
పాతబస్తీలో కార్డెన్ సెర్చ్
♦ ద్విచక్ర వాహనాలు,మద్యం బాటిళ్లు, కత్తులు, సర్క్యూట్
♦ మెటీరియల్ స్వాధీనం
బహదూర్‌పురా : దక్షిణ మండలం పోలీసుల ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజామున బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని హసన్‌నగర్‌లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 9 మంది రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో 60 ద్విచక్ర వాహనాలు, మరణాయుధాలు, 280 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి సర్క్యూట్ మెటీరియ ల్, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
తెల్లవారుజామున 5.30 గంటలకు ప్రారంభమైన ఈ తనిఖీల్లో దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 600 మంది పోలీసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలోని ప్రతి ఇల్లు, గోడౌన్లను శోధించారు. వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఆరుగురు వ్యక్తు ల్లో ఐదుగురు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అరెస్ట్ చేసి బైండోవర్ తరలించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ బాబురావు, చార్మినార్, సంతోష్‌నగర్ ఏసీపీలు అశోక చక్రవర్తి, వి. శ్రీనివాసులు, దక్షిణ మండలంలోని ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.