిఖీల్లో ఖైదీల వద్ద కత్తులు, మొబైల్ ఫోన్లే కాకుండా ఏడు మెమరీ కార్డులు, మొబైల్ బ్యాటరీలు, సిమ్‌కార్డులు, లైటర్లు, ఎలక్ట్రిక్ హీటర్లు, మొబైల్ చార్జర్, ఎలక్ట్రిక్ వైర్, కారం వంటి వస్తువులు దొరికాయి. అయితే తనిఖీల్లో లభించిన కత్తులు ఇటీవలి ఇద్దరి హత్యల్లో వాడలేదని పోలీసులు ధ్రువీకరించారు. జైల్లో ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదుచేశామని చెప్పారు. సోమవారం జైల్లో జరిగిన ఘర్షణలో ప్రత్యర్థుల చేతిలో కరుడుగట్టిన నేరగాడు మదూర్ ఇసుబ్, అతని అనుచరుడు గణేశ్ షెట్టి హత్యకు గురయిన సంగతి తెలిసిందే.